పేకాట స్థావరాలపై దాడులు, ఏడుగురి అరెస్ట్ | seven gamblers arrested in Nacharam | Sakshi
Sakshi News home page

పేకాట స్థావరాలపై దాడులు, ఏడుగురి అరెస్ట్

Published Fri, Sep 19 2014 9:22 AM | Last Updated on Mon, Sep 17 2018 6:26 PM

seven gamblers  arrested in Nacharam

హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలో పేకాట స్థావరాలపై టాస్క్ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి లక్షా 13వేల రూపాయల నగదుతో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని ఓయూ పోలీస్ స్టేషన్కు తరలించారు. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా  పేకాడుతున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు ఈ దాడి చేశారు.

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేకాట స్థావరాలతో పాటు, క్లబ్లపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే.   హైదరాబాద్లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement