gamblers arrest
-
పేకాటపై వార్తలు, జర్నలిస్టుపై దాడి
దిస్పూర్: రాష్ట్రంలో పేకాట శిబిరాలు పెరిగిపోతున్నాయని వార్తలు రాసిన ఓ జర్నలిస్టుపై జూదగాళ్లు మూకుమ్మడి దాడి చేశారు. విద్యుత్ స్తంభానికి కట్టేసి చిత్రవధ చేశారు. ఈ సంఘటన గువాహటికి పశ్చిమాన 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న మీర్జాలో జరిగింది. ప్రముఖ అస్సామీ దినపత్రిక ప్రతీదిన్‌లో రిపోర్టర్‌గా విధులు నిర్వర్తిస్తున్న కరుప్ జిల్లాకు చెందిన మిలన్ మహంత అనే జర్నలిస్ట్ గ్రామీణ ప్రాంతాల్లో పేకాటపై వరుస కథనాలు రాశారు. దీంతో కక్ష్య పెంచుకున్న ఐదుగురు జూదగాళ్లు రిపోర్టర్‌పై ఈ చర్యకు పాల్పడ్డారు. ఈ దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. జర్నలిస్టు మిలన్ మహంత్ మెడ, తల, చెవుల మీద గాయాలవగా.. ప్రస్తుతం ఆయన ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దాడికి పాల్పడిన నిందితులపై బారి పోలీస్ స్టేషన్ లో ఎఫ్ఐఆర్ నమోదైంది. నిందితుల్లో ఒకరిని అరెస్టు చేశామని మిగతావాళ్లు కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం
గుంతకల్లు : మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపాదం మోపనున్నట్లు డీఎస్పీ శ్రీధర్‌రావు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎస్పీ ఆదేశాల మేరకు అర్బన్ సీఐ రాజు, టూటౌన్ ఎస్ఐ వలిబాషు ఒక బృందం, వన్‌టౌన్ ఎస్ఐ నగేష్‌బాబు మరో టీంగా ఏర్పడి నాలుగు రోజులుగా పట్టణంలో విస్తృతంగా దాడులు నిర్వహించి మట్కా ఆర్గనైజర్స్ జేపీ రామచంద్ర (బళ్లారి), సుధాకర్‌రెడ్డి (ప్యాపిలి, కర్నూలుజిల్లా)తోపాటు పట్టణానికి చెందిన బీటర్లు ఎం.గోపి, రంగ, అంజాద్, మాబు, సంజీవరాయుడు, భీమన్న, కృష్ణమూర్తి, లోకలను అరెస్టు చేశారన్నారు. వీరి నుంచి రూ 2.25లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
బెట్టింగ్ రాయుళ్ల అరెస్టు
హిందూపురం రూరల్ : పట్టణంలో ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్, జూదాలు ఆడుతున్న 9 మందిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.1,01,700 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వన్‌టౌన్ సీఐ ఈదూర్‌బాషా శుక్రవారం విలేకరుల సమావేశంలో వెల్లడించారు. పెనుకొండ డీఎస్పీ సుబ్బారావు ఆదేశాలతో వన్‌టౌన్ ఎస్ఐ దిలీప్‌కుమార్, సిబ్బంది సునీల్‌నాయక్, ఆదినారాయణ, చెన్నకేశవులు, వెంకటరామిరెడ్డి, రామాంజి బెట్టింగ్ కేంద్రాలపై దాడులు నిర్వహించారు. క్రికెట్ బెట్టింగ్‌కు పాల్పడుతున్నట్లు సమాచారం రావడంతో వారిపై నిఘా ఉంచి దాడులు చేశామన్నారు. దాడుల్లో ఐదుగురు క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న అంజనప్రసాద్, నారాయణ, ఉదయ్‌కుమార్, ఇర్ఫాన్, సునీల్‌కుమార్‌ను అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారి వద్ద నుంచి రూ.71,300 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. అదేవిధంగా పట్టణంలోని చౌడేశ్వరీ కాలనీలో పేకాట స్థావరాలపై దాడులు చేసి బాబాజాన్, నౌషాద్, బాబు, నాగరాజును అదుపులోకి తీసుకుని వారి నుంచి రూ.30,500 నగదు స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. నిందితులను రిమాండ్‌కి తరలించి శనివారం కోర్టుకు హాజరుపరుస్తామని చెప్పారు. -
మట్కా నిర్వాహకుల అరెస్టు
హిందూపురం రూరల్ : మండలంలోని మణేసముద్రంలో మట్కా నిర్వాహకుడు నారాయణరెడ్డి, బీటర్ సురేశ్‌ను గురువారం అరెస్టు చేసినట్లు రూరల్ సీఐ రాజగోపాల్‌నాయుడు, టాస్క్‌ఫోర్స్ ఎస్ఐ ఆంజనేయులు తెలిపారు. పక్కా సమాచారం మేరకు తమ సిబ్బందితో కలసి దాడి చేసి వారిద్దరినీ పట్టుకున్నట్లు వివరించారు. వారి నుంచి రూ.1.24 లక్షల నగదు స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. -
మట్కా బీటర్ల అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో సీఐ శివప్రసాద్, ఎస్ఐలు శంకర్‌రెడ్డి, నబీరసూల్‌తో కలిసి పట్టణంలోని మట్కా స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సురేష్, తిమ్మప్ప, వరలక్ష్మి, లీలావతి, కుళ్లాయప్ప, రామాంజినేయులు, ప్రసాద్, బసిరెడ్డి, రామాంజినేయులు వద్ద మట్కా చీటీలు, రూ.2,71,155 నగదుస్వాదీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మట్కా బీటర్లనుపట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాగభూషణం, హోంగార్డు నిత్యానంద్లను డీఎస్పీ అనిల్ అభినందించారు. -
నోవాటెల్ హోటెల్ పై పోలీసుల దాడి
శంషాబాద్: శంషాబాద్ నోవాటెల్ హోటల్‌పై సోమవారం తెల్లవారుజామున ఎస్వోటీ పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా హోటల్లో పేకాట ఆడుతున్న 9 మందిని అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రూ. 95 వేల నగదుతో పాటు 10 సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో అసాంఘీక కార్యకలాపాలు ఎక్కువవుతున్నాయనే సమాచారంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. -
వనస్థలిపురంలో పేకాటరాయుళ్ల అరెస్టు
వనస్థలిపురం: నగరంలోని వనస్థలి పురంలో పేకాట స్ధావరాలపై మంగళవారం పోలీసులు దాడులు నిర్వహించారు. స్ధానిక ఓ హోటలో పేకాట ఆడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వనస్థలిపురం లోని స్వాగత్ గ్రాండ్ హోటల్‌పై దాడి చేసిన పోలీసులు 16 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 68 వేలు నగదు, పదహారు సెల్ఫోన్లు, ఒక ఇన్నోవా వాహనంతో పాటు అమెరికన్ డాలర్లు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసి నిందితులను స్టేషన్ కు తరలించారు. -
ఆరుగురు జూదరుల అరెస్ట్
దుగ్గిరాల: గుంటూరు జిల్లా దుగ్గిరాల మండలం వీర్లపాలెంలో పేకాట ఆడుతున్న ఆరుగురు జూదరులను పోలీసులు అరెస్ట్ చేశారు. కృష్ణానది ఒడ్డున పొలాల్లో పేకాట నడుస్తున్నట్టు సమాచారం అందుకున్న పోలీసులు దాడులు చేసి ఆరుగుర్ని అదుపులోకి తీసుకున్నారు. వారి నుంచి 8 బైకులు, రూ.8వేల నగదును స్వాధీనం చేసుకున్నారు. -
10మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
విజయనగరం(క్రైం): ఓ ఇంట్లో పేకాట ఆడుతున్న 10 మందిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ సంఘటన విజయనగరం జిల్లా స్కూల్‌బాగ్ కాలనీ ఎన్టీఆర్ జంక్షన్‌లోని ఓ ఇంట్లో జరిగింది. బుధవారం సాయంత్రం పేకాట ఆడుతున్నారనే సమాచారం అందుకున్న పోలీసులు దాడి చేసి 10 మంది పేకాటరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి పదివేల నగదుతో పాటు ఏడు సెల్పోన్లను స్వాదీనం చేసుకున్నారు. -
9మంది పేకాటరాయుళ్ల అరెస్ట్
విజయనగరం: జిల్లాలోని పూనపాటిరేగ మండలంలో శుక్రవారం పేకాట స్థావరాలపై పోలీసులు దాడులు జరిపారు. పేకాట ఆడుతున్న 9 మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారినుంచి రూ.2. 50లక్షలు, 3 బైక్‌లు, ఒక కారు, 7 సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. -
పేకాట స్థావరాలపై దాడులు, ఏడుగురి అరెస్ట్
హైదరాబాద్ : హైదరాబాద్ నాచారంలో పేకాట స్థావరాలపై టాస్క్‌ఫోర్స్ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా ఏడుగురు పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి లక్షా 13వేల రూపాయల నగదుతో పాటు ఏడు సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వీరిని ఓయూ పోలీస్ స్టేషన్‌కు తరలించారు. ఓ ఇంట్లో గుట్టుచప్పుడు కాకుండా పేకాడుతున్నట్లు సమాచారం అందటంతో పోలీసులు ఈ దాడి చేశారు. తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ పేకాట స్థావరాలతో పాటు, క్లబ్‌లపై ఉక్కుపాదం మోపిన విషయం తెలిసిందే. హైదరాబాద్‌లో పేకాట క్లబ్ అనే మాట వినపడకూడదని... అందుకు తగు విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు కూడా. ఈ నేపథ్యంలో పోలీసులు పేకాట స్థావరాలపై దాడులు ముమ్మరం చేశారు. -
స్టార్ హోటల్‌పై టాస్క్‌ఫోర్స్ పోలీసుల దాడి
హైదరాబాద్ : సోమాజీగూడలోని ఓ స్టార్ హోటల్‌పై వెస్ట్‌జోన్ టాస్క్‌ఫోర్స్ పోలీసులు మంగళవారం దాడి చేశారు. ఈ సందర్భంగా 15మంది పేకాటరాయుళ్లను పోలీసులు అదుపులోకి తీసుకుని, వారి వద్ద నుంచి రెండు లక్షల నగదు, 15 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. హోటల్లో పేకాడుతున్నట్లు సమాచారం అందుకున్న పోలీసులు ఈ దాడి చేశారు. అనంతరం పేకాటరాయుళ్లను స్టేషన్‌కు తరలించి అక్కడ నుంచి కోర్టులో హాజర పరచనున్నారు.