కళ్యాణదుర్గం రూరల్ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో సీఐ శివప్రసాద్, ఎస్‌ఐలు శంకర్‌రెడ్డి, నబీరసూల్‌తో కలిసి పట్టణంలోని మట్కా స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సురేష్, తిమ్మప్ప, వరలక్ష్మి, లీలావతి, కుళ్లాయప్ప, రామాంజినేయులు, ప్రసాద్, బసిరెడ్డి, రామాంజినేయులు వద్ద మట్కా చీటీలు, రూ.2,71,155 నగదుస్వాదీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మట్కా బీటర్లనుపట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాగభూషణం, హోంగార్డు నిత్యానంద్‌లను డీఎస్పీ అనిల్ అభినందించారు.