kalyandurg
-
పెట్రేగిపోతున్న టీడీపీ నేతలు...
-
Kalyandurg: టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గంలో టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు రౌడీయిజం చెలాయించాడు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలకు నిరసనగా వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబు దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్ సీపీ నేతలపై టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఉమామహేశ్వర నాయుడు, అనుచరులు దాడికి పాల్పడ్డారు. ఈ క్రమంలో టీడీపీ- వైఎస్సార్ సీపీ శ్రేణుల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పోలీసులు జోక్యం చేసుకొని ఇరువర్గాలను చెదరగొట్టారు. -
అంబులెన్స్ వచ్చినా.. దారివ్వని చంద్రబాబు!
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ నేతలు అత్యుత్సాహం ప్రదర్శించారు. రోడ్డుకు అడ్డంగా చంద్రబాబు ప్రచార రథం నిలిపారు. అంబులెన్స్ వచ్చినా.. చంద్రబాబు దారివ్వలేదు. అంతేగాక 108 అంబులెన్స్‌ను టీడీపీ నేతలు వెనక్కి పంపారు. కళ్యాణదుర్గం పట్టణంలోని టీ-సర్కిల్లో ఈ ఘటన చోటుచేసుకోగా.. టీడీపీ నేతల దౌర్జన్యంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
అనంత కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని చెబుతున్న మహిళ గురించి ఆమె బంధువుల మాటల్లో..
-
కోడిపల్లి ఘటనపై అనుమానాలున్నాయ్: అనంత ఎస్పీ
సాక్షి, అనంతపురం: కళ్యాణదుర్గం మండలం కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిందని, దళిత మహిళపై వైకాపా నాయకుల దాష్టీకమంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి కథనాలు వండివార్చాయి. దీంతో ఎల్లో మీడియా కథనాలపై జిల్లా ఎస్పీ శ్రీనివాసరావు స్పష్టత ఇచ్చారు. కోడిపల్లి ఘటనపై మంగళవారం మీడియా సమావేశం నిర్వహించిన ఆయన.. గ్యాంగ్‌రేప్‌పై అనుమానాలున్నాయని తెలిపారు. ‘‘కళ్యాణదుర్గం మండలం కోడిపల్లి ఘటనపై అనేక అనుమానాలు ఉన్నాయి. కోడిపల్లిలో గ్యాంగ్ రేప్ జరిగిన ఆనవాళ్లు లేవు. ఈ ఘటనతో వైఎస్సార్ సీపీ నేతలకు సంబంధం లేదు. కొందరు కావాలనే బాధితులను తప్పు దారి పట్టించి.. లబ్ది పొందే ప్రయత్నం చేస్తున్నట్లు మా దృష్టికి వచ్చింది. తప్పుడు ఆరోపణలు చేసే వారిపై కఠిన చర్యలు తీసుకుంటాం’’ అని ఎస్పీ తెలిపారు. ఫోన్లో వీడియోలు లేవు ఏడాది క్రితం తనపై గ్యాంగ్ రేప్ జరిగిందని ఓ మహిళ ఫిర్యాదు చేసింది. అత్యాచార సమయంలో విడియోలు తీశారని బాధితురాలు చెబుతోంది. ఆమె ఫోన్ లో ఎలాంటి విడియోలు లేవు. పైగా బాధిత మహిళ ఓ వ్యక్తితో ఉండగా.. గదికి తలుపులు వేసి కోడిపల్లి గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. మహిళ ప్రవర్తనపై గ్రామస్తుల నుంచి అనేక ఫిర్యాదులు ఉన్నాయి అని ఎస్పీ వెల్లడించారు. అన్ని కోణాల్లో దర్యాప్తు బాధిత మహిళ ఈనెల 10వ తేదీన ఒక రకంగా.. 14 తేదీన మరోలా ఫిర్యాదు చేసింది. కోడిపల్లికి మహిళ ఫిర్యాదు మేరకు అట్రాసిటీ కేసు నమోదు చేశాం. కోడిపల్లి ఘటనపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేస్తున్నాం. అసత్య ప్రచారాలను నమ్మొద్దు అని ప్రజలకు ఎస్పీ తెలియజేశారు. -
ఈనెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు సభను విజయవంతం చేయండి. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతీ ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. కళ్యాణదుర్గం సభలో ఇన్ పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేస్తారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు అని తెలిపారు. ఇక, కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నారా లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్ -
నువ్వా? నేనా?.. సైకిల్ పార్టీలో ఏం జరుగుతోంది?
గత ఎన్నికల్లో సీమలో తెలుగుదేశం పార్టీ రెండు సీట్లు గెలుచుకున్న జిల్లా అది. ఈసారి ఒకటి కూడా కష్టమనే కామెంట్స్ వినిపిస్తున్నాయి. అటువంటి జిల్లాలోని ఓ నియోజకవర్గంలో తెలుగు తమ్ముళ్ల మధ్య కుమ్ములాటలు తీవ్రస్థాయికి చేరాయి. వీలున్నప్పుడల్లా నువ్వా? నేనా అన్నట్లుగా ముష్టి యుద్ధాలకు దిగుతున్నారు. పచ్చపార్టీలో అనంత వివాదాలు అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఫైట్ పీక్ స్టేజ్‌కు చేరింది. నియోజకవర్గంలో ఆధిపత్యం కోసం ఇద్దరు నేతలు సర్వశక్తులూ ఒడ్డుతున్నారు. పార్టీ సీనియర్ నేత, మాజీ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి.. కళ్యాణదుర్గం టీడీపీ ఇంఛార్జి ఉమామహేశ్వర నాయుడు మధ్య చాన్నాళ్ళుగా ఆధిపత్య పోరు జరుగుతోంది. అనంతపురం జిల్లా టీడీపీలో వృద్ధ నేత హనుమంతరాయచౌదరి 2014 నుంచి 2019 దాకా కళ్యాణదుర్గం ఎమ్మెల్యేగా పనిచేశారు. 2019 ఎన్నికల్లో హనుమంతరావు చౌదరికి టిక్కెట్ నిరాకరించిన చంద్రబాబు.. ఉమామహేశ్వర నాయుడుని బరిలో దింపారు. గత ఎన్నికల్లో ఉమామహేశ్వర నాయుడు ఘోరంగా ఓడిపోయారు. సైకిల్‌కు ఫ్లెక్సీ వార్ ఉమామహేశ్వర నాయుడుకి జేసీ దివాకర్ రెడ్డి, ఎమ్మెల్యే పయ్యావుల కేశవ్ ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. 2019లో ఎన్నికలు పూర్తయినప్పటి నుంచి ఇప్పటివరకు.. టీడీపీ చేపట్టే అన్ని కార్యక్రమాలను ఉన్నం, ఉమా మహేశ్వరుడు వేర్వేరుగా నిర్వహిస్తున్నారు. ఎవరికి వారుగా ఫ్లెక్సీలు చేయించుకోవడం.. బలప్రదర్శన చేయడం.. ఒకరిపై మరొకరు బాహాటంగా విమర్శించుకోవటం కల్యాణదుర్గంలో సాధారణ విషయంగా మారింది. బహిరంగంగా కుస్తీలాట కళ్యాణదుర్గం నియోజకవర్గంలో ఇప్పుడు పార్టీ పదవుల ఎంపిక జరుగుతోంది. కళ్యాణదుర్గంలోనే సమావేశం నిర్వహిస్తే రెండు వర్గాల మధ్య గొడవ జరుగుతుందని భావించిన టీడీపీ అధిష్టానం ఆ సమావేశాన్ని అనంతపురంలో జరపాలని ఆదేశించింది. మాజీ మంత్రులు కాలువ శ్రీనివాస్, అమర్నాథ్ రెడ్డి, టీడీపీ జిల్లా ఇంఛార్జి బీటీ నాయుడు సమక్షంలో కళ్యాణదుర్గం పార్టీ సమావేశం జరిగింది. సమావేశం ప్రారంభం కాగానే.. ఉన్నం హనుమంతరాయచౌదరి, ఉమామహేశ్వర నాయుడు పార్టీ పదవులు తమ వర్గానికే ఇవ్వాలని పట్టుబట్టారు. మాటల యుద్ధంతో ఇరు వర్గాలు రెచ్చిపోయాయి. వాగ్వాదం, తోపులాటలతో పాటు పరస్పరం కొట్టుకోవడం.. కుర్చీలు విసురుకోవడం జరిగింది. రెండు వర్గాలకు సర్ది చెపచెప్పేందుకు ప్రయత్నించి విఫలమయ్యారు ముఖ్య నేతలు. దీంతో చేసేది లేక అర్ధాంతరంగా సమావేశాన్ని ముగించారు. లాబీయింగ్ బాబు కళ్యాణదుర్గం టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలు పొందేందుకు మాజీ ఎమ్మెల్యే హనుమంతరావు చౌదరి తీవ్ర స్థాయిలో లాబీయింగ్ చేస్తున్నారు. 2024 ఎన్నికల్లో తనకు గాని.. తన కొడుకు మారుతీ చౌదరికి గానీ టిక్కెట్ ఇవ్వాలని ఆయన కోరుతున్నారు. మరోవైపు ఇంఛార్జి పదవిని కాపాడుకుంటూనే వచ్చే ఎన్నికల్లో మరోసారి పోటీ చేయాలని ఉమా మహేశ్వర నాయుడు భావిస్తున్నారు. అందుకే ప్రతి విషయం లోనూ రెండు వర్గాలు బాహాబాహీకి దిగుతున్నాయి. నియోజకవర్గంలో నాయకులు అనుసరిస్తున్న తీరుపై పార్టీ కార్యకర్తలే అసహనం వ్యక్తం చేస్తున్నారు. -
ట్రూ లవ్ నెవర్ ఎండ్స్.. నేనూ నీ దగ్గరకే వస్తున్నా..
నాది కాని జీవితానికి నన్ను బానిసను చేశావు నన్ను నన్నుగా మెచ్చి నాలో ఆశలు రేపావు నా నవ్వులో దాగిన నువ్వు.. నన్ను నలుగురిని కలిపింది నువ్వున్నావన్న నమ్మకమే.. నన్ను నన్నుగా నిలిపింది నీవు లేని జీవితం వ్యర్థమని.. నిన్ను విడిచి వెళ్లనని అంతులేని కలగా మిగిలిపోయావు నువ్వు లేని ఈ బతుకు వ్యర్థం... అందుకే నేనూ వస్తున్నా... అంటూ భార్య మృతిని జీర్ణించుకోలేని భర్త ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ హృదయవిదారక ఘటన గురువారం సాయంత్రం కళ్యాణదుర్గంలో చోటు చేసుకుంది. కళ్యాణదుర్గం(అనంతపురం జిల్లా): స్థానిక శంకరప్ప తోటకు చెందిన నాగరాజు, యశోదమ్మ దంపతులకు ముగ్గురు కుమారులు. రెండో కుమారుడు గణేష్ (23) బేల్దారి పనులతో జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే రెండేళ్ల క్రితం బేల్దారి పని కోసం కర్ణాటకలోని వైఎన్‌హెచ్ కోటకు వెళ్లాడు. ఆ సమయంలో గగనశ్రీ (24)తో అతనికి పరిచయమైంది. అది కాస్త ప్రేమగా మారింది. అనంతరం గగనశ్రీని తల్లిదండ్రులు మంగళూరులోని ఏజే ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ కోర్సులో చేర్పించారు. విషయం తెలుసుకున్న గణేష్ కూడా మంగళూరుకు వెళ్లాడు. ఆ సమయంలోనే ఇద్దరూ పెళ్లి చేసుకున్నారు. కొంత కాలం అక్కడే కాపురమున్నారు. పెద్దలకు తెలియకుండా గగనశ్రీ బీటెక్ ద్వితీయ సంవత్సరం మధ్యలో ఆపేసి ఐదు నెలల క్రితం భర్తతో కలసి కళ్యాణదుర్గానికి వచ్చేసింది. జ్వరం బారిన పడి... ఇటీవల గగనశ్రీ జ్వరం బారిన పడింది. స్థానికంగా చికిత్స చేయించినా ఫలితం లేకపోవడంతో అనంతపురంలోని ఓ ప్రైవేట్ క్లినిక్‌లో చేర్పించారు. అప్పటికి ఆమె మూడు నెలల గర్భిణి. జ్వరం తీవ్రత పెరుగుతుండడంతో పరీక్షించిన వైద్యులు ఆమె డెంగీతో బాధపడుతున్నట్లు ఈ నెల 6న గుర్తించారు. విషయాన్ని గణేష్‌కు తెలపడంతో వెంటనే మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళుతుండగా మార్గ మధ్యంలో ఆమె మృతి చెందింది. దీంతో ఆమె మృతదేహాన్ని కళ్యాణదుర్గానికి తీసుకువచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. దీనిపై గణేష్ కుటుంబసభ్యులే తమ కుమార్తెను చంపేశారంటూ గగనశ్రీ తల్లిదండ్రులు నాగరాజు, హనుమక్క కళ్యాణదుర్గం పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. చదవండి: (‘ఎందుకమ్మ ఇట్ల చేసినవ్..?.. మమ్మీ.. డాడీ గుర్తుకు రాలేదా..?') ట్రూ లవ్ నెవర్ ఎండ్స్ నిజమైన ప్రేమ ఎప్పటికీ అంతం కాదు అనే నానుడిని గణేష్ నిజం చేశాడు. తన భార్య అనారోగ్యంతో మృతి చెందిదన్న విషయాన్ని జీర్ణించుకోలేని అతను గురువారం సాయంత్రం ఇంట్లో ఫ్యాన్‌కు ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నం చేశాడు. కుటుంబసభ్యులు గమనించి వెంటనే ఆస్పత్రికి తరలిస్తుండగా ప్రాణాలు కోల్పోయాడు. విషయం తెలుసుకున్న బంధువులు, స్నేహితులతో ఆస్పత్రి ఆవరణం కిక్కిరిసింది. రోదనలు మిన్నంటాయి. ఒక్క రోజు వ్యవధిలోనే ఇద్దరినీ తీసుకెళ్లావా.. దేవుడా ఎంత పని చేశావంటూ రోదిస్తుండడం అందరినీ కలిచివేసింది. మృతుని తండ్రి నాగరాజు ఫిర్యాదు మేరకు సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు. -
బ్యాంకుకి టోపీ పెట్టిన టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ ఫ్యామిలీ
సాక్షి, అనంతపురం: అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో టీడీపీ ఇన్ఛార్జ్ ఉమా మహేశ్వరనాయుడు నిర్వాకం బయటపడింది. తపస్వి ఇన్ఫ్రా ప్రాజెక్ట్స్ పేరుతో ఉమామహేశ్వరరావు సోదరులు బ్యాంకుల్లో భారీగా రుణాలు తీసుకొని చెల్లించలేదు. తీసుకున్న అప్పు చెల్లించకపోవడంతో బ్యాంకు అధికారులు ఉమామహేశ్వరరావు పొలాన్ని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పొలానికి ఫ్లెక్సీలు అతికించారు. చదవండి: (చంద్రబాబు ‘కుప్పం’ డ్రామా హాస్యాస్పదం: తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి) -
ఐదేళ్ల ప్రేమ.. పెళ్లి తర్వాత అందంగా లేదని.. దారుణంగా
కళ్యాణదుర్గం (అనంతపురం): అందంగా లేదని కట్టుకున్న ఇల్లాలిని హతమార్చిన ఘటన కళ్యాణదుర్గంలో కలకలం రేపింది. పోలీసులు తెలిపిన మేరకు... కళ్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో నివాసముంటున్న కుళ్లాయప్ప బేల్దారి పని చేసుకునేవాడు. తాను నివాసముంటున్న ప్రాంతానికి చెందిన అపర్ణ (27)ను ఆరేళ్ల క్రితం పెద్దలను ఎదిరించి పెళ్లి చేసుకున్నాడు. పెళ్లికి ముందు ఐదేళ్లు వీరిద్దరూ ప్రేమించుకున్నారు. వీరికి ఇద్దరు కుమార్తెలు సంతానం. కొంత కాలంగా కుళ్లాయప్ప మద్యానికి బానిసయ్యాడు. మద్యం మత్తులో రోజూ భార్యతో గొడవపడేవాడు. అందంగా లేవని వేధింపులకు గురి చేసేవాడు. ఈ క్రమంలోనే విషయాన్ని తన కుటుంబసభ్యులకు తెలిపి విడాకులు తీసుకునేందుకు అపర్ణ సిద్ధమైంది. శుక్రవారం రాత్రి కుళ్లాయప్ప మద్యం మత్తులో ఇంటికి చేరుకుని రోజువారీగానే భార్యతో గొడవ పెట్టుకుని కత్తితో అపర్ణ పొట్టలో బలంగా పొడిచాడు. రక్తపు మడుగులో పడి ఉన్న భార్యను వదిలేసి అక్కడి నుంచి పారిపోయాడు. విషయాన్ని గుర్తించిన స్థానికులు వెంటనే అపర్ణను కళ్యాణదుర్గం ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండడంతో వైద్యుల సూచన మేరకు.. అనంతపురం సర్వజనాస్పత్రికి తరలించారు. చికిత్సకు స్పందించక శనివారం ఉదయం ఆమె మృతి చెందింది. హతురాలి తల్లి నాగమ్మ ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ తేజమూర్తి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చదవండి: (రూ.2లక్షల అప్పు.. భర్త స్నేహితుడితో వివాహేతర సంబంధం..) -
భార్యపై అనుమానం.. ఇద్దరు పిల్లల హత్య
సాక్షి, కళ్యాణదుర్గం రూరల్ : ఆ తండ్రికి అనుమానం పెనుభూతమైంది.. పిల్లలు తనకు పుట్టలేదేమోనన్న అనుమానంతో గొంతు నులిమి కవలల ప్రాణాలు తీశాడు. కళ్యాణదుర్గం మండలం బోయలపల్లిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చాకలి రవి (చెవుడు, మూగ)కి రాయదుర్గం మండలం బొమ్మక్కపల్లికి చెందిన రాధమ్మతో పదేళ్ల కిందట వివాహమైంది. వీరికి కవలలు సుధీర్(5), సుదీప్(5) జన్మించారు. అయితే రాధమ్మపై భర్త రవికి అనుమానం. పిల్లలు కూడా తనకు పుట్టలేదన్న అనుమానంతో తరచూ భార్యతో గొడవపడేవాడు. ఇదిలా ఉండగా బుధవారం రాత్రి ఇంట్లో భార్యాప్లిలు నిద్రపోయాక చిన్నారుల గొంతు నులిమి వారి ప్రాణాలు తీశాడు. ఆ తర్వాత మృతదేహాలను గ్రామ సమీపంలోని అటవీ ప్రాంతంలోకి తీసుకెళ్లి గుంతలు తీసి పూడ్చిపెట్టాడు. ఉదయాన్నే రాధమ్మ నిద్రలేచాక పిల్లలు కనిపించకపోవడంతో విషయాన్ని కుటుంబ సభ్యులకు తెలిపింది. చుట్టుపక్కల వారిని విచారించింది. (భార్యపై అనుమానంతో తల నరికి..) అప్పటి దాకా కనిపించకుండా పోయి అదే సమయంలో అక్కడికొచ్చిన రవిని కుటుంబ సభ్యులు నిలదీశారు. దీంతో జరిగిన విషయం(సైగలతో) చెప్పాడు. పిల్లల్ని పూడ్చిపెట్టిన ప్రదేశాన్ని చూపించాడు. అల్లారుముద్దుగా పెంచుకుంటున్న పిల్లలిద్దరూ విగత జీవులుగా కనిపించడంతో ఆ తల్లిని ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కళ్యాణదుర్గం డీఎస్పీ వెంకటరమణ, సీఐ శివశంకర్‌నాయక్‌లు ఘటనా స్థలానికి చేరుకుని రవిని అదుపులోకి తీసుకుని కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
‘జగనన్న ఆశీర్వాదంతో విజయం సాధిస్తాను’
సాక్షి, అనంతపురం: రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం శాసనసభ అభ్యర్థి ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని కళ్యాణదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఉషశ్రీ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై నమ్మకం పెట్టి ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు జగనన్నకు కృతజ్ఞతలు. జగనన్న ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాను. మాది చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడికి జగనన్న సాయంతో నీరు తీసుకువస్తాం. ప్రత్యేక హోదాతో తిమ్మసముద్రంలో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తాం. మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటాం. కళ్యాణదుర్గం దశ దిశ నిర్ణయించాలని జగన్నను కోరుతున్నాను. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు.. ఇలా ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే జగనన్న అధికారంలోకి రావాల’ని అన్నారు. -
అడ్డు తొలగించుకున్నారు!
సాక్షి, శెట్టూరు (కళ్యాణదుర్గం): యువకుడి హత్య గుట్టు రట్టయ్యింది. మిస్సింగ్ కేసు నమోదుతో విచారణ చేపట్టిన పోలీసులు లోతుగా దర్యాప్తు చేసి నిందితులను గుర్తించారు. ఏడాది కిందట లేపాక్షి సమీపంలో జరిగిన హత్య కేసు వివరాలను కళ్యాణదుర్గం డీఎస్పీ టీఎస్ వెంకటరమణ, సీఐ శివప్రసాద్, పట్టణ ఎస్ఐ శంకర్‌రెడ్డిలు శుక్రవారం మీడియాకు వెల్లడించారు. వివాహేతర సంబంధమే హత్యకు కారణమని తేల్చారు. నిందితులైన భార్య, ఆమె ప్రియుడుతోపాటు మరొక వ్యక్తిని అరెస్ట్ చేశారు. భర్త అడ్డు తొలగించుకున్నదిలా.. తమ వివాహేతర సంబంధం సాఫీగా సాగిపోవాలంటే నందిని భర్త మంజునాథ్‌ను అడ్డు తొలగించుకోవాలని బొల్లు విశ్వేశ్వరరెడ్డి కుట్రపన్నాడు. ఇందు కోసం యలగలవంక గ్రామానికి చెందిన స్నేహితుడు మాదిగ హనుమంతరాయుడుతో కలిసి 2017 జనవరి మూడో తేదీన మంజునాథ్‌కు హిందూపురంలో డ్రైవర్ ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మించి తమ బైకులో ఎక్కించుకెళ్లారు. మంజునాథ్‌కు మార్గం మధ్యలో మద్యం తాపించారు. లేపాక్షి దాటిన తర్వాత కనుమగుడి దగ్గర ఉన్న గుట్టల్లోకి తీసుకెళ్లారు. అక్కడ మరోమారు మద్యం పూటుగా తాపారు. మత్తులో ఉన్న మంజునాథ్ కాళ్లను హనుమంతరాయుడు కాళ్లు గట్టిగా పట్టుకోగా.. విశ్వేశ్వరరెడ్డి అతని గొంతు కోసి చంపేశాడు. ఎవ్వరికీ అనుమానం రాకుండా మృతదేహాన్ని కిరోసిన్ పోసి నిప్పంటించారు. కాలిన అనంతరం శవాన్ని అక్కడే ఓ గుంతలో పూడ్చి వచ్చేశారు. వెలుగు చూసిన హత్య కేసు బోయ దాసరి మంజునాథ్ కనిపించడం లేదంటూ తమ్ముడు దాసరి అనిల్ ఈ నెల ఆరో తేదిన కళ్యాణదుర్గం పట్టణ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మిస్సింగ్ కేసుగా నమోదు చేసుకున్న ఎస్ఐ శంకర్‌రెడ్డి.. మంజునాథ్ భార్య నందినిని పలు కోణాల్లో విచారించారు. భర్త కొన్ని నెలలుగా కనిపించపోయినా తనకేమీ పట్టనట్టుగా వ్యవహరిస్తూ ఆమె స్వగ్రామం సింగేపల్లికి వెళ్లడంపై పోలీసులకు అనుమానం కలిగింది. లోతుగా దర్యాప్తు చేయడంతో యలగలవంక గ్రామానికి చెందిన విశ్వేశ్వరరెడ్డితో ఆమెకు వివాహేతర సంబంధం ఉన్నట్లు గుర్తించారు. వీఆర్వో ఎదుట లొంగిపోయిన నిందితులు పోలీసుల విచారణతో హత్య విషయం తెలుస్తుందని భయపడిన నిందితులు ఇటీవల ఇళ్ల నుంచి పారిపోయారు. ఎట్టకేలకు గురువారం ఉదయం నందిని, విశ్వేశ్వరరెడ్డి, హనుమంతరెడ్డిలు మానిరేవు వీఆర్వో ఇంటి వద్ద లొంగిపోయారు. నిందితులు వాడిన కత్తి, బైకును పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితులను శుక్రవారం అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. సంఘటన స్థలంలో లభ్యమైన హతుడి పుర్రెను డీఎన్ఏ పరీక్షల నిమిత్తం ఎఫ్ఎస్ఎల్కు పంపుతున్నట్లు పోలీసులు తెలిపారు. హత్య నేపథ్యం.. కళ్యాణదుర్గం పట్టణానికి చెందిన బోయ దాసరి మంజునాథ్(32)కు బొమ్మనహళ్ మండలం సింగేపల్లికి చెందిన దాసరి నందినితో వివాహమైంది. వీరిద్దరూ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగించేవారు. కూలి పనులకెళ్లే సమయంలో బెళుగుప్ప మండలం యలగలవంక గ్రామానికి చెందిన బొల్లు విశ్వేశ్వరరెడ్డితో నందినికి ఏర్పడిన పరిచయం కాస్త వివాహేతర సంబంధానికి దారితీసింది. -
కేవీకేకు ముగ్గురు నూతన శాస్త్రవేత్తలు
కళ్యాణదుర్గం: స్థానిక కృషి విజ్ఞాన కేంద్రానికి ముగ్గురు నూతన రెగ్యులర్ శాస్త్రవేత్తలను ప్రభుత్వం నియమించింది. వీరంతా శుక్రవారం బాధ్యతలు చేపట్టారు. కేవీకే సేవలను రైతులకు మరింత విస్తరింపజేయడానికి అవకాశం ఏర్పడిందని కోఆర్డినేటర్ సుధీర్ తెలిపారు. ఉద్యానవన శాస్త్రవేత్తగా డాక్టర్ లక్ష్మీదుర్గ, హోంసైన్సు శాస్త్రవేత్తగా మంజులత, విస్తరణ విభాగం శాస్త్రవేత్తగా ఉషా బాధ్యతలు చేపట్టారు. రైతులకు అందుబాటులో ఉండి మంచి దిగుబడులు సాధించేందుకు కృషి చేస్తామని చెప్పారు. శాస్త్రవేత్తల సేవలను ఉపయోగించుకోవాలని సూచించారు. -
ఇద్దరు దొంగల అరెస్ట్
కళ్యాణదుర్గం : కళ్యాణదుర్గంలోని పలు కాలనీలలో చోరీలకు పాల్పడిన ఇద్దరు దొంగలను అరెస్ట్ చేసినట్లు సీఐ శివప్రసాద్ తెలిపారు. స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఎస్ఐ శంకర్‌రెడ్డితో కలసి ఆయన దొంగలను మీడియా ఎదుట హాజరుపరిచారు. స్థానిక దేవీరమ్మ కాలనీలో దాసరి రాజు, హులికల్లుకు చెందిన పెద్దింటి కిష్టప్ప అనే దొంగలను హులికల్లు క్రాస్‌లో ఉండగా అరెస్ట్ చేసినట్లు వివరించారు. వారి నుంచి రూ.2 లక్షలు విలువ చేసే బంగారు ఆభరణాలు, కంప్యూటర్ పరికరాలను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
బాబొస్తే.. బస్సులాపేస్తారా?
- సీఎం పర్యటన పేరుతో పల్లె సర్వీసుల రద్దు - తీవ్ర అగచాట్లు పడ్డ కుగ్రామాల ప్రజలు - చెప్పాపెట్టకుండా ఆపేయడం ఏంటని డీఎంపై మండిపాటు కళ్యాణదుర్గం : సీఎం చంద్రబాబునాయుడు గురువారం పామిడికి వస్తున్న సందర్భంగా బుధవారం ఉదయం నుంచే కళ్యాణదుర్గం డిపోకు చెందిన 23 బస్సు సర్వీసులను రద్దు చేశారు. అయితే ఈ విషయం ప్రకటించకపోవడంతో వివిధ కుగ్రామాలకు వెళ్లే ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. బస్టాండులోనూ, మార్గమధ్యంలోనూ పడిగాపులు కాయాల్సి వచ్చింది. నైట్ సర్వీసులు ఎంతసేపటికీ రాకపోవడంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లాల్సిన మహిళలు ఆర్టీసీ అధికారుల తీరుపై మండిపడ్డారు. 22 బస్సు సర్వీసులను రద్దు చేయడం వల్ల డిపో రూ.4.50 లక్షల ఆదాయం కోల్పోయిందని ఎంప్లాయీస్ యూనియన్(ఈయూ) నాయకులు ముత్యాలన్న, గణపతి, పవన్ తదితరులు నిరసన తెలిపారు. ప్రయాణికులు, ఈయూ నాయకులు కలిసి డిపో మేనేజర్ పెంచలయ్యపై ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లాలోని 9 ఆర్టీసీ డిపోల నుంచి సుమారు 200 బస్సు సర్వీసులను సీఎం పర్యటనకు కేటాయించడంతో ఆయా ప్రాంతాల్లో కూడా ప్రయాణికులు ఇబ్బంది పడ్డారు. సీఎం సభకు బస్సులు తరలించాలని పైనుంచి ఆదేశాలు రాగానే సంబంధిత డిపో మేనేజర్లు కనీసం నోటీసు బోర్డు ద్వారా కూడా సమాచారం బహిర్గతం చేయకపోవడంపై మండిపడ్డారు. ఎంత సీఎం వస్తే మాత్రం చెప్పాపెట్టకుండా బస్సులు రద్దు చేస్తారా అని ప్రయాణికులు నిలదీశారు. దీనిపై డిపో మేనేజర్ ‘సాక్షి’తో మాట్లాడుతూ బుధవారం సాయంత్రానికే బస్సులు పామిడికి వెళ్లాల్సి ఉండటంతో సర్వీసులను రద్దు చేశామన్నారు. అయితే సిబ్బంది సహకరించకపోవడంతో పంపలేకపోయామని, గురువారం తెల్లవారుజాముకల్లా అక్కడికి చేరుస్తామని చెప్పారు. రద్దయిన సర్వీసులు బెంగళూరు(3 బస్సులు), అనంతపురం(1ఎక్స్‌ప్రెస్), వేపులపర్తి(1నైట్‌హాల్ట్), ముద్దినాయనపల్లి(1) ధర్మవరం(1), కుందుర్పి(3 అందులో 1 నైట్‌హాల్ట్), శెట్టూరు(1), గుంతకల్లు(1), రాయదుర్గం(1), ములకనూరు(1), ఓబిగానిపల్లి(1), పాళ్లూరు(1 నైట్‌హాల్ట్), జంబుగుంపల(1 నైట్‌హాల్ట్), చెళ్లికెర(1నైట్‌హాల్ట్), ఎరడికెర(1 నైట్‌హాల్ట్), శ్రీమజ్జనపల్లి(1 నైట్‌హాల్ట్), అమరాపురం(1), చెళ్లికెర (వయా) వేపులపర్తి(1). -
వైభవంగా అక్కమాంబ పరుష
కళ్యాణదుర్గం : అక్కమాంబ పరుష గురువారం వైభవంగా జరిగింది. ఉగాది పండుగ మరుసటి రోజున అక్కమాంబ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ కమిటీ సభ్యులు, పూజారులు, భక్తులు తిరునాలను వైభవంగా నిర్వహించారు. తిరునాల సందర్భంగా ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. ఉదయాన్నే పూజారులు అక్కమాంబ ఆభరణాలను ఊరేగింపుగా తీసుకొచ్చి, అక్కదేవతలను అలంకరించారు. కళ్యాణదుర్గం నియోజకవర్గంతో పాటు జిల్లా వ్యాప్తంగానే కాకుండా కర్ణాటక నుంచి కూడా వేలాదిగా భక్తులు తరలివచ్చారు. -
విద్యార్థి అదృశ్యంపై ఫిర్యాదు
కళ్యాణదుర్గం : పట్టణంలోని జ్ఞానభారతి ప్రైవేటు పాఠశాలలో ఏడవ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే విద్యార్థి తప్పిపోయినట్లు తండ్రి లక్ష్మణమూర్తి శనివారం పట్టణ పోలీస్టేన్‌లో ఫిర్యాదు చేశారు. గత బుధవారం ఉదయం 9 గంటల సమయంలో పాఠశాల ప్రహరీ దూకి వెళ్లిపోయినట్లు అక్కడి వార్డెన్ తిప్పేస్వామి సమాచారం ఇచ్చినట్లు అందులో పేర్కొన్నారు. కుటుంబ సభ్యులతో కలిసి కళ్యాణదుర్గం ప్రాంతంలో అన్వేషించినా ఆచూకీ లభించలేదన్నారు. తన కుమారుని అచూకీ కనుగొని న్యాయం చేయాలని కోరారు. -
హోరా హోరీగా కుస్తీ పోటీలు
– జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైన అనంత క్రీడాకారిణి కళ్యాణదుర్గం రూరల్ః రాష్ట్రస్థాయి అండర్–19 కుస్తీ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. స్థానిక కరణం చిక్కప్ప ఉన్నత పాఠశాల ఆవరణంలో ఉన్న ఇండోర్‌స్టేడియంలో ఆదివారం పీఈటీల జిల్లా సెక్రటరీ లక్ష్మినారాయణ ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. ఈ పోటీలకు 13 జిల్లాల క్రీడాకారులు హాజరయ్యారు. 44 కేజీల విభాగంలో అనంతపురం జిల్లా క్రీడాకారిణి ప్రియాంక మొదటి స్థానంలో నిలవగా కర్నూలు జిల్లాకు చెందిన వాణెమ్మ ద్వితీయస్థానంలో నిలిచింది. మొదటి స్థానం సాధించిన ప్రియంక జాతీయ స్థాయి పోటీలకు ఎంపికైంది. 48కేజీల విభాగంలో ఈస్ట్ గోదావరి జిల్లాకు చెందిన జి.అనూష మొదటిస్థానం, బి.గంగావతి(అనంతపురం) ద్వితీయ స్థానం గెలుపొంది బంగారు పతకాలు దక్కించుకున్నారు. 51 కేజీల విభాగంలో నెల్లూరు చెందిన కె.బిందుప్రియ ,అనంతపురానికి చెందిన కె.శిరీషలు మొదటి రెండు స్థానంలో నిలిచారు. 55కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన పి.శిరిష మొదటి స్థానం, విజయనగరానికి చెందిన ఎల్.పాపయమ్మ ద్వితీయ స్థానం దక్కించుకున్నారు. 59కేజీల విభాగంలోగుంటూరుకు చెందిన ఎన్. రూతురాణి మొదటి స్థానం, నెల్లూరుకు చెందిన ఎన్ భారతి ద్వితీయ స్థానంలో బంగారు పతాకం కైవసం చేసుకున్నారు. 63 కేజీల విభాగంలో గుంటూరుకు చెందిన జి.శ్రావణి మొదటి స్థానం, ఈస్ట్ గోదావరికి చెందిన పి.క్రాంతిరేఖ ద్వితీయ స్థానం సాధించి బంగారు పతకం సాధించారు. 67కేజీల విభాగంలో చిత్తూరు జిల్లాకు చెందిన పి.జయ మొదటి స్థానం, అనంతపురానికి చెందిన ఎస్.సుమియాబాను ద్వితీయ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. 72కేజీల విభాగంలో నెల్లూరుకు చెందిన ఎన్.నిహారిక మొదటి స్థానం, ఈస్ట్ గోదావరికి చెందిన వై,అనూష ద్వితీయ స్థానంలో గెలుపొందారు. మొత్తంగా అనంతపురం జిల్లా బాలికలు రెండు బంగారు పతకాలు, మూడు సిల్వర్ పతకాలు, మూడు కాంస్య పతకాలు సాధించారు. -
మట్కా బీటర్ల అరెస్ట్
కళ్యాణదుర్గం రూరల్ : జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు డీఎస్పీ అనిల్ ఆధ్వర్యంలో సీఐ శివప్రసాద్, ఎస్ఐలు శంకర్‌రెడ్డి, నబీరసూల్‌తో కలిసి పట్టణంలోని మట్కా స్థావరాలపై శుక్రవారం దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో సురేష్, తిమ్మప్ప, వరలక్ష్మి, లీలావతి, కుళ్లాయప్ప, రామాంజినేయులు, ప్రసాద్, బసిరెడ్డి, రామాంజినేయులు వద్ద మట్కా చీటీలు, రూ.2,71,155 నగదుస్వాదీనం చేసుకుని వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. మట్కా బీటర్లనుపట్టుకోవడంలో కీలక పాత్ర పోషించిన నాగభూషణం, హోంగార్డు నిత్యానంద్లను డీఎస్పీ అనిల్ అభినందించారు. -
మద్యం విక్రయిస్తున్న షాపులపై దాడులు
అనంతపురం : అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో గాంధీ జయంతి రోజు మద్యం విక్రయిస్తున్న దుకాణాలపై ఎక్సైజ్ అధికారులు దాడి చేశారు. అనంతరం దుకాణాలను మూసి వేశారు. పట్టణంలో మద్యం దుకాణాల వద్ద అమ్మకలు జరుగుతున్నాయని ఎక్సైజ్ సీఐ అన్నపూర్ణకు సమాచారం అందింది. దీంతో ఆమె కళ్యాణదుర్గంలో విస్తృత తనిఖీలు నిర్వహించారు. మద్యం విక్రయిస్తున్న షాపులను మూసివేశారు. ఇలాంటివి మరోసారి పునరావృతమైతే కఠిన చర్యలు తీసుకుంటామని మద్యం దుకాణ వ్యాపారులను సీఐ అన్నపూర్ణ హెచ్చరించారు. -
చంద్రబాబును ఉరి తీయాలి: శైలజానాథ్
కళ్యాణదుర్గం: రైతులు, మహిళలను నట్టేట ముంచిన ముఖ్యమంత్రి చంద్రబాబును చెట్టుకు ఉరి తీయాలని మాజీ మంత్రి, కాంగ్రెస్ నేత సాకే శైలజానాథ్ అన్నారు. టీడీపీ ప్రభుత్వ తీరును నిరసిస్తూ సోమవారం శైలజానాథ్ ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఆర్డీఓ కార్యాలయాన్ని ముట్టడించారు. అంతకుముందు కళ్యాణదుర్గం భవన్ (పీసీసీ అధ్యక్షుడు రఘువీరా నివాసం) నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించారు. ఆర్డీఓ కార్యాలయం వద్ద రెండు గంటల పాటు బైఠాయించారు. ఈ సందర్భంగా శైలజానాథ్ మాట్లాడుతూ యోగ్యత లేనప్పుడు హామీలు గుప్పించి రైతులను, మహిళలను మోసం చేయడం ఎంత వరకు సమంజసమని సూటిగా ప్రశ్నించారు. ‘ఎన్నికల మేనిఫేస్టోలో ఇచ్చిన హామీల్లో ఏ ఒక్కటి నెరవేర్చావో ప్రజల ముందుకొచ్చి ధైర్యంగా చెప్పగలరా’ అంటూ నిలదీశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి 2004 ఎన్నికల్లో ఉచిత విద్యుత్ ఇస్తామని హామీ ఇచ్చి ప్రమాణ స్వీకారం చేసిన రోజునే దాన్ని నెరవేర్చారని గుర్తు చేశారు. -
హామీలు మాఫీ చేస్తున్న చంద్రబాబు
కళ్యాణదుర్గం: రైతు రుణాల మాఫీ ఫైలుపై తొలి సంతకం అని చెప్పి, పూటకో మాట చెబుతున్న చంద్రబాబు.. రుణమాఫీ మాటేమిటో గానీ ఇచ్చిన హామీలను మాఫీ చేస్తున్నారని ఏపీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి ఎద్దేవా చేశారు. సోమవారం ఆయన అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో విలేకరులతో మాట్లాడారు. ఇప్పటికే రైతాంగం అయోమయంలో ఉందని, గత ఏడాది పంట నష్టానికి సంబంధించి ఇన్పుట్ సబ్సిడీ, బీమా కలిపి రూ. 2,174 కోట్లు వెంటనే విడుదల చేయించాలని డిమాండ్ చేశారు. ఎకరాకు రూ. 4 వేల చొప్పున రూ. 1,374 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ, వాతావరణ బీమా రూ. 800 కోట్లు వెంటనే రైతుల ఖాతాల్లో జమ చేయాలన్నారు. ఎన్నికల ముందు టీడీపీ నాయకులు చేసిన డిమాండ్ మేరకు ఎకరాకు రూ. 10 వేల ప్రకారం ఇన్పుట్ సబ్సిడీ విడుదల చేయించాలన్నారు. ప్రస్తుతం రైతులు కనీసం రుణాలు రెన్యూవల్ చేసుకోవడానికి ప్రభుత్వం వడ్డీ భరించలేదా అని నిలదీశారు. గతంలో 98 శాతం మహిళా రుణాల రికవరీ ఉండేదని, రుణమాఫీ హామీతో అప్పు చెల్లించలేక పోయారని తెలిపారు. బ్యాంకులు బంగారాన్ని వేలం వేసే పరిస్థితి వచ్చిందన్నారు. ఉద్యోగాలు తొలగించే విషయంలో శ్రద్ధ చూపిన పాలకులు.. పనులు కల్పించడంలో మాత్రం దృష్టి సారించలేకపోతున్నారని విమర్శించారు. -
సీమలో రాజధాని ఏర్పాటు చేయాలి
కళ్యాణదుర్గం: రాయలసీమలో రాజధాని ఏర్పాటు చేయాలని రాయలసీమ రాజధాని సాధన కమిటీ సభ్యులు డిమాండ్ చేశారు. అభివృద్ధి కొన్ని జిల్లాలకే పరిమితం అయితే మళ్లీ వేర్పాటు ఉద్యమం రగిలే ప్రమాదం ఉందన్నారు. బుధవారం అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలో ‘సీమ’లో రాజధాని ఏర్పాటు చేయాలన్న డిమాండ్‌తో విద్యార్థినులు, కమిటీ సభ్యులు భారీ ర్యాలీ నిర్వహించి మానవహారంగా ఏర్పడ్డారు. అంతకు ముందు ఓ ప్రైవేట్ కళాశాలలో జరిగిన సమావేశంలో కమిటీ సభ్యులు డాక్టర్ దేశం శ్రీనివాసరెడ్డి తదితరులు మాట్లాడుతూ.. రాజధాని కోసం గుంటూరు, విశాఖపట్నం, విజయవాడ లాంటి ప్రాంతాలలో కోట్లు ఖర్చు చేస్తే రాయలసీమకు తిరిగి అన్యాయం జరుగుతుందన్నా రు. 13 జిల్లాల్లో సమాన అభివృద్ధి చేపట్టాలన్నారు. ఈ విషయంలో రాయలసీమ ప్రజా ప్రతినిధులు గళం విప్పాలని,శివరామకృష్ణన్ కమిటీ నివేదిక ఇవ్వకుండానే నాయకులు రాజధాని నిర్ణయం గురించి మాట్లాడడం బాధాకరమన్నారు.