సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు.
ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు సభను విజయవంతం చేయండి. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతీ ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. కళ్యాణదుర్గం సభలో ఇన్ పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేస్తారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి.
రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు అని తెలిపారు.
ఇక, కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు.
ఇది కూడా చదవండి: నారా లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్
Comments
Please login to add a commentAdd a comment