Peddireddy ramacandrareddy
-
పీఏసీ ఛైర్మన్ ఎన్నికకు నామినేషన్ వేయనున్న పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
-
వైఎస్ జగన్ పుంగునూర్ పర్యటన రద్దు
-
హైకోర్టులో పెద్దిరెడ్డి పిటిషన్..
-
బాబుకు ఓటు అడిగే అర్హతే లేదు : పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి
పుంగనూరు: ఎన్నికల సమయంలో ప్రజలకు మాయమాటలు చెప్పి మోసం చేసే చంద్రబాబుకు కనీసం ఓటు అడిగే అర్హత కూడా లేదని మంత్రి, వైఎస్సార్సీపీ పుంగనూరు ఎమ్మెల్యే అభ్యర్థి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. గురువారం పట్టణంలోని కొత్తయిండ్లు, కొత్తపేట, ఎల్ఐసీ కాలనీలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఇంటింటికీ వెళ్లి ఓట్లు అభ్యర్థించారు. మంత్రి మాట్లాడుతూ బీజేపీ రాజంపేట ఎంపీ అభ్యర్థి కిరణ్‌కుమార్‌రెడ్డి చచ్చిన పాములాంటివాడని, ఆయనకు డిపాజిట్ కూడా దక్కదని స్పష్టం చేశారు. 2014 ఎన్నికల్లో చంద్రబాబు 600 హామీలతో మేనిఫెస్టోను విడుదల చేసి, అధికారంలోకి రాగానే మేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసేశారని విమర్శించారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019 ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నీ తూచా తప్పకుండా నెరవేర్చారని కొనియాడారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విద్య, ఆరోగ్యం, పేదల ఇళ్ల నిర్మాణానికి పెద్దపీట వేసినట్లు వెల్లడించారు. సచివాలయ వ్యవస్థను ఏర్పాటు చేసి ప్రజల ముంగిటకే ప్రభుత్వ పాలనను తీసుకెళ్లి సేవలు అందించామని తెలిపారు.వలంటీర్లు అందిస్తున్న సేవలు మరువలేనివన్నారు. కరోనా కష్టకాలంలో కుటుంబ సభ్యులు సైతం భయపడినా, జగనన్న వలంటీర్లు మాత్రం ధైర్యంగా రోగులకు సేవలు అందించారని స్పష్టం చేశారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పేదరికమే ప్రామాణికంగా సంక్షేమ పథకాలు అందించామని వివరించారు. జగన్మోహన్రెడ్డి చేసేవి మాత్రమే చెబుతారని , వాటినే మేనిఫెస్టోగా విడుదల చేశారన్నారు. ఐదేళ్లలో 98 శాతం ఎన్నికల హామీలను అమలు చేసిన వైఎస్సార్సీపీకే ప్రజల వద్దకు ధైర్యంగా వెళ్లి ఓటు అడిగే అర్హత ఉందని వెల్లడించారు.చంద్రబాబు , పవన్‌కల్యాణ విడుదల చేసిన ఉమ్మడి మేనిఫెస్టోకి బీజేపీ దూరంగా ఉందని, దీన్ని బట్టే అది ఎంత మోసకారి మేనిఫెస్టోనో అర్థమవుతోందని తెలిపారు. బారు మేనిఫెస్టోను ప్రజలు నమ్మే స్థితిలో లేరని, ఎన్నికల్లో కూటమి అభ్యర్థులకు ఓటమి తప్పదని స్పష్టం చేశారు. ఈనెల 13న జరిగే పోలింగ్ రోజున ప్రతి ఒక్కకూ తమ రెండు ఓట్లను ఫ్యాన్ గుర్తుకు వేసి వైఎస్సార్సీపీ అభ్యర్థులను అఖండ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు.సమావేశంలో టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్‌కుమార్, రాష్ట్ర జానపదకళల సంస్థ చైర్మన్ కొండవీటి నాగభూషణం, మున్సిపల్ చైర్మన్ అలీమ్‌బాషా, పీకేఎం ఉడా చైర్మన్ వెంకటరెడ్డి యాదవ్, సీమ జిల్లాల మైనారిటీ సెల్ ఇన్చార్జి ఫకృదీ్ధన్‌షరీఫ్, వక్ఫ్ బోర్డు చైర్మన్ జిల్లా అమ్ము పాల్గొన్నారు. -
సీఎం జగన్ పై మంత్రి పెద్దిరెడ్డి ప్రశంసలు
-
ఈనెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు సభను విజయవంతం చేయండి. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతీ ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. కళ్యాణదుర్గం సభలో ఇన్ పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేస్తారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు అని తెలిపారు. ఇక, కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నారా లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్ -
అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటీపై మంత్రి పెద్దిరెడ్డి రియాక్షన్
సాక్షి, అనంతపురం జిల్లా: అమిత్ షా, జేపీ నడ్డాలతో చంద్రబాబు భేటిపై ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పందించారు. రాజకీయంగా చంద్రబాబు నడవలేని స్థితిలో ఉన్నారని.. అందుకే నాలుగైదు పార్టీలతో పొత్తులు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నారని ఆయన మండిపడ్డారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మంత్రి ఉషాశ్రీచరణ్ ఆధ్వర్యంలో బహిరంగ సభ జరిగింది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనకు నాలుగేళ్లు పూర్తయిన సందర్భంగా.. కళ్యాణదుర్గం నియోజకవర్గంలో గడప గడపకూ మన ప్రభుత్వం కార్యక్రమం పూర్తయిన సందర్భంగా మంత్రి ఉషాశ్రీచరణ్ ఈ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఏపీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. ఎంత మందితో చంద్రబాబు వచ్చినా వైఎస్సార్సీపీని ఏమీ చేయలేరని.. మళ్లీ వైఎస్ జగన్ ముఖ్యమంత్రి కావటం ఖాయం అన్నారు. చంద్రబాబు మహానటుడు అని.. మరోసారి ప్రజలను మోసం చేసేందుకు అబద్ధాల మ్యానిఫెస్టోతో ముందుకు వస్తున్నారని ఏపీ స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషాశ్రీచరణ్ విమర్శించారు. చదవండి: ‘వైఎస్ జగన్‌ది మేనిఫెస్టో.. చంద్రబాబుది మోసఫెస్టో’ -
విజయవాడలో వైభవంగా శ్రీ మహాలక్ష్మి యజ్ఞం
-
సీఎం జగన్ ను కలిసిన పెద్దిరెడ్డి టీటీడీ ఈవో ధర్మారెడ్డి
-
జేబులు నింపుకుంది చాలు..!
సాక్షి ప్రతినిధి, శ్రీకాకుళం: నదులకు గర్భశోకం ఆపేలా నిర్ణయం వెలువడింది. తీరాల్లో జరుగుతున్న విధ్వంస రచనకు చరమ గీతం పాడేలా ఆదేశాలు వచ్చాయి. ఉచితం ముసుగులో జరిగిన అనుచితమైన పనులు ఆగేలా ఉత్తర్వులు వెలువడ్డాయి. ఇన్నాళ్లూ టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు జేబులు నింపుకోవడానికి వరంగా ఉన్న ‘ఉచిత ఇసుక’ విధానం రద్దయ్యింది. ఖజానాకొచ్చే ఆదాయానికి గండి కొట్టి పార్టీ నాయకుల కడుపులు నిం పడానికి గత చంద్రబాబు ప్రభుత్వం తీసుకొచ్చిన ఈ విధానం ఇక చెల్లదు. నదుల వద్ద ఇసుక రీచ్‌ల కేటాయింపులూ ఉండవు. గత సర్కారు చేసిన తప్పిదాలను సరిదిద్ది ఇటు ప్రజలకు, అటు ప్రభుత్వ ఆదాయానికి ఇబ్బంది లేకుండా కట్టుదిట్టమైన చర్యలతో నూతన ఇసుక విధానం తీసుకురావడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం నడుం బిగించింది. జూలై ఒకటో తేదీలోగా దీన్ని అమల్లోకి తీసుకొస్తామని గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మంగళవారం ప్రకటించారు. అప్పటివరకూ జిల్లాలో ఎక్కడ ఇసుక లారీ కనిపించినా అధికారులదే బాధ్యత. అక్రమ రవాణా బాధ్యులపై పీడీ యాక్ట్ కూడా ప్రయోగించనున్నారు. జిల్లాలో నాగావళి, వంశధార, మహేంద్రతనయ, బాహుదా... ఇలా నది ఏదైనా మాఫియా ఇసుక దోపిడీకి నిలయమైపోయాయి. టీడీపీ ప్రభుత్వం గత ఐదేళ్లలో అనుసరించిన రకరకాల విధానాల్లో లొసుగులు మాఫియాకు వరంగా మారాయి. ఆ అక్రమార్కులు, టీడీపీ నాయకులు చేతులు కలిపి ఇసుక ద్వారా గత ఐదేళ్లలో దోచుకున్నది సుమారు వెయ్యి కోట్ల రూపాయల పైమాటేనని ఓ అంచనా. నదుల జిల్లాగా పేర్కొందిన సిక్కోలులో ఎప్పుడూ ఐదు నుంచి పది ర్యాం పులకు మాత్రమే పర్యావరణ అనుమతులతో పాటు కలెక్టరు నేతృత్వంలోని జిల్లా సాండ్ కమిటీ నుంచి అనుమతులు ఇచ్చేవారు. కానీ అనధికారికంగా, అక్రమంగా పుట్టగొడుగుల్లా రీచ్‌లు అనేకంగా ఈ ఐదేళ్లూ పుట్టుకొచ్చాయి. ఇప్పటికీ నదుల గర్భాలను పొక్లెయినర్లతో ఛిద్రం చేస్తున్నారు. టీడీపీ హయాంలో గందరగోళం.. వాస్తవానికి ఇసుక తవ్వకాల విషయంలో గతంలో ఏ ప్రభుత్వాలు అనుసరించని భిన్నమైన విధానాలను గత టీడీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. అధికారంలోకి వచ్చిన తొలి రోజుల్లో జిల్లాలోని 23 ఇసుక ర్యాంపులను డ్వాక్రా సంఘాలకు అప్పగించింది. ఆన్లైన్లో చలానా చెల్లించి, రశీదు ర్యాంపులో చూపిస్తే వాహనంలో ఇసుక లోడింగ్ చేసేవారు. ఈ విధంగా ర్యాంపు నిర్వహణ సేవలు అందించినందుకు డ్వాక్రా సంఘాలకు ఇసుక విక్రయం ద్వారా వచ్చిన ఆదాయంలో 25 శాతం ఇస్తామని టీడీపీ ప్రభుత్వం ప్రకటించింది. అలాగే మరో 25 శాతం సొమ్ము స్థానిక రైతుల సంక్షేమానికి వినియోగిస్తామని చెప్పింది. ఇవేవీ సక్రమంగా అమలుకాలేదు సరికదా మరోవైపు ఇసుక బ్లాక్ మార్కెట్‌కు తరలిపోయింది. డ్వాక్రా సంఘాల ముసుగులో కొంతమంది అధికార పార్టీ నాయకులు, వారి అనుచరులే రీచ్‌లను నిర్వహించి సొమ్ము చేసుకున్నారు. ఇసుక ధర ఆకాశాన్ని అంటడంతో భవన నిర్మాణాలు నిలిచిపోయాయి. చివరకు భవన నిర్మాణ కార్మికులు ఆందోళనకు కూడా దిగిన సంగతి తెలిసిందే. ‘ఉచితం’ ముసుగులో దోపిడీ.. టీడీపీ ప్రభుత్వం ఇసుక ర్యాంపుల నిర్వహణ బాధ్యతలను డ్వాక్రా సంఘాల నుంచి తప్పించి 2016, ఏప్రిల్ నెలలో ‘ఉచిత ఇసుక విధానం’ తీసుకొచ్చింది. ఎవ్వరికి అవసరమైనా నదికి వెళ్లి ఇసుకను తెచ్చుకోవచ్చని ప్రకటించింది. ఎవ్వరైనా దాన్నో వ్యాపారంగా మా ర్చుకొని అక్రమంగా ఇసుక నిల్వ చేస్తే నిత్యావసరాల చట్టం కింద కేసులు నమోదు చేస్తామని కూడా టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. కానీ ఉచితం ముసుగులో మాఫియా జిల్లాలోని ఇసుక ర్యాంపులను గుప్పిట పట్టింది. ఇందుకు టీడీపీ నాయకులు అన్ని విధాలా మాఫియాకు సహాయ సహకారాలు అందించి పబ్బం గడుపుకొన్నారు. తనిఖీ చేయాల్సిన టాస్క్‌ఫోర్స్ ఎక్కడా కనిపించలేదు. ర్యాంపుల్లో సీసీ కెమెరాలు పెడతామంటూ చెప్పినా అవేవీ ఆచరణలోకి రాలేదు. ఒకరకంగా చెప్పాలంటే ఉద్దేశపూర్వకంగానే టీడీపీ నాయకులు, కార్యకర్తల జేబులను కాసులతో గలగలలాడించేందుకే ఈ ఉచిత ఇసుక విధానాన్ని తెరపైకి తెచ్చిందనే తీవ్ర విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీ నేతలు, వారి అనుయాయులకు ఉచిత ఇసుక విధానం బంగారు పథకంలా మారిపోయింది. నదులనే కాదు థర్డ్ ఆర్డర్ స్ట్రీమ్ కింద వాగులు, వంకలను కూడా వదల్లేదు. జిల్లా శాండ్ కమిటీ పర్యావరణ అనుమతులున్న రీచ్‌ల నుంచే ఇసుకను తవ్వాల్సి ఉన్నా అనుమతులతో సంబంధం లేకుండా, పర్యావరణ చట్టాలకు, నిబంధనలకు తూట్లు పొడుస్తూ మాఫియా నదుల్లో కాసుల వేట సాగించింది. సాయంత్రం 6 గంటల తర్వాత ఎట్టి పరిస్థితిలోనూ నదుల్లో ఇసుక తవ్వకాలు జరపకూడదు. కానీ అర్ధరాత్రి నుంచి తెల్లవారుజాము వరకూ ర్యాంపుల్లో జేసీబీలు, పొక్లెయినర్లు హోరెత్తుతున్నా యి. లారీలను నేరుగా నదిలోకి తీసుకెళ్లి మరీ ఇసుకను నింపేస్తున్నారు. వంతెనలకు, ఇరిగేషన్ పం పులు, వాటర్ ఫిల్టర్ సంపులకు కనీసం 500 మీట ర్లు దూరంలో ఇసుక తవ్వకాలను చేపట్టాలి. కానీ నిబంధనలు ఎక్కడా పట్టించుకోవట్లేదు. నిబంధనల ప్రకారం రీచ్ ఒడ్డున మాత్రమే తవ్వకాలు చేపట్టాలి. ఎట్టి పరిస్థితుల్లోనూ నదిలోపలకు మిషనరీ వాహనాలు (జేసీబీలు, పొక్లెయినర్లు) వెళ్లకూడదు. ఇసుక తవ్వకాలకు వినియోగించకూడదు. కానీ నదుల్లోకి రోడ్డులేసి మరీ తవ్వుకుపోతున్నారు. ముఖ్యంగా ఇసుకరీచ్ వద్ద కనీసం ఒక మీటరు ఎత్తు వరకు ఇసుక మందం ఉండాల్సి ఉంది. అంతకంటే తక్కువ మందం ఉన్న ప్రాంతాల్లో ఇసుక తవ్వకాలు నిషిద్ధం. అయితే ఏ నది లో చూసినా నిలువు లోతున కొన్నిచోట్ల నల్లమట్టి కనిపించేవరకూ యంత్రాలతో ఇసుకను తవ్వేస్తున్నా అడ్డుకునేవారే కరువయ్యారు. ఇసుక డిమాండును బట్టి రీచ్‌లవద్ద లారీకి రూ.6 వేల నుంచి రూ.10 వేల వరకూ మాఫియా వసూలు చేస్తోంది. ఇసుక అక్రమ రవాణాకు చెక్ ► టీడీపీ సర్కారు ‘ఉచిత ఇసుక’ విధానం రద్దు ► నెలాఖరు వరకూ ఇసుక రవాణా నిలిపివేత ►నదుల వద్ద రీచ్‌ల కేటాయింపులు బంద్ ► అక్రమ రవాణా ఆపకపోతే అధికారులపై చర్యలు ► మాఫియా వ్యక్తులపై పీడీ యాక్ట్ ప్రయోగం ► ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఆదేశాలు ఖజానా ఆదాయానికి గండికొట్టి.. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి రాకముందు ఇసుక ట్రాక్టరుకు రీచ్ వద్ద రూ.100కు మించకుండా సీనరేజీ వసూలు చేసేవారు. దీనివల్ల సామాన్యుల ఇళ్ల నిర్మాణానికి ఇబ్బంది ఉండేది కాదు. అంతేకాదు పెద్ద భవంతుల నిర్మాణానికి ఎంత ఇసుక అవసరమైనా పెద్దగా ఖర్చు అయ్యేది కాదు. మరోవైపు సీనరైజీ రూపేణా జిల్లాలో ఏటా రూ.25 కోట్ల నుంచి రూ.30 కోట్ల వరకూ ప్రభుత్వానికి ఆదాయం వచ్చేది. ఇలా వచ్చిన నిధులను ఎక్కువగా స్థానిక సంస్థలకు ఇచ్చి మౌలిక సౌకర్యాల కల్పనకు సద్వినియోగం చేసేవారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఇసుకను టీడీపీ నాయకులకు, కార్యకర్తలకు పెద్ద ఆదాయ వనరుగా మార్చేశారు. ప్రభుత్వ ఆదాయానికి గండి కొట్టి మరీ దోపిడీకి తెరతీశారు. ఈ ఐదేళ్లూ రోజుకు రాత్రి వేళ సుమారు 200 లారీల వరకు ఇసుక విశాఖ తదితర జిల్లాలకు అక్రమ రవాణా జరుగుతోంది. విశాఖ మార్కెట్లో లారీ ఇసుక ధర డిమాండును బట్టి రూ.16 వేల నుంచి రూ.20 వేల వరకూ పలుకుతుండటంతో మాఫియాకు కాసుల వర్షం కురుస్తోంది. ఈ ఐదేళ్లలో దోపిడీ చేసింది దాదాపు రూ.వెయ్యి కోట్ల వరకూ ఉంటుందని అంచనా. అందువల్లే ఇసుక అక్రమ రవాణా చేసేందుకు ఏకంగా టీడీపీ నాయకులు తమ అనుచరులు, బంధుగణాన్ని ర్యాంపుల్లో మోహరించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించవచ్చు. నెలాఖరు వరకూ రవాణా బంద్.. గత ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలను అరికట్టి, ప్రజలకు ఇసుక కష్టాలను తప్పించేలా నూతన విధానం తీసుకురావాలని వైఎస్ జగన్ ప్రభుత్వం తలపోస్తోంది. ఇందు కు సంబంధించిన విధివిధానాలు రూపొందిం చేవరకూ జిల్లాలో ఇసుక రవాణా నిలిపేయనున్నారు. అంతేకాదు నదికి ఆనుకొని ఉన్న పొలాల్లో ఇసుక మేటల తవ్వకాలనూ నిలిపేయాల్సిందే. ఎక్కడైనా ఇసుక అక్రమ రవాణా ను అడ్డుకోలేకపోతే అందుకు అధికారులే బాధ్యులవుతారని రాష్ట్ర గనుల శాఖ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్పష్టం చేశారు. ఆదేశాలు అందాయి.. ఇసుక తవ్వకాలకు సంబంధించిన కొత్త విధానం అమల్లోకి వచ్చేవరకూ రవాణాను నిలిపేయాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు అందాయి. ఉచిత ఇసుక విధానం రద్దు అయ్యింది. కొత్త విధానం వచ్చేవరకూ రీచ్‌ల కేటాయింపు ఉండదు. ఎవ్వరైనా అక్రమంగా ఇసుక తవ్వకాలు జరిపినా, రవాణా చేసినా కేసులు పెడతాం. – ఆర్.తమ్మునాయుడు, ఇన్చార్జ్ ఏడీ, జిల్లా గనుల శాఖ -
చంద్రబాబు నిప్పుకాదు.. తుప్పు
-వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శ సాక్షి, చిత్తూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ‘నిప్పు కాదు తుప్పు’ అని పుంగనూరు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఆదివారం చిత్తూరులో ఆయన విలేకరులతో మాట్లాడారు. అనునిత్యం నిప్పు అని తనను తాను ప్రకటించుకునే చంద్రబాబు నాయుడు.. ఓటుకు నోటు కేసులో విచారణకు సహకరించాలని డిమాండ్ చేశారు. రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఆయన కుమారుడు జగన్మోహన్రెడ్డిపై ఆరోపణలు వచ్చినప్పుడు సీబీఐ దర్యాప్తునకు ఆదేశించారని గుర్తుచేశారు. ముఖ్యమంత్రి నిజంగా నిప్పు అయితే స్టేను నిలుపుదల చేయించుకుని దర్యాప్తు చేయించుకోవాలని కోరారు. రెయిన్గన్లపై పబ్లిసిటీ స్టంట్ వేరుశనగ పంట ఎండిపోయిన తరువాత రేయిన్‌న్లతో ముఖ్యమంత్రి చంద్రబాబు పబ్లిసిటీ స్టంట్లు చేస్తున్నారని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చంద్రబాబు రైతులపై నిజంగా చిత్తశుద్ధి ఉంటే పంట ఎండు ముఖం పట్టే సమయంలోనే అన్నదాతలను ఆదుకునేందుకు ప్రయత్నించి ఉండేవారని చెప్పారు. రెయిన్గన్లను తానే కనిపెట్టినట్లు చంద్రబాబు చెప్పుకుంటున్నారని.. 20 సంత్సరాల క్రితమే రాయలసీమ రైతులు స్ప్రింక్లర్ల రూపంలో వీటిని వినియోగించేవారని పెద్దిరెడ్డి తెలిపారు. రెయిన్ గన్ల వల్ల పంటకు ఇప్పుడు ఒక్క శాతం కూడా అవసరం లేదన్నారు. నష్టపోయిన వేరుశనగ రైతులకు ఎకరాకు రూ.12 వేలు లెక్కన చెల్లించాలని డిమాండ్ చేశారు. హంద్రీ నీవా నీరు కుప్పానికి తొలిప్రాధాన్యం ఇస్తాననడం చిత్తూరు జిల్లా వ్యక్తిగా తాను హర్షిస్తున్నానని పెద్దిరెడ్డి అన్నారు. అయితే హంద్రీనీవా పిల్ల కాలువలకు కూడా నీరందిస్తే పేద రైతులకు కూడా ఉపయోగపడుతుందని చంద్రబాబు ఆలోచించకపోవడం శోచనీయమన్నారు. కృష్ణానీటిని చిత్తూరుజిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లోని రైతుల పొలాలు తడిసేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
చేనేత రుణాల్లో పైసా మాఫీ చేయని చంద్రబాబు
చేనేత కార్మికుల రుణాల్లో ఒక్క రూపాయి రుణాన్ని కూడా సీఎం చంద్రబాబు మాఫీ చేయరని వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. చిత్తూరు జిల్లా సదుం మండలం జాండ్రపేటలో నిర్వహించిన ప్రపంచ చేనేత దినోత్సవంలో ఆదివారం ఆయన పాల్గొని మాట్లాడారు. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు తన ఎన్నికల మ్యానిఫెస్టోలో చేనేత కార్మికులకు పలు పథకాలను ప్రకటించి, ప్రభుత్వం ఏర్పాటుచేసి రెండున్నర సంవత్సరాలు పూర్తవుతున్నా ఇంత వరకు ఏ ఒక్కటీ అమలు చేయలేదని పెద్దిరెడ్డి ధ్వజమెత్తారు. చేనేత దినోత్సవంలో నాయకులు నిలదీస్తారనే భయంతో వ్యూహాత్మకంగా అనంతరపురంలో ఒక్కరోజు ముందు రూ.111 కోట్ల చేనేత రుణాల మాఫీ, రూ.3 లక్షలతో గృహాలు కట్టిస్తామని ప్రకటించడం ఆయన దిగజారుడుతనాన్ని సూచిస్తుందన్నారు. నేతన్నలు రెండు సంవత్సరాలు ఓపిక పట్టాలని జగన్మోహన్ రెడ్డి సీఎం కాగానే ఇప్పటివరకు ఉన్న ప్రభుత్వాలు చేనేత కార్మికులకు ప్రకటించిన పథకాలన్నీ అమలుచేసి వారి కష్టాలను తీరుస్తామని స్పష్టం చేశారు. హామీలను అమలు చేయని పక్షంలో రాజకీయాల నుంచి వైదొలగుతామని ప్రకటించారు. కార్యక్రమంలో జెడ్పీ మాజీ వైస్ చెర్మైన్ పెద్దిరెడ్డి, చేనేత సంఘం చిత్తూరు జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రవి, చౌడేపల్లె జెడ్పీటీసీ సభ్యురాలు రుక్మిణమ్మ తదితరులు పాల్గొన్నారు.