Ushasri charan
-
రాష్ట్రంలో అరాచక పాలన
సాక్షి, పుట్టపర్తి: ‘రాష్ట్రంలో అరాచక పాలన సాగుతోంది. మహిళలకు రక్షణ కరువైంది. బాలికలు బతకాలంటేనే భయం భయంగా గడపాల్సి వస్తోంది. శ్రీసత్యసాయి జిల్లా హిందూపురం నియోజకవర్గం చిలమత్తూరు మండలం నల్లబొమ్మనపల్లి సమీపంలోని పేపరు మిల్లు వద్ద ఓ కుటుంబంలోని ఇద్దరు మహిళలపై శనివారం తెల్లవారుజామున కొందరు యువకులు గ్యాంగ్ రేప్ చేశారు. ఈ ఘటనపై ఇప్పటికీ ఎలాంటి చర్యలూ తీసుకోలేదు. పండుగ రోజున ఓ కుటుంబం అన్యాయానికి గురైతే ప్రభుత్వానికి పట్టదా? బాధితులను పరామర్శిద్దామని సాటి మహిళలుగా నేను (ఉషశ్రీచరణ్), దీపిక హిందూపురం ఆస్పత్రి వద్దకు వెళ్తే.. పోలీసులు లోపలికి అనుమతించలేదు.బాధితులను పరామర్శించాలంటే అధికారంలోనే ఉండాలా? చట్టం మీ చుట్టమా? చంద్రబాబు నేతృత్వంలో కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో ఏదో చోట మహిళలపై అఘాయిత్యాలు జరుగుతూనే ఉన్నాయి. మహిళల రక్షణలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. కాలేజీ బాత్ రూముల్లో వీడియోలు తీసి బయటకు వదిలేస్తున్నారు. చిన్నారులపై అత్యాచారాలకు పాల్పడుతున్నారు. పొట్ట కూటి కోసం వచ్చే కుటుంబాలపై గ్యాంగ్ రేప్ చేస్తున్నారు..’ అంటూ వైఎస్సార్సీపీ శ్రీసత్యసాయి జిల్లా అధ్యక్షురాలు ఉషశ్రీచరణ్ ధ్వజమెత్తారు.సోమవారం సాయంత్రం ఆమె పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, హిందూపురం నియోజకవర్గ పార్టీ సమన్వయకర్త టీఎన్ దీపిక తదితరులతో కలిసి పుట్టపర్తిలోని జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. అదనపు ఎస్పీ ఆర్ల శ్రీనివాసులును కలిసి గ్యాంగ్ రేప్ విషయమై మాట్లాడారు. నిందితులను త్వరగా పట్టుకుని.. కఠినంగా శిక్షించాలని కోరారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ గ్యాంగ్ రేప్ ఘటనపై సీఎం చంద్రబాబు, హోం మంత్రి అనిత ఎందుకు సరైన రీతిలో స్పందించలేదని ఉషశ్రీచరణ్ ప్రశ్నించారు. గత ప్రభుత్వంలో మహిళలకు రక్షణగా దిశ చట్టం తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్‌దేనన్నారు. మహిళలకు అన్యాయం జరగకుండా ఎస్ఓఎస్ ద్వారా రక్షణ కోరే అవకాశం ఉండేదని చెప్పారు. ప్రభుత్వ చేతగాని తనానికి నిదర్శనం రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని హిందూపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ సమన్వయకర్త టీఎన్ దీపిక అన్నారు. మొన్న ధర్మవరం వన్‌టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్ తల్లిని కిడ్నాప్ చేసి హత్య చేశారు, అంతకుముందు పుంగనూరు, నంద్యాలలోనూ మహిళలపై అఘాయిత్యాలు వెలుగు చూశాయి, ప్రస్తుతం హిందూపురం నియోజకవర్గంలో ఇద్దరు మహిళలపై గ్యాంగ్ రేప్ జరిగినా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం ప్రభుత్వ చేతగానితనానికి నిదర్శనమని విమర్శించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన నాటి నుంచి రాష్ట్రంలో అరాచకాలు ఎక్కువయ్యాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. -
ఎమ్మెల్యే బాలకృష్ణ ఆచూకీ ఎక్కడ?: వైఎస్సార్సీపీ
సాక్షి, శ్రీ సత్యసాయి జిల్లా: పుట్టపర్తి ఏఎస్పీ ఆర్ల శ్రీనివాస్‌ను వైఎస్సార్సీపీ నేతల బృందం సోమవారం కలిసింది. హిందూపురం నియోజకవర్గంలో అత్తా కోడలిపై సామూహిక లైంగికదాడి చేసిన నిందితులను కఠినంగా శిక్షించాలని విజ్ఞప్తి చేశారు. ఏఎస్పీని కలిసిన వారిలో వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, వైఎస్సార్ సీపీ హిందూపురం సమన్వయకర్త దీపిక తదితరులు ఉన్నారు. ఈ సందర్భంగా ఉషశ్రీ చరణ్ మీడియాతో మాట్లాడుతూ, నిందితులను పట్టుకోవడంలో పోలీసుల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు.అత్తాకోడళ్లపై జరిగిన ఘటనతో అనంతపురం జిల్లా ఉలిక్కిపడింది. మహిళలు, సామాన్య ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. నిందితులను తక్షణం అరెస్ట్ చేసి బాధితులకు న్యాయం చేసేవరకు వైఎస్సార్సీపీ పోరాడుతుంది. ఈ ఘటనపై జిల్లా మంత్రి సవిత సాయంత్రానికల్లా నిందితులను అరెస్ట్ చేస్తామని ప్రకటించారు. ఎస్పీ నిందితులపై చర్యలు తీసుకుంటామని చెప్పి వదిలేశారు. స్థానిక (హిందూపూర్) ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ ఆచూకీ తెలియడం లేదు. ఇంతవరకు ఈ ఘటనపై గా ఆయన స్పందించకపోవడం దారుణం.’’ అని ఉషశ్రీచరణ్ ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళల రక్షణ కోసం ప్రభుత్వం తీసుకునే చర్యలు సరిపోవడం లేదు. పుంగనూరు ఘటనలోనూ మూడు రోజులైనా పోలీసులు స్పందించలేదు. మా నాయకులు వైఎస్ జగన్ వస్తారని తెలియగానే మంత్రులు పర్యటించారు. అప్పటిదాకా ప్రభుత్వంలో కానీ, పోలీసుల్లో కానీ చలనం లేదు ఈ ఘటనలోనూ వైఎస్ జగన్ వస్తే తప్ప బాధితులకు న్యాయం చేయరా..? అలాగే అయితే మా నాయకులు ప్రజల కోసం రావడానికి ఎప్పుడూ సిద్ధమే’’ అని ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు.బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా?: దీపికఎమ్మెల్యే బాలకృష్ణకు బాధితులను పరామర్శించే తీరిక లేదా? అంటూ హిందూపురం నియోజకవర్గ ఇన్ఛార్జ్ దీపిక ప్రశ్నించారు. చిలమత్తూరు మండలం నల్లబొమ్మలపల్లి గ్రామంలో పక్క రాష్ట్రం నుంచి ఉపాధి కోసం వచ్చి నివాసం ఉంటున్న కుటుంబంలోని అత్తా కోడళ్లపై శనివారం లైంగికదాడి జరిగింది. స్ధానికుల సాయంతో శనివారం ఉదయం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇంత జరిగినా నియోజకవర్గ ఎమ్మెల్యే బాలకృష్ణ ఆచూకీ లేదు. ఆయనకు నియోజకవర్గ ప్రజల మాన ప్రాణాలపై ఇంత నిర్లక్ష్యమా. ఫోన్లో పరామర్శించి చేతులు దులిపేసుకోవడం న్యాయమా? రెండు రోజుల తర్వాత మంత్రి సవిత వచ్చి హడావుడి చేసి వెళ్లారు. సంఘటన జరిగిన 12 గంటల్లోనే ప్రతిపక్ష పార్టీ నుంచి మేం బాధితులకు అండగా నిలబడితే, వ్యవస్థలన్నీ చేతుల్లో ఉంచుకుని నిందితులను పట్టుకోవడానికి ప్రభుత్వం ఎందుకంత తాత్సారం చేస్తోంది...సాయంత్రం లోపు నిందితులను అరెస్ట్ చేస్తామని మంత్రి సవిత హామీ ఇచ్చారు. ఇంతవరకు నిందితులను పట్టుకోలేదు. మా పార్టీని తిట్టడం మాని ఇప్పటికైనా నిందితులను పట్టుకోవడంలో దృష్టిపెట్టాలి. మా ప్రభుత్వ హయాంలో తీసుకొచ్చిన దిశ చట్టం ఉండుంటే నిందితులు ఇంత స్వేచ్ఛగా నేరాలు చేసే వాళ్లు కాదు. 21 రోజుల్లో నిందితులను పట్టుకుని శిక్షలు విధించిన సందర్భాలున్నాయి. కూటమి ప్రభుత్వం వచ్చిన 120 రోజుల్లో మహిళలపై ఎన్నో నేరాలు చేసినా ఒక్క కేసులో కూడా నిందితులకు శిక్ష పడింది లేదు.ఇదీ చదవండి: ‘మాట మార్చడంలో బాబు తరువాతే ఎవరైనా’..హిందూపురం ప్రజలు గెలిపించింది బాలకృష్ణనా లేదా ఆయన పీఏనా. హైదరాబాద్‌లో కూర్చుని అన్‌స్టాపబుల్‌కి తర్వాతైనా ప్రిపేర్ అవొచ్చు.. హైదరాబాద్ నుంచి హిందూపురం ఇప్పటికైనా వచ్చి బాధితులకు న్యాయం చేయాలి. పోలీసుల నుంచి కూడా సరైన స్పందన లేదు. బాధితులను పరామర్శించడానికి కూడా మాకు అవకాశం ఇవ్వడం లేదు. మహిళా నాయకులు కూడా వెళ్లడం తప్పా.. బాధితులకు అండగా నిలవాల్సిన సామాజిక బాధ్యత మాపై ఉంది. కానీ దాన్ని కూడా అణచివేసేందుకు ప్రభుత్వం కుట్రపూరితంగా వ్యవహరిస్తుంది’’ అని దీపిక నిప్పులు చెరిగారు.రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు: దుద్దుకుంట శ్రీధర్రెడ్డిచంద్రబాబు సీఎం అయ్యాక రాష్ట్రంలో ప్రతినెలా ఏదోక చొట మహిళలపై అత్యాచారాలు జరుగుతూనే ఉన్నాయని పుట్టపర్తి మాజీ ఎమ్మెల్యే దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి అన్నారు. ముచ్చుమర్రి, పుంగనూరు, గుడ్లవల్లేరు, నేడు చిలమత్తూరు ఘటనలన్నీ చూస్తుంటే రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని అర్థం అవుతుంది. కూటమి పాలనలో రాష్ట్రాన్ని దోపిడీలు, దాడులకు అడ్డాగా మార్చేశారు. రాష్ట్రాన్ని నేరాంధ్రప్రదేశ్‌గా మార్చేశారు. ఆదాయం కోసం బెట్టింగులు, పేకాట క్లబ్బులు, గంజాయి అమ్మకాలను ఎమ్మెల్యేలే దగ్గరుండి మరీ ప్రోత్సహిస్తున్నారు. పోలీసులకు కూడా నేరాలపై నియంత్రణ లేకుండా పోయింది. గంజాయి, జూదం అరికడితే తప్ప ఈ నేరాలు అదుపులోకి వచ్చే అవకాశం ఉండదని సీఎం చంద్రబాబు గమనించాలి. రవి బిష్ణోయ్ గ్యాంగ్ తరహాలో అనంతపురంలో కూడా ఒక గ్యాంగ్ తయారవుతోంది. మహిళల రక్షణ కోసం గతంలో మా ప్రభుత్వం ప్రవేశపెట్టిన దిశ చట్టాన్ని కొనసాగించాలి’’ అని శ్రీధర్‌రెడ్డి డిమాండ్ చేశారు. -
ఈవీఎం ట్యాంపరింగ్ పై ఉషశ్రీ చరణ్ రియాక్షన్
-
టిడిపి నేతలపై ఉషశ్రీ చరణ్ కామెంట్స్
-
YSRCP కార్యకర్తలపై దాడులు..ఉషశ్రీ చరణ్ రియాక్షన్
-
చంద్రబాబుకు భారీ షాక్ వైఎస్సార్సీపీలోకి 250 టీడీపీ కుటుంబాలు
-
సీఎం జగన్ గురించి మాట్లాడే అర్హత షర్మిలకు లేదు
-
మంత్రి ఉషాశ్రీచరణ్ ఘనస్వాగతం పలికిన వైఎస్సార్సీపీ శ్రేణులు
-
మన బిడ్డల భవిష్యత్ కోసం జగన్ కావాలి
సాక్షి ప్రతినిధి, అనంతపురం: ‘ఇన్నేళ్లూ ప్రభుత్వాలన్నీ ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీ వర్గాలను ఓటు బ్యాంకుగానే చూశాయి. వాడుకుని వదిలేశాయి. కానీ ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టాక మన బిడ్డలకు ఇంగ్లిష్ చదువులు చెబుతున్నారు. వారి రక్షణకు భరోసా కల్పిస్తున్నారు, అక్కచెల్లెమ్మలకు చేయూతనిస్తున్నారు. అవ్వా తాతలను మనవడిలా వెంట ఉండి నడిపిస్తున్నాడు. మన బిడ్డల ఉన్నత చదువులకు, వారి భవిష్యత్‌కు మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన అవసరం ఉంది’’ అని పలువురు మంత్రులు, వైఎస్సార్సీపీ నేతలు చెప్పారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో చేపట్టిన సామాజిక సాధికార యాత్ర గురువారం భారీ జన సందోహంమధ్య పార్టీ రీజనల్ కోఆర్డినేటర్, మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో అనంతపురం జిల్లా శింగనమల నియోజకవర్గంలో సాగింది. సాయంత్రం 5 గంటలకు బుక్కరాయసముద్రం సభా వేదిక వద్దకు చేరుకుంది. సాధికారత అంటే ఏంటో చేసి చూపించారు: మంత్రి ఉషశ్రీ సామాజిక సాధికారత అంటే ఏమిటో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ చేసి చూపించారని స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి ఉషశ్రీ చరణ్ చెప్పారు. మహిళా సాధికారత కోసం రూ.25 వేల కోట్లు వెచ్చించారని తెలిపారు. జనరంజక పాలన అందించారని, ప్రతి ఎమ్మెల్యే కూడా ఆయన పేరు చెప్పుకుని గర్విస్తున్నామన్నారు. కేబినెట్లో పదకొండు మంది బీసీ మంత్రులు: అంజాద్ బాషా సీట్లు, ఓట్లతో పాటు మంత్రి పదవులు, ఇతర పదవుల్లోనూ సామాజిక న్యాయం కల్పించిన సీఎం జగన్ అన్ని వర్గాలకు రాజ్యాధికారం ఇచ్చారని ఉప ముఖ్యమంత్రి అంజాద్ బాషా చెప్పారు. జగన్ హయాంలో 11 మంది బీసీలు, ఐదుగురు ఎస్సీలు మంత్రులయ్యారన్నారు. 2024లో పేదలకు–పెత్తందార్లకు మధ్య కురుక్షేత్ర సంగ్రామం జరుగుతోందని, పేదల పక్షాన మనందరం జగన్‌కు ఓటేసి గెలిపించుకోవాలని చెప్పారు. స్వాతంత్య్రం ఇప్పుడే వచ్చింది: మంత్రి జయరాం భారత స్వాతంత్య్ర చరిత్రలో ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, బీసీలకు ఇప్పుడే అసలు సిసలు స్వాతంత్య్రం వచ్చిందని కార్మిక శాఖ మంత్రి జి.జయరాం చెప్పారు. పదవుల్లో, ఉద్యోగాల్లో, సంక్షేమ పథకాల లబ్ధిలో అన్నింటా స్వేచ్ఛ వచ్చిందన్నారు. పల్లెల్లో ప్రతి తల్లి, ప్రతి తండ్రీ జగన్‌ను కొడుకుగా భావిస్తున్నారని, చదువుకునే చిన్నారులతో మేనమామగా పిలిపించుకుంటున్న ఏకైక ముఖ్యమంత్రి జగన్ అని తెలిపారు. ఎస్సీలకు మేలు జరగకుండా బాబు అడ్డుకున్నారు: ఎంపీ సురేష్ ఎస్సీ, ఎస్టీ వర్గాలకు అమరావతి ప్రాంతంలో ఇళ్ల స్థలాలు ఇస్తే మురికివాడ అవుతుందని చంద్రబాబు కోర్టుల్లో కేసులు వేయించి అడ్డుకొన్నారని బాపట్ల ఎంపీ నందిగం సురేష్ చెప్పారు. పేదలందరికీ ఆరోగ్యశ్రీ కింద ఉచితంగా వైద్యం అందిస్తున్న ఘనత వైఎస్ జగన్‌దేనని అన్నారు. 14 ఏళ్ల సీఎం అనుభవం నలభై ఏళ్ల కుర్రాడి ముందు వెలవెల పోయిందని అన్నారు. శింగనమల సెంటిమెంటు పనిచేస్తుంది: జొన్నలగడ్డ శింగనమల నియోజకవర్గంలో ఎవరు గెలిస్తే ఆ పార్టీ రాష్ట్రంలో అధికారంలోకి వస్తుందని, మీరందరూ ఇక్కడ మళ్లీ వైఎస్సార్సీపీకి ఓటేసి జగన్‌ను సీఎం చెయ్యాలని శింగనమల ఎమ్మెల్యే జొన్నలగడ్డ పద్మావతి కోరారు. నియోజకవర్గంలో 40 చెరువులను లోకలైజ్ చేసి రైతులకు జగన్ అండగా నిలిచారని, ఈ నియోజకవర్గంపై ఆయనకు ప్రత్యేక ప్రేమ ఉందన్నారు. జగన్ అన్నట్టు 175కు 175 సీట్లు సాధ్యమే అని తెలిపారు. ఈ యాత్రలో ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్, ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యేలు అనంత వెంకట్రామిరెడ్డి, సిద్దారెడ్డి, దుద్దుకుంట శ్రీధర్‌రెడ్డి, వై.వెంకట్రామిరెడ్డి, కేతిరెడ్డి పెద్దారెడ్డి, ఎమ్మెల్సీలు శివరామిరెడ్డి, మంగమ్మ, మాజీ ఎమ్మెల్యే విశ్వేశ్వరరెడ్డి, జెడ్పీ చైర్పర్సన్ బోయ గిరిజమ్మ, ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, బీసీ సెల్ రీజనల్ కోఆర్డినేటర్ బీసీ రమేష్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అప్పుడే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’
అనంతపురం: ఎన్నికలు రాకముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్. ఆ భయంతోనే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు అబద్దాలకోరు. 2014-19 కళ్యాణదుర్గం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యం. హంద్రీనీవా కాలువ తవ్వకాలకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారు. భైరవానితిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జీర్ణించుకోలేక చంద్రబాబు విమర్శలు. ఎన్నికలు రాక ముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’ అని ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు. -
ఈనెల 8న సీఎం జగన్ కళ్యాణదుర్గం పర్యటన
సాక్షి, అనంతపురం: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో పర్యటించనున్నారు. ఈ సందర్భంగా కళ్యాణదుర్గంలో ఏర్పాట్లను మంత్రులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఉషాశ్రీచరణ్, ముఖ్యమంత్రి ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశిల రఘురాం పరిశీలించారు. ఈ సందర్బంగా మంత్రి పెద్దిరెడ్డి మాట్లాడుతూ.. ఈనెల 8వ తేదీన కళ్యాణదుర్గంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్ రైతు సభను విజయవంతం చేయండి. వైఎస్సార్ జయంతి సందర్భంగా ప్రభుత్వం ప్రతీ ఏటా రైతు దినోత్సవం నిర్వహిస్తోంది. కళ్యాణదుర్గం సభలో ఇన్ పుట్ సబ్సిడీని సీఎం జగన్ విడుదల చేస్తారు. సీఎం జగన్ రైతుల పక్షపాతి. రైతుల కోసం అనేక సంక్షేమ పథకాలు అమలు చేసిన ఘనత సీఎం జగన్‌దే. మూడు వేల కోట్ల రూపాయలతో ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేశారు. రైతులకు గిట్టుబాటు ధరలు కల్పిస్తున్నారు అని తెలిపారు. ఇక, కార్యక్రమంలో ప్రభుత్వ విప్ కాపు రామచంద్రారెడ్డి, ఎమ్మెల్యే తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, ఎమ్మెల్సీ మంగమ్మ, జెడ్పీ చైర్మన్ బోయ గిరిజమ్మ, ఏపీ ఉర్దూ అకాడమీ చైర్మన్ నదీం అహ్మద్, అహుడా ఛైర్మన్ మహాలక్ష్మి శ్రీనివాస్, కలెక్టర్ గౌతమి, ఎస్పీ శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. ఇది కూడా చదవండి: నారా లోకేష్‌కి మాజీ మంత్రి అనిల్‌కుమార్ సవాల్ -
బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం జగన్
సాక్షి, అమరావతి: చరిత్రలో రాష్ట్రంలోను, ఉమ్మడి రాష్ట్రంలోను బీసీలకు న్యాయం చేసిన ఏకైక సీఎం వైఎస్ జగన్ అని మహిళా శిశుసంక్షేమ శాఖ మంత్రి కె.వి.ఉషశ్రీచరణ్ చెప్పారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మంగళవారం ఆమె మీడియాతో మాట్లాడారు. ‘శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యుల్లో 68.18 శాతం మంది బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలే. అదే టీడీపీ హయాంలో శాసనమండలిలో టీడీపీ సభ్యుల్లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీలు 37.5 శాతమే. ఇచ్చిన హామీలు అమలు చేయాలని అడిగిన బీసీలను తోకలు కత్తిరిస్తానని అవహేళన చేసిన చంద్రబాబు.. గెలిచే అవకాశం ఉన్నప్పుడు ఎస్సీ వర్గానికి చెందిన వర్ల రామయ్యకు రాజ్యసభకు అవకాశం కల్పించకుండా.. ఓడిపోతారని తెలిసినప్పుడు ఆయనకు అవకాశం ఇవ్వడం ద్వారా ఆయా వర్గాల పట్ల తనకు ఏమాత్రం చిత్తశుద్ధి ఉందో బయటపెట్టుకున్నారు. సామాజిక సాధికారత కోసం నిబద్ధతతో వైఎస్ జగన్ పని చేస్తున్నారు. రాష్ట్ర చరిత్రలో కురుబ సామాజికవర్గానికి చెందిన నాకు మంత్రి పదవి ఇవ్వడమే అందుకు నిదర్శనం. మా సామాజికవర్గంలో నేనే మొదటి మహిళా మంత్రిని. జగన్‌ను మళ్లీ సీఎం చేయడమే లక్ష్యంగా బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ ప్రజలు సిద్ధంగా ఉన్నారు.’ అని ఆమె అన్నారు. -
పవన్ కళ్యాణ్ చంద్రబాబు చేతిలో కీలుబొమ్మ: ఉషా శ్రీ
-
డ్వాక్రా మహిళలను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే : మంత్రి ఉషశ్రీ చరణ్
-
దేశంలోనే ఏపీ నంబర్ వన్‌గా నిలవాలి: సీఎం జగన్
సాక్షి, అమరావతి: స్కూళ్లు, అంగన్వాడీలకు సరఫరా చేసే ఆహారంలో మంచి నాణ్యత, పరిమాణం, పర్యవేక్షణపై రాష్ట్ర ప్రభుత్వం దృష్టి సారించింది. ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షించడంతోపాటు నాణ్యతపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో తనిఖీలు చేపట్టాలని నిర్ణయించింది. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారణకు మరిన్ని చర్యలు చేపట్టినట్లు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అంగన్వాడీల ద్వారా అందించే నాణ్యమైన ఆహారాన్ని పర్యవేక్షించేందుకు ప్రత్యేక యాప్ రూపకల్పన చేసినట్లు చెప్పారు. డిసెంబర్ 1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను మార్క్‌ఫెడ్ చేపట్టనుందని, దీన్ని ప్రత్యేక యాప్ ద్వారా పర్యవేక్షణ చేయనున్నట్లు తెలిపారు. నవంబరు నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షిస్తామన్నారు. రక్తహీనత, పౌష్టికాహార లోపం నివారణలో ఏపీ దేశంలోనే నంబర్‌వన్‌గా నిలిచేలా కృషి చేయాలని అధికార యంత్రాంగానికి సూచించారు. తద్వారా సుస్ధిర ప్రగతి లక్ష్యాలను సాధించాలని దిశా నిర్దేశం చేశారు. దీనికి సంబంధించి గతంలో రూ.500 కోట్ల బడ్జెట్ మాత్రమే ఉండగా ఇప్పుడు రూ.1,900 కోట్లు ఇస్తున్నట్లు వెల్లడించారు. మనం చేస్తున్న కృషిని ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తేనే సుస్ధిర ప్రగతి లక్ష్యాల సాధనలో నంబర్ వన్‌గా ఉంటామని, లేదంటే ఫలితం ఉండదని స్పష్టం చేశారు. మహిళా, శిశు సంక్షేమంపై ముఖ్యమంత్రి జగన్ బుధవారం తన క్యాంపు కార్యాలయంలో ఉన్నతస్థాయి సమీక్ష నిర్వహించారు. ఆ వివరాలివీ.. క్వాలిటీ, క్వాంటిటీ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారం నాణ్యతతోపాటు కచ్చితమైన పరిమాణంలో ఉండాలని ముఖ్యమంత్రి జగన్ స్పష్టం చేశారు. పాలు, గుడ్లలో క్వాలిటీ, క్వాంటింటీ ఉండి తీరాలని, వీటిపై పర్యవేక్షణ తప్పనిసరన్నారు. రోజూ నిర్దేశిత మేరకు ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతరం పర్యవేక్షణ చేయాలన్నారు. నిర్ణయించిన ప్రమాణాల ప్రకారం క్వాలిటీ, క్వాంటిటీతో కూడిన ఆహారం పిల్లలకు అందేలా పూర్తి స్థాయిలో నూరు శాతం పర్యవేక్షణ మొదలు పెట్టాలని స్పష్టం చేశారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించగా దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే యత్నం చేశారని తెలిపారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీ పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. నాడు – నేడుతో సదుపాయాలు అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టి పెట్టాలని సీఎం సూచించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లోనూ సదుపాయాలు కల్పించేలా కార్యాచరణ సిద్ధం చేయాలన్నారు. పిల్లలు ఆడుకునే ఆట వస్తువులు లాంటివి పాడైపోతే వెంటనే రీప్లేస్ చేయాలని సూచించారు. నిర్వహణను పట్టించుకోకపోతే మళ్లీ అలాగే ఉంటాయని, అంగన్వాడీలను సిబ్బంది తమవిగా భావించాలన్నారు. వెంటనే ఫలితాలు కనిపించాలని స్పష్టం చేశారు. నాడు – నేడుతో అంగన్వాడీలను సమగ్రాభివృద్ధి చేసేలా పాఠశాల విద్యాశాఖతో కలసి సమగ్ర ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏమిటి? ఎలాంటి సదుపాయాలు కల్పించాలి? ఎలా తీర్చిదిద్దాలి? తదితర అంశాలతో ప్రణాళిక రూపొందించి విడతలవారీగా పనులు చేపట్టి ముందుకు వెళ్లాలని నిర్దేశించారు. అంగన్వాడీలకు ఫ్రిడ్జ్‌లు పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా, పాలు, గుడ్లు లాంటివి నిల్వ చేసే విధానాలపై కూడా దృష్టిపెట్టాలని సీఎం సూచించారు. అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్‌లు ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలన్నారు. తొలిదశలోనే అరికట్టేలా.. అంగన్వాడీ చిన్నారుల ఆరోగ్య పరిస్థితులపై విలేజ్ క్లినిక్స్, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు సమగ్రంగా పర్యవేక్షించాలని సీఎం జగన్ సూచించారు. సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామి కావాలని స్పష్టం చేశారు. శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సాయం, పౌష్టికాహారం అందించడం ద్వారా రుగ్మతలను తొలిదశలోనే నివారించే అవకాశం ఉంటుందన్నారు. అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణను జియో ట్యాగింగ్ చేయాలని ఆదేశించారు. నాడు రూ.500 కోట్లు.. నేడు రూ.1,900 కోట్లు గతంలో పిల్లల భోజనానికి ఏడాదికి సుమారు రూ.500 కోట్లు మాత్రమే ఇవ్వగా ఇప్పుడు ఏటా సుమారు రూ.1,900 కోట్లు ఖర్చు చేస్తున్నామని ముఖ్యమంత్రి జగన్ తెలిపారు. తల్లులు, చిన్నారుల బాగోగుల కోసం ఎంతో కృషి చేస్తున్నామని, ఈ కేటగిరీ ఎస్‌డీజీల్లో దేశంలోనే రాష్ట్రం నంబర్ వన్‌గా నిలవాలని స్పష్టం చేశారు. ఇంత చేసినా ఆ వివరాలను (డేటా) అప్డేట్ చేయకపోతే మన కృషి ఎస్డీజీలో ప్రతిబింబించదని, ఆ పరిస్థితి తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళ, శిశు సంక్షేమానికి అత్యంత ప్రాధాన్యమిస్తూ చాలా పెద్ద ఎత్తున కృషి చేస్తున్నామని తెలిపారు చిన్ననాటి నుంచే చదువుల్లో రాణించేలా.. ఇంగ్లీషు మీడియాన్ని చిన్ననాటి నుంచే అలవాటు చేసేందుకు ఫౌండేషన్ స్కూళ్లు, శాటిలైట్ పౌండేషన్ స్కూళ్లు తెచ్చామని సీఎం జగన్ చెప్పారు. రూ.వేల కోట్లు ఖర్చు చేసి విప్లవాత్మక మార్పులు తెచ్చినా సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదన్నారు. దీన్ని దృష్టిలో పెట్టుకుని వంద శాతం పర్యవేక్షణ ఉండేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. క్షేత్రస్థాయి నుంచి అందే సమాచారంపై అధికారులు సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలని, లేదంటే అరణ్య రోదనే అవుతుందని స్పష్టం చేశారు. 57 వేల సెల్ఫోన్ల పంపిణీకి శ్రీకారం అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు దాదాపు 57 వేల సెల్ఫోన్ల పంపిణీ కార్యక్రమాన్ని సమీక్ష సందర్భంగా సీఎం జగన్ ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, ఆరేళ్ల లోపు పిల్లలకు పౌష్టికాహారం సరఫరా, ఇతర సేవలను సమర్ధంగా అమలు చేయడంతో పాటు సమగ్ర పర్యవేక్షణ కోసం అంగన్వాడీ కేంద్రాలు, వర్కింగ్ సూపర్వైజర్లకు ప్రభుత్వం వీటిని అందచేస్తోంది. సమీక్షలో మహిళా, శిశు సంక్షేమశాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్, ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కేవీవీ సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఏ. బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ పీఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఏ.సిరి తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీల నిర్వహణ బాగుండాలి: సీఎం జగన్
-
అంగన్వాడీలపై సమీక్ష.. అధికారులకు సీఎం జగన్ కీలక ఆదేశాలు
సాక్షి, తాడేపల్లి: మహిళా, శిశు సంక్షేమశాఖపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమీక్ష నిర్వహించారు. తాడేపల్లిలోని సీఎం క్యాంపు కార్యాలయంలో బుధవారం జరిగిన ఈ సమావేశంలో అంగన్వాడీలపై ముఖ్యమంత్రి సమీక్షించారు. బాలింతలు, గర్భవతుల్లో రక్తహీనత, చిన్నారుల్లో పౌష్టికాహార లోపం నివారించడానికి రాష్ట్ర ప్రభుత్వం మరిన్ని చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా నిర్దేశించుకున్న ప్రమాణాలతో అంగన్వాడీల ద్వారా గర్భిణీలు, బాలింతలు, పిల్లలకు నాణ్యమైన ఆహారాన్ని అందించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని సీఎం జగన్ అధికారులను ఆదేశించారు. దీన్ని పర్యవేక్షించడానికి ప్రత్యేక యాప్‌లు రూపకల్పన చేయాలని, తద్వారా సుస్థిర ప్రగతి లక్ష్యాలను సాధించవచ్చని అధికారులకు దిశానిర్ధేశం చేశారు. ఈ సందర్భంగా సీఎం జగన్ మాట్లాడుతూ.. అంగన్వాడీల్లో పిల్లలకు ఇచ్చే ఆహారంలో క్వాలిటీ, కచ్చితమైన క్వాంటిటీ ఉండాలన్నారు. ప్రతిరోజూ నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం ఆహారం అందుతుందా? లేదా? అన్నదానిపై నిరంతర పర్యవేక్షణ చేయాలని తెలిపారు. దీనికోసమే దశాబ్దకాలంగా పెండింగ్‌లో ఉన్న సూపర్వైజర్ల నియామకాలను ప్రారంభించామని, దురదృష్టవశాత్తూ కోర్టుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేశారని ప్రస్తావించారు. వీలైనంత త్వరగా ఈ పోస్టుల భర్తీని పూర్తిచేయాలని ఆదేశించారు. అక్టోబరులో నిర్దేశించుకున్న ప్రమాణాల ప్రకారం నూటికి నూరుపాళ్లు క్వాలిటీ, క్వాంటిటీ ఆహారం పిల్లలకు అందాలని పేర్కొన్నారు. చదవండి: నిరుద్యోగులకు శుభవార్త.. జాబ్ నోటిఫికేషన్ విడుదల అంగన్వాడీల్లో టాయిలెట్ల పరిశుభ్రతపై దృష్టిపెట్టాలని ముఖ్యమంత్రి వైఎస్ జగన్ అధికారులను ఆదేశించారు. సొంత భవనాల్లోనే కాకుండా అద్దె భవనాల్లో నడుస్తున్న అంగన్వాడీల్లో కూడా కనీస మౌలిక సదుపాయాలు ఏర్పాటు చేసుకోవాలని సూచించారు. ఈమేరకు కార్యాచరణ సిద్ధంచేసుకోవాలన్న సీఎం..అంగన్వాడీల్లో నాడు – నేడు ద్వారా సమగ్రాభివృద్ధి చేయాలని పేర్కొన్నారు. పాఠశాల విద్యాశాఖతో కలిసి ఈమేరకు కార్యాచరణ చేసుకోవాలన్నారు. సీఎం జగన్ ఇంకా ఏమన్నారంటే.. ►అంగన్వాడీల రూపురేఖలను సంపూర్ణంగా మార్చాలి ►అంగన్వాడీల్లో ప్రస్తుత పరిస్థితులు ఏంటి? ఎలాంటి సదుపాయాలు కల్పించుకోవాలి? ఏ రకంగా వాటిని తీర్చిదిద్దాలి? తదితర అంశాలను పరిగణలోకి తీసుకుని ప్రణాళిక తయారు చేసుకోవాలి. ►విడతల వారీగా ఆ పనులు చేసుకుంటూ ముందుకు వెళ్లాలి. ►పిల్లలకు ఇచ్చే ఆహారం పాడవకుండా చూసేందుకు ఎలాంటి విధానాలు అనుసరించాలన్నదానిపై కూడా దృష్టిపెట్టాలి. ►పిల్లలు రోజూ తీసుకునే పాలు, గుడ్లులాంటివి పాడవకుండా నిల్వచేసే విధానాలపైనా కూడా దృష్టిపెట్టాలి. ►అంగన్వాడీల్లో ప్రతిచోటా ఫ్రిడ్జ్ ఏర్పాటు దిశగా ఆలోచన చేయాలి. ►స్కూళ్లకు, అంగన్వాడీలకు సరఫరాచేసే ఆహారంపై నాణ్యత, పర్యవేక్షణకు మరిన్ని చర్యలు. ►డిసెంబర్1 నుంచి పౌష్టికాహార పంపిణీ బాధ్యతలను చేపట్టనున్న మార్క్‌ఫెడ్.ప్రత్యేక యాప్ ద్వారా దీని పర్యవేక్షణ. ►నవంబరు నుంచి నుంచి గుడ్ల పంపిణీపై కూడా యాప్ ద్వారా పర్యవేక్షణ. ►ఈ ఆహార నాణ్యత బాగుందా? లేదా? అన్నదానిపై కేంద్ర ప్రభుత్వ సంస్థతో థర్డ్ పార్టీ పర్యవేక్షణ. ►ఈలోగా పంపిణీ అవుతున్న ఆహారం క్వాలిటీపైనా ప్రత్యేక దృష్టిపెట్టాలని సీఎం ఆదేశం. ►క్వాలిటీ, క్వాంటిటీపై యాప్‌ల ద్వారా సమగ్ర పర్యవేక్షణ ఉండాలి. ►అంగన్వాడీల పిల్లల ఆరోగ్య పరిస్థితులపై విలేజి క్లినిక్స్ ద్వారా, ఆశా వర్కర్ల ద్వారా వైద్యాధికారులు పర్యవేక్షణ చేయాలి: ►సచివాలయంలోని వెల్ఫేర్ అసిస్టెంట్ కూడా ఇందులో భాగస్వామ్యం కావాలి: ►శారీరకంగా బలహీనంగా ఉన్న పిల్లలకు వైద్య సహాయమే కాకుండా, ఆ పిల్లలకు పౌష్టికాహారం మరింత పెంచేలా తగిన ఆలోచనలు చేయాలి. ►దీనివల్ల రక్తహీనత, శారీరక బలహీనతలను మొదటి దశలోనే నివారించే అవకాశం ఉంటుంది. ►అంగన్వాడీలపై సూపర్వైజర్ల పర్యవేక్షణ జియోట్యాగింగ్ చేయాలలి. ►అంగన్వాడీలకు, సూపర్వైజర్లకు మొత్తంగా దాదాపు 57వేలమందికి సెల్ఫోన్ల్ పంపిణీ కార్యక్రమాన్నిసీఎం ప్రారంభించారు. గర్భిణీలు, బాలింతలు, 6 సంవత్సరాల లోపు పిల్లలకు అందించే పౌష్టిహారం, ఇతర సేవలను మరింత సమర్ధవంతంగా అమలు చేయడంతో పాటు, సమగ్రపర్యవేక్షణ కోసం అంగన్వాడీ సెంటర్లకు, వర్కింగ్ సూపర్ వైజర్లకు ఈ సెల్‌ఫోన్స్ ప్రభుత్వం అందిస్తుంది. సుస్థిర ప్రగతి లక్ష్యాల్లో దేశంలోనే నంబర్‌వన్‌గా నిలవాలి. ►గతంలో పిల్లల భోజనానికి నెలకు సుమారురూ.500 కోట్లు ఉండేది, ఈరోజు నెలకు సుమారుగా రూ.1900 కోట్లు ఖర్చుచేస్తున్నాం. ►విద్య, వైద్యం, వ్యవసాయం, మహిళా శిశు సంక్షేమాలకోసం చాలా పెద్ద ఎఫర్ట్ పెడుతున్నాం. ►ఇంగ్లిషు మీడియంను చిన్ననాటినుంచే అలవాటు చేయడానికి ఫౌండేషన్ స్కూల్స్, శాటిలైట్ పౌండేషన్ స్కూల్స్ తీసుకువచ్చాం. ►నాడు – నేడు ద్వారా పూర్తిగా రూపురేఖలు మారుస్తున్నాం. ►ఇన్నివేల కోట్లు ఖర్చుచేసి అనేక విప్లవాత్మక మార్పులు తీసుకువస్తున్నాం. ►ఇన్ని కార్యక్రమాలు చేసినా..సరైన పర్యవేక్షణ లేకపోతే ప్రయోజనం ఉండదు. ►అందుకే కచ్చితమైన పర్యవేక్షణ అవసరం. ►అధికారులు కూడా సరైన సమయంలో స్పందించి తగిన చర్యలు తీసుకోవాలి. ►దేశంలో నంబర్‌వన్ కావడానికి మనం ప్రయత్నాలు చేస్తున్నాం ఈ సమీక్షా సమావేశంలో మహిళాశిశు సంక్షేమశాఖ మంత్రి కె వి ఉషశ్రీచరణ్, మహిళా శిశు సంక్షేమశాఖ ముఖ్య కార్యదర్శి ముద్దాడ రవిచంద్ర, ఆర్ధికశాఖ కార్యదర్శి కె వి వి సత్యనారాయణ, ఏపీడీడీసీఎఫ్ ఎండీ ఎ బాబు, మార్క్‌ఫెడ్ ఎండీ పి ఎస్ ప్రద్యుమ్న, మహిళా శిశు సంక్షేమశాఖ డైరెక్టర్ డాక్టర్ ఎ సిరి, ఇతర ఉన్నతాధికారులు హాజరయ్యారు. -
ఈ లిక్కర్ బ్రాండ్లు టీడీపీవి కావా..!
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ఉన్న మద్యం బ్రాండ్లన్నీ బాబు, భువనేశ్వరి, బ్రహ్మణి (బీ–3) బ్రాండ్లేనని మహిళా, శిశుసంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీ చరణ్, ఎమ్మెల్సీలు వరుదు కళ్యాణి, పోతుల సునీత, ఎస్సీ (మాల) కార్పొరేషన్ చైర్ పర్సన్ పి.అమ్మాజీ స్పష్టం చేశారు. టీడీపీ అధికారంలో ఉండగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి, కోడలు బ్రహ్మణి ఆధ్వర్యంలోనే లిక్కర్ డీల్స్ జరిగాయని పేర్కొన్నారు. హెరిటేజ్ పేరుతో వారు పాల వ్యాపారం చేస్తున్నట్లు కనిపించినా తెర వెనక జరిగింది లిక్కర్ బేరమేనని వెల్లడించారు. మద్యం తయారీకి అనుమతులు ఇప్పించటాన్ని చంద్రబాబు, భువనేశ్వరి దశాబ్దాలుగా కుటీర పరిశ్రమగా మార్చుకున్నారని చెప్పారు. మద్యం సేవించటంలో స్వయంగా అత్తా కోడళ్లు పోటీ పడతారని.. ఇలా తాగి ఇటీవల కొట్టుకున్నట్లు కూడా వార్తలు వచ్చాయని చెప్పారు. టోటల్‌గా బాబు కుటుంబమే తాగుబోతు ఫ్యామిలీ అని వ్యాఖ్యానించారు. ఒకవంక మగువ, మరోవంక మద్యం.. ఇదే పప్పు బ్రాండ్ అని లోకేష్‌పై ధ్వజమెత్తారు. ఇంట్లో అన్నింటికీ లైసెన్స్.. అది తమకు సాధారణమే అన్నట్లుగా నారా కుటుంబం వ్యవహార శైలి ఉందన్నారు. చుక్క లేకపోతే తండ్రీ కొడుకులు ఒక్క ముక్క కూడా మాట్లాడలేరని చెప్పారు. ఆదివారం అనంతపురం, విశాఖపట్నం, తాడేపల్లిలో వారు వేర్వురుగా మీడియాతో మాట్లాడారు. ఆ వివరాలివీ.. ► చంద్రబాబు హయాంలోనే బూమ్ బూమ్ బీర్, ప్రెసిడెంట్స్ మెడల్, గవర్నర్స్ ఛాయిస్, పవర్ స్టార్ 999, రష్యన్ రోమనోవా, ఏసీబీ, 999 లెజండ్, హెవెన్స్ డోర్, క్రేజీ డాల్, క్లిఫ్ హేంగర్ లాంటి 254 బ్రాండ్లకు అనుమతులిచ్చారు. ఇలాంటి బ్రాండ్ల పేరుతో దత్త పుత్రుడి రుణం, వియ్యంకుడి రుణం తీర్చుకున్నారు. ► మద్యం కంపెనీలన్నీ టీడీపీ నేతలవే. ఎస్పీవై బ్రాండ్ ఎవరిది? ఎస్పీవై రెడ్డి ఏ పార్టీలో ఉన్నారు? ఆయన టీడీపీ నాయకుడు కాదా? ► విశాఖ డిస్టిలరీకి 2019 ఫిబ్రవరి 25న అనుమతి ఇచ్చారు. అది టీడీపీ నేతఅయ్యన్నపాత్రుడికి చెందిన కంపెనీ. దాన్ని గత ఏడాది అమ్మేశానని ఆయన చెబుతున్నారు. అంటే ఏడాది క్రితం వరకు అది అయ్యన్నదే కదా? ఎన్నికల ముందు ఆ కంపెనీకి చంద్రబాబు అనుమతి ఇచ్చారా? లేదా? ► పీఎంకే డిస్టిలరీ యనమల రామకృష్ణుడి వియ్యంకుడిది కాదా? శ్రీకృష్ణా డిస్టిలరీ ఆదికేశవులునాయుడిది కాదా? లైసెన్సులు ఇచ్చింది చంద్రబాబు.. బ్రాండ్లకు అనుమతి ఇచ్చినది ఆయన హయాంలోనే. లిక్కర్ విక్రయాలను ఆకాశానికి పెంచింది చంద్రబాబే. ఈ అనుమతులన్నీ బీ–3 వల్లే వచ్చాయి. టీడీపీ నేతలు ఈ అనుమతుల కోసం లంచాలు ఎవరికి ఇస్తారు? మద్యం వినియోగం తగ్గింది.. ► లిక్కర్ సేల్స్ పెంచితే కమీషన్లు వస్తాయి గానీ తగ్గిస్తే ఎవరైనా ఇస్తారా? బెల్ట్ షాపుల్ని రద్దు చేసి, బార్ లైసెన్సుల్ని 33 శాతం తగ్గించి, పర్మిట్ రూముల్ని మూసి వేయించి, ప్రభుత్వ దుకాణాల ద్వారా ఇప్పుడు పరిమితంగా లిక్కర్ అమ్ముతున్నారు. ఇలా విక్రయాలు గణనీయంగా తగ్గిపోయిన పరిస్థితుల్లో ఎవరైనా కమీషన్లు ఇస్తారా? ► రాష్ట్రంలో మద్యం వినియోగం ఎంతగా తగ్గిందో అందరికీ తెలుసు. 2018–19లో లిక్కర్ అమ్మకాలు 384.31 లక్షల కేసులు ఉంటే 2021–22లో ఏకంగా 278.5 లక్షల కేసులకు తగ్గాయి. ఇదే సమయంలో బీరు అమ్మకాలు 277.10 లక్షల కేసుల నుంచి గణనీయంగా 82.6 లక్షల కేసులకు తగ్గిపోయాయి. ► 2018–19లో మద్యం విక్రయాల ఆదాయం రూ.20,128 కోట్లు కాగా 2021–22లో ఆదాయం రూ. 25,023 కోట్లు ఉంది. ► 43 వేలకు పైగా బెల్టుషాపులను రద్దు చేశాం. పర్మిట్ రూమ్‌లన్నీ రద్దు చేశాం. 4,380 నుంచి 2,934కి వైన్ షాప్‌లను తగ్గించాం. ► ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లో షాపులుంటే విచ్చలవిడిగా మద్యం విక్రయించి బెల్టుషాపులు కూడా ఏర్పాటు చేస్తారు కాబట్టి ప్రభుత్వమే పరిమితంగా నిర్ణీత వేళల్లో విక్రయాలు చేపట్టింది. ► నాటు సారా తయారీ, అమ్మకాలపై గట్టి నిఘా వ్యవస్థ ఏర్పాటు చేశాం. ఎస్ఈబీ ద్వారా ఎక్కడిక్కడ దాడులు చేస్తూ కఠినంగా వ్యవహరిస్తున్నాం. డిస్టిలరీల ఓనర్లు పచ్చబాబులే ► భవిష్యత్తులో ఏర్పడే మద్యం డిమాండ్‌కు అనుగుణంగా అంటూ చంద్రబాబు హయాంలో విచ్చలవిడిగా లైసెన్స్‌లు ఇచ్చారు. అదీ దిగిపోయే ముందు! లిక్కర్ తయారీదార్లు, డిస్టిలరీ ఓనర్లు పచ్చబాబులే. ► 2019 తర్వాత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం వచ్చాక ఒక్క డిస్టిలరీకి కానీ, ఒక్క బ్రూవరీకి కానీ అనుమతి ఇచ్చిందే లేదు. ► రాష్ట్రంలో 20 డిస్టిలరీలు ఉండగా వాటికి అనుమతులు ఎప్పుడు వచ్చాయో గమనిస్తే ఆశ్చర్యం కలిగించే విషయాలు తెలుస్తాయి. 1982కి ముందు ఉన్నవి కేవలం ఐదు డిస్టిలరీలే. ఆ తర్వాతే మిగిలినవన్నీ వచ్చాయి. యాజమాన్యం మారిన రెండు కంపెనీలతో కలిపి చంద్రబాబు హయాంలో అనుమతి ఇచ్చినవి మొత్తం 14. చంద్రబాబు 2014 నుంచి 2019 మధ్యలో ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏకంగా 7 డిస్టిలరీలకు కు అనుమతి ఇచ్చారు. ఐదేళ్లలో 254 బ్రాండ్లు, ఏడు డిస్టిల్లరీలకు అనుమతి ఇచ్చి లిక్కర్ విక్రయాలను ప్రోత్సహించారు. ► సొంత మామ ఎన్టీఆర్‌కు వెన్నుపోటు పొడిచిన చంద్రబాబు ఎన్నికలు రాగానే మళ్లీ దండలు వేస్తుంటారు. అలాగే గతంలో తాను అనుమతి ఇచ్చిన బ్రాండ్లు, డిస్టీలరీలపై మళ్లీ ఆయనే ఇవెక్కడివంటూ విమర్శలు చేస్తుంటారు. ఆ దోపిడీ.. బీ–3 కుంభకోణాలే ► ఇసుక అమ్మకాల్లో ఇప్పుడు రూ.4,000 కోట్లు వస్తుంటే... గత ప్రభుత్వంలో ఈ డబ్బంతా ఏమయిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణం. ► మైనింగ్ దోపిడీ ఎలా జరిగిందన్న ప్రశ్నకు సమాధానం బీ–3 కుంభకోణాలు. ► దోచుకో, పంచుకో, తినుకో (డీపీటీ) అన్నదే టీడీపీ విధానం. దుష్ట చతుష్టయంలోని ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ–5, దత్త పుత్రుడికి ఎప్పటికప్పుడు వాటాలు. ► టీడీపీ అంటేనే డీపీటీ. లంచాలకు ప్రతిఫలంగానే అనుకూల పత్రికలు, టీవీల్లో ఎల్లో ప్రచారాలు. ఈ కుంభకోణంపై న్యాయ విచారణ చేయాలి. -
ఆ కుటుంబానికి ప్రభుత్వ అండ
కళ్యాణదుర్గం: విజయవాడ ప్రభుత్వాస్పత్రిలో అత్యాచారానికి గురైన బాధితురాలి కుటుంబానికి ప్రభుత్వం అండగా ఉంటుందని రాష్ట్ర స్త్రీ, శిశు సంక్షేమ శాఖ మంత్రి కేవీ ఉషశ్రీచరణ్ చెప్పారు. అనంతపురం జిల్లా కళ్యాణదుర్గంలోని తన క్యాంపు కార్యాలయంలో శనివారం ఆమె మాట్లాడారు. ఘటన జరిగిన వెంటనే సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించి.. మంత్రులను బాధితురా లి వద్దకు పంపి ఆమెకు భరోసానిచ్చినట్టు చెప్పా రు. అలాగే రూ.10 లక్షలు ఎక్స్‌గ్రేషియా అందించారని తెలిపారు. బాధిత కుటుంబానికి ఇంటి స్థలంతో పాటు ఇంటి నిర్మాణానికి సహకారం అందించడంతో పాటు, కుటుంబానికి ఆసరా కల్పిస్తామని భరోసా ఇచ్చినట్టు వివరించారు. అత్యాచారానికి ఒడిగట్టిన నిందితులు ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదని మంత్రి స్పష్టం చేశారు. బాధి తురాలిని పరామర్శించేందుకు వెళ్లిన మహిళా కమిషన్ చైర్పర్సన్ వాసిరెడ్డి పద్మపై చంద్రబాబు, ఆయన అనుచరులు దాడి చేయడం దారుణమని, రాజకీయం చేస్తున్నారని మంత్రి దుయ్యబట్టారు. -
సెకన్ల వ్యవధిలో బారికేడ్లు దాటారు.. ఆ ఆరోపణలు అవాస్తవం: ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప
అనంతపురం క్రైం: ‘శెట్టూరు మండలం చెర్లోపల్లికి చెందిన గణేష్ ద్విచక్ర వాహనం సెకన్ల వ్యవధిలోనే పోలీస్ బారికేడ్లను దాటి వెళ్లింది. పోలీసులు దారి ఇవ్వకపోవడంతో చిన్నారికి సకాలంలో వైద్యం అందక మృతి చెందిందని కొందరు పనిగట్టుకుని ప్రచారం చేస్తున్నారు. ఇలా చేయడం పద్ధతి కాదు’ అని అనంతపురం జిల్లా ఎస్పీ డాక్టర్ ఫక్కీరప్ప అన్నారు. ఈ నెల 15న మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం పోలీసులు కల్యాణదుర్గంలోని బ్రహ్మయ్య గుడి సమీపంలో వాహన రాకపోకలు ఆపడం వల్ల 8 నెలల చిన్నారి మృతి చెందిందన్న అంశంపై ఎస్పీ ఫక్కీరప్ప స్పందించారు. శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో గణేష్, ఈరక్క దంపతులు బైక్‌పై వారి 8 నెలల చిన్నారిని ఇంటినుంచి ఆస్పత్రికి తీసుకువచ్చిన దృశ్యాలను సీసీ కెమెరాల ఫుటేజిని మీడియాకు చూపించారు. వివిధ సెల్ టవర్ లొకేషన్లను దాటిన తీరును కూడా వివరించారు. ఈ ఘటనపై లోతుగా విచారణ చేపట్టి శాస్త్రీయ ఆధారాలను సేకరించామన్నారు. మంత్రి ఉషశ్రీ చరణ్ కాన్వాయ్ కోసం చిన్నారి తండ్రి బైక్‌ను పోలీసులు ఆపలేదన్నారు. ‘ఈ నెల 15న సాయంత్రం 6 గంటలకు గణేష్, ఈరక్క దంపతుల చిన్నారికి ఫిట్స్ వచ్చాయి. 6.10 గంటలకు బైక్‌పై చెర్లోపల్లి నుంచి కల్యాణదుర్గం ఆర్డీటీ ఆస్పత్రికి బయలుదేరారు. మంత్రి ఇంటి సమీపంలోని బ్రహ్మయ్య గుడి పోలీస్ చెక్‌పోస్ట్ వద్ద 6.36 గంటలకు కన్పించారు. అక్కడి నుంచి సెకన్ల వ్యవధిలోనే ముందుకు సాగారు. సాయంత్రం 6.40 గంటలకు కల్యాణదుర్గం పట్టణంలోకి ప్రవేశించి, 6.48 గంటలకు ఆర్డీటీ ఆస్పత్రికి చేరారు. 6.50 గంటలకు ఓపీ తీసుకున్నట్లు ఆస్పత్రి రికార్డుల్లో నమోదైంది. 7.18 గంటలకు చిన్నారి మృతిని వైద్యులు ధ్రువీకరించారు. చెర్లోపల్లి నుంచి ఆర్డీటీ ఆస్పత్రికి 20 కిలోమీటర్ల దూరం ఉంది. బైక్‌పై 38 నిమిషాల వ్యవధిలోనే ఆస్పత్రికి చేరుకున్నారు. చిన్నారి మృతి చెందిన తర్వాత కూడా అంబులెన్స్ ఏర్పాటు చేస్తామని గణేష్ కుటుంబీకులను పోలీసులు కోరారు. కానీ వారు నిరాకరించారు. రాత్రి 8.15 గంటల సమయంలో చిన్నారి మృతదేహంతో రోడ్డుపై ఆందోళనకు దిగారు’ అని ఎస్పీ వివరించారు. రాద్ధాంతం చేయొద్దు చిన్నారి మృతి చెందడం చాలా బాధగా ఉందని, కానీ కొందరు వాస్తవాలను వక్రీకరించి లేనిపోని రాద్ధాంతం చేయడం సరికాదని ఎస్పీ ఫక్కీరప్ప అన్నారు. చిన్నారి తల్లిదండ్రులు అమాయకులని, వారిపై ఎటువంటి కేసులు నమోదు చేయబోమని స్పష్టం చేశారు. ఎవరైనా పోలీసులపై బురద జల్లడమే కాకుండా శాంతిభద్రతల సమస్యకు కారణమైతే చట్టపరమైన చర్యలు తప్పవని హెచ్చరించారు. -
Ushashri Charan: కంచుకోటను బద్దలు కొట్టి.. మంత్రి వర్గంలో..
బీసీల పట్ల సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి మరోసారి అభిమానం చాటుకున్నారు. ప్రస్తుత మంత్రివర్గంలో సముచిత స్థానం కల్పించారు. కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు కేబినెట్లో చోటు కల్పించి బీసీల అభ్యున్నతి, స్త్రీ సంక్షేమం పట్ల చిత్తశుద్ధిని నిరూపించుకున్నారు. బీసీ వర్గానికి చెందిన మహిళ ఉమ్మడి జిల్లా నుంచి మంత్రిగా ప్రాతినిథ్యం వహించడం ఇదే తొలిసారి. దీన్ని బట్టి బీసీ వర్గాలకు ముఖ్యమంత్రి ఎంతటి ప్రాధాన్యతనిచ్చారో తెలుస్తోందని రాజకీయ విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. సాక్షి , అనంతపురం: బీసీ కురుబ సామాజిక వర్గానికి చెందిన ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ ఉన్నత విద్యావంతురాలిగా పేరుగడించారు. లైఫ్ సైన్సెస్‌లో బీఎస్సీ, ఎన్విరాన్మెంటల్ విభాగంలో ఎమ్మెస్సీ చదివిన ఆమె 2012లో సామాజిక సేవా కార్యక్రమాల ద్వారా రాజకీయాల్లోకి అడుగు పెట్టారు. 2014లో వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీ చేరారు. తర్వాత కళ్యాణదుర్గం వైఎస్సార్సీపీ సమన్వయకర్తగా బాధ్యతలు చేపట్టారు. నియోజకవర్గంలోని ప్రతి గడపకూ మూడు సార్లు తిరిగి ప్రత్యక్షంగా ప్రజా సమస్యలను తెలుసుకున్నారు. ఐదేళ్లు పార్టీ అభివృద్ధితో పాటు ప్రజా సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఆమె కృషిని గుర్తించిన అధిష్టానం 2019 అసెంబ్లీ ఎన్నికల్లో కళ్యాణదుర్గం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థిగా బరిలో దించింది. ప్రచారంలో రెట్టించిన ఉత్సాహంతో కదిలిన ఆమె సమీప ప్రత్యర్థి టీడీపీకి చెందిన మాదినేని ఉమా మహేశ్వర నాయుడిని 19,896 ఓట్ల తేడాతో ఓడించారు. అసెంబ్లీలో గళం.. ఎమ్మెల్యేగా గెలిచాక తనదైన శైలిలో దూసుకెళ్తూ ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్ కళ్యాణదుర్గం ప్రజల్లో మంచి పేరు సంపాదించుకున్నారు. ఎమ్మెల్యే గెలుపొందిన వెంటనే ఎన్నికల ముందు ఇచ్చిన మాట ప్రకారం అన్ని గ్రామాల్లో తిరిగి ప్రజలకు దగ్గరయ్యారు. ఇక.. నియోజకవర్గ సమస్యలపై అసెంబ్లీలో పలు పర్యాయాలు గళమెత్తి పరిష్కారానికి కృషి చేశారు. తొలిసారి ఎమ్మెల్యే అయినా అసెంబ్లీలో తన మాటతీరుతో అందరి దృష్టినీ ఆకర్షించారు. కళ్యాణదుర్గానికి ఆయువుపట్టుగా ఉన్న బీటీ ప్రాజెక్టుకు జీడిపల్లి రిజర్వాయర్ నుంచి సాగునీరు తీసుకువచ్చేందుకు శక్తి వంచన లేకుండా కృషి చేస్తున్నారు. ఇవన్నీ గుర్తించిన అధిష్టానం ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి కట్టబెట్టింది. బీసీ మహిళకు సముచిత స్థానం కల్పించడంతో ఉమ్మడి జిల్లా ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. బిజీబిజీగా ఉన్నా.. ఉన్నత విద్యపై ఆసక్తి.. ప్రజాప్రతినిధిగా ప్రజల మధ్య తీరిక లేని సమయం గడుపుతున్నా.. ఉన్నత చదువు చదివేందుకు ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్ దరఖాస్తు చేసుకున్నారు. ఎగ్జిక్యూటివ్ కోటాలో పీహెచ్డీ చేరే అవకాశం ఉండడంతో 3 నెలల క్రితం దరఖాస్తు చేశారు. గత నెలలో ఎస్కేయూ పాలకమండలి ఆమె పీహెచ్డీ దరఖాస్తుకు ఆమోదం తెలిపింది. త్వరలో అడ్మిషన్ కల్పించనున్నారు. ఫిజిక్స్ విభాగం అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ రామ్‌గోపాల్ పర్యవేక్షణలో ఉషశ్రీచరణ్ పరిశోధన చేయనున్నారు. ఉమ్మడి జిల్లా నుంచి తొలి బీసీ మహిళ.. ఉమ్మడి అనంతపురం జిల్లా నుంచి గతంలో ముగ్గురు మహిళలు మంత్రులుగా ప్రాతినిథ్యం వహించారు. కానీ ఇప్పటివరకూ బీసీ వర్గానికి చెందిన మహిళలు ఎవరూ మంత్రులు కాలేదు. కానీ ఉషశ్రీ చరణ్‌కు ఆ అవకాశం దక్కింది. గతంలో లక్ష్మిదేవమ్మ, శమంతకమణి, పరిటాల సునీత ఈ జిల్లానుంచి మంత్రులుగా వ్యవహరించారు. వారి తర్వాత మంత్రిగా ప్రాతినిథ్యం వహిస్తున్న ఉషశ్రీ చరణ్ నాల్గవ మహిళ. సోమవారం ఉదయం ఆమె మంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఇక.. ఇప్పటివరకూ ఎవరికి మంత్రి పదవులు వరిస్తాయో అని ఎదురు చూసిన జిల్లా వాసులు.. ఇప్పుడు ఉషశ్రీచరణ్‌కు ఏ శాఖ దక్కుతుందోనని ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. చదవండి: (ఆంధ్రప్రదేశ్ నూతన మంత్రి వర్గ జాబితా.. పూర్తి వివరాలు..) వైఎస్సార్ సీపీ శ్రేణుల సంబరాలు.. ఎమ్మెల్యే ఉషశ్రీచరణ్‌కు మంత్రి పదవి దక్కడంతో అటు పార్టీ శ్రేణులు, ఇటు కళ్యాణదుర్గం ప్రాంత ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. తమ ఎమ్మెల్యే మంత్రి కానుండడంతో కళ్యాణదుర్గంలో సంబరాలు మిన్నంటాయి. టపాసులు పేల్చుతూ, స్వీట్లు పంచుకుంటూ నాయకులు, కార్యకర్తలు ఆనందం పంచుకున్నారు. పూర్వజన్మ సుకృతం రాజకీయాల్లోకి రావడం, ఎమ్మెల్యేగా గెలవడం, మంత్రి కావడం నిజంగా పూర్వ జన్మ సుకృతం. ఇది ముమ్మాటికీ నాకు జగనన్న ఇచ్చిన వరం. ఈ వరం వల్లే నేను ఇంతదాకా వచ్చా. గతంలో చంద్రబాబు బీసీలతో ఓట్లేయించుకుని వారిని ఓటుబ్యాంకుగానే చూశారు. ఏనాడూ బీసీ వర్గాలకు చెందిన మహిళను మంత్రిని చేయాలని చూడలేదు. నాకు ఏ శాఖ కేటాయించినా బాధ్యతగా, ప్రభుత్వానికి మంచిపేరు వచ్చేలా నిర్వహిస్తా. అందరినీ కలుపుకుని ఈ ప్రభుత్వానికి, జగనన్నకు కీర్తి తెస్తా. – ఉషశ్రీ చరణ్ ఉషశ్రీ చరణ్ బయోడేటా పూర్తి పేరు: కురబ విరుపాక్షప్ప గారి ఉషశ్రీ చరణ్ (కేవీ ఉషశ్రీచరణ్) పుట్టిన తేదీ: 16–07–1976 తల్లిదండ్రులు : కేవీ రత్నమ్మ, డాక్టర్ కురుబ విరుపాక్షప్ప పుట్టిన స్థలం: రాయదుర్గం భర్త పేరు: శ్రీ చరణ్ రెడ్డి పిల్లలు: కుమార్తె జయనా శ్రీచరణ్, కుమారుడు దివిజిత్ శ్రీచరణ్ విద్యార్హత : బీఎస్సీ (లైఫ్ సైన్సెస్), ఎంఎస్సీ (ఎన్విరాన్మెంటల్ సైన్స్). ఎస్కేయూలో అట్మాస్పియరిక్ సైన్స్ అండ్ గ్లోబల్ వార్మింగ్‌పై పీహెచ్డీ చేయనున్నారు. చదవండి: (నూతన మంత్రివర్గంలో చోటుదక్కించుకున్న అమరనాథ్ ఫ్రొఫైల్ ఇదే..) -
ప్రజలు వైఎస్ఆర్సీపీకి బ్రహ్మరథం పట్టారు:ఎమ్మెల్యే ఉషాశ్రీ చరణ్
-
ఆగంతకుడు ఫోన్: ఎమ్మెల్యే ఉషశ్రీ చాకచక్యం
అనంతపురం : అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం తమ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. పీఎమ్ఈజీపీ రుణాలు ఇప్పిస్తామని ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించే యత్నం చేశాడు. ఈ పథకం కింద మూడు కోట్ల రుణం కావాలంటే తొలుత రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని మోసం చేసే ప్రయత్నం చేశాడు. అయితే అప్పటికే ఎమ్మెల్యేకు అనుమానం రావడంతో చాకచక్యంగా వ్యవహరించి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఇదంతా మోసమని తేలటంతో ఎమ్మెల్యే ఉషశ్రీ కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి విచారణ చేపట్టారు. -
‘జగనన్న ఆశీర్వాదంతో విజయం సాధిస్తాను’
సాక్షి, అనంతపురం: రాజన్న రాజ్యం మళ్లీ రావాలంటే అది జగనన్నతోనే సాధ్యమని వైఎస్సార్ సీపీ కళ్యాణదుర్గం శాసనసభ అభ్యర్థి ఉషశ్రీచరణ్ పేర్కొన్నారు. గురువారం జిల్లాలోని కళ్యాణదుర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాల్గొన్న ఎన్నికల ప్రచార సభలో ఉషశ్రీ ప్రసంగించారు. ఆమె మాట్లాడుతూ.. ‘నాపై నమ్మకం పెట్టి ఎమ్మెల్యేగా నిలబెట్టినందుకు జగనన్నకు కృతజ్ఞతలు. జగనన్న ఆశీర్వాదంతో తప్పకుండా విజయం సాధిస్తాను. మాది చాలా వెనుకబడిన నియోజకవర్గం. ఇక్కడికి జగనన్న సాయంతో నీరు తీసుకువస్తాం. ప్రత్యేక హోదాతో తిమ్మసముద్రంలో పరిశ్రమలు నెలకొల్పి ఉపాధి కల్పిస్తాం. మున్సిపాలిటీని అభివృద్ధి చేసుకుంటాం. కళ్యాణదుర్గం దశ దిశ నిర్ణయించాలని జగన్నను కోరుతున్నాను. రైతులకు, మహిళలకు, విద్యార్థులకు, నిరుద్యోగులకు.. ఇలా ప్రతి ఒక్కరికి మేలు జరగాలంటే జగనన్న అధికారంలోకి రావాల’ని అన్నారు. -
ఇక్కడ టీడీపీ డమ్మీ..!
సాక్షి, కల్యాణదుర్గం : కల్యాణదుర్గం అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటయ్యాక ఇప్పటివరకూ 13 పర్యాయాలు అసెంబ్లీ ఎన్నికలు జరిగాయి. నాలుగు ఎన్నికల్లో కాంగ్రెస్ విజయం సాధించగా, టీడీపీ ఐదుసార్లు, స్వతంత్రులు రెండుసార్లు, సీపీఐ, జేఎన్పీ ఒక్కోసారి విజయం సాధించాయి. ఈ దఫా కల్యాణదుర్గం నియోజకవర్గ ఎన్నికపై రాష్ట్రవ్యాప్తంగా ఆసక్తి నెలకొంది. దీనికి కారణం పీసీపీ చీఫ్ రఘువీరారెడ్డి కాంగ్రెస్ పార్టీ తరఫున బరిలో ఉండటమే. ఇక్కడ వైఎస్సార్ సీపీ, టీడీపీ, కాంగ్రెస్ అభ్యర్థులతోపాటు సిట్టింగ్ ఎమ్మెల్యే ఉన్నం హనుమంతరాయచౌదరి టీడీపీ రెబల్‌గా బరిలోకి దిగారు. దీంతో ఇక్కడ చతుర్ముఖ పోటీ నెలకొంది. చీకటి ఒప్పందంతో బరిలోకి ‘డమ్మీ’ ఏపీలో కాంగ్రెస్ ఎక్కడా గెలిచే పరిస్థితి లేదు. దీంతో కనీసం పీసీసీ చీఫ్‌ను గెలిపించాలని చంద్రబాబుకు రాహుల్ గాంధీ ఫోన్ చేసి చెప్పారు. ఇక్కడ ఆయనను గెలిపిస్తే.. మిగిలిన చోట్ల తాము సహకరిస్తామన్నారు. దీంతో ఉరవకొండ నియోజకవర్గానికి చెందిన పెద్దగా ఎవరికీ తెలియని తృతీయ శ్రేణి నేత ఉమామహేశ్వర్‌కు టికెట్ ఇచ్చారు. అయినప్పటికీ ‘ఫ్యాన్’ హోరుతో కాంగ్రెస్ అభ్యర్థి ఏటికి ఎదురీదుతున్నారు. కాంగ్రెస్, టీడీపీ సాగిస్తున్న కుమ్మక్కు రాజకీయాలు తేటతెల్లం కావడంతో ఈ రెండు పార్టీలను ప్రజలు దూరంపెట్టే పరిస్థితి కనిపిస్తోంది. ఇప్పటికే నియోజకవర్గంలో బలంగా ఉన్న వైఎస్సార్ సీపీకి ఈ పరిణామాలు మరింత కలిసొచ్చే అంశం. ఆరోపణలు, విభేదాలతో టీడీపీ సతమతం కల్యాణదుర్గం నుంచి చౌదరి సిట్టింగ్ ఎమ్మెల్యేగా కొనసాగుతున్నారు. గత ఎన్నికల్లో 22,318 ఓట్ల మెజార్టీతో ఆయన విజయం సాధించారు. ఎంపీ జేసీ దివాకర్‌రెడ్డి గెలుపునకు ఈ మెజార్టీ దోహదపడింది. పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని 7 అసెంబ్లీ సెగ్మెంట్లలో గత ఎన్నికల్లో టీడీపీకి అత్యధిక మెజార్టీ వచ్చిన స్థానం ఇదే. ఈ ఎన్నికల్లో చౌదరికి టిక్కెట్ రాకుండా జేసీ దివాకర్‌రెడ్డి అడ్డుపడ్డారు. దీనికితోడు చౌదరి కుటుంబం అవినీతి విషయంలో రెచ్చిపోయింది. విండ్ పవర్ భూముల కొనుగోళ్లలో భారీ గోల్‌మాల్‌కు పాల్పడింది. రైతుల నుంచి ఎకరా రూ.2 లక్షల నుంచి రూ.3 లక్షలకే భూములు కొనుగోలు చేసి.. అవే భూములను విండ్ పవర్ సంస్థకు రూ.14 లక్షల నుంచి రూ.17 లక్షలకు విక్రయించారు. నియోజకవర్గంలో వేల ఎకరాల భూములను విండ్ పవర్ కోసం కంపెనీలు కొనుగోలు చేశాయి. రైల్వే కాంట్రాక్టుల్లో కూడా ఆయన కుటుంబం భారీగా లబ్ధి పొందింది. నియోజకవర్గంలో జరిగిన పనులు, ఇతర కాంట్రాక్టుల్లో ఆ కుటుంబ సభ్యులు చేతులు పెట్టారు. ఈ పరిణామాలతో టీడీపీ ప్రతిష్ట బాగా దెబ్బతింది. దీనికి తోడు స్థానిక నేతలైన రామ్మోహన్ చౌదరి, నారాయణ, రమేశ్, మల్లికార్జున వంటి నాయకులు చౌదరికి టిక్కెట్ రాకుండా అడ్డుకున్నారు. స్థానికులకే సీటివ్వాలని డిమాండ్ చేశారు. ఈక్రమంలో ఎస్ఆర్ కనస్ట్రక్షన్ అధినేత అమిలినేని సురేంద్రబాబుకు చంద్రబాబు టిక్కెట్ ఖరారు చేశారు. ఎన్నికల ప్రచారం చేసుకోమని ఫోన్లో సూచించారు. ఆ రెండు పార్టీలకూ ముప్పే రఘువీరారెడ్డి సొంత నియోజకవర్గం మడకశిర. పునర్విభజనలో భాగంగా 2009లో మడకశిర ఎస్సీలకు రిజర్వ్ కావడంతో ఆయన కల్యాణదుర్గం నుంచి పోటీచేసి గెలుపొందారు. 2014లో పెనుకొండ నుంచి పోటీచేసి ఓడిపోయారు. ఈ ఎన్నికల్లోనూ తిరిగి కల్యాణ దుర్గం నుంచి బరిలో నిలుస్తున్నారు. టీడీపీ సహకారం లభిస్తుందని ఆశించినా.. మూడు దశాబ్దాల పాటు సైకిల్ గుర్తుకు ఓటేసిన ప్రజలు ఒక్కసారి హస్తానికి వేయాలంటే కుదరని పని. దీంతో టీడీపీ ఓట్లు రఘువీరా, ఉమామహేశ్వరావు చీల్చే అవకాశం ఉంది. దీనికి తోడు ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరి కూడా టీడీపీ ఓట్లు చీల్చే అవకాశం ఉంది. టీడీపీలో విభేదాలు.. వైఎస్సార్సీపీలో ఐక్యతా రాగం టీడీపీలో సిట్టింగ్ ఎమ్మెల్యే చౌదరిని వ్యతిరేకించిన వారంతా ఉమామహేశ్వరరావుకు కూడా సహకారం అందించడం లేదు. స్థానికులకు సీటివ్వాలని తాము కోరితే స్థానికేతరులకు ఇచ్చారన్న అక్కసుతో పార్టీ శ్రేణులు అంటీముట్టనట్టు వ్యవహరిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్ సీపీ నేతలంతా ఏకతాటిపైకి వచ్చి పార్టీ గెలుపునకు కృషి చేస్తున్నారు. గత ఎన్నికల్లో ఎమ్మెల్యేగా పోటీచేసి ఓడిమి పాలైన తిప్పేస్వామి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ రఘునాథరెడ్డి, ఎల్ఎం మోహన్‌రెడ్డితోపాటు నేతలంతా ఉషాశ్రీ గెలుపు కోసం పనిచేస్తున్నారు. ఇది వైఎస్సార్ సీపీకి లాభించే అంశం. మరోవైపు రాష్ట్రంలో ఒక్క స్థానంలోనైనా గెలవాలనే తాపత్రయంతో బరిలో ఉన్న పీసీపీ చీఫ్‌కు వాతావరణం అనుకూలంగా లేదు. ఓటర్ల వివరాలు మొత్తం : 2,10,622 పురుషులు : 1,06,341 మహిళలు : 1,04,275 ఇతరులు: 06 – మొగిలి రవివర్మ, సాక్షి ప్రతినిధి, అనంతపురం