అనంతపురం : అందుబాటులో ఉన్న టెక్నాలజీని ఉపయోగించుకుని కేటుగాళ్లు రెచ్చిపోతున్నారు. అమాయకులనే కాకుండా ప్రజాప్రతినిధులను సైతం తమ బుట్టలో వేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. తాజాగా అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం ఎమ్మెల్యే ఉషశ్రీ చరణ్‌కు ఓ ఆగంతకుడు ఫోన్ చేశాడు. పీఎమ్‌ఈజీపీ రుణాలు ఇప్పిస్తామని ఏకంగా ఎమ్మెల్యేనే బురిడీ కొట్టించే యత్నం చేశాడు. ఈ పథకం కింద మూడు కోట్ల రుణం కావాలంటే తొలుత రెండు లక్షల రూపాయలను డిపాజిట్ చేయాలని మోసం చేసే ప్రయత్నం చేశాడు.
అయితే అప్పటికే ఎమ్మెల్యేకు అనుమానం రావడంతో చాకచక్యంగా వ్యవహరించి పరిశ్రమల శాఖ ఉన్నతాధికారులను సంప్రదించారు. ఇదంతా మోసమని తేలటంతో ఎమ్మెల్యే ఉషశ్రీ కళ్యాణదుర్గం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు రంగంలోకి దిగిన పోలీసులు ఆగంతకుడు ఫోన్ నెంబర్, బ్యాంకు ఖాతా వివరాలను సేకరించి విచారణ చేపట్టారు.
Comments
Please login to add a commentAdd a comment