
అనంతపురం: ఎన్నికలు రాకముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుందని ఎద్దేవా చేశారు మంత్రి ఉషాశ్రీ చరణ్. ఆ భయంతోనే తమ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలపై జీర్ణించుకోలేక విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. ‘చంద్రబాబు అబద్దాలకోరు. 2014-19 కళ్యాణదుర్గం ప్రజలకు చంద్రబాబు చేసింది శూన్యం. హంద్రీనీవా కాలువ తవ్వకాలకు భూములు కోల్పోయిన రైతులకు పరిహారం ఇవ్వకుండా చంద్రబాబు మోసం చేశారు.
భైరవానితిప్ప ప్రాజెక్టు భూ నిర్వాసితులకు పరిహారం విడుదల చేసిన ఘనత ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌దే. పేదలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయని జీర్ణించుకోలేక చంద్రబాబు విమర్శలు. ఎన్నికలు రాక ముందే చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది’ అని ఉషాశ్రీ చరణ్ పేర్కొన్నారు.