
సాక్షి, అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు.
కాగా, కుప్పంలోనే కాదు పలమనేరులోనూ చంద్రబాబు చెప్పిందే చెప్పి రొటీన్ ప్రసంగంతో ప్రజలకు బోర్ కొట్టించారు. తన గంట ప్రసంగంలో అనువుగాని హామీలు వందల్లోనే గుప్పించారు. ఈ మాటలు వివీ వినీ జనం అక్కడనుంచి మెల్లగా జారుకోవడం కనిపించింది. ఆయన పదేపదే చేతులెత్తండి..గట్టిగా చప్పట్లు కొట్టండి.. అంటున్నా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు.
మరో వైపు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ‘సిద్ధం’ సభలకు లభించిన విశేష స్పందన, సభలకు హాజరైన అశేష జనవాహినిని పత్రికలు, టీవీలలో చూసిన చంద్రబాబుకు భయం పట్టుకుంది. ‘మేమంతా సిద్ధం’ సీఎం జగన్ బస్సు యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు
Comments
Please login to add a commentAdd a comment