bitter experience
-
ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చేదు అనుభవం
సాక్షి, విజయనగరం జిల్లా: ఎమ్మెల్యే కోళ్ల లలిత కుమారికి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల హామీ మేరకు తమ గ్రామానికి రోడ్డు వేయించాలంటూ వేపాడ మండలం ఆతవ గ్రామస్థులు చుట్టుముట్టారు. దీంతో సమాధానం చెప్పలేక కోళ్ల లలిత కుమారి కారు ఎక్కి వెళ్లిపోయారు. కారుకు అడ్డుపడి గ్రామస్తులు ఆందోళన చేశారు. గ్రామస్తులను చెదరగొట్టిన పోలీసులు ఎమ్మెల్యేను తప్పించారు. -
మంత్రి నాదెండ్లను నిలదీసిన రైతులు
సాక్షి, కృష్ణా జిల్లా: చల్లపల్లి, ఘంటసాల, మోపిదేవి మండలాల్లో పర్యటించిన మంత్రి నాదెండ్ల మనోహర్‌కు చేదు అనుభవం ఎదురైంది. ధాన్యం కొనుగోళ్లపై మంత్రిని రైతులు నిలదీశారు. 10 రోజులైనా ధాన్యం కొనడం లేదంటూ రైతులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కనీసం గోనె సంచులు కూడా ఇవ్వడం లేదంటూ మండిపడ్డారు. తేమ శాతం పేరుతో మిల్లర్లు ధాన్యం తీసుకోవడం లేదని మంత్రికి రైతులు ఫిర్యాదు చేశారు.ఈ క్రాప్ జరిగినప్పటికీ అధికారులెవరూ పట్టించుకోవడం లేదన్న రైతులు.. 1262 ధాన్యం కొనుగోలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు ప్రశ్నించడంతో అధికారులపై మంత్రి నాదెండ్ల ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదేశించినా ఎందుకు కొనడం లేదంటూ మండిపడ్డారు. నిర్లక్ష్యంగా ఉన్న సిబ్బంది పై చర్యలు తీసుకోవాలంటూ ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. సాయంత్రానికల్లా ధాన్యం కొని.. రేపటికల్లా డబ్బులు పడేలా చేస్తానంటూ మంత్రి హామీ ఇచ్చారు.ఇదీ చదవండి: మళ్లీ మొదటికొచ్చిన ‘సీజ్ ది షిప్’ -
వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం
సాక్షి, నెల్లూరు: టీడీపీ ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్‌రెడ్డికి అవమానం జరిగింది. జిల్లా సమీక్షా మండలి సమావేశంలో సరైన గౌరవం ఇవ్వలేదంటూ అసహనం వ్యక్తం చేశారు. మంత్రులు ఆనం రామనారాయణ రెడ్డి, ఎండీ ఫరూక్, నారాయణ, ఎంపీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డిని అధికారులు ఆహ్వానించారు.అయితే, మంత్రులకు బొకేలు ఇచ్చి ఎంపీని అధికారులు పట్టించుకోలేదు. ప్రభాకర్‌రెడ్డిని ఆనం రామనారాయణరెడ్డి సముదాయించారు. అయినా కూడా వేమిరెడ్డి పట్టించుకోకుండా అలిగి అక్కడ నుంచి వెళ్లిపోయారు. -
రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం: రాప్తాడులో చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. జనం లేక చంద్రబాబు సభ వెలవెల బోయింది. సభా ప్రాంగణం ఖాళీగా ఉండటంతో చంద్రబాబు అసహనం వ్యక్తం చేశారు. చంద్రబాబు మాట్లాడుతుండగానే జనం వెళ్లిపోయారు. కాగా, కుప్పంలోనే కాదు పలమనేరులోనూ చంద్రబాబు చెప్పిందే చెప్పి రొటీన్ ప్రసంగంతో ప్రజలకు బోర్ కొట్టించారు. తన గంట ప్రసంగంలో అనువుగాని హామీలు వందల్లోనే గుప్పించారు. ఈ మాటలు వివీ వినీ జనం అక్కడనుంచి మెల్లగా జారుకోవడం కనిపించింది. ఆయన పదేపదే చేతులెత్తండి..గట్టిగా చప్పట్లు కొట్టండి.. అంటున్నా జనం నుంచి పెద్దగా స్పందన రాలేదు. మరో వైపు, రాష్ట్రంలో వైఎస్సార్ సీపీ ‘సిద్ధం’ సభలకు లభించిన విశేష స్పందన, సభలకు హాజరైన అశేష జనవాహినిని పత్రికలు, టీవీలలో చూసిన చంద్రబాబుకు భయం పట్టుకుంది. ‘మేమంతా సిద్ధం’ సీఎం జగన్ బస్సు యాత్రకు కూడా ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు -
టీడీపీకి చేదు అనుభవం.. షాక్ ఇచ్చిన స్థానికులు
బాపట్ల జిల్లా: రేపల్లె నియోజకవర్గం నిజాంపట్నంలో టీడీపీకి చేదు అనుభవం ఎదురైంది. బాబు షూరిటీ భవిష్యత్ గ్యారెంటీ పేరిట టీడీపీ కార్యక్రమం చేస్తుండగా, తమ వీధికి రావొద్దంటూ టీడీపీ నాయకులను స్థానికులు అడ్డుకున్నారు. అబద్ధాలు చెప్పి మోసం చేసి ఇప్పుడు ఏ ముఖం పెట్టుకుని వస్తున్నారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో కంగుతిన్న టీడీపీ నాయకులు స్థానికులతో గొడవకు దిగారు. టీడీపీలో టికెట్ల పంచాయతీ పల్నాడు జిల్లా పెదకూరపాడు తెలుగుదేశం పార్టీలో ముసలం పుట్టింది. పెదకూరపాడు టికెట్‌ను కొమ్మలపాటి శ్రీధర్ కాకుండా మరొకరికి కేటాయిస్తున్నారంటూ ప్రచారం జరగడంతో కొమ్మలపాటి శ్రీధర్ వర్గీయులు ఆగ్రహంతో ఊగిపోతున్నారు. గుంటూరులో పెదకూరపాడు నియోజకవర్గ తెలుగుదేశం కార్యకర్తలు సమావేశం నిర్వహించారు. కొమ్మలపాటికి టికెట్ కేటాయించాలంటూ తీర్మానించారు. వేరే వారికి టికెట్ కేటాయిస్తే పరిణామాలు తీవ్రంగా ఉంటాయంటూ చంద్రబాబు, లోకేష్‌లకు టీడీపీ నేతలు నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. ఇదీ చదవండి: Pawan Kalyan: సేనాని రూటే సెపరేటు! -
క్యాబ్ బిల్లు చూసి షాకైన ప్యాసెంజర్..చివరికి ఏం చేశాడంటే..?
క్యాబ్ సేవల సంస్థ ఓలాకు సంబంధించి మరో షాకింగ్ సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది. ఆన్లైన్లో క్యాబ్ బుక్ చేసుకున్న ఓ విద్యార్థికి ఊహించని ట్విస్ట్ ఎదురైంది. బుక్ చేసుకున్నపుడు ఉన్న ఫీజుకి, తీరా చెల్లించాల్సిన సొమ్ముకి ఉన్న తేడా చూసి కంగు తిన్నాడు. ఇదేం చోద్యం బాసూ అంటూ లబోదిబోమన్నాడు. చివరికి ఏమైందంటే..? కోల్‌కతా నుంచి బెంగళూరుకు వచ్చిన అనురాగ్ కుమార్ సింగ్ అనే కాలేజీ విద్యార్థి కెంపేగౌడ విమానాశ్రయంలో ఓలా 'మినీ' క్యాబ్‌ను చేసుకున్నాడు. ఓలా బుక్ చేసుకున్న మతికెరె ప్రాంతానికి సమయంలో ధర రూ.730 చూపించింది. తీరా రైడ్ ముగిసిన తరువాత రూ.5194 చెల్లించాలని డ్రైవర్ డిమాండ్ చేశాడు. దిగ్భ్రాంతికి గురైన అనురాగ్ వెంటనే తన ఫోన్లో చెక్ చేస్తే రైడ్ క్యాన్సిల్ అయినట్లు చూపించింది. క్యాన్సిల్ అయిన రైడ్‌కు అంత డబ్బులు ఎలా వసూలు చేస్తావంటూ డ్రైవర్ని నిలదీశాడు.దీంతో ఇద్దరి మధ్యా కాసేపు వాగ్వాదం జరిగింది. ఓలా కస్టమర్‌కేర్‌ను కూడా సంప్రదించేందుకు ప్రయత్నించాడు. అయినా ఫలితం లేదు. చివరికి అక్కడున్న తోటివారి సలహా మేరకు డ్రైవర్‌కు రూ. 1,600 చెల్లించాడు. తన ఫిర్యాదుకు ఓలా నుంచి ఎలాంటి స్పందన రాకపోవటంపై అనురాగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. బెంగళూరు మొత్తం తిరిగినా ఇంత ఖర్చు కాదు అంటూ అసహనం వ్యక్తం చేశాడు. ఈ మొత్తం వ్యవహారాన్ని సోషల్‌మీడియాలో వైరల్‌గా మారింది. ప్రయాణీకులు అప్రమత్తంగా ఉండాలని, రైడ్ వివరాల స్క్రీన్షాట్లను తీసుకొని, ఏదైనా తేడా వస్తే కస్టమర్ సపోర్ట్ టీమ్‌లకు రిపోర్ట్ చేయాలని నెటిజన్లు సూచించారు. -
గురుపత్వంత్ సింగ్ ఎవరు? భారత్- కెనడాల మధ్య ఎలా చిచ్చుపెడుతున్నాడు?
భారతదేశం-కెనడాల మధ్య సంబంధాలు అంతకంతకూ దిగజారుతున్నాయి. కెనడా ప్రభుత్వం తమ దేశంలో ఖలిస్థాన్ అనుకూల కార్యకలాపాలను అరికట్టకపోవడమే ఇందుకు కారణం. ఢిల్లీలో ఇటీవల జరిగిన జీ-20 సదస్సులో కెనడా ప్రధాని జస్టిన్ ట్రూడోపై పీఎం నరేంద్ర మోదీ ప్రత్యేక దృష్టి సారించలేదు. ఈ కఠినమైన ప్రవర్తనకు స్పందనగా ట్రూడో తమ దేశంలోని సిక్కు ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) గ్రూప్‌తో సంబంధం ఉన్న హర్దీప్ సింగ్ నిజ్జార్ హత్యలో భారత ప్రభుత్వ ఏజెంట్ల ప్రమేయం ఉందని ఆరోపించింది. అలాగే ఒక అగ్రశ్రేణి భారతీయ దౌత్యవేత్తను బహిష్కరించింది. ఈ నేపధ్యంలో భారత ప్రభుత్వం ఒక సీనియర్ కెనడియన్ దౌత్యవేత్తను దేశం విడిచి వెళ్లాలంటూ ఆదేశాలు జారీ చేసింది. కెనడావి నిరాధార ఆరోపణలు కెనడా ఆరోపణలను అసంబద్ధమని, రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా భారత్ అభివర్ణించింది. కెనడాలో రక్షణ పొందుతున్న ఖలిస్తానీ ఉగ్రవాదులు, తీవ్రవాదుల నుంచి దృష్టి మరల్చేందుకే కెనడా ఇలాంటి నిరాధార ఆరోపణలు చేస్తున్నదని విదేశాంగ మంత్రిత్వ శాఖ (ఎంఈఏ) పేర్కొంది. భారతదేశ సార్వభౌమత్వానికి ముప్పు కలిగించే ఖలిస్తాన్ మద్దతుదారులపై అక్కడి ప్రభుత్వం ఇప్పటికీ ఎటువంటి చర్యలు తీసుకోలేదు. కెనడాలో ఖలిస్థాన్ అనుకూల తీవ్రవాదుల భారత వ్యతిరేక నిరసనల సంఖ్య పెరిగింది. ఆ భారత దౌత్యవేత్తలను హత్య చేయాలంటూ.. ఈ ఘటనల్లో నిషేధిత ఖలిస్థానీ అనుకూల గ్రూప్ సిక్ ఫర్ జస్టిస్ (ఎస్ఎఫ్జే) హస్తం ఉన్నట్లు తేలింది.ఈ సంఘంతో సంబంధం ఉన్న గురుపత్వంత్ సింగ్ పన్నూ ఇటీవల కెనడాలో నివసిస్తున్న హిందువులను దేశం విడిచి వెళ్లాలని కోరింది. గురుపత్వంత్ సింగ్ పన్నూ అమృత్సర్ జిల్లాలోని ఖాన్కోట్ గ్రామంలో జన్మించాడు. అతని తండ్రి పంజాబ్ స్టేట్ అగ్రికల్చరల్ మార్కెటింగ్ బోర్డులో ఉద్యోగి. పంజాబ్ యూనివర్శిటీ, చండీగఢ్‌లో న్యాయ పట్టా పొందిన పన్నూ.. సిక్ ఫర్ జస్టిస్‌కు న్యాయ ప్రతినిధి. అతనికి కెనడాతో పాటు అమెరికా పౌరసత్వం కూడా ఉంది. భారత్‌ను వదిలి విదేశాలకు వెళ్లిన పన్నూ తొలుత అక్కడ డ్రైవర్‌గా పనిచేశాడు. కొంతకాలం తర్వాత న్యాయవాద వృత్తిని చేపట్టాడు. జులై 2023లో ఒక వీడియోను విడుదల చేసిన పన్నూ.. ఉత్తర అమెరికా, యూరప్‌లోని భారతీయ దౌత్యవేత్తలను హత్య చేయాలని పిలుపునిస్తూ పోస్టర్లను ముద్రించాడు. భారత ప్రభుత్వం గురుపత్వంత్ సింగ్ పన్నూను 2020లో ఉగ్రవాదిగా ప్రకటించింది. భారత్ సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తున్నదంటూ.. కెనడాలోని భారత రాయబార కార్యాలయాన్ని మూసివేయించడమే కాకుండా పన్నూ మరో వీడియోలో ప్రధాని మోదీని, హోంమంత్రి అమిత్ షాను కూడా బెదిరించాడు. పన్నూపై భారత్‌లో దేశద్రోహ కేసుతో సహా 20కి పైగా క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఖలిస్తాన్‌కు మద్దతుగా పన్నూ అమెరికా, కెనడా తదితర దేశాల్లో కార్యక్రమాలు, ర్యాలీలు నిర్వహిస్తున్నాడు. భారతదేశం సిక్కుల మానవ హక్కులను ఉల్లంఘిస్తోందనే ఆరోపణలు గుప్పిస్తున్నాడు. అతనిపై అంతర్జాతీయ స్థాయిలో రెడ్ కార్నర్ నోటీసు జారీ చేయాలని భారత్ కోరినప్పటికీ ఇంటర్‌పోల్ ఇంకా నోటీసు జారీ చేయలేదు. కెనడా క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు కెనడాలో సిక్కు జనాభా గణనీయంగా ఉంది. ఇమ్మిగ్రేషన్ విధానం చాలా ఉదారంగా ఉన్న పాశ్చాత్య దేశాలలో కెనడా ఒకటని చెబుతారు. కెనడాలో గణనీయమైన సంఖ్యలో భారత సంతతికి చెందినవారు ఉన్నారు. అందులో ముఖ్యంగా సిక్కులు అధికంగా ఉన్నారు. కెనడాలో ఏడున్నర లక్షల మందికి పైగా సిక్కులు నివసిస్తున్నారు. అక్కడ వారు వ్యాపార రంగం మొదలుకొని రాజకీయ రంగం వరకూ ప్రభావవంతంగా ఉన్నారు. ఈ నేపద్యంలో ఈ సిక్కు ఓటు బ్యాంకుకు ట్రూడో కాపాడుకుంటూ వస్తున్నారు. ట్రూడో తన మొదటి టర్మ్‌లో మంత్రివర్గాన్ని ఏర్పాటు చేసినప్పుడు సిక్కులకు అత్యధిక ప్రాముఖ్యతనిచ్చారు. ఆయన క్యాబినెట్లో నలుగురు సిక్కు మంత్రులు ఉన్నారు. అందుకే ఖలిస్థాన్ అనుకూల వేర్పాటువాదులపై కఠిన చర్యలు తీసుకోకూడదని ట్రూడో భావిస్తున్నారని విశ్లేషకుల వాదన. అయితే కెనడాలోని చాలా మంది సిక్కులు అతని భావజాలానికి మద్దతునివ్వడం లేదని సమాచారం. ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి 1980 నుండి భారతదేశం- కెనడా మధ్య అగాధం పెరిగింది. 1985లో కెనడాకు చెందిన ఖలిస్తానీ వేర్పాటువాద బృందం ఎయిర్ ఇండియా విమానంపై బాంబు దాడి చేయడంతో ఇది మొదలయ్యింది. ఈ పేలుడులో విమానంలోని మొత్తం 329 మంది చనిపోయారు. ఈ బాంబు పేలుడుపై జరిగిన దర్యాప్తులో ఇంకా ఖచ్చితమైన వివరాలు వెల్లడి కాలేదు. కాగా కొన్ని నెలల క్రితం బ్రాంప్టన్‌లో జరిగిన పరేడ్‌లో మాజీ భారత ప్రధాని ఇందిరా గాంధీ చిత్రం రక్తంతో తడిసిన చీరలో కనిపించడంతో ఇరు దేశాల మధ్య సంబంధాలు మరింత దెబ్బతిన్నాయి. గత కొన్ని నెలలుగా కెనడాలో భారత వ్యతిరేక నిరసనలు తరచూ కనిపిస్తున్నాయి. కెనడా ప్రభుత్వం వాటిని నియంత్రించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇది కూడా చదవండి: ఖలిస్తాన్ అంటే ఏమిటి? పంజాబ్‌ను ఎందుకు వేరు చేయాలంటున్నారు? -
ఢిల్లీలో టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు
సాక్షి, ఢిల్లీ: టీడీపీ ఎంపీలకు మళ్లీ భంగపాటు ఎదురైంది. ఏపీలో ఆర్థిక అవకతవకలు జరుగుతున్నాయన్న ఫిర్యాదులను కేంద్ర ఆర్థికమంత్రి నిర్మలా సీతారామన్ పట్టించుకోలేదు. నిర్మల సీతారామన్.. తన ఆఫీసు బయటే నిలబెట్టి టీడీపీ ఎంపీలు, సర్పంచులతో మాట్లాడి పంపించివేశారు. "అలాగే చూద్దాం" అంటూ ఒక్క నిమిషంలోనే ఆర్థిక మంత్రి ముగించారు. నిన్ననే కేంద్రమంత్రి కపిల్ మోరేశ్వర పాటిల్ టీడీపీ ఎంపీలకు షాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. ఉపాధి హామీ పథకం చెల్లింపులు అన్ని ఆన్లైన్లోనే జరుగుతున్నప్పుడు అవకతవకలకు ఆస్కారం లేదని కేంద్ర మంత్రి అన్నారు. దీంతో టీడీపీ ఎంపీలు తిరిగి సమాధానం చెప్పలేక నోరెళ్ల బెట్టారు. చదవండి: అదీ బాబు గ్యాంగ్ అంటే.. ఆ విధంగా తుస్సుమన్నారు -
ఆన్లైన్ ఫ్రాడ్: రూ. 40లక్షల కారు గోవిందా, మ్యూజిక్ డైరెక్టర్ లబోదిబో
ఆన్లైన్ మోసాలకు సంబంధించి ఖరీదైన కారును పోగొట్టుకున్న వైనం ఒకటి తాజాగా వెలుగులోకి వచ్చింది. గుజరాతీ గాయకుడు ,సంగీత దర్శకుడు, బిన్నీ శర్మ రూ. 40 లక్షల విలువైన ఎప్యూవీని పోగొట్టకుని లబోదిబోమంటున్నాడు. ఈ మేరకు తనకెదురైన చేదు అనుభవాన్ని సోషల్ మీడియాలో పంచుకోవడంతో ఇది వైరల్ అవుతోంది. (అతిపెద్ద లిక్కర్ కంపెనీ సీఈవో, భారత సంతతికి చెందిన ఇవాన్ ఇక లేరు) తన పాటలు, వాయిస్‌తో గాయకుడిగా పాపులర్ అయిన బిన్నీ గూగుల్‌లో సెర్చ్ చేసి ఫేక్ పోర్ట్ల్ ద్వారా మోసానికి గురయ్యాడు. తాను సాధారణంగా సహాయం కోసం అడగను, కానీ మోసగాడు చేసిన స్కామ్‌కు బలైపోయా.. చాలా క్లిష్ట పరిస్థితిలో ఉన్నాను సాయం చేయాలంటూ ఇన్‌స్టా వేదికగా కోరుతున్నాడు. అలాగే మూవ్ మై కార్, జస్ట్ డయల్, గూగుల్ యాడ్స్ తో జాగ్రత్తగా ఉండాలి, మోస పోవద్దంటూ పిలుపునివ్వడం గమనార్హం. రూ.40 లక్షలు విలువ చేసే తన ఎస్‌యూవీని హిమాచల్ ప్రదేశ్ నుంచి అహ్మదాబాద్ కు తరలించాలంటూ శర్మ మూవ్ మై కార్ అనే పోర్టల్ లో వెండర్‌ను సంప్రదించాడు. ఈ మేరకు సదరు వెండర్‌కు చెందిన ట్రక్ శర్మ కారును తీసుకెళ్లింది. ఇక్కడి దాకా బాగానే ఉంది. తీసుకెళ్లి కారును మాత్రం గమ్యస్థానానికి చేర్చలేదు. పైగా ఒప్పందం ప్రకారం ఇవ్వాల్సిన సొమ్ముకాకుండా అధికంగా ఇవ్వాలంటూ డిమాండ్ చేయడం మొదలుపెట్టాడు. దీంతో మోసపోయానని గమనించిన బిన్నీ పోలీసులను ఆశ్రయించాడు. అగర్వాల్ ఎక్స్ ప్రెస్ ప్యాకర్స్ అండ్ మూవర్స్, మూవ్ మై కార్ పోర్టల్‌పై కూడా సైబర్ పోలీసులు కన్జ్యూమర్ ఫోరంకు ఫిర్యాదు చేశానని బిన్నీ తెలిపారు. అటు పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కూడా దాఖలు చేయాలని భావిస్తున్నట్టు చెప్పారు. (ఐవోఎస్ 17 అదిరిపోయే అప్డేట్: ఈ పాపులర్ ఐఫోన్ యూజర్లకు మాత్రం) కాగా రేడియో జాకీగా తొలినాళ్ల నుంచి 'మై వరల్డ్' అనే షోను హోస్ట్ చేస్తూ సునిధి చౌహాన్, శంకర్ ఎహసాన్ లాయ్, అర్జిత్ సింగ్ వంటి పాపులర్ సింగర్స్‌తో ప్రదర్శనలు ఇవ్వడంతో పాటు, తన టాలెంట్‌తో అనేక మంది ఫ్యాన్స్‌ని, ఫాలోయర్స్‌ని సంపాదించకున్నాడు బిన్నీ శర్మ. -
ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం
సాక్షి, అనంతపురం జిల్లా: అనంతపురంలో ఏపీ బీజేపీ అధ్యక్షుడు సోము వీర్రాజుకు చేదు అనుభవం ఎదురైంది. మూడు రాజధానులకు మద్దతు ఇవ్వాలని అభివృద్ధి వికేంద్రీకరణ సాధన సమితి నాన్ పొలిటికల్ జేఏసీ ప్రతినిధులు సోము వీర్రాజును కోరారు. వికేంద్రీకరణకు అనుకూలం అంటూనే అమరావతి ఫేక్ యాత్రకు ఎందుకు బీజేపీ మద్దతు తెలుపుతోందని వారు నిలదీశారు. సోము వీర్రాజు సూటిగా స్పందించకపోవడంతో వికేంద్రీకరణ సాధన సమితి జేఏసీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. సోము వీర్రాజుతో వాగ్వాదానికి దిగారు. చదవండి: మూడు రాజధానులకు మద్దతు ప్రకటించిన మాల మహానాడు -
కాకినాడలో కేఏపాల్‌కు చేదు అనుభవం
సాక్షి, కాకినాడ జిల్లా: కాకినాడలో ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌కు చేదు అనుభవం ఎదురైంది. గత రాత్రి సీబీసీఎన్సీ స్కూల్ గ్రౌండ్లో కేఏ పాల్‌కు చెందిన వాహనాలను పార్కింగ్ చేశారు. అయితే గురువారం ఉదయం వాహనాలను వెళ్లకుండా స్కూల్ సిబ్బంది అడ్డుకున్నారు. సీబీసీఎన్సీ డైరెక్టర్ రత్నకుమార్ చెబితేనే వాహనాలను పంపుతామని సిబ్బంది చెప్పారు. పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని కేఏపాల్ కాన్వాయ్ వాహనాలను విడిచిపెట్టారు. చదవండి: వైఎస్సార్ కాపు నేస్తం; సీఎం జగన్ కాకినాడ జిల్లా పర్యటన షెడ్యూల్ ఇదే.. -
ఆన్సర్ చేసినా ఆనవాలే లేదట.. జేఈఈ అభ్యర్థులకు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: ఇటీవల జరిగిన జేఈఈ మెయిన్స్ పరీక్ష మునుపెన్నడూ లేనంతగా సమస్యలు సృష్టిస్తోంది. పరీక్ష రోజు గంటల తరబడి ఆలస్యం కాగా... ఇప్పు డు సమాధానం ఇచ్చిన ప్రశ్నలను కంప్యూటర్ లెక్కలోకి తీసుకోని చేదు అనుభవం అభ్యర్థులు చవిచూస్తున్నారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) దేశవ్యాప్తంగా నిర్వ హించిన ఈ పరీక్షలో లోపాలు వస్తే వినే నాథుడే కన్పించడం లేదని విద్యార్థులు నిస్సహాయత వ్యక్తం చేస్తున్నారు. తాజాగా ఎన్టీఏ జేఈఈ ప్రశ్నపత్రం కీ విడు దల చేసింది. అభ్యర్థులు లాగిన్ అయి చూసుకుని కలవరప డుతున్నారు. తాము ఎక్కువ ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే, తక్కువ ఇచ్చినట్టు చూపిస్తోందని అనేకమంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. హైదరాబాద్‌లోని ఒక మహిళా ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్ష రాసిన విద్యార్థుల్లో దాదాపు పది మందికి ఇదే అనుభవం ఎదురైంది. అనుజ్ అనే విద్యార్థి 65 ప్రశ్నలకు కంప్యూటర్లో టిక్ పెడితే, రెస్పాన్స్ షీట్ మాత్రం 30 ప్రశ్నలకు బదులిచ్చినట్లే చూపింది. మరో విద్యార్థిని భవిత్ 51 ప్రశ్నలు పూర్తి చేస్తే, 34 మాత్రమే చేసినట్టు వచ్చిందని తెలిపింది. ముద్ద యశ్వసిని అనే విద్యార్థిని 21 ప్రశ్నలు పూర్తి చేస్తే, రెస్పాన్స్ షీట్ లో అసలేమీ చేయలేదని వచ్చిందని వాపోయింది. దీనిపై ఎన్టీఏకి ఫిర్యాదు చేసినా స్పందించలేదని, పొరపాట్లను సరిచేయకపోతే ప్రతిభావంతులు కూడా కనీస ర్యాంకుకు చేరుకోవడం కష్టమని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. -
ఉప ముఖ్యమంత్రి మొహం మీదే తలుపులు వేసిన మహిళలు
సాక్షి, న్యూఢిలీ: ఉత్తర్‌ప్రదేశ్‌లో ఎన్నికల ప్రచారానికి వెళ్లిన డిప్యూటీ సీఎం కేశవ్ప్రసాద్మౌర్యకు చుక్కెదురైంది. తన సొంత నియోజగవర్గం సిరాతూలో కొందరు మహిళలు.. మౌర్య మొహం మీదే తలుపులు మూసేశారు. ప్రచారంలో భాగంగా మూడురోజుల నుంచి కనిపించకుండా పోయిన జిల్లా పంచాయతీ సభ్యుడు రాజేశ్ మౌర్య కుటుంబాన్ని పరామర్శించడానికి ఆదివారం ఆయన వెళ్లారు. ఈ క్రమంలోనే స్థానికులు.. డిప్యూటీ సీఎం రాగానే తలుపులు మూసుకున్నారు. అనంతరం ఆయనకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. వారిని నిశబ్దంగా ఉండాలని మౌర్య చేతితో సంజ్ఞలు చేశారు. దీనికి సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి. అయితే రాజేశ్ మౌర్య కేసులో పోలీసుల వ్యవహరించిన తీరుకు వ్యతిరేకంగా స్థానికులు నిరసన చేయడం వల్లే ఈ ఘటన జరిగినట్లు బీజేపీ తెలిపింది. (చదవండి: బీజేపీకి గుడ్‌బై.. ఏ పార్టీలోకి వెళ్లను.. ‘ఏక్ నిరంజన్’: మాజీ సీఎం) -
హుజురాబాద్‌లో ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం
సాక్షి, కరీంనగర్: హుజూరాబాద్ నియోజకవర్గంలో ఈటల రాజేందర్‌కు చేదు అనుభవం ఎదురైంది. మృతుని కుటుంబాన్ని పరామర్శించేందుకు వెళ్లిన ఈటలకు నిరసన సెగ తలిగింది. వివరాలు.. పాపయ్యపల్లిలో ప్రవీణ్ యాదవ్ అనే వ్యక్తి కొద్ది రోజుల క్రితం చనిపోయాడు. బాధిత కుటుంబాన్ని పరామర్శించేదుకు బుధవారం ఈటల అక్కడకు వెళ్లారు. ఈ క్రమంలోనే మృతుడి కుటుంబ సభ్యులు ఆయనకు ఊహించని షాక్ ఇచ్చారు. ఈటలను చూడగానే ఒక్కసారిగా తిట్లదండకం అందుకున్నారు. ఆయన వల్లే తమ బిడ్డ మృతి చెందాడని మృతుని తల్లిదండ్రులు ఆరోపించారు. దీంతో ఏంచేయాలో తెలియని స్థితిలో ఈటల పోలీసుల సాయంతో అక్కడ నుంచి వెళ్లిపోయారు. చదవండి: (హుజురాబాద్ ఉప ఎన్నిక: ఆట ఆరంభం.. ఎవరూ తగ్గడం లేదు) ఇదిలాఉండగా.. తెలంగాణలో తీవ్ర ఉత్కంఠ రేకెత్తిస్తున్న హుజూరాబాద్ ఉప ఎన్నికకు షెడ్యూల్ విడుదల కావడంతో రాష్ట్రంలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. అక్టోబర్ 30న హుజురాబాద్ అసెంబ్లీ స్ధానానికి ఉపఎన్నిక జరగనుంది. ఫలితాలు నవంబర్ 2న వెల్లడిస్తారు. చదవండి: (‘పోసాని భార్యను అవమానించడం దారుణం.. భగవంతుడే మీకు బుద్ధి చెప్తాడు’) -
హుజురాబాద్‌లో ఈటెల రాజేందర్‌కు చేదు అనుభవం
-
హీరోయిన్ లావణ్య త్రిపాఠికి చేదు అనుభవం
‘అందాల రాక్షసి’ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన నటి లావణ్య త్రిపాఠి. తొలి సినిమాతోనే హీరోయిన్గా సత్తా చాటిన ఆమె ఆ తర్వాత తెలుగు, తమిళ భాషల్లో వరుస అవకాశాలను అందిపుచ్చుకుంది. ఈ ఏడాది ‘ఏ1 ఎక్స్‌ప్రెస్’ సినిమాతో ప్రేక్షకులను పలకరించిన ఆమె.. ప్రస్తుతం ‘రాయబారి’ అనే సినిమాలో నటిస్తుంది. ఇక సోషల్ మీడియాలోనూ ఎంతో యాక్టివ్‌గా ఉండే లావణ్య తనకు సంబంధించిన పలు విషయాలను అభిమానులతో షేర్ చేస్తుంటుంది. అయితే తాజాగా ఈ బ్యూటీకి చేదు అనుభవం ఎదురైంది. ఓ సినిమా షూటింగ్ నిమిత్తం వేరే ప్రాంతానికి విమానంలో ప్రయాణించిన లావణ్యకు అక్కడ ఊహించని పరిణామం ఎదురైంది. సాంకేతిక సమస్యల కారణంగా ఆమె ప్రయాణించాల్సిన విమానం క్యాన్సిల్ కావడంతో లావణ్య ప్రయాణానికి అంతరాయం కలిగింది. దీంతో సదరు విమానయాన సంస్థ ఎయిర్ ఏషియాను సోషల్ మీడియాలో ట్యాగ్ చేస్తూ విమానం క్యాన్సిల్ అవుతుందన్న విషయం ముందుగా ఎందుకు తెలియజేయలేదంటూ ఫైర్ అయ్యింది. విమానంలో సీటు రిజర్వ్ చేసుకున్న అనంతరం ఫ్లైట్ క్యాన్సిల్ అని మెసేజ్ రావడం ఏంటని మండిపడింది. ఇలాంటిది గతంలో ఎవరికైనా జరిగిందా లేక తనకే ఎదురైందా అంటూ ఫ్యాన్స్‌ను కోరింది. -
సీపీఐ నారాయణకు చేదు అనుభవం
సాక్షి, విశాఖపట్నం: స్టీల్ ప్లాంట్ దగ్గర సీపీఐ నారాయణకు చేదు అనుభవం ఎదురైంది. స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ అంశంపై ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ విజయసాయిరెడ్డిలపై నారాయణ చేసిన వ్యాఖ్యలను కార్మిక సంఘాల నేతలు ఖండించారు. నారాయణ ప్రసంగానికి కార్మిక సంఘాల నేతలు అడ్డుతగిలారు. స్టీల్ ప్లాంట్ దగ్గరికి వచ్చి రాజకీయాలు చేయొద్దని హితవు పలికారు. స్టీల్ ప్లాంట్ కోసం అన్ని పార్టీలు పోరాటం చేస్తున్నాయని సూచించారు. ఇప్పటికే సీఎం రెండుసార్లు ప్రధానికి లేఖ రాశారని కార్మి సంఘాలు గుర్తుచేశాయి. అసెంబ్లీలో తీర్మానం కూడా చేశారని కార్మిక సంఘాల నేతలు పేర్కొన్నారు. -
Hyderabad: మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం
-
క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం
సాక్షి, హైదరాబాద్: గచ్చిబౌలిలో క్రీడల మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు చేదు అనుభవం ఎదురైంది. ఒలంపిక్స్‌కు వెళ్తున్న బ్యాడ్మింటన్ ప్లేయర్ల కోచ్‌ల సన్మాన కార్యక్రమంలో మంత్రి షాక్ తిన్నారు. కోవిడ్ టైంలో గుంపులుగా సత్కారాలు పెట్టడంపై కోచ్‌ల అసహనం వ్యక్తం చేశారు. సన్మానం కోసం ఒలంపియన్ కోచ్‌లు స్టేజ్ మీదకి వచ్చేందుకు ఒప్పుకోలేదు. చివరకు మంత్రి బ్రతిమిలాడగా పీవీ సింధు, సాయి ప్రణీత్ స్టేజ్ మీదకు వచ్చారు. -
ఏ మొహం పెట్టుకుని వచ్చారు..
-
విజయవాడలో చంద్రబాబుకు చేదు అనుభవం
సాక్షి, విజయవాడ: మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రతిపక్ష నేత చంద్రబాబుకు చేదు అనుభవం ఎదురైంది. వన్‌టౌన్ నైజాం గేట్ మసీదు సెంటర్ వద్ద ముస్లిం రైట్స్ అండ్ వెల్ఫేర్ సంస్థ సభ్యుడు.. చంద్రబాబును నిలదీశారు. చంద్రబాబు హయాంలో 35 గుళ్లతో పాటు రామవరప్పాడు వద్దనున్న అబూబకర్ మసీద్‌ను కూడా తొలగించారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అభివృద్ధి పేరుతో రాష్ట్రాన్ని సర్వనాశనం చేసి ఏ మొహం పెట్టుకుని ఓట్లు అడిగేందుకు వచ్చారని చంద్రబాబును ఆయన నిలదీశారు. కాగా, పరిపాలన రాజధానిగా ఎంపికైన విశాఖపట్టణానికి వ్యతిరేకంగా ఉన్నారంటూ ప్రతిపక్ష నేత, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుకు గత శుక్రవారం రాత్రి వైజాగ్ వాసులు షాకిచ్చిన సంగతి విదితమే. ఉత్తరాంధ్ర ద్రోహి అంటూ నినదించారు. విశాఖ పట్టణానికి రాగా అతడిని గో బ్యాక్ అంటూ ప్లకార్డులు పట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూడలిలో నిలబడి చంద్రబాబు పర్యటనపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అలాగే, గత నెల కుప్పం పర్యటనలో కూడా చంద్రబాబుకు ఊహించని దెబ్బ తగిలిన విషయం తెలిసిందే.. కుప్పం నియోజకవర్గ పర్యటన నిమిత్తం విచ్చేసి ప్రతిపక్ష నేత చంద్రబాబునాయుడు అర్ధంతరంగా పర్యటన ముగించుకుని తిరుగు ప్రయాణమయ్యారు. పార్టీ శ్రేణులు తూటాల్లా సంధిస్తున్న ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖం చాటేశారని పలువురు కార్యకర్తలు బహిరంగంగా చెప్పుకోవడం కనిపించింది. చదవండి: అపవిత్ర పొత్తు: సైకిల్ గుర్తు.. లేదంటే గ్లాస్ గుర్తు..! ప్రజలపై అక్కసు.. చంద్రబాబు శాపనార్థాలు -
నారా లోకేష్‌కు చేదు అనుభవం
సాక్షి, గుంటూరు: అమరావతి పర్యటనలో నారా లోకేష్‌కు చేదు అనుభవం ఎదురైంది. తుళ్లూరు (మ) దొండపాడులో లోకేష్ గోబ్యాక్ అంటూ నినాదాలు చేశారు స్థానికులు. నిన్న (ఆదివారం) రాజధాని రైతుల పేరుతో చేసిన ర్యాలీలో.. ట్రాక్టర్ ఢీకొని కొప్పుల రెబ్బమ్మ అనే వృద్ధురాలు మృతి చెందారు. ఆమె కుటుంబాన్ని పరామర్శించడానికి నారా లోకేష్ సోమవారం అక్కడ పర్యటించారు. అయితే, లోకేష్‌ను ఇంటికి రావొద్దంటూ రెబ్బమ్మ కుటుంబసభ్యులు తేల్చిచెప్పారు. వెనక్కి వెళ్లిపోవాలని గ్రామస్తులు నినాదాలు చేశారు. (చదవండి: పిట్ట కథలు వద్దు: పవన్‌కు ఎస్తేర్ కౌంటర్) -
టీడీపీ మాజీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం
సాక్షి, తూర్పు గోదావరి: టీడీపీ మాజీ ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డికి బిక్కవోలు మండలం కాపవరం గ్రామంలో శనివారం చేదు అనుభవం ఎదురైంది. ఆయన వాహనాన్ని కాపవరం గ్రామస్తులు అడ్డుకున్నారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో నీరు చెట్టు పథకంలో వేలకోట్ల రూపాయలు దోచుకున్నారని విమర్శించారు. చెరువులో పడి ముగ్గురు చనిపోయినా మాజీ ఎమ్మెల్యే రామకృష్ణారెడ్డి పరామర్శించేందుకు రాలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పుడు పేదలకు ఇచ్చే ఇళ్ల స్థలాలను పరిశీలించడమేంటని గ్రామస్తులు ఆయనను నిలదీశారు. కాపవరంలో పేదలకు ఇచ్చే స్థలాల మీద నిరాధార ఆరోపణలు చేస్తున్న రామకృష్ణారెడ్డి సమాధానం చెప్పాలంటూ వారంతా కారు ముందు బైఠాయించి ఆందోళన చేపట్టారు. దీంతో అక్కడ కాసేపు గందరగోళ పరిస్థితి నెలకొంది. (చదవండి: ఈఎస్ఐ స్కామ్‌లో ముగిసిన ఏసీబీ విచారణ) -
ఫడ్నవీస్‌కు చేదు అనుభవం
ముంబై: శివసేన వ్యవస్థాపకుడు బాల్ ఠాక్రేకు నివాళులర్పించడానికి స్థానిక శివాజీ పార్క్‌కు వెళ్లిన మహారాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్‌కు చేదు అనుభవం ఎదురైంది. శివాజీ పార్క్ వెలుపల శివసేన కార్యకర్తలు ఫడ్నవీస్‌కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. బాల్ ఠాక్రే 7వ వర్ధంతి సందర్భంగా ఆదివారం శివాజీ పార్క్‌కు సహచర బీజేపీ నేతలతో కలిసి ఫడ్నవీస్ వెళ్లిన సందర్భంగా ఈ ఘటన చోటు చేసుకుంది. ఆ సమయంలో అక్కడ శివసేన సీనియర్ నేతలెవరూ లేరు. పార్టీ చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే వ్యక్తిగత కార్యదర్శి మిలింద్ నర్వేకర్ మాత్రం ఉన్నారు. అంతకుముందు, బాల్ ఠాక్రే ప్రసంగాల వీడియోలను ట్వీటర్లో ఫడ్నవీస్ షేర్ చేశారు. కాగా, బాల్ ఠాక్రేకు బీజేపీ, శివసేన నేతలు వేర్వేరుగా నివాళులర్పించారు. ఉదయం పదిగంటల సమయంలో బాల్ ఠాక్రే కుమారుడు, శివసేన చీఫ్ ఉద్ధవ్ ఠాక్రే తన కుటుంబ సభ్యులతో కలిసి శివాజీ పార్క్‌లో నివాళులర్పించగా, మధ్యాహ్నం ఒంటిగంట సమయంలో బాల్ ఠాక్రేకు నివాళులర్పించేందుకు ఫడ్నవీస్ శివాజీ పార్క్‌కు వెళ్లారు. శివాజీ అందరివాడు ఛత్రపతి శివాజీ ఏ ఒక్క పార్టీకో, ఏ ఒక్క కులానికో చెందినవాడు కాదని శివసేన వ్యాఖ్యానించింది. శివాజీ 11 కోట్ల మరాఠీలకు చెందినవాడని స్పష్టం చేసింది. మరాఠా సామ్రాజ్య స్థాపకుడైన శివాజీ ఆశీస్సులు తమకే ఉన్నాయంటూ బీజేపీ చేస్తున్న ప్రచారాన్ని తిప్పికొడుతూ శివసేన ఎంపీ సంజయ్‌రౌత్, పార్టీ పత్రిక ‘సామ్నా’లో ‘రోక్‌తోక్’ అనే తన కాలమ్‌లో పై వ్యాఖ్యలు చేశారు. ‘ నేడు పవార్, సోనియా భేటీ పుణె: ఎన్సీపీ అధ్యక్షుడు శరద్ పవార్ సోమవారం కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీతో భేటీ కానున్నారు. వీరు ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడంపై చర్చించనున్నారని ఎన్సీపీ నేత నవాబ్ మాలిక్ తెలిపారు. ఎన్సీపీ, కాంగ్రెస్ నేతలు మంగళవారం సమావేశమై, ప్రభుత్వ ఏర్పాటు ప్రాతిపదికలపై చర్చిస్తారన్నారు. -
తహసీల్దార్ హత్య : ‘రూ.2 వేలు ఇవ్వకుంటే గల్లా పడుత’
సాక్షి, భువనగిరి: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన రంగారెడ్డి జిల్లా అబ్దుల్లాపూర్‌మెట్ తహసీల్దార్ చెరుకూరి విజయారెడ్డి హత్యోదంతంతో రెవెన్యూ ఉద్యోగులు భయాందోళనకు గురవుతున్నారు. విజయారెడ్డి హత్యకు నిరసనగా మూడు రోజులపాటు విధులు బహిష్కరించాలని తెలంగాణ రెవెన్యూ ఉద్యోగుల సంఘం అధ్యక్ష, కార్యదర్శు లు వంగా రవీందర్‌రెడ్డి, గౌతమ్‌కుమార్ పిలుపునిచ్చారు. తహసీల్దార్‌ను దారుణంగా హతమార్చిన నిందితుడు సురేష్‌ని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు. అయితే, ఈనేపథ్యంలో నిరసన చేపట్టిన భువనగిరి జిల్లా గుండాల మండల రెవెన్యూ సిబ్బందికి చేదు అనుభవం ఎదురైంది. (చదవండి : పెట్రోల్ పోసి.. నిప్పంటించి..) నిరసనకు దిగిన సిబ్బందిని అక్కడి ప్రజలు నిలదీశారు. అన్నీ పత్రాలు సక్రమంగా తమ పనులు చేయడానికి కార్యాలయం చుట్టూ నెలల తరబడి తిప్పించుకుంటున్నారని ఆరోపించారు. ఈక్రమంలో తన వద్ద రూ.2 వేలు లంచం తీసుకున్నాడంటూ ఓ మహిళ రెవెన్యూ ఉద్యోగిని నిలదీసింది. తన దగ్గర వసూలు చేసిన డబ్బులు ఇవ్వకుంటే గల్లా పట్టి వసూలు చేస్తానని హెచ్చరించింది. ఈవ్యవహారమంతా వీడియో రికార్డింగ్ అవుంతోందని గ్రహించిన సిబ్బంది అక్కడి నుంచి వెళ్లిపోవడం గమనార్హం. (చదవండి : మూడు రోజులు విధుల బహిష్కరణ ) -
కేంద్ర మంత్రికి చేదు అనుభవం
కోల్‌కతా: కేంద్ర మంత్రి, బీజేపీ నేత బాబూల్ సుప్రియోకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమబెంగాల్ రాజధాని కోల్‌కతాలోని జాదవ్‌పూర్ విశ్వవిద్యాలయంలో గురువారం ఓ కార్యక్రమంలో పాల్గొనేందుకు వచ్చిన సుప్రియోను ఎస్ఎఫ్ఐ, ఏఎస్ఐఏ, ఏఎఫ్‌ఎస్‌యూ, ఎఫ్‌ఈటీఎస్‌యూ తదితర వామపక్ష విద్యార్థి సంఘాలు ఘెరావ్ చేశాయి. దీంతో ఆయన్ను కాపాడేందుకు సాక్షాత్తూ గవర్నర్ ధనకర్‌తో పాటు భారీగా పోలీసులు రంగంలోకి దిగాల్సి వచ్చింది. బీజేపీ విద్యార్థి విభాగం ఏబీవీపీ నిర్వహించిన సదస్సుకు హాజరైన సుప్రియో రాకను నిరసిస్తూ భారీసంఖ్యలో విద్యార్థులు నల్లజెండాలు పట్టుకుని నిరసన తెలిపారు. సెమినార్ అనంతరం ఆయన తిరిగివెళుతుండగా కారును అడ్డుకుని వాగ్వాదానికి దిగారు. ఈ సందర్భంగా కొందరు విద్యార్థులు తన జుట్టు పట్టుకుని లాగారనీ, దాడిచేశారని సుప్రియో ఆరోపించారు. అయితే సుప్రియో వర్సిటీ విద్యార్థినులతో దురుసుగా ప్రవర్తించారని ఏఎస్‌ఎఫ్‌యూ నేత దెబ్రాజ్ దేబ్నాథ్ విమర్శించారు. ఈ ఉద్రిక్తత గురించి తెలుసుకున్న గవర్నర్ ధనకర్ హుటాహుటిన విశ్వవిద్యాలయానికి చేరుకుని సుప్రియోను సురక్షితంగా బయటకు తీసుకురాగలిగారు. ఈ ఘటన అనంతరం ఏబీవీపీ కార్యకర్తలు రెచ్చిపోయారు. క్యాంపస్‌లోని ఏఎఫ్‌ఎస్‌యూ కార్యాలయంలోని కంప్యూటర్లు, సీలింగ్ ఫ్యాన్లు, ఫర్నీచర్‌ను ధ్వంసం చేసి నిప్పుపెట్టారు. సుప్రియోపై దాడి వ్యవహారంపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని పశ్చిమబెంగాల్ సీఎస్‌ను గవర్నర్ ఆదేశించారు. -
టీడీపీ అభ్యర్థికి వింత పరిస్థితి!
సాక్షి, చింతలపూడి (పశ్చిమగోదావరి జిల్లా) : రాష్ట్ర వ్యాప్తంగా అధికార టీడీపీకి వ్యతిరేక గాలి వీస్తోందనడానికి ఈ వీడియోనే నిదర్శనం. ఓ పక్క ప్రతిపక్షనేత, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆయన తల్లి విజయమ్మ, సోదరి షర్మిల బహిరంగ సభలతో పాటు పార్టీ అభర్థుల రోడ్‌షోలకు జనం పోటేత్తుతుండగా... మరోవైపు టీడీపీ రోడ్ షోలు మాత్రం జనం లేక వెలవెలబోతున్నాయి. పశ్చిమగోదావరి జిల్లా చింతలపూడి టీడీపీ అభ్యర్ధి కర్రా రాజారావుకు ఆదివారం వింత అనుభవం ఎదురైంది. జంగారెడ్డిగూడెం మండలం ఏ. పోలవరంలో కర్రా రాజారావు రోడ్ షో నిర్వహించగా ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనిపించలేదు. మరోవైపు ఆయన వెంట కూడా ప్రచారంలో ఇద్దరు ముగ్గురు అనుచరులే ఉండటం టీడీపీ దుస్ధితిని తెలియజేస్తోంది. రోడ్ పై ఒక్కరు లేకపోయినా కూడా కర్రా రాజారావు మాత్రం ఖాళీ రోడ్డు, గోడలకు దండం పెడుతూ.. తనకు, ఎంపీగా మాగంటి బాబుకి ఓటు వేయాలని చెప్పుకు పోవడం.. ఆయన వెంట జీపులో ఉన్న ఇద్దరు అనుచరులకి కూడా ఆశ్చర్యం కలిగించింది. కనీసం తెలుగుదేశం కార్యకర్తలు కూడా లేకుండా చింతలపూడి నియోజకవర్గంలో రోడ్ షో జరుగుతున్న తీరు వారి ఓటమికి సంకేతాలని రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. రాష్ట్రంలో ప్రజలు మార్పు కోరుకొంటున్నారని, వైస్ జగన్ సీఎం కావడం కాయమని పేర్కొంటున్నారు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం నెట్టింట హల్చల్ చేస్తోంది. -
ఒక్కరంటే ఒక్కరు కూడా రోడ్డుపై కనిపించలేదు..
-
టీడీపీ ఎమ్మెల్యేకు చేదు అనుభవం..!
సాక్షి, ధర్మవరం: టీడీపీ ధర్మవరం ఎమ్మెల్యే వరదాపురం సూరీకి చేదు అనుభవం ఎదురైంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా గురువారం ఆయన పట్టణంలోని పాండురంగ వీధిలో పర్యటించారు. స్థానిక సమస్యలపైన మహిళలు ఆయన్ను గట్టిగా నిలదీశారు. ‘ఇంటి పట్టాలకోసం ఐదేళ్లలో పది సార్లు అర్జీలు ఇచ్చినాం.. ఇళ్లు లేని వాళ్లకు పట్టాలు ఇవ్వకుండా.. నీ వెనుక తిరిగే వాళ్లకు పట్టాలు ఇచ్చినావ్’ అంటూ ఆయన్ను నిలదీశారు. దీంతో వారికి సమాధానం చెప్పకుండా సూరి దాటేసుకుని వెళ్లిపోయారు. స్థానిక నాయకులు ‘మేమున్నాంలేమ్మా.. మళ్లీ అధికారంలోకొస్తే ఇప్పిస్తాం ’ అని సర్దిచెప్పే ప్రయత్నం చేస్తే.. చూసినాం పోప్పా..’ అంటూ వారిని అక్కడి నుంచి తరిమేసినంత పనిచేశారు. ఈ వ్యవహారానికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది. అక్కడా నిలదీతే.. ప్రభుత్వం నుంచి రావాల్సిన ఒక్క సంక్షేమ పథకాన్ని కూడా తమకు అందేలా చేయలేదని చేనేతలు సైతం గోనుగుంట్ల సూర్యనారాయణ (సూరి)ను నిలదీశారు. ‘చేనేత ముడిపట్టు రాయితీలూ బకాయి ఉంది.. ఇంకేం చేశారని మీకు ఓటు వేయాలి.. ఈ ఐదేళ్లలో మీ ఇంటి వద్దకు ఎన్నిసార్లు తిరిగినాం.. ఒక్క మగ్గం లోన్ అయినా ఇప్పించారా? ఒక్క బీసీ రుణ మైనా మంజూరు చేశారా? ఏమన్నా అంటే మీ వార్డు కౌన్సిలర్‌ను అడుగు, మీవార్డు ఇన్‌చార్జ్‌ను అడుగండి అంటారు’ అని చేనేత అన్నలు ఎమ్మెల్యేను దుయ్యబట్టారు. ఎమ్మెల్యే సర్దిచెప్పే ప్రయత్నం చేస్తున్నా వినకుండా గుక్కతిప్పుకోండా.. టీడీపీ నాయకుల వైఖరిని ఎండగట్టారు. -
తిరుపతి టీడీపీ ఎమ్మెల్యే సుగుణమ్మకు చేదు అనుభవం
-
మంత్రి పితాని పాదయాత్రకు చుక్కెదురు
-
మంత్రి గంటా కారును ఆడ్డుకున్న స్థానికులు: పదిమంది అరెస్ట్
-
మంచిరెడ్డి కిషన్‌రెడ్డికు చేదు అనుభవం
-
ప్రచారంలో మాగంటీ గోపినాథ్‌కు చేదు అనుభవం
-
ఎన్నికల ప్రచారంలో జూపల్లికి చేదు అనుభవం
-
నారాయణుడు కాకున్నా.. నరుడిగానైనా ఉండాలి!!
‘వైద్యో నారాయణో హరి’ అంటారు. వైద్యుడు దేవుడితో సమానం అని! అయితే ‘వైద్యుడు దేవుడు కాకపోయినా పర్వాలేదు.. కనీసం మనిషిగానైనా ఉంటే చాలు’ అనిపిస్తుంది.. చెన్నైలోని ఓ ప్రముఖ ఆసుపత్రిలో ఒక యువతికి ఎదురైన చేదు అనుభవం గురించి తెలిస్తే. అది చెన్నై మహానగరం. వైద్యవిజ్ఞానం అభివృద్ధి చెందిన నగరం. సూపర్ స్పెషాలిటీ హాస్పిటళ్లకు, సూపర్ స్పెషలిస్టులైన డాక్టర్లకు కొదవలేని నగరం. అంతంత చదివిన పెద్ద డాక్టర్లకు.. సంస్కారవంతంగా వ్యవహరించాలనే పాఠం ఎవరూ చెప్పలేదో ఏంటో? పేషెంట్ పట్ల చూపించాల్సిన నిబద్ధత, నైతికతల గురించి ఒక్క పుస్తకంలోనూ రాయలేదో లేక ఆ పుస్తకాన్ని ఆ డాక్టర్ చదవకుండానే కోర్సు పూర్తి చేసుకున్నాడో! మొత్తానికి ఆ డాక్టర్ చేసిన పనికిగాను వివరణ ఇవ్వాల్సిందిగా ఆయన పని చేస్తున్న హాస్పిటల్‌కి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా లీగల్ నోటీసులిచ్చింది. జ్వరంతో హాస్పిటల్‌కి వెళ్తే చెన్నైలో ఓ ఇరవై మూడేళ్ల అమ్మాయి తీవ్రమైన జ్వరంతో ఓ పెద్ద హాస్పిటల్‌కి వెళ్లింది. అది నగరంలో మంచి పేరున్న హాస్పిటలే. ఆమెను హెచ్డియు (హై డిపెండెన్సీ యూనిట్)లో చేర్చారు. ఆమెను పరీక్షించడానికి వచ్చింది మగడాక్టరు. ఆ సమయానికి డ్యూటీలో ఉన్నది అతడొక్కడే కాబట్టి పేషెంట్లకు మరో మార్గంలేదు. ఆమెను పరీక్షిస్తూ అనుచితంగా ప్రవర్తించాడు. వైద్య పరీక్ష నెపంతో దేహ భాగాలను ప్రైవేట్ పార్ట్స్‌ను తాకినట్లు ఆమె ఆరోపిస్తోంది. వైద్య పరీక్షల కోసం దేహాన్ని తాకడానికి, దురుద్దేశంతో తాకడానికి మధ్య తేడా తెలియని వయసు కాదామెది. ‘హాస్పిటల్లో తనకు తోడుగా తన వాళ్లెవరినీ అనుమతించలేదని, కనీసం తన ఫోన్‌ను కూడా లోపలికి తెచ్చుకోనివ్వలేదని చెబుతూ, డాక్టర్ పరీక్షిస్తున్నంత సేపు నిస్సహాయంగా దిక్కులేని దానిలాగ ఉండిపోవాల్సి వచ్చింది’ అంటోందామె.‘డాక్టర్ చేతలు అర్థమవుతున్నా తన దేహం అచేతనంగా ఉండటంతో అతడి చేతిని తోసేయడానికి కూడా తన చేయి లేవలేదని, మనసు పెనుగులాడుతున్నా దేహం సహకరించని స్థితిలో ఉండిపోయానని’ చెప్తోందామె. జ్వరంతో ఉన్న పేషెంట్‌కి వైద్యం చేసే ప్రక్రియలో జననాంగాల్ని తడమాల్సిన అవసరమేంటని ప్రశ్నిస్తూ హాస్పిటల్ యాజమాన్యానికి రాతపూర్వకంగా కంప్లయింట్ ఇచ్చింది. నోరు మెదపని హాస్పిటల్ కంప్లయింట్ ఇచ్చి నెల దాటినా కూడా హాస్పిటల్ నుంచి ఆమెకు ఎటువంటి సమాధానం రాలేదు. దాంతో ఆమె కుటుంబం ఈసారి మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా (ఎమ్‌సిఐ)కు కంప్లయింట్ ఇచ్చింది. మెడికల్ కౌన్సిల్ స్పందించింది. డాక్టర్ చర్యలను, హాస్పిటల్ నిర్లక్ష్య ధోరణిని తప్పుపడుతూ ఆ హాస్పిటల్‌కి లీగల్ నోటీసు జారీ చేసింది. పెద్ద భవనాలతో అధునాతనంగా కట్టిన ఆ కార్పొరేట్ వైద్యశాలకు, అందులోని డాక్టర్‌కీ ఇప్పుడైనా పేషెంట్లతో ఎలా వ్యవహరించాలనే పాఠం ఒకటుంటుందని, దానిని కూడా చదవాలనే స్పృహ కలుగుతుందో లేదో? ఇలాంటివి చూస్తుంటే ఆడపిల్లలకు రక్షణ ఎక్కడా ఉండదా అనే ప్రశ్న మళ్లీ మళ్లీ వేసుకోవాలనిపిస్తుంది. గుడ్‌టచ్, బ్యాడ్ టచ్ ఏదో తెలియని వయసులో పరిచితుల స్పర్శలు కంపరం పుట్టిస్తాయి. చదువుకోవాలంటే టీచర్ల నుంచి, ఉద్యోగాలకు వెళ్తే పై అధికారుల నుంచి లైంగిక వేధింపులు, న్యాయం కోసం పోలీస్ స్టేషన్‌కెళ్తే అక్కడా వేధింపులు తప్పడం లేదు. ఆఖరుకి అనారోగ్యంతో హాస్పిటల్‌కి వెళ్లినా ఇదే తీరైతే... ఇక మహిళకు రక్షణ ఎక్కడ? ఆరోగ్యాన్ని బాగు చేసి పునర్జన్మనిచ్చిన డాక్టర్లో దేవుణ్ని చూస్తారు పేషెంట్లు. చేతులెత్తి మొక్కాలనుకుంటారు. వైద్యుడిలో దేవుడు లేకపోయినా ఫర్వాలేదు, మనిషి లేకపోతేనే కష్టం. చట్టం ఏం చెబుతోంది? మెడికల్ కౌన్సిల్ రెగ్యులేషన్స్, 2002, మెడికల్ కౌన్సిల్ యాక్ట్, 1956 ప్రకారం పేషెంట్‌కి కొన్ని హక్కులుంటాయి. ఇలాంటి డాక్టర్లున్న చోట ఆ హక్కులను సాధించుకోవడానికి వెనుకాడాల్సిన అవసరమే లేదు. ముఖ్యంగా పేషెంట్లు మహిళలై, డాక్టర్ మగవారు అయితే మెడికల్ కౌన్సిల్ అనుమతిస్తున్న ఈ హక్కుల గురించి తెలుసుకోవడం అవసరం. పేషెంట్ మత సంప్రదాయాలకు భంగం కలగని విధంగా వైద్య పరీక్షలు నిర్వహించాలి. ఆ మేరకు పేషెంట్ మత విశ్వాసాలను గౌరవించాలి. పేషెంట్‌కి అవసరమైన వైద్యం, అందుకు అవసరమైన పరీక్షల వివరాలను తెలియచేయాలి. దేహాన్ని ముట్టుకునేటప్పుడు ఎందుకు తాకాల్సి వస్తుందనే విషయాన్ని పేషెంట్‌కి చెప్పాలి.పేషెంట్‌ని పరీక్షించేటప్పుడు వారికి సహాయంగా వచ్చిన వారిని కూడా అనుమతించాలి. అలా ఎవరూ లేకపోతే ఎగ్జామినేషన్ గదిలో డాక్టరు, పేషెంట్‌తోపాటు మహిళానర్సు కూడా ఉండాలి. ప్రతి హాస్పిటల్లోనూ కంప్లయింట్స్ కమిటీ ఉండాలి. ఆ కమిటీ పేషెంట్ల నుంచి ఎదురైన వినతులు, విజ్ఞప్తులు, ఆరోపణలను విచారించి నిర్ణీత గడువులోపల తీర్పు చెప్పాలి. హాస్పిటల్లో డాక్టర్లు, ఇతర వైద్యసేవలందించే ఉద్యోగులందరికీ అప్పాయింట్మెంట్ లెటర్లో ఎంసిఐ విధి విధానాలన్నీ పొందుపరిచి ఉంటాయి. విధి నిర్వహణలో ఏ మాత్రం అనుచితంగా ప్రవర్తించినట్లు నిర్ధారణ అయిన వెంటనే వారిని ఉద్యోగం నుంచి తొలగించవచ్చు. వైద్యసేవలను మినహాయించి మరేవిధమైన సంబంధాలను (పేషెంట్లతో ఫోన్లో మాట్లాడటం, బహుమతులివ్వడం, వారితో కలిసి భోజనం చేయడం, ట్రీట్మెంట్ సమయంలో పుస్తకాలు ఇచ్చిపుచ్చుకోవడం, సన్నిహితంగా మెలగడం, లైంగిక కలయిక) కొనసాగించడానికి ప్రయత్నించినా కూడా అది తప్పే. – మంజీర -
టీఆర్ఎస్ తాజా మాజీ ఎమ్మెల్యేలకు ప్రచారంలో నిరసన సెగ
-
రజనీకాంత్..! ఎవరు నువ్వు?
సాక్షి, న్యూఢిల్లీ : తమిళనాడులోని తూత్తుకుడిలో జరిగిన అమానుష పోలీసు కాల్పులపై రాజకీయ నాయకుడిగా మారిన సినీ నటుడు రజనీకాంత్ మాట మార్చి ప్రజల ముందు, ముఖ్యంగా సోషల్ మీడియాలో అభాసు పాలయ్యారు. పోలీసుల కాల్పుల సంఘటన జరిగిన మే 22వ తేదీన వారి అమానుషత్వాన్ని విమర్శిస్తూ రజనీకాంత్ ఓ చిన్న వీడియాను విడుదల చేశారు. పోలీసు కాల్పుల్లో గాయపడి తూత్తుకుడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితులను పరామర్శించడానికి ఆయన బుధవారం అక్కడికి వెళ్లినప్పుడు ఓ బాధితుడి నుంచి ఆయనకు ఊహించని ప్రశ్న ఎదురయింది. ‘ఎవరు నువ్వు?’ అన్నదే ఆ ప్రశ్న. దీంతో కంగుతిన్న రజనీకాంత్, అక్కడ తన పేరు చెప్పుకొని త్వరత్వరగా పరామర్శ కార్యక్రమాన్ని ముగించుకొని ఆస్పత్రి బయటకు వచ్చారు. ‘సంఘ వ్యతిరేక శక్తులు, సంఘ విద్రోహ శక్తులు నిరసనలో పాల్గొన్నారు. వారు పోలీసులపై రాళ్లు రువ్వడం వల్ల పోలీసులు కాల్పులు జరపాల్సి వచ్చింది’ అని రజనీకాంత్ తన అంతుకుముందటి వైఖరి మార్చుకొని మీడియా ముందు వ్యాఖ్యానించారు. దివంగత ముఖ్యమంత్రి జయలలిత తన పాలనలో ఇలాంటి శక్తులు తలెత్తకుండా చేశారని, ఆమె తరహాలో ప్రస్తుత ఏఐఏడిఎంకే ప్రభుత్వం సంఘ విద్రోహ శక్తులను ఉక్కుపాదంతో అణచివేయాలని కూడా ఆయన పిలుపునిచ్చారు. నిరసన ప్రదర్శనలో సంఘ విద్రోహ శక్తులు ఉన్నారన్న విషయం తమకు ఎలా తెలుసు, ఎలా ధ్రువీకరించుకున్నారంటూ మీడియా అడిగిన ప్రశ్నకు తడబడిన ఆయన ‘ఆ...నాకు తెలుసు’ అంటూ అక్కడి నుంచి నిష్క్రమించారు. ఇలా మాట మార్చడంపై సోషల్ మీడియాలో రజనీకాంత్‌కు వ్యతిరేకంగా విమర్శలు వెల్లువెత్తాయి. ‘పక్కా బీజేపీ తొత్తువి’, ‘ఏలియన్ హిందూత్వ’ అంటూ ట్వీట్లు పేలాయి. వేదాంత గ్రూప్‌నకు చెందిన తూత్తుకుడి స్టెరిలైట్ కాపర్ కంపెనీకి వ్యతిరేకంగా జరిగిన ఆందోళనలో టెర్రరిస్టులు, నక్సలైట్లు పాల్గొన్నారని బీజేపీ నాయకులు విమర్శించడం తెల్సిందే. మోదీకి, బీజేపీకి వేదాంత గ్రూప్ ఇష్టమైన సంస్థ అవడమే వారి విమర్శలకు కారణం ఏమో! అయినా మాట మార్చడం రజనీకాంత్‌కు కొత్త కాదు. జయలలిత తుదిశ్వాస వరకు ఆమెను నిజమైన ‘అమ్మ’ అంటూ ప్రశంసించిన ఆయన 1996లో జయలలితకు ఓటు వేయరాదంటూ తమిళనాడు ప్రజలకు పిలుపునిచ్చారు. ఆమె గనుక గెలిస్తే తమిళనాడు రాష్ట్రాన్ని ఆ భగవంతుడు కూడా కాపాడలేరంటూ విమర్శించారు. రీల్ హీరోగా, రియల్ హీరోగా వేరు చాలా మందిలాగానే సినిమాలో హీరోగా కనిపించే రజనీకాంత్ వేరు. నిజ జీవితంలో రజనీ వేరు. జూన్ ఏడవ తేదీన విడుదలవుతున్న ‘కాలా’ చిత్రంలో రజనీ ప్రజల నిరసన ప్రదర్శనలను ప్రోత్సహిస్తారు. పేద వారి శరీరాలే ఆయుధాలంటారు. తూత్తుకుడిలో ప్రదర్శన జరిపిన ప్రజలనేమో సంఘ విద్రోహశక్తులన్నారు. ‘ఎవరు నువ్వు’ అంటూ ఓ బాధితుడు అన్నందుకు కోపం వచ్చి రజనీకాంత్ మాటమార్చారని అనుకోరాదు. ఒకవేళ అదే కారణం అయితే ఇప్పుడిప్పుడే రాజకీయాల్లోకి వస్తున్న ఆయన ఇక రాణించలేరు. అరాచకవాదులు, తీవ్రవాదులు, సంఘ విద్రోహశక్తులు తూత్తుకుడి ప్రదర్శనలో ఉన్నారని రజనీకాంత్ అత్యంత సన్నిహితుడు, ఆరెస్సెస్ సభ్యుడు, తుగ్లక్ మాగజైన్ ఎడిటర్ ఎస్. గురుమూర్తి ఆరోపించారు. రజనీ కూడా సంఘ విద్రోహ శక్తులంటూ మాట మార్చడంతో ఆయన ట్వీట్ల మీద ట్వీట్లతో రజనీకాంత్‌ను ప్రశంసించారు. ‘ఎవరు నువ్వు?’ అంటూ బాధితుడు వేసిన ప్రశ్న రజనీకాంత్‌కు సరిగ్గా అర్థం కానట్లు ఉంది. తనదీ ఆద్యాత్మిక రాజకీయమంటూ చెప్పుకుంటున్న రజనీకాంత్ ఎవరి పక్షమని, ఏ పార్టీ పక్షం అన్నదే ప్రశ్న. ఆధ్యాత్మికమంటే హిందూత్వమనేదే అర్థమని, రజనీకాంత్ బీజేపీ పక్షమంటూ విమర్శలు వస్తూనే ఉన్నాయి. ఈ విషయాన్ని ఆయన బహిరంగంగా ఒప్పుకోవాలన్నదే బాధితుడి ప్రశ్న. -
ఎమ్మెల్యే హాస్యనటుడు బాబూ మోహన్‌కు చుక్కెదురు
-
చేదు అనుభవాల్ని వెల్లడించిన హీరోయిన్
సాక్షి, న్యూఢిల్లీ: బాలీవుడ్లో తన తొలి సినిమా ‘దేవ్ డీ’ తో మంచి మార్కులు కొట్టేసిన మహీ గిల్.. సినిమా రంగంలో దుమారం రేపుతున్న క్యాస్టింగ్ కౌచ్ పై స్పందించారు. సినిమాల్లో అవకాశాల కోసం వెళ్లినప్పుడు నిర్మాతలు, దర్శకులు, హీరోలు... అమ్మాయిలతో వ్యవహరించే తీరును ఆమె ఎండగట్టారు. ఒక జాతీయ పత్రికకు ఇచ్చిన ఇంటర్వ్యూలో తనకు ఎదురైన చేదు అనుభవాలను మహీ గిల్ వెల్లడించారు. సినిమా ఛాన్సుల కోసం తిరిగే సమయంలో ఒక సినీ నిర్మాత తన పట్ల అనుచితంగా ప్రవర్తించిన తీరును ఆమె గుర్తు చేసుకున్నారు. కెరీర్ ప్రారంభంలో సినిమాలో అవకాశం కోసం ఒక దర్శకుని దగ్గరకు వెళ్లినప్పుడు ‘సల్వార్ కమీజ్ ధరించి ఇలా నిండుగా వస్తే ఎవరూ నీకు అవకాశాలు ఇవ్వర’ని అతను హేళనగా మాట్లాడిన సందర్భాన్ని వివరించారు. మరోసారి ఓ నిర్మాతను సంప్రదించడానికి వెళ్లినప్పుడు ‘నువ్ నైటీలో ఎలా ఉంటావో చూసిన తర్వాతే నీకు సినిమాలో అవకాశం ఇవ్వడం గురించి ఆలోచిస్తాన’ని వెకిలిగా, అసభ్యంగా మాట్లాడిన తీరును వెల్లడించారు. తనకు ఎదురైన చేదు అనుభవాలతో ....క్యాస్టింగ్ కౌచ్ రొంపిలోకి దిగకుండా జాగ్రత్త పడ్డానని తెలిపారు. సమాజంలో ఇలాంటి కామ పిశాచాలకు కొదవ లేదని మండిపడ్డారు. తనతో చెడుగా వ్యవహరించిన ఆ సినీ ప్రముఖుల పేర్లు వెల్లడించలేనని మహీ అన్నారు. కాగా, ‘దేవ్ డీ’ లో తన అద్భుత నటనతో మహీ 2010లో ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డు అందుకున్నారు. స్త్రీలపై కొనసాగుతున్న పురుషాధిక్య సమాజపు ఆగడాలే ఇతివృత్తంగా ‘దేవ్ డీ’ రూపుదిద్దుకుంది. -
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
-
ఏపీ మంత్రులకు షాకిచ్చిన మహిళ
సాక్షి, ఏలూరు : ఏపీ మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావులకు చేదు అనుభవం ఎదురైంది. పశ్చిమ గోదావరి జిల్లా ఏలూరు ఫైర్ స్టేషన్ సెంటర్లో జరిగిన బాబు జగ్జీవన్‌రామ్ విగ్రహావిష్కరణ సభలో భాగంగా ఓ మహిళ ఇద్దరు మంత్రులకు షాకిచ్చారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు, ప్రతిపక్షనేత వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై మంత్రి జవహార్ విమర్శలు, తప్పుడు ఆరోపణలు చేస్తుండగా కార్యక్రమంలో పాల్గొన్న ఓ మహిళ ధైర్యంగా మంత్రి ప్రసంగాన్ని అడ్డుకున్నారు. అవినీతి గురించి మాట్లాడే అర్హతే మీకు లేదంటూ సభలో నిలదీశారు. దీంతో అవాక్కవ్వడం వేదిక మీదున్న మంత్రుల వంతయింది. వైఎస్ జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేసిన ఆ మహిళ.. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి గానీ, వైఎస్ జగన్ గానీ ఎలాంటి అవినీతికి పాల్పడలేదని పేర్కొన్నారు. వైఎస్ జగన్ నిజాయితీ పరుడు, ఆయన గురించి తప్పుడు ఆరోపణలు, విమర్శలు చేస్తే ఊరుకునేది లేదంటూ మంత్రులను సభలోనే కడిగిపారేశారు. వైఎస్ జగన్ ఎలాంటి తప్పు చేయలేదని, జై జగన్ జిందాబాద్ అంటూ నినాదాలు చేయడంతో దిక్కుతోచని పరిస్థితుల్లో మంత్రులు జవహర్, ప్రత్తిపాటి పుల్లారావుతో పాటు స్థానిక ఎమ్మెల్యే బుజ్జి సభ నుంచి అర్ధాంతరంగా వెళ్లిపోయారు. -
పశ్చిమగోదవరిలో రసాబాసగా దళితతేజం కార్యక్రమం
-
బస్సు యాత్రలో రాహుల్‌కు చేదు అనుభవం
-
సీపీఐ నారాయణకు చేదు అనుభవం
సాక్షి, అమరావతి : సీసీఐ జాతీయ కార్యదర్శి నారాయణకు వెలగపూడిలో చేదు అనుభవం ఎదురైంది. గురువారం ఉదయం ఆయన సైకిల్ తొక్కుకుంటూ వెలగపూడి సచివాలయం ప్రాంగణంలోకి వచ్చారు. అయితే నారాయణను మధ్యలోనే ఎస్పీఎఫ్ సిబ్బంది అడ్డుకున్నారు. ఈ సమయంలో ఎవరూ ఉండరని, సైకిల్‌పై లోపలికి అనుమతి ఇవ్వబోమంటూ భద్రతా సిబ్బంది ...ఆయనను బయటకు పంపేశారు. అయితే ఏదో సరదాగా అసెంబ్లీ చూద్దామని వస్తే సెక్యూరిటీ సిబ్బంది అడ్డుకోవడంతో నారాయణ అసంతృప్తి వ్యక్తం చేశారు. అధికార పార్టీ గుర్తైన సైకిల్‌పైనే తాను వస్తే అనుమతించకపోవడంతో ఆయన ఒకింత నిరుత్సాహానికి గురయ్యారు. అయినప్పటికీ ఉండబట్టలేక నారాయణ అసెంబ్లీ, సచివాలయం ముందు కాసేపు సైకిల్‌పై చక్కర్లు కొట్టారు. అలా అటూ ఇటూ తిరిగి తిరుగు పయనం అయ్యారు. ఇంతలో ఆయనకు మధ్యలో కల్లు కనిపించేసరికి టక్కున ఆగిపోయారు. వెంటనే సైకిల్ దిగి ఓ గ్లాస్ కల్లు గటగటా తాగేశారు. -
ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు చేదు అనుభవం
-
మంత్రి కామినేనికి అవమానం
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి కామినేని శ్రీనివాస్‌కు అవమానం జరిగింది. ఉండవల్లి కరకట్ట మీదకు వెళ్లే రహదారి వద్ద పోలీసులు ఓవర్ యాక్షన్ చేశారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నివాసానికి వెళ్లే రోడ్డులో ...సెక్యూరిటీ పేరు చెప్పి మంత్రి వాహనాన్ని మంగళవారం ఉదయం భద్రతా సిబ్బంది నిలిపివేశారు. అసెంబ్లీకి అటువైపుగా దారి లేదంటూ మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకున్నారు. బ్యారికేడ్లు పెట్టి మంత్రి కామినేని శ్రీనివాసరావు, నలుగురు ఎమ్మెల్యేల కార్లను ఆపారు. మంత్రి అయినా, ఎమ్మెల్యే అయినా పంపేది లేదని గన్మన్లతో వాగ్వివాదానికి దిగారు. 15 నిమిషాలపాటు మంత్రులు, ఎమ్మెల్యేలు అక్కడే ఉండిపోయారు. మరోవైపు సీఎం ఇంటికెళ్లే కరకట్ట మార్గంలో పోలీసులు అడుగడుగునా ఆంక్షలు విధించారు. రాజధాని ప్రాంత ప్రజలను కూడా అటువైపు నుంచి రాకపోకలు సాగనివ్వకుండా పోలీసులు అడ్డుకుంటున్నారు. కాగా కరకట్ట రోడ్డుపై మంత్రులు, ఎమ్మెల్యేల వాహనాలను పోలీసులు అడ్డుకోవడంపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు సీరియస్ అయ్యారు. పోలీసులను వివరణ కోరారు. దీంతో గుంటూరు రూరల్ ఎస్పీ వెంకట అప్పలనాయుడు అసెంబ్లీకి వచ్చి స్పీకర్‌కు వివరణ ఇచ్చారు. పోలీసుల తీరుపై స్పీకర్ అసంతృప్తి వ్యక్తం చేస్తూ ఇలాంటి ఘటనలు పునరావృతం కావద్దని ఆదేశించారు. గతంలో శ్రీకాకుళం జిల్లా పలాస ఎమ్మెల్యే గౌతు శ్యామ్ సుందర్ శివాజీకి కూడా ఇటువంటి సంఘటనే ఎదురైంది. గత అసెంబ్లీ సమావేశాల సందర్భంగా ఆయన కరకట్టపై నుంచి శాసనసభకి వెళ్లేందుకు పోలీసులు అనుమతి నిరాకరించిన విషయం తెలిసిందే. దాంతో శివాజీ పోలీసుల వైఖరికి నిరసనగా కరకట్ట దగ్గర రోడ్డుపైనే సుమారు గంటపాటు ధర్నా చేశారు. -
సింధుకు చేదు అనుభవం
న్యూఢిల్లీ: బ్యాడ్మింటన్‌లో ఒలింపిక్స్ రజత పతక విజేత పీవీ సింధుకు శనివారం ఇండిగో ఎయిర్‌లైన్స్‌కు చెందిన విమానంలో చేదు అనుభవం ఎదురైంది. హైదరాబాద్ నుంచి ముంబైకి ఇండిగో విమానంలో వెళ్తుండగా సంస్థకు చెందిన క్షేత్రస్థాయి సిబ్బందిలో ఒకరు తనతో దురుసుగా ప్రవర్తించారని ఆమె ట్వీటర్ ద్వారా తెలిపారు. ‘గ్రౌండ్ స్టాఫ్ అజితీశ్ నాతో చాలా దురుసుగా, అమర్యాదగా ప్రవర్తించాడు. ప్రయాణికులతో అలా మాట్లాడవద్దని ఎయిర్‌హోస్టెస్ అతనికి సూచించగా, ఆమెతోనూ అనుచితంగా వ్యవహరించాడు. ఇలాంటి వాళ్లు ఇండిగోలో పనిచేస్తూ ఆ సంస్థకు చెడ్డపేరు తీసుకొస్తున్నారు’ అని ట్వీటర్ పోస్ట్‌లో సింధు వివరించారు. అయితే ఇండిగో సంస్థ తమ ఉద్యోగికి మద్దతుగా నిలుస్తూ ‘సింధు అనుమతించిన దాని కన్నా అధిక లగేజీతో విమానమెక్కారు. అది ఆమె సీటు పైన ఉన్న క్యాబిన్లో పట్టడం లేదు. దానిని విమానంలోని కార్గోకు తరలిస్తామంటే ఆమె ఒప్పుకోలేదు. ప్రయాణికులెవరైనా ఎక్కువ సామానును తీసుకొస్తే మేం ఈ విధానాన్నే పాటిస్తాం. కానీ సింధు తన లగేజీ తనతోనే ఉండాలని పట్టుబట్టారు. చివరకు ఆమెను ఎంతగానో అభ్యర్థించి లగేజీని కార్గోకు తరలించాం. ఈ వ్యవహారం సాగుతున్నంత సేపు ఆమె ఆరోపణలు చేస్తున్న మా ఉద్యోగి మౌనంగానే ఉన్నారు’ అని ఓ ప్రకటనలో తెలిపింది. అజితీశ్ ఓ ఉద్యోగిగా తన బాధ్యతలను మాత్రమే నిర్వర్తించారనీ, సింధు ఈ విషయాన్ని గుర్తిస్తారని తాము ఆశిస్తున్నట్లు సంస్థ పేర్కొంది. -
దురుసుగా మైక్ లాక్కున్న చినరాజప్ప
-
మంత్రి అయ్యన్నకు చేదు అనుభవం
అమరావతి: ఎస్ఆర్ఎం యూనివర్శిటీ ప్రారంభోత్సవంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి అయ్యన్నపాత్రుడుకు శనివారం చేదు అనుభవం ఎదురైంది. మంత్రి అయ్యన్నపాత్రుడిని పోలీసు సిబ్బంది లోనికి వెళ్లనీయకుండా అడ్డుకున్నారు. మంత్రిననే విషయం ఆయనే స్వయంగా చెప్పినా బారికేడ్లు తొలగించేందుకు నిరాకరించారు. దీంతో ఆయన ఆగ్రహంతో వెనుదిరిగారు. ఈ సందర్భంగా అయ్యన్న మాట్లాడుతూ...రాజకీయ నాయకులకు అవమానాలు, గౌరవాలు సహజమేనన్నారు. అయితే ఈ విషయం తెలుసుకున్న కలెక్టర్ కోన శశిధర్ ...మంత్రి అయ్యన్నకు ఫోన్ చేశారు. తిరిగి కార్యక్రమానికి హాజరు కావాలని మంత్రిని కోరినప్పటికీ ఆయన నిరాకరించారు. అయ్యన్నతోపాటు పలువురు అతిథులను.. ప్రముఖులను కూడా లోపలికి వెళ్లకుండా గుంటూరు పోలీసులు ఇబ్బందులకు గురి చేశారు. మరోవైపు మంత్రి గంటా శ్రీనివాసరావే ఇలా చేయించారని అయ్యన్న వర్గీయులు మండిపడుతున్నారు. విశాఖ భూ కబ్జాల వ్యవహారంలో మంత్రులు గంటా, అయ్యన్న మధ్య విభేదాలు తారాస్థాయికి చేరిన విషయం తెలిసిందే. -
ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి చేదు అనుభవం
హైదరాబాద్ : తెలుగుదేశం పార్టీ ఎంపీ జేసీ దివాకర్ రెడ్డికి శంషాబాద్ విమానాశ్రయంలో చేదు అనుభవం ఎదురైంది. ఆదివారం ఉదయం హైదరాబాద్ నుంచి విజయవాడ వెళ్లేందుకు విమానాశ్రయానికి వచ్చిన ఆయన ట్రూ జెట్ విమానంలో ప్రయాణించేందుకు టికెట్ కోసం యత్నించారు. అయితే ట్రూ జెట్ ఎయిర్‌లైన్స్ అధికారులు మాత్రం ఎంపీ జేసీకి టికెట్ ఇచ్చేందుకు నిరాకరించడంతో చేసేదేమీ లేక ఆయన వెనుదిరిగారు. కాగా ఇండిగో ఎయిర్ లైన్స్ సిబ్బందిపై దాడి చేసిన ఎంపీ జేసీ దివాకర్ రెడ్డి పై విమానయాన సంస్థలు నిషేధం విధించిన విషయం తెలిసిందే. తమ సంస్థల విమానాల్లో ప్రయాణించకూడదని ఆంక్షలు పెట్టాయి. తమ సిబ్బందిపై దాడి చేసినందుకు ఇండగో నిషేదం విధించగా.. ఈ నిర్ణయానికి మద్దతుగా ఎయిర్ ఇండియా, స్పైస్ జెట్, జెట్ ఎయిర్వేస్ కూడా నిషేధాన్ని అమలు చేశాయి. బోర్డింగ్ పాస్ ఇవ్వడం లేదంటూ విశాఖ ఎయిర్ పోర్టులో ఇండిగో సిబ్బందిపై జేసీ దివాకర్ రెడ్డి దాడి చేసి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. -
మంత్రి లోకేశ్‌కు చేదు అనుభవం
విజయవాడ: ఐటీ, పంచాయతీ శాఖ మంత్రి నారా లోకేశ్‌కు చేదు అనుభవం ఎదురైంది. గుంటూరు, కృష్ణాజిల్లా సుబాబుల్ రైతులు మంగళవారం మంత్రి లోకేశ్‌ను కలిశారు. మూడేళ్ల నుంచి తమ డబ్బుల కోసం మార్కెట్ యార్డ్ చుట్టూ తిరుగుతున్నా న్యాయం జరగడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ, రేపు డబ్బులు ఇస్తామని తిప్పుతున్నారంటూ రైతులు ఆవేదన చెందారు. 310మంది రైతులకు సుమారు రూ.10 కోట్లు వరకూ రావాలని వారు తెలిపారు. డబ్బులు లేక ఇబ్బందులు పడుతున్నామని రైతులు కంటతడి పెట్టారు. తమ బాధలు చెప్పుకుంటున్న రైతులపై మంత్రి లోకేశ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కొంత సమయం ఓపిక పట్టాలని ఆయన రైతులకు సూచించారు. అయితే ఇంకెంతకాలం తాము ఓర్పుగా ఉండాలని రైతులు...మంత్రి లోకేశ్‌ను సూటిగా ప్రశ్నించారు. -
విశాఖ టూర్లో చినబాబుకు చేదు అనుభవం
-
కేకేకు చేదు అనుభవం.. గెటవుట్ నినాదాలు
హైదరాబాద్: టీఆర్ఎస్ పార్టీ ఎంపీ కేకే(కే కేశవరావు)కు చేదు అనుభవం ఎదురైంది. ఉస్మానియా విశ్వవిద్యాలయంలోకి అడుగుపెట్టిన ఆయనను విద్యార్థులు నిరసనలతో చుట్టుముట్టారు. కేకే గెటవుట్ అంటూ నినాదాలు చేశారు. దీంతో కాస్తంత ఉద్రిక్త వాతావరణం నెలకొంది. ఓయూలో పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో పాల్గొనేందుకు మంగళవారం కేకే యూనివర్సిటీకి వచ్చారు. ఈ సందర్భంగా ఆర్ట్స్ కాలేజీలోని ప్రిన్సిపల్ చాంబర్లో జరిగిన ఓ కార్యక్రమంలో పాల్గొన్నారు. అనంతరం ఓయూ ఉత్సవాల కమిటీతో మాట్లాడి బయటకు వస్తుండగా అప్పటికే అక్కడ ఉన్న వివిధ విద్యార్థి సంఘాల నేతలు కేకేను చుట్టుముట్టారు. తెలంగాణ వచ్చి టీఆర్ఎస్ ప్రభుత్వం ఏర్పడి మూడేళ్లు అవుతున్నా ఇప్పటి వరకు ఉద్యోగాలు భర్తీ ప్రక్రియ చేపట్టలేదని, ఒక్క నోటిఫికేషన్ ఇవ్వలేదని, ఇచ్చిన నోటిఫికేషన్ కూడా వెనుకకు తీసుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తూ ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. కేకే గెటవుట్ అంటూ ఆయనపైకి వందలాదిమంది విద్యార్థులు దూసుకెళ్లారు. అయితే, ఈ విషయాన్ని శాంతంగా మాట్లాడుకుందామని కేకే చెబుతున్నా వారు వెనుకకు తగ్గలేదు. దీంతో అప్రమత్తమైన కేకే భద్రతా సిబ్బంది, అక్కడ ఉన్న పోలీసులు విద్యార్థులను అడ్డుకున్నారు. ఈ క్రమంలో వారి మధ్య చిన్నపాటి తోపులాట చోటుచేసుకుంది. -
ఎమ్మెల్యే రాజయ్యకు చేదు అనుభవం
-
మంత్రి మృణాళినికి చేదు అనుభవం
విజయవాడ (ఇంద్రకీలాద్రి) : దసరా ఉత్సవాల్లో భాగంగా లలితా త్రిపుర సుందరీదేవి అలంకరణలోని దుర్గమ్మను దర్శించుకునేందుకు విచ్చేసిన మంత్రి మృణాళినికి చేదు అనుభవం ఎదురైంది. మంత్రి దంపతులు అమ్మవారి దర్శనం కోసం గురువారం ఆలయ ప్రాంగణానికి చేరుకున్నా ఆలయ అధికారులు, రెవెన్యూ అధికారులు గుర్తించలేదు. అంతరాలయంలోని వీఐపీలు వెళ్లే మార్గం వద్ద పోలీసులు ఉన్నా మంత్రిని గుర్తించకపోవడంతో ఆమె కొంత సేపు ఆరుబయటే ఉండిపోయారు. కొంత సేపటి తరువాత మంత్రిని గుర్తించిన సెక్యూరిటీ సిబ్బంది ఆమెను ఆలయంలోకి తీసుకెళ్లారు. గతంలో ఇదే తరహా ప్రొటోకాల్ వ్యవహారంలో దుర్గగుడి ఈవోలతో పాటు అధికారులపై వేటు పడింది. అయినా అధికారుల తీరు మారలేదనేందుకు ఇదే చక్కటి ఉదాహరణ అని మంత్రి అనుచరులు బహిరంగంగానే విమర్శించారు. -
రమ్య కుటుంబ సభ్యులకు మరో షాక్
రమ్య పిన్ని ప్రయాణిస్తున్న కారును బైక్‌తో ఢీకొన్న మైనర్ హైదరాబాద్: ర్యాష్ డ్రైవింగ్ కారణంగా మృత్యువాత పడిన చిన్నారి రమ్య కుటుంబానికి మరో చేదు అనుభవం ఎదురైంది. మూడు నెలల క్రితం మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల పంజగుట్టలో జరిగిన రోడ్డు ప్రమాదంలో చిన్నారి రమ్య, బాబాయ్ రాజేశ్, తాతయ్య చనిపోరుున విషయం తెలిసిందే. ఆ ప్రమాదంలో చనిపోరుున రాజేశ్ భార్య(రమ్య పిన్ని) శిల్ప.. తన అక్కా, బావతో కలసి మంగళవారం కాప్రా నుంచి నల్లగొండకు కారులో వెళ్తుండగా.. బైక్‌పై దూసుకువచ్చిన ఓ మైనర్ వారి కారును ఢీ కొట్టాడు. పంజగుట్ట ప్రమాదంతో భయం.. భయంగా ఉన్న శిల్ప తాజా ప్రమాదంతో షాక్‌కు గురయ్యారు. కుషారుుగూడ పోలీస్‌స్టేషన్ పరిధిలో చోటు చేసుకున్న ఈ ఘటనలో బైక్ నడుపుతున్న బాలునికి స్పల్ప గాయాలయ్యాయి. ఈ సందర్భంగా రమ్య పిన్ని శిల్ప మీడియాతో మాట్లాడుతూ.. మైనర్ల ర్యాష్ డ్రైవింగ్ వల్ల తమ కుటుంబంలో చోటు చేసుకున్న మూడు మరణాలతో ఇప్పటికీ తామంతా కుంగిపోతున్నామని, ఆ షాక్ నుంచి తేరుకోలేక ఇంట్లోనే ఉంటున్నామని చెప్పారు. ఎంతకాలం ఇలా కుమిలిపోతావని అక్కా, బావ తనను బలవంతంగా ఒప్పించి బయటకు తీసుకెళ్తున్న క్రమంలో తిరిగి ర్యాష్ డ్రైవింగ్ వల్ల ప్రమాదం జరగడంపై ఆవేదన వ్యక్తం చేశారు. బాధ్యతను విస్మరించిన తల్లిదండ్రులు మైనర్లకు వాహనాలు ఇస్తున్నారని, ఇకనైనా అధికారులు మేల్కోవాలని, తమ పరిస్థితి మరే కుటుంబానికీ రాకుండా చూడాలని వేడుకున్నారు. కాగా, ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు జరుపుతున్నట్లు ఎస్ఐ అశోక్ తెలిపారు. -
కేంద్రమంత్రికి చేదు అనుభవం
కేంద్ర మంత్రి అశోక్ గజపతిరాజు భవానీపురం : మనిషి జీవితం నీటితో ముడిపడి ఉందని కేంద్ర మంత్రి అశోక్ గజపతి రాజు అన్నారు. గురువారం సాయంత్రం ఆయన పున్నమిఘాట్లో పుష్కర స్నానమాచరించారు. కాగా, కేంద్రమంత్రికి కాస్త చేదు అనుభవం ఎదురైంది. ఆయనకు ప్రొటోకాల్ ప్రకారం స్వాగతం లభించలేదు. సాయంత్రం సుమారు 4.30 గంటల సమయంలో పున్నమిఘాట్‌కు వచ్చినా జిల్లా ఉన్నతాధికారులెవరు అక్కడ లేకపోవడం గమనార్హం. హడావుడిగా కొంతమంది ఉన్నతాధికారులు వచ్చి రిసీవ్ చేసుకున్నారు. -
విలీన ప్రాంత ప్రజలకు 'చేదు అనుభవం'
రాజమండ్రి (నెల్లిపాక) : విలీన మండలాల ప్రజలు కనీస వైద్య సౌకర్యానికి నోచుకోలేకపోతున్నారు. ఇటు ఆంధ్రా అధికారులు పట్టించుకోకపోవడం , అటు తెలంగాణ ప్రాంతం వారు కనికరించకపోవడంతో విలీన ప్రాంత ప్రజల ప్రాణాలు గాలిలో దీపాలుగా మారుతున్నాయి. పాముకాటుకు గురైన ఓ బాలిక చావుబతులకుల మధ్య కొట్టుమిట్టాడుతున్న పరిస్థితే ఇందుకు నిదర్శనం. మండల పరిధిలోని కుసుమనపల్లి గ్రామానికి చెందిన పూసం శ్రీను సీతమ్మ దంపతుల కుమారై రోనామేరీ స్థానికంగా ఒకటో తరగతి చదువుతోంది. శుక్రవారం రాత్రి ఇంటి ముందు ఆడుకుంటుండంగా పాము కాటేసింది. కుటుంబసభ్యులు 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. ఆ గ్రామానికి తెలంగాణ ప్రాంత వాహనమే వచ్చే అవకాశం ఉందని, వారు అక్కడికి రావడానికి నిరాకరిస్తున్నారని సమాధానం చెప్పారు. దీంతో బాలికను ద్విచక్ర వాహనంపై భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆంధ్ర ప్రజలకు ఇకడ వైద్యం చేయమని వైద్య సిబ్బంది తెగేసి చెప్పారు. దీంతో వారు చేసేదేమీలేక స్థానికంగా ఉన్న ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించి చికిత్స చేయిస్తున్నారు. తమ బిడ్డ పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారని తండ్రి శ్రీనివాస్ వివరించాడు. -
మంత్రి, ఎంపీకి చేదు అనుభవం
బెంగళూరు: తెలంగాణ - కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో మంత్రి జూపల్లి కృష్ణారావు, మహబూబ్‌నగర్ ఎంపీ జితేందర్‌రెడ్డికి మంగళవారం చేదు అనుభవం ఎదురైంది. ఇరు రాష్ట్రాల సరిహద్దుల్లో కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా ప్రాజెక్టులను నిర్మిస్తుందని ఆరోపణలు వెల్లువెత్తాయి. ఈ నేపథ్యంలో సదరు ప్రజా ప్రతినిధులతోపాటు పలువురు నాయకులు బృందంగా మంగళవారం ఆ ప్రాజెక్టులను పరిశీలించేందుకు బయలుదేరింది. ఆ విషయం తెలిసిన కర్ణాటక పోలీసులు సరిహద్దుల్లో వారిని అడ్డుకున్నారు. మీ పర్యటనకు తమ ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదంటూ అక్కడి పోలీసులు జూపల్లి, జితేందర్‌రెడ్డికి తేల్చి చెప్పారు. ఆ క్రమంలో వారు కర్ణాటక పోలీసులతో వాగ్వాదానికి దిగారు. దీంతో స్థానికంగా ఉద్రిక్తంగా మారింది. ప్రాజెక్టులు పరిశీలించేందుకు తమకు అనుమతి ఇవ్వాలంటూ వారు కర్ణాటక ప్రభుత్వాన్ని డిమాండ్ చేసి.. అక్కడే భీష్మించుకుని కుర్చున్నారు. -
పీతల సుజాతకు చేదు అనుభవం
-
విజయవాడలో వెంకయ్యకు చేదు అనుభవం
-
అమేధీలో రాహుల్‌గాంధీకి చేదు అనుభవం
-
లోకేష్‌కు చేదు అనుభవం
-
ఏపీ మంత్రి రావెలకు చేదు అనుభవం!
-
పాపం.. గంట కొట్టేశారు!!
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి గంటా శ్రీనివాసరావుకు ఒకే రోజు రెండు చేదు అనుభవాలు ఎదురయ్యాయి. ఆయన ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా విశాఖపట్నంలో ఇందిరానగర్ బస్తీ వాసులు మంగళవారం ఉదయం తమను అక్కడినుంచి ఖాళీ చేయించడానికి వీల్లేదంటూ ఆయనను ఘెరావ్ చేసి, ఇంటిముందు నినాదాలు చేశారు. ఇందిరానగర్ బస్తీని ఖాళీ చేయించి, అక్కడున్నవారికి వేరే ప్రాంతాల్లో ఇళ్లు కేటాయించాలని జీవీఎంసీ భావిస్తోంది. నగర సుందరీకరణలో భాగంగా ఇలా చేయాలని కార్పొరేషన్ తలపెడుతోంది. దీన్ని బస్తీవాసులు వ్యతిరేకిస్తున్నారు. ఇక తూర్పుగోదావరి జిల్లా కాకినాడలో డీఎడ్ విద్యార్థులు కూడా గంటా శ్రీనివాసరావును అడ్డుకున్నారు. కాకినాడ జేఎన్టీయూకు వచ్చిన ఆయనను పట్టుకుని నిలదీశారు. డీఎడ్ చేసిన వారికి డీఎస్సీలో ఎందుకు అవకాశం కల్పించరంటూ ఆయనను ప్రశ్నించారు. దాంతో వారికి వచ్చే డీఎస్సీలో అవకాశం కల్పిస్తామని హామీ ఇచ్చి ఎలాగోలా అక్కడినుంచి తప్పించుకున్నారు. ఒకేరోజు గంటా శ్రీనివాసరావుకు ఇలా రెండు రకాలా చేదు అనుభవాలు ఎదురైనట్లయింది. -
ఏఎన్‌యూలో లగడపాటికి చేదు అనుభవం
విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు శనివారం నాగార్జున నగర్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్‌యూ) ప్రాంగణంలో చేదు అనుభవం ఎదురు అయింది. ఈ రోజు ఉదయం యూనివర్శిటీలో సమైక్యాంధ్రకు మద్దుతుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి లగడపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లగడపాటి వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని విద్యార్థి ఐకాస, సమైక్యవాదులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. లగడపాటి రాజీనామా చేసే వరకు ఆయన్ని కదలనివ్వమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
మహిళా ఎమ్మెల్యేలకు చేదుఅనుభవం
రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా సీమాంధ్ర జిల్లాల్లో ఆందోళనలు, నిరసనలు రోజు రోజుకు ఉధృతమవుతున్నాయి. ప్రజలే నాయకులుగా ఉద్యమం నడిపిస్తున్నారు. ధర్నాలు, రాస్తారోకోలు, నిరాహారదీక్షలు, భారీ ప్రదర్శనలతో ఆందోళనలు చేస్తున్నారు. లక్షలాది గళాలతో మహోగ్రంగా సమైక్య నినాదాలు విన్పిస్తున్నారు. తమతో కలిసిరాని ప్రజా ప్రతినిధులను ఎక్కడికక్కడ నిలదీస్తున్నారు. రాజీనామాలు చేసి ఉద్యమంలోకి రావాలని అడ్డుకుంటున్నారు. ఇద్దరు మహిళా ఎమ్మెల్యేలను సమైక్యవాదులు అడ్డుకున్నారు. వైఎస్సార్ జిల్లా బద్వేల్ సమైక్యవాదుల సభలో బద్వేల్ ఎమ్మెల్యే కమలమ్మకు చేదు అనుభవం ఎదురయింది. సభలో ప్రసంగించొద్దని ఆమెకు సమైక్యవాదులు అడ్డుతగిలారు. విజయనగరం జిల్లా పార్వతీపురం ఎమ్మెల్యే జయమణిని ఉపాధ్యాయ సంఘాలు అడ్డుకున్నాయి. రాజీనామాచేసి ఉద్యమంలో పాల్గొనాలని డిమాండ్ చేస్తూ జయమణికి వ్యతిరేకంగా ఆందోళనకారులు నినాదాలు చేశారు.