విజయవాడ లోక్సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్కు శనివారం నాగార్జున నగర్లోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్యూ) ప్రాంగణంలో చేదు అనుభవం ఎదురు అయింది. ఈ రోజు ఉదయం యూనివర్శిటీలో సమైక్యాంధ్రకు మద్దుతుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి లగడపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లగడపాటి వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని విద్యార్థి ఐకాస, సమైక్యవాదులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. లగడపాటి రాజీనామా చేసే వరకు ఆయన్ని కదలనివ్వమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు.