Seemandhra people
-
ఇక్కడ మేము క్షేమమే బాబూ..
హైదరాబాద్: ఏపీలో రాజకీయాలను ధైర్యంగా ఎదుర్కోవడం చేతగాని చంద్రబాబు.. తెలంగాణలో నివశిస్తున్న సీమాంధ్రులను అడ్డుపెట్టుకుని రాజకీయ లబ్ధికి పాకులాడడం సిగ్గుచేటని కూకట్‌పల్లికి చెందిన సీమాంధ్ర ప్రాంతవాసులు విమర్శించారు. సోమవారం సాయంత్రం కేపీహెచ్‌బీ కాలనీలోని రమ్య గ్రౌండ్లో సీమాంధ్రులు మీడియా సమావేశం నిర్వహించారు. కటికరెడ్డి శ్రీనివాసరెడ్డి, సదాశివరెడ్డి, విజయభాస్కర్, రంగమోహన్, నాగకుమార్, గోపీ, రవీంద్రనాధ్‌ఠాగూర్, ప్రియదర్శిని, పవన్‌కుమార్ తదితరులు మాట్లాడుతూ.. ఆంధ్రప్రదేశ్‌లోని మూడున్నర కోట్ల మంది ప్రజల సమాచార గోప్యతకు సంబంధించిన కేసులో తెలంగాణ పోలీసులకు అందిన ఫిర్యాదుతో చిన్నాచితక ఐటీ కంపెనీపై పోలీసులు దాడులు చేస్తే సీమాంధ్రులపై దాడిగా చిత్రీకరించడం చంద్రబాబుకే చెల్లిందన్నారు. (డేటా స్కామ్ డొంక కదులుతోంది!) గత 25–30 ఏళ్లుగా తాము తెలంగాణ ప్రాంతాంలో క్షేమంగా జీవిస్తున్నామని అన్నారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం సీమాంధ్ర ప్రజలను పావులుగా వాడుకోవద్దని హితవు పలికారు. ఆంధ్రప్రదేశ్‌లో రాజకీయాలను.. అక్కడి ప్రత్యర్థి పార్టీలను ఎదుర్కొవడం కోసం తప్పుడు దారులు వెతుక్కోవడం ద్వారా చంద్రబాబు తన వక్రబుద్ధిని చాటుకున్నాడని విమర్శించారు. ఐటీ గ్రిడ్ సంస్థకు ఆంధ్రప్రదేశ్ ప్రజల డేటా ఎలా వచ్చిందనే విషయంపై పోలీసులు విచారణ జరుపుతున్నారని, దీనికి తెలుగుదేశం పార్టీ, అక్కడి మంత్రివర్గం మొత్తం ఆందోళన చెందడం చూస్తే ఏదో తప్పు జరిగిందనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయని తెలిపారు. (మమ్మల్ని పోలీసులు నిర్బంధించలేదు) కాగా, ప్రాంతీయ విద్వేషాలు రెచ్చగొట్టేలా మాట్లాడుతున్న చంద్రబాబునాయుడుపై తక్షణం కేసు నమోదు చేసి చర్యలు తీసుకోవాలని కోరుతూ సీమాంధ్ర ప్రాంతానికి చెందిన ప్రజలు కేపీహెచ్‌బీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. హైదరాబాద్‌లో ప్రాంతీయ విభేదాలు చెలరేగే అవకాశం ఉందని, ఇక్కడి ప్రభుత్వం వెంటనే చంద్రబాబుపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
'సీమాంధ్రులు పోలింగ్‌లో పాల్గొంటారు'
హైదరాబాద్: కాంగ్రెస్, టీడీపీలు అధికారంలో ఉన్నప్పుడు చేసిన తప్పిదాల వల్ల ప్రతికూల ఫలితాలను ఇప్పటికీ అనుభవిస్తున్నామని, దీని వల్లే కొన్ని పనుల్లో జాప్యం జరిగిందని టీఆర్ఎస్ ఎంపీ వినోద్ కుమార్ అన్నారు. గ్రేటర్ హైదరాబాద్ మునిసిపల్ కార్పొరేషన్ ఎన్నికలు జాప్యం కావడానికి వేరే కారణాలు లేవని చెప్పారు. జీహెచ్ఎంసీ ఎన్నికల్లో సీమాంధ్రులు ఓటు హక్కు వినియోగించుకుంటారని వ్యాఖ్యానించారు. కాంగ్రెస్ నాయకులు వాస్తవాలు మరిచి మాట్లాడుతున్నారని, వారి హయాంలో జరగని అభివృద్ధిని తాము చేశామని వినోద్ అన్నారు. దేశంలో ఇటీవల జరిగిన పలు ఘటనలకు నిరసనగా రచయితలు అవార్డులను తిరిగి వెనక్కి ఇవ్వడంపై స్పందిస్తూ.. ఇలా చేయడం సరికాదని అభిప్రాయపడ్డారు. -
'రాష్ట్రం విడిపోయినా... సీమాంధ్రల ఆగడాలు ఆగలేదు'
హైదరాబాద్: రాష్ట్రం విడిపోయినప్పటికీ హైదరాబాద్ నగరంలోని సీమాంధ్రుల ఆగడాలు ఇంకా ఆగలేదని టీఆర్ఎస్ ఎమ్మెల్యే ఎస్. రామలింగారెడ్డి ఆరోపించారు. బుధవారం హైదరాబాద్‌లో విలేకర్ల సమావేశంలో మాట్లాడుతూ... ఆంధ్రప్రదేశ్ రాజధానిని తక్షణమే సీమాంధ్ర ప్రాంతానికి తరలించుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కి కేటాయించిన పాత అసెంబ్లీ హాల్ చారిత్రక భవనమని ఈ సందర్బంగా రామలింగారెడ్డి గుర్తు చేశారు. అలాంటి భవనానికి మరమ్మతులు చేయడం సరికాదని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంపై రామలింగారెడ్డి నిప్పులు చెరిగారు. -
వీలైనంత తొందరగా ఏపీలో అసెంబ్లీ: కోడెల
సాక్షి, హైదరాబాద్: ‘‘మన రాష్ట్రం ఒక చోట.. సభ జరిగేది, చట్టాలు చేసేది ఇక్కడ... ఈ పరిస్థితి నుంచి బయటపడేందుకు వీలైనంత త్వరలో మన రాష్ట్రంలోనే శాసనసభ ఏర్పాటు చేసుకుందాం’’ అని ఆంధ్రప్రదేశ్ శాసనసభ స్పీకర్ డాక్టర్ కోడెల శివప్రసాదరావు పేర్కొన్నారు. రాష్ట్రం విడిపోయిన తర్వాత సీమాంధ్ర ప్రజలు నాలుగు రోడ్ల కూడలిలో ఉన్నారని.. ఈ పరిస్థితుల నుంచి గట్టెక్కేందుకు పరస్పరం అందరూ సహకరించుకోవాలని పిలుపునిచ్చారు. శుక్రవారం స్పీకర్‌గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా సభనుద్దేశించి కోడెల మాట్లాడారు. స్పీకర్‌గా బాధ్యతలేంటో గుర్తెరిగి ప్రవర్తిస్తానని, సభ్యులు హద్దులు మీరి ప్రవర్తించరాదని సూచించారు. సభలో సభ్యులు హుందాగా వ్యవహరించాలన్నారు. అప్పుడూ ఇప్పుడూ నరసరావుపేట నుంచే... ఉమ్మడి మద్రాసు రాష్ట్రం విడిపోయి ఆంధ్ర రాష్ట్రం ఏర్పడినప్పుడు తొలి శాసనసభ స్పీకర్‌గా నల్లపాటి వెంకట్రామయ్య చౌదరి ఎన్నికయ్యారని, ఆయన నరసరావుపేట నియోజకవర్గానికి ప్రాతినిథ్యం వహించారని కోడెల గుర్తుచేశారు. ఇప్పుడు కొత్త ఆంధ్రప్రదేశ్‌కు కూడా నరసరావుపేటకు చెందిన తనను స్పీకర్‌గా నియమించడం ఆశ్చర్యకరమని, ఇది తన అదృష్టంగా భావిస్తున్నానని వ్యాఖ్యానించారు. -
ఆ ముగ్గురూ జోగులే !: షర్మిల
► గుంటూరు జనభేరిలో మోడీ, వెంకయ్య, పవన్‌లపై షర్మిల ధ్వజం ►జగన్ ఒక్కడిని ఎదుర్కోలేక చంద్రబాబు వీళ్లను తెచ్చాడు ►జోగీ జోగీ రాసుకుంటే రాలేది బూడిదే ►విభజన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముంది ►మోడీ మాటలు నమ్మడానికి సీమాంధ్ర ప్రజలు పిచ్చివాళ్లు కాదు సాక్షి, గుంటూరు: ‘‘టీడీపీఅధినేత చంద్రబాబునాయుడు రాజశేఖరరెడ్డిని ఒంటరిగా ఎదుర్కోలేక అందరితో కలసి మహాకూటమిగా ఏర్పాటు చేసి పోరాడినా ఫలితం లేకపోయింది. ఇప్పుడు రాజశేఖరరెడ్డి వెళ్లిపోయినా.. ఆయన కొడుకును కూడా ఒంటరిగా ఎదుర్కొనే దమ్ము ఈ చంద్రబాబుకు లేదు. అందుకనే బీజేపీకి చెందిన నరేంద్రమోడీ, వెంకయ్య నాయుడు, పవన్ కల్యాణ్‌లను మూకుమ్మడిగా తీసుకొచ్చాడు. అయినా ఫరవాలేదు. జోగీజోగీ రాసుకుంటే బూడిదే రాలుతుంది’’ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి సోదరి షర్మిల విమర్శిం చారు. తిరుపతి సభలో ఈ ముగ్గురూ చేసిన వ్యాఖ్యలు ప్రస్తావిస్తూ వారిని కడిగిపారేశారు. తెలుగు ప్రజలను విడగొట్టిన పాపంలో కాంగ్రెస్, టీడీపీ, బీజేపీలకూ భాగముందన్నారు. కొడుకును ప్రధానమంత్రిని చేసుకోవాలని సోనియా రాష్ట్రాన్ని ముక్కలు చేస్తుంటే.. ‘కొబ్బరికాయ ముక్కల్లా విభజించండి’ అని చంద్రబాబు మద్దతు పలికారని, చట్టసభల్లో విభజనకు బీజేపీ బేషరతుగా మద్దతిచ్చిందని దుయ్యబట్టారు. గుంటూరు జిల్లాలోని క్రోసూరు, తాడికొండ, పెదకాకానిలో గురువారం జరిగిన ‘వైఎస్సార్ జనభేరి’ సభల్లో ప్రసంగించారు. షర్మిల ప్రసంగాల సారాంశం ఆమె మాటల్లోనే.. మూడురాష్ట్రాల్లో ఏం చేశారు..? ‘‘చంద్రబాబు మూకుమ్మడిగా తెచ్చిన మోడీ, వెంకయ్య, పవన్ కల్యాణ్.. ఈ జోగులంతా తిరుపతిలో ఒక బహిరంగ సభ పెట్టారు. అందరిదీ ఒక్కటే టార్గెట్ జగన్. అందరూ మనస్ఫూర్తిగా జగన్‌ను ఆడిపోసుకున్న తరువాత, ‘సీమాంధ్రను బ్రహ్మాండంగా అభివృద్ధి చేస్తాము.. హైదరాబాద్ లాంటి రాజధానిని మళ్లీ సీమాంధ్రలో కడతాము.. అదిగదిగో చందమామ..’అని మోడీ సీమాంధ్ర ప్రజలను నమ్మించే ప్రయత్నం చేస్తున్నారు. ఇదే బీజేపీ జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్, ఉత్తరాంచల్ రాష్ట్రాలను ఏర్పాటు చేసింది. అప్పుడూ ఇదే వాగ్దానాలు చేసింది. కనీసం ఒక్కో రాష్ట్రానికి రూ. 500 కోట్లయినా ఇచ్చిన దాఖలాలు లేవు. ఆ రాష్ట్రాల్లో అంతర్జాతీయ విమానాశ్రయం లేదు, కనీసం చెప్పుకోదగ్గ మంచి ఆస్పత్రి కూడా లేదు. అలాంటిది మోడీ నిన్న వచ్చి బ్రహ్మాండమైన అభివృద్ధి చేస్తాం, బ్రహ్మాండమైన రాజధాని కడతామంటే నమ్మడానికి తెలుగు ప్రజలు అమాయకులనుకుంటున్నారా.. లేక పిచ్చివాళ్లనుకుంటున్నారా..? ఇంకొకరు వెంకయ్యనాయుడు ఈయన సొంత నియోజకవర్గంలో, సొంత వార్డుల్లో ఒక్క వార్డు మెంబరును కూడా గెలిపించుకోలేరు. పవన్ సేవ చేస్తారట.. ఇంకొకరు ఆయన పక్కనే నిల్చున్నారు, పవన్ కల్యాణ్ అట. ఈ పవన్ కల్యాణ్ తన అన్న చిరంజీవితో కలిసి ప్రజారాజ్యం అనే ఓ పార్టీ పెట్టారు. అన్నా తమ్ముడు ఇద్దరూ కలిసి రూ. 70 కోట్లకు ఆ పార్టీని అమ్మేసుకుని మంచం కింద ఆ డబ్బు దాచి పెట్టుకుని కేసులు జరగకుండా మేనేజ్ చేసుకున్నారు. ఈ ఐదేళ్లు అదే మంచంమీద ఇద్దరూ తొంగున్నారు. ప్రజారాజ్యం పెట్టేటప్పుడు పవన్ కల్యాణ్ అక్కడే ఉన్నారు. ఎన్నికల్లో కూడా చురుగ్గా పాల్గొన్నారు. ప్రచారం చేశారు, హామీలు కూడా ఇచ్చారు. ప్రజారాజ్యంలో యువసేన అనే దానికి అధ్యక్షునిగా ఉన్నారు. మరి ఏ కాంగ్రెస్ పార్టీకి అయితే వ్యతిరేకంగా ప్రజారాజ్యం పార్టీని పెట్టారో ఆ కాంగ్రెస్ పార్టీకే పార్టీని అమ్మేసుకుంటే ప్రజల ముందుకు వచ్చి ఒక్క సమాధానమైనా చెప్పారా ఈ పవన్ కల్యాణ్. ఈయన సేవ చేస్తారట.. సేవ అనే పేరుతో కామన్ మ్యాన్ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే సంస్థ పెట్టి.. కోట్ల కొద్దీ విరాళాలు కూడా సేకరించారు. ఆ సంస్థ ఏమైందో, ఆ విరాళాలను ఏం చేశారో ఎప్పుడైనా చెప్పారా? ఎంత మంది ప్రజలకు సేవ చేశారో ఎప్పుడైనా చెప్పారా? అంత హడావుడిగా కోట్ల రూపాయలు సేకరించి స్థాపించిన సంస్థ కదా.. కనీసం ఇప్పుడది బతికి ఉందా, చచ్చిందా.. అదైనా చెప్పారా పవన్ కల్యాణ్ . చెప్పలేదు. ఈ ఐదేళ్ళల్లో ఎవరికీ ఏ సమాధానం చెప్పలేదు. మొన్న ఆడిటోరియంలో ఒక పెద్ద సభ పెట్టి ఆ సభలో ప్రజల కోసం ప్రశ్నించడానికే ముందుకు వచ్చానని చెప్పుకున్నాడు ఈ పవన్ కల్యాణ్. చంద్రబాబుకు అధికారమిస్తే గొయ్యి తవ్వుకున్నట్టే.. వీళ్లందరినీ తెచ్చింది చంద్రబాబు. బాబు తొమ్మిదేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్నారు. నేను ఫలానా గొప్ప పథకాన్ని చేశాను, నేను ముఖ్యమంత్రి అయ్యాక మళ్లీ ఆ పథకాన్ని చేస్తానని చెప్పుకునే ధైర్యం ఈ రోజు చంద్రబాబుకు లేదు. పదేళ్లు చంద్రబాబు ప్రధాన ప్రతిపక్ష నాయకుడి హోదాలో ఉన్నారు. ఈ పదేళ్లలో నేను ప్రజలకు వచ్చిన ప్రధాన సమస్యలో ఫలానా పోరాటం చేశాను.. ప్రభుత్వం మెడలు వంచి ఫలానాది సాధించాను.. ఓట్లు వేయండనే ధైర్యం చంద్రబాబుకు లేదు. ఇంత అసమర్థుడు ఈ రోజు ఎన్నికలు వచ్చాయి కదా అని, అన్ని దొంగ వాగ్దానాలు చేస్తూ తిరుగుతున్నాడు.. ఒక సామెత ఉంది.. పేనుకు పెత్తనం ఇస్తే మొత్తం గొరిగేసినట్లు చంద్రబాబుకు పెత్తనం ఇస్తే మొత్తం దోచేస్తాడు. చంద్రబాబు మాటల్లో నిజంలేదు. చంద్రబాబు వాగ్దానాల్లో నిజం లేదు. చంద్రబాబు గుండెల్లో నిజాయితీ లేదు. ఇలాంటి వారికి అధికారమిస్తే మన గొయ్యి మనమే తవ్వుకున్నట్లే. -
మమ్మల్ని ఆదరిస్తే అభివృద్ధి: హరిబాబు
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజలు ఎన్నుకున్న 175 మంది ఎమ్మెల్యేలు, 25 మంది ఎంపీలెవ్వరూ నోరెత్తకున్నా వారి సమస్యల్ని చట్టసభల్లో ప్రస్తావించి న్యాయం జరిగే వరకు పోరాడింది తమ పార్టీయేనని బీజేపీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నూతన అధ్యక్షుడు కె.హరిబాబు చెప్పారు. సీమాంధ్ర నుంచి తమ పార్టీకి ఒక్క ఎమ్మెల్యే లేదా ఎంపీ లేకున్నా ప్రధాని సహా ప్రతి మంత్రినీ నిలదీసి ప్రత్యేక ప్యాకేజీని సాధించామన్నారు. పార్టీ రాష్ట్ర అధ్యక్షునిగా ఎంపికైన తర్వాత తొలిసారిగా హైదరాబాద్‌కు వచ్చిన హరిబాబు శుక్రవారం మీడియాతో మాట్లాడారు. సీమాంధ్రకు లభించిన ప్యాకేజీ పూర్తి స్థాయిలో అమలుకావాలంటే కేంద్రంలో నరేంద్ర మోడీ ప్రధానిగా ప్రభుత్వం ఏర్పడాలన్నారు. సీమాంధ్రలో బీజేపీని ఎన్నుకుంటేనే మోడీని తమకేమి చేస్తారని అడగడానికి వీలుంటుందన్నారు. సీమాంధ్రలో ఎన్నికల కసరత్తు ప్రారంభించామని, అభ్యర్థుల వివరాలు సేకరిస్తున్నామన్నారు. పొత్తులపై ఇంకా ఎటువంటి నిర్ణయమూ తీసుకోలేదన్నారు. ప్రస్తుతం సొంతంగా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు అవసరమైన 272 లోక్‌సభ సీట్లు ఎలా గెలవాలన్నదే లక్ష్యమన్నారు. పొత్తున్నా లేకున్నా ఒంటిరిగానే ముందుకు వెళ్తామని వివరించారు. నరేంద్రమోడీ సభలు పెట్టి బీజేపీ అధికారంలోకి వస్తే సీమాంధ్రకు ఏమి చేస్తారో చెప్పిస్తామన్నారు. పార్టీ తెలంగాణ ఎన్నికల కమిటీ భేటీ నేడు.. బీజేపీ తెలంగాణ ప్రాంత ఎన్నికల కమిటీ సమావేశం శనివారం హైదరాబాద్‌లో జరగనుంది. జి.కిషన్‌రెడ్డి అధ్యక్షతన జరిగే ఈ సమావేశంలో అభ్యర్థుల ఎంపికపై ప్రధానంగా దృష్టి సారిస్తారు. -
'కేంద్రం ఇచ్చిన హామీలు నెరవేర్చేవరకు పోరాడుతాం'
-
సీమాంధ్రులు... క్షమించండి: నన్నపనేని
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం సమైక్యంగా ఉంచేందుకు చేసిన 'సమైక్యాంధ్ర పోరాటం'లో టీడీపీ ఓడిపోయిందని ఆ పార్టీ ఎమ్మెల్సీ నన్నపనేని రాజకుమారి అన్నారు. ఈ నేపథ్యంలో ఆ పార్టీ నాయకురాలిగా సీమాంధ్ర ప్రజలకు క్షమాపణలు చెబుతున్నట్లు ప్రకటించారు. రాష్ట్ర విభజనపై కేంద్రం తీసుకున్న నిర్ణయంపై న్యాయస్థానంలో తమ పోరాటాన్ని మాత్రం కొనసాగిస్తామన్నారు. రాష్ట్ర విభజన వద్దని తమ పార్టీ కొనసాగించిన పోరాటాన్ని ఆమె ఈ సందర్భంగా విశదీకరించారు. విభజన బిల్లు తప్పులు తడఖ అని అటు విధాన సభ, ఇటు విధాన మండలి రాష్ట్రపతికి తిప్పి పంపామని, అయిన పార్లమెంట్ ఉభయ సభలలో ఆ బిల్లు ఆమోదం పొందిందని ఈ సందర్భంగా నన్నపనేని కాంగ్రెస్ పార్టీ అనుసరించిన వైఖరిపై నిప్పులు చెరిగారు. -
సీమాంధ్రులకు ఎటువంటి ఢోకాలేదు: కేటీఆర్
తెలంగాణ ప్రాంతంలో నివసించే సీమాంధ్రులకు ఎటువంటి ఢోకా ఉండదని తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్యే కేటీఆర్ స్పష్టం చేశారు. న్యూఢిల్లీ నుంచి బుధవారం మధ్యాహ్నం శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు. ఆంధ్రప్రదేశ్ రెండు రాష్ట్రాలుగా విడిపోయినప్పటికి అన్నదమ్ముల్లా కలసి ఉండి అభివృద్ధి చేసుకుందామన్నారు. టీఆర్ఎస్ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో శంషాబాద్ ఎయిర్ పోర్ట్‌కు చేరుకుని కేటీఆర్‌కు స్వాగతం పలికారు. తెలంగాణ బిల్లు పార్లమెంట్ ఉభయ సభలలో ఇటీవలే ఆమోదం పొందింది. ఈ నేపథ్యంలో యూపీఏ అధ్యక్షురాలు సోనియా గాంధీకి ధన్యవాదాలు తెలిపేందుకు టీఆర్ఎస్ అధ్యక్షుడు చంద్రశేఖర రావు కుటుంబ సభ్యులంతా ఢిల్లీ తరలివెళ్లారు. ఆ క్రమంలో సోనియాను కలసి ఆదివారం కేసీఆర్‌తోపాటు ఆయన కుటుంబ సభ్యులు ధన్యవాదులు తెలిపారు. అనంతరం కేటీఆర్ బుధవారం హైదరాబాద్ తిరిగివచ్చారు. ఈ రోజు సాయంత్రం 3.00 గంటలకు టీఆర్ఎస్ అధ్యక్షుడు కేసీఆర్ హైదరాబాద్ నగరానికి రానున్నారు. -
తెలంగాణలోని సీమాంధ్రులంతా తెలంగాణవారే!
హైదరాబాద్: తెలంగాణలో ఉన్న సీమాంధ్రులంతా తెలంగాణవారేనని పీసీసీ మాజీ అధ్యక్షుడు డి.శ్రీనివాస్ చెప్పారు. ఆదివారం తన నివాసంలో ఆయన మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో 75 లక్షల మంది సీమాంధ్రులు నివసిస్తున్నారని తెలిపారు. సోనియాగాంధీ పట్టుదలతోనే తెలంగాణ రాష్ట్రం సాకారమైందన్నారు. సోనియాగాంధీకి తెలంగాణ ప్రజలంతా రుణపడి ఉంటారని తెలిపారు. తెలంగాణ వారంతా కాంగ్రెస్‌కు అండగా నిలవాలని పిలుపు ఇచ్చారు. తెలంగాణ, సీమాంధ్రలో ఏర్పడిన గందరగోళ పరిస్థితికి మాజీ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డే కారణమని ఆరోపించారు. ముఖ్యమంత్రిగా ఉంటూ ప్రజాసంక్షేమం కోసం పాటుపడాల్సిన కిరణ్‌కుమార్‌రెడ్డి తన స్వార్ధం కోసం అధికార, ధన బలంతో ప్రజల మధ్య రాగద్వేషాలను పెరిగేలా చేశాడని పేర్కొన్నారు. సీఎం క్యాంపు కార్యాలయాన్ని రాజకీయాలకు వాడుకున్నారని విమర్శించారు. -
మా సవరణలను కాపీకొట్టారు: జేడీ శీలం
బీజేపీపై కేంద్ర మంత్రి జేడీ శీలం ధ్వజం సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలకు మేలు చేసేలా కాంగ్రెస్ పార్టీ చేసిన సవరణలనే బీజేపీ కాపీ కొట్టిందని కేంద్ర మంత్రి జేడీ శీలం విమర్శించారు. ‘‘ సీమాంధ్రలో రెవెన్యూ లోటుకు సం బంధించి రూ.10వేల కోట్లు ఇవ్వాలని, ఈశాన్య రాష్ట్రాల మాదిరే ప్రత్యేక రాష్ట్ర ప్రతిపత్తి ఇస్తామని లోక్‌సభలో బిల్లు ఆమోదానికి ముందురోజే రాహుల్‌గాంధీ మాకు హామీ ఇచ్చారు. అయితే అప్పటికే వాటిని పొందుపరచడంలో ఆలస్యం జరగడంతో లోక్‌సభలో ఈ సవరణలు పెట్టలేదు. రాజ్యసభలో బిల్లు సందర్భంగా పెడతామని చెప్పారు. ఈ సవరణలనే బీజేపీ కాపీ కొట్టి సీమాంధ్ర ప్రజల కోసం పోరాడుతున్నట్లుగా మొసలికన్నీరు కారుస్తోంది’’ అని శీలం విమర్శించారు. సీమాంధ్ర ప్రజలపై బీజేపీకి నిజంగా ప్రేమ ఉంటే హైదరాబాద్‌ను పదేళ్లపాటు యూటీగా చేయాలన్న డిమాండ్‌కు ఎందుకు అంగీకరించలేదని ఆయన ప్రశ్నించారు. సీమాంధ్రుల సమస్యలను పరిష్కరించేందుకు కంకణబద్ధులమై ఉన్నామని, రెండు ప్రాంతాల వారు అభివృద్ధి చెందేలా కృషిచేస్తామని జేడీశీలం భరోసా ఇచ్చారు. -
'హైదరాబాద్‌లో భయంగా సీమాంధ్రులు'
హైదరాబాద్ : హైదరాబాద్‌లో సీమాంధ్ర ప్రజలు ప్రస్తుతం భయాందోళనతో ఉన్నారని కేంద్రమంత్రి పల్లంరాజు అన్నారు. హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం ద్వారానే వారికి సరైన రక్షణ కల్పించగలమని ఆయన మంగళవారమిక్కడ వ్యాఖ్యానించారు. ప్రజల కోసం హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతం చేయటం పెద్ద కష్టమైన పనేమీ కాదని పల్లంరాజు అభిప్రాయపడ్డారు. హైదరాబాద్‌ను యూటీ చేయాలని తాము గట్టిగా కోరుతున్నామని అన్నారు. కొత్త రాజధాని నిర్మాణం కాగానే హైదరాబాద్‌ను కేంద్రపాలిత ప్రాంతంగా తొలగించవచ్చని పల్లంరాజు పేర్కొన్నారు. -
ఒంగోలు నుంచే పోటీ చేస్తా కానీ... ?
తెలంగాణ బిల్లు పార్లమెంట్లో ఆమోదం పొందితే కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేస్తానని ఒంగోలు ఎంపీ, కాంగ్రెస్ పార్టీ నాయకుడు మాగుంట శ్రీనివాసులు రెడ్డి స్పష్టం చేశారు. శనివారం ఆయన ఒంగోలులో విలేకర్లతో మాట్లాడారు. సీమాంధ్ర ప్రజల మనోభావాలను కాంగ్రెస్ పార్టీ పట్టుకోవడం లేదన్నారు. టి.బిల్లుపై కాంగ్రెస్ పార్టీ తాను పట్టిన కాళ్ల కుందేలుకు మూడే కాళ్లు అన్న తరహాలో అప్రజాస్వామికంగా వ్యవహరిస్తుందని ఆయన ఆరోపించారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లుకు వ్యతిరేకంగా ఓటు వేయాలని చూసిన మాపై వేటు వేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచే క్రమంలో సీమాంధ్రలో జరుగుతున్న సమైక్య ఉద్యమం మరో స్వాతంత్ర్య పోరాటమని ఆయన అభివర్ణించారు. రానున్న ఎన్నికలలో ఒంగోలు నుంచి పోటీ చేస్తా కానీ ఏ పార్టీ తరఫున అనేది మాత్రం ఇప్పుడే వెల్లడించలేనని మాగుంట శ్రీనివాసులు రెడ్డి తెలిపారు. -
బంతి పడకుండానే... బ్యాటొదిలారు
-
సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తాం: కెటిఆర్
హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల భయాందోళనలను తొలగించడానికి హైదరాబాద్‌లో సద్భావనా యాత్రలు నిర్వహిస్తామని టిఆర్ఎస్ ఎమ్మెల్యే కేటీఆర్ చెప్పారు. హైదరాబాద్‌లోని సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్నారు. పులిచింతల ప్రారంభోత్సవంలో ముఖ్యమంత్రి కిరణ్ కుమార్ రెడ్డి చేసిన వ్యాఖ్యల్లో వాస్తవం లేదని చెప్పారు. టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడి మానసికస్థితి బాగోలేదని కేటీఆర్ అన్నారు. అందుకే ఆయన ఇష్టానుసారం మాట్లాడుతున్నారని చెప్పారు. -
మంత్రి రఘువీర నివాసాన్ని ముట్టడించిన సమైక్యవాదులు
రాష్ట్ర మంత్రి రఘువీరా రెడ్డికి సమైక్య సెగ తగిలింది. కళ్యాణదుర్గంలోని మంత్రి రఘువీరారెడ్డి నివాసాన్ని సమైక్యవాదులు ఆదివారం ముట్టడించారు. మంత్రి పదవికి వెంటనే రాజీనామా చేయాలని సమైక్యవాదులు రఘువీరారెడ్డిని డిమాండ్ చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడంలో మంత్రి రఘువీరా ఘోరంగా విఫలమయ్యారని ఆరోపించారు. ఈ నేపథ్యంలో వెంటనే పదవికి రాజీనామా చేసి సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని వారు డిమాండ్ చేశారు. రఘువీరా ఇంటిని సమైక్యవాదులు ముట్టడించడంతో స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి సమైక్యవాదులను కట్టడి చేసేందుకు యత్నిస్తున్నారు. -
సీమాంధ్రులకు న్యాయం జరిగేలా కృషి: హరిబాబు
అద్వానీ హామీ ఇచ్చారు: కె.హరిబాబు అగ్రనేతకు సీమాంధ్ర బీజేపీ నేతల వినతిపత్రం సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల్లో ఉన్న భయాందోళనలను తొలగించి, వారికి న్యాయం జరిగేలా చూస్తామని బీజేపీ అగ్ర నేత అద్వానీ ఆ పార్టీ సీమాంధ్ర నేతలకు హామీ ఇచ్చారు. సీమాంధ్ర బీజేపీ నేతలు.. కె.హరిబాబు, కె.శాంతారెడ్డి, వై.రఘునాథబాబు, బి.రంగమోహనరావు, రఘు, బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు ఎస్.విష్ణువర్ధన్‌రెడ్డి శుక్రవారం ఇక్కడ అద్వాన్డ్డ్డ్డ్డ్డ్డ్డీతో భేటీ అయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో సీమాంధ్ర ప్రజల భయాలు, సందేహాలు, సమస్యలపై అద్వానీకి వివరించారు. రాజ్‌నాథ్‌కు ఇచ్చిన వినతిపత్రం ప్రతిని ఆయనకూ అందజేశారు. సీమాంధ్రకు న్యాయం జరిగేలా చూడాలని విన్నవించారు. భేటీ అనంతరం హరిబాబు మీడియాతో మాట్లాడుతూ.. సీమాంధ్ర ప్రజలకు న్యాయం జరిగేలా పార్టీ పూర్తి స్థాయిలో కృషి చేస్తుందని అద్వానీ తమకు హామీ ఇచ్చారని తెలిపారు. 11 అంశాలపై స్పందన కోరుతూ హోంశాఖ పంపిన లేఖ పార్టీకి అందిందని, దీనిపై కసరత్తును రెండ్రోజుల్లో పూర్తిచేసి అభిప్రాయాలను జాతీయ నాయకత్వానికి నివేదిస్తామని, అక్కడి నుంచి తుది స్పందన హోంశాఖకు వెళుతుందన్నారు. అఖిలపక్ష భేటీలో పాల్గొనే విషయాన్ని అధిష్టానం నిర్ణయిస్తుందని చెప్పారు. సీమకు న్యాయం చేయాలని కోరాం.. విభజన జరిగితే వెనకబడ్డ రాయలసీమ ఎడారిగా మారిపోయే అవకాశముందని, పోలవరంతో కృష్ణా-గోదావరి నదుల అనుసంధానం చేసినపుడు రాయలసీమను ఆదుకోవాలని అద్వానీకి విజ్ఞప్తి చేశామని బీజేపీ నేత శాంతారెడ్డి చెప్పారు. గోదావరి నుంచి 200 టీఎంసీల జలాలను రాయలసీమకు తరలించాలని, ఉత్తరాంధ్రకు కూడా నీళ్లు మళ్లించాలని, పోలవరాన్ని నాలుగేళ్లలో పూర్తిచేసి సీమాంధ్ర ప్రజలను ఆదుకోవాలని కోరినట్లు తెలిపారు. వైఎస్సార్సీపీపై అద్వానీ ఆరా! ఆంధ్రప్రదేశ్‌లోని తాజా రాజకీయ పరిస్థితులు, విభజన ప్రక్రియపై వివిధ పార్టీల వైఖరులు ఎలా ఉన్నాయంటూ అద్వానీ తనను కలిసిన సీమాంధ్ర నేతల నుంచి ఆరా తీసినట్టు తెలిసింది. సీమాంధ్రలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి ప్రజాదరణ ఏస్థాయిలో ఉందని ఆయన అడిగినట్లు సమాచారం. మారిన పరిస్థితుల్లో టీడీపీకి ఏపాటి ఆదరణ ఉందని ప్రశ్నించినట్లు సమాచారం. విభజనపై ఇరు ప్రాంతాల నేతలు అందించిన వివరాలను పరిశీలించి రాజ్‌నాథ్‌సింగ్ వాటిపై ఓ నిర్ణయం తీసుకుంటారని అద్వానీ వారికి చెప్పారు. -
కాళహస్తి సమీపంలో చింతా మోహన్‌కు సమైక్య సెగ
కాంగ్రెస్ పార్టీ ఎంపీ చింతా మోహన్‌కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న చింతామోహన్‌ను ఏపీఎన్జీవోలతోపాటు సమైక్యవాదులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే పదవికి రాజీనామా చేయాలని వారు చింతా మోహన్‌ను డిమాండ్ చేశారు. సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందులోభాగంగా ఎంపీ వాహనాన్ని అడ్డగించి రోడ్డుపై వారంతా బైఠాయించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి, చింతా మోహన్ వాహనాన్ని అక్కడి నుంచి పంపివేశారు. -
చిత్తశుద్ధి ఉంటే జీవోఎంను బహిష్కరించాలి: పి.లక్ష్మణ్‌రెడ్డి
సీమాంధ్ర మంత్రులు, ఎంపీలకు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక సూచన ఉద్యమాన్ని దెబ్బతీసేలా కుట్రలు తగవని హితవు సాక్షి, హైదరాబాద్: సీమాంధ్ర ప్రజల ఆకాంక్షలను, ఉద్యమాన్ని దెబ్బతీసేలా కొందరు రాజకీయ నాయకులు కుట్ర చేస్తున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత జస్టిస్ పి.లక్ష్మణ్‌రెడ్డి అనుమానం వ్యక్తం చేశారు. ప్రజల ఆకాంక్షలకు పాతరేసి విభజన ప్రక్రియకు దోహదపడుతున్నారని సీమాంధ్ర ఎంపీలు, కేంద్ర మంత్రులపై ధ్వజమెత్తారు. చిత్తశుద్ధి ఉంటే.. విభజన ప్రక్రియలో భాగంగా ఏర్పాటైన జీవోఎం(మంత్రుల బృందం)ను బహిష్కరించాలని పిలుపునిచ్చారు. సమైక్యమే తమ ఏకైక ఎజెండా అంటున్న ఉద్యోగ సంఘాలు సైతం జీవోఎంను బహిష్కరించాలన్నారు. వేదిక రాష్ట్ర కోఆర్డినేటర్ వి.లక్ష్మణరెడ్డి, నాయకులు వి.రామకృష్ణ, పోతుల శివ, పి.జె.ప్రకాశ్‌తో కలిసి ఆయన బుధవారమిక్కడ మీడియాతో మాట్లాడారు. విభజన జరిగిపోయిందని, మెరుగైన ప్యాకేజీలైనా సంపాదించాలంటూ అధికారపార్టీ నేతలు ప్రజలతో ‘మైండ్ గేమ్’ ఆడుతున్నారని విమర్శించారు. విభజనను అడ్డుకుంటామంటూ ఇప్పటివరకు ప్రజలను మభ్యపెట్టారని, ఇప్పుడు అధిష్టానం తమను మోసం చేసిందంటూ కొత్త రాగం అందుకున్నారని కాంగ్రెస్ ఎంపీలపై ఆయన మండిపడ్డారు. విభజనకోసం ప్రజలు మిమ్ములను ఎన్నుకోలేదనే విషయాన్ని గుర్తించాలని వారికి సూచించారు. కొత్త రాగాలందుకుంటూ కొత్త కుట్రలకు పాల్పడుతూ విభజనకు తోడ్పడితే రాజకీయ భవిష్యత్ కోల్పోక తప్పదని హెచ్చరించారు. జీవోఎం నివేదిక త్వరగా అందించడానికి అధికారపార్టీ సహకరిస్తోందని, తద్వారా విభజనకు పరోక్షంగా దోహదం చేస్తుందన్న విషయాన్ని ప్రజలు గుర్తించారని ఆయన తెలిపారు. సీమాంధ్రులకు రక్షణ కల్పిస్తామన్న బొత్స వ్యాఖ్యల్ని తప్పుబట్టారు. సామాన్య ప్రజల రక్షణకొచ్చిన ఇబ్బందేమీ లేదని, ప్రజల్ని మోసగిస్తున్న నేతలకే రక్షణ సమస్య ఉందన్నారు. కోఆర్డినేటర్ల నియామకం.. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక జిల్లా కోఆర్డినేటర్లుగా పి.వెంకటరమణ(శ్రీకాకుళం), యం.వి.రామరాజు(విశాఖ), ఆర్వీ ప్రసాదరావు(తూ.గో.), నండూరి రమేష్(ప.గో.), రెడ్డి చంద్రశేఖర్(విజయనగరం), ఐ.సుబ్బారావు(కృష్ణా), యం.శ్రీనివాసరెడ్డి(గుంటూరు), సి.హెచ్.వి.కృష్ణరాజు(ప్రకాశం), షేక్ గాజుల ఫరూక్ అలీ(నెల్లూరు), కె.వి.రమణారెడ్డి(చిత్తూరు), పి.రాజేష్‌కుమార్(కడప), బి.వీరభద్రారెడ్డి(కర్నూలు), హేమచంద్రారెడ్డి(అనంతపురం)లను నియమించినట్లు వి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. ప్రాంతీయ కోఆర్డినేటర్లుగా వి.నారాయణరెడ్డి, ఎం.ముత్యాలనాయుడు, ఎం.చంద్రారెడ్డి వ్యవహరించనున్నారని తెలిపారు. సీమాంధ్ర విశ్వవిద్యాలయ అధ్యాపకుల జేఏసీ కన్వీనర్‌గా వి.నారాయణరెడ్డి పనిచేస్తారన్నారు. ప్రైవేటు కళాశాలలు, విద్యాసంస్థల జేఏసీ కన్వీనర్‌గా డి.వి.ఎస్.చక్రవర్తి నియమితులయ్యారన్నారు. -
తీర్మానం పేరుతో మోసం: టీఆర్ఎస్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు సంబంధించిన తీర్మానం రాష్ట్ర శాసనసభకు వస్తుందంటూ ముఖ్యమంత్రి కిరణ్‌కుమార్‌రెడ్డి ఇంకా సీమాంధ్ర ప్రజలను మోసం చేస్తున్నారని టీఆర్ఎస్ పార్టీ ఆరోపించింది. శాసనసభలో తీర్మానం అవసరం లేదనుకొనే కేంద్ర మంత్రివర్గం తెలంగాణ నోట్‌కు ఆమోదం తెలిపిందని ఆ పార్టీ సెక్రటరీ జనరల్ కే కేశవరావు, పొలిట్‌బ్యూరో సభ్యుడు బి. వినోద్‌కుమార్ అన్నారు. పార్టీ నేతలతో కలిసి మంగళవారం తెలంగాణభవన్‌లో వారు విలేకరులతో మాట్లాడారు. ఏన్డీయే ప్రభుత్వం గతంలో మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్, బీహార్ రాష్ట్రాలను విభజించి కొత్త రాష్ట్రాలను ఏర్పాటు చేసిన సమయంలో.. ముందు ఆయా రాష్ట్రాల అసెంబ్లీల్లో విభజనకు ఆమోదం తెలుపుతూ తీర్మానం చేసిన తర్వాతే అందుకు సంబంధించిన కేబినెట్ నోట్‌కు కేంద్ర మంత్రివర్గం ఆమోదం తెలిపిందన్నారు. ఇప్పు డు మన రాష్ట్ర విభజన ప్రక్రియకు సంబంధించి కేబినెట్ నోట్‌పై నిర్ణ యం జరిగిపోయిందన్నారు. అయినా అసెంబ్లీకి తీర్మానం వస్తుం దంటూ ముఖ్యమంత్రి చెప్పడాన్ని వారు తప్పుపట్టారు. ఆ ప్రక్రియ అధిగమించాకే కేబినెట్ నోట్ నిర్ణయం జరిగిందన్నారు. కేంద్రం ఏర్పా టు చేసిన మంత్రుల బృందం విభజన పె పాథమిక నివేదిక రూపొందించి తర్వాత దాన్ని రాష్ట్రపతికి పంపుతారని, అనంతరం ఆయన అభిప్రాయాలను మాత్రమే తెలుసుకుంటారన్నారు. దానికి సంబంధించి ఎలాంటి ఓటింగ్ ఉండే అవకాశమే లేదని స్పష్టంచేశారు. ఈ మాత్రం అవగాహన లేని పరిస్థితిలో కిరణ్, చంద్రబాబు ఉన్నారని దుయ్యబట్టారు. అసెంబ్లీ తీర్మానానికి సంబంధించి దిగ్విజయ్‌సింగ్ కొంత గందరగోళపరిచేలా వ్యాఖ్యలు చేశారని తప్పుపట్టారు. గతంలో ఉమ్మడి పంజాబ్‌ను విభజించినప్పుడు కేవలం సీడబ్లూసీ తీర్మానం చేశారని, ఆ రాష్ట్ర అసెంబ్లీ తీర్మానం కోరకుండానే విభజన ప్రక్రియ పూర్తి చేశారని గుర్తుచేశారు. ఇప్పుడు కిరణ్ మాదిరే ఆ సమయంలో అప్పటి పంజాబ్ సీఎం విభజనను వ్యతిరేకిస్తే రాష్ట్రపతి పాలన విధించారన్నారు. పంజాబ్ విభజన ప్రక్రియపై ఆ రాష్ట్ర అసెంబ్లీ అభిప్రాయం కూడా తీసుకోవాల్సిన అవసరం లేకుండా అప్పటి రాష్ట్రపతి రాజ్యాంగంలో రాష్ట్రాల విభజన ఆర్టికల్‌లో కొంత భాగాన్ని సస్పెండ్ ఉంచుతున్నట్టు గెజిట్ నోటిఫికేషన్ కూడా జారీ చేశారంంటూ.. అందుకు సంబంధించిన కాపీని మీడియాకు చూపించారు. -
సీమాంధ్రులను రెచ్చగొట్టొద్దు: సోనియా గాంధీ
తెలంగాణ ప్రాంత నేతలకు సోనియా సూచన సాక్షి, న్యూఢిల్లీ: సీమాంధ్ర ప్రజలను రెచ్చగొట్టేలా వ్యవహరించొద్దని కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ సూచించారని కాంగ్రెస్ అధికార ప్రతినిధి, రాజ్యసభ సభ్యురాలు రేణుకా చౌదరి, రాజ్యసభ సభ్యుడు ఎం.ఎ.ఖాన్లు శుక్రవారం తెలిపారు. విభజన నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలకు పూర్తి న్యాయం చేస్తామని సోనియా హామీ ఇచ్చారని చెప్పారు. ఇలాఉండగా, తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు ఎన్ని అవరోధాలు ఎదురైనా కాంగ్రెస్ వెనకడుగు వేయబోదని కాంగ్రెస్ అధికార ప్రతినిధి మీమ్ అఫ్జల్ స్పష్టం చేశారు. 8 పార్టీలతో చర్చించిన తర్వాతే నిర్ణయం తీసుకున్నామన్నారు. అయితే, బీజేపీ, టీడీపీ, వైఎస్ఆర్సీపీలు ఆ తర్వాత తమ వైఖరులను మార్చుకున్నాయని విమర్శించారు. -
హైదరాబాద్‌ను వదిలి వెళ్ళాలంటే ఎలా? - సీమాంద్రులు
-
ఒంగోలులో చంద్రబాబు పోస్టర్లు దగ్దం
విభజనపై కేంద్రమంత్రి వర్గం తీసుకున్న నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు శుక్రవారం ఒంగోలు నగరంలో బైక్ ర్యాలీ నిర్వహించాలి. ఒంగోలు కార్పొరేషన్ కార్యాలయం ఎదుట కేంద్ర మంత్రుల దిష్టిబొమ్మలను కార్పొరేషన్ ఉద్యోగులు కోడిగుడ్లు, టమోటాలతో దాడి చేశారు. కోల్కత్తా - చెన్నై జాతీయ రహదారిపై సమైక్యవాదులు రాస్తారోకో నిర్వహించారు. అలాగే జిల్లాలోని కనిగిరి చర్చ్ సెంటర్లో మన్మోహన్ సింగ్, సోనియా గాంధీల దిష్టి బొమ్మలను దగ్దం చేశారు. చంద్రబాబు పోస్టర్లను తగులబెట్టారు. పామూరు బస్టాండ్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నేతలు ముక్కు కాశిరెడ్డి, వైఎమ్ ప్రసాద్ రెడ్డిలు నిరసన చేపట్టారు. -
'నీ ఆస్తిపాస్తులేమైనా ఉంటే నీ కొడుక్కు పంచుకో'
విజయవాడ : తెలంగాణ నోట్‌పై కేంద్ర కేబినెట్ ఆమోదం తెలపటంపై సీమాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. ఉదయం నుంచే విజయవాడతో పాటు కృష్ణాజిల్లా వ్యాప్తంగా బంద్ చేపట్టారు. రాష్ట్రాన్ని విభజిస్తే సిరులు పండే భూములు ఎడారులుగా మారే అవకాశం ఉందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర విభజనను ఎట్టి పరిస్థితుల్లోనూ అంగీకరించేది లేదంటూ అయిదో నెంబర్ జాతీయ రహదారిపై టైర్లు కాల్చి, ఆందోళన చేస్తున్నారు. స్కూలు పిల్లల నుంచి.... మహిళలు, ప్రజలు ఆందోళనలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోనియాగాంధీపై సామాన్య ప్రజానీకం నిప్పులు చెరుగుతున్నారు. " నీ ఆస్తిపాస్తులేమయినా ఉంటే కొడుక్కు పంచుకో సోనియామ్మ....అంతే కానీ రాష్ట్రాన్ని విభజించే హక్కు'' లేదంటూ వారు పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ప్రజలను ఇబ్బందులకు గురి చేయటం సరికాదన్నారు. రాజీవ్ మరణం తర్వాత రాష్ట్రంలో కాంగ్రెస్ తుడిచిపెట్టుకోపోతే.... వైఎస్ రాజశేఖరరెడ్డి తన రెక్కల కష్టంతో అధికారంలోకి తీసుకువచ్చారన్నారు. తనను ఎదిరిస్తే ఎవరినైనా జైల్లో పెట్టించటం.... అనుకూలంగా ఉంటే దగ్గర పెట్టుకోవటం కాంగ్రెస్ అధిష్టానానికి అలవాటుగా మారిందన్నారు. -
జాతిపిత సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ
సాక్షి నెట్వర్క్ : జాతిపిత మహాత్మాగాంధీ జయంతి నాడు సీమాంధ్రవాసులు ఆయన విగ్రహాల సాక్షిగా సమైక్య ప్రతిజ్ఞ చేశారు. భాషా ప్రయుక్త రాష్ట్రాల్లో మొదటిదైన ఆంధ్రప్రదేశ్ ముక్కలు కాకుండా ఒక్కటిగా ఉంచేందుకు దేనికైనా సిద్ధమని ప్రతినబూనారు. వరుసగా 64వ రోజూ బుధవారం కోస్తా, రాయలసీమ జిల్లాల్లో వివిధ రూపాల్లో సమైక్యపోరాటం హోరెత్తింది. రాష్ట్ర విభజన జరిగితే నీటి కరువు తీవ్రత ఎలా ఉంటుందో తెలియజేస్తూ కృష్ణాజిల్లా ముదినేపల్లి మండలం గురజలో ఆర్ఎంపీ వైద్యులు ఉగ్గు గిన్నెలతో స్నానం చేశారు. ఇబ్రహీంపట్నంలో 2 వేల మంది విద్యార్ధులు భారీ ర్యాలీ నిర్వహించారు. గుంటూరు ఇంటర్ బోర్డు ఆర్జేడీ కార్యాలయం వద్ద అధ్యాపకులు గాంధీగిరి పద్ధతిలో శాంతియుత నిరసన వ్యక్తం చేశారు. ప్రకాశం జిల్లా వ్యాప్తంగా శాంతి ర్యాలీలు నిర్వహించి మహాత్ముని విగ్రహాలకి వినతిపత్రాలు సమర్పించారు. పలుచోట్ల జాతిపిత విగ్రహాలకు క్షీరాభిషేకం చేశారు. నెల్లూరుజిల్లా వేదాయపాళెం సెంటర్లో ముదిరాజ్ సేవా సంఘం ఆధ్వర్యంలో చేపట్టిన రిలే నిరాహార దీక్షలు 8వ రోజుకు చేరాయి. విశాఖ జిల్లా వేంపాడు వద్ద జాతీయ రహదారిపై పాయకరావుపేట, తుని ప్రాంతాలకు చెందిన శెట్టి బలిజలు భారీ ర్యాలీ నిర్వహించారు. తూర్పుగోదావరి జిల్లా అయినవిల్లి మండలం ముక్తేశ్వరంలో విద్యార్థులు ప్రదర్శన చేపట్టారు. కాకినాడ గాంధీనగర్ పార్కులోని గాంధీ విగ్రహానికి నివాళులర్పించి కేంద్రం మనసు మార్చాలని వేడుకున్నారు. పశ్చిమ గోదావరిజిల్లా ఏలూరులో ఉపాధ్యాయుల జేఏసీ ఆధ్వర్యంలో గాంధీ జయంతి సందర్భంగా 144 మంది ఉపాధ్యాయులు దీక్షలో కూర్చున్నారు. విజయనగరంలో మహిళా జేఏసీ ఆధ్వర్యంలో కోట జంక్షన్లో నిర్వహించిన నారీభేరి కార్యక్రమం విజయవంతంగా సాగింది. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా సమైక్యవాదులు గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి ఉద్యమాన్ని కొనసాగించారు. చిత్తూరు జిల్లా పలమనేరులో గిరిజన గర్జనకు జనం పోటెత్తారు. చిత్తూరు ఎంపీ శివప్రసాద్ స్త్రీ వేషంలో గాంధీ విగ్రహానికి పుష్పాంజలి ఘటించారు. కర్నూలు నగరంలో ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలు రాజ్‌విహార్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకు శాంతి ర్యాలీ నిర్వహించారు. అనంతపురం నగరంలోని టవర్ క్లాక్ కూడలిలో ‘సమైక్య గర్జన’ నిర్వహించారు. వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగులో 1869 మంది మహిళలు రిలే దీక్షలు చేపట్టారు. కడపలో వేలాది మంది విద్యార్థులు భారీ జాతీయజెండాతో ర్యాలీ నిర్వహించి సమైక్య గర్జన నిర్వహించారు. రాజంపేటలో జేఏసీ ఆధ్వర్యంలో శాంతి ర్యాలీ నిర్వహించారు. ప్రొద్దుటూరులో నివాసాలు, వాహనాలపై సమైక్య జెండాలు ఎగరవేశారు. పులివెందులలో విద్యార్థులు ర్యాలీ నిర్వహించారు. జేఏసీ నేతలపై పనబాక చిందులు సాక్షి నెట్వర్క్ : గుంటూరుజిల్లా బాపట్లలోని పనబాక నివాస గృహాన్ని జేఏసీ నేతలు ముట్టడించి, లోపలికి వెళ్లేందుకు యత్నించగా... పోలీసులు అడ్డుకున్నారు. అనంతరం బయటకు వచ్చిన ఆమె.. ‘వచ్చినప్పుడల్లా రాజీనామా..రాజీనామా అంటూ నసపెడుతున్నారు... నేను మంత్రి పదవికి రాజీనామా చేస్తే మళ్లీ గెలిపిస్తారా... వైఎస్సార్సీపీ, టీడీపీ అభ్యర్థులను పోటీకి నిలపకుండా చూస్తారా..?’ అంటూ చిందులేశారు. మరోవైపు విశాఖలో కేంద్రమంత్రి కృపారాణిని విద్యుత్‌శాఖ ఉద్యోగులు అడ్డుకున్నారు. తాను రాజీనామా చేస్తే సామాన్య పౌరురాలిని అవుతానని, పార్లమెంట్లో వాదనలు విన్పించడం కష్టమవుతుందన్నారు. ఢిల్లీలో అంధ ఉద్యోగుల ధర్నా సాక్షి, న్యూఢిల్లీ : రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ రాష్ట్ర అంధ ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో ఏపీ భవన్ ముందు బుధవారం ధర్నా నిర్వహించారు. విభజనపై కాంగ్రెస్ నిర్ణయాన్ని తప్పుపడుతూ పెద్దఎత్తున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని ఎట్టి పరిస్థితుల్లోనూ విభజించవద్దని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా అంధ ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొర్రెపాటి రవీంద్రబాబు మాట్లాడుతూ... అంధులకు సంబంధించి వసతి గృహాలు హైదరాబాద్‌లోనే ఉన్నాయని, ఇప్పుడు విభజన జరిగితే తమ పరిస్థితి మరింత అంధకారంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రమే పరిష్కరించాలి :ఎస్పీ బాలు కావలి : రాష్ట్రంలో నెలకొన్న సంక్షోభానికి కేంద్ర ప్రభుత్వమే పరిష్కార మార్గం చూపాలని సినీ గాయకుడు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం అన్నారు. నెల్లూరు జిల్లా కావలిలో బుధవారం రాత్రి జరిగిన బాలసుబ్రహ్మణ్యం ఆర్ట్స్ అండ్ మ్యూజిక్ అకాడమీ వార్షికోత్సవంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుత సంక్షోభంతో ప్రజల సమస్యలు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. వీటన్నింటిని పరిగణనలోకి తీసుకుని సమస్య పరిష్కారానికి కేంద్ర ప్రభుత్వం వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు. మరో ఇద్దరి మృతి రాష్ట్ర విభజనలో హైదరాబాద్‌ను కోల్పోతే తనకు భవిష్యత్ ఉండదనే భయంతో చిత్తూరు జిల్లా కేవీబీపురం మండలం కాంట్రపల్లెకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్థి వినోద్(24) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విభజన ప్రక్రియను తట్టుకోలేక విజయనగరంలోని ప్రదీప్‌నగర్ కాలనీకి చెందిన తిరుమలాదేవి(45) మంగళవారం రాత్రి గుండె ఆగి చనిపోయారు. -
వద్దంటున్నా.. విభజనా ? : పి.లక్ష్మణరెడ్డి
సాక్షి, హైదరాబాద్: చట్టబద్ధంగా, శాస్త్రీయంగా ఏర్పాటైన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని విభజించాలనే నిర్ణయం తీసుకొనే ముందు.. ప్రజాభిప్రాయాన్ని తెలుసుకోవాలనే జ్ఞానం ప్రభుత్వాలకు ఉండాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిరక్షణ వేదిక నేత, హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి వ్యాఖ్యానించారు. ఇప్పటికైనా ప్రజాభిప్రాయానికి అనుగుణంగా నిర్ణయం తీసుకోవాలని కేంద్రానికి సూచించారు. వేదికకు చెందిన మరో నేత వి.లక్ష్మణరెడ్డితో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘ఆంధ్రప్రదేశ్‌ను విభజించి సీమాంధ్ర వాళ్లకు ప్రత్యేక రాష్ట్రం ఇచ్చి ఇక్కడ నుంచి వెళ్లి పొమ్మంటున్నారు. 1973లో ప్రత్యేకాంధ్ర అడిగినప్పుడు ఇవ్వలేదు. తెలుగుజాతి అంతా ఒక్కటిగా ఉండాలని అప్పట్లో ఢిల్లీ పెద్దలు చెప్పారు. ఇప్పుడు మాత్రం సీమాంధ్ర ప్రజలు అడగకపోయినా రాష్ట్రం ఇవ్వాలని నిర్ణయించారు. ప్రత్యేక రాష్ట్రాన్ని సీమాంధ్ర ప్రజలు అంగీకరిస్తే మంచిదే! కానీ ఒప్పుకోవడం లేదు. కలిసి ఉంటామంటే.. వెళ్లి పొమ్మంటున్నారు. ఇదెక్కడి న్యాయం? ఎంత వరకు సమంజసం?’ అని జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి ప్రశ్నించారు. ప్రజల మధ్య సాధారణంగా విద్వేషాలు ఉండవని కొందరు స్వార్థపరుల వల్లే విద్వేషాలు పెరుగుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఇరు ప్రాంతాల నాయకులు రెచ్చగొట్టే ప్రసంగాలు మానుకోవాలని హితవు పలికారు. హైదరాబాద్‌లో సభలు, సమావేశాలు నిర్వహించుకునేందుకు అనుమతి ఇచ్చి భద్రత కల్పించాలని పోలీసులకు సూచించారు. సీఎం చొరవ చూపి అసెంబ్లీని సమావేశపరచాలి ‘సీమాంధ్రలో వ్యతిరేకత రావడంతో తెలంగాణపై 2009 డిసెంబర్ ప్రకటనను కేంద్రం ఉపసంహరించుకుని శ్రీకృష్ణ కమిటీని ఏర్పాటు చేసింది. కమిటీ ఇరు ప్రాంతాల్లో పర్యటించి అన్ని వర్గాలతో మాట్లాడి నివేదిక ఇచ్చింది. ఆ నివేదికను ప్రజలకు తెలియజెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. నివేదికపై శాసనసభలో కూలంకషంగా చర్చించి రాజకీయాలను పక్కనబెట్టి విప్‌లు లేకుండా తీర్మానం చేయాలి’ అని జస్టిస్ పి.లక్ష్మణరెడ్డి డిమాండ్ చేశారు. దీనిపై ముఖ్యమంత్రి వెంటనే చొరవ తీసుకొని శాసనసభను సమావేశపరచాలని సూచించారు. ఎంపీలు, కేంద్ర మంత్రులు రాజీనామాలు చేసి కేంద్రంపై ఒత్తిడి పెంచాలన్నారు. శ్రీకృష్ణ కమిటీ నివేదికపై చర్చించి అసెంబ్లీలో తీర్మానం చేయాల్సి ఉన్నందున రాష్ట్ర మంత్రులు, ఎమ్మెల్యేలు రాజీనామాలు చేయాల్సిన అవసరం లేదన్నారు. 3 నుంచి సీమాంధ్రలో సదస్సులు రాష్ట్ర విభజన వల్ల ఎదురయ్యే సమస్యలు, కలిగే నష్టాలను ప్రజలకు వివరించడానికి అక్టోబర్ 3వ తేదీన తిరుపతిలో, 5న గుంటూరులో, 7న విశాఖపట్నంలో సదస్సులు నిర్వహించాలని నిర్ణయించామని వి.లక్ష్మణరెడ్డి తెలిపారు. సదస్సుల్లో హైకోర్టు మాజీ న్యాయమూర్తులు లక్ష్మణరెడ్డితోపాటు టి.గోపాలకృష్ణ, మాజీ వీసీ వేణుగోపాలరెడ్డి, న్యాయవాది జంధ్యాల రవిశంకర్, రైతు నేతలు అక్కినేని భవానీప్రసాద్, ఎర్నేని నాగేంద్రనాథ్, ప్రొఫెసర్లు శామ్యూల్, రామకృష్ణరాజు, వీరభద్రారెడ్డితో పాటు వివిధ రంగాల ప్రముఖులు పాల్గొంటారు. హైదరాబాద్‌లోనూ సదస్సు ఏర్పాటు చేసే యోచనలో ఉన్నామని వి.లక్ష్మణరెడ్డి వెల్లడించారు. టీడీపీ లేఖ వెనక్కి తీసుకోవాలి రాష్ట్రంలో సీపీఎం, ఎంఐఎం, వైఎస్సార్ సీపీ.. మూడు పార్టీలే సమైక్యవాదాన్ని వినిపిస్తున్నాయని వి.లక్ష్మణరెడ్డి చెప్పారు. మిగతా పార్టీలు కూడా తమ నిర్ణయాన్ని పునఃసమీక్షించుకోవాలని విజ్ఞప్తి చేశారు. రాష్ట్ర విభజనకు అనుకూలంగా ఇచ్చిన లేఖను టీడీపీ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తెలంగాణ కోసం పని చేస్తున్న టీఆర్ఎస్ మాదిరిగా రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచడానికి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పోరాటం చేస్తోందని చెప్పారు. -
యుద్ధానికి సిద్ధమే: దేవీప్రసాద్
ఖమ్మం, న్యూస్‌లైన్ : ‘ఆరు దశాబ్దాలుగా ఈ ప్రాంత ప్రజలు చేస్తున్న ఉద్యమ ఫలితంగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ప్రకటన వచ్చింది. దీనిపై సీమాంధ్ర ప్రజలు రాద్ధాంతం చేస్తున్నారు. మేం శాంతియుతంగా విడిపోదాం అంటుంటే.. వారు యుద్ధం చేయాలంటున్నారు.. యుద్ధమే చేయాలనుకుంటే మేమూ సిద్ధమే’ అని టీఎన్జీవో కేంద్ర సంఘం అధ్యక్షుడు దేవీప్రసాద్ అన్నారు. ఖమ్మంలో శుక్రవారం ఆయన విలేకరులతో, టీఎన్జీవోల సభలో మాట్లాడుతూ, మీరు సమ్మె చేయండి.. మీ జీతాలు మీకిప్పిస్తామని సీమాంధ్ర ఉద్యోగులకు ఓ మంత్రి భరోసా ఇవ్వడంలో ఆంతర్యం ఏమిటని ఆయన ప్రశ్నించారు. చర్చలకు రమ్మని ఏపీఎన్జీవో ఉద్యోగులు పిలుస్తున్నారని, విభజన తర్వాతే వస్తామన్నారు. ఏపీఎన్జీవోల వైఖరివల్లే పీఆర్సీ అందకుండా పోతోందని ఆవేదన వ్యక్తంచేశారు. ఉద్యోగులకు దసరాలోపు 45 శాతం ఇంటీరియం చెల్లించాలని, లేనిపక్షంలో టీజేఏసీ ఆధ్వర్యంలో అక్టోబరులో మహోద్యమం చేపడతామని హెచ్చరించారు. గ్రామీణ వ్యవస్థకు పునాది అయిన గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వ తీరు వివక్షతపూరితంగా ఉందని దేవీప్రసాద్ విమర్శించారు. హైదరాబాద్‌లో శుక్రవారం జరిగిన తెలంగాణ గ్రామ రెవెన్యూ సహాయకుల కేంద్ర సంఘం ఆవిర్భావ సభలో ఆయన మాట్లాడారు. గ్రామ సహాయకులను నాలుగో తరగతి ఉద్యోగులుగా గుర్తించి, రూ.15 వేల కనీస వేతనం చెల్లించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టీజీఓ అధ్యక్షుడు శ్రీనివాస్‌గౌడ్, విఠల్ తదితరులు మాట్లాడారు. -
విభజనేమైనా కాంగ్రెస్ ఇంటి సమస్యనా?
-
..అలా ముందుకు వెళదాం: చంద్రబాబు నాయుడు
సాక్షి, హైదరాబాద్: వస్తున్నా మీకోసం, తెలుగువారి ఆత్మగౌరవ యాత్రలంటూ ఎన్ని ప్రయత్నాలు చేసినా పార్టీ గ్రాఫ్ పెరక్కపోవడంతో తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు పార్టీ నేతలను నమ్మించేందుకు చాలా శ్రమపడుతున్నారు. సీమాంధ్ర, తెలంగాణ ప్రాంత నేతలతో గురువారం తన నివాసంలో ఉమ్మడి సమావేశం నిర్వహించారు. పార్టీకి మంచి భవిష్యత్తే ఉంటుందని, తనను నమ్మాలని చెప్పారు. తెలంగాణకు అనుకూలంగా లేఖ ఇచ్చినప్పటికీ సీమాంధ్ర ప్రజలు సానుకూలంగా తనను అర్థం చేసుకున్నారని తెలిపారు. మా లేఖ వల్లనే తెలంగాణ అంటూ ప్రజల్లో విస్తృతంగా ప్రచారం చేయాలని ఆయన పార్టీ నేతలకు సూచించారు. అలాగే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం చేయాలని కోరుతూ ఆ ప్రాంత నేతలు వివిధ రూపాల్లో పోరాటాలు చేయాలని చంద్రబాబు ఆదేశించారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఇటు సీమాంధ్రలో, అటు తెలంగాణలోనూ పార్టీ వెనకబడిపోయిందని నేతలు ప్రస్తావించగా... రాష్ట్రంలో నెలకొన్న సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఉభయ ప్రాంతాల నేతలందరినీ త్వరలోనే ఢిల్లీకి తీసుకెళతానని ఆయన చెప్పారు. రాష్ట్రపతి ప్రణబ్ ముఖర్జీని, ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ను కలిసి విషయాలను వారి దృష్టికి తీసుకురానున్నట్లు తెలిపారు. శుక్రవారం తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత నేతలతో విడివిడిగా మాట్లాడి సమస్యలు తెలుసుకుని శనివారం ఉమ్మడి సమావేశంలో పరిష్కారమార్గాలు సూచిస్తానని చెప్పారు. సమావేశానంతరం గాలి ముద్దుకృష్ణమనాయుడు, పెద్దిరెడ్డి విలేకరులతో మాట్లాడుతూ చంద్రబాబు తన ఆత్మగౌరవయాత్ర అనుభవాలను తెలిపారన్నారు. 14వ ఆర్థిక సంఘానికి ప్రభుత్వం సమర్పించిన నివేదిక తప్పుల తడకగా ఉందని, ఇది రాష్ట్రానికి మేలు చేయకపోగా కీడే ఎక్కువ చేస్తుందని విమర్శించారు. సమావేశంలో పార్టీ నాయకులు యనమల రామకృష్ణుడు, టి. దేవేందర్‌గౌడ్, ఎర్రబెల్లి దయాకరరావు, ఎల్.రమణ, గాలి ముద్దుకృష్ణమనాయుడు, మోత్కుపల్లి నర్సిం హులు, సోమిరెడ్డి చంద్రమోహన్‌రెడ్డి, కొనకళ్ల నారాయణ, వైఎస్ చౌదరి, సీఎం రమేష్, రావుల చంద్రశేఖరరెడ్డి, ఎనుముల రేవంత్‌రెడ్డి, జి.జైపాల్‌యాదవ్, కంభంపాటి రామ్మోహనరావు, డాక్టర్ కోడెల శివప్రసాదరావు, ఇనుగాల పెద్దిరెడ్డి, వర్ల రామయ్య, ఎం.అరవిందకుమార్‌గౌడ్, వీవీవీ చౌదరి, శమంతకమణి, పంచుమర్తి అనూరాధ, సీతక్క, శోభా హైమవతి, బి. శోభారాణి తదితరులు పాల్గొన్నారు. ఉదయం, సాయంత్రం సమావేశం జరగ్గా, ఉదయం జరిగిన సమావేశంలో నేతలతోపాటు మీడియా విశ్లేషకులు పాల్గొన్నారు. -
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ ఏదీ: అశోక్‌బాబు
సాక్షాత్తు రాష్ట్ర రాజధాని నగరంగా ఉన్న హైదరాబాద్‌లోనే న్యాయవాదులు, ఉద్యోగులపై దాడులు జరుగుతున్నాయని, ఇలాగైతే హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ ఎలా ఉంటుందని ఏపీఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ప్రశ్నించారు. తాము ఈనెల 16వ తేదీన తమ భవిష్యత్తు కార్యచరణను ప్రకటిస్తామన్నారు. ప్రభుత్వ కమిటీలతో తప్ప.. పార్టీ ప్రతినిధులతో చర్చలు జరపబోమని ఆయన వెల్లడించారు. సీమాంధ్ర ప్రజలకు విభజనపై సమాధానం ఇవ్వాలని ఆ ప్రాంత ఎమ్మెల్యేలకు లేఖలు రాస్తామని, సీమాంధ్ర ఎంపీలపై ఒత్తిడి పెంచుతామని, విభజన వద్దని టీఆర్ఎస్ ఎమ్మెల్యేలను కలుస్తామని అశోక్ బాబు చెప్పారు. సోనియా గాంధీని కలవాల్సిందిగా సీమాంధ్ర ఎంపీలను కోరుతామన్నారు. పోలీసుల్లో కూడా కొందరు పక్షపాత ధోరణిని అవలంబిస్తున్నారని ఆయన ఆరోపించారు. -
హైదరాబాద్‌లో సీమాంధ్రులకు రక్షణ ఏదీ: అశోక్‌బాబు
-
అవసరమైతే సుప్రీంకోర్టుకు : అశోక్‌బాబు
సాక్షి, హైదరాబాద్: కొద్ది మంది ఎంపీలే సీమాంధ్ర ప్రజల మనోభావాలకు అనుగుణంగా వ్యవహరించారని, మిగతా ఎంపీలు, కేంద్ర మంత్రుల తీరు బాగా లేదని ఏపీఎన్జీవో సంఘం అధ్యక్షుడు, ఉద్యోగ సంఘాల జేఏసీ చైర్మన్ అశోక్‌బాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘ఎంపీలు రాజీనామాలు చేస్తారో లేదో తెలుసుకోవాలనుకుంటున్నాం. వారు ఏం చేస్తారో, వారి కార్యాచరణ ఏమిటో స్పష్టంగా తెలియాలి’’ అని అన్నారు. సీమాంధ్ర ఉద్యోగులు చేస్తున్న సమ్మెపై హైకోర్టు ఈ నెల 16న ఇవ్వనున్న తీర్పు ఎలా ఉన్నా ఉద్యమం కొనసాగిస్తామని స్పష్టం చేశారు. ఆయన బుధవారమిక్కడ ఏపీఎన్జీవో కార్యాలయంలో మాట్లాడారు. ‘‘తీర్పు మాకు వ్యతిరేకంగా వచ్చే అవకాశం ఉందని అంచనా వేస్తున్నాం. తీర్పు వ చ్చాక సుప్రీంకోర్టుకు వెళ్లే అంశంపై జేఏసీ కార్యవర్గ భేటీలో చర్చిస్తాం. అవసరమైతే సుప్రీం కోర్టుకు వెళ్లడానికి వెనకాడం’’ అని చెప్పారు. తెలంగాణపై కేబినెట్ నోట్ సిద్ధమైన తర్వాత రాష్ట్ర రాజకీయ వాతావరణంలో మార్పు వచ్చే అవకాశం ఉందని పేర్కొన్నారు. శాసనసభలో తెలంగాణ తీర్మానాన్ని, పార్లమెంట్లో బిల్లును ఓడించడానికి ఎమ్మెల్యేలు, ఎంపీలపై ఒత్తిడి తెస్తామని, దీనికోసం కార్యాచరణ రూపొందించనున్నామని తెలిపారు. ఈ నెల 16న పూర్తిస్థాయిలో జేఏసీ కార్యవర్గాన్ని ఏర్పాటు చేస్తామని చెప్పారు. సీమాంధ్ర న్యాయవాదులు మానవహారం నిర్వహిస్తే తెలంగాణ న్యాయవాదులు అడ్డుకోవడం సమంజసం కాదన్నారు. 14న భవిష్యత్ కార్యాచరణ నిర్ణయిస్తాం: సీమాంధ్ర న్యాయవాదులు హైదరాబాద్ అందరికీ రాజధాని అని, ఇక్కడ ఇరు ప్రాంతాల ప్రజలు తమ వాదనలు వినిపించడానికి అవకాశం ఉంటుందని సీమాంధ్ర న్యాయవాదుల జేఏసీ కన్వీనర్ మోహన్‌రెడ్డి అన్నారు. ఈనెల 14న అనంతపురంలో జరిగే జేఏసీ సమావేశంలో భవిష్యత్ కార్యాచరణను ఖరారు చేస్తామని బుధవారమిక్కడ చెప్పారు. ‘మీరు నిరసన కార్యక్రమాలు చేసినప్పుడు మేం అడ్డుకోలేదు. ఇప్పుడు మేం చేస్తున్నప్పుడు మీరు అడ్డుకోవడం మంచి పద్ధతి కాదు’ అని తెలంగాణ న్యాయవాదులకు మోహన్‌రెడ్డి సూచించారు. -
విభజన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకగలరా?:షర్మిల
-
విభజన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకగలరా?:షర్మిల
ఆత్మకూరు: విభజన తర్వాత సీమాంధ్రులు హైదరాబాద్‌లో బతకగలరా అని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు షర్మిల ప్రశ్నించారు. సమైక్య శంఖారావం బస్సు యాత్రలో భాగంగా ఈ మధ్యాహ్నం శ్రీ పొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా ఆత్మకూరులో జరిగిన బహిరంగ సభలో ఆమె ప్రసంగించారు. సాక్షాత్తు హైకోర్టులో సీమాంధ్ర న్యాయవాదులపై తెలంగాణవాదులు దాడి చేశారు. నిన్న ఏపి ఎన్జీఓలపై దాడి చేశారు. ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే, ఇక రాష్ట్రం విడిపోతే హైదరాబాదులో సీమాంధ్రుల పరిస్థితి ఏమిటని అడిగారు. గతంలో మద్రాసును తీసుకున్నారు, ఇప్పుడు సీమాంధ్రులకు హైదరాబాద్‌ను దూరం చేస్తామంటున్నారన్నారు. ఒక్క హైదరాబాద్ నుంచే సగం ఆదాయం వస్తోంది. హైదరాబాద్‌పై హక్కులేదంటే సంక్షేమ పథకాలు అమలయ్యేది ఎలా? పదేళ్లలో హైదరాబాద్ లాంటి రాజధాని నిర్మాణం సాధ్యమేనా? అని ప్రశ్నించారు. 50 ఏళ్ల అభివృద్ధికి నిదర్శనం హైదరాబాద్ అని తెలిపారు. విభజనకు అంగీకరిస్తూ బ్లాంక్ చెక్ లాంటి లేఖను టిడిపి అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కేంద్రానికి ఇచ్చారు. విభనకు అసలు కారకుడు చంద్రబాబేనని షర్మిల మండిపడ్డారు. చేసిందంతా చేసి ఇప్పుడు ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని విమర్శించారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందని హెచ్చరించారు. కాంగ్రెస్, టిడిపి నేతలు రాజీనామా చేస్తే రాష్ట్ర విభజన ఆగిపోయేదన్నారు. నాలుగు సీట్ల కోసం కోట్ల మంది తెలుగు ప్రజలకు అన్యాయం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
'చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పే రోజు దగ్గరలోనే ఉంది'
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనకు తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు లేఖే కారణమని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే కాపు రామచంద్రారెడ్డి ఆరోపించారు. ఆదివారం అనంతపురంలో రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన పాల్గొని ప్రసంగించారు. విభజనకు అనుకూలం అంటూ కేంద్రానికి లేఖ ఇచ్చిన బాబు సిగ్గు లేకుండా సీమాంధ్రలో ఆత్మగౌరవ యాత్ర చేస్తున్నారని ఆయన ఎద్దేవా చేశారు. బాబు వ్యవహారిస్తున్న వైఖరి చుస్తుంటూ మహాభారతంలోని కురుక్షేత్రంలో శకుని పాత్ర గుర్తుకు వస్తుందని అన్నారు. చంద్రబాబుకు ప్రజలు బుద్ది చెప్పే రోజు చాలా దగ్గరలోనే ఉందని రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. -
సీమాంధ్ర ప్రయోజనాలు కాపాడే బిల్లుకే మద్దతివ్వాలి
సాక్షి, హైదరాబాద్: విభజన ప్రక్రియపై సీమాంధ్రలో వివిధ వర్గాల్లో తలెత్తుతున్న అభద్రతాభావం, ఉద్యోగ వర్గాలలో ఆందోళన, విద్య, వైద్య, నదీ జలాలు తదితర విషయాల్లో సందేహాలను నివృత్తి చేస్తూ, ఆ ప్రాంత ప్రయోజనాలను పరిరక్షించే విధంగా ఉన్న తెలంగాణ బిల్లుకు మాత్రమే పార్లమెంట్లో మద్దతు ఇవ్వాలని రాష్ట్ర బీజేపీ నిర్ణయించింది. ఈ మేరకు జాతీయ నాయకులకు విజ్ఞప్తి చేయాలని ఏకగ్రీవంగా తీర్మానించారు. పార్టీ జాతీయ అధ్యక్షుడు రాజ్‌నాథ్‌సింగ్‌ను కలిసి ఈ అంశాలన్నింటినీ సవివరంగా వివరించాలన్న నిర్ణయానికి వచ్చారు. బీజేపీ సీమాంధ్ర ప్రాంత రాష్ట్ర పదాధికారులు, జిల్లా అధ్యక్షులు, జిల్లా ఇన్చార్జులతోపాటు జై ఆంధ్ర ఉద్యమ కమిటీ నేతలు శనివారం హైదరాబాద్‌లో సమావేశమై తాజా పరిణామాలపై చర్చించారు. సీమాంధ్ర ఉద్యమ కమిటీ చైర్మన్ యడ్లపాటి రఘునాథబాబు అధ్యక్షతన నిర్వహించిన ఈ సమావేశంలో పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, రాష్ట్ర పార్టీ వ్యవహారాల ఇన్చార్జి వి.సతీష్జీ, పార్టీ నేతలు కంభంపాటి హరిబాబు, కె.శాంతారెడ్డి, సోము వీర్రాజు, బండారు దత్తాత్రేయ, ఎస్.సురేష్‌రెడ్డి, రంగారాజు, చంద్రశేఖర్‌రెడ్డి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర విభజనకు పార్టీ బహిరంగంగా మద్దతు ప్రకటించిన నేపథ్యంలో ఇప్పుడు ప్రజల నుంచి తమకు ఎదురవుతున్న సమస్యలపై వారి మధ్య చర్చ జరిగింది. జాతీయ పార్టీగా తెలంగాణ అంశంపై తీసుకున్న నిర్ణయం నుంచి వెనక్కిపోయే అవకాశం లేకపోయినప్పటికీ.. ప్రస్తుత పరిస్థితుల్లో రాష్ట్రంలోని కోస్తా, రాయలసీమ ప్రాంతాల ప్రజల అభిప్రాయాలను గమనించి విభజన ప్రక్రియలో పార్టీ ముందుకు పోవడం మంచిదన్న అభిప్రాయం సమావేశంలో వ్యక్తమైంది. రాష్ట్రాన్ని విభజిస్తే సీమాంధ్ర ప్రాంతానికి న్యాయం జరగాలని, దానిపై తగు సూచనలతో కూడిన డాక్యుమెంట్‌ను సమర్పించాలని సమావేశంలో నేతలు అభిప్రాయపడ్డారు. ప్రజల్లో ఉద్రిక్తతలను పెంచే దిశగా ప్రకటనలు చేసే వారి విషయంలో కేంద్రం కఠిన చర్యలు చేపట్టే దిశగా బీజేపీ అగ్రనాయత్వం చొరవ తీసుకోవాలని కోరారు. -
విద్యార్ఠుల భారీ నిరసన ర్యాలీ
-
బాబూ తెలంగాణ డిమాండ్ న్యాయమైనదేనా? : పొన్నం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. కేంద్రం ప్రకటించిన విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తు సీమాంధ్ర ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తునా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలు విభజనను ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు సమైక్యంధ్ర కోరటంలో న్యాయం ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు. అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ న్యాయమో కాదో చెప్పాలన్నారు. ఏపీఎన్జీవోలు రాష్ట్ర విభజన అంశంపై సమ్మె చేయడం సరికాదన్నారు. టీఎన్జీవోలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఏనాడు సమ్మె చేయలేదని పొన్నం గుర్తుచేశారు. సమైక్య రాష్ట్ర ఉద్యమంలో సీమాంధ్ర ఉద్యోగులు పావులుగా మారుతే నష్ట పోయేది వారేనని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంలో సీమాంధ్ర ఉద్యోగుల హాజరుకావడం, ఇరు ప్రాంతాల్లో జరిగిన అరెస్ట్‌లు, నమోదైన కేసులపై ప్రభుత్వ చీఫ్ సెక్రేటరీ వాస్తవాలు వెల్లడించాలిని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు. -
ఏఎన్‌యూలో లగడపాటికి చేదు అనుభవం
విజయవాడ లోక్‌సభ సభ్యుడు లగడపాటి రాజగోపాల్‌కు శనివారం నాగార్జున నగర్‌లోని ఆచార్య నాగార్జున యూనివర్శిటీ (ఏఎన్‌యూ) ప్రాంగణంలో చేదు అనుభవం ఎదురు అయింది. ఈ రోజు ఉదయం యూనివర్శిటీలో సమైక్యాంధ్రకు మద్దుతుగా చేపట్టిన ఆందోళన కార్యక్రమానికి లగడపాటి ముఖ్యఅతిథిగా హాజరయ్యారు. లగడపాటి వెంటనే ఎంపీ పదవికి రాజీనామా చేసి సమైక్యాంధ్ర ఉద్యమంలో పాల్గొనాలని విద్యార్థి ఐకాస, సమైక్యవాదులు సంయుక్తంగా డిమాండ్ చేశారు. లగడపాటి రాజీనామా చేసే వరకు ఆయన్ని కదలనివ్వమని వారు భీష్మించుకుని కూర్చున్నారు. దాంతో ఒక్కసారిగా స్థానికంగా ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దీంతో పోలీసులు రంగప్రవేశం చేసి పరిస్థితిని ఆదుపులోకి తీసుకువచ్చేందుకు ప్రయత్నిస్తున్నారు. -
చిత్తూరు జిల్లాలో కొనసాగుతున్న నిరసనలు
సమైక్యాంధ్రకు మద్దతుగా చిత్తూరు జిల్లాలో నిరసనలు కొనసాగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లాలోని ఆర్టీసీ బస్సులు గత 30 రోజులుగా డిపోలకే పరిమితమైనాయి. దాంతో తిరుపతి రీజియన్‌లో రూ.44 కోట్ల నష్టం వాటిల్లిందని ఆర్టీసీ ఉన్నతాధికారులు గురువారం ఇక్కడ వెల్లడించారు. అలాగే రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని కోరుతూ తిరుపతి మున్సిపల్ కార్యాలయం వద్ద జేఏసీ చేపట్టి దీక్ష 30 రోజుకు చేరుకుంది. శ్రీ వేంకటేశ్వర యూనివర్శిటీలో విద్యార్థి జేఏసీ ఆంధ్రప్రదేశ్ విభజనను నిరసిస్తు చేస్తున్న దీక్ష 25వ రోజుకు చేరుకుంది. అలాగే ఆర్డీఓ కార్యాలయం వద్ద రెవెన్యూ ఉద్యోగులు, ఎన్టీఆర్ సర్కిల్ వద్ద ఎన్జీవోలు చేపట్టిన దీక్ష 17వ రోజుకు చేరాయి. టీటీడీ పరిపాలన భవనం వద్ద ఆ సంస్థ ఉద్యోగుల దీక్ష 26వ రోజుకు చేరింది. ఆంధ్రప్రదేశ్ విభజనపై కాంగ్రెస్ పార్టీ అనుసరిస్తున్న వైఖరికి నిరసనగా వైఎస్ జగన్ చేపట్టిన ఆమరణకు మద్దతుగా తుడా సర్కిల్ వద్ద వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు చేపట్టిన దీక్ష ఐదవ రోజుకు చేరుకుంది. అలాగే తిరుపతి ఆర్టీసీ బస్టాండ్‌లో ఆర్టీసీ కార్మికుల చేపట్టిన దీక్ష 10వ రోజుకు చేరింది. -
జగన్‌కు మద్దతుగా దీక్షలు
-
వైఎస్ జగన్‌కు మద్దతుగా సీమాంధ్రలో దీక్షలు
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరికి నిరసనగా చంచల్‌గూడ జైల్లో వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదివారం ప్రారంభించిన ఆమరణ నిరాహార దీక్షకు సీమాంధ్రలోని సమైక్యవాదులు పెద్ద ఎత్తున సంఘీభావం ప్రకటించారు. చిత్తూరు జిల్లా కుప్పం నుంచి శ్రీకాకుళం జిల్లా వరకు వివిధ ప్రాంతాల్లో ఆయనకు మద్దుతుగా ఆమరణ నిరాహార దీక్షను చేపట్టారు. అలాగే పలు పట్టణాల్లో ర్యాలీలు నిర్వహించారు. చిత్తూరు జిల్లాలోని తిరుపతిలో స్థానిక ఎమ్మెల్యే భూమన కరుణాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వైఎస్ జగన్‌కు మద్దతుగా నగర ప్రజలు పెద్ద ఎత్తున ర్యాలీ నిర్వహించారు. ఆయన ఫోటోలు పట్టుకుని సమైక్యవాదులు తిరుపతి పుర వీధుల్లో జగన్‌కు అనుకూలంగా పెద్ద పెట్టున నినాదాలు చేశారు. రాష్ట్రాన్ని సమైక్యంగా ఉంచాలని వారు నినదించారు. సమైక్య రాష్ట్రాన్ని ముక్కలు చేస్తే కాంగ్రెస్ పార్టీకి పరాభవం తప్పదని వారు హెచ్చరించారు. జగన్ దీక్షకు మద్దతుగా మదనపల్లెల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ దేశాయి తిప్పారెడ్డి నిరాహార దీక్ష చేపట్టారు. అదే జిల్లాలోని పుంగనూరులో ముస్లిం సోదరులు రిలే నిరాహార దీక్షను చేపట్టారు. సత్యవేడులో వైఎస్ఆర్ పార్టీ కన్వీనర్ నిరంజన్ రెడ్డి ఆధ్వర్యంలో ఆ పార్టీ కార్యకర్తలు ఆమరణ నిరాహార దీక్షకు కుర్చున్నారు. వైఎస్ఆర్ జిల్లాలోని రాజంపేటలో ఆ పార్టీ ఎమ్మెల్యే అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో నిరాహార దీక్షకు పునుకున్నారు. అలాగే జిల్లా వ్యాప్తంగా పలు ప్రాంతాల్లో పలువురు దీక్ష చేపట్టారు. కర్నూలు జిల్లాలోని ఆలూరులో ఆ పార్టీ నేత సౌమ్య ఆధ్వర్యంలో నిరాహార దీక్ష ప్రారంభమైంది. అదే జిల్లాలోని ఆత్మకూరులో జగన్ అభిమానులు, ఆయన పార్టీ కార్యకర్తులు నిరాహార దీక్ష చేపట్టారు. తూర్పు గోదావరి జిల్లా వ్యాప్తంగా పలు మండల కేంద్రాల్లో వైఎస్ జగన్ అభిమానులు రిలే నిరాహార దీక్షలు చేస్తున్నారు. కృష్ణా జిల్లాలో జగన్ దీక్షకు మద్దతుగా పెడన ఎమ్మెల్యే జోగి రమేష్ ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. విజయవాడలో కూడా జగన్‌కు సంఘీభావంగా పలువురు ఆమరన నిరాహార దీక్ష చేస్తున్నారు. విశాఖ జిల్లాలోని నర్సీపట్నంలో ఆ పార్టీ రూరల్ మహిళ అధ్యక్షురాలు పీల మహాలక్ష్మి ఆధ్వరంలో దీక్ష ప్రారంభమైంది. ఉత్తరాంధ్ర జిల్లాలో కూడా పలువురు జగన్‌కు సంఘీభావంగా ఆమరణ నిరాహార దీక్ష చేపట్టారు. -
సమైక్య ఉద్యమాన్ని ప్రజలే నడిపిస్తున్నారు: ఎంపీ అనంత
సమైక్యాంధ్ర ఉద్యమాన్ని ప్రజలే చేస్తున్నారు కాని నాయకులు కాదని అనంతపురం ఎంపీ అనంత వెంకట్రామిరెడ్డి శుక్రవారం న్యూఢిల్లీలో స్పష్టం చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజనపై తీసుకున్న సీడబ్ల్యూసీ నిర్ణయాన్ని నిలిపివేయాలని ఆయన కాంగ్రెస్ అధిష్టానాన్ని డిమాండ్ చేశారు. విభజనతో నెలకొంటున్న సమస్యలపై సమాధానం చెప్పకుండా విభజన ఎలా చేస్తారని ఆయన ప్రశ్నించారు. తామ లోక్‌సభ సభ్యత్వానికి రాజీనామాలను స్పీకర్ ఫార్మాట్లో ఇచ్చామని గుర్తు చేశారు. ఈ నెల 27, 28 తేదీల్లో ఆంటోని కమిటీని కలసి తమ వాదనలు వినిపిస్తామని తెలిపారు. శనివారం సీమాంధ్ర ఎంపీలంతా ఇక్కడ సమావేశం కానున్నట్లు ఆయన వెల్లడించారు. ఆ సమావేశానికి కేంద్ర మంత్రులను కూడా ఆహ్వానించినట్లు చెప్పారు. భవిష్యత్ కార్యాచరణపై రేపు జరిగే ఆ సమావేశంలో నిర్ణయిస్తామని అనంత వెంకట్రామిరెడ్డి ఈ సందర్భంగా అన్నారు. -
సీమాంధ్రులకు భద్రత కల్పిస్తాం: సుదర్శనరెడ్డి
హైదరాబాద్, తెలంగాణ ప్రాంతాల్లోని సీమాంధ్రవాసులకు భద్రత కల్పిస్తామని రాష్ట్ర మంత్రి సుదర్శన్ రెడ్డి హామీ ఇచ్చారు. శుక్రవారం ఆయన నిజామాబాద్‌లో విలేకర్ల సమావేశంలో ప్రసంగించారు. కేబినెట్ పరంగా సీమాంధ్రులకు హామీ ఇస్తున్నట్లు తెలిపారు. సీమాంధ్రులు ఎటువంటి అభద్రతాభావానికి లోనుకావద్దని ఆయన స్పష్టం చేశారు. నీటి పంపిణిలో కూడా ఎవరికి ఎటువంటి అన్యాయం జరగదన్నారు. ఓ వ్యక్తి వ్యాఖ్యలను దృష్టిలో ఉంచుకుని ఆందోళన చెందవద్దని ఆయన సీమాంధ్రవాసులకు సూచించారు. అన్ని ప్రాంతాల న్యాయమైన పంపిణీని ఎవరూ అడ్డుకోలేరని మంత్రి సుదర్శన్‌రెడ్డి ఈ సందర్భంగా పేర్కొన్నారు. తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడితే సీమాంధ్ర ఉద్యోగులు తమ ప్రాంతాలకు వెళ్లవలసిందే అని కేసీఆర్ ఇటీవల వ్యాఖ్యలు చేశారు. వారికి ఎటువంటి అప్షన్లు ఉండవని ఈ సందర్భంగా కేసీఆర్ వ్యాఖ్యానించారు. దీంతో హైదరాబాద్‌లోని సీమాంధ్ర ఉద్యోగుల నుంచి తీవ్ర నిరసనలు వ్యక్తమైనాయి. దాంతో సచివాలయం నుంచి సీమాంధ్రలోని మారుమూల పల్లె వరకు కేసీఆర్ వ్యాఖ్యలపై నిరసనలు వ్యక్తమైన సంగతి తెలిసిందే. -
జోరువానలోనూ కొనసాగుతున్న ఆమరణ దిక్ష
-
'ప్రజల మనోభావాలను గుర్తించకుండానే విభజన'
రాష్ట్ర ప్రజల మనోభావాలు గుర్తించకుండా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తుందని ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, కడప మాజీ మేయర్ రవీంద్రనాథ్ రెడ్డి శుక్రవారం కడపలో ఆరోపించారు. అయితే రాయల తెలంగాణ పేరుతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రంలో మరింత చిచ్చు పెడుతోందని వారు పేర్కొన్నారు. ఇలాంటి నిర్ణయాలకు తీసుకుంటే కాంగ్రెస్ పార్టీకి ప్రజల మరచిపోలేని శిక్ష వేస్తారన్నారు. స్వార్థ రాజకీయ ప్రయోజనాల కోసమే కాంగ్రెస్ పార్టీ రాష్ట్రాన్ని చీల్చాలని చూస్తోందని శ్రీకాంత్‌రెడ్డి అన్నారు. కడపలో సమైక్యాంధ్ర కోసం ఎమ్మెల్యే శ్రీకాంత్‌రెడ్డి, మాజీ మేయర్ రవీంద్రనాథ్‌రెడ్డి చేపట్టిన ఆమరణ దీక్ష శుక్రవారానికి ఐదవ రోజుకు చేరింది. జోరువానలోనూ వీరి దీక్ష కొనసాగుతోంది. రాష్ట్రాన్ని చీల్చాలని చూస్తున్న నేతలకు ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని శ్రీకాంత్‌రెడ్డి హెచ్చరించారు. ఎమ్మెల్యే శ్రీకాంత్ రెడ్డి, రవీంద్రనాథ్ రెడ్డి ఆరోగ్య పరిస్థితిని వైద్యులు ఈరోజు ఉదయం పరిక్షించారు. అలాగే సమైక్యాంధ్రకు మద్దతుగా కేంద్ర, రాష్ట్ర మంత్రులు రాజీనామా చేయాలని రైల్వే కోడూరు ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసలు శుక్రవారం డిమాండ్ చేశారు. సీమాంధ్ర ప్రజాప్రతినిధులు రాజీనామా చేస్తే రాజకీయ సంక్షోభం ఏర్పడుతుంది కానీ రాష్ట్ర విభజన మాత్రం జరగదని ఆయన స్పష్టం చేశారు. ఇక వైఎస్ఆర్ జిల్లా రాజంపేటలో సమైక్యాంధ్రకు మద్దతుగా వైఎస్ఆర్ సీపీ ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి చేపట్టిన ఆమరణ నిరహార దీక్ష రెండో రోజుకు చేరింది. ఓ వైపు వర్షం కురుస్తున్నా.. అమర్నాథ్రెడ్డి దీక్ష మాత్రం కొనసాగుతూనే ఉంది. వర్షం కారణంగా దీక్షా శిబిరం కుంగిపోయింది. చలి విపరీతంగా ఉన్నా.. మొక్కవోని ధైర్యంతో అమర్నాథ్రెడ్డి దీక్షను కొనసాగిస్తున్నారు. -
సీమాంధ్రలో కొనసాగుతున్న నిరసనలు
రాష్ట్ర విభజనను వ్యతిరేకిస్తూ సమైక్యావాదులు సీమాంధ్రలో చేపట్టిన ఉద్యమం ఉప్పెనలా కొనసాగుతోంది. ఉత్తరాంధ్రలోని శ్రీకాకుళం జిల్లా నుంచి నెల్లూరు జిల్లా వరకు నిరసనలు మిన్నంటాయి. విభజనకు వ్యతిరేకంగా శ్రీకాకుళంలో జిల్లాలోని వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ధర్మాన కృష్ణాదాస్ తన నియోజకవర్గంలో నేడు ఉయదం నుంచి సాయంత్రం వరకు బస్సు యాత్ర చేపట్టనున్నారు. ఆయనచేపట్టిన బస్సు యాత్ర ఉదయం 9.00 గంటలకు మడపాం నుంచి ప్రారంభం కానుంది. సాయంత్రం 5.00 గంటలకు కృష్ణాదాస్ నియోజవర్గమైన నరసన్నపేట చేరుతుంది. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన ప్రసంగించనున్నారు. శ్రీకాకుళం జిల్లా వ్యాప్తంగా కేబుల్ టీవీ చానల్స్ ప్రసారాలను శుక్రవారం నిలిపివేస్తున్నట్లు ఎమ్‌ఎస్‌వోల సంఘం ప్రకటించింది. ఈ రోజు సాయంత్రం 5.00గంటలకు శ్రీకాకుళంలో ఏర్పాటు చేసిన ర్యాలీలో పాల్గొనాలని ఆ సంఘం సిబ్బందికి పిలుపునిచ్చింది. సీమాంధ్రలోని అన్ని జిల్లాల్లో ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. విజయనగరం, విశాఖపట్నం,తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి,కృష్ణ, గుంటూరు,ప్రకాశం, నెల్లూరు జిలాలల్లో సమైక్యాంధ్రకు మద్దతుగా ఆంధ్రులు చేపట్టిన నిరసనలు మిన్నంటాయి. అయితే రాయలసీమా ప్రాంతంలోని నాలుగు జిల్లాల్లో కూడా ఆర్టీసీ బస్సులు డిపోలకే పరిమితమైనాయి. అయితే తిరుపతిలో మాత్రం ఆర్టీసీ బస్సులు తిరుమలకు వెళ్తున్నాయి. రవాణ సౌకర్యాలు లేకపోవడంతో తిరుమలో శ్రీవారిని దర్శించుకునేందుకు వస్తున్న భక్తుల సంఖ్యా చాలా వరకు తగ్గింది. గురువారం తిరుపతి నుంచి కేవలం 75 బస్సులు మాత్రమే తిరుమల వెళ్లాయి. -
సీమాంధ్రలో మిన్నంటిన సమైక్య నిరసనలు
-
సీమాంధ్రలో మిన్నంటిన సమైక్య నిరసనలు
కేంద్రం ప్రభుత్వం రాష్ట్ర విభజన నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించుకోవాలని ఏపీఎన్జీవో సంఘం మంగళవారం హైదరాబాద్ లో డిమాండ్ చేసింది. ఆ నిర్ణయాన్ని వెనక్కి తీసుకునేంత వరకు సమ్మె ఉధృతంగా కొనసాగుతోందని స్పష్టం చేసింది. సీమాంధ్రలోని ప్రజాప్రతినిధులు రాజీనామాలు చేసి వెంటనే సమైక్య ఉద్యమంలో పాల్గొన్నాలని ఎపీఎన్జీవో సంఘం గతంలో వారిని కొరింది. అయితే ఆ విషయంపై ప్రజాప్రతినిధులు తర్జనభర్జన పడుతుండటంతో గత అర్థరాత్రి నుంచి ఏపీఎన్జీవో సంఘం సమ్మెను మరింత తీవ్రతరం చేసింది. దీంతో సీమాంధ్రలోని 13 జిల్లాలో జనజీవనం అస్తవ్యస్తమైంది. అయా జిల్లాల్లోని ఆర్టీసీ బస్సులు ఎక్కడిక్కడ డిపోల్లోనే నిలిచిపోయాయి. సమ్మె ప్రకటించిన ఏపీ ఎన్జీవోల పలు ప్రజాసంఘాలు, ఆర్టీసీ, వ్యాపార సంస్థలు మద్దతు ప్రకటించాయి. తిరుపతి నగరంలోని గాంధీ సర్కిల్లో మానవహారంగా ఏర్పడి టీచర్స్ జేఏసీ తమ నిరసన తెలిపింది. అలాగే తిరుపతి నుంచి తిరమలకు వెళ్లే బస్సులు డిపోల్లోనే పరిమితమైయ్యాయి. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఆ సంస్థకు చెందిన కార్మికులు నిరసనకు దిగారు. వివిధ ప్రాంతల నుంచి కలియుగ దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. అయితే భక్తులకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయలేక టీటీడీ చేతులెత్తేసింది. నెల్లూరు జిల్లాలోని తడ మండలం కాజులూరు వద్ద సమైక్యవాదులు కార్మికులను అడ్డుకున్నారు. కావలిలో బస్సు సర్వీసులను నిరసనకారులు అడ్డుకుని నిలిపివేశారు. దాంతో చెన్నై- బెంగళూరు నగరాల మధ్య బస్సు సర్వీసులు నిలిచిపోయాయి. నెల్లూరు కలెక్టరేట్‌కు ఏపీఎన్జీవోలు మంగళవారం తాళం వేసి తమ నిరసన తెలియజేశారు. ప్రకాశం, గుంటూరు జిల్లాల్లో కూడా ఇంచుమించి ఇదే పరస్థితి నెలకొంది. సమైక్యాంధ్రకు మద్దతుగా కృష్ణా జిల్లాలో బంద్ కొనసాగుతుంది. జిల్లాలోని వివిధ పట్టాణాల్లో బస్సులు డిపోలకే పరిమితమైనాయి. ఏపీఎన్జీవోలు, ఆర్టీసీ ఉద్యోగులు మంగళవారం చేపట్టిన సమ్మెలో పాల్గొన్నాయి. విద్యాసంస్థలు, వ్యాపార సంస్థులు స్వచ్ఛందంగా బంద్ పాటిస్తున్నాయి. విశాఖ జిల్లాలో కూడా బంద్ కొనసాగుతుంది. జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలు మూతపడ్డాయి. నగరంలోని వివిధ డిపోల్లో 1060 బస్సులు నిలిచిపోయాయి. దాంతో నిత్యం రద్దిగా ఉండే ద్వారకా బస్టాండ్ మంగళవారం బోసిపోయింది. ఒడిశా, ఛత్తీస్‌గఢ్, మధ్యప్రదేశ్‌లకు రవాణా సర్వీసులు ఆగిపోయయి. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ పార్టీ వైఖరి మార్చుకోవాలని ఆర్టీసీ కార్మికులు మద్దెలపాలెం డిపో వద్ద రాస్తారోకో చేశారు. అయితే సమ్మెతో రోజుకు రూ.70 లక్షలు నష్టం వస్తున్నట్లు ఆర్టీసీ అధికారులు పేర్కోన్నారు. అనంతపురంలో సమైకాంధ్ర మద్దతుగా నిరసనకారులు చేపట్టిన సమ్మె ఉధృతంగా సాగుతోంది. జిల్లా వ్యాప్తంగా ఆర్టీసీ బస్సులు నిలిచిపోయాయి. ఏపీఎన్జీవోలు సమ్మెలో పాల్గొన్నారు. -
సీమాంధ్రుల అభిప్రాయాలు సేకరిస్తాం: దిగ్విజయ్ సింగ్
తెలంగాణ ఏర్పాటుకు అనుకూలంగా తీసుకున్న నిర్ణయంపై సీమాంధ్రుల అభిప్రాయాలను కాంగ్రెస్ ఉన్నత స్థాయి కమిటీ సేకరిస్తుందని దిగ్విజయ్‌సింగ్ తెలిపారు. బెంగళూరు గ్రామీణ, మండ్య లోక్‌సభ స్థానాలకు 21న ఉప ఎన్నికలు జరగనున్న సందర్భంగా బుధవారమిక్కడ నిర్వహించిన కాంగ్రెస్ కార్యకర్తల సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. తనతోపాటు కేంద్ర మంత్రులు ఏకే ఆంటోనీ, వీరప్ప మొయిలీ, సోనియా గాంధీ రాజకీయ సలహాదారు అహ్మద్ పటేల్‌లతో ఉన్నత స్థాయి కమిటీ ఏర్పడిందని చెప్పారు. ‘కుటుంబంలాంటి ఉమ్మడి రాష్ట్రాన్ని విభజించడం చాలా కష్టం. తెలంగాణ సమస్య చాలా ఏళ్లుగా నలుగుతోంది. ఆందోళనలు కొనసాగుతూ వచ్చాయి. ఆంటోనీ కమిటీ ఈ రోజు నుంచే పని ప్రారంభిస్తుంది’ అని తెలిపారు. ‘ఎన్జీవోలు, విద్యార్థులు, అన్ని పక్షాల రాజకీయ నాయకులు తమ అభిప్రాయాలను కమిటీకి చెప్పవచ్చు. అందరికీ సంతృప్తికరమైన రీతిలో నిర్ణయం తీసుకుంటాం. ఏపీ ఎన్జీవోలు సమ్మెకు వెళ్లవద్దు. వారు తమ అభిప్రాయాలను కమిటీకి చెప్పవచ్చు. తెలంగాణ సమస్య ఎంతోకాలంగా ఉంది. అందుకే నిర్ణయం తీసుకున్నాం. సీడబ్ల్యూసీ కూడా అందుకే తీర్మానం చేసింది. అందరూ అర్థం చేసుకుని, ఆందోళన మార్గాన్ని విరమించుకోవాలి. పార్టీలు సంయమనం పాటించాలి’ అని విజ్ఞప్తి చేశారు. విభజనపై తీవ్ర వ్యతిరేకత ఉన్న మాట నిజమేనని అంగీకరించారు. అయితే, అన్ని సమస్యలకూ కాంగ్రెస్ పరిష్కారం చూపుతుందని భరోసా ఇచ్చారు. ఉన్నతస్థాయి కమిటీ అభిప్రాయ సేకరణ జరిగే వరకు విభజన ప్రక్రియ ఆగుతుందా అన్న ప్రశ్నకు సమాధానాన్ని దాటవేశారు. -
విభజన ప్రక్రియను ఆపాలి: ఎంపీ వేణుగోపాల్ రెడ్డి
న్యూఢిల్లీ : రాష్ట్ర విభజన ప్రక్రియను తక్షణమే ఆపాలని నర్సరావుపేట టీడీపీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్ రెడ్డి డిమాండ్ చేశారు. విభజన వల్ల సీమాంధ్ర ప్రజలు నష్టపోతారని ఆయన బుధవారమిక్కడ అన్నారు. రాజీనామాలు ఆమోదించేవరకూ ఆందోళనలు కొనసాగిస్తామని వేణుగోపాల్ రెడ్డి స్పష్టం చేశారు. ప్రధానమంత్రి, సోనియాగాంధీ ముందు ఫ్లకార్డులు ప్రదర్శించి నిరసనలు తెలిపామని ఆయన అన్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా నిన్న సభలో తెలుగుదేశం సభ్యులు నిమ్మల కిష్టప్ప, నారాయణరావు, వేణుగోపాల్‌రెడ్డి, శివప్రసాద్ పోడియం వద్దకు వచ్చి ‘జై సమైక్యాంధ్ర’ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ సభను స్తంభింప చేసిన విషయం తెలిసిందే.