కాంగ్రెస్ పార్టీ ఎంపీ చింతా మోహన్కు ఆదివారం సమైక్య సెగ తగిలింది. రేణిగుంట విమానాశ్రయం నుంచి శ్రీకాళహస్తికి వెళ్తున్న చింతామోహన్ను ఏపీఎన్జీవోలతోపాటు సమైక్యవాదులు ఆదివారం ఉదయం అడ్డుకున్నారు. సమైక్యాంధ్రకు మద్దతుగా వెంటనే పదవికి రాజీనామా చేయాలని వారు చింతా మోహన్ను డిమాండ్ చేశారు.
సమైక్యాంధ్రకు మద్దతుగా ఆందోళనకారులు పెద్ద పెట్టున నినాదాలు చేశారు. అందులోభాగంగా ఎంపీ వాహనాన్ని అడ్డగించి రోడ్డుపై వారంతా బైఠాయించారు. దాంతో పోలీసులు రంగప్రవేశం చేశారు. ఆందోళనకారులను చెదరగొట్టి, చింతా మోహన్ వాహనాన్ని అక్కడి నుంచి పంపివేశారు.