
బాబూ తెలంగాణ డిమాండ్ న్యాయమైనదేనా? : పొన్నం
హైదరాబాద్: రాష్ట్ర విభజనపై సీమాంధ్ర ప్రాంతంలో ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతోంది. కేంద్రం ప్రకటించిన విభజన ప్రక్రియను వెనక్కి తీసుకోవాల్సిందిగా డిమాండ్ చేస్తు సీమాంధ్ర ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులు పెద్ద ఎత్తునా ర్యాలీలు, నిరసనలు, ధర్నాలు చేపడుతున్నారు. సీమాంధ్ర ప్రజలు విభజనను ఆపాల్సిందిగా డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో సీమాంధ్ర ప్రజలు సమైక్యంధ్ర కోరటంలో న్యాయం ఉందని టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు అంటున్నారని ఎంపీ పొన్నం ప్రభాకర్ పేర్కొన్నారు.
అయితే ప్రత్యేక తెలంగాణ డిమాండ్ న్యాయమో కాదో చెప్పాలన్నారు. ఏపీఎన్జీవోలు రాష్ట్ర విభజన అంశంపై సమ్మె చేయడం సరికాదన్నారు. టీఎన్జీవోలు ప్రత్యేక రాష్ట్ర డిమాండ్‌తో ఏనాడు సమ్మె చేయలేదని పొన్నం గుర్తుచేశారు. సమైక్య రాష్ట్ర ఉద్యమంలో సీమాంధ్ర ఉద్యోగులు పావులుగా మారుతే నష్ట పోయేది వారేనని పొన్నం ప్రభాకర్ తెలిపారు. సీమాంధ్ర ఉద్యమంలో సీమాంధ్ర ఉద్యోగుల హాజరుకావడం, ఇరు ప్రాంతాల్లో జరిగిన అరెస్ట్‌లు, నమోదైన కేసులపై ప్రభుత్వ చీఫ్ సెక్రేటరీ వాస్తవాలు వెల్లడించాలిని పొన్నం ప్రభాకర్ డిమాండ్ చేశారు.