Seemandhra
-
అభివృద్ధి, సుస్థిర పాలనకే మా మద్దతు
సాక్షి, హైదరాబాద్/పంజగుట్ట: సీమాంధ్రులమని చెప్పుకుంటూ కొందరు తెలంగాణలో కులాలు, ప్రాంతాల మధ్య విద్వేషాలు రెచ్చగొడుతున్నారని గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ ఆరోపించింది. తెలంగాణలో స్థిరపడిన సుమారు 15 లక్షల మంది సీమాంధ్రులు 40 నియోజకవర్గాల్లో గెలుపోటములను ప్రభావితం చేయగలరంటూ తమ పేరుతో కొందరు స్వార్థ రాజకీయాల కోసం వివిధ పార్టీలను 15 అసెంబ్లీ టికెట్లు ఇవ్వాలని బెదిరిస్తున్నారని దుయ్యబట్టింది. అలాంటి వారితో తమకు ఎలాంటి సంబంధం లేదని స్పష్టం చేసింది. ఆదివారం హైదరాబాద్‌లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎ. హనుమంతరెడ్డి మాట్లాడుతూ తెలంగాణ అభివృద్ధి, సుస్థిర పాలనకే తమ మద్దతు ఉంటుందన్నారు. ప్రశాంతంగా ఉన్న తెలంగాణలో విద్వేషాలు రెచ్చగొట్టే వారికి తాము పూర్తి వ్యతిరేకమని తేలి్చచెప్పారు. సెటిలర్స్ అనే పదమే లేదని.. తామంతా తెలంగాణావాసులమేనన్నారు. విద్య, వైద్యం, ఉపాధి కోసమే తెలంగాణకు.. గ్రేటర్ రాయలసీమ ప్రాంతం (నెల్లూరు, ప్రకాశం, కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం) నుంచి తెలంగాణలో దాదాపు 15 లక్షల మంది స్థిరపడ్డారని హనుమంతరెడ్డి చెప్పారు. హైదరాబాద్‌లోని శేరిలింగంపల్లి, కూకట్పల్లి, కుత్బుల్లాపూర్, మేడ్చ ల్, మల్కాజిగిరి, సికింద్రాబాద్, ఖైరతాబాద్, జూబ్లీ హిల్స్, ఉప్పల్, అంబర్పేట్, ముషీరాబాద్, సనత్‌నగర్, నాంపల్లి, రాజేంద్రనగర్, సికింద్రాబాద్ కంటోన్మెంట్, ఉప్పల్ నియోజకవర్గాలతోపాటు మహ బూబ్‌నగర్, రంగారెడ్డి, మెదక్, నిజామాబాద్, వరంగల్ జిల్లాల్లోనూ చాలా మంది వ్యాపారాలు, వృత్తి ఉద్యోగాల్లో స్థిరపడ్డారని ఆయన వివరించారు. రాష్ట్రం విడిపోయాక అన్నదమ్ముల్లా కలసిమె లసి ప్రశాంతంగా జీవిస్తున్నామన్నారు. ఇక్కడ ఎ లాంటి ఇబ్బందులు లేవన్నారు. దేశంలోనే అ త్యంత వెనుకబడిన, కరువుపీడిన ప్రాంతమైన రా యలసీమ నుంచి విద్య, వైద్యం, ఉపాధి కోసం ప్రజలు హైదరాబాద్ సహా తెలంగాణకు వస్తుంటారన్నారు. మాకూ ఓ భవన్ కట్టివ్వాలి... గ్రేటర్ రాయలసీమ అసోసియేషన్ అఫ్ తెలంగాణ సంస్థ స్థాపించి పదేళ్లు అయ్యిందని... ఇందులో 40 వేల మంది సభ్యులు ఉన్నారని హనుమంతరెడ్డి చెప్పారు. సాంఘిక, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించుకొనేందుకు వీలుగా ఇతర ప్రాంతవాసులకు కేటాయించినట్లుగా తమ అసోసియేషన్‌కు సైతం ఒక భవనం తెలంగాణ ప్రభుత్వం నిర్మించి ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో సంస్థ ప్రధా న కార్యదర్శి రాఘవ్, బద్రీనాథ్, నిరంజన్ దేశాయ్, చంద్రశేఖర్‌రెడ్డి, కులేశ్వర్‌రెడ్డి, రాజే‹Ù, రాజశేఖర్‌రెడ్డి, రామకృరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనే సాగుతోంది
సూర్యాపేట : రాష్ట్రంలో సీమాంధ్రుల పాలనే కొనసాగుతోందని మాజీ ఎమ్మెల్సీ, తెలంగాణ జనసమితి రాష్ట్ర నాయకుడు కపిలవాయి దిలీప్‌కుమార్ విమర్శించారు. సోమవారం పట్టణంలోని రైతుబజారు వద్ద గల అంబేద్కర్ విగ్రహం వద్ద స్వచ్ఛ రాజకీయాలు, నియోజకవర్గ సమాగ్రాభివృద్ధి కోసం తెలంగాణ జనసమితి జిల్లా ఇన్చార్జి కుంట్ల ధర్మార్జున్ ఆధ్వర్యంలో చేపట్టిన మహాపాదయాత్రను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా తెలంగాణ సిద్ధాంతకర్త జయశంకర్ చిత్రపటానికి, అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి ని వాళులర్పించారు. అనంతరం ఆయన మాట్లాడు తూ రాజకీయాల్లో జవాబుదారీతనం ఉండాలన్నా రు. ప్రస్తుతం నాయకులు ఏ పార్టీలో ఉంటున్నారో తెలియడం లేదన్నారు. టీఆర్ఎస్ ప్రభుత్వం రాజకీయ సంస్కృతిని ధ్వంసం చేసిందని విమర్శించారు. తెలంగాణ ఉద్యమ ఆకాంక్షలు పక్కకు పోయి కాంట్రాక్టర్లే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. ప్రజల జీవన ప్రమాణాలు మెరుగుపర్చకుండా ప్రాజెక్టులు, ఇతర నిర్మాణాలు చేపడితే లాభం ఉండదన్నారు. జయశంకర్ ఆశయ సాధన కోసం ప్రొఫెసర్ కోదండరాం తెలంగాణ జనసమితిని స్థాపించారని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా ఇంచార్జి ధ ర్మార్జున్ మాట్లాడుతూ కాళేశ్వరం పేరుతో ప్రభుత్వం కమీషన్లు దండుకుంటూ అభివృద్ధి జరుగుతుందని ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారని విమర్శించారు. కార్యక్రమంలో చెలమారెడ్డి, జిల్లా కోఆర్డినేటర్ రమాశంకర్, మల్లయ్య, యాదగిరి, పందిరి నాగిరెడ్డి, రాజమల్లయ్య, పరీక్షన్, అంజయ్య, కృష్ణారెడ్డి, మట్టన్న, నారబోయిన కిరణ్‌కుమార్, అశోక్‌కుమార్, శంకర్, మహేష్ పాల్గొన్నారు. -
సీమాంధ్రలో అక్కడక్కడా భారీ వర్షాలు
విశాఖపట్నం : పశ్చిమ మధ్య బంగాళాఖాతంలో ఉపరితల ఆవర్తనం స్థిరంగా కొనసాగుతుందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం వెల్లడించింది. అలాగే ఉత్తర కోస్తాంధ్ర సమీప ప్రాంతాల్లో కూడా ఈ ఆవర్తనం కొనసాగుతుందని పేర్కొంది. 3.1 కిలో మీటర్ల ఎత్తులో ఈ ఆవర్తనం కొనసాగుతుందని తెలిపింది. అయితే దక్షిణ తమిళనాడు - కొమరిన్ ప్రాంతంలో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని చెప్పింది. ఈ ఆవర్తనం 5.8 కిలోమీటర్ల ఎత్తులో ఆవరించి ఉందని వెల్లడించింది. ఈ నేపథ్యంలో సీమాంధ్రలో వర్షాలు, అక్కడక్కడా భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం పేర్కొంది. -
ద్రోణి ప్రభావంతో సీమాంధ్రలో భారీ వర్షాలు
విశాఖపట్నం : ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకు అల్పపీడన ద్రోణి ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం ఆదివారం వెల్లడించింది. సోమవారంలోగా అది వాయువ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశం ఉందని తెలిపింది. ద్రోణి ప్రభావంతో కోస్తాంధ్ర, రాయలసీమలో పలుచోట్ల భారీ వర్షాలు పడతాయని పేర్కొంది. దక్షిణ కోస్తా తీరం వెంబడి గంటకు 45 నుంచి 50 కి.మీ వేగంతో ఈదురుగాలులు వీస్తాయని చెప్పింది. చేపల వేటకు వెళ్లే మత్స్యకారులు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది. -
సీమాంధ్రలో భారీ వర్షాలు పడే అవకాశం
విశాఖపట్నం : బంగాళాఖాతంలో వాయుగుండం ఏర్పడిందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం మంగళవారం వెల్లడించింది. ఇది చెన్నైకి నైరుతి దిశగా 240 కి.మీ దూరంలో కేంద్రీకృతమైందని తెలిపింది. వాయుగుండం ప్రభావంతో తమిళనాడులో వర్షాలు కురుస్తాయని పేర్కొంది. అలాగే కోస్తాంధ్ర, రాయలసీమలో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని విశాఖలోని వాతావరణ కేంద్రం వివరించింది. రాగాల 24 గంటల్లో చాలా చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపింది. -
కొనుగోళ్ల పర్వాన్ని వివరించాం
♦ ఫిరాయింపులపై చర్యల అధికారాన్ని స్పీకర్ నుంచి తప్పించాలి ♦ మూడు నెలల కాలవ్యవధి పెట్టి ఈసీకి అప్పగించాలి ♦ 10 ప్రధాన హామీలు నెరవేర్చని పార్టీని పోటీనుంచి నిషేధించాలి ♦ సీమాంధ్ర, జీహెచ్ఎంసీలో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి ♦ ఎన్నికలను అర్థవంతంగా నిర్వహించేందుకు ఈసీకి మూడు సూచనలిచ్చాం ♦ చంద్రబాబు అనైతిక రాజకీయాలపై ప్రధానికి లేఖ రాస్తాం ♦ న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో.. నిరాకరణ ఉండదు ♦ పోరాటం ఇంతటితో ఆగదు.. న్యాయస్థానాలకూ వెళతాం ♦ ‘సేవ్ డెమొక్రసీ’ ఉద్యమంపై వైఎస్ జగన్ సంతృప్తి న్యూఢిల్లీ నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి : రాష్ట్రంలో జరుగుతున్న అనైతిక రాజకీయాలను, అవినీతి సొమ్ముతో విచ్చలవిడిగా సాగిస్తున్న ఎమ్మెల్యేల కొనుగోళ్ల తీరును ఎన్నికల సంఘం దృష్టికి తీసుకెళ్లామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్ మోహన్‌రెడ్డి చెప్పారు. అనైతిక రాజకీయాలకు అడ్డుకట్ట వేయడానికి, ఫిరాయింపుల నిరోధక చట్టాన్ని మరింత బలోపేతం చేసి ప్రజల ఆకాంక్షలకు రక్షణ కవచంగా మార్చాలని వైఎస్సార్సీపీ చేస్తున్న పోరాటానికి తప్పకుండా ఫలితం ఉంటుందన్న విశ్వాసం వ్యక్తం చేశారు. న్యాయం జరగడంలో ఆలస్యం ఉండవచ్చే మో కానీ.. న్యాయం తప్పకుండా జరుగుతుందంటూ తొణికిసలాడిన ఆత్మవిశ్వాసంతో మీడియా అడిగిన ప్రశ్నలకు సమాధానం ఇచ్చారు. గురువారం ఎన్నికల సంఘంతో భేటీ అనంతరం ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘రూ. 20-30 కోట్ల అవినీతి సొమ్ముతో ఒక్కో ఎమ్మెల్యేని అధికార టీడీపీ కొనుగోలు చేస్తున్న తీరును వివరించాం. కొందరు ఎమ్మెల్యేలకు మంత్రి పదవులను ఎర చూపుతున్న పరిస్థితిని విడమరిచి చెప్పాం’ అని తెలిపారు. ఎన్నికలను మరింత అర్థవంతంగా నిర్వహించడానికి అనుసరించాల్సిన మార్గాలను సూచించాలని వివిధ రాజకీయ పార్టీలను ఎన్నికల సంఘం కోరిన నేపథ్యంలో తమ పార్టీ తరఫున మూడు సూచనలతో కూడిన వినతిపత్రాన్ని సమర్పించామని చెప్పారు. ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి, వరప్రసాద్, బుట్టా రేణుక తదితరులతో కూడిన బృందం జగన్ నేతృత్వంలో ఎన్నికల ప్రధాన కమిషనర్ నజీమ్ జైదిని కలిసి ఈ వినతిపత్రం సమర్పించారు. ప్రధానమంత్రికి లేఖ రాస్తాం ఏపీలో సాగుతున్న అక్రమాలు, అవినీతి, అనైతిక రాజకీయాలను వివరిస్తూ ప్రధానమంత్రికి లేఖ రాస్తానని ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు సమాధానంగా జగన్ చెప్పారు. ‘‘ప్రధాన మంత్రి అపాయింట్మెంట్ అడిగాం. మీరన్నట్లుగా (బీజేపీకి టీడీపీ మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదా? అని అడిగిన విలేకరిని ఉద్దేశించి) మిత్రపక్షం కాబట్టి ఇవ్వలేదోమో! మా వాదనలు, విజ్ఞప్తులు వివరిస్తూ ప్రధానికి లేఖ రాస్తాం. ‘చంద్రబాబు.. అవినీతి చక్రవర్తి’ పుస్తకాన్ని పోస్టు ద్వారా పంపిస్తాం’’ అని తెలిపారు. ‘సేవ్ డెమొక్రసీ’ ఢిల్లీ యాత్ర సంతృప్తికరంగా సాగిందా? అంటూ ఒక విలేకరి అడిగిన ప్రశ్నకు ‘‘వ్యవస్థలో మార్పు తీసుకు రావాలంటే మన వాదన గట్టిగా వినిపించాలి. సాధ్యమైనంత మేర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావాలి. ఏదో ఒక రోజు న్యాయం జరుగుతుంది’’ అని సమాధానమిచ్చారు. మీ పోరాటం ఫలిస్తుందనే నమ్మకం ఉందా? అని మరో విలేకరి ప్రశ్నించగా... ‘‘ఇదో పోరాటం. న్యాయం జరుగుతుందా, జరగదా అనే విషయం పక్కనబెడితే.. ఆంధ్రప్రదేశ్‌లో జరుగుతున్న అన్యాయాన్ని దేశం దృష్టికి తీసుకొచ్చాం. దేశంలోని ముఖ్య నాయకులు, ముఖ్యమైన సంస్థలు, వ్యవస్థల దృష్టికి ఆంధ్రప్రదేశ్‌లో సాగుతున్న అనైతిక రాజకీయాల తీరును వివరించగలిగాం’ అని జవాబు చెప్పారు. ‘ఇంతటితో ఆగం. కోర్టులకూ వెళతాం. అక్కడా మా పోరాటాన్ని కొనసాగిస్తాం. న్యాయం జరగడం ఆలస్యం కావచ్చేమో కానీ... నిరాకరించడం మాత్రం జరగదు’ అని మరో ప్రశ్నకు ఆత్మవిశ్వాసంతో సమాధానం చెప్పారు. గ్యాస్ కనెక్షన్లు అధికంగా ఇవ్వాలని వినతి కేంద్ర పెట్రోలియం, సహజ వాయు మంత్రి ధర్మేంద్ర ప్రదాన్‌ను జగన్ గురువారం మధ్యాహ్నం ఇక్కడి శాస్త్రిభవన్‌లోని మంత్రి కార్యాలయంలో కలిశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... ‘‘హోం మంత్రి, ఆర్థిక మంత్రికి ఇచ్చిన వినతిపత్రాలను ఇక్కడ కూడా ఇచ్చాం. ముఖ్యంగా రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి పర్వం, ఫిరాయింపుల పర్వాన్ని వివరించాం. అలాగే ఏపీ పునర్ వ్యవస్థీకరణ చట్టంలో పొందుపరిచిన హామీల్లో పెండింగ్‌లో ఉన్న అంశాలను వారి దృష్టికి తీసుకెళ్లాం. ఇటీవలే కేంద్రం ప్రకటించిన ఉచిత గ్యాస్ కనెక్షన్లలో ఆంధ్రప్రదేశ్‌కు పెద్దమొత్తంలో ఇవ్వాలని కోరాం..’’ అని వివరించారు. ఈసీకి వైఎస్సార్సీపీ ఇచ్చిన సూచనలు సూచన-1 పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలకు అనర్హత వేటు వేసే అధికారాన్ని స్పీకర్ పరిధి నుంచి తప్పించి, మూడు నెలల వ్యవధిలో నిర్ణయం తీసుకునేలా ఎన్నికల సంఘానికి అప్పగించమని కేంద్ర ప్రభుత్వానికి సిఫార్సు చేయండి. అలా చేయకుంటే ప్రజాస్వామ్యం బతకదు. అనైతిక రాజకీయాలతో పట్టపగలే ప్రజాస్వామ్యాన్ని, ప్రజల ఆకాంక్షలను ఖూనీ చేస్తారనే ఆందోళన వ్యక్తమవుతోంది. స్పీకర్ అధికార పార్టీకి చెందిన వ్యక్తే కాబట్టి... అధికార పార్టీలోకి ఫిరాయించిన ఎమ్మెల్యేల శాసనసభ్యత్వాన్ని రద్దు చేయరు. ఎమ్మెల్యేలు రాజీనామా చేయరు. ఇటు అనర్హత వేటు పడకుండా, అటు రాజీనామాలు చేయకుండా.. ఎమ్మెల్యేలుగా కొనసాగుతూ మంత్రి పదవులూ చేపట్టే దౌర్భాగ్య పరిస్థితి వచ్చింది. సూచన-2 ఎన్నికల మేనిఫెస్టోలోని 10 ముఖ్యమైన హామీలను అన్ని పార్టీలను అడగండి. అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ 10 హామీలను నెరవేర్చలేకపోతే.. తర్వాత జరిగే ఎన్నికల్లో ఆ పార్టీలు పోటీ చేయకుండా నిషేధం విధించండి. ఎన్నికల్లో చంద్రబాబు నాయుడు అబద్దాలు చెప్పి ప్రజలను ఏ విధంగా మోసం చేశారో చూస్తే అర్థమవుతుంది. ♦ రూ. 87,612 కోట్ల వ్యవసాయ రుణాలను పూర్తిగా మాఫీ చేస్తానని చంద్రబాబు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చిన తర్వాత రుణమాఫీ కింద చంద్రబాబు ఇచ్చిన సొమ్ము.. రైతుల వడ్డీలకు సరిపోలేదు. రుణాలన్నీ మాఫీ చేస్తానని డ్వాక్రా అక్కచెల్లెమ్మలకూ పంగనామాలు పెట్టారు. ♦ జాబు కావాలంటే బాబు రావాలంటూ ఎన్నికల ముందు టీడీపీ ఊదరగొట్టింది. ఉద్యోగం ఇవ్వలేని పక్షంలో ఇంటికి రూ. 2 వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామని హామీ ఇచ్చి.. తీరా అధికారంలోకి వచ్చిన తర్వాత మోసం చేశారు. ఉద్యోగాల ఇచ్చే సంగతి అటుంచితే.. ఉన్న ఉద్యోగాలనే ఊడబెరుకుతున్నారు. నిరుద్యోగ భృతి మాటే ఎత్తడం లేదు. ♦ ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసి, వారి జీవితాలతో ఆడుకుంటున్నారు. చంద్రబాబు చేసిన మోసానికి ప్రజలు ఆగ్రహంతో ఉన్నారు. ప్రజాగ్రహానికి, వ్యతిరేకతకు భయపడి ప్రతి పక్ష పార్టీ ఎమ్మెల్యేలను రూ. 20-30 కోట్లకు కొనుగోలు చేస్తున్నారు. ప్రజల గొంతుక వినపండకుండా చేయాలని ముఖ్యమంత్రి ఆరాటపడుతున్న తీరు జుగుప్సాకరంగా ఉంది. ఫిరాయింపుదారులతో రాజీనా మా చేయించి ఎన్నికలకు వెళ్లడానికి బాబు భయపడుతున్నారంటే ప్రజల్లో ప్రభుత్వంపై ఎంత వ్యతిరేకత ఉందో అర్థమవుతుంది. సూచన-3 ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌కు హైదరాబాద్ దాదాపు ఆరు దశాబ్దాలపాటు రాజధాని. సీమాంధ్రకు చెందిన వారు పెద్ద సంఖ్యలో జీహెచ్ఎంసీ(గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పోరేషన్) పరిధిలో స్థిర నివాసం ఏర్పరుచుకున్నారు. సీమాంధ్ర, జీహెచ్ఎంసీ ప్రాంతాల్లో ఒకే రోజు పోలింగ్ నిర్వహించాలి. తద్వారా రెండు చోట్లా ఓట్లు వేసే (డబుల్ ఓటింగ్) అవకాశం లేకుండా చేయవచ్చు. -
విభేదాలతో పాఠశాల పరువు తీయొద్దు!
► ఏపీ రెసిడెన్షియల్ జాయింట్ సెక్రటరీ పి.జగన్మోహనరెడ్డి ► గురుకుల బాలికల పాఠశాలను తనిఖీచేసిన ఉన్నతాధికారులు ► విద్యార్థుల సమస్యలుతెలుసుకున్న అధికారులు కావూరు(చెరుకుపల్లి): పేద విద్యార్థుల చదువు కోసం ప్రభుత్వం వేలకోట్ల రూపాయలు ఖర్చుచేస్తున్న ఫలితం మాత్రం శూన్యం పనిచేసినా, చేయకున్నా మా జీతాలు మాకు అందితే చాలులే అన్నట్లుగా గురుకుల పాఠశాల ఉపాధ్యాయులు పనిచేయడం వలనే పాఠశాల భవనాల, పరిసరాల దుస్థితి శిధిలాస్థకు చేరిందని ఏపీ రెసిడెన్సియల్ హైదరాబాద్ జాయింట్ సెక్రటరీ పి.జగన్మోహన రెడ్డి అన్నారు. మండలంలోని గురుకుల బాలికల పాఠశాలను శనివారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం పాఠశాల అభివృద్ధికి గత ఆరు నెలలకు ముందే రూ.11లక్షలను విడుదల చేసిన్నప్పటికి ప్రిన్సిపాల్ ఆ నిధులను వినియోగించకుండా పాఠశాల అభివృద్ధిని కుంటుపరిచారన్నారు. సీమాంధ్రాలో 63 గురుకుల బాలికల పాఠశాలలు, కళాశాలలున్నాయన్నారు. రాష్ట్రంలోని 53 గురుకుల పాఠశాలు ఉంటే ఏ గురుకుల పాఠశాల ఈ పాఠశలలాగా లేదని ఆవేదన చెందారు. ఉపాధ్యాయులకు ఉపాధ్యాయులకు మధ్య విభేదాలు ఉండడం వలన పాఠశాల స్థితి ఈ విధంగా చేరిందన్నారు. ప్రభుత్వం పాఠశాలల అభివృద్ధికి ఎన్నో నిధులను వెచ్చిస్తున్నాయన్నారు. ఇచ్చిన నిధులనే పాఠశాల ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ రూపవతి వినియోగించలేక పోయిందన్నారు. విద్యార్థినీలకు సక్రమంగా పాఠ్యాంశాలను బోధించడంలో కూడా పాఠశాలలోని ఉపాధ్యాయులు చొరవ చూపటం లేదన్నారు. పాఠశాల ఆవరణంలోని అపరిశుభ్రతను చూసిన అధికారులు ఉపాద్యాయులపై అసంతృప్తి వ్యక్తం చేశారు. ఏపీ విద్యారంగ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ జి. వెంకట రమణ మాట్లాడుతూ రాష్ట్రంలో గురుకుల పాఠశాలల అభివృద్ధికి రూ.3.97కోట్లను గతంలోనే ప్రభుత్వాన్ని కోరటం జరిగిందన్నారు. కావూరు గురుకుల పాఠశాల అభివృద్ధికి సుమారుగా రూ.6కోట్ల వ్యయం అవుతుందని అంచలనాలను తయారుచేసి ఉన్నతాధికారులకు అందించడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో ఏపీ రీజనల్ డిప్యూటీ సెక్రటరీ నాగలక్ష్మీ, డీఈ. సత్యనారాయణ, అభివృద్ధి కమిటీ స భ్యులు తుమ్మల నరేంద్ర నాథ్, నాగళ్ళ గోపాల్, పా ఠశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
ఆంధ్రావాళ్లపై ఈగ వాలనివ్వలేదు: కేటీఆర్
హైదరాబాద్ : పేదవాళ్లు ఏ ప్రాంతం వాళ్లైనా తమకు ఒక్కటే అని పంచాయతీ, ఐటీశాఖ మంత్రి కేటీఆర్ అన్నారు. ఆయన గురువారం తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడుతూ 'ఈ 18 నెలల్లో ఏ ఒక్క ఆంధ్రావారిపై ఈగ వాలనివ్వలేదు. ఆంధ్రావాళ్లను ఇక్కడ నుంచి పంపించేస్తారని ప్రచారం చేశారు. హైదరాబాద్‌లోని సీమాంధ్ర వారిలో ఏ ఒక్కరికైనా నష్టం జరిగిందా?. సంక్షేమ పథకాల అమల్లో పక్షపాతం చూపించామా?. అన్ని ప్రాంతాల వారిని కేసీఆర్ అక్కున చేర్చుకున్నారు. మురికివాడలో తిరిగిన సీఎం ఎవరైనా ఉన్నారా?. బీజేపీ నేతలు సిగ్గులేకుండా మాట్లాడుతున్నారు. పేకాట క్లబ్బులు మూయించిన ఘనత కేసీఆర్‌దే. రాష్ట్రం విడిపోవడం వల్ల రెండు ప్రాంతాలు లబ్ధి పొందాయి. లేకుంటే ఏపీలో కొత్త నగరాలు వచ్చేవి కావు. హైటెక్ సిటీ కట్టించాం అనేవాళ్లు కింద మోరీలు కట్టుడు మరిచారు. హైదరాబాద్‌లో గీత కార్మికులను కాపాడుకుందాం. అలాగే నగరంలో పేదలకు నల్లా, కరెంట్ బిల్లు మాఫీ చేయించిన ఘనత కేసీఆర్‌దే. ఆంధ్రావాళ్లు సంక్రాంతికి ఇళ్లకు వెళ్లి వచ్చాకే జీహెచ్ఎంసీ ఎన్నికలు. వారి ఓట్లతోనే జీహెచ్ఎంసీ పీఠాన్ని కైవసం చేసుకుంటాం. గ్రేటర్ ఎన్నికల్లో పొత్తులు లేవు. ఒంటరిగానే పోటీ చేస్తాం. రిజర్వేషన్స్ ప్రకటన తర్వాత గెలుపు గుర్రాలకే టిక్కెట్లు. 75 సీట్లు మహిళలకే' అని తెలిపారు. -
ఆంధ్రావాళ్లపై ఈగ వాలనివ్వలేదు: కేటీఆర్
-
రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు
విశాఖపట్నం : ఆంధ్రప్రదేశ్‌లో ఈశాన్య రుతుపవనాల ప్రభావం బలంగా ఉన్నాయని విశాఖపట్నంలోని వాతావరణ శాఖ అధికారులు శనివారం వెల్లడించారు. రుతుపవనాల ప్రభావంతో కోస్తా, రాయలసీమల్లో రాగల 24 గంటల్లో అక్కడక్కడా వర్షాలు కురుస్తాయని తెలిపారు. అలాగే కోస్తా తీరం వెంబడి 45 నుంచి 50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురుగాలులు వీస్తాయని చెప్పారు. అయితే శ్రీలంక పరిసర ప్రాంతాల్లో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. -
'4 లక్షలకు పైగా సీమాంధ్రుల ఓట్లు తొలగింపు'
న్యూఢిల్లీ : గ్రేటర్ హైదరాబాద్‌లో 4 లక్షలకు పైగా సీమాంధ్ర ఓటర్లను తొలగించారని తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్ కుమార్ రెడ్డి ఆరోపించారు. జీహెచ్ఎంసీలో ఓట్లు తొలగింపుపై తెలంగాణ కాంగ్రెస్ నేతలు సోమవారం కేంద్ర ఎన్నికల కమిషన్‌కు కలిసి ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా ఉత్తమ్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ కుట్రపూరితంగా మరొక 25 లక్షల మంది ఓట్లను తొలగించేందుకు రంగం సిద్ధం చేస్తున్నారన్నారు. జీహెచ్ఎంసీ కమిషనర్ సోమశ్ కుమార్ టీఆర్ఎస్కు అనుకూలంగా పని చేస్తున్నారని మండిపడ్డారు. బోగస్ ఓటర్లను తొలగిస్తే అభ్యంతరం లేదని అన్నారు. డోర్ లాక్, షిప్ట్ పేరుతో ఓట్లు తొలగిస్తున్నారని ఉత్తమ్ కుమార్ రెడ్డి వ్యాఖ్యానించారు. తొలగింపు ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని ఆయన డిమాండ్ చేశారు. తొలగింపు ఓటర్ల జాబితాను బహిరంగపరచాలని, గ్రేటర్ ఎన్నికల జాబితా ఫైనల్‌కు ముందు తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినవారిని కాకుండా బయట వ్యక్తిని పరిశీలకుడిగా నియమించాలని ఉత్తమ్ డిమాండ్ చేశారు. -
సీమాంధ్రకు వర్ష సూచన
విశాఖపట్నం: ఒడిశా నుంచి కోస్తాంధ్ర మీదుగా దక్షిణ తమిళనాడు వరకూ అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. మరో వైపు అసోం నుంచి పశ్చిమ మధ్య బంగాళా ఖాతం వరకు వాయువ్య బంగాళాఖాతం మీదుగా ఉపరితల ద్రోణి ఏర్పడింది. దీని ప్రభావంతో రుతుపవనాలు కూడా చురుకుదనం సంతరించుకున్నాయి. రానున్న 24 గంటల్లో కోస్తాంధ్ర, రాయలసీమల్లో పలుచోట్ల తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురుస్తాయని భారత వాతావరణ విభాగం ఆదివారం నాటి నివేదికలో వెల్లడించింది. కోస్తాంధ్రలోని శ్రీకాకుళం, విజయనగరం,విశాఖపట్నం, ఉభయగోదావరి, కృష్ణా, గుంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమలోని అనంతపురం, కడప, కర్నూలు, జిల్లాల్లో ఒకటి రెండుచోట్ల భారీవర్షాలు కూడా కురిసే అవకాశముందని ఐఎండీ తె లిపింది. అదే సమయం లో తీరంవెంబడి ఈదురుగాలులు వీస్తాయని పేర్కొంది. -
సీమాంధ్రలో చెదురుమదురు వర్షాలు
విశాఖపట్నం: ఆంధ్రప్రదేశ్ అంతటా నైరుతి రుతుపవనాలు విస్తరించాలంటే నాలుగైదు రోజులు పట్టే అవకాశం ఉందని విశాఖపట్నంలోని వాతావరణ కేంద్రం బుధవారం వెల్లడించింది. కోస్తాంధ్ర, రాయలసీమలో చెదురుమదురు వర్షాలు పడతాయని తెలిపింది. అలాగే తెలంగాణలో అక్కడక్కడా ఉరుములుతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని పేర్కొంది. అయితే అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి, చెన్నై నగారాన్ని నైరుతి రుతుపవనాలు తాకాయని వాతావరణ కేంద్రం వెల్లడించింది. -
పెండింగ్‌లో 13 ‘సమైక్య కేసులు’
సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో సమైక్యాంధ్ర ఉద్యమం సమయంలో నమోదైన కేసుల తొలగింపుపై పోలీసు విభాగం కసరత్తు పూర్తి చేసింది. 257 కేసుల ఎత్తివేతపై తుది నిర్ణయం తీసుకోవాలని సమీక్ష కమిటీ ప్రభుత్వానికి గురువారం నివేదించింది. దాదాపు 1,900 కేసులు నమోదయ్యాయి. వీటిలో కొన్నింటికి ప్రభుత్వం అప్పట్లోనే ఎత్తివేసింది. ఏపీ డీజీపీగా వెంకటరాముడు బాధ్యతలు చేపట్టే నాటికి 847 కేసులు మిగిలాయి. అన్ని కేసులను ఎత్తేయాలని ప్రభుత్వం నిర్ణరుుంచిన నేపథ్యంలో పోలీసు విభాగం కసరత్తు చేపట్టింది. 13 కేసులు తీవ్రమైన ఆరోపణలతోపాటు రైల్వేలు లాంటి కేంద్రం ప్రభుత్వ ఆస్తుల విధ్వంసం లాంటి కేసులున్నట్లు కమిటీ గుర్తించింది. వీటిపై నిర్ణయం తీసుకునే అవకాశం లేదని చెప్పింది. -
‘సీమాంధ్ర ఎంపీడీఓలను బదిలీ చేయండి’
సాక్షి, రంగారెడ్డి జిల్లా: జిల్లాలో పనిచేస్తున్న సీమాంధ్ర ప్రాంత ఎంపీడీఓలను వారి సొంత రాష్ట్రానికి పంపించాలని తెలంగాణ ఎంపీడీఓల సంఘం డిమాండ్ చేసింది. ఈమేరకు ఎమ్మెల్యే శ్రీనివాస్ ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన టీజీ నేతలు, ఎంపీడీఓ సంఘం ప్రతినిధులు రాష్ట్ర పంచాయతీరాజ్ శాఖ మంత్రి కేటీఆర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు. మంత్రిని కలిసిన వారిలో టీజీఓ అధ్యక్ష, కార్యదర్శులు మమత, సత్యనారాయణ, ప్రచార కార్యదర్శి పీసీ వెంకటేశం తదితరులు ఉన్నారు. -
హైదరాబాద్‌పై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు: ఎంపీ కవిత
హైదరాబాద్ : ‘హైదరాబాద్ కామన్ క్యాపిటలే తప్ప జాయింట్ క్యాపిటల్ కాదు... దానిపై సీమాంధ్రులకు ఎలాంటి అధికారాలూ ఉండవు’ అని నిజామాబాద్ ఎంపీ కవిత అన్నారు. తెలంగాణ ఉద్యమంలో పాల్గొన్న ప్రతి ప్రభుత్వ రంగ అనుబంధ సంస్థల ఉద్యోగులకు తెలంగాణ ఇంక్రిమెంట్ వచ్చేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెద్దామన్నారు. మంగళవారం సోమాజిగూడ ప్రెస్‌క్లబ్‌లో తెలంగాణ పబ్లిక్ సెక్టార్ ఎంప్లాయీస్ జేఏసీ ఆధ్వర్యంలో ఉద్యోగుల విభజన, ఆస్తులు, అప్పులు అనే అంశంపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆమె మాట్లాడారు. జూన్ 2 తరువాత ఉద్యమాలకు రెస్ట్ ఉంటుందని అనుకున్నాం కాని అది జరగడం లేదని పోలవరం, ఉద్యోగుల విభజన, హైదరాబాద్ ఆస్తులు, గవర్నర్ అధికారాలపై ఇలా నిరంతరం పోరాటం చేస్తూనే ఉండాల్సిన పరిస్థితి నెలకొందని అన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే శ్రీనివాస్ గౌడ్, ఉద్యోగ సంఘం నాయకులు దేవీప్రసాద్, విఠల్, జేఏసీ ప్రతినిధులు రమణరెడ్డి, థామస్‌రెడ్డి, గోవర్ధన్, కనకరాజు, అంజయ్య, వెంకటేశ్వరరావు, కరీముల్లాతో పాటు వివిధ కార్పొరేషన్లకు చెందిన యూనియన్ నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్ర బీసీలకు రిజర్వేషన్ గండం!
తెలంగాణ బీసీల జాబితాలో లేని ఆంధ్ర బీసీ విద్యార్థికి అందని రిజర్వేషన్ బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో కొత్త సమస్య ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా తెరపైకి వచ్చిన రిజర్వేషన్ అంశం లా సెక్రటరీల సలహాకోరనున్న తెలంగాణ, ఆంధ్ర ప్రభుత్వాలు హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వం బీసీ కులాల సంఖ్యను 138 నుంచి 112కు కుదించడంతో... సీమాంధ్రలో బీసీలుగా గుర్తింపు పొందిన కొన్ని కులాల విద్యార్థులు తెలంగాణలో బీసీ రిజర్వేషన్‌ను కోల్పోయే ప్రమాదం నెలకొంది. ఈ పరిణావుంతో ఆయూ వర్గాల విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే బీసీ-ఏ,బీ,సీ,డీ,ఈ.. కేటగిరీలలో ఏయే కులాలు వస్తాయనే అంశంపై ఉత్తర్వులు జారీచేసింది. ఉమ్మడి రాష్ట్రంలో 138 బీసీ కులాలు ఉండగా, తెలంగాణలో ఉన్న బీసీ కులాల వివరాలను బట్టి 112 కులాలున్నట్లు ఇక్కడి ప్రభుత్వం తేల్చింది. గోదావరి జిల్లాల్లో అధికసంఖ్యలో ఉండే శెట్టిబలిజలు ప్రస్తుతం తెలంగాణ బీసీ జాబితాలో లేరు. కేవలం కృష్ణబలిజ, సూర్యబలిజ, లింగబలిజ కులాల పేర్లు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే ఉత్తర కోస్తాలో అధికంగా ఉండే తూర్పు కాపు ప్రస్తుతం తెలంగాణ జాబితాలో లేదు. కేవలం వుున్నూరుకాపు, లక్కవురికాపు కులాలు వూత్రమే తెలంగాణ బీసీ జాబితాలో ఉన్నారుు. అలాగే కొప్పుల వెలవు కులం కూడా తెలంగాణ జాబితాలో లేదు. ఈ కులాలకు చెందిన వేలాది వుంది హైదరాబాద్, పరిసరాల్లో నివసిస్తున్నారు. ఇలా ఆంధ్రప్రదేశ్‌లో బీసీల జాబితాలో ఉన్నా ... తెలంగాణ జాబితాలో లేని బీసీ కులాలకు చెందిన విద్యార్థుల్లో ఈ కొత్త ఆందోళన మొదలైంది. తెలంగాణ బీసీ జాబితాలో లేనందువల్ల రిజర్వేషన్ వర్తించదని, ఇతర కులాల కేటగిరీలో సీట్లు తీసుకోవాలంటూ అడ్మిషన్ల సందర్భంగా అధికారులు స్పష్టం చేయడంతో ఈ సవుస్య జటిల రూపం దాల్చింది. ఆదివారం ఎంసెట్ కౌన్సెలింగ్ సందర్భంగా ఈ సమస్య ఉత్పన్నం కావడంతో ఆంధ్రప్రదేశ్‌కు చెందిన ఉన్నతాధికారి ఒకరు సోమవారం సచివాలయంలోని తెలంగాణ అధికారుల దృష్టికి దీనిని తీసుకొచ్చారు. ఉమ్మడి రాష్ట్రంలోని బీసీకులాల జాబితాను పరిశీలించి తెలంగాణలో ఉన్న కులాలను బట్టే తాజా జాబితాను సిద్ధం చేసినట్లు అధికారులు స్పష్టం చేశారని సమాచారం. ఇది వురో పెద్ద సమస్యగా మారుతుందోమోనన్న అనుమానాన్ని ఇరురాష్ట్రాల అధికారులు వ్యక్తంచేసిన నేపథ్యంలో ఈ అంశాన్ని రెండు రాష్ట్రాలు తమ తమ న్యాయ కార్యదర్శుల (లా సెక్రటరీ) దృష్టికి తీసుకె ళ్లాలని నిర్ణయించినట్లు తెలిసింది. న్యాయశాఖ చెప్పే అభిప్రాయాన్ని బట్టి ఈ అంశంపై తదుపరి చర్యలు తీసుకోవాలనే నిర్ణయానికి అధికారులు వచ్చినట్లు విశ్వసనీయ సమాచారం. అయితే తెలంగాణలోని పది జిల్లాలకు సంబంధించి బీసీ జాబితాను ఖరారు చేసిన నేపథ్యంలో ఈ జాబితాలో లేని కులాలను ఓసీలుగానే పరిగణించాల్సి ఉంటుందని తెలంగాణ అధికారులు చెబుతున్నారు. -
సీమాంధ్రులకు వత్తాసు పలుకుతున్న కేంద్రం
చంద్రశేఖర్‌కాలనీ : కేంద్ర ప్రభుత్వం సీమాంధ్రులకు వత్తాసు పలుకుతోందని టీఆర్ఎస్ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు లక్ష్మణ్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన జిల్లాకేంద్రంలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం హైదరాబాద్‌పై గవర్నర్ పెత్తనం చెలాయించేవిధంగా చర్యలు తీసుకోవడం, దగాపడిన తెలంగాణకు ఇంకా అన్యాయం చేసేందుకు సీమాంధ్ర నాయకుల అడుగులకు మడుగులొత్తుతోందని ఆరోపించారు. ఆరు దశాబ్దాలుగా వివక్షకు గురైన తెలంగాణ ప్రత్యేక రాష్ట్ర ఏర్పాటుకు కేంద్రం తనవంతు తోడ్పాటునందించాల్సిన విషయం మరవడాన్ని తెలంగాణ ప్రజలందరు గమనిస్తున్నారని అన్నారు. రైతు రుణమాఫీ విషయంపై సీఎం కేసీఆర్ స్పష్టమైన విధానాన్ని ప్రకటించినా, ఈ విషయంపై బీజేపీ నాయకులు రాద్ధాంతం చేయడం తగదన్నారు. 39 లక్షల మంది రైతులకు * 19 లక్షల వరకు రుణాలను కేసీఆర్ ప్రభుత్వం మాఫీ చేస్తుం దన్నారు. ఈ విషయంలో రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. తమది రైతు ప్రభుత్వమన్నారు. ఈ నెల 19 జరిగే ఇంటింటి సర్వేకు జిల్లా రైతులు,ప్రజలందరు సహకరించాలని కోరారు. -
రైతులను మోసగిస్తున్నారు
కనిగిరి: సీమాంధ్ర పీఠంపై ఎక్కిన చంద్రబాబు ఇప్పటికైనా తప్పుడు ప్రకటనలు చేయకుండా రైతులు, డ్వాక్రా మహిళలను అడ్డుకోవాలని వైఎస్సార్ సీపీ కనిగిరి నియోజకవర్గ సమన్వయకర్త బుర్రా మధుసూదన్ యాదవ్ డిమాండ్ చేశారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు క నిగిరిలోని చర్చి సెంటర్లో రాస్తోరోకో నిర్వహించారు. రుణమాఫీ కోసం ఎదురు చూసిన ప్రజలు ఇప్పుడు ఆందోళన చెందుతున్నారన్నారు. ఈ సందర్భంగా నాయకులు, కార్యకర్తలు ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తించారు. అయితే ఆందోళ చేస్తున్న వారిలో 20 మంది కార్యకర్తలు, రైతులను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. కార్యక్రమంలో పార్టీ జిల్లా అధికార ప్రతినిధి నరాల రమణారెడ్డి, ట్రేడ్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కేవీ ప్రసాద్, జెడ్పీటీసీ మాజీ సభ్యుడు వైఎం ప్రసాద్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ రంగనాయకులరెడ్డి, తమ్మినేని శ్రీను, యూత్ విభాగం మండల కన్వీనర్ ఎస్కే రహీం పాల్గొన్నారు. -
లగ్జరీని వదల్లేకే బాబు సీమాంధ్రకు రావట్లేదా?
గుంటూరు : ఆంధ్రప్రదేశ్ దళిత మహాసభ వ్యవస్థాపక కార్యదర్శి కత్తి పద్మారావు మరోసారి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై ధ్వజమెత్తారు. సీఎంగా బాబు హైదరాబాద్ నుంచి పాలన సాగించడమేంటని ఆయన ప్రశ్నించారు. గుంటూరు జిల్లా నంబూరులో ఆయన నిన్న మాట్లాడుతూ హైదరాబాద్‌లో అలవాటైన లగ్జరీని వదిలి ముఖ్యమంత్రి సీమాంధ్రకు రాలేకపోతున్నారని విమర్శించారు. రానున్న రోజుల్లో ఈ ప్రాంతానికి చెందిన వ్యక్తినే సీఎంగా ఎన్నుకోవాలన్నారు. 85 శాతం ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ వర్గాలకు చెందిన వారే సీమాంధ్రలో ఉన్నారని వారి అభివృద్ధిని దృష్టిలో పెట్టుకుని ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలన్నారు. ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో 150 అడుగుల అంబేద్కర్ విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని దళిత మహాసభ తీర్మానించిందని, విగ్రహం ఏర్పాటుకు వర్సిటీలో 25 ఎకరాల స్థలాన్ని కేటాయించాలన్నారు. (ఇంగ్లీషు కథనం ఇక్కడ చదవండి) -
అన్ని ప్రాంతాల అభివృద్ధి ఆవశ్యకం
పూర్వ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా హైదరాబాద్‌కే తరలించడం వల్ల వచ్చిన పెనుముప్పు ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి కృష్ణా, గుంటూరు జిల్లాలో రాజధానిని నిర్మిస్తే, కర్నూలును ఉప రాజధానిని చేయాల్సిన అవసరముంది. నేడు సీమాంధ్ర రాష్ట్రంగా రూపొందడం ఒక గొప్ప చారిత్రక అవసరం. ఈ పదమూడు జిల్లాలు ఒక రాష్ట్రంగా ఏర్పడటం వల్ల పరిపాలనా సౌలభ్యంతో పాటు ఆయా జిల్లాల్లో ఉండే మానవ వనరులు, ప్రకృతి వనరులు, మానవ శ్రమ కొత్తపుం తలు తొక్కడానికి అవకాశముంది. ఎన్నో ప్రసిద్ధి చెందిన రాజ్యాలు ఒకప్పుడు ఈ ప్రాంతాన్ని పాలించాయి. చారిత్రకంగా సీమాంధ్ర ఎంతో ప్రాధాన్యమున్న ప్రాం తం. 960 కిలోమీటర్ల సముద్ర తీరం వాణిజ్యానికి అపార అవకాశాలను కల్పిస్తోంది. ఫ్రెంచ్, డచ్, ఇంగ్లిష్ పాలకులు ఈ సముద్ర తీర ఓడ రేవుల నుండే కోస్తాంధ్రలోకి ప్రవేశించారు. బౌద్ధ సంస్కృతి సీమాంధ్ర మొత్తంలో పరిఢవిల్లడం వల్ల లౌకికవాద భావజాలం కూడా కొన్ని వందల సంవత్సరాల నుంచి ఈ ప్రాంతంలో విరాజిల్లింది. ఇంతటి ప్రాధాన్యతగల ప్రాంతంలోని నాగార్జున విశ్వవిద్యాలయ ప్రాంగణంలో కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయడం ఈ ప్రాంత వాసుల్లో నూతన ఉత్సాహాన్ని తీసుకువచ్చింది. అయితే పూర్వ రాష్ట్రంలో ఉన్న సంపదనంతా హైదరాబాద్‌కే తరలించడం వల్ల వచ్చిన పెనుముప్పు ఒకే ప్రాంతం మీద దృష్టి పెడితే మళ్లీ వచ్చే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్య పట్టణాన్ని కృష్ణా, గుంటూరు జిల్లాలో నిర్ణయిస్తే, ఉప ముఖ్యపట్టణాన్ని తప్పకుండా కర్నూలు జిల్లాలో కూడా నిర్మించవలసిన అవసరముంది. ఎందుకంటే రాయలసీమ రాష్ట్రం మొత్తంమీద వెనుకబడిన ప్రాంతం. ఇక్కడి జిల్లాల్లో నీటి ఎద్దడి చాలా తీవ్రంగా ఉంది. సముద్ర మట్టం నుంచి ఈ ప్రాంతం 250 మీటర్ల నుంచి 600 మీటర్ల ఎత్తులో ఉంది. ఆంధ్రప్రదేశ్ సగటు వర్షపాతం 858 మి.మీ కాగా, ఉత్తరాంధ్రలో వర్షపాతం అత్యధికంగా 1250 మి.మీ ఉంది. రాయలసీమలో మాత్రం 800 మి.మీ కన్నా తక్కువ వర్షపాతమే నమోదవుతోంది. అందువల్లే సీమ కరువు ప్రాంతంగా ఉంది. సీమలో ప్రధానంగా పండిస్తున్న వేరుశనగ, కొర్ర జొ న్న పంటలకు కనీస స్థాయిలో కూడా నీరు అందడం లేదు. సాలీనా 30 శాతానికి మించి పంటలు పండించే స్థితిలో ఇక్కడి ప్రజలు లేరు. పైగా రాయలసీమలో ఖరీఫ్ పంటకాలంలో వర్షపాతం 365.8 మి.మీ మాత్రమే. ఇది కూడా అన్ని ప్రాంతాల్లో ఒకే రకంగా ఉండదని సీమ విశ్లేషకులు చెబుతున్నారు. కాబట్టి రాజధానిని సీమాంధ్రలో ఏ ప్రాంతంలో నిర్ణయించినా సీమ అభివృద్ధికి ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకత ప్పదు. అలాగే ఖనిజ సంపదకు ఆలవాలమైన ఉత్తరాంధ్ర జిల్లాలు విజయనగరం, శ్రీకాకుళం, విశాఖ జిల్లాలను అభివృద్ధి చేస్తే విశాఖపట్నం ముంబైలాగా అభివృద్ధి కాగలదు. కాగా, రాజధాని విషయంలో పాలకులు విస్మరిస్తున్న అంశం దళిత సమస్య. రాయలసీమలో ఎస్సి, ఎస్టి కులాలు చాలా దయనీయ పరిస్థితుల్లో ఉన్నాయి. ఇక్కడ అంటరానితనం కులవివక్ష, అస్పృశ్యత యథేచ్ఛగా కొనసాగడానికి కారణం పేదరికం, నిరక్షరాస్యతే. ఇకపోతే గుంటూరు, కృష్ణా, ప్రకాశం జిల్లాల్లో ఒక్క శాతం భూమి కూడా దళితులకు లేదంటే ఎంత వివక్ష కొనసాగుతుందో అర్థమవుతుంది. ఇక్కడి దళితుల్లో 60 శాతం మందికి ఇళ్లస్థలాలు లేవు. ప్రతి ఇంటిలోనూ డిగ్రీ చదివిన పిల్లలంతా నిరుద్యోగులుగా జీవిస్తున్నారు. కాని ముఖ్యమంత్రి చంద్రబాబు ఇటీవలి ఉపన్యాసాల్లో ఎక్కడా దళితుల ప్రస్తావన కానీ, ఎస్సీ సబ్ ప్లాన్ ప్రస్తావన గానీ చేయడం లేదు. సీమాంధ్ర అన్ని జిల్లాల్లోనూ దళిత బహుజన మైనార్టీల ప్రజలు వెనుకబడి ఉన్నారు. వీరికి జీవనభృతిని, ఉపాధిని, విద్యను, భూవసతిని కల్పించడం వల్ల మాత్రమే సీమాంధ్ర మళ్లీ గొప్ప రాష్ట్రంగా నిలబడుతుంది. తమ సొంత కులాలకు మాత్రమే మేలు జరిగే పద్ధతుల్లో ఆలోచిస్తే మిగిలిన కులాలన్నీ అణగారిపోతాయి. మళ్లీ కొత్త ఉద్యమాలు వస్తాయి. ఒకే కులాన్ని, ఒకే ప్రాంతాన్ని అభివృద్ధి చేయడంలో చంద్రబాబు సిద్ధహస్తుడు. దీనివల్ల మళ్లీ ఉత్తరాంధ్ర, రాయలసీమల్లో ఉద్యమాలు బలంగా వస్తాయి.పైగా కార్పొరేట్ విద్యా సంస్థలకే పెద్ద పీట వేయడానికి ప్రభుత్వం సిద్ధపడుతుండటంతో ప్రభుత్వ విద్య అంతరించి పోయే ప్రమాదం ఉంది. అంతిమంగా.. పాలకులు ప్రజలకు ఆశలు రేపెట్టకూడదు. పాలకులు ప్రజలను శ్రమజీవులుగా, శక్తివంతులుగా మార్చాలి. మానవ వనరులకు మానవ శ్రమను సమన్వయం చేసినప్పుడే ఉత్పత్తి వర్ధిల్లుతుంది. ప్రభుత్వమూ వర్ధిల్లుతుంది. అన్ని ప్రాంతాలను సమంగా అభివృద్ధి చేసుకోవలసిన చారిత్రక సందర్భం ఇది. (వ్యాసకర్త దళిత ఉద్యమకారుడు) కత్తి పద్మారావు -
అడవి అటు.. అధికారులు ఎటు..?
ఆంధ్రలోకి ముంపు మండలాల్లోని అటవీ ప్రాంతం సందిగ్ధంలో అటవీశాఖ అధికారులు కుక్కునూరు : పోలవరం ముంపు మండలాల్లోని అటవీప్రాంతమంతా సీమాంధ్రలో విలీనం కానుండడంతో ఆ శాఖ అధికారుల్లో సందిగ్ధం నెలకొంది. ఆ మండలాల్లో పని చేస్తున్న అటవీశాఖ అధికారులంతా తెలంగాణకు చెందిన వారు కావడమే ఇందుకు కారణం. కొన్ని అటవీశాఖ చెక్‌పోస్టులు, భద్రాచలం కార్యాలయం మాత్రం తెలంగాణలోనే ఉన్నాయి. జిల్లాలో మొత్తం 42 అటవీ రేంజ్‌లు ఉన్నాయి. వాటిల్లో ఏడు ముంపు మండలాలకు చెందిన అటవీరేంజ్ పరిధిలో 2.53లక్షలకు పైగా రిజర్వ్‌ఫారెస్ట్ ఉంది. దీంతో సుమారు 2.40లక్షల హెక్టార్ల అటవీభూమి సీమాంధ్రలో కలుస్తోంది. బూర్గంపాడు మాత్రమే జిల్లాలో మిగలడంతో 13వేల హెక్టార్ల అటవీప్రాంతం మాత్రమే మిగిలింది. మిగిలిని ముంపు మండలాలైన భద్రాచలం, చింతూరు, వీఆర్‌పురం, వేలేరుపాడు, కూనవరంలలో సెంటు అటవీ భూమి కూడా తెలంగాణకు మిగలలేదు. కుక్కునూరు మండలంలోని కుక్కునూరు, అమరవరం రేంజ్ అటవీప్రాంతంలో 51వేల హెక్టార్ల అటవీభూమి ఉండగా కుక్కునూరు రేంజ్ పరిధిలోని 36,919 హెక్టార్లలో 34,580 హెక్టార్లు ఆంధ్రాప్రాంతంలో కలుస్తోంది. తెలంగాణలోని అశ్వారావుపేట మండంలోని నందిపాడులో 2339 హెక్టార్ల అటవీభూమి మాత్రమే మిగిలింది. అలాగే మండలంలోని అమరవరం రేంజ్ పరిధిలో 15వేల హెక్టార్ల అటవీభూమి ఉండగా తెలంగాణలోని ములకలపల్లి మండలంలో ఉన్న 5వేల హెక్టార్ల అటవీభూమి మాత్రమే మిగులుతోంది. ఇటీవల జిల్లాకు చెందిన అటవీశాఖ అధికారులందరితో జరిగిన చర్చలో ఏడు ముంపు మండలాల్లోని అటవీభూమి ఎక్కువగా ఆంధ్రాకు అప్పగించాల్సి వస్తోందనే అంశంపైనే చర్చ జరిగినట్లు తెలుస్తోంది. అధికారుల దారెటు..? ఏడు ముంపు మండలాల్లోని భద్రాచలం, చర్ల, చింతూరు రేంజ్ అధికారులు ఆంధ్రాకు చెందిన వారుకాగా భద్రాచలం, కుక్కునూరు, అమరవరం, వీఆర్‌పురం, కూనవరం రేంజ్ అధికారులందరూ తెలంగాణకు చెందినవారే. ఆప్షన్లు ఇస్తే ఆ రెండు మండలాలకు చెందిన ఇద్దరు ఆంధ్రా రేంజ్ అధికారులు ఆంధ్రాలో విలీనమైన మండలాలకు బదిలీ అయ్యే అవకాశాలు కల్పిస్తున్నాయి. మరోపక్క ఆంధ్రాలో సరిపడా అటవీశాఖ సిబ్బంది లేదనట్లు తెలుస్తోంది. అదే నిజమైతే ముంపు మండలాల్లో పని చేస్తున్న తెలంగాణ అధికారులే అక్కడా పని చేయాల్సి వస్తుంది. లేదా కొత్తగా నియామకాలు చేపట్టాలి. ఈ నేపథ్యంలో తెలంగాణకు చెందిన వారు ఆంధ్ర ప్రాంతంలో పని చేస్తారా..? లేక తెలంగాణలో పనిచేస్తారా..? అనేది తెలియాల్సి ఉంది. కార్యాలయాలు, చెక్‌పోస్టుల తెలంగాణలోనే.. తెలంగాణలో మిగిలిన భద్రాచలం పట్టణంలో అటవీశాఖ కార్యాలయ సముదాయ భవనం ఉంది. ఆ శాఖ పరిధిలో 27వేల హెక్టార్ల అటవీభూమి మాత్రం ఆంధ్రాలో కలువనుంది. అదే విధంగా కుక్కునూరు రేంజ్ పరిధిలోని నందిపాడు, గుమ్మడవల్లి అటవీశాఖ చెక్‌పోస్టులు కూడా తెలంగాణలోనే ఉండటం గమనార్హం. -
మొక్కకూ దిక్కులేదు
తాడేపల్లిగూడెం : సీమాంధ్రను సింగపూర్ చేస్తాం.. మోడల్ రాజధాని నిర్మిస్తామంటూ ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్న సర్కారు కనీసం మొక్కలు నాటేందుకైనా చర్యలు తీసుకోవడం లేదు. సామాజిక వన నర్సరీలకు పైసా కూడా విదల్చకపోవడంతో రోడ్ల పక్కన కనీసం మొక్కలైనా నాటే దిక్కులేకుండాపోరుుంది. రోడ్ల వెంబడి నీడనిచ్చే మొక్కలను నాటాల్సిన తరుణం ఇది. ఇలా నాటడానికి సామాజిక వన నర్సరీలలో మొక్కలు లేవు. అదేమంటే.. వాటిని పెంచడానికి రూకలు లేవు. ఈ ఏడాది ఏప్రిల్ నుంచి ఇదే పరిస్థితి. రాష్ట్ర విభజనను సాకుగా చూపుతూ జిల్లాలోని మూడు అటవీ డివిజన్లకు బడ్జెట్ కేటాయించలేదు. అప్పటినుంచి అధికారులు, సిబ్బంది సొంత సొమ్ము వెచ్చించి ముందుకు సాగుతున్నారు. మరోవైపు సామాజిక వన విభాగంలో ఔషధ మొక్కల పెంపకం నిలిచిపోరుుంది. వర్షాకాలానికి ముందే ఉపాధి హామీ పథకంలో కూలీలను కేటారుుంచి లక్షలాదిగా మొక్కలను నాటించి పెంచేవారు. ఆ మొక్కల పెంపకాన్ని తామే చేపడతామని డ్వామా అధికారులు ముందుకొచ్చారు. దీంతో సామాజిక వన నర్సరీలలో మొక్కలు పెంచే అవకాశం లేకుండాపోయింది. డ్వామా అధికారులు చేపట్టిన మొక్కల పెంపకం పథకం మాడిపోయింది. ఏ మొక్క బతికి బట్టకట్టలేదు. మరోపక్క సామాజిక వన నర్సరీలలో మొక్కలు లేవు. దీంతో ఈ సీజన్లో జిల్లాలో రోడ్ల వెంబడి మొక్కలు నాటే పరిస్థితి లేదు. ఉపాధి లేదు.. పర్యావరణ పరిరక్షణా లేదు ఏటా ఉపాధి హామీ పథకంలో లక్ష వరకు మొక్కలను సామాజిక వన నర్సరీలలో పెంచేవారు. ఇందు కోసం ప్రతి నర్సరీకి 50 మంది కూలీలను కేటాయించే వారు. వీరంతా తుంగ, మోదుగ, జావల్లి, వెలగ, కానుగ, తుమ్మ, వేప, టేకు వంటి సుమారు 112 రకాల మొక్కలను పెంచేవారు. ఇవికాకుండా రోడ్ల వెంబడి నీడ, అందమైన పూలు ఇచ్చే అగ్నిపూలు చెట్లు పెంచేవారు. నర్సరీలలో బ్యాగ్ నర్సరీ, బెడ్ నర్సరీలుగా విభజించి మొక్కలను పెంచేవారు. వీటిని తహసిల్దార్ కార్యాలయాలు, ఎంపీడీవో కార్యాలయాలు, స్వచ్ఛంద సంఘాల ద్వారా నాటడానికి వివిధ ప్రాంతాలకు పంపేవారు. చాలాకాలంగా ఇదే మాదిరి సాగుతోంది. గత ఏడాది బ్యాగ్ నర్సరీల నిర్వహణను తామే చేపడతామని డ్వామా అధికారులు ముందుకు వచ్చారు. దీంతో సామాజిక వన నర్సరీలు టేకు మొక్కలు పెంచే బెడ్ నర్సరీలుగా మారిపోయాయి. దీంతో జిల్లాలోని నరసాపురం, ఏలూరు, జంగారెడ్డిగూడెం అటవీ రేంజ్‌ల పరిధిలోని సామాజిక వన నర్సరీలు బోసిపోయాయి. ఒకప్పుడు ఔషధ మొక్కల పెంపకానికి చిరునామాగా మారిన తాడేపల్లిగూడెం మండలం వెంకటరామన్నగూడెంలోని నర్సరీ పిచ్చిమొక్కలకు నిలయంగా మారింది. అందమైన మొక్కలు లేవు. క్లోనింగ్ యూకలిప్టస్ మొక్కల కోసం వేచిన షేడ్ నెట్లు పిచ్చిమొక్కల నిలయాలుగా మారాయి. అందులోని రహదారులు పాముల పుట్టలతో దర్శనమిస్తున్నారుు. వర్షాలు రాగానే జిల్లాలో సుమారు 80 కిలోమీటర్ల మేర రోడ్లకు ఇరువైపులా నీడనిచ్చే మొ క్కలు నాటే కార్యక్రమానికి శ్రీకారం చుట్టేవారు. రాష్ట్రం విడిపోరుుందని, దీనివల్ల నిధులు లేవనే సాకుతో లక్ష్యా న్ని 20 కిలో మీటర్లకు కుదించారు. దానికి కూడా నిధులు కేటాయించలేదు. -
'రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కోరతాం'
రాష్ట్రానికి 58 ఎమ్మెల్సీ స్థానాలు కోరాలని నిర్ణయించినట్లు ఆంధ్రప్రదేశ్ ఆర్థిక శాఖ మంత్రి యనమల రామకృష్ణుడు వెల్లడించారు. బుధవారం హైదరాబాద్‌లో యనమల రామకృష్ణుడు మాట్లాడుతూ... విభజన చట్టంలో జరిగిన లోపాలపై కేంద్ర హోంశాఖకు లేఖ రాయాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇప్పటికే అదే అంశంపై న్యాయశాఖ అధికారులతో సంప్రదించినట్లు చెప్పారు. ఈ పార్లమెంట్ సమావేశాల్లోనే సవరణ బిల్లు పెట్టేందుకు ప్రయత్నిస్తున్నట్లు వివరించారు. రాష్ట్ర బడ్జెట్ సమావేశాలపై కసరత్తు ప్రారంభించినట్లు తెలిపారు. ఆగస్టు రెండో వారం నుంచి ఆ సమావేశాలు ప్రారంభమయ్యే అవకాశం ఉందని చెప్పారు. ఆ బడ్జెట్ సమావేశాలు 18 రోజుల పాటు కొనసాగుతాయని పేర్కొన్నారు. ఆంధ్ర - తెలంగాణ సరిహద్దుల్లో కొత్తగా 8 చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. కర్నూలు, సున్నిపెంట, మాచర్ల, దాచెపల్లి, గరికపాడు, తిరువూరు, జీడుగుమిల్లి, కొండపల్లిలో చెక్‌పోస్టులు ఏర్పాట్లు చేస్తున్నట్లు యనమల విశదీకరించారు. -
'ముంపు గ్రామాలు తెలంగాణలోనే ఉంచాలి'
పోలవరం ముంపు గ్రామాలను తెలంగాణ రాష్ట్రంలోనే ఉంచాలని కేంద్ర ప్రభుత్వాన్ని టీజేఏసీ డిమాండ్ చేసింది. గురువారం నగరంలోని ఇందిరా పార్క్ వద్ద ధర్నా నిర్వహించింది. ఆ ధర్నాలో టీజేఏసీ కన్వీనర్ కోదండరామ్ పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విభజన నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. దాంతో తెలంగాణలోని ఏడు మండలాలను ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కలుపుతూ కేంద్రం ఆర్డినెన్స్ జారీ చేసింది. ఆంధ్రప్రదేశ్‌లో కలిపిన ఏడు మండలాలు తెలంగాణలో ఉంచాలని ఆ రాష్ట్ర ప్రజలు ఆకాంక్షిస్తున్న సంగతి తెలిసిందే. ఆ ఏడు మండలాలు తెలంగాణలో ఉంచాలని డిమాండ్ చేస్తూ ఆ రాష్ట్ర ఎంపీలు గత రెండు రోజులుగా లోక్‌సభలో నిరసనలు తెలుపుతున్న విషయం విదితమే. -
కాంగ్రెస్ వల్లే సీమాంధ్రకు రాయితీలు
హైదరాబాద్: రాష్ట్ర విభజన సమయంలో సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు రాయితీల కోసం కృషి చేశారని మాజీ కేంద్ర మంత్రి జేడీ శీలం అన్నారు. యూపీఏ ప్రభుత్వం సీమాంధ్రకు ఇచ్చిన రాయితీలను బీజేపీ ఇచ్చినట్టుగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పడం సరికాదని వ్యాఖ్యానించారు. సీమాంధ్రకు చెందిన అప్పటి కేంద్ర మంత్రులు కృషిచేయడం వల్లే విభజన బిల్లులో సీమాంధ్రకు నష్టం జరగకుండా రాయితీలు ఇచ్చారని జేడీ శీలం చెప్పారు. సార్వత్రిక ఎన్నికల ముందు యూపీఏ ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్‌ను విభజించి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రాన్ని ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే. అయితే సీమాంధ్రకు అన్యాయం చేశారంటూ ఆ ప్రాంతంలో తీవ్ర నిరసనలు వ్యక్తమయ్యాయి. -
తెలంగాణ కళాశాలల వైపే సీమాంధ్ర విద్యార్థుల మొగ్గు
హైదరాబాద్: మెడిసిన్ పీజీ సీట్ల భర్తీలో కొత్త వివాదం రాజుకుంది. పీజీ ప్రవేశపరీక్షలో ఉత్తమ ర్యాంకులు సాధించిన ఆంధ్రప్రదేశ్ విద్యార్థులంతా తెలంగాణలోని వైద్య కళాశాలల్లో చేరుతుండటంతో ఈ ప్రాంత విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటి వరకు తెలంగాణలో 500 సీట్లను భర్తీ చేయగా, అందులో సగానికిపైగా ఏపీ విద్యార్థులే ఉన్నారని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే తెలంగాణలో సగానికి పైగా విద్యార్థులు నష్టపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. తెలంగాణ రాష్ట్ర వైద్యవిద్య అధికారులు మాత్రం ఈ విషయంలో తామేమీ చేయలేమని, రాష్ట్ర పునర్విభజన బిల్లులోని 10వ షెడ్యూల్లో వృత్తి విద్యా ప్రవేశాలను పొందుపరిచారని అంటున్నారు. అందులో భాగంగా ఎంబీబీఎస్ విద్యను తెలంగాణలో అభ్యసించిన ఏపీ విద్యార్థులంతా స్థానికులుగా పరిగణలోకి వస్తారని స్పష్టం చేశారు. నేటి నుంచి మళ్లీ మెడికల్ పీజీ కౌన్సెలింగ్ : వివాదాస్పదమైన పీజీ మెడిసిన్ సీట్ల కౌన్సెలింగ్ ప్రక్రియను ఆదివారం నుంచి మళ్లీ ప్రారంభిస్తున్నట్లు తెలంగాణ వైద్య విద్యా సంచాలకుడు డాక్టర్ పుట్టా శ్రీనివాస్ తెలిపారు. 48 గంటల్లో అన్ని సీట్లను భర్తీ చేయడంతోపాటు సుప్రీంకోర్టు తీర్పు, మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా మార్గదర్శకాల మేరకు జూలై 10 నుంచి తరగతులను ప్రారంభిస్తామని స్పష్టం చేశారు. ఈ విషయంలో కఠినంగా వ్యవహరిస్తామని పేర్కొన్నారు. -
సీమాంధ్రులంతా గెస్టు ఆర్టిస్టులే
హైదరాబాద్: సీమాంధ్రులు హైదరాబాద్‌లో ఉండేది తాత్కాలికమేనని, వారంతా గెస్టు ఆర్టిస్టులేనని తెలంగాణ వ్యవసాయ శాఖ మంత్రి పోచారం శ్రీనివాస రెడ్డి అన్నారు. సచివాలయంలో బ్యారికేడ్లు ఏర్పాటు చేయడంపై మంత్రి స్పందిస్తూ పైవిధంగా వ్యాఖ్యానించారు. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ సచివాలయాల మధ్య శుక్రవారం రాత్రి బారికేడ్లు వెలిశాయి. రెండు రాష్ట్రాల సచివాలయాలు వేరు చేస్తూ అధికారులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఇరువైపులా భారీగా కేంద్ర బలగాలు మోహరించాయి. రాష్ట్ర విభజన సందర్భంగా గతంలో తెలంగాణ, సీమాంధ్ర ప్రాంత ఉద్యోగుల మధ్య ఘర్షణ నెలకొన్న నేపథ్యంలో ముందు జాగ్రత్త చర్యగా అధికారులు ఈ ఏర్పాట్లు చేసినట్లు సమాచారం. తెలంగాణలో రైతు రుణమాఫీపై వెనక్కి తగ్గే ప్రసక్తేలేదని పోచారం అన్నారు. రెండుమూడు రోజుల్లో రుణమాఫీపై విధానపరమైన నిర్ణయం తీసుకుంటామని తెలిపారు. -
ఉద్యోగుల సర్వీస్ రూల్స్ కోసం ప్రత్యేక శాఖ
ఏపీ సచివాలయ సమన్వయ సంఘం సమావేశంలో చంద్రబాబు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజనకు వ్యతిరేకంగా ఉద్యోగులందరూ మొన్న ఏ స్ఫూర్తితో కలిసికట్టుగా ముందుకు వచ్చారో అదే స్ఫూర్తితో ఆంధ్రప్రదేశ్‌ను దేశంలోనే అగ్రగామిగా నిలిచేవిధంగా తనను ముందుకు నడిపించే బాధ్యత తీసుకోవాలని సీమాంధ్ర ప్రాంత సచివాలయ ఉద్యోగులను ఏపీ సీఎం చంద్రబాబు కోరారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత తొలిసారిగా గురువారం సచివాలయానికి వచ్చిన చంద్రబాబును ఆంధ్రప్రదేశ్ సచివాలయ సమన్వయ సంఘం సన్మానించింది. ఈ సందర్భంగా బాబు మాట్లాడుతూ... ఉద్యోగుల సర్వీసు రూల్స్ చూసేందుకు ప్రత్యేక శాఖను ఏర్పాటు చేస్తున్నట్లు ప్రకటించారు. సచివాలయ సమన్వయ సంఘం చైర్మన్ మురళీకృష్ణ మాట్లాడుతూ రాష్ట్ర అభివృద్ధికోసం తమ వంతు కృషి చేస్తామన్నారు. నూతన రాజధాని ఏర్పాటు కోసం సీమాంధ్ర సచివాలయ ఉద్యోగులు రెండు రోజుల వేతనాన్ని ఇస్తామని ప్రకటించారు. ఈ కార్యక్రమంలో మంత్రి కామినేని శ్రీనివాస్, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఐవైఆర్ కృష్ణారావు, ఉద్యోగ సంఘం నేతలు రామాంజనేయులు, వెంకటసుబ్బయ్య, మద్దిలేటి, హరీష్ కుమార్‌రెడ్డి, జి.రామక్రిష్ణ, రమణయ్య, ఇంద్రాణి తదితరులు పాల్గొన్నారు. -
విభజన, వలసలే కాంగ్రెస్‌ను ముంచాయి
ఏపీ కాంగ్రెస్ నేతల సమీక్షలో వెల్లడి సాక్షి, విజయవాడ: రాష్ట్ర విభజన, కీలక నేతల వలసలే సార్వత్రిక ఎన్నికల్లో కాంగ్రెస్ ఓటమికి కారణాలయ్యాయని ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ స్పష్టం చేసింది. కాంగ్రెస్ రాజకీయ చరిత్రలో ఘోర పరాజయాన్ని చవిచూడడం దురదృష్టకరమని పార్టీ నేతలు అభిప్రాయపడ్డారు. విభజనకు వంత పాడిన దిగ్విజయ్‌సింగ్, జైరాం రమేష్‌లపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి సహా రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి, కావూరి సాంబశివరావు తదితరుల తీరుపై పలువురు మాజీ మంత్రులు ధ్వజమెత్తా రు. ఏపీ కాంగ్రెస్ కమిటీ ఎన్నికల సమీక్షా సమావేశం మంగళవారం విజయవాడలో జరిగింది. ఉదయం 10 గంటలకు మొదలైన ఈ సమావేశం సాయంత్రం 5 వరకు కొనసాగింది. 13 జిల్లాల డీసీసీ అధ్యక్షులు, పీసీపీ సభ్యులు, ఎన్నికల్లో పోటీ చేసిన ఎమ్మెల్యే, ఎంపీ అభ్యర్థులు, మాజీ కేంద్ర, రాష్ట్ర మంత్రులు హాజరయ్యారు. మొత్తం 52 మంది మాట్లాడారు. ఓటమికి గల కారణాలు, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన చర్యలపై చర్చించుకోవాల్సిన అవసరముందని ఏపీ పీసీసీ అధ్యక్షుడు రఘువీరారెడ్డి సూచించారు. అనుభవాలు, ఇబ్బందులతో రూపొందించిన నివేదికను ఈ నెల 23న ఏఐసీసీకి పంపనున్నట్టు చెప్పారు. మాజీ మంత్రుల కొండ్రు మురళి, సాకే శైలజానాథ్, కన్నా లక్ష్మీనారాయణ, ఎంపీ జేడీ శీలం, మాజీ కేంద్రమంత్రి కిల్లి కృపారాణిలతో పాటు పలువురు మాజీ మంత్రులు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. మీడియా కూడా దెబ్బతీసింది :బొత్స కాంగ్రెస్‌పై టీడీపీ కుట్ర సాగిస్తోందని మాజీ పీసీసీ అధ్యక్షుడు బొత్స సత్యనారాయణ అన్నారు. చంద్రబాబుతోనే అభివృద్ధి అంటూ ఎల్లో మీడియా ఎన్నికల ముందు నుంచీ విస్తృతంగా ప్రచారం చేసి కాంగ్రెస్‌ను తీవ్రంగా దెబ్బతీసింది. రుణాల మాఫీ పేరిట బాబు ప్రదర్శించిన విద్యలను ఆయా పత్రికలు బాగా ప్రచారం చేశాయన్నారు. బాబు అధికారంలోకి రాగానే రూ. 14 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉందని చెబుతున్న ఓ వర్గం మీడియా 2004లో కాంగ్రెస్‌కు అధికారాన్ని కట్టబెట్టే నాటికి రూ. 21 వేల కోట్ల లోటుబడ్జెట్ ఉందన్న విషయాన్ని విస్మరిస్తున్నాయని ప్రశ్నించారు. ఈ కుట్రలను తిప్పి కొట్టి పార్టీ బలోపేతానికి కృషి చేయాలన్నారు. కిరణ్ది తీరని ద్రోహం: డొక్కా కన్నతల్లి లాంటి కాంగ్రెస్ పార్టీకి మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి తీరని ద్రోహం చేశారని మాజీ మంత్రి డొక్కా మాణిక్యవరప్రసాద్ విమర్శించారు. కిరణ్ చేసిన కుట్ర ప్రపంచంలో ఎక్కడా చూడలేదని, ఎంతో నమ్మకంగా నటించాడని, సీనియర్ మంత్రుల్ని సైతం న మ్మించాడని దుయ్యబట్టారు. విభజన ప్రకటన వెలువడగానే కిరణ్ రాజీనామా చే సి ఉంటే విభజన ప్రక్రియ కొంత మేరకు ఆగి ఉండేదన్నారు. జైరాం తీరు బాగోలేదు: దేవినేని రాజశేఖర్ రాష్ట్ర విభజన సమయంలో కేంద్రమంత్రి జైరాం రమేష్ తీరు అస్సలు బాగోలేదని మాజీ ఎమ్మెల్యే దేవినేని రాజశేఖర్(నెహ్రూ) అన్నారు. విభజనకు అనుకూలంగా ఉన్న ఆయన వ్యవహార శైలితో సీమాంధ్ర ప్రజల్లో ఆవేశం కట్టలు తెంచుకుందన్నారు. రాయపాటి, లగడపాటి, పురందేశ్వరి, కావూరిల తీరుతో కార్యకర్తల్లో విశ్వాసం సన్నగిల్లిందని తెలిపారు. అవమానకరం: ఆనం వివేకా రాష్ట్ర విభజన అవమానకర ఘటనని మాజీ ఎమ్మెల్యే ఆనం వివేకానంద రెడ్డి పేర్కొన్నారు. తెలుగు సంస్కృతి తెలియని దుర్మార్గులు రాష్ట్రాన్ని విడగొట్టారని దుయ్యబట్టారు. డిగ్గీలు, భగ్గీలందరూ(దిగ్విజయ్‌సింగ్) రోజుకో తీరున మాట్లాడుతుంటే సీమాంధ్ర రక్తం వేడెక్కిందన్నారు. -
మన ఫౌండ్రీకి చైనా ముప్పు..
20 శాతం కోల్పోతున్న వ్యాపారం ధరా భారమవుతున్న ముడిసరుకు మానవ వనరులూ కొరతే తెలంగాణ, సీమాంధ్రకు పొరుగు రాష్ట్రాల బెడద ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్ వెల్లడి హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: దేశీయ ఫౌండ్రీ పరిశ్రమకు చైనా ముప్పు తప్పడం లేదు. భారత్‌లో ఉన్న లొసుగులను ఆ దేశం క్యాష్ చేసుకుంటోంది. దేశీయంగా ముడి సరుకులు ప్రియమవుతుండడంతో ఫౌండ్రీ పరిశ్రమలో తుది ఉత్పాదనలైన క్యాస్టింగ్స్ ధరలు కూడా అదే స్థాయిలో దూసుకెళ్తున్నాయి. ఈ అంశమే చైనా దూకుడుకు కారణమవుతోంది. దీంతో భారతీయ ఫౌండ్రీ పరిశ్రమ 20% దాకా వ్యాపారం కోల్పోతోంది. ప్రభుత్వం చొరవ తీసుకుంటే చైనాకు పోటీనివ్వడం ఖాయమని పరిశ్రమ అభివృద్ధికి 1950 నుంచి కృషి చేస్తున్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇండియన్ ఫౌండ్రీమెన్(ఐఐఎఫ్) అంటోంది. వేడెక్కుతున్న సమస్యలు..: 15 ఏళ్ల క్రితం వరకు పిగ్ ఐరన్ ధర దేశవ్యాప్తంగా ఒకేలా ఉండేది. దీని తయారీలో ఉన్న ప్రైవేటు కంపెనీలు ప్రస్తుతం విలువ ఆధారిత ఉత్పత్తులపైనే దృష్టిసారిస్తున్నాయి. అంతేగాక ధర విషయంలో ఈ కంపెనీలదే తుది నిర్ణయమవుతోందని పరిశ్రమ వాపోతోంది. టన్ను పిగ్ ఐరన్ ధర అప్పట్లో రూ.5 వేలుంటే, నేడు రూ.35 వేలకు ఎగబాకిందని ఓ కంపెనీ ప్రతినిధి వెల్లడించారు. భారతీయ బొగ్గులో బూడిద(యాష్) ఎక్కువగా ఉండడంతో నాణ్యమైన బొగ్గును టన్నుకు రూ.35 వేల దాకా వెచ్చించి విదేశాల నుంచి తెప్పిస్తున్నామని చెప్పారు. దీంతో తుది ఉత్పత్తుల ధర కాస్తా 20 శాతం దాకా పెరిగిందని ఐఐఎఫ్ దక్షిణ భారత చైర్మన్ వి.రామస్వామి తెలిపారు. వాహన పరిశ్రమ తోసహా తయారీ రంగం రెండేళ్లుగా కుదేలవడం, మైనింగ్ నిషేధం తదితర కారణాలతో పరిశ్రమ వృద్ధికి ఆటంకంగా మారిందన్నారు. స్థిర ప్రభుత్వం రాకతో ఇక అన్ని రంగాల నుంచి క్యాస్టింగ్స్కు డిమాండ్ ఉంటుందని ఆశాభావం వ్యక్తం చేశారు. అవకాశాలను అందుకోవాలంటే ముడి సరుకుల ధరలకు కళ్లెం వేయడంతోపాటు విరివిగా ఫౌండ్రీ పార్కుల ఏర్పాటుకు ప్రభుత్వం నడుం బిగించాలని కోరారు. నిపుణుల కొరత..: క్యాస్టింగ్స్ తయారీలో ముడిసరుకును కరిగించే కొలిమిని 1,650 డిగ్రీల సెల్సియస్ వరకు వేడి చేస్తారు. తయారీ ప్రదేశం అత్యంత వేడిగా ఉండటంతో ఫౌండ్రీల్లో పనిచేసేందుకు చాలా మంది విముఖత చూపిస్తున్నారు. దినసరి కార్మికులకు ఒక్కో షిఫ్టుకు రూ.600 దాకా చెల్లిస్తున్నారు. లోహ శాస్త్రం చదివే విద్యార్థుల సంఖ్యా తగ్గుతోందని రామస్వామి చెప్పారు. నిపుణుల కొరత పరిశ్రమను పట్టిపీడిస్తోందన్నారు. పొరుగు రాష్ట్రంలో ఒకలా.. సమైక్య రాష్ట్రంలో కొద్ది రోజుల క్రితం వరకు నెలకొన్న అనిశ్చితి, విద్యుత్ సమస్యలతో 60కిపైగా యూనిట్లు మూతపడ్డాయి. 150 యూనిట్లు ఖాయిలాపడ్డాయి. 30 వేల మంది రోడ్డున పడ్డారు. ఇదే అదనుగా ఇక్కడి అవకాశాలను కర్ణాటక చేజిక్కించుకుంది. రూ.200 కోట్లదాకా ఈ కంపెనీలకు రుణాలుండొచ్చని భాగ్యనగర్ ఫౌండ్రీస్ అసోసియేషన్ కార్యదర్శి ఎం.ప్రభాకర్ తెలిపారు. ప్రభుత్వం చొరవ చూపితే తిరిగి ఈ ప్లాంట్లలో ఉత్పత్తి కార్యకలాపాలు ప్రారంభమవుతాయని చెప్పారు. మెదక్ జిల్లాలో ప్రతిపాదిత ఫౌండ్రీ పార్కు ఏ అడ్డంకులు లేకుండా త్వరితగతిన పూర్తి అయితే మరిన్ని పార్కులు వస్తాయని వెల్లడించారు. సీమాంధ్ర, తెలంగాణలో ఏటా సుమారు రూ.5,000 కోట్ల విలువైన వ్యాపారం జరుగుతోంది. విద్యుత్ కూడా సమస్యే.. తెలంగాణ, సీమాంధ్రలో విద్యుత్ చార్జీలు ఒక యూనిట్‌కు రూ.12తోపాటు ఎఫ్ఎస్ఏ అదనం. అదే పొరుగున ఉన్న కర్ణాటకలో రూ.6.50, తమిళనాడులో రూ.7.50 చార్జీ ఉంది. ఒక కిలో ముడిసరుకును కరిగించడానికి 1.2 యూనిట్ల విద్యుత్ అవసరం. మెదక్ జిల్లాలో ఉన్న ఒక ప్రముఖ కంపెనీ మహారాష్ట్ర నుంచి రూ.2,000 కోట్ల విలువైన క్యాస్టింగ్స్ను తెప్పిస్తోందంటే పరిస్థితిని అర్థం చేసుకోవచ్చు. దేశవ్యాప్తంగా విద్యుత్ చార్జీలు ఒకేలా ఉండాలన్నది పరిశ్రమ డిమాండ్. ఇదీ పరిశ్రమ విలువ.. భారత ఫౌండ్రీ పరిశ్రమలో దాదాపు 6,000కుపైగా కంపెనీలున్నాయి. 85 శాతం సూక్ష్మ, చిన్న, 10 శాతం మధ్యతరహా, 5 శాతం భారీ స్థాయిలో ఉన్నాయి. ఫై, నాన్ ఫై, అల్యూమినియం, స్టీల్ వంటి క్యాస్టింగ్స్ ఉత్పత్తి చేస్తున్నాయి. వాహ నాలు, రైల్వేలు, ఇంజిన్లు, మెషినరీ తయారీలో క్యాస్టింగ్స్ వినియోగం ఎక్కువ. ప్రత్యక్షంగా 5 లక్షలు, పరోక్షంగా 15 లక్షల మంది ఉపాధి పొందుతున్నారు. సుమారు 1.4 కోట్ల టన్నుల క్యాస్టింగ్స్ ఉత్పత్తి అవుతోంది. పరిశ్రమ విలువ రూ.1.2 లక్షల కోట్లుందని సమాచారం. ఎగుమతులు 10 శాతం దాకా నమోదవుతున్నాయి. 2020 నాటికి ఉత్పత్తి సామర్థ్యం 2.5 కోట్ల టన్నులకు చేరుకుంటుందని పరిశ్రమ చెబుతోంది. ప్రస్తుతం చైనా, అమెరికాల తర్వాతి స్థానంలో భారత్ నిలిచింది. -
ఏపీకి ప్రత్యేక హోదా సాధ్యం కాదు!
కేంద్ర ప్రభుత్వానికి ప్రణాళికా సంఘం నివేదిక- పీటీఐ కథనం విభజన బిల్లు ఆమోదం సందర్భంగా ఏపీకి ఐదేళ్లు ‘స్పెషల్ స్టేటస్’ హామీ ఇచ్చిన నాటి ప్రధాని మన్మోహన్ ఆ తర్వాత కేంద్ర కేబినెట్ సమావేశంలోనూ ఆమోదం హామీని అమలు చేయాలని ప్రణాళికా సంఘానికీ నిర్దేశం జాతీయ అభివృద్ధి మండలి ఆమోదం అవసరం లేదన్న జైరాం రాష్ట్ర విభజన అమలైన నేపథ్యంలో ప్రత్యేక హోదాపై చర్చ ఇంకా నిర్ణయం తీసుకోలేదని ప్రణాళికా సంఘం వివరణ సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అభివృద్ధి మండలి (ఎన్డీసీ) ప్రస్తుతం నిర్దేశిస్తున్న నిబంధనల ప్రకారం.. ఆంధ్రప్రదేశ్ (సీమాంధ్ర) రాష్ట్రానికి ప్రత్యేక తరగతి హోదా కల్పించటం సాధ్యం కాదని పేర్కొంటూ కేంద్ర ప్రణాళికా సంఘం కేంద్ర ప్రణాళికాశాఖ మంత్రి ఇందర్‌జిత్‌సింగ్‌కు నివేదిక సమర్పించినట్టు పీటీఐ వార్తా సంస్థ శుక్రవారం ఒక కథనం ప్రచురించింది. ప్రత్యేక హోదా కల్పించేందుకు ఎన్డీసీ నిర్దేశించిన విధివిధానాలు.. ఆంధ్రప్రదేశ్‌కు వర్తించవని, ఆ నిబంధనలను ఆంధ్రప్రదేశ్ సంతృప్తిపరచటం లేదని ప్రణాళికా సంఘం తన నివేదికలో చెప్పిందనేది ఆ కథనం సారాంశం. అయితే.. ప్రణాళికాసంఘం నివేదిక నేపథ్యంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ప్రణాళికామంత్రి ఇందర్జిత్సింగ్తో మాట్లాడారు. ఏపీకి ప్రత్యేక హోదాపై చర్చించారు. దీంతో శుక్రవారం రాత్రి ప్రణాళికాసంఘం ఒక ప్రకటన చేస్తూ.. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశం పరిశీలనలోనే ఉందని.. దీనిపై ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదని వివరణ ఇచ్చింది. రాష్ట్ర విభజనకు ఉద్దేశించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ బిల్లు గత ఫిబ్రవరి 21న రాజ్యసభలో ఆమోదం పొందే సందర్భంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్.. రాష్ట్ర విభజన తర్వాత అవశేష ఆంధప్రదేశ్‌కు ఐదేళ్ల పాటు ప్రత్యేక తరగతి హోదా కల్పిస్తామని హామీ ఇచ్చిన విషయం తెలిసిందే. ఈ మేరకు 2014 మార్చి 2న జరిగిన కేంద్ర మంత్రివర్గం కూడా దీనిని ఆమోదించింది. ప్రణాళిక సంఘం చైర్మన్ హోదాలో స్వయంగా ప్రధానమంత్రి సభలో చేసిన వాగ్దానమైనందున అమలుపరచాలని ప్రణాళికాసంఘాన్ని ఆదేశించింది. అయితే.. ‘రాష్ట్రాలకు ప్రత్యేక కేటగిరీ హోదా ఇవ్వాలంటే అందుకు జాతీయ అభివృద్ధి మండలి ఆమోదించాల్సి ఉంటుంది కదా?’ అన్న ప్రశ్నకు ఆనాటి కేంద్రమంత్రి జైరాంరమేశ్.. ఎన్డీసీ అనుమతి అవసరం లేదని, కేవలం ఆమోదించాలని, స్వయంగా ప్రధానమంత్రి సభలో హామీ ఇచ్చినందున ఎలాంటి అవాంతరాలు ఉండవని బదులిచ్చారు. కానీ ఏపీకి స్పెషల్ స్టేటస్‌పై ఆనాటి కేబినెట్ తీర్మానం జరిగిన రెండు రోజులకే కేంద్ర ఎన్నికల సంఘం సార్వత్రిక ఎన్నికల షెడ్యూలు జారీచేయడంతో ఆ తీర్మానం ముందుకు సాగలేదు. తరువాత పాత ప్రభుత్వం రద్దయి కొత్త ప్రభుత్వం రావడం, ఎన్డీఏ సర్కారు తొలి మంత్రివర్గ సమావేశంలోనే పోలవరం ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ ఆర్డినెన్స్ తేవాలని నిర్ణయించడం, రాష్ట్రపతి సంబంధిత ఆర్డినెన్స్ జారీచేయడం వంటి పరిణామాలు చకచకా సంభవించాయి. అయితే ఆంధ్రప్రదేశ్‌కు స్పెషల్ స్టేటస్ అంశంపై మాత్రం కదలిక రాలేదు. ఇటీవల మాజీ మంత్రి జైరాంరమేశ్ ఓ విలేకరుల సమావేశంలో దీనిపై స్పందిస్తూ ‘‘ఒకవేళ కేంద్రం ఆ హామీ నెరవేర్చకుంటే ఎన్డీఏ ప్రభుత్వం విఫలమైనట్టే లెక్క. స్వయంగా నాటి ప్రధానమంత్రి, ప్రణాళిక సంఘం చైర్మన్ అయిన మన్మోహన్సింగ్ పార్లమెంటులో చేసిన ప్రకటన అది. ఆంధ్రప్రదేశ్‌లో ప్రభుత్వం ఏర్పాటవుతున్న జూన్ 8 నాటికే ప్రణాళికాసంఘం నోటిఫికేషన్ జారీచేయాల్సి ఉంటుంది...’’ అని పేర్కొన్నారు. ఇదే సందర్భంలో కేంద్రమంత్రి ఎం.వెంకయ్యనాయుడు ‘‘బిల్లు పాసయిన సందర్భంలోనే అప్పటి ప్రణాళిక సంఘం డిప్యూటీ చైర్మన్ అహ్లూవాలియాను నేను సంప్రదించాను. ప్రధాని పార్లమెంటులో చేసిన ప్రకటన అయినందువల్ల అమలు సులభసాధ్యమేనని ఆయన చెప్పారు. అందువల్ల స్పెషల్ స్టేటస్ రావడంలో ఎలాంటి అవాంతరాలు లేవని నేను నమ్ముతున్నా. ఒకవేళ ఉన్నా.. యూపీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీని ఎన్‌డీసీలో ఆమోదింపజేసుకోవాల్సి వస్తే.. అందులో అటు యూపీఏ పాలిత, ఎన్డీఏ పాలిత రాష్ట్రాలు ఉన్నందున అది పెద్ద కష్టమైన పనేం కాదు..’’ అని పేర్కొన్నారు. ఎన్డీసీ నిబంధనలేమిటంటే... సాధారణ రాష్ట్రాలకు కేంద్ర నిధుల్లో 30 శాతం గ్రాంటుగా, 70 శాతం రుణంగా లభిస్తుండగా.. స్పెషల్ కేటగిరీ స్టేటస్ జాబితాలో ఉన్న రాష్ట్రాలకు 90 శాతం గ్రాంటుగా, 10 శాతం రుణం రూపంలో కేంద్ర సాయం లభిస్తుంది. ప్రస్తుతం కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం రెవెన్యూ లోటుతో ఉండటమే కాకుండా.. రాష్ట్రానికి రాజధాని నిర్మాణాన్ని చేపట్టాల్సి ఉంది. ఇలాంటి ప్రత్యేక పరిస్థితుల నేపథ్యంలో విభజన తర్వాత మిగిలే ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక స్టేటస్ హోదా ఇస్తామని నాటి కేంద్ర సర్కారు విభజనకు ముందే ప్రకటించింది. ఈ నెల 2వ తేదీన ఆంధ్రప్రదేశ్ విభజన అధికారికంగా అమలులోకి వచ్చి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రంగా అవతరించింది. ఈ నేపధ్యంలో ప్రత్యేక హోదా అంశం చర్చనీయాంశంగా మారింది. 13 జిల్లాలతో మిగిలిన కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం స్పెషల్ స్టేటస్‌కు అర్హత పొందాలంటే ఎన్డీసీ నిబంధనలను సంతృప్తి పరచాలని, అయితే ఆ రాష్ట్రం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనలేవీ సంతృప్తిపరచగలిగేలా లేదని కేంద్ర ప్రణాళికాసంఘం కేంద్ర ప్రణాళికా మంత్రికి ఇచ్చిన నివేదికలో చెప్పినట్టు పీటీఐ తాజా కథనంలో పేర్కొంది. ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల మేరకు స్పెషల్ స్టేటస్‌కు అర్హత సాధించాలంటే.. 1. పర్వత, క్లిష్టతరమైన ప్రాంతమై ఉండాలి. 2. జనసాంద్రత తక్కువగా ఉండాలి. 3. గిరిజన జనాభా ఎక్కువగా ఉండాలి. 3. ఇతర దేశాల సరిహద్దులను పంచుకునేవిగా ఉండాలి. 4. ఆర్థిక, మౌలిక వనరుల్లో వెనకబడి ఉండాలి. 5. ఆర్థిక వనరులను సమీకరించుకోలేనివిగా ఉండాలి. అయితే ఈ నిబంధనలను సంతృప్తిపరుస్తున్న 11 రాష్ట్రాలు ప్రస్తుతం స్పెషల్ కేటగిరీ స్టేటస్‌ను పొందాయి. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, ఉత్తరాఖండ్, నాగాలాండ్, త్రిపుర, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకాశ్మీర్, సిక్కిం రాష్ట్రాలు ఈ జాబితాలో ఉన్నాయి. అలాగే.. బీహార్, రాజస్థాన్, ఒడిశా, జార్ఖండ్ తదితర రాష్ట్రాల నుంచి కూడా ప్రత్యేక తరగతి హోదా కోసం డిమాండ్లు ఉన్నాయి. ‘ప్రత్యేక హోదా’ పరిగణనలో ఉంది: ప్రణాళికా సంఘం ఆంధ్రప్రదేశ్ ప్రత్యేక హోదా పొందేందుకు ఎన్డీసీ నిబంధనలను సంతృప్తిపరచడం లేదంటూ వచ్చిన వార్తలపై కేంద్ర ప్రణాళికా సంఘం శుక్రవారం రాత్రి ఒక ప్రకటన విడుదల చేసింది. ‘‘కొత్త ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక కేటగిరీ హోదా ఇచ్చే అంశంపై తుది నిర్ణయం ఏదీ తీసుకోలేదు. ప్రసార సాధనాల్లో వస్తున్న వార్తల కారణంగా ఈ విషయం తెలియపరుస్తున్నాం. ప్రత్యేక హోదా ఇచ్చే అంశం ప్రణాళికాసంఘం పరిగణనలో ఉంది’’ అని ఆ ప్రకటనలో వివరించింది. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై కేంద్రమంత్రి వెంకయ్యనాయుడు ప్రణాళికాసంఘం మంత్రితో చర్చించాక ఈ ప్రకటన వెలువడటం విశేషం. -
తెలంగాణలో ఉంటాం.. సీమాంధ్రకూ విస్తరిస్తాం
* వ్యాపారావకాశం ఉన్నచోటుకే విస్తరణ * పారిశ్రామికవాడల్లో అయితే పెట్టుబడికి సిద్ధం * ఒకే దరఖాస్తుతో అన్ని అనుమతులు ఇవ్వాలి * రెండు రాష్ట్రాలు సీఎస్టీ మినహాయించాలి * ఇవీ పారిశ్రామిక ప్రతినిధుల డిమాండ్లు హైదరాబాద్, బిజినెస్ బ్యూరో: వ్యాపార పరంగా మేం ఎదగాలి. అందుకు విస్తరణే ఎకైక మార్గం. నూతన వ్యాపార అవకాశాలు ఉన్నచోటే ప్లాంట్లు పెడతామని అంటున్నారు వివిధ పరిశ్రమల ప్రతినిధులు. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న ప్లాంట్లు అలాగే కొనసాగుతాయని వారు అంటున్నారు. ఇక్కడి ప్లాంట్లను మూసివేసి మరోచోటుకు తరలించే అవకాశమే లేదని స్పష్టం చేస్తున్నారు. కొత్త ప్లాంట్లు మాత్రం సీమాంధ్రతోసహా వివిధ రాష్ట్రాల్లో స్థాపిస్తామని చెబుతున్నారు. మరోవైపు రెండు రాష్ట్రాల మధ్య జరిగే వ్యాపారంపై కేంద్ర అమ్మకం పన్ను(సీఎస్టీ) మినహాయించాలని డిమాండ్ చేస్తున్నారు. సీఎస్టీ మినహాయిస్తే తెలంగాణ నుంచి ప్లాంట్లు తరలిపోవని మరీ చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో వ్యాపార అవకాశాలపై వివిధ అభిప్రాయాలను పారిశ్రామికవేత్తలు వ్యక్తం చేశారు. అవి..పన్ను మినహాయిస్తే.. తెలంగాణ, సీమాంధ్ర మధ్య జరిగే వ్యాపారంపై 2 శాతం సీఎస్టీని వ్యాపారులు చెల్లించాల్సి వస్తోంది. ఈ అంశమే ఇప్పుడు పెద్ద సమస్యగా పరిణమించింది. 2-3 శాతం మార్జిన్లతో వ్యాపారాలు చేస్తున్నాం. అలాంటప్పుడు సీఎస్టీకే 2% పోతే ఎలా అని అంటున్నారు ఈటా బ్రాండ్ ఉత్పత్తులను తయారు చేస్తున్న కిషోర్‌సన్స్ డిటర్జెంట్స్ ఎండీ గౌతమ్ చంద్ జైన్. ‘మా వ్యాపారంలో 80 శాతం వాటా సీమాంధ్ర నుంచే. ప్లాంటేమో తెలంగాణలో ఉంది. మాలాంటి కంపెనీలు ఇక్కడ చాలా ఉన్నాయి. 10 ఏళ్ల క్రితం హైదరాబాద్ ఫార్మా కంపెనీలు పన్ను ప్రయోజనాలు అందుకోవడానికి ఉత్తరాఖండ్, హిమాచల్‌ప్రదేశ్‌లకు వెళ్లాయి. ఇదే మాదిరిగా ఇప్పుడు సీమాంధ్రకు కూడా వెళ్లాల్సిన పరిస్థితి తలెత్తింది’ అని గుర్తు చేశారు. 5 ఏళ్లపాటు ఇరు రాష్ట్రాల మధ్య సీఎస్టీ లేకుండా చేయాలన్నారు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఈ అంశంపై స్పష్టత ఇవ్వాలన్నారు. ఉత్తరాఖండ్, హిమాచల్ మాదిరిగా పన్ను ప్రయోజనాలు ఇస్తే ఏ రాష్ట్రంలోనైనా అసెంబ్లింగ్ ప్లాంటు పెడతామని సెల్కాన్ సీఎండీ వై.గురు పేర్కొన్నారు. పారిశ్రామికవాడలైతేనే...: విద్యాలయాలు, సేవా రంగంలో ఉన్న కంపెనీలు ఎంత ధరైనా స్థలానికి వెచ్చిస్తాయి. తయారీ కంపెనీలు అలా చేయలేవు. నిరంతరం ముడిపదార్థాలను కొనుగోలు చేయాలి. అటు పోటీ ఉంటుంది కాబట్టి లాభాలను కుదించుకుని తక్కువ ధరకు ఉత్పత్తులను విక్రయించాలి. ఈ పరిస్థితుల్లో స్థలానికే అధిక వ్యయం చేయలేవని సుధాకర్ పైప్స్ ఎండీ ఎం.జయదేవ్ తెలిపారు. రాజధాని మా జిల్లాలో అంటే మా జిల్లాలో అంటూ ప్రచారం జరగడంతో సీమాంధ్రలో స్థలాల ధరలు ఊహించనంతగా ఆకాశాన్నంటాయని వివరించారు. పారిశ్రామిక వాడలే ఇందుకు పరిష్కారమని చెప్పారు. చిన్న కంపెనీలు ప్రస్తుత పరిస్థితుల్లో స్థలం కొనే అవకాశాలే లేవని తెలిపారు. ఇటువంటి కంపెనీలకు తక్కువ ధరకు భూములను అద్దెకు ఇవ్వాలని కోరారు. అందుబాటు ధరలో స్థలం, ఒకే దరఖాస్తుకు అన్ని అనుమతులు, నిరంతర విద్యుత్, కార్మికులకు నివాస గృహాలు, మంచి రోడ్లు ఇవీ సగటు పారిశ్రామికవేత్తల డిమాండ్లని పేర్కొన్నారు. ఇక అమ్మకం పన్ను, విద్యుత్ చార్జీల్లో సబ్సిడీ మొత్తాల విషయంలో రీయింబర్స్మెంట్ విధానాన్ని తీసేయాలని, నేరుగా ప్రయాజనం కల్పించాలని ఫ్యాప్సీ వైస్ ప్రెసిడెంట్, నయాస్ట్రాప్ ఎండీ వెన్నం అనిల్‌రెడ్డి కోరారు. వ్యాపారావకాశాలు.. ముడి పదార్థాల లభ్యత, మౌలిక వసతుల కల్పన, వ్యాపార అవకాశాలు.. ఈ మూడు అంశాలే పారిశ్రామికవేత్తలకు అత్యంత ప్రధానమైనవని ఫ్యాప్సీ సీనియర్ వైస్ ప్రెసిడెంట్, రుంగ్టా గ్లాస్ ఎండీ శివ్‌కుమార్ రుంగ్టా పేర్కొన్నారు. కొన్ని ప్రాంతాల్లో భూముల ధరలు ఇబ్బడిముబ్బడిగా పెరిగాయని అన్నారు. తెలంగాణ, సీమాంధ్ర ప్రభుత్వాలు ప్రకటించబోయే పారిశ్రామిక విధానాల కోసం వ్యాపారవేత్తలు ఎదురు చూస్తున్నారని చెప్పారు. తెలంగాణ ప్రభుత్వం హైదరాబాద్ వెలుపల, ఇతర ప్రాంతాల్లో పారిశ్రామికవాడల ఏర్పాటు, అలాగే పన్ను ప్రోత్సాహకాలు ఇచ్చే అవకాశం ఉందని ఆయన పేర్కొన్నారు. ఇక సీమాంధ్రలో కొత్త వ్యాపార అవకాశాలు ఉత్పన్నమవుతాయి కాబట్టి విస్తరణకు అక్కడికి వెళ్లేందుకు పారిశ్రామికవేత్తలు చూస్తున్నారని వివరించారు. రూ.2,500 కోట్ల పెట్టుబడి.. ప్లాస్టిక్ కంపెనీలు హైదరాబాద్ సమీపంలో ప్లాస్టిక్ పార్కు ఏర్పాటు చేయాలని చాలా ఏళ్లు శ్రమించాయి. అది సాధ్యం కాలేదు. ఇప్పుడు అన్ని వసతులతో సీమాంధ్రలో పార్కు ఏర్పాటైతే వెళ్లేందుకు దాదాపు 1,000 కంపెనీలు సిద్ధంగా ఉన్నాయని ఆంధ్రప్రదేశ్ ప్లాస్టిక్ మాన్యుఫ్యాక్చరర్స్ అసోసియేషన్ చెబుతోంది. పార్కులో రెండేళ్లలో రూ.2,500 కోట్ల పెట్టుబడి ఖాయమని అసోసియేషన్ అంటోంది. కొత్త అవకాశాలు అందుకోవడానికైనా కంపెనీలు సీమాంధ్రలో విస్తరిస్తాయని అసోసియేషన్ ప్రెసిడెంట్ వెన్నం అనిల్‌రెడ్డి చెప్పారు. కాగా, సుధాకర్ పైప్స్ రూ.100 కోట్లతో 30 ఎకరాల్లో కేబుల్స్ తయారీ ప్లాంటు పెట్టాలని భావిస్తోంది. గుజరాత్ లేదా సీమాంధ్రలో ఇది రానుంది. ప్రత్యక్షంగా, పరోక్షంగా 1,500 మందికి ఉపాధి లభించనుంది. రుంగ్టా గ్లాస్ రూ.20 కోట్లతో నిర్మాణ రంగానికి అవసరమయ్యే గ్లాస్, ల్యామినేటెడ్ గ్లాస్ ఉత్పత్తుల తయారీ యూనిట్ పెట్టనుంది. కిషోర్‌సన్స్ రోజుకు 300 టన్నుల సామర్థ్యం గల తయారీ యూనిట్ ఏర్పాటుకు యోచిస్తోంది. రూ.10 కోట్లదాకా వ్యయం చేయనుంది. ప్లాస్టిక్ ప్యాకేజింగ్ ఉత్పత్తుల తయారీకై నయాస్ట్రాప్ రూ.10 కోట్లతో ప్లాంటు స్థాపించే పనిలో ఉంది. దాదాపు 60 ఎలక్ట్రానిక్ పరిశ్రమలు మొత్తం రూ.1,200 కోట్ల దాకా పెట్టుబడికి సిద్ధంగా ఉన్నాయని సమాచారం. -
వైజాగ్‌ను రాజధాని చేయాలి
శ్రీకాకుళం అర్బన్, న్యూస్‌లైన్: నూతన ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రానికి వైజాగ్‌ను రాజధానిగా చేయాలని మాజీ మంత్రి తమ్మినేని సీతారాం డిమాండ్ చేశారు. శ్రీకాకుళంలోని ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. టీడీపీ పుణ్యమాని రాష్ట్రం రెండు ముక్కలైందని, ఒక రాష్ట్రానికి కే సీఆర్ ముఖ్యమంత్రి అయ్యారన్నారు. ఆదాయ వనరులున్న తెలంగాణాలో కేసీఆర్ నిరాడంబరంగా ప్రమాణం స్వీకారం చేస్తే, లోటు బడ్జెట్, సమస్యలతో ఉన్న రాష్ట్రంలో బాబు రూ.30 కోట్లతో ప్రమాణ స్వీకారం చేస్తున్నారన్నారు. కేసీఆర్‌కు ఉన్న విజ్ఞత బాబుకు లేకపోవడం శోచనీయమన్నారు. బాబు ప్రమాణ స్వీకారానికి ఇంత హడావుడి చేయడంలో ఆంతర్యమేమిటని, దాని వల్ల సీమాంధ్రకు ఒరిగిందేమిటని ప్రశ్నించారు. నవ్యాంధ్ర నిర్మాణం, నూతన రాజధాని పేరుతో విరాళాలు సేకరిస్తూ, మరో పక్క ప్రమాణ స్వీకారానికి నిధులు దుర్వినియోగం చేస్తున్నార న్నారు. హైదరాబాద్ నుంచి సీమాంధ్ర పాలన సాగిస్తానన్న బాబు గుంటూరులో ఎందుకు ప్రమాణ స్వీకారం చేస్తున్నారని ప్రశ్నించారు. కేవలం కుటుంబ ఆస్థుల విలువ పెంచుకోవడం కోసమేన ని ఆరోపించారు. రైతు రుణమాఫీ, డ్వాక్రా మహిళల రుణ మాఫీ, ఇంటికో ఉద్యోగం తదితర హామీల అమలు, సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని సూచించారు. ఇప్పటికే విద్య, వైద్యం, మౌళిక వసతుల పరంగా 88శాతం అభివృద్ధి చెందిన వైజాగ్‌ను రాజధానిగా చేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేయాలని కోరారు. సమావేశంలో మొదలవలస లీలామోహన్ తదితరులు పాల్గొన్నారు. -
అక్కడ బాబు ప్రమాణం.. ఇక్కడ ట్రాఫిక్ ఆంక్షలు
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సంద ర్భంగా తెలంగాణలోనూ ట్రాఫిక్ ఆంక్షలు విధించారు. ఆంధ్ర సరిహద్దు జిల్లా అయిన ఖమ్మంలో ఆదివారం ఈ ఆంక్షలు అమల్లో ఉండనున్నాయి. ఈ మేరకు తెలంగాణ రాష్ట్ర డీజీపీ అనురాగ్‌శర్మ నుంచి ఆదేశాలు వచ్చినట్టు పోలీసులు వర్గాలంటున్నాయి. ఈ ఆదేశాల మేరకు ఆదివారం ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు ఖమ్మం నుంచి విజయవాడ, గుంటూరు ప్రాంతాలకు వెళ్లే వాహనాలను నిలిపివేయనున్నారు. ఈ రూట్లలో జిల్లా వ్యాప్తంగా చెక్‌పోస్టులు ఏర్పాటు చేస్తామని, ఈ చెక్‌పోస్టుల నుంచి వెళ్లే వాహనాలను శనివారం రాత్రి 10 గంటల నుంచే నిలిపివేసి.. ఆదివారం రాత్రి 10 గంటల తర్వాత పంపుతామని జిల్లా ఎస్పీ ఎ.వి.రంగనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. గుంటూరులోని నాగార్జున వర్శిటీ సమీపంలో చంద్రబాబు ప్రమాణ స్వీకారం చేస్తున్న సందర్భంగా ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్టు ఆ ప్రకటనలో వెల్లడించారు. అంటే శనివారం రాత్రి నుంచి ఆదివారం రాత్రి వరకు ఎలాంటి రవాణా వాహనాలు సరిహద్దులు దాటి వెళ్లవు. ఏపీలో రాష్ట్రపతి పాలన ఎత్తివేత సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్ర ప్రదేశ్‌లో కొత్త ప్రభుత్వం కొలువుదీరనున్న నేపథ్యంలో అక్కడ రాష్ట్రపతి పాలనను ఎత్తివేస్తూ రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ నిర్ణయం తీసుకున్నారు. ఇది జూన్ 8 నుంచి అమల్లోకి వస్తుంది. ఉమ్మడి రాష్ట్రంలో జూన్ 1 వరకు రాష్ట్రపతి పాలన ఉండటం, ఆంధ్రప్రదేశ్‌లో అప్పటికి కొత్త ప్రభుత్వం ఏర్పాటు కానుందున దాన్ని పొడిగించడం తెలిసిందే. -
ఉద్యోగుల పంపిణీపై వారంలో ముసాయిదా
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన అనంతరం ఉద్యోగుల తుది పంపిణీకి సంబంధించి మార్గదర్శకాల రూపకల్పనపై కమలనాథన్ కమిటీ దృష్టి సారిం చింది. రెండు రాష్ట్రాలకు ఉద్యోగుల పంపిణీ, మార్గదర్శకాలపై కమలనాథన్ అధ్యక్షతన రాష్ట్ర స్థాయి సలహా కమిటీని కేంద్ర ఏర్పాటు చేసిన విషయం తెలిసిందే. ఈ నెల 14వ తేదీన కమిటీ సమావేశం కానుంది. రెండు రాష్ట్రాల ప్రభుత్వ ప్రధాన కార్యదర్శులు, తెలంగాణ ఆర్థికశాఖ ముఖ్యకార్యదర్శి నాగిరెడ్డి, ఆంధ్రప్రదేశ్ ముఖ్యకార్యదర్శి పీవీ రమేశ్, కేంద్ర సిబ్బంది శిక్షణ విభాగం సంయుక్త కార్యదర్శి అర్చనవర్మ ఇందులో పాల్గొంటారు. ఈ సమావేశం లో ఉద్యోగుల పంపిణీ ముసాయిదా మార్గదర్శకాలను ఖరారు చేసి ప్రజల ముందు ఉంచుతారు. దీనిపై అభ్యంతరాలు, సూచనలను కమిటీ పరిగణనలోకి తీసుకుని తుది మార్గదర్శకాలను రూపొందించి ప్రధాని ఆమోదానికి పంపనుంది. ఆయన ఆమోదం అనంతరం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియను కమిటీ చేపట్టనుంది. రెండు రాష్ట్రాల్లో కేటగిరి వారీగా కేడర్ సంఖ్య ఎంత ఉండాలనేది కమలనాథన్ కమిటీ నిర్ధారిస్తుంది. అనంతరం ఉద్యోగుల నుంచి నిర్ధారించిన కేటగిరిల్లో అప్షన్లను స్వీకరించనున్నారు. ప్రధానంగా దంపతులు, త్వరలో పదవీ విరమణ చేయనున్న వారు, ఎస్సీ, ఎస్టీలు, కొన్ని రకాల రోగాలతో బాధపడుతున్న వారి నుంచి ఆప్షన్లను స్వీకరించనున్నారు. ఉద్యోగుల పంపిణీపై అభ్యంతరాలుంటే తెలియజేసేందుకు కొంత సమయం ఇస్తారు. అనంతరం ఉద్యోగుల తుది పంపిణీ ప్రక్రియను పూర్తి చేయనున్నారు. అయితే కొత్త ప్రభుత్వాల సలహాలు, సూచనల మేరకు కమిటీ ముందుకు సాగాల్సి ఉంటుంది. నిబంధనలను అతిక్రమించడానికి వీలుండదని ఉన్నతాధికారి ఒకరు తెలిపారు. -
విధుల్లో చేరిన ఆ ఇద్దరు కానిస్టేబుళ్లు
సంగారెడ్డి, న్యూస్‌లైన్ : సమైక్య సభలో జై తెలంగాణ నినాదాలు చేసిన కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంపై కేసులు ఎత్తివేయడంతో మెదక్ జిల్లాలో శనివారం వారు విధుల్లో చేరారు. తమను గుర్తించిన సీఎం కేసీఆర్, డీజీపీ, ఎస్పీ శెముషీ బాజ్‌పాయ్‌కు, తెలంగాణ పోలీస్ ఫోరానికి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సందర్భంగా శనివారం జరిగిన కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫోరం అధ్యక్షుడు చిందం సుభాష్ పాల్గొని కానిస్టేబుళ్లు శ్రీనివాస్‌గౌడ్, శ్రీశైలంలకు సన్మానం చేశారు. అలాగే దివంగత కానిస్టేబుల్ కిష్టయ్యకు నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ పోలీసు ఫోరం రాష్ట్ర కార్యదర్శి కృష్ణ, సభ్యులు కరణం శివానంద్, అనిల్‌కుమార్, హనుమండ్లు, బుర్రి శ్రీనివాస్, జగదీష్, సంగారెడ్డి సబ్‌డివిజనల్ హోంగార్డు అధ్యక్షుడు చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
సీమాంధ్రకు 40, తెలంగాణకు 32 పులులు
నల్లమల విభజన నూతన జోన్ ఏర్పాటు మార్కాపురం, న్యూస్‌లైన్: రాష్ట్ర విభజన నేపథ్యంలో నల్లమల అటవీ ప్రాంతాన్ని కూడా అధికారులు విభజిం చారు. ప్రకాశం, గుంటూరు, కర్నూలు, మహబూబ్‌నగర్, నల్లగొండ జిల్లాల పరిధిలో నల్లమల అటవీ ప్రాంతం విస్తరించి ఉంది. నల్లమలలో మొత్తం 72పులులు సంచరిస్తున్నట్లు అధికారులు గుర్తించారు. వీటిలో 30నుంచి 32 వరకు తెలంగాణలో, 40 వరకు సీమాంధ్రలో ఉండవచ్చుంటున్నారు. టైగర్ ప్రాజెక్టు జోన్‌గా ఈ ప్రాంతాన్ని కేంద్రం గతంలో ప్రకటించింది. ఇందులో భాగంగా మార్కాపురం, ఆత్మకూరు, నాగార్జునసాగర్, అచ్చంపేట డివిజన్లను ఏర్పాటు చేసింది. కాగా, విభజన నేపథ్యంలో అచ్చంపేట, నాగార్జునసాగర్ డివిజన్లను తెలంగాణకు కేటాయిస్తూ ఉత్తర్వులు జారీ కాగా, మార్కాపురం, ఆత్మకూరు డివిజన్లతో పాటు నూతనంగా విజయపురిసౌత్ డివిజన్‌ను సీమాంధ్రకు కేటాయిం చారు. ప్రస్తుతం సీమాంధ్రకు 5,568 చ.కి.మీ రిజర్వు ఫారెస్ట్ ను కేటాయించారు. ఇందులో 3,568 చ.కి.మీ.(కోర్ ఏరియా) పులులు, ఎలుగుబంట్లు సంచరించే ప్రాంతంగా గుర్తించారు. 2 వేల చ.కి.మీ.(బఫర్ ఏరియా) గ్రామాలకు, అటవీ ప్రాంతానికి మధ్య ఉన్న ప్రాంతంగా గుర్తించారు. మార్కాపురం డివిజన్ 2,280 చ.కి.మీ పరిధిలో ఉండగా, ఆత్మకూరు డివిజన్ 1500 చ.కి.మీ పరిధిలో, విజయపురిసౌత్ డివిజన్ దాదాపు 300 చ.కి.మీ పరిధిలో ఉన్నట్లు గుర్తించారు. గతంలో 70 కి.మీ ఉన్న బీట్ ప్రాంతాన్ని 20 నుంచి 25 కి.మీలకు తగ్గించి అదనపు బీట్లను ఏర్పాటు చేస్తున్నారు. -
అగ్రికల్చర్ బెల్ట్‌గా సీమాంధ్ర
మురుగప్ప గ్రూప్ చైర్మన్ ఎ.వేలాయన్ చెన్నై: సీమాంధ్రలో అవకాశాలు పుష్కలంగా ఉన్నాయని మురుగప్ప గ్రూప్ ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఎ. వేలాయన్ తెలిపారు. వ్యవసాయానికి అనువైన వాతావరణం, భూమి పరిస్థితుల కారణంగా సీమాంధ్ర ప్రధాన అగ్రికల్చర్ బెల్ట్‌గా ఎదగగలదని ఆయన అభిప్రాయపడ్డారు. కొత్త ప్రభుత్వం వ్యవసాయంపై ప్రధానంగా దృష్టి సారించనుండటంతో .. వరి, మిరప, పత్తి, పప్పు ధాన్యాలు కీలకమైన పంటలుగా ఉండగలవని వేలాయన్ వివరించారు. సరైన సాగు నీటి సదుపాయం కల్పించగలిగితే సీమాంధ్ర ప్రధాన వ్యవసాయ రాష్ట్రంగా ఎదుగుతుందన్నారు. విద్యుత్ కొరతే పెద్ద సమస్యని ఆయన చెప్పారు. అయితే, బీజేపీతో భాగస్వామ్యం కారణంగా సీమాంధ్ర ప్రభుత్వానికి కేంద్రం నుంచి తగిన తోడ్పాటు లభించే అవకాశం ఉందన్నారు. సీమాంధ్రలో పెట్టుబడి అవకాశాలను పరిశీలించేందుకు చిన్న బృందాన్ని ఏర్పాటు చేసినట్లు వేలాయన్ చెప్పారు. ఇప్పటికే శ్రీకాకుళం నుంచి కాకినాడ, విశాఖపట్నం దాకా తమ కార్యకలాపాలు ఉన్నాయని వివరించారు. -
సీమాంధ్ర కేబుల్ ఆపరేటర్ల అసోషియేషన్ ప్రారంభం
-
‘ముంపు’ బడి
ఖమ్మం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలిపే ప్రక్రియ అక్కడి విద్యార్థులకు శాపంగా మారింది. రాష్ట్ర విభజన నేపథ్యంలో జిల్లాలోని ఏడు మండలాల పరిధిలోని 136 హ్యాబిటేషన్లను సీమాంధ్రలో కలిపారు. జిల్లాతో అనుబంధం ఉన్న ప్రజలను విడదీశారు. అక్కడ ఉన్న పాఠశాలలు, ఉపాధ్యాయులు, ఇతర ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఈనెల 12వ తేదీన విద్యాసంవత్సరం ప్రారంభమవుతుంది. గత విద్యాసంవత్సరం పాఠశాలల ముగింపు రోజు ఒక రాష్ట్రంలో..పాఠశాలలు తెరిచేలోపు మరో రాష్ట్రంలో ముంపు ప్రాంత విద్యార్థులు ఉండాల్సిన పరిస్థితి. ఇప్పటి వరకు జిల్లాలో ఉన్న ఉపాధ్యాయులు, విద్యార్థులు సీమాంధ్రలోని తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాలకు వెళ్లాల్సి ఉంటుంది. వీరికి వేతనాలు కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వమే ఇవ్వాలి. అక్కడి ప్రభుత్వం వేతనాలు ఇస్తుందే సరే ఎవరి అజమాయిషీలో పనిచేయాలనే సందిగ్ధత ఆ ప్రాంత ఉపాధ్యాయులు, బోధనేతర సిబ్బందిలో నెలకొంది. తాము ఏ ట్రెజరీ పరిధిలోకి వస్తామో కూడా చెప్పలేని పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. విద్యార్థులకు ప్రభుత్వ పరంగా అందించే ఉచిత పుస్తకాలు, మధ్యాహ్నభోజన పథకం అమలు, ఉపాధ్యాయులకు శిక్షణ, వారిపై పర్యవేక్షణ, బోధించే పాఠ్యాంశాలు, ఏ రాష్ట్ర సిలబస్ బోధించాలో అర్థంకాని పరిస్థితి ఉంది. అసలు ఉపాధ్యాయులు సీమాంధ్రుకు వెళ్లేందుకు ఒప్పుకుంటారా?, ఒప్పుకుంటే వారిని ఎక్కడ సర్దుబాటు చేయాలి? గత సంవత్సరం మేలో జరిగిన ఉపాధ్యాయుల బదిలీల కౌన్సెలింగ్‌లో ఇతర మండలాలకు బదిలీ అయిన ఉపాధ్యాయులు రిలీవర్ లేక ఇప్పటి వరకు ఆయా పాఠశాలల్లోనే పనిచేస్తున్నారు. ఇప్పుడు వారు ఎక్కడ పనిచేయాలి? వారికి వేతనాలు ఎవరు ఇవ్వాలి అనేది ప్రశ్నార్థకంగా మారింది. ఉపాధ్యాయుల వేతనాల చెల్లింపుపై చిక్కులు జూన్ 2తేదీ తర్వాత ఏ ప్రభుత్వం పరిధిలోకి వచ్చే ఉద్యోగులకు ఆ ప్రభుత్వం ఖజానా నుంచే వేతనాలు చెల్లించాలి. జిల్లాలోని ఏడు మండలాలకు చెందిన 230 ప్రాథమిక పాఠశాలలు, 12 ఉన్నత పాఠశాలలు సీమాంధ్రలో కలుస్తున్నాయి. వీటితోపాటు ఆయా పాఠశాలల్లో పనిచేసే 569 మంది ఉపాధ్యాయులు, ఐదు ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, వాటిలో పనిచేసే సుమారు 110 మంది బోధన, బోధనేతర ఉద్యోగులు సీమాంధ్రలోకి వెళ్లే అవకాశం ఉంది. అంటే జూన్ 2వ తేదీ నుండి వారి వేతనాలు సీమాంధ్ర ప్రభుత్వం ఖజనా నుంచి చెల్లించాల్సి ఉంటుందన్నమాట. ఇప్పటి వరకు ఆయా పాఠశాలలు, కళాశాలల విభజన, వాటి కేటాయింపుపై ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆదేశాలు రాలేదని అధికారులు చెబుతున్నారు. సీమాంధ్ర ప్రభుత్వం వేతనాలు చెల్లించేటట్టయితే..ఖమ్మం జిల్లా విద్యాశాఖ అధికారి పర్యవేక్షణ చేస్తే ఉభయ గోదావరి జిల్లాల అధికారులు ఏలా బిల్లులు చేస్తారు అనేది చర్చనీయాంశంగా మారింది. బూర్గంపాడు, వేలేరుపాడు, కుక్కునూరు మండలాలకు ట్రెజరీ బూర్గంపాడులో ఉంది. భద్రాచలం, చింతూరు, వీఆర్‌పురం, కూనవరం మండలాల ట్రెజరీ భద్రాచలంలో ఉంది. ఈ ట్రెజరీలు తెలంగాణ ప్రాంతంలోనే ఉన్నాయి. ఈ ప్రాంతంలో ట్రెజరీలు ఉన్నప్పుడు ఏపీలో ఎలా వేతనాలు చెల్లిస్తారనేది చర్చనీయాంశంగా మారింది. ఈ ప్రాంతాలు, ఉద్యోగుల సర్దుబాట్లు, పాఠశాలలు తదితర అంశాలన్నీ ఎప్పుడు కొలిక్కి వస్తాయి..? అప్పటి వరకు వేతనాలు ఆగుతాయా? అనే ప్రశ్నలు ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. విద్యార్థుల లోకల్ ఏరియాపై సందిగ్ధత ఇప్పటి వరకు తెలంగాణలో చదివిన ముంపు ప్రాంత విద్యార్థులు, నిరుద్యోగులు ఇప్పుడు సీమాంధ్రలో కలవడంతో వారి లోకల్ ఏరియా ఏ ప్రాంతానికి వస్తుందో.. అనే సందిగ్ధత నెలకొంది. జూన్ 2 తర్వాత ఆ ప్రాంతానికి వెళ్తే అక్కడి ప్రభుత్వ ఉద్యోగాల భర్తీలో సముచిత స్థానం కల్పిస్తారో? లేదోనన్న ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అక్కడి ప్రభుత్వం వారి విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందోనన్న గందరగోళ పరిస్థితులు నెలకొన్నాయి. విద్యార్థులకు తెలంగాణ ప్రభుత్వ సిలబస్ బోధించాలా? ఆంధ్ర ప్రభుత్వందా? అనే విషయంలోనూ ఇప్పటి వరకు స్పష్టత లేదు. జూన్ మొదటివారంలో చేపట్టే బడిబాట కార్యక్రమం కూడా ముంపు ప్రాంతాల్లో ఇంకా ప్రారంభంకాలేదు. ఇవన్నీ సమస్యలు ఎప్పుడు కొలిక్కి వస్తాయోనని ముంపు ప్రాంత విద్యార్థులు, ఉపాధ్యాయులు ఎదురుచూస్తున్నారు. -
అక్కడ కూడా పోటీనే
పోటీ అనేది అన్ని రంగాల్లోనూ ఉంటుంది. ఒక రంగంలో పోటిపడేవారు మరో రంగంలో పోటీ పడ కూడదనేమీ లేదు. అలా సినిమా రంగంలో నువ్వా? నేనా? అనేంతగా పోటీపడుతున్న కాజల్ అగర్వాల్, సమంత ఆస్తులు కొనుగోలు చేయడంలోను పోటీ పడుతున్నారట. ఇప్పటికే కోట్ల పారితోషికం పొందుతున్న ఈ భామలు ఆ సంపాదనను స్థిరాస్తులుగా మార్చుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ విడిపోయి రెండు రాష్ట్రాలుగా ఆవిర్భవిస్తుండడంతో టాలీవుడ్ తారల్లో కలకలం రేగుతోందనే ప్రచారం జరుగుతోంది. ఇలాంటి పరిస్థితిలో చెన్నై చిన్నది సమంత, ఉత్తరాది భామ కాజల్ అగర్వాల్‌లు సీమాంధ్రలో ఆస్తులు పెంచుకునే ప్రయత్నంలో నిమగ్నమయ్యారన్నది తాజా సమాచారం. ఆంధ్రాలో ఆస్తులను కొనుగోలు చేయడానికి ముద్దు గుమ్మలు ఇద్దరు పోటీ పడుతున్నారట. ఇళ్లయినా, ఎకరాల లెక్కన స్థలాలయినా సరే కొనేస్తున్నారట. ఇందుకు స్థల బ్రోకర్లను రప్పించుకుని మరి ప్రాంతాల వివరాలను రాబట్టుకుంటున్నారట. అదే విధంగా శర్వానంద్, తరుణ్, అల్లరి నరేష్ వంటి యువ నటులతో ఇప్పటికే హైదరాబాద్‌లో రెస్టారెంట్, బార్లు వంటి వ్యాపారాల్లోకి దిగారని సమాచారం. ఇప్పుడు వాళ్లు కూడా సీమాంధ్రలో స్థిరాస్తులను ఏర్పాటు చేసుకునే పనిలో పడ్డట్టు వార్తలు ప్రచారం అవుతున్నాయి. -
ఉమ్మడిగా గిట్టి విడిగా.. పుట్టిన రోజు
-
ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా..?
భద్రాచలం, న్యూస్‌లైన్: ముంపు మండలాలను సీమాంధ్రకు బదలాయించి ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా అని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను శనివారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం లక్షలాది మంది అమాయక ఆదివాసీ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని వినియోగించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. వనరులను దోపిడీ చేయాలనే లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. పెట్టుబడిదారుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. తాము తెలంగాణలోనే ఉంటామని ముంపు ప్రాంత ఆదివాసీలంతా పట్టుబడుతున్నా.. ఎవరినీ సంప్రదించకుండా ఆర్డినెన్స్ తీసుకురావటం అన్యాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రతోనే ఈ ఆర్డినెన్స్ వచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగంపై ఆయనకు గౌరవం ఉంటే గిరిజనులకు అన్యా యం చేసే పోలవరం ప్రాజెక్టును ఆపాలని కోరారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ పక్షాన అన్ని రకాలుగా ఉద్యమిస్తామని ప్రకటించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య ఒక సత్కార్యం కోసం చేస్తున్న దీక్షలు అభినందనీయమన్నారు. ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి... రాజ్యాంగ విరుద్ధంగా, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బదలాయింపును అడ్డుకునేందుకు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోదండరామ్ కోరారు. ఆర్డినెన్స్ వచ్చినందున ఈ దశలో ఏమీ చేయలేమని చెప్పటం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన చట్టాలు గిరిజనులకు రక్షణ కవచాల వంటివని, వీటిని పరిరక్షించాల్సింది రాష్ట్ర గవర్నరేనని అన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలి... ముంపు మండలాల్లోని గిరిజనులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు కొంతమంది దూరంగా ఉంటున్నట్లుగా తాము గుర్తించామని, వారి వైఖరి సరైంది కాదని అన్నారు. ఆదివాసీలకు అండగా నిలువాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేలా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమించడంలో భద్రాచలం టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు నడింపల్లి వెంకటపతిరాజు, టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎస్కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికుమారి తదితరులు పాల్గొన్నారు. -
తెలంగాణ దేవత సోనియా
గోదావరిఖని, న్యూస్‌లైన్ : సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీకి తీరని నష్టం కలుగుతుందని తెలిసినా తెలంగాణ ప్రజల చిరకాల వాంఛను నెరవేర్చేందుకు సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రాన్ని ప్రకటించి ఆమె తెలంగాణ ప్రజలకు దేవతగా మారారని పెద్దపల్లి మాజీ ఎంపీ జి.వివేక్ అన్నారు. తెలంగాణ సంబరా ల్లో భాగంగా ఆదివారం రాత్రి గోదావరిఖని ప్రధాన చౌరస్తాలో కాంగ్రెస్ ఆధ్వర్యంలో ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇచ్చిన మాటకు కట్టుబడి కాంగ్రెస్ తెలంగాణను ఇచ్చిందన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ ద్వారానే తెలంగాణ సాధించిన విషయాన్ని ప్రజలందరికీ చేరవేసేలా ప్రచారం చేయాలని సూచించారు. ప్రత్యేక రాష్ట్రం కావాలని జి.వెంకటస్వామి పోరాటం చేశారని, ఇప్పుడు ఆయన కల నెరవేరిందన్నారు. టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపర్చిన హామీలన్నిం టిని నెరవేర్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ బి.వెంకట్రావు, బాబర్ సలీంపాషా, బడికెల రాజలింగం, గుమ్మడి కుమారస్వామి, తానిపర్తి గోపాల్‌రావు, ఎం.రవికుమార్, మహంకాళి స్వామి, కాల్వ లింగస్వామి, కొలిపాక సుజాత, దొంతుల లింగం, కోట రవి తదితరులు పాల్గొన్నారు. -
మీ త్యాగఫలమే..
కుట్రలకు కలత చెంది... భిక్కనూరు మండల కేంద్రానికి చెందిన పెరుముల కుమార్ ఐటీఐ చదివారు. ప్రైవేటు ఎలక్ట్రీషియన్‌గా పనిచేసేవారు. తెలంగాణ ఏర్పాటుకు సీమాంధ్ర పాలకులు కుట్రలు చేస్తున్నారని కలత చెంది 2014, ఫిబ్రవరి 11న పొలం వద్ద చెట్టుకు ఉరివేసుకుని ఆత్మార్పణం చేసుకున్నారు. ఈ క్షణాన తమ కొడుకు ఉంటే సంబరపడి పోయే వాడని కుమార్ తండ్రి యెల్లేశం, తల్లి అంజమ్మ కన్నీరుమున్నీరయ్యారు. - కామారెడ్డి, న్యూస్‌లైన్ ఉద్యమానికి ఊపు తెచ్చిన కిష్టయ్య భిక్కనూరు మండలం శివాయిపల్లికి చెందిన పుట్టకొక్కుల కిష్టయ్య ఉరఫ్ కానిస్టేబుల్ కిష్టయ్య సమైక్య రాష్ట్రంలో తెలంగాణకు జరుగుతున్న అన్యాయాలకు తీవ్ర ఆవేదన చెందారు. కామారెడ్డి పట్టణంలో 30 నవంబర్, 2009న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మార్పణం చేసుకున్నారు. కిష్టయ్య ఆత్మర్పణంతో తెలంగాణలో ఉద్యమం ఎగిసి పడింది. కిష్టయ్యకు తల్లి లక్ష్మమ్మ, భార్య పద్మ, కొడుకు రాహుల్, కూతురు ప్రియాంక ఉన్నారు. - కామారెడ్డి, న్యూస్‌లైన్ కేంద్రం నిర్ణయంతో .. ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు శ్రీకారం చుడతామంటూ కేంద్ర ప్రభుత్వం 2009, డిసెంబర్ 9న చేసిన ప్రకటనను, సీమాంధ్రంలో ఎగిసిన ఉద్యమానికి తలొగ్గి వెనక్కి తీసుకోవడంతో తీవ్ర మనోవేదనకు గురైన ఎల్లారెడ్డి మండల కేంద్రానికి చెందిన ఆకుల శివకుమార్ 10 డిసెంబర్, 2009న బావిలో దూకి ఆత్మార్పణం చేసుకున్నారు. తెలంగాణ విద్యావంతుల వేదిక మండల కన్వీనర్‌గా బాధ్యతలు నిర్వర్తించిన శివకుమార్.. తుదిశ్వాస విడిచే వరకు ఉద్యమంలో చురుగ్గా పాల్గొన్నారు. ప్రత్యేక తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు కానుండడంతో తన కుమారుడు శివకుమార్‌తో పాటు తెలంగాణ అమరులందరీ ఆత్మశాంతిస్తుందని తల్లి అంజమ్మ ‘న్యూస్‌లైన్ ’కు తెలిపారు. - ఎల్లారెడ్డి, న్యూస్‌లైన్ కన్నవారిని విడిచి.. సీమాంధ్ర పెత్తందారుల ఒత్తిడికి తలొగ్గి కేంద్ర ప్రభుత్వం 2009,డిసెంబర్9న చేసిన ప్రకటనను వెనక్కి తీసుకోవడంతో బాన్సువాడ మండలంలోని సోమేశ్వర్‌కు చెందిన శామకూర శంకర్ తీవ్రంగా కలత చెందారు. ఇక తెలంగాణ రాదని తీవ్ర భావోద్వేగానికి గురైన శంకర్ 31మార్చి, 2012న ఒంటికి నిప్పంటించుకున్నారు. తెలంగాణ కోసమే ఆత్మబలిదానం చేసుకున్నానంటూ సుమారు 80 శాతం కాలిన గాయాలతో కొన ఊపిరితో శంకర్ న్యాయమూర్తికి మరణ వాం గ్మూలం ఇచ్చారు. ప్రస్తుతం శంకర్ కుటుంబం కడు పేదరికంలో కొట్టుమిట్టాడుతోంది. భర్త, కొడుకు దూరం కావడంతో శంకర్ తల్లి భూదేవి మేకల కాపరిగా మారి ఇద్దరు కూతుళ్లు చంద్రభాగ, మమతలను సాకుతోంది. పూరి గుడెసెలో కడు దుర్భరంగా బతుకులు వెళ్లదీస్తున్నారు. - బాన్సువాడ రూరల్, న్యూస్‌లైన్ -
ఉమ్మడిగా గిట్టి విడిగా.. పుట్టిన రోజు
సాక్షి, కాకినాడ : దాదాపు అరవై ఏళ్ల అనుబంధం తెగిపోయింది. ఆంధ్రప్రదేశ్ రెండుగా చీలింది. భౌగోళికంగా రాష్ర్టం రెండయిందన్న వేదనతో గుండె బరువెక్కుతున్నా తెలుగుజాతి మాత్రం ఎప్పుడూ ఒక్కటిగా ఉండాలని, కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్ పునర్నిర్మాణానికి సీమాంధ్రులంతా అంకితం కావాలని జిల్లావాసులు ఆకాంక్షిస్తున్నారు.కొత్తగా పుట్టింది పేరుకు తెలంగాణ రాష్ర్టమే అయినా కృత్యాద్యవస్థను చవి చూడనున్నది ‘ఆంధ్రప్రదేశ్’ అన్న పాతపేరును మిగుల్చుకున్న సీమాంధ్ర ప్రాంతమే.రాష్ర్టం కలిసే ఉండాలని, కలిసే ముందంజ వేయాలని కాంక్షిస్తూ సమైక్యవాదులు ఢిల్లీ నుంచి గల్లీ వరకు ఉద్యమించారు. అయినా కాంగ్రెస్, బీజేపీ, టీడీపీ కుమ్మక్కు రాజకీయాలతో విభజన జరిగిపోయింది. విభజనకు కేంద్రం నిర్దేశించిన అపాయింటెడ్ డే సోమవారం నుంచి అమల్లోకి రానుంది. ప్రజాప్రతినిధులూ! ఇకనైనా ప్రగతికి పాటుపడండి! కొత్త ఆంధ్రప్రదేశ్ అభివృద్ధికి చిత్తశుద్ధితో పాటుపడాలని జిల్లావాసులు అభిలషిస్తున్నారు. ‘ఇప్పటి వరకూ మనఆదాయంతో హైదరాబాద్‌ను అభివృద్ధి చేశాం. ఇకనైనా మన ఆదాయంతో మన ప్రాంతాన్నే అభివృద్ధి చేసుకుందాం’ అన్న భావనను పలువురు వ్యక్తం చేస్తున్నారు. మానవ వనరులతోపాటు సహజ వనరులు పుష్కలంగా ఉన్న మన జిల్లా రాష్ర్ట పునర్నిర్మాణంలో కీలక భాగస్వామి కావాలని కోరుకుంటున్నారు. సహజ సిద్ధమైన యాంకరేజ్ పోర్టు, మానవ నిర్మితమైన డీప్ వాటర్ పోర్టులతో పాటు గ్యాస్, చమురు నిక్షేపాలు, లక్షలాది ఎకరాల్లో వ్యవసాయ, వాణిజ్య పంటలు జిల్లా సొంతం. జాతీయ, అంతర్జాతీయ విశ్వవిద్యాలయాలు, భారీ పరిశ్రమలు ఇక్కడ ఏర్పాటయ్యేలా ఈ ప్రాంత ప్రజాప్రతినిధులు చిత్తశుద్ధితో కృషి చేయాలని జిల్లావాసులు కోరుతున్నారు. ఇక దేని రాబడి దానిదే.. తెలంగాణలో టీఆర్ఎస్ సర్కార్ మరికొద్ది గంటల్లోనే కొలువు దీరనుండడంతో అక్కడ పూర్తిస్థాయి పాలన సోమవారం నుంచే ప్రారంభం కానుంది. పాత పేరుతో కొత్తగా ఏర్పడుతున్న ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం టీడీపీ సర్కార్ ఈ నెల 8న కొలువుతీరనుంది. అప్పటి వరకూ ఇక్కడ రాష్ర్టపతి పాలనే కొనసాగనుంది. ఇప్పటి వరకు రాష్ట్ర పాలన, రికార్డుల నిర్వహణ ఉమ్మడి ప్రభుత్వాధీనంలో సాగేవి. విభజనతో శాఖల వారీగా రెండు రాష్ట్రాలకు రెండేసి చొప్పున కొత్తగా వెబ్సైట్ల రూపకల్పన పూర్తయింది. సర్వర్లను కూడా వేర్వేరుగా సిద్ధం చేస్తుండడంతో ఆ మేరకు జిల్లా ప్రభుత్వ కార్యాలయాల్లో సాంకేతికపరంగా సమూలమైన మార్పులు రాబోతున్నాయి. శాఖల వారీగా ఏ రాష్ర్ట ఆదాయం ఆ రాష్ర్ట ఖాతాకు జమ కానుంది. ఏపీ-04 సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు రవాణా శాఖకు సంబంధించి ఇప్పటి వరకు జిల్లాలో అమల్లో ఉన్న ఏపీ-05 సిరీస్‌కు బదు లు ఏపీ-04 సిరీస్‌తో రిజిస్ట్రేషన్లు జరగనున్నాయి. ఇప్పటివరకూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం, హైదరాబాద్ చిరునామాతో అన్ని శాఖల్లో స్టాంపింగ్ జరిగేది. రాజధాని ఎక్కడో తేలకపోవడంతో రాజధాని పేరు లేకుండానే ఆంధ్రప్రదేశ్ పేరుతో స్టాంపింగ్ చేయనున్నారు. దాదాపు అన్ని శాఖల్లో ఆదాయ, వ్యయాలతో పాటు నిర్వహణలో కూడా అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయి. ఇందుకోసం శుక్రవారం నుంచి వివిధ శాఖల సర్వర్లు, వెబ్సైట్లను నిలిపేశారు. మీసేవా కేంద్రాలు సైతం మూతపడ్డాయ. కొత్త ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొలువైన తర్వాతే అవసరమైన నిధుల కోసం శాఖలవారీగా ప్రతిపాదనల రూపకల్పనలో అధికారులు నిమగ్నమయ్యారు. శాఖల వారీగా రాష్ర్ట కార్యాలయాలు, ఉన్నతాధికారులు కొత్తగా ఏర్పడనుండడంతో ఆయా కార్యాలయాల చిరునామాలను, అధికారుల ఫోన్ నంబర్లను వెబ్సైట్లో పొందుపర్చే పని జరుగుతోంది. రాజకీయాలకతీతంగా రాష్ట్రాభివృద్ధికి అంకితం కావాలి రాష్ట్రం విడిపోకూడదని అన్ని ప్రాంతాల నుంచీ వర్గాలకు అతీతంగా పోరాటాలు జరిగాయి. కోనసీమ నుంచి జేఏసీ తరఫున మేమూ ఉధృతంగా పోరాడాం. కానీ చివరకు రాష్ట్రం విడిపోయింది. జరిగిందాని గురించి బాధపడడం కంటే జరగాల్సిన దానికోసం పాలకులు విజ్ఞతతో ఆలోచిస్తే సీమాంధ్ర ప్రజలకు భవిష్యత్తులో న్యాయం జరుగుతుంది. రాష్ట్ర విభజనను నిరోధించడంలో విఫలమైన అన్ని పార్టీల నాయకులూ కనీసం రాష్ట్ర పునర్నిర్మాణంలోనైనా రాజకీయాల జోలికి వెళ్లకుండా కొత్త రాష్ట్రం అభివృద్ధికి అంకితభావంతో పని చేయాలి. - బండారు రామ్మోహనరావు, కన్వీనర్, కోనసీమ సమైక్యాంధ్ర జేఏసీ ఆదాయ వనరులను తక్షణమే తెచ్చుకోవాలి సీమాంధ్రకు రావాల్సిన ఆదాయ వరులను తక్షణమే తెచ్చుకోవాలి. సీమాంధ్రలో వ్యాపారాలు చేస్తూ తెలంగాణ లో రిజిస్టర్డ్ కార్యాలయాలున్న పారిశ్రామికవర్గాలు తక్షణమే వాటిని సీమాంధ్రకు తెచ్చుకోవాలి. కేజీ బేసిన్‌లోని గ్యాస్ గుజరాత్‌కు తరలిపోకుండా చూడాలి. అనువైనచోట హైకోర్టు ను, మిగిలినచోట్ల బెంచ్ కోర్టులు ఏర్పాటు చేయాలి. విద్యుత్‌ను వాడకం ప్రాతిపదికన కాక జనాభా ప్రాతిపదికన కేటాయిస్తే భవిష్యత్‌లో సీమాంధ్రలో పరిశ్రమలు అభివృద్ధి చెందితే ఇబ్బందులు తలెత్తవు. ఏపీ బార్ కౌన్సిల్ నిధిని కేసుల ప్రాతిపదికన కేటాయించాలి. - ముప్పాళ్ళ సుబ్బారావు, న్యాయవాది, మానవ హక్కుల నేత, రాజమండ్రి సముద్ర తీరమే మనకున్న ఆస్తి రాష్ర్ట విభజనను అడ్డుకోవాలని తీవ్రంగా ఉద్యమించినా ఫలితం లేకపోయింది. సముద్రతీరమే మనకున్న ప్రధాన ఆదాయ వనరు. ఒక్కో జిల్లాకు ఒక్కోటి చొప్పున తొమ్మిది కోస్తా జిల్లాలకు తొమ్మిది పోర్టులు అందుబాటులోకి వస్తాయి. తెలంగాణ జిల్లాల నుంచి కాకినాడ పోర్టు ద్వారా ఎగుమతయ్యే బియ్యం, మొక్కజొన్న, గ్రానైట్లను కొన్నేళ్లు అంతర్రాష్ర్ట పన్ను నుంచి మినహాయింపునిస్తేఎగుమతులు పెరిగి మన పోర్టుకు ఆదాయం వృద్ధవుతుంది. పోర్టు ఆధారిత పరిశ్రమల ఏర్పాటును ప్రోత్సహించి పదేళ్లు పన్ను రాయితీనివ్వాలి. - దంటు సూర్యారావు, కోకనాడ చాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్షుడు రాష్ట్రాభివృద్ధికి తోడ్పాటునందిస్తాం.. రాష్ట్రం సమైక్యంగా ఉండాలని అనేక పోరాటాలు చేసినప్పటికీ యూపీఏ సర్కార్ ఏకపక్ష నిర్ణయం వల్ల రాష్ట్రం విడిపోతున్నందుకు తీవ్రంగా చింతిస్తున్నాం.రాష్ట్ర పునర్నిర్మాణం, అభివృద్ధికి మా వంతు తోడ్పాటునందిస్తాం. రాష్ట్ర పునర్నిర్మాణ విషయంలో అంకిత భావంతో పనిచేస్తాం. అవసరమైన పక్షంలో అదనంగా ఒక గంట పనిచేయడానికి కూడా వెనుకాడం. - బూరిగ ఆశీర్వాదం, ఏపీ ఎన్జీఓ సంఘం రాష్ర్ట ఉపాధ్యక్షుడు -
తెలుగుతల్లి గుండె పగిలె
సాక్షి, ఏలూరు : ప్రజా ఉద్యమాలు.. అలుపెరగని పోరాటాలు.. నిరాహార దీక్షలు.. అన్నీ నిష్ర్పయోజనం అయ్యాయి. తెలుగు నేలను ముక్కలు చేసేశారు. ప్రాంతాలు వేరైనా, వేష భాషల్లో తేడాలున్నా దశాబ్దాలుగా తెలుగువారంతా ఒకే రాష్ట్రంలో కలిసి ఉన్నారు. కానీ తెలుగుజాతి నేటి నుంచి రెండుగా విడిపోతోంది. నిన్నటి వరకు నాది అనుకున్న ప్రాంతాలు నేడు పరాయివి అయిపోయాయి. జిల్లా ప్రజల హృదయాల్లో తీరని ఆవేదన నింపింది. అన్నీ ప్రశ్నలే.. సమాధానాలు లేవు రాష్ట్రం విడిపోయిందనే బాధలో ఉన్న ప్రజల్లో ఎన్నో భయాలున్నాయి. వాటికి సరైన సమాధానాలిచ్చి, ధైర్యం చెప్పేవారెవరూ కనిపించడం లేదు. 1963లో ప్రారంభమైన శ్రీశైలం ప్రాజెక్టు నిర్మాణం 1984లో పూర్తయింది. ఒక్క ప్రాజెక్టు నిర్మాణానికే 21 ఏళ్లు పడితే హైదరాబాద్ వంటి రాజధానిని నిర్మించడానికి, ఇంటర్నేషనల్ ఎయిర్‌పోర్టులు, ఎంఎంటీఎస్ రైల్వే వ్యవస్థ, హైటెక్‌సిటీ, సెంట్రల్ యూనివర్సిటీలు, పరిశ్రమలు, ఫ్లై ఓవర్లు నిర్మించడానికి ఎన్నేళ్లు పడుతుంది? సాగు నీరు, తాగు నీటి కోసం ఇప్పటికే కర్ణాటక, మహారాష్ట్రతో పోరాటాలు చేస్తున్నాం. బాబ్లీ, ఆల్మట్టి ప్రాజెక్టులను ఆపలేకపోయాం. తెలంగాణ పాలన పగ్గాలు చేపడుతున్న నేతలు ఇప్పటికే ‘పోలవరం’ప్రాజెక్టుకు కొర్రీలు పెడుతున్నారు. తెలంగాణలోని సీమాంధ్ర ఉద్యోగులు వెనక్కి వెళ్లిపోవాల్సిందేనని లొల్లి పెడతున్నారు. వారికి సరిపడా పోస్టులు ఆంధ్రప్రదేశ్‌లో ఎక్కడివి? నీటి యుద్దాలు, కరెంటు కష్టాలు తీర్చేదెవరు? లోటు బడ్జెట్‌తో ఏర్పడుతున్న అవశేష ఆంధ్రప్రదేశ్‌లో అభివృద్ధి జరిగేదెలా?అనే ఆందోళన ఎందరిలోనే కనిపిస్తోంది. రోదన మిగిలింది తెలుగుజాతిని ముక్కలు చేయెద్దంటూ జిల్లాలో సమైక్యాంధ్ర పరిరక్షణ ఉద్యమం వందరోజులకుపైగా సాగింది. ప్రజలే నాయకులై ఉద్యమాన్ని నడిపించారు. ఉద్యోగ సంఘాలు, ఉపాధ్యాయ సంఘాలు, విద్యార్థి సంఘాలు, న్యాయవాదులు, రైతులు, ప్రైవేట్ విద్యాసంస్థలు, వ్యాపార, వాణిజ్య సంఘాలు సమైక్యాంధ్ర ఉద్యమంలో ముఖ్య భూమిక పోషించాయి. ఉద్యమంలో పాల్గొనే ప్రతి పౌరుడు తన జేబులో డబ్బునే ఖర్చు చేశాడు. ఎవరికి వారు చందాలు వేసుకున్నారు. నిరాహార దీక్షలు చేశారు. రోడ్లపైనే వంటావార్పూ నిర్వహించారు. వేర్పాటు వాదుల దిష్టి బొమ్మలను తగులబెట్టారు. విభజనను తట్టుకోలేక ఎందరో గుండె ఆగి చనిపోయారు. అయినా సమైక్య వాదుల గోడును ఎవరూ పట్టించుకోలేదు. ఉద్యమాన్ని ఖాతరు చేయలేదు. నేటితో తెలంగాణ రాష్ట్రం ఆవిర్భవిస్తోంది. తెలుగుజాతి రెండుగా చీలిపోతోంది. -
ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు... కొమరం భీంలా పోరాడదాం
వేలేరుపాడు, న్యూస్‌లైన్: పోలవరం ముంపు ప్రాంతాలను ఆంధ్రప్రదేశ్‌లో విలీనం చేసేందుకు జారీ చేసిన ఆర్డినెన్స్‌ను అడ్డుకునేందుకు ఆదివాసీలంతా కొమరం భీం మాదిరిగా పోరాడాలని న్యూడెమోక్రసీ జిల్లా కార్యదర్శి పోటు రంగారావు పిలుపునిచ్చారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా వేలేరుపాడు మండలంలోని మారుమూలనున్న కొయిదాలో అఖిలపక్షం ఆధ్వర్యంలో శనివారం జరిగిన పాదయాత్రలో ఆయన పాల్గొన్నారు. ఇక్కడ ఏర్పాటైన సభలో పోటు రంగారావు మాట్లాడుతూ.. ఆంధ్రాలోని బడా పారిశ్రామికవేత్తల స్వప్రయోజనాల కోసం ఇక్కడి ఆదివాసీలను ప్రధాని మోడీ, ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నీట ముంచుతున్నారని ధ్వజమెత్తారు. విలీనంపై పార్లమెంటులో, అసెంబ్లీలో ఎలాంటి చర్చ జరపకపోవడం వెనుక ఏపీ పెద్దల కుట్ర ఉందన్నారు. ఆర్డినెన్స్ రద్దు చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేశారు. ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా దశల వారీగా ఆందోళన చేపట్టనున్నట్టు చెప్పారు. జూన్ 2వ తేదీన ముంపు మండలాల్లో బ్లాక్ డే జరపనున్నట్టు చెప్పారు. 20 కిలోమీటర్లు సాగిన పాదయాత్ర కొయిదాలో శనివారం ప్రారంభమైన పాదయాత్ర రాత్రికి 20 కిలోమీటర్ల దూరంలోగల కన్నాయిగుట్టకు చేరింది. ఈ పాదయాత్రకు గిరిజన గ్రామాల్లో విశేష స్పందన లభించింది. మేడేపల్లి నుంచి మరో బృందం ప్రారంభించిన పాదయాత్ర మల్లారం వరకు సాగింది. ఈ పాదయాత్రలో న్యూడెమోక్రసీ నాయకులు ఎస్కె.గౌస్, గోకినేపల్లి వెంకటేశ్వరావు, సీపీఐ అశ్వారావుపేట నియోజకవర్గ కన్వీనర్ ఎండి.మునీర్, వైఎస్ఆర్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాస గౌడ్, వివిధ పార్టీల నాయకులు కారం దారయ్య, అమరవరపు అశోక్, ఎస్కె.నజీర్, వలపర్ల రాములు, గిల్లా వెంకటేశ్వర్లు, పూరెం లక్ష్మయ్య, గడ్డాల ముత్యాల్రావు తదితరులు పాల్గొన్నారు. -
ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా..?
భద్రాచలం, న్యూస్‌లైన్: ముంపు మండలాలను సీమాంధ్రకు బదలాయించి ఆదివాసీల హక్కులపై దాడి చేస్తారా అని టీజేఏసీ కన్వీనర్ ప్రొఫెసర్ కోదండరామ్ కేంద్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిం చారు. భద్రాచలంలో ఎమ్మెల్యే సున్నం రాజయ్య చేపట్టిన ఆమరణ దీక్షను శనివారం ఆయన సందర్శించి సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గుప్పెడు మంది కార్పొరేట్ శక్తుల కోసం లక్షలాది మంది అమాయక ఆదివాసీ ప్రాణాలను పణంగా పెడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గోదావరి నీటిని వినియోగించుకునేందుకు అనేక మార్గాలు ఉన్నప్పటికీ.. వనరులను దోపిడీ చేయాలనే లక్ష్యంతోనే పోలవరం ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారని ఆరోపించారు. పెట్టుబడిదారుల ఒత్తిడితోనే కేంద్ర ప్రభుత్వం ఇలా ఆగమేఘాల మీద ఆర్డినెన్స్‌ను తీసుకొచ్చిందని విమర్శించారు. తాము తెలంగాణలోనే ఉంటామని ముంపు ప్రాంత ఆదివాసీలంతా పట్టుబడుతున్నా.. ఎవరినీ సంప్రదించకుండా ఆర్డినెన్స్ తీసుకురావటం అన్యాయమని అన్నారు. చంద్రబాబు నాయుడు పన్నిన కుట్రతోనే ఈ ఆర్డినెన్స్ వచ్చిందని ఆరోపించారు. రాజ్యాంగంపై ఆయనకు గౌరవం ఉంటే గిరిజనులకు అన్యా యం చేసే పోలవరం ప్రాజెక్టును ఆపాలని కోరారు. పోలవరం నిర్మాణాన్ని అడ్డుకునేందుకు టీజేఏసీ పక్షాన అన్ని రకాలుగా ఉద్యమిస్తామని ప్రకటించారు. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజ య్య ఒక సత్కార్యం కోసం చేస్తున్న దీక్షలు అభినందనీయమన్నారు. ఆయనకు ప్రతి ఒక్కరూ అండగా నిలవాల్సిన అవసరం ఉందన్నారు. గవర్నర్ జోక్యం చేసుకోవాలి... రాజ్యాంగ విరుద్ధంగా, గిరిజన చట్టాలకు వ్యతిరేకంగా జరుగుతున్న బదలాయింపును అడ్డుకునేందుకు రాష్ట్ర గవర్నర్ జోక్యం చేసుకోవాలని కోదండరామ్ కోరారు. ఆర్డినెన్స్ వచ్చినందున ఈ దశలో ఏమీ చేయలేమని చెప్పటం సరికాదన్నారు. రాజ్యాంగం ప్రకారం సంక్రమించిన చట్టాలు గిరిజనులకు రక్షణ కవచాల వంటివని, వీటిని పరిరక్షించాల్సింది రాష్ట్ర గవర్నరేనని అన్నారు. ఉద్యమాన్ని ఉధృతం చేయాలి... ముంపు మండలాల్లోని గిరిజనులకు అండగా నిలిచేందుకు ప్రతి ఒక్కరూ ముందుకు రావాలని కోదండరామ్ పిలుపునిచ్చారు. ఆందోళన కార్యక్రమాలకు కొంతమంది దూరంగా ఉంటున్నట్లుగా తాము గుర్తించామని, వారి వైఖరి సరైంది కాదని అన్నారు. ఆదివాసీలకు అండగా నిలువాల్సిన బాధ్యత అందరిపైనా ఉందన్నారు. కేంద్రం కళ్లు తెరిపించేలా ఆందోళన కార్యక్రమాలను ఉధృతం చేయాలని పిలుపునిచ్చారు. అన్ని వర్గాలను కలుపుకుని ఉద్యమించడంలో భద్రాచలం టీజేఏసీ డివిజన్ కన్వీనర్ చల్లగుళ్ల నాగేశ్వరరావు చేస్తున్న కృషి అభినందనీయమన్నారు. కార్యక్రమంలో టీజేఏసీ జిల్లా అధ్యక్షుడు కూరపాటి రంగరాజు, తెలంగాణ పంచాయతీ రాజ్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు నడింపల్లి వెంకటపతిరాజు, టీజేఏసీ డివిజన్ అధ్యక్షుడు చల్లగుళ్ల నాగేశ్వరావు, పీఆర్ మినిస్టీరియల్ ఉద్యోగుల సంఘం రాష్ట్ర నాయకులు ఎస్కే గౌసుద్ధీన్, వెక్కిరాల శ్రీనివాస్, సోమశేఖర్, పూసం రవికుమారి తదితరులు పాల్గొన్నారు. -
ముంపు మండలాల బంద్ ప్రశాంతం
భద్రాచలం, న్యూస్‌లైన్: పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ పోలవరం ప్రాజెక్ట్ వ్యతిరేక పోరాట కమిటీ పిలుపుతో ముంపు మండలాల్లో శుక్రవారం సంపూర్ణ బంద్ జరిగింది. దుకాణాలు, బ్యాంకులు, సినిమా థియేటర్లు, పెట్రోల్ బంకులు, ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డాయి. ముంపు ప్రాంతాలకు బస్ సర్వీసులను ఆర్టీసీ అధికారులు రద్దు చేశారు. భద్రాచలంలోని ముఖ్య కూడళ్లలో అఖిలపక్షం నాయకులు ప్రదర్శన, అటవీశాఖ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో అఖిలపక్షం నాయకులు కెచ్చెల రంగారెడ్డి, పట్టం నారాయణ, కె.ఫణీశ్వరమ్మ, ముర్ల రమేష్, గుండు శరత్, బాదం జగదీష్, దాసరి శేఖర్, ఎవి.రావు, దాగం ఆదినారాయణ, జంజర్ల రమేష్, కాటం హరినాధ్, మడివి నెహ్రూ, కల్లూరి జయబాబు, చల్లగుళ్ల నాగేశ్వరరావు, కె.సీతారాములు, బి.రాజు, బండారు వెంకటేశ్వర్లు, కల్లూరి వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నిరనన హోరు ఆర్డినెన్స్‌కు వ్యతిరేకంగా ముంపు మండలాల్లో నిరసల హోరు సాగింది. వీఆర్‌పురంలో రహదారులపై అఖిలపక్షం నాయకులు ముళ్ళ కంచెలు వేసి వాహనాల రాకపోకలను పూర్తిగా అడ్డున్నారు. వంటావార్పు నిర్వహించారు. కూనవరం పాత బస్టాండ్ సెంటర్లో అఖిలపక్షం నేతలు రిలే నిరాహార దీక్ష చేపట్టారు. పాల్వంచ డివిజన్లోని కుక్కునూరులో అఖిలపక్షం ఆధ్వర్యంలో మానవహారం ఏర్పాటైంది. టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి వెంకయ్య నాయుడు, ప్రధాని నరేంద్ర మోడి దిష్టిబొమ్మలను ఆందోళనకారులు దహనం చేశారు. -
సీమాంధ్రకు కేకే,తెలంగాణకు కేవీపీ
రాజ్యసభ సభ్యుల లాటరీలో విడ్డూరం సాక్షి, న్యూఢిల్లీ: లాటరీ ద్వారా రాజ్యసభ సభ్యులను శుక్రవారం ఇరురాష్ట్రాలకు కేటాయించారు. ఇక్కడే విచిత్రం జరిగింది. సీమాంధ్రకు చెందిన సభ్యులు కేవీపీ రామచంద్రరావు, సి.ఎం.రమేశ్‌లు తెలంగాణకు వెళ్లారు. తెలంగాణకు చెందిన కె.కేశవరావు(కేకే), ఎం.ఎ.ఖాన్, దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి సీమాంధ్ర ఖాతాలోకి వచ్చారు. అవిభాజ్య ఆంధ్రప్రదేశ్ నుంచి 18మంది రాజ్యసభలో ప్రాతినిథ్యం వహిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టంలో చెప్పిన ప్రకారం ఈ సభ్యులను తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు 7ః11 నిష్పత్తిలో కేటాయించాలి. ఈ చట్టం మొదటి షెడ్యూల్లోని 13వ సెక్షన్ ప్రకారం సభ్యుల ను పదవీకాలం ముగిసే సమయం ప్రాతిపదికన మూడుగా విభజించి, ఆయా బృందాల్లోని సభ్యులను ఇరు రాష్ట్రాలకు కేటాయించాల్సి ఉంది. ఇందుకోసం శుక్రవారం సాయంత్రం పార్లమెంటులో రాజ్యసభ చైర్మన్ హమీద్ అన్సారీ సమక్షంలో లాటరీ ద్వారా సభ్యులను కేటాయించారు. 2016లో పదవీవిరమణ పొందే వారిలో.. ముందుగా 2016 జూన్ 21న పదవీ కాలం ముగిసే ఆరుగురు సభ్యుల్లో ఇద్దరిని తెలంగాణకు కేటాయిం చాల్సి ఉంది. డ్రా ద్వారా గుండు సుధారాణి, వి.హనుమంతరావును తెలంగాణకు కేటాయించారు. జేడీ శీలం, జైరాం రమేశ్, వై.ఎస్.చౌదరి ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహిస్తారు. వీరితో పాటు ఎన్.జనార్దన్‌రెడ్డి (ఈయన మరణించడంతో ప్రస్తుతం సీటు ఖాళీగా ఉంది) ప్రాతినిథ్యం వహించిన సీటు ఆంధ్రప్రదేశ్‌కే ఉంటుంది. ఈ సీటుకు త్వరలో ఎన్నిక జరగనుంది. 2018లో పదవీ కాలం ముగిసే సభ్యులు.. 2018 ఏప్రిల్ 2న పదవీ కాలం ముగిసే సభ్యుల్లో ముగ్గురిని తెలంగాణ కేటాయించాల్సి ఉంది. వీరిలో లాటరీ ద్వారా రాపోలు ఆనందభాస్కర్, పాల్వాయి గోవర్దన్‌రెడ్డి, సి.ఎం. రమేశ్‌లను తెలంగాణకు కేటాయించారు. మిగిలిన వారిలో చిరంజీవి, రేణుకాచౌదరి, దేవేందర్‌గౌడ్‌లను సీమాంధ్రకు కేటాయించినట్టుగా పరిగణించాల్సి ఉంటుంది. అంటే తెలంగాణకు చెందిన దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరి ఆంధ్రప్రదేశ్‌కు వెళ్లాల్సి ఉంటుంది. సీమాంధ్రకు చెందిన సి.ఎం.రమేశ్ తెలంగాణకు వచ్చారు. ఈ విధానం ద్వారా ఆంధ్రప్రదేశ్ నుంచి ప్రాతినిథ్యం వహించనున్న దేవేందర్‌గౌడ్, రేణుకాచౌదరిల పదవీకాలం ముగిశాక.. వారి స్థానంలో ఆంధ్రప్రదేశ్ నుంచి సభ్యుడిని ఎన్నుకోవాల్సి ఉంటుంది. అలాగే తెలంగాణకు ప్రాతినిథ్యం వహించనున్న సి.ఎం.రమేశ్ పదవీకాలం ముగి శాక తెలంగాణ వారిని సభ్యుడిగా ఎన్నుకొంటారు. 2020లో..:2020 ఏప్రిల్ 2న పదవీకాలం ముగిసే సభ్యుల నుంచి ఇద్దరిని తెలంగాణకు కేటాయించాల్సి ఉంది. ఇందులో లాటరీ ద్వారా కేవీపీ రామచంద్రరావు, గరికపాటి మోహన్‌రావులను తెలంగాణకు కేటాయిం చారు. మిగిలిన సభ్యులైన టి.సుబ్బిరామిరెడ్డి, ఎం.ఎ. ఖాన్, కె.కేశవరావు, తోట సీతారామలక్ష్మిలను ఆంధ్రప్రదేశ్ కు కేటాయించినట్టుగా పరిగణించారు. ఇక్కడ ఆంధ్రప్రదేశ్‌కు చెందిన కేవీపీ తెలంగాణకు రాగా, తెలంగాణకు చెందిన కె.కేశవరావు, ఎం.ఎ.ఖాన్ ఆంధ్రప్రదేశ్‌కు ప్రాతినిథ్యం వహించాల్సి వస్తోంది. ఇక్కడ కూడా సభ్యుల పదవీ కాలం ముగిశాక సొంత రాష్ట్రాల నుంచి సభ్యులను ఎన్నుకోవాల్సి ఉంటుంది. కేంద్రం పరిష్కారం! సాక్షి, హైదరాబాద్: రాజ్యసభ సభ్యుల లాటరీ చిక్కులకు పరిష్కారం లభించేలా ఉంది! సభ్యుల పరస్పర అంగీకారంతో ఏ రాష్ట్రం వారు ఆ రాష్ట్రానికి సంబంధించిన నిధులను ఖర్చు చేసుకునే వెసులుబాటును కల్పించేందుకు కేంద్రం సుముఖత వ్యక్తం చేసింది. దీనికితోడు ఎంపీగా వారికి సంక్రమించే అన్ని అధికారాలు, ప్రోటోకాల్‌ను కూడా సొంత రాష్ట్రానికి వినియోగించుకునే విషయంలో సానుకూలత వ్యక్తం చేసింది. ఈ మేరకు కేంద్రం త్వరలో ఉత్తర్వులు జారీ చేసేందుకు అంగీకరించింది. అయితే లాటరీ ద్వారా తెలంగాణకు చెందిన నలుగురు ఎంపీలను ఆంధ్రప్రదేశ్‌కు కేటాయించగా, సీమాంధ్రకు చెందిన ఇద్దరు ఎంపీలను మాత్రమే తెలంగాణకు కేటాయించడంతో పరస్పర అంగీకారం ఎలా సాధ్యమనేది ప్రశ్నార్థకంగా మారింది. ఒకవేళ నలుగురి మధ్య అంగీకారం కుది రినా మరో ఇద్దరు తెలంగాణ ఎంపీల పరిస్థితి ఏమిటనేది ఆసక్తికరంగా మారింది. సాంకేతికంగా పొరుగు రాష్ట్రానికి కేటాయించినప్పటికీ ఎంపీ లాడ్స్ నిధులను తెలంగాణలోనే ఖర్చు చేసుకునేందుకు, ఇతరత్రా అధికారాలను వినియోగించుకునేందుకు అనుమతినిస్తూ కేంద్రం అంగీకరించినట్లు సమాచారం. -
కేసీఆర్ ఫోటో తెచ్చిన గొడవ!
-
ప్రధాని మోడీ నిర్ణయం హర్షణీయం
పోలవరం ముంపు గ్రామాలపై ఆర్డినెన్స్‌కు కేంద్ర కేబినెట్ ఆమోదం భీమవరం అర్బన్, న్యూస్‌లైన్ : పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతాలైన ఏడు మండలాలను సీమాంధ్రలో కలుపుతూ రాష్ట్రపతి ఆర్డినెన్స్‌కు అనుకూలంగా కేంద్ర కేబినెట్ తొలి భేటీలోనే ప్రధాని నరేంద్ర మోడీ నిర్ణయం తీసుకోవడం హర్షణీయమని బీజేపీ రాష్ట్ర నాయకుడు పాకా వెంకట సత్యనారాయణ అన్నారు. స్థానిక పార్టీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. 1956లో భద్రాచలం ప్రాంతం తూర్పుగోదావరి జిల్లాలో ఉండేదని, అయితే పరిపాలనా సౌలభ్యం కోసం 1959లో ఖమ్మం జిల్లాలో కలిపారని గుర్తు చేశారు. పోలవరం ప్రాజెక్టు ఎత్తును తగ్గించాలని టీఆర్ఎస్ నాయకులు చేస్తున్న డిమాండ్లను వ్యతిరేకిస్తున్నామన్నారు. ప్రాజెక్టు మదింపు అనేది రాజకీయనాయకులకు సంబంధంలేని విషయమని, సాంకేతికంగా తలెత్తే ఇబ్బందులను ఇంజినీరింగ్ అధికారులు వివరిస్తారని, సెంటర్ వాటర్ కమిషన్ సూచనల మేరకే విధివిధానాలను రూపొందిస్తారన్నారు. పోలవరంను జాతీయ ప్రాజెక్టుగా గుర్తించాలన్నారు. త్వరలో తమ నేత వెంకయ్య నాయుడు ఆధ్వర్యంలో ప్రధాన మంత్రి మోడీని కలిసి ఈ విషయమై కోరతామన్నారు. జమ్మూ కాశ్మీర్‌కు ప్రత్యేక ప్రతిపత్తిని ఇచ్చే రాజ్యాంగంలోని 370వ అధికరణాన్ని రద్దు చేయాలని, దేశ సమగ్రత దెబ్బతినే ప్రాదేశిక సార్వభౌమత్వాన్ని తాము వ్యతిరేకిస్తున్నట్లు చెప్పారు. పార్టీ పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు అరసవల్లి సుబ్రహ్మణ్యం, అడ్డగర్ల ప్రభాకర గాంధీ పాల్గొన్నారు. -
బంధం వీడింది
సాక్షి ప్రతినిధి, ఖమ్మం: సుదీర్ఘ అనుబంధం వీడిపోయింది. జిల్లాలోని ఆదివాసీ గిరిజనులు, వారి సంస్కృతి, సంప్రదాయాలు, అడవితల్లి అందాలు జిల్లా నుంచి విడిపోనున్నాయి. జిల్లాలోని పోలవరం ముంపు మండలాలన్నింటినీ తెలంగాణ నుంచి వేరుచేసేందుకు రాష్ట్రపతి ఆమోదం లభించింది. ఈ మేరకు రాష్ట్రపతి ప్రణబ్‌ముఖర్జీ ఆర్డినెన్స్‌ను ఆమోదిస్తూ సంతకం చేయడంతో కేంద్ర న్యాయ శాఖ గురువారం గెజిట్ జారీ చేసింది. ఈ గెజిట్ ప్రకారం జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు, బూర్గం పాడు, భద్రాచలం, వీఆర్‌పురం, చింతూరు, కూనవరం మండలాలన్నీ సీమాంధ్ర ప్రాంతంలోకి వెళ్లనున్నాయి. అయితే, భద్రాచలం మండలంలోని భద్రాచలం పట్టణం (రెవెన్యూ గ్రామం)తోపాటు బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు మాత్రం తెలంగాణలోనే ఉం టాయి. జూన్ రెండు నుంచి సాంకేతికంగా ఈ మండలాలన్నీ ఖమ్మం జిల్లాతో పాటు తెలంగాణ నుంచి విడిపోనున్నాయి. ఈ నేపథ్యంలో ఖమ్మం జిల్లా రూపురేఖలే మారిపోతాయి. స్థానిక సంస్థల స్థానాలు, జిల్లా జనాభా, మండలాలు తగ్గిపోనున్నాయి. గెజిట్‌లో పేర్కొన్న ప్రకారం భద్రాచలం రామయ్య మినహా భద్రాచలం ఏజెన్సీలోని నాలుగు మండలాలు పూర్తిగా సీమాంధ్రలోకి వెళతాయి. అయితే, మొదటి నుంచీ కొంత గందరగోళంగా ఉన్న బూర్గంపాడు మండలం విషయంలో స్పష్టత వచ్చింది. బూర్గంపాడు మండలంలోని పినపాక, మోరంపల్లి బంజర, బూర్గంపాడు, నాగినేనిప్రోలు, కృష్ణసాగర్, టేకుల, సారపాక, ఇరవెండి, మోతెపట్టినగర్, ఉప్పుసాక, సోంపల్లి, నకిరిపేట రెవెన్యూ గ్రామాలు తెలంగాణలోనే ఉండనున్నాయి. మిగిలిన గ్రామాలు సీమాంధ్రలో కలవనున్నాయి. అయితే, కేవలం ప్రాంతాలను విలీనం చేస్తూ గెజిట్ జారీ చేశారు కానీ ముంపు బాధితుల పునరావాసానికి సంబంధించి ఎలాంటి ప్రస్తావనా గెజిట్‌లో చేయకపోవడం గమనార్హం. మరి మండలాలెన్నో! ముంపు ప్రాంతాలను సీమాంధ్రలో కలపడంతో జిల్లాలోని మండలాల సంఖ్యలో మార్పు జరగనుంది. మొత్తం జిల్లాలో ఇప్పటివరకు 46 మండలాలుండగా, ఏడు మండలాలను వేరుచేయడంతో ఆ సంఖ్య 39కి తగ్గనుంది. అయితే, భద్రాచలం పట్టణంతో పాటు బూర్గంపాడు మండలంలోని 12 గ్రామాలు తెలంగాణలోనే ఉండడంతో, వాటన్నింటిని కలిసి ఒక మండలం చేసే ఆలోచనలో జిల్లా అధికార యంత్రాంగం ఉంది. అలా జరిగితే మండలాల సంఖ్య 40 కానుంది. అయితే, కొత్తగా ఏర్పాటు చేయనున్న మండలానికి మండల కేంద్రంలో ఎక్కడన్నది అప్పుడు ప్రశ్నార్థకమవుతోంది. ఎందుకంటే భద్రాచలంతోపాటు బూర్గంపాడు మండల కేంద్రమైన బూర్గంపాడు కూడా తెలంగాణలోనే ఉంటున్నాయి. ఈ నేపథ్యంలో గోదావరి అవతల ఉన్న భద్రాచ లాన్ని మండల కేంద్రంగా చేస్తారా? గోదావరి ఇవతల ఉన్న బూర్గంపాడును మండల కేంద్రంగా చేస్తారా అన్నది తేలాల్సి ఉంది. అయితే, ఈ రెండింటిని కలపడం అసెంబ్లీ స్థానాల వారీగా ఇబ్బందులను కలిగిస్తుంది. ఎందుకంటే భద్రాచలం అసెంబ్లీ పరిధిలో భద్రాచలం పట్టణం ఉండగా బూర్గంపాడులోని 12 గ్రామాలు పినసాక అసెంబ్లీ పరిధిలోనికి వస్తాయి. ఈ నేపథ్యంలో వీటన్నింటినీ కలిపి ఒక మండలం చేయడం కష్టసాధ్యమవుతుంది. మరి అలాంటి పరిస్థితుల్లో భద్రాచలం రెవెన్యూ గ్రామ జనాభా 50వేలకు పైగా ఉన్నందున దానిని ప్రత్యేక మండలంగా చేసి, మిగిలిన 12 గ్రామాలను బూర్గంపాడు మండలంగా ఉంచితే ఎలాంటి సమస్యా ఉండదు. అప్పుడు జిల్లాలో మండలాల సంఖ్య 41 కానుంది. జిల్లా పరిషత్ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పిస్తారా? ముంపు మండలాలు సాంకేతికంగా సీమాంధ్రలోనికి వెళ్లిపోతే ఆయా మండలాల్లో గత ఎన్నికలలో జెడ్పీటీసీలుగా గెలుపొందిన వారికి జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో అవకాశం కల్పిస్తారా అనేది ఇప్పుడు చర్చనీయాంశమైంది. అధికారికంగా ఆయా మండలాలు సీమాంధ్రకు వెళ్లిపోయాయి కాబట్టి ఖమ్మం జెడ్పీ చైర్మన్ ఎన్నికలో వీరికి ఎలాంటి ప్రాధాన్యం ఉండకపోవచ్చని అధికారవర్గాలంటున్నాయి. అయితే, ముంపు మండలాల్లో కేవలం ఐదు జెడ్పీటీసీలకు మాత్రమే ఎన్నికలు జరగ్గా అందులో మూడు టీడీపీ, రెండు వైఎస్సార్సీపీలు గెలిచాయి. వీఆర్‌పురం, కూనవరం, భద్రాచలంలలో టీడీపీ గెలుపొందగా, బూర్గంపాడు, చింతూరులో వైఎస్సార్సీపీ గెలిచాయి. ఈ పరిస్థితులలో టీడీపీ బలం మూడు స్థానాలు తగ్గి 19కి పడిపోతుంది. అప్పుడు మొత్తం 40 మండలాలుంటే 21 జెడ్పీటీసీలు, 41 మండలాలయితే 22 జెడ్పీటీసీ స్థానాలు టీడీపీకి అవసరం అవుతాయి. 41 మండలాలుంటే భద్రాచలం, బూర్గంపాడులకు చెందిన ఒక్కో స్థానం టీడీపీ, వైఎస్సార్సీపీ ఖాతాలోనే ఉంటాయి. లేదంటే ఈ ప్రాంతాలను కలిపి ఒకే మండలం చేస్తే మండల కేంద్రం ఎక్కడ ఉంటే ఆ జెడ్పీటీసీని పరిగణనలోకి తీసుకుంటారు. ఈ పరిస్థితిలో జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో బలాబలాల సంఖ్యలో కూడా మార్పు రానుంది. అయితే, ఖమ్మం జిల్లా పరిధిలోనే ఎన్నికలు జరిగినందున జెడ్పీ చైర్పర్సన్ ఎన్నికలో ముంపు మండలాల ప్రతినిధులకు అవకాశం ఇవ్వాలా లేక సీమాంధ్రకు వెళ్లిపోయారు కాబట్టి ఇవ్వకూడదా అనే అంశంపై స్పష్టత కోరుతూ జిల్లా యంత్రాంగం ఎన్నికల సంఘానికి నివేదించనుంది. ఎన్నికల సంఘం నిర్ణయం మేరకు దీనిపై స్పష్టత రానుంది. ఎమ్మెల్యే మనకే భద్రాచలం అసెంబ్లీ పరిధిలోని నాలుగు మండలాలు ముంపు కింద సీమాంధ్రలో కలిసిపోయినప్పటికీ అసెంబ్లీ స్థానాల విషయంలో ఎలాంటి మార్పు ఉండదని అధికార వర్గాలంటున్నాయి. ఎందుకంటే శాసనసభా స్థానాల మార్పు పూర్తిగా పునర్విభజనపై ఆధారపడి ఉంటాయి. అసెంబ్లీ స్థానాల పునర్విభజన ఇప్పట్లో ఉండదు కాబట్టి చర్ల, వాజేడు, వెంకటాపురం మండలాలతో పాటు భద్రాచలం పట్టణం కలిపి భద్రాచలం అసెంబ్లీ నియోజకవర్గంగా ఉంటుంది. అదే పునర్విభజన సమస్య ప్రకారం ఇప్పుడు ముంపు పేరుతో సీమాంధ్రలోనికి వెళుతున్న ఏడు మండలాలను ఆ ప్రాంతంలోని ఏ అసెంబ్లీ, పార్లమెంటు నియోజకవర్గంలో కూడా కలిపే వీలులేదు. మరి అలాంటప్పుడు ఆ మండలాల పరిస్థితి ఏంటన్నది ప్రశ్నార్థకం కానుంది. అయితే, అధికారికంగా నియోజకవర్గాల పునర్విభజన జరగకపోయినా ప్రస్తుత ఆర్డినెన్స్‌కు పార్లమెంటులో చట్టం చేసే సమయంలో సవరణలు చేసి ఈ మండలాలు ఆంధ్రలోని ఏ నియోజకవర్గంలోనికి వెళ్లాలో నిర్ణయించవచ్చని అధికారులంటున్నారు. అయితే, అదే సమయంలో ఆర్డినెన్స్‌కు మార్పులు చేయాల్సి వస్తే భద్రాచలం పట్టణం నుంచి తెలంగాణలోనే ఉండే దుమ్ముగూడెం, చర్ల, వాజేడు మండలాలకు వెళ్లే మార్గంలో ఉన్న మూడు రెవెన్యూ గ్రామాలు సీమాంధ్రలోకి వెళుతున్నాయి. అలాంటప్పుడు భద్రాచలం నుంచి ఆ మూడు మండలాలకు రహదారి సౌకర్యం లేకుండా పోతుంది. అలాంటి పరిస్థితుల్లో ఆ మూడు గ్రామాలను తెలంగాణలోనే ఉంచుతూ ఆర్డినెన్స్‌లో మార్పులు జరుగుతాయనే ప్రచారం జరుగుతోంది. -
పోలవరం ఆర్డినెన్సును తిప్పి పంపండి..!
సాక్షి, ముంబై: పోలవరం ఆర్డినెన్సును తిప్పి పంపాలని ముంబై తెలంగాణ సంఘీభావ వేదిక డిమాండ్ చేసింది.సీమాంద్ర రాజకీయ నాయకుల ఒత్తిడికి తలొగ్గి... మోడీ, వెంకయ్యనాయుడు, చంద్రబాబుల కుట్రల ఫలితంగా పోలవరంపై ఆర్డినెన్సును రూపొందించారని ఆరోపించింది. వివిధ తెలంగాణ సంఘాల మద్దతుతో తూర్పు దాదర్‌లోని అంబేద్కర్ భవనం ఎదురుగాగల శ్రామిక హాలులో మధ్యాహ్నం 2.00 గంటలకు వేదిక ఆధ్వర్యంలో ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. ఆర్డినెన్సును తిప్పి పంపాలంటూ ప్లకార్డులు ప్రదర్శించారు. అనంతరం హాలులో సభ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ముంబై రిలయన్స్ ఎనర్జీ కార్మిక సమాఖ్య నాయకుడు పొట్ట వెంకటేశ్, మహారాష్ట్ర తెలంగాణ మంచ్ అధ్యక్షుడు గుడుగుంట్ల వెంకటేశ్, వేదిక నాయకులు అక్కనపెల్లి దుర్గేశ్, మల్లేశ్, శ్రమజీవి సంఘం నాయకులు బాబుశంకర్, ఎడ్ల సత్తయ్య, అఖిల భారత తెలంగాణ రచయితల వేదిక ప్రధాన కార్యదర్శి మచ్చ ప్రభాకర్ హాజరై ప్రసంగించారు. ఖమ్మం జిల్లాలోని(భద్రాచలం) 7 మండలాలను సీమాంధ్రలో కలపడాన్ని తెలంగాణ వ్యతిరేక చర్యగా పొట్ట వెంకటేశ్ అభివర్ణించారు. ఆదివాసులకు జరుగుతున్న అన్యాయాన్ని అడ్డుకోకపోతే భవిష్యత్తులో మన జలవనరులు, అటవీ సంపదలే కాకుండా ఆదివాసుల జీవితాలు కూడా నాశనమయ్యే ప్రమాదం ఉందని దుర్గేశ్ పేర్కొన్నారు. వెంకటేశ్ జి. మాట్లాడుతూ.. రాబోయే తెలంగాణకు సీమాంధ్రుల కుట్రలు ఎంత ప్రమాదకరమో మొదటి ఆర్డినెన్సు ద్వారా రుచి చూపింరని, దీనిని వ్యతిరేకించాలని కోరారు. రచయిత మచ్చ ప్రభాకర్ మాట్లాడుతూ.. మోడీ, వెంకయ్య, చంద్రబాబుల కుట్రల ఫలితంగానే పోలవరం ఆర్డినెన్సును కేంద్రం రాష్ట్రపతికి పంపించే ధైర్యం చేసిందని, దీనితో వారి తెలంగాణ వ్యతిరేక స్వభావాలు బయట పడ్డాయని, ఇక రాబోయే తెలంగాణ పునర్నిర్మాణంలో ఉద్యోగులు, మేధావులు, కవులు, ప్రజలు మరింత చైతన్యవంతమై ఎదుర్కొంటే తప్ప తెలంగాణ రాష్ట్రం అభివృద్ధికి నోచుకోదన్నారు. ఇదిలాఉండగా జూన్ 2న తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవాన్ని ముంబైలోని తెలంగాణ ప్రజా, కులసంఘాలు ఘనంగా జరుపుకోవాలని వేదిక నాయకులు బాబూ శంకర్, పొట్ట వెంకటేశ్, ఎడ్ల సత్తయ్య, శ్రీను, మల్లేశ్ తదితరులు కోరారు. -
'ఆర్డినెన్స్‌పై అనవసర రాద్దాంతం వద్దు'
న్యూఢిల్లీ : పోలవరం ఆర్డినెన్స్‌పై అనవసర రాద్దాంతం వద్దని కేంద్రమంత్రి వెంకయ్య నాయుడు హితవు పలికారు. యూపీఏ నిర్ణయాన్నే తాము అమలు చేశామని ఆయన గురువారమిక్కడ తెలిపారు. రెచ్చగొట్టే వ్యాఖ్యలు చేయటం మంచిదికాదని, తెలంగాణ బిల్లు ఆమోదం పొందినప్పుడే ఆర్డినెన్స్ రూపొందిందన్నారు. తమకు రెండు ప్రాంతాలు సమానమేనని వెంకయ్యనాయుడు తెలిపారు. పోలవరం ముంపు మండలాలను సీమాంధ్రలో కలిపేందుకు మెజార్టీ పార్టీలు ఒప్పుకున్నాయని వెంకయ్య ఈ సందర్భంగా గుర్తు చేశారు. బిల్లు పాస్ అయినప్పుడు టీఆర్ఎస్ లాంటి పార్టీలు సంబరాలు చేసుకున్నాయని, ఇప్పుడు విమర్శించటంలో అర్థమేమిటని ఆయన ప్రశ్నించారు. ఈ విషయంలో వివాదానికి ఆస్కారం లేదని వెంకయ్య తెలిపారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదాపై శ్రద్ధ తీసుకుంటానని ఆయన చెప్పారు. తెలంగాణ అభివృద్ధి కోసం ప్రభుత్వం పనిచేస్తుందన్నారు. రాష్ట్ర విభజన చట్టంలో ఉన్న ప్రతీ అంశాన్ని అమలు చేస్తామని వెంకయ్య తెలిపారు. -
'సీమాంధ్రకు తరలించటం చట్టవిరుద్ధం'
జగిత్యాల : పోలవరం ముంపు గ్రామాలను సీమాంధ్రకు తరలించడం చట్టవిరుద్ధమని జగిత్యాల కాంగ్రెస్ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి అన్నారు. ఆయన గురువారమిక్కడ మాట్లాడుతూ అసెంబ్లీ అభిప్రాయాన్ని పరిగణనలోకి తీసుకోకుండా రాష్ట్రాల సరిహద్దులు ఎలా మారుస్తారని ప్రశ్నించారు. అపాయింటెడ్ డే తరువాత కేంద్ర ఆర్డినెన్స్‌ను వ్యతిరేకిస్తూ తెలంగాణ అసెంబ్లీ ఏకగ్రీవంగా తీర్మానం చేయాలన్నారు. కాగా పోలవరం ప్రాజెక్టు విషయంలో ఏడు ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌లో కలుపుతూ కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ జారీ చేసిన విషయం తెలిసిందే. -
ఆశల మోసులు
సాక్షి, ఏలూరు : రాష్ట్ర విభజన నేపథ్యంలో పశ్చిమగోదావరి జిల్లాకు మహర్దశ పట్టనుందనే ఆశలు రేకెత్తుతున్నాయి. కనీస సౌకర్యాలు కరువై.. అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న మన జిల్లాలో కనీవినీ ఎరుగని మార్పు చోటుచేసుకోనుంది. గుంటూరు-విజయవాడ నగ రాల మధ్య కొత్త రాజధాని ఏర్పాట వుతుందనే వార్తల నేపథ్యంలో పెట్టుబడిదారులు మన జిల్లావైపు చూస్తున్నారు. అప్పుడే చిన్నాచితక సాఫ్ట్వేర్ కంపెనీలు వెలుస్తున్నాయి. రహదారుల విస్తరణ, మౌలిక సదుపాయాలు అభివృద్ధి చెందుతాయనే ఆశతో ఇతర జిల్లాల్లో స్థిరపడిన వారు స్వస్థలాలకు వచ్చేందుకు సిద్ధమవుతున్నారు. ఆస్తులు అమ్ముకుని ఎన్నో ఏళ్ల క్రితం వెళ్లిపోయిన వారు సొంత గ్రామా లకు తిరిగొచ్చి భూములు, ఇళ్లు కొనే ఆలోచనతో ఉన్నారు. భూముల ధరలకు రెక్కలు నిన్నమొన్నటి వరకూ తిరోగమనంలో ఉన్న రియల్ ఎస్టేట్ రంగం కొత్త రాజధాని పేరు చెప్పుకుని పురోగమనం బాట పట్టింది. జిల్లాలో సాగునీరు అందక అరకొర దిగుబడిని ఇచ్చే పంట చేలు సైతం రహదారుల పక్కన ఉన్నకారణంగా కోట్లాది రూపాయలు పలుకుతున్నాయి. కొత్త రాజధానికి కనీసం 80 కిలోమీటర్ల వరకూ అభివృద్ధి చెం దుతుందనే ఊహాగానాలతో అంతే దూరంలో ఉన్న పశ్చిమగోదావరి జిల్లాపై ఇప్పుడు అందరి దృష్టి పడుతోంది. ఏలూరు నగర శివారులో గజం స్థలం రూ.7వేల నుంచి రూ.15వేలకు పెరిగింది. గ్రామీణ ప్రాంతాల్లో నాన్ లే-అవుట్ స్థలాలు గజం రూ.4వేలు, లే-అవుట్ స్థలాలు గజం రూ.5వేలు పైబడి ఉన్నాయి. వ్యవసాయ భూముల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. గరిష్టంగా ఎకరం రూ.20 లక్షలు వరకూ ఉంది. పొలంలోకి రహదారి, సాగునీటి సౌకర్యం ఉంటే ఆ ధర మరింత భారీగా ఉం టోంది. లే-అవుట్, వాణిజ్య అవసరాలకు ఉపయోగపడే భూములైతే ఎకరా నికి రూ.కోటి పైగా చెల్లించాల్సిందే. అభివృద్ధిపై కోటి ఆశలు రాజధాని సమీపంలో ఉంటే పశ్చిమ గోదావరి అభివృద్ధిలో దూసుకుపోతుందని స్థానికులు ఆశపడుతున్నారు. విజయవాడ-గుండుగొలను మధ్య నాలుగు లేన్ల జాతీయ రహదారిని ఆరు లేన్లకు విస్తరించేందుకు ఇప్పటికే టెండర్లు ఖరారయ్యాయి. మరికొన్ని రహదారుల విస్తరణతో పాటు ఎనిమిది లేన్ల రోడ్లు ఏర్పాటవుతాయని భావిస్తున్నారు. తాడేపల్లిగూడెంలో విమానాశ్రయాన్ని పునరుద్ధరి స్తారనే ఆశలు చిగురిస్తున్నాయి. రైల్వే లో సైతం పెనుమార్పులు వచ్చే అవకాశాలు లేకపోలేదు. కొత్త రైళ్లు వేయటంతోపాటు, ఫాస్ట్ ట్రైన్స్ రానున్నాయి. జిల్లాలో ఏకైక నగరమైన ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోకి వెళితే మౌలిక సదుపాయా ల కల్పనకు అవకాశం ఏర్పడుతుందని నగరవాసులు ఎదురుచూస్తున్నారు. ఆసక్తి చూపుతున్న పారిశ్రామిక వేత్తలు ఇప్పటివరకూ హైదరాబాద్ వంటి నగరాలకే పరిమితమైన పరిశ్రమలు, సాఫ్ట్వేర్ సంస్థలు పశ్చిమగోదావరి జిల్లావైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఏలూరు నగరంలో చిన్నాచితకా కంపెనీలు కార్యకలాపాలను ప్రారంభించాయి. కృష్ణా, గోదావరి జలాలు, రెండు జాతీ య రహదారులు, కావాల్సినన్ని అట వీ, వ్యవసాయ భూములతోపాటు సముద్రం, రైల్వే, విమాన సదుపాయాలు అందుబాటులో ఉండటంతో పరిశ్రమల ఏర్పాటుకు కంపెనీలు ఆసక్తి కనబరుస్తున్నాయి. పారిశ్రామిక వర్గాలు భూముల కొనుగోలుపై దృష్టి సారించాయి. -
చేవెళ్ల-ప్రాణహిత కోసం పోరాటం
చేవెళ్ల, న్యూస్‌లైన్: చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి రాజీలేని పోరాటం చేస్తామని తెలుగుదేశం పార్టీ అధినేత చంద్రబాబునాయుడు పేర్కొన్నారు. మొయినాబాద్ మండల పరిధిలోని హిమాయత్‌నగర్ గ్రామశివారులో గల గండిపేట తెలుగువిజయంలో రెండు రోజులపాటు నిర్వహించిన మహానాడులో బుధవారం రాత్రి ముగింపు సమావేశంలో ఆయన ప్రసంగించారు. కేంద్ర ప్రభుత్వంతో మాట్లాడి చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టు సాధనకు కృషిచేస్తానని పేర్కొన్నారు. అధికార పగ్గాలు చేపట్టబోతున్న సీమాంధ్రతోపాటుగా అధికారంలోలేని తెలంగాణను కూడా అన్ని విధాలా అభివృద్ధి చేయడానికి ప్రయత్నిస్తానని చెప్పారు. గతంలో 9 సంవత్సరాలు అధికారంలో ఉన్నప్పుడు హైదరాబాద్ నగరంతోపాటుగా రంగారెడ్డి జిల్లాను కూడా తామే అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. పోలవరంతో పాటుగా చేవెళ్ల-ప్రాణహిత ప్రాజెక్టును సాధించడానికి పోరాటం చేస్తానని చెప్పారు. తెలుగు ప్రజలందరినీ కలుపుకొని అన్ని ప్రాంతాల అభివృద్ధే ధ్యేయంగా పనిచేస్తానని వివరించారు. అదే విధంగా శంషాబాద్ విమానాశ్రయంలోని డొమెస్టిక్ టెర్మినల్‌కు ఎన్టీ రామారావు పేరు పెట్టడానికి కృషిచేస్తానని, సాధించి తీరుతాననే నమ్మకం ఉందని పేర్కొన్నారు. తెలుగు ప్రజలందరూ బాగుండాలని తాను ఎల్లప్పుడూ కోరుకుంటున్నానని చంద్రబాబు చెప్పారు. -
200 యూనిట్లు దాటితే బిల్లు బాంబే
ఇళ్లకు భారీ షాక్.. విద్యుత్ చార్జీల వడ్డనకు ఈఆర్సీ ప్రతిపాదనలు * 50 యూనిట్లలోపు వారికి 50 పైసల భారం * వాణిజ్య సంస్థలకు 29 పైసల పెంపు * కొత్త ప్రభుత్వాల అనుమతికై ఎదురుచూపులు * తెలంగాణలో రూ.2,500 కోట్లు, సీమాంధ్రలో రూ.3,500 కోట్ల బాదుడు సాక్షి, హైదరాబాద్: కొత్త విద్యుత్ చార్జీల వడ్డనకు రంగం సిద్ధమయ్యింది. ఇరు ప్రాంతాల ప్రజలపై మొత్తం రూ.6 వేల కోట్ల భారాన్ని మోపేందుకు ప్రతిపాదనలు రూపుదిద్దుకున్నాయి. తెలంగాణ ప్రజలపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్ర ప్రజలకు రూ.3,500 కోట్ల షాక్ తగలనుంది. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ప్రతిపాదనలను ఇరు రాష్ట్రాల ప్రభుత్వాల ముందుంచనున్నారు. అధికారం చేపట్టిన వెంటనే రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఈ చార్జీలపై నిర్ణయం తీసుకోనున్నారుు. ప్రభుత్వాలు అనుమతించిన వెంటనే కొత్త విద్యుత్ చార్జీలపై ఈఆర్సీ ఆదేశాలు వెలువడతాయి. జూన్ నెల నుంచే ఈ చార్జీలను వసూలు చేసే అవకాశం ఉంది. ఈఆర్సీ ప్రతిపాదనలను పరిశీలిస్తే.. తాజా పెంపు గృహ వినియోగదారులపై పెను భారం మోపనుంది. 50 యూనిట్లలోపు వినియోగించే పేద వినియోగదారులకూ షాక్ కొట్టనుంది. ఇక నెలకు 200 యూనిట్లు దాటితే బిల్లు బాంబులా పేలిపోనుంది. 200 యూనిట్లు దాటి వినియోగిస్తే... మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ 5.56 చొప్పున చెల్లించాల్సి రానుంది. ఇక వాణిజ్య సంస్థలకు సంబంధించి యూనిట్‌కు 29 పైసల చొప్పున పెంపుదల ఉండనుండగా... పరిశ్రమలకు 29 పైసల నుంచి రూ.2.41 వరకూ చార్జీలు పెరగనున్నాయి. వాస్తవానికి గత ఏప్రిల్ 1 నుంచే కొత్త విద్యుత్ చార్జీలు అమల్లోకి రావాల్సి ఉంది. అయితే ఎన్నికల కోడ్, ఆ తర్వాత రాష్ట్ర విభజన వల్ల గవర్నర్ నిర్ణయం తీసుకోలేదు. తాజాగా రెండు రాష్ర్ట ప్రభుత్వాలకు ఈ మేరకు విడివిడిగా ఈఆర్సీ ప్రతిపాదనలు పంపనుంది. సీమాంధ్రపైనే అధిక భారం! విభజన నేపథ్యంలో ఇరు ప్రాంతాల వారీగా పడనున్న విద్యుత్ చార్జీల భారం లెక్క తేలిం ది. తెలంగాణలోని వినియోగదారులపై రూ.2,500 కోట్ల భారం పడనుండగా, సీమాంధ్రలోని వినియోగదారులపై రూ.3,500 కోట్ల భారం పడనుంది. సీమాంధ్రలో గృహ కనెక్షన్లు ఎక్కువగా ఉండటమే ఇందుకు కారణమని ఇంధనశాఖ వర్గాలు అంటున్నాయి. తెలంగాణ ప్రాంతంలో సీపీడీసీఎల్, ఎన్పీడీసీఎల్లు సేవలు అందిస్తున్నాయి. సీమాంధ్రలో ఈపీడీసీఎల్, ఎస్పీడీసీఎల్లు విద్యుత్ పంపిణీ చేపడుతున్నాయి. అయితే సీమాంధ్రలోని కర్నూలు, అనంతపురం జిల్లాలకూ సీపీడీసీఎల్ విస్తరించి ఉంది. ఈ రెండు జిల్లాల పరిధిని ఎస్‌పీడీసీఎల్‌లోకి చేర్చారు. దీంతో ఈ రెండు జిల్లాల్లోని ఉచిత విద్యుత్, ఇతర వర్గాల సబ్సిడీ భారాన్ని సీమాంధ్ర ప్రభుత్వమే చెల్లించాల్సి ఉంటుం దని లెక్కకట్టారు. ఉచిత విద్యుత్‌తో పాటు వివిధ వర్గాలకు ఇస్తున్న సబ్సిడీ కింద తెలంగాణ ప్రభుత్వం రూ.2,800 కోట్లు చెల్లించాల్సి రానుంది. కర్నూలు, అనంతపురం జిల్లాలను కూడా కలుపుకుని సీమాంధ్ర ప్రభుత్వం సబ్సిడీ కింద రూ.3,200 కోట్లు చెల్లించాల్సి ఉంటుందని లెక్కకట్టారు. క్రాస్ సబ్సిడీతో తెలంగాణకు తగ్గిన భారం! వాస్తవానికి ఉచిత వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు తెలంగాణలోనే అధికం. మొత్తం 30 లక్షల వ్యవసాయ కనెక్షన్లలో తెలంగాణలోనే 18 లక్షల కనెక్షన్లు ఉన్నాయి. అయినప్పటికీ సబ్సిడీ భారం తక్కువగా ఉంది. పరిశ్రమలు క్రాస్ సబ్సిడీ కింద చెల్లిస్తున్న మొత్తం అధికంగా ఉండటమే ఇందుకు కారణం. అదేవిధంగా ఇక్కడ వాణిజ్య వినియోగదారులు అధికంగా ఉన్నారు. వీరు కూడా క్రాస్ సబ్సిడీ కింద మిగిలిన వర్గాల చార్జీల భారాన్ని భరిస్తున్నారు. తెలంగాణలో పరిశ్రమలు, వాణిజ్య సంస్థల కనెక్షన్లు ఎక్కువగా ఉండటంతో క్రాస్ సబ్సిడీ ఆదాయం ఎక్కువగా ఉండి ప్రభుత్వం చెల్లించాల్సిన సబ్సిడీ భారం తగ్గిందన్నమాట. 200 దాటితే ఇల్లు గుల్లే: కొత్త చార్జీల నేపథ్యంలో నెలకు 200 యూనిట్లు దాటి విద్యుత్‌ను వినియోగిస్తే బిల్లు పెద్ద షాకివ్వడం ఖాయం. ఎందుకంటే 200 యూనిట్లు దాటి ఒక్క యూనిట్ ఎక్కువగా వాడినా మొదటి 200 యూనిట్ల వరకు యూనిట్‌కు 5.56 చొప్పున వసూలు చేయనున్నారు. ఉదాహరణకు ఒక వినియోగదారుడు నెలకు 200 యూనిట్లు వినియోగిస్తే... పెరగనున్న చార్జీల మేరకు (మొదటి 50 యూని ట్లకు యూనిట్‌కు రూ.3.10 చొప్పున, 51-100 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.3.75 చొప్పున, 101-150 వరకు యూనిట్‌కు రూ.5.38 చొప్పున, 151-200 యూనిట్ల వరకు యూనిట్‌కు రూ.5.94 చొప్పున) మొత్తం రూ.908.50 చెల్లించాల్సి ఉంటుంది. 201 యూనిట్లు వినియోగిస్తే మాత్రం ఏకంగా (మొదటి 200 యూనిట్లకు యూనిట్‌కు రూ.5.56 చొప్పున రూ.1112తో పాటు ఒక యూనిట్‌కు రూ. 6.69 మేరకు మొత్తం రూ.1118.69 చెల్లించాల్సి ఉంటుంది. అంటే ఒక యూనిట్ అదనంగా వాడినందుకు ఏకంగా రూ. 210.19 అదనంగా చెల్లించాల్సి రానుంది. మొత్తం బిల్లుకు సర్వీసు, ఇతర చార్జీలు అదనం. -
స్థానికత ఆధారంగానే.. ఉద్యోగుల తాత్కాలిక విభజన
సచివాలయ ఉద్యోగ సంఘాల నేతలతో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ * పోస్టులను బట్టి జూనియర్లను అటు, ఇటు కేటాయించినట్టు వెల్లడి *శాశ్వత విభజన సమయంలో *అభ్యంతరాలను పరిష్కరిస్తామని హామీ సాక్షి, హైదరాబాద్: స్థానికత ఆధారంగానే సచివాలయ ఉద్యోగులు, పోస్టుల తాత్కాలిక విభజన జరుగుతుందని ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేష్ ఉద్యోగ సంఘాల నేతలకు స్పష్టం చేశారు. సచివాలయ ఉద్యోగుల విభజనపై వివాదాలు నెలకొన్న నేపథ్యంలో తెలంగాణ, సీమాంధ్ర ఉద్యోగ సంఘాల నేతలతో ఆయన ఆదివారమిక్కడ సమావేశమయ్యారు. స్థానికత ఆధారంగా తాత్కాలిక విభజన చేశామని ఉద్యోగ సంఘాల నేతలకు తెలిపారు. అయితే కొన్ని పోస్టు ల్లో ఖాళీలను బట్టి జూనియర్లను అటు, ఇటు కేటాయించామని.. ఈ మేరకు కొంతమంది సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణకు, తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు తాత్కాలికంగా పంపిణీ చేశామని వివరించారు. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్ కేడర్‌లో కొంత మంది తెలంగాణ ఉద్యోగులను సీమాంధ్రకు కేటాయించినట్లు చెప్పారు. అలాగే డిప్యూటీ, అడిషనల్ సెక్రటరీ కేడర్‌లో కొంతమంది సీమాంధ్ర అధికారులను తెలంగాణకు కేటాయించామని పేర్కొన్నారు. ఉద్యోగుల సహకరిస్తే మూడు నెలల్లోపే శాశ్వత కేటాయింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్రాల ఆవిర్భావ దినం సమీపిస్తున్న తరుణంలో తాత్కాలిక కేటాయింపులు వెంటనే పూర్తి చేయాలని, ఈ మేరకు రూపొందించిన ఉద్యోగుల కేటాయింపుల జాబితాను కేంద్రానికి పంపించి ఆమోదం తీసుకోవాల్సిన అవసరం ఉందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రూపొందించిన జాబితాకు అంగీకరిస్తే సోమవారం కేంద్రానికి పంపిస్తానని రమేష్ ఉద్యోగ సంఘాలకు చెప్పారు. ఏ ప్రాంతం ఉద్యోగులను ఆ ప్రాంతానికే కేటాయించాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల నేతలు చేసిన విజ్ఞప్తికి ఆయన సానుకూలంగా స్పందించలేదు. కేంద్రం ఇచ్చిన మార్గదర్శకాల ప్రకారమే కేటాయింపులు చేసినట్టు స్పష్టంచేశారు. అయితే వారి అభ్యంతరాలను కేంద్రం దృష్టికి తీసుకెళతానని చెప్పారు. ఈ తాత్కాలిక కేటాయింపుల గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, మూడు నెలల్లో అందరికీ ఆమోదయోగ్యమైన రీతిలో శాశ్వత కేటాయింపులు పూర్తి చేస్తామని హామీ ఇచ్చారు. దీంతో తాత్కాలిక కేటాయింపుల జాబితా పట్ల ఇరు ప్రాంతాల నేతలు సానుకూలంగా స్పందించారు. ప్రభుత్వానికి అన్ని విధాలుగా సహకరిస్తామని హామీ ఇచ్చారు. కాగా, సచివాలయ ఉద్యోగుల సీనియారిటీని నిర్ధారించడం ప్రభుత్వానికి కష్టతరంగా ఉందని, ఉద్యోగ సంఘాల నేతలే కూర్చుని సీనియారిటీ జాబితా రూపొందించాలని పీవీ రమేష్ సూచించారు. అయితే, ఈ అంశం ప్రస్తుతం కోర్టు పరిధిలో ఉందని ఉద్యోగ సంఘాల నేతలు ఆయనకు వివరించారు. -
మెదక్ ఎంపీగా కిషన్‌రెడ్డి పోటీ?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రిగా జూన్ 2న కేసీఆర్ ప్రమాణ స్వీకారం చేయాలని నిర్ణయించుకోవడంతో మెదక్ లోక్‌సభ స్థానానికి ఆయన రాజీనామా చేస్తున్నారు. ఈసీ నిబంధనల ప్రకారం రెండు స్థానాల్లో పోటీ చేసి గెలిచిన అభ్యర్థి ఎన్నికైన 18 రోజుల లోపు ఏదో ఒక స్థానానికి విధిగా రాజీనామా చేయాలి. ఆ గడువు కంటే ముందుగానే కేసీఆర్ తన ఎంపీ పదవికి రాజీనామా చేస్తున్నారు. దీంతో మెదక్ పార్లమెంట్ స్థానానికి వచ్చే 6 నెలల్లో ఉప ఎన్నికలు జరగనున్నాయి. ఇక్కడి నుంచి బీజేపీ అభ్యర్థిగా కిషన్‌రెడ్డిని బరిలోకి దించాలని ఆ పార్టీ కేంద్ర నాయకత్వం భావిస్తోంది. టీఆర్ఎస్ ఎవరిని బరిలోకి దించినా కిషన్‌రెడ్డి అయితేనే దీటుగా పోటీనివ్వగలమని బీజేపీ యోచన. కిషన్‌రెడ్డి కూడా పార్లమెంట్‌కు వెళితేనే మేలనే ఉద్దేశంతో ఇటీవలి సార్వత్రిక ఎన్నికల్లో సికింద్రాబాద్ స్థానాన్ని ఆశించినా బీజేపీ అధిష్టానం దత్తాత్రేయ వైపు మొగ్గుచూపిన విషయం తెలిసిందే. -
సీమాంధ్ర తొలి సీఎస్‌గా ఐవైఆర్
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రం విడిపోయాక ఆంధ్రప్రదేశ్ తొలి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా సీనియర్ ఐఏఎస్ అధికారి ఐ.వై.ఆర్. కృష్ణారావు నియమితులు కానున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా త్వరలో ప్రమాణ స్వీకారం చేయనున్న చంద్రబాబు నాయుడు సీఎస్ ఎంపికపై కసరత్తును పూర్తి చేశారు. ఐవైఆర్ కృష్ణారావును సీఎస్‌గా నియమించాల్సిందిగా శనివారం గవర్నర్ ఈఎస్ఎల్ నరసింహన్‌ను కలిసి కోరారు. ఈ మేరకు ఆయన ఐవైఆర్ కృష్ణారావును వెంటతీసుకుని రాజ్‌భవన్‌కు వెళ్లి గవర్నర్‌తో భేటీ అయ్యారు. ఉమ్మడి రాష్ట్రంలో ప్రస్తుతం సీఎస్‌గా పనిచేస్తున్న మహంతి జూన్1వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఆయన తరువాత 1979 బ్యాచ్‌కు చెందిన వారిలో ఐ.వి.సుబ్బారావు సీనియర్‌గా ఉన్నారు. ఆయన ప్రస్తుతం యునెస్కోలో పనిచేస్తున్నారు. సీఎస్ పదవి ఇస్తానంటే యునెస్కోలో బాధ్యతలను వదిలి రాష్ట్రానికి వచ్చేందుకు సుముఖత వ్యక్తం చేశారు. అయినా ఎందుకో చంద్రబాబు ప్రస్తుతం సీసీఎల్ఏ బాధ్యతలు నిర్వహిస్తున్న ఐవైఆర్ కృష్ణారావువైపు మొగ్గారు. గతంలో ఆర్థిక, పంచాయతీరాజ్ బాధ్యతలు గతంలో చంద్రబాబు ప్రభుత్వంలో ఐవైఆర్ ఆర్థిక శాఖ, పంచాయతీరాజ్ శాఖల బాధ్యతలు నిర్వహించారు. జూన్ 2వ తేదీ నుంచి ఆంధ్రప్రదేశ్ సీఎస్‌గా ఐవైఆర్ బాధ్యతలు స్వీకరిస్తే 2016 జనవరి వరకు పదవిలో కొనసాగుతారు. రాష్ట్ర సర్వీసులో ఉన్న తననుకాదని కేంద్ర సర్వీసులో ఉన్న మహంతిని తీసుకువచ్చి ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి పదవి అప్పగించడం పట్ల ఐవైఆర్ కృష్ణారావు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. పేషీ అధికారులూ ఖరారు: చంద్రబాబు తన పేషీలో అధికారుల నియామకాలను కూడా ఖరారు చేశారు. తన పేషీలో నియమించుకునే అధికారుల వివరాలను గవర్నర్ నరసింహన్‌కు తెలియజేశారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో ఐఏఎస్ అధికారుల్లో ఎవరు తెలంగాణకు, ఎవరు ఆంధ్రప్రదేశ్‌కు పంపిణీ అవుతారో తేలాల్సి ఉంది. 1984 బ్యాచ్‌కు చెందిన సీనియర్ ఐఏఎస్ అధికారి అజయ్ ప్రకాశ్ సహానీని సీఎం పేషీ ముఖ్యకార్యదర్శిగా, 1988 బ్యాచ్‌కు చెందిన ఐఏఎస్ అధికారి ఎ. గిరిధర్‌ను, 1991 బ్యాచ్‌కు చెందిన జి.సాయిప్రసాద్‌ను సీఎం పేషీ కార్యదర్శులుగా నియమించుకోవాలని బాబు నిర్ణయం తీసుకున్నారు. ప్రస్తుతం వ్యవసాయ శాఖ కమిషనర్‌గా పనిచేస్తున్న కె. మధుసూదన్‌రావును సీఎం పేషీలో అదనపు కార్యదర్శిగా నియమించుకోవాలని అనుకుంటున్నారు. వీరి పేర్లను చంద్రబాబు రాష్ట్ర గవర్నర్ దృష్టికి తీసుకువెళ్లినట్లు అధికార వర్గాల సమాచారం. ఈ నెల 31వ తేదీ గానీ లేదా జూన్ 1వ తేదీ గానీ వీరి నియామకానికి సంబంధించిన ఉత్తర్వులు జారీ అయ్యే అవకాశం ఉంది. ప్రస్తుతం చంద్రబాబు దగ్గర పనిచేస్తున్న రిటైర్డ్ ఐఏఎస్ అధికారి కృష్ణయ్యను సీఎం పేషీలో ఓఎస్డీగా నియమించుకోవాలని కూడా నిర్ణయించినట్లు సమాచారం. -
తెలంగాణలో ‘కిక్కు’ తక్కువే!
ఐఎంఎల్ విక్రయాలు సీమాంధ్రలోనే అధికం సీమాంధ్రలో రూ.10,972 కోట్ల మద్యం విక్రయాలు గ్రేటర్‌ను మినహాయిస్తే తెలంగాణ జిల్లాల్లో రూ.5 వేల కోట్ల అమ్మకాలే బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్ ఏకంగా 2.75 కోట్ల కేసుల బీర్లు అమ్మకాలు 2013-14 ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలివీ సాక్షి, హైదరాబాద్: సీమాంధ్రలో మద్యం విక్రయాలు పెరుగుతున్నాయి. ఉమ్మడి రాష్ట్రంలో జిల్లాలవారీగా జరిగిన మద్యం విక్రయూలపై ఏపీబీసీఎల్ తేల్చిన లెక్కలు ఈ విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. ఈ లెక్కన సీమాంధ్ర, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఎక్సైజ్, మద్యం విక్రయూలపై లభించే వ్యాట్ ఆదాయూల్లో పెద్దగా తేడా ఉండకపోవచ్చునని తేలుతోంది. ఈ మద్యం విక్రయాల్లోనూ కొన్ని ఆసక్తికరమైన విశేషాలు కనిపిస్తున్నాయి. ఐఎంఎల్ (ఇండియున్ మేడ్ లిక్కర్) విక్రయూలు సీవూంధ్రలో అధికంగా ఉండగా... బీర్ల అమ్మకాల్లో మాత్రం తెలంగాణ టాప్‌లో ఉంది. ప్రత్యేకించి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో బీర్ల అమ్మకాలు గణనీయుంగా పెరుగుతున్నాయి. గత ఆర్థిక సంవత్సరంలో ఏకంగా కోటి కేసుల బీరును లాగించేశారు! భారత తయారీ మద్యం (ఐఎంఎల్) మూడు రకాలుగా తయారవుతుంది. బాందీ, విస్కీ మొదలైన ఈ బ్రాండ్లలో ఆర్డినరీ, మీడియం, ప్రీమియం విభాగాలుగా తయారవుతుంది. మూడు రకాల లిక్కర్ అమ్మకాల్లోనూ తెలంగాణ కన్నా సీమాంధ్ర ముం దుంది. తెలంగాణలో రంగారెడ్డి జిల్లాలో అత్యధికంగా 47.11 లక్షల మద్యం కేసులు అమ్ముడైతే, రెండు, మూడు స్థానాల్లో హైదరాబాద్, కరీంనగర్ నిలిచాయి. సీమాంధ్రలో తూర్పు గోదావరి జిల్లాలో అత్యధికంగా 29.84 లక్షల ఐఎంఎల్ పెట్టెలు అమ్ముడయ్యాయి. మరో ఏడు జిల్లాల్లో 25 లక్షల నుంచి 29 లక్షల చొప్పున మద్యం పెట్టెలు విక్రయించడం గమనార్హం. మొత్తంగా తీసుకుంటే రెండు ప్రాంతాల్లో కలిపి 4.74 కోట్ల ఐఎంఎల్ అమ్మకాలు ఉంటే, అందులో సీమాంధ్రలో 2.83 కోట్లు, తెలంగాణలోని 8 జిల్లాల్లో 1.23 కోట్లు, హైదరాబాద్, రంగారెడ్డిలో 76.64 లక్షల కేసులు అమ్ముడయ్యాయి. ఇక్కడ నిజామాబాద్ జిల్లాలో అత్యల్ప ఐఎంఎల్ విక్రయాలు సాగాయి. బీరులో తెలంగాణ జోరు.. వేసవిలోనే ఎక్కువగా సాగే బీర్ల అమ్మకాలు గ్రేటర్ సహా తెలంగాణ జిల్లాల్లో అత్యధికంగా అమ్ముడవుతున్నాయి. తెలంగాణలో 2.75 కోట్ల బీర్ల పెట్టెలు (ఒక్కో పెట్టెకు 12 చొప్పున) విక్రయించగా, సీమాంధ్రలో ఆ సంఖ్య 1.65 కోట్లకే పరిమితమైంది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే కోటికిపైగా పెట్టెల బీర్లు విక్రయించడం గమనార్హం. తెలంగాణలో రంగారెడ్డి, హైదరాబాద్ తర్వాత బీర్ల అమ్మకాల్లో కరీంనగర్ ముందుండగా, సీమాంధ్రలో వైజాగ్ 21.93 లక్షల పెట్టెల విక్రయాలతో ముందుంది. అత్యల్పంగా శ్రీకాకుళం జిల్లాలో 7 లక్షల బీర్ల పెట్టెలు మాత్రమే అమ్ముడయ్యాయి. మరికొన్ని ముఖ్యాంశాలు.. ఏడాదిలో రూ.వెయ్యి కోట్లకు పైగా అమ్మకాలు సాగిన జిల్లాలు తెలంగాణలో రంగారెడ్డి (రూ.2,403.12 కోట్లు), హైదరాబాద్(రూ.1,533.82 కోట్లు), కరీంనగర్(రూ.1,064.17 కోట్లు) ఉన్నాయి. సీమాంధ్రలో విశాఖపట్నం(రూ.1,194.66 కోట్లు), తూర్పు గోదావరి(రూ.1,114.62 కోట్లు), గుంటూరు(రూ.1,102.16కోట్లు), కృష్ణా(రూ.1,068.15 కోట్లు), చిత్తూరు(రూ.1,001.36 కోట్లు) ఉన్నాయి. రూ.474.98 కోట్లతో అత్యల్ప మద్యం విక్రయాలు సాగిన జిల్లాగా నిజామాబాద్ నిలిచింది. 2012- 13 ఆర్థిక సంవత్సరంలో కూడా ఇదే తరహాలో విక్రయాలు సాగాయి. ఆ సంవత్సరం సీమాంధ్రలో రూ.9,534.58 కోట్ల విక్రయాలు జరగ్గా.. తెలంగాణలో 8,575 .65 కోట్ల మేర అమ్మకాలు జరిగాయి. ఇందులో హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోనే రూ.3,500 కోట్ల విక్రయాలు జరిగాయి. అంటే నికరంగా తెలంగాణలో 2012-13లో జరిగిన మద్యం విక్రయాలు రూ.5 వేల కోట్ల పైచిలుకు మాత్రమే. -
రియల్ బూమ్.. ఢాం
హైదరాబాద్, రంగారెడ్డిలో భారీగా పడిన రియల్ ఎస్టేట్ భూముల క్రయువిక్రయూల్లో స్తబ్ధత గణనీయంగా తగ్గిపోయిన రిజిస్ట్రేషన్లు విభజన తర్వాత సగానికి సగం తగ్గిన రాబడి మెదక్ జిల్లాపైనా విభజన ప్రభావం కొంతకాలం గడిస్తేనే మళ్లీ పుంజుకుంటుందంటున్న రియల్టర్లు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర రాజధాని, శివారు ప్రాంతాల్లో రియల్ భూం ఢాం అంది! విభజన ఎఫెక్ట్‌తో హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం ఆకాశం నుంచి నేలకు దిగింది. భూముల క్రయవిక్రయాలు భారీగా తగ్గిపోయాయి. కేంద్ర ప్రభుత్వం పార్లమెంటులో విభజన ప్రకటన చేశాక రిజిస్ట్రేషన్లు సగానికి సగం పడిపోయాయి. ప్రత్యేకించి నగర శివార్లలో ఏర్పడిన వెంచర్లవైపు ఎవరూ కన్నెత్తి చూసే పరిస్థితి లేదు. తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం అనుసరించే విధానాలను బట్టి హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో ఆ రంగం భవిష్యత్తు ఆధారపడి ఉంటుందని రియల్టర్లు చెబుతున్నారు. రూ. 564 కోట్ల నుంచి రూ. 274 కోట్లకు.. అధికారిక లెక్కల ప్రకారం హైదరాబాద్ సహా రంగారెడ్డి జిల్లాలో 2013 మార్చి, ఏప్రిల్ నెలల్లో ప్రభుత్వానికి రిజిస్ట్రేషన్ల ద్వారా రూ. 564.17 కోట్ల రాబడి వచ్చింది. ఈ ఏడాది (2014) అదే నెలల్లో రిజిస్ట్రేషన్ల రాబడి రూ.274.47 కోట్లకు పడిపోయింది. ఈ ఏడాది ఫిబ్రవరిలో కేంద్రం పార్లమెంటులో తెలంగాణ బిల్లు ప్రవేశపెట్టి రాష్ట్రాన్ని విభజించాక ఏకంగా సగానికిపైగా రాబడి తగ్గిపోవడం గమనార్హం. రంగారెడ్డి జిల్లాను విడిగా చూస్తే గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.313.84 కోట్లు ఉండగా... ఈ ఏడాది మార్చిలో ఈ ఆదాయం ఏకంగా రూ.121.12 కోట్లకు పడిపోయింది. ఇక ఒక్క హైదరాబాద్‌ను చూస్తే గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ద్వారా 112.69 కోట్ల రాబడి రాగా... ఈ ఏడాది మార్చిలో అది ఏకంగా 46.73 కోట్లకు దిగజారింది. గతేడాది ఏప్రిల్‌లో రంగారెడ్డి జిల్లాలో రిజిస్ట్రేషన్ల ద్వారా ప్రభుత్వానికి రూ.103 కోట్లు రాగా.. ఈ ఏడాది అదే నెలలో రూ.68.07 కోట్లకు పడిపోయింది. విభజన ప్రక్రియ జరిగిన ఫిబ్రవరి నెలతో పోలిస్తే తర్వాతి నెలల్లోనూ భారీగా తేడా కనిపించింది. రంగారెడ్డి, హైదరాబాద్‌ల్లో రిజిస్ట్రేషన్ల రాబడి ఫిబ్రవరిలో రూ.277.35 కోట్లు ఉండగా... మార్చి నెలలో రూ. 167.85 కోట్లకు, ఏప్రిల్‌లో రూ.106 కోట్లకు పడిపోయింది. రంగారెడ్డి, హైదరాబాద్‌లకు ఆనుకొని ఉన్న మెదక్ జిల్లాపైనా విభజన ప్రభావం కనిపించింది. ఈ జిల్లాలో గతేడాది మార్చిలో రిజిస్ట్రేషన్ల ఆదాయం రూ.45.80 కోట్లు కాగా... ఈ ఏడాది మార్చిలో అది రూ.14.99 కోట్లకు అంటే మూడో వంతుకు పడిపోయింది. కొత్త ప్రభుత్వ విధానాలతోనే: రియల్ ఎస్టేట్ రంగం ఇంత తీవ్రంగా పడిపోవడం... రిజిస్ట్రేషన్ల ఆదాయం సగానికిపైగా తగ్గడంతో అధికారులు ఆందోళన చెందుతున్నారు. విభజన నేపథ్యంలో నెలకొన్న గందరగోళ పరిస్థితి వల్లే ఇక్కడ భూముల కొనుగోళ్లు పడిపోయాయని అంటున్నారు. ఈ పరిస్థితి మెరుగుపడాలంటే తెలంగాణలో ఏర్పడబోయే కొత్త ప్రభుత్వం తీసుకునే నిర్ణయాలే కీలకం అని రియల్టర్లు అంటున్నారు. ప్రభుత్వం పెట్టుబడుల పట్ల సానుకూలంగా వ్యవహరించి, పెట్టుబడులను ఆహ్వానించే తీరుపైనే రియల్ ఎస్టేట్ భవిష్యత్తు ఆధారపడి ఉంటుందంటున్నారు. హైదరాబాద్‌కు ఉన్న అవకాశాలు, మౌలిక సదుపాయాలు, వాతావరణ సమతుల్యత తదితర కారణాలతో రాబోయే ఏడాదిలోగా రియల్ రంగం యథాతథ స్థితికి వస్తుందన్న ధీమా వ్యక్తంచేశారు. హైదరాబాద్‌కు మించిన నగరం ఎక్కడుంది?: టి.శేఖర్‌రెడ్డి విభజన తర్వాత హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాలో రియల్ ఎస్టేట్ రంగం పడిపోయిందని తాను భావించడం లేదని కాన్ఫెడరేషన్ ఆఫ్ రియల్ ఎస్టేట్ డెవలపర్స్ అసోసియేషన్ ఆఫ్ ఇండియా (క్రెడాయ్) అధ్యక్షులు టి.శేఖరరెడ్డి అంటున్నారు. విభజన జరిగిన తర్వాత ఈ రెండు మూడు నెలల కాలంలో రిజిస్ట్రేషన్లు పడిపోయాయని భావించడం లేదని చెప్పారు. ఆ నెలల్లో కొన్న భూములకు అప్పటికప్పుడే రిజిస్ట్రేషన్లు జరగబోవని, రిజిస్ట్రేషన్లు ఏమేరకు జరిగాయో తర్వాత తెలుస్తుందని పేర్కొన్నారు. విభజన ప్రభావం ఎంతో కొంతమేర ఉండటానికి కారణం వేరే ఉందన్నారు. ‘‘విభజన జరగకముందు పెట్టుబడిదారులు, కొనుగోలుదారులు, రియల్ ఎస్టేట్ బిల్డర్లలో కొంత గందరగోళం ఉంది. అయితే విభజన జరిగాక అందరికీ స్పష్టత వచ్చింది. అయినా ఆసియాలోనే హైదరాబాద్ గొప్ప నగరం. దేశంలో ఇక్కడ ఉన్నన్ని వసతులు మరెక్కడా లేవు. మౌలిక సదుపాయాలు పుష్కలంగా ఉన్నాయి. ధరలు కూడా అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇక్కడి భూములపైనా... ఇతరత్రా ప్రాజెక్టులు, పరిశ్రమలపైనా పెట్టుబడులు పెట్టడానికి ఎవరికీ అభ్యంతరాలు ఉండబోవు’’ అని ఆయన చెప్పారు. నూతన పరిశ్రమల స్థాపన కోసం వచ్చే పారిశ్రామికవేత్తలకు కొత్త ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించి, పదిహేను ఇరవై రోజుల్లోగా అనుమతులు ఇచ్చేట్లయితే హైదరాబాద్ అభివృద్ధిని ఎవరూ ఆపలేరన్నారు. ఐటీఐఆర్ ప్రాజెక్టు వల్ల రాబోయే 20 ఏళ్లలో 50 లక్షల ఉద్యోగాలు వస్తాయని, దీనిద్వారా నగరం ఎంత అభివృద్ధి చెందుతుందో ఊహించవచ్చన్నారు. -
అస్తవ్యస్తం.. అసమగ్రం.. అస్పష్టం
జూన్ 2 ముంచుకొస్తున్నా నత్తనడకన విభజన ప్రక్రియ మే 15 నాటికి పూర్తవ్వాలన్న గవర్నర్ ఆదేశాలు గాలికి ఉద్యోగుల కేటాయింపుపై ఇంకా రగడే స్థానికతను ఉల్లంఘించారంటూ ఆరోపణలు ‘రెండు రాష్ట్రాల ప్రయోగాత్మక పాలన’ ఊసే లేదు ఐఏఎస్‌ల కేటాయింపే ఇంకా కొలిక్కి రాలేదు 20 సంస్థలను విభజించాలి... పూర్తయింది రెండే సచివాలయం, అసెంబ్లీల విభజన ఉత్తర్వులే రాలేదు డిజిటైజ్డ్ ఫైళ్లను ఎవరికి అప్పగించాలో అయోమయం సాక్షి, హైదరాబాద్: అంతా అయోమయం... గందరగోళం... అసమగ్రం... అసంపూర్ణం. వెరసి... విభజన ప్రక్రియ ఆద్యంతం అస్తవ్యస్తం! ఓ వైపు అపాయింటెడ్ డే అయిన జూన్ 2 ముంచుకొస్తున్నా విభజన ప్రక్రియ మాత్రం ఇంకా నత్త నడకనే సాగుతోంది. దాంతో... మే 26 నుంచి ప్రయోగాత్మకంగా రెండు రాష్ట్రాల పాలన వ్యవస్థలు విడిగా కార్యక్రమాలు ప్రారంభించాలని తొలుత భావించినా అదిప్పుడు సాధ్యం కావడం లేదు. చివరి నిమిషం దాకా ఏదీ తేల్చలేని పరిస్థితి ఏర్పడింది. పాలనకు గుండెకాయగా చెప్పే సచివాలయంలోనే విభజన ఇంకా ఎటూ తేలలేదు. బ్లాకులవారీగా ఇరు రాష్ట్రాలకు కేటాయింపులు జరిపినా ఏ కార్యాలయం ఏ బ్లాకులో పని చేయాలనే విషయమై సాధారణ పరిపాలన శాఖ ఇప్పటిదాకా ఉత్తర్వులే జారీ చేయలేదు. ఉద్యోగుల తాత్కాలిక విభజన ఉత్తర్వులు వెలువడి, వారు ఏ రాష్ట్రంలో పని చేయాలన్న స్పష్టత కూడా ఇంకా రావాల్సే ఉంది. విభజన తరువాత వారు ప్రస్తుత శాఖల్లోనే పని చేయాలా, మరే శాఖకైనా మార్చి సర్వీసు ఆర్డర్ ఇస్తారా అంటూ ఉద్యోగుల్లో నెలకొన్న సంశయాన్ని తీర్చే నాథుడే లేడు! తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ తేదీని జూన్ 2గా పేర్కొంటూ మార్చి 4న కేంద్రం అపాయింటెడ్ తేదీని ప్రకటించడం తెలిసిందే. అప్పటి నుంచి విభజన ప్రక్రియ కోసం 22 రకాల కమిటీల ఏర్పాటు, అధ్యయనాలు, సమావేశాలు, సర్క్యులర్ల జారీ తదితరాలన్నీ జరిగాయి. కానీ గడువు ముంచుకు వచ్చిన ఈ సమయంలోనూ ప్రక్రియ ఇంకా పూర్తి కావడమే లేదు. దాదాపు ప్రతి రోజూ సమీక్షలు నిర్వహిస్తున్నా విభజన ప్రక్రియలో ఆశించిన వేగం మాత్రం కనిపించడం లేదు. దీనిపై కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు కూడా అసంతృప్తి వ్యక్తం చేయడం తెలిసిందే. ఇరు రాష్ట్రాలు ఏర్పాటయ్యాక సీఎంలిద్దరూ దీన్ని సజావుగా పరిష్కరించుకునే అవకాశమున్నా ముందుగానే విభజనను చేపట్టి జటిలం చేశారని ఆయన అభిప్రాయపడ్డారు. తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక ఖాతాను ప్రారంభించడం, ట్రెజరీ కార్యాలయాలు, వాణిజ్య పన్నుల శాఖలో టిన్ నంబర్ కేటాయించడం మాత్రం ఇప్పటిదాకా జరిగాయి. ఈ రెండూ జూన్ 1 అర్ధరాత్రి నుంచి అమల్లోకి రానున్నాయి. విభ జనకు సంబంధించి అంశాలవారీగా పరిస్థితిని ఓసారి పరిశీలిస్తే... అసెంబ్లీ, శాసనమండలి ఇబ్బంది: వీటి కేటాయింపుపై కూడా ఇంకా స్పష్టత లేదు. ఇరు రాష్ట్రాల ముఖ్యమంత్రులు బాధ్యత స్వీకరించాక గాని దీనిపై స్పష్టత వచ్చే అవకాశం లేదు. వారిని సంప్రదించకుండా వీటిని కేటాయిస్తే అనవసర రాద్ధాంతం తప్పకపోవచ్చు. ప్రస్తుత అసెంబ్లీని తెలంగాణకు, పాత అసెంబ్లీ భవనాన్ని సీమాంధ్రకు; ప్రస్తుత శాసనమండలిని తెలంగాణకు, జూబ్లీ హాల్‌ను సీమాంధ్ర మండలికి అని గవర్నర్ వద్ద జరిగిన సమావేశంలో భావించారు. కాని ఎందుకో గానీ ఆ తరవాత దీనిపై అధికారులకే స్పష్టత లేకుండా పోయింది! కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపు ఇబ్బంది: దీనికోసం ఏర్పాటైన ప్రత్యూష్ సిన్హా కమిటీ తుది నివేదిక ఇంకా ఇవ్వనే లేదు. నివేదిక ఆధారంగానే ఐఏఎస్, ఐపీఎస్, ఐఎఫ్ఎస్ వంటి కేంద్ర సర్వీసు అధికారుల కేటాయింపు ఉంటుంది. వారికి ఆప్షన్లుండవని తెలిసి కూడా ‘ఏ రాష్ట్రంలో పని చేయడానికి ఆసక్తి ఉందో తెలపండి’ అంటూ అధికారుల నుంచి ఆసక్తి వ్యక్తీకరణ పత్రాలు తీసుకున్నారు. వారికి పోస్టింగులు ఎలా, ఎప్పుడిస్తారో తెలియని పరిస్థితి. వారికి పోస్టింగులిస్తే తప్ప పాలన సాధ్యమే కాదు. ఈ మార్గదర్శకాలకు నరేంద్ర మోడీ ప్రధాని అయ్యాక ఆయన ఆమోదం తెలపాల్సి ఉంది. జూన్ 1 అర్ధరాత్రి వారి పోస్టింగులపై స్పష్టత ఇస్తారంటున్నా, ఆ మర్నాటి నుంచే రెండు రాష్ట్రాలూ విడిగా కార్యకలాపాలు ప్రారంభించడం కష్టసాధ్యంగానే కన్పిస్తోంది. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపు ఇబ్బంది: ఇది మే 25 నాటికి పూర్తయి 26 నుంచి రెండు రాష్ట్రాలు ప్రయోగాత్మకంగా విడిగా పని చేయాలన్నది నిర్ణయం. కానీ అది అమలు కావడం లేదు. ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపుల్లో స్థానికత వివాదం తలెత్తింది. పైగా ఈ జాబితాను కేంద్రానికి పంపాలి. వారు అన్నీ సమగ్రంగా ఉన్నాయో, లేదో పరిశీలించాలి. కేంద్రం ఆమోదం పొందితే తప్ప ఉద్యోగుల కేటాయింపు కొలిక్కి రాదు. పైగా కేటాయింపులో స్థానికతను సరిగా పాటించలేదు. ఇంకా పలు అభ్యంతరాలను ఉద్యోగులు లేవనెత్తుతున్నారు. వారి మధ్య ఇంకా మరెన్నో సమస్యలున్నాయి. అవన్నీ ఎప్పటికి పరిష్కారమవుతాయో తెలియదు. కార్పొరేషన్లు/సంస్థల విభజన ఇబ్బంది: జూన్ 2 నాటికి 20 ప్రభుత్వ రంగ సంస్థలు/సహకార సంస్థలను విడదీయాలన్నది లక్ష్యం. కానీ ఇప్పటికి కేవలం ఆర్టీసీ, జెన్కోలను మాత్రమే విభజించారు. మిగతా సంస్థల విభజన ఇప్పట్లో పూర్తయ్యేలా లేదు. తాజాగా మరో 38 సంస్థలను ప్రస్తుతానికి విభజనకు దూరంగా ఉంచుతూ పదో షెడ్యూల్లో పొందుపరిచారు. విద్యా సంస్థల్లో ఉమ్మడి ప్రవేశాలు, ఉన్నత విద్యామండలి విభజనపై సైతం సందిగ్ధతే కొనసాగుతోంది. ఏపీపీఎస్సీ స్థానంలో తెలంగాణకు టీపీఎస్సీ ఏర్పాటుపై అధికార వర్గాల్లోనే స్పష్టత లేదు. రవాణా శాఖ రిజిస్ట్రేషన్లు, నంబర్లపై సైతం ఇప్పటికీ ఆ శాఖ అధికార వర్గాల్లో కూడా అయోమయమే నెలకొని ఉంది! భవనాలు, హెచ్ఓడీ కార్యాలయాలు ఇబ్బంది: భవనాల కేటాయింపునకు సంబంధించి ఇప్పటిదాకా ఎలాంటి ఉత్తర్వులూ వెలువడలేదు. కేవలం లీకులతోనే కాలం గడుపుతున్నారు. సచివాలయంలోని నాలుగు బ్లాకులను తెలంగాణకు, ఐదింటిని సీమాంధ్రకు కేటాయించినట్టు బయటకొచ్చినా.. వాటిపై ఇంకా తుది ఉత్తర్వులు రాలేదు. ఈ బ్లాకుల కేటాయింపు పూర్తయితే తప్ప ఆయా బ్లాకుల్లో ఏ ఫ్లోర్ ఏ శాఖకు కేటాయించాలన్నది సాధారణ పరిపాలన శాఖ నిర్ణయించలేదు. పలు విభాగాల అధిపతుల కార్యాలయాల్లోనూ ఇరు రాష్ట్రాలకు వసతి సౌకర్యాలు ఏ మేరకు ఇవ్వాలన్న దానిపై ఇంకా ఉత్తర్వులు జారీ చేయలేదు. మంత్రుల నివాసాలు ఇబ్బంది: దీనిపైనా అధికారులు ఇంకా దృష్టి సారించలేదు. బంజారాహిల్స్, కుందన్‌బాగ్‌లో మంత్రుల నివాసాలున్నాయి. వాటిలో వేటిని ఎవరికివ్వాలి, ఒక రాష్ట్ర మంత్రులకు పూర్తిగా ఒకవైపు ఇవ్వాలా, లేక వారు కోరే విధంగా కేటాయించాలా వంటి పలు అంశాలపై ఇంకా సందిగ్ధమే నెలకొని ఉంది. తనకు కేటాయించిన తెలంగాణ సీఎం క్యాంపు కార్యాలయం వద్దని, దాన్ని కుందన్‌బాగ్‌లో ఏర్పాటు చేయాలని కేసీఆర్ ఇప్పటికే స్పష్టం చేశారు. చంద్రబాబు కూడా తనకు క్యాంపు కార్యాలయంగా కేటాయించిన లేక్‌వ్యూ అతిథి గృహం అక్కర్లేదని, ఇంటి నుంచే విధులు నిర్వర్తిస్తానని చెబుతున్నారు. ఆయన కోసం సచివాలయంలో ముస్తాబు చేస్తున్న ‘హెచ్ ’ బ్లాక్ వాస్తుపరంగా బాలేదని ఆయన మనుషులు తాజాగా శనివారం తేల్చారు. ఇప్పుడు కొత్తగా ‘ఎల్’ బ్లాక్‌ను పరిశీలించారు! ఫైళ్ల డిజిటైజేషన్ ఇబ్బంది: ఈ ప్రక్రియ దాదాపు పూర్తయింది. కానీ ఈ ఫైళ్లను ఎవరికి అప్పగించాలి, ఆ సందర్భంగా ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలన్న మార్గదర్శకాలేవీ ఇవ్వలేదు. సిబ్బందిని కొత్త రాష్ట్రానికి పంపిణీ చేశాక ఈ కంప్యూటర్లను ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తీసుకెళ్లాలో లేదో కూడా తెలియని పరిస్థితి! ఉద్యోగుల విభజనపై కసరత్తు మళ్లీ మొదటికి రాష్ట్ర విభజనలో కీలకాంశమైన ఉద్యోగుల విభజనపై ఇప్పటి వరకూ జరిగిన కసరత్తు మళ్లీ మొదటికి వచ్చింది. ఉద్యోగుల విభజనలో సీనియారిటీ, స్థానికత అంశాలు అసమగ్రంగా ఉన్నాయని తెలంగాణ ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతుండగా.. సీమాంధ్ర ఉద్యోగ సంఘాలు మాత్రం అందుకు పూర్తి విరుద్ధంగా చెబుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి పీవీ రమేశ్ ఆదివారం ఉదయం 10.30 గంటలకు డాక్టర్ మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి(ఎంసీహెచ్ఆర్డీ) కేంద్రంలో రెండు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహించనున్నారు. ఈ సమావేశంలో ఇరు ప్రాంతాలకు చెందిన ఉద్యోగ సంఘాల ప్రతినిధుల అనుమానాలు, సందేహాలను తెలుసుకుని రమేశ్ నివృత్తి చేయనున్నారు. -
సీమాంధ్ర అసెంబ్లీ కార్యదర్శి ఎవరు?
అర్హులు లేని వైనం... డెప్యుటేషనే మార్గం సాక్షి, హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ తొలి కార్యద ర్శిగా ఎవరుంటారన్నది చర్చనీయాంశంగా మారింది. ప్రస్తుత కార్యదర్శి ఎస్.రాజ సదారాం పదవి కాలం ఇప్పటికే ముగిసినా అసెంబ్లీ సచివాలయంలో అర్హులెవరూ లేకపోవడంతో గత ప్రభుత్వం ఆయనకు పొడిగింపు ఇవ్వడం తెలిసిందే. జూన్ 2 నుంచి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల అసెంబ్లీలు వేరవుతున్నాయి. సదారాం తెలంగాణకు చెందిన వారు గనుక ఆయన్ను తెలంగాణ అసెంబ్లీ కార్యదర్శిగా కొనసాగించే అవకాశముంది. దాంతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ కార్యదర్శిపై సందిగ్ధత నెలకొంది. ఎందుకంటే ఆ పదవిలోకి వచ్చేవారు న్యాయశాస్త్రంలో పట్టభద్రులై ఉండాలి. సంయుక్త కార్యదర్శి, అదనపు కార్యదర్శులకు కూడా ఇది వర్తిస్తుంది. కానీ అసెంబ్లీ సచివాలయంలో న్యాయశాస్త్ర పట్టభద్రులు ప్రస్తుతం డిప్యూటీ సెక్రెటరీ స్థాయిలోనే ఉన్నారు. వారికన్నా సీనియర్లకు న్యాయశాస్త్ర పట్టా లేని కారణంగా సంయుక్త, అదనపు కార్యదర్శులుగా పదోన్నతి లభించడం లేదు. దాంతో అసెంబ్లీలో ఆ పదవులు ఖాళీగా ఉన్నాయి. ఆ కారణంగా కార్యదర్శి పదవికి అర్హులెవరూ లేకుండా పోయారు. 1970ల్లో ఇలాంటి పరిస్థితే ఎదురైతే న్యాయ శాఖ నుంచి ఒక అధికారిని డెప్యుటేషన్‌పై అసెంబ్లీ కార్యదర్శిగా తీసుకున్నారు. ఇప్పుడూ అదే విధానాన్ని అవలంబించక తప్పని పరిస్థితి నెలకొంది. అసెంబ్లీ ఉద్యోగుల స్థానికతపై వివాదం అసెంబ్లీలో ఉద్యోగుల స్థానికతపై వివాదం తలెత్తింది. అసెంబ్లీ సచివాలయ ఉద్యోగుల విభజన జరగాల్సి ఉన్న నేపథ్యంలో వారి స్థాయీ నివేదికను అసెంబ్లీ కార్యదర్శి ప్రకటించారు. అయితే అందులో 22 మంది సీమాంధ్ర ఉద్యోగులు తెలంగాణ వారిగా క్లెయిమ్ చేసుకుంటున్నారంటూ పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. దీనిపై నలుగురు సభ్యులతో కమిటీని కార్యదర్శి నియమించారు. అది శనివారం ఉద్యోగుల అభ్యంతరాలను పరిశీలించి నివేదిక ఇవ్వనుంది. -
‘తెలంగాణ’ సిరీస్ ఏమిటి?
వాహనాలకు ‘టీజీ’ కేటాయిస్తారా.. మారుతుందా? సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రం అధికారికంగా ఆవిర్భవించాక వాహనాల రిజిస్ట్రేషన్ నంబర్లు, వాటి సిరీస్‌ల విషయంలో ఇప్పటి వరకు కేంద్రం నుంచి ఎలాంటి ఆదేశాలు రాకపోవటం గందరగోళానికి దారితీస్తోంది. అపాయింటెడ్ డే (జూన్ 2)కు ఇంకా కేవలం పది రోజులు మాత్రమే మిగిలి ఉన్నప్పటికీ కేంద్రం నుంచి రవాణా శాఖకు ఎలాంటి స్పష్టత రాలేదు. దీనిపై పలుమార్లు వాకబు చేసినా ఫలితం లేకపోవటంతో అధికారులు చేతులెత్తేశారు. జూన్ రెండు నుంచి అధికారికంగా ఆంధ్రప్రదేశ్, తెలంగాణ విడిపోయి దేనికవి పాలన ప్రారంభిస్తాయి. వాహనాల రిజిస్ట్రేషన్లు రాష్ట్రాల పరిధిలోనే జరుగుతాయి. ప్రస్తుతం ఉన్న ‘ఏపీ’ సిరీస్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి, తెలంగాణకు ‘టీజీ’ సిరీస్‌ను కేటాయించాలని ఇప్పటికే రాష్ట్రప్రభుత్వం కేంద్రం దృష్టికి తెచ్చింది. అయితే ఆంధ్రప్రదేశ్‌కు ఏపీ సిరీస్ విషయంలో ఎలాంటి గందరగోళం లేకున్నా తెలంగాణకు సమస్యవచ్చిపడింది. అసలు టీజీ సిరీస్ ఉంటుందా, మరేదైనా కేటాయిస్తారా అన్న అనుమానాలూ అధికారుల్లో వ్యక్తమవుతున్నాయి. రాష్ట్రాల పేర్ల ఆధారంగా పరి శీలిస్తే తెలంగాణకు టీజీ సిరీసే ఉంటుందని అధికారులు అంచనా వేసుకోవటం మినహా కేంద్రం నుంచి స్పష్టత రాలేదు. టీజీ సిరీస్‌ను కేటాయించినా... జిల్లాల వారీగా ఏయే సంఖ్య ఉంటుందో కూడా తేలాల్సి ఉంది. ఏపీ సిరీస్‌లో ఆయా జిల్లాల ఆంగ్ల అక్షరక్రమం ప్రకారం నంబర్లను కేటాయించారు (ఉదా... ఖైరతాబాద్ 09, మెహిదీపట్నం 13, వరంగల్‌కు 36). తెలంగాణకు కొత్త సిరీస్‌లో భాగంగా అంకెలు మారతాయా, పాత అంకెలనే కొనసాగించాల్సి ఉంటుందా అన్నదీ తేలాల్సి ఉంది. అధికారులు మాత్రం ఆదిలాబాద్‌కు టీజీ 01తో ప్రారంభించి నంబర్లను ఉజ్జాయింపుగా సిద్ధం చేసుకున్నారు. గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ప్రస్తుతం పది ఆర్టీఏ కార్యాలయాలున్నాయి. వీటికి ఏడు నంబర్లను కేటాయించారు. ఈలెక్కన టీజీ 01 నుంచి టీజీ-15 వరకు నంబర్లు ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు. కానీ కేంద్రం ఆదేశాలిస్తేగాని ఇందులో స్పష్టత రాదు. ఏపీ సిరీస్‌లో తెలంగాణ జిల్లాలకు ఉన్న నంబర్లనే కొనసాగించాలని పేర్కొంటే మాత్రం టీజీ సిరీస్‌తో ఆ పాత నంబర్లే కొనసాగుతాయి. తెలంగాణకు కొత్త నంబర్లు కేటాయిస్తే.. అందులోనూ మరో అయోమయం ఉండబోతోంది. ప్రస్తుతం తెలంగాణలో ఉన్న పది జిల్లాలను విభజించి 24కు పెంచాలని కాబోయే తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచిస్తున్నారు. ఆ ప్రక్రియ జరిగితే మళ్లీ నంబర్లలో తేడాలొస్తాయి. ఇక ఏపీ సిరీస్‌తో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాత వాహనాల విషయం మరో చిక్కు ప్రశ్న. తెలంగాణలోని పాత వాహనాలన్నింటిని కూడా కొత్త సిరీస్‌లోకి మార్చాల్సి ఉంటుందా... లేదా అవి అలాగే ఏపీ సిరీస్‌తోనే కొనసాగుతాయా అన్నది తేలాల్సి ఉంది. లెసైన్సుదారులకు అందజేస్తున్న కార్డుల విషయంలోనూ గందరగోళం కొనసాగుతోంది. ఆ కార్డులపై రాష్ట్ర అధికారిక చిహ్నం ఉంటుంది. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ అధికారిక చిహ్నాన్ని ముద్రిస్తున్నారు. తె లంగాణ రాష్ట్రంలో కొత్త చిహ్నాన్ని ముద్రించాల్సి ఉంటుంది. ఇప్పటి వరకు తెలంగాణకు అధికారిక చిహ్నమంటూ ఏదీ సిద్ధం కాలేదు. జూన్ రెండు నుంచి జారీ చేసే కార్డులపై ఏ చిహ్నం ముద్రించాలన్న అంశంపై గందరగోళం నెలకొంది. మరో పది రోజుల్లో అధికారికంగా తెలంగాణ ఆవిర్భవిస్తున్న నేపథ్యంలో ఇన్ని అంశాలకు స్పష్టత రాకపోవటంతో అధికారులు అయోమయంలో పడ్డారు. ఇప్పటికే ఢిల్లీని సంప్రదించినా ఫలితం రాకపోవటంతో వేచిచూసే ధోరణి అవలంభించాలని నిర్ణయించి ఎలాంటి ముందస్తు ఏర్పాట్ల జోలికి వెళ్లటం లేదు. మరో నాలుగైదు రోజుల తర్వాత కేంద్రం నోటిఫికేషన్ జారీ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ఫ్యాన్సీ నంబర్లకు నెలాఖరువరకు గడువు... తెలంగాణ జిల్లాల్లో ముందస్తుగా వాహనాల నంబర్లను రిజర్వ్ చేసుకున్నవారు ఈనెలాఖరులోపు రిజిస్ట్రేషన్లు పూర్తి చేసుకోవాలని అధికారులు పేర్కొంటున్నారు. కేంద్రం ఇచ్చే ఆదేశాల మేరకు తెలంగాణలో రిజిస్ట్రేషన్ సిరీస్, నంబర్లు మారే అవకాశం ఉన్నందున పాత సిరీస్ కేటాయింపు సాధ్యం కాదని పేర్కొంటున్నారు. ముందస్తుగా రిజిస్ట్రేషన్ నంబరు రిజర్వు చేసుకున్నాక పక్షం రోజుల్లో వాహనాన్ని రిజిస్టర్ చేసుకోవాల్సి ఉంటుంది. కానీ ప్రస్తుతం అపాయింటెడ్ డేకు పది రోజుల గడువు మాత్రమే ఉన్నందున, ఆ పక్షం రోజుల నిబంధన అమలు సాధ్యం కాదని తేల్చిచెబుతున్నారు. ఈనెలాఖరు నాటికి రిజిస్ట్రేషన్ చేయించుకోని వారికి ... ఇప్పటికే చెల్లించిన ముందస్తు రిజర్వేషన్ చార్జీలను తిరిగి చెల్లించమని స్పష్టం చేస్తున్నారు. -
ఉద్యోగులకు నేడే వేతనాలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు శనివారంనాడు వేతనాలు అందనున్నాయి. వారం రోజుల ముందుగానే వారి చేతికి వేతనం లభించనుంది. రాష్ట్ర విభజన నేపథ్యంలో... మే మాసం వేతనంతోపాటు, జూన్ ఒకటో తేదీ వేతనాన్ని కూడా కలిపి ఇవ్వనున్నారు. అలాగే పెన్షనర్లకు కూడా పెన్షన్ మొత్తాన్ని వారి అకౌంట్లలో పడనుంది. వేతనంతోపాటు ఈసారి కరువుభత్యం కలిపి చెల్లించనున్నారు. మే 24 తరువాత అపాయింటెడ్ డే జూన్ రెండో తేదీవరకు మరే రకమైన చెల్లింపులు చేయరాదని ఇదివరకు నిర్ణయించిన సంగతి విదితమే. రెండు రాష్ట్రాలు ఏర్పాటైన తరువాత.. ఏ రాష్ట్రంలో పనిచేసే సిబ్బందికి ఆ రాష్ట్రమే వేతన భారాన్ని భరించాల్సి ఉంటుంది. ఈ నెలాఖరుతో పదవీ విరమణ చేసే ఉద్యోగులకు కూడా చెల్లించాల్సిన అన్ని రకాల ప్రయోజనాలను శనివారంనాడు చెల్లించాలని కూడా ఆర్థిక శాఖ నిర్ణయించిన విషయం విదితమే. కాగా.. ఉద్యోగులకు సంబంధించి సమాచారం అప్లోడ్ చేసిన దరిమిలా.. దాదాపు యాభైవేల మంది ఉద్యోగుల సమాచారం ఆర్థిక శాఖకు చేరని విషయం తెలిసిందే. కేంద్రానికి ఉద్యోగుల వివరాలు... స్థానికత ఆధారంగా ఉద్యోగుల తాత్కాలిక కేటాయింపునకు సంబంధించిన సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వానికి పంపించడానికి అధికారులు శుక్రవారం అర్ధరాత్రి వరకు పనిచేశారు. ఈ కేటాయింపు సమాచారాన్ని కేంద్ర ప్రభుత్వం పరిశీలించి ఉద్యోగులను జనాభా దామాషా ఆధారంగా 58.32 శాతం సీమాంధ్రకు, 41.68 శాతం ఉద్యోగులను తాత్కాలికంగా కేటాయించారా? లేదా? అన్న అంశాలను కేంద్ర సిబ్బంది, శిక్షణ విభాగం అధికారులు పరిశీలించిన తరువాత తెలంగాణ రాష్ట్రంలో పనిచేసేలా సదరు ఉద్యోగులకు ఉత్తర్వులు జారీ కానున్నట్లు సమాచారం. -
టీ. అసెంబ్లీలో సీమాంధ్ర సిబ్బంది వద్దు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ శాసనసభ సచివాలయంలో సీమాంధ్ర ఉద్యోగులు పనిచేయడాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని తెలంగాణ ఉద్యోగుల సంఘం నేత వేణుగోపాల్ తెలిపారు. తెలంగాణ శాసనసభకు కేటాయించిన సిబ్బందిలో సీమాంధ్ర ఉద్యోగులున్న విషయాన్ని ఆధారాలతోసహా శాసనసభ కార్యదర్శి రాజా సదారాంకు సమర్పించామన్నారు. మరికొంత సమయమిస్తే మరిన్ని ఆధారాలు సమర్పిస్తామని చెప్పారు. తెలంగాణ శాసనసభకు 185 మంది అధికారులు, 210 మంది నాలుగో తరగతి సిబ్బందిని కేటాయించగా, వారిలో 80 మందికిపైగా సీమాంధ్రులున్నారని చెప్పారు. -
ఫలితాలపై జూన్‌లో ఏపీ పీసీసీ సమీక్ష
సాక్షి, హైదరాబాద్: ఎన్నికల్లో సీమాంధ్రలో పూర్తిగా దెబ్బతినడానికి కారణాలను అన్వేషించేందుకు జూన్ తొలి వారంలో సమావేశాలు నిర్వహించాలని ఆంధ్రప్రదేశ్ పీసీసీ నిర్ణయించింది. జూన్1 లేదా 2వ తేదీల్లో రాజమండ్రి లేదా విశాఖలో ఒకచోట భారీ కార్యక్రమం ఏర్పాటు చేయాలని భావిస్తోంది. మరోవైపు శాసనసభలో ప్రాతినిథ్యం లేకపోయినప్పటికీ.. ఆచరణ సాధ్యం కాని హామీల అమలులో చంద్రబాబు విఫలమవుతారని, ప్రభుత్వ వైఫల్యాలపై చట్ట సభల వెలుపల ఆందోళన కార్యక్రమాలు కొనసాగించాలని అభిప్రాయానికి వచ్చారు. -
సీపీఐ రెండు శాఖల ఏర్పాటు
కార్యదర్శులుగా ఆంధ్రాకు కె.రామకృష్ణ, తెలంగాణకు చాడా పదవి నుంచి తప్పుకున్న నారాయణ మఖ్దూంభవన్ నుంచే రెండు శాఖల కార్యకలాపాలు సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో సీపీఐ భావోద్వేగాల నడుమ శుక్రవారం లాంఛనంగా రెండు శాఖల్ని ఏర్పాటు చేసుకుంది. ఆంధ్రప్రదేశ్ శాఖకు కె.రామకృష్ణ కార్యదర్శిగా ముప్పాళ్ల నాగేశ్వరరావు, జేవీ సత్యనారాయణ మూర్తి సహాయ కార్యదర్శులుగా, తెలంగాణ శాఖకు చాడా వెంకటరెడ్డి కార్యదర్శిగా పల్లా వెంకటరెడ్డి, సిద్ది వెంకటేశ్వర్లు సహాయ కార్యదర్శులుగా ఎన్నికయ్యారు. రెండురోజులుగా జరుగుతున్న ఉమ్మడి రాష్ట్ర పార్టీ రాష్ట్ర సమితి సమావేశాల ముగింపు సందర్భంగా నూతన శాఖలు ఏర్పాట య్యాయి. ఆహ్వానితులతో కలిసి మొత్తం 182 మంది రాష్ట్ర సమితి సభ్యుల్లో 106 మందిని తెలంగాణకు, 77 మందిని ఆంధ్రాకు కేటాయించారు. ఎన్నికయిన ఇద్దరు కార్యదర్శులూ ఆయా రాష్ట్రాల ఎన్నికల కమిటీలకు కన్వీనర్లుగా వ్యవహరించిన వారే కావడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్ శాఖ కార్యదర్శి రామకృష్ణ అనంతపురం జిల్లాకు చెందినవారు కాగా, సహాయ కార్యదర్శులు ముప్పాళ్ల నాగేశ్వరరావు గుంటూరు జిల్లా, జేవీ సత్యనారాయణ మూర్తి (నానీ) విశాఖ జిల్లాకు చెందినవారు. తెలంగాణ శాఖ కార్యదర్శి చాడా వెంకటరెడ్డి కరీంనగర్ జిల్లాకు చెందినవారు కాగా, సహాయ కార్యదర్శులు సిద్ది వెంకటేశ్వర్లు ఖమ్మంజిల్లా, పల్లా వెంకటరెడ్డి నల్లగొండ జిల్లాకు చెందినవారు. ఆంధ్రప్రదేశ్ శాఖ తొలి సమావేశాన్ని వచ్చే నెల 7న విజయవాడలో నిర్వహించి భవిష్యత్ కార్యక్రమాన్ని ప్రకటిస్తుంది. ఇప్పటివరకు కొనసాగిన రాష్ట్ర కార్యవర్గం, రాష్ట్ర సమితి రద్దయినట్టు పార్టీ ఉమ్మడి రాష్ట్ర కార్యదర్శి కె.నారాయణ ప్రకటిస్తూ తాను కూడా బాధ్యతల నుంచి వైదొలుగుతున్నట్టు చెప్పారు. ఈ సందర్భంగా నూతన కార్యదర్శులతో కలిసి మీడియాతో మాట్లాడారు. ఆస్తుల విభజనకు కమిటీ పార్టీ ఉమ్మడి ఆస్తుల విభజనకు కమిటీని ఏర్పాటు చేస్తున్నట్టు నారాయణ తెలిపారు. విశాలాంధ్ర విజ్ఞాన సమితి, 99 టీవీ, సీఆర్ ఫౌండేషన్, మఖ్దూంభవన్ ప్రస్తుతం ఉమ్మడి ఆస్తులుగా ఉన్నాయి. రెండు శాఖలూ మఖ్దూంభవన్ నుంచే కార్యకలాపాలను నిర్వహిస్తాయి. సుమారు 15 ఏళ్లపాటు పార్టీ రాష్ట్ర కార్యదర్శిగా పని చేసి వివిధ పోరాటాలు చేసిన తన చేతుల మీదుగానే పార్టీకి రెండు శాఖల్ని ఏర్పాటు చేయడం బాధాకరంగా ఉన్నా అనివార్యమని నారాయణ చెప్పారు. ప్రస్తుత పరిస్థితులకు దీటుగా పార్టీని నిర్మించడమే తమ ముందున్న తక్షణ కర్తవ్యంగా రెండు రాష్ట్రాల కార్యదర్శులు చాడా వెంకటరెడ్డి, కె.రామకృష్ణ తెలిపారు. హైదరాబాద్‌లో స్థిరపడిన ఆంధ్రులకు ఎటువంటి కష్టనష్టాలను రానివ్వకుండా చూస్తామన్నారు. అంతకుముందు పార్టీ ప్రధాన కార్యదర్శి సురవరం మాట్లాడుతూ ఎన్నికల సందర్భంగా వామపక్షాల మధ్య తలెత్తిన మనస్పర్థలను తొలగించి ఉమ్మడి పోరాట కార్యక్రమాలకు నడుంకడతామన్నారు. ఆత్మీయ ఆలింగనాలు, అలాయ్ బలాయ్లు నూతన రాష్ట్ర ఆవిర్భావదినోత్సవానికి జూన్ 2 వరకు గడువున్నా సీపీఐకి మాత్రం శుక్రవారమే అపాయింటెడ్ డేగా మారింది. సుమారు ఆరు దశాబ్దాల పాటు కలిసి మెలిసి ఎన్నెన్నో అనుభవాలను కలబోసుకున్న నేతలు భావోద్వేగాల నడుమ రెండయ్యారు. తీవ్ర భావోద్వేగాలకు లోనయ్యారు. బరువెక్కిన హృదయాలతో ఉద్విగ్న భరిత వాతావరణంలో ఆత్మీయ ఆలింగనాలు, అలాయ్ బలాయ్లు చేసుకున్నారు. రాష్ట్ర సమితి రద్దయిందని అధ్యక్షవర్గం ప్రకటించినప్పుడు యువ నేతలు జి.ఈశ్వరయ్య, కుమారస్వామిలాంటి వాళ్లు కన్నీళ్ల పర్యంతమయ్యారు. తన జీవితం పార్టీతో ముడిపడి ఉందన్న నారాయణ తన శేష జీవితాన్ని పార్టీకి అంకితం చేస్తున్నట్టు ప్రకటించారు. -
ఆంధ్రప్రదేశ్ రాజధాని బెజవాడే(నా) ?
-
లోకల్ లొల్లి
సాక్షి ప్రతినిధి, ఆదిలాబాద్ : సచివాలయంలో రగులుతున్న ‘స్థానికేతర’ చిచ్చు జిల్లాకు పాకింది. తెలంగాణ సచివాలయం లోని స్థానికేతర ఉద్యోగులను సీమాంధ్రకు పంపాలని తెలంగాణ ఉద్యోగ సంఘాల డిమాండ్ తెరపైకి వచ్చిన విషయం విదితమే. ఈ అంశం ఇప్పుడు జిల్లాలోనూ చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ కూడా స్థానికేతర ఉద్యోగులు ఎంత మంది ఉన్నారనే అంశంపై ఉద్యోగ సంఘాల నేతలు ఆరా తీస్తున్నారు. వారి పూర్తి వివరాలు ఇవ్వాలని కలెక్టర్ అహ్మద్‌బాబుకు సమాచార హక్కు చట్టం కింద ఇటీవల దరఖాస్తు చేశామని టీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్ తెలిపారు. అటెండర్ నుంచి ఉన్నతాధికారి వరకు వారి పేరు, హోదా, ఏ ప్రాంతానికి చెందిన వారు, ఎక్కడి నుంచి బదిలీపై వచ్చారు వంటి అన్ని వివరాలు ఇవ్వాలని దరఖాస్తులో కోరారు. ఈ వివరాలను వారం రోజుల్లో పంపాలని కలెక్టర్ ఆయా శాఖల ఉన్నతాధికారులకు ఆదేశాలు జారీ చేశారు. అలాగే తెలంగాణ మెడికల్, హెల్త్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు కూడా ఇటీవల డీఎంహెచ్‌వోకు ఇచ్చిన వినతిపత్రంలో ఈ స్థానికేతర ఉద్యోగుల అంశాన్ని ప్రస్తావించారు. ఇలా సేకరించిన వివరాలను అన్ని జిల్లాల్లో క్రోడీకరించి కేంద్రానికి పంపాలనే నిర్ణయానికి వచ్చినట్లు టీఎన్జీవో నేతలు పేర్కొన్నారు. 8 వేలకు పైగా స్థానికేతరులు? జిల్లాలో అన్ని ప్రభుత్వ శాఖల్లో కలిపి సుమారు 8వేల మంది స్థానికేతర ఉద్యోగులుంటారని టీఎన్జీవో నాయకులు ప్రాథమిక అంచనాకొచ్చారు. ముఖ్యంగా ఐదారు శాఖల్లో సీమాంధ్ర ఉద్యోగులు ఎక్కువగా ఉన్నట్లు గుర్తించారు. విద్యాశాఖలో అనేక మంది ఉపాధ్యాయులు స్థానికేతరులు ఉన్నట్లు తేలింది. వైద్య ఆరోగ్యశాఖలో కూడా ఈ సంఖ్య అధికంగా ఉన్నట్లు గుర్తించారు. స్త్రీ, శిశు సంక్షేమ శాఖలో కూడా అనేక మంది అంగన్వాడీ కార్యకర్తలు, సూపర్వైజర్లున్నట్లు భావిస్తున్నారు. ఇందిరా క్రాంతి పథం(ఐకేపీ), గుడిపేట బెటాలియన్‌లో ఎక్కువగా స్థానికేతర ఉద్యోగులున్నట్లు గుర్తించారు. ఒక్క సింగరేణిలోనే నాలుగు వేలకుపైగా స్థానికేతరులు ఉన్నట్లు సమాచారం. సమావేశంలో జిల్లా నేతలు స్థానికేతర ఉద్యోగుల గుర్తింపు విషయమై హైదరాబాద్‌లో గురువారం జరిగిన ఉద్యోగ సంఘాల భేటీలో జిల్లా నుంచి టీఎన్జీవో నాయకులు అశోక్, పలు ఉపాధ్యాయ సంఘాల నేతలు పాల్గొన్నారు. -
కేసీఆర్‌తో సీఎస్ భేటీ
విభజన కమిటీ కూడా.. విభజన ప్రక్రియను వివరించిన అధికారులు సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రానికి కాబోయే ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావును ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రసన్న కుమార్ మహంతి, రాష్ట్ర విభజన కమిటీలోని సభ్యులు గురువారం ఆయన నివాసంలో మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర విభజన ప్రక్రియ ఆయనకు వివరించాలని అధికారులు వెళ్లినా, సమయం లేని కారణంగా వారు ఆయనకు పవర్ పాయింట్ ప్రజంటేషన్ ఇవ్వలేదని సమాచారం. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితోపాటు, ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శులు అజేయకల్లం, పీవీ రమేష్, పురపాలక శాఖ ముఖ్యకార్యదర్శి శైలేంద్ర కుమార్ జోషి కలిశారు. రాష్ట్ర విభజనకు సంబంధించి పలు ఉద్యోగ సంఘాలు, ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు కలుస్తున్న నేపథ్యంలో, విభజన కమిటీకి నేతృత్వం వహిస్తున్న అధికారులు కేసీఆర్‌ను కలిసి వాస్తవ పరిస్థితులను వివరించాలని నిర్ణయించుకున్నారు. అధికారులు వెళ్లే సమయానికి కేసీఆర్ ఇతరులతో సమావేశంలో ఉండడంతో ఆలస్యం జరిగినట్లు సమాచారం. దీనితో అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఏమీ ఇవ్వలేదని తెలిసింది. అయితే విభజన ప్రక్రియలో అపోహలు రాకుండా ఉండడానికి వీలుగా వీరు విభజన జరుగుతున్న తీరును కేసీఆర్‌కు మౌఖికంగా వివరించారు. ఉద్యోగుల బదిలీలకు సంబంధించి తుది నిర్ణయం ఇంకా జరగలేదని, ఇప్పుడు ఇస్తున్నది కూడా తాత్కాలిక కేటాయింపులు మాత్రమేనని.. రెండు ప్రభుత్వాలు ఏర్పడిన తరువాత శాశ్వత కేటాయింపులు ఉం టాయని అధికారవర్గాలు కేసీ ఆర్కు వివరించినట్టు తెలి సింది. ఉద్యోగుల కేటాయిం పుల్లో తెలంగాణ ఉద్యోగులకు నష్టం కలగరాదని కేసీఆర్ స్పష్టం చేసినట్టు సమాచారం. జూన్ 2 నాటికి సాధ్యమైనంతగా విభజన ప్రక్రియ పూర్తి చేస్తామని అధికారులు పేర్కొన్నట్టు తెలిసింది. -
ఉద్యోగుల్లో ‘స్థానికత’ చిచ్చు
సచివాలయ సిబ్బందిలో పెరుగుతున్న దూరం సాక్షి, హైదరాబాద్: రాష్ర్ట విభజనకు గడువు సమీపిస్తున్న తరుణంలో ఉద్యోగుల మధ్య చిచ్చు రేగుతోంది. శాఖల వారీగా ఉద్యోగుల పంపిణీ కసరత్తు జరుగుతున్న నేపథ్యంలో ఇరు ప్రాంత ఉద్యోగుల మధ్య రోజురోజుకూ దూరం పెరుగుతోంది. సచివాలయ ఉద్యోగుల స్థానికత వివరాలను ఇటీవల వెల్లడించిన తర్వాత వాతావరణం మరింత వేడెక్కింది. సీమాంధ్ర ఉద్యోగులు తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో స్థానికతను మార్చుకున్నారంటూ తెలంగాణ ఉద్యోగ సంఘాలు చేసిన ఆరోపణలు మాటల యుద్ధానికి తెరలేపాయి. సీమాంధ్ర ఉద్యోగులను తెలంగాణ సచివాలయం గేటు లోపలికి కూడా రానివ్వమంటూ టీఆర్ఎస్ అధ్యక్షుడు కె.చంద్రశేఖర్‌రావు తాజాగా చేసిన వ్యాఖ్యలు.. ఉద్యోగుల మధ్య దూరాన్ని మరింత పెంచాయి. రాజ్యాంగానికి ఎవరూ అతీతులు కారని, ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఎవరైనా నిబంధనలు పాటించాల్సిందేనంటూ సీమాంధ్ర ఉద్యోగులూ ఘాటుగానే స్పందించారు. విభజనపై రెండు రోజులుగా సాగుతున్న ఈ రగడ గురువారం కూడా కొనసాగింది. ఇరు ప్రాంత ఉద్యోగులు తమ వాదనను గట్టిగా వినిపించారు. తప్పుడు పత్రాలతో ఉండాలనుకుంటే అనుమతించం ఉద్యోగుల స్థానికతకు సంబంధించి సీమాంధ్రులు సమర్పించిన సర్టిఫికెట్లలో తప్పుడు ధ్రువపత్రాలు ఉన్నాయని సచివాలయ తెలంగాణ ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు నరేందర్‌రావు ఆరోపించారు. ప్లానింగ్ విభాగంలో 11 మంది సర్టిఫికెట్లను పరిశీలిస్తే అందులో తొమ్మిది మంది తప్పుడు పత్రాలనే సమర్పించినట్లు తేలిందన్నారు. తప్పుడు పత్రాలతో ఇక్కడే కొనసాగాలనుకుంటే అనుమతించే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును అడ్డుకునేందుకు సమ్మె చేసిన ఉద్యోగులు.. ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వంలో పనిచేయాలనుకోవడం ఏ విధంగా ైనె తికత అనిపించుకుంటుందని నిలదీశారు. తప్పుడు ధ్రువీకరణ పత్రాలతో ఇక్కడ కొనసాగే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. జీఏడీ అధికారులు ధ్రువీకరణ పత్రాలను పరిశీలిస్తున్నారని 2 రోజుల్లో అన్ని విషయాలు బయటకు వస్తాయన్నారు. ఇక్కడే పుట్టి పెరిగితే స్థానికులు కారా?: మురళీకృష్ణ ఉద్యోగుల కేటాయింపులు రాజ్యాంగం ప్రకారమే జరుగుతున్నా తప్పుబట్టడం సమంజసం కాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం చైర్మన్ మురళీకృష్ణ అన్నారు. మార్గదర్శకాల ప్రకారం జరుగుతున్న విభజనను అందరూ అంగీకరించాల్సిందేనన్నారు. ఆప్షన్లు ఇస్తే ఒక్క సీమాంధ్ర ఉద్యోగి కూడా తెలంగాణలో ఉండరన్నారు. వివిధ కారణాల వల్ల మహా అయితే పది శాతం మంది మాత్రమే ఉండటానికి ఇష్టపడతారని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక్కడే పుట్టి పెరిగిన వారిని కూడా స్థానికులు కాదనడంలో అర్థం లేదన్నారు. నిబంధనల మేరకు ఎవరు స్థానికులన్న స్పష్టత రాష్ట్రపతి ఉత్తర్వుల్లో ఉందనే విషయాన్ని గుర్తు చేశారు. రాజధాని నిర్మాణం జరగకపోయినా సీమాంధ్రకు వెళ్లి చెట్లకిందైనా ప్రశాంతంగా పనిచేసుకుంటామని చెప్పారు. కొంతమంది నాయకులు రెచ్చగొట్టే వ్యాఖ్యలతో ఉద్యోగుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. తమకూ ఆత్మాభిమానం ఉందని, తమ రాష్ట అభివృద్ధికి తాము పనిచేయాలనే ఆకాంక్ష ఉందన్నారు. చంద్రబాబు స్పందించాలి: అశోక్‌బాబు కేసీఆర్ వ్యాఖ్యలపై స్పందించడానికి ఏపీఎన్జీవోల సంఘం అధ్యక్షుడు అశోక్‌బాబు నిరాకరించారు. తెలంగాణకు కాబోయే సీఎం హోదాలో కేసీఆర్ చేసిన వ్యాఖ్యలపై సీమాంధ్ర కాబోయే సీఎం చంద్రబాబు స్పందించాలని చెప్పారు. కేసీఆర్ స్థాయికి తాను ప్రతి వ్యాఖ్యలు చేయడం తగదన్నారు. కాగా, ఉద్యోగులను రెచ్చగొట్టే విధంగా బాధ్యతాయుతమైన నేతలు మాట్లాడటం సరికాదని సచివాలయ సీమాంధ్ర ఉద్యోగుల ఫోరం కో-చైర్మన్ మురళీమోహన్ అన్నారు. విభజన ప్రక్రియ సాఫీగా పూర్తి కావడానికి తెలంగాణ నేతలు సహకరించాలని, సంయమనం పాటించాలని విజ్ఞప్తి చేశారు. -
కిరికిరి పెడితే కొట్లాటే..
టీ-ఉద్యోగులతో టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఏ ప్రాంత ఉద్యోగులు ఆ రాష్ట్రానికే పనిచేయాలి ఆంధ్రా ఉద్యోగులను సచివాలయం గేట్లు కూడా దాటనివ్వం.. మారుమూల ఉద్యోగులనూ విభజించాల్సిందే జిల్లా, జోనల్ కేడర్‌లో యథాస్థితిని అంగీకరించం.. ఇన్సర్వీస్గా సమ్మె కాలం.. తెలంగాణ ఇంక్రిమెంట్ ఇస్తాం విభజన బిల్లు పాసైన తర్వాత ఇచ్చిన ప్రమోషన్లు, రివర్షన్లు చెల్లవు.. గడువుకు ముందే పీఆర్సీ అమలు చేస్తాం తెలంగాణలో కాంట్రాక్టు ఉద్యోగులే ఉండరు.. ఆర్టీసీ ఉద్యోగులకు ప్రభుత్వ వేతనాలు ఇస్తాం సర్కారు ఏర్పడిన పది రోజుల్లో ప్రమోషన్లు.. అన్ని హామీలు నెరవేరుస్తానని కేసీఆర్ వెల్లడి విభజన వ్యూహం, విధానంపై చర్చ.. జూన్ 2 లోగా ఆంధ్రా ఉద్యోగుల సమాచారమివ్వాలని సూచన సాక్షి, హైదరాబాద్: తెలంగాణకు కాబోయే ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ తాజాగా ఉద్యోగుల విభజనపై దృష్టి సారించారు. ఏ ప్రాంతానికి చెందిన ఉద్యోగులు ఆ రాష్ర్ట ప్రభుత్వానికే పనిచేయాలని ఆయన తేల్చిచెప్పారు. సీమాంధ్ర ప్రాంత ఉద్యోగులను తెలంగాణలో ఉంచితే సహించేది లేదన్నారు. కాదని కయ్యానికి కాలు దువ్వితే, కిరికిరి పెడితే తాము కూడా కొట్లాటకు సిద్ధంగా ఉన్నామని కేసీఆర్ హెచ్చరించారు. ఉద్యోగుల విభజనకు సంబంధించిన వ్యూహం, విధానంపై చర్చించడానికి తెలంగాణ ప్రాంత ఉద్యోగులతో ఆయన ఇక్కడి కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం సమావేశమయ్యారు. వివిధ శాఖలకు చెందిన అన్ని స్థాయిల్లోని ఉద్యోగులు ఈ సమావేశానికి భారీ సంఖ్యలో హాజరయ్యారు. ఈ సందర్భంగా కేసీఆర్ మాట్లాడుతూ.. ప్రభుత్వ శాఖల్లో అన్ని స్థాయిల్లో ప్రస్తుతమున్న సీమాంధ్ర ఉద్యోగులు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంలోనే పనిచేయాలని పునరుద్ఘాటించారు. మారుమూల ప్రాంతాల్లో ఉన్న ఉద్యోగులను కూడా స్థానికత ఆధారంగా విభజించాల్సిందేనని స్పష్టం చేశారు. ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ సచివాలయం గేట్లు కూడా దాటనివ్వబోమని వ్యాఖ్యానించారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగుల జాబితాను టీఆర్ఎస్ ఏర్పాటు చేసిన వార్‌రూమ్ కమిటీకి అందించాలని టీ-ఉద్యోగులకు సూచించారు. ఈ పర్యవేక్షణ కమిటీ శనివారం నుంచి పనిచేస్తుందని చెప్పారు. ఉద్యోగుల్లేకుంటే ఉద్యమమే లేదు తెలంగాణ రాష్ట్రం కోసం ఉద్యోగులు త్యాగాలకు సిద్ధపడి రాజీలేని పోరాటం చేశారని, ఉద్యోగుల్లేకుంటే ఉద్యమమే లేదని కేసీఆర్ కొనియాడారు. సకల జనుల సమ్మె వంటి అద్భుత దృశ్యకావ్యాన్ని కళ్లెదుట ఆవిష్కరించారని గుర్తుచేశారు. ఈ సమ్మె కాలాన్ని ఇన్సర్వీసుగా పరిగణిస్తామని చెప్పారు. జీతం రాకపోతే మిత్తితో కలిపి ఇస్తామన్న మాటకు కట్టుబడి ఉన్నామని స్పష్టం చేశారు. తెలంగాణ ఉద్యోగులకు గతంలో ఇచ్చిన అన్ని హామీలను అమలుచేస్తామని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వ ఉద్యోగులకు తెలంగాణ స్పెషల్ ఇంక్రిమెంట్ ఉంటుందన్నారు. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులతో సమానంగా జీతాలిస్తామని చెప్పారు. ఇంక్రిమెంట్ల విషయంలో రాష్ట్ర ప్రభుత్వ విధానమే బాగుందని, దాన్ని కొనసాగిస్తేనే ఉద్యోగులకు మేలు కలుగుతుందని కేసీఆర్ వివరించారు. గడువులోపే వేతన సవరణ కమిషన్ (పీఆర్సీ) అమలు చేస్తామని స్పష్టం చేశారు. తెలంగాణ ప్రభుత్వంలో కాంట్రాక్టు ఉద్యోగులు ఉండరని చెప్పారు. ఆర్టీసీ, సింగరేణి కార్మికుల సమస్యలను పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆర్టీసీ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వ స్థాయి జీతాలు చెల్లిస్తామని హామీ ఇచ్చారు. మహిళా ఉద్యోగులకు మెటర్నిటీ, చైల్డ్ కేర్‌కు సంబంధించిన సడలింపుల విషయాన్ని పరిశీలిస్తామన్నారు. ప్రభుత్వ కార్యాలయాల్లో పరిశుభ్రంగా ఉండే లంచ్‌రూమ్‌లు, టాయిలెట్లను ఏర్పాటు చేస్తామన్నారు. జిల్లాలకు వచ్చినప్పుడు అక్కడే టీఎన్జీవో కార్యాలయంలో ఉద్యోగులతో కచ్చితంగా సమావేశమవుతానని కేసీఆర్ చెప్పారు. ప్రభుత్వం రాగానే శాఖలవారీగా డీపీసీలు ఏర్పాటుచేస్తామని, 10-12 రోజుల్లోనే పదోన్నతులు ఇస్తామన్నారు. ఆ తర్వాత వచ్చే రెండు నెలల్లోనే కింది స్థాయిలో ఉద్యోగాలను భర్తీ చేస్తామని హామీనిచ్చారు. తమ ప్రభుత్వం ఉద్యోగులతో స్నేహపూర్వకంగా ఉంటుందన్నారు. ఐఏఎస్‌లు, కలెక్టర్ల వంటి అధికారుల దబాయింపులుండవని కేసీఆర్ పేర్కొన్నారు. వారు కూడా కింది స్థాయి ఉద్యోగులతో ప్రజాస్వామిక భాషలోనే మాట్లాడాలన్నారు. ఏ సమస్య ఉన్నా చర్చించుకుందామని హితవు పలికారు. సమస్యల పరిష్కారం కోసం ఇందిరాపార్కులు, దర్నా చౌక్ల అవసరమే లేదని ఆయన వ్యాఖ్యానించారు. యథాతథ స్థితి ప్రసక్తే లేదు జిల్లా, జోనల్ కేడర్‌లో యథాతథ స్థితిని అంగీకరించే ప్రసక్తే లేదని కేసీఆర్ తేల్చి చెప్పారు. ఈ విషయంలో ఎంత వరకైనా సిద్ధపడతామన్నారు. తెలంగాణలో పనిచేస్తున్న ఆంధ్రా ఉద్యోగులకు సంబంధించిన సమాచారాన్ని ఎవరి కార్యాలయాల్లో వారు యూనియన్ నేతలకు జూన్ 2లోగా అందించాలని ఉద్యోగులకు కేసీఆర్ సూచించారు. దీనికోసం దేవీ ప్రసాద్ అధ్యక్షతన స్వామిగౌడ్, శ్రీనివాస్‌గౌడ్, సి.విఠల్ సహా 10 మందితో వార్‌రూమ్ కమిటీని ఏర్పాటు చేసినట్లు కేసీఆర్ గుర్తుచేశారు. అలాగే రాష్ర్ట విభజన బిల్లు ఆమోదం పొందిన తర్వాత రాష్ర్టంలో అమలైన ప్రమోషన్లు, రివర్షన్లు చెల్లవన్నారు. ప్రభుత్వం ఏర్పాటుకాగానే వీటిని సమీక్షిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగుల విభజన ప్రక్రియ ఇప్పటికే పూర్తయినట్లు మీడియాలో వస్తున్న కథనాలు నిజం కావన్నారు. రెండు రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పాటైన తర్వాతనే ఆ ప్రక్రియ ఉంటుందన్నారు. ఉద్యమ నేతగా ఉన్నా, ప్రభుత్వ అధినేతగా ఉన్నా ఆంధ్రా ఉద్యోగుల వైఖరిలో మార్పులేదన్నారు. తెలంగాణ ఉద్యోగులను ఎట్టి పరిస్థితుల్లోనూ ఇబ్బంది పెట్టనని కేసీఆర్ స్పష్టం చేశారు. ఇక్కడే ఉంటే శంకరగిరి మాన్యాలే ఆంధ్రాకు చెందిన ఉద్యోగులను తెలంగాణలోనే కొనసాగిస్తే వారికి శంకరగిరి మాన్యాలే గతి అని టీఆర్ఎస్ అధినేత, ఆ పార్టీ శాసనసభాపక్ష నేత కె.చంద్రశేఖర్‌రావు హెచ్చరించారు. తెలంగాణ ఉద్యోగ సంఘాల ముఖ్య నేతలతో ఇక్కడి కొంపల్లిలోని ఆర్డీ కన్వెన్షన్ సెంటర్లో గురువారం ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ భేటీకి మీడియాను అనుమతించలేదు. విశ్వసనీయవర్గాల సమచారం ప్రకారం.. ఈ సమావేశంలో ప్రధానంగా ఉద్యోగుల విభజనకు సంబంధించిన అంశాలపైనే కేసీఆర్ మాట్లాడారు. ‘ఉద్యోగుల విభజన ఇంకా జరగలేదు. రెండు రాష్ట్రాలకు ముఖ్యమంత్రులు ప్రమాణ స్వీకారం చేసిన తర్వాతే ఆ ప్రక్రియ జరుగుతుంది. దీనిపై మీడియాలో వస్తున్నదంతా అవాస్తవం. వాటిని పట్టించుకోవద్దు. ప్రస్తుతానికి ప్రభుత్వాలు నడవడానికి తాత్కాలిక ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ విషయాన్ని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శే నాకు చెప్పారు. అఖిల భారత సర్వీసుల్లోని అధికారుల విభజన మాత్రమే కేంద్ర ప్రభుత్వం చేతుల్లో ఉంది. మిగిలినవన్నీ రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్యనే ఉంటాయ’ని కేసీఆర్ వివరించారు. ‘ఆంధ్రా ఉద్యోగులను తెలంగాణ ప్రభుత్వానికి ఇచ్చి పనిచేసుకొమ్మంటే ఎలా? కొత్త ప్రభుత్వానికి స్వేచ్ఛ ఉండొద్దా? తెలంగాణ పునర్నిర్మాణంలో ఎన్నో ఉంటయి. ప్రాజెక్టులు, పథకాలు, అభివృద్ధి వంటి ఎన్నో రహస్యమైన పనులుంటయి. అవన్నీ లీకు కావా? అందుకే ఎవరితోనూ కయ్యం వద్దు. మంచిగా చెప్తం. తెలంగాణలో పనిచేసే ఆంధ్రా ఉద్యోగులను తీసుకోవాలని ఆంధ్రా ప్రభుత్వానికి ముందగా లేఖ రాస్తా. ఏ ప్రాంత ఉద్యోగులు ఆ ప్రాంతంలో హాయిగా పనిచేసుకోవాలంటున్నా. అయినా వినకుండా బలవంతంగా ఇక్కడే ఉద్యోగులుంటే వారికి శంకరిగిరి మాన్యాలే గతి. జీతాలు, పెన్షన్లు రాకుండా చూద్దాం. ప్రాధాన్యత లేని లూప్లైన్లో వారిని వేద్దాం. ఇంకేమన్నా ఇబ్బందులుంటే పెడతం. వారు కోర్టుకు పోతరు. అవన్నీ నడుస్తనే ఉంటయి’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ‘తప్పుడు ధ్రువ పత్రాలు సృష్టించినా.. ఎవరి స్థానికత ఏమిటో పక్కనే పనిచేస్తున్న ఉద్యోగులకు తెలియకుండా పోదు. ఏ ఉద్యోగి ఎక్కడి వారో అన్ని వివరాలను సేకరించండి. ఆంధ్రా ఉద్యోగి అయితే పుట్టుమచ్చలు ఎక్కడున్నాయో కూడా మనం ఏర్పాటు చేసిన వార్‌రూమ్ కమిటీకి చెప్పండి. అవన్నీ జూన్ 2లోగా చేస్తే రెండు రాష్ట్ర ప్రభుత్వాల మధ్య జరిగే పంపిణీలో మాట్లాడుతం. ఎక్కడి వారిని అక్కడకు పంపుతం. అయినా బలవంతంగా ఎవరైనా ఉంటామంటే ప్రధానికి చూపించడానికి సాక్ష్యాలు పట్టుకరండి’ అని కేసీఆర్ సూచించారు. మంత్రి పదవి ఎవరికి? ఉద్యోగ సంఘాల నుంచి వచ్చిన ఒకరిని మంత్రిని చేసుకుందామని ఉద్యోగులతో సమావేశంలో కేసీఆర్ చెప్పారు. దీనికి స్పందించిన ఉద్యోగులు... ప్రస్తుతం తమ తరఫు నుంచి టీఆర్ఎస్లో ఓ ఎమ్మెల్యే, మరో ఎమ్మెల్సీ ఉన్నారని, వారిద్దరికీ మంత్రి పదవులను ఇవ్వాలని కోరారు. సరే చూద్దాంలే అని కేసీఆర్ దాటవేశారు. ఇక కొందరు ఉద్యోగులు.. ఇళ్ల స్థలాలు, బదిలీలు, ప్రమోషన్లు వంటి విషయాల గురించి ప్రస్తావించినప్పుడు కేసీఆర్ నుంచి మౌనమే సమాధానమైంది. పుంటికూర చాలదా? ‘స్థానికతను గుర్తించడానికి 50 ఏళ్ల నుంచి రాద్ధాంతం చేస్తున్నరు. టీడీపీ హయాంలో నేను మంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇది చర్చకు వచ్చింది. నేను అప్పుడే అన్నా. సచివాలయంలో సాయంత్రం పని అయిపోయినంక ఒక చేతిలో పుంటికూర పట్టుకుని, మరోచేతిలో ఆనెపు కాయను పట్టుకుని గేటుకాడ నిలబడుదాం. గేటుకాడికి వచ్చిన ఉద్యోగికి పుంటికూర చూపించి ఇది ఏందని అడుగుతం. పుంటికూర అన్నోళ్లను తెలంగాణ దిక్కు, గోంగూర అన్నోళ్లను ఆంధ్రాకు పంపిద్దామని అప్పుడే చెప్పిన. ఇప్పుడు కూడా స్థానికత విషయంలో పెద్ద లొల్లి అవసరం లేదు. ఎవరెక్కడివాళ్లో వట్టిగనే తెలుస్తది’ అని కేసీఆర్ వ్యాఖ్యానించారు. ఈ సమావేశంలో ఉద్యోగ సంఘాల నేతలు దేవీ ప్రసాద్, సి.విఠల్, కారెం రవీందర్ రెడ్డి, ఎస్.ఎం.హుస్సేని ముజీబ్, కృష్ణ యాదవ్, ఎం.మణిపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సస్పెన్స్..!
ఖమ్మం కలెక్టరేట్, న్యూస్‌లైన్: ఇటు తెలంగాణ, అటు సీమాంధ్ర ప్రభుత్వాలు ఏర్పడిన తర్వాతే జిల్లాలోని పోలవరం ముంపు గ్రామాల భవితవ్యం పూర్తిస్థాయిలో తేలనుంది. పార్లమెంటు ఆమోదించిన ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం - 2014లో పేర్కొన్న విధంగా అపాయింటెడ్ డే తర్వాత 136 రెవెన్యూ గ్రామాలు సాంకేతికంగా జిల్లా నుంచి విడిపోయి సీమాంధ్రలో కలుస్తాయి. అయితే.. ఈ గ్రామాల పరిపాలన, ఇక్కడి ప్రజలకు పునరావాసం, మౌలిక సదుపాయాల కల్పన ఏ ప్రభుత్వం చూడాలనే దానిపై మాత్రం తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వాల ప్రతినిధులు సమావేశమై నిర్ణయం తీసుకోనున్నారు. ఈ నిర్ణయాన్ని కేంద్రానికి తెలియపరిస్తే ఆ మేరకు ఆర్టినెన్స్లో పేర్కొని ఆమోదిస్తారు. రెండు ప్రభుత్వాల మధ్య సయోధ్య కుదరని పక్షంలో కేంద్రమే తుది నిర్ణయం తీసుకుంటుందని అధికార వర్గాలు చెప్పాయి. అయితే, ఈలోపు ముంపు ప్రాంతాలను తూర్పు, పశ్చిమగోదావరి జిల్లాల్లో కలుపుతూ, ఏ గ్రామం ఏ ఎంపీటీసీ స్థానం పరిధిలోనికి వెళుతుంది... ఏ జడ్పీటీసీ స్థానం కిందకు వెళుతుంది అనే అంశాలపై నోటిఫికేషన్ వెలువడనుంది. కేంద్ర అధికారితో కలెక్టర్ భేటీ... పోలవరం ముంపు గ్రామాల పరిస్థితిపై చర్చించేందుకు కలెక్టర్ శ్రీనివాస శ్రీనరేశ్ మంగళవారం రాజ్‌భవన్‌లో కేంద్ర ఉన్నతాధికారి రాజీవ్‌శర్మతో సమావేశమయ్యారు. రాష్ట్ర విభజన విషయంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య సంధానకర్తగా వ్యవహరిస్తున్న రాజీవ్‌శర్మ కలెక్టర్‌ను అడిగి అన్ని వివరాలు తెలుసుకున్నారు. పోలవరం ముంపునకు గురయ్యే ప్రాంతాలు కనుక ప్రాజెక్టు నిర్మాణం పూర్తయ్యే వరకు ఆ ప్రాంతాల పరిస్థితి ఏమిటి? అక్కడి ప్రజల పాలన ఎలా? పన్నుల వసూళ్లు ఎలా చేయాలి? వారికి పునరావాసం ఏ ప్రభుత్వం కల్పించాలి? అందుకు సంబంధించిన నిధులెక్కడి నుంచి వస్తాయి? అసలు పునరావాసం కింద గోదావరి జిల్లాలకు వెళ్లాలంటే అక్కడి ప్రజలు అంగీకరిస్తారా? అంగీకరించని పక్షంలో ఖమ్మం జిల్లాలోనే పునరావాసం కల్పించే అవకాశం ఉందా? అనే అంశాలపై సమగ్ర వివరాలను తెలుసుకున్నారు. అయితే, పునరావాస కల్పన బాధ్యత తెలంగాణ ప్రభుత్వానికి అప్పజెపుతారని, ఇందుకు సంబంధించిన నిధులను మాత్రం కేంద్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందని అధికార వర్గాలంటున్నాయి. ఆర్డినెన్స్ వచ్చిన తర్వాతే పరిపూర్ణం... కాగా, పునర్వ్యవస్థీకరణ చట్టం వచ్చిన తర్వాత కేంద్ర కేబినెట్ సబ్ కమిటీ తీసుకున్న కొన్ని మార్పుల మేరకు కొత్తగా ఏర్పడే కేంద్ర ప్రభుత్వం ఆర్డినెన్స్ తేవాల్సి ఉంది. ఈ ఆర్డినెన్స్ ద్వారా బూర్గంపాడు మండలంలోని ఐదు గ్రామాలను మళ్లీ తెలంగాణలోకి తేవాల్సి ఉంది. దీంతోపాటు కొత్తగా ఏర్పడే రెండు ప్రభుత్వాల అభిప్రాయం మేరకు కూడా ఆర్డినెన్స్‌లో కొన్ని మార్పులు చేసే అవకాశం ఉంది. అయితే, మొదటి నుంచీ భద్రాచలం పట్టణంతో సహా ఆ డివిజన్ మొత్తాన్ని పూర్తిగా సీమాంధ్రలోనే విలీనం చేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తోంది. కేంద్రంలో కూడా సాధారణ మెజారిటీతో ఆ పార్టీనే అధికారంలోకి వచ్చింది. ఈ నేపథ్యంలో బీజేపీ ప్రభుత్వం తీసుకువచ్చే ఆర్డినెన్స్‌లో భద్రాచలాన్ని పూర్తిగా సీమాంధ్రలో కలుపుతారనే ప్రచారం కూడా జరుగుతోంది. మరోవైపు ప్రాజెక్టు ఇప్పుడప్పుడే పూర్తయ్యే అవకాశం లేనందున ముంపు ప్రజలను ఇప్పుడే సీమాంధ్ర పాలనలోనికి తీసుకెళ్లడం ఇబ్బందేననే ఆందోళన అధికారుల్లో వ్యక్తమవుతోంది. అక్కడి ప్రజలకు తూర్పు, పశ్చిమ గోదావరి జిల్లా కేంద్రాల కన్నా ఖమ్మంతోనే అనుబంధం ఎక్కువ ని, వారిని ఇక్కడ ఉంచడమే మేలని, పునరావాసం కూడా ఇక్కడే కల్పిస్తే, ముంపు ప్రాంతంలోని భూభాగాన్ని మాత్రమే సీమాంధ్రలో కలపవచ్చనే వాదన కూడా అధికార వర్గాల్లో వినిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇరు రాష్ట్ర ప్రభుత్వాల నిర్ణయాలే ముంపు ప్రాంతాల భవిష్యత్తును తేల్చడంలో కీలకం కానున్నాయి. -
వైద్యుల విభజన సంక్లిష్టం
హైదరాబాద్‌లో 2 వేల మందికిపైగా సీమాంధ్ర వైద్యులు ఒక్కసారిగా వెళితే వైద్య సేవలకు విఘాతం వాళ్లంతా వెళ్లాల్సిందేనంటున్న తెలంగాణ ప్రభుత్వ వైద్యులు తమకు ఆప్షన్లు ఇవ్వాలని కోరుతున్న సీమాంధ్ర ప్రాంత వైద్యులు హైదరాబాద్: రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరాబాద్‌లోని వివిధ ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆస్పత్రులు, వైద్యవిధాన పరిషత్ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న వైద్యుల విభజన సంక్లిష్టతకు దారి తీస్తోంది. హైదరాబాద్‌లోని ఆస్పత్రుల్లో సింహభాగం సీమాంధ్రకు చెందిన వైద్యులు ఉండటమే దీనికి కారణం. నగరంలో వివిధ ఆస్పత్రుల్లో పనిచేస్తున్న సీమాంధ్ర వైద్యుల సంఖ్య రెండు వేలకు పైనే ఉంటుందని అంచనా. ఒక్క ఉస్మానియా ఆస్పత్రి, వైద్య కళాశాలలోనే నాలుగు వందల మంది పైగా స్పెషాలిటీ వైద్యులు ఉన్నారు. గాంధీ ఆస్పత్రిలోనూ వారు నాలుగు వందల మందిపైనే ఉన్నట్టు అంచనా. అంతేకాదు ఆరోగ్య సంచాలకుల పరిధిలో ఉన్న 80 ఉన్నత ప్రాథమిక ఆరోగ్య కేంద్రా ల్లో 50 శాతం మంది వైద్యులు సీమాంధ్రకు చెందిన వారే. సరోజిని దేవి కంటి ఆస్పత్రి, ఎంఎన్‌జే క్యాన్సర్ ఆస్పత్రి, మెటర్నిటీ ఆస్పత్రులు ఇలా అన్ని ఆస్పత్రుల్లోనూ మెజారిటీ వైద్యులు సీమాంధ్రకు చెందిన వారే ఉన్నారని అధికార వర్గాలు చెప్తున్నాయి. అయితే రాష్ట్రవ్యాప్తంగా స్పెషలిస్టు వైద్యుల కొరత ఉంది. పైగా హైదరాబాద్‌లో కోటి మందికి పైగా జనాభా ఉంది. ఈ పరిస్థితుల్లో ఒక్కసారిగా 2,000 మందికి పైగా వైద్యులు నగరాన్ని వదిలి వెళితే పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. కానీ.. ఇక్కడి సీమాంధ్ర వైద్యులు విధిగా తమ రాష్ట్రానికి వెళ్లాల్సిందేనని, ఎంతో మంది వైద్య డిగ్రీలు పొంది నిరుద్యోగులుగా ఉన్నారని, వాళ్లలో చాలా మందికి అవకాశం లభిస్తుందని, సీనియర్ వైద్యులందరికీ పదోన్నతులు లభిస్తాయని తెలంగాణ ప్రభుత్వ వైద్యుల సంఘం అంటోంది. పైగా ఎన్నో ఏళ్ల నుంచి హైదరాబాద్‌లోనే పనిచేస్తూ, ప్రైవేటు క్లినిక్‌లు ఏర్పాటు చేసుకుని స్థిరపడిన చాలా మంది సీమాంధ్ర వైద్యులు రాష్ట్ర విభజన తర్వాత అక్కడికి వెళ్లడానికి ససేమిరా అంటున్నారు. రెండేళ్ల లోపు సర్వీసు ఉన్న చాలామంది సీమాంధ్రకు చెందిన వైద్యులు తమకు ఆప్షన్లు ఇవ్వాలని, ఒక వేళ నిజంగా సీమాంధ్రకు వెళ్లాల్సి వస్తే రాజీనామా చేసేందుకు వెనుకాడమని స్పష్టం చేస్తున్నారు.