ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి.
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్లో టీడీపీ, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ హోరాహోరీగా తలపడ్డాయి. కర్నూలు, చిత్తూరు, ప్రకాశం, నెల్లూరు, వైఎస్ఆర్ జిల్లాల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తి ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తే...గుంటూరు, కృష్ణా,పశ్చిమ గోదావరి, తూర్పు గోదావరి, విశాఖపట్నం, విజయనగరం, శ్రీకాకుళం జిల్లాల్లో సైకిల్ స్పీడ్‌ను ఫ్యాన్ గాలి అడ్డుకోలేపోయింది.
కర్నూలు, నంద్యాల, తిరుపతి, నెల్లూరు, ఒంగోలు, కడప, రాజంపేట, అరకు లోక్‌సభ స్థానాలను వైఎస్ఆర్ కాంగ్రెస్ గెల్చుకుంటే... అనంతపురం, హిందూపురం, చిత్తూరు, గుంటూరు, బాపట్ల, నరసరావుపేట, విజయవాడ, మచిలీపట్నం, ఏలూరు, రాజమండ్రి, కాకినాడ, అమలాపురం, అనకాపల్లి, విజయనగరం, శ్రీకాకుళం లోక్‌సభ స్థానాలను టీడీపీ కైవసం చేసుకుంది. నరసాపురం లోక్‌సభ సీటును బీజేపీ కైవసం చేసుకుంది.
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ, టీడీపీ, ఆంధ్రప్రదేశ్, ఎన్నికలు 2014, సీమాంధ్ర, ysr congress party, tdp, andhra pradesh, seemandhra