ప్రత్యేక హోదాకు ఊపిరిపోసింది వైఎస్‌ జగనే | YSRCP Leader Comments On TDP And BJP Governments YSR Kadapa | Sakshi
Sakshi News home page

ప్రత్యేక హోదాకు ఊపిరిపోసింది వైఎస్‌ జగనే

Published Sat, Jul 28 2018 8:55 AM | Last Updated on Sat, Mar 23 2019 9:10 PM

YSRCP Leader Comments On TDP And BJP Governments YSR Kadapa - Sakshi

సమావేశంలో మాట్లాడుతున్న పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి

నందలూరు (వైఎస్సార్‌ కడప): రాష్ట్రానికి ప్రత్యేక హోదా కావాలని నాలుగు సంవత్సరాలపాటు ఏకధాటిగా పోరాడుతూ ఊపిరి పోసిన ఏకైక వ్యక్తి వైఎస్సార్‌సీపీ అధ్యక్షుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి అని వైఎస్సార్‌సీపీ విద్యార్థివిభాగం జిల్లా ప్రధానకార్యదర్శి పల్లె గ్రీశ్మంత్‌రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్సార్‌సీపీ ట్రేడ్‌యూనియన్‌ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. 2014 ఎన్నికల ముందు టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు రాష్ట్రానికి 15 సంవత్సరాలపాటు ప్రత్యేకహోదా ఇస్తామని హామీలు ఇచ్చి... 5 కోట్ల ఆంధ్రులను మోసం చేశాయని విమర్శించారు.

వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డికి ప్రత్యేకహోదా మీదఉన్నంత చిత్తశుద్ధి చంద్రబాబుకు లేదన్నారు. వైఎస్‌ జగన్‌కు వస్తున్న ప్రజాధరణచూసి ఓర్వలేక మిగతాపార్టీలన్నీ కలిసి ఆయనమీదు బురదచల్లుతున్నాయని విమర్శించారు. రానున్న ఎన్నికల్లో వైఎస్సార్‌సీపీ అ«త్యధిక మెజార్టీతో గెలిచి వైఎస్‌ జగన్‌ ముఖ్యమంత్రి కావడం తథ్యమని ఆయన అన్నారు. వైఎస్సార్‌సీపీ నాయకులు గంగయ్య, ఆనంద్‌కుమార్, నరసింహులు, సుబ్బయ్య, మహబూబ్‌బాషా, నరసింహ, శివకుమార్, భాస్కరయ్య, మధు, సుధాకర్, శంకర్, బాలసుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement