కల్లూరు రూరల్, న్యూస్‌లైన్ : టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు కోస్తాంధ్రపై కులాభిమానం చూపవద్దని, సీమాంధ్ర రా ష్ట్ర రాజధానిని కర్నూలులోనే ఏర్పాటు చేయాలని కర్నూలు రాజధాని సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. ఆదివారం నగరంలోని కశిరెడ్డి శ్యాలమ్మ సత్రంలో సమితి నాయకులు వి.జనార్దన్‌రెడ్డి, జి.పుల్లయ్య, కె.చెన్నయ్య, సంజీవరెడ్డి, విజయకుమార్‌రెడ్డి, సోమశేఖర్‌గౌడ్, పి.బి.వి.సుబ్బయ్య, సంపత్‌కుమార్ విలేకరులతో మాట్లాడారు. కేంద్ర కమిటీ పర్యటన పూర్తి కాక మునుపే రాజధాని ఏర్పాటుకు ఎలా నిర్ణయం తీసుకుంటారని ప్ర శ్నించారు.
మద్రాసు విడిపోయినప్పుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశంపంతులు సూచన మేరకు అప్పట్లో కర్నూలును రాజ ధాని చేశారని, ఇక్కడ సీమాంధ్రకు రాజ ధాని పెట్టకపోతే ప్రకాశం పంతులును అవమానించిన వారవుతారని అన్నారు. కర్నూలు సీమాంధ్రకు కేంద్ర బిందువుగా లేదనే సాకుతో ఇక్కడ రాజధాని ఏర్పాటు చేయాలనే విషయాన్ని విస్మరిస్తున్నారని పేర్కొన్నారు. ఢిల్లీ, హైదరాబాదులు కూ డా ఖచ్చితమైన కేంద్ర బిందువులుగా లేవ ని గుర్తు చేశారు. ఇప్పటికే సమైక్యాంధ్ర కో సం పోరాటాలు చేశామని, రాజధాని దక్కకపోతే మరో ఉద్యమం తప్పదని హెచ్చరించారు. అనంతరం కర్నూలు రాజధాని కావాలంటూ నినాదాలు చేశారు.
కర్నూలులో రాజధాని ఏర్పాటు చేయాలి
Published Mon, May 19 2014 12:27 AM | Last Updated on Fri, Aug 10 2018 8:06 PM
Advertisement