
రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేశ్ కుమారుడు టీజీ భరత్(పాత చిత్రం)
కర్నూలు : జిల్లా టీడీపీలో మళ్లీ కుర్చీ కొట్లాట రాజుకుంది. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జిల్లా నుంచి పోటీ చేస్తే 14 సీట్లు టీడీపీ సొంతం అవుతాయని అన్నారు.
చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయలేని పక్షంలో సర్వే ప్రకారం గెలిచే వారికే కర్నూలు సీటు కేటాయించాలని కోరారు. కొంతకాలంగా స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్‌ల మధ్య సీటు పోరు కొనసాగుతోంది. ఇటీవల మంత్రి లోకేష్, కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల ప్రకటనతో టీజీ వర్గం ఆత్మరక్షణలో పడింది. తాజా టీజీ వ్యాఖ్యలతో మళ్లీ సీటు వివాదం తెరపైకి వచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment