tg bharath
-
మంత్రి టీజీ భరత్ కు వరుదు కళ్యాణి కౌంటర్
-
మంత్రి టీజీ భరత్ పై ఎస్వీ మోహన్ రెడ్డి ఫైర్
-
నేనే మంత్రి..!?
సార్వత్రిక పోరు ముగిసింది. కూటమి అధికారంలోకి వచ్చింది. త్వరలోనే కూటమి నేతగా నారా చంద్రబాబునాయుడు ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేయనున్నారు. ఈ క్రమంలో చంద్రబాబు మంత్రివర్గంలో ఎవరికి చోటు లభిస్తుందనే చర్చ కర్నూలు, నంద్యాల జిల్లాలో మొదలైంది. 2004 తర్వాత అత్యధిక స్థానాల్లో తెలుగుదేశంపార్టీ విజయం సాధించడంతో మంత్రి పదవి ఆశించేవారి సంఖ్య కూడా పెరిగింది.నంద్యాల జిల్లా కొత్తగా ఏర్పడిన తర్వాత టీడీపీ ప్రభుత్వం ఏర్పాటు కాబోతోంది. దీంతో కొత్త జిల్లాల ప్రాతిపదికన జిల్లాకో మంత్రి పదవి ఇస్తారా? లేదా ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన ఒకే మంత్రి పదవి ఇస్తారా? అనే చర్చ కూడా జోరుగా సాగుతోంది. సీనియర్ నేతలకు మంత్రి పదవి దక్కుతుందని అధిక శాతం నేతలు భావిస్తున్నా, సామాజిక సమీకరణల నేపథ్యంలో తమకూ అవకాశం దక్కుతుందని తొలిసారి అసెంబ్లీకి వెళ్లే నేతలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.సాక్షి ప్రతినిధి కర్నూలు: ఉమ్మడి కర్నూలు జిల్లాలోని రెండు ఎంపీలతో పాటు 12 అసెంబ్లీలు కూటమి అభ్యర్థులు గెలుపొందారు. ఆదోనిలో బీజేపీ అభ్యర్థి పార్థసారథి ఎమ్మెల్యేగా గెలుపొందితే, తక్కిన 11 చోట్ల టీడీపీ అభ్యర్థులు విజయం సాధించారు. ఆలూరు, మంత్రాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలుగా విరూపాక్షి, బాలనాగిరెడ్డి గెలుపొందారు. టీడీపీ అభ్యర్థుల్లో మంత్రి వర్గంలో కేంద్ర మాజీ మంత్రి కోట్ల జయసూర్యప్రకాశ్‌రెడ్డి ముందు వరుసలో ఉన్నారు.సార్వత్రిక పోరులో ప్రకాశ్‌రెడ్డితో పాటు ఆయన సతీమణి సుజాతమ్మ టిక్కెట్లు ఆశించారు. అయితే ఆమెకు టిక్కెట్ ఇవ్వలేమని, డోన్ అసెంబ్లీ నుంచి బరిలోకి దిగాలని.. గెలిస్తే మంత్రివర్గంలోకి తీసుకుంటామని చంద్రబాబు హామీ ఇచ్చారనే చర్చ కోట్ల వర్గంలో నడుస్తోంది. దీంతో ప్రకాశ్‌రెడ్డికి కచ్చితంగా మంత్రివర్గంలో చోటు లభిస్తుందనే ఆశాభావం ఆయన వర్గీయుల్లో కనిపిస్తోంది. కోట్ల అసెంబ్లీకి వెళ్లడం ఇదే తొలిసారి. గతంలో ఆదోని నుంచి పోటీ చేసి మీనాక్షినాయుడు చేతిలో ఓడిపోయారు. అయితే కర్నూలు ఎంపీగా ఆయన పలుసార్లు ప్రాతినిథ్యం వహించారు. కేంద్రమంత్రిగా కూడా పని చేశారు.నంద్యాల జిల్లా నుంచి రేసులో ముగ్గురు..నంద్యాల జిల్లా బనగానపల్లి ఎమ్మెల్యే బీసీ జనార్ధన్‌రెడ్డి కూడా మంత్రివర్గంలో చోటు ఆశిస్తున్నారు. 2014లో తొలిసారి అసెంబ్లీకి వెళ్లిన బీసీ, 2019లో ఓటమి చెందారు. తిరిగి 2024లో విజయం సాధించారు. నంద్యాల జిల్లాలో సీనియర్ ఎమ్మెల్యేగా ఉన్న బీసీ కూడా కేబినెట్ బెర్త్‌పై ఆశపెట్టుకున్నారు. ఇదే జిల్లాలో భూమా అఖిలప్రియ కూడా మంత్రివర్గంలో చోటుపై ధీమాగా ఉన్నారు. 2014లో వైఎస్సార్సీపీ తరఫున గెలిచిన అఖిలప్రియ ఆపై తన తండ్రి భూమా నాగిరెడ్డి సమక్షంలో టీడీపీలో చేరారు.నాగిరెడ్డి మృతి తర్వాత అఖిలకు మంత్రివర్గంలో చోటు కల్పించారు. పర్యాటక శాఖ మంత్రిగా చేసిన అఖిల ఈ దఫా కూడా మహిళల కోటాలో తనకు అవకాశం వస్తుందనే ధీమాతో ఉన్నారు. అలాగే నంద్యాల ఎమ్మెల్యే ఫరూక్ కూడా మంత్రి వర్గంలో చోటుపై ఆశలపల్లకిలో ఉన్నారు. 1999లో మంత్రిగా పని చేసిన అనుభవం కూడా ఉంది. మైనార్టీ నేత కావడం, రాయలసీమలో మదనపల్లి, నంద్యాల మాత్రమే మైనారీ్టలకు టిక్కెట్లు ఇచ్చారు. ఇద్దరూ గెలుపొందినా వీరిలో ఫరూక్ సీనియర్ కావడంతో మైనార్టీ కోటాలో కచ్చితంగా చోటు దక్కుతుందనే ఆశతో ఉన్నారు.పార్థసారథిని అదృష్టం వరించేనా? కర్నూలు జిల్లాలో తొలిసారి బీజేపీ ఎమ్మెల్యేగా ఆదోని నుంచి పార్థసారథి గెలుపొందారు. వాల్మీకి సామాజికవర్గానికి చెందిన ఈయనకు మంత్రివర్గంలో చోటు దక్కే అవకాశాలున్నాయి. కర్నూలు, అనంతపురంలో బలమైన సామాజికవర్గంగా వాల్మీకులు, కురబలు ఉన్నారు. అనంతపురం జిల్లా రాయదుర్గం, గుంతకల్లులో కాలవ శ్రీనివాసులు, గుమ్మనూరు జయరాం ఉన్నారు. వీరిద్దరికీ మంత్రి పదవుల అనుభవం ఉంది. అయితే అనంతపురం జిల్లాలో పోటీ ఎక్కువగా ఉంది.కురబ, వాల్మీకులకు చెరో మంత్రి పదవి ఇవ్వాలని భావిస్తే సత్యసాయి జిల్లా పెనుకొండ ఎమ్మెల్యే సవితకు చోటు దక్కే అవకాశం ఉంది. ఈ క్రమంలో కాలవ, గుమ్మనూరు, పార్థసారథిలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉంది. ఒక బీసీకి అనంతపురంలో ఇస్తే, మరో బీసీకి ఇచ్చే అవకాశం తక్కువగా ఉండొచ్చు. ఈక్రమంలో వాల్మీకి వర్గం నుంచి పార్థసారథిని మంత్రి పదవి వరించే అవకాశం ఉన్నట్లు చర్చ జరుగుతోంది.పైగా ఇతను బీజేపీ నేత కావడంతో.. ఆ పారీ్టకి కూడా కనీసం 2 మంత్రి పదవులు దక్కే అవకాశం ఉండటంతో పార్థసారథికి అదృష్టం వరించవచ్చనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఏదేమైనా కర్నూలు, నంద్యాల జిల్లాలో అత్యధిక స్థానాలు గెలుచుకున్న కూటమి అభ్యర్థుల్లో దాదాపు సగం మంది మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. వీరిలో ఎవరికి అమాత్యయోగం ఉందో వేచిచూడాలి.టీజీ, కేఈలు కూడా మంత్రివర్గంపై ఆశలు..సీనియర్ నేతలతో పాటు తొలిసారి అసెంబ్లీకి వెళ్తున్న కర్నూలు, పత్తికొండ ఎమ్మెల్యేలు టీజీ భరత్, కేఈ శ్యాంబాబు కూడా మంత్రి పదవిపై ఆశలు పెట్టుకున్నారు. టీజీ భరత్ ఆర్యవైశ్యుల కోటాలో తనకు తప్పకుండా మంత్రి పదవి దక్కుతుందనే ధీమాతో ఉన్నారు. ఎన్నికల ప్రచారంలో కూడా తనను గెలిపించాలని, ఈ దఫా తాను మంత్రిని కాబోతున్నానని పలువురు ప్రముఖులతో బాహాటంగానే చెప్పారు.భరత్ గెలుపొందిన తర్వాత టీజీ వర్గం కూడా కేబినెట్ బెర్త్ దక్కుతుందని చర్చించుకుంటున్నారు. అలాగే కేఈ శ్యాంబాబు కూడా కేబినెట్‌పై ఆశలు పెట్టుకున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతీ కేబినెట్లోనూ కేఈ కుటుంబం ఉంది. కేఈ ప్రభాకర్, కేఈ కృష్ణమూర్తి మంత్రులుగా చేశారు. 2014లో డిప్యూటీ సీఎంగా కూడా కేఈ కృష్ణమూర్తి కొనసాగారు. బీసీ కోటాలో తనకు చోటు దక్కుతుందని శ్యాంబాబు ధీమా వ్యక్తం చేస్తున్నారు.ఇవి చదవండి: ఏపీ కొత్త సీఎస్‌గా నీరబ్‌కుమార్ ప్రసాద్ -
అక్రమాల్లో టేకిటీజీ పాలసీ
ఆ ఉమ్మడి కుటుంబంలో తండ్రి జాతీయ పార్టీలో ఉంటే.. కొడుకు ప్రాంతీయ పార్టీలో ఉన్నారు. తండ్రి ఎమ్మెల్యేగా, మంత్రిగా, రాజ్యసభ సభ్యునిగా పనిచేసి అక్రమాలతో రూ.వందల కోట్లకు పడగలెత్తారు. కొడుకూ తక్కువేమీ తినలేదు. ఈ కుటుంబం దౌర్జన్యానికి కర్నూలు ప్రజలు దశాబ్దాలుగా పడుతున్న వేదన అంతా ఇంతా కాదు. ఇన్నేళ్ల రాజకీయ జీవితంలో వారు ఏనాడూ అభివృద్ధి, ప్రజాసమస్యలను పట్టించుకోలేదు. ఫలితంగా ఆ కుటుంబంపై సర్వత్రా తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది. సాక్షి, టాస్క్‌ఫోర్స్: ఆ కుటుంబం పేరు చెబితే వెంటనే వారు చేసిన ఆకృత్యాలే ప్రజలకు గుర్తుకొస్తాయి. తరచూ పార్టీలు మారే తండ్రికి ఓ రాజకీయ సిద్ధాంతం, పద్ధతి లేదనే విమర్శలు ఉన్నాయి. ఆయన ఇప్పుడు ఓ జాతీయ పార్టీలో ఉంటే కొడుకు ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో ప్రధాన ప్రతిపక్షం తరఫున అసెంబ్లీకి పోటీ చేస్తున్నారు. ఈ కుటుంబం బినామీ పేర్లతో వక్ఫ్ భూములు, దేవదాయ శాఖ మాన్యాలను తమ అ«దీనంలో పెట్టుకుని సర్కారు ఖజానాకు గండి కొడుతోంది. గోశాల పేరుతో పెద్ద దందా!కర్నూలు సిటీ నడిరోడ్డున దేవదాయశాఖ పరిధిలోని 1.31ఎకరాల గోశాల స్థలాన్ని 60 ఏళ్ల కిందట వి.రామచంద్రమ్మ అనే బినామీ పేరుతో లీజుకు తీసుకున్న ఈ కుటుంబం థియేటర్లు నిర్మించింది. జ్యూవెలరీ, బ్యాంకు, షోరూంతో పాటు 20 వరకు కమర్షియల్ కాంప్లెక్స్‌లు నిర్మించింది. తొలుత 30 ఏళ్లకు తీసుకున్న లీజు గడువు 1994 జూలై 1న ముగిసింది. అప్పట్లో నెలకు రూ.63,730 అద్దె ఉండేది. దానిని రూ.98,794కి పెంచి మరో 30 ఏళ్లు లీజుకు తీసుకున్నారు.రాబోయే జూలైతో ఆ గడువు ముగియనుంది. షాపింగ్ కాంప్లెక్స్ అద్దెలు, గ్రూపు థియే టర్లకు కలిపి నెలకు రూ.25 లక్షల వరకూ ఈ కుటుంబం అద్దె వసూలు చేస్తోందని చెబుతున్నారు. నిజానికి ఇంత కంటే ఎక్కువే అద్దె వస్తున్నట్లు సమాచారం. మళ్లీ ఇప్పుడు లీజును పొడిగించుకునేందుకు తండ్రీకొడుకులు యత్నిస్తున్నారు. కేసీ కెనాల్ భూములు స్వాహా! కర్నూలు మండల పరిధిలోని మునగాలపాడు పరిధిలో 46ఏ, 46బీ, 79బీ సర్వే నంబర్లలో 123.82 ఎకరాల భూమి ఉంది. జలవనరుల శాఖ పరిధిలో కేసీ కెనాల్(కర్నూలు–కడప కాల్వ) బండ్ భూమిగా 1908 ఆర్ఎస్ఆర్ రికార్డులు చెబుతున్నాయి. ఇవి హైదరాబాద్, బెంగళూరు నేషనల్ హైవే పక్కనే ఉన్నాయి. ఈ భూములపై ఆ కుటుంబం కన్ను పడింది. తమకు అనుకూలమైన ముగ్గురు వ్యక్తులను ఎంచుకుని 1998లోనే ఆ భూమి వారి పరిధిలో ఉన్నట్లు తప్పుడు రికార్డులు సృష్టించినట్లు తెలుస్తోంది. ఆపై మరో ఇద్దరు ఆ భూములను కొనుగోలు చేసినట్లు రిజిస్ట్రేషన్లు సృష్టించారు. ఆ తర్వాత 2003లో వీటిలో 5.43 ఎకరాలను వారసుల పేరు మీద రిజిస్ట్రేషన్ చేశారు. ఇది కాకుండా నలుగురు వ్యక్తులు ఇతరుల వద్ద తాకట్టుపెట్టిన సర్వే నంబర్ 46/1 మరో 1.5 ఎకరాల భూమిపై పంచాయితీని 2015లో ఆ కుటుంబం సెటిల్ చేసి వారసుల పేరుతో రాయించుకున్నట్లు తెలుస్తోంది. ఈ భూమి విలువ రూ.100 కోట్లపైనే ఉంటుంది. కర్నూలు అభివృద్ధిపై మాటలే.. చేతలేవీ? ► కర్నూలు సిటీలో జొహరాపురంలో డంపింగ్ యార్డు ఉంది. దీన్ని తీసేస్తానని 2009, 2014లో ఆ కుటుంబ పెద్ద మాట ఇచ్చారు. 2009లో గెలిచి మంత్రి అయ్యారు. 2014లో ఆయన ఓడిపోయినా ఆయన పార్టీ ప్రభుత్వమే ఉంది. కానీ దీని గురించి ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.8 కోట్లు కేటాయించి 23 ఎకరాల్లోని డంపింగ్ యార్డును తీసేస్తున్నారు. 95శాతం డంప్ తీసేశారు. దీంతో చుట్టపక్కల 50 వేల మందికి ఉపశమనం లభించింది. ► కర్నూలు నగర ప్రజలకు తాగు నీటి సమస్య నుంచి శాశ్వత పరిష్కారం చూపుతానని గతంలో ఆ కుటుంబ పెద్ద హామీ ఇచ్చారు. చేయలేకపోయారు. జగన్ ప్రభుత్వం వచ్చాక రూ.82 కోట్లతో సుంకేసుల రిజర్వాయర్ నుంచి ఎస్ఎస్ ట్యాంకు వరకూ పైపులైన్ నిర్మించారు. దీంతో సిటీకి నీటి కష్టాలు తప్పాయి. ► 2007లో కర్నూలుకు వరదలు వచ్చాయి.దీంతో వైఎస్సార్ రూ.244 కోట్లు మంజూరు చేసి కేసీ కెనాల్, హంద్రికి రక్షణ గోడ నిర్మించాలని నిర్ణయించారు. ఆ కుటుంబం దీన్ని నిర్లక్ష్యం చేసింది. ఫలితంగా 2009లో ప్రకృతి విలయంతో కర్నూలు కకావికలమైంది.► కార్పొరేషన్ నూతన భవనానికి 2010లో అప్పటి ఎమ్మెల్యేగా ఉన్న ఆ కుటుంబ పెద్ద శిలాఫలకం ఆవిష్కరించారు. రూ.9 కోట్ల అంచనాలతో చేపట్టాల్సిన ఈ పనులు చేయలేకపోయారు. ఇప్పుడు జగన్ ప్రభుత్వం రూ.26 కోట్లు వెచ్చించి భవనం నిర్మిస్తోంది. ఇప్పటికే 70శాతం పనులు పూర్తయ్యాయి..రైతులకు వేదన.. ఆల్కలీస్ ఫ్యాక్టరీ! తుంగభద్ర నదీ తీరంలో రాయలసీమ ఆల్కలీస్ ఫ్యాక్టరీ ఉంది. ఇది ఆ కుటుంబానికి చెందినదే. దీని కాలుష్యంతో ఇ.తాండ్రపాడు, గొందిపర్ల, ఇందిరమ్మకాలనీ, వసంతనగర్, దొడ్డిపాడు, పూలతోట, దేవమడ గ్రామాలలో వందల ఎకరాల వ్యవసాయ భూములు పంటలు పండక బీళ్లుగా మిగిలిపోయాయి. ప్రజలు అనారోగ్యానికి గురికావడంతో పాటు పశువులు చనిపోయిన ఘటనలు కోకొల్లలు. ఈ ప్రాంతంలో ఏదైనా ఘటన జరిగినా బయటకు రానివ్వరు. పరాయి వ్యక్తులను అక్కడికి వెళ్లనివ్వరు. తుంగభద్రకు ఇటువైపు కర్నూలు రాఘవేంద్ర మఠం అటువైపు ఫ్యాక్టరీ ఉంది.వీటి మధ్య వంతెన నిర్మించాలని దాంతో గ్రామాలకు, సిటీకి రాకపోకలు పెరగడంతోపాటు జోగులాంబ ఆలయానికి దగ్గరవుతుందని 25 ఏళ్లకుపైబడి ప్రతిపాదనలు పంపుతున్నా, ఆ కుటుంబం అడ్డుకుంటుందనే ఆరోపణలు ఉన్నాయి. దీనికి కారణం వంతెన నిర్మిస్తే ఫ్యాక్టరీ విషయాలు అందరికీ తెలియడంతోపాటు ఏ చిన్న ఘటన జరిగినా ఆందోళనలు చేస్తారనే భయమేనని స్థానికులు చెబుతున్నారు. -
టీజీ భరత్ జన్మదిన వేడుకకు కోట్లలో ఖర్చు..!
టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ తండ్రి, పారిశ్రామికవేత్త, బీజేపీ నాయకుడు టీజీ వెంకటేష్‌కు సంబంధించిన శ్రీరాయలసీమ ఆల్కాలీస్ పరిశ్రమకు చెందిన బ్యాంకు ఖాతా నుంచి xxxxxx680523 నెంబర్ గల ఖాతాకు మార్చి 8న రూ.1,500 జమ అయ్యింది. టీజీ భరత్ కుటుంబానికి చెందిన గౌరీగోపాల్ హాస్పిటల్ ప్రైవేట్ లిమిటెడ్ బ్యాంకు ఖాతా నుంచి xxx0523నెంబర్ గల ఖాతాకు ఏప్రిల్ 6న రూ.5 వేలు జమ అయ్యింది.. ఈ రెండే కాదు.. ఎన్నికల వేళ కర్నూలు నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ గుట్టుగా డబ్బు పంపిణీ చేస్తూ కుల సంఘాల నాయకులను, ప్రజలను ప్రలోభపెడుతున్నట్ల తెలుస్తోంది. ఓటమి భయంతో డబ్బును ఎరగా చూపి ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నాడు. కులాల వారీగా సంఘాల నాయకులను చేరదీసి కొంతమందికి రూ.15 వేల నుంచి రూ.20 వేలు ముట్టజెప్పి మద్దతు కోరుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. రెండుసార్లు ఓటమి చెందాం.. సాయం చేయండి.. టీజీ భరత్ తరపున ఆయన తండ్రి టీజీ వెంకటేష్ నగరంలోని ప్రముఖులను పలు రాజకీయ పార్టీల నాయకులు, కులసంఘాలు, ఉద్యోగ సంఘాలు, న్యాయవాదులను పిలిపించి రహస్యంగా మంతనాలు జరుపుతున్నారు. మీరు ఏ పార్టీలో ఉన్నా పర్వాలేదు. రెండుసార్లు ఓడిపోయాం.. ఈసారి కూడా ఓడిపోతే రాజకీయంగా భవిష్యత్తు ఉండదు. ఎలాగైనా సాయం చేయండి.. మీకు ఏ విధమైన సాయం కావాలన్నా చేస్తామంటూ ప్రాధేయపడుతున్నట్లు సమాచారం. వార్డుల్లో ఒకస్థాయి నాయకుడిని కూడా వదలకుండా తన కార్యాలయానికి పిలిపించుకుని అంతో ఇంతో ముట్టజెప్పి తన కొడుకును గట్టెక్కించాలని ప్రాధేయపడుతున్నట్లు రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. గతంలో టీజీ వెంకటేష్ దగ్గర కనీసం 70 మందికి పైగా ముఖ్యమైన వ్యక్తులు ఎళ్లవేళలా కుటుంబాన్ని అంటిపెట్టుకుని ఉండేవారు. టీజీ భరత్ వ్యవహారశైలి నచ్చక చాలామంది దూరంగా ఉంటున్నారు. అలాంటి వారందరినీ కూడా టీజీ వెంకటేష్ పిలిపించి నచ్చజెప్పే ప్రయత్నం చేస్తున్నప్పటికీ భరత్‌తో కలసి పని చేయడానికి ముందుకు రాని పరిస్థితి నెలకొన్నట్లు తెలుస్తోంది. బర్త్‌డే గిఫ్ట్ పేరుతో ఓటర్లకు వల 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం. ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి నెలకొంది. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించేందుకు భరత్ తన బర్త్‌డేను వేదికగా చేసుకున్నారు. బర్త్‌డేకు జనం రారని ముందే ఊహించి తన అనుచరులతో ఇంటింటికీ తిరిగి గిఫ్ట్ కూపన్లు పంపిణీ చేయించారు. ఏస్టీబీసీ కళాశాల మైదానంలో వచ్చి న వారందరికీ విందుతో పాటు రూ.700 విలువ చేసే గిప్ట్‌లు పంపిణీ చేసి ఎన్నికల్లో సహకరించాలని కోరడం అప్పట్లో చర్చనీయాంశమైంది. – కర్నూలు -
పిచ్చి పరాకాష్టకు.. టీడీపీ నేత టీజీ భరత్ బర్త్‌డే వేడుక నవ్వులపాలు
ఎవరిదైనా బర్త్‌డే జరిగితే అభిమానంతో వెళ్తాం. పుష్పగుచ్ఛమిచ్చి స్వీట్లు తినిపిస్తాం. ఇంకా దగ్గరి వాళ్లయితే కేక్ తీసుకెళ్లి కట్ చేయిస్తాం. వీలైతే ఒక గిఫ్ట్ కూడా ఇస్తాం. కానీ ఓ టీడీపీ నేత తన బర్త్‌డేకు రమ్మని ఏకంగా కూపన్లు పంచిపెట్టాడు. వాళ్లు మాత్రమే వచ్చి శుభాకాంక్షలు తెలపాలి. అప్పుడే అక్కడ ఏర్పాటు చేసిన కౌంటర్లలో ఆ కూపన్లను చూసి రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తారు. లేకపోతే వచ్చిన దారిలో వెళ్లిపోవాల్సిందే. ఇదండీ కథ. తండ్రి ప్రజల్లో విశ్వాసం కోల్పోతే.. కుమారుడు లేని ప్రజాదరణను చూపించుకునేందుకు తన బర్త్‌డేను వేదికగా చేసుకోవడం నవ్వులపాలైంది. నాయకుడి బర్త్‌డే అంటే స్వచ్ఛందంగా వచ్చి శుభాకాంక్షలు తెలుపుతారు కానీ.. ఇదెక్కడి విడ్డూరమని కొందరంటే, ఆ ఫ్యామిలీ అంతే పబ్లిసిటీ పిచ్చి అంటూ మరికొందరు నోరు చేసుకున్నారు. సాక్షి ప్రతినిధి కర్నూలు: బీజేపీ నేత టీజీ వెంకటేశ్ కుమారుడు, టీడీపీ కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ ఇన్చార్జ్ టీజీ భరత్ బర్త్‌డే శనివారం జరిగింది. 2014, 2019 రెండు సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందిన టీజీ కుటుంబానికి రానున్న 2024 ఎన్నికలు అత్యంత కీలకం! ఆ ఎన్నికల్లో పరాభవం చెందితే ‘హ్యాట్రిక్’ ఓటముల దెబ్బకు రాజకీయాల నుంచి టీజీ ఫ్యామిలీ దూరమయ్యే పరిస్థితి. దీంతో ఎలాగైనా నియోజకవర్గంలో తనకు బలముంది, ప్రజల మద్దతు ఉందని చూపించుకునేందుకు తన బర్త్‌డేను ఎంచుకున్నారు. నాలుగేళ్లుగా జనం మధ్య లేరు, చంద్రబాబు వచ్చినా జనం వచ్చే పరిస్థితి లేదు. దీంతో తన బర్త్‌డేకు జనం రారని భరత్ ముందే ఊహించినట్లున్నాడు. అందులో భాగంగా ఓ ప్లాన్ వేశాడు. డబ్బులిచ్చి ఎన్నికల ప్రచారానికి జనాలను పిలిపించుకున్నట్లు ‘గిఫ్ట్’లు ఎరగా వేశాడు. నియోజకవర్గంలోని అన్ని డివిజన్లలో టీడీపీ నాయకులను పదిరోజుల కిందట పిలిపించి సమావేశం నిర్వహించాడు. తన బర్త్‌డే వేడుకకు రూ.700 విలువ చేసే గిఫ్ట్ ఇస్తామని, దాని కోసం ఓ జాబితా తయారు చేయాలని, ఆ ప్రకారం కూపన్లు అందజేసి గిఫ్ట్‌లు పంపిణీ చేద్దామని నిర్ణయించారు. ఆ మేరకు జాబితాలు తయారయ్యాయి. వ్యక్తుల పేరు, ఓటర్ ఐడీ నెంబర్, పోలింగ్ బూత్ నెంబర్, ఫోన్ నెంబర్‌తో కూపన్ ప్రింట్ చేయించారు. ఈ కూపన్లను నియోజకవర్గంలోని డివిజన్లలో తమ పార్టీ సానుభూతిపరులకు పంపిణీ చేశారు. వీరు ఎస్టీబీసీ మైదానంలో ఏర్పాటు చేసిన వేడుకకు వచ్చి భరత్‌కు శుభాకాంక్షలు చెప్పి, భోజనం చేసి చివరలో గిఫ్ట్‌లు తీసుకెళ్లేలా ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు. పొదుపు మహిళలకు ముక్కుపుడకలు.. కొందరికి గిఫ్ట్‌లు, ఇలా మొత్తం పుట్టిన రోజు ముసుగులో లేని అభిమానానికి ఈ బర్త్‌డే బాయ్ చేసిన ఖర్చు అక్షరాల రూ.5కోట్ల పైనే. జనం బలం ఉందని చూపించుకునే తాపత్రయం టీజీ వెంకటేశ్ కుటుంబంపై ప్రజల్లో విశ్వసనీయత లేదు. టీడీపీలో ఉన్న టీజీ వెంకటేశ్ 2004 ఎన్నికల తర్వాత కాంగ్రెస్‌లో చేరారు. 2014లో తిరిగి టీడీపీలోకి వచ్చారు. 2019 ఎన్నికల తర్వాత బీజేపీలో చేరారు. కుమారుడు మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. తన వ్యాపార సామ్రాజ్యాన్ని కాపాడుకునేందుకు ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పారీ్టలో చేరడం మినహా టీజీ వెంకటేశ్‌కు రాజకీయ స్థిరత్వం లేదనేది తన రాజకీయ ప్రస్తానాన్ని విశ్లేషిస్తే స్పష్టమవుతోంది. అలాగే తండ్రీకొడుకుల్లో ఒకరు బీజేపీ, మరొకరు టీడీపీలో ఉండటం అవకాశవాద రాజకీయాన్ని సుస్పష్టం చేస్తోంది. పాత రోజులు కాకుండా ప్రజలు రాజకీయంగా చైతన్యం అయ్యారు. దీంతో టీజీ కుటుంబం అవకాశవాద రాజకీయాలను పసిగట్టి వారికి దూరంగా ఉన్నారు. ఇప్పటికే నియోజకవర్గంలో టీడీపీ అత్యంత బలహీనపడింది. ఒకే నియోజకవర్గంలో టీడీపీ, బీజేపీ నేతలుగా ఉన్న వీరు రాజకీయంగా ఏ రోజు పరస్పరం విమర్శించుకున్నదీ లేదు. తమ రాజకీయాల కోసం ఏ క్షణం, ఏ పారీ్టలోనైనా చేరే నేతగా టీజీ వెంకటేశ్ ప్రజల్లో విశ్వసనీయత కోల్పోయారు. ఆయన కుమారుడు భరత్ నాలుగేళ్లలో విపక్షపార్టీ నేతగా పోరాటం చేసిందీ లేదు. కేవలం ఎన్నికలకు ముందు బలప్రదర్శన చేసుకోవాలని భావించి, బలం లేక ఆర్థికబలంతో కోట్లు ఖర్చు చేసి గిఫ్ట్‌లు పంపిణీ చేసి వాటి కోసం వచ్చిన వారిని తమ అభిమానులుగా చిత్రీకరించుకుని రాజకీయ అడుగులు వేసే ప్రయత్నం చేశాడు. ఎన్నికల ‘వేడుక’ టీడీపీ నాయకుడు భరత్ పిచ్చి పరాకాష్టకు ఈ వేడుక తాజా నిదర్శనం. పుట్టిన రోజుకు రావాలని పిలవడం బాగుంటుంది కానీ, ఏకంగా ఓటరు ఐడీ జిరాక్స్ కాపీ జత చేసి తీసుకురావాలని కూపన్ల మీద కొట్టించడం ఇదంతా ఎన్నికల వేడుక అని చెప్పకనే చెప్పినట్లయింది. ఇంతేకాదు.. కూపన్ల మీ ద ఇచ్చిన వివరాలన్నీ ఓటరు ఐడీ కార్డు తరహాలో ఉండటం గమనార్హం. ఓటరు ఐడీ నెంబర్, బుక్ ఫోలియో, వార్డు నెంబర్, బూత్ నెంబర్‌ను పంపిణీ చేసిన కూపన్లపైనే ముద్రించారు. డేటా చౌర్యం గురించి మాట్లాడే టీడీపీ నేతలు కూపన్ల మాటున ఏకంగా ఓటరు ఐడీలనే బజారుకు తీసుకురావడం ఏమనుకోవాలనే చర్చకు తావిస్తోంది. చంద్రబాబు వద్ద విశ్వసనీయత కోల్పోయారా?! లక్కీటు బ్రదర్స్‌గా చెప్పుకునే రాంపుల్లయ్య యాదవ్, నరసింహులు యాదవ్‌లను పార్టీ నుంచి తప్పించాలని భరత్ ప్రయతి్నంచాడు. నియోజకవర్గంలో జరిగిన బస్సుయాత్రలో కూడా లక్కీటు బ్రదర్స్ పాల్గొనలేదు. దీంతో వీరు చంద్రబాబుకు భరత్‌పై ఫిర్యాదు చేశారు. ఆ మేరకు అధిష్టానం భరత్, లక్కీటు బ్రదర్స్‌ను ఇద్దరినీ పిలిపించి వేర్వేరుగా మాట్లాడారు. రాజకీయంగా బలపడాలంటే చేరికలపై దృష్టి పెట్టేవారిని చూశానని, పారీ్టలో ఉన్నవారిని బయటకు పంపే నేతను చూడలేదని భరత్‌ను చంద్రబాబు హెచ్చరించినట్లు టీడీపీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. 50 ఓట్లు ఉన్న వ్యక్తి కూడా మనకు ముఖ్యమేనని, సర్దుకుని పోవాలని సూచించారు. పైగా భరత్, టీజీ వెంకటేశ్ వేర్వేరు పార్టీలో ఉండటంతో టీడీపీ నియోజకవర్గంలో నష్టపోయిందని, ఇద్దరూ ఒకే పారీ్టలో ఉంటేనే టిక్కెట్ ఇచ్చే ఆలోచన చేస్తామని.. లేదంటే పార్టీ ప్రత్యామ్నాయం ఆలోచిస్తుందని స్పష్టం చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో బలం నిరూపించునే ప్రయత్నంలో తన బర్త్‌డే వేడుకను అవకాశంగా తీసుకున్నాడు భరత్. అయితే ఈ వేడుకపై ఇటు ప్రజల్లో, రాజకీయ పారీ్టల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. బర్త్‌డే వేడుకల్లో భరత్ కొత్త సంప్రదాయానికి తెర తీశాడని, ప్రతీ అంశాన్ని రాజకీయంగా చూడటం సరికాదని చర్చకు దారితీసింది. -
కర్నూలులో ఏ కండువా? ఏ దారి?
నియోజకవర్గంలో తండ్రి కాషాయ కండువా కప్పుకుని తిరుగుతున్నాడు. కొడుకేమో పచ్చ కండువా వేసుకుని రాజకీయాలు చేస్తున్నాడు. దీంతో వారి కేడర్‌కు ఏ కండువా కప్పుకోవాలో అర్థం కాక అయోమయంలో ఉన్నారు. వచ్చే ఎన్నికల్లో పచ్చ పార్టీ సీటు మైనారిటీకి ఇస్తారనే ప్రచారంతో కొడుకు పార్టీని పట్టించుకోవడంలేదట. దీంతో అక్కడి రాజకీయాలు మరింత గందరగోళంగా మారాయనే టాక్ నడుస్తోంది. ఇంతకీ ఆ తండ్రీ కొడుకులు ఎవరు? లీడర్లలో క్లారిటీ మిస్ అయిందా? గత ఎన్నికల్లో కర్నూల్ జిల్లాలో తెలుగుదేశం పార్టీ పూర్తిగా తుడిచిపెట్టుకుపోయింది. అప్పటివరకు పచ్చ పార్టీలో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న టీజీ వెంకటేశ్... పార్టీ ఓటమితో చంద్రబాబు సలహామేరకు కాషాయ కండువా కప్పుకున్నారు. కాని ఆయన కుమారుడు భరత్ మాత్రం టీడీపీలోనే కొనసాగుతున్నాడు. కర్నూల్ నుంచి అసెంబ్లీకి పోటీ చేసిన వెంకటేశ్ కుమారుడు భరత్ ఎన్నికల్లో ఓటమి తర్వాత చతికిలపడ్డారు. రాజకీయాలకు విరామం ఇచ్చి వ్యాపారాల్లో మునిగిపోయారు. దీంతో వచ్చే ఎన్నికల్లో పోటీ చేస్తారా లేదా అనే సందేహంతో వారి కేడర్‌లో అయోమయం కొనసాగుతోంది. మరోవైపు తండ్రి ఒక పార్టీలో...కొడుకు మరో పార్టీలో ఉండటం కూడా కేడర్‌ను ఇబ్బందికి గురిచేస్తోంది. తాము ఏ రంగు కండువా కప్పుకోవాలో అర్థంకాక జుట్టు పీక్కుంటున్నారు. కంచుకోట అలా బద్దలయింది.! ఒకప్పుడు కర్నూల్ నియోజకవర్గంలో టీజీ వెంకటేశ్ వర్గం బలంగా ఉండేది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ టీజీ కంచుకోటను బద్దలు చేసింది. టీజీ భరత్ దారుణంగా ఓడిపోయాడు. రాజ్యసభ సభ్యుడుగా కొనసాగుతున్న టీజీ వెంకటేశ్ తన వర్గాన్నంతా కొడుకుకు అప్పగించాడు. వారంతా గత ఎన్నికల్లో పచ్చ జెండాలు పట్టుకుని భరత్ కోసం పనిచేశారు. ఓడిపోయాక భరత్ కేడర్‌ను పట్టించుకోవడం మానేశాడు. పార్టీ కార్యక్రమాలకు దూరంగా ఉండటంతో పాటుగా..కేడర్‌తో సంబంధం లేదన్నట్లుగా వ్యవహరించడంతో వారంతా చెల్లా చెదురవుతున్నారని తెలుస్తోంది. కేడర్ దూరం కావడం భవిష్యత్‌లో భరత్‌కే నష్టం అంటున్నారు. తండ్రీ, కొడుకులిద్దరూ కలిసి వచ్చే ఎన్నికల్లో వైఎస్ఆర్ కాంగ్రెస్ విజయాన్ని ముందే ఖరారు చేశారనే టాక్ నడుస్తోంది. సైకిల్ కాదు కానీ..! కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గంలో ఎక్కువ శాతం మైనార్టీలు ఉన్నారు. మైనార్టీలే మెజారిటీగా ఉండటంతో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైనారిటీ నేతను ఎన్నికల బరిలో దించి విజయాన్ని అందుకుంది. ఈ నేపథ్యంలో వచ్చే ఎన్నికల్లో కూడా టీడీపీకి ఏమాత్రం అవకాశాలు లేవని అర్థమవుతోంది. తండ్రీ కొడుకులు వేర్వేరు రాజకీయాలు చేస్తుండటం... కేడర్‌ను దూరం చేసుకోవడంతో వచ్చే ఎన్నికల్లో ఓటమి కోసం టీడీపీ ఇన్చార్జ్ టీజీ భరత్ స్వయంగా బాటులు వేసుకుంటున్నట్లు ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. వచ్చే ఎన్నికల్లో టిజి భరత్ కు టిక్కెట్ వచ్చేట్లు కనిపించడంలేదని కర్నూలు నియోజకవర్గంలో ప్రచారం జోరుగా సాగుతోంది. దీంతో టీడీపీ నేతలు ఒక్కొక్కరు టిజి భరత్ కు దూరం అవుతున్నారు. టీజీ కుటుంబాన్ని నమ్ముకుంటే నిండా మునగడం ఖాయమని కార్యకర్తలు, నాయకులు భావిస్తున్నారు. తండ్రీ, కొడుకులు చెరో పార్టీలో ఉంటూ... కేడర్‌ను దూరం చేసుకోవడంతో మొత్తంగా కర్నూల్ తెలుగుదేశం పార్టీ అచేతనంగా మారిపోయింది. -పొలిటికల్ ఎడిటర్, సాక్షి డిజిటల్ -
బాబు నిర్లక్ష్యం వల్లే కర్నూలుకు హైకోర్టు తెలేకపోయం
-
మిస్టర్ కూల్
సాక్షి, కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): ఎక్కడైనా ప్రత్యర్థి పార్టీ అభ్యర్థి మెజార్టీలో ముందుంటే తీవ్ర హైరానా పడిపోతారు. ఏమి జరుగుతుందోనని ఆందోళన చెందుతారు. అయితే కర్నూలు అసెంబ్లీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ మాత్రం గురువారం నిర్వహించిన ఎన్నికల కౌం టింగ్‌లో ప్రత్యర్థి అభ్యర్థి టీజీ భరత్ ము ందంజలో ఉన్నా గెలుపు తననే వరిస్తుందన్న ధీమా కనబర్చడం ఆశ్చర్య పరిచింది. ఇండియా క్రికెట్ టీంలో మిస్టర్ కూల్ మహేంద్రసింగ్ ధోనిలాగా తన గెలుపుపై ఏ మాత్రం ఆందోళన చెందకుండా చివరకు మూడు రౌండ్లు ఉండగానే విజయాన్ని అందుకున్నారు. తీవ్ర ఉత్కంఠగా సాగిన లెక్కింపు... కర్నూలు అసెంబ్లీ బరిలో వైఎస్ఆర్సీపీ నుంచి హఫీజ్‌ఖాన్, టీడీపీ నుంచి టీజీ భరత్ బరిలో ఉన్నారు. జిల్లాలోని అన్ని నియోజకవర్గాలకు భిన్నంగా ఇక్కడ రెండు పార్టీలు పోటాపోటీగా తలపడ్డాయి. ప్రతి రౌండు ఫలితం తీవ్ర ఉత్కంఠకు తెరలేపింది. మొదట్లో పోస్టల్ బ్యాలెట్లో టీజీ భరత్ ఆధిక్యాన్ని కనబరిచారు. తరువాత కొన్ని రౌండ్లలో హఫీజ్‌ఖాన్, మరికొన్ని రౌండ్లలో టీజీ భరత్ అధిక్యాలను కనబరచారు. ఇలా మొత్తం 27 రౌండ్లలో 8వ రౌండ్ వరకు టీడీపీ 271 ఓట్ల మెజార్టీతో ముందంజలో ఉండేది. తరువాత 11వ రౌండ్ వచ్చేసరికి వైఎస్ఆర్సీపీకి 157 ఓట్ల ఆధిక్యం వచ్చింది. చివరకు 16వ రౌండ్ వరకు టీడీపీనే ఆధిక్యంలో ఉండడంతో కొన్ని టీవీ చానళ్లు టీజీ భరత్ విజయం సాధించినట్లు బ్రేకింగ్‌లు ఇచ్చారు. అయితే 17వ రౌండ్ వచ్చేసరికి పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల ఆధిక్యం వచ్చింది. తరువాత నుంచి ఆ మెజార్టీ తగ్గలేదు. మరో మూడు రౌండ్లు మిగిలి ఉండగానే వైఎస్ఆర్సీపీ విజయం ఖాయం కావడంతో టీజీ భరత్ కౌంటింగ్ కేంద్రం నుంచి వెళ్లిపోయారు. హఫీజ్‌ఖాన్ కర్నూలు ఎమ్మెల్యేగా గెలుపొందారు. ఆది నుంచి విజయంపై ధీమా కర్నూలు అసెంబ్లీలో 27 రౌండ్ల ఓట్ల లెక్కింపు ఉంది. ఇందులో 16 రౌండ్ల వరకు టీడీపీ స్వల్ప అధిక్యం సాధిస్తూ వచ్చింది. దీంతో టీడీపీనే గెలుస్తుందని అందరూ భావించారు. అయితే, హఫీజ్‌ఖాన్ ఏ మాత్రం హైరానా పడలేదు. రోజాలో ఉన్నా ముఖంలో కళ తగ్గలేదు. ప్రార్థనలు చేస్తూ విజయం తనకే వరిస్తుందని..కౌంటింగ్ ప్రక్రియ ఒక్కసారిగా తనకు అనుకూలంగా మారుతుందని సహచరులకు చెప్పగా వారేవరూ నమ్మలేదు. ఆయన అన్నట్టుగానే 17 రౌండ్ నుంచి ఒక్కసారిగా పరిస్థితి మారిపోయింది. వైఎస్ఆర్సీపీకి 3,248 ఓట్ల అధిక్యం వచ్చింది. అప్పటి నుంచి ఆయన మెజార్టీ పెరగడమే కానీ తగ్గలేదు. మూడు రౌండ్లు మిగిలి ఉండగానే విజయం సాధించారు. -
క్రికెట్ బెట్టింగ్ గుట్టురట్టు
కర్నూలు: కర్నూలు నగరంలో క్రికెట్ బెట్టింగ్ రాయుళ్ల గుట్టు రట్టయ్యింది. మొబైల్ యాప్ చూస్తూ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్‌కు బెట్టింగ్ నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో మూడవ పట్టణ సీఐ హనుమంతనాయక్, ఎస్ఐ శ్రీనివాసులు, ఏఎస్ఐ విశ్వనాథ్‌రెడ్డి, సిబ్బంది పాండునాయక్, లక్ష్మీనారాయణ, మహేష్‌తో కలిసి బుధవారపేటలోని భవానీ దేవాలయం వద్ద బెట్టింగ్ రాయుళ్లను ఆదివారం సాయంత్రం రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వారి నుంచి రూ.1.5 లక్షల నగదు, ఒక సెల్‌ఫోన్ స్వాధీనం చేసుకున్నారు. కర్నూలు నగరం పెద్దరంగరాజు వీధికి చెందిన గద్దెల రాజేశ్వరరావు... ప్రొద్దుటూరుకు చెందిన సుబ్బారెడ్డి, ఇర్ఫాన్ అనే వ్యక్తులకు బుకీగా వ్యవహరిస్తూ ఆటగాళ్లతో డబ్బులు వసూలు చేస్తూ బెట్టింగ్ నిర్వహిస్తున్నాడు. రాజేశ్వరరావుతో పాటు పెద్దరంగరాజు వీధికి చెందిన సాయికుమార్, అభిలాష్, మేదరవీధికి చెందిన కమలాపురం శివకోటి, తెలుగువీ«ధిలో నివాసం ఉంటున్న జీతూరి వెంకటేష్ ను అరెస్ట్ చేశారు. ప్రధాన నిర్వాహకుడు సుబ్బారెడ్డి, ఇర్ఫాన్‌ను పట్టుకునేందుకు ప్రత్యేక పోలీస్ బృందాలను ఏర్పాటు చేసినట్లు సీఐ హనుమంతనాయక్ తెలిపారు. పోలీసులపై టీజీ భరత్ ఒత్తిడి క్రికెట్ బెట్టింగ్‌లో బుకీతో పాటు నలుగురు ఆటగాళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం అందడంతో బెట్టింగ్ రాయుళ్లను విడిపించేందుకు రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ కుమారుడు, కర్నూలు నియోజకవర్గం టీడీపీ అభ్యర్థి టీజీ భరత్ పోలీసులపై తీవ్ర ఒత్తిడి చేసినట్లు సమాచారం. ఎన్నికల్లో తనకు యువకులు సహకరించినందున ఎలాగైనా వదిలిపెట్టాలని పోలీసులపై ఆయన ఒత్తిడి తీసుకు వచ్చినట్లు సిబ్బందిలో చర్చ జరుగుతోంది. బెట్టింగ్ నిర్వాహకుల వద్ద భారీ మొత్తంలో నగదు లభించినప్పటికీ టీజీ భరత్ ఒత్తిడి మేరకు తూతూ మంత్రంగా కేసు నమోదు చేసి, తక్కువ మొత్తంతోనే అరెస్ట్ చూపినట్లు పోలీసు శాఖలో చర్చ జరుగుతోంది. -
బరి తెగించిన టీజీ భరత్
కర్నూలు(టౌన్): ఓటమి భయంతో అధికార పార్టీ నేతలు బరి తెగిస్తున్నారు. ఎన్నికల్లో ఎలాగైనా గట్టెక్కాలనే ఉద్దేశంతో ప్రజాస్వామ్యాన్ని ఆపహాస్యం చేసేలా వ్యవహరిస్తున్నారు. బహిరంగంగానే ప్రలోభాలకు ఒడిగట్టారు. కర్నూలు అసెంబ్లీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న టీజీ భరత్ మరింత బరి తెగించారు. ఓటర్లను తీవ్రస్థాయిలో ప్రలోభాలకు గురిచేస్తున్నారు. వారం రోజులుగా తన హోటల్ కేంద్రంగా ప్రలోభపర్వం కొనసాగిస్తున్నప్పటికీ అధికారులెవరూ అటువైపు కన్నెత్తి చూడడం లేదు. వాస్తవానికి భరత్‌కు చివరి నిమిషంలో టికెట్ ఖరారైంది. అప్పటికే వైఎస్సార్సీపీ అభ్యర్థి హఫీజ్‌ఖాన్ కర్నూలు అసెంబ్లీ పరిధిలో విస్తృతంగా పర్యటించారు. అన్ని వర్గాలను కలిసి ఓట్లు అభ్యర్థించారు. ఒక్కసారి అవకాశం కల్పిస్తే నగరాన్ని అన్నివిధాల అభివృద్ధి చేస్తానంటూ హఫీజ్‌ఖాన్ ప్రచారంలో దూసుకెళ్తున్నారు. దీంతో కంగుతిన్న భరత్ ప్రలోభాలకు తెరతీశారు. తక్కువ సమయంలో ఓటర్లను కలవడం సాధ్యం కాదన్న ఉద్దేశంతో తాయిలాలు ఎర వేస్తున్నట్లు తెలుస్తోంది. మౌర్య ఇన్‌లో డబ్బుల పంపిణీ జోరుగా చేపడుతున్నట్లు స్వయాన టీడీపీ నాయకులే చెబుతున్నారు. ప్రతి రోజు హోటల్లో మహిళా గ్రూపులతో సమావేశాలు నిర్వహించడం, భోజనాలు ఏర్పాటు చేయడం పరిపాటిగా మారింది. రంగంలోకి ఆల్కలీస్ సిబ్బంది ఓటర్లను ప్రలోభపెట్టే పనిలో భాగంగా టీజీ వెంకటేష్ అల్కలీస్ పరిశ్రమలకు చెందిన సిబ్బందిని కూడా రంగంలోకి దింపారు. మంగళవారం సాయంత్రం వారు కర్నూలు శ్రీరామ నగర్‌లోని పలు కాలనీలలో పర్యటిస్తూ ఓటర్లను ప్రలోభ పెట్టేందుకు యత్నించారు. కాలనీల్లో తమకు తెలిసిన వారి నుంచి ఓటరు కార్డు నకలు, బ్యాంకు అకౌంట్ పాస్ పుస్తకం జిరాక్స్ ప్రతులను సేకరించారు. ముందస్తుగా మాట్లాడుకున్న వారికి నేరుగా అకౌంట్లో డబ్బులు జమచేస్తామని హామీ ఇస్తున్నారు. ఈ విషయం వెలుగులోకి రావడంతో అక్కడికి ‘సాక్షి’ బృందం చేరుకుంది. దీంతో అల్కలీస్ సిబ్బంది మెల్లగా జారుకున్నారు. టీజీవీ కళాక్షేత్రంలోనూ కళాకారులతో గెట్–టు–గెదర్ పేరుతో డబ్బుల పంపిణీ జరుగుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
చంద్రబాబుకు షాక్ ఇస్తున్న కర్నూలు టీడీపీ నేతలు
-
బాబోయ్.. నేను పోటీ చేయను
సాక్షి ప్రతినిధి, కర్నూలు: అధికార తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలయ్యింది. టీడీపీ తరఫున పోటీ చేయలేమంటూ ఆ పార్టీ నేతలు చేతులెత్తేస్తున్నారు. టికెట్ ఇస్తామన్నా.. వద్దంటూ ఒక్క రొక్కరిగా పారిపోతున్నారు. ఇప్పటికే నెల్లూరు రూరల్ టికెట్ వదులుకొని ఆదాల ప్రభాకర్‌రెడ్డి వైఎస్సార్ సీపీలో చేరిపోగా.. ఇప్పుడు కర్నూలు జిల్లా శ్రీశైలం ఎమ్మెల్యే బుడ్డా రాజశేఖరరెడ్డి తాను పోటీ నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. గతంలో ఈ సీటు ఆశించిన మాజీ మంత్రి ఏరాసు ప్రతాప్‌రెడ్డిని పోటీ చేయాలని టీడీపీ అధిష్టానం కోరగా.. ఆయన సైతం తన వల్ల కాదంటూ చేతులెత్తేశారు. అధికారపార్టీ ఓడిపోతుందనే... శ్రీశైలం నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ రోజు రోజుకూ బలపడుతోంది. మండలాలు, గ్రామాల వారీగా నేతలు క్యూ కడుతున్నారు. దీంతో అధికార టీడీపీకి నాయకత్వమే లేకుండా పోతున్న పరిస్థితి నెలకొంది. ఈ నేపథ్యంలో టీడీపీ ఓటమి ఖాయ మని తెలుసుకున్న బుడ్డా రాజశేఖరెడ్డి, ఏరాసు ప్రతా పరెడ్డి పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు తెలిసింది. అయితే, తన భార్య అనారోగ్యం వల్లే పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు బుడ్డా రాజశేఖరెడ్డి తన అను చరులతో చెప్పుకుంటున్నారు. అంతటితో ఆగ కుండా పూర్తిగా రాజకీయాల నుంచే తప్పుకుంటు న్నట్లు ఆయన ప్రకటించడం గమనార్హం. మరోవైపు ‘నంద్యాల’ ఏవీ సుబ్బారెడ్డిని శ్రీశైలం నుంచి బరిలో దింపాలని టీడీపీ నేతలు యోచిస్తున్నారు. ఆయన అంగీకరిస్తారా? లేదా అన్నది తేలాల్సి ఉంది. వీడని ‘సీట్ల’ ముడి.. మరోవైపు కర్నూలు, కోడుమూరు, నంద్యాల సీట్ల వ్యవహారం ఇంకా తేలలేదు. ఈ నేపథ్యంలో తాము స్వతంత్రంగా పోటీ చేస్తామని నంద్యాల ఎంపీ ఎస్పీ వై రెడ్డి కుటుంబం ప్రకటించింది. గురువారం తాము ఎంపీ, ఎమ్మెల్యే స్థానాలకు నామినేషన్లు వేస్తామని తేల్చి చెప్పింది. చంద్రబాబును నమ్మి పూర్తిగా మోస పోయామని ఆ కుటుంబం మండిపడుతోంది. ఇక కర్నూలు సీటును మొన్నటివరకు ఎస్వీ మోహన్ రెడ్డికి ఇస్తామంటూ టీడీపీ పెద్దలు చెప్పుకొచ్చారు. తీరా ఇప్పుడు చంద్రబాబు పర్యటన నేపథ్యంలో ఆ సీటును టీజీ భరత్‌కు ఇవ్వబోతున్నట్టు తెలిసింది. తనకు సీటు ఇవ్వకపోతే అటు పత్తికొండ, ఇటు ఆలూరు, కర్నూలులో టీడీపీని ఓడిద్దామని ఎస్వీ మోహన్‌రెడ్డి అనుచరులకు స్పష్టం చేసినట్లు సమా చారం. ఇక కోడుమూరు సీటును రిటైర్డు ఐఏఎస్ రామాంజనేయులుకు ఇవ్వొద్దని కోట్ల వర్గం అం టుండగా.. ఆయనకే ఇవ్వాలని, లేదంటే తన అను చరులకివ్వాలని విష్ణువర్ధన్ రెడ్డి హెచ్చరిస్తున్నట్లు తెలిసింది. మీరెంత సంపాదించారో నాకు తెలుసు! ప్రతిపక్ష వైఎస్సార్సీపీ నుంచి గెలిచి టీడీపీలోకి ఫిరా యించిన ఎమ్మెల్యేలకు చంద్రబాబు తన మార్క్ ‘యూజ్ అండ్ త్రో’ రాజకీయం రుచి చూపి స్తున్నారు. చంద్రబాబు ఇప్పటికే ఎంపీలు బుట్టా రేణుక, ఎస్పీవై రెడ్డికి ఝలక్ ఇచ్చారు. ఇక కోడు మూరు ఎమ్మెల్యే మణిగాంధీకి సీటు నిరాకరించారు. పార్టీ మారిన సమయంలో ఎవరెవరికి ఎంత ఇచ్చా నో? తర్వాత ఎవరెవరు ఎంత సంపాదించారో చిట్టా అంతా తన వద్ద ఉందని చంద్రబాబు వీరిని హెచ్చ రిస్తున్నట్లు తెలిసింది. దీంతో వారంతా కిందామీద పడుతున్నారు. చంద్రబాబు మాటలతో వైఎస్సార్ సీపీ నుంచి బయటకు వచ్చి ఎంత పెద్ద తప్పు చేశా మో అర్థమవుతోందని వారంతా తమ అనుచరుల వద్ద వాపోతున్నట్లు సమాచారం. మరోవైపు ఓటమి ఖాయమని తెలుస్తున్నందున.. ఇప్పుడు ఎన్నికల్లో ఖర్చు చేసి.. ఉన్న డబ్బులను కూడా ఎందుకు పోగొట్టుకోవడమని భావిస్తున్నట్టు తెలిసింది. -
కర్నూలు సీటు కోసం చంద్రబాబు వద్దకు ఎస్వీ
సాక్షి, అమరావతి : కర్నూలు జిల్లా టికెట్ల పంచాయితీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్దకు చేరింది. కర్నూలు అసెంబ్లీ టికెట్‌పై కొంతకాలంగా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి... టీడీపీ రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ తనయుడు టీజీ భరత్ మధ్య పోటీ నెలకొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి గురువారం ముఖ్యమంత్రి చంద్రబాబు నివాసానికి వచ్చారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. మంత్రి నారా లోకేష్ కర్నూలులో పోటీ చేయాలని తాను చెప్పిన మాటకు కట్టుబడి ఉన్నానన్నారు. ఎవరి మీద ఫిర్యాదు చేయడానికి తాను అమరావతి రాలేదని ఆయన స్పష్టం చేశారు. ఇవాళ జరిగే కర్నూలు పార్లమెంట్ సమీక్షలో అసెంబ్లీ సీటుపై స్పష్టత వస్తుందని ఎస్వీ మోహన్ రెడ్డి ఆశాభావం వ్యక్తం చేశారు. కాగా గత కొంతకాలంగా నివురుగప్పిన నిప్పులా ఉన్న కర్నూలు అసెంబ్లీ టికెట్ రాజకీయం తెరమీదకు వచ్చింది. అసెంబ్లీ టికెట్ కోసం ప్రస్తుత ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, మరోవైపు టీజీ భరత్ పోటీ పడుతున్నారు. అయితే జిల్లా పర్యటనకు వచ్చిన మంత్రి నారా లోకేష్... కర్నూలు టికెట్ ఎస్వీ మోహన్ రెడ్డికేనని ప్రకటించడం అసమ్మతి భగ్గుమంది. లోకేష్ ఏ హోదాతో టికెట్ కేటాయింపుపై ప్రకటన చేస్తారంటూ ఎంపీ టీజీ వెంకటేష్ అసంతృప్తి వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. మరోవైపు కోట్ల సూర్యప్రకాశ్ రెడ్డి కుటుంబసభ్యులు ఈ నెల 28న టీడీపీ కండువా కప్పుకోనున్నారు. ఇక కోట్ల కుటుంబానికి కర్నూలు ఎంపీతో పాటు కర్నూలు అసెంబ్లీ టికెట్ ఇవ్వాలని కేఈ సోదరులు టీడీపీ అధిష్టానం ముందు కొత్త ప్రతిపాదన చేయడంతో ఎస్వీ మోహన్ రెడ్డి ముందుగానే అప్రమత్తం అయ్యారు. తన టికెట్‌కు ఎసరు వస్తుందనే భయంతో ఆయన తాజాగా నారా లోకేష్ పేరు తెరమీదకు తీసుకువచ్చారు. లోకేష్ కర్నూలులో పోటీ చేస్తే తన స్వచ్ఛందంగా తప్పుకుంటానని వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో ఉన్న గందరగోళం నేపథ్యంలో ఎస్వీ మోహన్ రెడ్డి...ముఖ్యమంత్రితో భేటీ అయ్యేందుకు రావడం ప్రాధాన్యత సంతరించుకుంది. -
ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలపై చూపిస్తున్నది కపట ప్రేమేనని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రివర్గంలో ముస్లింలకు నాలుగున్నర ఏళ్లుగా స్థానం కల్పించని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీలోని లాల్‌మసీదు రోడ్డులో పదో వార్డుకు సంబంధించిన రెండు పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంతంలో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. సభకు అదనపు రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి అతిథిగా హాజరై ప్రసంగించారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల కోసం నవరత్నాలు రూపొందించారని తెలిపారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ టీజీ భరత్ నిర్వహిస్తున్నది విజన్ యాత్ర కాదు.. రాజకీయ ఉనికి యాత్ర అని విమర్శించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నగరాభివృద్ధి కోసం కాకుండా తన ఆస్తుల అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరారని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేసే వాడే నిజమైన నాయకుడన్నారు. అంతకు ముందు కేక్ కట్ చేసి లావుబాలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జహీర్ అహ్మద్‌ఖాన్, నూరుల్లా ఖాద్రి, మాజీ కార్పొరేటర్లు మున్నా, పి.రహ్మాన్, విఠల్, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు కటారి సురేశ్‌కుమార్, రైల్వే ప్రసాద్, ఎస్.ఎ.అహ్మద్, ఆదిమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, నజీర్ అహ్మద్‌ఖాన్, రియాజ్, ఫైజాన్, హకీం, ఏసన్న, ప్రభుదాస్, మాలిక్, జమీలా, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
యాత్రను వెంటనే ఆపేయి..
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ ప్రారంభించిన ‘విజన్ యాత్ర’ అధికార పార్టీలో ఫిర్యాదుల పరంపరకు తెరలేపింది. ఈ యాత్రను వెంటనే ఆపేయించాలని కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నేరుగా టీడీపీ అధినేత చంద్రబాబును కలిసి విన్నవించారు. కర్నూలు నియోజకవర్గం నుంచి ఇప్పటికే తన పేరు ప్రకటించిన నేపథ్యంలో భరత్ యాత్ర వల్ల కేడర్‌లో గందరగోళం ఏర్పడడమే కాకుండా అంతిమంగా పార్టీకి నష్టం జరుగుతోందని వివరించినట్లు సమాచారం. అయితే, యాత్ర ఆపేయాలంటూ అధిష్టానం నుంచి ఇప్పటివరకు ఎటువంటి ఆదేశాలూ రాకపోవడంతో మరింత జోరు పెంచేందుకు టీజీ భరత్ సిద్ధమవుతున్నట్టు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఎస్వీతో విభేదిస్తున్న ఎంపీ బుట్టా రేణుకను ముందు పెట్టడం ద్వారా ఇబ్బంది లేకుండా చూసుకుంటున్నట్లు సమాచారం. పార్టీ వ్యతిరేక కార్యకలాపం కాదని, పార్టీ కోసమే యాత్ర చేస్తున్నామన్న సందేశాన్ని ఇచ్చేందుకు ఇది దోహదపడుతుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. మరోవైపు కాంగ్రెస్‌తో పొత్తు నేపథ్యంలో బుట్టా రేణుకకు అసలు ఎంపీ సీటే రాదని ఎమ్మెల్యే వర్గం ప్రచారం ప్రారంభించింది. ఆమె ఎమ్మిగనూరు అసెంబ్లీ నియోజకవర్గం నుంచి పోటీ చేస్తారని కూడా ఈ సందర్భంగా అంటున్నారు. సర్వే పేరుతో.. వాస్తవానికి టీడీపీలో సీట్ల కేటాయింపు సర్వే ప్రకారం జరుగుతోంది. చివరి నిమిషం వరకూ సీటు ఎవరికిస్తారనే విషయం రహస్యంగా ఉంటుంది. అయితే, ఇందుకు భిన్నంగా ముందుగానే కర్నూలు నియోజకవర్గానికి సిట్టింగ్ ఎమ్మెల్యే ఎస్వీ, ఎంపీ స్థానానికి బుట్టా రేణుక పోటీ చేస్తారని నారా లోకేష్ స్వయంగా ప్రకటించారు. దీనిపై ఎంపీ టీజీ భగ్గుమన్నారు. సీటు ప్రకటించడానికి అసలు లోకేష్ ఎవరంటూ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై పార్టీ నుంచి కూడా ఎటువంటి స్పందనా రాలేదు. దీంతో మరింత దూకుడు పెంచేందుకు సిద్ధమయ్యారు. నగర ప్రజలకు ఏం కావాలో తెలుసుకునేందుకే విజన్ యాత్ర ప్రారంభించానని, 2019 ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని యాత్ర ప్రారంభం సందర్భంగా టీజీ భరత్ ప్రకటించారు.పరోక్షంగా ఎమ్మెల్యే అవినీతిపైనా వ్యాఖ్యలు చేస్తున్నారు. నగర ప్రజలు అవినీతి లేని అభివృద్ధి కోరుకుంటున్నారని, గతంలో తాము అదే చేశామని అంటున్నారు. నగరంలో జరుగుతున్న అభివృద్ధి పనుల్లో అవినీతి జరుగుతోందంటూ ఎంపీ బుట్టా రేణుక కూడా స్వరం కలిపారు. తద్వారా సీటు విషయంలో తన సపోర్ట్ భరత్‌కేనని తేల్చిచెప్పారు. ఈ నేపథ్యంలో రానున్న రోజుల్లో ఏయే పరిణామాలు చోటుచేసుకుంటాయన్నది వేచి చూడాలి. -
ఎస్వీ వర్సెస్ టీజీ భరత్
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డితో నేరుగా తేల్చుకునేందుకు టీజీ భరత్ సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. ఇందుకోసం ప్రజల వద్దకు వెళ్లేందుకు ఆయన సన్నద్ధమవుతున్నారు. విజన్ యాత్ర పేరుతో 33 వార్డుల పర్యటనకు తెరలేపారు. వచ్చే నెల 9 లేదా 27వ తేదీన ఈ యాత్రను ప్రారంభించనున్నట్టు తెలుస్తోంది. ఇందులో భాగంగా ప్రజా సమస్యలను తెలుసుకోవడంతో పాటు 2019 ఎన్నికల ఎజెండా కూడా ప్రకటిస్తానని ఆయన అంటున్నారు. అంతేకాకుండా వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీలో ఉంటానని స్పష్టం చేస్తున్నారు. దీంతో ఎస్వీ, టీజీ మధ్య పోరు మరింత ఆసక్తికరంగా మారుతోందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఇప్పటికే వార్డుల వారీగా ఎమ్మెల్యే ఎస్వీ పర్యటిస్తున్నారు. ఇదే సందర్భంలో టీజీ భరత్ కూడా వార్డు పర్యటనల ద్వారాతన అనుచరులను కట్టడి చేయడంతో పాటు బలాన్ని ప్రదర్శించేందుకు కూడా దోహదపడుతుందనేది ఆయన అభిప్రాయంగా ఉంది. వచ్చే నెలలో... వచ్చే ఎన్నికల్లో తప్పకుండా పోటీ చేస్తానని టీజీ భరత్ ఇప్పటికే పలుమార్లు ప్రకటించారు. నేరుగా సీఎం చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తనను పోటీ నుంచి ఎవ్వరూ తప్పించలేరని కుండబద్దలు కొడుతున్నారు. మరోవైపు కర్నూలు అసెంబ్లీ స్థానం నుంచి ఎస్వీ మోహన్‌రెడ్డి పోటీ చేస్తారని తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి లోకేష్ ఇప్పటికే ప్రకటించారు. అయితే, సీట్లను ప్రకటించేందుకు లోకేష్ ఎవరంటూ భరత్ తండ్రి, రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ మండిపడ్డారు. టీజీ వ్యాఖ్యలపై అధికార పార్టీ నుంచి ఎటువంటి స్పందన లేకపోగా.. కనీసం ఆయనకు షోకాజ్ నోటీసు జారీ చేసేందుకు కూడా పార్టీ ముందుకు రాలేదు. పత్తికొండ నియోజకవర్గంలో ఏకంగా డిప్యూటీ సీఎం కేఈ కృష్ణమూర్తికి వ్యతిరేకంగా తుగ్గలి నాగేంద్ర పర్యటిస్తున్నారు. దీనికి సంబంధించి జిల్లా అధ్యక్షుడు సోమిశెట్టిపై మండిపడటం తప్ప కేఈ ఏమీ చేయలేకపోయారు. ఇదే తరుణంలో కర్నూలు నగరంలోనూ ఎమ్మెల్యే ఎస్వీకి పోటీగా టీజీ భరత్ అదే పార్టీ కండువా కప్పుకుని పర్యటిస్తే అడ్డుచెప్పే అవకాశం లేదన్నది వీరి అభిప్రాయంగా ఉన్నట్టు తెలుస్తోంది. వార్డుల వారీగా సమస్యలను తెలుసుకోవడంతో పాటు ఎమ్మెల్యే వైఖరిని కూడా ఆయన ఎండగట్టే అవకాశముంది. ఇదే జరిగితే ఇరువర్గాల మధ్య పోటీ మరింత ముదిరే సూచనలు కన్పిస్తున్నాయి. -
‘సీటు’ఫైట్!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: ఎన్నికలకు సమయం ఉన్నప్పటికీ కర్నూలు అసెంబ్లీ సీటు విషయంలో అధికార పార్టీలో పెద్ద యుద్ధమే జరుగుతోంది. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, సీటు ఆశిస్తున్న టీజీ భరత్ పోటాపోటీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. ప్రతీ రోజూ ఏదో ఒక బూత్ కమిటీలతో టీజీ భరత్ సమావేశమవుతున్నారు. అంతేకాకుండా తనకే సీటు వస్తుందని... సీఎం చంద్రబాబు ఇంకా స్పందించలేదన్న విషయాన్ని వారికి గుర్తుచేస్తున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు బరిలో ఉంటే తప్ప తాను కర్నూలు సీటు వదులుకునేది లేదని స్పష్టం చేస్తున్నారు. కేవలం మంత్రి లోకేష్ ప్రకటించిన మాత్రాన సీటు ఖరారు చేసినట్టు కాదని ఆయన అనుచరులు కూడా బయట ప్రచారం చేయడం ప్రారంభించారు. మరోవైపు ఎమ్మెల్యే ఎస్వీ వార్డుల్లో పర్యటిస్తుండగా.... ఇటు టీజీ భరత్ ప్రతీ రోజూ సాయంత్రం నియోజకవర్గంలోని పలు బూతు కమిటీ నాయకులు, కార్యకర్తలతో సమావేశం నిర్వహిస్తున్నారు. ప్రధానంగా గతంలో తన తండ్రి టీజీ వెంకటేష్ హయాంలో జరిగిన అభివృద్ధిని ప్రజలకు వివరించాలని పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. అంతేకాకుండా ఎవరికి సీటు వస్తుందనే విషయంపై అసలు చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేస్తున్నారు. మరోవైపు వచ్చే సాధారణ ఎన్నికల్లో కర్నూలు అసెంబ్లీ సీటుకు పోటీ చేయడం ఖాయమని టీజీ భరత్ తేల్చిచెబుతున్నారు. అయితే, ఎలా పోటీ చేస్తామన్న విషయంపై అప్పుడే చర్చలు, ఆందోళన అవసరం లేదని కూడా పేర్కొంటున్నారు. కేవలం తన వెంట నడిచేందుకే ప్రస్తుతానికి సిద్ధం కావాలని... సీటు విషయంపై అధికార తెలుగుదేశం పార్టీలో సర్వే చేసిన తర్వాతే అభ్యర్థిని ప్రకటిస్తారన్న అంశాన్ని విస్తృతంగా ఆయన ప్రచారం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ఇరువురు నేతలు పోటాపోటీగా సమావేశాలు నిర్వహిస్తుండటం కర్నూలు అసెంబ్లీ రాజకీయాల్లో ఆసక్తి రేపుతోంది. పోటాపోటీగా...! ఒకవైపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి వార్డు పర్యటనలను కొనసాగిస్తున్నారు. మరోవైపు టీజీ భరత్ వార్డుల వారీగా సమావేశాలను నిర్వహిస్తున్నారు. అంతేకాకుండా అటువైపు ఎవరెవరు నేతలు, కార్యకర్తలు ఉన్నారనే అంశాన్ని ఇరువురు నేతలు వాకబు చేస్తున్నారు. తద్వారా అవతలి నేతలు, కార్యకర్తలను ఆకర్షించేందుకు ఇరువురు పోటీపడుతున్నారు. ప్రస్తుతానికి వచ్చే ఎన్నికల్లో ఎమ్మెల్యే అభ్యర్థిగా మంత్రి లోకేష్ కర్నూలు పర్యటనలో ప్రకటించినప్పటికీ... ఎన్నికల సమయం వచ్చే నాటికి కచ్చితంగా సర్వే ప్రకారమే అభ్యర్థులను ఖరారు చేస్తారని టీజీ భరత్ పేర్కొంటున్నట్టు తెలుస్తోంది. గతంలోనూ ఇదే తరహాలో సీట్లు ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తుచేస్తున్నారు. ఒకవేళ సీటు ఇవ్వకపోయినప్పటికీ తాను పోటీ చేసేది మాత్రం పక్కా అని ఆయన స్పష్టం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో బలాన్ని మరింత పెంచుకునేందుకు తనవైపు వచ్చే నేతల వివరాలను ఆయన వార్డుల వారీగా సేకరిస్తున్నారు. ఆ నేతలతో మాట్లాడి... తన వెంట నడవాలని కోరుతున్నట్టు తెలుస్తోంది. ఇక మరోవైపు ఎమ్మెల్యే కూడా తనకు బలం ఉందని నిరూపించుకునే ప్రయత్నం చేస్తున్నారు. అధికారపార్టీలో ఇలా ఇరువురు నేతల మధ్య బలాలప్రదర్వన కొనసాగుతోంది. అయితే, కర్నూలు నియోజకవర్గంలో మాత్రం ప్రధానంగా ప్రజలు ప్రతిపక్ష వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ వైపు చూస్తున్నారు. ఆ పార్టీకి పట్టుగొమ్మలుగా ఉన్న మైనార్టీ వర్గాల ఓటు బలం ఎక్కువగా ఉండటంతో ఆ పార్టీకే తమ మద్దతు అని తేల్చిచెబుతున్నారు. -
టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు
కర్నూలు : జిల్లా టీడీపీలో మళ్లీ కుర్చీ కొట్లాట రాజుకుంది. రాజ్యసభ ఎంపీ టీజీ వెంకటేష్ కుమారుడు టీజీ భరత్ సంచలన వ్యాఖ్యలు చేశారు. కర్నూలు అభివృద్ధి చెందాలంటే రానున్న ఎన్నికల్లో సీఎం చంద్రబాబు నాయుడు కర్నూలు నుంచి పోటీ చేయాలని వ్యాఖ్యానించారు. చంద్రబాబు జిల్లా నుంచి పోటీ చేస్తే 14 సీట్లు టీడీపీ సొంతం అవుతాయని అన్నారు. చంద్రబాబు కర్నూలు నుంచి పోటీ చేయలేని పక్షంలో సర్వే ప్రకారం గెలిచే వారికే కర్నూలు సీటు కేటాయించాలని కోరారు. కొంతకాలంగా స్థానిక ఫిరాయింపు ఎమ్మెల్యే ఎస్వీ మోహన్ రెడ్డి, టీజీ భరత్‌ల మధ్య సీటు పోరు కొనసాగుతోంది. ఇటీవల మంత్రి లోకేష్, కర్నూలు ఎంపీ, ఎమ్మెల్యేల సీట్ల ప్రకటనతో టీజీ వర్గం ఆత్మరక్షణలో పడింది. తాజా టీజీ వ్యాఖ్యలతో మళ్లీ సీటు వివాదం తెరపైకి వచ్చింది. -
ఒకే కుటుంబానికి మూడు సీట్లా?!
సాక్షి ప్రతినిధి, కర్నూలు: కర్నూలు అసెంబ్లీ నియోజకవర్గ సీటు విషయంలో టీజీ, ఎస్వీ వర్గాల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. నిన్నటివరకు కేవలం టీజీ భరత్, ఎస్వీ మోహన్రెడ్టిలకే పరిమితమైంది. తాజాగా టీజీ వెంకటేష్ కూడా రంగంలోకి దిగారు. ఒకే కుటుంబానికి మూడు సీట్లు ఉన్నాయని, ఒక సీటు తగ్గినా నష్టం లేదులే అని టీజీ వ్యాఖ్యానించారు. ఒకవేళ తాను పత్తికొండలో పోటీ చేస్తానంటే కేఈ వాళ్లు తుంగభద్రలో పడేస్తారని, ఆళ్లగడ్డలో పోటీకి దిగితే కుటుంబ సభ్యులు ఇంట్లోకి కూడా రానివ్వరని ఎస్వీ మోహన్ రెడ్డి పేర్కొన్నారు. రాజకీయంగా పునర్జన్మ ఇచ్చిన కర్నూలును వదిలిపెట్టిపోనని ఆయన మరోసారి స్పష్టం చేశారు. కర్నూలు నగరంలో నిర్వహించిన జన్మభూమి సభలో పాల్గొన్న సందర్భంగా గురువారం ఇద్దరి మధ్య మాటల యుద్ధం నడిచింది. వాస్తవానికి కొంతకాలంగా కర్నూలు సీటు విషయంలో అధికార పార్టీలో టీజీ భరత్, ఎస్వీ మోహన్‌రెడ్డి మధ్య రచ్చ జరుగుతోంది. కర్నూలు నుంచి తాను పోటీ చేస్తానని టీజీ భరత్ అంటుండగా... సిట్టింగ్ ఎమ్మెల్యేగా సీటు తనదేనని ఎస్వీ చెబుతున్నారు. మరోవైపు నియోజకవర్గాలు పెరిగే అవకాశం ఉందంటూ టీజీ వాతావరణాన్ని కొంత చల్లబరిచే ప్రయత్నం చేసినప్పటికీ.. కుటుంబంలో ముగ్గురికి ఎలా సీట్లు ఇస్తారనే కొత్త వాదనను మాత్రం తెరమీదకు తెచ్చారు. ఒకే వాహనంలో తిరుగుతూనే.. కర్నూలులోని ఎన్ఆర్ పేట నుంచి ఎస్.నాగప్ప స్ట్రీట్ వరకూ గురువారం జన్మభూమి సభలు జరిగాయి. ఈ సందర్భంగా టీజీ, ఎస్వీ ఇద్దరూ ఒకే వాహనంలో కలిసి తిరిగారు. వీరితో పాటు మునిసిపల్ కమిషనర్ కూడా ఉన్నారు. ఒకే వాహనంలో తిరుగుతున్నప్పటికీ కర్నూలు సీటు విషయానికి వచ్చేసరికి ఎవరికివారుగా వ్యాఖ్యలు చేస్తుండటం గమనార్హం. పైగా ఇప్పటివరకు టీజీ భరత్, ఎస్వీకే పరిమితమైన మాటల యుద్ధం.. తాజాగా టీజీ వెంకటేష్, ఎస్వీ మధ్య మారినట్టు అర్థమవుతోంది. నియోజకవర్గాల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, అప్పుడు సీట్లకు ఇబ్బంది ఉండదని కూడా ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ వ్యాఖ్యానించారు. అయితే, స్వయంగా టీజీ వెంకటేష్ రాజ్యసభలో వేసిన ప్రశ్నకు నియోజకవర్గాల పునర్విభజన లేదంటూ సమాధానం వచ్చింది. అయినప్పటికీ మాట వరుసకే ఆయన ఇలా అన్నారని తెలుస్తోంది. -
పందెం కోళ్లు
సాక్షి ప్రతినిధి, కర్నూలు: సంక్రాంతి పండుగకు ముందే జిల్లాలో ‘పందెంకోళ్లు’ రె‘ఢీ’ అయ్యాయి. వచ్చే ఎన్నికల బరిలో ఉండేది తామేనంటూ ఎవరికి వారు ధీమాగా చెబుతున్నారు. తామే గెలుపు కోళ్లమని కూడా ప్రకటించుకుంటున్నారు. మొత్తమ్మీద అధికారపార్టీలో సీట్ల లొల్లి షురూ అయ్యింది. ప్రధానంగా కర్నూలు, ఆళ్లగడ్డ నియోజకవర్గాల్లో బరిలో ఉండేది ‘నేనే అంటే నేనే’ అంటూ పోటీపడుతున్నారు. కర్నూలు నియోజకవర్గంలో సర్వే ఆధారంగా తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ప్రకటిస్తుండగా.. సిట్టింగ్ ఎమ్మెల్యే హోదాలో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ మోహన్‌రెడ్డి చెబుతున్నారు. ప్రతి జన్మభూమి సభలోనూ వచ్చే సాధారణ ఎన్నికల్లో తానే పోటీ చేయనున్నట్టు ఎస్వీ ప్రకటిస్తుండటం చర్చనీయాంశమవుతోంది. మరోవైపు సర్వే ఆధారంగా గెలుపు అభ్యర్థిని తానేనని, అందువల్ల తనకే సీటు వస్తుందని టీజీ భరత్ ఒక అడుగు ముందుకేసి చెబుతున్నారు. ఓడిపోయే అభ్యర్థికి సీటు ఇవ్వరంటూ పరోక్షంగా ఎస్వీ మోహన్ రెడ్డిని ఉద్దేశించి వ్యాఖ్యానిస్తున్నారు. ఇక ఆళ్లగడ్డ నియోజకవర్గంలోనూ సీట్ల పోరు కొత్త సంవత్సరం వేడుక సాక్షిగా మొదలయ్యింది. ఇక్కడ టీడీపీ తరఫున బరిలో నిలిచేది తానేనని భూమా నాగిరెడ్డి సన్నిహిత మిత్రుడు ఏవీ సుబ్బారెడ్డి తన సన్నిహితుల వద్ద వ్యాఖ్యానిస్తుండటం కలకలం రేపుతోంది. అంతేకాకుండా బలనిరూపణకు వేదికగా ఆయన నూతన సంవత్సర వేడుకలను నిర్వహించారు. మంత్రి అఖిలప్రియ వద్దన్నప్పటికీ బలమేమిటో నిరూపించుకోగలగడం ద్వారా తానే పందెం కోడినని ఏవీ సుబ్బారెడ్డి స్పష్టం చేస్తున్నారు. నేనంటే నేనే..! కర్నూలు నియోజకవర్గంలో ఎవరికి ఓటు వేస్తారంటూ ఓటర్లందరి ఫోన్లకు వాయిస్ మెసేజ్ పంపి సర్వే చేపట్టారు. ఇందులోనే ఎవరు మీ అభ్యర్థి అంటూ మొదటి నెంబరు టీజీ భరత్‌కు, రెండో నెంబరు ఎస్వీ మోహన్ రెడ్డికి కేటాయించడంతో అసలు పోరు మొదలయ్యింది. ఈ సర్వేతోనే సీటు గొడవ మొదలయ్యింది. గెలిచే అభ్యర్థి తానేనని, అందువల్ల సీటు తనకేనని టీజీ భరత్ స్పష్టం చేస్తున్నారు. అయితే, గత మూడు రోజులుగా ప్రతి జన్మభూమి సభలోనూ తానే కర్నూలు నుంచి పోటీ చేస్తానని, కొందరు కావాలని పత్తికొండ నుంచి పోటీ చేస్తారంటూ ప్రచారం చేస్తున్నారని ఎస్వీ మోహన్‌రెడ్డి పదే పదే చెబుతున్నారు. ఇక ఆళ్లగడ్డలోనూ తాజాగా పోరు మొదలయ్యింది. నూతన సంవత్సర వేడుకల సాక్షిగా భూమా అఖిలప్రియ, ఏవీ సుబ్బారెడ్డి మధ్య సీట్ల గొడవ ప్రారంభమైంది. తనకే అధిక బలం ఉందని నిరూపణ కోసం ఏవీ ప్రయత్నించారు. భూమా బంధువులు కూడా తన వెంటే నడుస్తారని చెప్పుకోవడంలో ఆయన సఫలీకృతుడయ్యారు. మరోవైపు తన వర్గాన్ని కాపాడుకునే పనిలో మంత్రి అఖిలప్రియ నిమగ్నమయ్యారు. ఏవీ పార్టీకి వెళ్లకుండా అడ్డుకట్ట వేసే పని చేశారు. మంత్రిగా, తన తండ్రి వారసురాలిగా తనకే సీటు అని ఆమె ధీమా వ్యక్తం చేస్తున్నారు. సర్వే గుబులు! ఇక అధికార పార్టీ నేతల్లో సర్వే గుబులు ప్రారంభమయ్యింది. మొదట్లో కేవలం కర్నూలు నియోజకవర్గంలోనే అభ్యర్థిపై సర్వే జరగగా... తాజాగా అన్ని నియోజకవర్గాల్లోని ఓటర్లకు ఫోన్లు వస్తుండటం గమనార్హం. పోటీలో ఎవరు నిలబడితే గెలుస్తారో చెప్పాలంటూ ఐవీఆర్ఎస్ ద్వారా ఆయా నియోజకవర్గ ఓటర్లకు ఫోన్లు వస్తున్నాయి. ఈ సర్వే ఆధారంగా అభ్యర్థిని ఖరారు చేస్తారనే గుబులు అందరిలోనూ మొదలయ్యింది. సర్వే ఆధారంగా ఇస్తే తమ భవితవ్యం ఏమిటని కొందరు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొత్తమ్మీద అధికార పార్టీలో సంక్రాంతి సాక్షిగా ఎన్నికల పందెం కోళ్ల పోటీ ప్రారంభమయ్యిందన్నమాట! -
టీజీ భరత్‌కు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు
కర్నూలు (టౌన్): టీజీవి గ్రూపు సంస్థలో ఒకటైన శ్రీ రాయలసీమ హైస్ట్రెంగ్త్ హైపో అలైడ్ పరిశ్రమల సీఎండీ టీజీ భరత్‌కు బిజినెస్ ఎక్స్‌లెన్స్ అవార్డు దక్కింది. ప్రతి ఏడాది హెచ్ఎం టీవీ ఈ అవార్డును అందజేస్తోంది. ఈ ఏడాది అవార్డును హైదరాబాదులో కేంద్ర మంత్రులు వెంకయ్యనాయుడు, బండారు దత్తాత్రేయ చేతుల మీదుగా టీజీ భరత్ అందుకున్నారు. -
కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీకి కృషి
– రాజ్యసభ సభ్యుడు టీజీ వెంకటేష్ – అట్టహాసంగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు ప్రారంభం – కర్నూలులో క్రీడాకారుల మోటార్ సైకిల్ ర్యాలీ కర్నూలు (టౌన్): కర్నూలులో బ్యాడ్మింటన్ అకాడమీ ఏర్పాటుకు తన వంతు కృషి చేస్తానని రాజ్యసభ సభ్యులు టీజీ వెంకటేష్ అన్నారు. బుధవారం.. టీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. పోటీలను పురస్కరించుకొని స్థానిక మౌర్య ఇన్ వద్ద బ్యాడ్మింటన్ క్రీడాకారుల ర్యాలీని టీజీ వెంకటేష్ జెండా ఊపి ప్రారంభించారు. ఈ ర్యాలీ మౌర్య ఇన్, రాజ్‌విహార్ సర్కిల్, జిల్లా పరిషత్తు, గాంధీనగర్, విద్యానగర్, కిడ్స్ వరల్డ్, కోట్ల సర్కిల్ మీదుగా ఇండోర్ స్టేడియం వరకు సాగింది. ఇండోర్ స్టేడియంలో జ్యోతి ప్రజ్వలనతో పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా టీజీ వెంకటేష్ మాట్లాడుతూ.. రాష్ట్రంలోనే మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలు నిర్వహించడం సంతోషించదగ్గ విషయమన్నారు. భారత దేశంలో బ్యాడ్మింటన్ క్రీడకు ఎనలేని ప్రాచుర్యం లభించిందన్నారు. రాష్ట్ర స్థాయిలో లీగ్ పోటీలు నిర్వహించడంతో కర్నూలులో ఈ క్రీడ అభివృద్ధిఖఙ అవకాశం ఏర్పడుతుందన్నారు. టీజీ భరత్ ఆంధ్రా బ్యాడ్మింటన్ అసోసియేషన్ చైర్మన్ టీజీ భరత్ మాట్లాడుతూ.. బ్యాడ్మింటన్ క్రీడాకారునిగా సౌత్‌జోన్ స్థాయి వరకు ఆడిన తాను ఈ క్రీడ అభివృద్ధికి కృషి చేస్తున్నానన్నారు. క్రికెట్ తరహాలో ఈ క్రీడకు ప్రాచుర్యం తీసుకురావాలని కర్నూలులో భారీ ర్యాలీ నిర్వహించినట్లు చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని క్రీడలను సమాన అవకాశాలు కల్పించాలన్నారు. భారత బ్యాడ్మింటన్ సమాఖ్య అధ్యక్షుడు పున్నయ్య చౌదరి మాట్లాడుతూ.. భారతదేశంలోనే మొట్టమొదటిసారిగా బ్యాడ్మింటన్ లీగ్ పోటీలను నిర్వహించడం కర్నూలుకే గర్వకారణమన్నారు. జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో బ్యాడ్మింటన్ ఆడుతున్న 60 మంది క్రీడాకారులను వేలం ద్వారా కోనుగోలు చేసి లీగ్ పోటీలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాజమండ్రి, ఒంగోలు, విశాఖపట్నం, విజయవాడలో ఫైనల్స్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. పోటీల్లో రాయలసీమ వారియర్స్, వైజాగ్ ఎసర్స్, గోదావరి గన్స్ తదితర టీమ్‌లు తలపడనున్నాయి. గెలుపొందిన వారికి రూ. 10 లక్షలు విలువ చేసే బహుమతులు ఇస్తున్నట్లు నిర్వహకులు వెల్లడించారు. కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు నారాయణరెడ్డి, రవికిరణ్, శ్రీనివాస భట్, వంశీ, రవికళాధర్ రెడ్డి పాల్గొన్నారు. -
ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్
- ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి డిమాండ్ - రాష్ట్ర అధ్యక్షుడిగా టి.జి.భరత్ ఎన్నిక కర్నూలు(టౌన్): ఆర్యవైశ్యులకు ప్రత్యేక కార్పొరేషన్ ఏర్పాటు చేయాలని ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం స్థానిక పూలబజార్‌లోని చిన్న అమ్మవారి శాలలో ఈ సమితి ఏర్పాటయ్యింది. వివిధ ఆర్యవైశ్య సంఘాలకు చెందిన నాయకులు సాధన సమితికి నూతన అధ్యక్షుడిగా టి.జి.భరత్‌ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా లోగోను ఆవిష్కరించారు. డిమాండ్లతో కూడిన కరపత్రాలను సమావేశంలో విడుదల చేశారు. వివిధ ఆర్యవైశ్య సంఘాలు టీజీ భరత్‌ను ఘనంగా సన్మానించాయి. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో టీజీ భరత్ మాట్లాడుతూ..ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, కాపు, బ్రాహ్మణ కులాలకు ప్రత్యేక కార్పొరేషన్లు ఏర్పాటు చేసిన ప్రభుత్వం ఆర్యవైశ్యులను మాత్రం విస్మరిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్యవైశ్యుల్లో ఐకమత్యం లేకపోవడం వల్లే ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయన్నారు. అందరినీ ఏకతాటిపైకి తీసుకువచ్చి హక్కుల సాధన కోసం గాంధీ మార్గాన్ని ఎంచుకుంటామని ప్రకటించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల్లో పర్యటిస్తూ సమితిని జిల్లాస్థాయి, మండల స్థాయి, గ్రామ స్థాయిలో బలోపేతం చేస్తామన్నారు. చిరు వ్యాపారులకు తక్కువ వడ్డీతో రుణాలు ఇప్పించేందుకు ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తామన్నారు. రాష్ట్రంలో ప్రతి పేద ఆర్యవైశ్యునికి ప్రభుత్వం ఉచిత గృహం నిర్మించాలన్నారు. జనాభా ప్రాతిపదికన చట్టసభల్లో, స్థానిక సంస్థల ఎన్నికల్లో ఎక్కువ సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో టి.జి.శివరాజు, మార్కెట్ యార్డు చైర్మన్ శమంతకమణి, శ్రీశైలం ట్రస్టు బోర్డు మాజీ చైర్మన్ ఇమ్మిడిశెట్టి కోటేశ్వరరావు, కాశీ అన్నపూర్ణ సత్రం అధ్యక్షులు వై.బాలకృష్ణ, ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షుడు జయంతి వెంకటేశ్వర్లు, అవోపా నాయకులు రత్నప్రసాద్, వాసవీ సేవాదళ్, వాసవీ క్లబ్ సభ్యులు, ఆర్యవైశ్య సంఘ సభ్యులు, ఆర్యవైశ్య మహిళా మండలి సభ్యులు, ఆ సంఘం జిల్లా అధ్యక్షులు పత్తి ప్రసాద్, శేషగిరి శెట్టి, సుబ్రహ్మణ్యం, నందకిషోర్ తదితరులు పాల్గొన్నారు. నూతన కమిటీ ఏర్పాటు ఆర్యవైశ్య హక్కుల సాధన సమితి సమావేశం అనంతరం నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షుడుగా ఎన్నికైన టి.జి.భరత్‌తో పాటు ప్రధాన కార్యదర్శి ఇల్లూరు లక్ష్మయ్య, కోశాధికారి తిరుపాల్ బాబు, జిల్లా అధ్యక్షుడు ఇల్లూరు సుధాకర్, కర్నూలు పట్టణ అధ్యక్షుడు సోమిశెట్టి నవీన్, పట్టణ ప్రధాన కార్యదర్శిగా లగిశెట్టి కిరణ్‌లను ఎన్నుకున్నారు.