ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ | Katasani Ram Bhupal Reddy Slams Chandrababu | Sakshi
Sakshi News home page

ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ

Published Sun, Nov 25 2018 10:48 AM | Last Updated on Sun, Nov 25 2018 10:48 AM

Katasani Ram Bhupal Reddy Slams Chandrababu - Sakshi

ప్రసంగిస్తున్న కాటసాని రాంభూపాల్‌రెడ్డి సభకు హాజరైన ప్రజలు

కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలపై చూపిస్తున్నది కపట ప్రేమేనని మాజీ ఎమ్మెల్యే వైఎస్‌ఆర్‌సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు.  మంత్రివర్గంలో ముస్లింలకు నాలుగున్నర ఏళ్లుగా  స్థానం కల్పించని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం  ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు.  హఫీజ్‌ ఖాన్‌ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీలోని లాల్‌మసీదు రోడ్డులో పదో వార్డుకు సంబంధించిన రెండు పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంతంలో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. సభకు అదనపు రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్‌ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి అతిథిగా హాజరై ప్రసంగించారు. 

తండ్రి వైఎస్‌ఆర్‌ బాటలోనే తనయుడు వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర  చేస్తున్నారన్నారు. ప్రజల కోసం నవరత్నాలు రూపొందించారని తెలిపారు.  హఫీజ్‌ ఖాన్‌ మాట్లాడుతూ టీజీ భరత్‌ నిర్వహిస్తున్నది  విజన్‌ యాత్ర కాదు.. రాజకీయ ఉనికి యాత్ర  అని విమర్శించారు.   ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నగరాభివృద్ధి కోసం కాకుండా   తన ఆస్తుల అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరారని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేసే వాడే నిజమైన నాయకుడన్నారు. 

అంతకు ముందు కేక్‌ కట్‌ చేసి లావుబాలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జహీర్‌ అహ్మద్‌ఖాన్, నూరుల్లా ఖాద్రి, మాజీ కార్పొరేటర్లు మున్నా, పి.రహ్మాన్, విఠల్, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు కటారి సురేశ్‌కుమార్, రైల్వే ప్రసాద్, ఎస్‌.ఎ.అహ్మద్, ఆదిమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, నజీర్‌ అహ్మద్‌ఖాన్, రియాజ్, ఫైజాన్, హకీం, ఏసన్న, ప్రభుదాస్, మాలిక్, జమీలా, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement