Katasani Ram Bhupal Reddy
-
జగన్ నాయకత్వంలో పథకాల అమలు కోసం పోరాటం చేస్తాం
-
చంద్రబాబుపై కాటసాని సెటైర్లు
-
‘నాకు రూ.వెయ్యికోట్ల ఆస్తి ఉన్నట్లు నిరూపిస్తే రామోజీకే రాసేస్తా..’
-
జగనన్నే మా భవిష్యత్తు కార్యక్రమంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి పాల్గొన్నారు
-
ఇచ్చిన ప్రతి మాట నెరవేరుస్తున్నారు అది సీఎం జగన్ అంటే..
-
సీఎంను కలిసిన పాణ్యం ఎమ్మెల్యే.. కుమారుడి వివాహానికి ఆహ్వానం
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన భార్య కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివ నరసింహారెడ్డితో పాటు కలిశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాయంలో కలిసి ఈ నెల 22వ తేదీన కర్నూలులోని పంచలింగాల సమీపంలోని మాంటీస్సొరి పాఠశాల ఆవరణలో జరిగే తమ కుమారుడు శివ నరసింహారెడ్డి వివాహానికి హాజరు కావాలని పెళ్లి పత్రికను అందించారు. -
న్యాయ రాజధాని కోసం ‘సీమ’లో మళ్లీ ఉద్యమం
కర్నూలు ప్రాంతం దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైంది. ఈ నేపథ్యంలో ఇక్కడి ప్రజల కష్టాలు తీర్చేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం హైకోర్టు ఏర్పాటు చేయతలపెట్టింది. 2019లోనే మూడు రాజధానుల బిల్లు ప్రవేశపెట్టినా కొన్ని విపక్షాలు కోర్టుల్లో కేసులు వేసి, మరోమారు ‘సీమ’ను దగా చేసే యత్నానికి ఒడిగట్టాయి. ఈ క్రమంలో ‘సీమ’ వాసులు మళ్లీ గళమెత్తుతున్నారు. ఉద్యమాన్ని తీవ్రం చేసేందుకు ఈ నెల 15న కర్నూలు వేదికగా సమావేశం కానున్నారు. సాక్షి, కర్నూలు: ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటు తర్వాత కర్నూలే రాష్ట్ర రాజధాని.. ఆపై హైదరాబాద్‌కు తరలించారు. హైకోర్టు కర్నూలులో ఏర్పాటు చేస్తామని అప్పట్లో ప్రకటించారు. ప్రతి రాజకీయపార్టీ ‘సీమ’లో ప్రాబల్యం కోసం దీన్ని రాజకీయ అస్త్రంగా వాడుకోవడం మినహా చిత్తశుద్ధి చూపలేదు. ఈ క్రమంలో 2014లో తెలంగాణ ఏర్పాటుతో హైదరాబాద్ దూరమైంది. దశాబ్దాలుగా హైదరాబాద్ కేంద్రంగానే అభివృద్ధి జరిగింది. ఫార్మా, ఐటీలతో పాటు అన్ని రకాల పరిశ్రమలు హైదరాబాద్ సమీపంలోనే స్థాపించారు. విద్యా, వైద్యంతో పాటు ఏ అవసరమున్నా హైదరాబాద్‌కు వెళ్లాల్సిన అనివార్య పరిస్థితిని పాలకులు కల్పించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో హైదరబాద్ దూరం కావడంతో రాష్ట్రానికి ప్రధాన ఆదాయ వనరు లేకుండా పోయింది. ఈ అనుభవంతో 2014లో టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత అభివృద్ధి వికేంద్రీకరణ జరగాలి, కర్నూలులో హైకోర్టు ఏర్పాటు చేయాలని ఉద్యమించారు. దీన్ని చంద్రబాబు విస్మరించారు. 2019లో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అభివృద్ధి వికేంద్రీకరణ చేస్తూ, విశాఖను పాలన రాజధానిగా, కర్నూలు న్యాయ రాజధాని, అమరావతిని శాసన రాజధానిగా చేస్తూ బిల్లు ప్రవేశపెట్టింది. హైదరాబాద్ విషయంలో జరిగిన పొరపాటు మరోసారి జరగకుండా జాగ్రత్త తీసుకుంది. దీనిపై రాష్ట్రవ్యాప్తంగా హర్షం వ్యక్తమైంది. అన్ని ప్రాంతాలను ప్రభుత్వం సమానంగా భావిస్తోందనే చర్చ మొదలైంది. ‘సీమ’కు ద్రోహం చేసేలా రాజకీయపార్టీల వైఖరి ప్రభుత్వ ప్రకటన తర్వాత ఒక్కసారిగా విపక్ష పార్టీలు స్వరం మార్చాయి. అమరావతి రాజధానిగా ఉండాలని ఆ పారీ్టలు ప్రకటన చేశాయి. చివరకు జిల్లా వాసి, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఇదే స్వరం విని్పంచారు. జిల్లా టీడీపీ నేతలు జయనాగేశ్వరరెడ్డి, అఖిలప్రియ, సోమిశెట్టి వెంకటేశ్వర్లు, తిక్కారెడ్డితో పాటు పలువురు టీడీపీ నేతలు రాజధానిగా అమరావతి వైపే మొగ్గు చూపారు. 2019లో జీఎన్‌రావు కమిటీ, బోస్టన్‌కమిటీ రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు తిరిగి పరిస్థితులు అధ్యయనం చేసి ప్రజాభిప్రాయాలు తీసుకుని నివేదికలు ఇచ్చాయి. ఈ కమిటీలు కూడా వికేంద్రీకరణే శ్రేయస్కరమని సూచించాయి. కానీ టీడీపీ నేతలు అమరావతిలో ఆస్తులు కొనుగోలు చేసి వాటిని కాపాడుకునే క్రమంలో వికేంద్రీకరణకు వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేయించారు. దీంతో హైకోర్టు తరలింపు ప్రక్రియలో జాప్యం జరుగుతోంది. హెచ్ఆర్సీ, లోకాయుక్త ఏర్పాటు న్యాయరాజధానిలో భాగంగా ఇప్పటికే మానవహక్కుల కమిషన్, లోకాయుక్త కార్యాలయాలు జిల్లాలో ఏర్పాటయ్యాయి. త్వరలోనే మరిన్ని ట్రిబ్యునల్స్ రానున్నాయి. హైకోర్టుతో పాటు మొత్తం 43కుపైగా అనుబంద ట్రిబ్యునల్స్ జిల్లాకు రానున్నాయి. వీటి ఏర్పాటుతో కర్నూలు అభివృద్ధి మరోస్థాయికి చేరనుంది. కానీ కోర్టు కేసులతో జాప్యం జరగనుండటంతో ప్రజల ఆకాంక్షలు మరోసారి తెలియజేసేలా రాయలసీమలోని ఉద్యోగ, వ్యాపార, విద్యార్థి, న్యాయవాద వర్గాలు, సంఘాలు కలిసి వికేంద్రీకరణ పరిరక్షణ సమితి ఏర్పాటు చేశాయి. దీని కన్వీనర్‌గా క్రిష్టఫర్, ఛాంబర్ ఆఫ్ కామర్స్ జిల్లా అధ్యక్షుడు విజయ్‌కుమార్‌రెడ్డిలు సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. న్యాయరాజధాని సాధన దిశగా కార్యాచరణ రూపొందించనున్నారు. సాక్షి, కర్నూలు (రాజ్‌విహార్): రాష్ట్రంలో మూడు రాజధాలను ఏర్పాటు చేయడంతోనే అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందుతాయని వైఎస్సార్సీపీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. చంద్రబాబు నాయుడు తన, తన అనుచరుల రియల్ దందా కోసమే పాదయాత్ర చేయిస్తున్నారని అన్నారు. గతంలో 14 ఏళ్ల పాటు ఆయన సీఎంగా ఉన్నా రాష్ట్రాభివృద్ధి కంటే స్వలాభం కోసమే ఎక్కువ శ్రమించారన్నారు. ఇచ్చిన హామీలను విస్మరిస్తూ ప్రజలను మోసం చేస్తూ వచ్చారు తప్ప ఏం సాధించారో చెప్పాలన్నారు. శ్రీబాగ్ ఒప్పందంకు అనుగుణంగా శివరామకృష్ణ, శ్రీరామకృష్ణ కమిటీలు నివేదికలు ఇచ్చినా ఆయన ఎందుకు సాధించలేకపోయారన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రలు వెనకబడిపోయినా, వీటి గురించి ఆలోచించని ఆయన కేవలం ఒక సామాజిక వర్గం భూమి కొనుగోలు చేసిన ప్రాంతం అభివృద్ధి కోసం తపిస్తున్నారన్నారు. 1953లో వచ్చిన రాజధాని కోల్పోయిన తాము ఇప్పుడు వచ్చిన హైకోర్టును పోగొట్టుకోలేమని, ఇందు కోసం ఎలాంటి ఉద్యమాలకైనా సిద్ధంగా ఉన్నామని స్పష్టం చేశారు. అనంతరం మాజీ ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి మాట్లాడుతూ గతంలో చెన్నై, తాజాగా హైదరాబాదు అభివృద్ధి చెందిన తరువాత వదిలి వచ్చామని, ఇప్పుడు విజయవాడ, గుంటూరు అభివృద్ధి చెందిన తరువాత వదిలేసి వెళ్లమంటే పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. జగన్ తీసుకున్న నిర్ణయానికి ప్రజలు మద్దతుగా నిలవాలని చెప్పారు. ఈ సమావేశంలో బీసీ కార్పొరేషన్ల డైరెక్టర్లు గోపాల్‌రెడ్డి, షరీఫ్, పార్టీ రాష్ట్ర నాయకులు సీహెచ్ మద్దయ్య పాల్గొన్నారు. ఎంత వరకైనా వెనకాడం ‘సీమ’కు ప్రతిసారీ దగా జరుగుతోంది. అంతా వెన్నుపోటు పొడవాలని చూస్తున్నారు. హైకోర్టు ఏర్పాటును కూడా అడ్డుకుంటుంటే రేపు ఈ ప్రాంత అభివృద్ధి విషయంలో న్యాయం చేస్తారనే నమ్మకం ఏముంది. హైకోర్టు అనేది ‘సీమ’ హక్కు. కచ్చితంగా ఏర్పాటు చేయాల్సిందే. దీని కోసం ధర్నాలు, పాదయాత్రలు, రిలేదీక్షలు అవసరమైతే ఆమరణదీక్షలు చేస్తాం. ఇప్పుడు న్యాయం జరగకపోతే ప్రత్యేక రాయలసీమ ఉద్యమం కూడా వచ్చే అవకాశం ఉంది. ఇది జరగకుండా న్యాయరాజధాని ఏర్పాటు చేయాలి. – బి.క్రిష్టఫర్, వికేంద్రీకరణ పరిరక్షణ సమితి అధ్యక్షుడు విడతల వారీగా ఉద్యమం అన్ని పార్టీలు, సంఘాలను సదస్సుకు పిలిచాం. ఈ దఫా ఉద్యమం తీవ్రంగా చేయనున్నాం. హైకోర్టు ఏర్పాటయ్యేదాకా ఉద్యమం ఆగదు. అందరి అభిప్రాయాలు తీసుకుని కార్యాచరణ రేపు ప్రకటిస్తాం. టీడీపీ, బీజేపీతో సహా అన్ని పారీ్టలను ఆహ్వానించాం. ఎవరి అభిప్రాయాలు వారు చెప్పొచ్చు. న్యాయరాజధాని ఏర్పాటైతే జరిగే అభివృద్ధి మేం వివరిస్తాం. దీనికి ‘సీమ’ వాసులంతా సహకరించాలి. – విజయ్ కుమార్‌రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, ఛాంబర్ ఆఫ్ కామర్స్ -
టీడీపీ శవ రాజకీయాలు.. అందుకే హైడ్రామా
సాక్షి, కర్నూలు: టీడీపీ నేత నారా లోకేష్ శవ రాజకీయాలు చేస్తున్నారని కర్నూలు ఎమ్మెల్యే హాఫిజ్ ఖాన్ మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ, రాజకీయం కోసం ఏడాది తర్వాత నారా లోకేష్ గొనెగండ్ల మండలం ఎర్రబాడు యువతి మృతిపై అసత్య ఆరోపణలు చేస్తున్నారన్నారు. అనుమానాస్పద మృతి కేసుపై సమగ్ర దర్యాప్తు జరుగుతోందన్నారు. టీడీపీ ప్రభుత్వంలోనే నంద్యాల ముస్లింలపై అక్రమ కేసులు నమోదు చేశారని హఫీజ్‌ఖాన్ గుర్తుచేశారు. టీడీపీ కేబినెట్లో మైనారిటీలకు చోటే లేదన్నారు. టీడీపీ నేతలు ప్రస్తుతం శవ రాజకీయాలు చేస్తున్నారని దుయ్యబట్టారు. ప్రభుత్వ పథకాలను పక్కదోవ పట్టించడానికే టీడీపీ హైడ్రామా ఆడుతుందని ఎమ్మెల్యే హఫీజ్‌ఖాన్ నిప్పులు చెరిగారు. చదవండి: రమ్య హత్య కేసు: హెడ్ కానిస్టేబుల్ ధైర్య సాహసాలు ఏడాది క్రితం ఘటనపై లోకేష్ స్పందించడం హాస్యాస్పదం పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మాట్లాడుతూ, ప్రజలను మభ్య పెట్టేందుకు నారా లోకేష్ మరోసారి కర్నూలు జిల్లా లో పర్యటించారన్నారు. ఏడాది క్రితం ఘటనపై లోకేష్ స్పందించడం హాస్యాస్పదమన్నారు. ఎమ్మెల్యేగా కూడా గెలవలేని లోకేష్ మాటలు పట్టించుకోరని కాటసాని అన్నారు. లోకేష్ దొడ్డి దారిన కర్నూలు జిల్లా వచ్చాడు.. లోకేష్ దొడ్డి దారిన కర్నూలు జిల్లా వచ్చాడని కర్నూలు మేయర్ బీవై రామయ్య ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై పోరాటం చేయాల్సిన నారా లోకేష్, ఓ యువతి కుటుంబాన్ని అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని బీవై రామయ్య దుయ్యబట్టారు. నారా లోకేష్, చంద్రబాబు వెన్నుపోటు రాజకీయాలు, అసత్య ఆరోపణలు చేస్తూ రాజకీయ లబ్ధి పొందడానికి ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. ఇవీ చదవండి: ఇడ్లీ, పూరీ అంటే ఇష్టం.. దోశ, వడ కూడా.. ‘బుల్లెట్టు బండి’ పాటకు వధువు సూపర్ డ్యాన్స్.. ముగ్ధుడైన భర్త -
‘లోకేష్ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ’
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని దుయ్యబట్టారు. ‘‘నారాయణరెడ్డి హత్య కేసు దోషులకు అండగా నిలిచింది మీరు కాదా?. మా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. జంట హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరపొచ్చు’’ అని కాటసాని స్పష్టం చేశారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హితవు పలికారు. ‘‘2004 వైఎస్సార్ హయాం నుంచే మేం ఫ్యాక్షన్‌కు దూరంగా ఉన్నాం. టీడీపీ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగింది. వైఎస్సార్ హయాంలోనే రాయలసీమకు నీరు అందించామని’’ కాటసాని రాంభూపాల్ అన్నారు. లోకేష్‌కు సంస్కారం లేదు: బీవై రామయ్య నారా లోకేష్‌కు సంస్కారం లేదని కర్నూలు మేయర్ బీవై రామయ్య మండిపడ్డారు. లోకేష్ అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నారా లోకేష్, చంద్రబాబు.. కులాలు, మతాలకు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరికి శవాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నోరు వుందని విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజలు రాజకీయ సమాధి కడతారన్నారు. చదవండి: ‘లోకేష్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు’ ‘చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు’ -
శ్రీవారిని దర్శించుకున్న ప్రముఖులు
సాక్షి, తిరుమల: శ్రీవారిని పలువురు ప్రముఖులు శుక్రవారం దర్శించుకున్నారు. మంత్రి కొడాలి నాని, ఎమ్మెల్యేలు అబ్దుల్ హఫీజ్ ఖాన్, కాటసాని రాంభూపాల్ రెడ్డి, నిర్మాత రాకేష్ రెడ్డి ఉదయం విఐపీ దర్శనంలో స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ అర్చకులు ఆశీర్వదించి తీర్ధ ప్రసాదాలు అందచేశారు. దేవుని ఆశీస్సులు ఉండాలి:కొడాలి నాని మంత్రి నాని మీడియాతో మాట్లాడుతూ కోవిడ్ కారణంగా దేశం, ప్రపంచంలో అనేక వ్యవస్థలు కుప్పకూలి ఆర్థికంగా చితికి పోయాయన్నారు. కరోనా నుండి త్వరగా కోలుకోవాలని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కి రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపించడానికి దేవుని ఆశీస్సులు ఉండాలని కోరుకున్నానని తెలిపారు. మంత్రివర్గ విస్తరణకు సమయం ఉంది.. ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కరోనా మహమ్మారి త్వరగా నాశనం అయి.. ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకున్నామన్నారు. మంచి వర్షాలు కురిసి రైతులు అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. మంత్రివర్గ విస్తరణ.. ముఖ్యమంత్రి నిర్ణయం పై ఆధారపడి ఉంటుంది. మంత్రివర్గ విస్తరణ కి ఇంకా సమయం ఉందని కాటసాని తెలిపారు. దివంగత సీఎం జయలలితపై చిత్రం నిర్మాత రాకేష్ రెడ్డి మాట్లాడుతూ త్వరలోనే తమిళనాడు దివంగత సీఎం జయలలిత పై చిత్రం నిర్మిస్తున్నట్లు స్పష్టం చేసారు. ప్రపంచవ్యాప్తంగా కరోనా బారిన పడుతున్నారు. కరోనా బారి నుండి ప్రజలను రక్షించాలని దేవున్ని కోరుకున్నానని తెలిపారు. కరోనా కారణంగా సినీ పరిశ్రమ కష్టాల్లో ఉందని, త్వరలో కోలుకొని పూర్వ వైభవం వస్తుందని ఆశీస్తున్నామన్నారు. జయలలిత అనే చిత్రాన్ని త్వరలో ప్రారంభిస్తామని, తెలుగు, తమిళం తోపాటు హిందీలో కూడా ఈ చిత్రాన్ని తీస్తామని తెలిపారు. జయలలిత జీవితంలో ఓ ఘట్టాన్ని ఈ చిత్రంలో చూపించబోతున్నామని ఆయన వెల్లడించారు. -
ఎవరెన్ని కుట్రలు పన్నినా వికేంద్రీకరణ జరుగుతుంది: కాటసాని
-
చంద్రబాబుకు ఓటమి భయం పట్టుకుంది
-
మీ చేతగాని తనంతోనే నీటి సమస్యలు
కర్నూలు, పాణ్యం: వాటా నీటిని సాధించుకోలేకపోగా ఉన్న నీటిని సైతం ఇతర జిల్లాలకు తరలిస్తున్నా నోరుమెదపని అధికార పార్టీ నాయకుల తీరు కారణంగానే జిల్లాలో నీటి సమస్యలు తలెత్తుతున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. ఎలాంటి వాటా లేకున్నా ఇతర జిల్లాలకు ప్రభుత్వం నీటిని తరలిస్తుంటే ఏ నాయకుడూ ప్రశ్నించలేదన్నారు. తాగు, సాగునీరు అందించాలని కోరుతూ ఎంపీ ఎస్పీవైరెడ్డి రెండు రోజులుగా గోరుకల్లు రిజర్వాయర్ వద్ద దీక్ష చేస్తున్న నేపథ్యంలో మంగళవారం కాటసాని అక్కడకు వెళ్లి ఆయనతో మాట్లాడారు. ఈ ఏడాది గోరుకల్లు నుంచి గాలేరుకు తరలించే నీటిని నిలిపేందుకు గేట్లు ఏర్పాటు చేయకపోవడంతో సుమారు 30 టీఎంసీల నీరు వైఎస్సార్ జిల్లాకు తరలించారన్నారు. గోరుకల్లులో 8 టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంచే అవకాశం ఉన్నా ఆ స్థాయిలో పనులు చేపట్టకపోవడం సర్కారు నిర్లక్ష్యమేనని తెలిపారు. ఎలాంటి వాటా లేకున్నా నెల్లూరు జిల్లాకు 50 టీఎంసీల నీరు సరఫరా చేశారని, ఈ విషయాలపై ప్రభుత్వాన్ని ఎందుకు ప్రశ్నించలేదో చెప్పాలన్నారు. శ్రీశైలం నుంచి నాగర్జున సాగర్‌కు ఇష్టం వచ్చినప్పుడు గేట్లు ఎత్తి దించి నీటిని తరలించి జిల్లాను ఎండగట్టారని మండిపడ్డారు. నిర్లక్ష్యం, అవగాహన లోపంతో అధికార పార్టీ నాయకులు జిల్లాకు అన్యాయం చేశారన్నారు. పనులు పూర్తిస్థాయిలో చేపట్టి గోరుకల్లులో 12టీఎంసీలు నిల్వ చేసి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్నారు. ప్రస్తుతం గోరుకల్లు డెడ్ స్టోరేజీ (1.2టీఎంసీలు)లో ఉందని, ఈ నీటిని మీరు(ఎంపీ)తరలించుకుపోవాలని చూస్తే కుదరదని, రైతులతో కలిసి ఉద్యమిస్తామని హెచ్చరించారు. అధికార పార్టీ నాయకుల చేతకాని తనంతోనే జిల్లాకు నీటి సమస్యలు వస్తున్నాయని, యావత్తు రైతాంగం సాగునీటి కోసం రోడ్డెక్కాల్సిన దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఘాటుగా విమర్శించారు. జలహారతికోసమే నీటిని తరలించుకుపోయారు.. ఎమ్యెల్యే బీసీ అధికారులను బెదిరించి నీళ్లను దద్దనాలకు తీసుకుపోయారని, ఇక్కడి రైతుల నోట్లో మట్టి కొట్టి వందల ఎకరాల మిర్చి పంటను ఎండగట్టి మంత్రి ఆర్బాటాల కోసం జల హారతి ఇవ్వడానికే ఆ పని చేశారని కాటసాని దుయ్యబట్టారు. పంటలు ఎండుతున్న దశలో జలహారతులు అవసరమా అని కాటసాని ప్రశ్నించారు. చేతనైతే పోతిరెడ్డిపాడు నుంచి అదనంగా డ్రా చేసి రైతులకు సాగునీటిని ఇప్పించాలని, అలా చేసి ఉంటే కుందూ పరీవాహ ప్రాంతానికి కూడా మేలు జరిగి ఉండేదన్నారు. అనంతరం కాటసాని రైతులతో కలిసి రిజర్వాయర్ పనులు పరిశీలించారు. కలెక్టర్ సత్యనారాయణకు ఫోన్ చేసి నీటిని గోరుకల్లు నుంచి కాకుండా అలగనూరు నుంచి విడుదల చేయాలని సూచించారు. కాటసాని వెంట జెడ్పీటీసీ మాజీ సభ్యుడు సూర్యనారాయణరెడ్డి, నాయకులు అమరనాథ్‌రెడ్డి, లక్ష్మీమద్దయ్య, ప్రసాద్, కరుణాకర్‌రెడ్డి, రాముడు, చంద్రారెడ్డి, మహింద్రారెడ్డి తదితరులున్నారు. -
పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్ ఫ్రంట్
-
‘హీరోలు కలిసినప్పుడు.. జగన్ కలిస్తే తప్పేంటి’
సాక్షి, కర్నూల్ : ఫెడరల్ ఫ్రంట్ గురించి మాట్లాడితే టీడీపీ నాయకులు ఎందుకు ఉల్కిపడుతున్నారంటూ నందికోట్కూర్ ఎమ్మెల్యే ఐజయ్య ప్రశ్నించారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. పక్క రాష్ట్రాలతో స్నేహంగా ఉండటం కోసమే ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు చేసినట్లు తెలిపారు. పొత్తు లేకుండా ఎన్నికల్లో పోటీ చేయలేని అసమర్థుడు చంద్రబాబు నాయుడంటూ విమర్శించారు. పవన్ కళ్యాణ్ మళ్లీ టీడీపీతో జతకడుతున్నాడని ఆరోపించారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్ ఫ్రంట్ : కాటసాని తమ పార్టీ అధ్యక్షుడు జగన్ మోహన్ రెడ్డిని, కేటీఆర్ కలిస్తే తప్పేంటని వైఎస్సాఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాం భూపాల్ రెడ్డి ప్రశ్నించారు. చంద్రబాబు డైరెక్షన్లో నడవాల్సిన అవసరం తమకు లేదని స్పష్టం చేశారు. ప్రత్యేక హోదా కోసమే ఫెడరల్ ఫ్రంట్‌తో జతకడుతున్నామని తెలిపారు. సినిమాల కోసం బాలకృష్ట, పవన్ కళ్యాణ్‌లు కేసీఆర్‌ను కలిస్తే తప్పు లేనప్పుడు.. రాష్ట్ర ప్రయోజనాల కోసం జగన్, కేటీఆర్‌ను కలిస్తే మాత్రం తప్పేలా అవుతుందని ప్రశ్నించారు. -
ముస్లింలపై చంద్రబాబు కపట ప్రేమ
కర్నూలు (ఓల్డ్‌సిటీ): ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ముస్లింలపై చూపిస్తున్నది కపట ప్రేమేనని మాజీ ఎమ్మెల్యే వైఎస్ఆర్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి ధ్వజమెత్తారు. మంత్రివర్గంలో ముస్లింలకు నాలుగున్నర ఏళ్లుగా స్థానం కల్పించని చంద్రబాబు నాయుడు రాజకీయ లబ్ధి కోసం ఇప్పుడు మంత్రి పదవి ఇచ్చారని విమర్శించారు. హఫీజ్ ఖాన్ ఆధ్వర్యంలో శనివారం రాత్రి పాతబస్తీలోని లాల్‌మసీదు రోడ్డులో పదో వార్డుకు సంబంధించిన రెండు పార్టీ కార్యాలయాలను ప్రారంభించారు. అనంతరం అదే ప్రాంతంలో గొప్ప బహిరంగ సభ నిర్వహించారు. సభకు అదనపు రాష్ట్ర కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి అధ్యక్షత వహించగా కాటసాని రాంభూపాల్‌రెడ్డి అతిథిగా హాజరై ప్రసంగించారు. తండ్రి వైఎస్ఆర్ బాటలోనే తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రజాసంకల్ప యాత్ర చేస్తున్నారన్నారు. ప్రజల కోసం నవరత్నాలు రూపొందించారని తెలిపారు. హఫీజ్ ఖాన్ మాట్లాడుతూ టీజీ భరత్ నిర్వహిస్తున్నది విజన్ యాత్ర కాదు.. రాజకీయ ఉనికి యాత్ర అని విమర్శించారు. ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి నగరాభివృద్ధి కోసం కాకుండా తన ఆస్తుల అభివృద్ధి కోసమే అధికార పార్టీలో చేరారని విమర్శించారు. అధికారంలో ఉన్నా లేకున్నా ప్రజాసేవ చేసే వాడే నిజమైన నాయకుడన్నారు. అంతకు ముందు కేక్ కట్ చేసి లావుబాలీ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కార్యక్రమంలో రాష్ట్ర నాయకులు జహీర్ అహ్మద్‌ఖాన్, నూరుల్లా ఖాద్రి, మాజీ కార్పొరేటర్లు మున్నా, పి.రహ్మాన్, విఠల్, పార్టీ వివిధ శ్రేణుల నాయకులు కటారి సురేశ్‌కుమార్, రైల్వే ప్రసాద్, ఎస్.ఎ.అహ్మద్, ఆదిమోహన్‌రెడ్డి, సాంబశివారెడ్డి, కృష్ణకాంత్‌రెడ్డి, నజీర్ అహ్మద్‌ఖాన్, రియాజ్, ఫైజాన్, హకీం, ఏసన్న, ప్రభుదాస్, మాలిక్, జమీలా, చెన్నమ్మ తదితరులు పాల్గొన్నారు. -
అసహ్యంగా కాంగ్రెస్, చంద్రబాబు బంధం
సాక్షి, హైదరాబాద్: సీఎం చంద్రబాబు కాంగ్రెస్ పార్టీతో కలవడాన్ని రాష్ట్ర ప్రజలు అసహ్యించుకుంటున్నారని వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వ్యాఖ్యానించారు. 1982 నుంచి రాష్ట్రంలో టీడీపీ, కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల మధ్య పోరాటం జరుగుతూ వస్తోందని.. అలాంటిది చంద్రబాబు, కాంగ్రెస్‌తో సావాసం చేయడం వారు జీర్ణించుకోలేకుండా ఉన్నారన్నారు. కాటసాని శుక్రవారం జగన్ నివాసం వద్ద మీడియాతో మాట్లాడుతూ సోనియాగాంధీని రాక్షసి అని దారుణంగాదూషించిన వ్యక్తి ఇపుడు ఏ ముఖం పెట్టుకుని కాంగ్రెస్‌తో కలుస్తారని ప్రశ్నించారు. -
అసహ్యంగా కాంగ్రెస్, చంద్రబాబు బంధం
-
జగన్‌ను మట్టుబెట్టేందుకు కుట్ర
కర్నూలు(కొండారెడ్డి ఫోర్టు): వైఎస్సార్సీపీ అధ్యక్షులు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని మట్టుబెట్టేందుకు ప్రత్యర్థులు పక్కా ప్రణాళిక రచించుకున్నారని, ఇందుకు విశాఖపట్నం ఎయిర్‌పోర్టును వేదికగా ఎంచుకున్నారని ఆ పార్టీ కర్నూలు పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు బీవై రామయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. ఇందులో సీఎం చంద్రబాబు, డీజీపీ ఆర్పీ ఠాకూర్ పాత్ర, కుట్ర ఉన్నాయనే అనుమానాలు కలుగుతున్నాయన్నారు. ముందస్తు ప్రణాళిక ప్రకారమే నిందితుడి పోస్టర్, లేఖ సృష్టించారన్నారు. శనివారం వారు కర్నూలులోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడపై కత్తితో పొడిచి హత్య చేయాలని చూశారని, పెను ప్రమాదం త్రుటిలో తప్పిందని వివరించారు. వైఎస్ జగన్‌కు ఏమైనా జరిగి ఉంటే రాష్ట్రం అల్లకల్లోలం అయి ఉండేదన్నారు. ఆయన శాంతి కామకుడు కాబట్టి పార్టీ శ్రేణులు కేవలం రాస్తారోకోలు, ధర్నాలతో నిరసన తెలిపాయన్నారు. ఈ ఉదంతాన్ని పట్టుకొని చంద్రబాబు రాష్ట్రంలో శాంతిభద్రతలు అదుపు తప్పకుండా తానే కాపాడనని చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. వైఎస్సార్సీపీ, జనసేన, బీజేపీ కలసి గవర్నర్ ద్వారా రాష్ట్రపతి పాలన పెట్టించాలని ప్రయత్నిస్తున్నాయని చంద్రబాబు ఆరోపించడం దారుణమన్నారు. ప్రతిపక్ష నేతపై హత్యాయత్నం జరిగితే పరామర్శించాల్సిన ముఖ్యమంత్రి, మంత్రులు ఆయనపైనే విమర్శలు చేయడం వారి రాక్షసత్వానికి నిదర్శనమన్నారు. గతంలో టీడీపీ ప్రభుత్వ హయాంలో విజయవాడలో వంగవీటి మోహన్‌రంగా, ఒక అఖిల భారత సర్వీసు అధికారిని చంపారని, అదే విధంగా ఇప్పుడు వైఎస్ జగన్ మోహన్‌రెడ్డిని అడ్డు తొలగించుకోవాలని చూస్తున్నారని విమర్శించారు. ఐదు కోట్ల మంది ప్రజల ఆశీస్సులు, దీవెనలు ఉన్న జగన్‌ను ఎవరూ ఏమీ చేయలేరని స్పష్టం చేశారు. సినీనటుడు శివాజీకి నాలుగు తగిలించి జైల్లో పెడితే ‘అపరేషన్ గరుడ’ స్క్రిప్ట్ బయటకు వస్తుందన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై హత్యాయత్నం సమయంలోనే శివాజీ అమెరికాకు ఎందుకు వెళ్లారని, వెంటనే ఇండియాకు పిలిపించాలని డిమాండ్ చేశారు. అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా? వైఎస్ జగన్ పబ్లిసిటీ కోసం కత్తితో పొడిపించుకున్నారని కర్నూలు ఎంపీ బుట్టా రేణుక, ఎమ్మెల్యే ఎస్వీమోహన్‌రెడ్డి ఆరోపణలు చేయడంపై బీవై రామయ్య మండిపడ్డారు. అసలు మీరు అన్నం తింటున్నారా లేక గడ్డి తింటున్నారా అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. 2014 ఎన్నికల్లో జగన్ భిక్షతోనే ఎంపీ, ఎమ్మెల్యేలుగా గెలిచారనే విషయాన్ని మరచిపోవద్దని హితవు పలికారు. ముక్కూ ముఖం తెలియని బుట్టా రేణుక ఎంపీగా, పత్తికొండలో జెడ్పీటీసీగా ఓడిపోయిన ఎస్వీమోహన్‌రెడ్డి ఎమ్మెల్యేగా గెలిచారంటే అది జగన్ పుణ్యమేనన్నారు. ఇప్పుడు వారు రూ.కోట్లకు అమ్ముడుపోయి ఆయనపైనే విమర్శలు చేయడం దుర్మార్గమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా సేవ చేయాలని రాష్ట్ర ప్రజలు కోరుకుంటున్నారని, అందువల్లే ఆ దేవుడు పెద్ద ప్రమాదం నుంచి రక్షించారని కాటసాని రాంభూపాల్‌రెడ్డి అన్నారు. మంత్రులు, పోలీసు అధికారులు తమ అధినేత పట్ల క్రూరంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. కత్తితో పొడిపించుకుంటే పబ్లిసిటీ వస్తుందనుకుంటే టీడీపీ నాయకులే ఆ పని చేయించుకోవాలని సూచించారు. అలిపిరి ఘటనలో గాయపడిన చంద్రబాబును అప్పటి ప్రతిపక్ష నేత వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శించారని, అలాంటి హుందాతనం చంద్రబాబుకు లేదని దుయ్యబట్టారు. జగన్‌ను ఇతర పార్టీల నేతలు పరామర్శిస్తే సీఎం జీర్ణించుకోలేకపోతున్నారని, తిత్లీ తుపానుతో ముడిపెట్టి విమర్శలు చేయడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా నేత తోట వెంకటకృష్ణారెడ్డి విమర్శించారు. అత్యంత భద్రత ఉన్న విమానాశ్రయంలోకి కత్తి ఎలా వెళ్లిందో చెప్పాలని రాష్ట్ర సంయుక్త కార్యదర్శి తెర్నేకల్ సురేందర్‌రెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబుకు ఓటు రూపంలో ప్రజలే తగిన బుద్ధి చెప్పడానికి సిద్ధంగా ఉన్నారని స్పష్టం చేశారు. సమావేశంలో నాయకులు రియల్ టైం నాగరాజు, కరుణాకరరెడ్డి, మదారపు రేణుకమ్మ, సయ్యద్ ఆసిఫ్ తదితరులు పాల్గొన్నారు. -
‘అలా అనటం దిగజారుడు తనమే’
సాక్షి, కర్నూల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి! సానుభూతి కోసమే తనపై దాడి చేయించుకున్నాడని టీడీపీ నేతలు అనటం దిగజారుడు తనమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాడి చేయించుకుంటే సానుభూతి వస్తుందనుకుంటే! టీడీపీ నేతలందరూ పొడిపించుకోవాలంటూ మండిపడ్డారు. శనివారం ఆయన జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగటం దారుణమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో బౌతిక దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ నాయకులు కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. -
వైఎస్సార్ సీపీలోకి వసంత కృష్ణప్రసాద్
-
వైఎస్సార్సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి
సాక్షి, అమరావతి బ్యూరో: కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి ఆదివారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరారు. పెద్ద సంఖ్యలో నేతలు, కార్యకర్తలతో తరలివచ్చి కృష్ణా జిల్లా పామర్రు నియోజకవర్గం కనుమూరు సమీపంలో పాదయాత్ర సాగిస్తున్న వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరారు. కాటసాని, ఆయన కుటుంబ సభ్యులు, ఆయనతో పాటు వచ్చిన ఇతర నేతలకు వైఎస్ జగన్.. కండువాలు వేసి పార్టీలోకి ఆహ్వానించారు. ఈ సందర్భంగా జగన్ మాట్లాడుతూ ‘భూపాలన్న, ఆయనతోపాటు వచ్చిన నేతలు, కార్యకర్తలందరూ ఇక నుంచి వైఎస్సార్ కుటుంబ సభ్యులు’ అని పేర్కొన్నారు. కాటసాని రాంభూపాల్‌రెడ్డి మాట్లాడుతూ.. దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో రాష్ట్రంలో అన్ని వర్గాలకు లబ్ధి చేకూరిందన్నారు. మళ్లీ అలాంటి సంక్షేమ పాలన వైఎస్ జగన్‌తోనే సాధ్యమన్నారు. జగన్‌ను సీఎం చేయడమే అందరి కర్తవ్యం కావాలన్నారు. -
వైఎస్ఆర్ అంటే చాలా అభిమానం
-
వైఎస్ఆర్సీపీలోకి కాటసాని రాంభూపాల్‌రెడ్డి
-
29న వైఎస్సార్సీపీలోకి కాటసాని
కర్నూలు (టౌన్) : మాజీ ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి వైఎస్సార్సీపీలో చేరికకు ముహూర్తం ఖరారైంది. ఈ నెల 29న ఆ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి సమక్షంలో చేరనున్నారు. ఈ విషయాన్ని ఆయన బుధవారం సాయంత్రం స్థానిక కల్లూరులోని స్వగృహంలో విలేకరులకు వెల్లడించారు. ‘పాణ్యం నియోజకవర్గ నాయకులు, కార్యకర్తలతో నాలుగైదు సార్లు సమావేశాలు నిర్వహించా. బీజేపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరాలంటూ అందరూ ముక్తకంఠంతో ఒత్తిడి తెచ్చారు. వారి మనోభావాలు, అభీష్టం మేరకు బీజేపీ సభ్యత్వానికి రాజీనామా చేసి వైఎస్సార్సీపీలో చేరుతున్నా’నని ప్రకటించారు. ఈ నెల 29వ తేదీన 300 వాహనాల్లో బయలుదేరుతున్నట్లు తెలిపారు. గుడివాడ –పామర్రు మధ్య ఆ రోజు ఉదయం 11 గంటలకు వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. పాణ్యం టిక్కెట్టు కావాలని కోరడం లేదని, పార్టీ ఆదేశాల మేరకు పనిచేసుకుంటూ పోతామని అన్నారు. సమావేశంలో మీదివేముల ప్రభాకర్ రెడ్డి, గుట్టపాడు లక్ష్మీకాంతరెడ్డి, కల్లూరు సింగిల్ విండో అధ్యక్షులు లక్ష్మీకాంతరెడ్డి, ఉల్లిందకొండ సింగిల్‌విండో అధ్యక్షులు రమణారెడ్డి, పందిపాడు ఎంపీటీసీ సభ్యుడు శివశంకర్‌రెడ్డి, బొల్లవరం ఎంపీటీసీ సభ్యుడు రామక్రిష్ణారెడ్డి, కొంగనపాడు కేశవరెడ్డి, బీజేవైఎం జిల్లా అధ్యక్షులు హనుమంతరెడ్డి, నగర కార్యదర్శి గోపాల్‌రెడ్డి, బీజేపీ మైనార్టీ మోర్చా రాష్ట్ర కార్యదర్శి సలాం, మాజీ కార్పొరేటర్లు నర్సింహులు, కృష్ణమూర్తి, శుభాకర్, శివుడు, ఆనంద్ పాల్గొన్నారు.