
సాక్షి, కర్నూలు: ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డి గురించి మాట్లాడే స్థాయి లోకేష్‌కు లేదని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి మండిపడ్డారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ, లోకేష్ బఫూన్‌కు తక్కువ.. జోకర్‌కు ఎక్కువ అని ఎద్దేవా చేశారు. లోకేష్ వార్డు మెంబర్‌గా కూడా గెలవలేడని దుయ్యబట్టారు.
‘‘నారాయణరెడ్డి హత్య కేసు దోషులకు అండగా నిలిచింది మీరు కాదా?. మా ప్రభుత్వంలో పోలీసులకు పూర్తిగా స్వేచ్ఛ ఇచ్చారు. జంట హత్యలతో మాకు ఎలాంటి సంబంధం లేదు. దేశంలో ఏ దర్యాప్తు సంస్థతోనైనా విచారణ జరపొచ్చు’’ అని కాటసాని స్పష్టం చేశారు. రెచ్చగొట్టేందుకు ప్రయత్నిస్తే ప్రజలే బుద్ధి చెప్తారని ఆయన హితవు పలికారు. ‘‘2004 వైఎస్సార్ హయాం నుంచే మేం ఫ్యాక్షన్‌కు దూరంగా ఉన్నాం. టీడీపీ హయాంలో రాయలసీమకు అన్యాయం జరిగింది. వైఎస్సార్ హయాంలోనే రాయలసీమకు నీరు అందించామని’’ కాటసాని రాంభూపాల్ అన్నారు.
లోకేష్‌కు సంస్కారం లేదు: బీవై రామయ్య
నారా లోకేష్‌కు సంస్కారం లేదని కర్నూలు మేయర్ బీవై రామయ్య మండిపడ్డారు. లోకేష్ అనుచిత వ్యాఖ్యలను ఆయన ఖండించారు. నారా లోకేష్, చంద్రబాబు.. కులాలు, మతాలకు అడ్డుపెట్టుకుని రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. చివరికి శవాలతో కూడా రాజకీయాలు చేస్తున్నారని నిప్పులు చెరిగారు. నోరు వుందని విమర్శలు, ఆరోపణలు చేస్తే ప్రజలు రాజకీయ సమాధి కడతారన్నారు.
చదవండి: ‘లోకేష్ పిచ్చికుక్కలా మాట్లాడుతున్నాడు’
‘చంద్రబాబు దొంగల ముఠా నాయకుడు’
Comments
Please login to add a commentAdd a comment