
మాట్లాడుతున్న కాటసాని రాంభూపాల్ రెడ్డి
సాక్షి, కర్నూల్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్ జగన్‌మోహన్ రెడ్డి! సానుభూతి కోసమే తనపై దాడి చేయించుకున్నాడని టీడీపీ నేతలు అనటం దిగజారుడు తనమేనని వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాటసాని రాంభూపాల్ రెడ్డి వ్యాఖ్యానించారు. దాడి చేయించుకుంటే సానుభూతి వస్తుందనుకుంటే! టీడీపీ నేతలందరూ పొడిపించుకోవాలంటూ మండిపడ్డారు. శనివారం ఆయన జిల్లా వైసీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా ప్రతినిధుల సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రతిపక్ష నేతపై దాడి జరగటం దారుణమన్నారు. ప్రజాస్వామ్యవాదులంతా ముక్తకంఠంతో బౌతిక దాడులను ఖండించాలని పిలుపునిచ్చారు. రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు, టీడీపీ నాయకులు కనీసం మనుషుల్లా కూడా ప్రవర్తించటం లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
Comments
Please login to add a commentAdd a comment