
సీఎంను కలిసి పెళ్లి ఆహ్వాన పత్రిక అందిస్తున్న ఎమ్మెల్యే కాటసాని దంపతులు, కుమారుడు
సాక్షి, కర్నూలు(రాజ్‌విహార్): రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని పాణ్యం ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్‌రెడ్డి తన భార్య కాటసాని ఉమామహేశ్వరమ్మ, కుమారుడు కాటసాని శివ నరసింహారెడ్డితో పాటు కలిశారు. బుధవారం ఆయన క్యాంపు కార్యాయంలో కలిసి ఈ నెల 22వ తేదీన కర్నూలులోని పంచలింగాల సమీపంలోని మాంటీస్సొరి పాఠశాల ఆవరణలో జరిగే తమ కుమారుడు శివ నరసింహారెడ్డి వివాహానికి హాజరు కావాలని పెళ్లి పత్రికను అందించారు.
Comments
Please login to add a commentAdd a comment