![Big Shock For Tdp Alliance In Kurnool District - Sakshi](/styles/webp/s3/article_images/2024/04/12/Tdp-Alliance-In-Kurnool-District.jpg.webp?itok=vUqyB3X2)
సాక్షి, పల్నాడు జిల్లా: మాటపై నిలబడే నాయకుని నాయకత్వంలో పని చేయడానికి వైఎస్సార్‌సీపీలో చేరేందుకు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పెద్ద సంఖ్యలో ఆసక్తి చూపుతున్నారు. కార్యకర్తల మనోభావాలను పరిగణనలోకి తీసుకుని సీఎం పార్టీలో చేర్చుకుంటున్నారు.
ఈ క్రమంలో కర్నూలు జిల్లాలో టీడీపీ కూటమికి భారీ షాక్ తగిలింది. టీడీపీ, బీజేపీని వదిలి ఆ పార్టీల కీలక నేతలు వైఎస్సార్‌సీపీలో చేరారు. వైఎస్సార్‌సీపీ అధినేత వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరారు.
పల్నాడు జిల్లా ధూళిపాళ్ల నైట్ స్టే పాయింట్ వద్ద ఆలూరు నియోజకవర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ డాక్టర్ మసాల పద్మజ, కోడుమూరు మాజీ ఎమ్మెల్యే కొత్తకోట ప్రకాష్‌రెడ్డి. తెలుగుదేశం పార్టీ కీలక నేత కోట్ల హరిచక్రపాణిరెడ్డి, బీజేపీకి చెందిన మాజీ మేయర్, ఆలూరు నియోజకవర్గ నేత కురువ శశికళ, ఆంధ్రప్రదేశ్ కురవ సంఘం గౌరవ అధ్యక్షుడు కృష్ణమోహన్, తదితరులు వైఎస్సార్‌సీపీలోకి చేరారు. అందరికీ పార్టీ కండువా కప్పి పార్టీలోకి సీఎం జగన్ ఆహ్వానించారు.
Comments
Please login to add a commentAdd a comment