సాక్షి, కర్నూలు: కర్నూలు జిల్లాలో రెడ్ బుక్ రాజ్యాంగం కొనసాగుతోంది. వైఎస్సార్‌సీపీ నాయకులను టార్గెట్ చేసుకొని టీడీపీ నాయకుల ఫిర్యాదు మేరకు కర్నూలు పోలీసులు కేసులు నమోదు చేస్తున్నారు. ఈనెల 14వ తేదీన వైఎస్ యువజన విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి కూటమి ప్రభుత్వం, రాష్ట్ర మంత్రి టీజీ భరత్పై విమర్శలు చేశారని మంత్రి టీజీ భరత్.. త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో, సిద్ధార్థ్ రెడ్డిపై పోలీసులు కేసు నమోదు చేశారు.
అయితే, ఓ ఫార్మా కంపెనీ వద్ద మంత్రి భరత్ 45 కోట్ల రూపాయలు వసూలు చేశారని బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆరోపించిన విషయం తెలిసిందే. దాంతో తనపై, నారా లోకేష్ పై సిద్దార్థ్ రెడ్డి చేసిన ఆరోపణలకు స్పందించి కర్నూలు త్రీ టౌన్ పోలీస్ స్టేషన్‌లో మంత్రి భరత్ ఫిర్యాదు చేశారు. దీంతో, పోలీసులు కేసు నమోదు చేశారు.


