Byreddy Siddharth Reddy
-
YSRCP: వైఎస్సార్సీపీలో నూతన నియామకాలు
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పదవుల భర్తీలో భాగంగా పలు నియామకాలను ఆ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ప్రకటన విడుదల చేసింది.వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్‌గా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడిగా కాకుమాను రాజశేఖర్, పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్‌గా శెట్టిపల్లి రఘురామిరెడ్డి, క్రమశిక్షణ కమిటీ సభ్యులుగా రెడ్డి శాంతి, తానేటి వనిత, కైలే అనిల్, వై.విశ్వేశ్వరరెడ్డి నియమితులయ్యారు. -
జగనన్న మమ్మల్ని ఒక్కసారి వదిలితే.. టీడీపీ నేతలకు బై రెడ్డి వార్నింగ్..
-
YSRCP నేత భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఊరట
-
హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్చిట్
సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
నంద్యాల బాలిక ఘటనపై బైరెడ్డి స్ట్రాంగ్ రియాక్షన్
-
మీలాంటి కార్యకర్తలు దొరకడం జగనన్న అదృష్టం బైరెడ్డి ఎమోషనల్..
-
జగనన్న కోసం నా ఆఖరి శ్వాస వరకు పోరాడుతా...
-
చంద్రబాబుపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి అదిరిపోయే సెటైర్లు..
-
సీఎం జగన్ మేనిఫెస్టోపై బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి రియాక్షన్
-
చాలా బాధాకరం..సీఎం జగన్ దాడిపై బైరెడ్డి ఎమోషనల్
-
ప్రజలంతా సీఎం జగన్ వెంటే ఉన్నారు: సిద్ధార్థ్ రెడ్డి
-
చంద్రబాబు మేనిఫెస్టో పై బైరెడ్డి మాస్ ర్యాగింగ్
-
బైరెడ్డిని ఆప్యాయంగా పలకరించిన సీఎం జగన్
-
అదుడం ఆంధ్రా కార్యక్రమంలో మంత్రి ఆర్కే రోజా, బైరెడ్డి సిద్ధార్థరెడ్డి విజువల్స్
-
బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి స్టైల్ లో షర్మిలకు అదిరిపోయే కౌంటర్
-
చంద్రబాబు జైలు.. లోకేష్ బెయిల్: బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి
-
సీఎం జగన్ పై ప్రతీకారం తీర్చుకోవడానికి... గుంటనక్కలా ఎదురుచూస్తున్నారు
-
చంద్రబాబు జైల్..లోకేష్ బెయిల్...బైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డి పంచులు
-
నలుగురు ష్యూరిటీ ఇస్తేగాని జైలు నుండి బయటకు రాలే
-
కుప్పంలో చంద్రబాబు ఓటమి ఖాయం: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
-
పవన్ కళ్యాణ్ ని 5వ తరగతి పిల్లవాడు కూడా కొడతాడు
-
జగనన్న కోసం పోరాడటానికి నేను సిద్ధం
-
చంద్రబాబు నీచ రాజకీయాలను ప్రజలంతా గమనించాలి: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
-
ఇంత బ్రోకర్ టాలెంట్ చంద్రబాబుకే సాధ్యం: బైరెడ్డి
-
YSRCP:యువజన, మహిళా విభాగం అధ్యక్షుల నియామకం
తాడేపల్లి: వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం నూతన కమిటీ నియామకం జరిగింది. కొత్తగా కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఆదేశాలు జారీచేశారు. యువజన విభాగం అధ్యక్షుడిగా బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఉపాధ్యక్షులుగా కొండా రాజీవ్‌గాంధీ, పిన్నెళ్లి వెంకట్రామిరెడ్డిని నియమించారు.మొత్తం 64 మందితో నూతన కమిటీని నియమించినట్టు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటనలో పేర్కొంది. అదే విధంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగానికి కూడా నూతన కమిటీని నియమిస్తూ ఆదేశాలు జారీ చేశారు. వైఎస్సార్సీపీ మహిళా విభాగానికి అధ్యక్ష పదవికి ఎమ్మెల్సీలు పోతుల సునీత, వరుదు కళ్యాణిలు ఇద్దరినీ నియమించారు. అలాగే ఉపాధ్యక్షులుగా మంతెన మాధవీవర్మ, బండి పుణ్యశీల, డాక్టర్ శశికళను నియమించారు. మొత్తం 64 మందితో నూతన కార్యవర్గాన్ని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఓ ప్రకటన విడుదల చేసింది. పూర్తి జాబితా కోసం ఇక్కడి క్లిక్ చేయండి -
ఏపీని ఆటల ఆంధ్రప్రదేశ్ గా తీర్చిదిద్దాలనేదే సీఎం జగన్ లక్ష్యం: రోజా
-
లోకేష్ కనిపిస్తే కొట్టేందుకు చంద్రబాబు రెడీగా ఉన్నాడు.. బాలకృష్ణ, పురందేశ్వరిపై బైరెడ్డి సెటైర్లు
-
బాబు చేసిన చాలా స్కాంలు ఇప్పటివరకూ బయటకు రాలేదు
-
‘చంద్రబాబు స్కాంలు అన్నింటిలో ఇదే చిన్నది’
సాక్షి, విజయవాడ: చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నదని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి స్పష్టం చేశారు. చంద్రబాబు చేసిన చాలా స్కాంలు ఇప్పటివరకూ బయటకు రాలేదని, ఇక నుంచి చంద్రబాబు స్కాంలు ఒక్కొక్కటి వెలుగులోకి వస్తాయన్నారు బైరెడ్డి సిద్ధార్థ్‌రెడ్డి. సోమవారం మీడియాతో మాట్లాడిన బైరెడ్డి.. ‘ ఇది అంతం కాదు.. ఆరంభం మాత్రమే. చంద్రబాబు చేసిన స్కాంలు అన్నింటిలో స్కిల్ డెవలప్మెంట్ స్కాం చిన్నది.నాకున్న పరిచయాలు పెద్దవి అనే అహంకారం చంద్రబాబుది. నా స్నేహితులు అన్ని రంగాల్లో ఉన్నారనే ఓవర్ కాన్ఫిడెన్స్ తోనే చంద్రబాబు అన్ని స్కాంలు చేశారు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు అడ్డంగా దొరికిన విషయం అందరికీ తెలుసు. మనవాళ్ళు బ్రీఫ్డ్ మీ అంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలు అందరూ విన్నారు. చంద్రబాబు ఎవరికీ మంచి చేయలేదు కాబట్టి ఆయనకు ఎవరూ అండగా నిలబడలేదు. సీఐడీ చంద్రబాబును అరెస్ట్ చేయడం మంచిపనో కాదో వచ్చే ఎన్నికల్లో తెలుస్తుంది. పుష్కరాలు, పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టుల్లోనూ భారీ అవినీతి చేశారు. డయాగ్నొస్టిక్ సెంటర్లు, నీరు చెట్టులో పెద్ద అవినీతి చేశారు. ఐఏఎస్ ఆఫీసర్స్, మంత్రులు జైలుకు పోతారు నాకేంటిలే అని చంద్రబాబు అవినీతి చేశాడు. రోడ్లు వేయకుండా డబ్బు తినేశారు. ఎవరైనా పుష్కరాలు పుణ్యం కోసం చేస్తారు.. చంద్రబాబు డబ్బుల కోసం చేశాడు’ అని ధ్వజమెత్తారు. -
ప్రతిష్టాత్మకంగా ఏపీ సీఎం కప్ టోర్నమెంట్.. రాష్ట్ర క్రీడా చరిత్రలో గొప్ప కార్యక్రమం
సాక్షి, తిరుపతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న ఏపీ సీఎం కప్ టోర్నమెంట్ ఫైనల్స్ తిరుపతి జిల్లాలో జరగడం పట్ల ఎంతో సంతోషిస్తున్నామని క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా హర్షం వ్యక్తం చేశారు. స్థానిక ఎస్వీ యూనివర్సిటీ స్టేడియంలో ఆంధ్ర ప్రదేశ్ స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో రాష్ట్ర స్థాయి ఏపీ సీఎం కప్ టోర్నమెంట్‌ను ఆరంభించారు. తిరుపతిలో మే 1- 05 వరకు ఈ టోర్నీ జరుగనుంది. పురుషులు, మహిళల కోసం 14 విభాగాలలో ఈ టోర్నీ నిర్వహిస్తున్న నేపథ్యంలో మంత్రి ఆర్కే రోజా, శ్యాప్ చైర్మన్ సిద్ధార్థ రెడ్డి, యువజన సర్వీసులు ప్రధాన కార్యదర్శి, వాణీ మోహన్, జిల్లా కలెక్టర్ కె.వెంకట రమణ రెడ్డి, శ్యాప్ వీసీ అండ్ ఎండీ హర్ష వర్ధన్, శ్యాప్ డైరెక్టర్లతో కలిసి జ్యోతి ప్రజ్వలన చేసి పోటీలను ఘనంగా ప్రారంభించారు. అనంతపురం జిల్లా మొదలు 13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించగా మంత్రి గౌరవ వందనం స్వీకరించారు. కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి ఈ సందర్భంగా.. మంత్రి రోజా మాట్లాడుతూ రాష్ట్ర క్రీడా చరిత్రలో ఇంత పెద్ద ఎత్తున క్రీడా కార్యక్రమం ఏర్పాటు చేయడం జరగలేదని, ఇదొక గొప్ప కార్యక్రమం అన్నారు. సుమారు 4900 మంది మహిళా, పురుష క్రీడాకారులు ఈ ఈవెంట్లో పాల్గొంటున్నారని తెలిపారు. క్రీడలలో గెలిచేందుకు పోటీ పడాలని, అయితే, మెడల్ సాధించలేక పోయినా నిరాశ చెందాల్సిన పనిలేదని ఆమె క్రీడాకారులకు పిలుపునిచ్చారు. మండల, నియోజకవర్గ, జిల్లా స్థాయి క్రీడల పోటీలలో గెలుపొంది ప్రస్తుతం రాష్ట్రస్థాయి సీఎం కప్ పోటీలలో పాల్గొనే అర్హతతో ఇక్కడికి వచ్చారని.. ఇప్పటికే అందరూ సగం గెలిచారని, గెలుపు ఓటములు సహజమని ఓడినవారు బాధపడాల్సిన అవసరం లేదని స్పూర్తి నింపారు. రాష్ట్రస్థాయి ఏపీ సీఎం కప్ క్రీడలకు కోటి 40 లక్షల రూపాయలు కేటాయించి ప్రతిష్టాత్మకంగా టోర్నీని నిర్వహిస్తున్నామని మంత్రి రోజా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం అన్ని విధాలా క్రీడాకారులను ప్రోత్సహిస్తూ, సహకారం అందిస్తుందని, వారు జాతీయ, అంతర్జాతీయ స్థాయికి క్రీడాకారులు గా ఎదుగుటకు తోడ్పాటు ఉంటుందని అన్నారు. క్రీడలలో పాల్గొంటున్న క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ తెలిపి ఏపీ సిఎం కప్ 2023 డిక్లరేషన్‌తో క్రీడలను ప్రారంభించారు. క్రీడాకారుల కోసం ఇక శ్యాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి మాట్లాడుతూ.. ‘‘13 ఉమ్మడి జిల్లాల క్రీడాకారులు ఈ కార్యక్రమంలో పాల్గొనడం ఎంతో సంతోషంగా ఉంది. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రోత్సహంతో సంక్రాంతి సంబరాలు, జగనన్న క్రీడా సంబరాలు తదితర క్రీడా కార్యక్రమాలు నిర్వహించి ప్రైజ్ మనీ అందించాం. క్రీడాకారులు కూడా అభివృద్ధి చెందాలని ఈ ప్రభుత్వంలో వివిధ క్రీడాకారులకు 2500 మందికి స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగ అవకాశాలు కల్పించాం’’ అని తెలిపారు. జీవితం చాలా చిన్నదని, సంతోషంగా ఉండాలని, స్నేహితులతో సంతోషంగా గడపాలని టోర్నమెంట్లో పాల్గొనే అందరు క్రీడాకారులకు ఆల్ ది బెస్ట్ చెప్పారు. ఈ కార్యక్రమంలో స్మార్ట్ సిటీ జీఎం చంద్రమౌళి, ఎస్.ఈ ఆర్డబ్ల్యూఎస్ విజయకుమార్, సిఈఓ సేట్విన్ మురళి కృష్ణ రెడ్డి, పిడిడిఆర్డిఏ జ్యోతి, చీఫ్ కోచ్ సయ్యద్ హుస్సేన్, డిఎంహెచ్ఓ శ్రీహరి, జిల్లా సమాచార పౌర సంబంధాల అధికారి బాల కొండయ్య తదితరులు పాల్గొన్నారు. -
చంద్రబాబుకి వాడి చెంచాలకు ఒక్కటే చెప్తున్నా...
-
లోకేష్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్: బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి
-
Byreddy Siddharth Reddy: నారా లోకేష్‌పై బైరెడ్డి సిద్దార్ధ్ రెడ్డి ఫైర్
సాక్షి, తాడేపల్లి: టీడీపీ అధినేత చంద్రబాబు, నారా లోకేష్‌బాబుపై ఏపీ శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో టీడీపీకి 2,3 సీట్లు కూడా వచ్చే పరిస్థితి లేదని సంచలన కామెంట్స్ చేశారు. అవినీతిపై నారా లోకేష్ మాట్లాడటం సిగ్గుచేటు అంటూ వ్యాఖ్యలు చేశారు. కాగా, బైరెడ్డి సిద్దార్ధ్‌రెడ్డి మీడియాతో మాట్లాడుతూ.. ఏపీలో ఇల్లు కట్టుకుని రాజకీయాలు చేయమని టీడీపీ నేతలే చంద్రబాబుకు చెబుతున్నారు. సీఎం జగన్‌పై లోకేష్ ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. మంగళగిరిలో గెలవలేని వ్యక్తి పార్టీని అధికారంలోకి తీసుకువస్తాడంటా. లోకేష్ ఒక ఫెయిల్యూర్ పొలిటీషియన్. వచ్చే ఎన్నికల్లో టీడీపీ భారీ ఓటమి చవిచూస్తుంది. ప్రజాన్యాయస్థానంలో గెలిచిన నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి. సీఎం జగన్‌పై కుట్రలు పన్ని కేసులు పెట్టించారు. సీఎం జగన్ నిత్యం ప్రజల గురించే ఆలోచించే వ్యక్తి. ఉద్దానం సమస్యను పరిష్కారం చూపింది సీఎం జగన్ మాత్రమే. చంద్రబాబులాగా అబద్దపు హామీలు ఇచ్చే అలవాటు మాకు లేదు. ఐదేళ్లలో అన్ని హామీలు నెరవేరుస్తాము. మంత్రి రోజాను మహిళ అని కూడా చూడకుండా ఇష్టానుసారం మాట్లాడుతున్నారు. ఇది కరెక్ట్ కాదంటూ హెచ్చరించారు. 2014-19లో సిమెన్స్ కంపెనీని వాడుకుని రూ.250కోట్లు దోచుకున్నది వాస్తవం కాదా?. రూ. 250 కోట్లు ఏవిధంగా మాయమయ్యయో లోకేష్ చెప్పాలి. సిమెన్స్ కంపెనీతో చేసుకున్న ఒప్పందంపై లోతుగా విచారణ చేయాలి. టీడీపీ శ్రేణులు వాస్తవాలు తెలుసుకోవాలని కోరుతున్నాను. అచ్చెన్నాయుడు కుంభకోణంపై విచారణ జరగకుండా స్టే తెచ్చుకున్నారు. చంద్రబాబు అవినీతిపై వేల పుస్తకాలు వేయొచ్చు. ఎన్నడూ లేనివిధంగా ఏపీలో స్కూల్స్ అన్ని బాగుపడ్డాయి. ప్రతీ గ్రామానికి వైద్య సేవలు అందుతున్నాయి. విత్తనం నుంచి మద్దతు ధర వరకూ రైతులకు అండగా ఉన్నాము. రాష్ట్రంలో అన్ని వర్గాలకు సంక్షేమ పథకాలు అందుతున్నాయి. రాష్ట్రం వెనుకబడిపోయిందంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారు. రాష్ట్రం బాగుపడటం టీడీపీకి ఇష్టం లేదు. ఆరోపణలు చేస్తూ ఒక భ్రమలో బతుకుతున్నారు అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు. -
పవన్, చంద్రబాబు కలయికపై బైరెడ్డి సిద్ధార్థరెడ్డి కామెంట్స్
సాక్షి, అమరావతి: జనసేన అధినేత పవన్ కల్యాణ్, టీడీపీ అధినేత చంద్రబాబునాయుడు కలయికపై శాప్ ఛైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి స్పందించారు. వారిద్దరూ ఎప్పుడూ వేరు కాదని.. ఒక్కటే అని తాము భావిస్తున్నట్లు బైరెడ్డి ఉద్ఘాటించారు. ఇద్దరు వచ్చినా, ఇంకెంతమంది కలిసొచ్చినా గెలిచేది సీఎం జగన్ అని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో 175కు 175సీట్లు రావడం ఖాయమని ధీమా వ్యక్తం చేశారు. ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధి గ్రామాల్లో ప్రతి ఇంటికి వెళ్తే తెలుస్తుందన్నారు. ఎవరెవరికి ఎన్ని పథకాలు, ఎన్ని నిధులు ఇచ్చామో మా వద్ద లెక్కలు ఉన్నాయి. ఇతర పార్టీ నేతల వద్ద ఉంటే చర్చకు రండి అని బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. చదవండి: (ఏపీలో ముందస్తు ఎన్నికలపై సజ్జల రామకృష్ణారెడ్డి క్లారిటీ) -
పొత్తుతో వచ్చినా పదిమందితో వచ్చినా ఏమి చేయలేరు : బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
-
చాలా రంగాల్లో టీడీపీ వాళ్లే పాతుకుపోయారు: బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
-
మహిళా గ్రాండ్ మాస్టర్‌కు ‘శాప్’ సత్కారం
సాక్షి, అమరావతి: మహిళా గ్రాండ్ మాస్టర్ నూతక్కి ప్రియాంక విజయం రాష్ట్రానికి గర్వకారణమని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి కొనియాడారు. ఇటీవల ప్రతిష్టాత్మక ఆసియా కాంటినెంటల్ చెస్ చాంపియన్ షిప్లో 6.5 పాయింట్లతో రెండో స్థానంలో నిలిచి రజత పతకాన్ని సాధించడంపై అభినందించారు. గురువారం విజయవాడలోని శాప్ కార్యాలయంలో ప్రియాంకను ఘనంగా సత్కరించారు. ప్రియాంక మాట్లాడుతూ అంతర్జాతీయ పోటీల్లో పాల్గొనేందుకు, విదేశీ కోచ్‌ల ద్వారా శిక్షణ తీసుకునేందుకు ఆర్థిక సహాయం అందించాలని కోరగా శాప్ చైర్మన్, ఎండీలు సానుకూలంగా స్పందించినట్లు చెప్పారు. -
లోకేశ్‌ది మిడిమిడి జ్ఞానం
సాక్షి, అమరావతి: లోకేశ్ మిడిమిడి జ్ఞానంతో విమర్శలు చేస్తున్నారని, రాష్ట్రంలో క్రీడా వికాస కేంద్రాలను (కేవీకేలను) అభివృద్ధి చేస్తుంటే ఓర్వలేకపోతున్నారని ఏపీ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి మండిపడ్డారు. బుధవారం విజయవాడలో మీడియాతో మాట్లాడుతూ.. టీడీపీ హయాంలో కాంట్రాక్టర్లు, కార్యకర్తలకు లబ్ధి చేకూర్చేందుకే కేవీకేలను గుట్టలు, శ్మశానాల్లో నిర్మించారని చెప్పారు. దొంగ అంచనాలతో రూ.కోటి ఖర్చయ్యే భవనాన్ని రూ.2 కోట్లతో, అదీ నాసిరకంగా నిర్మించి ప్రజా ధనాన్ని దోచేశారని తెలిపారు. చాలా చోట్ల కేవీకేలు ఊరికి దూరంగా ఉండటంతో అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారాయన్నారు. ఓ అండ్ ఎం కింద ప్రైవేటు వ్యక్తులతో వాటిని వాడుకలోకి తెచ్చేందుకు న్యాయబద్ధంగా టెండర్లు పిలిచామన్నారు. పే అండ్ ప్లే విధానం గత ప్రభుత్వాల నుంచి ఉన్నదేనని చెప్పారు. గతంలోనూ కొన్ని స్టేడియాల్లో క్రీడాకారుల నుంచి ఫీజు వసూలు చేసేవారని, ఆ డబ్బులకు లెక్కలు ఉండేవి కావన్నారు. దానిని స్ట్రీమ్‌లైన్ చేసి సెంట్రలైజ్డ్ అకౌంట్ ద్వారా పారదర్శకంగా ప్రతి రూపాయినీ క్రీడల కోసం ఖర్చు చేస్తున్నామన్నారు. లీజుకు ఇచ్చే కేవీకేల్లో 10% పేద క్రీడాకారులు ఉచితంగా శిక్షణ పొందవచ్చని తెలిపారు. ఎక్కువ మంది సాధన చేసే కేవీకేలు, కోర్టులను ఓ అండ్ ఎం నుంచి మినహాయిస్తున్నామన్నారు. టీడీపీ హయాంలో క్రీడాకారులకు శిక్షణ పేరుతో టెన్విక్ కంపెనీకి రూ.50 కోట్లు దోచిపెట్టారన్నారు. క్రీడా సంఘాల్లో టీడీపీ నాయకులు జోక్యం చేసుకొని క్రీడలను నాశనం చేశారని, ఐదేళ్లలో ఒక్క స్టేడియాన్ని కూడా నిర్మించలేదని చెప్పారు. క్రీడాకారులకు ఇచ్చే ప్రోత్సాహకాలను కూడా గత ప్రభుత్వం ఎగ్గొట్టిందని, తమ ప్రభుత్వం వాటిని చెల్లించి.. పతకాలకు ఇచ్చే మొత్తాలను కూడా పెంచిందన్నారు. చరిత్రలో ఎన్నడూ లేదు.. ఏపీ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా 2,500 మందికి సచివాలయాల్లో స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చిన ఘనత సీఎం జగన్‌దని చెప్పారు. 6 వేల జగనన్న స్పోర్ట్స్ క్లబ్స్ ఏర్పాటు చేశామని చెప్పారు. శాప్ స్వయం ప్రతిపత్తి సంస్థ అని, ప్రభుత్వ సాయంతో పాటు సొంతంగా ఆదాయాన్ని సమకూర్చుకుంటుందన్నారు. కోచింగ్‌కు అవకాశం లేని చోట మాత్రమే ఓ అండ్ ఎంకు ఇస్తున్నామని, తద్వారా యువతకు కోచ్‌లుగా ఉపాధి దక్కుతుందని శాప్ ఎండీ ప్రభాకరరెడ్డి తెలిపారు. -
అందుకే పవన్‌ను చంద్రబాబు వెంట బెట్టుకున్నారు: మంత్రి రోజా
సాక్షి, చిత్తూరు: జన సైకోల అధినేత పవన్ కల్యాణ్ ఒరిజినల్ క్యారెక్టర్ బయట పడిపోయిందని మంత్రి రోజా అన్నారు. 2019 ఎన్నికల్లో పవన్ కల్యాణ్ మీటింగ్‌కు వచ్చారని ఓటింగ్‌కు రాలేదని వ్యంగ్యస్త్రాలు సంధించారు. అమరావతి టీడీపీ రాజధాని అన్న మనిషి..ఇప్పుడు మాట మార్చారని ప్రస్తావించారు. అలాంటి వ్యక్తిని ప్యాకేజీ స్టార్ అనకుండా ఏమనాలని ప్రశ్నించారు. జనవాణి కార్యక్రమానికి ఎక్కడా ర్యాలీ చేయని పవన్, విశాఖలో ఎందుకు ర్యాలీ చేశారని నిలదీశారు. పవన్ కల్యాణ్‌తో చంద్రబాబు ముసిముసి నవ్వులు నవ్వుకుంటూ వెళ్ళడం, ప్రజాస్వామ్య పరిరక్షణ గురించి మాట్లాడటం హాస్యాస్పదంగా ఉందన్నారు. వైఎస్సార్సీపీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలను తీసుకుని నలుగురిని మంత్రుల్ని చేసినప్పుడు ప్రజాస్వామ్య పరిరక్షణ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. ఎన్టీఆర్‌పై చెప్పులు వేయించినపుడు, ముద్రగడను అరెస్ట్ చేసినపుడు ప్రజాస్వామ్య పరిరక్షణఎక్కడ ఉందని ప్రశ్నించారు. జనసేన, టీడీపీ అధినేతలను కలపడంలో నాదెండ్ల మనోహర్ చక్కగా కథ నడిపించారని దుయ్యబట్టారు. ‘రాష్ట్రంలో ఇళ్లు లేని చంద్రబాబు, పవన్‌లకు హైద్రాబాదే దిక్కు. టీడీపీ ప్రజల్లోకి వస్తే చెప్పు దెబ్బలు తప్పవు. అందుకే పవన్‌ను వెంట బెట్టుకున్నారు. ఎప్పుడు లేనిది ఎల్లో మీడియాకు పవన్‌పై ప్రేమ పుట్టుకు వచ్చింది. కాపులకు వైఎస్సార్ ఇచ్చిన ప్రాముఖ్యత రాష్ట్రంలో ఎవ్వరూ ఇవ్వలేదు. ముద్రగడ కుటుంబాన్ని అరెస్ట్ చేస్తే ఆరోజు చంద్రబాబు చంక ఎక్కిన పవన్ కల్యాణ్ ఎక్కడ ఉన్నారు. కాపులకు ఏదైనా చేస్తే నీవెంట ఉంటారు. ఏం చేశావని నీ వెంట నడవాలి. జన సైకోలు, జగన్ సైనికులకు జరిగే 2024 ఎన్నికల యుద్ధంలో 175 స్థానాలకు గెల్చుకోవడం ఖాయం’ అని మంత్రి రోజా వ్యాఖ్యానించారు. సాక్షి, కర్నూలు: జనసేన అధినేత పవన్ కల్యాణ్‌పై స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ రెడ్డి ఫైర్ అయ్యారు. చంద్రబాబు ఆడుతున్న డ్రామాను పవన్ పోషిస్తున్నాడని విమర్శించారు. రెండు స్థానాల్లో పోటీ చేసి ఎక్కడా గెలవలేని పవన్ కూడా రాజకీయాలు మాట్లాడుతున్నాడని మండిపడ్డారు. పవన్ చీకటి ఒప్పందాలు రాష్ట్ర ప్రజలందరికీ తెలుసని అన్నారు. పవన్ పార్టీ ‘జనసేన’నా లేక ‘టీడీపీ సేన’నా చెప్పాలని డిమాండ్ చేశారు. -
పవన్ కళ్యాణ్ పై మండిపడ్డ శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి
-
ఆధునిక సదుపాయాలతోనే క్రీడా రంగం అభివృద్ధి
సాక్షి, అమరావతి: క్రీడా రంగంలో ఆధునిక మౌలిక సదుపాయాల కల్పన, ప్రోత్సాహంతోనే అభివృద్ధి సాధ్యమని రాష్ట్ర క్రీడా, యువజన సర్వీసుల శాఖ ముఖ్యకార్యదర్శి వాణి మోహన్ అన్నారు. గుజరాత్లో జరుగుతున్న 36వ జాతీయ క్రీడలను శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, ఎండీ ప్రభాకర్ రెడ్డితో కలిసి తిలకించారు. అహ్మదాబాద్, రాజ్‌కోట్, సూరత్ పట్టణాల్లో పర్యటించి క్రీడా మైదానాలు, గ్యాలరీల నిర్మాణం, మల్టీ పర్పస్ స్టేడియాలు, శిక్షణ కేంద్రాలను పరిశీలించారు. మహాత్మ మందిర్‌లో జూడో, బాక్సింగ్, ఐఐటీ గాంధీనగర్‌లో జరిగిన సాఫ్ట్ బాల్, సబర్మతి రివర్ ఫోర్ట్‌లో జరిగిన కానాయింగ్, సాప్ట్ టెన్నిస్, మల్లకంబ్ క్రీడలను వీక్షించి, క్రీడాకారులను ప్రోత్సహించారు. ఏపీ ప్రభుత్వం క్రీడా రంగంలో విప్లవాత్మక మార్పులకు శ్రీకారం చుట్టిందని చెప్పారు. శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి మాట్లాడుతూ.. త్వరలోనే ఏపీని అంతర్జాతీయ క్రీడా వేదికగా తీర్చిదిద్దుతామని తెలిపారు. శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి మాట్లాడుతూ.. గ్రామస్థాయిలో పాఠశాల నుంచి యూనివర్సిటీల వరకు స్పోర్ట్స్ క్లబ్‌లను ప్రోత్సహిస్తున్నామని వివరించారు. పలువురు జాతీయ పోటీల విజేతలకు మెడల్స్ బహూకరించారు. -
పతకాలే లక్ష్యంగా రాణించాలి
సాక్షి, అమరావతి: రాష్ట్ర క్రీడాకారులు పతకాలే లక్ష్యంగా జాతీయ పోటీల్లో రాణించాలని పర్యాటక, సాంస్కృతిక, యువజన సర్వీసులశాఖ మంత్రి ఆర్కే రోజా కోరారు. ఈ నెల 28 నుంచి అక్టోబర్ 10 వరకు గుజరాత్లో జరగనున్న 36వ నేషనల్ గేమ్స్‌లో పాల్గొనేందుకు పయనమైన 170 మంది రాష్ట్ర క్రీడాకారులను బుధవారం ఆమె అభినందించారు. కార్యక్రమంలో ఒలింపిక్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ధర్మాన కృష్ణదాస్, శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రతిభావంత క్రీడాకారులకు ప్రభుత్వం ప్రోత్సాహం
సాక్షి, అమరావతి: రాష్ట్రంలో ప్రతిభ ఉన్న క్రీడాకారులకు ప్రభుత్వ ప్రోత్సాహం ఉంటుందని రాష్ట్ర పర్యాటక సాంస్కృతిక, క్రీడలు, యువజన సర్వీసుల శాఖ మంత్రి ఆర్కే రోజా అన్నారు. బుధవారం ఆమె సచివాలయంలో శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రజత్ భార్గవ, ప్రిన్సిపల్ సెక్రటరీ వాణీమోహన్, శాప్ ఎండీ ప్రభాకర్‌రెడ్డి, ఇతర ఉన్నతాధికారులతో సమీక్ష నిర్వహించారు. క్రీడాకారులకు పలు ప్రయోజనాలను చేకూర్చే జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మంత్రి రోజా మాట్లాడుతూ.. క్రీడాకారులను ప్రోత్సహించేందుకు జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను అందుబాటులోకి తెచ్చినట్టు వివరించారు. ప్రతి గ్రామంలోను జగనన్న స్పోర్ట్స్ క్లబ్‌ల ఏర్పాటు, రాష్ట్రంలో క్రీడల అభివృద్ధికి చేపట్టాల్సిన చర్యలు, జగనన్న స్పోర్ట్స్ యాప్‌ను క్రీడాకారులు ఉపయోగించుకునే విధానం, నూతన స్పోర్ట్స్ పాలసీ సవరణలపై ఈ సందర్భంగా సమీక్షించారు. జగనన్న స్పోర్ట్స్ యాప్‌పై విస్తృతంగా ప్రచారం చేసి రాష్ట్రంలోని స్పోర్ట్స్ క్లబ్బులు, క్రీడాకారుల సమాచారం పొందుపరిచేలా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్రీడాకారులు ఈ యాప్‌లో తమ క్రీడకు సంబంధించిన సమాచారాన్ని పొందుపరచడం ద్వారా క్రీడాశాఖ ద్వారా ప్రోత్సాహకాలు అందించేందుకు వీలవుతుందని మంత్రి పేర్కొన్నారు. అన్న క్యాంటీన్ల పేరుతో ఘర్షణలకు టీడీపీ కుట్ర అనవసర విషయాలను అడ్డంపెట్టుకొని టీడీపీ రాజకీయం చేస్తోందని మంత్రి ఆర్కే రోజా మండిపడ్డారు. బుధవారం ఆమె తాడేపల్లిలో మాట్లాడుతూ.. అన్న క్యాంటీన్ల పేరుతో రాష్ట్రంలో ఘర్షణ వాతావరణం సృష్టించేందుకు టీడీపీ కుట్రలు చేస్తోందని ధ్వజమెత్తారు. చంద్రబాబుకు ఎన్టీఆర్‌పై అంత ప్రేమ ఉంటే 2014లో టీడీపీ అధికారంలోకి రాగానే ఎందుకు అన్న క్యాంటీన్లను ప్రారంభించలేదని ప్రశ్నించారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
సాక్షి, అమరావతి: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అనుబంధ విభాగాలకు రాష్ట్ర అధ్యక్షులను నియమించారు. వైఎస్సార్సీపీ అధినేత, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నియామకాలు చేసినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం మంగళవారం ఓ ప్రకటనలో తెలిపింది. -
హోరాహోరీ.. చివరి బంతికి విజయం..
Sakshi Premier League 2022 AP- విజయవాడ స్పోర్ట్స్: సాక్షి ప్రీమియర్ లీగ్ (ఎస్పీఎల్) ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో జూనియర్ విభాగంలో సర్ కట్టమంచి రామలింగారెడ్డి (సీఆర్) పాలిటెక్నిక్ కాలేజీ (ఏలూరు) జట్టు... సీనియర్ విభాగంలో శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కామర్స్ (సీకాం) డిగ్రీ కాలేజీ (తిరుపతి) జట్టు చాంపియన్స్‌గా నిలిచాయి. స్థానిక కేఎల్ యూనివర్సిటీ మైదానంలో బుధవారం జరిగిన జూనియర్ ఫైనల్లో సెంట్రల్ ఆంధ్ర రీజియన్‌కు చెందిన సీఆర్ రెడ్డి కాలేజీ ఆరు వికెట్ల తేడాతో ఉత్తరాంధ్ర రీజియన్‌కు చెందిన సాయి గణపతి జూనియర్ కాలేజీ (విశాఖపట్నం) జట్టును ఓడించింది. తొలుత సాయి గణపతి కాలేజీ 62 పరుగులు సాధించింది. సీఆర్ రెడ్డి కాలేజీ బౌలర్లలో సంజయ్ నాలుగు వికెట్లు తీయగా... రేవంత్, మనోజ్ దత్తు ఒక్కో వికెట్ పడగొట్టారు. 63 పరుగుల లక్ష్యాన్ని సీఆర్ రెడ్డి జట్టు 7.2 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి ఛేదించి గెలిచింది. సంజయ్ 26 పరుగులతో రాణించాడు. ఆల్‌రౌండ్ ప్రదర్శన కనబరిచిన సంజయ్‌కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’... ‘మ్యాన్ ఆఫ్ ద సిరీస్’ అవార్డులు లభించింది. చివరి బంతికి విజయం... సీనియర్ విభాగం ఫైనల్లో రాయలసీమ రీజియన్‌కు చెందిన సీకాం డిగ్రీ కాలేజీ రెండు పరుగుల ఆధిక్యంతో మహరాజ్ విజయరామ్ గజపతి రాజ్ (ఎంవీజీఆర్) ఇంజనీరింగ్ కాలేజీ (విజయనగరం) జట్టుపై గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సీకాం డిగ్రీ కాలేజీ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో ఏడు వికెట్లు నష్టపోయి 96 పరుగులు చేసింది. అఫ్రోజ్ 24 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్స్‌లతో 48 పరుగులు సాధించగా... ధరణి 14 పరుగులు చేశాడు. ఎంవీజీఆర్ జట్టు బౌలర్లు తరుణ్ తేజ్ మూడు, వంశీ రెండు వికెట్లు తీశారు. 97 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన ఎంవీజీఆర్ జట్టు 8 వికెట్లకు 94 పరుగులు చేసి ఓడిపోయింది. ఎంవీజీఆర్ జట్టు విజయానికి చివరి బంతికి మూడు పరుగులు అవసరంకాగా ఆ జట్టు బ్యాటర్ ఆకేశ్ భారీ షాట్‌కు యత్నించి బౌండరీ వద్ద సీకాం కాలేజీ ఫీల్డర్ అబ్బాస్ చేతికి చిక్కాడు. అంతకుముందు ఎంవీజీఆర్ బ్యాటర్లు రవికిరణ్ (26), సాయిప్రణీత్ (16), ప్రసాద్ (19) పరుగులతో రాణించారు. అఫ్రోజ్‌కు (సీకాం కాలేజీ) ‘మ్యాన్ ఆఫ్ ద మ్యాచ్’ అవార్డు... ఎం.రవికిరణ్ (ఎంవీజీఆర్ కాలేజీ) ‘మ్యాన్ ఆఫ్ ది సిరీస్’ అవార్డు గెల్చుకున్నారు. ఆంధ్రప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్ధార్ధ్ రెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి విన్నర్, రన్నరప్ జట్లకు ట్రోఫీలు, నగదు పురస్కారాలు అందజేశారు. సాక్షి యాజమాన్యానికి అభినందనలు: బైరెడ్డి ఈ సందర్భంగా బైరెడ్డి మాట్లాడుతూ... క్రీడా ప్రతిభను వెలికితీసేందుకు సాక్షి ప్రీమియర్ లీగ్ దోహదపడుతుందన్నారు. ప్రతిభావంతులను గుర్తించేందుకు సాక్షి యాజమాన్యం ఈ టోర్నీని నిర్వహించడం అభినందనీయమని బైరెడ్డి అన్నారు. ఈ కార్యక్రమంలో కేఎల్ యూనివర్సిటీ డైరెక్టర్ ఆఫ్ అడ్మిషన్స్ డాక్టర్ జె.శ్రీనివాసరావు, ఎంహెచ్ఎస్ డీన్ డాక్టర్ ఎం.కిషోర్‌బాబు, స్పోర్ట్స్ అసోసియేట్ డీన్ డాక్టర్ హరికిషోర్, సాక్షి డిప్యూటీ ఎడిటర్ రాఘవ రెడ్డి, యాడ్స్ జీఎం బొమ్మారెడ్డి వెంకట రెడ్డి, ఈవెంట్స్ ఏజీఎం ఉగ్రగిరిరావు, విజయవాడ యూనిట్ బ్రాంచ్ మేనేజర్ కేఎస్ అప్పన్న, బ్యూరో ఇన్‌చార్జ్‌లు ఓబుల్ రెడ్డి వెంకట్రామి రెడ్డి, రమేశ్, గుంటూరు జిల్లా యాడ్స్ ఆర్ఎం వెంకట రెడ్డి, ఈవెంట్ ఆర్గనైజర్లు శ్రీహరి, వేణు తదితరులు పాల్గొన్నారు. చదవండి: IPL 2022 DC Vs PBKS: ఢిల్లీ అలవోకగా... -
ఎప్పటికీ వైఎస్ జగన్‌కు విధేయుడినే: బైరెడ్డి సిద్ధార్థరెడ్డి
కర్నూలు(సెంట్రల్): వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తమదని, తాను ఎప్పటికీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి విధేయుడినేనని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి అన్నారు. కొన్ని మీడియా సంస్థల్లో తాను పార్టీ మారుతున్నట్లు వస్తున్న వార్తలు అవాస్తమైనవని అన్నారు. చదవండి: పథకాల రద్దుకు ‘పచ్చ’ కుట్ర మంగళవారం ఆయన సాక్షితో మాట్లాడారు. తాను వైఎస్సార్సీపీకి వీర సైనికుడినని, తనకు సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి నందికొట్కూరు పార్టీ ఇన్చార్జి బాధ్యతలు, శాప్ చైర్మన్ పదవిని ఇచ్చారన్నారు. తనకు ఇంత చేసిన పార్టీని తానెందుకు వీడుతానని, మీడియాలో అవాస్తవాలు ప్రచారం చేయడం మానేయాలన్నారు. తాను ఎప్పటికీ వైఎస్సార్సీపీ, వైఎస్ జగన్మోహన్రెడ్డికి విధేయుడనేనని మరోసారి స్పష్టం చేశారు. -
వెటరన్ అథ్లెట్‌కు పెన్షన్
సాక్షి, అమరావతి: రాష్ట్ర చరిత్రలో తొలిసారిగా అంతర్జాతీయ వెటరన్ అథ్లెట్, ఆసియన్ పతక విజేత చింత ప్రతాప్కుమార్కు ప్రభుత్వం నెలకు రూ.10 వేల చొప్పున క్రీడా పెన్షన్ మంజూరు చేసిందని శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి, ఎండీ ప్రభాకరరెడ్డి తెలిపారు. సోమవారం శాప్ కార్యాలయంలో పెన్షన్ పత్రాన్ని ఆయనకు అందజేసి సత్కరించారు. ప్రతాప్‌కుమార్ 1975లో సౌత్ కొరియాలో జరిగిన 2వ ఆసియన్ అథ్లెటిక్ చాంపియన్‌షిప్‌లో 800 మీటర్లను 48 సెకన్లలో అధిగమించి రికార్డు కాంస్య పతకం సాధించారు. 1973లో మద్రాస్‌లో జరిగిన ఇండో రష్యన్ అథ్లెటిక్ టెస్టులో రెండో స్థానం, 1975లో ఫిలిప్పీన్స్‌లో జరిగిన ట్రయాంగ్యులర్ 800 మీటర్ల పరుగులో మొదటి స్థానం, వివిధ అంతర్జాతీయ వెటరన్ మీట్లలో సత్తా చాటారు. ప్రతాప్‌కుమార్ జాతీయ స్థాయిలో 9 బంగారు, 6 వెండి, 2 కాంస్య పతకాలు సాధించారు. పేదరికంతో ఇబ్బంది పడుతున్న తనను గుర్తించి ప్రభుత్వం పెన్షన్ మంజూరు చేయడంపై ప్రతాప్ కుమార్ ఆనందం వ్యక్తం చేశారు. -
సాగర గర్భం నుంచి సీఎం జగన్‌కు బర్త్‌డే శుభాకాంక్షలు
సాక్షి, కొమ్మాది (భీమిలి)/ విశాఖ స్పోర్ట్స్: రాష్ట్ర వ్యాప్తంగా 110 జలక్రీడ ప్రాంతాలను గుర్తించినట్టు రాష్ట్ర శాప్ చైర్మన్ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి తెలిపారు. క్రీడలను ప్రోత్సహించే కార్యక్రమంలో భాగంగా ఆయన విశాఖ రుషికొండలోని యాటింగ్ సెంటర్‌ను సందర్శించారు. ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని నదులు, సముద్రంలో 110 ప్రాంతాలు జల క్రీడలు నిర్వహించేందుకు అనుకూలంగా ఉన్నాయన్నారు. అనంతరం ఆయన లైవ్ అడ్వంచర్ డైరెక్టర్ బలరామ్‌నాయుడుతో కలసి సముద్రంలో 30 అడుగుల లోతు వరకు స్కూబా డైవ్ చేశారు. ఈనెల 21న సీఎం జగన్ పుట్టినరోజు సందర్భంగా సముద్ర గర్భంలోకి వెళ్లి అడ్వాన్స్ హ్యాపీ బర్త్ డే సీఎం సార్ అంటూ బైరెడ్డి సిద్ధార్థరెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. Byreddy Siddharth Reddy's special birthday wishes to CM YS Jagan garu 🔥🔥#CMYSJagan pic.twitter.com/twqNJVYsGK — Manvitha (𝕾𝖚𝖒𝖆) (@ManviDad) December 19, 2021 సీఎం కప్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభం విశాఖలోని వైఎంసీఏ వద్ద ఆదివారం సీఎం కప్ స్టేట్ సీనియర్స్, యూత్ మెన్, ఉమెన్ బాక్సింగ్ టోర్నీ ప్రారంభమైంది. తొలి బౌట్‌ను బైరెడ్డి సిద్దార్థరెడ్డి ప్రారంభించారు. మూడు రోజుల పాటు ఈ పోటీలు కొనసాగనున్నాయి. కార్యక్రమంలో ఏపీ బాక్సింగ్ సంఘం అధ్యక్షుడు కాయల వెంకటరెడ్డి, జీసీసీ చైర్పర్సన్ స్వాతిరాణి, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి, 13 జిల్లాల బాక్సర్లు పాల్గొన్నారు. చదవండి: (సినిమా టికెట్ల ఆన్లైన్ విక్రయాలకు ప్రత్యేక వ్యవస్థ) -
గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తాం: బైరెడ్డి సిద్దార్థరెడ్డి
సాక్షి, రాజమహేంద్రవరం: ఎంపీ భరత్ రామ్ నిర్వహిస్తున్న రాజన్న రచ్చబండ కార్యక్రమంలో రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) చైర్మన్ బైరెడ్డి సిద్దార్థరెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లడూతూ..గ్రామస్థాయి నుంచే క్రీడల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపారు. అద్భుతాలు సృష్టించే క్రీడాకారులు గ్రామాల్లో ఉన్నారని, క్రీడా ప్రతిభను గుర్తించి ప్రోత్సహించినప్పుడే వారికి సరైన గుర్తింపు దక్కుతుందని ఆయన అన్నారు. ఇటీవల కాలంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పోర్ట్స్ పాలసీని తీసుకురావాలని ఆదేశించారు. దీనికోసం రాష్ట్రంలో అన్ని వర్గాల వారి సలహాలు తీసుకుంటున్నామని బైరెడ్డి పేర్కొన్నారు. రాష్ట్రంలో అన్ని వసతులతో క్రీడా అకాడమీలు ఏర్పాటు చేస్తామని ఆయన చెప్పారు. సింధూ, రజనీలను ప్రొత్సహించినట్లే ప్రతిభ కల్గిన క్రీడాకారులను ప్రొత్సహిస్తామని బైరెడ్డి సిద్దార్థరెడ్డి స్పష్టం చేశారు. సీఎం జగన్ ఆశీస్సులతో రాష్ట్రంలో క్రీడలను అభివృద్ధి చేస్తామని ఆయన తెలిపారు. చదవండి:ఏపీ గవర్నర్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా సిసోడియా