సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్‌చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.
నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది.
Comments
Please login to add a commentAdd a comment