clean chit
-
YSRCP నేత భైరెడ్డి సిద్ధార్థ్ రెడ్డికి ఊరట
-
హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి క్లీన్చిట్
సాక్షి, విజయవాడ: సాయి ఈశ్వర్ హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డికి ఊరట లభించింది. ఆయనకు ప్రజా ప్రతినిధుల కోర్టు క్లీన్చిట్ ఇచ్చింది. కర్నూలు త్రిటౌన్ పోలీస్‌స్టేషన్‌లో నమోదైన హత్య కేసులో బైరెడ్డి సిద్ధార్థరెడ్డితో పాటు 9 మందిని ప్రజాప్రతినిధుల కోర్టు నిర్దోషులుగా ప్రకటించింది.నందికొట్కూరు మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ తెలుగు సాయి ఈశ్వర్ 2014లో దారుణ హత్యకు గురికావడంతో కర్నూలు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మొదటి నిందితుడు బాషా కాగా ఐదో నిందితుడిగా బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి పేరును పోలీసులు చేర్చారు. బైరెడ్డి సిద్ధార్థతో పాటు ఆయన అనుచరులపైనా కేసులు నమోదు చేశారు. అయితే ఈ కేసులో వాదనలు విన్న విజయవాడ ప్రజా ప్రతినిధుల కోర్టు తాజాగా తీర్పునిచ్చింది. -
‘మా ఆయన ఆత్మకు శాంతి చేకూరింది’
పశ్చిమ బెంగాల్‌లోని డార్జిలింగ్‌లో ఆమధ్య కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుంచి గూడ్స్ రైలు ఢీకొంది. ఈ ఘటనపై విచారణ అనంతరం గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్‌కుమార్ కుటుంబానికి ఊరట లభించింది. రైల్వే సేఫ్టీ చీఫ్ కమిషనర్ (సీసీఆర్ఎస్)తన నివేదికలో జూన్ 17న జరిగిన కాంచనజంగా ఎక్స్‌ప్రెస్ ప్రమాదానికి గూడ్స్ రైలు లోకో పైలట్ అనిల్‌కుమార్ కారకుడు కాదని తేల్చి చెప్పారు. దీనిని విన్న అనిల్‌కుమార్ భార్య ఇప్పుడే తన భర్త ఆత్మకు శాంతి చేకూరిందని పేర్కొన్నారు.ఆ నాటి ప్రమాదంలో 10 మంది ప్రాణాలు కోల్పోగా, 43 మంది గాయపడ్డారు. ఈ ఘటనపై సీసీఆర్ఎస్ నివేదిక వెలువడిన అనంతరం లోకో పైలట్ అనిల్ భార్య రోష్ణి కుమార్ మాట్లాడుతూ ‘రైలు ప్రమాదం జరిగిన కొద్దిసేపటికే నా భర్త ప్రమాదానికి కారకుడంటూ అధికారులు తేల్చేశారు. దర్యాప్తు ప్రారంభించకముందే నా భర్తను బాధ్యుడుగా చేయడాన్ని విని నేను షాక్ అయ్యాను. అయితే ఇప్పుడు రైల్వేశాఖ సరైన విచారణ జరిపి, తన భర్తను నిర్దోషిగా తేల్చినందుకు సంతోషిస్తున్నాను. ఇప్పుడు మా ఆయన ఆత్మకు శాంతి చేకూరుతుంది’ అని పేర్కొన్నారు.నాడు గూడ్స్ రైలు కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్‌ను వెనుక నుండి ఢీకొన్న దరిమిలా రైల్వే బోర్డు చైర్పర్సన్ జయ వర్మ సిన్హాతో పాటు ఇతర రైల్వే అధికారులు ఈ ప్రమాదానికి ఘటనలో మృతి చెందిన పైలట్ అనిల్ కుమార్, అతని సహాయకుడు కారణమనే నిర్ధారణకు వచ్చారు. అయితే ఈ ప్రమాదంపై అధికారుల జరిపిన విచారణలో.. కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ ట్రాక్‌పై ఉన్నప్పటికీ, గూడ్స్ రైలు లోకో పైలట్‌ను ఆ సెక్షన్లో వెళ్లడానికి అనుమతించారని, ఎటువంటి జాగ్రత్తలు లేకుండా అతనికి తప్పుడు సంకేతాలను పాస్ చేశారని సీసీఆర్ఎస్ ప్రాథమిక నివేదిక పేర్కొంది.ఆ సమయంలో గూడ్స్ రైలు గంటకు 78 కిలోమీటర్ల వేగంతో ప్రయాణిస్తున్నట్లు దర్యాప్తులో తేలింది. గూడ్సు రైలు పైలట్ కాంచన్‌జంగా ఎక్స్‌ప్రెస్ వెనుక భాగాన్ని గమనించి, అత్యవసర బ్రేకులు వేశాడు. దీంతో గూడ్సు రైలు వేగం నెమ్మదించి, అది కాంచన్‌జంగాను గంటకు 40 కిలోమీటర్ల వేగంతో ఢీకొన్నదని తేలింది. ఇది అనిల్ అప్రమత్తతను తెలియజేస్తుందని నివేదికలో పేర్కొన్నారు.ప్రమాదానికి సంబంధించిన దర్యాప్తు నివేదిక అందిన దరిమిలా అనిల్ కుమార్ కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం అందజేశామని రైల్వే అధికారులు ప్రకటించారు. ఈ విషయమై ఎన్ఎఫ్ఆర్ సీనియర్ అధికారి మాట్లాడుతూ బాధిత కుటుంబానికి పెన్షన్ ఆర్డర్ కూడా జారీ అయ్యిందని, త్వరలో గ్రాట్యుటీ కూడా చెల్లించనున్నారన్నారు. మృతుని కుమారులు మైనర్లు అయినందున వారిలో ఒకరికి పెద్దయ్యాక రైల్వేలో ఉద్యోగం ఇవ్వనున్నారని తెలిపారు. -
ఎన్సీపీ నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్.. అందుకేనా ?
న్యూఢిల్లీ: మాజీ కేంద్ర మంత్రి, ఎన్సీపీ నేత ప్రఫుల్ పటేల్ యూపీఏ ప్రభుత్వ హయాంలో జరిగిన విమానాల లీజు వ్యవహారంలో ఎలాంటి అవినీతికి పాల్పడలేదని సీబీఐ తాజాగా క్లీన్ చిట్ ఇచ్చింది. ఢిల్లీలో ఈ కేసు విచారణ జరుగుతున్న కోర్టులో సీబీఐ ఈ మేరకు దర్యాప్తు క్లోజర్ రిపోర్టు దాఖలు చేసింది. యూపీఏ హయంలో ప్రఫుల్ విమానయాన శాఖ మంత్రిగా ఉన్నపుడు ఎయిర్ ఇండియా విమానాల లీజులో అవినీతి జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేవని క్లోజర్ రిపోర్టులో సీబీఐ పేర్కొంది. ఈ క్లోజర్ రిపోర్టును విచారించి కేసును మూసివేసే అంశంలో నిర్ణయం తీసుకునేందుకుగాను ఏప్రిల్ 15న హాజరుకావాలని కేసు దర్యాప్తు అధికారికి కోర్టు నోటీసులు జారీ చేసింది. శరద్‌పవార్ అధ్యక్షుడిగా ఉన్న ఎన్సీపీని ఆయన మేనల్లుడు అజిత్‌పవార్ చీల్చి మహారాష్ట్రలో బీజేపీ నేతృత్వంలో ఉన్న ఎన్డీఏ ప్రభుత్వంలో భాగస్వామిగా చేరిన విషయం తెలిసిందే. సరిగ్గా ఇది జరిగిన 8 నెలల తర్వాత ఎన్సీపీ ముఖ్య నేత ప్రఫుల్‌పటేల్‌కు సీబీఐ క్లీన్చిట్ ఇవ్వడం చర్చనీయాంశమవుతోంది. అవసరం లేకున్నా ఎయిర్ఇండియా కోసం అత్యంత ఎక్కువ ఖర్చుతో విమానాలు లీజుకు తీసుకున్నారన్న ఆరోపణలపై ప్రఫుల్‌పటేల్ మీద 2017లో సీబీఐ కేసు నమోదు చేసింది. సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సీబీఐ ఈ కేసును దర్యాప్తు చేసింది. ఇదీ చదవండి.. బీజేపీకి అర్థం కావడం లేదు.. చిదంబరం -
నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్
-
మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్
-
మంత్రి కాకాణికి సీబీఐ క్లీన్ చిట్
సాక్షి, విజయవాడ: నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో మంత్రి కాకాణి గోవర్థన్‌రెడ్డికి సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చింది. నెల్లూరు కోర్టు ఫైళ్ల మిస్సింగ్ కేసులో సీబీఐ ఛార్జ్ షీట్ దాఖలు చేసింది. ఫైళ్ల మిస్సింగ్ కేసులో కాకాణి పాత్ర లేదంటూ ఛార్జ్ షీట్లో సీబీఐ స్పష్టం చేసింది. మంత్రి కాకాణికి నేరం జరిగిన విధానం పట్ల అవగాహన లేదని చార్జ్‌షీట్‌లో సీబీఐ పేర్కొంది. ఏడాది పాటు విచారణ జరిపి, 403 పేజీల చార్ఝ్ షీట్ దాఖలు సీబీఐ.. 88 మంది సాక్షులను విచారించింది. సొమిరెడ్డి ఆరోపణలను కొట్టిపారేసిన సీబీఐ.. మంత్రి కాకాణికి దోషులతో ఎలాంటి సంబంధం లేదని తేల్చింది. ఏపీ పోలీసుల విచారణను సీబీఐ సమర్థించింది. పోలీసులు నిర్ధారించిన సయ్యద్ హయత్, షేక్ ఖాజా రసూల్‌లను సీబీఐ దోషులుగా నిర్ధారించింది. దొంగతనాలు అలవాటున్న వీరే కోర్టులో ఉన్న బ్యాగ్ దొంగిలించారని చార్జ్ షీట్లో స్పష్టం చేసింది. హైకోర్టు ఆదేశాల మేరకు ఈ కేసును సీబీఐ విచారణ చేపట్టింది. సీబీఐ విచారణకు తాను సిద్ధమని హైకోర్టులో మంత్రి కాకాణి ముందే చెప్పారు. సీబీఐ విచారణ జరపాలని హైకోర్టును మంత్రి కోరారు. సీబీఐ విచారణకు అభ్యంతరం లేదని అప్పట్లోనే హైకోర్టుకి అడ్వకేట్ జనరల్ తెలిపారు. సీబీఐ ఛార్జ్‌షీట్‌తో చంద్రబాబు, లోకేష్, సోమిరెడ్డిలకు షాక్ తగిలింది. రెండేళ్లుగా చేసిన ఆరోపణలన్నీ సీబీఐ ఛార్జ్‌షీట్‌తో పటాపంచలయ్యాయి. ఇదీ చదవండి: టీడీపీ వెన్నులో వణుకు.. జగన్ జన బలం సుప్ర‘సిద్ధం’! -
కేరళ సీఎం పినరయి విజయన్‌కు ఊరట
CMDRF Scam Pinarayi Vijayan: ముఖ్యమంత్రి విపత్తు సహాయ నిధి (సీఎండీఆర్ఎఫ్) దుర్వినియోగానికి సంబంధించిన ఆరోపణల కేసులో కేరళ సీఎం పినరయి విజయన్ ప్రభుత్వానికి ఊరట లభించింది. గతంలో ప్రభుత్వ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ లోకాయుక్త సోమవారం తీర్పు చెప్పింది. ఈ సందర్భంగా పినరయి విజయన్‌తో పాటు 18 మంది మాజీ కేబినెట్ మంత్రులపై వేసిన పిటిషన్‌ను లోకాయుక్త తిరస్కరించింది. బంధుప్రీతి లేదా అవినీతి జరిగిందనడానికి ఎటువంటి ఆధారాలు లేవని లోకాయుక్త జస్టిస్ సిరియాక్ జోసెఫ్, అప్ లోకాయుక్తలు జస్టిస్ హరూన్ అల్ రషీద్, జస్టిస్ బాబు మాథ్యూ పి జోసెఫ్‌లతో కూడిన లోకాయుక్త బెంచ్ పేర్కొంది. సీఎండీఆర్‌ఎఫ్‌లోని నిధులను దుర్వినియోగం చేశారంటూ 2018లో సీఎంతో పాలు పలువురు మంత్రులపై కేసు నమోదైంది. నిబంధనలకు విరుద్ధంగా ఎన్సీపీ మాజీ చీఫ్ ఉజ్వూర్ విజయన్ కుటుంబానికి రూ.25 లక్షలు, దివంగత ఎమ్మెల్యే రామచంద్రన్ నాయర్ కుటుంబానికి రూ.9 లక్షలు, ప్రమాదంలో మరణించిన పోలీసు అధికారి కుటుంబానికి రూ.20 లక్షల ఆర్థిక సాయం అందించారని ఆరోపిస్తూ అవినీతి వ్యతిరేక ఉద్యమకారుడు ఆర్ఎస్ శశికుమార్ పిటిషన్ దాఖలు చేశారు. జస్టిస్ సిరియాక్ జోసెఫ్, జస్టిస్ హరున్ ఉల్ రషీద్‌లతో కూడిన డివిజన్ బెంచ్ ఈ వ్యాజ్యాన్ని విచారించింది. అయితే సభ్యుల మధ్య అభిప్రాయ భేదాలు రావడంతో ధర్మాసనం ఏకగ్రీవ నిర్ణయానికి రాలేకపోయింది. దీంతో మార్చి 2023లో, ఈ కేసును పెద్ద బెంచ్‌కు రిఫర్ చేసింది. ఇది ఊహించిందే, హైకోర్టుకెళతా ఇది ఇలా ఉంటే తాజా నిర్ణయాన్ని కేరళ హైకోర్టులో సవాల్ చేస్తానని పిటిషన్ ఆర్ఎస్ శశికుమార్ తెలిపారు. తీర్పు ఊహించినదేనని, దీనికి వ్యతిరేకంగా అప్పీల్ చేస్తానని చెప్పారు. లోకాయుక్తలో గతంలో రెండు వేలుండే కేసులు ఇపుడు 200కి తగ్గాయని పేర్కొన్నారు. ఈ సంస్థపై ప్రజలకు నమ్మకం పోయిందనడానికి ఇదే నిదర్శనమని ఆయన ఆరోపించారు -
అదానీ గ్రూప్ కి సుప్రీమ్ కోర్ట్ క్లీన్ చీట్
-
సరోగసీ వివాదంలో నయనతార దంపతులకు క్లీన్ చిట్
-
ఆర్యన్ ఖాన్‌ను ఇరికించారు: ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ
ముంబై: బాలీవుడ్ నటుడు షారుఖ్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్‌ను నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) అధికారులు కావాలనే డ్రగ్స్ కేసులో ఇరికించారని ఎన్సీబీ విజిలెన్స్ కమిటీ పేర్కొంది. దీనికి సంబంధించి ఒక సీనియర్ అధికారితో పాటు ఎనిమిది మందిపై చర్యలకు సిఫార్సు చేసింది. ఓ క్రూయిజ్ పడవలో పార్టీ సందర్భంగా డ్రగ్స్ తీసుకున్నారంటూ ఆర్యన్‌తో పాటు 15 మందిని గతేడాది అక్టోబర్‌లో ఎన్సీబీ అధికారులు అరెస్టు చేయడం తెలిసిందే. కానీ ఆర్యన్‌ను కేసు నుంచి తప్పించేందుకు అధికారులు లంచం డిమాండ్ చేశారని అనంతరం ఆరోపణలొచ్చాయి. ఆర్యన్‌తో పాటు ఇతర కేసుల్లో వచ్చిన ఇలాంటి ఆరోపణలపై విచారణ జరిపిన విజిలెన్స్ కమిటీ గత ఆగస్టులో మొత్తం 8 మంది అధికారులపై 3,000 పేజీల సుదీర్ఘ చార్జ్‌షీట్ నమోదు చేసింది. డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు కమిటీ గత మేలో క్లీన్చిట్ ఇచ్చింది. ఇప్పుడు సొంత అధికారులే ఆర్యన్‌ను కావాలని ఇరికించారని తేల్చడం ఎన్సీబీకి మరోసారి తలవంపులు తెచ్చింది. -
Drug Case: షారూక్ కొడుక్కు క్లీన్చిట్
ముంబై/న్యూఢిల్లీ: మాదకద్రవ్యాల కేసులో బాలీవుడ్ నటుడు షారూక్‌ఖాన్ కుమారుడు ఆర్యన్‌ఖాన్‌కు క్లీన్చిట్ లభించింది. ఆర్యన్‌కు వ్యతిరేకంగా ఎలాంటి సాక్ష్యాధారాలూ లభించలేదని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) పేర్కొంది. దాంతో అతనిపై అభియోగాలు నమోదు చేయలేదని కోర్టుకు తెలిపింది. ఈ కేసుకు సంబంధించి ఎన్సీబీ శుక్రవారం ముంబై కోర్టుకు 6 వేల పేజీల చార్జిషీటు సమర్పించింది. ఆర్యన్, మరో ఐదుగురి పేర్లను అందులో ప్రస్తావించలేదు. సంజయ్‌కుమార్ సింగ్ ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) విచారణ జరిపి 14 మందిపై ఎన్డీపీఎస్ చట్టంలోని పలు సెక్షన్ల కింద అభియోగాలు నమోదు చేసి కోర్టుకు సమర్పించింది. ‘‘ఆర్యన్‌కు వ్యతిరేకంగా పక్కా సాక్ష్యాలేవీ దొరకలేదు. దాంతో అతన్ని, మరో ఐదుగురిని చార్జిషీటు నుంచి మినహాయించాం’’ అని ఎన్సీబీ చీఫ్ ఎస్.ఎన్.ప్రధాన్ చెప్పారు. ఆర్యన్, మొహక్ల దగ్గర డ్రగ్స్ లభించలేదన్నారు. సత్యమే గెలిచిందని ఆర్యన్ తరఫున వాదించిన లాయర్ ముకుల్ రోహత్గీ అన్నారు. ఎన్సీబీ తన తప్పిదాన్ని అంగీకరించిందని చెప్పారు. ఆర్యన్‌కు క్లీన్‌చిట్‌పై నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎన్సీపీ) హర్షం వ్యక్తం చేసింది. ఆర్యన్ అనుభవించిన మనస్తాపానికి ఎన్సీబీ ముంబై జోనల్ డైరెక్టర్‌గా కేసులో ప్రాథమిక విచారణ చేసిన సమీర్ వాంఖెడే బాధ్యత వహించాలంది. తప్పుల తడకగా విచారణ జరిపినందుకు వాంఖెడేపై చర్యలు తీసుకోవాలని కేంద్రం ఆదేశించింది. ఏం జరిగింది..? ముంబై నుంచి గోవా వెళ్తున్న ఓడలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో 2021 అక్టోబర్ 2న ఎన్సీబీ అధికారులు చేసిన దాడుల్లో ఆర్యన్‌ఖాన్ దొరికిపోయాడు. ఆర్యన్‌తో పాటు మొత్తం 8 మందిని అధికారులు అదుపులోకి తీసుకున్నారు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో లింకులున్నాయని ఎన్సీబీ వాదించడంతో ఆర్యన్, అర్బాజ్, దమేచాలను కోర్టు రిమాండ్‌కు అప్పగించింది. ఆర్యన్‌ను జైల్లో పెట్టారు. 22 రోజుల తర్వాత వారికి బెయిల్ దొరికింది. కేసు వీగింది ఇందుకే... ► ముంబై క్రూయిజ్‌లో ఆర్యన్‌ను అరెస్ట్ చేసినప్పుడు అతని దగ్గర ఎలాంటి మాదకద్రవ్యాలూ దొరకలేదు. పడవలో అరెస్టు చేసిన ఇతర నిందితుల వద్ద లభించిన డ్రగ్స్‌నే అరెస్టు చేసిన వారందరి దగ్గర నుంచి గంపగుత్తగా లభించినట్టు చూపారు. ఇది ఎన్డీపీఎస్ నిబంధనలకు విరుద్ధం. ► ఆర్యన్ డ్రగ్స్ తీసుకున్నట్టు నిర్ధారించడానికి వైద్య పరీక్షలేవీ చేయలేదు. ► పడవలో రేవ్ పార్టీ జరుగుతోందన్న సమాచారంతో దాడి చేశామంటున్న ఎన్సీబీ వీడియో ఫుటేజ్ సమర్పించలేదు. ► ఆర్యన్ ఫోన్ చాటింగ్స్ ఈ కేసుకు సంబంధించినవి కావు. అంతర్జాతీయ డ్రగ్స్ ముఠాలతో అతనికి లింకులున్నట్టు వాటిలో ఆధారాలేవీ లేవు. ► ఎన్సీబీ సాక్షులు విచారణలో ఎదురు తిరిగారు. అధికారులు తెల్ల కాగితాలపై సంతకాలు తీసుకున్నారని ఒకరు, ఆ సమయంలో తాము ఆ పరిసరాల్లోనే లేమని మరో ఇద్దరు చెప్పారు. -
ముంబై డ్రగ్స్ కేసులో ఆర్యన్‌ఖాన్ కు క్లీన్ చిట్
-
Aryan Khan: డ్రగ్స్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు ఎన్సీబీ క్లీన్ చిట్..
Narcotics Control Bureau Has Given Clean Chit To Aryan Khan: బాలీవుడ్ బాద్షా షారుక్ ఖాన్ కుమారుడు ఆర్యన్ ఖాన్ డ్రగ్స్ కేసు విషయంలో నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో (ఎన్సీబీ) యు టర్న్ తీసుకుంది. ముంబై క్రూయిజ్ డ్రగ్ కేసులో ఆర్యన్ ఖాన్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది ఎన్సీబీ. ఆర్యన్ ఖాన్ అమాయకుడని, అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోవడంలో లేదని స్పష్టం చేసింది. 2021, అక్టోబర్ 3న ముంబై తీరంలో ఓ క్రూయిజ్ షిప్లో ఎన్సీబీ ఆకస్మిక తనిఖీలు నిర్వహించగా.. ఆర్యన్ ఖాన్ అరెస్ట్ అయిన విషయం తెలిసిందే. ఆర్యన్ ఖాన్ అరెస్ట్‌తో ఇదొక హై ప్రొఫైల్ కేసుగా వార్తల్లో నిలిచింది. డ్రగ్స్‌తో సంబంధం ఉందన్న ఆరోపణలతో.. ఆర్యన్‌తో పాటు మరో 19మందిపై కేసు నమోదు అయ్యాయి. వీళ్లలో ఆర్యన్‌తోపాటు మరో 17 మందికి బెయిల్ దొరికింది. కాగా ఈ కేసులో దర్యాప్తు చేస్తున్న ఇద్దరు అధికారుల్ని, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో ఇటీవల పక్కకు తప్పించిన విషయం తెలిసిందే. విశ్వ విజయ్ సింగ్, అశిష్ రాజన్ ప్రసాద్‌లు ఈ కేసులో ఇన్వెస్టిగేషన్ ఇన్చార్జిగా, డిప్యూటీ ఇన్వెస్టిగేషన్ ఇన్ఛార్జిగా వ్యవహరించారు. అయితే వీళ్లిద్దరూ అనుమానిత కార్యకలాపాలకు పాల్పడుతున్నట్లు తేలిందని, అందుకే వీళ్లను తప్పించినట్లు యాంటీ డ్రగ్ ప్రొబ్ ఏజెన్సీ (ఎన్సీబీ) స్పష్టం చేసింది. చదవండి:👇 'డెడ్' అని సమంత పోస్ట్.. ఆ వెంటనే డిలీట్ 12 ఏళ్ల లవ్.. ఎట్టకేలకు పెళ్లి చేసుకోబోతున్న హీరోయిన్ -
మంత్రి శ్రీనివాస్‌గౌడ్‌కు కేంద్ర ఎన్నికల సంఘం క్లీన్చిట్
సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్: గత అసెంబ్లీ ఎన్నికల్లో మహబూబ్‌నగర్ నియోజకవర్గం నుంచి పోటీ చేసిన శ్రీనివాస్‌గౌడ్ (ప్రస్తుత మంత్రి) సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చినట్టుగా అందిన ఫిర్యాదులను కేంద్ర ఎన్నికల సంఘం కొట్టేసింది. ఈ విషయంలో పూర్తిస్థాయి విచారణ జరిపామని, ఎలాంటి తప్పిదం జరగలేదని స్పష్టం చేసింది. ఈ మేరకు ఫిర్యాదు చేసిన వ్యక్తితో పాటు రాష్ట్ర ఎన్నికల అధికారి, జిల్లా ఎన్నికల అధికారిగా బాధ్యతలు నిర్వర్తించిన కలెక్టర్‌కు సమాచారం ఇచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి.. పూర్తిస్థాయిలో విచారించాం ‘2018 ఎన్నికల్లో శ్రీనివాస్‌గౌడ్ సమర్పించిన అఫిడవిట్‌ను తర్వాత మార్చారని చలువగాలి రాఘవేంద్రరాజు 2021 ఆగస్టు 2న, అదే ఏడాది డిసెంబర్ 16న ఫిర్యాదు చేశారు. దీనిపై తెలంగాణ రాష్ట్ర ఎన్నికల అధికారిని నివేదిక కోరాం. ఆయన మహబూబ్‌నగర్ జిల్లా ఎన్నికల అధికారుల ద్వారా విచారణ జరిపి నివేదిక ఇచ్చారు. ఈ ఎన్నికల్లో టీఆర్ఎస్ అభ్యర్థి శ్రీనివాస్‌గౌడ్ సహా 25 మంది అభ్యర్థులు మొత్తం 51 సెట్ల నామినేషన్లు దాఖలు చేశారు. శ్రీనివాస్‌గౌడ్ 2018 నవంబర్ 14న మూడు సెట్లు, నవంబర్ 19న మరో సెట్ నామినేషన్ వేశారు. చదవండి👉🏻 Telangana: త్వరలో 13వేల పోస్టులు భర్తీ మొత్తం 51 సెట్లలో 10 తిరస్కరణకు గురయ్యాయి. ఆరు సెట్లకు సంబంధించి అభ్యర్థులు ఉపసంహరించుకున్నారు. మొత్తం మీద 14 మంది అభ్యర్థులకు గాను 35 సెట్ల నామినేషన్లు మిగిలాయి. ఒక్కో అభ్యర్థికి ఒక్క సెట్ (సక్రమమైన) నామినేషన్ చొప్పున 14 పోగా.. మిగిలిన 21 మల్టిపుల్/డూప్లికేట్ సెట్లు. ఎన్నికల కమిషన్ వెబ్సైట్లో వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానం ప్రకారం మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, వాటికి అనుసంధానమైన అఫిడవిట్లు పబ్లిక్ డొమైన్లో కనిపించే ఆప్షన్ లేదు. ఈ మేరకు 2018 నవంబర్ 14న శ్రీనివాస్‌గౌడ్‌తో పాటు ఇతర అభ్యర్థులకు సంబంధించిన మల్టిపుల్/డూప్లికేట్ నామినేషన్లు, అఫిడవిట్లు కనిపించకుండా పోయాయి. వెబ్‌జెనెసిస్ అప్లికేషన్ విధానంలో ఈ అఫిడవిట్లు కనిపించకుండా పోయినందున దీనికి ఎవరినీ బాధ్యులను చేయలేం.. చర్యలు తీసుకోలేం..’అని ఎన్నికల ప్రధాన అధికారి ఆ ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అఫిడవిట్లు మార్చారనే ఫిర్యాదులపై పూర్తిస్థాయిలో విచారణ జరిపామని, అలాంటివేమీ జరగలేదని తేలడంతో ఫిర్యాదులు డిస్పోజ్ చేస్తున్నామని తెలిపారు. ధ్రువీకరించిన కలెక్టర్ ఈ విషయాన్ని మహబూబ్‌నగర్ కలెక్టర్ వెంకట్రావ్ ధ్రువీకరించారు. కేంద్ర ఎన్నికల సంఘం విచారణ జరిపి జారీ చేసిన ఆదేశాలు రాజ్యాంగ వ్యవస్థపై నమ్మకాన్ని కలిగించాయని, రాజ్యాంగ వ్యవస్థలో పనిచేస్తున్న వ్యక్తులు, అధికారుల నైతిక బలాన్ని, ఐక్యతను కాపాడేలా కేంద్ర ఎన్నికల సంఘం వివరణ ఇచ్చిందని ఆయన చెప్పారు. చదవండి👉 దక్షిణ డిస్కంలో తొలి లైన్‌ఉమెన్‌గా శిరీష -
డ్రగ్స్ కేసులో టాలీవుడ్ స్టార్స్‌కు ఊరట, ఈడీ క్లీన్చిట్
టాలీవుడ్ సంచలనం సృష్టించిన డ్రగ్స్ కేసులో సినీ ప్రముఖులకు ఊరట లభించింది. ఈ డ్రగ్ కేసులో పలువురు టాలీవుడ్ సెలబ్రెటీలకు క్లిన్ చిట్ లభించింది. ఇప్పటికే తెలంగాణ ఎక్సైజ్ శాఖ అధికారులు సినీ ప్రముఖులకు క్లిన్ చిట్ ఇవ్వగా తాజాగా ఈడీ కూడా ఈ కేసులో వీరికి క్లిన్ చిట్ ఇచ్చింది. ఇటీవల టాలీవుడు డ్రగ్స్ కేసులో ఈడీ విచారణ ముగిసిన సంగతి తెలిసిందే. డ్రగ్స్ దిగుమతులతో పాట ఆర్ధిక లావాదేవీలు, నిధుల మల్లింపులపై టాలీవుడ్‌కు చెందిన మొత్తం12 మందిని స్టార్స్‌ను, సెలబ్రెటీలను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. అనూహ్య పరిణామాల మధ్య విచారణ ప్రారంభించిన ఎన్ఫోర్స్మెంట్ డైరక్టరేట్ కూడా ఎలాంటి ఆధారాలు లేవని.. తమ కేసును కూడా క్లోజ్ చేసింది. ఫెమా, హవాలా సంబంధించిన ఆధారాలు లభ్యం కానందున ఈడీ కేసులో కూడా సినీ ప్రముఖులకు క్లీన్ చిట్ లభించింది. దీంతో కొంతకాలంగా డ్రగ్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న నటీనటులకు ఊరట లభించింది. -
లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్‌కు క్లీన్ చిట్
Hero Arjun Sarja Gets Clean Chit In Me Too Case After Three Years: లైంగిక వేధింపుల కేసులో స్టార్ హీరో అర్జున్ సర్జాకు క్లీన్ చిట్ లభించింది. మూడేళ్ల క్రితం నమోదైన ఈ కేసులో సాక్ష్యులు ఎవరూ లేకపోవడంతో అర్జున్‌పై అభియోగాలు వీగిపోయినట్లు బెంగళూరు పోలీసులు మెజిస్ట్రేట్‌కు నివేదిక సమర్పించారు. కాగా మూడేళ్ల క్రితం అర్జున్‌పై శృతి హరిహరన్ అనే హీరోయిన్ మీటూ ఆరోపణలు చేసిన సంగతి తెలిసిందే. సినిమా షూటింగులో రిహార్సల్ సాకుతో అర్జున్ తనను కౌగిలించుకున్నాడని, తనతో అసభ్యంగా ప్రవర్తించాడని శృతి తీవ్ర ఆరోపణలు చేయడం అప్పట్లో సెన్సేషన్‌ను క్రియేట్ చేశాయి. దీనిపై కేసు నమోదు చేసుకున్న కర్ణాటక పోలీసులు దాదాపు మూడేళ్ల విచారణ అనంతరం తాజాగా అర్జున్‌కు క్లీన్చిట్ ఇచ్చారు. విచారణలో ఎలాంటి ఆధారాలు లభించనందున అతనిపై ఉన్న అభియోగాలు ఎత్తివేస్తున్నట్లు తమ నివేదికలో రూపొందించారు. -
మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వండి
న్యూఢిల్లీ: క్రీడా సమాఖ్యలు క్రీడాకారులను అనవసరంగా వేధించడం ఆపాలని ఢిల్లీ హైకోర్డు ఆదేశించింది. స్టార్ టేబుల్ టెన్నిస్ క్రీడాకారిణి మనిక బత్రాకు క్లీన్చిట్ ఇవ్వాలని భారత టేబుల్ టెన్నిస్ సమాఖ్య (టీటీఎఫ్ఐ)ను ఆదేశించింది. ఆసియా చాంపియన్‌షిప్‌లో ఆడకుండా ఉద్దేశపూర్వకంగానే తనను జట్టు నుంచి తప్పించారని, కోచ్ సౌమ్యదీప్ రాయ్ తన శిష్యురాలికి ఒలింపిక్ బెర్త్ కోసం తనను మ్యాచ్‌లో ఓడిపోవాలని ఒత్తిడి చేశారని మనిక గత నెలలో హైకోర్టును ఆశ్రయించింది. అప్పుడు జస్టిస్ రేఖ పల్లి ప్లేయర్ ఆరోపణలపై విచారణ చేయాల్సిందిగా క్రీడా శాఖను ఆదేశించగా... సీల్డు కవర్లో నివేదికను కోర్టుకు సమరి్పంచింది. ఇందులో ఆమె వైపు నుంచి ఎలాంటి తప్పు లేదని తేలడంతో ఢిల్లీ హైకోర్టు సోమ వారం విచారణ సందర్భంగా టీటీఎఫ్ఐపై అసంతృప్తి వ్యక్తం చేసింది. ‘సమాఖ్య తీరుపట్ల నిరాశ చెందాను. కారణం లేకుండానే ఒక క్రీడాకారిణిని వివాదాల్లోకి లాగు తున్నారు. ఇది సమంజసం కాదు. క్రీడాశాఖ నివేదిక చదివాను. ఆమెకు జారీచేసిన షోకాజ్ నోటీసును ఉపసంహరించుకోండి. క్లీన్చిట్ ఇచ్చి భారత జట్టుకు ఎంపిక చేయండి’ అని ఆదేశిస్తూ కేసును ఈ నెల 17కు వాయిదా వేసింది. -
టాలీవుడ్ డ్రగ్స్ కేసులో మలుపులు
డ్రగ్స్ విషయమై వరుసగా టాలీవుడ్ ప్రముఖులను ఈడీ విచారించిన సంగతి తెలిసిందే. డ్రగ్ డీలర్ కెల్విన్ ఇచ్చిన సమాచారంతో ఈడీ విచారణ జరుగుతుండగా సినీ తారలపై ఎక్సైజ్ శాఖ వరుస ఛార్జ్షీట్లు దాఖలు చేసింది. కెల్విన్‌తో సెలబ్రిటీలకి ఉన్న సంబంధాలపై విచారించింది. తాజాగా సినీ ప్రముఖులకు అతనితో సంబంధం ఉన్నట్లు బలమైన ఆధారాలు లేవని, నిందితులుగా చేర్చేందుకు కేవలం కెల్విన్ వాగ్మూలం సరిపోదని ఎక్సైజ్ శాఖ తెలిపింది. ఎక్సైజ్ శాఖ, ఎఫ్ఎస్ఎల్ డ్రగ్స్ కేసులో టాలీవుడ్ నటులకు క్లీన్చిట్ ఇచ్చాయి. కాగా, 2017 జూలై 2న డ్రగ్స్ కేసులో కెల్విన్ అరెస్టు అయ్యాడు. అతని సమాచారం మేరకు మొత్తం 66 మందిని విచారించిన ఎక్సెజ్సిట్, ముగ్గురు మాత్రమే నిందితులని పేర్కొంది. అయితే ఇటీవల డైరెక్టర్ పూరి జగన్నాథ్, నటుడు తరుణ్ స్వచ్ఛందంగా శాంపిల్స్ ఇవ్వగా, వాటిలో డ్రగ్స్ ఆనవాళ్లు లేవని ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్(ఎఫ్ఎస్ఎల్) చెప్పింది. చదవండి: డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్చిట్ -
డ్రగ్స్ కేసులో కీలక పరిణామం.. ఆ ఇద్దరికి క్లీన్చిట్
-
సునంద పుష్కర్ మృతి కేసు: శశిథరూర్‌కు ఊరట
న్యూఢిల్లీ: భార్య సునంద పుష్కర్ మృతి కేసులో కాంగ్రెస్ ఎంపీ శశిథరూర్‌కు ఊరట లభించింది. ఈ కేసులో శశిథరూర్‌కు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారలు లేవన్న ప్రత్యేక కోర్టు శశిథరూర్ మీద ఉన్న ఆరోపణలను కొట్టిపారేసింది. సునంద పుష్కర్ జనవరి 17, 2014 రాత్రి ఢిల్లీలోని ఒక లగ్జరీ హోటల్ సూట్లో శవమై కనిపించింది. ఈ క్రమంలో శశి థరూర్‌పై ఢిల్లీ పోలీసులు ఆత్మహత్య, క్రూరత్వ ఆరోపణలపై కేసు నమోదు చేశారు. -
కరోనా వ్యాక్సిన్ ఉచితం : ఈసీ క్లీన్ చిట్
సాక్షి, పట్నా: ఎక్కడ చూసినా ప్రస్తుత ఎన్నికల పోరులో కరోనా వ్యాక్సిన్ ఉచితం అనేది ఓటర్లకు బంపర్ ఆపర్ గా నిలుస్తోంది. ఈ నేపథ్యంలో బిహార్ అసెంబ్లీ ఎన్నికల్లో తాము తిరిగి అధికారంలోకి వస్తే ఉచితంగా కరోనా వ్యాక్సిన్ ఇస్తామంటూ బీజేపీ తన ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించింది. దీనిపై ప్రతిపక్షాలు మండిపడటంతో వివాదం రాజుకుంది. దీనిపై సాకేత్ గోఖలే అనే ఆర్టీఐ కార్యకర్త ఈసీని ఆశ్రయించారు. అయితే కోవిడ్-19 వ్యాక్సిన్ ఉచిత హామీ ఎంత మాత్రమూ ఎన్నికల ప్రవర్తనా నియమావళి ఉల్లంఘన కిందకు రాదని కేంద్ర ఎన్నికల సంఘం తాజాగా స్పష్టం చేసింది. బీజేపీ ఎన్నికల మ్యానిఫెస్టోలో రాష్ట్ర ప్రజలకు ఉచిత కరోనా వ్యాక్సిన్ వాగ్దానం ప్రవర్తనా నియమావళి (ఎంసిసి) ఉల్లంఘన కిందకు రాదంటూ క్లీన్ చిట్ ఇచ్చింది. టీకా విధానం ఇంకా నిర్ణయించబని క్రమంలో ఓటర్లను తప్పుదోవ పట్టించే ప్రయత్నం అని ఆరోపిస్తూగోఖలే ఫిర్యాదు మేరకు ఈసీ స్పందించింది. అక్టోబర్ 28 న గోఖలేకు కమిషన్ ఇచ్చిన సమాధానంలో మూడు విషయాలను ప్రస్తావించింది. రాజ్యాంగానికి, విరుద్దంగా, కించపర్చేదిగా, ఎన్నికల ప్రక్రియ స్వచ్ఛతను దెబ్బతీసేలా, విఘాం కలిగించేలా లేదా ఓటరుపై అనవసర ప్రభావాన్ని చూపే వాగ్దానాలు ఉండకూడదని స్పష్టం చేసింది. కాగా ఉచిత కరోనా వ్యాక్సిన్ హామీపై ఆర్జేడీ కాంగ్రెస్ సహా ఇతర ప్రతిపక్ష పార్టీలు బీజేపీపై విరుచుకుపడిన సంగతి తెలిసిందే. ఇంకా అందుబాటులోకి రాని వ్యాక్సిన్‌ను ఒక రాష్ట్ర ప్రజలకే ఉచితంగా ఎలా ఇస్తారని ప్రశ్నించాయి. కరోనా మహమ్మారిని బీజేపీ రాజకీయం చేస్తోందని, ప్రజల భయాలతో ఆడకుంటోందని మండిపడ్డాయి. అలాగే మిగతా రాష్ట్రాలు ఈ దేశంలో లేవా అని దుయ్యబట్టాయి. మరోవైపు బిహార్ అసెంబ్లీ ఎన్నికల మొదటి విడత పోలింగ్ ఈ నెల 28వ తేదీన ముగిసింది. రెండో విడత పోలింగ్ నవంబర్ 3న, చివరి విడత పోలింగ్ నవంబర్ 7న జరగనుంది. ఫలితాలు నవంబర్ 10 వెలువడనున్నాయి. -
నయీం కేసులో మరో సంచలనం
సాక్షి, హైదరాబాద్ : రాష్ట్రంలో సంచలనం రేపిన గ్యాంగ్‌స్టర్ నయీం కేసులో మరో సంచలనం చోటుచేసుకుంది. నయీం ఎన్కౌంటర్ అనంతరం వెలుగులోకి వచ్చిన ఉదంతాలపై విచారణ చేపట్టిన ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) కీలక నిర్ణయం తీసుకుంది. ఈ కేసులో ఆరోపణలను ఎదుర్కొంటున్న 25 మంది పోలీసులకు క్లీన్చిట్ ఇచ్చింది. నయీంతో సంబంధాలు ఉన్నాయని ల్యాండ్ సెటిల్మెంట్, బెదిరింపు ఆరోపణలు ఎదుర్కొన్న 25 మంది పోలీస్ అధికారులకు దీనిలో ఎలాంటి సంబంధంలేదని తేల్చింది. అధికారులపై వచ్చిన ఆరోపణల్లో ఎలాంటి సాక్ష్యాధారాలు లభించని కారణంగా వారందరి పేర్లను నుంచి తొలగిస్తున్నట్లు పేర్కొంది. ఈ మేరకు పోలీసు అధికారుల పాత్రపై ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ రాసిన లేఖకు సిట్ చీఫ్ నాగిరెడ్డి శనివారం సమాధానమిచ్చారు. కాగా నయీం ఎన్కౌంటర్, తదనంతరం పరిణామాలపై సిట్ 175కుపైగా చార్జ్‌సీట్‌లను దాఖలు చేసిన విషయం తెలిసిందే. 130కి పైగా కేసుల్లో పోలీసులతో పాటు 8మంది ప్రముఖ రాజకీయ నాయకుల పేర్లు కూడా ఉన్నాయి. వీరిలో ఇద్దరూ అడిషనల్ ఎస్పీలతో పాటు ఏడుగురు డీఎస్పీలు,13 మంది సీఐలు, హెడ్ కానిస్టేబుల్ ఉన్నారు. తాజాగా వీరందరికి క్లీన్‌చీట్ ఇస్తున్నట్లు సిట్ చీఫ్ నాగిరెడ్డి వెల్లడించారు. మరోవైపు నయీమ్ కేసును సీబీఐకి అప్పగించాలంటూ ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ గవర్నర్‌కు లేఖ రాసింది. ఈ కేసులో పోలీసుల పేర్లను తొలగించడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది. నయీం ఇంట్లో దొరికిన డైరీలో ఉన్న వివరాలను ఇప్పటివరకు ఇవ్వలేదని, 4 ఏళ్లుగా కేసును సిట్ దర్యాప్తు చేస్తున్న బాధితులకు న్యాయం జరగలేదని ఆవేదన వ్యక్తం చేసింది. నేరస్తులకు శిక్ష పడడాలంటే ఈ కేసును సీబీఐతో విచారణ జరిపించాలని ఫోరం ఫర్ గుడ్ గవర్నెన్స్ ప్రతినిధులు కోరారు. క్లీన్ చిట్ పొందినవారిలో అడిషనల్ ఎస్పీ లు శ్రీనివాస్ రావు చంద్రశేఖర్ డీఎస్పీలు.. సీహెచ్. శ్రీనివాస్ ఎం శ్రీనివాస్ సాయి మనోహర్ ప్రకాష్ రావు వెంకట నరసయ్య అమరేందర్ రెడ్డి తిరుపతన్న ఎస్ఐలు.. మస్తాన్ రాజగోపాల్ వెంకటయ్య శ్రీనివాస్ నాయుడు కిషన్ ఎస్ శ్రీనివాసరావు వెంకట్ రెడ్డి మజీద్ వెంకట సూర్య ప్రకాష్ రవి కిరణ్ రెడ్డి బలవంత య్య నరేందర్ గౌడ్ రవీందర్ కానిస్టేబుల్ దినేష్ ఆనంద్ బాలన్న సదాత్ మియా -
గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యేకి క్లీన్ చిట్
సాక్షి, న్యూఢిల్లీ: ఉత్తరప్రదేశ్ భదోహి అసెంబ్లీ నియోజకవర్గం ఎమ్మెల్యే రవీంద్రనాథ్ త్రిపాఠితో పాటు పలువురు తనని గ్యాంగ్ రేప్ చేశారంటూ ఓ మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. మహిళ ఫిర్యాదుతో ఎఫ్ఐఆర్ నమోదు చేసుకున్న పోలీసులు కోర్టులో హాజరుపరిచారు. ఈ సందర్భంగా 2016లో తొలిసారి త్రిపాఠి తనపై అత్యాచారానికి పాల్పడ్డాడని, ఆపై తనని పెళ్లి చేసుకుంటానని నమ్మించాడని పేర్కొంది. 2017 అసెంబ్లీ ఎన్నికల ముందు ఓ హోటల్ రూమ్ తనని ఉంచాడని, అదే సమయంలో కొంతమంది నిందితులు తనపై పలుమార్లు గ్యాంగ్ రేప్‌కు పాల్పడ్డారని కోర్టుకు తెలిపింది. విచారణ చేపట్టిన జిల్లా మేజిస్ట్రేట్ ప్రధాన న్యాయమూర్తి బాధితురాలి స్టేట్మెంట్ రికార్డ్ చేసిన తరువాత కేసు దర్యాప్తు చేయాలని సూపరిటెండెంట్ రామ్ బదన్ సింగ్ తో పాటు గులాఫ్షా మహిళా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్ తో సహా ఇద్దరు సభ్యుల బృందానికి కేసును అప్పగిస్తూ తీర్పిచ్చింది. న్యాయస్థానం ఉత్తర్వులతో స్టేట్మెంట్ రికార్డ్ చేసిన పోలీస్ ఉన్నతాధికారులు..వైద్య పరీక్షలు చేయించుకునేందుకు ఆమె ఒప్పుకోవడం లేదని ఎస్పీ తెలిపారు. ఎటువంటి ఆధారాలు లేనందున ఎమ్మెల్యే త్రిపాఠికి క్లీన్ చిట్ ఇచ్చినట్లు తెలిపిన ఎస్పీ.. గ్యాంగ్ రేప్ కేసులో ఎమ్మెల్యే మేనల్లుడు సందీప్ తివారీ, మరో బంధువు నితేష్ లపై ఎఫ్ ఐఆర్ నమోదు చేసినట్లు చెప్పారు. కాగా తాను గర్భం దాల్చడంతో అబార్షన్ చేయించుకోవాలని ఎమ్మెల్యే త్రిపాఠి తనపై ఒత్తిడి తెచ్చినట్టుగా ఆమె ఫిర్యాదులో వెల్లడించినట్లు ఎస్పీ రామ్ బదన్ సింగ్ వెల్లడించారు. -
సీఈవోకు క్లీన్ చిట్, షేర్లు జూమ్
సాక్షి,ముంబై: అతిపెద్ద ఐటీ దిగ్గజం ఇన్ఫోసిస్ షేర్లు సోమవారం భారీగా లాభపడుతున్నాయి.శుక్రవారం మార్కెట్‌ముగిసిన తరువాత ప్రకటించిన క్యూ3 ఫలితాల్లో మెరుగైన లాభాలను సాధించిన నేపథ్యంలో ఇన్వెస్టర్లు ఇన్ఫీ షేర్లలోకొనుగోళ్లకు ఎగబడ్డారు. దీనికితోడు సవరించిన రెవెన్యూ గైడెన్స్, ఆర్థిక అవకతవకల ఆరోపణలపై సీఈవో సహా, ఇతర ఎగ్జిక్యూటివ్‌లకు క్లీన్చిట్ ఇవ్వడం కూడా సెంటిమెంట్‌ను బాగా ప్రభావితం చేసింది. దీంతో 4 శాతానికి ఎగిసిన ఇన్ఫీ షేరు మార్కెట్లో టాప్ విన్నర్‌గా కొనసాగుతోంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరం మూడవ త్రైమాసికంలో ఐటీ మేజర్ ఊహించిన దానికంటే మెరుగైన లాభాలను సాధించింది. జనవరి 10న ప్రకటించిన ఫలితాల్లో 2019 డిసెంబర్ 31తో ముగిసిన త్రైమాసికంలో లాభం 23 శాతం ఎగిసి రూ .4,466 కోట్ల నమోదు చేసింది. ఆదాయం 7.95 శాతం పెరిగి రూ .23,092 కోట్లకు చేరింది. దీనికి తోడు భారీ ఆర్డర్లు లభించడంతో 2020 ఆర్థిక సంవత్సరానికి రెవెన్యూ గైడెన్స్ 10 -10.5 శాతానికి సవరించింది. మరోవైపు సంస్థలో ఆర్థిక తప్పులు, దుష్ప్రవర్తనకు సంబంధించి బోర్డు ఆడిట్ కమిటీకి ఎలాంటి ఆధారాలు లభించలేదని సంస్థ తేల్చి చెప్పింది. 2019 అక్టోబర్ 21న విజిల్ బ్లోయర్ ఇన్ఫోసిస్ సీఈవో సలీల్ పరేఖ్, సీఎఫ్‌వో నీలంజన్ రాయ్ అనైతిక పద్ధతులకు పాల్పడ్డారని ఆరోపించారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టిన సంస్థ తాజాగా ఈ విషయాలను సంస్థ వెల్లడించింది.