న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలను బలపరిచేలా కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణలో ఎలాంటి ఆధారాలూ లభించలేదని తెలుస్తోంది. అలోక్ వర్మ, సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్తానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వారిని కేంద్రం తాత్కాలికంగా విధుల నుంచి తప్పించడం, ఆరోపణలపై సీవీసీ విచారణ చేస్తుండటం తెలిసిందే. అలోక్ వర్మపై విచారణను రెండు వారాల్లో పూర్తి చేయాలని ఇటీవల సుప్రీంకోర్టు సీవీసీకి గడువును నిర్దేశించింది. ఈ గడువు పూర్తవ్వడంతో విచారణ నివేదికను శుక్రవారం సుప్రీంకర్టుకు సీవీసీ అందించనుంది. అయితే విచారణలో అలోక్ వర్మకు వ్యతిరేకంగా ఆధారాలేవీ లభించలేదని విశ్వసనీయ వర్గాల సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment