alok Verma
-
సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు!
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ డైరెక్టర్ అలోక్ వర్మపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని కేంద్ర హోంశాఖ డిపార్ట్ట్మెంట్ ఆఫ్ పర్సనల్ అండ్ ట్రైనింగ్(డీఓపీటీ)కి సిఫారసు చేసింది. అధికార దుర్వినియోగానికి పాల్పడడం, సర్వీసు రూల్స్ ఉల్లంఘించడం వంటి ఆరోపణల నేపథ్యంలో హోంశాఖ ఈ మేరకు సిఫారసు చేస్తూ డీఓపీటీకి లేఖ రాసినట్లు ప్రభుత్వ వర్గాలు వెల్లడించాయి. ఆరోపణలు రుజువైతే అలోక్ పెన్షన్, రిటైర్మెంట్ ప్రయోజనాలను తాత్కాలికంగా లేదా శాశ్వతంగా జప్తు చేసే అవకాశం ఉందని పేర్కొన్నాయి. అలోక్ 2017 ఫిబ్రవరి 1న సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టి రెండేళ్లు కొనసాగారు. అప్పుడే తన కింద పని చేసే మరో అధికారి రాకేశ్ ఆస్తానాతో తగాదా పెట్టుకున్నారు. ఇరువురు అధికారులు ఒకరిపై ఒకరు అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. కేంద్ర హోంశాఖ చేసిన సిఫార్సును డీఓపీటీ యూనియన్ పబ్లిక్ సర్వీసు కమిషన్‌కి పంపించింది. -
నిఘా జాబితాలో అనిల్ అంబానీ
ముంబై: నిఘా పెట్టిన ఫోన్ల జాబితాలో రిలయన్స్ అడాగ్ గ్రూపు చైర్మన్ అనిల్ అంబానీ చెందిన నెంబర్లు ఉన్నట్లు ‘ది వైర్’ బయటపెట్టింది. 36 రాఫెల్ యుద్ధ విమానాల కొనుగోలు భారీ కుంభకోణం జరిగిందని కాంగ్రెస్ ఆరోపించిన విషయం తెలిసిందే. రాఫెల్ యుద్ధ విమానాలను తయారుచేసే సంస్థ డసాల్ట్‌కు భారత భాగస్వామిగా అనిల్ సంస్థను ఎంపిక చేయడం వెనుక ఆయను ఆయాచిత లబ్ది చేకూర్చే ప్రయత్నం జరిగిందని ఆరోపణలు వచ్చాయి. డసాల్ట్ ఏవియేషన్‌కు భారత ప్రతినిధి వెంకటరావు పోసిన, బోయింగ్ ఇండియా బాస్ ప్రత్యూష్ కుమార్ల నెంబర్లు నిఘా జాబితాలో ఉన్నాయని వైర్ తెలిపింది. దలైలామా సన్నిహిత సలహాదారులపై నిఘా కొనసాగిందని వైర్ వెల్లడించింది. సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మను 2018లో పదవిలోనుంచి తొలగించగానే ఆయన ఫోన్లపైనా నిఘా పెట్టారు. -
న్యాయవాది భూషణ్‌కు ఏ శిక్ష విధిస్తేనేం?
సాక్షి, న్యూఢిల్లీ : ‘నేత్రికన్ తిరప్పినమ్, కుట్రమ్ కుట్రమే’ అన్న తమిళ వ్యాక్యానికి ‘శివుడు మూడో కన్ను తెరిచినాసరే, తప్పు తప్పే’ అని అర్థం. సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ తనపై దాఖలైన ‘కోర్టు ధిక్కార నేరం’ కేసులో దాదాపు ఇదే అర్థంలో వాదించారు. కోర్టు ధిక్కార నేరానికి పాల్పడ్డావని సుప్రీం కోర్టు తేల్చినా, శిక్ష పడుతుందని హెచ్చరించినా ప్రశాంత్ భూషణ తన మాటలకే కట్టుబడి ఉన్నారు. కోర్టుపై తాను చేసిన వ్యాఖ్యలు సబబేనని పునరుద్ఘాటించారు. అత్యున్నత న్యాయవ్యవస్థ పనితీరు, మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తులు ఇచ్చిన తీర్పులకు సంబంధించి ప్రశాంత్ భూషణ్ చేసిన రెండు ట్వీట్లు వివాదాస్పదం అవడం, దీనిపై స్వయంగా స్పందించిన సుప్రీం కోర్టు ఆయనపై కోర్టు ధిక్కార నేరం మోపడం తెల్సిందే. భూషణ్ నేరం చేసినట్లు గత వారమే నిర్ధారించిన సుప్రీం కోర్టు ఆయనకు శిక్ష విధించేందుకు మంగళవారం నాడోసారి కొలువుదీరింది. క్షమాపణలకు అవకాశం ఇచ్చినప్పటికీ భూషణ్ అందుకు అంగీకరించలేదు. ఇప్పుడు ఆయనకు కోర్టు ఏ శిక్ష విధించినా అది ఆయన ప్రతిష్టను మరింత పెంచుతుందే తప్పా, తగ్గించేదేమీ లేదు. భూషణ్ ధిక్కారం కేసులో కోర్టు వ్యవహారం ‘గోరుతో పోయేది గొడ్డలిదాకా తెచ్చుకున్న’ చందంగా మారింది. కోర్టు పనితీరును, న్యాయమూర్తుల ప్రవర్తనను విమర్శిస్తూ భూషణ్ చేసిన ట్వీట్లు అస్పష్టంగానే ఉన్నాయి. కానీ తనపై దాఖలైన కోర్టు ధిక్కార కేసుకు సమాధానంగా ఆయన దాఖలు చేసిన అఫిడవిట్లో కోర్టు వ్యవహరించిన తీరును సమూలంగా వివరించారు. వివాదాస్పద పౌరసత్వ బిల్లు, జమ్మూ కశ్మీర్ రాష్ట్రానికి ప్రత్యేక హోదాను రద్దు చేసిన బిల్లు, కశ్మీర్లో పౌరసత్వ హక్కుల పునరుద్ధణకు సంబంధించిన కేసుల్లో కోర్టు వ్యవహరించిన తీరును ఆయన ప్రస్తావించారు. అయోధ్య–రామ జన్మభూమి కేసులో గొగొయ్ ఇచ్చిన తీర్పును సైతం ఆయన వదిలిపెట్టలేదు. (క్షమాపణ కోరితే తప్పేముంది) అంతేకాకుండా, సుప్రీంకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగొయ్‌కి వ్యతిరేకంగా దాఖలైన లైంగిక వేధింపుల కేసులో కోర్టు వ్యవహరించిన తీరును, గొగొయ్ పదవీ విరమణ తర్వాత ఆ కేసును దాఖలు చేసిన యువతికి కోర్టులో మళ్లీ అదే పోస్ట్ ఇవ్వడం లాంటి పరిణామాలను భూషణ్ కూలంకుషంగా ప్రస్తావిస్తూ వాటిపై తన అభ్యంతరాలను నిక్కచ్చిగా వెల్లడించారు. బిర్లా–సహారా కేసు నుంచి సుప్రీం కోర్టు జడ్జీలకు వ్యతిరేకంగా అరుణాచల్ ప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి కాలిఖోపాల్ ఆత్మహత్య నోట్లో చేసిన ఆరోపణల వరకు ప్రశాంత్ భూషణ్ ప్రస్తావించారు. మాజీ సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను విధులు నిర్వహించకుండా కేంద్రం అడ్డుకున్న వ్యవహారానికి సంబంధించి కూడా ఆయన పేర్కొన్నారు. ప్రధానంగా ఆయన గత నలుగురు మాజీ ప్రధాన న్యాయమూర్తుల తీర్పులనే ఎక్కువగా ప్రస్థావించారు. దేశ ప్రజలకు దేశ రాజ్యాంగం ప్రకారం భావ ప్రకటన స్వేచ్ఛ ఉందంటూ అనేక కేసుల్లో అనేక సార్లు తీర్పు చెప్పిన మన న్యాయ వ్యవస్థ తన విషయంలో మాత్రం ఎందుకు ‘ధిక్కారం’ అంటుందో...!! -
సీబీఐ కోర్టులో మాజీ డైరెక్టర్‌కు ఊరట
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) మాజీ స్పెషల్ డైరెక్టర్ రాకేష్ ఆస్థానా, డీఎస్పీ దేవేందర్ కుమార్ అవినీతి ఆరోపణలపై దర్యాప్తు సంస్థలు ఇచ్చిన క్లీన్‌చిట్‌ను సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం శనివారం సమర్థించింది. రాకేష్ ఆస్థానా, దేవేందర్ కుమార్ల అవినీతి ఆరోపణలు నిరూపించేందుకు తగిన ఆధారాలు లేవని సీబీఐ ప్రత్యేక న్యాయమూర్తి సంజీవ్ అగర్వాల్ తెలిపారు. ఆస్థానాతో పాటు సీబీఐ డీఎస్పీ దేవేందర్, మధ్యవర్తి మనోజ్ ప్రసాద్‌లపై దాఖలైన కేసులకు ఆధారాలు లేవంటూ కోర్టు తెలిపింది మాంసం ఎగుమతిదారుడు మోయిన్ ఖురేషీపై నమోదైన మనీలాండరింగ్ కేసు విచారణ సందర్భంగా సీబీఐ డైరెక్టర్ అలోక్‌వర్మ, సీబీఐ జాయింట్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా మధ్య వివాదం తలెత్తిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో వారిద్దరూ పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్నారు. మోయిన్ ఖురేషీ వ్యవహారంలో విచారణ సందర్భంగా.. కేసు నుంచి బయటపడేందుకు తాను రూ.2 కోట్ల లంచం పది నెలల్లో చెల్లించానని హైదరాబాద్ వ్యాపారి సతీష్ సానా ఫిర్యాదు మేరకు అక్టోబరు 15న ఆస్థానాపై సీబీఐ కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. -
విచారణ నుంచి తప్పుకున్న జస్టిస్ ఎన్వీ రమణ
-
‘వర్మా.. ఈ ఒక్కరోజు పనిచేయండి’
సాక్షి, న్యూఢిల్లీ : ప్రభుత్వ తీరుతో పోలీస్ సర్వీసుకు సీబీఐ మాజీ చీఫ్ ఆలోక్ వర్మ చేసిన రాజీనామాను ప్రభుత్వం తిరస్కరించింది. పదవీవిరమణ చేసే వరకూ సర్వీసులో కొనసాగాలని కోరింది. అలోక్ వర్మ ఈనెల 31న (నేడు) పదవీవిరమణ చేయాల్సి ఉంది. దీంతో ఈ ఒక్కరోజు పనిచేయాలని ఆయనను హోంమంత్రిత్వ శాఖ కోరింది. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మను తొలగించిన ప్రభుత్వం ఆయనను ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్‌గా బదిలీ చేసింది. కాగా,సీబీఐ చీఫ్‌గా తనను తొలగించడాన్ని తప్పుపట్టిన వర్మ సర్వీసు నుంచి వైదొలగుతున్నట్టు ప్రకటించిన సంగతి తెలిసిందే. సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, జాయింట్ డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలు పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో వీరి వ్యవహారంపై ఆగ్రహం వ్యక్తం చేసిన ప్రభుత్వం ఇద్దరినీ సెలవుపై పంపింది. ప్రభుత్వం తనను అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీం కోర్టును ఆశ్రయించారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు అనుగుణంగా తిరిగి సీబీఐ పగ్గాలు చేపట్టిన వర్మపై ప్రభుత్వం బదిలీ వేటు వేసింది. ఆరోపణలు ఎదుర్కొన్న రాకేష్ ఆస్ధానాను వేరే శాఖకు బదలాయించింది. -
సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు: మరో ట్విస్ట్
సాక్షి, న్యూఢిల్లీ : దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ కేసు వివాదంలో మరో ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసు విచారణ నుంచి తప్పుకుంటున్నట్లు గురువారం జస్టిస్ ఎన్వీ రమణ ప్రకటించారు. ఇదిలా ఉండగా ఇప్పటికే ఈ కేసు విచారణ నుంచి ఇద్దరు జడ్జీలు తప్పుకోగా.. తాజాగా రమణ కూడా వీరి జాబితాలో చేరారు. ఈ విషయం గురించి రమణ మాట్లాడుతూ.. ‘నాగేశ్వర రావుది, నాది ఒకే రాష్ట్రం. అంతేకాక నేను, అతని కుమార్తె వివాహానికి కూడా హాజరయ్యాను. ఈ నేపథ్యంలో నేను ఈ విచారణ బెంచ్‌లో ఉండటం సబబు కాదు. అందుకే తప్పుకుంటున్నాను’ అని తెలిపారు. సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా ఎం నాగేశ్వరావు నియామకాన్ని సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్ విచారణ నుంచి తొలుత సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. నూతన సీబీఐ డైరెక్టర్‌ను ఎంపిక చేసే కమిటీలో తాను సభ్యుడిగా ఉన్నందున.. ఈ కేసు తదుపరి విచారణకు తాను దూరంగా ఉంటానని ఆయన స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత రెండు రోజులకే జస్టిస్ సిక్రీ కూడా ఈ కేసు విచారణ బెంచ్ నుంచి తప్పుకుటున్నట్లు ప్రకటించారు. సీబీఐ డైరెక్టర్‌గా అలోక్‌వర్మను తొలిగించిన ఉన్నతాధికార కమిటీలో జస్టిస్ సిక్రీ కూడా ఉన్నారు. దాంతో తాను ఈ బెంచ్ నుంచి తప్పుకుంటున్నట్లు సిక్రీ తెలిపారు. తాజాగా ముడో వ్యక్తి ఎన్వీ రమణ కూడా ఈ బెంచ్ నుంచి తప్పుకున్నారు. పిటిషన్‌ను విచారించే ధర్మాసనం నుంచి ఒక్కొక్కరు తప్పుకోవడంతో సర్వత్రా అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
‘కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ కొరకే’
సాక్షి, హైదరాబాదు : డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు వ్యతిరేకంగా ఈ నెల 23 నుంచి 25 వరకూ నాలుగు సంఘాలకు చెందిన దాదాపు 4 లక్షల మంది కార్మికులు సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే. కార్మికుల సమ్మెకు సీపీఐ పూర్తి మద్దతు తెలుపుతుందన్నారు ఆ పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డి. ఈ సందర్భంగా శుక్రవారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన పలు అంశాల గురించి మాట్లాడారు. డిఫెన్స్ ఇండస్ట్రీలో ప్రైవేటికరణకు అనుమతించడం వల్ల దేశ రక్షణకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అంతేకాక మోదీ కక్షపూరితంగానే ఆలోక్ వర్మను ట్రాన్స్ఫర్ చేయించారని ఆరోపించారు. ఆలోక్ విషయంలో పారదర్శకంగా విచారణ జరపాలని డిమాండ్ చేశారు. అంతేకాక కేరళలో కమ్యూనిస్ట్‌లపై మోదీ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నామని తెలిపారు. సుప్రీం తీర్పుకు వ్యతిరేకంగా మోదీ మాట్లాడటం సిగ్గుచేటని విమర్శించారు. జేఎన్‌యూ విద్యార్థులపై అక్రమంగా నమోదు చేసిన చార్జిషీట్‌ను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. కేసీఆర్ ఫ్రంట్ బీజేపీ లబ్ధి కొరకే : చాడ తెలంగాణ సీఎం కేసీఆర్ ఫిరాయింపులను ప్రోత్సాహిస్తున్నారంటూ సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. టీఆర్ఎస్ నుంచి ఫిరాయిస్తే ఒక రకంగా.. టీఆర్ఎస్లోకి వెళ్తే మరో రకంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు కాంగ్రెస్‌లో చేరారని ఫిర్యాదు అందగానే ఆఘమేఘాల మీద చర్యలు తీసుకోవడం ఏంటని ప్రశ్నించారు. కాంగ్రెస్‌లో గెలిచిన ఎమ్మెల్సీలను టీఆర్ఎస్లో చేర్చుకొని విలీనం చేయడం పద్దతి కాదని తెలిపారు. ఈ సందర్భంగా తెలంగాణ అసెంబ్లీ నూతన స్పీకర్‌గా ఎన్నికైన పోచారం శ్రీనివాస్ రెడ్డికి శుభాకాంక్షలు తెలిపారు. శాసన సభలను ఔన్నత్యంగా నడపాలని కోరారు. -
సీబీఐలో మరో నలుగురిపై వేటు
న్యూఢిల్లీ: అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి అలోక్ వర్మను తొలగించిన రోజుల వ్యవధిలోనే ఆ సంస్థలోని మరో నలుగురు అధికారులపై ప్రభుత్వం వేటు వేసింది. వీరిలో అలోక్‌వర్మతో గొడవ పెట్టుకున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానా కూడా ఉన్నారు. అస్థానాతోపాటు జేడీ అరున్ కుమార్ శర్మ, డీఐజీ మనీశ్ కుమార్ సిన్హా, ఎస్పీ జయంత్ నైక్నవారేల పదవీకాలాన్ని ప్రభుత్వం తగ్గించింది. ఈ మేరకు సిబ్బంది మంత్రిత్వ శాఖ ఓ ప్రకటన విడుదల చేసింది. -
ఆ డాక్యుమెంట్లు బయటపెట్టండి
సాక్షి ప్రతినిధి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) డైరెక్టర్‌గా ఆలోక్‌వర్మను తొలగించడానికి కీలకంగా మారిన అన్ని పత్రాలు, నివేదికలను బహిర్గతం చేయాలని కేంద్ర సమాచార మాజీ కమిషనర్ శ్రీధర్ ఆచార్యులు కోరారు. సీబీఐతో పాటు కేంద్ర సమాచార కమిషన్(సీఐసీ) నియామకాల్లో పారదర్శకత పాటించాల్సిన అవసరముందని వ్యాఖ్యానించారు. ఈ మేరకు ఆయన రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు లేఖ రాశారు. ‘సీఐసీ నియామకాల నుంచే పారదర్శకత అన్నది ప్రారంభం కావాలి. సీఐసీ, సీబీఐతో పాటు అన్ని ప్రభుత్వ సంస్థలు, ఆలోక్ వర్మను తొలగించేందుకు ప్రధాని మోదీ అధ్యక్షతన ఏర్పాటైన హైలెవల్ కమిటీ, సమాచార కమిషనర్ల నియామకం సహా అన్ని ప్రభుత్వ వ్యవహారాల్లో పారదర్శకత ఉండేలా చూడాలి’ అని శ్రీధర్ కోరారు. గతేడాది కేంద్ర సమాచార కమిషన్ వార్షిక సమావేశంలో కోవింద్ మాట్లాడుతూ.. ప్రజాస్వామ్యంలో అధిక సమాచారం అంటూ ఏదీ ఉండదని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తుచేశారు. ప్రస్తుతం సీవీసీతో పాటు సీబీఐలో జరుగుతున్న నియామకాలకు సంబంధించి తీవ్రమైన సమాచార లోటు ఉందని అభిప్రాయపడ్డారు. దీనివల్ల ప్రజలు తమ సమస్యలను సీఐసీ దృష్టికి నమ్మకంగా, ధైర్యంతో తీసుకెళ్లలేరని స్పష్టం చేశారు. ఆలోక్ వర్మ తొలగింపుపై సీవీసీ నివేదికను, కీలక పత్రాలను బహిర్గతం చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయంలో ప్రభుత్వం ప్రజలకు సమాచారాన్ని ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు. సమాచార హక్కు చట్టం(ఆర్టీఐ)లోని సెక్షన్ 4 కింద అన్ని నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని స్వచ్ఛందంగా వెల్లడించాల్సి ఉంటుందన్నారు. న్యాయవ్యవస్థ కన్నెర్ర చేసినప్పుడే కేంద్రం సీవీసీ వంటి సంస్థల్లో ఖాళీలను భర్తీ చేస్తోందనీ, అయినా ప్రజలకు సమాచారమివ్వడం లేదన్నారు. ప్రధాని, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేలు సభ్యులుగా ఉన్న హైలెవల్ కమిటీ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా 2–1 మెజారిటీతో తొలగించడం తెల్సిందే. -
సీబీఐని చుట్టుముట్టిన ఆ రహస్యాలు ఏమిటి?
సీబీఐ డైరెక్టర్ పదవినుంచి ఆలోక్ వర్మను బదిలీ చేయడం అంటే తొలగించడమనే అర్థం. అర్ధరాత్రి హఠాత్తుగా ఆలోక్ వర్మను తొలగించే అధికారం ప్రభుత్వానికి లేదని, సీబీఐ చట్టం కింద కాకుండా నియామకాలు, తొలగింపుల కోసం ఏర్పాటయిన అత్యున్నత అధికార కమిటీకి మాత్రమే ఆ అధికారం ఉందని సుప్రీంకోర్టు తీర్పు వెల్లడిస్తే, ఇంకా న్యాయం మినుకుమినుకు మని మెరుస్తున్నదని సంతోషించాం. అంతలోనే ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడు, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తితో కూడిన అత్యున్నతాధికార కమిటీ హఠాత్తుగా సమావేశమైంది. ముందే ఒక నిర్ణయం తీసుకున్నట్టు కనిపించే వాతావరణం. ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ హాజరైనప్పటికీ, తొలిరోజు ఏ నిర్ణయానికి రాలేదు. మరునాడు మళ్లీ కమిటీ సమావేశమైంది. ప్రధాని, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతోపాటు ప్రధాన న్యాయమూర్తి ప్రతినిధిగా జస్టిస్ ఎ.కె. సిక్రీ హాజరయ్యారు. సమావేశం వేగంగా నిర్ణయం తీసుకున్నది. సీబీఐ డైరెక్టర్ పదవిలో ఉన్న ఆలోక్ వర్మను ఏ ప్రాధాన్యతాలేని ఫైర్ శాఖకు బదిలీ చేశారు. కేవలం ఆ అధికారం ఉంది కనుక కమిటీ ఆయన్ను తొలగించేయవచ్చా? అందుకు ఆధారం ఏదీ ఉండనవసరం లేదా అని న్యాయపరమైన ప్రశ్న. కమిటీలోని ముగ్గురిలో ప్రతిపక్ష నాయకు డుగా ఉన్న ఖర్గే ఒక్కరే తొలగింపు చర్యను వ్యతిరేకించారు. జనవరి 10న అత్యున్నతాధికార కమిటీ సమావేశంలో జరిగిన చర్చలను, నిర్ణయాన్ని వివ రించే మినిట్స్ పత్రం ప్రతి కావాలని అడిగారు. సీవీసీ ఇచ్చిన నివేదిక ఆధారంగా సీబీఐ డైరెక్ట ర్ను తొలగించారని అంటున్నారు. మొదటిసారి వర్మను తొలగించినప్పుడు సుప్రీంకోర్టులో ఆయన సవాలు చేశారు. తొలగింపునకు కారణాలని భావిస్తున్న అంశాలను సీవీసీ పరిశోధించాలనీ, ఆ పరిశోధనను మాజీ న్యాయమూర్తి ఎ.కె. పట్నాయక్ పర్య వేక్షించాలని సుప్రీంకోర్టు ఆదేశించింది. జస్టిస్ పట్నాయక్ వర్మను తొలగించేంత తీవ్రమైన అవినీతి, అక్రమాల ఆరోపణలకు ఏవిధమైన సాక్ష్యాలు లేవని, కనుక వర్మ తొలగింపు చాలా తొందరపాటు చర్య అని విమర్శించారు. సీవీసీ నివేదికను, పట్నాయక్ నివేదికను చదివిన తరువాత, ఆలోక్ వర్మ వివరణను విని సొంత బుర్ర ఉపయోగించి నిర్ణ యం తీసుకోవలసిన బాధ్యత కమిటీపైన ఉందని మల్లికార్జున ఖర్గే ప్రధానమంత్రికి రాసిన లేఖలో వ్యాఖ్యా నించారు. మరొక డైరెక్టర్ తాత్కాలిక నియామక ప్రతిపాదనను కమిటీ ముందుకు ఎందుకు తీసుకురాలేదని కూడా ఆయన నిలదీశారు. జస్టిస్ పట్నాయక్ గారు ఆ సీవీసీ నివేదికతో తనకు ఏ ప్రమేయమూ లేదని, అది కేవలం íసీవీసీకి మాత్రమే చెందిన నివేదిక అనీ, సీవీసీ దర్యాప్తును పర్యవేక్షించడానికి సుప్రీంకోర్టు నియమించిన మాజీ న్యాయమూర్తి స్వయంగా వివరిస్తూ ఉంటే ఆ నివేదికను కమిటీ సభ్యులకు ఇవ్వకుండా, పట్నా యక్ నివేదికను కమిటీలో పరిశీలించకుండా, ఇంత తీవ్ర నిర్ణయాలు ఎలా తీసుకుంటారు? ప్రభుత్వం తనకు అధికారం లేకున్నా ఆలోక్ వర్మను తొలగించేసింది. ఆయన సవాలు చేస్తే సుప్రీంకోర్టు ఆయనకు కోల్పోయిన పదవి ఇచ్చింది. కానీ ఆలోక్ వర్మను రెండురోజుల్లో మళ్లీ తొలగించేశారు. తొలగించే నిర్ణయం తీసుకున్న కమిటీలో సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి మొదటి రోజు ఉన్నారు. మరునాడు ఆయన ప్రతినిధిగా మరో జడ్జిగారు రావడమే కాకుండా ప్రధానితో పాటు ఏకీభవించి ఆలోక్ వర్మ తొలగింపు నిర్ణయాన్ని సమర్థించారు. ఇవి న్యాయవ్యవస్థ ప్రతిష్ఠకు విశ్వసనీయతకు సంబంధించిన కీలక అంశాలు. ఈ పరిణామాల్లో ఎక్కడా పారదర్శకత మచ్చుకైనా లేకపోవడం ప్రమాదకరం. జస్టిస్ పట్నాయక్ నివేదికను, సీవీసీ నివేదికను ఎవరు చూశారు? అందులో ఏముంది? వాటి ప్రతులు మల్లిఖార్జున ఖర్గేకు ఎందుకు ఇవ్వలేదు. ప్రధాన మంత్రి, న్యాయమూర్తి అయినా ఆ నివేదికలు చదివారా? అర్థం చేసుకున్నారా? అందులో కొంపముంచే ఆరోపణలు ఏమున్నాయని, ఎందుకు డైరెక్టర్‌ను తొలగించవలసి వచ్చిందో చెప్పవలసిన బాధ్యత ఆ పెద్దల మీద లేదా? ఇవి చాలా తీవ్రమైన ప్రశ్నలు. నిజానికి ఈ దేశంలో ప్రతిపౌరుడికి తెలియాల్సిన వివరాలు ఇవి. సీబీఐ వంటి అత్యున్నతస్థాయి సంస్థలో అర్ధరాత్రి దర్యాప్తు బృందంలోని పోలీసు అధికారులను ఉన్నట్టుండి, ఏ కారణమూ చెప్పకుండా, దేశంలోని మారుమూల ప్రాంతాలకు చెల్లాచెదురుగా విసిరేస్తూ బదిలీలు జరపడం, అందుకోసం నంబర్ వన్, నంబర్ టు స్థానాల్లో ఉన్న ఉన్నతాధికారులను పదవిలోంచి తప్పించడం ఆశ్చ ర్యకరమైన పరిణామాలు. ఆ బృందం దర్యాప్తు చేస్తున్న ఆరోపణలు ఏమిటి? ఏ కీలకమైన నాయకులను రక్షించడానికి ఈ తతంగమంతా? మాడభూషి శ్రీధర్ వ్యాసకర్త కేంద్ర మాజీ సమాచార కమిషనర్ -
రాకేష్ ఆస్ధానాపై బదిలీ వేటు
సాక్షి, న్యూఢిల్లీ : అత్యున్నత దర్యాప్తు ఏజెన్సీ సీబీఐలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకున్న సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ, ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాలపై ప్రభుత్వం చర్యలు చేపట్టింది. ఆలోక్ వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించిన ప్రభుత్వం ఫైర్ సర్వీసుల డీజీగా పంపడంతో మనస్ధాపం చెందిన ఆలోక్ ప్రభుత్వ సర్వీసు నుంచి వైదొలగిన సంగతి తెలిసిందే. తాజాగా సీబీఐలో నెంబర్ టూగా ఉన్నరాకేష్ ఆస్థానాను దర్యాప్తు ఏజెన్సీ నుంచి ప్రభుత్వం తప్పించింది. బ్యూరో ఆఫ్ సివిల్ ఏవియేషన్ సెక్యూరిటీ విభాగానికి ఆయనను బదలీ చేసింది. కాగా తనపై నమోదైన అవినీతి కేసుపై ఆస్థానా హైకోర్టుకు వెళ్లినా ఆయనకు ఊరట లభించలేదు.ఆలోక్ వర్మ పదవీ విరమణ చేసిన నాలుగు రోజులకే ఆస్ధానాపై బదిలీ వేటు పడింది. -
వ్యవస్థల్ని ఇంత పతనం చేయాలా?
సీబీఐలో తాజాగా సాగిన రెండు వర్గాల మధ్య పోరు– అవినీతికి సంబంధించిందే. ఇందులో ప్రధాన డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా మధ్య ఎవరికెక్కువ అవినీతి అన్న సమస్యను తేల్చడంలో బీజేపీ పాలకవర్గం ప్రధానంగా ఆరోపణలున్న ఆస్థానాకు కంటితుడుపుగా కొమ్ముకాసి, డైరెక్టర్ ఆలోక్ వర్మపై ఆస్థానా ఆరోపణలను భుజానికెత్తుకుంది. రఫేల్ ఒప్పందం కాగితాలు, వాటి వెనుక జరిగిన వేలకోట్ల రూపాయల లావాదేవీలు సీబీఐ చేతికి చిక్కి రచ్చకాకుండా ఉండాలంటే– ఆలోక్ వర్మ అక్కడ ఉండకూడదు. ఈ పథకంలో విజిలెన్స్ కమిషనర్, సుప్రీం జడ్జి కూడా మోదీకి దన్ను కాస్తూ భాగం కావడం రాజ్యాంగ వ్యవస్థల పరిపూర్ణ పతనానికి గుర్తు. ‘‘నీవు శిక్షణ ఫలితంగా అబ్బిన గుణగ ణాల వల్ల, నీవు జతకట్టిన స్నేహితులను బట్టి, నీలో కొన్ని వర్గ భావాలు ఏర్పడుతుంటాయి. అలాంటప్పుడు నీవు ఇతరుల అభిప్రాయాలను పరిశీలించాల్సి వచ్చినప్పుడు నీవు చెప్పాలనుకున్న నీ మంచి అభిప్రాయాన్ని నిశితమైన నీ తీర్పును ప్రకటించలేవు. శ్రమజీవుల పట్ల తీర్పులు ప్రకటించేటప్పుడు న్యాయమూర్తులకు (జడ్జీలు) ఎదురయ్యే సమస్యే ఇది. నిజానికి నిష్పాక్షికంగా వ్యవహరించగల నీ జడ్జీలెక్కడ? ఈ జడ్జీలు విద్యాధికులైనప్పటికీ, పారిశ్రామిక యాజమాన్యాలు పెరిగిన మూస భావాల్లోనే వారూ పెరుగుతూవచ్చారు. అలాంటప్పుడు ఒక శ్రామికుడు కానీ, ఒక ట్రేడ్ యూనియన్ కానీ, నిష్పాక్షికమైన తీర్పుల్ని ఎలా పొందగలడు? ఈ భిన్న దృక్పథాలు గల వర్గాల్లో ఒకరైన శ్రామికునికి దానికి విరుద్ధమైన వర్గానికి చెందిన మరొకరి (జడ్జి)కి మధ్య నిష్పాక్షిక నిర్ణయం అనేది క్లిష్టమైన విషయం!’’ – సుప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ స్క్రూటన్, కేంబ్రిడ్జి లా సొసైటీలో ఉవాచ. ‘‘న్యాయమూర్తులనేవారు కూడా ఒక వర్గానికి చెందినవారే. ఫలి తంగా ఆ వర్గ లక్షణాలు వారికి అలవడటం సహజం. జడ్డీలు కూడా ప్రజాప్రయోజనాలను నిర్వచిస్తూ ఉంటారు, అయితే తామేవర్గం నుంచి వచ్చారో ఆ వర్గ భావాలనే వల్లిస్తారు. వారి దృక్పథం నుంచే భాష్యం చెబుతారు’’ – (ప్రొఫెసర్ గ్రిఫిత్ : ‘‘ది పాలిటిక్స్ ఆఫ్ ది జ్యుడీషియరి’’) నేడు దేశంలో ప్రజాస్వామ్యం ముసుగులో, రిపబ్లిక్ రాజ్యాంగం పేరిట ఘటిల్లుతున్న పరిణామాలు దేశంలోని రాజ్యాంగ వ్యవస్థలన్నింటినీ ఒక్కటొక్కటిగా పాలక పక్షాలు కూలగొట్టడం వైపుగానే సాగుతున్నాయనిపిస్తోంది. సుమారు 19 ఏళ్ల నాడు భారత సుప్రీం కోర్టు 50 సంవత్సరాలు పూర్తి చేసుకున్న రోజున (జనవరి 26) సుప్రసిద్ధ సుప్రీం న్యాయమూర్తి జస్టిస్ వి.ఆర్ కృష్ణయ్యర్ ధర్మాసన చైతన్యం ప్రజా ప్రయోజనానికి ఎంత ఉపయోగకారిగా ఉందో అంత దుర్వినియోగపడుతోందని చెప్పారు. ఇంతకూ దేశాన్ని ఎదుర్కొంటున్న అసలు సవాలంతా– సుప్రీం కోర్టును భారత ప్రజల సమున్నత స్థాయి వాణిగా మార్చేయడమేనని అదే నిజమైన వ్యవస్థా, ప్రజాస్వామిక పరివర్తన అనీ ఆయన వర్ణించారు. ఈ ప్రజాస్వామిక పరివర్తనా దశకు అనుగుణంగానే పూర్తి స్థాయిలో మన పాలకులు గాని, వారి సమక్షంలో కొలువు తీరుతున్న న్యాయవ్యవస్థగానీ నడుచుకోగలుగుతున్నాయా? అప్పుడప్పుడూ అవాంఛనీయమైన ఒత్తిళ్లకు కేంద్రపాలకులు (ప్రధానమంత్రితో సహా) న్యాయవ్యవస్థను గురిచేస్తున్నప్పటికీ ఒక మేరకు న్యాయమూర్తులు కొందరు నిభాయించుకుని రాగలుగుతున్నట్లు కన్పిస్తున్నా, తిరిగి ఏదో ఒక దశలో పాలకవర్గ ప్రయోజనాలకు అనుగుణంగా తీర్పులను పాలకులు లొంగదీసుకునే స్థితికి అలవాడుపడుతున్నారు. ఇందుకు ఇటీవల కాలంలో అనేక ఉదాహరణలున్నాయి. వీటిలో తాజా ఘటనగా రఫేల్ విమానాల కొనుగోలు కుంభకోణంలో మోదీ (బీజేపీ) ప్రభుత్వం దేశవ్యాప్తంగా ఎదుర్కొన్న అనేక విమర్శలు, చివరికి ఫ్రెంచి మాజీ ప్రెసిడెంట్ హయాంలో అనిల్ అంబానీ ప్రయోజనాలు నెరవేర్చే దసాల్ట్ ఫైటర్ విమానాల కంపెనీతో కుదిర్చిన ‘వియ్యం’ తాలూకు (రూ.30,000 కోట్ల పైచిలుకు కాంట్రాక్టు) ఒప్పందం రగడ అక్కడితో కూడా ఆగకుండా దాని తాలూకు ప్రకంపనలు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ), సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ పెద్దల దాకా విస్తరించాయి. స్వతంత్ర భారతంలో ఇంతకుముందెన్నడూ లేనంత స్థాయిలో రాజ్యాంగ విధులను పక్కకు తోసేసి రాజ్యాంగ ప్రధాన బాహ్య శాఖలలో ఒకటైన న్యాయ వ్యవస్థలోనే రాజకీయ పాలనా వర్గం జోక్యం చేసుకోవడానికి, తీర్పులను బలవంతంగానో లేదా నర్మగర్భంగా ‘సన్నాయి నొక్కుళ్ల’ ద్వారానో తారుమారు చేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను ప్రజలూ, సామాజిక శాస్త్రవేత్తలు, కార్యకర్తలు, వివిధ ప్రజా సంస్థలూ గమనిస్తూనే ఉన్నారు. ఈ విషయమై బీజేపీ మాజీ మంత్రి అరుణ్ శౌరి పుస్తకావిష్కరణ సందర్భంగా ప్రసిద్ధ న్యాయమూర్తి జస్టిస్ లోథా మాట్లాడుతూ చాలా బరువైన సందేశాన్ని అందజేశారు: ‘‘సుప్రీంకోర్టు ప్రస్తుతం నడుస్తున్న దశ, తీరూ వినాశకరమయింది. సుప్రీంను నడపగలిగిన సుప్రీం నాయకత్వం అత్యవసరం. స్వతంత్ర న్యాయస్థానం ఒత్తిళ్లకు రాజీ బేరాలకు అతీతంగా ఉండాలి. అందుకు చొరవ అగ్రస్థానం నుంచే రావాలి. లేనిపక్షంలో దేశ న్యాయ వ్యవస్థే అరాచకం పాలయ్యే సమయం దగ్గర పడుతుంద’’ని హెచ్చరించారు జస్టిస్ లోథా. ఒరిస్సా మెడికల్ ఇనిస్టిట్యూట్ నిర్వహణ నియామకాల్లో ఒక న్యాయమూర్తి అవినీతిని శిక్షించకుండా సమర్థించి రక్షించినందుకు అది పెద్ద వివాదాస్పద సమస్యగా మారినప్పుడు సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ చలమేశ్వర్ ఆధ్వర్యంలో సుప్రీం పాలనా నిర్వహణ శాఖాధికారిగా ప్రధాన న్యాయమూర్తికి ఉన్న అధికారాన్ని ప్రశ్నించకుండానే ఆ అధికారాన్ని చట్ట పరిధులకు లోబడి హేతుబద్ధంగా నిర్వహించాలన్న సత్యాన్ని గుర్తింపజేస్తూ నలుగురు సుప్రీం జడ్జీలతో పత్రికా గోష్ఠి నిర్వహించి తొలిసారిగా సుప్రీంలో ప్రజాస్వామిక పద్ధతుల్లో స్పష్టమైన భిన్నాభిప్రాయాన్ని ప్రకటించి చరిత్ర సృష్టించారు. సుప్రీం నిర్వహణలో ఇదొక ఆహ్వానించదగ్గ ప్రజాస్వామ్య మలుపు. ఇక తాజాగా, రఫేల్ కుంభకోణం పూర్వ రంగంలో మొత్తం సీబీఐ– కేంద్ర పాలకవర్గం తేనెతుట్టెంతా కదిలింది. సీబీఐ నాయకత్వంలో రెండు వర్గాల మధ్య పోరు– అవినీతికి సంబంధించిందే. అయితే ఇందులో ప్రధాన డైరెక్టర్ ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ ఆస్థానా మధ్య ఎవరికెక్కువ అవినీతి అన్న సమస్యను తేల్చడంలో బీజేపీ పాలకవర్గం ప్రధానంగా ఆరోపణలున్న ఆస్థానాకు కంటితుడుపుగా కొమ్ముకాసి, డైరెక్టర్ ఆలోక్ వర్మపై ఆస్థానా ఆరోపణలను ప్రధానంగా భుజానికెత్తుకుంది. సోహ్రాబుద్దీన్ ఎన్కౌంటర్ కేసు హత్యలో అమిత్ షా పాత్ర తెరమీదికొచ్చినప్పుడు, తరువాత జస్టిస్ లోయా అనుమానాస్పద మరణం వెనుక గాథ వెల్లడైనప్పుడు అమిత్ షాను ఉదహరిస్తూ ఢిల్లీ హైకోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఎ.పి.షా మాట్లాడారు, జస్టిస్ లోయా మరణవార్త చుట్టూ పాకిపోయిన అనుమానాన్ని తేలిగ్గా తోసిపుచ్చుతూ లోయా కేసును కాస్తా మూసేయడం న్యాయ శాస్త్రం రీత్యా అనుమతించదగింది కాదని ఆయన చెప్పారు. తీరా ఇప్పుడు ‘వయా రఫేల్’ జరిగిన తంతు– అసలు మోదీ బర్తరఫ్ చేసిన సీబీఐ చీఫ్ డైరెక్టర్ ఆలోక్ వర్మను సుప్రీం ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ తిరిగి పదవిలో ప్రతిష్టించి న్యాయ వ్యవస్థ స్వతంత్ర ప్రతిపత్తిని కాపాడారు. కానీ రఫేల్ ఒప్పందం కాగితాలు, వాటి వెనుక జరిగిన వేలకోట్ల రూపాయల లావాదేవీలు సీబీఐ చేతికి చిక్కి రచ్చకాకుండా ఉండాలంటే– ఆలోక్ వర్మ అక్కడ ఉండకూడదు. కనుకనే సీబీఐకి పోటీగా కేంద్ర విజిలెన్స్ (నిఘా) కమిషనర్ కేవీ చౌదరి రహస్యంగా ఒక పని నెరవేర్చారని ప్రధాన ప్రతిపక్షం బయట పెట్టింది. ఈ ‘రహస్యం’ ఏమిటి? ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించడానికి 17 రోజుల ముందు (అక్టోబర్ 6) సీవీసీ చౌదరి ‘అర్ధరాత్రి మద్దెలదరువు’ అన్నట్టు అకస్మాత్తుగా వెళ్లి వర్మకు ఉద్వాసన ఉత్తర్వును అందజేయడానికి వెళ్లినప్పుడు ఆయనకు సీవీసీ పదవి పరువు కూడా గుర్తుకు రాలేదు. ఈ వ్యవహా రంలో మరో పరువు తక్కువ కార్యం ఏమిటంటే, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ తరఫున ప్రధాని ఆధ్వర్యంలో ఉన్న ‘త్రిసభ్య ఉన్నతాధికార నిర్ణయ సంఘానికి సీనియర్ న్యాయమూర్తి ఎ.కె. సిక్రీని మూడవ సభ్యునిగా నిర్ణయించారు. అయితే ఈ నియామకానికి ముందే ప్రధాని మోదీ ప్రభుత్వం చేసిన పని లండన్‌లోని అంతర్జాతీయ కామన్వెల్త్ సెక్రటేరి యట్ ఆర్బిట్రేషన్ (తీర్పరి) ట్రిబ్యునల్ సంస్థలో ప్రభుత్వ ప్రతినిధిగా సిక్రీని నియమించడం. ఈ వార్త పొక్కి పోవడంతోనే సిక్రీ లండన్ ట్రిబ్యునల్‌లో తన నియామకం వార్తను ఖండిస్తూ ప్రకటించాల్సి వచ్చింది. రాజకీయ నాయకులు (పాలకులు) అందరినీ ఎలా ‘నీతిమంతులు’గానో అవినీతిపరులుగానో మూకుమ్మడి ముద్ర ఎలా వేయలేమో పోలీసు అధికారులు సహా యావత్తు అధికార గణాన్ని అలా బదనాం చేయలేం. కానీ ‘నాపై అవినీతి ఆరోపణలను రుజువు చేయండి అవి రుజువూ పత్రంలేని ఆరోపణలు. నాపట్ల శత్రుత్వంతో వ్యవహరిస్తున్న స్పెషల్ డైరెక్టర్ వేసిన అభాండాలు’’ అని ఆలోక్ వర్మ సవాలు చేశారు. కనుకనే వర్మను పదవినుంచి బర్తరఫ్ చేస్తూ 2018 అక్టోబర్ 23 నాటి సీవీసీ ఉత్తర్వులను సుప్రీంకోర్టు కొట్టేయడమే వర్మ వాదనకు బలం అవుతోంది. సీబీఐ స్వతంత్ర సంస్థగా, ఎలాంటి రాజకీయ పాలకుల ప్రలోభాలకు లోనుకాని కేవలం స్టాట్యుటరీ సంస్థగా వర్ధిల్లకుండా పాలకుల ‘చేతి ఎత్తుబిడ్డ’గా ఎదుగుతూ పాక్షిక విచారణలు, శత్రుపూర్వక ఆరోపణలతో ఎలా వ్యక్తులను, ప్రత్యర్థులను పాలకులు వేధిస్తారో– కొందరు న్యాయమూర్తుల్ని, సీబీఐ అధికారులను గత పాతికేళ్లలో తాను కేసుల్నుంచి బయట పడటానికి లేదా జగన్మోహన్ లాంటి యువ ప్రత్యర్థుల్ని అక్రమంగా జైళ్లపాల్జేయడానికీ ఏ మాత్రం వెరవని బాబు లాంటి పయోముఖ విషకుంభాలు నిరూపించాయి. ఇక అలాంటి చరిత్రలు పునరావృతం కావడాన్ని తెలుగు గడ్డపై సహించరాదు. కొందరు జడ్జీలు నేనా కేసును చూడను (నాట్ బిఫోర్) అని తప్పుకుంటారు. జగన్ కేసులో జస్టిస్ లోకూర్, సుప్రీంలో అంబానీ ప్రవేశంతో జస్టిస్ భండారీ ఇలాగే తప్పుకున్నారు. ఈ వైఖరి స్వతంత్ర శక్తికి, నిజాయితీకి అగ్నిపరీక్ష! వ్యాసకర్త: ఏబీకే ప్రసాద్, సీనియర్ సంపాదకులు abkprasad2006@yahoo.co.in -
అలోక్ వర్మ ఉద్వాసనలో అసలు ప్రశ్న!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్‌గా అలోక్ వర్మ తొలగింపు వెనకనున్న అనుమానాలన్నీ పటాపంచలయ్యాయి. దాదాపు అన్ని ప్రశ్నలకు సమాధానం దొరికింది. అలోక్ వర్మపై సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్థాన చేసిన ఆరోపణలపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) చీఫ్ కేవీ చౌదరి దర్యాప్తు జరిపి సమర్పించిన నివేదికను పరిగణలోకి తీసుకొని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నేతత్వంలోని ఎంపిక కమిటీ ఆయన్ని సీబీఐ నుంచి తప్పించడం, ఆయన్ని ఫైర్ సర్వీసెస్‌కు బదిలీ చేయడం, ఆ కొత్త బాధ్యతలను స్వీకరించకుండానే వర్మ ప్రభుత్వ సర్వీసు నుంచే తప్పుకోవడం తదితర పరిణామాలు తెల్సినవే. వర్మపై దర్యాప్తును సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీంకోర్టు జడ్జీ జస్టిస్ ఏకే పట్నాయక్‌తోపాటు సీవీసీ దర్యాప్తును ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా, వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తేల్చిచెప్పినప్పటికీ ఆయనపై ఎనిమిది ఆరోపణలకు ఆధారాలు ఉన్నాయంటూ కేవీ చౌదరి ఎందుకు తప్పుడు నివేదికను సమర్పించారన్నది ఓ ప్రశ్నయితే, సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి వర్మను తప్పించాలనే ప్రధాని నరేంద్ర మోదీ ప్రతిపాదనకు సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన సుప్రీం కోర్టు జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు మద్దతిచ్చారన్నది మరో ప్రశ్న. ప్రధాని సిఫార్సు మేరకు సీబీఐ ప్రత్యేక డైరెక్టర్‌గా నియమితుడైన రాకేశ్ అస్థాన హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు ముడుపులు పుచ్చుకున్నారంటూ ఆరోపణలు రావడం, వాటిని పురస్కరించుకొని సీబీఐ డైరెక్టర్ హోదాలో వర్మ, ఆయనపై కేసు పెట్టడం, వర్మకు వ్యతిరేకంగా రాకేశ్ ప్రత్యారోపణలు చేయడం, ఈ నేపథ్యంలో వారిని బలవంతంగా సెలవుపై మోదీ ప్రభుత్వం పంపించడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. వారిపై కేంద్రం చర్యలు తీసుకోకముందే చీఫ్ విజిలెన్స్ కమిషనర్ కేవీ చౌదరి 2018, అక్టోబర్ నెలలో అలోక్ వర్మను స్వయంగా కలుసుకొని ఆయనకు అస్థానకు మధ్య రాజీ కుదుర్చేందుకు ప్రయత్నించారు. అందుకు అలోక్ వర్మ అంగీకరించకపోవడంతో రాజీ కుదరలేదు. ఆ తర్వాత సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు అలోక్ వర్మపై చౌదరి స్వయంగా దర్యాపు జరిపారు. ఈ నేపథ్యంలో ఆయన నివేదిక ఎలా ఉంటుందో ఎవరైనా ఊహించవచ్చు. జస్టిస్ ఏకే సిక్రీ ఎందుకు లొంగారు? అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని తెల్సినా ఆయనపై చర్యకు నిజాయితీపరుడిగా గుర్తింపున్న జస్టిస్ సిక్రీ మొగ్గు చూపడానికి కారణం ప్రభుత్వం నుంచి వచ్చిన ఒత్తిడే కారణమన్న వార్తలు వచ్చాయి. కానీ అది ఎలాంటి ఒత్తిడి? ఆయన ఎలాంటి ప్రలోభానికి లొంగారు? అన్న విషయాలు వెలుగులోకి రాలేదు. అయితే వర్మ ఉద్వాసనకు ప్రభుత్వం తరఫున వత్తాసు పలకడం వల్ల ఆయనపై కూడా విమర్శలు వెల్లువెత్తాయి. లండన్‌లోని ‘కామన్వెల్త్ ట్రిబ్యునల్’కు జస్టిస్ ఏకే సిక్రీ పేరును శనివారం నాడు మోదీ ప్రభుత్వం సిఫార్సు చేయడంతో ఆ ప్రలోభం ఏమిటో బయటి ప్రపంచానికి తెల్సింది. అప్పటికే విమర్శలతో కలత చెందిన జస్టిస్ సిక్రీ కేంద్రం సిఫార్సును సున్నితంగా తిరస్కరించారు. దీంతో వర్మ ఉద్వాసనపై తలెత్తిన ప్రశ్నలన్నింటికి స్పష్టమైన సమాధానాలే దొరికాయి. అయితే ఆయన్ని ఎందుకు తొలగించారన్నది ఇప్పటికీ శేష ప్రశ్నే? రఫేల్ యుద్ధ విమానాల ఒప్పందంపై విపక్షం చేస్తున్న ఆరోపణలపై దర్యాప్తు జరిపేందుకు తాను సిద్ధమేనంటూ ప్రకటించినందుకే ఆయనపై వేటు పడిందా! -
అలోక్ వర్మపై అన్ని నిరాధార ఆరోపణలే!
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ మాజీ డైరెక్టర్ అలోక్ వర్మ అవినీతికి పాల్పడ్డారని చెప్పడానికి ఎలాంటి ఆధారాలు లేవని, ఆయనపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ (సీవీసీ) విచారణను సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన మాజీ సుప్రీం కోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఏకే పట్నాయక్ శనివారం మీడియా ముందు స్పష్టం చేశారు. కేవలం సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా చేసిన ఆరోపణ లపైనే అలోక్ వర్మపై కేంద్ర విజిలెన్స్ కమిషన్ దర్యాప్తు జరిపి సుప్రీం కోర్టుకు నివేదిక సమర్పించిందని, ఆ నివేదికలోని అంశాలకు తనకు ఎంత మాత్రం సంబంధం లేదని పట్నాయక్ స్పష్టం చేశారు. ఇదే విషయాన్ని తాను లిఖిత పూర్వకంగా సుప్రీం కోర్టుకు తెలియజేశానని చెప్పారు. అంతేకాకుండా అలోక్ వర్మపై సీవీసీ విచారణను ప్రత్యక్షంగా పర్యవేక్షించిన సుప్రీం కోర్టు మాజీ ప్రధాన న్యాయమూర్తి ఆర్ఎం లోధా కూడా అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలకు ఎలాంటి ఆధారాలు లేవని శుక్రవారం ఏఎన్ఐ వార్తా సంస్థతో వ్యాఖ్యానించడం మరింత షాకింగ్ న్యూస్. అలోక్ వర్మపై వేటు గురించి ఆయన మాట్లాడుతూ సీబీఐపై రాజకీయ పెత్తనం కొనసాగినంతకాలం ఇలాంటివి జరుగుతూనే ఉంటాయని ఆయన వ్యాఖ్యానించారు. ‘సీబీఐ యజమాని మాటలను పలికే పంజరంలో రామ చిలక’ అంటూ 2013లో వ్యాఖ్యానించినదీ కూడా జస్టిస్ ఆర్ఎం లోధానే. అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలను విశ్వసించేందుకు తగిన ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ సమర్పించిన నివేదిక ఆధారంగానే ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి నరేంద్ర మోదీ నాయకత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. విచారణను ఇటు సీవీసీ తరఫున అటు సుప్రీం కోర్టు తరఫున పర్యవేక్షించిన జస్టిస్ లోధా, జస్టిస్ పట్నాయక్, ఇద్దరూ ఆధారాలు లేవని ఇంత స్పష్టంగా చెబుతున్నప్పుడు ఆధారాలు ఉన్నాయంటూ సీవీసీ నుంచి సుప్రీం కోర్టుకు, కోర్టు నుంచి ప్రధాని కార్యాలయానికి నివేదిక ఎలా వెళ్లిందన్నది కోటి రూకల ప్రశ్న. సీవీసీ కూడా పంజరంలో రామ చిలకేనా? వర్మపై తీసుకున్న నిర్ణయాన్ని పునర్ సమీక్షించాల్సిందిగా సుప్రీం కోర్టే ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీకి సూచించినప్పటికీ వర్మను తొలగిస్తూ ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకోవడం తొందరపాటేనని పట్నాయక్ అన్నారు. అన్ని అంశాలను అన్ని కోణాల నుంచి పరిశీలించి ఎంపిక కమిటీ నిర్ణయం తీసుకొని ఉండాల్సిందని ఆయన అభిప్రాయపడ్డారు. సీవీసీ అభిప్రాయమే తుది అభిప్రాయం ఎందుకు అవుతుందని, విచారణను పర్యవేక్షించిన తన నివేదికను పరిగణలోకి తీసుకోవచ్చుగదా! అని ఆయన వ్యాఖ్యానించారు. అయితే సుప్రీం కోర్టుకు అందజేసిన పట్నాయక్ నివేదికను సుప్రీం కోర్టు ప్రధాని కార్యాలయానికి పంపి ఉండకపోవచ్చు. పంపినా పట్టించుకోక పోవచ్చు. నరేంద్ర మోదీకి మంచి విశ్వాసపాత్రుడైన సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణలు రావడంతో ఆయనపై కేసు పెట్టి అరెస్ట్ చేయడానికి అలోక్ వర్మ ప్రయత్నించడం, అలోక్ వర్మపైనే రాకేశ్ అస్థాన ప్రత్యారోపణలు చేయడంతో సీబీఐలో ముసలం పుట్టడం, వారిద్దరిని బలవంతపు సెలవుపై మోదీ సర్కార్ పంపించడం, అలోక్ వర్మ తనపై చర్యను సుప్రీం కోర్టులో సవాల్ చేయడం తదితర పరిణామాలన్నీ తెల్సినవే. చదవండి: అలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు -
భయంతోనే ఆలోక్‌వర్మ బదిలీ: నారాయణ
సాక్షి, హైదరాబాద్: సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మ కొనసాగితే రఫేల్ కుంభకోణం మొత్తం బయటపడుతుందనే ఆందోళనతోనే ప్రధాని నరేంద్ర మోదీ ఆయన్ను అగ్నిమాపక శాఖకు మార్చారని సీపీఐ జాతీయ కార్యదర్శి కె.నారాయణ ఆరోపించారు. ప్రధాని స్థాయిలోనే చట్టా ల ధిక్కరణ జరిగితే ప్రజాస్వామ్యం మనుగడ ఎలా సాధ్యమవుతుందని ఆయన ప్రశ్నించారు. సీబీఐపై ఇలాంటి ప్రత్యక్షచర్య 55 ఏళ్లలో ఎప్పు డూ జరగలేదన్నారు. ఆలోక్‌వర్మను సీబీఐ డైర్టెకర్‌గా కొనసాగించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదే శాలు తట్టుకోలేక ప్రధాని నిరాశ, నిస్పృహలతో అత్యున్నతస్థాయి కమిటీ పేరుతో వర్మను ఫైర్ సర్వీస్‌కు బదిలీచేశారని విమర్శించారు. రాజ్యాంగంలోని సెక్యులరిజాన్ని వెక్కిరించే పద్ధతుల్లో కేంద్ర ప్రభుత్వం దేశాన్ని మతపరంగా విభజిం చే కుట్ర చేస్తోందని నారాయణ ధ్వజమెత్తారు. అస్సాం పౌరసత్వం బిల్లును కేంద్రం వెంటనే ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. -
ఆలోక్ పదవీ విరమణ
న్యూఢిల్లీ: అగ్నిమాపక శాఖలో తాను పనిచేయబోవడం లేదనీ, తనను ఇక పదవీ విరమణ పొందినట్లుగా గుర్తించాలని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఉద్వాసనకు గురైన ఆలోక్‌వర్మ కేంద్ర సిబ్బంది విభాగానికి తెలియజేశారు. తాను ఇప్పటికే పదవీవిరమణ వయసును దాటిపోయినందున ఇక తనను రిటైర్ అయినట్లుగానే భావించాలని ఆయన కోరారు. 2017 జూలై 31 నాటికి ఆలోక్ వర్మ పదవీ విరమణ వయసుకు చేరుకున్నారు. అయితే ఆయన అప్పటికే సీబీఐ చీఫ్‌గా నియమితులై ఉండటం, ఆ పదవీకాలం నిర్దిష్ట రెండేళ్లు కావడంతో ఇప్పటివరకు కొనసాగారు. అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆయనను సీబీఐ డైరెక్టర్‌గా తప్పించి అగ్నిమాపక శాఖ డీజీగా బదిలీ చేయడం తెలిసిందే. తనను అబద్ధపు ఆరోపణలపై బదిలీ చేశారనీ, అవి కూడా తన విరోధి అయిన ఒకే ఒక్క వ్యక్తి దురుద్దేశంతో చేసిన ఆరోపణలు తప్ప ఇతరులెవరూ తనను వేలెత్తి చూపలేదని వర్మ ఉద్ఘాటించారు. సీబీఐ డైరెక్టర్ పదవికి ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు మళ్లీ నియమించిన రెండ్రోజుల్లోనే, అత్యున్నత స్థాయి త్రిసభ్య ఎంపిక కమిటీ ఆయనను 2:1 ఆధిక్యంతో ఆ పదవి నుంచి తప్పించి, అగ్నిమాపక సేవల డీజీగా బదిలీ చేస్తూ సంచలన నిర్ణయం తీసుకోవడం తెలిసిందే. సుప్రీంకోర్టు తీర్పు తర్వాత తొలిసారి ఆయన మౌనం వీడుతూ గురువారం రాత్రి పీటీఐకి ఓ ప్రకటన పంపారు. ‘సీబీఐ దేశంలోనే అత్యున్నత దర్యాప్తు సంస్థల్లో ఒకటి. దాని స్వతంత్రతను కాపాడాలి. బయటి శక్తుల ప్రమేయం లేకుండా అది పనిచేయాలి. సీబీఐని నాశనం చేయడానికి కొందరు చూస్తున్నప్పుడు, ఆ సంస్థ నిజాయితీని, ప్రతిష్ఠను కాపాడేందుకు నేను ప్రయత్నించాను. నాకు వ్యతిరేకంగా ఉన్న ఒకే ఒక్క వ్యక్తి చేసిన అబద్ధపు ఆరోపణలపై నన్ను బదిలీ చేయడం బాధాకరం’ అని వర్మ వాపోయారు. ప్రధాని నరేంద్ర మోదీ, సుప్రీంకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ ఆలోక్‌ను పదవి నుంచి బదిలీ చేసింది. ఖర్గే కూడా ఆలోక్ బదిలీని వ్యతిరేకిస్తూ ఆయన వాదన వినాలని పట్టుబట్టినా, మోదీ, జస్టిస్ సిక్రీ కలిసి ఆలోక్‌ను బదిలీ చేశారు. మళ్లీ బదిలీలన్నీ రద్దు గురువారం రాత్రి మళ్లీ సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఎం.నాగేశ్వర రావు, సంస్థలో అంతకుముందు ఆలోక్ వర్మ చేసిన బదిలీలన్నింటినీ రద్దు చేశారు. గతేడాది అక్టోబర్‌లో నాగేశ్వరరావు డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించగానే, ఆగమేఘాల మీద పలువురు అధికారులను బదిలీ చేశారు. అయితే సుప్రీంకోర్టు తీర్పు తర్వాత మళ్లీ బాధ్యతలు చేపట్టిన ఆలోక్‌వర్మ ఆ బదిలీలన్నింటినీ రద్దు చేయడం తెలిసిందే. తాజాగా, మళ్లీ నాగేశ్వరరావుకు బాధ్యతలు వచ్చాక, ఆలోక్ వర్మ ఇచ్చిన బదిలీ ఉత్తర్వులను అన్నింటినీ రద్దు చేశారు. ప్రభుత్వం రాజకీయ బుల్లెట్లు పేలుస్తోంది ప్రభుత్వం సీబీఐని బలహీనపరుస్తోందనీ, సీవీసీ భుజాల నుంచి రాజకీయ బుల్లెట్లను పేలుస్తోందని కాంగ్రెస్ ఆరోపించింది. ప్రభుత్వంతో కలిసి రాజ్యాంగాన్ని సీవీసీ ఉల్లంఘిస్తోందంది. కాంగ్రెస్ అధికార ప్రతినిధి అభిషేక్ సింఘ్వీ మాట్లాడుతూ ఊహలు, వాదనల ఆధారంగా సీవీసీ ఇచ్చిన నివేదికను అనుసరించి సీబీఐ డైరెక్టర్‌గా ఆలోక్ వర్మను తొలగించడాన్ని తాము ఖండిస్తున్నామని తెలిపారు. అయితే రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలుకు సంబంధించి మాత్రం సంబంధిత పత్రాలు సమర్పించినా సీవీసీ స్పందించడం లేదని ఆరోపించారు. -
వర్మ అవినీతిపై ఆధారాలున్నాయనే!
న్యూఢిల్లీ: ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు జడ్జి జస్టిస్ సిక్రీ, లోక్‌సభలో విపక్ష నేత ఖర్గేల అత్యున్నత కమిటీ సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి ఆలోక్ వర్మను తొలగిస్తూ తీసుకున్న నిర్ణయానికి సంబంధించి సుప్రీంకోర్టు మాజీ జడ్జి జస్టిస్ మార్కండేయ కట్జూ ఒక ఆసక్తికర అంశాన్ని ఫేస్బుక్లో పోస్ట్‌చేశారు. వర్మను తొలగించే ప్రతిపాదనకు ఎందుకు మద్దతిచ్చావని శుక్రవారం ఉదయమే ఫోన్ చేసి జస్టిస్ సిక్రీని తాను ప్రశ్నించానని, అందుకు ఆయన సమాధానమిచ్చారని కట్జూ చెప్పారు. వర్మపై వచ్చిన తీవ్రమైన అవినీతి ఆరోపణలకు సంబంధించి సీవీసీ వద్ద కచ్చితమైన ఆధారాలున్నాయని, అవి చూశాకే.. విచారణ ముగిసేవరకు సీబీఐ డైరెక్టర్ పదవిలో వర్మ కొనసాగడం సరికాదని తాను భావించినట్లు జస్టిస్ సిక్రీ వివరించారని కట్జూ వెల్లడించారు వర్మ వివరణ తీసుకున్నాకే సీవీసీ ఆ నివేదిక రూపొందించిన విషయాన్ని జస్టిస్ సిక్రీ చెప్పారన్నారు. ఈ విషయాన్ని బహిర్గతం చేసేందుకు ఆయన నుంచి తాను అనుమతి తీసుకున్నానన్నారు. అయితే, సీబీఐ చీఫ్‌గా వర్మను తప్పించిన తీరును తాను వ్యతిరేకిస్తున్నానని జస్టిస్ కట్జూ స్పష్టం చేశారు. సీబీఐ చీఫ్‌గా తొలగించే ముందు వర్మ వివరణ ఎందుకు తీసుకోలేదని ఆయన ప్రశ్నించారు. ‘సాధారణంగా, సస్పెండ్ చేసే ముందు కూడా సంబంధిత వ్యక్తి నుంచి వివరణ తీసుకున్నాకే చర్య తీసుకుంటారు. వర్మను సస్పెండ్ చేయలేదు.. డిస్మిస్ చేయలేదు. కేవలం సమాన హోదా కలిగిన పోస్ట్‌కు బదిలీ చేశారు’ అని జస్టిస్ కట్జూ గుర్తు చేశారు. వర్మను సీబీఐ చీఫ్‌గా తొలగించే ప్రతిపాదనను ఖర్గే వ్యతిరేకించారు. -
‘ఎన్నికల సంఘం టీఆర్ఎస్కు తొత్తుగా మారింది’
సాక్షి, హైదరాబాద్ : ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారిందంటూ మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారమిక్కడ ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ఓటర్ లిస్ట్‌లో పొరపాట్లు జరిగాయని స్వయంగా ఎన్నికల సంఘమే చెప్పిందన్నారు. మరి ఆ తప్పులకు బాధ్యులేవరు.. వారి మీద ఎటువంటి చర్యలు తీసుకున్నారని శశిధర్ రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల సంఘానికి సరైన ఓటర్ లిస్ట్ తయారు చేసేంత చిత్తశుద్ధి కూడా లేదంటూ విమర్శించారు. ఎన్నికల సంఘం అధికార పార్టీకి తొత్తుగా మారి.. ప్రజస్వామ్యాన్ని ఫుట్‌బాల్ అడుకుంటుందని శశిధర్ రెడ్డి ఆరోపించారు. దాదాపు 30 లక్షల ఓట్లను ఎన్నికల సంఘం తొలగించిందని తెలిపారు. క్యాబినెట్ సమావేశంలో ఎన్నికల సంఘానికి సీఎం కేసీఆర్ కృతజ్ఞతలు చెప్పడంతోనే వారి మధ్య ఉన్న బంధం ఏంటో జనాలకు బాగా అర్థమయ్యిందంటూ ఎద్దేవా చేశారు. ఓటర్ లిస్ట్‌లో పొరపాట్లు చేసిన అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దేశంలోనే నంబర్ వన్‌గా ప్రజస్వామ్యన్ని ఎలా ఖూని చేయాలో కేసీఆర్ చూపించారంటూ మండి పడ్డారు. కేంద్ర ఎన్నికల సంఘం కూడా టీఆర్ఎస్కు అనుకూలంగా వ్యవహరిస్తోందని ఆరోపించారు. ప్రజాస్వామ్యం ప్రమాదంలో ఉంది : మల్లు రవి సీబీఐ మాజీ డైరెక్టర్ ఆలోక్ వర్మ నుంచి వివరణ తీసుకోవాలని మల్లిఖార్జున ఖర్గే చెప్పినా కూడా ప్రధాని నరేంద్ర మోదీ పట్టించుకోలేదని మల్లు రవి ఆరోపించారు. సీబీఐ డైరెక్టర్‌ను ఆఘమేఘాల మీద ఎందుకు ట్రాన్సఫర్ చేశారని ప్రశ్నించారు. రఫెల్ కుంభకోణం నుంచి తప్పించుకోవడానికే సీబీఐ డైరెక్టర్‌ను ట్రాన్స్ఫర్ చేశారని విమర్శించారు. రాజ్యాంగం ఇచ్చిన హక్కును ప్రధాని స్వార్థానికి వాడుకున్నారని మండిపడ్డారు. ఆలోక్ వర్మను తప్పించడం వంటి చర్యలను చూస్తే ప్రజాస్వామ్యం ఎంతటి ప్రమాదంలో ఉందో అర్థమవుతుందన్నారు. -
ఆలోక్ వర్మ రాజీనామా
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ వ్యవహారంలో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. భారత పోలీస్ సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు సీబీఐ చీఫ్ ఆలోక్ వర్మ శుక్రవారం ప్రకటించారు. ఫైర్ సర్వీసుల డైరెక్టర్ జనరల్ బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించిన వర్మ ప్రభుత్వ ఉద్యోగానికి రాజీనామా చేశారు. బదిలీ చేసిన మరుసటి రోజే సర్వీసు నుంచి తప్పుకుంటున్నట్టు వెల్లడించారు. సీబీఐ అత్యున్నత పదవి నుంచి వర్మను ప్రభుత్వం తొలగించడం ఇది రెండవసారి కావడం గమనార్హం. సీబీఐ చీఫ్‌గా తనను తప్పించి ప్రభుత్వం అకారణంగా సెలవుపై పంపడాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ దాఖలు చేసిన పిటిషన్‌పై సర్వోన్నత న్యాయస్ధానం విచారణ చేపట్టి తిరిగి ఆలోక్‌కు సీబీఐ పగ్గాలు అప్పగించాలని ఆదేశించిన సంగతి తెలిసిందే. కాగా, అంతకుముందు సీబీఐ చీఫ్‌గా ఆలోక్‌కు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ ఆలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. మరోవైపు సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్ వర్మ బుధవారమే సీబీఐ చీఫ్‌గా బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేష్ ఆస్ధానాతో విభేదాల నేపథ్యం చివరికి తీవ్ర మనస్ధాపంతో ఆలోక్ వర్మ రాజీనామాకు దారితీసింది.సీబీఐ చీఫ్‌గా ప్రభుత్వం తనను తప్పించడంపై న్యాయపోరాటంలో ఆలోక్ నెగ్గినా ప్రభుత్వం తిరిగి వేటు వేయడం ఆయనను కలిచివేసింది. -
ఆలోక్ వర్మపై వేటు, సవాలక్ష ప్రశ్నలు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మను బలవంతపు సెలవుపై పంపించడం చెల్లదని, ఆయన్ని ఆ పదవిలో పునర్నియమిస్తూ సుప్రీం కోర్టు ఉత్తర్వులు జారీ చేసిన మరునాడే అంటే, గురువారం సాయంత్రం ఆయన్ని ఆ పదవి నుంచి ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని ఎంపిక కమిటీ తొలగించిన విషయం తెల్సిందే. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న ఆలోక్ వర్మను ఆ పదవిలో కొనసాగించడం సీబీఐ ప్రతిష్టకే భంగకరం కనుక ఆయన్ని ఆ పదవి నుంచి తప్పించి అగ్నిమాపక సర్వీసుకు బదిలీ చేయాల్సి వచ్చిందని ప్రభుత్వం సమర్థించుకుంది. వాస్తవానికి ఈ నిర్ణయంతో సీబీఐ ప్రతిష్ట మరింత మసకబారింది. ఆలోక్ వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలకు సరైన సాక్ష్యాధారాలు ఉన్నాయంటూ కేంద్ర విజిలెన్స్ కమిషన్ రహస్య నివేదిక వెల్లడించిన నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ, ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ సూచించిన జస్టిస్ సిక్రీ, ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేలతో కూడిన ఎంపిక కమిటీ వర్మపై వేటు వేసింది. ఆయన్ని సీబీఐ డైరెక్టర్ పదవి నుంచి తొలగిస్తూ మోదీ, జస్టిస్ సిక్రీలు నిర్ణయం తీసుకోగా ఖర్గే వ్యతిరేకించారు. మెజారిటీ నిర్ణయం కనుక ఆలోక్ వర్మను బదిలీ చేశారు. సీబీఐ డైరెక్టర్ స్థాయిలో ఉన్న వ్యక్తిపై అవినీతి ఆరోపణలు వస్తే వాటిపై ఉన్నత స్థాయిలో విచారణ జరిపి నిజానిజాలు తేల్చాల్సిన మోదీ ప్రభుత్వం అలా చేయకుండా బదిలీ ఎందుకు చేసింది? ఆయన అవినీతికి పాల్పడితే శిక్షించడం ద్వారా సంస్థ ప్రతిష్టను మరింత పెంచవచ్చుగదా! అదే అవినీతి ఆరోపణలను ఎదుర్కొంటున్న సీబీఐ ప్రత్యేక డైరెక్టర్ రాకేశ్ అస్థానాపై మోదీ ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు ? రఫేల్ యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందంలో భారీ కుంభకోణం జరిగిందంటూ వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు జరపడానికి అలోక్ వర్మ సంసిద్ధత వ్యక్తం చేసినప్పటి నుంచే ఆయనకు వ్యతిరేకంగా ఇన్ని పరిణాలు ఎందుకు చోటు చేసుకున్నాయి ? అసలు సీబీఐకి స్పెషల్ డైరెక్టర్‌గా రాకేశ్ అస్థానాను నియమించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది ? రాకేశ్ అస్థాన నియమకం నుంచే అనుమానాలు 1984, గుజరాత్ ఐపీఎస్ బ్యాచ్‌కు చెందిన రాకేశ్ అస్థానను 2017, అక్టోబర్ 22వ తేదీన సీబీఐ స్పెషల్ డైరెక్టర్‌గా నరేంద్ర మోదీ ప్రభుత్వం నియమించింది. సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కదలికలను ఎప్పటికప్పుడు తెలుసుకోవడంతోపాటు రాజకీయ ప్రత్యర్థులపై సీబీఐ దాడులకు ఉపయోగించుకోవడం కోసమే అస్థానను మోదీ ప్రభుత్వం నియమించిందని అప్పట్లో వార్తలు వచ్చాయి. మోదీ గుజరాత్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఆయన రాజకీయ ప్రత్యర్థుల కేసులను దర్యాప్తు జరపడం ద్వారా ‘సూపర్‌కాప్’గా ముద్రపడిన రాకేశ్ అస్థాన, మోదీకి మంచి విశ్వాసపాత్రుడన్న ప్రచారం ఉంది. హవాలా కేసులో ముడుపులు ఓ హవాలా కేసులో మూడున్నర కోట్ల రూపాయలు తీసుకొని కేసును తారుమారు చేశారన్న ఆరోపణలపై రాకేశ్ అస్థానపై సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ కేసు దాఖలు చేసి సీబీఐలోని ఆయన కార్యాలయంపై స్వయంగా దాడులు జరపడం తెల్సిందే. అదే రోజు రాత్రి కేంద్రం ఆదేశాల మేరకు కేంద్ర విజిలెన్స్ అధికారులు సీబీఐ కార్యాలయంలోని ఆలోక్ వర్మ కార్యాలయంపై దాడులు జరిపారు. పరస్పర ఆరోపలు చేసుకుంటున్న అస్థాన, వర్మలను అదే రోజు బలవంతపు సెలవులపై కేంద్రం పంపించింది. ప్రధాని నాయకత్వంలోని ఎంపిక కమిటీ ప్రమేయం లేకుండా తనను ఎలా తొలగిస్తారంటూ అలోక్ వర్మ సుప్రీం కోర్టుకు వెళ్లారు. అన్ని సమాధానం లేని ప్రశ్నలే అప్పటి నుంచి అన్ని ప్రశ్నలు, అనుమానాలు తప్ప, ఏ ఒక్కదానికి సరైన జవాబు దొరకడం లేదు. ఎంపిక కమిటీ నిర్ణయం లేకుండా వర్మపై చర్య చెల్లదని అప్పుడే తేల్చి చెప్పాల్సిన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తి గొగోయ్ నాయకత్వంలోని బెంచీ అలా చేయకుండా వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై ఎందుకు సీవీసీ దర్యాప్తునకు ఆదేశించింది ? ఎందుకు రహస్య నివేదిక అడిగింది ? అస్థానపై అదే దర్యాప్తునకు ఎందుకు ఆదేశించలేదు? సీవీసీ నివేదిక ఇచ్చిన తర్వాత ప్రభుత్వం నిర్ణయం తప్పని ఎందుకు పేర్కొంది? మళ్లీ మోదీ నాయకత్వంలోని ఎంపిక సమీక్షించే వరకు ఎలాంటి నిర్ణయాలు తీసుకోకూడదని వర్మను సుప్రీం కోర్టు ఎందుకు ఆదేశించింది? తాను తెప్పించుకున్న సీవీసీ రహస్య నివేదికను మోదీకి ఎందుకు పంపించింది? అలోక్ వర్మపై చర్య తీసుకున్న మోదీ కమిటీ రాకేశ్ అస్థానపై ఎందుకు చర్య తీసుకోలేదు? ఆయన ఎందుకు ఇప్పుడు స్వచ్ఛంద సెలవుపై వెళ్లారు? హిందూత్వ వాదిగా ముద్రపడిన నాగేశ్వర రావునే సీబీఐ తాత్కాలిక డైరెక్టర్‌గా నియమించారు? ఇదంతా ఓ స్క్రిప్టు ప్రకారం ఎందుకు జరుగుతోంది? ‘సీబీఐ యజమాని మాటలు పలికే పంజరంలో రామ చిలక’గా అభివర్ణించిన సుప్రీం కోర్టే ఎందుకు ప్రభుత్వం వైపు మొగ్గు చూపిస్తోంది? ఈ ప్రశ్నలన్నింటిని నివృత్తి చేయాల్సిన బాధ్యత మోదీ ప్రభుత్వానిదే. అప్పుడే ప్రభుత్వం సచ్చీలతగానీ, సీబీఐ ప్రతిష్టగానీ తేలేది. -
ఆలోక్ వర్మపై వేటు
ఆలోక్ వర్మపై కేంద్ర ప్రభుత్వం మరోసారి వేటువేసింది. రెండు నెలల క్రితం అనూహ్యంగా బలవంతంగా సెలవుపై పంపిన మోదీ ప్రభుత్వం ఇప్పుడు ఏకంగా సీబీఐ చీఫ్ పదవి నుంచే తప్పించేసింది. సీబీఐలో అంతఃకలహాల నేపథ్యంలో గత అక్టోబర్ 23 అర్ధరాత్రి ఆయనను సెలవుపై పంపింది. దీనిపై సుప్రీంకోర్టు నుంచి ఊరట పొందిన రెండు రోజులకే ప్రభుత్వం ఆయనను అత్యున్నత దర్యాప్తు సంస్థ అధిపతి బాధ్యతల నుంచి తొలగిస్తూ మరోమారు అసాధారణ నిర్ణయం తీసుకుంది. మోదీ అధ్యక్షతన సమావేశమైన అత్యున్నత స్థాయి ఎంపిక కమిటీ 2:1 మెజారిటీతో ఆయనపై వేటువేసింది. మోదీ కక్షగట్టి ఆయనను తప్పించారని విపక్షాలతోపాటు న్యాయనిపుణులు కూడా పేర్కొన్నారు. విమర్శలకు జడవకుండా మోదీ ఆయనపై వేటు వేయడం కలకలం రేపింది. 55 ఏళ్ల సీబీఐ చరిత్రలో డైరెక్టర్‌స్థాయి అధికారిపై వేటు పడటం ఇదే మొదటిసారి కావడం గమనార్హం. ఆలోక్ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్రావుకు బాధ్యతలు అప్పగించారు. న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మపై మరోసారి వేటుపడింది. రెండు నెలల క్రితం ప్రభుత్వం ఆయన్ను సెలవుపై పంపగా ఈసారి ఏకంగా బాధ్యతల నుంచి తొలగిస్తూ ప్రధాని నేతృత్వంలోని అత్యున్నత ఎంపిక కమిటీ 2–1 తేడాతో నిర్ణయం తీసుకుంది. ప్రధాని మోదీ, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గేల అత్యున్నత భేటీ అనంతరం వర్మను సీబీఐ నుంచి ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా కేంద్రం బదిలీ చేసింది. ఆ స్థానంలో తెలుగు వ్యక్తి నాగేశ్వర్‌రావుకే మళ్లీ బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. ఆలోక్ వర్మ, సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానా పరస్పరం అవినీతి ఆరోపణలు చేసుకోవడంతో రెండు నెలల క్రితం కేంద్రం వారిని సెలవుపై పంపించింది. అనంతరం కేంద్రం నిర్ణయాన్ని సవాల్ చేస్తూ ఆలోక్ వర్మ సుప్రీంకోర్టును ఆశ్రయించారు. రెండేళ్ల పదవీ కాలం ముగియకుండా సీబీఐ డైరెక్టర్‌పై కేంద్రం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని పేర్కొన్న సుప్రీంకోర్టు.. ఆయన్ను డైరెక్టర్‌గా కొనసాగనివ్వాలని ఆదేశించింది. పలు బదిలీలు చేపట్టిన వర్మ సీబీఐ డైరెక్టర్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ బుధ, గురువారాల్లో పలు బదిలీలు చేపట్టారు. ముఖ్యంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్థానాపై అవినీతి ఆరోపణల కేసు దర్యాప్తు బాధ్యతలను సీబీఐ డీఐజీ ఎంకే సిన్హాకు అప్పగించారు. ఆస్థానాపై వచ్చిన లంచం ఆరోపణలపై దర్యాప్తును పర్యవేక్షిస్తున్న ఎస్కే సిన్హాను 2018 అక్టోబర్ 23న సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఎం.నాగేశ్వర్రావు నాగ్‌పూర్‌కు బదిలీ చేశారు. సిన్హాతోపాటు నాగేశ్వర్రావు చేపట్టిన ఇతర బదిలీలను రద్దుచేస్తూ ఆలోక్ ఆదేశాలిచ్చారు. భేటీలో ఏమయింది? ఆలోక్ వర్మ భవితవ్యంపై చర్చించేందుకు ప్రధాని నేతృత్వంలోని ఎంపిక కమిటీ బుధ, గురువారాల్లో సమావేశమయింది. ఈ భేటీల్లో ప్రధాని మోదీతోపాటు సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తరఫున జస్టిస్ ఏకే సిక్రి, లోక్‌సభలో ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే పాల్గొన్నారు. గురువారం సాయంత్రం రెండు గంటలపాటు సుదీర్ఘంగా చర్చించిన ఈ కమిటీ... వర్మపై వచ్చిన అవినీతి ఆరోపణలపై సెంట్రల్ విజిలెన్స్ కమిషన్ అందజేసిన నివేదికను పరిశీలించింది. దీంతో వర్మను సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీతోపాటు జస్టిస్ ఏకే సిక్రి మొగ్గు చూపగా మరో సభ్యుడు మల్లికార్జున ఖర్గే మాత్రం వ్యతిరేకించారు. శిక్షించేందుకు ముందుగా ఆలోక్ వర్మ వాదనను కూడా కమిటీ వినాలని ఖర్గే వాదించినట్లు అధికార వర్గాల సమాచారం. అత్యున్నత స్థాయి భేటీ అనంతరం ప్రభుత్వం.. సివిల్ డిఫెన్స్ అండ్ హోం గార్డ్స్ విభాగంలోని ఫైర్ సర్వీసెస్ డైరెక్టర్ జనరల్‌గా ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. అవినీతి బయటపడుతుందనే.. రఫేల్ కుంభకోణం కేసును ఆలోక్ వర్మతో దర్యాప్తు చేయిస్తే ప్రభుత్వ అవినీతి బయటపడుతుందనే భయంతోనే ఆయన్ను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని మోదీ కంకణం కట్టుకున్నారని కాంగ్రెస్ అధ్యక్షుడు రాహుల్ గాంధీ ట్విట్టర్లో ఆరోపించారు. ‘సీబీఐ చీఫ్ వర్మను పదవి నుంచి తొలగించేందుకు ప్రధాని ఎందుకు తొందర పడ్డారు?, ఎంపిక కమిటీ ముందు హాజరై తన వాదనలు వినిపించకుండా వర్మను మోదీని ఎందుకు అడ్డుకున్నారు? అని ప్రశ్నించారు. ఇందుకు సమాధానం ‘రఫేల్’ అని రాహుల్ ట్విట్టర్లో పేర్కొన్నారు. వివరణ కోరి ఉండాల్సింది బీజేపీ నేత సుబ్రమణ్య స్వామి, న్యాయవాది ప్రశాంత్ భూషణ్ స్పందిస్తూ..సీబీఐ డైరెక్టర్ బాధ్యతల నుంచి వర్మను తొలగించడం ఏకపక్ష నిర్ణయమైతే అది దురదృష్టకరం. ఆయనపై మోపిన ఆరోపణలపై వివరణ కోరి ఉండాల్సింది’ అని అన్నారు. ఆలోక్ వర్మ తొలగింపును అధికార ఉల్లంఘనగా రాజ్యసభ సభ్యుడు, సీనియర్ న్యాయవాది మజీద్ మెమన్ అన్నారు. విశ్వసనీయత లేని సీవీసీ ఆరోపణలే ప్రాతిపదికగా వర్మను బాధ్యతల నుంచి తప్పించడం దురదృష్టకరమని లాయర్ అభిషేక్ సింఘ్వి అన్నారు. ఖర్గే అసమ్మతి నోట్ ఆలోక్‌ను తొలగించాలన్న అత్యున్నత ఎంపిక కమిటీ నిర్ణయంపై లోక్‌సభలో కాంగ్రెస్ నేత మల్లికార్జున ఖర్గే అసమ్మతి నోట్ ఇచ్చారు. ముందుగా ఆలోక్‌పై వచ్చిన ఆరోపణలకు సంబంధించి ఆయన వాదనలు కమిటీ వినాలని ఖర్గే తెలిపినట్లు తెలిపారు. ‘సీవీసీ, సిబ్బంది శిక్షణ మంత్రిత్వశాఖ నుంచి వచ్చిన చట్ట విరుద్ధమైన ఉత్తర్వుల ఆధారంగా కోల్పోయిన 77 రోజుల పదవీ కాలాన్ని పూర్తిగా అధికారంలో కొనసాగకుండా వర్మను పదవి నుంచి తొలగించడం అన్యాయం’ అని ఖర్గే తన నోట్లో పేర్కొన్నారు. 2018 అక్టోబర్ 23వ తేదీన జరిగిన ఘటనలపై సుప్రీంకోర్టు నేతృత్వంలోని ఉన్నత స్థాయి కమిటీతో విచారణ జరిపించాలని ఖర్గే డిమాండ్ చేశారు. ‘సీవీసీ చేసిన పది ఆరోపణల్లో ఆరింటికి ఎలాంటి ఆధారాలు లేవు, అవి అసత్యాలు. మిగతా నాలుగు ఆరోపణలపై ఒక నిర్ధారణకు రావడానికి మరింత దర్యాప్తు చేపట్టాల్సిన అవసరం ఉంది’ అని అన్నారు. నాగేశ్వర్‌రావుకే మళ్లీ పగ్గాలు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ బాధ్యతలను అడిషనల్ డైరెక్టర్‌గా ఉన్న నాగేశ్వర్రావుకు కేంద్రం గురువారం అప్పగించింది. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు లేదా మరొకరిని నియమించే వరకు ఆయన ఆ పదవిలో కొనసాగుతారని పేర్కొంది. వర్మ సెలవులో ఉన్నకాలంలో నాగేశ్వర్రావు సీబీఐ తాత్కాలిక డైరెక్టర్ ఉన్నారు. నాగేశ్వర్రావు 1986 బ్యాచ్ ఒరిస్సా కేడర్ ఐపీఎస్ అధికారి. 1979 బ్యాచ్ ఐపీఎస్ అధికారి అయిన వర్మ 2017 ఫిబ్రవరి ఒకటో తేదీన సీబీఐ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. ఆయన పదవీ కాలం ఈ నెల 31వ తేదీతో ముగియనుంది. కాగా, కేంద్ర మాజీ మంత్రులు అరుణ్ శౌరీ, యశ్వంత్ సిన్హా, లాయర్ ప్రశాంత్ భూషణ్‌లు రఫేల్ విమానాల కొనుగోలు ఒప్పందంలో అవినీతి, దీనిపై కేసు నమోదు చేయాలంటూ 2018 అక్టోబర్ 15వ తేదీన సీబీఐ డైరెక్టర్‌గా ఉన్న ఆలోక్ వర్మకు వినతిపత్రం అందజేయడం గమనార్హం. ఆలోక్ వర్మ తొలగింపు వెనక.. న్యూఢిల్లీ: 50 ఏళ్ల సీబీఐ చరిత్రలో ఉద్వాసనకు గురైన తొలి డైరెక్టర్‌గా అప్రతిష్ట మూటగట్టుకున్న ఆలోక్ వర్మ..అవినీతి, విధుల నిర్వహణలో నిర్లిప్తతతో మూల్యం చెల్లించుకున్నారు. సీబీఐ అంతర్గత సంక్షోభం దరిమిలా విచారణ జరిపిన సెంట్రల్ విజిలెన్స్ కమిషన్(సీవీసీ) చేసిన పలు రకాల ఆరోపణలే ప్రాతిపదికగా ప్రధాని నేతృత్వంలోని ఉన్నతస్థాయి కమిటీ వర్మపై వేటు వేసింది. వర్మను తొలగించడానికి సీవీసీ పేర్కొన్న కారణాల్ని పరిశీలిస్తే.. 1. మాంస వ్యాపారి మొయిన్ ఖురేషి మనీ లాండరింగ్ కేసులో హైదరాబాద్ వ్యాపారవేత్త సతీశ్‌బాబు సానాను నిందితుడిగా చేర్చాలని సీబీఐ భావించినా, అందుకు ఆలోక్ వర్మ అనుమతివ్వలేదు. 2. ‘సీబీఐలో నంబర్ వన్ స్థానంలో ఉన్న వ్యక్తి’తో మధ్యవర్తులకు సంబంధం ఉందని రీసెర్చ్ అండ్ అనాలిసిస్ వింగ్(రా) సేకరించిన సమాచారం ద్వారా తెలుస్తోంది. 3. గుర్గావ్లో సుమారు రూ.36 కోట్లు చేతులు మారిన భూమి కొనుగోలు కేసులో ఆలోక్ వర్మ పేరు ఉంది. 4. ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఆర్సీటీసీ అవినీతి కేసులో ఓ అధికారిని కాపాడేందుకు ప్రయత్నించారని ఆలోక్ వర్మపై ఆరోపణలు వచ్చాయి. 5. అవినీతి, కళంకిత అధికారుల్ని సీబీఐలోకి తీసుకొచ్చేందుకు వర్మ ప్రయత్నించారు. 6. సీవీసీకి సహకరించడానికి నిరాకరించిన వర్మ ఉద్దేశపూర్వకంగా కీలక ఫైల్స్‌ను దాచిపెట్టారు. 7. ఎంపిక కమిటీకి నకిలీ, కల్పిత పత్రాలు సమర్పించి ఆలోక్ వర్మ సీబీఐ విశ్వసనీయత, సమగ్రతను దెబ్బతీశారు. 8. డైరెక్టర్, స్పెషల్ డైరెక్టర్ల మధ్య అంతర్గత విభేదాలతో సీబీఐ ప్రతిష్ట మసకబారింది. 9. కేబినెట్ కార్యదర్శి ఫార్వర్డ్ చేసిన ఫిర్యాదులోని విషయాలు చాలా వరకు నిజమని నిరూపితమయ్యాయి. ఆ ఆరోపణలు తీవ్రమైనవని, అవి సీబీఐ, దాని ఉన్నతాధికారులపై పెను ప్రభావం చూపాయి. 10. కొన్ని ఆరోపణల్లో నిజం తేలాలంటే లోతైన విచారణ చేయాలి. ఆలోక్ డైరెక్టర్‌గా ఉండగా నిష్పక్షపాత విచారణ జరగదు. ఎన్నో మలుపులు.. 2017, ఫిబ్రవరి 1: సీబీఐ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ 2018 జులై 12: సీబీఐలో ప్రమోషన్ల సమావేశానికి తన అనుమతి లేకుండానే తన ప్రతినిధిగా ఆస్థానా హాజరుకావడంపై సీవీసీకి వర్మ లేఖ. ఆగస్ట్ 24: దర్యాప్తు కొనసాగుతున్న ఓ కేసులో నిందితులను కాపాడడానికి ఆలోక్, ఆయన సహాయకుడైన అదనపు డైరెక్టర్ ఎన్కే శర్మ ప్రయత్నించారని, మాంసం వ్యాపారి మొయిన్ ఖురేషీ కేసులో వర్మకు హైదరాబాద్‌కు చెందిన వ్యాపారి సతీష్ సానా రూ.2కోట్లు లంచం ఇచ్చారని ఆరోపిస్తూ సీవీసీ, కేబినెట్ సెక్రెటరీకి ఆస్థానా లేఖ. అక్టోబర్ 4: ఆస్థానాకు రూ.3 కోట్లు చెల్లించినట్టు మేజిస్ట్రేట్ ముందు చెప్పిన సానా. అక్టోబర్ 15: మొయిన్ ఖురేషీ కేసులో అవినీతికి పాల్పడ్డారనే ఆరోపణపై ఆస్థానాపై సీబీఐ ఎఫ్ఐఆర్ దాఖలు. అక్టోబర్ 23: రాకేశ్ ఆస్థానా కేసులో యథాతథ స్థితి కొనసాగించాలని సీబీఐని ఢిల్లీ హైకోర్టు ఆదేశించింది. మరో సీబీఐ అధికారి దేవేంద్రకుమార్‌కు ఏడురోజుల సీబీఐ రిమాండ్‌కు కోర్టు ఆదేశం. అక్టోబర్ 15న ఆస్థానాపై నమోదు చేసిన ఎఫ్ఐఆర్లో కుమార్ పేరు కూడా చేర్చారు. అక్టోబర్ 24: సీవీసీ సిఫార్సుతో ఆలోక్, ఆస్థానాలను సెలవుపై పంపిస్తూ కేంద్రం నిర్ణయం. అక్టోబర్ 26: వర్మపై జరుగుతున్న సీవీసీ దర్యాప్తు పర్యవేక్షణకు సుప్రీంకోర్టు మాజీ జడ్జీ ఏకే పట్నాయక్‌ను నియమించిన సుప్రీంకోర్టు. నవంబర్ 12: కోర్టుకు సీవీసీ విచారణ నివేదిక. 2019, జనవరి 8: ఆలోక్ వర్మను సీబీఐ డైరెక్టర్‌గా పునర్నియమిస్తూ సుప్రీంకోర్టు ఆదేశాలు.∙ జనవరి 9: బాధ్యతలు చేపట్టిన ఆలోక్ వర్మ. తాత్కాలిక డైరెక్టర్ నాగేశ్వరరావు ఆధ్వర్యంలో జరిగిన బదిలీలను రద్దుచేస్తూ నిర్ణయం. వర్మ భవితవ్యంపై నిర్ణయం తీసుకునే హైపవర్డ్ కమిటీలో జస్టిస్ ఏకే సిక్రికి చోటు కల్పించిన సీజేఐ జస్టిస్ రంజన్ గొగోయ్ జనవరి 10: ఇద్దరు జాయింట్ డైరెక్టర్లు సహా మొత్తం ఐదుగురు అధికారులను బదిలీచేసిన వర్మ. ∙ప్రధాని మోదీ, మల్లికార్జున ఖర్గే, జస్టిస్ సిక్రిలతో కూడిన హైపవర్డ్ కమిటీ భేటీ. ఆలోక్ వర్మకు ఉద్వాసన పలుకుతూ నిర్ణయం. ఆలోక్ వర్మను బదిలీ చేస్తూ కేబినెట్ నియామకాల కార్యదర్శి త్రిపాఠి జారీ చేసిన ఉత్తర్వులు -
బ్రేకింగ్ : సీబీఐ చీఫ్ అలోక్ వర్మపై వేటు
సాక్షి, న్యూఢిల్లీ : సీబీఐ చీఫ్‌గా అలోక్‌వర్మకు ఉద్వాసన పలుకుతూ ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని అత్యున్నత కమిటీ సంచలన నిర్ణయం తీసుకుంది. గురువారం రాత్రి ప్రధాని నివాసంలో భేటి అయిన కమిటీ అలోక్ వర్మపై వచ్చిన ఆరోపణలు నిజమేనని నిర్దారించింది. దీంతో మరో 21రోజుల పదవీ కాలం ఉండగానే అయనపై కమిటీ వేటు వేసింది. సీబీఐ హైలెవల్ కమిటీ భేటీలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ, ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే, భారత ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్‌కు బదులుగా జస్టిస్ ఏ కే సిక్రి పాల్గొన్నారు. (సీబీఐ చీఫ్‌గా మళ్లీ అలోక్ వర్మ) సుప్రీంకోర్టు తీర్పు అనంతరం ఆలోక్ వర్మ బుధవారమే బాధ్యతలు చేపట్టిన విషయం తెలిసిందే. అంతకుముందు సీబీఐ చీఫ్‌గా తిరిగి బాధ్యతలు చేపట్టిన అలోక్ వర్మ వరుస సంచలన నిర్ణయాలు తీసుకున్నారు. సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేశారు. అంతేకాకుండా జేడీ అజయ్ భట్నాగర్ సహా మొత్తం ఐదుగురు ఉన్నతాధికారులను బదిలీ చేశారు. బదిలీ అయిన వారిలో డీఐజీ ఎంకే సిన్హా, డీఐజీ తరుణ్ గౌబా, జేడీ మురుగేశన్, ఏడీ ఏకే శర్మ తదితరులు ఉన్నారు. (‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ) -
‘సీబీఐ చీఫ్’ కమిటీలో జస్టిస్ సిక్రీ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మను ఆ స్థానంలో కొనసాగించాలా? వద్దా? అనే విషయంపై నిర్ణయం తీసుకునే అత్యున్నత స్థాయి కమిటీ నుంచి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రంజన్ గొగోయ్ తప్పుకున్నారు. తన స్థానంలో సుప్రీంకోర్టులో సీనియర్ న్యాయమూర్తి జస్టిస్ ఏకే సిక్రీని ప్రతిపాదించారు. ఆలోక్ వర్మ కేసులో తీర్పును వెలువరించే బెంచ్‌లో సీజేఐ కూడా భాగమై ఉన్న కారణంగా కమిటీ నుంచి ఆయన తప్పుకున్నట్లు తెలుస్తోంది. ప్రధాని నేతృత్వంలోని ఈ అత్యున్నత కమిటీ ఆలోక్‌పై నిర్ణయం తీసుకోనుంది. -
నాగేశ్వరరావు చేసిన బదిలీలన్నీ రద్దు
న్యూఢిల్లీ: గత 77 రోజులుగా సీబీఐ డైరెక్టర్(ఇన్చార్జ్)గా ఉన్న ఎం.నాగేశ్వరరావు హయాంలో జరిగిన అన్ని బదిలీలను రద్దుచేస్తూ సీబీఐ డైరెక్టర్ ఆలోక్ వర్మ నిర్ణయం తీసుకున్నారు. ఆలోక్ వర్మ, స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ ఆస్తానాలు ఒకరిపై మరొకరి ప్రత్యారోపణల నేపథ్యంలో వీరిద్దరినీ కేంద్రప్రభుత్వం బలవంతపు సెలవుపై పంపి నాగేశ్వరరావును అక్టోబర్ 23న సీబీఐకి కొత్త డైరెక్టర్(ఇన్చార్జ్)గా నియమించడం తెల్సిందే. సీబీఐ డైరెక్టర్ హోదాలో నాగేశ్వరరావు.. భారీస్థాయిలో ఉన్నతాధికారుల బదిలీలు చేపట్టారు. ఆస్థానా అవినీతి ఆరోపణల కేసును దర్యాప్తుచేస్తున్న డీఎస్పీ ఏకే బస్సీ, డీఐజీ ఎంకే సిన్హా, జాయింట్ డైరెక్టర్ ఏకే శర్మ సహా ముఖ్యమైన ఉన్నతాధికారులను నాగేశ్వరరావు బదిలీ చేశారు. అయితే, ప్రభుత్వ ఆదేశాలను కొట్టివేస్తూ ఆలోక్ వర్మను సుప్రీంకోర్టు.. మళ్లీ సీబీఐ డైరెక్టర్‌గా నియమిస్తూ తీర్పుచెప్పడం తెల్సిందే. దీంతో బుధవారం సీబీఐ డైరెక్టర్ హోదాలో విధులకు హాజరైన ఆలోక్ వర్మ.. నాగేశ్వరరావు చేసిన బదిలీలను రద్దుచేశారు.