సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ
న్యూఢిల్లీ: సీబీఐ డైరెక్టర్ అలోక్ వర్మ గురువారం సెంట్రల్ విజిలెన్స్ కమిషనర్(సీవీసీ) కేవీ చౌదరిని కలిశారు. ఈ సందర్భంగా సీబీఐ స్పెషల్ డైరెక్టర్ రాకేశ్ అస్తానా తనపై చేసిన అవినీతి ఆరోపణలను ఖండించారు. విజిలెన్స్ కమిషనర్ శరద్ కుమార్‌తో వర్మ భేటీ అయ్యారని సీవీసీ వర్గాలు తెలిపాయి. గురువారం మధ్యాహ్నం సీవీసీ కార్యాలయానికి వెళ్లిన అలోక్ వర్మ దాదాపు రెండు గంటలపాటు అక్కడ ఉన్నారు. వర్మపై అస్తానా చేసిన లంచం ఆరోపణలపై సుప్రీంకోర్టు రిటైర్డు జడ్జి జస్టిస్ ఏకే పట్నాయక్ పర్యవేక్షణలో విచారణను చేపట్టి రెండు వారాల్లోగా నివేదిక అందజేయాలని సీవీసీని గత నెల 26వ తేదీన అత్యున్నత న్యాయస్థానం ఆదేశించిన విషయం తెలిసిందే.
Comments
Please login to add a commentAdd a comment