Senior IPS Officer Praveen Sood Takes Charges As CBI Director - Sakshi
Sakshi News home page

Praveen Sood: సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్‌ సూద్‌

Published Thu, May 25 2023 6:00 PM | Last Updated on Thu, May 25 2023 7:02 PM

Senior IPS Officer Praveen Sood Take Charges As CBI Director - Sakshi

సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్‌ ఐపీఎస్‌ అధికారి ప్రవీణ్‌ సూద్‌ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు.

సీబీఐ డైరెక్టర్‌ గురించి మరిన్ని విషయాలు
► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్‌ సూద్‌, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు.

► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. 

► ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. 

► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. 

► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు.

► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. 

► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు.

► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు.

► ఢిల్లీ స్పెషల్‌ పోలీస్‌ ఎస్టాబ్లిష్‌మెంట్‌ యాక్ట్‌ 1946 కింద CBI (సెంట్రల్‌ బ్యూరో ఆఫ్‌ ఇన్వెస్టిగేషన్‌) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్‌ బాధ్యతలు స్వీకరించారు.

► ప్రవీణ్‌ సూద్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్‌ అల్లుడే టీం ఇండియా క్రికెట్‌ బ్యాట్స్‌మన్‌ మయాంక్‌ అగర్వాల్‌.

► ప్రవీణ్‌ సూద్‌ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. 

సంవత్సరం పురస్కారం
1996 చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్
2002 పోలీస్ మెడల్
2006 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్
2011 ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు
2011 నేషనల్ e-గవర్నెన్స్ గోల్డ్ మెడల్

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement