Central Bureau of Investigation (CBI)
-
కోల్‌కతా: నిందితుడికి బెయిల్ ఇవ్వమంటారా? సీబీఐపై కోర్టు ఫైర్
కోల్‌కతా: కోల్‌కతా ఆర్జీ కర్ ఆస్పత్రిలో జూనియర్ డాక్టర్ హత్యాచార ఘటన దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. ఈ కేసులో ప్రధాన నిందితుడు సంజయ్‌రాయ్‌ను సీబీఐ విచారిస్తోంది. ఈ కమ్రంలో సంజయ రాయ్ బెయిల్ కోరుతూ కోల్‌కతా సీబీఐ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్‌పై విచారణ చేపట్టిన కోర్టు సీబీఐపై తీవ్ర అసహనం వ్యక్తం చేసింది. శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు కోర్టులో వాదనలు ప్రారంభమయ్యాయి. నిందితుడి తరఫున న్యాయవాది కవితా సర్కార్ వాదనలు వినిపించారు. అనంతరం వాదనలు వినిపించాల్సిందిగా సీబీఐ తరఫున న్యాయవాదిని కోర్టు కోరింది. సీబీఐ న్యాయవాది దీపక్ పోరియా అందుబాటులో లేకపోవటంపై కోర్టు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దీంతో.. ‘నిందితుడు నిందితుడు సంజయ్ రాయ్‌కు బెయిల్ ఇవ్వమంటారా? న్యాయవాది కోర్టు హాలులో లేకపోవటం సీబీఐ చట్టవ్యతిరేక ప్రవర్తనకు నిదర్శనం. ఇలా చేయటం చాలా దురదృష్టకరం’’ అని అదనపు చీఫ్ జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ పమేలా గుప్తా సీబీఐపై ఆగ్రహం వ్యక్తం చేశారు.సుమారు 40 నిమిషాల ఆలస్యం తర్వాత సీబీఐ తరఫున న్యాయవాది కోర్టుకు హాజరై వాదనలు వినిపించారు. నిందితుడు సంజయ్ రాయ్ బెయిల్ అభ్యర్థనను వ్యతిరేకించారు. సున్నితమైన ఈ కేసులో సీబీఐ చేసే దర్యాప్తుకు ఆటంకం కలిగిస్తుందని కోర్టుకు తెలియజేశారు. వాదనలు విన్న కోర్టు సంజయ్ రాయ్ బెయిల్ పటిషన్ తిరస్కరించింది.ఈ కేసులో నిందితుడు సంజయ్ రాయ్‌ను పోలీసులు ఆగస్టు 10వ తేదీన అరెస్ట్ చేశారు. కోర్టు నిందితుడికి సెప్టెంబర్ 20 వరకు 14 రోజులు జ్యుడీషియల్ కస్టడీ విధించింది. సీబీఐ విచారణలో భాగంగా నిందితుడుకి గత నెలలో పాలిగ్రాఫ్ పరీక్ష నిర్వహించిన విషయం తెలిసిందే. -
Central government: సీబీఐ మా నియంత్రణలో లేదు
న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ) తమ నియంత్రణలో లేదని కేంద్ర ప్రభుత్వం గురువారం సుప్రీంకోర్టుకు తెలియజేసింది. సీబీఐ ఒక కేసును నమోదు చేయడాన్ని గానీ, సీబీఐ దర్యాప్తును గానీ తాము పర్యవేక్షించలేమని వెల్లడించింది. సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేస్తోందని, విపక్షాలను లక్ష్యంగా చేసుకొని వేధించడానికి వాడుకుంటోందని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ప్రభుత్వం ఇచి్చన వివరణ ప్రాధాన్యం సంతరించుకుంది. తమ రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తునకు ఇచి్చన సాధారణ సమ్మతిని బెంగాల్ ప్రభుత్వం 2018 నవంబర్ 16న ఉపసంహరించుకుంది. దాంతో రాష్ట్రంలో సీబీఐ దర్యాప్తు చేయలేదు. కొన్ని నెలల క్రితం బెంగాల్లో ఈడీ అధికారుల బృందంపై జరిగిన దాడిపై సీబీఐ కేసు నమోదు చేసి, దర్యాప్తు ప్రారంభించింది. సందేశ్‌ఖాలీ అక్రమాలపై దర్యాప్తు చేపట్టింది. దీనిపై బెంగాల్ సర్కారు అభ్యంతరం వ్యక్తం చేసింది. తమ అనుమతి తీసుకోకుండానే సీబీఐ తమ రాష్ట్రంలో ఎఫ్ఐఆర్ నమోదు చేసి, కేసులు దర్యాప్తు చేస్తోందని ఆరోపిస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. రాజ్యాంగంలోని ఆరి్టకల్ 131 కింద కేంద్ర ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఫిర్యాదు చేసింది. ఈ పిటిషన్‌పై సుప్రీంకోర్టు ధర్మాసనం గురువారం విచారణ చేపట్టింది. కేంద్ర ప్రభుత్వం తరఫున సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా వాదనలు వినిపించారు. బెంగాల్లో కేసులను భారత ప్రభుత్వం నమోదు చేయలేదని, సీబీఐ నమోదు చేసిందని తెలిపారు. సీబీఐపై ప్రభుత్వæ నియంత్రణ ఉండదన్నారు. స్వతంత్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐ దర్యాప్తులో కేంద్రం జోక్యం చేసుకొనే ప్రసక్తే లేదని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. -
CBI: కవిత రిమాండ్ రిపోర్టులో సంచలన విషయాలు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను విచారణ కోసం అయిదు రోజుల కస్టడీ కోరుతూ సీబీఐ రౌస్ అవెన్యూ కోర్టులో రిమాండ్ పత్రాలను సమర్పించింది. కవిత రిమాండ్ రిపోర్టులో సీబీఐ అధికారులు పలు సంచలన విషయాలు పొందుపర్చారు. కవితే రూ. 100 కోట్లు చెల్లించినట్లు పేర్కొంది. కవితకు చెందిన జాగృతి సంస్థకు శరత్ చంద్రారెడ్డి రూ.80 లక్షల ముడుపులు చెల్లించినట్లు అభియోగం మోపింది. డబ్బుల కోసం శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని తెలిపింది. ల్యాండ్ డీల్ చేసుకోకపోతే తెలంగాణలో బిజినెస్ ఎలా చేస్తావో చూస్తానని శరత్ చంద్రారెడ్డిని కవిత బెదిరించారని పేర్కొంది. అసలు భూమే లేకుండా వ్యవసాయ భూమి కొనుగోలు చేసినట్లు అగ్రిమెంట్లు, రిజిస్ట్రేషన్ పత్రాలు సృష్టించినట్లు పేర్కొంది. నకిలీ భూ విక్రయం పేరుతో శరత్ చంద్రారెడ్డి నుంచి రూ. 14 కోట్లు కవిత తీసుకున్నారని రిపోర్టు రిపోర్టులో వెల్లడించింది. మహబూబ్‌నగర్‌లో వ్యవసాయ భూమి ఉందని, దాన్ని కొనుగోలు చేసినట్లు రూ. 14 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారు. అసలు ఆ భూమి సంగతి, దాని ధర ఎంతో తెలియనందువల్ల తను రూ.14కోట్లు ఇవ్వలేనని అన్నారు శరత్. మొత్తం డబ్బులు ఇవ్వకపోతే తెలంగాణలో అరబిందో ఫార్మా బిజినెస్ ఉండదని కవిత బెదిరించినట్లు పేర్కొంది. చదవండి: కవితకు రౌస్ అవెన్యూ కోర్టులో చుక్కెదురు ఒక్కో రిటైల్ జోన్‌కు రూ.5 కోట్ల చొప్పున 5 రిటైల్ జోన్లకు రూ.25 కోట్లు ఇవ్వాలని శరత్ చంద్రారెడ్డిని కవిత డిమాండ్ చేశారని సీబీఐ చెబుతోంది. ఎంపీ మాగుంట శ్రీనివాసులరెడ్డిని కూడా కవిత రూ. 50 కోట్లు డిమాండ్ చేశారని, తన కుమారుడు మాగుంట రాఘవ ద్వారా కవితకు ఆయన రూ.25కోట్లు చెల్లించారని తెలిపింది. కేజ్రీవాల్ అనుచరుడు విజయనాయర్‌కు కవితే రూ.100కోట్లు చెల్లించారని చెప్పింది. ఇండోస్పిరిట్లో కవిత 65 శాతం వాటా పొందారని, గోవాకు రూ.44.45 కోట్లు హవాలా మార్గంలో బదిలీ చేశారని సీబీఐ పేర్కొంది. ఈ డబ్బును కవిత పీఏ అశోక్ కౌశిక్ హవాలా డీలర్లకు చేర్చాడని, ఈ విషయాలన్నింటిపైనా కవిత సరైన సమాధానాలు చెప్పడం లేదని తెలిపింది. ఆమెను 5 రోజులు కస్టడీలోకి తీసుకొని మరిన్ని విషయాలను రాబట్టాలని ప్రత్యేక కోర్టును కోరింది సీబీఐ. కాగా బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) ఇప్పటికే ఆమెను అరెస్టు చేయగా జ్యుడీషియల్ రిమాండ్‌లో ఉన్న సంగతి తెలిసిందే. లిక్కర్ కేసులో గతంలోనూ సీబీఐ ఆమెను హైదరాబాద్‌లో ఆమెనుప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే అరెస్ట్ చేసి కోర్టుకు హాజరు పరిచింది. విచారణ నిమిత్తం కవితను కస్టడీకి ఇవ్వాలని కోరుతూ రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై కాసేపట్లో న్యాయస్థానం తీర్పు వెల్లడించనుంది. మరోవైపు సీబీఐ ప్రశ్నించడం, అరెస్టు చేయడాన్ని సవాల్ చేస్తూ కవిత దాఖలు చేసిన పిటిషన్లను కోర్టు కొట్టివేసింది. -
సీబీఐ అరెస్ట్.. కోర్టులో కవితకు చుక్కెదురు
న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు రోజురోజుకీ రసవత్తరంగా మారుతోంది. బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత, ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ అరెస్ట్‌లు.. కేంద్ర దర్యాప్తు సంస్థల విచారణలు.. బెయిల్ పిటిషన్లతో కేసు కీలక మలుపులు తిరుగుతోంది. తాజాగా లిక్కర్ కేసులో కవితకు చుక్కెదురైంది. లిక్కర్ కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ అరెస్ట్‌ను వ్యతిరేకిస్తూ కవిత కోర్టును ఆశ్రయించారు. కవిత తరపున ఆమె లాయర్ మోహిత్ రావు.. ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. అత్యవసరంగా పిటిషన్ విచారించాలని కోరారు. ఎలాంటి నోటీసులు లేకుండా కవితను జైల్లో సీబీఐ ఎలా అరెస్ట్ చేస్తుందని పిటిషన్లో పేర్కొన్నారు. అయితే ఇది అత్యవసరంగా విచారించాల్సిన పిటిషన్ కాదని స్పెషల్ కోర్టు తెలిపింది. కవిత పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది. రెగ్యులర్‌గా లిక్కర్ కేసు విచారణ జరిపే కావేరి భవేజా కోర్టులోనే వాదనలు వినిపించాలని జడ్జి మనోజ్ కుమార్ స్పష్టం చేశారు. కాగా లిక్కర్ కేసులో నిందితురాలుగా ఉన్న కవిత ఇప్పటికే తీహార్ జైల్లో జ్యూడీషియల్ కస్టడీలో ఉన్నారు. ఇదే కేసులో గతంలో హైదరాబాద్‌లో ఆమెను ప్రశ్నించింది. ఆ తర్వాత సీబీఐ ప్రత్యేక కోర్టు అనుమతితో ఈ నెల 6న తీహార్ జైలులో మరోసారి ప్రశ్నించింది. ఈ క్రమంలోనే నేడు అరెస్ట్ చేసింది. ఇవాళ కోర్టులకు సెలవు కావడంతో రేపు(శుక్రవారం) తీహార్ జైలు నుంచి కోర్టుకు కవితను తీసుకెళ్లనుంది. ఉదయం 10:30 కు కోర్టు ముందు ప్రవేశపెట్టనుంది. కవితను వారం రోజుల పోలీస్ కస్టడీకి కోరనుంది. చదవండి: లిక్కర్ స్కాంలో ట్విస్ట్.. కవితను అరెస్ట్ చేసిన సీబీఐ -
సీబీఐ ఇంటరాగేషన్.. కవిత పిటిషన్‌పై నేడు విచారణ
ఢిల్లీ, సాక్షి: లిక్కర్ స్కాం కేసులో అరెస్టైన తనను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ సంస్థ ఇంటరాగేషన్ చేయడాన్ని బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత కోర్టులో సవాల్ చేశారు. ఈ పిటిషన్‌పై ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు నేడు విచారణ చేపట్టనుంది. ఢిల్లీ లిక్కర్ కుంభకోణం కేసులో కోర్టు కవితను తీహార్ జైల్లోనే విచారించేందుకు సీబీఐకు ఏప్రిల్ 5వ తేదీన ప్రత్యేక న్యాయస్థానం అనుమతి ఇచ్చింది. అయితే.. ఆమెను సీబీఐ ప్రశ్నించే అంశంపై విచారణ చేపట్టాలని కవిత తరఫు న్యాయవాది నితీష్ రాణా కోర్టులో మెన్షన్ చేశారు. ఈ పిటిషన్‌పై కౌంటర్ దాఖలుకు సీబీఐ సమయం కోరడంతో.. గడువు ఇస్తూ పిటిషన్‌పై విచారణ ఇవాళ్టికి వాయిదా వేసింది. ఇదిలా ఉంటే.. లిక్కర్ కేసులో మార్చి 15వ తేదీన అరెస్టైన కవిత.. ప్రస్తుతం తీహార్ జైల్లో ఉన్నారు. జ్యూడీషియల్ కస్టడీలో ఉన్న ఒక వ్యక్తిని ప్రశ్నించాలంటే కోర్టు అనుమతి అవసరం. అలా తీహార్ జైల్లో ఉన్న కవితను కోర్టు అనుమతితో సీబీఐ బృందం ప్రశ్నించాలనుకుంది. ఇప్పటికే.. శనివారం తీహార్ జైలుకు వెళ్లిన దర్యాప్తు సంస్థ అధికారులు కవితను ప్రశ్నించినట్లు సమాచారం. -
బాబు.. బిల్లీ.. లక్ష కోట్లు!
సాక్షి, అమరావతి: చంద్రబాబు నిజంగా విజనరీయే. 20 ఏళ్ల కిందటే రూ. లక్ష కోట్లు కొట్టేయడానికి పన్నాగం పన్నారంటే... అందుకోసం ఎవ్వరి దృష్టీ పడని క్రీడా రంగాన్ని ఎంచుకున్నారంటే ఏమనుకోవాలి. 2004లో ఆపద్ధర్మ ముఖ్యమంత్రి హోదాలో తన బినామీ బిల్లీరావు అలియాస్ అహోబిలరావు చేత ‘ఐఎంజీ అకాడెమీస్ భారత్’ అనే కంపెనీని పెట్టించి... అది అమెరికాలో ఉన్న ఐఎంజీ అకాడెమీకి చెందిన కంపెనీ అని నమ్మించి... హడావుడిగా దానికి గచ్చిబౌలిలోని 400 ఎకరాలు కేటాయించి, సేల్‌డీడ్ కూడా చేసేశారంటే ఏమనుకోవాలి? శంషాబాద్ పక్కన మరో 450 ఎకరాలు కూడా కేటాయించటంతో పాటు... హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లోని అన్ని స్టేడియాలనూ ఆ కంపెనీకి 45 ఏళ్ల పాటు లీజుకిచ్చేసి... వాటి నిర్వహణ ఛార్జీలను కూడా ప్రభుత్వమే ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నారంటే ఏమనుకోవాలి? క్రీడల ద్వారా, వాటి అడ్వర్టయిజ్మెంట్లు, స్పాన్సర్‌షిప్‌ల ద్వారా వచ్చే డబ్బులన్నీ ఐఎంజీ అకాడెమీస్కే చెందేలా భారీ దోపిడీకి పథకం వెయ్యగలిగారంటే ఆయన విజనరీయే కదా? ఇప్పటి విలువల ప్రకారం చూస్తే ఈ స్కామ్ విలువ లక్ష కోట్లపైనే. స్పై కెమెరాకు పట్టుబడిన బిల్లీ... ఈ రాష్ట్ర ప్రజల అదృష్టం బాగుంది కాబట్టే 2004 ఎన్నికల్లో వైఎస్ రాజశేఖరరెడ్డి గెలిచారు. బాబు ఓడిపోయారు. వైఎస్సార్ ప్రభుత్వం ఐఎంజీ కేటాయింపుల్ని సమీక్షించినపుడు మొత్తం బోగస్ కంపెనీలేనని తేలటంతో ఒప్పందాన్ని రద్దు చేసి, భూమిని వెనక్కి తీసుకుంది. కానీ బాబు గారి ముఠా ఊరుకోలేదు. తమకు కోర్టుల్లో బలం ఉంది కనక... న్యాయస్థానంలో సవాల్ చేశారు. 2009 ఎన్నికల ముందు... ఈ కేసులో తీర్పు వెలువడవచ్చని బిల్లీరావు భావించారు. ఆ సమయంలో ఆయన సన్నిహితుడొకరు ఆయన్ను కలిసి.. తమ సంభాషణను స్పై కెమెరాతో రికార్డు చేశారు. వ్యవస్థ నిర్ఘాంతపోయే నిజాల్ని అప్పట్లో బిల్లీరావు వెల్లడించారు. వాటిని ‘సాక్షి’ ప్రచురించింది కూడా. అప్పట్లో అది సంచలనం కావటంతో... తీర్పు వాయిదా పడింది. న్యాయమూర్తులు మారటంతో సుదీర్ఘకాలం కొనసాగింది. తాజాగా గురువారంనాడు బిల్లీరావు తమకే కేటాయించిన భూముల్ని తమకు ఇవ్వాలంటూ వేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు కొట్టేసింది. అంతేకాదు... అది మొత్తం వ్యవస్థ నివ్వెరపోయే కుంభకోణమని తేల్చింది. చంద్రబాబు దోపిడీని బయటపెట్టింది. దీనిపై వైఎస్సార్ ప్రభుత్వం సీబీఐ దర్యాప్తునకు ఆదేశించగా... అప్పట్లో ఇన్ఛార్జిగా ఉన్న సీబీఐ అధికారి లక్ష్మీనారాయణ... తమకు తగిన సిబ్బంది లేరన్న సాకుతో దాన్ని చేపట్టలేదు. తాజాగా గురువారంనాడు హైకోర్టు ఈ వ్యవహారంపై వ్యాఖ్యానిస్తూ... దీనిపై సీబీఐ విచారణ ఎందుకు జరిపించలేదో చెప్పాలని తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించింది. లేదంటే తామే ఆదేశిస్తామని కూడా స్పష్టంచేసింది. ఈ అంశంపై సమాధానమివ్వాలంటూ అక్కడి ప్రభుత్వానికి వారం రోజుల గడువునిచ్చింది. నిజానికి అప్పట్లోనే సీబీఐ దర్యాప్తు జరిపి ఉంటే.. ఈ పాటికే బాబు దోపిడీ బయటపడి, చంద్రబాబు జైల్లో ఊచలు లెక్కబెడుతుండేవారని స్పష్టంగా చెప్పొచ్చు. బాబు... నా జేబులో ఉంటారన్న బిల్లీ తాజా పరిణామాల నేపథ్యంలో... అప్పట్లో బిల్లీరావు స్పై కెమెరాల సాక్షిగా ఏమన్నారు... బాబు ఎంత ఎంత పెద్ద దోపిడీకి స్కెచ్ వేశారు? వ్యవస్థలో ఎంతమందిని వాడేశారు? వంటి వివరాలు మరొక్కసారి చూద్దాం. ‘‘ఇదిగో తీర్పు ...ఇదే మనకు అనుకూలంగా రాబోతున్న కోర్టు తీర్పు కాపి. ఈ తీర్పును నేనే రాశాను. నేను ఏది రాస్తే అదే తీర్పుగా వస్తుంది. ఈ విషయం చంద్రబాబుకు కూడా తెలుసు. ––– కు ఎంత డబ్బులు ఇవ్వాలో చంద్రబాబే చెప్పారు. అసలు ఆయనకు ఉన్న జ్ఞాపక శక్తి అలాంటిది. ఆయనే అన్నీ చూస్తున్నారు. అర్ధరాత్రి 2 గంటలకు నిద్రలేపి అడిగినా ఈ కేసుకు సంబంధించిన అన్ని విషయాలను ఆయన చెప్పేస్తారు. నేను ఏం చెబితే చంద్రబాబు అది చేస్తారు’’. వాస్తవానికి నాటి వీడియోలో న్యాయ వ్యవస్థలోని పలువురి పేర్లను బిల్లీ వాడేశారు. ‘సాక్షి’ వాటిని ప్రచురించలేదు. ఆ వీడియో కాపీని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తికి పంపింది కూడా. క్రీడా వ్యవస్థను చెరబట్టేందుకు పన్నాగం కేవలం కాగితాలకే పరిమితమైన ఐంఎంజీ భారత్ కంపెనీకి ఉమ్మిడి ఆంధ్ర ప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను ధారాదత్తం చేసేందుకు చంద్రబాబు కుతంతం్ర పన్నారు. 2004 ఎన్నికల్లో చంద్రబాబు ప్రభుత్వం గెలిచినా, వైఎస్సార్ ప్రభుత్వం నాటి ఒప్పందాన్ని రద్దు చేయకపోయినా... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థ మొత్తం ఓ మాఫియా గుప్పిట్లోకి వెళ్లిపోయేది. సామాన్యులెవ్వరూ క్రీడల్లోకి ప్రవేశించే ఆలోచన కూడా చేయలేకపోయేవారు. ఎందుకంటే ఐఎంజీ భారత్ కంపెనీతో అప్పటి చంద్రబాబు ప్రభుత్వం కుదుర్చుకున్న ఒప్పందం అలాంటిది. కేవలం హైదరాబాద్ గచ్చిబౌలిలోని 850 ఎకరాలను కేటాయించడమే కాదు. 16 స్టేడియంలు సహా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లోని యావత్ క్రీడా వ్యవస్థను తన బినామీ బిల్లీ రావుకు 45 ఏళ్లపాటు లీజు పేరిట కట్టబెట్టేశారు. ఆ సమయంలో ఆ స్టేడియంలు, వాటి ఆస్తుల నిర్వహణ అంతా ఐంఎంజీ భారత్ పెత్తనం కిందకే వస్తాయి. కానీ ఏటా నిర్వహణ వ్యయాన్ని ప్రభుత్వమే భరిస్తుంది. బీమా ప్రీమియాన్నీ చెల్లిస్తుంది. స్టేడియాల నిర్వహణ కోసం ఆ కంపెనీకి ఉచిత నీరు, ఉచిత విద్యుత్, వినోద పన్ను రాయితీ, విదేశీ సుంకం రాయితీలు అన్ని వెసులుబాట్లు కల్పిస్తుంది. టీవీ ప్రసార హక్కుల ఆదాయం ఆ కంపెనీకే దక్కుతుంది. అంతేకాదు.. మరో ప్రమాదకరమైన నిబంధననూ చేర్చారు. స్టేడియంలు, వాటి ఆస్తులను ఐఎంజీ భారత్ తన విచక్షణ మేరకు నిర్ణయించిన ధరకు కొనుగోలు చేసుకోవచ్చనే క్లాజును చేర్చారు. రాష్ట్ర ప్రభుత్వం సహాయ నిరాకరణ చేస్తే ఆ క్లాజు కింద ఆ స్టేడియంలను ఐఎంజీ భారత్ తన సొంతం చేసుకునే హక్కు కల్పించడమన్న మాట. అంటే రాష్ట్రంలో 45 ఏళ్ల పాటు క్రీడా వ్యవస్థ అంతా ఐఎంజీ భారత్ కంపెనీ ముసుగులో చంద్రబాబు గుత్తాధిపత్యం కింద ఉంటుంది. ఏదో ఒక సాకు చూపించి స్టేడియంలు, వాటి ఆస్తులన కూడా ఆ కంపెనీ తాను నిర్ణయించిన నామమాత్రపు ధర కింద కొనుగోలు చేసేసుకోవచ్చు. అంటే ప్రస్తుతం చంద్రబాబు భాషలో చెప్పాలంటే... రాష్ట్రంలో క్రీడా వ్యవస్థను చంద్రబాబు కుర్చీ మాదిరి మడతపెట్టేస్తారన్నది సుస్పష్టం. కాగా న్యాయ వ్యవస్థ తన నిబద్ధతను, విశ్వసనీయతను మరోసారి చాటిచెప్పింది. చంద్రబాబు, ఐఎంజీ భారత్ కంపెనీ కుతంత్రాలను తిప్పికొట్టింది. ఐంఎంజీ భారత్‌కు అప్పట్లో చంద్రబాబు ప్రభుత్వం హైదరాబాద్‌లో 850 ఎకరాలను కేటాయించడాన్ని రద్దు చేస్తూ వైఎస్‌రాజశేఖర్‌రెడ్డి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని సమర్థించింది. ఆ భూకేటాయింపులు సరైన నిర్ణయమేనని తీర్పునిచ్చింది. దాంతో చంద్రబాబు భూబాగోతం బెడిసికొట్టింది. ఇపుడు సీబీఐ దర్యాప్తునకు కూడా ఆదేశిస్తే... చంద్రబాబు ఊచలు లెక్కబెట్టడం ఖాయమనేది న్యాయవర్గాల మాట. -
820 కోట్ల స్కామ్! 67 ప్రాంతాల్లో సీబీఐ సోదాలు
న్యూఢిల్లీ: ఐఎంపీఎస్ లావాదేవీల ముసుగులో జరిగిన భారీ కుంభకోణాన్ని కేంద్ర దర్యాప్తు సంస్థ గుర్తించింది. దేశవ్యాప్తంగా ఏడు నగరాల్లో తాజాగా సీబీఐ సోదాలు నిర్వహించడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. యూకో బ్యాంక్‌లో జరిగిన భారీ కుంభకోణంలో కేసులో కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ గురువారం పలుచోట్ల తనిఖీలు చేపట్టింది. రాజస్థాన్, మహారాష్ట్రలోని ఏడు నగరాల్లో 67 చోట్ల సోదాలు జరుపుతోంది. యూకో బ్యాంక్‌లోని వివిధ ఖాతాల్లో సుమారు 820 కోట్ల అనుమానాస్పద ఐఎంపీఎస్ లావాదేవీలకు సంబంధించిన కేసులో సీబీఐ ఈ దాడులు చేస్తోంది. వివిధ అకౌంట్లలోకి ట్రాన్స్ఫర్ అయిన సొమ్మును మళ్లీ వెనక్కి తెప్పించేందుకు ప్రయత్నిస్తున్నారు.. ఈ సోదాల్లో భాగంగా యూకో బ్యాంక్, ఐడీఎఫ్సీకి చెందిన 130 పత్రాలను అధికారులు సీజ్ చేశారు. అలాగే మొబైల్ ఫోన్లు, హార్డ్ డిస్క్‌లను స్వాధీనం చేసుకుని వాటిని ఫోరెన్సిక్ విశ్లేషణకు పంపించారు. 30 మంది అనుమానితులను కూడా విచారించినట్లు దర్యాప్తు సంస్థ అధికారులు పేర్కొన్నారు. కాగా గత ఏడాది నవంబర్ 10 నుంచి13 మధ్య ఏడు ప్రైవేట్ బ్యాంకులకు చెందిన 14,600 ఖాతాల నుంచి తమ బ్యాంక్‌కు చెందిన 41,000 ఖాతాలలో ఐఎంపీఎస్ అంతర్గత లావాదేవీలు తప్పుగా జరిగినట్లు గుర్తించిన యూకో.. సీబీఐకి ఫిర్యాదు చేసింది. దీని ఆధారంగా నవంబర్ 21న కేంద్ర దర్యాప్తు సంస్థ కేసు నమోదు చేసింది. దీని ఫలితంగా బదిలీ చేసిన బ్యాంక్ ఖాతాల నుంచి డెబిట్ కాకుండానే యూకో బ్యాంక్ ఖాతాల్లో రూ. 820 కోట్లు జమ అయ్యాయి. దీంతో డబ్బులు పడ్డాయని తెలిసిన చాలా మంది ఖాతాదారులు వారి ఖాతాలలోని ఆకస్మిక మొత్తాన్ని విత్‌డ్రా కూడా చేసుకున్నారు. ఇక 2023 డిసెంబర్‌లోనూ కోల్‌కతా, మంగళూరులోని యూకో బ్యాంక్ అధికారులకు చెందిన 13 ప్రదేశాలలో సీబీఐ సోదాలు జరిపింది. చదవండి: సవాల్ విసిరితే.. దేనికైనా సిద్ధమే: రాజ్‌నాథ్ సింగ్ -
Sandeshkhali: షాజహాన్‌ను సీబీఐకి అప్పగించిన బెంగాల్ పోలీసులు
పశ్చిమ బెంగాల్‌లోని ‘సందేశ్‌ఖాలీ’ అరాచకాల కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. ఈ వ్యవహారంలో ప్రధాన నిందితుడైన సస్పెండెడ్ టీఎంసీ నేత షాజహాన్ షేక్‌ను కస్టడీకి అప్పగించే విషయంలో బెంగాల్ ప్రభుత్వం, సీబీఐ మధ్య రసవత్తర రాజీకీయం నడుస్తోంది. తాజాగా షాజహాన్‌ను సీబీఐకి అప్పగించేందుకు బెంగాల్ పోలీసులకు కలకత్తా హైకోర్టు కొత్త డెడ్‌లైన్ విధించింది సందేశ్‌ఖాలీ కేసుపై జస్టిస్లను హరీష్ టండన్, హిరన్మయి భట్టాచర్యాలతో కూడా ద్విసభ్య ధర్మాసనం బుధవారం విచారణ చేపట్టింది. ఈ సందర్భంగా షాజహాన్‌ను నేటి సాయంత్రం 4.15 నిమిషాల వరకు సీబీఐకి అప్పగించాల్సిందేనని ఆదేశించింది. సీఐడీపై కోర్టు ధిక్కారం నమోదు చేయాలని సీబీఐ కోరిన నేపథ్యంలో హైకోర్టు ఈ మేరకు ఉత్తర్వులు జారీ చేసింది. అయితే కోర్టు ఇచ్చిన గడువు ముగియడంతో సీబీఐ అధికారులు బెంగాల్ పోలీసు హెడ్‌క్వార్టర్‌కు చేరుకున్నారు. ఎట్టకేలకు షాజహాన్‌ను పోలీసులు సీబీఐకి అప్పజెప్పారు. ఇక ఈ కేసులో షాజహాన్ షేక్‌ను సీబీఐకి అప్పగించాలంటూ కలకత్తా హైకోర్టు మంగళవారమే ఆదేశాలు ఇచ్చింది. కానీ దీనిని పశ్చిమ బెంగాల్ ప్రభుత్వం లెక్కచేయలేదు. అతడిని అప్పగించబోమని తెలిపింది. ఈ మేరకు హైకోర్టు ఆదేశాలను సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. నిందితుడిని అదుపులోకి తీసుకునేందుకు సీబీఐ అధికారులు కోల్‌కతాలోని సీఐడీ ప్రధాన కార్యాలయానికి వెళ్లగా.. షాజహాన్‌ను అప్పగించేందుకు పోలీసులు నిరాకరించారు. దీంతో సీబీఐ అధికారులు అక్కడి నుంచి వెనక్కి వెళ్లిపోయారు. చదవండి: Rajasthan : డబుల్ జీరో! కాంగ్రెస్ ‘సున్నా’ రాత మారేనా? అనంతరం సీబీఐ మరోసారి హైకోర్టును ఆశ్రయించింది. మంగళవారం నాటి ఆదేశాలపై సుప్రీం ఎటువంటి స్టే ఇవ్వలేదని.. అయినా రాష్ట్ర ప్రభుత్వం షాజహాన్ షేక్‌ను అప్పగించడం లేదని ఈడీ చెప్పడంతో నేటి సాయంత్రానికి నిందితుడు షాజహాన్ షేక్‌ను అప్పగించి తీరాల్సిందేనని హైకోర్టు డెడ్‌లైన్ విధించింది. కాగా గత కొంతకాలంగా సందేశ్‌ఖాలీ పేరు వార్తల్లో నిలుస్తున్న విషయం తెలిసిందే. టీఎంసీ నేత షాజహాన్ షేక్ ఇంట్లో సోదాలు చేసేందుకు వెళ్లిన ఈడీ అధికారులపై అతడి అనుచరులు దాడి చేశారు. అనంతరం అతడు స్థానికుల నుంచి భూములు లాక్కోవడం, ఇవ్వని పక్షంలో మహిళలపై లైంగిక దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు వచ్చాయి. ఈ ఆకృత్యాలపై, టీఎంసీ గుండాలకు వ్యతిరేకంగా అక్కడి మహిళలు రోడ్డెక్కారు. ఈ ఉద్యమానికి బీజేపీతో సహా ప్రతిపక్షాలు మద్దతు ఇచ్చాయి. ఈ నేపథ్యంలో జనవరి 5 నుంచి షేక్ షాజహాన్ పరారీలో ఉన్నాడు. దాదాపు 55 రోజుల తర్వాత గవర్నర్, హైకోర్టు అల్టిమేటంతో బెంగాల్ పోలీసులు ఇతడిని అరెస్ట్ చేశారు. అయితే, రాష్ట్ర ప్రభుత్వమే షాజహాన్ని కాపాడుతోందని బీజేపీ విమర్శిస్తోంది. ఈ వివాదం పెద్దది కావడంతో టీఎంసీ అతడిని 6 ఏళ్ల పాటు సస్పెండ్ చేసింది. ఇతడికి బెయిల్ ఇచ్చేందుకు కూడా హైకోర్టు నిరాకరిస్తూ.. అతడిపై తమక సానుభూతి లేదని ప్రకటించింది. -
1993 పేలుళ్ల కేసులో ‘డాక్టర్ బాంబ్’ తుండాకు ఊరట!
జైపూర్: 1993 వరుస బాంబు పేలుళ్ల కేసులో సీబీఐకి ఎదురుదెబ్బ తగిలింది. లష్కరే తోయిబా ప్రధాన సభ్యుడు అబ్దుల్ కరీమ్ తుండాను రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం నిర్దోషిగా ప్రకటించింది. పేలుళ్ల కేసులకు సంబంధించి.. తుండాకు వ్యతిరేకంగా ఎలాంటి ఆధారాల్లేవని కోర్టు ఈ సందర్భంగా వ్యాఖ్యానించింది. .. అదే సమయంలో ఈ కేసులో అమీనుద్దీన్, ఇర్ఫాన్ అనే ఇద్దరికి జీవితఖైదు విధించింది. అండర్ వరల్డ్ మాఫియా డాన్ దావూద్ ఇబ్రహీంకు కరీం తుండా బాగా దగ్గర. బాంబుల తయారీలో నైపుణ్యం ఉన్నందునే కరీం తుండాను ‘మిస్టర్ బాంబ్’గా పేర్కొంటారు. గతంలో.. లష్కరే తోయిబా, ఇండియన ముజాహిద్దీన్, జైషే మహమ్మద్, బబ్బర్ ఖాల్సా సంస్థలకు పని చేశాడు. బాబ్రీ మసీదు కూల్చివేతకు ప్రతీకారంగా పేర్కొంటూ పలు ఉగ్రసంస్థలు దేశంలో వరుస పేలుళ్లకు పాల్పడ్డాయి. 1993లో కోటా, కాన్పూర్, సూరత్, సికింద్రాబాద్ స్టేషన్ల పరిధిలో రైళ్లలో జరిగిన పేలుళ్లు యావత్ దేశాన్ని షాక్‌కి గురి చేశాయి. ఈ కేసుల దర్యాప్తును సీబీఐకి అప్పగించింది అప్పటి కేంద్ర ప్రభుత్వం. అయితే వివిధ నగరాల్లో నమోదైన ఈ కేసులంటిని ఉగ్రవాద నిరోధక చట్టం ఆధారంగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం విచారణ చేపట్టింది. కరీం తుండాను నిర్దోషిగా రాజస్థాన్ ప్రత్యేక న్యాయస్థానం ప్రకటించడాన్ని.. సుప్రీం కోర్టులో సవాల్ చేయాలని సీబీఐ భావిస్తోంది. సీబీఐ వెల్లడించిన వివరాల ప్రకారం.. కార్పెంటర్ పని చేసే తుండా.. ముంబై పేలుళ్ల తర్వాతే నిఘా సంస్థల పరిశీలనలోకి వచ్చాడు. ఉత్తరాఖండ్ నేపాల్‌సరిహద్దులో 2013లో పోలీసులు అతన్ని అరెస్ట్ చేశాయి. 1996 పేలుడు కేసుకు సంబంధించి హర్యానా కోర్టు అతనికి జీవితఖైదు విధించింది. ఇక.. బాంబు తయారు చేస్తుండగా ప్రమాదవశాత్తూ పేలి కరీం తన ఎడమ చేతిని కోల్పోయాడు. -
అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు
లక్నో: యూపీ ప్రతిపక్ష నేత, సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌కు సీబీఐ నోటీసులు జారీ చేసింది. యూపీ అక్రమ మైనింగ్ కేసులో రేపు విచారణకు తమ ఎదుట హాజరు రావాలని నోటీసుల్లో పేర్కొంది. మైనింగ్‌లకు సంబంధించి ఈ-టెండర్లలో ఉల్లంఘనలు జరిగాయన్న ఆరోపణలపై.. అలహాబాద్ హైకోర్టు ఆదేశాలతో సీబీఐ దర్యాప్తు చేపట్టింది. ఈ క్రమంలోనే..సీఆర్పీసీ సెక్షన్ 160 కింద ఢిల్లీలోని తమ కార్యాలయానికి రావాలంటూ సీబీఐ నోటీసుల్లో కోరింది. మైనింగ్‌పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ నిషేధం ఉన్నప్పటికీ.. 2012-16 సమయంలో అఖిలేష్ ముఖ్యమంత్రిగా ఉండగా ప్రభుత్వాధికారులు అడ్డగోలుగా అక్రమ గనులకు అనుమతులు మంజూరు చేశారని.. చట్టవిరుద్ధంగా లైసెన్లను రెన్యువల్ చేశారనే అభియోగాలు ఉన్నాయి. -
‘ఒక్క కేసులో అయినా సీబీఐ విచారణకు సిద్ధమా?’
గుంటూరు, సాక్షి: చంద్రబాబుకి నీతిమంతుడని నిరూపించుకునే అవకాశం ఇచ్చారు ఏపీ వ్యవసాయ శాఖా మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి. బాబుపై ఉన్న కేసుల్లో ఓ ఒక్కదానికైనా సీబీఐ విచారణకు సిద్ధపడాలని.. 24 గంటల్లో దీనికి స్పందించాలని మంత్రి కాకాణి చంద్రబాబుకి సవాల్ విసిరారు. నెల్లూరు న్యాయస్థానంలో ఫైళ్లు గల్లంతైన కేసులో వ్యవసాయ శాఖ మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డికి దర్యాప్తు సంస్థ సీబీఐ క్లీన్ చిట్ ఇచ్చిన సంగతి తెలిసిందే. అయితే.. ఆరోపణలన్నీ అవాస్తవమని సీబీఐ తేల్చినా కూడా తనపై తప్పుడు రాతలు ఆగడం లేదని అన్నారాయన. ‘‘గతంలో నాపై వచ్చిన ఆరోపణలపై సిబిఐ ఛార్జిషీట్ ని కూడా కొన్ని పత్రికలు తప్పుపడుతున్నాయి. సీబీఐ విచారణకి ఎటువంటి అభ్యంతరం లేదని హైకోర్టుకి చెప్పా. సీబీఐ విచారణ గత ఏడాదిగా విచారణ జరిపింది. ఛార్జి షీట్లో స్పష్టంగా నా ప్రమేయం లేదని తేలింది. పోలీసులపై సోమిరెడ్డి పదేపదే చేసిన ఆరోపణలు అవాస్తవాలని స్పష్టమైంది. సీబీఐ అంటే సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్విస్టిగేషన్.. అంతేగానీ చంద్రబాబు ఇన్వెస్టిగేషన్ కాదు. రెండేళ్లగా పదే పదే తప్పుడు ఆరోపణలు చేస్తున్నారని రుజువైంది. దీనిపై చంద్రబాబు, లోకేష్ నేల టిక్కెట్ సమాధానం చెప్పాలి.. నేల టిక్కెట్ అంటే సోమిరెడ్డి. మీకు అనుకూలంగా వస్తే అత్యున్నత సంస్ధ అంటారు. అదే వ్యతిరేకంగా వస్తే సీబీఐ సరిగ్గా విచారించలేదని చెప్తారు. మీ వారికి బెయిల్ వస్తే న్యాయస్ధానాలు న్యాయం జరిగినట్లు.. లేకపోతే న్యాయస్ధానాలపై దాడులకి సిద్దపడతారు. చంద్రబాబుపై అనేక ఆరోపణలు వచ్చాయి..ఎన్నో కేసులలో స్టే లు తెచ్చుకున్నారు. చంద్రబాబూ.. నీపై నమోదైన కేసులలో ఒక్క కేసులోనైనా నువ్వు సీబీఐ విచారణకి సిద్దమా?. మీ(చంద్రబాబు) పాత్ర లేకుంటే ఎందుకు సీబీఐ విచారణ కోరటం లేదు. నీపై వచ్చిన అభియోగాలపై ఎటువంటి విచారణకి సిద్దమా? లేదా? స్పష్టత ఇవ్వాలి. నువ్వు నీతిమంతుడివైతే సీబీఐ విచారణ జరిపించుకోవాలి. 24 గంటల లోపుల నా సవాల్ కి స్పందించాలి. నా సవాల్ స్వీకరించకపోతే తాను అవినీతిపరుడని చంద్రబాబే ఒప్పుకున్నట్లే అని మంత్రి కాకాణి అన్నారు. చంద్రబాబు, టీడీపీ హయాం కంటే రైతులకు మేం ఎక్కువ మేలు చేశాం. టీడీపీ హయాంలో వ్యవసాయ యాంత్రీకరణపై సీబీఐ విచారణకి సిద్దమా?. చంద్రబాబు మోసగాడని ప్రజలు భావిస్తున్నట్లుగానే.. ఇప్పుడు మోసపూరిత హామీలు ఇస్తున్నారు అంటూ మంత్రి కాకాణి చురకలు అంటించారు. -
అక్రమ ఆస్తుల కేసులో డీకేఎస్‌కు ఎదురుదెబ్బ
సాక్షి, బెంగళూరు: కర్ణాటక పీసీసీ చీఫ్, ఆ రాష్ట్ర డిప్యూటీ సీఎం డీకే శివకుమార్‌కు కర్ణాటక హైకోర్టులో చుక్కెదురైంది. తనపై నమోదు అయిన అక్రమ ఆస్తుల కేసు కొట్టేయాలని ఆయన వేసిన పిటిషన్‌ను హైకోర్టు గురువారం కొట్టేసింది. అంతేకాదు సీబీఐ విచారణ నిలుపుదల పేరిట గతంలో ఇచ్చిన మధ్యంతర ఉత్వర్వుల్ని ఎత్తేస్తూ.. మూడు నెలల్లో దర్యాప్తు పూర్తి చేసి పూర్తి నివేదిక సమర్పించాలని కోర్టు దర్యాప్తు సంస్థను ఆదేశించింది. ఆదాయానికి మించిన ఆస్తుల్ని కలిగి ఉన్నారంటూ డీకే శివకుమార్‌పై సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (CBI) కేసు నమోదు చేసింది. గతంలో సమన్లు ఇచ్చి ఆయన్ని విచారించింది కూడా. ఈ క్రమంలో శివకుమార్ కుటుంబ సభ్యులపైనా కేసులు నమోదు అయ్యాయి. అయితే కర్ణాటక ఎన్నికల సమయంలో(ఫిబ్రవరిలో) శివకుమార్ అభ్యర్థన పిటిషన్ ఆధారంగా హైకోర్టు సీబీఐ విచారణపై స్టే విధించింది. ఈ స్టేపై సీబీఐ సుప్రీం కోర్టుకు వెళ్లగా.. జోక్యం చేసుకునేందుకు సర్వోన్నత న్యాయస్థానం నిరాకరించింది. తాజాగా కేసు కొట్టేయాలని ఆయన వేసిన అభ్యర్థనను తోసిపుచ్చుతూ.. సీబీఐ దర్యాప్తునకు మార్గం సుగమం చేసింది హైకోర్టు. In a setback to Karnataka Deputy CM #DKShivakumar, #KarnatakaHC has refused to quash a corruption case registered against him by the #CBI for allegedly possessing assets worth ₹74.93 crore disproportionate to his known sources of income | @Kpsagri reportshttps://t.co/jw0MOK5o6I — The Hindu-Bengaluru (@THBengaluru) October 19, 2023 -
ఒకరిది ఓర్పు.. పిరికితనం మరొకరిది!
తెలుగుదేశం పార్టీ చేస్తున్న విన్యాసాలు గమ్మత్తుగా ఉన్నాయి. వారికి ఎప్పుడు ఏ నిరసన చేపట్టాలో కూడా తెలియనట్లుగా ఉంది. గతంలో యూపీఏ ఛైర్ పర్సన్ గా ఉన్న సోనియాగాంధీ, టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు కుమ్మక్కై ప్రస్తుత ఏపీ ముఖ్యమంత్రి, అప్పట్లో ఎంపీగా ఉన్న వైఎస్ జగన్మోహన్ రెడ్డిపై కుట్రపూరిత కేసులు పెట్టినప్పుడు ఆయన ఎదుర్కున్న తీరు.. అవినీతికి పాల్పడి ప్రభుత్వ నిధులు కైంకర్యం చేశారన్న ఆరోపణలకు గురై జైలు పాలైన చంద్రబాబు నాయుడు వైనానికి మధ్య స్పష్టమైన తేడా కనిపిస్తుంది. జగన్ కనీసం ప్రభుత్వంలో మంత్రి కాదు. ఆయన తండ్రి రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో జగన్ చేపట్టిన కొన్ని పరిశ్రమలలో కొందరు పెట్టుబడులు పెట్టడాన్నే అవినీతిగా చూపించి, దానికి క్విడ్ ప్రోకో అని పేరుపెట్టి ఆయనను నిర్భంధించారు. విశేషం ఏమిటంటే ఆనాడు మంత్రివర్గం వివిధ పరిశ్రమలకు సాధారణంగా ఇచ్చిన రాయితీలను సైతం తప్పుపట్టిన చంద్రబాబు.. ఇప్పుడు అందుకు విరుద్దంగా మాట్లాడుతున్నారు. మంత్రివర్గ నిర్ణయాలకు తనను బాధ్యుడిగా ఎలా చేస్తారని ప్రశ్నిస్తున్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రి హోదాలో ఉండి అవినీతికి పాల్పడ్డారని సీఐడీ పలు ఆధారాలు చూపుతోంది. అయినా చంద్రబాబు అవినీతిపరుడు కాడని తెలుగుదేశం అంటోంది.ఆ పార్టీ వాదనకు జనసేన అధినేత పవన్ కళ్యాణ్ వంత పాడుతున్నారు. ✍️ఇక ఆయన కుటుంబ సభ్యులు అబ్బే! మాకు ఎంతో ఆస్తి ఉంది. హెరిటేజ్ లో రెండు శాతం షేర్లు అమ్ముకుంటే రూ.400 కోట్లు వస్తాయి.. అని చెబుతున్నారు. అలాంటప్పుడు ఎంత పద్దతిగా ,ఎంత నిజాయితీగా పాలన సాగించి ఉండాలి. కాని అందుకు విరుద్దంగా నానా రకాల స్కామ్ లకు చంద్రబాబు బృందం పాల్పడింది.జగన్ పై కేసులు పెట్టడం కోసం ఆనాడు న్యాయ వ్యవస్థను వాడుకున్నారని పలువురు మేధావులు బహిరంగంగానే వ్యాఖ్యానించేవారు. ఎందుకంటే జగన్ తో కాని, ఆయన సంస్థలతో కాని సంబంధం లేని వ్యక్తి ఒకరు హైకోర్టుకు లేఖ రాస్తే.. దానిపై కనీసం సంతకం లేకపోయినా విచారణకు తీసుకున్న తీరు విమర్శలకు గురి అయింది. దానిని అత్యంత వేగంగా సీఐబీకి అప్పగించారు. ఆ తర్వాత ఆ న్యాయమూర్తికి ఉమ్మడి ఏపీలో ఒక ఉన్నత పదవి కూడా ఇవ్వడంతో పలు విమర్శలు వచ్చాయి. సీబీఐని అడ్డుపెట్టుకుని జగన్ పై ఒక కేసు కాదు.. పదకొండు కేసులు పెట్టి రాష్ట్రానికి పెట్టుబడులు, పరిశ్రమలు రాకుండా చేశారు. విభజిత ఆంధ్రప్రదేశ్ ప్రాంతం అప్పట్లో ఎంతగానో నష్టపోయింది. సోనియాగాంధీ, చంద్రబాబు, ఆ సీబీఐ అధికారి అందుకు కారణం అని నిర్వివాదాంశంగా అంతా భావిస్తారు. పరిశ్రమలు పెట్టకుండా బ్యాంకులకు వేల కోట్లు ఎగవేసినవారేమో దర్జాగా బయట తిరుగుతుంటే వారి జోలికి వెళ్లని సీబీఐ.. ఏపీలో మాత్రం పరిశ్రమలు పెట్టేవారిని అరెస్టు చేసింది. వీరి కుట్ర కారణంగా చీరాల,రేపల్లె ప్రాంతంలో రావాల్సిన పలు భారీ పరిశ్రమలు ఆగిపోయాయి. పదమూడువేల ఎకరాలు సేకరించినప్పటికీ వాటిని నిరుపయోగంగా ఉంచేయవలసి వచ్చింది. అది వినియోగంలోకి వచ్చి ఉంటే వేలాది మందికి ఉపాది కల్పిస్తున్న మరో శ్రీసిటీ తయారయ్యే అవకాశం ఉండేది. అలా జరగనివ్వకుండా అభివృద్దిని అడ్డుకోవడమే కాకుండా ,జగన్ ను ఎలాగైనా రాజకీయాలలో లేకుండా చేయాలని సోనియా, చంద్రబాబులు విపరీతమైన కృషి చేశారు. అప్పట్లో హైకోర్టులో ఈ కేసు రాగానే ఇదేదో కుట్రేమో అని చాలామంది అనుకున్నారు. అలాగే ఆ వ్యవహారం కొనసాగింది. ✍️సీబీఐ జగన్‌కు నోటీసు ఇస్తే.. ఆయన దానిపై విమర్శలు చేయలేదు. మాచర్ల వద్ద ఆయన ప్రచార సభలో ఉన్నప్పటికీ, నిర్దిష్ట తేదీ ప్రకారం సీబీఐ విచారణకు వెళ్లారు. కొన్ని రోజులు ఆ విచారణ చేశాక ఆయన్ని అరెస్టు చేస్తున్నట్లు ప్రకటించారు. దాంతో ఉమ్మడి ఏపీ అంతటా అలజడి ఏర్పడింది. కాని గొడవలు జరగలేదు. ప్రజలంతా ఇది కుట్ర అని నమ్మారు. అందుకే ఆ టైమ్ లో జరిగిన ఉప ఎన్నికలలో జగన్ స్థాపించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ 18 ఉప ఎన్నికలకుగాను.. పదిహేను చోట్ల విజయం సాధించింది. కాంగ్రెస్ రెండు చోట్ల, టీఆర్ఎస్ ఒక చోట గెలిచాయి. తెలుగుదేశం పార్టీ ఘోరంగా ఓడింది. కొన్ని చోట్ల డిపాజిట్లు కోల్పోయింది. అలా ప్రజల మద్దతు జగన్ కు లభించింది. ✍️ఆయన జైలులో ఉన్న పదహారు నెలలు న్యాయ పోరాటం చేశారే కాని, రోడ్లపై ఆందోళనలు జరపలేదు. కేవలం కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి సొంతపార్టీ పెట్టుకున్నందుకే జగన్ అన్ని కష్టాలు పడవలసి వచ్చింది. తనకు సమస్యలు వస్తాయని తెలిసినా.. జగన్ ధైర్యంగా తట్టుకుని నిలబడ్డారే కాని, ఎక్కడా తగ్గలేదు. డప్పులు కొట్టడాలు, ఈలలు ఊదడాలు వంటివి చేయలేదు. ఆ రోజుల్లో జగన్ పై ఈనాడు, ఆంధ్రజ్యోతి వంటి మీడియా సంస్థలు ఎంత ఘోరమైన కధనాలు రాసేవో తలచుకుంటే చీదర వేస్తోంది. సీబీఐ విచారణ పేరుతో ఉన్నవి.. లేనివి రాసేవారు. పలుమార్లు జగన్‌ను తీహారు జైలుకు పంపేస్తారని, ఆయన జైలు నుంచి బయటకు వచ్చే అవకాశమే లేదని వార్తలు వండేవారు. తెలుగుదేశం పార్టీ ఎంత నీచంగా విమర్శలు చేసేది అంటే.. వ్యక్తిగత ఆరోపణలకు కూడా దిగేది. చివరికి జగన్ సతీమణి భారతి వెళ్లి ఆయనను జైలులో కలిస్తే కూడా టీడీపీ నేతలు దారుణమైన వ్యాఖ్యలు చేసేవారు..అయినా జగన్ ఓర్పు వహించారు. సహించారు. ధైర్యంతో నిలబడ్డారు. తదుపరి 2014లో అనూహ్యంగా తన పార్టీ గెలవకపోయినా ఆయన చలించకుండా తనదైన శైలిలో ప్రజలలో తిరిగి వారి ఆదరణ పొందారు. అది జగన్ ధైర్యం. ప్రస్తుతం తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడుపై వచ్చిన ఆరోపణలు ఆయన ముఖ్యమంత్రిగా పనిచేసిన కాలానివి. జగన్ ప్రభుత్వం రాగానే ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని ఏర్పాటు చేసి వాటిలో వాస్తవాలను వెలికితీయించింది. అవినీతికి ఆధారాలను కనుగొంది. రాష్ట్ర ప్రభుత్వమే కాదు. కేంద్రానికి చెందిన ఆదాయపన్ను శాఖ చంద్రబాబు కు ఒక నోటీసు పంపి రూ. 118 కోట్ల రూపాయల నల్లధనం ఆయన ఖాతాలలోకి వచ్చినట్లు గుర్తించినట్లు తెలిపి వివరణ కోరింది. అంతకుముందు చంద్రబాబు పీఎస్‌గా ఉన్న శ్రీనివాస్ ఇంటిలో సోదాలు జరపడం, చంద్రబాబు టైమ్ లో కాంట్రాక్టులు పొందిన షాపూర్ జీ సంస్థలలో దొరికిన ఆధారాలతో రెండువేల కోట్ల అవకతవకతలు జరిగినట్లు అధికారికంగానే సీబీటీడీ ప్రకటించింది. అయినప్పటికీ చంద్రబాబు అత్యంత నీతిమంతుడని తెలుగుదేశం కాని, ఆయన కుటుంబ సభ్యులు కాని చెప్పుకుంటే చెప్పుకోవచ్చు. కాని అవినీతిని సహించను అంటూ బీరాలు పలికిన రామోజీరావు కూడా చంద్రబాబు అసలు అవినీతికి పాల్పడలేదని డబాయిస్తూ కధనాలు ఇస్తున్నారు. తెలుగుదేశం కరపత్రికగా ఈనాడు మీడియాను ఆయన మార్చేశారు. ఆయన పత్రిక చూసినా, ఆయన టీవీని చూసినా నిత్యం అబద్దాలు తప్ప ఇంకేవీ కనిపించడం లేదు. పూర్తిగా విశ్వసనీయతను రామోజీ కోల్పోయారు. ✍️ఇక ఆంద్రజ్యోతి ,టివి 5 వంటి వాటి గురించి రాయడం వృధా. వారు ఎప్పటినుంచో బట్టలు ఊడదీసుకుని శరభ,శరభ అంటూ వేప రెమ్మలు కట్టుకుని తిరుగుతున్నారు. సిట్ పూర్తి స్థాయిలో దర్యాప్తు చేసిన తర్వాత స్కిల్ డెవలప్ మెంట్ కార్పొరేషన్ స్కామ్ లో చంద్రబాబును అరెస్టు చేసింది. తెలుగుదేశం వారంతా తమ అధినేత దొరికిపోయారే అని మదనపడుతున్న తరుణంలో ,ఎల్లో మీడియా మాత్రం అసలు ఏమీ జరగలేదని, స్కిల్ కార్పొరేషన్ ద్వారా చాలా మందికి శిక్షణ ఇచ్చారంటూ పిచ్చి ప్రచారం ఆరంభించింది. అంతే తప్ప 240 కోట్ల రూపాయలు షెల్ కంపెనీల ద్వారా చంద్రబాబు, లోకేష్ లకే చేరిందన్న సీఐడీ వాదనకు మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నాయి. ఫైబర్ నెట్, ఇన్నర్ రింగ్ రోడ్డు,అమరావతి అస్సైన్డ్ భూములు మొదలైన స్కాములన్నిటిపైన సాక్ష్యాధారాలతో ఏపీ సీఐడీ కేసులు పెడుతుంటే.. వీరికి గుక్క తిరగడం లేదు.గతంలో జగన్ పై కేసులు పెట్టి సీబీఐ విచారణ పేరుతో తంతు సాగిస్తే, ఇప్పుడు సీఐడీ పూర్తి విచారణ చేపట్టి, ఆధారాలు దొరికిన తర్వాతే ,వందల కోట్లు స్వాహా అయ్యాయని నమ్మిన తర్వాతే చంద్రబాబుపై, ఆయన అనుచరులపై కేసులు పెట్టింది. ✍️గతంలో న్యాయ వ్యవస్థలో తాము ఏమి అనుకుంటే అది జరుగుతుందని భావించిన తెలుగుదేశం పార్టీవారికి ఇప్పుడు ఎదురుదెబ్బలు తగులుతుంటే వాటిని తట్టుకోలేకపోతున్నారు. జగన్ కేసుల్లో కాని, ఆ తర్వాత ఆయన ముఖ్యమంత్రి అయ్యాక వివిధ విషయాలలో న్యాయ వ్యవస్థ అనుసరించిన వైఖరిపై కూడా విమర్శలు వస్తే , ఆ వ్యవస్తనే తప్పు పడతారా అంటూ తెలుగుదేశం దీర్ఘాలు తీసేది.కాని తన విషయానికి వచ్చేసరికి మాత్రం జడ్జిలను వ్యక్తిగతంగా దూషించడానికి వెనుకాడలేదు. కోర్టులు అన్నిటిని పరిశీలించి చంద్రబాబును రిమాండ్ ద్వారా జైలుకు పంపింది. కింది కోర్టులలో సానుకూల తీర్పులు రాకపోవడంతో ప్రస్తుతం సుప్రింకోర్టుకు చంద్రబాబు వెళ్లారు.ఈలోగా కేసులకు భయపడి చంద్రబాబు కుమారుడు లోకేష్ ఢిల్లీకి చిత్తగించి ఇరవై రోజుల తర్వాత తిరిగి వచ్చారు. ఇంతకాలం మమ్మల్ని ఏమీ చేయలేరు.. ఏం పీకారు..అంటూ రోతరోతగా మాట్లాడిన వీరు ఇప్పుడు హడలిపోతున్నారు. రాష్ట్ర ప్రభుత్వాన్ని విమర్శిస్తూ అక్రమ కేసులు అంటూ నిరసనలు, ర్యాలీలు తీస్తున్నారు. క్యాండిళ్లు వెలిగిస్తున్నారు. డప్పులు కొడుతున్నారు. విజిల్స్ ఊదుతున్నారు.వాటిని చూసేవారు ఆశ్చర్యపోయే పరిస్థితి. ✍️చంద్రబాబు జైలుకు వెళితే వీరు సంబరాలు చేసుకున్నట్లు ఉంది తప్ప బాధపడుతున్నట్లు లేదని సోషల్ మీడియాలో వ్యంగ్య వ్యాఖ్యానాలు వచ్చాయి. నిజంగానే చంద్రబాబు కోడలు బ్రాహ్మణి ఆ డప్పు కొట్టడం ఏమిటి? విజిల్ ఊదడం ఏమిటి? శాసనసభలో ఆమె తండ్రి బాలకృష్ణ అలాగే విజిల్ ఊది నవ్వులపాలైతే, అదే దారిలో ఆమె కూడా వ్యవహరించడం విడ్డూరంగానే ఉంది. వీరు ప్లేట్లు తీసుకుని మోత చేస్తుంటే, గతంలో చంద్రబాబు పాలనలో కాపు రిజర్వేషన్ ఆందోళనకారులు కంచాలు కొట్టినప్పుడు ఆ ప్రభుత్వం ఎంత కఠినంగా వ్యవహరించింది అందరికి గుర్తుకు వచ్చింది.గతంలో జగన్ ను కోర్టు జైలుకు పంపింది కనుక అవన్ని సక్రమ కేసులని తెలుగుదేశం అధినేత చంద్రబాబు నాయుడు ప్రచారం చేసేవారు. మరి ఇప్పుడు అదే కోర్టు తనను జైలుకు పంపితే మాత్రం అది అక్రమం అని అంటున్నారు.ఆయన నిరసన దీక్ష చేశారట ఆయనకు సంఘీబావంగా ఆయన భార్య భువనేశ్వరి కూడా దీక్ష చేశారు.ఇవి నిరసనలతో పోయే కేసులా? కోర్టులలో రుజువు చేసుకోవలసిన కేసులు కదా అన్న సందేహం ఎవరికైనా వస్తుంది. కాకపోతే చంద్రబాబు జైలుకు వెళితే వెళ్లారు ..కనీసం సానుభూతి అయినా సంపాదించాలన్న యావలో ఇలా చేస్తున్నట్లుగా ఉంది. ✍️అప్పట్లో జగన్ ముందుగా బెయిల్ కోసం ప్రయత్నించారు.కాని దానికి కూడా అడుగడుగునా అడ్డుపడేవారు. మామూలుగా అయితే మూడు రోజులలో బెయిల్ రావల్సిన కేసుల్లో జగన్ ను కాబట్టి పదహారు నెలలు ఉంచారని ఒక సీనియర్ న్యాయవాది అప్పట్లో నాతో చెప్పారు. ఇప్పుడు బెయిల్ కోసం కాకుండా కేసును కొట్టివేయించుకోవాలని చంద్రబాబు లాయర్ల ప్రయత్నమట.అందుకే కేసు లోతుల్లోకి వెళ్లకుండా సాంకేతిక అంశాలకే పరిమితమై వాదనలు చేస్తున్నారు. అప్పట్లో జగన్ లాయర్లు ఎక్కడా అభ్యంతరకర వ్యాఖ్యలు చేయలేదు. కాని చంద్రబాబు లాయర్ మాత్రం తాము కోరుకున్న న్యాయం దొరకకపోతే కత్తిపట్టాలన్న ఒక సూక్తిని ప్రచారంలోకి తెచ్చారు.తద్వారా వారు ఎంత డిస్పరేట్ గా ఉందీ తెలియచెప్పారు. దాదాపు రెండు దశాబ్దాలుగా న్యాయ వ్యవస్థలో తన ఇష్టం వచ్చినట్లు చెలామణి చేసుకున్న చంద్రబాబుకు ఇప్పుడు కాలం మారిందన్న సంగతి అర్దం అవుతుండాలి. :::కొమ్మినేని శ్రీనివాస రావు, ఏపీ మీడియా అకాడెమీ చైర్మన్ -
లాలూ హుషారే చిక్కుల్లో పడేయనుందా?
ఢిల్లీ: బీహార్ మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్(75) హుషారుగా ఉండడం.. ఆయన్ని చిక్కుల్లో పడేసేలా కనిపిస్తోంది. గడ్డి కుంభకోణం కేసుల్లో ఒకదాంట్లో అనారోగ్య కారణం చూపించి బెయిల్‌పై బయట ఉన్న ఆయన.. సంపూర్ణ ఆరోగ్యంగా ఉన్నారని, ఆయన బెయిల్ రద్దు చేయాలంటూ సీబీఐ, సుప్రీం కోర్టును కోరింది. ఇందుకు ఆయన హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలను చూపించింది కూడా!. దాణా స్కాంలోని కేసులో లాలూకు జార్ఖండ్ హైకోర్టు ఇచ్చిన బెయిల్‌ను రద్దు చేయాలంటూ సీబీఐ సుప్రీం కోర్టును ఆశ్రయించింది. శుక్రవారం ఈ పిటిషన్‌పై జస్టిస్ ఏఎస్ బోపన్న, జస్టిస్ ఎంఎం సుందరేశ్‌లతో కూడిన ద్విసభ్య ధర్మాసనం వాదనలు వింది. లాలూ తరపు సీనియర్ కపిల్ సిబాల్ వాదిస్తూ.. బెయిల్ రద్దు చేయాలనే సీబీఐ అభ్యర్థనను తిరస్కరించాలని బెంచ్‌ను కోరారు. ఈమధ్యే కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స జరిగిందన్న విషయాన్ని కోర్టు దృష్టికి తీసుకెళ్లారాయన. అలాగే.. 42 నెలలపాటు లాలూ ప్రసాద్ యాదవ్ జైల్లో గడిపిన విషయాన్ని ప్రస్తావించారు. అయితే.. సీబీఐ తరపున వాదనలు వినిపించిన అదనపు సోలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు.. ‘‘లాలూకు బెయిల్ మంజూరు విషయంలో జార్ఖండ్ హైకోర్టు న్యాయపరిధికి తగ్గటుగా వ్యవహరించలేదని.. తప్పిదం చేసిందని వాదించారు. ఆయన ఆరోగ్యంగా ఉన్నారని, బ్యాడ్మింటన్ ఆడుతున్న ఫొటోలు ప్రముఖంగా వైరల్ అయిన కోర్టు దృష్టికి తీసుకెళ్లారు. ‘‘దాణా స్కాం దొరండ ట్రెజరీ కేసులో లాలూకు ఐదేళ్ల శిక్షపడింది. ఈ కేసులో దోషిగా తేలిన తర్వాత ఆయనకు బెయిల్ మంజూరైంది. బెయిల్ తర్వాత ఆయన బ్యాడ్మింటన్ ఆడుతూ ఆరోగ్యంగా కనిపించారు. అలాగే.. ఆయనకు బెయిల్ మంజూరు చేయాలనే హైకోర్టు ఆదేశం తప్పని నిరూపించేందుకు సీబీఐ సిద్ధం. ఆయన మూడున్నరేళ్ల శిక్షను ఏకకాలంలో అనుభవించలేదు. అయితే హైకోర్టు ఆయన శిక్షను ఏకకాలంలోనే అనుభవించారని పొరపడి బెయిల్ మంజూరు చేసింది’’ అని అదనపు సాలిసిటర్ జనరల్ కోర్టుకు తెలిపారు. వాదనలు ముగియడంతో.. అక్టోబర్ 17వ తేదీకి విచారణ వాయిదా వేసింది సుప్రీం కోర్టు. 1992 నుంచి 1995 మధ్య కాలంలో బీహార్ ముఖ్యమంత్రిగా ఉన్న లాలూ ప్రసాద్ యాదవ్.. ఆర్థిక, పశుసంవర్థకశాఖ పోర్ట్‌ఫోలియోలను తన వద్దే ఉంచుకున్నారు. ఆ సమయంలోనే 950 కోట్ల రూపాయల దాణా కుంభకోణం జరిగిందని.. ఫేక్, ఫోర్జ్డ్ బిల్లులతో ఖజానా నుంచి సొమ్ము తీశారనే అభియోగాలు నమోదు అయ్యాయి. ఇందుకు సంబంధించి ఐదు కేసులు నమోదు అయ్యాయి. ఇందులో దొరండా ట్రెజరీ కేసుకు సంబంధించి 2022 ఫిబ్రవరిలో సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం లాలూకు ఐదేళ్ల జైలు శిక్షతో పాటు 60 లక్షల రూపాయల జరిమానా కూడా విధించింది. అయితే ఈ ఏడాది ఏప్రిల్ 22వ తేదీన అనారోగ్య కారణాలు చూపించడంతో జార్ఖండ్ హైకోర్టు లాలూకు బెయిల్ మంజూరు చేసింది. ఇదిలా ఉంటే.. బెయిల్‌పై బయట ఉన్న లాలూ.. కిడ్నీ మార్పిడి శస్త్రచికిత్స తర్వాత హుషారుగా బ్యాడ్మింటన్ ఆడుతూ కనిపించారు. లాలూ ఆడుతున్న వీడియోని ఆయన కొడుకు తేజస్వి యాదవ్ సోషల్ మీడియాలో షేర్ చేశారు. ‘‘దేనికీ భయపడరు. దేనికీ తలవంచరు. పోరాడారు. పోరాడుతూనే ఉంటారు. జైల్లో పెట్టినా బెదరలేదు. అంతిమంగా విజయమే సాధించారు’’ అని క్యాప్షన్ కూడా ఉంచారు. -
అజేయ కల్లం పిటిషన్ విచారణకు స్వీకరణ
హైదరాబాద్: వివేకా హత్య కేసుకు సంబంధించి మాజీ ఐఏఎస్ అధికారి, ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లాం దాఖలు చేసిన పిటిషన్‌ను తెలంగాణ హైకోర్టు విచారణకు స్వీకరించింది. తాను ఇచ్చిన స్టేట్మెంట్ను సీబీఐ అబద్ధాల మయంగా మార్చేసిందన్నది ఆయన వాదన. ఈ క్రమంలో.. గత వారం ఆయన వేసిన పిటిషన్ విచారణ అర్హతకు సంబంధించిన ఆదేశాలను రిజర్వ్ చేసిన హైకోర్టు.. ఇవాళ(శుక్రవారం) విచారణకు స్వీకరిస్తున్నట్లు పేర్కొంది. ఈ క్రమంలో.. రిజిస్ట్రీ అభ్యంతరాలను హైకోర్టు తోసిపుచ్చింది. పిటిషన్‌కు మెయిన్ నంబర్ ఇవ్వాలని రిజిస్ట్రీని ఆదేశించింది. ‘‘సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా స్టేట్మెంట్ రికార్డు చేయలేదు. అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని గత వారం హైకోర్టులో వాదనలు సందర్భంగా అజేయ కల్లం న్యాయవాదులు వాదించారు. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా వివేకా కేసులో విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. -
మణిపూర్ హింస: సీబీఐ దర్యాప్తు బృందంలో 29 మంది మహిళా అధికారులు
మణిపూర్ అల్లర్లలో వెలుగుచూసిన లైంగిక హింస వీడియో కేసును సీబీఐకి కేంద్రం అప్పగించిన విషయం తెలిసిందే. ఈ కేసును విచారించడానికి సీబీఐ దేశవ్యాప్తంగా ఉన్న తన యూనిట్ల నుంచి 53 మంది అధికారులను నియమించింది. వీరిలో 29 మంది మహిళా అధికారులు ఉన్నారు. ముగ్గురు డీఐజీలు లవ్లీ కతియార్, నిర్మలాదేవి, మోహిత్ గుప్తాతోపాటు ఒక ఎస్పీ రాజ్వీర్ సైతం ఉన్నారు. ఇద్దరు అదనపు పోలీసు సూపరింటెండెంట్లు, ఆరుగురు డిప్యూటీ సూపరింటెండెంట్లు ఆఫ్ పోలీస్‌లు 53 మంది సభ్యుల బృందంలో ఉన్నారు. వీరంతా మొత్తం దర్యాప్తును జాయింట్ డైరెక్టర్ ఘనశ్యామ్ ఉపాధ్యాయ్‌కు తమ నివేదికను నివేదించనున్నారు. కాగా కేంద్ర దర్యాప్తు సంస్థ ఒకే కేసులో ఇంత భారీ సంఖ్యలో మహిళా అధికారులను తీసుకోవడం ఇదే తొలిసారని అధికారులు భావిస్తున్నారు. సీబీఐ విచారిస్తున్న ఈ కేసుల్లో చాలా వరకు షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 1989లోని నిబంధనలకు సంబంధించినవని, వీటిని డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ ర్యాంక్ అధికారి దర్యాప్తు చేయవచ్చని సంబంధిత వర్గాలు తెలిపాయి.అయితే ఇలాంటి కేసుల్లో డీఎస్పీలు పర్యవేక్షకులుగా ఉండటం సాధ్యం కానందున దర్యాప్తును పర్యవేక్షించడానికి సీబీఐ ముగ్గురు డీఐజీలను ఒక ఎస్పీని నియమించినట్లు పేర్కొన్నారు. చదవండి: మధ్యప్రదేశ్‌లో హీటెక్కిన పాలి‘ట్రిక్స్’.. దిగ్విజయ్ హాట్ కామెంట్స్ ఈ బృందంలో 16 మంది ఇన్స్పెక్టర్లు, 10 మంది సబ్ ఇన్స్పెక్టర్లు కూడా ఉంటారని అధికారులు తెలిపారు. సాధారణంగా ఇంత పెద్ద సంఖ్యలో కేసులను సీబీఐకి అప్పగించాల్సి వస్తే సిబ్బందిని సమకూర్చేందుకు కేంద్ర దర్యాప్తు సంస్థ సంబంధిత రాష్ట్రంపై ఆధారపడి ఉంటుందని, అయితే కానీ మణిపూర్ విషయంలో దర్యాప్తులో పక్షపాత ఆరోపణలు రాకుండా స్థానిక అధికారుల పాత్రను తగ్గించడానికి సీబీఐ ప్రయత్నిస్తోందని అధికారులు చెప్పారు. ముఖ్యంగా ఇరు వర్గాల వ్యక్తుల ప్రమేయం ఉండకుండా ఉందేందుకు చర్యలు తీసుకుంటోందని పేర్కొన్నారు. కాగా ఇప్పటికే సీబీఐ ఎనిమిది కేసులు నమోదు చేసింది. ఇందులో రెండు కేసులో మే 4న ఇద్దరు మహిళలను నగ్నంగా ఊరేగించిన కేసుకు సంబంధించినవి. మణిపూర్ హింసాకాండకు సంబంధించి మరో తొమ్మిది కేసులను దర్యాప్తు చేసేందుకు సీబీఐ సిద్ధమైంది. దీంతో సంస్థ విచారించనున్న మొత్తం కేసుల సంఖ్య 17కు చేరింది.ఈ కేసులో కాకుండా మహిళలపై నేరాలు, లైంగిక వేధింపులకు సంబంధించిన మరే ఇతర కేసులను కూడా ప్రాధాన్యత ఆధారంగా విచారిస్తుందని అధికారులు పేర్కొన్నారు. ఈ క్రమంలో చురచంద్‌పూర్ జిల్లాలో జరిగిన లైంగిక వేధింపుల కేసును కూడా కేంద్ర దర్యాప్తు సంస్థ స్వీకరించే అవకాశం ఉంది. ఇదిలా ఉండగా మార్చి 3న మణిపూర్ హింస మొదలైనప్పటి నుంచి ఇప్పటి వరకు 160 మంది ప్రాణాలు కోల్పోయారు. వందలాది మంది గాయపడ్డారు.మే 4న కుకి జాతికి చెందిన ఓ గ్రామంపై దాడి చేసిన దుండగులు.. ఇద్దరు మహిళలను నగ్నంగా చేసి, ఊరేగించారు. ఓ ఫేక్ వీడియోను చూసి, కోపంతో ఈ దారుణానికి ఒడిగనట్టు తెలుస్తోంది. బాధితుల్లో ఒకరిపై సామూహిక అత్యాచారం కూడా జరిగింది, ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు జులై 26 వెలుగులోకి రాగా.. దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. చదవండి: కొనసాగుతున్న వర్ష బీభత్సం.. రూ.10 వేల కోట్ల ఆస్తి నష్టం.. -
‘వివేకా కేసు దర్యాప్తులో దురుద్దేశం కనిపిస్తోంది!’
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో ఏపీ ప్రభుత్వ ముఖ్య సలహాదారు అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై తీర్పును రిజర్వ్ చేసింది తెలంగాణ హైకోర్టు. తన స్టేట్మెంట్ను యధాతథంగా రికార్డు చేయలేదని.. తిరిగి తన స్టేట్మెంట్ను రికార్డు చేయించేలా దర్యాప్తు సంస్థ సీబీఐని ఆదేశించాలని ఆయన ఉన్నత న్యాయస్థానాన్ని అభ్యర్థించారు. ఈ క్రమంలో ఇవాళ వాదనలు విన్న హైకోర్టు బెంచ్.. పిటిషన్ విచారణ అర్హతపై తీర్పును రిజర్వ్ చేసింది. వివేకా కేసులో సీనియర్ అధికారి అజేయ కల్లం దాఖలు చేసిన పిటిషన్‌పై శుక్రవారం తెలంగాణ హైకోర్టులో వాదనలు జరిగాయి. ‘‘సీబీఐ సీఆర్పీసీ సెక్షన్-161 ప్రకారం నోటీస్ ఇవ్వలేదు. మెస్సేజ్ చేసి విచారణకు పిలిచారు. నా(అజేయ కల్లం) స్టేట్మెంట్ రికార్డు చేసింది అప్పటి విచారణాధికారి వికాస్ సింగ్. స్టేట్మెంట్పై సంతకం మాత్రం ముఖేష్ శర్మది ఉంది. సీనియర్ ఐపీఎస్‌లు అయ్యిఉండి ప్రొసీజర్ ఫాలో కాలేదు. నేను చెప్పింది యధాతథంగా రికార్డు చేయలేదు. దర్యాప్తు వెనకాల దురుద్దేశం కనిపిస్తోంది. సీబీఐ తన ఛార్జిషీట్లో తన స్టేట్మెంట్ తొలగించాలి. తిరిగి తనస్టేట్మెంట్ రికార్డు చేయాలి’’ అని అజేయ్ కల్లం తరపు న్యాయవాదులు వాదించారు. దీంతో పిటిషన్ విచారణ అర్హతపై తీర్పు రిజర్వ్ చేసింది ధర్మాసనం. నాడు చెప్పింది ఇదే.. ఉమ్మడి ఏపీ మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. ఏప్రిల్ 29, 2023న సీబీఐ అజేయ కల్లం నుంచి స్టేట్మెంట్ రికార్డు చేసింది. ‘‘మార్చి 15, 2019న జగన్‌గారి నివాసంలో ఉదయం మేనిఫెస్టోపై సమావేశం ప్రారంభమైంది. సమావేశం మొదలైన గంటన్నర తర్వాత అటెండర్ వచ్చి డోరు కొట్టారు. ఓఎస్డీ కృష్ణమోహన్‌రెడ్డి బయటకు వెళ్లి, తిరిగి వచ్చి జగన్‌గారికి ఏదో విషయం చెప్పారు. వెంటనే జగన్ షాక్‌కు గురైనట్టుగా లేచి చిన్నాన్న చనిపోయారని చెప్పారు’’. ఇది తాను సీబీఐకి చెప్పింది.. అంతకు మించి తానేం చెప్పలేదు అని అజేయ కల్లాం అంటున్నారు. స్టేట్మెంట్ అంతా అబద్ధాలమయమే! జగన్ గారి భార్య ప్రస్తావనకాని, మరే ఇతర ప్రస్తావన కాని తాను చేయలేదు. సీబీఐ తాను ఒకటి చెబితే.. దాన్ని మార్చేసి ఛార్జిషీట్లో మరోలా ప్రస్తావించింది. తాను చెప్పినట్టుగా ఛార్జిషీటులో సీబీఐ పేర్కొన్న స్టేట్మెంట్లో అబద్ధాలే ఉన్నాయి. దర్యాప్తును తప్పుదోవపట్టించే ధోరణి ఇందులో కనిపిస్తోంది. తన విజ్ఞాపనను పరిగణలోకి తీసుకుని ఛార్జిషీటులో తన స్టేట్మెంట్గా పేర్కొన్న అంశాలను కొట్టేయాలి. అవసరమైతే తన నుంచి మరోసారి స్టేట్మెంట్ను రికార్డు చేసేలా ఆదేశించాలి. వివక్షలేకుండా, పక్షపాతం లేకుండా విచారణ సాగాలని తన పిటిషన్లో అజేయ కల్లం కోరారు. ఇదీ చదవండి: బతికున్నోళ్లను సునీతమ్మ బజారుకీడుస్తోంది -
ఒడిశా ప్రమాదం.. ముగ్గురు రైల్వే ఉద్యోగుల అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: ఒడిశా బాలాసోర్ రైలు ప్రమాదానికి సంబంధించి.. సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ) ముగ్గురు రైల్వే ఉద్యోగుల్ని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. జూన్ 2వ తేదీ రాత్రిపూట జరిగిన కోరమాండల్ ఎక్స్‌ప్రెస్ ప్రమాదంలో 290 మంది దాకా మృతి చెందిన సంగతి తెలిసిందే. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. అయితే ఈ దుర్ఘటనపై లోతైన దర్యాప్తు చేపట్టిన సీబీఐ.. పలువురిని విచారించింది. ఘటనకు కారకులు అవ్వడంతో పాటు సాక్ష్యాలను ధ్వంసం చేసినందుకు అనే అభియోగాల మీదే వీళ్లను అరెస్ట్ చేసినట్లు సమాచారం. ఈ క్రమంలో ఇవాళ మగ్గురిని అరెస్ట్ చేసినట్లు తెలుస్తోంది. అరెస్ట్ అయిన వాళ్లు అరుణ్ కుమార్ మహంత, ఎండీ అమీర్ ఖాన్ , పప్పు కుమార్‌గా తెలుస్తోంది. వీళ్లపై హత్యకు సమానం కాని నేరపూరిత నరహత్య కింద, అలాగే.. సాక్ష్యాలను నాశనం చేసిన అభియోగాలు మోపింది సీబీఐ. ఈ ముగ్గురి చర్యలు.. ప్రమాదానికి దారితీశాయని సీబీఐ వర్గాలు చెబుతున్నాయి. తాము చేసిన పని పెనుప్రమాదానికి.. విషాదానికి దారి తీస్తుందనే అవగాహన వాళ్లకు ఉందని సీబీఐ తన నివేదికలో పేర్కొంది. ఇదీ చదవండి: ఒడిశా దుర్ఘటన.. అమీర్ ఖాన్ ఇంటికి సీల్ -
ఒడిశా దుర్ఘటన.. అతడి ఇంటికి సీబీఐ సీల్
ఢిల్లీ/భువనేశ్వర్: ఒడిశా దుర్ఘటనకు సంబంధించి సీబీఐ దర్యాప్తులో ఆసక్తికర పరిణామం ఒకటి చోటు చేసుకుంది. ఈ కేసుకు సంబంధించి ఓ ఇంటికి సోమవారం సీల్ వేసింది దర్యాప్తు సంస్థ. అదే టైంలో బాలాసోర్ యాక్సిడెంట్ హ్యాష్ ట్యాగ్‌తో అమీర్‌ఖాన్ అనే పేరు ట్విటర్లో ట్రెండ్ అవుతోంది. భారతీయ రైల్వేస్‌లో సిగ్నల్ జూనియర్ ఇంజినీర్‌గా పని చేస్తున్న అమీర్ ఖాన్, అతని కుటుంబంతో సహా ఘటన తర్వాత నుంచి కనిపించకుండా పోయాడు. ఈ క్రమంలో సోమవారం హడావిడిగా అతను ఉంటున్న ఇంటికి చేరుకున్న అధికారులు తాళం గమనించాక.. సీల్ వేసి మరీ వెళ్లడం గమనార్హం. ఆపై సోరోలోని తెంటెయ్ ఛక్‌లో ఉన్న బాహానాగా స్టేషన్ మాస్టర్ ఇంటికి సైతం సీబీఐ బృందం వెళ్లింది. అయితే.. ఈ వ్యవహారంలో మరో ఆసక్తికరమైన విషయం ఇప్పుడు బయటకు వచ్చింది. సిగ్నల్ జేఈ అయిన అమీర్ ఖాన్ బాలాసోర్ ప్రమాద ఘటన జరిగిన రీజియన్‌లోనే పని చేస్తున్నాడు. జూన్ 2వ తేదీ రాత్రి బాలాసోర్ రైలు ప్రమాద ఘటన జరగ్గా.. రంగంలోకి దిగిన సీబీఐ సిగ్నల్ జేఈని రహస్య ప్రదేశంలోకి తీసుకెళ్లి మరీ ప్రశ్నించినట్లు తెలుస్తోంది. దర్యాప్తు సంస్థకు అతనిపై అనుమానాలు ఉన్నాయి. అందుకే నిఘా వేసింది. ఆ తర్వాతే అతను కుటుంబంతో సహా కనిపించకుండా పోయాడు. భారతీయ రైల్వేస్‌లో జూనియర్ సిగ్నల్ ఇంజినీర్ పని ఏంటంటే.. పాయింట్ మెషీన్లు, ఇంటర్‌లాకింగ్ సిస్టమ్‌లు, సిగ్నల్‌లతో సహా సిగ్నలింగ్ పరికరాల ఇన్స్టాలేషన్, నిర్వహణ, మరమ్మత్తును చూసుకుటారు. రైలు సేవలను సాఫీగా మరియు సురక్షితంగా నిర్వహించడంలో ఇవే కీలక పాత్ర పోషిస్తాయి. ఎవరీ జేఈ అమీర్ ఖాన్ ఈ ఉదయం నుంచి ట్విటర్లో బాలాసోర్ ప్రమాదం మళ్లీ ట్రెండ్ అవుతోంది. అందుకు జేఈ అమీర్ ఖాన్ కూడా ఓ కారణం. అతని గురించి వివరాలు తెలుసుకునేందుకు చాలామంది ఆసక్తి చూపుతున్నారు. సోరోలో అన్నపూర్ణ రైలు మిల్లు దగ్గర అతని అద్దె ఇల్లు ఉంది. ఒడిశా ఘోర ప్రమాదం తర్వాత అతని కదలికలపై నిఘా వేసింది సీబీఐ. అతని స్వస్థలం ఏంటి? నేపథ్యం ఏంటన్న విషయాలనూ సీబీఐ వెల్లడించడం లేదు. ఇదీ చదవండి: పోస్ట్‌మార్టం చేస్తుండగా.. గుండె కొట్టుకుంది! -
బహనాగా బజార్ దుర్ఘటనపై దర్యాప్తు ప్రారంభించిన సీబీఐ
భువనేశ్వర్: రాష్ట్రంలో సంభవించిన ట్రిపుల్ రైలు ప్రమాదం కేసులో ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) మంగళవారం వెల్లడించింది. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో కోరమాండల్ ఎక్స్‌ప్రెస్, యశ్వంత్‌పూర్–హౌరా ఎక్స్‌ప్రెస్, గూడ్స్ రైలుకు మధ్య జరిగిన ఘోర రైలు ప్రమాదానికి సంబంధించి సంబంధిత అధికారులతో మాట్లాడేందుకు సీబీఐకి చెందిన 10మంది సభ్యుల బృందం సోమవారం రాత్రి ఒడిశాకు చేరుకుంది. ఈ మేరకు ఘటనా స్థలాన్ని అధికారులు పరిశీలించారు. రైల్వేశాఖ అభ్యర్థన మేరకు, ఒడిశా ప్రభుత్వ సమ్మతితో కేసు నమోదు చేసినట్లు దర్యాప్తు వర్గం సభ్యులు తెలిపారు. ఈ దుర్ఘటనకు సంబంధించి బాలాసోర్ ప్రభుత్వ రైల్వే పోలీసు(జీఆర్పీఎస్)లో నమోదు చేసిన కేసులో దర్యాప్తు చేపట్టిందన్నారు. సీఆర్ఎస్ విచారణ.. రైలు దుర్ఘటనలో ప్రాణహాని సంభవించే పరిస్థితుల్లో రైల్వే భద్రతా కమిషనర్(సీఆర్ఎస్) దర్యాప్తు చేపట్టడం నిబంధన. ఈ నేపథ్యంలో ఇటీవల బహనాఘా బజార్ రైల్వే స్టేషన్లో జరిగిన ట్రిపుల్ రైలు దుర్ఘటనలో మృతులు సంభవించిన ఘటనపై సీఆర్ఎస్ విచారణ కోసం రంగంలోకి దిగింది. ఘటనా స్థలంలో ప్రత్యక్షంగా సందర్శించిన అనుబంధ అధికార, సిబ్బంది వర్గాలతో ముఖాముఖి సంప్రదించింది. ఆదివారం ప్రమాద స్థలాన్ని సందర్శించిన రైల్వే భద్రతా కమిషనర్ శైలేష్‌కుమార్ పాఠక్.. కొంతమంది వ్యక్తుల వాంగ్మూలం నమోదు చేశారు. ఇదిలా ఉండగా ఇదో ఉద్దేశపూర్వక ట్యాంపరింగ్ సంఘటనగా ఖుర్దా రోడ్ డివిజనల్ రైల్వే మేనేజర్ రింకేష్రాయ్ మీడియాతో అన్నారు. ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్‌లో మార్పు కారణంగా రైలుప్రమాదం సంభవించిందని.. అయితే ప్రమాదానికి గురైన రైళ్లలో ఒకటైన చైన్నెకి వెళ్లే కోరమండల్ ఎక్స్‌ప్రెస్ లోకోపైలట్(ఎల్పీ), అసిస్టెంట్ లోకోపైలట్ వివరణ ప్రకారం గ్రీన్‌సిగ్నల్ వచ్చినట్లు వెల్లడైందన్నారు. ఈ ఘటనకు వీరివురు ప్రత్యక్ష సాక్షులు. ఈ పరిస్థితుల దృష్ట్యా సిగ్నలింగ్ వ్యవస్థలో ‘ఉద్దేశపూర్వకంగా ట్యాంపరింగ్‘ ఉండవచ్చని డీఆర్ఎం సందేహం వ్యక్తంచేశారు. ఈ ఘటనపై సీబీఐ విచారణకు రైల్వేబోర్డు ఆదివారం సిఫార్సు చేసిన విషయం తెలిసిందే. పరిస్థితులు, పరిసరాలు, నిర్వహణ ఇతరేతర అనుబంధ వర్గాల నుంచి అందిన సమాచారాన్ని పరిగణలోకి తీసుకుని రైల్వేబోర్డు తదుపరి విచారణ, దర్యాప్తు కోసం సీబీఐ విచారణకు సిఫార్సు చేసినట్లు రైల్వేమంత్రి అశ్విని వైష్ణవ్ ఆదివారం స్పష్టం చేశారు. ఈ ఘటనలో 21 కోచ్‌లు ఢీకొని పట్టాలు తప్పడంతో 288 మృతులు నమోదయ్యాయి. వెయ్యి మందికి పైగా గాయపడ్డారు. సమ్మతించిన రాష్ట్రప్రభుత్వం రైలు ప్రమాదంపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం సమ్మతి తెలిపింది. సీబీఐ విచారణకు రాష్ట్ర హోంశాఖ కార్యదర్శి సంతకం చేసిన సమ్మతి లేఖ జారీ చేశారు. ఈనెల 2న బహనాగా బజార్లో కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు ప్రమాదానికి దారితీసిన కారణాలపై సీబీఐ విచారణకు ఒడిశా ప్రభుత్వం తర ఫున అదనపు చీఫ్ సెసీ(హోమ్) డీకే సింగ్ సమ్మతి తెలిపారు. ఈ ప్రమాదం యశ్వంత్‌పూర్ ఎక్స్‌ప్రెస్‌లోని 2 కోచ్‌లను కూడా ప్రభావితం చేసింది. గుర్తించాల్సినవి.. 83 బహనాగా బజార్ స్టేషన్ కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల సంఖ్యలో హెచ్చుతగ్గులు చోటు చేసుకోవడంతో గందరగోళం నెలకొంది. మృతుల జాబితా విస్తృత ధ్రువీకరణ, అనుబంధ వర్గాల సమాచారం, ఘటనా స్థలం ఇతరేతర రంగాల్లో 2రౌండ్ల కూబింగ్ నిర్వహించిన అనంతరం 288మరణాలను నిర్థారించినట్లు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ప్రదీప్‌కుమార్ జెనా మంగళవారం సాయంత్రం వెల్లడించారు. 205 మృతదేహాలను గుర్తించి బంధు వర్గాలకు అప్పగించగా, మరో 83 ఇంకా గుర్తించాల్సి ఉందన్నారు. భువనేశ్వర్‌లో 110, బాలాసోర్‌లో 94, భద్రక్‌లో 1 గుర్తించిన వాటిలో ఉన్నాయి. పలు ప్రాంతాలకు మృత దేహాలను ప్రభుత్వ ఖర్చులతో తరలించారు. అయితే గుర్తించని మృతదేహాల్లో పలు సందర్భాల్లో వివాదం తలెత్తుతోంది. ఒక్కో మృతదేహం కోసం ఒకరి కంటే ఎక్కువ మంది ముందుకు రావడంతో ఈ పరిస్థితి నెలకొంటుంది. వివాదం నుంచి బయట పడేందుకు సందిగ్ధ 83 మృతదేహాలకు డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో అనుబంధ వర్గాల నుంచి సహాయ, సహకారాలు అభ్యర్థించారు. రాష్ట్ర మృతులు 39.. కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో రాష్ట్రం నుంచి 39మంది ప్రయాణికులు మృతిచెందారు. వీరిలో బాలాసోర్ జిల్లా నుంచి 14, మయూర్భంజ్ 9, భద్రక్ 8, కటక్ 3, జాజ్‌పూర్ 2, ఖుర్దా 2, కెంజొహర్ జిల్లా నుంచి ఒకరు మృతి చెందినట్లు ఖరారు చేశారు. ముఖ్యమంత్రి నవీన్ పట్నాయక్ ప్రకటన మేరకు మృతుల కుటుంబీకులకు ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ.1.95 కోట్ల పరిహారం మంజూరు చేశారు. ఒక్కో మృతుని కుటంబానికి రూ.5 లక్షల చొప్పున పరిహారం ప్రకటించిన విషయం తెలిసిందే. పరిహారం పొందడం ఇలా.. ఈనెల 2న బాలాసోర్ జిల్లా బహనాగా బజార్ రైల్వేస్టేషన్లో జరిగిన రైలు ప్రమాదంలో మరణించిన గాయపడిన వ్యక్తుల కుటుంబాలకు రైల్వేశాఖ నష్టపరిహారం ప్రకటించింది. వాస్తవ బాధిత, పీడిత వర్గాలు ఈ పరిహారం లబ్ధిదారులు. పరిహారం పొందేందుకు దశలవారీ క్రమ విధానం ఇలా ఉంది. మృతులు, గాయపడిన వారు, గుర్తు తెలియని మృతదేహాల చిత్రాలతో కూడిన వెబ్సైట్ల లింక్‌లను రైల్వేశాఖ విడుదల చేసింది. మృతదేహాలను ఉంచిన ఆస్పత్రులు, చికిత్స పొందుతున్న, గాయపడిన వ్యక్తుల పేర్లు, చిరునామాలను కూడా ఈ సైట్లో పేర్కొంటాయి. రైల్వేశాఖ మృతుల కుటుంబీకులకు రూ.10 లక్షల పరిహారం చెల్లిస్తుంది. ఈ మొత్తంలో రూ.50వేల నగదు, రూ.9.5 లక్షల చెక్కు అందిస్తారు. తీవ్రంగా గాయపడిన వారికి రూ.5 లక్షలు, స్వల్పంగా గాయపడిన వారికి రూ.50 వేలు చొప్పున పరిహారం పంపిణీ చేస్తారు. మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం కోరమండల్ ఎక్స్‌ప్రెస్ రైలు దుర్ఘటనలో మృతుల గుర్తింపు చర్యలు ముమ్మరం చేస్తున్నారు. మృతుల బంధువులు, ఆత్మీయులు సులువుగా గుర్తించేందుకు పలు రకాల సన్నాహాలు చేశారు. ఈ చర్యలు అంతంత మాత్రంగా ఫలప్రదమయ్యాయి. ఇదిలా ఉండగా మృతదేహాల కోసం పలువురు ముందుకు రావడంతో పరిస్థితి మరింత బిగుసుకుంది. ఈ నేపథ్యంలో మృతదేహాలను దీర్ఘకాలం తాజాగా ఉంచేందుకు శక్తివంతమైన కంటైనర్లు వంటి సాంకేతిక సదుపాయాలతో మృతుల వివరాలు ప్రదర్శన వంటి సన్నాహాలు చేపట్టారు. వీటిపై వివాదం తలెత్తడంతో మృతులు, బంధువర్గాల డీఎన్ఏ పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈ మేరకు స్థానిక అఖిల భారత వైద్యవిజ్ఞాన సంస్థ(ఎయిమ్స్) ప్రాంగణంలో డీఎన్ఏ పరీక్షల కేంద్రం ఏర్పాటు చేశారు. 10మంది వ్యక్తులు డీఎన్ఏ పరీక్షలకు ముందుకు వచ్చారు. వీరిలో 5మంది పరీక్షలు పూర్తి చేసినట్లు అనుబంధ వర్గాలు తెలిపాయి. సచివాలయ సేవాసంఘం.. బాధితుల సహాయార్థం రాష్ట్ర సచివాలయ సేవాసంఘం రూ. 2.50 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించారు. ఈ మేరకు సేవాసంఘం సభ్యుల బృందం ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో సీఎస్ ప్రదీప్ జెనాతో భేటీ అయ్యారు. బాధితులకు సాయం.. రైలు ప్రమాద బాధితుల సహాయార్థం ఒడిశా వెటర్నరీ సర్వీసెస్ అసోసియేషన్ రూ.20 లక్షలను ముఖ్యమంత్రి సహాయ నిధికి అందించింది. అసోసియేషన్ సభ్యులు ప్రత్యేక సహాయ కమిషనర్ కార్యాలయంలో చీఫ్ సెక్రటరీ ప్రదీప్‌కుమార్ జెనాకు దీనికి సంబంధించిన చెక్కును అందజేశారు. వెబ్‌పోర్టల్ వివరాలు: ► ఘోర ప్రమాదంలో మరణించిన వ్యక్తుల చిత్రాలను https://srcodisha.nic.in వెబ్సైట్లో చూడవచ్చు. ► వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న, గాయపడిన ప్రయాణికుల పేర్లను తెలుసుకునేందుకు https://www.bmc.gov.in ► కటక్ ఎస్సీబీ మెడికల్ కశాశాల ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న గుర్తు తెలియని వ్యక్తుల ఫోటోల వివరాలు ఈ క్రింది వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. ► https://www.bmc.gov.in/train&accident/ download/Un&identified&person&under&treatment&atSCB&Cuttack.pdf ► ప్రభావిత వర్గలు ప్రటకించిన నష్టపరిహారం పొందేందుకు క్రమ పద్ధతిలో అనుబంధ వర్గాలను సంప్రదించాల్సి ఉంది. ► తొలుత మృతదేహం భద్రపరిచిన ఆస్పత్రిని సంప్రదించాలి. ఈ మేరకు రైల్వేశాఖ జారీ చేసిన జాబితాను పరిగణలోకి తీసుకోవాలి. ► బాధితులతో తమ సంబంధాన్ని ధ్రువీకరించే పత్రాలు దాఖలు చేయాలి. ► అభ్యర్థన మేరకు దాఖలు చేసిన పత్రాలను పరిశీలించిన మేరకు ధ్రువీకరించిన తరువాత మృతదేహాన్ని అప్పగిస్తారు. ► ఈ సందర్భంగా ఆస్పత్రి అధికారులు డిశ్చార్జి సర్టిఫికెట్ జారీ చేస్తారు. ► తదుపరి పరిహారం పొందేందుకు డిశ్చార్జ్ సర్టిఫికెట్తో పాటు అవసరమైన దరఖాస్తు దాఖలు చేయాల్సి ఉంటుంది. ► మృతుల రక్త సంబంధీకులకు మాత్రమే పరిహారం చెల్లిస్తారు. వివాహిత జంట(దంపతులు) విషయంలో భర్త లేదా భార్యకు మాత్రమే పరిహారం ముడుతుంది. రైల్వే సిబ్బంది ప్రస్తావన లేదు: సీబీఐ 288 మంది మృతికి కారణమైన బాలాసోర్ రైలు ప్రమాదంలో నమోదైన ఎఫ్ఐఆర్ వివరాలను సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ) లోతుగా పరిశీలించినట్లు మంగళవారం తెలిపింది. ఎఫ్ఐఆర్ దాఖలు సమయానికి నిర్దిష్ట రైల్వే ఉద్యోగుల నేరం నిర్థారించలేదు. తదుపరి దర్యాప్తు సమయంలో ఈ అంశం నిర్థారిస్తామని పేర్కొంది. కటక్ ఓపీఎస్ ఎస్డీఆర్పీఓ రంజిత్ నాయక్ లిఖిత పూర్వకంగా ఫిర్యాదు చేయడంతో ఈ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఎస్సీబీలో ఎల్ఈడీ ప్రదర్శన కటక్ ఎస్సీబీ వైద్య బోధన ఆస్పత్రి ప్రాంగణంలో ఎల్ఈడీ టీవీ ప్రదర్శన ప్రారంభించారు. ఈ ప్రాంగణంలో జిల్లా యంత్రాంగం ఆధ్వర్యంలో హెల్ప్‌డెస్క్, సమాచార కేంద్రాలు పని చేస్తున్నాయి. ఇప్పటి వరకు ఎవరూ గుర్తించని బాధితుల బంధు వర్గాలు ముందుకు వచ్చేందుకు వీలుగా ఆస్పత్రి ఆవరణలో చికిత్స పొందుతున్న వారి ఫొటోలను ఎల్ఈడీ టీవీలో ప్రదర్శిస్తున్నారు. బాధితుల వివరాలతో సమగ్ర జాబితా ఈ ప్రదర్శనలో లభ్యమవుతోంది. -
బాలాసోర్ ఘటనపై సీబీఐ ఎఫ్ఐఆర్
భువనేశ్వర్: బాలాసోర్ రైలు ప్రమాద దుర్ఘటనపై సీబీఐ దర్యాప్తు మొదలైంది. మంగళవారం ఉదయం ఘటనా స్థలానికి టెక్నికల్ టీంతో పాటుగా చేరుకున్నారు సీబీఐ అధికారులు. ఆపై ఐపీసీలోని వివిధ సెక్షన్ల ప్రకారం.. సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. ఈ ఉదయం ప్రమాదం జరిగిన రైల్వే ట్రాక్, సిగ్నల్ రూమ్‌ను సీబీఐ అధికారుల బృందం పరిశీలించింది. ఆపై ప్రమాద స్థలికి దగ్గర్లో ఉన్న బహనాగా బజార్ రైల్వే స్టేషన్‌కు చేరుకుని.. అక్కడి అధికారులతో మాట్లాడి వివరాలు సేకరించింది. ఆపై రైల్వే పోలీసులు నమోదు చేసిన కేసు ఆధారంగానే సీబీఐ ఎఫ్ఐఆర్ నమోదు చేసినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. ఒడిశా పోలీసులు ఇదివరకే ఈ ప్రమాద ఘటనపై కేసు ఫైల్ చేశారు. నిర్లక్ష్యం, ప్రాణ హాని తలపెట్టడం లాంటి అభియోగాలను అందులో నమోదు చేశారు.ఇంటర్ లాకింగ్ సిస్టమ్ మార్చడమే ప్రమాదానికి కారణమని రైల్వే శాఖ ఇదివరకే ప్రకటించుకుంది. ఈ కోణంలోనే సీబీఐ దర్యాప్తు కొనసాగనుందని తెలుస్తోంది. సిగ్నల్ ఫెయిలా? మరేదైనా కారణమా? అనే కోణాల్లో దర్యాప్తు కొనసాగుతోంది. మరోవైపు ఈ ఘటనపై భద్రతా కమిషన్ విచారణ కొనసాగుతోంది. మానవ తప్పిదమా? విధ్వంసమా? లేదంటే సాంకేతిక తప్పిదామా?.. సీబీఐ దర్యాప్తులో ఏం తేలనుందో చూడాలి. జూన్ 2వ తేదీ సాయంత్రం ఏడు గంటల ప్రాంతంలో జరిగిన మూడు రైళ్ల ఢీ ఘోర ప్రమాదం.. 278 మంది బలిగొంది(ఇప్పటివరకు). మరో 800 మంది గాయలపాలయ్యారు. ఇదీ చదవండి: ఒడిశా ఘటన.. అయినవాళ్లు ఎక్కడ? -
ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ విచారణ ఎదుర్కొంటున్న కడప ఎంపీ అవినాష్ రెడ్డికి.. తెలంగాణ హైకోర్టులో ఊరట లభించింది. ఈ కేసులో ఆయనకు ముందస్తు బెయిల్ మంజూరు చేసింది ఉన్నత న్యాయస్థానం. ముందస్తు బెయిల్ కోసం ఆయన దాఖలు చేసుకున్న పిటిషన్‌పై ఇవాళ తుది తీర్పు వెలువరించిన హైకోర్టు వెకేషన్ బెంచ్.. బెయిల్ మంజూరు చేస్తున్నట్లు ప్రకటించింది. అవినాష్‌రెడ్డి లాయర్ల వాదనలతో ఏకీభవించిన హైకోర్టు బెంచ్.. షరతులతో కూడిన బెయిల్ అవినాష్‌రెడ్డికి మంజూరు చేస్తున్నట్లు స్పష్టం చేసింది. అదే సమయంలో వివేకా కేసులో అవినాష్ రెడ్డి కస్టడీ విచారణ అవసరం లేదని బెంచ్ సీబీఐ తరపు న్యాయవాదులతో స్పష్టం చేసింది. హైకోర్టు ఆర్డర్కాపీలో ఏముందంటే.. 30 పేజీల హైకోర్టు ఆదేశాల్లో హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. అవినాష్‌రెడ్డిపై ఆరోపణలు మాత్రమే కనిపిస్తున్నాయి. అవినాష్‌రెడ్డికి వ్యతిరేకంగా ఒక్క ఆధారం కూడా చూపించలేకపోయారు. సీబీఐ ఎలాంటి ఆధారాలు సేకరించలేకపోయింది. సాక్ష్యాలను తారుమారు చేశారనడానికి కూడా ఎవిడెన్స్ లేవు. చెప్పుడు మాటల ఆధారంగా సీబీఐ దర్యాప్తు చేసింది. ఊహాజనితమైన విచారణ మాత్రమే సాగింది. ఈ తరుణంలో.. కస్టోడియల్ విచారణ అవసరం లేదని భావిస్తున్నాం. అవినాష్‌రెడ్డికి షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తున్నాం. హైకోర్టు షరతులివే ► అవినాష్‌రెడ్డిని గనుక అరెస్టు చేసినట్లయితే.. రూ. 5 లక్షల పూచీకత్తుతో బెయిల్ పై విడుదల చేయాలి ► సీబీఐ అనుమతి లేకుండా అవినాష్ రెడ్డి దేశం విడిచి వెళ్లరాదు. ► సాక్షులను అవినాష్ రెడ్డి ప్రభావితం చేయకూడదు. ► సీబీఐ దర్యాప్తునకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరించాలి. ► ప్రతి శనివారం ఉ.10 నుంచి సా.5 వరకు అవినాష్ రెడ్డి సీబీఐ ఎదుట హాజరుకావాలి ► అవసరమని CBI భావించినప్పుడు విచారణకు అవినాష్ రెడ్డిని పిలవచ్చు పైషరతులు ఉల్లంఘిస్తే బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరవచ్చు. ఆ ఛానెల్స్ డిబేట్‌పై అభ్యంతరం ఇక ఏబీఎన్ ఆంధ్రజ్యోతి, మహా టీవీ ఛానెల్స్‌లో తాజాగా వివేకా కేసు పరిణామాలపై జరిగిన డిబేట్లో న్యాయమూర్తికి డబ్బుల సంచులు వెళ్లాయంటూ ఓ సస్పెండెడ్ మెజిస్ట్రేట్ చేసిన వ్యాఖ్యలపైనా.. హైకోర్టు న్యాయమూర్తి సీరియస్ అయ్యారు. ఆ చర్చకు సంబంధించిన వీడియోలను కోర్టును సమర్పించాలని ఆదేశాలు జారీ చేశారు. ‘‘నా వ్యక్తిగత ప్రతిష్టను దెబ్బతీసే విధంగా కథనాలు ప్రచారం చేశాయి. మీడియా ఛానల్ డిబేట్ లో కొంత మంది వ్యక్తుల ద్వారా నాపై ఆరోపణలు చేయించారు’’ అంటూ ఆర్డర్ కాపీలో వ్యాఖ్యానించారు న్యాయమూర్తి. ‘‘‘మీడియా అంటే మాకు పూర్తి గౌరవం ఉంది. మీడియా స్వేచ్చకు మేం అడ్డంకి కాదు. కానీ, కొన్ని మీడియా సంస్థలు వ్యక్తిత్వ హననానికి పాల్పడ్డాయి. మీడియా కథనాలు చూసి ఒక స్థాయిలో నేను ఈ కేసు విచారణ నుండి తప్పుకోవాలనుకున్నాను. సస్పెండ్ అయ్యి ఒక జడ్జ్ నాకు డబ్బు సంచులు వచ్చాయని అసత్య ప్రచారం చేయడం బాధాకరం. సుప్రీంకోర్టు ఆదేశాలు ఉన్నాయి కాబట్టి విచారణ జరిపి తీర్పు వెల్లడించాను. ఆయా డిబేట్ల వీడియోలను కోర్టుకు సమర్పించండి. చీఫ్ జస్టిస్ ఆ వీడియోలపై ఎలాంటి చర్యలు తీసుకోవాలో నిర్ణయిస్తారు అని హైకోర్టు జడ్జి పేర్కొన్నారు. హైకోర్టు ఉత్తర్వుల కాపీ కోసం క్లిక్ చేయండి అనేక మలుపులు.. ఈ కేసులో ముందస్తు బెయిల్ కోసం ఏప్రిల్ 17వ తేదీన అవినాష్‌రెడ్డి తెలంగాణ హైకోర్టును ఆశ్రయించారు. అయితే అప్పటి నుంచి ఆ పిటిషన్‌పై విచారణ అనేక మలుపులు తిరిగింది. చివరికి.. సుప్రీం కోర్టు జోక్యంతో ఎట్టకేలకు ఆయన ఊరట లభించింది. అవినాష్‌రెడ్డికి బెయిల్ పిటిషన్ వేసే హక్కు ఉందని, పిటిషన్‌పై వాదనలు వినాలని సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించిన నేపథ్యంలో.. అందుకు అనుగుణంగా వాదనలు వింది తెలంగాణ హైకోర్టు వేకేషన్ బెంచ్. వైఎస్ వివేకానందరెడ్డి హత్యకేసు విచారణలో భాగంగా.. సీబీఐ ఎదుట అవినాష్ రెడ్డి ఇప్పటికే ఏడుసార్లు హాజరయ్యారు. అయితే తల్లి అనారోగ్యం కారణంగా ఈ నెల 22వ తేదీన విచారణకు మాత్రం హాజరు కాలేదు. సీబీఐ విచారణలో ఇప్పటిదాకా తాను సహకరిస్తూ వస్తున్న విషయాన్ని ప్రస్తావించిన ఆయన.. తల్లి బాగోగులు చూసుకోవడానికి గడువు కోరుతూ సీబీఐకి విజ్ఞప్తి లేఖ రాశారు. సుప్రీంకోర్టు ఆదేశాలతో అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణ జరిపిన తెలంగాణ హైకోర్టు.. పలు కీలక వ్యాఖ్యలు చేసింది. సీబీఐకి పలు ప్రశ్నలను సంధించింది. ఇదీ చదవండి: అవినాష్‌రెడ్డిని టార్గెట్ చేయడం సరికాదు! -
ఓఆర్ఆర్ టెండర్‌పై రఘునందన్ సంచలన ఆరోపణలు, సీబీఐకి ఫిర్యాదు
సాక్షి, హైదరాబాద్: ఔటర్ రింగ్ రోడ్డు టెండర్ లో అవినీతి అక్రమాలు జరిగాయని బీజేపీ ఎమ్మెల్యే రఘునందన్ రావు ఆరోపించారు. ఈ మేరకు ఓఆర్ఆర్ టెండర్ పైన సీబీఐకి ఫిర్యాదు చేశారు. కేటీఆర్, మున్సిపల్ శాఖ స్పెషల్ సెక్రెటరీ అరవింద్ కుమార్ లు అప్పనంగా ఐఆర్బీ సంస్థకు టెండర్ అప్పగించారని దుయ్యబట్టారు. ఔటర్ రింగు రోడ్డు టెండర్ లో అవినీతి జరిగిందని గతంలోనే ఈడీకి ఎమ్మెల్యే రఘునందన్ రావు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే దర్యాప్తు సంస్థలు విచారణకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. ఐఆర్బీ డెవలపర్స్ సంస్థకు వ్యతిరేకంగా మాట్లాడితే మనుషుల్నే లేకుండా చేస్తున్నారని రఘునందన్ రావు ఆరోపించారు. ఆ సంస్థకు వ్యతిరేకంగా పోస్టులు పెడితే బెదిరిస్తున్నారని అన్నారు. ఔటర్ రింగ్ రోడ్డు టోల్గేట్ విషయంపై సీఎం కేసీఆర్ ఎందుకు స్పందిచడం లేదని ఎమ్మెల్యే ప్రశ్నించారు. (చదవండి: ప్రైవేటుకు ఓఆర్ఆర్!.. 30 ఏళ్లకు లీజుకిచ్చిన కేసీఆర్ సర్కార్) 'ఓఆర్ఆర్ టెండర్ అంశంపై బీజేపీ ఎందుకు ప్రశ్నించట్లేదని ఇటీవల కొందరు విమర్శిస్తున్నారు. ఓఆర్ఆర్ టోల్గేట్ అంశంపై మా పార్టీ చాలారోజులుగా ప్రశ్నిస్తోంది' అని రఘునందన్ రావు చెప్పారు. వేసవి సెలవుల తరువాత దీనిపై న్యాయ స్థానాన్ని ఆశ్రయిస్తామని పేర్కొన్నారు. ఇటీవల ఓఆర్ఆర్ను 30 ఏళ్ల పాటు లీజుకు ఇచ్చింది తెలంగాణ ప్రభుత్వం. ఐఆర్బీ ఇన్ఫ్రాస్ట్రక్చర్స్ డెవలపర్స్ అనే సంస్థ ఈ టెండర్‌ను దక్కించుకుంది. అయితే ఈ ఎపిసోడ్లో భారీ స్కామ్ జరిగిందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఐఆర్బీ సంస్థ నేర చరిత్ర కలిగిందని విమర్శిస్తున్నాయి. మరోవైపు పారదర్శకంగానే టెండర్ల ప్రక్రియ జరిగిందని ప్రభుత్వం చెబుతోంది. (చదవండి: HYD ORR: ఓఆర్ఆర్ 30 ఏళ్ల లీజుకి రూ. 8వేల కోట్లు: రేసులో ఆ నాలుగు కంపెనీలు) -
సీబీఐ నూతన డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన ప్రవీణ్ సూద్
సాక్షి, న్యూఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) నూతన డైరెక్టర్‌గా సీనియర్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్ గురువారం బాధ్యతలు చేపట్టారు. ఆయన ఇంతకుముందు కర్ణాటక డీజీపీగా పనిచేశారు. సీబీఐ డైరెక్టర్ గురించి మరిన్ని విషయాలు ► 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారి ప్రవీణ్ సూద్, నిన్నటివరకు కర్ణాటక డీజీపీగా సేవలందించారు. ► సీబీఐ కొత్త డైరెక్టర్ పదవిలో ఆయన రెండేళ్ల పాటు కొనసాగుతారు. ► ప్రవీణ్ సూద్ ఐఐటీ ఢిల్లీలో ఇంజినీరింగ్ చదివారు. ఆ తర్వాత UPSC ద్వారా IPS సర్వీసులోకి వచ్చారు. ► కర్ణాటక పోలీస్ శాఖలో పలు ఉన్నత పదవులు నిర్వహించారు. ► 1989లో మైసూరు ఏఎస్పీగా బాధ్యతలు, అనంతరం బళ్లారి, రాయచూరు ఎస్పీగా, ఆ తర్వాత బెంగళూరు డీసీపీగా పని చేశారు. ► 1999లో డిప్యుటేషన్ మీద మారిషస్ లో మూడేళ్ల పాటు పనిచేశారు. ► 2004-2007 మధ్య మైసూరు కమిషనర్ గా పని చేశారు. ► ఆ తర్వాత కర్ణాటక హోం శాఖ ముఖ్య కార్యదర్శిగా, అడిషనల్ డీజీపీగా, రిజర్వ్ పోలీస్ ఫోర్స్ అడిషనల్ డైరెక్టర్ జనరల్ గానూ వ్యవహరించారు. ► ఢిల్లీ స్పెషల్ పోలీస్ ఎస్టాబ్లిష్మెంట్ యాక్ట్ 1946 కింద CBI (సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్) ఏర్పాటు అయింది కాబట్టి ఆ చట్టం 4A కింద డైరెక్టర్ బాధ్యతలు స్వీకరించారు. ► ప్రవీణ్ సూద్‌కు సంబంధించిన మరో ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. సూద్ అల్లుడే టీం ఇండియా క్రికెట్ బ్యాట్స్‌మన్ మయాంక్ అగర్వాల్. ► ప్రవీణ్ సూద్ పలు విశిష్ట పురస్కారాలు, అవార్డులు అందుకున్నారు. సంవత్సరం పురస్కారం 1996 చీఫ్ మినిస్టర్ గోల్డ్ మెడల్ 2002 పోలీస్ మెడల్ 2006 ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్ 2011 ప్రిన్స్ మైఖైల్ ఇంటర్నేషనల్ రోడ్ సేఫ్టీ అవార్డు 2011 నేషనల్ e-గవర్నెన్స్ గోల్డ్ మెడల్ -
ఓవరాక్షన్ సరే!.. అప్పుడేమైంది గురివింద బాబు?
‘ఆంధ్రప్రదేశ్‌లో చిత్ర విచిత్రమైన రాజకీయం నడుస్తోంది. అది బయటి వారికి చాలా అసహ్యంగానూ అనిపిస్తోంది. రాజకీయాలు మరీ ఇంతలా దిగజారిపోవాలా? అనిపిస్తోందంటున్నారు రాజకీయ పండితులు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుకు సంబంధించి.. అవినాష్ రెడ్డిని సిబిఐ ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి? సిబిఐ ఇంత బలహీనంగా ఉందా? అంటూ ఏపీలో ప్రధాన ప్రతిపక్షమైన తెలుగుదేశం పార్టీ ప్రశ్నిస్తోంది. టిడిపి అనుకూల మీడియాల్లో డిబేట్స్ చూస్తోంటే సీబీఐ అరెస్ట్ చేయకపోతే మీడియా ప్రతినిథులే వెళ్లి అవినాష్ ను అరెస్ట్ చేసేలా కనిపిస్తున్నారు. ఇటువంటి ట్రెండ్ గతంలో ఎన్నడూ చూడలేదంటున్నారు రాజకీయ విశ్లేషకులు.‘ ఏపీలో 2019 ఎన్నికలకు కొద్ది నెలల ముందు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డికి స్వయానా చిన్నాన్న అయిన వై.ఎస్.వివేకానంద రెడ్డి హత్య జరిగింది. ఈ హత్య జరిగే నాటికి ఏపీలో చంద్రబాబు నాయుడు అధికారంలో ఉన్నారు. కొంతకాలంగా ఈ హత్య కేసు విచారణ ముమ్మరంగా సాగుతోంది. హత్యకేసులో ప్రధాన నిందితులను విచారించిన సీబీఐ.. ఆ తర్వాత మరి కొందరిని పిలిచి విచారిస్తోంది. ఈ క్రమంలో భాగంగా వివేకా మరో సోదరుడు వైఎస్ భాస్కర రెడ్డి తో పాటు ఆయన తనయుడు.. కడప ఎంపీ అయిన అవినాష్ రెడ్డిని సీబీఐ విచారించింది. భాస్కర రెడ్డిని రిమాండ్ లో తీసుకున్న సీబీఐ.. అవినాష్ రెడ్డిని ఇప్పటికే పలు దఫాలు విచారించింది. తాజాగా మరోసారి విచారణకు పిలిచింది. అయితే.. అవినాష్ రెడ్డి తల్లికు గుండెపోటు రావడంతో ఆమెను ఆసుపత్రిలో చేర్పించేందుకు వెళ్లాల్సి రావడం.. తాను విచారణకు రాలేనని అవినాష్ రెడ్డి సిబిఐ కి లేఖ రాశారు. అదే సమయంలో సుప్రీం కోర్టులో పిటిషన్ దాఖలు చేసిన తన బెయిల్ పిటిషన్ ను విచారించాల్సిందిగా తెలంగాణ హైకోర్టును ఆదేశించాలని కోరారు. అవినాష్ రెడ్డి తల్లికి కర్నూలు లోని ఓ ఆసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. ప్రస్తుతం ఆమె ఆరోగ్య పరిస్థితి క్రిటికల్ గా ఉందని వైద్యులు కూడా బులెటిన్ విడుదల చేశారు. ఐసీయూ లో కొద్ది రోజులు చికిత్స అందించాల్సి ఉంటుందని వారు స్పష్టం చేశారు. తన తండ్రి భాస్కర రెడ్డి అరెస్ట్ అయి ఉన్నందున తన తల్లిని తానే చూసుకోవాలి కాబట్టి ఈ నెల 27 వరకు తనకు గడువు నివ్వాలని.. ఆ తర్వాత తాను విచారణకు హాజరవుతానని అవినాష్ రెడ్డి సిబిఐకి రాసిన లేఖలో కోరారు. అంతే.. ఈ వార్తలు మీడియాలో ప్రసారం అవుతుండగానే అటు టీడీపీ నేతలు, ఇటు టీడీపీ అనుకూల ఛానెళ్లూ కూడా.. ‘‘అదేంటీ?.. అవినాష్ రెడ్డిని ఇంకా అరెస్ట్ చేయకపోవడం ఏంటి?.. ఏం! సీబీఐ మరీ అంత బలహీనంగా ఉందా?’’ అంటూ డిబేట్స్ నడపడం మొదలు పెట్టారు. అటు టిడిపి నేతలు అవినాష్ రెడ్డిని తక్షణమే అరెస్ట్ చేయాలంటే డిమాండ్లు చేయడం మొదలు పెట్టారు. సీబీఐకి రాష్ట్ర ప్రభుత్వం ఏ మాత్రం సహకరించకపోగా.. వ్యతిరేకంగా పావులు కదుపుతోందంటూ కొన్ని పత్రికలు కథనాలు ప్రచురించాయి. దీనిపై న్యాయ రంగ నిపుణులు మండి పడుతున్నారు. 👉 ‘అసలు ఎవరిని అరెస్టు చేయాలి?..’ అది చెప్పడానికి మీడియా ఎవరు? సీబీఐ ఎవరిని అరెస్ట్ చేయాలో ఎప్పుడు అరెస్ట్ చేయాలో అసలు చేయాలో చేయకూడదో మీడియా చెప్పడం ఏంటి? దర్యాప్తు సంస్థకు దమ్ము ఉందా లేదా అన్నది కూడా మీడియానే తేల్చేయడం ఏంటి? తమ రాజకీయ ప్రత్యర్ధులు అయితే వెంటనే అరెస్ట్ చేసేయాలి అదే తమపై కేసులు వచ్చి తమని అరెస్ట్ చేస్తే రాజకీయంగా కక్షసాధిస్తారా? అంటూ దబాయింపు సెక్షన్ విరుచుకు పడిపోతారు . ఇదేం పద్ధతి? అంటున్నారు న్యాయ రంగ నిపుణులు. 👉 వివేకా హత్య కేసులో అవినాష్ రెడ్డి నిందితుడు కారు. ఆయనపై ఉన్న అభియోగం అల్లా హత్య జరిగిన తర్వాత సాక్ష్యాలు తారు మారు చేయించారని. అది కూడా ఆయన చేశారని కాదు. అసలు వివేకానంద రెడ్డిని హత్య చేసిన ప్రధాన నిందితుడు దస్తగిరి బెయిల్ పై హాయిగా బయట తిరుగుతున్నాడు. అనుమానాలు మాత్రమే ఉన్న అవినాష్ రెడ్డిని మాత్రం.. తక్షణమే అరెస్ట్ చేసేయాలంటూ టీడీపీ నేతలు పట్టుబడుతున్నారు. కేంద్ర దర్యాప్తు సంస్థకు రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదంటూ ఓ పత్రిక రాసి పారేసింది. నిజానికి సీబీఐ ఇంత వరకు దీనిపై ఎలాంటి ప్రెస్ నోట్ రిలీజ్ చేయలేదు. ప్రభుత్వంపై కానీ అవినాష్ రెడ్డిపై కానీ ఎలాంటి ఫిర్యాదులూ చేయలేదు. అవినాష్ రెడ్డి అడిగింది కూడా నాలుగు రోజుల పాటు విచారణకు గడువు ఇమ్మనమనే. అది కూడా తల్లి ఆరోగ్యం బాగా లేదు కాబట్టి. అయితే టీడీపీ నేతలు.. వారి అనుకూల ఛానెళ్లు సీబీఐకి ఏదో అపచారం జరిగిపోతోన్నట్లు.. ధర్మాన్ని ఎవరో అడ్డుకుంటోన్నట్లు గగ్గోలు పెట్టేస్తున్నారు. 👉 కేంద్ర దర్యాప్తు సంస్థ అయిన సీబీఐకి సహకరించకపోవడం క్షమించరాని నేరం అంటున్న ఆ పత్రిక.. గతంలో చంద్రబాబు నాయుడు, ఇదే సీబీఐ ఏపీలో అడుగు పెట్టనివ్వకుండా ఏకంగా జీవో జారీ చేస్తే అపుడు సిబిఐ దుర్మార్గమైన దర్యాప్తు సంస్థ అన్నట్లు.. కేంద్ర ప్రభుత్వ కనుసన్నల్లో పనిచేస్తోందన్నట్లు కథనాలు వండి వార్చింది. అపుడు టిడిపి నేతలు కూడా సీబీఐని పనికిమాలిన సంస్థగా ఏకి పారేశారు. ఇపుడు తాము ప్రతిపక్షంలోకి వచ్చే సరికి తమ ప్రత్యర్ధులపై ఓ కేసు వచ్చింది కాబట్టి టిడిపి నేతలు ఇపుడు సిబిఐని కీర్తిస్తున్నారని న్యాయ రంగ నిపుణులు ఆరోపిస్తున్నారు. ఇక తన తల్లి ప్రాణాపాయ స్థితిలో ఉందని అవినాష్ అంటోంటే ‘అదంతా నాటకం.. డ్రామా..’ అంటూ టీడీపీ నేతలు, మాజీ మంత్రులు ప్రచారం చేస్తున్నారు. ‘‘2019లో టిడిపి ప్రతిపక్షంలోకి జారుకున్నాక వారి హయాంలో చేసిన అవినీతికి సంబంధించిన కేసుల్లో పోలీసులు అరెస్ట్ చేసే సందర్భాల్లో టిడిపి నేతలు కూడా ఆసుపత్రుల్లో చేరారు. అచ్చెంనాయుడు అయితే తనకి పైల్స్ ఆపరేషన్ అయ్యిందని నెలల తరబడి ఆసుపత్రి బెడ్ దిగలేదు. అది కూడా ప్రభుత్వ ఆసుపత్రికి పోనని చెప్పి టిడిపి అనుకూల వర్గీయులది అయిన రమేష్ హాస్పిటల్ లో ఆయన కాలక్షేపం చేసి విచారణ నుండి తప్పించుకున్నారు. వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ తరపున ఎంపీగా గెలిచి.. టిడిపి తరపున వ్యవహారాలు నడుపుతోన్న రఘురామ కృష్ణం రాజు కులాల మధ్య చిచ్చు రేపేలా వ్యాఖ్యలు చేశారని కేసు నమోదు చేసి అరెస్ట్ చేస్తే తనని కొట్టేశారంటూ ఆరోపణలు చేసి బెయిల్ తెచ్చుకుని తనకు అనుకూలంగా ఉండే ఆర్మీ ఆసుపత్రిలో చికిత్స పొందారే తప్ప ఏపీలోని ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందలేదు. మార్గదర్శి చిట్స్ లో అక్రమాలు జరుగుతున్నాయన్న ఆరోపణలపై సిఐడీ అధికారులు సోదాలకు వెళ్లినపుడు ఆ సంస్థ అధినేత రామోజీ రావు అమాంతం మంచం పై పడుక్కుని ఆరోగ్యం బాగా లేదని చెప్పుకున్నారు. విచారణకు కూడా సిద్ధంగా లేనని చెప్పించారు. అయితే అలాగని లిఖిత పూర్వకంగా రాసి ఇస్తారా అని డాక్టర్లను సిఐడీ అధికారులు అడగడంతో వాళ్లు నీళ్లు నమిలి విచారణకు హాజరు కావచ్చునని ఒప్పుకున్నారు. టిడిపి నేత సినీ నటుడు నందమూరి బాలకృష్ణ నివాసంలో ఓ సినీ నిర్మాతపై తుపాకీతో కాల్పులు జరిపిన ఘటనలో బాలయ్యను అరెస్ట్ చేయాల్సి వచ్చినపుడు అమాంతం బాలయ్యకు మానసిక పరిస్థితి బాగా లేదని మతి చలించిందని వైద్యుల చేత సర్టిఫికెట్ పుట్టించుకుని అరెస్ట్ నుండి తప్పించుకున్నారు.’’ ఇపుడు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు వీటినే గుర్తు చేస్తున్నారు. అప్పట్లో.. ఆస్పత్రిలో అచ్చెన్న 👉 టిడిపి నేతలను అరెస్ట్ చేసే సందర్భాల్లో వాళ్లకి మాయరోగాలు వస్తాయి.. వాళ్లు తమకు అనుకూలమైన ఆసుపత్రులనే ఆశ్రయిస్తారు.. చివరకు బెయిల్ కోసం విశ్వ ప్రయత్నాలు చేస్తారు.. అదే అవినాష్ రెడ్డి తల్లి పరిస్థితి బాగా లేక విచారణకు సమయం కావాలని అడిగితే ఆయన్ను ఎందుకు అరెస్ట్ చేయరు? అంటూ టిడిపి నేతలు, టిడిపి అనుకూల పత్రికలు ప్రశ్నించడంలో అర్ధం లేదని పాలక పక్ష నేతలు అంటున్నారు. చంద్రబాబు నాయుడిపై పలు అవినీతి ఆరోపణలు ఉన్నాయి. ఆ కేసుల్లో విచారణలు జరక్కుండా చంద్రబాబు స్టేలు తెచ్చుకుని కాలక్షేపం చేస్తున్నారు. అటువంటి చంద్రబాబు నాయుడి పార్టీ నేతలు గురివింద గింజలాగా నీతులు చెప్పడం విడ్డూరంగా ఉందంటున్నారు వై.ఎస్.ఆర్.కాంగ్రెస్ నేతలు. 👉 ప్రస్తుతానికి అవినాష్ రెడ్డి బెయిల్ పిటిషన్ పై సమగ్ర దర్యాప్తు చేయాల్సిందిగా తెలంగాణా హై కోర్టును సుప్రీం కోర్టు ఆదేశించింది. హై కోర్టు వెకేషన్ బెంచ్ ను ఆశ్రయించాల్సిందిగా అవినాష్ రెడ్డి తరపు న్యాయవాదులను సూచించింది. ఈఘటనలో టిడిపి నేతలతో సమానంగా మీడియా ప్రతినిథులు కూడా తామే న్యాయమూర్తులు అయినట్లు, దర్యాప్తు సంస్థల అధికారులు అయినట్లు విచారించేసి తీర్పులు ఇచ్చేస్తున్నారనే చర్చ కూడా ఒకటి నడుస్తోంది. ఈ పద్ధతి మారాలని అంటున్నారు కొందరు. అసలు సీబీఐని ఏపీలోకి అనుమతించాలా? అడ్డుకోవాలా? అన్న అంశంపై టిడిపి నేతలు తమ వైఖరి ఏంటో ఇప్పటికైనా స్పష్టం చేయాలంటున్నారు పాలక పక్ష నేతలు. అధికారంలో ఉంటే ఒకలాగ ప్రతిపక్షంలో ఉంటే అందుకు పూర్తి భిన్నంగా యూటర్నులు తీసుకోవడం చంద్రబాబు నాయుడికి మొదట్నుంచీ అలవాటే అంటున్నారు రాజకీయ పండితులు. ::: CNS యాజులు, సాక్షి టీవీ ఇదీ చదవండి: ఆ టీడీపీ ఎమ్మెల్యే వస్తే ఊరంతా హడల్! -
వివేకా లేఖపై సునీతకు సీబీఐ ప్రశ్నలు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సీబీఐ దర్యాప్తు వేగం పుంజుకుంది. కేసులో కీలకంగా భావిస్తున్న వివేకా రాసిన లేఖపై ఇవాళ వివేకా కూతురు సునీతారెడ్డిని సీబీఐ ప్రశ్నించింది. వివేకా కేసులో సునీతారెడ్డి సీబీఐ విచారణకు హాజరయ్యారు. కోఠిలోని సీబీఐ కార్యాలయానికి సునీతను పిలిపించుకుని లేఖపై ఆరా తీశారు సీబీఐ అధికారులు. ఆమె కూడా భర్త నర్రెడ్డి రాజశేఖర్‌రెడ్డి ఉన్నట్లు తెలుస్తోంది. ఇక ఈ కేసులో ఇప్పటికే పలుమార్లు ఆమెను పిలిపించుకుని స్టేట్మెంట్ నమోదు చేసింది సీబీఐ. మరోవైపు వివేకా కేసులో పలువురు సాక్షులను సైతం సీబీఐ ప్రశ్నిస్తోంది. రక్తపు మరకల లేఖ.. ఎందుకు గోప్యంగా ఉంచారు? వివేకా గుండెపోటుతో చనిపోయారని ప్రచారం చేసేందుకుగాను పక్కా కుట్ర ఒకటి జరిగినట్టు ఇటీవల కడప ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి ఆరోపించారు. వివేకా కుమార్తె సునీత, అల్లుడు నర్రెడ్డి రాజశేఖరరెడ్డి, పెద్ద బావమరిది నర్రెడ్డి శివ ప్రకాశ్‌రెడ్డి దీని వెనక ఉన్నట్టు కొన్ని ఆధారాలు బయటపెట్టారు. వైఎస్ వివేకాపై తీవ్రంగా దాడిచేసిన తరువాత హంతకులు ఆయన చేత బలవంతంగా లేఖ రాయించినట్టు తేలింది. హంతకులు బెదిరించడంతో.. డ్రైవర్ ప్రసాద్ తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడని ఆ లేఖలో వివేకా రాశారు. ఆ లేఖను మొదటగా అంటే ఆ రోజు ఉదయం 6.10లోపే చూసిన ఆయన పీఏ కృష్ణారెడ్డి.. ఆ విషయాన్ని సునీత భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి చెప్పారు. రక్తపు మరకలున్న ఆ లేఖ చూసినవారెవరికైనా.. వివేకాది హత్యేనని తెలిసిపోతుంది. కానీ లేఖ విషయాన్ని కృష్ణారెడ్డి చెప్పగానే.. తాము వచ్చే వరకు ఆ లేఖను, వివేకా సెల్‌ఫోన్‌ను ఎవ్వరికీ ఇవ్వవద్దని, దాచి ఉంచాలని నర్రెడ్డి రాజశేఖరరెడ్డి చెప్పినట్టు కృష్ణారెడ్డి వెల్లడించారు, అదే విషయాన్ని దర్యాప్తులోనూ చెప్పారు. ఆ తరవాతే నర్రెడ్డి మరో అడుగు ముందుకేసి శివ ప్రకాశ్ రెడ్డి ద్వారా అవినాష్‌రెడ్డికి చెప్పించారు. అవినాష్ కాల్ డేటా చూస్తే ఈ విషయం నిర్ధారణ అవుతుంది కూడా. అవినాశ్ అక్కడకు చేరాక కూడా ఆయనకు లేఖ చూపించలేదు. అసలు లేఖ ఉందన్న విషయం కూడా చెప్పలేదు. వాస్తవానికి వారు గనక ఆ లేఖను వెంటనే పోలీసులకు ఇవ్వాలని చెప్పి ఉంటే వివేకా హత్యకు గురయ్యారన్నది వెంటనే అందరికీ తెలిసిపోయేది. హత్య జరిగిందని తెలిస్తే ఎవ్వరూ మృతదేహాన్ని తాకేవారే కాదు. కానీ లేఖను ఉద్దేశపూర్వకంగానే గోప్యంగా ఉంచారు. ఆ రోజు మధ్యాహ్నం 1 గంట సమయంలో పులివెందుల చేరుకున్న సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డికి ఆ లేఖతోపాటు వివేకా సెల్‌ఫోన్‌ను కృష్ణారెడ్డి ఇచ్చారు. ఆ లేఖను చదివారు కానీ.. వెంటనే పోలీసులకు ఇవ్వలేదు. సునీత ఆదేశాలతో సాయంత్రం 5 గంటలకు కృష్ణారెడ్డి ఆ లేఖను, సెల్‌ఫోన్‌ను పోలీసులకు అప్పగించారు. ఆ లేఖను సునీత, ఆమె భర్త నర్రెడ్డి రాజశేఖరరెడ్డి ఎందుకు గోప్యంగా ఉంచారన్నదే ఈ హత్య కేసులో కీలకం కానుంది. ఇదే విషయాన్ని ఇప్పటికే ఎంపీ అవినాష్‌రెడ్డి సిబీఐ దృష్టికి తీసుకెళ్లారు కూడా. -
సమీర్ వాంఖడేపై సీబీఐ అవినీతి కేసు
ముంబై: సమీర్ వాంఖడే గుర్తున్నాడా?.. బాలీవుడ్ స్టార్ హీరో షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై డ్రగ్స్ ఆరోపణలను దర్యాప్తు చేసిన ఉన్నతాధికారి. అదిగో ఆ ఆఫీసర్‌పై శుక్రవారం సీబీఐ అవినీతి కేసు ఫైల్ చేసింది. అదీ ఆర్యన్ ఖాన్ వ్యవహారంతో ముడిపడిన ఆరోపణలపైనే కావడం గమనార్హం. సమీర్‌తో పాటు ఇతర అధికారులు.. ఆర్యన్‌ను డ్రగ్స్ కేసులో ఇరికించకుండా ఉండేందుకు పాతిక కోట్ల రూపాయల లంచం డిమాండ్ చేసినట్లు అభియోగాలు నమోదు చేసింది సీబీఐ. ఈ మేరకు ముంబై, ఢిల్లీ, రాంచీ, కాన్పూర్లలో సీబీఐ సోదాలు కూడా నిర్వహించింది. ముంబై క్రూయిజ్ డ్రగ్స్ కేసు రెయిడ్ సమయంలో.. నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరోకు ముంబై జోనల్ చీఫ్‌గా సమీర్ వాంఖేడే ఉన్నాడు. షారూక్ ఖాన్ కొడుకు ఆర్యన్‌పై ఆరోపణలు వచ్చిన ఆరోపణలపై దర్యాప్తు చేసింది కూడా తొలుత ఈయనే. అయితే ఈ విచారణ సమయంలో ఆయన తీరుపై ఎన్నో విమర్శలు వచ్చాయి. దీంతో ఈ కేసు నుంచి తప్పించి.. డైరెక్టరేట్ ఆఫ్ రెవెన్యూ ఇంటెలిజెన్స్(డీఆర్ఐ)కు పంపారు. ఆపై ముంబైలోని అనలైటిక్స్ అండ్ రిస్క్‌మేనేజ్‌మెంట్‌కు బదిలీ చేశారు. కిందటి ఏడాది నాన్-సెన్సిటివ్ పోస్టింగ్ మీద చెన్నైకు బదిలీ చేశారు. ఇక ఆర్యన్ వ్యవహారంలో వాంఖడే వ్యవహరించిన తీరుపైనా దర్యాప్తు కోసం యాంటీ డ్రగ్స్ ఏజెన్సీ(NCB) ఒక సిట్ ఏర్పాటు చేయించింది. ఈ విజిలెన్స్ టీమ్ వాంఖడేను పలుమార్లు ప్రశ్నించింది కూడా. మరోవైపు ఈ వ్యవహారంలో నాలుగు వారాలపాటు జైల్లో గడిపిన షారూక్ ఖాన్ తనయుడు .. సరైన ఆధారాలు లేకపోవడంతో మే 2022లో క్లీన్ చిట్ దక్కించుకున్నాడు. సంబంధిత వార్త: సమీర్ అంటే ఒకప్పుడు వాళ్లకు ‘సింహస్వప్నం’ -
లిక్కర్ కేసు: అప్రూవర్‌గా గోరంట్ల బుచ్చిబాబు!
సాక్షి, ఢిల్లీ: ఎక్సైజ్ పాలసీ కేసులో తాజాగా మరో కీలక పరిణామం చోటు చేసుకున్నట్లు తెలుస్తోంది. ఈ కేసులో మరో నిందితుడు, హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ ఛార్టెడ్ అకౌంటెంట్ బుచ్చిబాబు గోరంట్ల.. అప్రూవర్‌గా మారినట్లు సమాచారం. బుచ్చిబాబు గతంలో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత దగ్గర ఆడిటర్‌గా పని చేశాడు. లిక్కర్ కేసులో.. సౌత్ గ్రూప్ తరపున బుచ్చిబాబు మధ్యవర్తిత్వం వహించినట్లు అభియోగాలు ఉన్నాయి. ఇదీ చదవండి: కారు చీకటి బతుకులు.. అంతరం ఇంకా అలాగే! -
వివేకా కేసు.. ఏ1 గంగిరెడ్డి బెయిల్ రద్దు
సాక్షి, హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(సీబీఐ)కి ఊరట లభించింది. ఏ1 నిందితుడు ఎర్ర గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేసింది తెలంగాణ హైకోర్టు. ఈ మేరకు వచ్చే నెల 5వ తేదీలోగా హైదరాబాద్ సీబీఐ కోర్టులో లొంగిపోవాలని గంగిరెడ్డిని ఆదేశించింది. ఒకవేళ లొంగిపోకపోతే.. గంగిరెడ్డిని అరెస్ట్ చేయవచ్చని సీబీఐకి తెలిపింది న్యాయస్థానం. మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో.. ప్రస్తుతం బెయిల్ మీద బయట ఉన్నాడు ప్రధాన నిందితుడు (ఏ–1) ఎర్ర గంగిరెడ్డి. అయితే.. బెయిల్ రద్దు చేయాలని కోరుతూ వివేకా కేసు విచారణ జరుపుతున్న తెలంగాణ హైకోర్టులో సీబీఐ ఓ పిటిషన్ దాఖలు చేసింది. వివేకా హత్యకు కుట్ర పన్నింది ఎర్ర గంగిరెడ్డేనని, దాన్ని అమలు చేయడంలోనూ అతనిది కీలక పాత్ర అని దర్యాప్తు సంస్థ వాదనలు వినిపించింది. అంతేకాదు.. సాక్ష్యాలు తారుమారు చేయడంలోనూ అతను కీలకంగా వ్యవహరించాడని పేర్కొంది. గంగిరెడ్డి గనుక బయట ఉంటే సాక్షులను ప్రభావితం చేస్తారు కాబట్టి బెయిల్ రద్దు చేయాలని సీబీఐ వాదించింది. అయితే.. గంగిరెడ్డి డీఫాల్ట్ బెయిల్‌ను రద్దు చేయించాలని సీబీఐ పలుమార్లు ప్రయత్నించి విఫలమైందని అతని తరపున న్యాయవాది వాదించారు. సీబీఐ దాఖలు చేసిన బెయిల్ రద్దు పిటిషన్లను.. కడప కోర్టు, ఏపీ హైకోర్టు కూడా కొట్టివేశాయని ప్రస్తావించారు. బెయిల్ రద్దు చేయాలని సుప్రీంకోర్టు కూడా చెప్పలేదని తెలంగాణ హైకోర్టు ధర్మాసనం దృష్టికి తీసుకెళ్లారు. ఈ హత్యతో గంగిరెడ్డికి సంబంధం లేదని, బెయిల్‌ను రద్దు చేయాల్సిన అవసరం లేదని తెలంగాణ హైకోర్టు బెంచ్‌కు విజ్ఞప్తి చేశారు. అయితే వాదనలు విన్న ఏకసభ్య బెంచ్.. సీబీఐ వాదనతోనే ఏకీభవించింది. దర్యాప్తు దశలో.. గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తూ తీర్పు ఇచ్చింది. మే 5వ తేదీలోపు సీబీఐ కోర్టులో గంగిరెడ్డి లొంగిపోవాలని, లేకుంటే అరెస్ట్ చేసుకోవచ్చని దర్యాప్తు సంస్థకు సూచించింది హైకోర్టు. అలాగే.. రెండు నెలల్లోపు వివేకా కేసులో సీబీఐ దర్యాప్తు పూర్తి చేయాలని, జూన్ 30వ తేదీ వరకు మాత్రమే గంగిరెడ్డి బెయిల్‌ను రద్దు చేస్తున్నట్లు తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. జులై 1వ తేదీ తర్వాత గంగిరెడ్డికి తిరిగి బెయిల్ ఇవ్వొచ్చని ట్రయల్ కోర్టుకు తెలిపింది హైకోర్టు. 2019 అక్టోబర్‌లో వివేకా కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఎర్ర గంగిరెడ్డికి డీఫాల్ట్ బెయిల్ ఇచ్చింది పులివెందుల కోర్టు. ఆపై 2021లో ఎర్ర గంగిరెడ్డిపై సీబీఐ ఛార్జ్‌షీట్ దాఖలు చేసింది. ఏ1గా కేసును ప్రభావితం చేసే అవకాశం ఉన్నందునా.. బెయిల్ రద్దు చేయాలని సీబీఐ కోరుతూ వస్తోంది. ఇదీ చదవండి: వివేకా రెండో భార్య సంచలన స్టేట్మెంట్ -
వివేకా కేసు దర్యాప్తు జూన్ 30 వరకు పొడిగింపు
► వివేకా హత్య కేసుకు సంబంధించి తెలంగాణ హైకోర్టు ఇచ్చిన ఆదేశాలను సుప్రీంకోర్టు కొట్టివేసింది. ఈ హత్య కేసులో దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగించింది. గతంలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఆ గడువు ఏప్రిల్ 30కి ముగియాల్సి ఉంది. తాజా ఉత్తర్వులతో సీబీఐకి మరో రెండు నెలల అదనపు గడువు వచ్చినట్టయింది. ► ఎంపీ అవినాష్ రెడ్డికి ముందస్తు బెయిల్ గురించి ఈ సమయంలో అడగాల్సిన అవసరం లేదు. ఇప్పటివరకు ఎంపీ అవినాష్ రెడ్డిని సీబీఐ అరెస్ట్ చేయలేదు. ఒక వేళ నిజంగానే అవినాష్ రెడ్డిని అరెస్ట్ చేయాలని సీబీఐ భావించి ఉంటే.. ఇప్పటికే సీబీఐ అరెస్ట్ చేసి ఉండేది. లిఖిత పూర్వకంగా ప్రశ్నలు, సమాధానాలు ఇవ్వాలన్న హైకోర్టు ఉత్తర్వులను కొట్టివేస్తున్నాం- చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ చీఫ్ జస్టిస్ చంద్రచూడ్ పూర్తి ఆదేశాలు 1. తెలంగాణ హైకోర్టు సింగిల్ బెంచ్ జడ్జి ఇచ్చిన ఆదేశాలను పరిశీలించాం. కడప ఎంపీ అవినాష్ రెడ్డి వేసిన పిటిషన్ ఆధారంగా ఆదేశాలిచ్చారు. 2. వైఎస్ వివేకానందారెడ్డి ఆయన ఇంట్లో హత్యకు గురయ్యారు. ఆయన దివంగత ముఖ్యమంత్రి రాజశేఖరరెడ్డికి సోదరుడు. 3. హత్య గురించి వివేకా పీఏ MV కృష్ణారెడ్డి ఫిర్యాదు చేశారు. దీనికి సంబంధించి ఒక సిట్ ఏర్పాటయింది. అలాగే కేసును అడిషనల్ డైరెక్టర్ నేతృత్వంలో సిబిఐ దర్యాప్తు చేస్తోంది. 4. వివేకా కూతురు విజ్ఞప్తి మేరకు కేసును బదిలీ చేశాం. సిబిఐ వేసిన ఛార్జ్‌షీట్‌లో నలుగురి పేర్లు ఉన్నాయి. నవంబర్ 17, 2021న శివశంకర్ రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేసింది. జనవరి 31, 2022న సిబిఐ సప్లిమెంటరీ ఛార్జ్‌షీట్‌ను దాఖలు చేసింది 5. ఏప్రిల్ 16న దర్యాప్తుకు హాజరు కావాలని ఎంపీ అవినాష్‌రెడ్డికి సిబిఐ నోటీసులిచ్చింది. దీనిపై తెలంగాణ హైకోర్టును ఎంపీ అవినాష్‌రెడ్డి ఆశ్రయించారు. పిటిషన్ విచారించిన హైకోర్టు..లాయర్ సమక్షంలో విచారణ జరపాలని సిబిఐకి సూచించింది. 6. అలాగే ఏప్రిల్ 19 నుంచి 25 వరకు దర్యాప్తుకు హాజరు కావాలని ప్రశ్నలను లిఖిత పూర్వకంగా ఇవ్వాలని తెలంగాణ హైకోర్టు సూచించింది. ఆ మధ్యంతర ఉత్తర్వులను మేం కొట్టివేస్తున్నాం. 7. ఈ సమయంలో అరెస్ట్ చేయాలా వద్దా అన్న అంశాల జోలికి వెళ్లడం లేదు. నిజంగా అవినాష్‌రెడ్డిని సిబిఐ అరెస్ట్ చేయాలని భావించి ఉంటే ఎప్పుడో అరెస్ట్ చేసి ఉండేవాళ్లు. సిబిఐ కూడా ఒక పద్ధతిలో దర్యాప్తు చేస్తోంది. సీబీఐ అరెస్టు చేస్తుందని మీరెందుకు ఊహిస్తున్నారు?. 8. కేసు దర్యాప్తు గడువును జూన్ 30 వరకు పొడిగిస్తున్నాం. 9. ఏప్రిల్ 25న తెలంగాణ హైకోర్టు ముందుకు రానున్న పిటిషన్ లో ముందస్తు బెయిల్ కు సంబంధించి ఎంపీ అవినాష్ తన వాదనలు వినిపించుకోవచ్చు 10. సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాల ప్రభావం అవినాష్ ముందస్తు బెయిల్ పిటిషన్ పై ప్రభావం చూపరాదు. వైఎస్ అవినాష్ తరపున సీనియర్ న్యాయవాది ముకుల్ రోహత్గి వాదనలు అవినాష్ రెడ్డి ఎంపీగా బాధ్యత గల పదవిలో ఉన్నారు, ఎక్కడికి వెళ్లడం లేదు సిబిఐ ముందు ఇప్పటివరకు ఏడుసార్లు విచారణకు హాజరయ్యారు విచారణకు అవినాష్ రెడ్డి పూర్తిగా సహకరిస్తున్నాడు హైకోర్టు మధ్యంతర ఉత్తర్వులలోని పేరా 18 తప్పుడు గా అన్వయం చేస్తున్నారు అవినాష్ రెడ్డి ఎలాంటి సాక్ష్యం ధ్వంసం చేయలేదు, పైగా అన్ని వైపులా అవినాష్ పై దాడి జరుగుతోంది ► అవినాష్ రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై రేపు(మంగళవారం) తెలంగాణ హైకోర్టులో వాదనలు వినిపించుకోవచ్చని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. తాము ఇవాళ ఇచ్చిన తీర్పు ప్రభావం ముందస్తు బెయిల్ పిటిషన్ విచారణపై ఉండకూడదని పేర్కొంది. ఇదీ చదవండి: ఏది నిజం? వివేకా హంతకులను నడిపిస్తుందెవరు? -
సత్యపాల్ మాలిక్‌కు సీబీఐ సమన్లు
Satya Pal Malik News: జమ్ము కశ్మీర్ మాజీ గవర్నర్ సత్యపాల్ మాలిక్(76)కు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్(CBI) శుక్రవారం సమన్లు జారీ చేసింది. అనిల్ అంబానీకి చెందిన రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌పై అవినీతి ఆరోపణలకు సంబంధించిన కేసులో సత్యపాల్ మాలిక్‌ను ప్రశ్నించాలని సీబీఐ భావించింది. ఈ మేరకు ఏప్రిల్ 28వ తేదీన ఈ కేసులో సాక్షిగానే తమ ఎదుట హాజరు కావాలని సీబీఐ సమన్లలో కోరింది. 2018లో కంపెనీ కాంట్రాక్ట్‌ను ఆ సమయంలో జమ్ము కశ్మీర్ గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్ ఆ ఫైల్స్‌ను స్వయంగా పర్యవేక్షించానని చెబుతూ ఒప్పందాన్ని రద్దు చేశారు. జమ్ము కశ్మీర్ ప్రభుత్వ ఉద్యోగులు, వాళ్ల కుటుంబ సభ్యుల మెడికల్ ఇన్సూరెన్స్ స్కీమ్‌కు సంబంధించి స్కాం ఇది. దాదాపు మూడున్నర లక్షల ఉద్యోగులు 2018 సెప్టెంబర్‌లో ఇందులో చేరారు. అయితే.. అవకతవకలు ఉన్నాయంటూ నెలకే ఈ కాంట్రాక్ట్‌ను రద్దు చేస్తూ సంచలనానికి తెర తీశారు అప్పుడు గవర్నర్‌గా ఉన్న సత్యపాల్ మాలిక్. ఈ కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్లో రిలయన్స్ జనరల్ ఇన్సూరెన్స్‌తో పాటు ట్రినిటీ రీఇన్సూరెన్స్ బ్రోకర్స్‌ను నిందితులుగా చేర్చింది సీబీఐ. ఇందులో మోసం జరిగిందని మాలిక్ ఆరోపించడంతో.. ఆయన నుంచి అదనపు సమాచారం సేకరించేందుకే సీబీఐ ప్రశ్నించనున్నట్లు తెలుస్తోంది. CBI has asked me to come to their Delhi office to give clarification regarding the alleged insurance scam in J&K on 27th or 28th April: Former J&K Governor Satyapal Malik on alleged insurance scam involving Reliance General Insurance (file photo) pic.twitter.com/t9kLr3Dvrp — ANI (@ANI) April 21, 2023 ఇదిలా ఉంటే.. కిందటి ఏడాది ఏప్రిల్‌లో మాలిక్ చేసిన అవినీతి ఆరోపణలకు సంబంధించి రెండు ఎఫ్ఐఆర్లు నమోదు చేసింది సీబీఐ. అందులో ఒకటి పైన చెప్పుకున్న ఇన్సూరెన్స్ స్కీమ్ది కాగా, రెండోది జమ్ము కశ్మీర్ దాదాపు రూ.2,200 కోట్ల వ్యయంతో చేపట్టిన కిరూ హైడ్రాలిక్ పవర్ ప్రాజెక్టుకు సంబంధించిన ఆరోపణలు. రిలయెన్స్ ఇన్సూరెన్స్ ప్రతిపాదిత బీమా పథకాన్ని ముందుకు తీసుకువెళ్లాలని ఆర్ఎస్ఎస్, బీజేపీ నేత రామ్ మాధవ్ అప్పట్లో అనుకున్నారని, పేపర్ వర్క్ కూడా పూర్తయిన ఆ స్కీమ్‌ను రద్దు చేయడం ఆయనకు అసంతృప్తిని కలిగించిందని సత్యపాల్ మాలిక్ ఏప్రిల్ 14న కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో వెల్లడించారు. దీనికి ముందు, డీబీ లైవ్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలోనూ మాలిక్ ఈ ప్రస్తావన చేశారు. ఈ లైవ్ ప్రసారం కాగానే సత్యపాల్ మాలిక్‌కు రామ్ మాధవ్ పరువునష్టం నోటీసు పంపారు కూడా. సంచలనంగా సత్యపాల్ మాలిక్ చరణ్ సింగ్ భారతీయ క్రాంతి దళ్‌తో రాజకీయ ప్రస్థానం ప్రారంభించిన సత్యపాల్ మాలిక్. ఆ తర్వాత భారతీయ లోక్‌దల్ పార్టీలో చేరి, ఆ పార్టీ ప్రధాన కార్యదర్శిగా పని చేశారు. లోక్‌సభ, రాజ్యసభ సభ్యుడిగా పని చేసిన మాలిక్.. 2012లో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షుడిగా పని చేశారు కూడా. ఆపై బీహార్, జమ్ము కశ్మీర్, గోవా, మేఘాలయాకు గవర్నర్‌గా బాధ్యతలు నిర్వహించారు. జమ్ము కశ్మీర్ ప్రత్యేక హోదాను కేంద్రం వెనక్కి తీసుకున్న సమయంలో ఈయనే గవర్నర్‌గా ఉన్నారు. రైతుల ఉద్యమ సమయంలో ఈయన రైతులకు మద్దతు ప్రకటించడం, కేంద్రానికి హెచ్చరికలు జారీ చేయడం అప్పట్లో చర్చనీయాంశంగా మారింది. తాజాగా.. పుల్వామా దాడి, నరేంద్ర మోదీ మీద తాజాగా (ఏప్రిల్ 14వ తేదీన) కరణ్ థాపర్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూ సంచలనానికి తెర తీసింది. అవినీతిపై మోదీ ఎలాంటి చర్యలు తీసుకోరని, ఎందుకంటే అందులో ఆరోపణలు ఎదుర్కొనేవాళ్లు ఆయనకు సన్నిహితులేనని వ్యాఖ్యానించారు. అంతేకాదు పుల్వామా దాడి సమయంలో మోదీ, ఎన్ఎస్ఏ అజిత్ దోవల్ గవర్నర్‌గా ఉన్న తనకు చేసిన సూచనలపైనా ఆయన చేసిన వ్యాఖ్యలు దుమారం పుట్టించాయి. పుల్వామా దాడిలో ఇంటెలిజెన్స్ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని, 300 కేజీల ఆర్డీఎక్స్ పాక్ నుంచి రావడం, జమ్ము కశ్మీర్లో పది నుంచి పదిహేను రోజులపాటు చక్కర్లు కొట్టడం, దానిని అధికారులు గుర్తించలేకపోవడం పైనా మాలిక్ వ్యాఖ్యలు చేశారు. -
అవినాశ్‌ను అరెస్టు చేయొద్దు
సాక్షి, హైదరాబాద్: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో ఈ నెల 25వ తేదీ వరకు కడప ఎంపీ వైఎస్ అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని సీబీఐని తెలంగాణ హైకోర్టు ఆదేశించింది. అప్పటి వరకు ఆయన రోజూ సీబీఐ కార్యాలయానికి వస్తారని, ఏ విచారణ చేయాలన్నా చేపట్టవచ్చని సూచించింది. అయితే సీబీఐ అడిగే ప్రశ్నలు లిఖితపూర్వకంగా ఉండాలని... వీడియో, ఆడియో రికార్డు చేయాలని స్పష్టం చేసింది. స్పష్టమైన ఆధారాలు లేకుండా అరెస్టులు చేయడం సరికాదని, 25వతేదీలోగా సాక్ష్యాలు సేకరించాలని పేర్కొంటూ మంగళవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేసింది. తదుపరి విచారణ నాటికి అన్ని అంశాలను పరిశీలించి తుది ఆదేశాలు ఇస్తామని స్పష్టం చేసింది. సుప్రీంకోర్టు ఉత్తర్వుల మేరకు ఈ నెల 30లోగా విచారణ పూర్తి చేయాలని సీబీఐకి నిర్దేశించింది. వివేకా హత్య కేసులో సీబీఐ అరెస్టు చేయకుండా ముందస్తు బెయిల్ కోరుతూ అవినాశ్‌రెడ్డి దాఖలు చేసిన పిటిషన్‌ను విచారించిన తెలంగాణ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ సురేందర్ ఈమేరకు ఆదేశాలు జారీ చేశారు. పిటిషనర్ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనలు వినిపించారు. ఆ వివరాలు ఇవీ... ఏది ప్రామాణికం..? ‘హత్య జరిగిన రోజు నిందితుల కదలికలకు సంబంధించి భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో ఒకలా.. ఏ–4 దస్తగిరి ఇచ్చిన వాంగ్మూలంలో మరోలా.. సీబీఐ గూగుల్ టేకౌట్లో ఇంకోలా ఉంది. ఇందులో ఏది ప్రామాణికం? దేనిని పరిగణలోకి తీసుకోవాలి? కిరాయి హంతకుడు దస్తగిరి (ఏ–4) సోమవారం ప్రెస్‌మీట్ పెట్టి మాట్లాడితే ఈనాడు పత్రిక ప్రచురించింది. గతంలో ఈ కేసు దర్యాప్తు చేసిన సీబీఐ ఎస్పీ రామ్సింగ్ను పలుకుబడితో మార్చేశారంటూ వ్యాఖ్యలు చేశాడు. దీన్ని సీబీఐ సమర్థిస్తుందా? విచారణాధికారిని మార్చింది సుప్రీంకోర్టు. అంటే దస్తగిరి ఉద్దేశం సుప్రీంకోర్టు ద్వారా మార్పించారనా? అత్యున్నత న్యాయస్థానంపై ఇలాంటి వ్యాఖ్యలను స్వాగతిస్తామా? ఈ కేసులో ఇంప్లీడ్ అయిన సునీత న్యాయవాది దస్తగిరి వ్యాఖ్యలను సమర్థించడం సరికాదు. అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి, మరో ఇద్దరు తమ వెనుక ఉన్నారని గంగిరెడ్డి పేర్కొన్నట్లు దస్తగిరి చెప్పాడు. అయితే గంగిరెడ్డి మాత్రం తాను ఎవరి పేర్లు చెప్పలేదని వాంగ్మూలంలో పేర్కొన్నాడు. కిరాయి హంతకుడు చెప్పిన ఓ మాటను పట్టుకుని అవినాశ్, భాస్కర్‌రెడ్డిని ఈ కేసులో ఇరికించేందుకు సీబీఐ శతవిధాలా ప్రయత్నిస్తోంది. గూగుల్ కూడా సర్టిఫికెట్ ఇవ్వదు.. వైఎస్ వివేకా హత్య వెనుక ఉన్న ప్రధాన కారణాలపై సీబీఐ దర్యాప్తు సాగించడం లేదు. గంగిరెడ్డితో వివేకాకు భూమికి సంబంధించిన వివాదం ఉంది. తనకు రావాల్సిన వాటా ఇవ్వడం లేదని గంగిరెడ్డి ఆగ్రహంతో ఉండేవాడు. వివేకా రెండో భార్య, ఆమె కుమారుడి ఉదంతంలో మొదటి భార్య, కుమార్తె సునీత, అల్లుడితో తీవ్ర విభేదాలున్నాయి. సునీల్ యాదవ్(ఏ–2) తల్లిని వివేకా అసభ్యకరంగా వేధింపులకు గురి చేసినట్లు ఆరోపణలున్నాయి. వివేకాకు కొందరు రాజకీయ శత్రువులు కూడా ఉన్నారు. ఈ నాలుగు అంశాలపై సీబీఐ విచారణ జరపలేదు. సీబీఐ దర్యాప్తు అంతా అవినాశ్, భాస్కర్‌రెడ్డిని ఇరికించేందుకే సాగుతూ ఇతర కారణాల జోలికి వెళ్లడం లేదు. గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికం కాదు. ఇది సీబీఐకి కూడా తెలిసినా అవినాశ్‌రెడ్డి, భాస్కర్‌రెడ్డిని ఇరికించే ఉద్దేశంతో దాన్ని పదే పదే ప్రస్తావిస్తున్నారు. గూగుల్ టేక్ అవుట్ ప్రామాణికమని గూగుల్ కూడా అధికారికంగా సర్టిఫికెట్ ఇవ్వదు.. ఇప్పటివరకు ఇవ్వలేదు కూడా. అలాంటిది సీబీఐ దాన్ని ఆధారంగా పేర్కొనడం తప్పుబట్టాల్సిన అంశం. ఆధారాలు లేకుండా అరెస్టులు... 2017లో జరిగిన ఎమ్మెల్సీ ఎన్నికల్లో వివేకా స్వల్ప తేడాతో ఓడిపోయారు. ఆ ఓటమికి అవినాశ్, భాస్కర్‌రెడ్డి, శివశంకర్‌రెడ్డి కారణమని వివేకా ఆగ్రహం వ్యక్తం చేసినట్లు రిమాండ్ పిటిషన్లో సీబీఐ పేర్కొంది. దీనికి ఎలాంటి ఆధారం, సాక్ష్యం లేదు. ఎలాంటి ఆధారం లేకుండా ఓ యువ ఎంపీని అరెస్టు చేస్తే ఆయన భవిష్యత్, పరువు ప్రతిష్టలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. కడప పార్లమెంట్ స్థానం నుంచి అవినాశ్ రెండుసార్లు ఎంపీగా పోటీ చేశారు. వివేకా జీవించి ఉండగా అవినాశ్ విజయం కోసం ప్రచారం నిర్వహించారు. గెలుపు బాధ్యతంతా ఆయనే తీసుకుని పనిచేశారు. అత్యంత సన్నిహితులైన వివేకా, అవినాశ్ మధ్య సంబంధాలు ఒక్క ఎమ్మెల్సీ ఎన్నిక కారణంగా హత్యలు చేసుకునే స్థాయికి వెళ్లాయనడం సరికాదు. సీబీఐ కంటే ముందు సిట్ మెటీరియల్ అంతా సేకరించింది. దీన్ని సీబీఐకి అందజేసింది. దస్తగిరి బెయిల్ పిటిషన్ విచారణ సమయంలో గానీ, అప్రూవర్‌గా పేర్కొన్న సమయంలో గానీ ఈ మెటీరియల్‌ను మేజిస్ట్రేట్ ముందు ప్రవేశపెట్టలేదు. అసలు హత్యలో కీలక పాత్ర పోషించిన ఎర్ర గంగిరెడ్డి, దస్తగిరిని వదిలేశారు. ఎర్ర గంగిరెడ్డి బెయిల్ రద్దుకు ఎందుకు పిటిషన్ వేయలేదని న్యాయస్థానం ప్రశ్నించడంతో తర్వాత దాఖలు చేశారు. దీనిపై కూడా వాయిదాలు కోరుతూ జాప్యం చేస్తూ వస్తున్నారు. హత్య చేసిన తర్వాత తాను బీరువా పగుల కొట్టానని, గంగిరెడ్డి ఏవో డాక్యుమెంట్ల కోసం వెతికి తీసుకెళ్లాడని దస్తగిరి వాంగ్మూలం ఇచ్చాడు. ఆ డాక్యుమెంట్లు ఏమిటి? ఎక్కడి తీసుకెళ్లాడో దర్యాప్తు అధికారులు ఇంతవరకు తెలుసుకోలేదు. అసలు మెటీరియల్‌ను దర్యాప్తు అధికారులు ఎందుకు పరిశీలించడం లేదో తెలియదు. వివేకా మృతి విషయాన్ని ఆయన అల్లుడికి చెప్పింది ఎవరు? వారికి ఈ విషయం ఎలా తెలిసింది? దీని గురించి కూడా విచారణ చేయడం లేదు. ఆధారాలు లేకుండానే భాస్కర్‌రెడ్డిని అరెస్టు చేశారు. విచారణకు పూర్తిగా సహకరిస్తున్నారు.. తన వీడియో, ఆడియో రికార్డును చేస్తున్నారో లేదో చెప్పాలని అవినాశ్ పలుమార్లు సీబీఐని కోరారు. ఓ చిన్న నోట్ ఇచ్చేందుకు కూడా వారు నిరాకరించారు. దీంతో ఆయన కోర్టును ఆశ్రయించి ఆ వివరాలు తెలుసుకోవాల్సి వచ్చింది. విలువైన కోర్టు సమయం వృథా అయింది. దర్యాప్తు పారదర్శకంగా లేదు. విచారణ ముగిసిందని భాస్కర్‌రెడ్డి రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు. అవినాశ్‌కు ఈ హత్యతో సంబంధం ఉన్నట్లు వారి వద్ద ఆధారాలు, సాక్ష్యాలు ఏమీ లేవు.. ఒక్క దస్తగిరి వాంగ్మూలం మినహా. సీబీఐ విచారణకు సహకరించేందుకు అవినాశ్‌రెడ్డి సిద్ధంగా ఉన్నారు. ఎప్పుడు, ఎక్కడికి పిలిచినా ఆయన వస్తారు. ఇప్పటికే పలుమార్లు 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేశారు. దాదాపు 20 గంటలకుపైగా విచారించి 161 సీఆర్పీసీ కింద స్టేట్మెంట్ నమోదు చేసుకున్నారు. అవినాశ్‌ను అరెస్టు చేయాలని సీబీఐ అతృతతో ఉంది. ఈ అంశాలన్నీ పరిగణలోకి తీసుకుని అరెస్టు చేయకుండా ఆదేశాలివ్వాలి’ ఇంకా సాక్ష్యాలు సేకరిస్తున్నాం: సీబీఐ పీపీ ‘వివేకా హత్య వెనుక కుటుంబ తగాదాలు, వ్యాపార తగాదాలు లేవు. అవినాశ్‌రెడ్డి విచారణకు సహకరించడం లేదు. ఆయన సాక్ష్యాలను తారుమారు చేసే ప్రయత్నాలు చేశారు. ఇంకా కొందరిని విచారించాల్సి ఉంది. సమాచారం, డాక్యుమెంట్లు సేకరిస్తున్నాం. గంగిరెడ్డి తీసుకువెళ్లిన డాక్యుమెంట్లను సేకరించలేదు’ అని సీబీఐ పీపీ తెలిపారు. కిక్కిరిసిన కోర్టు హాల్లో సుదీర్ఘ వాదనల అనంతరం అవినాశ్‌రెడ్డిని అరెస్టు చేయవద్దని ఆదేశాలు జారీ చేస్తూ తదుపరి విచారణను న్యాయమూర్తి వాయిదా వేశారు. -
వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయ్: అవినాష్‌రెడ్డి న్యాయవాది
సాక్షి, హైదరాబాద్: వివేకా కేసులో వైఎస్ అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై తెలంగాణ హైకోర్టులో విచారణ కొనసాగింది. కేవలం దస్తరిగి ఇచ్చిన కన్ఫెషన్ తప్ప.. సీబీఐ దగ్గర ఎలాంటి ఆధారాలు లేవని, పైగా దస్తగిరిని కూడా బెదిరించి ఆ స్టేట్మెంట్ తీసుకుందని ఎంపీ వైఎస్ అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదించారు. ఆపై పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేసింది కోర్టు. అవినాష్‌రెడ్డి తరపు న్యాయవాది వాదనలు.. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో వైఎస్ భాస్కర్‌రెడ్డిని అక్రమంగా అరెస్ట్ చేశారు. భాస్కర్‌రెడ్డి పిటిషన్ పెండింగ్‌లో ఉండగానే అరెస్ట్ చేశారు. ఆయన్ని అరెస్ట్ చేయడానికి దస్తగిరి కన్ఫెషన్ తప్ప సీబీఐ వద్ద ఎలాంటి ఆధారాలు లేవు. దస్తగిరిని బెదిరించి.. చిత్రహింసలకు గురిచేసినట్లు ఎర్ర గంగిరెడ్డి చెప్పాడు. దస్తగిరి కూడా సీబీఐకి భయపడి భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలకు వ్యతిరేకంగా స్టేట్మెంట్ ఇచ్చాడు. వివేకా హత్యకు నాలుగు కారణాలున్నాయి. ఒకటి కుటుంబం, రెండోది వ్యాపార సంబంధాలు, మూడోది వివాహేతర సంబంధాలు, నాలుగోది పొలిటికల్ గెయిన్. వీటిపై సీబీఐ ఫోకస్ పెట్టలేదని అవినాష్ రెడ్డి తరపున న్యాయవాది వాదించారు. అలాగే.. వైఎస్ అవినాష్‌రెడ్డిని రాజకీయంగా దెబ్బ తీసే కుట్ర జరుగుతోందని, రాజకీయ కోణంలో భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్రలో భాగమే ఇదంతా అని వాదించారు. ఈ తరుణంలో అవినాష్‌రెడ్డి ముందస్తు బెయిల్ పిటిషన్‌పై విచారణను రేపటికి వాయిదా వేస్తున్నట్లు తెలిపింది తెలంగాణ హైకోర్టు. అంతేకాదు.. వివేకా కేసులో అవినాష్‌రెడ్డి ఇవాళ్టి విచారణను రేపటికి సీబీఐ వాయిదా వేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో.. రేపు సాయంత్రం నాలుగు గంటల తర్వాతే అవినాష్‌రెడ్డిని విచారణకు పిలవాలని సీబీఐకి తెలంగాణ హైకోర్టు స్పష్టం చేసింది. ఇదీ చదవండి: వివేకాపై అందుకే సునీత కక్షగట్టింది -
దర్యాప్తు సంస్థలపై కేసులు వేస్తా-కేజ్రీవాల్
దర్యాప్తు సంస్థలపై కేసులు వేస్తా-కేజ్రీవాల్ -
కేజ్రీవాల్ సీబీఐ ఎదుట హాజరవుతారు: ఆప్
ఢిల్లీ: దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారడంతో పాటు రాజకీయ ప్రకంపనలు సృష్టించిన లిక్కర్ స్కాంలో ఇవాళ కీలక పరిణామం చోటుచేసుకుంది. ఆప్ కన్వీనర్, ఢిల్లీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. ఈ కుంభకోణానికి సంబంధించి తమ ఎదుట హాజరు కావాలని సమన్లలో సీబీఐ ఆయన్ని కోరింది. ఏప్రిల్ 16న విచారణకు రావాలని సీబీఐ తన సమన్లలో పేర్కొంది. ఈ కుంభకోణం మొత్తానికి కారణమైన.. కొత్త మద్యం పాలసీకి సంబంధించి ఆయన్ని ప్రశ్నించే అవకాశం కనిపిస్తోంది. దీంతో ఆదివారం ఆయన సీబీఐ ఎదుట హాజరు కావాల్సి ఉంది. ఇప్పటికే ఈ కేసులో ఆప్ నేత మనీష్ సిసోడియా జైల్లో ఉన్న సంగతి తెలిసిందే. సీబీఐ ఈ స్కాంలో సిసోడియాను విచారణకు పిలిచి.. అటు నుంచి అటే అరెస్ట్ చేసింది. సిసోడియా రిమాండ్ రిపోర్ట్‌లో కేజ్రీవాల్ పేరు ఉంది కూడా. ‘‘జాతీయ పార్టీ హోదా దక్కించుకున్న నేపథ్యంలోనే ఆప్‌పై ఒత్తిడి చేయాలని కేంద్రం ప్రయత్నిస్తోంది. ఈ కుట్రలో భాగంగానే కేజ్రీవాల్‌కు సీబీఐ సమన్లు జారీ చేసింది. కానీ, ఆయన సీబీఐ ఎదుట హాజరు అవుతారు. పై నుంచి కిందిదాకా అవినీతిలో కూరుకుపోయింది మీరు(ప్రధాని మోదీని ఉద్దేశించి), మీ ప్రభుత్వమే. సీబీఐ సమన్లతో కేజ్రీవాల్ తన పోరాటం ఆపరు. సీబీఐ ఎదుట హాజరవుతారు. అరెస్ట్ చేసినా, జైల్లో పెట్టినా, ఎలాంటి చర్యలు తీసుకున్నా ఆయన తన గళం వినిపించడం ఆపరు’’ అంటూ ఆప్ ఎంపీ సంజయ్ సింగ్ ఓ ప్రకటన విడుదల చేశారు. -
‘వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు’
సాక్షి,హైదరాబాద్: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసుపై తెలంగాణ హైకోర్టులో సుదీర్ఘ వాదనలు జరిగాయి. గురువారం వైఎస్ భాస్కరరెడ్డి తరపున న్యాయవాది వాదనలు వినిపించగా, ఆపై సీబీఐ కూడా తమ వాదనలు వినిపించింది. వివేకా కేసులో దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించిందని.. భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను కేసులో ఇరికించే కుట్ర జరుగుతోందని భాస్కర్‌రెడ్డి తరపున లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. కేసుతో భాస్కర్‌రెడ్డికి ఎలాంటి సంబంధం లేదు. అయినా భాస్కర్‌రెడ్డి, అవినాష్‌రెడ్డిలను ఇరికించే కుట్ర జరుగుతోంది. సీబీఐ ఉద్దేశపూర్వకంగానే.. మా క్లయింట్లను లాగే ప్రయత్నం చేస్తున్నారు. దస్తగిరి అప్రూవర్‌గా మారడాన్ని వ్యతిరేకిస్తున్నాం. వివేకా హత్యలో దస్తగిరి పాల్గొన్నాడు. అలాంటిది నిందితుడు దస్తగిరిని అప్రూవర్‌గా మార్చేసి.. దర్యాప్తును సీబీఐ పక్కదారి పట్టించింది. ఒక నిందితుడు ఇచ్చిన స్టేట్మెంట్ ఆధారంగా మా క్లయింట్లను ఈ కేసులోకి ఎలా లాగుతారు. గూగుల్ టేక్అవుట్ ఫొటోలను ఎలా ఆధారంగా చూపిస్తారు?. ఇది ముమ్మాటికీ మా క్లయింట్స్‌ను ఇరికించే ప్రయత్నమే అంటూ లాయర్ నిరంజన్‌రెడ్డి వాదించారు. ఇక సీబీఐ తరపు న్యాయవాది వాదనలు వినిపిస్తూ.. మాజీ మంత్రి వివేకానందరెడ్డిది హత్యేనేని, వివేకాను ఎవరు హత్య చేశారన్నది తేలాల్సి ఉందని, సుప్రీం కోర్టు ఈ కేసును దగ్గరగా పర్యవేక్షిస్తోందని వాదించింది. ఈ తరుణంలో ఈ కేసులో తదుపరి విచారణను సోమవారానికి వాయిదా వేసింది తెలంగాణ హైకోర్టు. -
2014 తర్వాతే సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది: ప్రధాని మోదీ
ఢిల్లీ: కేంద్ర దర్యాప్తు సంస్థ సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇండియా(CBI) తాజాగా అరవై ఏళ్లు పూర్తి చేసుకుంది. ఈ క్రమంలో.. డైమండ్ జూబ్లీ వేడుకలను దేశ ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. న్యూఢిల్లీ విజ్ఞాన్ భవన్లో ఈ కార్యక్రమం జరిగింది. సీబీఐ డైమండ్ జూబ్లీ ఉత్సవాలను ప్రారంభించడంతో పాటు షిల్లాంగ్, పూణే, నాగ్‌పూర్‌లలో కొత్తగా ఏర్పాటు చేసిన సీబీఐ కాంప్లెక్స్‌లను ప్రధాని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలోనే ప్రెసిడెంట్స్ పోలీస్ మెడల్‌తో పాటు ఉత్తమ దర్యాప్తు అధికారులకు మెడల్స్ ప్రదానం చేశారు. అలాగే.. డైమండ్ జూబ్లీ ఉత్సవాల స్మారకార్ధం పోస్టల్ స్టాంపు, నాణెం విడుదల చేశారు. ఈ కార్యక్రమంలోనే సీబీఐ కొత్త ట్విటర్ హ్యాండిల్‌ను ప్రధాని మోదీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ప్రధాని మోదీ మాట్లాడుతూ.. ‘సీబీఐ పరిధి పెరిగింది. చాలా నగరాల్లో సీబీఐ ఆఫీసులు నెలకొల్పుతున్నాం. అవినీతి సాధారణ నేరం కాదు. దేశాభివృద్ధికి అవినీతి ప్రధాన శత్రువు. అవినీతిని కొందరు వారసత్వంగా భావిస్తున్నారు. 2014లో మేము అవినీతిపై యుద్ధం ప్రారంభించాము. 2014 తర్వాత సీబీఐ స్వేచ్ఛగా పనిచేస్తోంది. అవినీతిపై పోరాటంలో సీబీఐది కీలకపాత్ర. ఇప్పుడు అవినీతిపరులు భయపడుతున్నారు. గత ప్రభుత్వాలు అవినీతిని వ్యవస్థీకృతం చేశాయి. ఒక కుంభకోణానికి మించి మరో కుంభకోణం చేశాయి. 2జీ స్కామ్ అతిపెద్ద కుంభకోణం. ఆర్థిక నేరగాళ్లు వేలకోట్లు కొల్లగొట్టి విదేశాలకు పారిపోయారు. బీజేపీ ప్రభుత్వం అవినీతిపై యుద్ధం చేస్తోంది’ అని స్పష్టం చేశారు. ఇక, నాటి కేంద్ర హోం వ్యవహారాల మంత్రిత్వ శాఖ తీర్మానం మేరకు.. 1963, ఏప్రిల్ 1వ తేదీన సీబీఐ ప్రారంభమైంది. మినిస్ట్రీ ఆఫ్ పర్సనల్, పబ్లిక్ గ్రీవెన్స్ అండ్ పెన్షన్స్ పర్యవేక్షణలో.. సీబీఐ పని చేస్తుంది. దేశంలో ఇప్పటిదాకా ఎన్నో హైప్రొఫైల్‌తో పాటు సంక్లిష్టమైన కేసుల్ని పరిష్కరించిన కేంద్రం అత్యున్నత దర్యాప్తు సంస్థగా సీబీఐకంటూ ఓ పేరు ఉండిపోయింది. #WATCH | 10 years ago, there was a competition to do more and more corruption. Big scams took place during that time but the accused were not scared because the system stood by them… After 2014, we worked on a mission mode against corruption, black money: PM Narendra Modi pic.twitter.com/LOqxd6mCbz — ANI (@ANI) April 3, 2023 ఇదీ చదవండి: ఆలయంలోకి బుల్డోజర్లు.. అక్రమ కట్టడం కూల్చివేత -
సీబీఐ అప్పుడు నాపై ఒత్తిడి చేసింది: అమిత్ షా
న్యూఢిల్లీ: బీజేపీ సీనియర్ నేత, కేంద్ర హోం మంత్రి అమిత్ షా తాజాగా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. దర్యాప్తు సంస్థలను కేంద్రం తప్పుదోవలో తమలో కొందరిపై ప్రయోగిస్తోందంటూ విపక్షాలు, కేంద్రంలోని బీజేపీపై గుప్పిస్తున్న విమర్శలపై ఆయన స్పందించారు. యూపీఏ ప్రభుత్వ హయాంలో.. సీబీఐ తనపైనా ఓ కేసు దర్యాప్తు విషయమై ఒత్తిళ్లు చేసిందని, నరేంద్ర మోదీని అందులో ఇరికించే యత్నమూ చేసిందని ఆరోపించారాయన. బుధవారం ఓ మీడియా ఈవెంట్లో ఆయన మాట్లాడుతూ.. యూపీఏ హయాంలో కూడా సీబీఐ నా మీద కూడా ఒత్తిళ్లకు పాల్పడింది. గుజరాత్ ఫేక్ ఎన్కౌంటర్ కేసులో ప్రధాని మోదీని ఇరికించేందుకు యత్నించింది. ఆ సమయంలో ఆయన(మోదీ) గుజరాత్ సీఎంగా ఉన్నారు. ఈ కేసు దర్యాప్తు సమయంలో నన్ను ప్రశ్నించిన సీబీఐ.. మోదీ పేరును ప్రస్తావించాలని సీబీఐ నాపై(షా తనను తాను ఉద్దేశించుకుని) ఎంతో ఒత్తిడి తీసుకొచ్చింది అని పేర్కొన్నారాయన. కానీ, ఆ సమయంలో దర్యాప్తు సంస్థ ఒత్తిళ్లకు నేను తలొగ్గలేదు. అలాగని సీబీఐ తీరును బీజేపీ బహిరంగంగా ఎండగట్టలేదు. కానీ, ఇప్పుడు కాంగ్రెస్ అవినీతికి మద్దతుగా రాద్ధాంతం చేస్తోందని, దర్యాప్తు సంస్థలపై విమర్శలు గుప్పిస్తోందని పేర్కొన్నారాయన. ఇక రాహుల్ గాంధీ అనర్హత పరిణామంపై స్పందిస్తూ.. రాహుల్ గాంధీని కోర్టు దోషిగా తేల్చింది. లోక్‌సభ సభ్యత్వంపై అనర్హత వేటు పడింది. ఆయన కోర్టుకు వెళ్లొచ్చు. కానీ, తన తలరాతకు ప్రధాని మోదీనే కారణమంటూ రాజకీయ రచ్చ చేస్తున్నాడు.. కన్నీళ్లు కారుస్తున్నాడు అంటూ షా తప్పుబట్టారు. ఇంకా పలు అంశాలపైనా ఈ కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇదీ చదవండి: ఆ పథకానికి పీఎం మోదీ కన్వీనర్.. కాంగ్రెస్ చీఫ్ ఎద్దేవా -
వివేకా కేసు విచారణకు నూతన సిట్
సాక్షి, న్యూఢిల్లీ: మాజీ మంత్రి వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణలో సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (సిట్) సీబీఐ ఏర్పాటు చేసింది. బృందంలోని సభ్యుల పేర్లను సీబీఐ అందజేయగా సుప్రీంకోర్టు ఆమోదం తెలిపింది. దర్యాప్తును వేగవంతం చేసి ఏప్రిల్ 30 లోగా పూర్తి చేయాలని ఆదేశిస్తూ ప్రస్తుతం ఈ కేసులో దర్యాప్తు అధికారిగా ఉన్న రాంసింగ్‌ను తప్పించింది. వివేకా హత్య కేసులో ఏ5గా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులశమ్మ దాఖలు చేసిన పిటిషన్‌ను జస్టిస్ ఎంఆర్ షా, జస్టిస్ సీటీ రవికుమార్‌లతో కూడిన ధర్మాసనం బుధవారం విచారించింది. నూతన సిట్ బృందానికి సీబీఐ డీఐజీ కేఆర్ చౌరాసియా నేతృత్వం వహించనున్నారు. ఈ బృందంలో ఎస్పీ వికాస్‌సింగ్, అదనపు ఎస్పీ ముకేష్‌కుమార్, ఇన్స్పెక్టర్లు ఎస్.శ్రీమతి, నవీన్ పూనియా, ఎస్ఐ అంకిత్ యాదవ్ ఉన్నారు. ఇలా ఎంతకాలం? దర్యాప్తు అధికారి మార్పు/కొనసాగింపుపై సీబీఐ డైరెక్టర్ నిర్ణయాన్ని వెల్లడించాలంటూ సుప్రీం కోర్టు ఆదేశించిన నేపథ్యంలో సీబీఐ తరఫు అదనపు సొలిసిటర్ జనరల్ నటరాజన్ తాజాగా జాబితాను అందజేశారు. చౌరాసియా నేతృత్వంలోని నూతన సిట్‌ను పరిగణనలోకి తీసుకుంటున్నట్లు ఈ సందర్భంగా జస్టిస్ ఎంఆర్ షా తెలిపారు. ఈ సందర్భంగా దర్యాప్తు ఆలస్యం అవుతోందని అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం వేగంగా పూర్తి చేయాలని పేర్కొంది. చదవండి: వివేకా హత్య కేసులో ఈ విషయాలు ఎందుకు పరిశీలించలేదు? భారీ కుట్ర కారణంగా ట్రయల్ కోర్టులో అదనపు చార్జిషీటు దాఖలు చేసేందుకు స్వేచ్ఛ కావాలని సీబీఐ కోరడంతో ఇలా ఎంతకాలం సాగదీస్తారని జస్టిస్ సీటీ రవికుమార్ ప్రశ్నించారు. ‘విచారణ వేగవంతం చేయాలని హైకోర్టు, సుప్రీంకోర్టు ఇప్పటికే ఆదేశించాయి. మేం మరోసారి అదే చెబుతున్నాం. బెయిలు పిటిషన్ దరఖాస్తు చేసుకునేందుకు ఏ5 (శివశంకర్‌రెడ్డి) భార్య అనుమతి కోరారు. ఈరోజు నుంచి ఆర్నెళ్ల వరకూ విచారణ ప్రారంభం కాకుంటే రెగ్యులర్ బెయిల్‌కు ఏ 5 దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే సుప్రీంకోర్టు ఆదేశాలు వర్తించవు. కేవలం మెరిట్స్ ప్రకారమే హైదరాబాద్‌లోని ట్రయల్ కోర్టు విచారిస్తుంది. ఈ పిటిషన్‌పై విచారణ ముగిస్తున్నాం’ అని ధర్మాసనం ఆదేశాల్లో పేర్కొంది. చదవండి: ఏది నిజం.. పచ్చపైత్యం ముదిరిపోయింది.! -
సుప్రీం కోర్టులో నేడు వివేకా కేసు పిటిషన్‌పై విచారణ
సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసు విచారణకు సంబంధించి దాఖలైన ఒక పిటిషన్‌పై సుప్రీం కోర్టులో నేడు(మార్చి 27, సోమవారం) విచారణ జరగనుంది. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శివశంకర్‌రెడ్డి భార్య తులసమ్మ దాఖలు చేసిన పిటిషన్‌పై విచారణ చేపట్టనుంది కోర్టు. సీబీఐ తరపున దర్యాప్తు అధికారిని మార్చాలంటూ పిటిషన్ వేశారు తులసమ్మ. గతంలో ఈ పిటిషన్‌పై విచారణ సందర్భంగా.. సుప్రీం కోర్టు దర్యాప్తు సంస్థ తీరును తీవ్రంగా తప్పుబట్టిన సంగతి తెలిసిందే. వైఎస్ వివేకానందరెడ్డి హత్య కేసులో దర్యాప్తు ఆలస్యంపై సుప్రీం కోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. విచారణను ఎందుకు జాప్యం చేస్తున్నారని దర్యాప్తు సంస్థను ప్రశ్నించింది. ఈ మేరకు కేసు పురోగతిపై సీల్డ్ కవర్లో స్టేటస్ రిపోర్టు ఇవ్వాలని సీబీఐని ఆదేశించించింది కూడా. -
manish sisodia: సిసోడియాపై మరో కేసు
ఢిల్లీ: ఆమ్ ఆద్మీ పార్టీ నేత, ఢిల్లీ లిక్కర్ స్కాంలో ప్రధాన నిందితుడిగా ఉన్న మనీష్ సిసోడియాకు మరో షాక్ తగిలింది. ఢిల్లీ ప్రభుత్వ ఫీడ్‌బ్యాక్ విభాగంలో(FBU) అవినీతి ఆరోపణలకుగానూ ఆయనపై తాజాగా సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ మరో కేసు నమోదు చేసింది. ఇప్పటికే ఆయన లిక్కర్ స్కాంలో అరెస్ట్ అయ్యారు. ఫీడ్‌బ్యాక్ యూనిట్‌ను ఢిల్లీలో అధికారంలోకి వచ్చాక ఆప్ ప్రభుత్వం 2015లో ఏర్పాటు చేసింది. అయితే ఈ విభాగం ఏర్పాటు, నిర్వాహణ అంతా చట్టానికి విరుద్ధంగా నడిచిందని, సుమారు రూ.36 లక్షల నష్టంతో అవకతవకలు జరిగాయని సీబీఐ పేర్కొంది. ఈ అవినీతి ఆరోపణలకుగానూ సిసోడియాపై కేసు నమోదు చేస్తున్నట్లు సీబీఐ వెల్లడించింది. ఈ పరిణామంపై ఆప్ జాతీయ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ స్పందించారు. ఇదంతా ప్రధాని ప్లాన్ అని, సుదీర్ఘకాలం మనీష్ సిసోడియాను జైల్లో ఉంచేందుకు తప్పుడు కేసులు బనాయిస్తున్నారంటూ ట్వీట్ చేశారాయన. PM’s plan is to slap several false cases against Manish and keep him in custody for a long period. Sad for the country! https://t.co/G48JtXeTIc — Arvind Kejriwal (@ArvindKejriwal) March 16, 2023 ఎఫ్‌బీయూను తప్పుడు దోవలో రాజకీయ అవసరాల కోసం సిసోడియా ఉపయోగించారని, ఇతరుల వ్యక్తిగత సమాచార సేకరణ యత్నం జరిగిందని(Snooping Case) సీబీఐ తన నివేదికలో పొందుపరిచింది. ఈ మేరకు ఫిబ్రవరి నెలలో కేంద్ర హోం మంత్రిత్వ శాఖ.. అవినీతి నిరోధక చట్టం కింద సిసోడియాను విచారించేందుకు సీబీఐను అనుమతించింది కూడా. ఢిల్లీ మాజీ ఉపముఖ్యమంత్రి అయిన సిసోడియాను సీబీఐ ఢిల్లీ ఎక్సైజ్ పాలసీ 2021-22 రూపకల్పనలో జరిగిన అవినీతి కుంభకోణానికిగానూ ఫిబ్రవరి 26వ తేదీన అరెస్ట్ చేసింది. -
Delhi Liquor Scam: సీబీఐ అరెస్ట్‌పై సుప్రీంకోర్టుకు సిసోడియా..
న్యూఢిల్లీ: లిక్కర్ కుంభకోణం కేసులో అరెస్ట్ అయిన ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా సుప్రీంకోర్టును ఆశ్రయించారు. సీబీఐ అరెస్ట్‌ను సవాల్ చేస్తూ అత్యున్నత న్యాయస్థానంలో మంగళవారం పిటిషన్ దాఖలు చేశారు. సిసోడియా పిటిషన్‌పై విచారణకు సుప్రీంకోర్టు అంగీకరించింది. నేటి మధ్యాహ్నం 3.50 గంటలకు విచారిస్తామని సీజేఐ డీవై చంద్రచూడ్ ధర్మాసనం వెల్లడించింది. సిసోడియా అరెస్టు, మద్యం పాలసీ కేసులో సీబీఐ దర్యాప్తు తీరును సవాల్ చేస్తూ సీనియర్ న్యాయవాది అభిషేక్ మను సింఘ్వీ సీజేఐ ముందు కేసును ప్రస్తావించనున్నారు. కాగా ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో ఆదివారం సీబీఐ అధికారులు మనీష్‌సిసోడియాను అరెస్ట్ చేసిన విషయం తెలిసిందే. ఎనిమిది గంటలపాటు సిసోడియాను ప్రశ్నించిన సీబీఐ అధికారులు.. తాము అడిగిన ప్రశ్నలకు సమాధానాలు సరిగా చెప్పడం లేదని డిప్యూటీ సీఎంను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం సోమవారం ఢిల్లీ రౌస్ అవెన్యూ ప్రత్యేక కోర్టులో ఆయన్ను హాజరుపరిచారు. ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఆయనను విచారించాల్సి ఉందని... తమ కస్టడీకి అప్పగించాలని సీబీఐ కోరింది. దీనికి అంగీకరించిన కోర్టు.. సిసోడియాను 5 రోజుల సీబీఐ కస్టడీకి అనుమతించింది. ఈ పరిమాణాల నేపథ్యంలో ఆయన సుప్రీం మెట్లెక్కారు. మరోవైపు సిసోడియా అరెస్టును వివిధ రాజకీయ పార్టీలు తీవ్రంగా ఖండించాయి. దర్యాప్తు సంస్థలను కేంద్రం దుర్వినియోగం చేసి ప్రతిపక్ష నేతలపై దాడులకు ఉపయోగిస్తోందని విమర్శించాయి. -
విచారణ జరుగుతుండగానే మీడియానే ట్రయల్ చేసి దోషులు ఎవరో తేల్చేస్తున్నారు: అవినాష్ రెడ్డి
-
మాకు వ్యతిరేకంగా కేంద్రం సీబీఐ, ఈడీని వాడుకుంటోంది: సిసోడియా
-
విశాఖ సీబీఐ అధికారులకు ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు వినతిపత్రం
-
చిత్రా రామకృష్ణ విచారణకు గ్రీన్‌సిగ్నల్
న్యూఢిల్లీ: కో–లొకేషన్ స్కామ్ కేసులో మాజీ మేనేజింగ్ డైరెక్టర్, చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (ఎండీ, సీఈవో) చిత్రా రామకృష్ణను విచారించేందుకు సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ (సీబీఐ)కు వీలుకల్పిస్తూ ప్రముఖ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఎన్ఎస్ఈ బోర్డు కీలక నిర్ణయం తీసుకుంది. ఫిబ్రవరి 7వ తేదీన ఈ మేరకు బోర్డ్ ఆమోదముద్ర వేసినట్లు సంబంధిత ఉన్నత స్థాయి వర్గాలు వెల్లడించాయి. డిసెంబర్ త్రైమాసికంలో ఎక్సే్ఛంజ్ ఆదాయ అంశాలను కూడా బోర్డ్ ఈ సందర్భంగా ఆమోదించినట్లు ఆ వర్గాలు తెలిపాయి. గత ఏడాది మార్చి 6వ తేదీన చిత్రా రామకృష్ణ అరెస్టయ్యారు. అటు తర్వాత ఆమెను విచారించేందుకు నేషనల్ స్టాక్ ఎక్సే్ఛంజ్ ఆఫ్ ఇండియా (ఎన్ఎస్ఈ) బోర్డు ఆమోదం కోసం సీబీఐ వేచి చూస్తోంది. నిజానికి ఈ కేసులో 2018 మేలో సీబీఐ ఎఫ్ఐఆర్ను నమోదుచేసింది. అనంతరం దాదాపు నాలుగు సంవత్సరాల తర్వాత ఆమె అరెస్టయ్యారు. స్కామ్ ఏమిటి? మార్కెట్ ఎక్సే్ఛంజీల కంప్యూటర్ సర్వర్ల నుంచి కొందరు స్టాక్ బ్రోకర్లకు చట్ట విరుద్ధంగా కీలక ముందస్తు సమాచారం లభించేలా చిత్రా రామకృష్ణ అవకతవకలకు పాల్పడ్డారన్న ప్రధాన ఆరోపణపై సీబీఐ విచారణ జరుపుతోంది. ఎక్సే్ఛంజ్ ప్రాంగణంలో ఆయా స్టాక్ బ్రోకర్లు తమ సర్వర్లు, సిస్టమ్స్ లోకేట్ చేయడానికి, నిర్దిష్ట రాక్లను రెంట్‌కు తీసుకోడానికి అనుమతించారన్నది క్లుప్తంగా కో–లొకేషన్ స్కామ్ ప్రధానాంశం. ఈ కో– లెకేషన్ స్కామ్ ద్వారా కొంతమంది బ్రోకర్లు అధిక ఫ్రీక్వెన్సీ ట్రేడింగ్‌లో ప్రిఫరెన్షియల్ యాక్సెస్‌ను పొందారన్న ఆరోపణలు ఉన్నాయి. రామకృష్ణ 2009లో ఎన్ఎస్ఈ జాయింట్ మనేజింగ్ డైరెక్టర్‌గా నియమితులయ్యారు. 2013 మార్చి 31 వరకు ఆ స్థానంలో కొనసాగారు. 2013 ఏప్రిల్ 1న ఆమె ఎండీ, సీఈఓగా పదోన్నతి పొందారు. ఎన్ఎస్ఈలో ఆమె పదవీకాలం డిసెంబర్ 2016లో ముగిసింది. కో–లొకేషన్ కుంభకోణం వ్యవహారంలో క్యాపిటల్ మార్కెట్స్ రెగ్యులేటర్ సెబీ 2019లో ఏప్రిల్ చిత్రారామకృష్ణ అలాగే ఎన్ఎస్ఈ ఎండీ, సీఈవోగా పనిచేసిన రవి నారాయణ్‌లను లిస్టెడ్ కంపెనీ లేదా మార్కెట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇన్స్టిట్యూషన్తో లేదా మరే ఇతర మార్కెట్ ఇంటర్మీడియేటరీతో సంబంధం లేకుండా ఐదేళ్ల పాటు నిషేధించింది. నిర్ణీత వ్యవధిలో తీసుకున్న జీతాల్లో 25 శాతాన్ని డిపాజిట్ చేయాలని కూడా వారిని ఆదేశించింది. అయితే ఈ ఏడాది ఫిబ్రవరిలో రామకృష్ణ, నారాయణ్‌లపై మార్కెట్ రెగ్యులేటర్ జారీ చేసిన ఆదేశాలను సెక్యూరిటీస్ అప్పిలేట్ ట్రిబ్యునల్ (శాట్) కొట్టివేసింది. సుప్రీంకోర్టులో మాజీ సీఈఓకు ఊరట ఢిల్లీ హైకోర్టు బెయిల్‌పై జోక్యానికి నో... ఇదిలావుండగా, చిత్రరామకృష్ణకు బెయిల్ మంజూరు చేస్తూ ఢిల్లీ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి అత్యున్నత న్యాయస్థానం నిరాకరించింది. సీబీఐ కేసులో చిత్రారామకృష్ణకు ఢిల్లీ హైకోర్టు గతేడాది సెప్టెంబర్ 28వ తేదీన బెయిల్ మంజూరు చేసింది. దీనిని సవాలు చేస్తూ, సీబీఐ సుప్రీంను ఆశ్రయించింది. దీనిని విచారించిన జస్టిస్ అజయ్ రస్తోగీ, బేల ఎం త్రివేదిలతో కూడిన డివిజన్ బెంచ్ సీబీఐ అప్పీల్‌ను తిరస్కరిస్తూ, అరెస్టయిన 60 రోజుల్లో రావాల్సిన బెయిల్‌కు సంబంధించి మాత్రమే హైకోర్టు ఉత్తర్వులు ఉన్నాయని పేర్కొంది. విచారణను ఈ బెయిల్ ప్రభావితం చేయబోదని తెలిపింది. గత ఏడాది ఫిబ్రవరి 24న ఈ కేసులో అరెస్టయిన ఎక్సే్ఛంజ్ మాజీ గ్రూప్ ఆపరేటింగ్ ఆఫీసర్ (జీఓఓ) ఆనంద్ సుబ్రమణియన్‌కు బెయిల్ మంజూరు చేస్తూ హైకోర్టు ఇచ్చిన ఉత్తర్వుల్లో జోక్యం చేసుకోవడానికి కూడా సుప్రీంకోర్టు నిరాకరించింది. కాగా, కో–లొకేషన్ కేసుకు సంబంధించి అక్రమ ధనార్జన (మనీలాండరింగ్) ఆరోపణలపై గత ఏడాది జూలై 14న చిత్రా రామకృష్ణఅను అరెస్ట్ చేస్తున్నట్లు ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) చూపించింది. ఈ కేసులో కూడా ఈ ఏడాది ఫిబ్రవరి 9 ఢిల్లీ హైకోర్టు చిత్రా రామకృష్ణకు బెయిల్ మంజూరు చేసింది. ఎన్ఎస్ఈ ఉద్యోగుల అక్రమ ఫోన్ ట్యాపింగ్, రహస్య సమాచార సేకరణ వంటి ఆరోపణలు కూడా ఈడీ దాఖలు చేసిన మనీలాండరింగ్ కేసులో ఉన్నాయి. -
బుచ్చిబాబు మద్యం విధానం కుట్రలో భాగస్వామి: సీబీఐ
-
Custom Milling Rice: సీఎంఆర్‌పై సీబీ'ఐ'
సాక్షి, హైదరాబాద్/న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా ధాన్యం కొనుగోళ్లు, కస్టమ్ మిల్లింగ్ రైస్ (సీఎంఆర్) అప్పగింతల్లో జరిగిన అక్రమాలపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) దృష్టి పెట్టింది. భారత ఆహార సంస్థ (ఎఫ్‌సీఐ) అధికారుల సహకారంతో చాలా రాష్ట్రాల్లో రైస్ మిల్లర్లు, వ్యాపారులు, రాష్ట్ర అధికారులు కలిసి వ్యవస్థీకృత సిండికేట్ నడుపుతున్నారనే ఆరోపణల నేపథ్యంలో ఆయా రాష్ట్రాల్లో సీబీఐ విచారణ చేపట్టి తనిఖీలు నిర్వహిస్తోంది. ధాన్యం కొనుగోళ్లలో పెద్ద ఎత్తున అక్రమాలకు పాల్పడటం, నాసిరకం బియ్యాన్ని ప్రభుత్వానికి అప్పగించడం, నాణ్యత ప్రమాణాలకు తిలోదకాలిచ్చి బియ్యం సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై ఇప్పటికే ఢిల్లీ, హరియాణా, పంజాబ్, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లో దాడులు నిర్వహించింది. 74 మందిపై కేసులు నమోదు చేసి అరెస్ట్ చేసింది. ఇదే క్రమంలో త్వరలోనే తెలంగాణలోనూ ధాన్యం కొనుగోళ్లలో అక్రమాలు, సీఎంఆర్ అప్పగింతల్లో అవకతవకలపై దర్యాప్తుకు సీబీఐ రంగంలోకి దిగనున్నట్లు కేంద్రప్రభుత్వ వర్గాల ద్వారా తెలుస్తోంది. రాష్ట్రంలోని అధికార బీఆర్ఎస్ నేతల అండతో మిల్లర్లు సీఎంఆర్ కేటాయింపుల విషయంలో అవకతవకలకు పాల్పడుతున్నట్లుగా ఢిల్లీకి ఉప్పందినట్లు తెలిసింది. మిల్లర్లకు పౌరసరఫరాల శాఖ అధికారుల సంపూర్ణ సహకారం కూడా ఉందని భావిస్తున్న సీబీఐ ఆ దిశగా దర్యాప్తుకు సిద్ధమవుతున్నట్లు సమాచారం. 4 రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో తనిఖీలు.. విశ్వసనీయ సమాచారం మేరకు.. ధాన్యం ఉత్పత్తి అధికంగా ఉండే పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్, తెలంగాణ వంటి రాష్ట్రాల్లో ధాన్యం కొనుగోళ్లలో భారీగా అక్రమాలు జరిగినట్లు సీబీఐ గుర్తించింది. దీనితో పాటు సకాలంలో కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ ఇవ్వకుండా మిల్లర్లు ప్రైవేటుకు అమ్ముకోవడం, దీనికి కొందరు ఎఫ్‌సీఐ అధికారులతో పాటు ఆయా రాష్ట్రాల ఆహార, పౌరసరఫరాల శాఖల అధికారులు సహకరిస్తుండటాన్ని కూడా గుర్తించింది. సెంట్రల్ పూల్‌కు ఇచ్చే బియ్యంలో నాణ్యత లోపిస్తున్నా, ఎఫ్‌సీఐ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండడంతో వినియోగదారులకు నాణ్యత లేని బియ్యం సరఫరా అవుతున్నట్లు నిర్ధారించింది. ఈ నేపథ్యంలోనే మూడ్రోజుల కిందట ఢిల్లీ, పంజాబ్, హరియాణా, ఛత్తీస్‌గఢ్ రాష్ట్రాల్లోని 50 ప్రాంతాల్లో సీబీఐ ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది. ఎఫ్‌సీఐ డిప్యూటీ జనరల్ మేనేజర్ రాజీవ్‌కుమార్ మిశ్రా సహా 74 మందిని అరెస్ట్ చేసింది. ఇందులో 37 మంది ఎఫ్‌సీఐ అధికారులు కాగా మిగతావారిలో మిల్లర్లు, దళారులు, గోదాముల నిర్వాహకులు ఉన్నారు. ఉత్పత్తి సామర్థ్యానికి మించి కొనుగోళ్లు మిశ్రా ఎఫ్‌సీఐ ప్రధాన కార్యాలయంలో పనిచేసిన సమయంలోనే తెలంగాణ, పంజాబ్, హరియాణా రాష్ట్రాల్లో ఉత్పత్తి సామరŠాధ్యనికి మించి ధాన్యం కొనుగోళ్లు జరిగాయనే ఆరోపణలు వచ్చాయి. మిశ్రా చాలా రాష్ట్రాల మిల్లర్లతో కుమ్మక్కై, కేంద్రానికి ఇవ్వాల్సిన సీఎంఆర్ కోటా గడువు పెంపునకు ఆదేశాలు ఇచ్చారని, ఈ క్రమంలో కోట్ల రూపాయలు చేతులు మారాయనే ఆరోపణలు రాగా విచారణ జరుగుతోంది. తెలంగాణకు సంబంధించి ఎఫ్‌సీఐలో గతంలో పనిచేసిన ఓ అధికారి హయాంలో కూడా సీఎంఆర్ కోటా సేకరణ విషయంలో అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. అలాగే గత సంవత్సరం వానాకాలం, యాసంగి సీజన్ల సీఎంఆర్ గడువు దాటినా ఎఫ్‌సీఐకి అందకపోవడం, లెక్కల్లో తేడాలుండటం వంటి అంశాలు సీబీఐ దృష్టిలో ఉన్నట్లు చెబుతున్నారు. సీఎంఆర్ అప్పగింతలో అవకతవకలు రాష్ట్రంలో వానాకాలం, యాసంగి సీజన్లలో రైతులు పండించిన పంటను మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం.. ఆ ధాన్యాన్ని ఎప్పటికప్పుడు మిల్లులకు తరలిస్తుంటుంది. సుమారు 3 వేల మిల్లుల ద్వారా ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, కేంద్ర ప్రభుత్వం సెంట్రల్‌పూల్ కింద ఇచ్చిన టార్గెట్‌కు అనుగుణంగా సీఎంఆర్‌ను ఎఫ్‌సీఐ గోడౌన్లకు పంపిస్తుంటుంది. అయితే మిల్లర్లు వ్యాపారమే లక్ష్యంగా రాజకీయ అండదండలతో అవకతవకలకు పాల్పడుతున్నారు. వచ్చిన ధాన్యాన్ని ఆరునెలల్లోగా మిల్లింగ్ చేసి ఎఫ్‌సీఐకి అప్పగించాల్సిన మిల్లర్లు ఆ తర్వాత రెండు, మూడు సీజన్లు గడిచినా అప్పగించడం లేదు. మిల్లుల్లోని నాణ్యమైన సర్కారు ధాన్యాన్ని మిల్లింగ్ చేసి, ప్రైవేటు వ్యాపారులకు విక్రయించుకుంటున్నారని, ప్రజా పంపిణీ బియం కొని, రీసైక్లింగ్ చేసి లోటును భర్తీ చేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఆధారాలు సేకరించిన దర్యాప్తు సంస్థ! రాష్ట్రంలో ఉన్న సుమారు 3 వేల రైస్ మిల్లులకు గత మూడేళ్లుగా ప్రతి సీజన్లో సుమారు రూ.15 వేల కోట్ల విలువైన ధాన్యాన్ని ప్రభుత్వం అప్పగించి, సీఎంఆర్ తీసుకుంటోంది. ధాన్యాన్ని మిల్లింగ్ చేసినందుకు లేబర్ ఖర్చుతో సహా ప్రతి పైసా మిల్లర్లకు చెల్లిస్తోంది. అయినా.. 33 జిల్లాల్లోని పలువురు పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో మిల్లర్లు సర్కారు ధాన్యాన్ని సొంత వ్యాపారానికి వినియోగించుకుంటున్నట్టుగాసీబీఐ ఆధారాలు సేకరించినట్లు సమాచారం. 2019–20లో 118 మంది మిల్లర్లు రూ.230 కోట్ల విలువైన 1,00,427 మెట్రిక్ టన్నుల బియ్యం ఎఫ్‌సీఐకి బకాయి పడగా, వారిపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. పైగా సదరు మిల్లులకు మరోసారి సీఎంఆర్ గడువు పెంచడం అనుమానాలకు తావిచ్చింది. 2020–21లో కూడా వందల సంఖ్యలో మిల్లర్లు బకాయిలు పడగా వారిని డిఫాల్టర్లుగా ప్రకటించి, 2021–22 సీజన్లలో ధాన్యం కేటాయింపును నిలిపివేశారు. అయితే ఆ తర్వాత రాజకీయ జోక్యంతో సదరు మిల్లులకు కూడా యధాతథంగా ధాన్యం సరఫరా అయింది. గత మూడేళ్లుగా రాష్ట్రంలో ధాన్యం దిగుబడి గణనీయంగా పెరగ్గా.. పౌరసరఫరాల శాఖ అధికారుల అండతో సాగుతున్న అడ్డగోలు వ్యవహారాలన్నింటిపై సీబీఐ ప్రాథమికంగా సమాచారం సేకరించినట్లు తెలిసింది. ఇప్పటికీ పెండింగ్‌లో 2021–22 వానాకాలం బియ్యం రాష్ట్రంలో ప్రస్తుతం 2022–23 వానకాలం సీజన్‌కు సంబంధించిన ధాన్యం కొనుగోళ్లు సాగుతుండగా, మరో నెలలో కస్టమ్ మిల్లింగ్ ప్రారంభం కావలసి ఉంది. కానీ ఇప్పటికీ 2021–22 వానాకాలం సీజన్‌కు సంబంధించిన బియ్యం 8.65 లక్షల మెట్రిక్ టన్నులు (ఎల్ఎంటీ) ఎఫ్‌సీఐకి రావలసి ఉండటం గమనార్హం. ఆ సీజన్లో 70.21 ఎల్ఎంటీల ధాన్యాన్ని మిల్లర్లకు అప్పగించగా, 47.04 ఎల్ఎంటీల బియ్యాన్ని సీఎంఆర్ కింద ఇవ్వాల్సి ఉంది. అయితే ఇప్పటికి పలుమార్లు గడువు పెంచినా ఎఫ్‌సీఐకి ఇచ్చిన బియ్యం 38.39 ఎల్‌ఎంటీలే. ఇక గత యాసంగి సీజన్‌కి సంబంధించి 50.39 ఎల్ఎంటీ ధాన్యం మిల్లులకు పంపించి, 34.07 ఎల్ఎంటీ సీఎంఆర్ తీసుకోవలసి ఉండగా, ఇప్పటివరకు కేవలం 16 ఎల్ఎంటీల బియ్యం మాత్రమే ఎఫ్‌సీఐకి అందింది. 2020–21 యాసంగి సీజన్‌కు సంబంధించి మిర్యాలగూడలోని వజ్ర పారాబాయిల్డ్ రైస్‌మిల్లు రూ.5.90 కోట్ల విలువైన బియ్యాన్ని ఎగవేయడంతో ఈ నెల 9న ఆ రైస్‌మిల్లు యజమానులు ముగ్గురిని అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు. ఇలాంటి కేసులు ప్రతి జిల్లాలో ఉన్నప్పటికీ అధికారుల అండతో అక్రమాలు యధేచ్చగా కొనసాగుతూనే ఉన్నాయనే ఆరోపణలు విన్పిస్తున్నాయి. -
ఈ తొమ్మిది రాష్ట్రాల్లో ‘సీబీఐ’కి నో ఎంట్రీ
న్యూఢిల్లీ: ముందస్తు అనుమతిలేకుండా తమ రాష్ట్రాల్లో కేసులను దర్యాప్తు చేయడానికి వీల్లేదంటూ సీబీఐని తొమ్మిది రాష్ట్రాలు నిరోధించాయని కేంద్రం బుధవారం వెల్లడించింది. తెలంగాణ, పశ్చిమబెంగాల్, కేరళ, ఛత్తీస్‌గఢ్, జార్ఖండ్, మేఘాలయ, మిజోరం, పంజాబ్ రాష్ట్రాలు నిర్ణయం తీసుకున్నాయని మంత్రి జితేంద్రసింగ్ సభలో పేర్కొన్నారు. బీజేపీ నేతృత్వంలోని కేంద్రప్రభుత్వంతో బేదాభిప్రాయాలు, ఇతరత్రా ప్రత్యేక కారణాలను చూపుతూ కొన్ని రాష్ట్రాలు సీబీఐకి సాధారణ అనుమతికి నిరాకరించిన విషయం తెల్సిందే. ఈ విషయాన్ని కేంద్రం బుధవారం పార్లమెంట్ సాక్షిగా వెల్లడించింది. ఇదీ చదవండి: Tawang dominates Parliament: ‘చైనా’పై చర్చించాల్సిందే -
ఢిల్లీ లిక్కర్ స్కాం ఏంటి?.. అసలు కథ ఎప్పుడు మొదలైంది?
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో ఢిల్లీ లిక్కర్ స్కాం ప్రకంపనలు సృష్టిస్తోంది. లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని కవితకు సీబీఐ నోటీసులిచ్చిన సంగతి తెలిసిందే. 160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసింది. ఇప్పటికే లిక్కర్ స్కాంలో తెలంగాణకు చెందిన అభిషేక్ బోయినపల్లి అరెస్టయ్యారు. ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగిన మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ ఢిల్లీ ప్రభుత్వం పాలసీని మార్చింది. ►ఢిల్లీలో ఉన్న మద్యం దుకాణాలకు సంబంధించి ముందుగా ఒక ఎక్స్పర్ట్ కమిటి వేసిన ఢిల్లీ ప్రభుత్వం ►ఢిల్లీ ఎక్సైజ్ కమిషనర్ ఆధ్వర్యంలో ముగ్గురితో కమిటి వేసిన ప్రభుత్వం ►అయితే ఎక్స్పర్ట్ కమిటి సిఫార్సులపై మళ్లీ ముగ్గురు మంత్రులతో కమిటీ వేసిన ఢిల్లీ ప్రభుత్వం ►చాలా కాలంగా ప్రభుత్వ హయాంలో ఉన్న రిటైల్ మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు అప్పజెప్పాలని నిర్ణయించిన ఢిల్లీ ప్రభత్వం ►ఫిబ్రవరి 2021లో మంత్రులతో కమిటీ వేసిన ఢిల్లీలోని ఆప్ ప్రభుత్వం ►నెల రోజుల్లో రిపోర్టు ఇచ్చిన మంత్రుల కమిటి... మార్చి 2021లో మంత్రుల కమిటి సిఫార్సును ఓకే చేసిన ఢిల్లీ క్యాబినెట్ ►ఢిల్లీలో మద్యం అమ్మకాలు ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని ప్రభుత్వం వేసిన కమిటీ సిఫార్సు చేసింది ►ప్రైవేటు వ్యక్తులకు మద్యం షాపులు కేటాయించడం ద్వారా ప్రభుత్వ ఆదాయం 9500కోట్లు పెరుగుతుందని ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ►ఢిల్లీ క్యాబినెట్ ఓకే చేసిన కొత్త లిక్కర్ పాలసీని ఢిల్లీ ఎల్జీకి పంపిన ప్రభుత్వం ►దాదాపు నాలుగు నెలలు పెండింగ్ పెట్టిన తరువాత 2021 నవంబర్‌లో కొత్త పాలసీకి ఓకే చెప్పిన ఢిల్లీ లెఫ్టనెంట్ గవర్నర్ ►అయితే కొత్తగా ఏర్పాటు చేయబోయే మద్యం దుకాణాలకు ఢిల్లీ డెవలప్మెంట్ అధారిటీతో పాటు ఢిల్లీ మున్సిపల్ కార్పోరేషన్ అనుమతి తప్పనిసరి అని ఎల్జీ మెలిక పెట్టారు. ►కొత్త ఎక్సైజ్ పాలసీకి అనుగుణంగా ఢిల్లీలో తెరుచుకున్న 849 మద్యం దుకాణాలు ►కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ధరల విషయంలో ప్రైవేటు వ్యాపారులు స్వేచ్ఛగా వ్యవహరించే అవకాశం ►తెల్లవారుజామున 3గంటల వరకు షాపులు తెరిచి ఉంచేందుకు వీలు కల్పించిన లిక్కర్ పాలసీ ►ఇక కొత్త లిక్కర్ పాలసీ ద్వారా మద్యం హోమ్ డెలివరీ చేసేందుకు అవకాశం ►కొత్త చీఫ్ సెక్రెటరీ రాకతో... వెలుగులోకి స్కాం ►2022 ఎప్రిల్లో నరేష్ కుమార్... ఢిల్లీ చీఫ్ సెక్రెటరీగా నియామకం ►ఉద్యోగంలో చేరగానే లిక్కర్ పాలసీని క్షుణ్ణంగా స్టడీ చేసిన నరేష్ కుమార్ ►లిక్కర్ పాలసీ రూపకల్పనలోనే అవకతవకలు జరిగాయని... మద్యం దుకాణాల కేటాయింపులోనూ తప్పులు జరిగినట్లు గుర్తించిన చీఫ్ సెక్రెటరీ ►కొత్త లిక్కర్ పాలసీ ద్వారా ప్రైవేటు వ్యక్తులకు లబ్ది చేకూరేలా విధానపరమైన మార్పులు చేసినట్లు డిల్లీ సీఎస్ నివేదిక రూపొందించారు ►ఢిల్లీ చీఫ్ సెక్రెటరీ ఇచ్చిన నివేదిక ఆధారంగా లెఫ్టనెంట్ గవర్నర్ ఈ ఏడాది జులైలో సీబీఐ విచారణకు ఆదేశించారు ►ఓ వైపు చీఫ్ సక్రెటరీ నివేదిక రూపొందిస్తున్న సమయంలోనే లిక్కర్ పాలసీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ►తాము ఆశించిన స్థాయిలో ప్రభుత్వ ఆదాయం పెరగడం లేదని అందుకే కొత్త పాలసీని రద్దుచేస్తున్నట్లు ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం ►తొలి త్రైమాసికానికి బడ్జెట్ అంచనాల కన్నా దాదాపు 35శాతం తక్కువ ఆదాయం వచ్చినట్లు అసెంబ్లీలో ప్రకటించిన ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ స్కాం.. ఆరోపణలు ►మద్యం దుకాణాల కేటాయింపుల్లో అవకతవకలు జరిగాయి ►మద్యం దుకాణాల కేటాయింపులో నిబంధనలకు విరుద్ధంగా గుత్తాధిపత్యం కనిపించింది. ►మద్యం పాలసీలో మార్పులు చేస్తూ ఢిల్లీ ఉపముఖ్యమంత్రి సిసోడియా ప్రభుత్వానికి 145కోట్ల రూపాయల నష్టం చేశారు. ►మద్యం వ్యాపారులు ప్రభుత్వానికి కట్టాల్సిన రూ.145 కోట్ల రూపాయలను కోవిడ్ పేరుతో ఏకపక్షంగా ప్రభుత్వం మాఫీ చేసింది. ►ప్రతీ బీర్ కేస్‌కు ప్రభుత్వానికి చెల్లించాల్సిన ఇంపోర్ట్ డ్యూటీని ప్రభుత్వం మాపీ చేసింది. ►ఎల్-1 కేటగిరి లైసెన్సుల జారీలో లంచాలు తీసుకుని పర్మిషన్లు ఇచ్చారు. ►ఢిల్లీ ఉపముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడు దినేష్ అరోరా కంపెనీకి ఒక మద్యం వ్యాపారి కోటి రూపాయలు తరలించినట్లు గుర్తించి సీబీఐ ►రిటైల్ వెండర్లకు క్రెడిట్ నోట్లు జారీచేయడం ద్వారా లంచాలు ఇచ్చినట్లు గుర్తించిన సీబీఐ ►మనిష్ సిసోడియా అనుచరులు దినేష్ అరోరా, అమిత్ అరోరా, అర్జున్ పాండేలు ఈ కుంభకోణంలో కీలకపాత్ర పోషించినట్లు గుర్తించిన అధికారులు -ఇస్మాయిల్, ఇన్పుట్ ఎడిటర్, సాక్షి టీవీ -
ముగిసిన కవిత సీబీఐ విచారణ.. అవసరమైతే మళ్లీ ప్రశ్నించే అవకాశం
06:30PM ►ఢిల్లీ లిక్కర్ స్కాంలో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత సీబీఐ విచారణ ముగిసింది. ►అవసరమైతే మళ్లీ విచారించే అవకాశం ►ఏడు గంటలపాటు కవితను సీబీఐ విచారించింది. ► ఉదయం 11 గంటల నుంచి కవితను సీబీఐ ప్రశ్నించింది. ►సీఆర్పీసీ 161కింద కవిత స్టేట్మెంట్ను రికార్డు చేసింది. 06:00PM ►లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను విచారిస్తున్న సీబీఐ ►7 గంటలకు పైగా కవితను ఆమె నివాసంలోనే ప్రశ్నిస్తున్న సీబీఐ 03:00PM ►ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితను సీబీఐ ప్రశ్నిస్తోంది. ► రాఘవేంద్ర వత్స ఆధ్యర్యంలో ఆరుగురు సభ్యుల బృందం కవితను ప్రశ్నిస్తోంది. ►కవిత నివాసంలో సీబీఐ విచారణ 4 గంటలుగాపైగా కొనసాగుతోంది. ►కవిత న్యాయవాది సమక్షంలోనే సీబీఐ స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తోంది. ►సాయంత్రం 5 గంటల వరకు విచారణ కొనసాగే అవకాశం ఉంది. 12:28AM ►కవిత నివాసంలో మూడు గంటలకు కొనసాగుతున్న సీబీఐ విచారణ ►సీబీఐ టీమ్‌ను లీడ్ చేస్తున్న రాఘవేంద్ర వత్స ►సీబీఐ అడిగే ప్రశ్నలు, కవిత ఇచ్చే సమాధానాలపై ఉత్కంఠ 11:28AM ►సీబీఐ డీఐజీ రాఘవేంద్ర ఆధ్వర్యంలో కవిత విచారణ ►సీబీఐ బృందంలో 11మంది అధికారులు ►కవిత స్టేట్మెంట్ను రికార్డ్ చేస్తున్న సీబీఐ అధికారులు 11:11AM ►ప్రారంభమైన కవిత సిబిఐ విచారణ ►సిబిఐ ఉన్నతాధికారులు సిద్ధం చేసిన ప్రశ్నావళిని ముందుంచి ప్రశ్నించే అవకాశం ►మొదటి రోజు ఓరల్ విచారణ ►కొన్ని డాక్యుమెంట్లు, కాల్ లిస్ట్ పై ప్రశ్నించనున్న అధికారులు ►సిసోడియా, అరోరా, అభిషేక్ విషయంలో కవితను విచారించనున్న సిబిఐ 10:51AM కవిత నివాసానికి చేరుకున్న డిల్లీ సిబిఐ అధికారులు ►మహిళా అధికారులతో సహా ఆరుగురు అధికారులు ►న్యాయనిపుణుల సమక్షంలో విచారించాలని కోరే అవకాశం ►ఇప్పటికే చేరుకున్న న్యాయవాదులు ►160 సీఆర్పీసీ నోటీస్ కింద విచారణ ►గ్రౌండ్ ఫ్లోర్ లోనే ప్రత్యేక గదిని సిద్దం చేసిన సిబ్బంది 10:38AM ►మరికాసేపట్లో కవిత నివాసానికి రానున్న సిబిఐ బృందం ►సిబిఐ గెస్ట్ హౌస్ నుంచి కవిత నివాసానికి బయల్దేరిన ఢిల్లీ సీబీఐ టీం. ►మూడు వెహికల్స్ లో బయలు దేరిన అధికారులు ►ఢిల్లీ మద్యం కేసులో కవిత స్టేట్మెంట్ రికార్డు చేయనున్న సిబిఐ బృందం ►కవిత ఇంటి పరిసర ప్రాంతాల్లో భారీ ఎత్తున పోలీస్ భద్రత ఏర్పాటు ►ఎయిర్పోర్ట్ నుంచి తమ అధికార గెస్ట్ హౌస్ లో దిగిన సిబిఐ టీమ్స్ సాక్షి, హైదరాబాద్: లిక్కర్ స్కామ్‌కు సంబంధించి ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాపై నమోదు చేసిన కేసులో.. ఈ రోజు(ఆదివారం) ఉదయం 11 గంటలకు రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు కుమార్తె, ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితను సీబీఐ విచారించనుంది. ఈ నెల 11న విచారణకు తన నివాసంలో అందుబాటులో ఉంటానని కవిత తెలియజేయగా, సీబీఐ కూడా అందుకు అంగీకరించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో నిత్యం వందలాది మంది కార్యకర్తలతో కళకళలాడే కవిత నివాసం ప్రాంగణం బోసిపోయింది. భారీ సంఖ్యలో ఫ్లెక్సీలు.. మరోవైపు పార్టీ శ్రేణులు వారం రోజులుగా పెద్ద ఎత్తున బంజారాహిల్స్‌లోని ఆమె నివాసానికి తరలివచ్చి సంఘీభావం తెలుపుతున్నారు. దీంతో పోలీసులు అక్కడ భద్రత కట్టుదిట్టం చేశారు. ‘డాటర్ ఆఫ్ ఫైటర్.. విల్ నెవర్ ఫియర్’(యోధుడి కుమార్తె.. ఎప్పుడూ భయపడదు), ‘వుయ్ ఆర్ విత్ యూ కవితక్కా..’(మేము నీతో ఉన్నాం కవితక్కా..) అంటూ కవిత నివాస పరిసర ప్రాంతాలతో పాటు పలుచోట్ల పార్టీ శ్రేణులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేశాయి. ఇలావుండగా కొండగట్టు ఆలయ అభివృద్ధికి రూ.100 కోట్లు కేటాయించేలా కృషి చేసినందుకు గాను కవితకు ఎమ్మెల్యేలు సుంకె రవిశంకర్, డాక్టర్ సంజయ్ కృతజ్ఞతలు తెలిపారు. ఆలయ ఈఓ, పూజారులు కవితకు వేద ఆశీర్వచనాలు అందజేశారు. తెలంగాణాలో ప్రకపంనలు సృష్టిస్తున్న ఢిల్లీ లిక్కర్ స్కాం ►లిక్కర్ స్కాంలో విచారణకు హాజరు కావాలని కవితకు నోటీసులిచ్చిన సీబీఐ ►160 సీఆర్పీసీ కింద నోటీసులు జారీ చేసిన సీబీఐ ►ఇప్పటికే లిక్కర్ స్కాంలో అరెస్టైన తెలంగాణాకు చెందిన అభిషేక్ బోయినపల్లి ►ఢిల్లీ ప్రభుత్వం గతేడాది ప్రవేశపెట్టిన కొత్త లిక్కర్ పాలసీలో అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ►గతంలో ఢిల్లీ ప్రభుత్వ హయాంలో జరిగే మద్యం అమ్మకాలను ప్రైవేటు కంపెనీలకు ధారాదత్తం చేస్తూ పాలసీని మార్చిన ఢిల్లీ ప్రభుత్వం -
డిసెంబర్ 11న సీబీఐ విచారణకు సిద్ధమన్న కవిత
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో తన వివరణ ఇవ్వడానికి డిసెంబర్ 11న ఉదయం 11 గంటలకు సిద్ధమని టీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత తెలిపారు. సీబీఐ అధికారులతో సమావేశం కావడానికి ఆరోజున అందుబాటులో ఉంటానని పేర్కొన్నారు. ఈ మేరకు సీబీఐ అధికారులకు కవిత ఈ- మెయిల్ ద్వారా సమాచారం అందించారు. కాగా, మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. దీంతో అధికారులు మరో రోజు విచారణకు అంగీకరించారు. చదవండి: (ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ) -
ఎమ్మెల్సీ కవిత లేఖకు సమాధానమిచ్చిన సీబీఐ
న్యూఢిల్లీ: ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత లేఖకు కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ జవాబు ఇచ్చింది. డిసెంబర్ 11న కవితతో సమావేశానికి సీబీఐ అంగీకరించింది. ఈ మేరకు ఈ మెయిల్ ద్వారా కవితకు సమాచారం ఇచ్చింది. డిసెంబర్ 11న విచారణకు అందుబాటులో ఉండాలని తెలిపింది. మంగళవారం ఉదయం 11 గంటలకు హైదరాబాద్‌లోని కవిత ఇంట్లో ఆమె స్టేట్మెంట్ రికార్డు చేయనుంది సీబీఐ. కాగా మంగళవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరు కావాలని 160 సీఆర్పీసీ కింద సీబీఐ అధికారులు నోటీసులు పంపించిన విషయం తెలిసిందే. అయితే తాను ఆ రోజు అందుబాటులో ఉండటం లేదని విచారణకు హాజరుకాలేనని కవిత సీబీఐకి లేఖ రాశారు. ఈనెల 11, 12, 14, 15 తేదీన విచారించేందుకు సమయం కోరారు. ఈ క్రమంలో ఎమ్మెల్సీ కవిత సమాచారం మేరకు సీబీఐ అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. చదవండి: శంషాబాద్‌కు భారీ ‘తిమింగలం’! -
తప్పు చేయకుంటే భయం ఎందుకు?
-
మంత్రి గంగుల, ఎంపీ గాయత్రీ రవికి సీబీఐ నోటీసులు
-
సీబీఐ అధికారినంటూ విశాఖవాసి మోసాలు.. ఏకంగా ఏడీజీపీగా నటన.. చివరకు
న్యూఢిల్లీ: సీబీఐ అధికారినంటూ మోసాలకు పాల్పడుతున్న వ్యక్తి బాగోతం బట్టబయలైంది. కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)లో సీనియర్ ఆఫీసర్ని అని చెప్పుకుంటూ అనేక మంది వ్యక్తుల నుంచి డబ్బు వసూలు చేసిన కొవ్విరెడ్డి శ్రీనివాసరావును సీబీఐ అరెస్టు చేసి కేసు నమోదు చేసింది. ఈ నకిలీ అధికారి విశాఖపట్నం చిన్నవాల్తేరుకు చెందిన వ్యక్తిగా అధికారులు గుర్తించారు. సీబీఐలో సీనియర్ ఐపీఎస్ అధికారిగా నటిస్తూ అతను భారీగా కూడబెట్టినట్టు తెలిసింది. నిందితుడిని అరెస్టు చేసిన సీబీఐ అధికారులు అతని ఇంట్లో జరిపిన సోదాల్లో రూ.21లక్షల నగదు, గోల్డ్ స్టోన్స్ స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు ఢిల్లీలోని తమిళనాడు హౌస్‌లో ఉంటున్నాడు. అడిషనల్ డైరెక్టర్ జనరల్ ఆఫ్ పోలీస్ (ఏడీజీపీ)గా అందరినీ నమ్మించాడు. శ్రీనివాసరావును అరెస్ట్ అనంతరం ఢిల్లీలోని కాంపిటెంట్ కోర్టు ముందు హాజరుపరచగా, రెండు రోజుల పోలీస్ కస్టడీకి అనుమతిచ్చింది. -
నెల్లూరు కోర్టులో చోరీ కేసు విచారణను సీబీఐకి అప్పగించిన హైకోర్టు
సాక్షి, అమరావతి: నెల్లూరు నాలుగో అదనపు జూనియర్ సివిల్ కోర్టులో చోరీ కేసుకు సంబంధించి సుమోటో పిల్‌పై హైకోర్టు గురువారం తీర్పు వెలువరించింది. కేసు విచారణను సీబీఐకు అప్పగిస్తూ ఆదేశాలు జారీ చేసింది. సీబీఐ విచారణపై తమకు ఎలాంటి అభ్యంతరం లేదని ప్రభుత్వం అఫిడవిట్ దాఖలు చేసింది. ఏస్వతంత్ర దర్యాప్తు సంస్థతో విచారణ చేయించిన తమకు అభ్యంతరం లేదని మంత్రి కాకాణి గోవర్ధన్‌రెడ్డి కోర్టుకు తెలిపారు. చదవండి: (ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో రఘురామకృష్ణంరాజుకు సిట్ నోటీసులు) -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. నివేదికను నవంబర్ 29లోగా సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు: గుజ్జుల ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఏమీ లేని కేసులో రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని లేదా సీబీఐ విచారణ జరగాలని బీజేపీ కోరింది. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ జరగాలని విచారణ పూర్తిగా సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి ఇవ్వాలన్న తీర్పును స్వాగతిస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. చదవండి: (Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..) -
ఢిల్లీ లిక్కర్ స్కాంలో బిగ్ ట్విస్ట్.. అప్రూవర్‌గా దినేష్ అరోరా
న్యూఢిల్లీ: దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన ఢిల్లీ లిక్కర్ స్కాం కేసు కీలక మలుపు తిరిగింది. ఈ కేసులో కీలక నిందితుడిగా ఉన్న దినేష్ అరోరా అప్రూవర్‌గా మారిపోయారు. దినేష్ అరోరాను సాక్షిగా పరిగణించాలంటూ ఢిల్లీ కోర్టులో పిటిషన్ దాఖలు చేసింది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ఈ క్రమంలో దినేష్ అరోరా వాంగ్మూలం నమోదు చేసింది ధర్మాసనం. ఎవరైనా బెదిరించారా, ఏమైనా ఇబ్బందులకు గురి చేశారా? అని దినేష్ అరోరాను సీబీఐ కోర్టు న్యాయమూర్తి అడిగారు. కేసులో తదుపరి విచారణను ఈనెల 14కు వాయిదా వేశారు. కీలక నిందితుడిగా ఉన్న వ్యాపారవేత్త దినేష్ అరోరాకు గత వారమే ఢిల్లీ కోర్టు బెయిల్ మంజూరు చేసింది. ఆ సమయంలో సీబీఐ అభ్యంతరం చెప్పకపోవటం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ కేసులో దినేష్‌ను సాక్షిగా చూడాలని కోరుతూ సోమవారం సీబీఐ పిటిషన్ దాఖలు చేసింది. దర్యాప్తు అధికారులకు దినేష్ సహకరిస్తున్నారని, ఇప్పటికే కీలకమైన సమాచారాన్ని అందించారని కోర్టుకు తెలిపింది. మద్యం కుంభకోణం కేసులో ఇప్పటి వరకు ముగ్గురు అరెస్టయ్యారు. అందులో అరోరా ఒకరు. ఈ కేసులో మరో నిందితుడు సమీర్ మహేంద్ర.. రాధా ఇండస్ట్రీస్ ఖాతా నుంచి రూ.కోటి బదిలీ చేసినట్లు సీబీఐ తేల్చింది. రాధా ఇండస్ట్రీస్ దినేష్ అరోరాకి చెందినది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియా, దినేష్ అరోరా సహా నిందితులపై ఐపీసీ సెక్షన్ 120బీ, 477ఏతో పాటు అవినీతి నిరోధక చట్టంలోని సెక్షన్ 7కింత సీబీఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టింది. ఈ కేసులో దినేష్ అరోరా అప్రూవర్‌గా మారినట్లు సీబీఐ ప్రకటించటం ప్రస్తుతం సంచలనంగా మారింది. ఇదీ చదవండి: వీళ్లు ఆడవాళ్లా లేక రౌడీలా?.. తప్పతాగి నడిరోడ్డులో యువతిపై దాడి -
శ్రీసత్యసాయి జిల్లా: టీడీపీ నేత సవిత ఇంట్లో తనిఖీలు చేస్తున్న సీబీఐ
-
తెలంగాణ ప్రభుత్వం సంచలన నిర్ణయం
సాక్షి, హైదరాబాద్: కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐపై తెలంగాణ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. రాష్ట్రంలోకి సీబీఐ రాకుండా జీవో నెం. 51ని జారీ చేసింది. గతంలో ఏ కేసు దర్యాప్తుకైనా సీబీఐకి ఇచ్చిన అనుమతులను ఉపసంహరించుకుంది. ఈమేరకు ఆగస్టు 30న రాష్ట్ర ప్రభుత్వం జీఓ నెం. 51ని జారీచేసింది. దీంతో ఇకపై సీబీఐ రాష్ట్రంలో ఏ కేసు దర్యాప్తు చేయాలన్న రాష్ట్ర ప్రభుత్వం అనుమతి తీసుకోవాల్సిందే. -
ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ కేసు కొట్టివేత
సాక్షి, అమరావతి : ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడుల వ్యవహారానికి సంబంధించి సీబీఐ నమోదు చేసిన కేసుల నుంచి తెలంగాణ హైకోర్టు శుక్రవారం మరొకరికి విముక్తి కలిగించింది. ఇండియా సిమెంట్స్‌కు భారీ ఎత్తున లబ్ధి చేకూర్చినందుకు ప్రతిగా జగన్ కంపెనీల్లో ఆ సంస్థ పెట్టుబడులు పెట్టిందని ఆరోపిస్తూ సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టేసింది. ఇండియా సిమెంట్స్‌పై సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణనలోకి (కాగ్నిజెన్స్) తీసుకొనేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. ఈ మేరకు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ శుక్రవారం తీర్పు వెలువరించారు. ఇండియా సిమెంట్స్ వైస్ ప్రెసిడెంట్, ఎండీ ఎన్ శ్రీనివాసన్‌పై ఇదే ఆరోపణలతో సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు ఇప్పటికే కొట్టేసిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో గుర్తు చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ఇండియా సిమెంట్స్‌పై కేసు కొనసాగించడం న్యాయం కాదని స్పష్టం చేశారు. సీబీఐ చేసిన ఆరోపణలకు సంబంధించి ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను రికార్డ్ చేయలేదని సీజే జస్టిస్ భుయాన్ ఆక్షేపించారు. అందువల్ల ఇలాంటి ఉత్తర్వులు న్యాయ సమీక్షకు నిలబడవని తేల్చి చెప్పారు. గతంలో శ్రీనివాసన్‌పై కేసును కొట్టేసిన న్యాయమూర్తి కూడా ఇదే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారని తీర్పులో పేర్కొన్నారు. కార్పొరేట్ కంపెనీ ఓ కృత్రిమ వ్యక్తి అని, కంపెనీ వ్యవహారాలను చూసుకొనే వ్యక్తులు చేసే తప్పులకు కార్పొరేట్ కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. ఇదే విషయాన్ని సుప్రీంకోర్టు కూడా స్పష్టంగా చెప్పిందని తెలిపారు. చట్టం స్పష్టంగా నిర్దేశిస్తే తప్ప వ్యక్తులు చేసే తప్పులకు కంపెనీ బాధ్యత వహించాలనడానికి వీల్లేదన్నారు. క్విడ్ ప్రో కో ఆరోపణలతో సీబీఐ కేసు దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఇండియా సిమెంట్స్‌కు కృష్ణా జలాలను అదనంగా కేటాయించడంతోపాటు కడపలో ఆ సంస్థ ఫ్యాక్టరీకి ఉన్న 2.5 ఎకరాల స్థలం లీజును పొడిగించినందుకు ప్రతిఫలంగా ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి చెందిన కంపెనీల్లో ఇండియా సిమెంట్స్ పెట్టుబడి పెట్టిందని ఆరోపిస్తూ ఆ కంపెనీపై సీబీఐ కేసు నమోదు చేసింది. దర్యాప్తు అనంతరం చార్జిషీట్ కూడా దాఖలు చేసింది. ఈ చార్జిషీట్‌ను విచారణకు స్వీకరిస్తూ సీబీఐ కోర్టు ఉత్తర్వులు జారీ చేసింది. దీనిని సవాలు చేస్తూ ఇండియా సిమెంట్స్ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ విచారణ జరిపారు. కంపెనీ తరఫున సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి, న్యాయవాది చల్లా గుణరంజన్ వాదనలు వినిపించారు. సుదీర్ఘ వాదనలు విన్న తర్వాత తీర్పును రిజర్వ్ చేసిన జస్టిస్ భుయాన్... శుక్రవారం ఆ వివరాలను వెలువరించారు. -
ఢిల్లీ లిక్కర్ స్కాం: సీబీఐ విచారణకు సీఏ బుచ్చిబాబు
సాక్షి, హైదరాబాద్: హైదరాబాద్, ఢిల్లీ రాజకీయాల్లో లిక్కర్ స్కాంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈ కేసులో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ), కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)లు దూకుడు పెంచాయి. లిక్కర్ పాలసీ ముడుపుల వ్యవహారంలో సీబీఐ కీలక ఆధారాలు సేకరించింది. ఇప్పటికే పలువురిని అరెస్ట్ చేయగా మరికొందరికి నోటీసులు పంపించాయి. ఈ కేసులో ఢిల్లీ ముఖ్యమంత్రి మనీశ్ సిసోడియాను సోమవారం విచారించింది ఈడీ. ఇదే కేసులో హైదరాబాద్ వాసి అరుణ్ రామచంద్ర పిళ్లైని సీబీఐ విచారిస్తోంది. ఈ క్రమంలోనే హైదరాబాద్ చార్టెడ్ అకౌంటెంట్ గోరంట్ల బుచ్చిబాబుకు నోటీసులు పంపించగా.. ఈరోజు(మంగళవారం) సీబీఐ ముందు హాజరుకానున్నారు సీఏ బుచ్చిబాబు. రాబిన్ డిస్టిలరీస్‌తో పాటు ఈ కేసులో నిందితులుగా ఉన్న పలువురికి చార్టర్డ్ అకౌంటెంట్‌గా పని చేశారు బుచ్చిబాబు. ఇప్పటికే ఢిల్లీలో ఇండో స్పిరిట్ యజమాని సమీర్ మహేంద్రు, సిసోడియా అనుచరుడు విజయ్ నాయర్‌ను ఈడీ అరెస్ట్ చేసి విచారిస్తోంది. ఇదీ చదవండి: Delhi Liquor Scam: అభిషేక్ ఇచ్చిన సమాచారంతో అతడి విచారణ.. మరిన్ని అరెస్టులకు ఛాన్స్! -
Delhi Liquor Scam: సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం
-
Delhi Liquor Scam: సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం.. ఆ ఆరే కీలకం
సాక్షి, న్యూఢిల్లీ: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో డిప్యూటీ సీఎం మనీష్ సిసోడియాపై సీబీఐ ప్రశ్నల వర్షం కురిపించింది. ఇప్పటికే అరెస్టు అయిన విజయ్ నాయర్, సమీర్ మహేంద్ర, అభిషేక్ రావు తదితరులు ఇచ్చిన సమాచారం ఆధారంగా సీబీఐ విచారణ కొనసాగుతుంది. మద్యం విధానం, లైసెన్స్‌ల వ్యవహారంపై సీబీఐ ఫోకస్ పెట్టింది. ప్రధానంగా ఆరు అంశాలపై సీబీఐ అధికారులు ప్రశ్నలు అడుగుతున్నారు. 1. మద్యం విధాన మార్పులలో అవకతవకలు 2. లైసెన్సుదారులకు అనుచిత లబ్ధి చేకూర్చడం 3. లైసెన్సు ఫీజులు మినహాయించడం లేదా తగ్గించడం 4. అనుమతి లేకుండా ఎల్ -1 లైసెన్సులు పొడిగించడం 5. అక్రమాల ద్వారా వచ్చిన డబ్బును ప్రభుత్వ అధికారులకు చెల్లించడం 6. ఎవరికి అనుమానం రాకుండా ఉండేందుకు ఖాతా పుస్తకాలలో తప్పుడు ఎంట్రీలు రాయడం. చదవండి: ‘సూపర్ హీరో’గా సిసోడియా.. కేజ్రీవాల్ ట్వీట్‌కు బీజేపీ కౌంటర్ -
ఢిల్లీ లిక్కర్ స్కాం: మనీశ్ సిసోడియాకు సీబీఐ సమన్లు
న్యూఢిల్లీ: ఢిల్లీ ఎక్సైస్ పాలసీ కేసు దేశవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసు దర్యాప్తులో దూకుడు పెంచింది కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ). ప్రధానంగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి, ఆమ్ ఆద్మీ పార్టీ కీలక నేత మనీశ్ సిసోడియాకు సమన్లు జారీ చేసింది. సోమవారం ఉదయం 11 గంటలకు విచారణకు హాజరుకావాలని స్పష్టం చేసింది. సీబీఐ సమన్లు జారీ చేయటంపై స్పందించారు సిసోడియా. గతంలో సీబీఐ దాడులు చేపట్టగా తప్పు చేసినట్లు ఎలాంటి ఆధారాలు లభించలేదన్నారు. అయితే, దర్యాప్తు సంస్థకు పూర్తి సహకారం అందిస్తామని పేర్కొన్నారు. ‘నా ఇంటిలో సీబీఐ 14 గంటల పాటు సోదాలు నిర్వహించింది. కానీ, ఏమీ లభించలేదు. వారు నా బ్యాంకు లాకర్‌ను సైతం తనిఖీ చేశారు. అక్కడా ఏమీ లభించలేదు. మా గ్రామంలోనూ వారికి ఎలాంటి ఆధారాలు దొరకలేదు. ఇప్పుడు విచారణకు హాజరు కావాలని సమన్లు జారీ చేశారు. నేను వెళ్లి వారికి పూర్తిగా సహకారం అందిస్తాను.’ అని తెలిపారు సిసోడియా. ఢిల్లీ ప్రభుత్వం లిక్కర్ పాలసీలో అవినీతి జరిగిందనే ఆరోపణలతో సీబీఐ కేసు నమోదు చేసింది. మొత్తం 15 మంది నిందితుల్లో మనీశ్ సిసోడియా పేరును కూడా చేర్చింది. ఇప్పటికే ఆయన నివాసాల్లో సోదాలు నిర్వహించింది. అవినీతి ఆరోపణలను ఆప్ మొదటి నుంచి ఖండిస్తోంది. తమ ప్రభుత్వం చేస్తున్న మంచి పనులను చూసి ఓర్వేలేకే బీజేపీ ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని విమర్శించింది. ఇదీ చదవండి: రైతులకు శుభవార్త.. రేపే పీఎం కిసాన్ 12వ విడత నిధుల విడుదల -
అభిషేక్ లింకులపై ఆరా.. ఏం చెబుతాడో!
సాక్షి, హైదరాబాద్: ఢిల్లీ మద్యం కుంభకోణం కేసులో అరెస్టయిన రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్ బోయినపల్లి అభిషేక్‌రావును లోతుగా విచారిస్తే కేసులో కీలకమైన అంశాలు, రాజకీయ ప్రముఖుల పాత్ర తెలుసుకోవచ్చని సీబీఐ భావిస్తోంది. పెద్ద ఎత్తున ముడుపులు చేతులు మారిన వ్యవహారంలో అభిషేక్ ప్రమేయం కన్పిస్తున్నట్టు సీబీఐ ప్రాథమిక విచారణ ద్వారా తేల్చింది. ఈ క్రమంలో ఆయనకు గల రాజకీయ సంబంధాలు ఈ కేసులో అత్యంత కీలకమని, వీటిపై సమగ్ర సమాచారం రాబట్టాల్సిన అవసరం ఉందని సీబీఐ కోర్టుకు సమర్పించిన రిమాండ్ రిపోర్టులో పేర్కొంది. కోర్టు అనుమతితో అభిషేక్‌రావును కస్టడీలోకి తీసుకుని విచారణ ప్రారంభించింది. ఆ బంధమేంటి?: ఢిల్లీ మద్యం విధాన రూపకల్పనలో కొందరు కొన్ని కంపెనీలకు లబ్ధి చేకూరేలా వ్యవహరించారనేది ఈ కేసులో ప్రధాన ఆరోపణ. దీనిపై విచారణ చేపట్టిన కేంద్ర దర్యాప్తు సంస్థ ప్రాథమిక సమాచార నివేదికలో 16 మంది ప్రమేయాన్ని ప్రస్తావించింది. ఈ క్రమంలో అరుణ్ రామచంద్రన్ పిళ్ళైని నిందితుడిగా చేర్చింది. అభిషేక్‌తో పాటు పిళ్ళై కూడా రాబిన్ డిస్ట్రిబ్యూషన్ ఎల్ఎల్పీ డైరెక్టర్‌గా ఉన్నారు. ఈ లింక్‌తో ముందుకెళ్ళిన సీబీఐ అనేక విషయాలను రాబట్టినట్టు తన రిమాండ్ రిపో ర్టులో పేర్కొంది. అభిషేక్ బ్యాంకు ఖాతాలపై సీబీఐ వర్గాలు పలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో సహ నిందితుడు సమీర్ మహేంద్రుకు భారీగా ముడుపులు చేరడం, అక్కడ్నుంచి ఇతరులకు పంపిణీ అవ్వడంపై స్పష్టత కోసం అభిషేక్‌ను సీబీఐ ప్రశ్నించే వీలుంది. లిక్కర్ స్కాంలో కీలకమైన వ్యక్తులు ఢిల్లీ, ముంబయి, హైదరాబాద్‌లో సమావేశమవ్వడం, ఇందులో అభిషేక్ కూడా పాల్గొనడంతో స్కామ్‌తో అభిషేక్‌కు ఉన్న లింకులేమిటో తెలుసుకునేందుకు సీబీఐ ప్రయత్నిస్తోంది. అభిషేక్ గుట్టు విప్పేనా? లిక్కర్ కుంభకోణంలో సీబీఐ ఇప్పటికే డాక్యుమెంటరీ ఆధారాలు సేకరించింది. ఢిల్లీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా అనుచరుడిగా భావిస్తున్న అర్జున్ పాండేకు విజయ్ నాయర్ తరఫున మహేంద్రు ముడుపులు అందించినట్టు సీబీఐ భావిస్తోంది. ఇందులో అభిషేక్ పాత్రను బ్యాంకు లావాదేవీలు, నిందితులతో జరిగిన సమావేశాల ద్వారా గుర్తించారు. అయితే ఈ కుంభకోణంలో రాజకీయ ప్రము ఖుల హస్తం ఉందనేది ప్రధాన ఆరోపణ. కాగా అభిషేక్‌కు రాష్ట్రంలోని ప్రముఖ నేతలతో వాణిజ్యపరమైన లావాదేవీలున్నాయని సీబీఐ ప్రాథమిక విచారణలో గుర్తించినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో.. పెద్ద మొత్తంలో చేతులు మారిన ముడుపులు ఏ రాజకీయ ప్రముఖుడి నుంచి ఎవరికి వెళ్లాయనే అనే అంశంపై సీబీఐ దృష్టి పెట్టినట్లు తెలిసింది. దర్యాప్తు సంస్థకు లభించిన డాక్యుమెంటరీ ఆధారాలు, హవాలా మార్గంలో నిధులు చేతులు మారడం, ఎవరు లబ్ధి పొందారు? అనే కోణాల్లో అభిషేక్‌ను సీబీఐ ప్రశ్నించే అవకాశం ఉంది. కాగా అభిషేక్‌ను సీబీఐ ప్రశ్నించడం రాష్ట్రంలో ప్రకంపనలు సృష్టిస్తోంది. -
ఆపరేషన్ గరుడ: డ్రగ్స్ ముఠాలపై సీబీ‘ఐ’.. 175 మంది అరెస్ట్
సాక్షి, న్యూఢిల్లీ: మత్తుపదార్థాల(డ్రగ్స్) దందా నిర్వహిస్తున్న ముఠాలపై ఉక్కుపాదం మోపుతోంది కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ). ‘ఆపరేషన్ గరుడ’ పేరుతో ఇంటర్‌పోల్, రాష్ట్రాల పోలీసుల భాగస్వామ్యంతో దేశవ్యాప్తంగా విస్తృత తనిఖీలు చేపట్టింది. అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు నెరుపుతూ దేశంలో డ్రగ్స్ సరఫరా చేస్తున్నవారిపై కేసులు, అరెస్టులు చేపట్టింది. ఆపరేషన్ గరుడలో భాగంగా ఇప్పటి వరకు దేశవ్యాప్తంగా 127 కేసులు నమోదు చేసి 175 మందిని అరెస్ట్ చేసినట్లు సీబీఐ వర్గాలు తెలిపాయి. ఆపరేషన్ గరుడ ఏమిటి? అంతర్జాతీయ ముఠాలతో సంబంధాలు పెట్టుకుని డ్రగ్స్ దందా చేస్తున్న నెట్‌వర్క్‌లను నిరోధించేందుకు ఆపరేషన్ గరుడ పేరుతో పలు దఫాలుగా తనిఖీలు చేపట్టింది సీబీఐ. ఇంటర్‌పోల్ ద్వారా క్రిమినల్ ఇంటెలిజెన్స్ సమాచారం సేకరించి డ్రగ్ ట్రాఫికింగ్లను గుర్తించేందుకు ఈ ఆపరేషన్‌ను నిర్వహిస్తోంది. ఇంటర్‌పోల్ ద్వారా అంతర్జాతీయ చట్టాల పరిధిలోనూ ఈ తనిఖీలు చేపట్టింది. ముఖ్యంగా హిందూ మహాసముద్ర ప్రాంతంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు సీబీఐ తెలిపింది. ఇంటర్‌పోల్, నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో(ఎన్సీబీ)ల సమన్వయంతో గ్లోబల్ ఆపరేషన్ నిర్వహిస్తోంది. అంతర్జాతీయ ముఠాలతో లింక్స్ ఉన్న నెట్వర్క్లే లక్ష్యంగా ఈ ఆపరేషన్ గరుడ కొనసాగిస్తోంది సీబీఐ. దీని ద్వారా డ్రగ్స్ నిర్వహణ, సరఫరా, తయారీ జోన్స్, వారికి మద్దతు ఇచ్చే వారిపై చర్యలు తీసుకుంటోంది. రాష్ట్రాలు, కేంద్ర పాలిత ప్రాంతాల్లో పోలీసు బలగాల సమన్వయంతో సమాచారం సేకరించి డ్రగ్స్ ముఠాలపై చర్యలు చేపట్టింది. 6600 అనుమానితులపై.. దేశవ్యాప్తంగా దాదాపు అన్ని రాష్ట్రాల్లో ఈ దాడులు నిర్వహించింది సీబీఐ. సుమారు 6600 అనుమానిత వ్యక్తులను తనిఖీ చేసింది. 127 కొత్త కేసులు నమోదు చేసి.. 175 మందిని అరెస్ట్ చేసింది. అందులో పరారీలో ఉన్న ఆరుగురు నిందితులు సైతం ఉన్నారు. ఈ ఆపరేషన్‌లో భాగంగా 5.1 కిలోల హెరాయిన్, 33.4 కిలోల మరిజున, 3.29 కిలోల చరాస్, 1365 గ్రాముల మెఫెడ్రోన్, 33.8 గ్రాముల స్మాక్, బుప్రెనోర్ఫిన్కు చెందిన 87 సిరంజీలు, 122 ఇంజెక్షన్లు, 87 ట్యాబ్లెట్లు స్వాధీనం చేసుకుంది. అలాగే 946 అల్ప్రాజోలమ్ ట్యాబ్లెట్లు, 106 కిలోల ట్రామడోల్, 10 గ్రాముల హాష్ ఆయిల్, 0.9 గ్రాముల ఎక్స్టాసీ పిల్స్, 1.15 కిలోల ఓపియమ్, 30 కిలోల పప్పీ హక్, 1.43 కిలోల ఇటోక్సికాంట్ పౌండర్, 11039 పిల్, క్యాప్సల్స్ సీజ్ చేసింది. ఇదీ చదవండి: పెళ్లితో సంబంధం లేదు.. అబార్షన్లపై సుప్రీంకోర్టు సంచలన తీర్పు -
ఆపరేషన్ మేఘ్‌చక్ర: సీబీ‘ఐ’ మెరుపు దాడులు
ఢిల్లీ: తెలుగు రాష్ట్రాలతో సహా దేశంలో పలు చోట్ల ఇవాళ కేంద్ర దర్యాప్తు సంస్థ సీబీఐ మెరుపు దాడులకు దిగింది. పిల్లలపై లైంగిక వేధింపుల కంటెంట్‌ను గుర్తించేందుకు, ఆ కంటెంట్‌తో మైనర్లపై బ్లాక్‌మెయిల్‌కు దిగుతున్న ముఠాల పని పట్టేందుకు ఆపరేషన్ ‘మేఘ్‌చక్ర’ను నిర్వహిస్తోంది. ఈ మేరకు శనివారం దేశవ్యాప్తంగా సోదాలు మొదలుపెట్టింది. మొత్తం పంతొమ్మిది రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల్లో కలిపి దాదాపు 56 చోట్ల సెంట్రల్ బ్యూరో ఆఫ్ ఇన్వెస్టిగేషన్ దాడులు కొనసాగుతున్నాయి. మైనర్లపై లైంగిక వేధింపుల మెటీరియల్‌కు సంబంధించిన సమాచారం అందిన నేపథ్యంలోనే ఈ దాడులు కొనసాగినట్లు తెలుస్తోంది. అయితే ఎంతమందిని అదుపులోకి తీసుకుంది.. ఇతరత్ర పరిణామాలపై ఇంకా స్పష్టత రావాల్సి ఉంది. సింగపూర్ ఇంటర్‌పోల్ విభాగం నుంచి అందిన పక్కాసమాచారం మేరకే ఈ సెర్చ్ ఆపరేషన్‌ను మొదలుపెట్టింది సీబీఐ. పిల్లల లైంగిక వేధింపుల మెటీరియల్‌ను పంపిణీ చేయడం, వాటి ఆసరాగా మైనర్లను బ్లాక్మెయిల్ చేసే వ్యక్తులను, ముఠాలను గుర్తించడం.. చర్యలు తీసుకోవడం లక్ష్యంగా పెట్టుకుంది సీబీ‘ఐ’. పిల్లల అశ్లీల విషయాలను ప్రసారం చేయడానికి ఉపయోగించే క్లౌడ్ స్టోరేజీ సౌకర్యాలను లక్ష్యంగా చేసుకుని నిరుడు సీబీఐ చేపట్టిన ‘ఆపరేషన్ కార్బన్’కు మేఘ్‌చక్ర కొనసాగింపు తెలుస్తోంది. ఇదిలా ఉంటే.. చైల్డ్ పోర్నోగ్రఫీకి సంబంధించిన కేసులను పర్యవేక్షించేందుకు ఏర్పాటు చేసిన యంత్రాంగంపై వివరణాత్మక నివేదికను సమర్పించాలని గత వారం సుప్రీంకోర్టు కేంద్ర ప్రభుత్వాన్ని కోరింది కూడా. ఇదీ చదవండి: ఘోర ప్రమాదం.. గోడ కూలి 10 మంది దుర్మరణం! -
‘నేను మగవాడిని.. నా శరీరాన్ని ఈడీ, సీబీఐ తాకలేవు’
కోల్‌కతా: మహిళా పోలీసులు తనతో దురుసుగా ప్రవర్తించారంటూ ఇటీవల పశ్చిమబెంగాల్ బీజేపీ ఎమ్మెల్యే, ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా బీజేపీ చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకొని.. సువేందు అధికారిని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో మహిళా పోలీసులపై ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘మీరు మహిళా అధికారి. నన్ను టచ్ చేయొద్దు.. పురుష సిబ్బందిని పిలవండి’ అని వారించారు. తాజాగా సువేందు అధికారి వ్యాఖ్యలకు టీఎంసీ ఎమ్మెల్యే కౌంటర్ ఇచ్చారు. టీఎంసీ శాసన సభ్యుడు ఇద్రిస్ అలీ ‘ఈడీ, సీబీఐ నా శరీరాన్ని తాకలేవు.. నేను మగవాడిని’ అని రాసి ఉన్న కుర్తా ధరించి అసెంబ్లీ లోపలికి వెళ్లాడు. టీఎంసీ ఎమ్మెల్యే ఇలాంటి డ్రెస్ ధరించి అసెంబ్లీకి ఎందుకు వచ్చారని మీడియా ప్రశ్నించగా.. ‘తనను సీబీఐ, ఈడీ తాకలేవని భావించే ఓ బీజేపీ నేత ఉన్నారు’ అంటూ సువేందు అధికారిని ఉద్ధేశిస్తూ చురకలంటించారు. చదవండి: సహనం కోల్పోతున్నాం: హిజాబ్ వాదనలపై సుప్రీం కాగా పశ్చిమ బెంగాల్లో తృణమూల్ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతికి పాల్పడుతోందని ఆరోపిస్తూ ‘నబానా ఛలో’ పేరుతో బీజేపీ ర్యాలీ చేపట్టిన విషయం తెలిసిందే ఈ క్రమంలో ఓ మహిళా పోలీస్ తనతో దురుసుగా ప్రవర్తించారని ప్రతిపక్ష నేత సువేందు అధికారి ఆరోపణలు చేశారు. ర్యాలీని అడ్డుకున్న పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు. కొంతమంది మహిళా పోలీసులు అతన్ని వ్యాన్‌లోకి ఎక్కిస్తున్న తరుణంలో వారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ ‘నన్ను టచ్ చేయొద్దు’ అని వారించారు. అనంతరం ఇదే విషయంపై ఆయన మాట్లాడుతూ.. ప్రతి మహిళా కళ్లల్లో దుర్గామాతను చూస్తానని, మహిళలంటే ఎంతో గౌరవమని తెలిపారు. -
ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో కుట్ర.. క్విడ్ ప్రోకో!
సాక్షి, హైదరాబాద్: కుట్ర, క్విడ్ ప్రోకో.. ఢిల్లీ లిక్కర్ స్కామ్‌లో ఈ రెండు అంశాలపైనే సీబీఐ ప్రధానంగా దృష్టి సారించనుంది. ఎక్సైజ్ పాలసీని నిబంధనలకు విరుద్ధంగా రూపొందించి వ్యాపారులకు మేలు చేశారని ఆరోపిస్తున్న సీబీఐ, ఇందులో కుట్ర కోణంతో పాటు క్విడ్ ప్రో కో ఉన్నట్టు ప్రాథమిక ఆధారాలు సేకరించింది. మరోవైపు నిందితులుగా ఆరోపణలెదుర్కొంటున్న వారితో పాటు బినామీ కంపెనీలు సృష్టించి లిక్కర్ టెండర్లు దక్కేలా సిండికేట్ వ్యవహారం సాగించిన చీకటి వ్యక్తులకు సంబంధించిన వివరాలు పూర్తి స్థాయిలో బయటపెట్టే దిశగా సీబీఐ దూకుడు పెంచినట్టు తెలుస్తోంది. ఈ కేసులో 16 మందిని నిందితులుగా చేర్చిన ఢిల్లీ సీబీఐ, ఆ జాబితాలో ఉన్న హైదరాబాద్‌కు చెందిన అరుణ్ రామచంద్ర పిళ్లై నివాసంలో గత నెలలో సోదాలు నిర్వహించింది. సీబీఐ దాడుల తర్వాత ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ అధికారులు రెండు సార్లు సోదాలు నిర్వహించారు. పిళ్లైతో పాటు ఆయన సంస్థ రాబిన్ డిస్టిలరీ ప్రైవేట్ లిమిటెడ్ డైరెక్టర్లుగా ఉన్న అభిషేక్ బోయినిపల్లి, గండ్ర ప్రేమ్‌సాగర్, ఆడిటర్ బుచ్చిబాబు, మరో 25 మంది నివాసాలు, కార్యాలయాల్లో తనిఖీలు నిర్వహించారు. ఆ సోదాల్లో లభించిన కీలక ఆధారాలతో ప్రముఖులకు లిక్కర్ స్కామ్ ఉచ్చు బిగుస్తోందని తెలుస్తోంది. వెలుగులోకి సంచలనాత్మక విషయాలు... రెండు దర్యాప్తు సంస్థల విచారణలో బినామీ కంపెనీల గుర్తింపు, ఆ కంపెనీల టెండర్లు, లంచాలకు ఇచ్చిన నగదు.. ఇలా అనేక సంచలనాత్మక విషయాలు వెలుగులోకి వచ్చాయి. కుట్ర పూరితంగానే ఈ విధంగా వ్యవహరించి కంపెనీలకు లాభం చేర్చేలా చేశారని, అదేవిధంగా భారీ స్థాయిలో డబ్బులు చేతులు మారినట్టు సీబీఐ భావిస్తోంది. ఈ నేపథ్యంలోనే బినామీ కంపెనీలను సృష్టించడంతో పాటు సిండికేట్ రూపంలో తమ వారికి దక్కేలా చేసిన చీకటి నేతలు, ప్రముఖ వ్యక్తులపై ఇప్పుడు సీబీఐ దృష్టి సారించినట్టు తెలుస్తోంది. రెండు దఫాలుగా నోటీసులు.. అరుణ్ రామచంద్ర పిళ్లైతో పాటు ఆయన కంపెనీలో డైరెక్టర్లుగా ఉన్న బోయినపల్లి అభిషేక్, గండ్ర ప్రేమ్‌సాగర్, ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన ఆడిటర్ బుచ్చిబాబును మొదటి దఫాలో విచారించేందుకు సీబీఐ సిద్ధమవుతున్నట్టు విశ్వసీనీయ వర్గాల ద్వారా తెలిసింది. ఈ మేరకు ప్రత్యేక బృందాలు రెండు రోజుల్లో హైదరాబాద్‌కు వచ్చి నోటీసులు ఇచ్చి విచారణకు పిలిచే అవకాశాలున్నాయని తెలిసింది. అయితే విచారణ ఇక్కడ చేస్తారా లేకా ఢిల్లీలో చేస్తారా అన్న అంశాలపై తుది నిర్ణయం తీసుకోలేదని తెలిసింది. వీరితో పాటు రెండో దఫాలో ప్రముఖ ఫార్మా కంపెనీ ఎండీతో పాటు ఇటీవల ఈడీ సోదాలు నిర్వహించిన 16 కంపెనీలు, వాటిలోని డైరెక్టర్లు 8మందికి నోటీసులిస్తారని సీబీఐ వర్గాలు తెలిపాయి. ఇలావుండగా ఎక్సైజ్ స్కామ్‌లో ఆరోపణలెదుర్కొంటున్న సిండికేట్‌లోని ఇద్దరు వ్యాపారులు తాము ఈ టెండర్ల వ్యవహారంలో రూ.250 కోట్లకు పైగా నష్టపోయినట్టుగా ఆందోళన వ్యక్తం చేస్తున్నట్టు తెలిసింది. భారీ నష్టంతో పాటు సీబీఐ, ఈడీ కేసులు ఎదుర్కోవడం ఇబ్బందికరంగా మారిందని ఓ ప్రముఖ నేత వద్ద గోడు వెల్లబోసుకున్నట్టు తెలుస్తోంది. ఇదీ చదవండి: ఎన్ఐఏ పంజా.. నిజామాబాద్ కేంద్రంగా ఉగ్రవాద శిక్షణపై ఫోకస్ -
Kothapalli Geetha: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు ఐదేళ్ల జైలు శిక్ష
సాక్షి, హైదరాబాద్: అరకు మాజీ ఎంపీ కొత్తపల్లి గీతకు సీబీఐ కోర్టు ఐదేళ్ల జైలు శిక్ష, రూ.లక్ష జరిమానా విధించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ నుంచి విశ్వేశ్వర ఇన్ఫ్రాస్ట్రక్చర్ కంపెనీ పేరుతో లోన్ తీసుకుని ఎగ్గొట్టారనే బ్యాంక్ అధికారుల ఫిర్యాదుతో కొత్తపల్లి గీతపై గతంలోనే కేసులు నమోదు అయ్యాయి. తాజాగా రుణాల పేరిట బ్యాంక్‌ను మోసం చేసిన కేసులో ఈ శిక్ష ఖరారైంది. ఇదే కేసులో గీతతో పాటు ఆమె భర్త పి.రామకోటేశ్వరరావుకు ఐదేళ్ల జైలు శిక్ష, లక్ష జరిమానా విధించారు. మాజీ ఎంపీకి సహకరించిన బ్యాంకు అధికారులు బీకే జయప్రకాషన్, కేకే అరవిందాక్షన్కు ఐదేళ్ల జైలు శిక్ష పడింది. విశ్వేశ్వర ఇన్ఫ్రా ప్రైవేట్ లిమిటెడ్‌కు సీబీఐ కోర్టు రూ.2లక్షల జరిమానా విధించింది. శిక్షలు ఖరారు కావడంతో కొత్తపల్లి గీత సహా నిందితులను బుధవారం సీబీఐ అదుపులోకి తీసుకుంది. -
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు
గోవుల అక్రమ రవాణా కేసులో టీఎంసీ నేత అరెస్టు -
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం
.. కేంద్రంతో సంబంధాలు ఇంకా వేగవంతం చేయాలేమో మేడం -
వాన్‌పిక్ ప్రాజెక్ట్ లిమిటెడ్‌కు ఊరట
-
వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై కీలక తీర్పు వెలువరించిన సీజే జస్టిస్ ఉజ్జల్ భుయాన్
సాక్షి, అమరావతి: ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కంపెనీల్లో పెట్టుబడులకు సంబంధించిన వ్యవహారంలో తెలంగాణ హైకోర్టు తాజాగా కీలక తీర్పు వెలువరించింది. వాన్‌పిక్ ద్వారా పలు ప్రయోజనాలు కల్పించినందుకు నిమ్మగడ్డ ప్రసాద్ జగతి పబ్లికేషన్స్‌లో పెట్టుబడులు పెట్టారని ఆరోపిస్తూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్‌పై సీబీఐ నమోదు చేసిన కేసును హైకోర్టు కొట్టి వేసింది. చట్టం అనుమతినిస్తే మినహా కంపెనీపై వచ్చిన నేరారోపణలకు, కంపెనీ చర్యలకు దాని చైర్మన్‌నుగానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులను గానీ బాధ్యులుగా చేయడానికి వీల్లేదని స్పష్టం చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్పె సీబీఐ నమోదు చేసిన అభియోగ పత్రాన్ని (చార్జిషీట్) విచారణ నిమిత్తం పరిగణలోకి (కాగ్నిజెన్స్) తీసుకునేటప్పుడు సీబీఐ ప్రత్యేక న్యాయస్థానం యాంత్రికంగా వ్యవహరించిందని హైకోర్టు తేల్చి చెప్పింది. అభియోగపత్రాన్ని విచారణకు స్వీకరిస్తూ ఉత్తర్వులు జారీ చేసే సమయంలో సీబీఐ కోర్టు మెదడు ఉపయోగించలేదని ఘాటు వ్యాఖ్యలు చేసింది. వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ అనేది ఓ వ్యక్తి కాదనే విషయాన్ని సీబీఐ కోర్టు పరిగణలోకి తీసుకోలేదని పేర్కొంది. అంతేకాక వాన్‌పిక్ ప్రాజెక్ట్స్పైగానీ, దానికి నేతృత్వం వహిస్తున్న నిమ్మగడ్డ ప్రసాద్పైగానీ సీబీఐ ఆరోపణలకు ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు సీబీఐ కోర్టు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని తేల్చి చెప్పింది. చార్జిషీటు, దానితో జత చేసిన డాక్యుమెంట్లు, ఆఫీసు నోటు, కోర్టు తీర్పులను మాత్రమే సీబీఐ కోర్టు పరిశీలించిందని తెలిపింది. సీబీఐ ఆరోపణలకు ఓ కార్పొరేట్ సంస్థగా వాన్పిక్స్ ప్రాజెక్ట్స్ లేదా దాని చైర్మన్‌గా ప్రాథమిక ఆధారాలున్నాయా? కార్పొరేట్ సంస్థ చేసినట్లు ఆరోపిస్తున్న నేరాలకు చైర్మన్ మాత్రమే బాధ్యత వహించాలా? అన్న విషయంలో సీబీఐ ఎలాంటి కారణాలను నమోదు చేయలేదని హైకోర్టు స్పష్టం చేసింది. కార్పొరేట్ సంస్థ ఓ వ్యక్తి కాదని, అలాంటి కంపెనీ లేదా కార్పొరేషన్ నేరస్తుడైతే, అందుకు సంబంధించిన బాధ్యతను దాని డైరెక్టర్లకు గానీ, ఆ కంపెనీని నడుపుతున్న వ్యక్తులకుగానీ యాంత్రికంగా ఆపాదించడానికి వీల్లేదని తేల్చి చెప్పింది. నేరస్తులు కంపెనీకి చెందిన వారన్న కారణంతో కంపెనీ తప్పులకు వారిని యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి వీల్లేదంది. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్ట్స్‌పై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు కాదని హైకోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు తెలంగాణ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం కీలక తీర్పు వెలువరించారు. నిరంజన్‌రెడ్డి వాదనలతో ఏకీభవించిన సీజే... సీబీఐ తమపై నమోదు చేసిన కేసును కొట్టి వేయాలని కోరుతూ వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ ప్రైవేట్ లిమిటెడ్ 2016లో హైకోర్టులో పిటిషన్ దాఖలు చేసింది. ఈ వ్యాజ్యంపై ఇటీవల వాదనలు విని తీర్పు రిజర్వ్ చేసిన ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ ఉజ్జల్ భుయాన్ గురువారం తీర్పు వెలువరించారు. సహేతుక కారణాలు చూపకుండానే సీబీఐ దాఖలు చేసిన చార్జిషీట్‌ను సీబీఐ కోర్టు కాగ్నిజెన్స్‌లోకి తీసుకుందన్న వాన్‌పిక్ ప్రాజెక్ట్స్ తరఫు సీనియర్ న్యాయవాది టి.నిరంజన్‌రెడ్డి వాదనతో ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ ఏకీభవించారు. వాన్‌పిక్ ప్రాజెక్టŠస్ లాంటి కృత్రిమ వ్యక్తిని ప్రాసిక్యూట్ చేసేందుకు అవసరమైన ప్రాథమిక ఆధారాలు లేవని, ఈ విషయాన్ని కింది కోర్టు పూర్తిగా విస్మరించిందన్న నిరంజన్‌రెడ్డి వాదనను సైతం జస్టిస్ భుయాన్ పరిగణలోకి తీసుకున్నారు. చార్జిషీట్‌ను కాగ్నిజెన్స్‌లోకి తీసుకోవడం అన్నది మెదడు ఉపయోగించి చేయాల్సిన ప్రక్రియ అని, అది యాంత్రికంగా చేసే ప్రక్రియ ఎంత మాత్రం కాదని సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పిందని ప్రధాన న్యాయమూర్తి తన తీర్పులో పేర్కొన్నారు. అలాంటప్పుడు నేరాన్ని ఆపాదించరాదు... ‘కాగ్నిజెన్స్ తీసుకునే విషయంలో మేజిస్ట్రేట్‌కు విస్తృత అధికారం ఉన్నప్పటికీ న్యాయపరంగా సహేతుక రీతిలో ఉపయోగించాలి. నేరం గురించి నిందితులకు అవగాహన కల్పించే విషయంలో కాగ్నిజెన్స్ అన్నది ఓ ప్రక్రియ అంటూ సుప్రీంకోర్టు పలు తీర్పుల్లో స్పష్టంగా చెప్పింది. కాగ్నిజెన్స్ అన్నది మేజిస్ట్రేట్ ఫిర్యాదులో పేర్కొన్న ఆరోపణలను, నమోదు చేసిన వాంగ్మూలాలను పరిగణలోకి తీసుకుని, నిందితులు చట్టాన్ని ఉల్లంఘించారా? లేదా? అన్న దానిపై దృష్టి సారించడానికే తప్ప, వ్యక్తులను కోర్టు ముందు హాజరుపరచడానికి, కోర్టు ముందుకు పిలిచేందుకు ఉపయోగించే యాంత్రిక ప్రక్రియ ఎంతమాత్రం కాదు. నేరపూరిత ఉద్దేశంతో కంపెనీ లేదా దానిని నడిపిస్తున్న వ్యక్తులు నేరం చేసినట్లైతే ఆ నేరానికి ఆ కంపెనీని, ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. అయితే ఏ ఏ సందర్బాల్లో అలా బాధ్యులుగా చేయవచ్చో సుప్రీంకోర్టు స్పష్టంగా చెప్పింది. కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను బాధ్యులుగా చేయాలంటే అందుకు చట్టం అనుమతినించి ఉండాలి. నేరంలో ఆ వ్యక్తుల పాత్ర ఉన్నట్లు నిర్దిష్ట ఆధారాలు ఉంటే, నేరానికి ఆ వ్యక్తులను బాధ్యులుగా చేయవచ్చు. ఈ సందర్భాల్లో మినహా మిగిలిన సందర్భాల్లో కంపెనీ చేసిన నేరానికి ఆ కంపెనీని నడిపిస్తున్న వ్యక్తులను యాంత్రికంగా బాధ్యులుగా చేయడానికి ఎంత మాత్రం వీల్లేదు. ఈ విషయాన్ని సుప్రీంకోర్టు తన తీర్పుల ద్వారా చాలా స్పష్టంగా చెప్పింది.’అని జస్టిస్ భుయాన్ స్పష్టం చేశారు. స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించొచ్చు... ‘క్రిమినల్ కేసుల్లో నిందితులకు సమన్లు జారీ చేయడం అన్నది చాలా తీవ్రమైన విషయం. క్రిమినల్ లాను అమలు చేసే చర్య ఇది. సమన్లు జారీ చేయాలంటే, సంబంధిత మేజిస్ట్రేట్ నిందితులైన మేనేజింగ్ డైరెక్టర్, కంపెనీ సెక్రటరీ, ఇతర డైరెక్టర్లకు వ్యతిరేకంగా ప్రాథమికాధారాలు ఉన్నాయని సంతృప్తి చెందుతూ అందుకు కారణాలను నమోదు చేయాలి. ప్రస్తుత కేసులో కూడా సీబీఐ కోర్టు వాన్‌పిక్ ప్రాజెక్ట్స్, దాని చైర్మన్ నిమ్మగడ్డ ప్రసాద్‌కు వ్యతిరేకంగా ప్రాథమిక ఆధారాలున్నాయని సంతృప్తి చెందేందుకు ఎలాంటి కారణాలను నమోదు చేయలేదు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం కంపెనీ చేసిన నేరాన్ని దాని చైర్మన్‌కు ఆపాదించడానికి ఎంత మాత్రం వీల్లేదు. అంతిమ న్యాయం అందించేందుకు, న్యాయ ప్రక్రియ దుర్వినియోగాన్ని అడ్డుకునేందుకు హైకోర్టు సీఆర్పీసీ సెక్షన్ 482 కింద తనకున్న స్వతఃసిద్ధ అధికారాలను ఉపయోగించవచ్చు. ఈ అధికారాన్ని ఉపయోగించి క్రిమినల్ ప్రొసీడింగ్స్‌ను కొట్టేయవచ్చు. చైర్మన్‌గా నిమ్మగడ్డ ప్రసాద్ ప్రాతినిధ్యం వహిస్తున్న కార్పొరేట్ సంస్థ అయిన వాన్‌పిక్ ప్రాజెక్టులపై క్రిమినల్ ప్రాసిక్యూషన్‌కు అనుమతినిచ్చినట్లయితే అంతిమ న్యాయం చేసినట్లు అవదు. అందువల్ల వీటన్నింటినీ పరిగణలోకి తీసుకుంటూ నాంపల్లి సీబీఐ ప్రత్యేక న్యాయస్థానంలో వాన్‌పిక్ ప్రాజెక్టులపై పెండింగ్‌లో ఉన్న కేసును కొట్టి వేస్తున్నాం’అని ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ భుయాన్ తన తీర్పులో పేర్కొన్నారు. -
రూ.100 కోట్లకు రాజ్యసభ సీటు లేదా గవర్నర్ పదవి! రాకెట్ గుట్టు రట్టు
సాక్షి,న్యూఢిల్లీ: రూ.100 కోట్లిస్తే రాజ్యసభ సీటు ఇప్పిస్తామని దందా నడుపుతున్న ముఠా గుట్టును సీబీఐ రట్టు చేసింది. నిందితులకు ఓ వ్యక్తికి మధ్య డబ్బులు చేతులు మారడానికి క్షణాల ముందు వారిని పట్టుకుంది. రూ.100 కోట్లిస్తే గవర్నర్ పదవి కూడా ఇప్పిస్తామని నిందితులు ఆఫర్ ఇస్తున్నట్లు తెలుస్తోంది. నాలుగు వారాలుగా గుర్తు తెలియని నెంబర్ల నుంచి వెళ్తున్న కాల్స్‌పై నిఘా వహించిన అధికారులు ఎట్టకేలకు నలుగురు నిందితులను గుర్తించి పక్కా ప్రణాళికతో అదుపులోకి తీసుకున్నారు. నిందితులను మహారాష్ట్రకు చెందిన కర్మలాకర్ ప్రేమ్‌కుమార్ బండ్గార్, కర్ణాటకకు చెందిన రవీంద్ర విఠల్ నాయక్, ఢిల్లీకి చెందిన మహేంద్ర పాల్, అభిషేక్ బూరాగా గుర్తించారు అధికారులు. వీరంతా చాలా కాలంగా ఈ రాకెట్ నడుపుతున్నారు. డబ్బులిస్తే రాజ్యసభ సీటు, గవర్నర్ పదవితో పాటు ప్రభుత్వ సంస్థలకు ఛైర్మన్‌గా నియమిస్తామని నమ్మించి మోసానికి పాల్పడుతున్న తెలుస్తోంది. అంతేకాదు తాము సీబీఐ అధికారులమని చెప్పి పోలీసు శాఖలో అధికారులను కూడా బురిడీ కొట్టించి పనులు చేయించుకున్నట్లు సమాచారం. నిందితుడు ప్రేమ్‌కుమార్ తనకు ప్రభుత్వ ఉన్నతాధికారులతో సంబంధాలున్నాయని చెప్పి అభిషేక్ బూరాతో కలిసి కుట్రలు చేసినట్లు సీబీఐ సన్నిహిత వర్గాలు పేర్కొన్నారు. చదవండి: కడుపులో బంగారం మాయం.. భార్య ఫిర్యాదుతో అసలు కథ వెలుగులోకి! -
సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
-
సీఎం కేసీఆర్‌పై సీబీఐకి ఫిర్యాదు చేసిన కేఏ పాల్
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ ముఖ్యమంత్రి కె చంద్రశేఖర్‌రావుపై ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ బుధవారం సీబీఐకి ఫిర్యాదు చేశారు. సీఎం కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యులు తెలంగాణలో రూ.9 లక్షల కోట్ల అవినీతికి పాల్పడ్డారని కేఏ పాల్ ఆరోపించారు. ఈ మేరకు ఢిల్లీలో సీబీఐ డైరెక్టర్ సుబోద్ కుమార్ జైశ్వాల్‌ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం కేఏ పాల్ మీడియాతో మాట్లాడుతూ.. ప్రపంచంలో ఎక్కడా ఇలాంటి అవినీతి చూడలేదు. తెలంగాణ ప్రజలంతా సీఎం కేసీఆర్ అవినీతిపై విచారణ జరగాలని కోరుతున్నారు. కేసీఆర్ కుటుంబానికి ఆదాయానికి మించి ఉన్న ఆస్తులపై దర్యాప్తు జరపాలి. రాష్ట్ర విభజన సమయంలో తెలంగాణ కు రూ.60 వేల కోట్ల మిగులు బడ్జెట్ ఉంది. కేసీఆర్ సర్కార్ నాలుగున్నర లక్షల కోట్ల అప్పు చేసింది. తెలంగాణలో అధికారంలోకి వచ్చిన నాటి నుంచి సీఎం కేసీఆర్, కేటీఆర్, హరీష్ రావు, సంతోష్, ఎమ్మెల్సీ కవితలు భారీ అవినీతికి పాల్పడ్డారు. తెలంగాణతో పాటూ సింగపూర్, దుబాయ్, అమెరికాలో అనేక ఆస్తులు కూడబెట్టారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలోనూ భారీగా అవినీతికి పాల్పడ్డారు. యాదాద్రి అభివృద్ధిలోనూ అవినీతి జరిగింది. రూ.2 వేల కోట్లు అంచనాలో రూ.200 కోట్లు ఖర్చు చేసి మిగిలింది అంతా దోచుకున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలు బయట పెట్టాలి. ప్రభుత్వ ఖజానాను కాపాడాలి. కేసీఆర్, ఆయన కుటుంబ సభ్యుల బినామీ లావాదేవీలపై కూడా విచారణ జరపాలి. కేసీఆర్ అవినీతిని ప్రశ్నిస్తున్నందుకు నాపై దాడులు చేస్తున్నారు. కేసీఆర్ అవినీతి అక్రమాలపై జరిగే దర్యాప్తుకు నా పూర్తి సహకారం అందిస్తానని కేఏ పాల్ అన్నారు. ఫిర్యాదు కాపీలను సీబీఐతో పాటు కేంద్రమంత్రులు అమిత్ షా, పురుషోత్తం రూపాలాకు కూడా పంపారు. చదవండి: ('ఫోన్ నెంబర్ ఇవ్వు.. లేకపోతే లైంగికదాడి చేస్తాం') -
ప్రధాని మోదీతో ఎన్సీపీ అధినేత శరద్ పవార్ భేటీ
న్యూఢిల్లీ: ఎన్సీపీ అధినేత శరద్ పవార్ ప్రధాని నరేంద్ర మోదీతో భేటీ అయ్యారు. పార్లమెంట్ ప్రాంగణంలో జరిగిన ఈ సమావేశంలో దాదాపు 20 నిమిషాలపాటు ఇద్దరు నేతలు చర్చలు జరిపారు. రాష్ట్రపతి ఎన్నికలపై చర్చ జరిగిందనే ఊహాగానాలు వినిపిస్తున్నాయి. అయితే ఎన్సీపీ, శివసేన నేతలపై ఈడీ, సీబీఐ చర్యలపైనే ప్రధానంగా చర్చించినట్టు సమాచారం. మహారాష్ట్ర మజీ హోంమంత్రి అనిల్ దేశ్‌ముఖ్‌ను ఉదయం సీబీఐ కస్టడీలోకి తీసుకుంది. సేన ఎంపీ సంజయ్ రౌత్ ఆస్తులను నిన్న ఈడీ అటాచ్ చేసింది. ఈ నేపథ్యంలో ప్రధానితో పవార్ భేటీ ప్రాధాన్యత సంతరించుకుంది. చదవండి: (ఉక్రెయిన్ నుంచి తిరిగొచ్చిన భారత వైద్యవిద్యార్థులకు తీపి కబురు)