సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. నివేదికను నవంబర్ 29లోగా సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది.
రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు: గుజ్జుల
ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఏమీ లేని కేసులో రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని లేదా సీబీఐ విచారణ జరగాలని బీజేపీ కోరింది. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ జరగాలని విచారణ పూర్తిగా సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి ఇవ్వాలన్న తీర్పును స్వాగతిస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు.
చదవండి: (Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..)
Comments
Please login to add a commentAdd a comment