MLA purchase
-
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో తీర్పు రిజర్వ్ చేసిన హైకోర్టు
-
నందుకుమార్‌ను ప్రశ్నించనున్న ఈడీ
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర’కేసులో కీలక నిందితుడు నందుకుమార్‌ను ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సోమవారం చంచల్‌గూడ జైల్లో ప్రశ్నించనుంది. ఎమ్మెల్యేలను ప్రలోభ పెట్టేందుకు పెద్ద మొత్తంలో డబ్బులు ఆశచూపారని, ఇందులో మనీలాండరింగ్‌కు అవకాశం ఉందన్న అనుమానాలతో ఈడీ రంగంలోకి దిగింది. ఇదే ప్రధానాంశంగా నందుకుమార్‌ను ప్రశ్నించేందుకు ఈడీ అసిస్టెంట్ డైరెక్టర్ సుమిత్ గోయల్ నేతృత్వంలోని ఇద్దరు అధికారుల బృందం సన్నద్ధమైంది. ఈ వ్యవహారంలో పెద్ద మొత్తంలో డబ్బులు ఆఫర్ చేసినట్టు ఎఫ్ఐఆర్ నమోదైన నేపథ్యంలో ఈ డబ్బులు ఎక్కడి నుంచి సమకూర్చాలనుకున్నారు? ఆర్థిక లావాదేవీల వెనుక ఎవరెవరు ఉన్నారన్న అంశాలపై ప్రధా నంగా ప్రశ్నించే అవకాశం ఉంది. నందుకుమార్ చెప్పే అంశాలే ఇప్పుడు ఈడీ అధికారుల దర్యా ప్తులో కీలకంగా మారనున్నాయి. ఇప్పటివరకు ఈ కేసులో ప్రధాన నిందితులైన రామచంద్రభారతి, సింహయాజీ, నందుకుమార్‌లతో సత్సంబంధాలు న్న వారు... ఈ డీల్ సందర్భంగా రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీ ప్రస్తావించిన పేర్లు, ఆ సమయంలో వారు ఎవరెవరితో ఫోన్లో మాట్లాడారు.. ఎవరితో టచ్‌లో ఉన్నారు.. అన్న అంశాల ఆధారంగానే ‘సిట్’బృందం దర్యాప్తు చేసింది. సిట్ బృందాలు కేరళ, కర్ణాటక, ఇతర రాష్ట్రాల్లో జరిపిన సోదాల్లోనూ కేవలం ఈ కేసుతో లింకులున్న వ్యక్తుల గురించి ఆరా తీయడంపైనే దృష్టి పెట్టింది. సిట్ ఇప్పటివరకు చేసిన దర్యాప్తులో నందుకుమార్ భార్యతోపాటు ఇద్దరు న్యాయవాదులను ప్రశ్నించింది. కానీ, ఎక్కడా డబ్బు ప్రస్తావన రాలేదు. నిందితుల అరెస్టు సమయంలో పెద్దమొ త్తంలో డబ్బులు ఇవ్వజూపారని మాత్రమే సైబరా బాద్ పోలీసులు వెల్లడించారు. కానీ, ఘటనా స్థలంలో మాత్రం నగదు పట్టుబడిన ఆధారాలు వెల్లడించలేదు. రూ. వందల కోట్లు ఆశజూపి బేరసారాలు జరిపినట్లు ఆరోపణల నేపథ్యంలో ఈడీ విచారణలో డబ్బు అంశంతో మరేమైన కొత్త కోణాలు వెలుగులోకి వస్తాయా అన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. సోమ, మంగళవారాల్లో నందుకుమార్ ఇచ్చే వాంగ్మూలం కొత్త మలుపులకు దారితీసే అవకాశం ఉన్నట్టు చర్చ జరుగుతోంది. మరోసారి పైలెట్ రోహిత్‌రెడ్డి ఎమ్మెల్యేల ఎర కేసు ఫిర్యాదుదారుడు ఎమ్మెల్యే పైలట్ రోహిత్‌రెడ్డి మంగళవారం మరోసారి ఈడీ అధికారుల విచారణకు హాజరుకానున్నా రు. గత వారంలో రెండు రోజులపాటు రోహిత్‌రెడ్డిని ప్రశ్నించిన ఈడీ ఈనెల 27న మరోమారు విచారణకు హాజరుకావాలని ఆదేశించింది. -
ఫామ్ హౌజ్ కేసు ఒక దొంగ కేసు : డీకే అరుణ
-
ఎమ్మెల్యే రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు
రంగారెడ్డి జిల్లా కోర్టులు: మొయినాబాద్ ఫామ్‌హౌస్‌లో ఎమ్మెల్యేల కొనుగోలు కేసు దర్యాప్తులో భాగంగా మంగళవారం రంగారెడ్డి జిల్లా కోర్టులో 5వ మెట్రోపాలిటన్ మేజిస్ట్రేట్ డి.దేవేందర్ బాబు.. ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. ఈ కేసులో ఫిర్యాదీ తాండూరు శాసనసభ్యుడు పైలెట్ రోహిత్ రెడ్డి వాంగ్మూలాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 164 ప్రకారం అధికార పరిధిలో లేని మేజిస్ట్రేట్ నమోదు చేయాల్సి ఉంది. సరూర్‌నగర్ పోలీసులు ప్రత్యేక భద్రత మధ్య ఎమ్మెల్యేను కోర్టులో హాజరు పరిచారు. -
‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసు నిందితుడు నందకుమార్‌పై మరో కేసు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యే కొనుగోలు కేసులో నిందితుడిగా ఉన్న నందకుమార్‌పై మరో కేసు నమోదైంది. వ్యాపారం పేరుతో తమను నందకుమార్ మోసం చేసినట్లు ఆరోపిస్తూ మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. తన వ్యాపారంలో పెట్టుబడి పెడితే 50 శాతం వాటా ఇస్తానని నమ్మించి మోసం చేశాడని ఫిర్యాదులో పేర్కొన్నారు. నందకుమార్ వల్ల తాము రూ.2 కోట్లు నష్టపోయామని ఫిర్యాదులో పేర్కొన్నారు మానిక్ చంద్ పాన్ మసాలా నిర్వాహకులు. మానిక్ చంద్ నిర్వాహకుల ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు విచారణ చేపట్టారు. ఇదీ చదవండి: నందకుమార్‌కు బెయిల్ మంజూరు.. లాస్ట్‌లో ట్విస్ట్ ఇచ్చిన పోలీసులు! -
అనుకూల వివరాలే మీడియాకిచ్చారు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేల ఎరకు సంబంధించి మొయినాబాద్ ఫాంహౌస్‌లో దాదాపు 3 గంటలకు పైగా చర్చలు జరిగాయని సైబరాబాద్ సీపీ తెలిపారు. ఆ తతంగాన్నంతా వీడియో తీశామని, ఆడియో రికార్డు చేశామని చెప్పారు. సీఎం కేసీఆర్ ప్రెస్‌మీట్ పెట్టి మీడియాకు వీడియో, ఆడియో సీడీలను విడుదల చేశారు. ఇందులో వీడియో నిడివి గంట మాత్రమే ఉంది. అంటే 3 గంటల నిడివి ఉన్న వీడియోలో తమకు అనుకూలమైన దాన్ని ఉంచి.. మిగతాది తొలగించి మీడియాకు విడుదల చేశారు. సదరు వీడియో సీడీలను పోలీసులు తప్ప వేరేవరూ సీఎంకు అందజేసే అవకాశమే లేదు’అని బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి తరఫు సీనియర్ న్యాయవాది ఎస్డీ సంజయ్.. హైకోర్టుకు వెల్లడించారు. ఆ వీడియోలను సీజేఐకి, హైకోర్టు సీజేలకు, ఇతర ప్రముఖులకు పంపించారని.. మీడియాలో విస్తృతంగా ప్రసారం అయ్యేలా చేశారన్నారు. దీన్ని తీవ్ర చర్యగా పరిగణించాలని.. క్షమాపణ చెబితే సరిపోదని నివేదించారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. తదుపరి విచారణను వచ్చే మంగళవారానికి వాయిదా వేశారు. ఎమ్మెల్యేలకు ఎర కేసును సీబీఐ లేదా సిట్టింగ్ జడ్జి ఆధ్వర్యంలోని ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)తో విచారణ జరిపించాలని బీజేపీ నేత గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డితో పాటు నిందితులు రామచంద్ర భారతి, సింహయాజీ, నందుకుమార్, ఇతరులు దాఖలు చేసిన పిటిషన్లపై న్యాయమూర్తి జస్టిస్ బి.విజయ్‌సేన్‌రెడ్డి శుక్రవారం విచారణ చేపట్టారు. నిందితులు నందుకుమార్, రామచంద్ర భారతి, సింహయాజీల తరఫున సీనియర్ న్యాయవాది మహేశ్ జఠ్మలానీ, బీజేపీ తరఫున సీనియర్ న్యాయవాది జె.ప్రభాకర్, ప్రభుత్వం తరఫున ఏఏజీ రామచందర్‌రావు వాదనలు వినిపించారు. సిట్ అధికారుల ప్రమోషన్లు, బదిలీలు సీఎం చేతుల్లో... ఎస్డీ సంజయ్: ‘నేరుగా ముఖ్యమంత్రి ప్రమేయం ఉన్న ఈ కేసులో సిట్ పారదర్శకంగా, స్వేచ్ఛగా దర్యాప్తు చేసే అవకాశమే లేదు. సీబీఐ లాంటి స్వతంత్ర దర్యాప్తు సంస్థతో దర్యాప్తు చేయించాలి’అని విజ్ఞప్తి చేశారు. సిట్ వద్ద ఉన్న మెటీరియల్, సీఎం మీడియాకు ఇచ్చిన మెటీరియల్ ఒకటేనా? ఫిర్యాదుదారుడైన ఎమ్మెల్యే కూడా సీఎంకు సమాచారం ఇచ్చి ఉండవచ్చు కదా.. అని న్యాయమూర్తి ప్రశ్నించారు. దీనికి సందీప్ బదులిస్తూ.. ‘పోలీసులే.. వీడియో, ఆడియోలు రికార్డు చేశారు. క్రిమినల్ కేసు వివరాలను ఫిర్యాదుదారుడికి కూడా వెల్లడించడానికి వీలులేదు. అలా అని సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఉన్నాయి. సిట్‌లో ఉన్న వారంతా ఐపీఎస్‌లు, ఇతర పోలీస్ అధికారులు. వారి ప్రమోష న్, డిప్యూటేషన్, బదిలీలు లాంటివన్నీ రాష్ట్రానికి హెడ్‌గా వ్యవ హరించే సీఎం చేతుల్లోనే ఉంటాయి. కేరళలో ఓ పార్టీ చీఫ్ తుషా ర్ పేరును నవంబర్ 3న ప్రెస్మీట్లో సీఎం తొలిసారి వెల్లడించారు. ఆ తర్వాత ఏర్పాటైన సిట్ తుషార్‌కు సీఆర్పీసీ 41ఏ కింద నోటీసులిచ్చింది. సీఎం డైరెక్షన్లోనే సిట్ విచారణ సాగుతోంది అనడానికి ఇంతకు మించి నిదర్శనం లేదు’ అని చెప్పారు. ఆడియోను నిర్ధారించకుండానే మీడియాకు వివరాలు.. మహేశ్ జఠ్మలానీ: ‘మొయినాబాద్ ఘటన జరిగిన రోజే పోలీస్ కమిషనర్ మీడియాకు వివరాలు వెల్లడించడం తీవ్రంగా పరిగణించాల్సిన అంశం. సీఆర్పీసీ సెక్షన్ 157 ప్రకారం సాక్ష్యాధారాలను మేజిస్ట్రేట్కే అందజేయాలి. ఇతలెవరికీ లీక్ చేయవద్దు. ఆడియో, వీడియోల్లోని గొంతులు ఎవరివో సాంకేతిక ఆధారా లు లేకుండానే మీడియాకు వారిపై వ్యతిరేకంగా వివరాలు చెప్ప డం చట్టవిరుద్ధం. ఈ అన్ని అంశాలను పరిశీలించి సిట్ నిలిపివే సి, సీబీఐ దర్యాప్తు ఆదేశించాలి’అని విజ్ఞప్తి చేశారు. వాదనలు విన్న న్యాయమూర్తి.. విచారణను 13వ తేదీకి వాయిదా వేశారు. -
సిట్ ‘మెమో’పై సుదీర్ఘ వాదనలు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో మరో నలుగురిని నిందితులుగా చేరుస్తూ దాఖలు చేసిన మెమోను ఏసీబీ కోర్టు తిరస్కరించడాన్ని సవాల్ చేస్తూ ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) హైకోర్టును ఆశ్రయించగా, తీర్పు రిజర్వు చేసింది. గురువారం కూడా సుదీర్ఘ వాదనలు కొనసాగాయి. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(ఏ–4), బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి(ఏ–5), కేరళకు చెందిన జగ్గుస్వామి(ఏ–6), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది భూసారపు శ్రీనివాస్(ఏ–7)ను నిందితులుగా చేర్చేందుకు ఏసీబీ కోర్టులో సిట్ మెమో దాఖలు చేసింది. అసలు సిట్‌కు ఈ కేసు విచారణ చేసే అర్హతే లేదని ట్రయల్ కోర్టు మెమోను తిరస్కరించింది. దీన్ని సవాల్ చేస్తూ దాఖలైన క్రిమినల్ రివిజన్ పిటిషన్‌పై న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ గురువారం విచారణ చేపట్టారు. భూసారపు శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది ఎన్.రాంచందర్‌రావు, రామచంద్రభారతి తరఫున సీనియర్ న్యాయవాది రవిచందర్, సిట్ తరఫున అడ్వొకేట్ జనరల్ (ఏజీ) బీఎస్ ప్రసాద్ వాదనలు వినిపించారు. రాంచందర్‌రావు: ‘ఏసీబీ కోర్టు అన్ని అంశాలను క్షుణ్ణంగా పరిశీలించిన తరువాతే మెమోను తిరస్కరిస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఏసీబీ కోర్టు ఆదేశాలపై స్టే ఇవ్వవద్దు. అసలు ఈ కేసులో ఇంతవరకు ఎలాంటి డబ్బు పట్టుబడలేదు. అందుకే అవినీతి నిరోధక చట్టం సెక్షన్ 8 ఇక్కడ వర్తించదని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఒక పక్క కేసు దర్యాప్తు కొనసాగుతోంది. సీఆర్పీసీ సెక్షన్ 41ఏ కింద కొందరికి నోటీసులు కూడా జారీ చేశారు. వీటిపై హైకోర్టులో విచారణ సాగుతుండగానే.. సిట్‌కు నలుగురిని నిందితులుగా చేర్చాల్సిన అవసరం ఏమొచ్చింది. కేసు నమోదు అంతా అవినీతి నిరోధక చట్ట ప్రకారం జరిగింది.. అన్నీ కూడా ఏడేళ్ల కంటే తక్కువ శిక్ష పడే సెక్షన్లే అని ట్రయల్ కోర్టు పేర్కొంది. ఇలాంటి కేసులో లా అండ్ ఆర్డర్ పోలీసులు ఎలా ఎఫ్ఐఆర్ నమోదు చేస్తారని.. దర్యాప్తు ఎలా చేస్తారని ఏసీబీ కోర్టు ప్రశ్నించింది’అని నివేదించారు. రవిచందర్: ‘నిందితుడిపై మెమో దాఖలు చేయడంలో సిట్ అనుసరించిన విధానంలోనే లోపాలున్నాయి. వారు పాటిస్తున్న పద్ధతి క్రిమినల్ చట్టంలోనే లేదు. అసలు అఫిడవిట్ దాఖలు చేయకుండా సిట్ మెమో ఎలా దాఖలు చేస్తుంది? రూ.100 కోట్ల డీల్ నిందితులకు, ఎమ్మెల్యేలకు మధ్య సాగిందని చెబుతున్న పోలీసులు ఇప్పటివరకు ఒక్క రూపాయి దొరికినట్లు ఆధారాలు చూపలేకపోయారు. సిట్ దాఖలు చేసిన పిటిషన్‌ను కొట్టివేయాలి’అని విజ్ఞప్తి చేశారు. బీఎస్ ప్రసాద్: ‘అనుమానాలున్న వారిని ప్రతిపాదిత నిందితులుగా చేరుస్తూ మెమో దాఖలు చేసే అధికారం.. పోలీసులకు ఉంటుంది. ఇది తదుపరి విచారణకు ఎంతో అవసరం. కేసులో పలు పిటిషన్లు హైకోర్టు వద్ద విచారణలో ఉండగా, ఏసీబీ కోర్టు మెమోను ఎలా తిరస్కరిస్తుంది. ఏసీబీ కోర్టు తన పరిధిని దాటి మెమోను రద్దు చేసింది. మెమో అనేది కేవలం సిట్ తెలియజేసే సమాచారం మాత్రమే. అయినా ఆర్డర్ ఇచ్చేసి చట్ట వ్యతిరేకంగా చేసింది. నలుగురిని నిందితులుగా ప్రతిపాదిస్తూ మెమో దాఖలు చేస్తే దానిని ఏసీబీ కోర్టు కొట్టేయడం చెల్లదు. ఏసీబీ కోర్టు అధికారాలను ఉల్లంఘించింది. హైకోర్టు, సుప్రీంకోర్టులే దర్యాప్తులను అడ్డుకోవు. అసాధారణ పరిస్థితుల్లోనే దర్యాప్తులను ఆపుతాయి. ఏసీబీ కోర్టు మాత్రం తన పరిధికి మించి ఉత్తర్వులు ఇచ్చింది. వెంటనే ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. నిందితులు తమపై నమోదుచేసిన కేసు(ఎఫ్ఐఆర్ నంబర్ 455/2022) ను ఏ కోర్టులోనూ సవాల్ చేయలేదు. దర్యాప్తును కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ)తో జరిపించాలని మాత్రమే కోరారు’అని వివరించారు. ఈ సందర్భంగా సుప్రీంకోర్టు గత తీర్పులను కోర్టు దృష్టికి తెచ్చారు. -
ప్రతిపాదిత నిందితులకు నోటీసులివ్వండి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో ప్రతిపాదిత నిందితులకు నోటీసులను, ఈ కేసుకు సంబంధించిన ప్రతులను అందజేసేలా చూడాలని అడ్వొకేట్ జనరల్(ఏజీ), ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్)ను హైకోర్టు ఆదేశించింది. పోలీసులు దాఖలు చేసిన మెమోను తిరస్కరిస్తూ ఏసీబీ కోర్టు ఇచ్చిన ఉత్తర్వులను సిట్ హైకోర్టులో సవాల్ చేసింది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బీఎల్ సంతోష్(ఏ–4), బీడీజేఎస్ అధ్యక్షుడు తుషార్ వెల్లపల్లి(ఏ–5), కేరళకు చెందిన జగ్గుస్వామి(ఏ–6), కరీంనగర్‌కు చెందిన న్యాయవాది శ్రీనివాస్(ఏ–7)ను నిందితులుగా చేర్చేందుకు అనుమతి ఇవ్వాలని విజ్ఞప్తి చేసింది. మొదటి ముగ్గురు నిందితుల నేరాంగీకార వాంగ్మూలంలో ఎక్కడా ఈ నలుగురి పేర్లు లేవని.. ఎఫ్ఐఆర్, రిమాండ్ రిపోర్టుల్లోనూ ఈ నలుగురి పాత్రపై ఎలాంటి ప్రాథమిక ఆధారాలు లేవన్న ఏసీబీ కోర్టు మెమోను తిరస్కరించింది. లంచ్ మోషన్ సిట్ పిటిషన్ దాఖలు చేసింది. దీనిపై మధ్యాహ్నం 2.30 గంటలకు న్యాయమూర్తి జస్టిస్ డి.నాగార్జున్ బుధవారం విచారణ చేపట్టారు. ప్రభుత్వం తరఫున అడ్వొకేట్ జనరల్(ఏజీ) బీఎస్ ప్రసాద్, పీపీ ప్రతాప్‌రెడ్డి, భూసారపు శ్రీనివాస్ తరఫున సీనియర్ న్యాయవాది రామచందర్‌రావు వాదనలు వినిపించారు. ‘ఈ కేసుకు సంబంధించి పలు విచారణలు ఇదే హైకోర్టు సాగుతున్నాయి. సుప్రీంకోర్టు కూడా దీనిపై విచారణ జరిపింది. ఇలాంటి పరిస్థితుల్లో ఏసీబీ కోర్టు మెమోను ఎలా తిరస్కరిస్తుంది. అసలు మెమోను తిరస్కరించే అధికారం ఏసీబీ కోర్టుకు లేదు. వెంటనే ఏసీబీ కోర్టు ఉత్తర్వులను కొట్టివేయాలి. ఒక్క రోజు ఆలస్యమైనా అది సిట్ విచారణపై ప్రభావం చూపుతుంది’అని ఏజీ చెప్పారు. ‘పిటిషన్‌కు సంబంధించిన వివరాల ప్రతులను నాకు ఇవ్వకపోవడం సరికాదు. దీంతో పిటిషన్లో అసలు ఏముందో చూడలేకపోయాను. ఇది సహజ న్యాయ సూత్రాలకు విరుద్ధం. శ్రీనివాస్‌కు కనీసం నోటీసులైనా జారీ చేయకుండా విచారణ ఎలా చేస్తారు’అని రామచందర్‌రావు ప్రశ్నించారు. ఈయన వాదనతో ఏకీభవించిన న్యాయమూర్తి.. నోటీసుల జాబితాలో శ్రీనివాస్ పేరును కూడా చేర్చాలని సిట్ ఆదేశించారు. నిందితులుగా చేర్చబోయే వారికి నోటీసులు జారీ చేయాలన్నారు. అలాగే వారికి కేసు వివరాలను కూడా అందజేయాలని ఏజీకి స్పష్టం చేశారు. విచారణను నేటికి (గురువారం) వాయిదా వేశారు. -
కాంగ్రెస్‌లో నందు చిట్టా తంటా!
సాక్షి, హైదరాబాద్: వలసల బెడదతో సతమతమ వుతున్న రాష్ట్ర కాంగ్రెస్ పార్టీకి ‘నందు చాటింగ్ చిట్టా’కొత్త తంటాలు తెచ్చిపెట్టింది. ఎమ్మెల్యేలకు ఎర కేసు కేవలం టీఆర్ఎస్, బీజేపీల మధ్యనే నడుస్తుందని భావించిన కాంగ్రెస్ పెద్దలకు నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ నేతల పేర్లు ఉండటం కలవరం పుట్టిస్తోంది. పార్టీ ఎమ్మెల్యేలతోపాటు మాజీ ఎమ్మెల్యేలు, ఎంపీ, ఎమ్మెల్యే అభ్యర్థులుగా పోటీ చేసిన నాయకులు, తాము పార్టీలో చేర్చుకోవాలనుకుంటున్న నేతల పేర్లు ఈ జాబితాలో ప్రత్యక్షం కావడంతో ఎప్పుడు ఏం జరుగుతుందోననే టెన్షన్ కాంగ్రెస్ ముఖ్యనేతల్లో వ్యక్తమవుతోంది. సిట్ విచారణలో భాగంగా వెల్లడైన ఈ పేర్లు కేవలం కాగితాలు, ఫోన్ చాటింగ్‌ల వరకే పరిమితం అయ్యా యా? పార్టీ నేతలను ఎవరైనా కలిసి మంతనాలు జరిపారా? ఆ మంతనాల్లో పాల్గొన్నదెవరు? ఎవరు పార్టీలో ఉంటారు? ఎవరు వెళ్లిపోతారు? అనే ప్రశ్నలు కాంగ్రెస్ పెద్దలను కలవరపెడుతున్నాయి. ఎమ్మెల్యేలతో సహా...! నందు చాటింగ్ జాబితాలో తమ పార్టీ కీలక నేతలుండటం టీపీసీసీ వర్గాలను ఉలికిపాటుకు గురిచేస్తోంది. పార్టీ ఎన్నికల సమన్వయ కమిటీ చైర్మన్ దామోదర రాజనర్సింహ, ఏఐసీసీ కార్యక్రమాల అమలు కమిటీ చైర్మన్ ఏలేటి మహేశ్వర్‌రెడ్డి, మంథని, భద్రాచలం, సంగారెడ్డి ఎమ్మెల్యేలు శ్రీధర్‌బాబు, పొదెం వీరయ్య, జగ్గారెడ్డి, ఎమ్మెల్సీ జీవన్‌రెడ్డి లాంటి నేతల పేర్లున్న నేపథ్యంలో పార్టీలో ఎంత మందిని టార్గెట్ చేశారనేది ఆసక్తికరంగా మారింది. వీరిలో ఒకరిద్దరు మినహా అందరూ పార్టీ విధేయులేనని, ఎట్టి పరిస్థితుల్లో కాంగ్రెస్‌ను వీడే ఆలోచన ఉన్న వారు కాదని గాంధీభవన్ వర్గాలు చెబుతున్నాయి. అయితే, అలాంటి నేతల పేర్లు కూడా నందు లిస్ట్‌లో ఉండటం చూస్తే పార్టీ కుంభస్థలాన్ని కొట్టేందుకే కొందరు కుట్రలు చేస్తున్నారనే అనుమానం వ్యక్తంచేస్తున్నాయి. వీరికి తోడు పార్టీకి వెన్నుదన్నుగా నిలుస్తున్న మల్రెడ్డి బ్రదర్స్, గాలి అనిల్‌కుమార్, సురేశ్‌షెట్కార్, రాజ్‌ఠాకూర్, ఆదిశ్రీనివాస్, అలిగిరెడ్డి ప్రవీణ్‌రెడ్డి, చెరుకు శ్రీనివాస్‌రెడ్డి, గడ్డం ప్రసాద్కుమార్లాంటి నేతల పేర్లు ప్రత్యక్షం కావడంతో అసలు నందు అండ్ కో వీరిలో ఎవరినైనా కలిసిందా అనే కోణంలో టీపీసీసీ ఆరా తీస్తోంది. వీరికి తోడు తమ పార్టీలోకి వస్తారని భావిస్తున్న తీగల కృష్ణారెడ్డి, పట్నం మహేందర్‌రెడ్డి, తుమ్మల నాగేశ్వరరావు తదితరుల పేర్లు కూడా చాటింగ్‌లో ప్రస్తావనకు రావడంతో పార్టీలో ఉన్న వారిని తీసుకోవడంతోపాటు కొత్తవారు రాకుండా గట్టి ప్రయత్నాలే జరుగుతున్నాయనే చర్చ ఇప్పుడు పార్టీలో హాట్ టాపిక్‌గా మారింది. ఒక సామాజిక వర్గమే టార్గెట్ నందు జాబితాలోని నేతల పేర్లు చూస్తుంటే రాష్ట్రంలోని ఓ ప్రధాన సామాజిక వర్గంపై దృష్టిపెట్టారని కాంగ్రెస్ నేతలంటున్నారు. ‘మొదటి నుంచీ రాష్ట్రంలో కాంగ్రెస్‌కు అండగా ఉంటున్న ఆ సామాజిక వర్గం నేతలను దూరం చేయడం ద్వారా తమ ఓటు బ్యాంకును పెంచుకోవడంతోపాటు కాంగ్రెస్‌ను పూర్తిగా బలహీనపర్చాలనే వ్యూహం అమలు చేస్తున్నార’ని అని టీపీసీసీ ముఖ్య నాయకుడు ‘సాక్షి’తో చెప్పారు. మొత్తంమీద నందు చిట్టా ఏ పరిణామాలకు దారితీస్తుందో, పార్టీలో ఎప్పుడు ఏం జరుగుతుందో? ముందస్తు నష్ట నివారణ చర్యలకు టీపీసీసీ పూనుకుంటుందో లేదో అన్న సందేహాలు కాంగ్రెస్ కేడర్‌లో తలెత్తుతున్నాయి. -
ఎమ్మెల్యేల కొనుగోళ్లపై విచారణ జరపాలి
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారంపై హైదరాబాద్ పోలీస్ కమిషనర్ సీవీ ఆనంద్ ఆధ్వర్యంలో జరుగుతున్న సిట్ విచారణ పరిధిని మరింత పెంచాలని కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసింది. 2014లో కాంగ్రెస్, టీడీపీ, ఇతర పార్టీల నుంచి ఎమ్మెల్యేలుగా గెలిచిన వారు పార్టీలు మారడానికి గల కారణాలు ప్రజలకు తెలియాలని టీపీసీసీ ఉపాధ్యక్షుడు నిరంజన్ అన్నారు. గాంధీభవన్‌లో గురువారం ఆయన మీడియా సమావేశంలో మాట్లాడుతూ 2014, 2019 లలో కాంగ్రెస్, ఇతర పార్టీల నుంచి గెలిచిన ఎమ్మెల్యేలకు పార్టీ మారేందుకు ఎంత ఎర వేశారో తేల్చాలన్నారు. తలసాని శ్రీనివాస్ యాదవ్ టీడీపీ సభ్యుడిగా గెలిచి 2014లో మంత్రి అయితే, సబితా ఇంద్రారెడ్డి 2019లో కాంగ్రెస్ పార్టీ నుంచి గెలిచి మంత్రి అయ్యార ని, వీళ్లకు ఏం ఎరవేశారని ప్రశ్నించారు. కార్మిక మంత్రి మల్లారెడ్డి కూడా 2016లో టీడీపీ ఎంపీగా గెలిచి, టీఆర్ఎస్లో చేరారని గుర్తు చేశారు. ప్రలోభాలలో భాగంగానే మర్రి రాజశేఖర్‌రెడ్డికి మల్కాజిగిరి, తలసాని సాయికిరణ్‌కు సికింద్రాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం టికెట్ ఇచ్చారని విమర్శించారు. ఈ విషయమై తలసాని, మల్లారెడ్డికి నార్కోటిక్ పరీక్షలు నిర్వహించాలని డిమాండ్ చేశారు. -
సొంతూరు.. పరిగి, ఎల్బీ నగర్, చైతన్యపురి
బంజారాహిల్స్ (హైదరాబాద్): ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో నిందితుడు కొర్రె నందుకుమార్ పోలీస్ విచారణలో పొంతనలేని సమాధానాలు చెప్పినట్లు తెలిసింది. రెండు రోజుల పోలీస్ కస్టడీ ముగియడంతో పోలీసులు అతడిని మంగళవారం తిరిగి చంచల్‌గూడ జైలుకు తరలించారు. సినీ నటుడు దగ్గుబాటి వెంకటేష్, నిర్మాత దగ్గుబాటి సురేష్‌లకు చెందిన ప్లాట్లను లీజు పేరుతో తీసుకొని దుర్వినియోగం చేసిన కేసులో నందుకుమార్ నుంచి మరింత సమాచారం రాబట్టేందుకు బంజారాహిల్స్ పోలీసులు రెండు రోజుల కస్టడీకి తీసుకున్నారు. ఇందులోభాగంగా పోలీసులు మంగళవారం నందుకు 22 ప్రశ్నలు సంధించారు. తొలుత మీ సొంతూరు ఏది అని ప్రశ్నించగా పరిగి, ఎల్బీనగర్, చైతన్యపురి అని నిర్లక్ష్యంగా చెప్పినట్లుగా తెలిసింది. నీ వృత్తి ఏంటన్న ప్రశ్నకు.. హోటల్ బిజినెస్ అని చెప్పినట్లు సమాచారం. మొదటగా అంబర్‌పేట్‌లో సీజన్ పేరుతో హోటల్ నడిపినట్లు చెప్పారు. ఫిలింనగర్లో డెక్కన్ కిచెన్ హోటల్ ఎలా వచ్చిందని ప్రశ్నించగా 2016 డిసెంబర్లో డబ్లూ3 పేరుతో హోటల్ లీజుకు తీసుకున్నానని, అనంతరం దక్కన్ కిచెన్‌గా మార్చానని బదులిచ్చారు. డెక్కన్ హోటల్‌కు ఎవరెవరు వచ్చే వారు? సదరు ఎమ్మెల్యేలు ఎలా తెలుసు? రామచంద్ర మూర్తితో పరిచయం ఎలా జరిగింది అని ఆరా తీసినట్లు సమాచారం. డబ్లూ 3 హాస్పిటాలిటీకి ప్రమోద్ కుమార్ రాజీనామా చేయగానే తాను ఎండీగా కొనసాగినట్లు చెప్పారని తెలిసింది. అభిషేక్‌కూడా 2017లోనే డైరెక్టర్‌గా తప్పుకున్నారన్నారు. దక్కన్ కిచెన్ పేరుతో 6 లక్షలు వసూలు చేసినప్పుడు ఏదైనా డాక్యుమెంటేషన్ ఉందా అని ప్రశ్నించగా అలాంటిదేమి లేదని తెలిపారు. ఈ ప్రాపర్టీని ఎందుకు తీసుకున్నావన్న ప్రశ్నకు.. వ్యాపారనిమిత్తం తీసుకున్నట్లు చెప్పారు. ఏ వ్యాపారం కోసం తీసుకున్నారన్న ప్రశ్నకు సమాధానం ఇస్తూ ఐస్‌క్రీం షాపులు, మిల్క్‌షేక్ కౌంటర్లు ఏర్పాటు చేశానన్నారు. దక్కన్ కిచెన్ ప్రొప్రైటర్లు ఎలా పరిచయం అని ప్రశ్నించగా వారే తనను సంప్రదించారని చెప్పినట్లు తెలిసింది. కామన్ ఫ్రెండ్ సురేష్‌రెడ్డి ద్వారా ప్రమోద్ కుమార్ పరిచయమైనట్లు చెప్పారు. ఈ హోటల్ ద్వారా పది శాతం రెవెన్యూ వాటా పొందుతున్నానని, ప్రస్తుతం డైరెక్టర్లుగా కల్వకుంట్ల తేజేశ్వర్ రావు అలియాస్ కన్నారావు, ఆవుల అభిషేక్ ఉన్నారని తెలిపినట్లు సమాచారం. -
బండి సంజయ్ పేరు చెప్పాలని సిట్ ఒత్తిడి చేస్తోందని పిటిషన్
-
ఎమ్మెల్యేలకు ఎర కేసు: నందుతో ఏం మాట్లాడారు?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో కీలక నిందితుడు నందుకుమార్ భార్య చిత్రలేఖ, ఓ స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్ మాదిగ సోమవారం సిట్ ఎదుట హాజరయ్యారు. సిట్ అధికారులు దాదాపు 8 గంటల పాటు ఇరువురినీ వేర్వేరుగా, కలిపి పలు ప్రశ్నలు సంధించారు. అయితే వీరి నుంచి సరైన సమాధానాలు రాలేదని తెలుస్తోంది. ఈ కేసుకు సంబంధించి చిత్రలేఖ, నందు మధ్య సంప్రదింపులు, సమాచార మార్పిడి జరిగినట్లు ఇప్పటికే సిట్ గుర్తించింది. తాను చేసే ప్రతి పని గురించి చిత్రలేఖకు చెప్పడం నందుకు అలవాటు. కొన్ని కీలక లావాదేవీలు, వ్యవహారాలకు సంబంధించిన అంశాల స్క్రీన్‌షాట్స్ కూడా ఆమెకు పంపినట్లు గుర్తించారు. సిట్ ఆ వివరాలను ఆమె నుంచి రాబట్టడానికి ప్రయత్నిస్తోంది. ఇదే కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజీ సైతం పలుమార్లు నందు ఇంటికి వెళ్లారు. ఆ సమయంలో వాళ్లు ఎవరెవరిని కలిసే వారు? ఏం మాట్లాడుకునే వారు? ఎక్కడెక్కడ తిరిగారు? తదతర వివరాలను చిత్రలేఖ నుంచి రాబట్టడానికి సిట్ పలు ప్రశ్నల్ని సంధించింది. అయితే, ఆమె నుంచి సరైన సమాధానాలు రాలేదని అధికారులు చెప్తున్నారు. దీంతో మరో రోజు విచారణకు రప్పించే అంశాన్ని పరిశీలిస్తున్నారు. అలాచేస్తే బీజేపీలో చేరతా! సోమవారం సిట్ అధికారులు స్వచ్ఛంద సంస్థ ప్రధాన కార్యదర్శి ఎం.విజయ్‌కుమార్‌ను కూడా ప్రశ్నించారు. ఈయన కాంగ్రెస్ సిటీ కమిటీలో సభ్యుడిగా ఉన్నారు. తనకు జాతీయ ఎస్సీ, ఎస్టీ కమిషన్‌లో సభ్యుడిగా అవకాశం కల్పించాలని, అలా చేస్తే తాను కూడా బీజేపీలో చేరతానంటూ నందుతో సంప్రదింపులు జరిపారు. సాంకేతిక ఆధారాలను బట్టి ఈ విషయం గుర్తించిన సిట్ దానిపైనే విజయ్ను ప్రశ్నించింది. ఇందులో భాగంగా ఆర్థిక లావాదేవీలేమైనా జరిగాయా? నందును కాకుండా ఇంకా ఎవరినైనా కలిశారా? ఢిల్లీకి వచ్చారా? తదితర వివరాలు సేకరించారు. కాగా, ఏపీలోని నరసాపురం ఎంపీ రఘురామ కృష్ణరాజుకు నందు, రామచంద్ర భారతిలతో సంబంధాలు ఉన్నట్లు సిట్ గుర్తించింది. వీళ్లు ముగ్గురూ పలుమార్లు ఢిల్లీకి వెళ్లి కీలక వ్యక్తులను కలిసినట్లు ఆధారాలు సేకరించారు. దీనిపై ప్రశ్నించడానికి మంగళవారం ఉదయం 10.30 గంటలకు తమ ముందు హాజరు కావాలని అధికారులు రఘురామకు నోటీసులు జారీ చేశారు. అయితే వ్యక్తిగత కారణాలతో విచారణకు రాలేనని రఘురామ సిట్‌కు సమాచారమిచ్చారు. మరో రోజు అవకాశమిస్తే వచ్చి వాంగ్మూలం ఇస్తానని పేర్కొన్నారు. దీంతో మరో తేదీని ఖరారు చేసి ఆయనను ప్రశ్నించాలని సిట్ నిర్ణయించింది. -
సిట్ నోటీసులను ఆపండి
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) దర్యాప్తు పేరుతో ఇస్తున్న నోటీసులను నిలిపివేయాలని బీజేపీ హైకోర్టులో మధ్యంతర పిటిషన్ వేసింది. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ప్రేమేందర్‌రెడ్డి ఈ పిటిషన్ దాఖలు చేశారు. ‘ఇటీవల హైకోర్టు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం కేసులో నిందితుల పేర్లను, నోటీసుల వివరాలను మీడియాకు సిట్ వెల్లడించకూడదు. అయితే ఆ ఆదేశాలకు వ్యతిరేకంగా సిట్ పని చేస్తోంది. నోటీసులు ఇచ్చిన వాళ్ల వివరాలను మీడియాకు తెలిసేలా చేస్తోంది. బీజేపీ జాతీయ ప్రధాన కార్యదర్శి బి.లక్ష్మీ జనార్దన సంతోష్(బీఎల్ సంతోష్)కు 41ఏ నోటీసులు జారీ చేయడమే ఇందుకు నిదర్శనం. 17న నోటీసులు ఇచ్చిన వారందరి వివరాలు చానళ్లలో ప్రసారం అయ్యాయి. కేవలం బీజేపీ లక్ష్యంగా దర్యాప్తు సాగుతోంది. 41ఏ నోటీసు తర్వాత అరెస్టు చేస్తారు. దర్యాప్తు పేరుతో కేసుకు సంబంధం లేని వాళ్లను వేధించే కుట్ర జరుగుతోంది. నోటీసుల తర్వాత దర్యాప్తు పేరుతో వాళ్లను ఇబ్బందులకు గురిచేసే అవకాశాలు ఉన్నాయి. ఎలాగైనా బీజేపీ ప్రతిష్టను దెబ్బతీయాలనే ప్రయత్నం సాగుతోంది. సిట్ నోటీసుల అమలును నిలివేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలి’అని పిటిషన్లో ప్రేమేందర్‌రెడ్డి కోరారు. రాష్ట్ర హోంశాఖ ముఖ్య కార్యదర్శి, డీజీపీ, సైబరాబాద్ సీపీ, రాజేంద్రనగర్ ఏసీపీ, మొయినాబాద్ స్టేషన్ ఆఫీసర్, కేంద్ర హోంశాఖ కార్యదర్శి, సీబీఐ, పైలట్ రోహిత్‌రెడ్డిలను ప్రతివాదులుగా చేర్చారు. ఈ పిటిషన్‌పై హైకోర్టు విచారణ జరపనుంది. -
ఎమ్మెల్యేలకు ఎర కేసు.. కేరళలో ముగ్గురి అరెస్ట్?
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేలకు ప్రలోభాలు పెట్టిన కేసులో స్పెషల్ ఇన్వెస్టిగేషన్ టీం (సిట్) అధికారులు కీలక ఆధారాలు సేకరించారు. ఇప్పటికే ఈ కేసులో అరెస్టయిన ప్రధాన నిందితుడు రామచంద్రభారతికి మధ్యవర్తిగా వ్యవహరించిన కేరళలోని కొచ్చికి చెందిన వైద్యుడితో సహా ఆయన ఇద్దరు సహాయకులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. కొన్ని రోజులుగా కేరళలోనే మకాం వేసి, విస్తృతంగా తనిఖీలు చేస్తున్న సిట్ బృందంలో తెలంగాణ కేడర్‌కు చెందిన ఓ కేరళ ఐపీఎస్ అధికారి కూడా ఉన్నట్లు సమాచారం. కేరళలో అదుపులో ఉన్న ఈ ముగ్గురిని పోలీసులు విచారిస్తున్నట్లు తెలిసింది. కాల్‌డేటా, బ్యాంక్ ఖాతాలను నిశితంగా పరిశీలించగా.. కొన్ని అనధికారిక లావాదేవీలు జరిగినట్లు పోలీసులు గుర్తించారు. ఆయా లావాదేవీలపై వారిని ప్రశ్నించగా.. సంతృప్తికర సమాధానం ఇవ్వలేదని పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో ఒకట్రెండు రోజుల్లో వారిని ట్రాన్సిట్ వారెంట్‌పై హైదరాబాద్‌కు తీసుకొచ్చి, విచారించేందుకు ప్రయత్నాలు చేస్తున్నట్లు సమాచారం. గత నెల 26న మొయినాబాద్‌లోని ఫామ్‌హౌస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు పైలెట్ రోహిత్ రెడ్డి, రేగ కాంతారావు, గువ్వల బాలరాజు, బీరం హర్షవర్ధన్ రెడ్డిలతో రామచంద్రభారతి, నందుకుమార్, సింహయాజీలు ప్రలోభాల చర్చలు జరుపుతున్న సమయంలో పోలీసులు రెడ్ హ్యాండెడ్‌గా పట్టుకున్న విషయం తెలిసిందే. తాజాగా ఇతర రాష్ట్రాల్లో దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు హైదరాబాద్‌కు వచ్చాక న్యాయ నిపుణులతో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకోనున్నారు. ముందు పరారీ.. రామచంద్రభారతి నెట్‌వర్క్‌పై సిట్ బృందం ప్రత్యేక దృష్టిసారించింది. ఇప్పటికే హరియాణా, కర్ణాటకలో రామచంద్రభారతికి చెందిన ఇళ్లు, ఆశ్రమాలపై సోదాలు జరిపి కీలక సమాచారాన్ని సేకరించింది. దాని ఆధారంగా కొచ్చికి చెందిన ఓ వైద్యుడు.. రామచంద్రభారతి, తుషార్‌కు మధ్యవర్తిత్వం వహించినట్లు పోలీసులు గుర్తించారు. ఈ మేరకు సిట్ బృందం కేరళలోని ఎర్నాకుళం ప్రాంతానికి వెళ్లగా.. ఈ సమాచారం అందుకున్న వైద్యుడు ఆసుపత్రి ప్రాంగణంలోని తన క్వార్టర్స్ నుంచి పరారైనట్లు పోలీసు వర్గాలు తెలిపాయి. దీంతో సహాయకులను విచారించి ఇంటి చిరునామా, ఇతరత్రా వివరాలను తీసుకొని అక్కడికి వెళ్లగా అక్కడి నుంచి కూడా పరారైనట్లు తెలిసింది. దీంతో సిట్ బృందం అక్కడే మకాం వేసి, స్థానిక పోలీసుల సహాయంతో వైద్యుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. -
జడ్జి పర్యవేక్షణలో దర్యాప్తు
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక దర్యాప్తు బృందం(సిట్) విచారణ హైకోర్టు సింగిల్ జడ్జి పర్యవేక్షణలోనే సాగాలని ఉన్నత న్యాయస్థానం స్పష్టం చేసింది. మొయినాబాద్ పోలీసులు నమోదు చేసిన క్రైమ్ నంబర్ 455/2022లో సిట్ దర్యాప్తులో ముందుకెళ్లవచ్చని సూచించింది. దర్యాప్తు తొలి నివేదికను సీల్డ్ కవర్లో ఉంచి ఈ నెల 29న సింగిల్ జడ్జి ముందు సమర్పించాలని ఆదేశించింది. ఇకపై దర్యాప్తు వివరాలను ఎప్పటికప్పుడు కోర్టుకు వెల్లడించాలని పేర్కొంది. మీడియాకు, ఇతర ఉన్నతాధికారులకు, రాజకీయ ప్రతినిధులకు విచారణకు సంబంధించిన ఎలాంటి వివరాలకు వెల్లడించరాదని, లీక్ చేయొద్దని తేల్చిచెప్పింది. సిట్‌లో ఇతర ఉన్నతాధికారుల జోక్యం కూడా చేసుకోవద్దని ఆదేశాలు ఇచ్చింది. అలాగే కేసు నమోదు చేసిన సమయంలో, విచారణ సందర్భంగా సీజ్ చేసిన వస్తువులు, పత్రాలను కోర్టుకు సమర్పించాలని చెప్పింది. వివరాలు లీక్ అయితే దానికి సిట్‌కు నేతృత్వం వహిస్తున్న సీవీ ఆనంద్ బాధ్యత వహించాల్సి ఉంటుందని వెల్లడించింది. సిట్‌కు ఎలాంటి అవసరాలు ఉన్నా సింగిల్ జడ్జి అనుమతి తీసుకుని ఆ మేరకు ఏర్పాట్లు చేసుకోవచ్చని వివరించింది. ఆ మేరకు స్వేచ్ఛనిస్తున్నట్లు ప్రధాన న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్, జస్టిస్ సీవీ భాస్కర్‌రెడ్డి ధర్మాసనం తీర్పునిచ్చింది. సీబీఐ విచారణకు నిరాకరించింది. ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో స్టేను ఎత్తివేస్తూ.. పోలీస్ దర్యాప్తునకు అనుమతిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను బీజేపీ హైకోర్టులో సవాల్ చేసింది. దీనిపై సీజే ధర్మాసనం మంగళవారం విచారణ చేపట్టింది. పిటిషనర్ తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది వైద్యనాథన్ చిదంబరం, రాష్ట్ర ప్రభుత్వం తరఫున సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాది దుష్యంత్ దవే వాదనలు వినిపించారు. సీఎం చేతికి ఆడియో సీడీలు.. ‘మొయినాబాద్ పోలీస్‌స్టేషన్ పరిధిలో అక్టోబర్ 26న నమోదైన ఈ కేసులో పోలీసులు పక్షపాతం, అన్యాయంగా విచారణ సాగిస్తున్నారు. బీజేపీని దోషిగా నిలబెట్టాలనే సీఎం, టీఆర్ఎస్ ముఖ్యుల ఆదేశాలతో దర్యాప్తు సాగుతోంది. కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టకు చేస్తున్నారు. పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను, ఆధారాలను సీజ్ చేసి ఉంచాలి. అయితే అవన్నీ సీఎం కేసీఆర్ చేరవేయడంతో పాటు.. ఆయన మీడియా సమావేశంలో అందరికీ ఆడియో, వీడియో ఫుటేజీ సీడీలను పంచిపెట్టారు. అలాగే బీజేపీ జాతీయ స్థాయి నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. పరిస్థితుల నేపథ్యంలో సింగిల్ జడ్జి గత నెల 29న ఇచ్చిన స్టే ఉత్తర్వులను పొడిగించాలి. నేరుగా సీబీఐ విచారణకు ఆదేశించే అధికారం కోర్టుకు ఉందని చెప్పారు. ఆ మేరకు ఆదేశాలు జారీ చేయాలి’అని వైద్యనాథన్ విజ్ఞప్తి చేశారు. సుప్రీంకోర్టు కూడా స్టే ఇవ్వలేదు.. ‘ఈ కేసులో సుప్రీంకోర్టు కూడా పోలీస్ విచారణపై ఇప్పటివరకు స్టే ఇవ్వలేదు. అసలు సింగిల్ జడ్జి వద్ద బీజేపీ దాఖలు చేసిన పిటిషన్లో పోలీస్ దర్యాప్తుపై స్టే విధించాలన్న అంశమే ప్రేయర్లో లేదు. కాగ్నిజబుల్ నేరాల్లో పోలీసు దర్యాప్తును కోర్టులు అడ్డుకోలేవు. థర్డ్ పార్టీ అయిన బీజేపీకి లోకస్ క్యాండి అర్హతే లేదు’అని దవే చెప్పారు. ‘ఆడియో టేపులు, ఇతర వివరాలు టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడికి ఎలా చేరాయి.. ఆయన మీడియాకు ఎలా పంచారు. అలాగే పెన్‌డ్రైవ్‌లు, సీడీలకు మాకు అందాయి. ఇతర హైకోర్టులకు కూడా అందాయని తెలిసింది’అని ఈ సందర్భంగా ధర్మాసనం ప్రశ్నించింది. దీనిపై దవే స్పందిస్తూ.. తన విచారాన్ని వ్యక్తం చేయడంతోపాటు అలా జరగకుండా ఉండాల్సిందని అన్నారు. విచారణకు ప్రభుత్వం సిట్ కూడా ఏర్పాటు చేసిందని చెప్పారు. -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసు.. సీబీఐకి నో చెప్పిన హైకోర్టు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసు సీబీఐకి ఇచ్చేందుకు తెలంగాణ హైకోర్టు నిరాకరించింది. హైకోర్ట్ సింగిల్ జడ్జి విజయ్‌సేన్‌రెడ్డి అధ్వర్యంలోనే దర్యాప్తు జరగాలని ఆదేశించింది. దర్యాప్తు పారదర్శకంగా జరగాలని హైకోర్టు పేర్కొంది. దర్యాప్తుకు సంబంధించిన వివరాలను బయటకు వెల్లడించడానికి వీల్లేదని హైకోర్టు తెలిపింది. నివేదికను నవంబర్ 29లోగా సింగిల్ జడ్జికి సమర్పించాలని హైకోర్టు ఆదేశించింది. రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు: గుజ్జుల ఎమ్మెల్యేల కొనుగోలు కేసును హైకోర్టు న్యాయమూర్తి పర్యవేక్షణలో విచారణ జరిపించాలని కోర్టు తీర్పు ఇవ్వడాన్ని స్వాగతిస్తున్నామని బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి అన్నారు. ఏమీ లేని కేసులో రాజకీయ లబ్ధి కోసమే బిజేపీపై ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ చేపట్టాలని లేదా సీబీఐ విచారణ జరగాలని బీజేపీ కోరింది. న్యాయమూర్తి పర్యవేక్షణలో సిట్ విచారణ జరగాలని విచారణ పూర్తిగా సీల్డ్ కవర్లో న్యాయమూర్తికి ఇవ్వాలన్న తీర్పును స్వాగతిస్తున్నామని ప్రేమేందర్ రెడ్డి తెలిపారు. చదవండి: (Hyderabad: రెస్టారెంట్ ఇన్ ఫ్లైట్.. పాత విమానాన్ని కొనుగోలు చేసి మరీ..) -
ఎమ్మెల్యేల ఎర కేసు నిందితుడు నందకుమార్‌కు షాక్.. ప్రాపర్టీ కూల్చివేత
సాక్షి, హైదరాబాద్ / బంజారాహిల్స్: ఎమ్మెల్యేలకు ఎర కేసులో నిందితుడు నందుకుమార్‌కు చెందిన హోటల్ డెక్కన్ కిచెన్‌కు అనుబంధంగా ఉన్న రెండు నిర్మాణాలను జీహెచ్ఎంసీ అధికారులు ఆదివారం కూల్చేశారు. నందుకుమార్ ప్రస్తుతం జైల్లో ఉన్న నేపథ్యంలో ఆయన ఆస్తులపై ఆధికారులు ఆరా తీశారు. దీంతో ఫిల్మ్ నగర్లో ఉన్న డెక్కన్ కిచెన్ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. జీహెచ్ఎంసీ సర్కిల్–18 పరిధి, జూబ్లీహిల్స్ డివిజన్ ఫిలింనగర్ రోడ్ నం.1లోని ప్లాట్ నంబర్ 2 (ఇంటి నంబర్ 8–2–293/82/ఎఫ్/2)లో సినీ నటుడు దగ్గుబాటి రానాకు వెయ్యి గజాల స్థలం ఉంది. ఈ స్థలాన్ని నందుకుమార్‌కు చెందిన డబ్ల్యూ3 హాస్పిటాలిటీ ప్రైవేట్ లిమిటెడ్ సంస్థ లీజుకు తీసుకుంది. పక్కనే ఉన్న దగ్గుబాటి వెంకటేష్‌కు చెందిన ప్లాట్ నంబర్ 3లోని వెయ్యి గజాల స్థలాన్ని కూడా నందుకుమార్ లీజుకు తీసుకుని డెక్కన్ కిచెన్ పేరుతో రెస్టారెంట్‌ను నిర్వహిస్తున్నాడు. దగ్గుబాటి రానా ఫిర్యాదు తమ స్థలంలో, జీహెచ్ఎంసీ నుంచి అనుమతులు తీసుకోకుండా నిర్మాణాలు చేపడుతున్నారని రానా గతంలో జీహెచ్ఎంసీ టౌన్‌ప్లానింగ్ అధికారులకు ఫిర్యాదు చేశారు. తాజాగా శాశ్వత నిర్మాణాలు చేపడుతున్నారని, వెంటనే అడ్డుకోవాలని రానా ఇటీవల మరోసారి ఫిర్యాదు చేశారు. దీంతో జీహెచ్ఎంసీ అధికారులు నోటీసులు ఇచ్చారు. అయినప్పటికీ నందకుమార్ నిర్మాణ పనులను కొనసాగిస్తుండటంతో ఆదివారం జీహెచ్ఎంసీ సర్కిల్–18 టౌన్‌ప్లానింగ్ ఏసీపీ రాజ్‌కుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది జేసీబీల సహాయంతో కూల్చివేతలు చేపట్టారు. సుమారు 3 గంటల పాటు కూల్చివేతల ప్రక్రియ కొనసాగింది. నందకుమార్ భార్య సహా కుటుంబ సభ్యులు కూల్చివేతలను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. తాము చట్ట ప్రకారం లీజుకు తీసుకున్నామని, కోర్టు స్టే సైతం ఉందని చెప్పారు. ఈ సందర్భంగా పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. చదవండి: (రాజకీయాలు చేయడానికి మా ఇళ్లకు వచ్చారా?.. జనసేన నాయకులపై లబ్ధిదారుల ఫైర్) -
ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో సిట్ విచారణ వేగవంతం
-
పోలీస్ విచారణ ఆపండి
సాక్షి, హైదరాబాద్: ‘ఎమ్మెల్యేలకు ఎర’ కేసులో స్టేను ఎత్తివేస్తూ.. పోలీస్ దర్యాప్తు నకు అనుమతిస్తూ.. సింగిల్ జడ్జి ఇచ్చిన ఉత్తర్వులను భారతీయ జనతా పార్టీ హైకోర్టులో సవాల్ చేసింది. ఈ మేరకు బీజేపీ రాష్ట్ర అధికార ప్రతినిధి గుజ్జుల ప్రేమేందర్‌రెడ్డి ఈ రిట్ అప్పీల్ దాఖలు చేశారు. ‘మొయినాబాద్ పోలీస్ స్టేషన్ పరిధిలో అక్టోబర్ 26న నమోదైన (ఎఫ్ఐ ఆర్ నంబర్ 455/2022) కేసులో పోలీసులు పక్షపాతం, అన్యాయంగా విచారణ సాగిస్తున్నారు. బీజేపీని దోషిగా నిలబెట్టాలనే సీఎం, టీఆర్ఎస్ ముఖ్యుల ఆదేశాలతో దర్యాప్తు సాగుతోంది. కావాలనే బీజేపీపై నిందమోపుతూ అప్రతిష్టకు గురి చేస్తున్నారు. పంచనామా తతంగం అంతా 26న సాగగా.. సాక్షు లతో సంతకాలు 27న చేయించారు. కేసు నమోదు చేసిన అనంతరం సమాచారం ఇచ్చిన పైలట్ రోహిత్‌రెడ్డితో పాటు మరో ముగ్గురు ఎమ్మెల్యేలను సీఎం క్యాంప్ ఆఫీస్ ప్రగతిభవన్‌కు తరలించారు’అని అప్పీల్ పేర్కొన్నారు సీఎం చేతికి సీడీలు..: ‘పోలీసులు స్వాధీనం చేసుకున్న వస్తువులను, ఆధారాలను సీజ్ చేసి ఉంచాలి. అయితే అవన్నీ సీఎం కేసీఆర్ చేరవేయడంతో పాటు.. ఆయన మీడియా సమావేశంలో అందరికీ ఆడియో, వీడియో ఫుటేజీ సీడీలను పంచిపెట్టారు. బీజేపీ జాతీయ స్థాయి నేతలపై ముఖ్యమంత్రి తీవ్ర ఆరోపణలు చేశారు. రాష్ట్ర, జాతీయ స్థాయి పత్రికలు, చానెళ్లతో పాటు సోషల్ మీడియాలోనూ ఇవి విస్తృత ప్రచారం అయ్యాయి. ఈ నేపథ్యంలో ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీకి పిటిషన్ వేసే అర్హత(లోకల్ స్టాండి) ఉంది. సింగిల్ జడ్జి కూడా అర్హతపై లోతైన విచారణ సాగాల్సి ఉందని చెప్పారు. తాజాగా ప్రభుత్వం పోలీసుల అధికారులతో ఏర్పాటు చేసిన సిట్‌పైనా మాకు నమ్మకం లేదు. ఈ పరిస్థితుల నేపథ్యంలో సింగిల్ జడ్జి గత నెల 29న ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులను పొడిగించాలి. సీబీఐతో విచారణకు ఆదేశాలు జారీ చేయాలి’అని బీజేపీ కోరింది. దీనిపై సీజే నేతృత్వంలోని ధర్మాసనం విచారణ జరిపే అవకాశం ఉంది. -
టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో మరో కీలక మలుపు
సాక్షి, హైదరాబాద్: ఎమ్మెల్యేల కొనుగోలు కేసులో కీలక మలుపు చోటుచేసుకుంది. ఈ వ్యవహారంపై తెలంగాణ ప్రభుత్వం సీట్ ఏర్పాటు చేసింది. సీపీ సీవీ ఆనంద్ నేతృత్వంలో సిట్ ఏర్పాటైంది. సీట్ సభ్యులుగా నల్లగొండ ఎస్పీ రెమా రాజేశ్వరీ, డీసీపీ కల్మేశ్వర్, శంషాబాద్ డీసీపీ జగదీశ్వర్‌రెడ్డి, నారాయణపేట ఎస్పీ వెంకటేశ్వర్లు, రాజేంద్రనగర్ ఏసీపీ గంగాధర్, మొయినాబాద్ ఎస్‌హెచ్‌వో లక్ష్మీరెడ్డిలను నియమించింది. కాగా ‘ఎమ్మెల్యేలకు ఎర’కేసులో బీజేపీ దాఖలు చేసిన పిటిషన్ విచారణలో భాగంగా పోలీసుల దర్యాప్తుపై విధించిన స్టేను హైకోర్టు ఎత్తివేసిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రంగారెడ్డి జిల్లా మొయినాబాద్ పోలీసులు ఈ కేసు దర్యాప్తు చేసుకోవచ్చంటూ స్పష్టం చేసింది. ఇలాంటి కేసుల్లో ఎక్కువ రోజులు దర్యాప్తు నిలిపివేయడం మంచిది కాదని వ్యాఖ్యానించింది. కేసుపై రాష్ట్ర, జాతీయ స్థాయి మీడియాల్లో విపరీత ప్రచారం జరిగిన దృష్ట్యా లోతైన విచారణ జరగాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడింది. చదవండి: తెలంగాణ గవర్నర్ తమిళిసై సంచలన వ్యాఖ్యలు -
ఆడియో టేపు-2 రిలీజ్: ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?.. నువ్వే టీమ్ లీడర్ అవుతావు!
సాక్షి, హైదరాబాద్: తెలంగాణలో టీఆర్ఎస్ ఎమ్మెల్యేల కొనుగోలు వ్యవహారం హాట్‌టాపిక్ మారిన విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఎమ్మెల్యేల కొనుగోలుపై రెండో ఆడియో టేప్ బయటకు వచ్చింది. మొత్తం 27 నిమిషాల పాటు ఆడియో కాల్ సాగింది. ఈ సందర్భంగా.. ఆడియోలో డబ్బుల గుర్తించి ప్రస్తావించడం విశేషం. ఒక్కొక్కరికి ఎంత డబ్బు ఇవ్వాలనేదానిపై ముగ్గురి మధ్య చర్చ సాగింది. ఒక్కొక్కరు రూ. 100 అడుతున్నారని రామచంద్ర భారతి, సింహయాజితో నందు చెప్పాడు. ఇలా వీరి మధ్య సంభాషణ కొనసాగింది. నందు: పైలట్ రోహిత్ రెడ్డితో నేను మాట్లాడాను. నువ్వు ముందుగా వస్తే.. నువ్వే టీమ్ లీడర్ అవుతావు అని చెప్పాను. ఒక్కొక్కరికి ఒక్కో రేటు ఉంటుందని చెప్పాను. రామచంద్రభారతి: ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నారు?. నందు: రోహిత్ రెడ్డి ఒక్కరికే రూ. 100 ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు. మిగిలిన వారి మరో రేట్. రామచంద్రభారతి: అయితే నేను పైన చెప్పేటప్పుడు పైలట్ తనతో పాటు నలుగురిని తీసుకువస్తాడని చెప్తాను. రోహిత్‌ను తీసుకుంటే ఆయనతోపాటు మిగిలినవారు వస్తారని నేను చెప్తాను. నందు: ఇక్కడ వ్యవస్థ సరిగాలేదని పైన చెప్పండి. పైలట్ రోహిత్‌రెడ్డి చాలా విలువైన లీడర్ అని పైన చెప్పండి. రామచంద్రభారతి: మనం ఎక్కడ కూర్చుంటున్నామో గుర్తుపెట్టుకోవాలి. చాలా పెద్దవాళ్లతో మాట్లాడేటప్పుడు ఒకసారి కమిట్ అయితే వెనక్కి వెళ్లలేం. బండి సంజయ్, కిషన్‌రెడ్డితో కాదు.. ఇంకా పెద్దవాళ్లతో మాట్లాడుతున్నాం. నందు: ఈ విషయం స్థానిక లీడర్లకు తెలియకూడదు. రామచంద్రభారతి: మనం చేసే ఆపరేషన్ తెలంగాణ లీడర్లకు తెలియకుండా చేస్తాం. మునుగోడు ఎన్నికల కంటే ముందు రూ. 100 అడిగినా నేను పైన మాట్లాడతాను. నన్ను పైలట్ రోహిత్‌రెడ్డితో మాట్లాడించండి. ఇప్పుడు ఎంత మంది రెడీగా ఉన్నారని తుషార్‌కు చెప్పాలి. మునుగోడు ఎన్నికల కంటే ముందు దీన్ని కంప్లీట్ చేయాలి. నన్ను వాట్సాప్‌లో వారితో కాన్ఫరెన్స్‌లో పెడితే నేను మాట్లాడాతాను. సింహయాజులు: 100 కిలోమీటర్ల రేడియస్‌లో నలుగురు ఎమ్మెల్యేలు మనతో ఉన్నారు. కొడంగల్, తాండూర్, చేవేళ్ల ఎమ్మెల్యేలతో ఇప్పటికే మాట్లాడాను. రామచంద్రభారతి: కేవలం ఇద్దరు ముగ్గురి కోసం ఢిల్లీ నుంచి వారు రావడం సరికాదు. కనీసం 5 నుంచి ఆరుగురు జాయిన్ అయితే ఢిల్లీ వారిని రప్పించాలి. బల్క్‌గా ఎవరైనా చేరితేనే ఇంపాక్ట్ ఉంటుంది. సింహయాజులు: రూ. 100 కావాలని రోహిత్ అంటున్నాడు. రాజీనామా చేయాల్సి వస్తే ప్రభుత్వంతో ఢీకొనడం ఈజీ కాదని రోహిత్ అంటున్నాడు. రామచంద్రభారతి: రోహిత్ రాజీనామా చేస్తే.. నెలరోజుల్లో ప్రభుత్వం కూలిపోతుంది. ఢిల్లీలోనూ మేం పనిచేస్తున్నాం, 43 మంది ఢిల్లీ ఎమ్మెల్యేలు మాతో టచ్‌లో ఉన్నారు. అంటూ సంభాషణ కొనసాగింది. -
సంతలో పశువుల్లా కొంటున్నారు
రాష్ట్రాభివృద్ధిపై ఆ శ్రద్ధ చూపించండి చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచన అనంతపురం: సంతలో పశువులను కొంటున్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబు, ఆ శ్రద్ధను రాష్ట్రాభివృద్ధిపై చూపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం ప్రారంభమైన సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేవలం రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిన చంద్రబాబు, ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో సోలార్, విండ్ పవర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు కారుచౌకగా భూములు కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి, రాయులసీవు కార్యదర్శి ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.