సంతలో పశువుల్లా కొంటున్నారు | CPIM AP Secretary P Madhu Fires on CM Chandrababu Naidu | Sakshi
Sakshi News home page

సంతలో పశువుల్లా కొంటున్నారు

Published Tue, Mar 29 2016 9:50 AM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM

CPIM AP Secretary P Madhu Fires on CM Chandrababu Naidu

రాష్ట్రాభివృద్ధిపై ఆ శ్రద్ధ చూపించండి
చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచన


అనంతపురం: సంతలో పశువులను కొంటున్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబు, ఆ శ్రద్ధను రాష్ట్రాభివృద్ధిపై చూపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం ప్రారంభమైన సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేవలం రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిన చంద్రబాబు, ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు.

జిల్లాలో సోలార్, విండ్ పవర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు కారుచౌకగా భూములు కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి, రాయులసీవు కార్యదర్శి ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement