CPI (M) Central Committee
-
అధికారంలోకి వస్తే ఈసీకి జైలు శిక్ష
సాక్షి, ముంబై: తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఎన్నికల సంఘంపై చర్యలు తీసుకుంటామని భరిప బహుజన్ మహాసంఘ్(బీబీఎమ్) చైర్మన్, బీఆర్ అంబేద్కర్ మనువడు ప్రకాశ్ అంబేద్కర్ సంచలన వ్యాఖ్యలు చేశారు. మహారాష్ట్ర యవత్మాల్లో జరిగిన ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. ఎన్నికల సంఘం పక్షపాత ధోరణితో వ్యవహరిస్తోందని, పుల్వామా దాడి గురించి మాట్లాడకుండా ఆంక్షలు విధించడం దారుణమని విమర్శించారు. ‘రాజ్యాంగ పరిధిలో అంశమే అయినప్పటికీ పుల్వామా దాడి గురించి ప్రస్తావించకూడదని ఎన్నికల సంఘం ఎందుకు అడ్డుకుంటుందో అర్థం కావడం లేదు. మన ప్రభుత్వం వచ్చాక ఎలక్షన్ కమిషన్‌పై చర్యలు తీసుకుంటుంది. రెండు రోజులు ఎన్నికల సిబ్బందిని జైల్లో పెడుతుంది. తటస్థంగా ఉండాల్సిన ఈసీ బీజేపీ తొత్తుగా వ్యవహరిస్తుంది’ అని అన్నారు. ప్రకాశ్ అంబేద్కర్ సోలాపూర్, అకోలా లోక్‌సభ నియోజకవర్గాల నుంచి వంచిత్ బహుజన్ అగాదీ (వీబీఏ) అభ్యర్థిగా పోటీ చేస్తున్నారు. మహారాష్ట్రలో బరిప్ బహుజన్ మహాసంఘ్, ఏఐఎమ్ఐఎమ్, జనతా దళ్(ఎస్) లు కలిసి వీబీఏ కూటమి గా ఏర్పడిన విషయం తెలిసిందే. ఈ కూటమి ఏ పార్టీ ఓట్లు చీల్చుతుందోనని అధికార బీజేపీ, విపక్షాల్లో కలవరం మొదలైంది. కాగా సోలాపూర్ పార్లమెంట్ స్థానంలో పోటీ చేస్తున్న ప్రకాశ్ అంబేద్కర్‌కు పూర్తి స్థాయిలో మద్దతు ఇస్తున్నట్లు సీపీఐ(ఎం) ప్రకటించింది. -
అరెస్ట్ చేసిన నాయకులను విడుదల చేయాలి
-
రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదు
సాక్షి, ఒంగోలు : రాష్ట్రంలో జనసేన పార్టీ బలపడుతుందని, రానున్న ఎన్నికల్లో త్రిముఖ పోటీ తప్పదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు టీడీపీ ప్రభుత్వాన్ని హెచ్చరించారు. సోమవారం ప్రకాశం జిల్లా పర్చూరులో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అక్రమాలకు అడ్డూ అదుపు లేకుండా ఉందని విమర్శించారు. మార్టూరు మండలం బొబ్బెపల్లిలో మైనార్టీలు కొనుగోలు చేసి సాగు చేసుకుంటున్న 15 ఎకరాలను అధికార పార్టీ నాయకులు ఆక్రమించి అమ్ముకున్నారని ఆరోపించారు. పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టపోయారని, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు రైతులను ఆదుకోవటంలో పూర్తిగా విఫలమయ్యాయని అన్నారు. దళితుల భూముల్లో వేసిన కట్టలు నెలాఖరు లోగా తొలగించాలని డిమాండ్ చేశారు. నెలాఖరున వివిధ సంఘాల నాయకులతో కలిసి దళితుల హక్కుల కోసం ప్రదర్శన నిర్వహిస్తామని తెలిపారు. బీజేపీ మతోన్మాదాన్ని ప్రోత్సహించటం దేశానికి ప్రమాదకరమన్నారు. మైనార్టీల పట్ల వివక్ష, దళితుల ఊచకోతలు పెరిగిపోతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే ఎన్నికల్లో బీజేపీ పార్టీకి గుణపాఠం చెప్పాలని పిలుపునిచ్చారు. -
అది రాజకీయ జిమ్మిక్కు
విజయనగరం జిల్లా: బీజేపీని బోనులో నిలబెట్టాల్సిన టీడీపీ..తాము కడపలో స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామనడం బీజేపీని రక్షించడానికి చేస్తున్న రాజకీయ జిమ్మిక్కని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు విమర్శించారు. విలేకరులతో మాట్లాడుతూ..కేంద్ర ప్రభుత్వం నిర్మించాల్సిన ఉక్కు ఫ్యాక్టరీని రాష్ట్ర ప్రభుత్వమే నిర్మిస్తామనడం రాష్ట్ర ప్రయోజనాలను దెబ్బతీయడమే అవుతుందని పేర్కొన్నారు. రైల్వే జోన్ ఏర్పాటు కోసం 4 సంవత్సరాలు కావాలా అని ప్రశ్నించారు. కడప దీక్షలు తుస్సుమన్నాయని ఎద్దేవా చేశారు. విశాఖ రైల్వే జోన్ కోసం పోరాడితే మమ్మల్ని అరెస్ట్ చేసి..ఇప్పుడు టీడీపీ నాయకులు దీక్షలంటూ కొత్త నాటకాలు ఆడుతున్నారని ధ్వజమెత్తారు. టీడీపీ, వైఎస్సార్సీపీలు స్వార్థ ప్రయోజనాల కోసమే చూసుకుంటున్నాయని విమర్శించారు. సీపీఐ, సీపీఎం, జనసేన ఇతర పార్టీలను కలుపుకుని విభజన హామీల సాధన కోసం ఈ నెల 13వ తారీఖున ఉమ్మడి కార్యాచరణ మొదలు పెడతామని తెలిపారు. హామీల సాధన కోసం సెప్టెంబర్ 15న వామపక్షాలు, జనసేన, లోక్‌సత్తాల ఆధ్వర్యంలో విజయవాడలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తున్నట్లు వివరించారు. జీఎస్టీ వచ్చి సంవత్సరం గడిచినా ప్రజలకు నష్టం తప్ప లాభం లేదన్నారు. కేసీఆర్ మూడవ ప్రత్యామ్నాయం(థర్డ్ ఫ్రంట్) సాధ్యం కాదని, అది మధ్యలో ఆగిపోయిందన్నారు. ప్రాంతీయ పార్టీలు ఒక్కోరోజు ఒక్కొక్కరికి మద్ధతునిస్తున్నాయని వ్యాఖ్యానించారు. దేశవ్యాప్తంగా బీజేపీపై ప్రజలకు వ్యతిరేకత ఏర్పడిందని అన్నారు. విజయనగరం జిల్లాలో ఎక్కడ చూసినా అడ్డగోలుగా మైనింగ్కి అనుమతులిస్తున్నారని, టీడీపీ ప్రభుత్వం దొరికినదంతా గుటకా గుటకా మింగే దానిలా తయారైందని విమర్శించారు. -
మోదీ, మమతపై నిప్పులు చెరిగిన ఏచూరి
కోల్‌కతా: 2019 లోక్‌సభ ఎన్నికల తరువాతే కూటమిపై చర్చిస్తామని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి తెలిపారు. కోల్‌కతాలో గురువారం మీడియాతో మాట్లాడిన ఏచూరి పలు అంశాలపై చర్చించారు. ఫెడరల్ ఫ్రంట్‌పై ఆ ఎన్నికల అనంతరం నిర్ణయం తీసుకుంటామని ప్రకటించారు. ఇటీవల జరిగిన పార్టీ జాతీయ మహాసభల్లో.. రానున్న ఎన్నికల్లో మతతత్వ బీజేపీని ఓడించేందుకు లౌకిక శక్తులతో కలిసి పనిచేయాలని సీపీఎం జాతీయ కార్యవర్గం నిర్ణయం తీసుకుందని ఏచూరి తెలిపారు. ఎన్నికల తర్వాతనే ఏ పార్టీ అయినా ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని, మేం కుడా ఎన్నికల అనంతరమే ఫెడరల్ ఫ్రెంట్‌పై తమ అభిప్రాయం వ్యక్తం చేస్తామన్నారు. రానున్న ఎన్నికల్లో బీజేపీని ఓడించేందుకు ప్రతిపక్ష పార్టీలకు యూపీలోని ఎస్పీ-బీఎస్పీ కూటమి మంచి ఉదాహరణగా గుర్తుచేశారు. బెంగాల్ పంచాయతీ ఎన్నికల్లో జరిగిన ఘర్షణలపై తృణమూల్ కాంగ్రెస్ పార్టీ అధినేత్రి, బెంగాల్ సీఎం మమతా బెనర్జీపై ఏచూరి విమర్శలు గుప్పించారు. బెంగాల్లో మమత ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారని, ఎన్నికల్లో అభ్యర్థులు నామినేషన్ వేయకుండా అధికార తృణమూల్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు అడ్డుకున్నారని ఆరోపించారు. సీఎం మమతకు, ప్రధాని నరేంద్ర మోదీకి రహస్య ఒప్పందాలు ఉన్నాయని, వారిద్దరూ మతతత్వ ఘర్షణలను ప్రోత్సహించేవారేనన్నారు. ‘మోదీ హటావో.. దేశ్ బచావో, మమత హటావో.. బెంగాల్ బచావో’ అంటూ నినాదాలు చేశారు. కర్ణాటక ముఖ్యమంత్రి కుమారస్వామి ప్రమాణ స్వీకారానికి హాజరైన మమత, ఏచూరి ఒకే వేదికను పంచుకున్న మరునాడే ఏచూరి ఈ వ్యాఖ్యలు చేయడం గమనార్హం. -
‘రఘురామ కృష్ణంరాజు నాలుక చీరేస్తాం’
సాక్షి, విజయవాడ: కారల్ మార్క్స్ 200వ జయంతి సందర్భంగా వామపక్ష నేతలు విజయవాడలో నివాళులర్పించారు. ఆంధ్రప్రదేశ్ సీపీఎం, సీపీఐ కార్యదర్శులు మధు, రామకృష్ణ కారల్ మార్క్స్ విగ్రహానికి పూలమాలలు వేసి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ.. తెలుగుదేశం పార్టీ పాలనలో రాష్ట్రంలో మహిళలు, దళితులకు రక్షణ లేకుండా పోయిందని సీపీఎం కార్యదర్శి మధు మండిపడ్డారు. ప్రతి రోజు రాష్ట్రంలో మహిళలపై ఏదో ఒకచోట అత్యాచార ఘటనలు చోటు చేసుకుంటున్నాయని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల రక్షణకు ఎన్ని చట్టాలు వచ్చినా పరిస్థితులు మారడం లేదని అన్నారు. అధికారాన్ని అడ్డం పెట్టుకుని కొంత మంది శిక్షల నుంచి తప్పించుకుంటున్నారని మధు టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. వామపక్ష పార్టీలతో కలసి అత్యాచారాలకు వ్యతిరేకంగా త్వరలోనే ఉద్యమ కార్యాచరణ రూపొందిస్తామని తెలిపారు. లాలూచీ రాయకీయాలు చేస్తే సహించం.. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ మట్లాడుతూ ప్రత్యేక హోదా అంశంపై చేపట్టాల్సిన కార్యాచరణ రూపొందించేందుకు ఈ నెల 8న అన్ని ప్రజా సంఘాలు, రాజకీయ పార్టీలతో సమావేశం నిర్వహిస్తామన్నారు. నరేంద్రమోదీ ఆంద్రప్రదేశ్‌కి అన్యాయం చేశారని విమర్శించారు. రాష్ట్రానికి అన్యాయం జరగడంలో బీజేపీకి ఎంత పాత్ర ఉందో టీడీపీకి అంతే ఉందని రామకృష్ణ ఆరోపించారు. శుక్రవారం టీడీపీ తీర్థం పుచ్చుకున్న రఘురామకృష్ణంరాజు లాలూచీ రాయకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు. స్వాతంత్ర్య సమరయోధులతో చంద్రబాబు నాయుడిని పోల్చినందుకు రఘురామకృష్ణంరాజు నాలుక చీరేస్తామని హెచ్చరించారు. స్వాతంత్ర్య సమరయోధుల కాలి గోటికి కూడా చంద్రబాబు సరిపోరనీ.. ఇలా అవాకులు చెవాకులు పేలుతూ స్వాతంత్ర్య సమరయోధులను అవమానిస్తే ఊరుకునేది లేదని రామకృష్ణ అన్నారు. -
ఏచూరి మరోసారి
సాక్షి, హైదరాబాద్: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి రెండోసారి ఎన్నికయ్యారు. పార్టీ 22వ అఖిల భారత మహాసభల్లో భాగంగా ఆదివారం జరిగిన జాతీ య కార్యవర్గ సమావేశాల్లో ఆయన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పార్టీ ఈ మేరకు అధికారిక ప్రకటన చేసింది. 17 మందితో కూడిన పొలిట్ బ్యూరోను కూడా పార్టీ ఏకగ్రీవంగా ఎన్నుకుంది. ప్రస్తుతం 16 మందితో ఉన్న పొలిట్ బ్యూరోలో ఏకే రాఘవన్ ఢిల్లీ కార్యవర్గంలోకి వెళ్లారు. దీంతో పొలిట్ బ్యూరో సభ్యుల సంఖ్య 15కు చేరింది. తాజాగా నీలోత్పల్ బసు, తపన్ సేన్‌లకు చోటు కల్పించారు. రాష్ట్ర కార్యదర్శి తమ్మి నేని వీరభద్రంకు పొలిట్‌బ్యూరోలో అవకాశం వస్తుందని భావించినా చివరికి మొండిచేయే చూపారు. 95 మందితో కేంద్ర కమిటీ సభ్యులను పార్టీ ఎన్నుకుంది. ఇందులో తెలంగాణ నుంచి తమ్మినేని వీరభద్రం, వీరయ్య, చెరుపల్లి సీతారాములు, నాగయ్యలకు చోటు దక్కింది. ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యం నియమితులయ్యారు. ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర కమిటీలోకి పి.మధు, ఎం.ఎ.గఫూర్, వి.శ్రీనివాసరావు, ప్రత్యేక ఆహ్వానితులుగా పాటూరి రామయ్యలకు అవకాశం దక్కింది. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలపై ఉద్యమిస్తాం: ఏచూరి పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైన అనంతరం ఏచూరి ప్రసంగించారు. దేశంలోని వామపక్షాలను ఏకతాటిపైకి తెచ్చి కేంద్రంపై ఉద్యమిస్తామన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ విధానాలతో దేశ ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, బీజేపీ, ఆర్ఎస్ఎస్ ఓటమే తమ ప్రధాన ధ్యేయమని స్పష్టం చేశారు. దోపిడీ లేని సమాజం కోసం సమరశీల పోరాటాలు చేద్దామంటూ కార్యకర్తలకు పిలుపునిచ్చారు. సవాళ్లకు, దాడులకు ఎదురొడ్డి దేశ సమగ్రతను కాపాడుకుందామన్నారు. ‘‘శ్రామిక కార్మిక పాలన తీసుకురావాల్సిన ఆవశ్యకత ఉంది. దేశ సమైక్యతను, రాజ్యాంగాన్ని కాపాడుకోవడం మన కర్తవ్యం. ప్రధాన కార్యదర్శిగా మరోసారి ఎన్నుకున్నందుకు అందరికీ ధన్యవాదాలు. నాపై ఉంచిన బాధ్యతలను నెరవేర్చేందుకు శక్తివంచన లేకుండా పని చేస్తా. పార్టీ ఐక్యతను మహాసభలు మరోసారి రుజువు చేశాయి’’అని అన్నారు. శాశ్వత ఆహ్వానితులు: రాజేందర్ నేగి(కార్యదర్శి, ఉత్తరాఖండ్), సంజయ్ పరాటే(కార్యదర్శి, ఛత్తీస్‌గఢ్) ప్రత్యేక ఆహ్వానితులు: వీఎస్ అచ్యుతానందన్, మల్లు స్వరాజ్యం, మదన్ ఘోష్, పలోలి కుట్టీ, రామయ్య, కె.వరదరాజన్ సెంట్రల్ కంట్రోల్ కమిషన్: బాసుదేవ్ ఆచార్య, పి.రాజేంద్రన్, ఎస్.శ్రీధర్, జి.రాములు, బొనాని బిశ్వాస్ పొలిట్‌బ్యూరో: సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్ర పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, బృందా కారత్, పినరయ్ విజయన్, హన్నన్ మొల్లా, కొడియెరి బాలకృష్ణన్, ఎంఏ బేబీ, సుర్యకాంత మిశ్రా, మహ్మద్ సలీమ్, సుభాషిణీ అలీ, బీవీ రాఘవులు, జి.రామకృష్ణన్, తపన్‌సేన్, నీలోత్పల్ బసు మోదీని గద్దె దింపే వరకు పోరాటం: రాఘవులు బంగారు తెలంగాణ ఎలా ఉండాలో, దాని కోసం ఎలా పురోగమించాలో సభలో చర్చిం చామని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు చెప్పారు. సాయుధ పోరాటాలతో ఉద్యమాలకు ఊపిరి పోసింది తెలంగాణ గడ్డ అని.. ఆ స్ఫూర్తి, ఉత్తేజంతోనే దేశవ్యాప్తంగా కమ్యునిస్టు పార్టీ ప్రజా పోరాటాలు నిర్వహించిందని రాఘవులు గుర్తు చేశారు. సీపీఎం 22వ మహసభల బహిరంగసభకు అధ్యక్షత వహించిన రాఘవులు.. మహాసభలు విజయవంతంగా ముగిశాయని ప్రకటించారు. దళిత, గిరిజనులు, మహిళలపై మతోన్మాద శక్తులు లైంగిక దాడులకు పాల్పడుతున్నాయని, సామ్రాజ్యవాద శక్తుల శ్రమ దోపిడీ నుంచి ప్రజల్ని ఎలా రక్షించుకోవాలో సభలో చర్చ జరిగిందన్నారు. లౌకిక శక్తులను ఏకం చేసి మోదీ ప్రభుత్వాన్ని గద్దె దింపే వరకు ప్రజా పోరాటాలు చేయాలని నిర్ణయించినట్లు వెల్లడించారు. అచ్ఛే దిన్ కాదు.. కచ్చే దిన్: మాణిక్ సర్కార్ దేశంలో నాలుగేళ్లలో ‘అచ్ఛే దిన్’వస్తాయని మోదీ అన్నారని.. తీరా వెనక్కి తిరిగి చూస్తే అంతా ‘కచ్చే దిన్’అని త్రిపుర మాజీ ముఖ్యమంత్రి మాణిక్ సర్కార్ విమర్శించారు. ఎక్కువ రోజులు ప్రజలను మోసం చేయలేమని గుర్తించిన బీజేపీ, ఆర్ఎస్ఎస్లు ప్రజల మధ్య అశాంతి సృష్టించి, ప్రజల్ని చీల్చుతున్నాయని ఆరోపించారు. అందులో భాగంగానే దళితులు, మైనార్టీలపై దాడులకు తెగబడుతున్నారని నిప్పులు చెరిగారు. బీజేపీ, కాంగ్రెస్‌లు ప్రత్యామ్నాయం కాదని.. అవి నాణేనికి బొమ్మా బొరుసు లాంటి పార్టీలే అన్నారు. వామపక్ష ప్రజాతంత్ర శక్తులే పాలక పార్టీలకు ప్రత్యామ్నాయమన్నారు. ప్రమాదం పొంచి ఉందని, శత్రువు మన తలుపు తడుతోందని, ఇక ప్రజా పోరాటాలకు సిద్ధమవ్వాలని కార్యకర్తలను కోరారు. మోదీ హఠావో.. దేశ్ బచావో: బృందా కారత్ ‘ఎర్రజెండా లేకుండా చేశామని మోదీ, అమిత్ షా అంటున్నారు. ఎర్రజెండాను అంతం చేయడం ఎవరి వల్ల కాదు. ప్రజల గుండెల్లో శాశ్వతంగా ఉంటుందని వాళ్లు గుర్తు పెట్టుకోవాలి’ అని సీపీ ఎం పొలిట్ బ్యూరో సభ్యురాలు బృందా కారత్ హెచ్చరించారు. మోదీని గద్దె దింపేందుకు మహాసభ గట్టి నిర్ణయం తీసుకుందని, ‘మోదీ హఠావో.. దేశ్ బచావో’ నినాదం దేశమంతటా వినిపిస్తోందన్నారు. దేశంలో మహిళలు, చిన్నారులపై లెంగిక దాడులు పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. చిన్నారి ఆసిఫాపై జరిగిన అన్యాయానికి మతం రంగు పులిపి పాలిస్తున్న వీళ్లు నేరుస్థుల రక్షకులని విమర్శించారు. మతతత్వ శక్తులను రక్షించేందుకు మోదీ ప్రభుత్వం పని చేస్తోందని, అందుకే మక్కా మసీదు ఘటనకు పాల్పడిన వారిని నిర్దోషులుగా విడుదల చేయించారని ఆరోపించారు. ప్రతి అరగంటకో రైతు ఆత్మహత్య: పినరయి దేశంలో ప్రతి అరగంటకు ఒకరు చొప్పున రైతులు ఆత్మహత్మ చేసుకుంటున్నారని కేరళ ముఖ్యమంత్రి పినరయి విజయన్ ఆవేదన వ్యక్తం చేశారు. దారుణమైన ప్రపంచీకరణ, 1991లో వచ్చిన సరళ్జీకృత ఆర్థిక విధానాలను బీజేపీ ముమ్మరం చేసిందని.. పర్యవసానంగా వ్యవసాయ సంక్షోభం ఏర్పడిందన్నారు. కుబేరులకే మేలు చేసే విధానాలతో నిరుద్యోగం, ధరలు విపరీతంగా పెరిగిపోయాయని.. ఉద్యోగ, జీవన భద్రత లేకుండా పోయిందన్నారు. మోదీ పాలనలో మతతత్వ వాదులకు అడ్డూఅదుపూ లేకుండా పోయిందని.. దళితులు, మైనార్టీలు, మహిళలపై దాడులు రోజురోజుకూ పెరిగిపోతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ‘బేఠీ బచావో..బేఠీ పడావో’అనేవి మోదీ బూటకపు మాటలని విమర్శించారు. మోదీ హయంలో సీనియర్ న్యాయమూర్తులే ప్రజల ముందుకొచ్చి ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. -
వామపక్షాల ఆధ్వర్యంలో మతతత్వ రక్కసి బొమ్మ దహనం
-
జైట్లీ, సుజనా భేటీపై సర్వత్రా విమర్శలు
సాక్షి, విజయవాడ : కేంద్ర మంత్రి అరుణ్ జైట్లీని, టీడీపీ ఎంపీ సుజనా చౌదరి రహస్యంగా కలవడంపై సర్వత్రా విమర్శలు వెలువెత్తుతున్నాయి. ప్రత్యేక హోదా కోసం ఆందోళన చేస్తున్నామని బయటకు చెబుతూ, కేంద్ర ప్రభుత్వంతో చర్చలు జరపడం దేనికి సంకేతమనే ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ప్రత్యేక హోదాపై బాబుకు చిత్తశుద్ధి లేదు : చలసాని ప్రత్యేక హోదాపై ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు చిత్తశుద్ధి లేదని ఆంధ్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు చలసాని శ్రీనివాస్ విమర్శించారు. ఓ వైపు ప్రత్యేక హోదా అంటూనే మరోవైపు చర్చలు జరపడమేంటని ఆయన ప్రశ్నించారు. హోదాపై టీడీపీ మూడు సార్లు మాట మార్చిందని ఆయన గుర్తుచేశారు. హోదాతో పాటు విభజన హామీలన్నింటినీ అమలు చేయాల్సిందేనని డిమాండ్ చేశారు. పార్లమెంట్ సమావేశాలను అర్ధాంతరంగా ముగిస్తే ఆ రోజును చీకటి దినంగా పాటిస్తామని అన్నారు. ఈ నెల 28వ తేదీన విద్యార్థి సంఘాలతో, యువజన నేతలతో సమావేశమై జేఏసీ ఏర్పాటు చేస్తామని ఆయన వెల్లడించారు. జేపీసీ ఆధ్వర్యంలో పోరాటాన్ని ఉధృతం చేస్తామని, కర్ణాటకలో ఎన్నికల్లో బీజేపీకి బుద్ధి చెప్పేలా అక్కడికి వెళ్లి పని చేస్తామని ఆయన తెలిపారు. టీడీపీ ముసుగులో గుద్దులాట మానాలి : మధు ఓ వైపు అసెంబ్లీలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గట్టిగా మాట్లాడుతున్నారు, మరోవైపు సుజనా చౌదరి, జైట్లీతో చర్చలు జరుపుతున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తెలుగుదేశం పార్టీ ఇప్పటికైనా ముసుగులో గుద్దులాట విధానాన్ని మానుకోవాలని ఆయన హితవు పలికారు. చంద్రబాబు చేతకానితనం వల్లే : రామకృష్ణ చంద్రబాబు చేతకానితనం వల్లే ఏపీకి తీరని అన్యాయం జరుగుతుందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ అన్నారు. గతంలో ప్రత్యేక హోదా వద్దని చెప్పింది చంద్రబాబే, ప్యాకేజీ పేరుతో రాష్ట్రానికి అన్యాయం చేసింది చంద్రబాబేనని ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. నాలుగేళ్లు మంతనాలతో కాలం గడిపారని, ఇప్పుడు మళ్లీ సుజనా చేత జైట్లీతో చర్చలు జరిపించడం టీడీపీ అవకాశవాదానికి నిదర్శనం అని విమర్శించారు. సుజనా చౌదరి సొంతంగా చర్చలు జరపలేదని, చంద్రబాబు చెబితెనే ఆయన చర్చలు జరిపారని అన్నారు. మోడీ అంటే చంద్రబాబుకు భయం అందుకే మళ్లీ చర్చలు జరుపుతున్నారని ఆయన వ్యాఖ్యానించారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే అఖిలపక్షంతో పోరాటానికి కలిసిరావాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్ సీపీకి సంపూర్ణ మద్దతు: మధు
సాక్షి, న్యూఢిల్లీ : ప్రత్యేక హోదా కోసం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేస్తున్న పోరాటానికి తమ సంపూర్ణ మద్దతు ఎప్పుడు ఉంటుందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. దేశ రాజధానిలో జరుగుతున్న వైఎస్ఆర్ సీపీ మహాధర్నాలో ఆయన పాల్గొని మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ...‘బీజేపీకి పోయేకాలం వచ్చింది. అందుకే విజభన హామీలు అమలు చేయడం లేదు. ప్రత్యేక హోదా అంటే ప్యాకేజీనే మంచిదంటూ కేంద్రం అడుగులకు చంద్రబాబు నాయుడు మడుగులొత్తుతున్నారు. విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు అని ఎలా పోరాడామో, హోదా సాధన కోసం అలాగే పోరాడదాం.’ అని పిలుపునిచ్చారు. తాడోపేడో తేల్చుకోవాల్సిందే.. ఏపీకి ప్రత్యేక హోదాపై కేంద్రంతో తాడోపేడో తేల్చుకోవాల్సిన సమయం ఆసన్నమైందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ వ్యాఖ్యానించారు. వైఎస్ఆర్ సీపీ మహాధర్నాలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అసెంబ్లీ సమావేశాలు వాయిదా వేసి ఢిల్లీకి రావాలని డిమాండ్ చేశారు. ఢిల్లీలో ఇంత జరుగుతుంటే చంద్రబాబు అసెంబ్లీలో ఉండటం సరికాదని రామకృష్ణ అభిప్రాయపడ్డారు. వైఎస్ఆర్ సీపీ పోరాటాన్ని తాను అభినందిస్తున్నానని, టీడీపీ ఎంపీలు కూడా రాజీనామాలకు సిద్ధం కావాలని ఆయన డిమాండ్ చేశారు. -
వైఎస్ఆర్సీపీకి సంపూర్ణ మద్దతు : మధు
-
చంద్రబాబు విధానాల వల్లే మనకు కష్టాలు
-
'బీజేపీ, టీడీపీకి వ్యతిరేకంగా పోరాటం'
సాక్షి, విజయవాడ: ప్రజా గ్రహం నుంచి తప్పించుకునేందుకు టీడీపీ డ్రామాలాడుతోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. రాష్ట్రం అధోగతిపాలు కావడానికి చంద్రబాబే కారణమని ఆయన తెలిపారు. ప్రతిపక్షాలను సీఎం ఏనాడు పట్టించుకోలేదన్నారు. బీజేపీ, టీడీపీకి వ్యతిరేకంగా పోరాటాన్ని ఉధృతం చేస్తామన్నారు. విశాఖ ఉక్కు తరహాలో ఉద్యమం చేపడతామని ఆయన స్పష్టం చేశారు. -
వారిపై పవన్ వైఖరి ఏంటీ?
సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలయ్యారన్నారు. ప్రజల దృష్టి మరల్చడానికే సుప్రీం కోర్టు వెళ్తానంటున్నారన్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు స్థిరత్వం లేదన్నారు. టీడీపీ, టీఆర్ఎస్ల పట్ల పవన్ వైఖరి ఏంటో వెల్లడించాలన్నారు. -
అవినీతితో రాష్ట్రం అతలాకుతలం
పిఠాపురం టౌన్: తెలుగుదేశం అవినీతి పాలనతో రాష్ట్రం అతలాకుతలమైందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు అన్నారు. శనివారం సాయంత్రం సీపీఎం 22వ జిల్లా మహాసభ స్థానిక ఉప్పాడ సెంటర్లో జరిగింది. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన పార్టీ శ్రేణులను ఉద్దేశించి ఆయన మాట్లాడుతూ బి.జె.పి, టి.డి.పి. విధానాలపై ఆయన విరుచుకు పడ్డారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను పూర్తిగా విస్మరించి ప్రజలపై మోయలేని భారం మోపుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయకుండా నిరుద్యోగులకు తీరని నష్టం కల్గిస్తున్నారన్నారు. మట్టి, ఇసుక, మద్యం, మాఫియా రాష్ట్రంలో పెట్రేగిపోతోందన్నారు. జిల్లాలో పోలీసుల వ్యవహార శైలిపై ఆయన మండిపడ్డారు. సెజ్ రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలకు తిలోదకాలు ఇచ్చారని పిఠాపురం నియోజకవర్గంలోని అధికార యంత్రాంగం తీరు మార్చుకోవాలని హెచ్చరించారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు డి.రమాదేవి మాట్లాడుతూ మద్యం విధానంతో చంద్రబాబు మహిళలను ఆందోళనకు, ఆవేదనకు గురిచేస్తున్నారన్నారు. పార్టీ నాయకులు దడాల సుబ్బారావు, దువ్వా శేషు బాబ్జీలు మాట్లాడుతూ దేవదాయ భూములను టిడిపి నేతలను కాజేస్తున్నారన్నారు. రెండ్రోజులు పాటు జరిగే పార్టీ జిల్లా మహాసభల్లో ప్రజా సమస్యలపై ఉద్యమాలకు కార్యచరణ రూపొందించనున్నట్టు తెలిపారు. ఈ సభలో పార్టీ నాయకులు జి.బేబీరాణి, జి.అప్పారెడ్డి, కూరాకుల సింహాచలం తదితరులు మాట్లాడారు. పట్టణంలో భారీ ర్యాలీ... సీపీఎం 22వ మహాసభలు పురస్కరించుకుని శనివారం పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీలో ఎర్ర జెండా రెపరెపలాడింది. స్థానిక పార్టీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ మార్కెట్ సెంటర్, కోటగుమ్మం మీదుగా ఉప్పాడ సెంటర్‌కు చేరుకుంది. పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులు, కార్మికులు ప్రజలు, మహిళలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వివిధ కళారూపాలు ప్రదర్శించారు. జాతీయ నాయకుల వేషధారణలతో కళాకారులు ఆకట్టుకున్నారు. నృత్యాలు, తప్పెటగుళ్లు, డప్పు వాయిద్యాలతో సందడి చేశారు. బహిరంగ సభలో ప్రజా నాట్యమండలి కళాకారులు ప్రదర్శించిన కళారూపాలు విశేషంగా ఆకట్టుకున్నాయి. సుందరయ్య జీవిత చరిత్ర మీద ప్రదర్శించిన కథనంతో జానపద కళారూపాన్ని ప్రదర్శించారు. జగన్ పాదయాత్రతో సమస్యలు తెలుసుకోవడం హర్షణీయం... వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహనరెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రజల సమస్యలు తెలుసుకోవడం హర్షణీయమని రాష్ట్ర సీపీఎం పార్టీ కార్యదర్శి పి.మధు అన్నారు. చంద్రబాబు ప్రభుత్వంపై జనసేన అధినేత పవన్‌కల్యాణ్ వైఖరి వెల్లడించాలన్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరిలో భీమవరంలో నిర్వహించే రాష్ట్ర మహాసభల్లో రాష్ట్ర ప్రజల సమస్యలపై విశాల వేదిక ఏర్పాటుకు సిద్ధం అవుతున్నామని పవన్‌ను ఆహ్వానిస్తామని తెలిపారు. -
ప్రజాప్రతినిధులపై సీబీఐ, ఏసీబీ దాడులు జరగాలి
తిరుపతి అర్బన్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధీనంలో పనిచేస్తున్న అవినీతి నిరోధక సంస్థలైన సీబీఐ, ఏసీబీలు కేవలం ప్రభుత్వ అధికారులపైనే కాకుండా కుంభకోణాలకు పాల్పడే ప్రజాప్రతినిధులపై కూడా దాడులు జరపాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. తిరుపతిలో బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయం ముందు ఉద్యోగుల జేఏసీ చేపట్టిన సమ్మెలో సంఘీభావంగా బుధవారం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఏసీబీ అధికారులు అవినీతికి పాల్పడిన అధికారులు, ఉద్యోగులను పట్టుకోవడం మంచిదే అయినప్పటికీ ప్రజాప్రతినిధులుగా ఉంటూ కోట్లాది రూపాయల స్కాంలకు పాల్పడే ఎంపీలు, ఎమ్మెల్యేలను ఎందుకు పట్టుకోవడం లేదని ప్రశ్నించారు. దీన్నిబట్టి ప్రజాస్వామ్యం ఎక్కడుందో అందరూ ఆలోచించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకుంటూ దశాబ్దాలతరబడి ప్రజల కోసం పనిచేసిన ఉద్యోగులకు ఏవైనా భత్యాలు, సౌకర్యాలు కల్పించాలంటే ఆర్థిక అంశాలతో ముడిపెట్టి ఆలోచించే ప్రభుత్వాలు ఎమ్మెల్యేలు, ఎంపీల జీతాలు పెంచేందుకు మాత్రం క్షణం కూడా వెనుకాడవని వ్యాఖ్యానించారు. ఈ ఏడాది జూలై నుంచే కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వానికి తీవ్ర వ్యతిరేక పవనాలు ఆరంభమయ్యాయని, దానిప్రభావం రానున్న గుజరాత్ ఎన్నికల్లో ఓటర్లు తమ ఆవేదన ఏంటో వెల్లడించనున్నారని జోస్యం చెప్పారు. ఇంగ్లాండ్‌లో 20 ఏళ్ల క్రితం ప్రారంభమైన ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మొన్నటి జూన్ ఎన్నికల్లో ఉద్యోగులు, ఓటర్లు సరైన తీర్పునిచ్చి ప్రభుత్వరంగ సంస్థలను కాపాడుకునేందుకు మార్గం సుగమం చేసుకున్నారన్నారు. -
సమస్యలు పరిష్కరించకుంటే ప్రాజెక్ట్‌ల నిలిపివేత
ముత్తుకూరు(సర్వేపల్లి): పేదల సమస్యలు పరిష్కరించని పక్షంలో థర్మల్ విద్యుత్ ప్రాజెక్ట్‌ల్లో పనులు నిలిపివేస్తామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు హెచ్చరించారు. ముత్తుకూరు మండలంలోని నేలటూరు దళితవాడలో ఆదివారం జరిగిన బహిరంగసభలో ఆయన ప్రసంగించారు. ఏపీజెన్కో ప్రాజెక్ట్‌లో 300 ఉద్యోగాలు భర్తీ చేయకుండా కాంట్రాక్ట్ ఉద్యోగాలు కొనసాగిస్తూ, స్థానికులతో చప్రాసీ పనులు చేయిస్తున్నారన్నారు. థర్మల్ ప్రాజెక్ట్‌ల కాలుష్యం వల్ల పచ్చదనం మాడిపోయిందన్నారు. పంటలు దెబ్బతిన్నాయన్నారు. బతకడమే కష్టమైపోయిందని తెలిపారు. పబ్లిక్ హియరింగ్‌లో ఇచ్చిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు కనుక ఎన్సీసీ, టీపీసీఐఎల్, జెన్కో ప్రాజెక్ట్‌ల్లో పనులు నిలిపివేస్తామని హెచ్చరించారు. ఇందుకోసం సెప్టెంబర్‌లో ప్రాజెక్ట్‌ల ప్రభావిత గ్రామాల్లో 10 రోజులు పాదయాత్ర చేస్తామన్నారు. అప్పటిలోపు సమస్యలు పరిష్కరించకుంటే జెన్కో ప్రాజెక్ట్ మూసివేసేందుకు తేదీ ప్రకటిస్తామని స్ప ష్టం చేశారు. ప్రాజెక్ట్‌లపై ఆందోళనలు చేయనీయకుండా కొంతమందిని ప్రలోభాలకు గురిచేయ డం విచారకరమన్నారు. పేదలు ప్రలోభాలకు లొంగవద్దని సూచించారు. నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలి నేలటూరు గ్రామంతో పాటు దళి తవాడను కూడా ఒకేసారి తరలిం చాలని మధు డిమాండ్ చేశారు. గుండ్లపాళెంలోనే పునరావాసం కల్పించాలన్నారు. తరలించే ముందు 2013 పార్లమెంట్ చట్టం ప్రకారం ఇళ్లు, భూములు, చెట్లకు నాలుగు రెట్ల పరిహారం ఇవ్వాలన్నారు. ఈ సభలో సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, నాయకులు గోగుల శ్రీనివాసులు, గడ్డం అంకయ్య, పెడకాల శ్రీని వాసులు పాల్గొన్నారు. -
15 నుంచి రైతు సమస్యలపై ఉద్యమం
- సీపీఎం రాష్ట్ర కార్యదర్శి పి.మధు - యూత్ పాలసీ కోసం సెప్టెంబర్‌లో ఆందోళనలు - నంద్యాల చుట్టూనే సీఎం, మంత్రులు, ఎమ్మెల్యేలు అనంతపురం న్యూసిటీ: రైతు సమస్యలపై సీపీఎం ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి ఉద్యమించనున్నట్లు రాష్ట్ర కార్యదర్శి పి.మధు తెలిపారు. అనంతపురంలో జరిగిన సీపీఎం రాష్ట మహాసభల్లో చేసిన తీర్మానాలను ఆయన శనివారం పార్టీ కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇరవై ఒకటిన్నర లక్షల హెక్టార్ల భూమి సాగులోకి రాలేదని, ఇందులో ఒక్క రాయలసీమలోనే పదిహేడున్నర లక్షల ఎకరాలు సాగుకు నోచుకోలేదన్నారు. రైతులు ఎంతటి దుర్భర పరిస్థితులు ఎదుర్కొంటున్నారో ఇట్టే తెలిసిపోతోందన్నారు. పంటలకు గిట్టుబాటు ధర, రుణమాఫీ అమలుకు అసెంబ్లీలో ఒక చట్టం చేసి, సరికొత్త విధానాన్ని ప్రవేశపెట్టి రైతులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. విభజన చట్టంలో ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలన్నారు. రాయలసీమ, ఉత్తరాంధ్రకు ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలన్నారు. అనంతపురంలో సెంట్రల్ యూనివర్సిటీ, వైఎస్సార్ జిల్లాలో ఉక్కు పరిశ్రమ, కర్నూలులో విద్యావ్యవస్థను బలోపేతం చేస్తామని చెప్పి విస్మరించారన్నారు. రైతులను ఆదుకునేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చేందుకు ఈ నెల 15 నుంచి 30 వరకు ఆందోళన చేపడతామన్నారు. యూత్ పాలసీ తీసుకురావాలి : యువత, విద్యార్థుల భవిష్యత్తు కోసం యూత్ పాలసీని ప్రభుత్వం ప్రవేశపెట్టాలని మధు పేర్కొన్నారు. ఈ పాలసీ ద్వారా ఉద్యోగ అవకాశాలతో పాటు, సాంస్కృతిక, క్రీడలు నిర్వహించి, వారిలోని సృజనాత్మకతను వెలికితీయొచ్చన్నారు. ఇప్పటికే కేరళ, ఒరిస్సా, కర్నాటక ప్రాంతాల్లో యూత్ పాలసీ నడుస్తోందన్నారు. యూత్పాలసీ కోసం సెప్టెంబర్ 1 నుంచి 15 వరకు ఆందోళనలు చేపడుతామన్నారు. నంద్యాల చుట్టూనేనా..: రాష్ట్రంలో ఏమీ లేనట్టు తెలుగుదేశం ప్రభుత్వం నంద్యాలలో మకాం వేసిందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి నెలరోజులకుపైగా రాష్ట్ర ముఖ్యమంత్రి, మంత్రులు నంద్యాల చుట్టూ తిరుగుతున్నారన్నారు. ఇది ఏరకంగానూ సహించలేనిదన్నారు. నంద్యాల ఎన్నికల్లో బీజేపీ కూటమితో పోటీ చేస్తున్న తెలుగుదేశం పార్టీని ఓడించాలన్నారు. ఈ సమావేశంలో సీపీఎం రాష్ట్ర నేత ఓబులు, సీపీఎం జిల్లా కార్యదర్శి రాంభూపాల్, నేతలు నల్లప్ప, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ఇవీ తీర్మానాలు : - మద్యంషాపులు, బెల్టుషాపులు రద్దు కోసం ఆందోళన కార్యక్రమాలు చేపట్టడం - అంగన్వాడీ, మునిసిపల్ కార్మికులకిచ్చిన హామీలు నెరవేర్చడం - ప్రజా సమస్యలపై రోడ్డుపైకి వస్తే పోలీసులతో కేసులు పెట్టించడం - దళితులు, మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా పోరాటాలు -
బాబు సర్కార్ దళితుల వ్యతిరేకి
-
'దళితులకు రక్షణ కరువైంది'
విజయవాడ: టీడీపీ ప్రభుత్వం అక్రమ నిర్బంధానికి పాల్పడటం సిగ్గుచేటని గరికపర్రు గ్రామస్థులు ర్యాలీగా వస్తుంటే లాఠీచార్జి చేయడం దుర్మార్గమని సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది. చిత్తూరులో జరిగే ఉత్సవాల్లో దళితులను పాల్గొననీయకపోవడం ఆక్షేపణీయం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని గరికపర్రులో దళితుల మీద అమలవుతున్న సోషల్ బాయ్‌కాట్ ఎత్తివేయాలి లేకుంటే అన్ని పార్టీలను కలుపుకొని ఈ నెల 28న చలో గరికపర్రు చేపడతామని అన్నారు. -
నారాయణరెడ్డి హత్యపై దర్యాప్తు జరిపించాలి
-
నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్
-
నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్
అనంతపురం: కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా చేస్తున్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఆందోళనలో భాగంగా బుధవారం సీపీఐ నేతలు నారాయణ, రామకృష్ణ, సీపీఎం ఏపీ కార్యదర్శి మధు తదితరులు పాల్గొన్నారు. వామపక్ష నేతలు కలెక్టరేట్ ముట్టడికి ప్రయత్నించడంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. కలెక్టరేట్‌లోకి చొచ్చుకుపోతున్న వామపక్షాల నేతలు నారాయణ, రామకృష్ణ, మధు సహా వందలాది మంది కార్యాకర్తలను అదుపులో తీసుకున్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన నేతలను అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
‘టీడీపీ మహానాడును అడ్డుకుంటాం’
అనంతపురం: రైతులు, వ్యవసాయ కూలీల కష్టాలు తీర్చకుంటే టీడీపీ మహానాడును అడ్డుకుంటామని సీపీఎం ఏపీ కార్యదర్శి మధు హెచ్చరించారు. గౌతమీపుత్ర శాతకర్ణి సినిమాకు పన్నురాయితీ కల్పించిన సీఎం చంద్రబాబు రైతులకు ఇన్పుట్ సబ్సిడీ ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు. చంద్రబాబుది మోచేతి నీళ్లు తాగే రకమని, ఆయనను ఎట్టి పరిస్థితుల్లోనూ క్షమించకూడదని అన్నారు. విదేశీ పర్యటనలు, పుష్కరాలకు వేల కోట్ల నిధులు ఖర్చు పెట్టిన చంద్రబాబుకు కరువు రైతులను ఆదుకోవడం తెలియదా అని సీపీఐ ఏపీ కార్యదర్శి రామకృష్ణ అని ప్రశ్నించారు. రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై చంద్రబాబు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. బాలకృష్ణ ప్రాతినిథ్యం వహిస్తున్న హిందూపురంలో రెండు వారాలకు ఒకసారి సాగునీరు ఇవ్వడం సిగ్గుచేటని మండిపడ్డారు. -
రాష్ట్రంలో రాక్షస పాలన జరుగుతోంది
-
తుందుర్రులో పర్యటించిన అఖిలపక్షం
ఏలూరు: తమ గొంతులో ప్రాణం ఉన్నంత వరకు తుందుర్రులో ఆక్వా పార్కు నిర్మాణాన్ని చేపట్టనీయమని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. పశ్చిమగోదావరి జిల్లా కె.బేతపూడి, తుందుర్రు గ్రామాల్లో సోమవారం అఖిలపక్షం పర్యటించింది. ఈ సందర్భంగా మధు మాట్లాడుతూ ఫ్యాక్టరీ నిర్మాణాన్ని ఎట్టి పరిస్దితుల్లోనూ కొనసాగనీయమని.. ప్రజలకు అండగా ఉంటామని స్పష్టం చేశారు. ఇక్కడి ప్రజల కోసం తాము జైలుకైనా వెళ్తామన్నారు. టీడీపీ, బీజేపీలు బుడబుక్కల పార్టీలని, రెండేళ్లలో చంద్రబాబు దుకాణం మూసుకోవడం ఖాయమన వ్యాఖ్యానించారు. -
పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో దొంగ ఓట్లు
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు నెల్లూరు(సెంట్రల్) ప్రభుత్వ యంత్రాగాన్ని దుర్వినియోగం చేస్తున్న మంత్రి నారాయణ పట్టభద్రుల ఎన్నికల్లో దొంగ ఓట్లు మీద ఆశ పెట్టుకున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ఆరోపించారు. నెల్లూరులోని సీపీఎం కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో పట్టభద్రులకు సంబంధించి దాదాపుగా 6,500 బోగస్ ఓట్లు తొలగించాక తిరిగి ఓటర్ల జాబితాలో దొంగ చిరునామాతో 2033 ఓట్లు ఏ విధంగా వచ్చాయో చెప్పాలని ప్రశ్నించారు. కృష్ణచైతన్య కళాశాల పేరుతో 255, నారాయణ మెడికల్ కళాశాల పేరుతో 365 ఓట్లు నమోదు అయ్యాయన్నారు. ఒకరి పేరు మీద ఉండాల్సిన ఓట్లు వేరొకరి పేరుమీద ఉండడమే కాకుండా చిరునామా కూడా పూర్తిగా మార్చి ఉన్నట్లు ఆరోపించారు. ప్రభుత్వ యంత్రాగాన్ని అడుగడుగునా ప్రభావితం చేస్తూ ఎన్నికల్లో అడ్డదారులు తొక్కాలని చూస్తున్నారని మండిపడ్డారు. కొందరు మంత్రులు స్వయంగా ఆయా శాఖల్లో ఉన్న అధికారులను పిలిచి తన అభ్యర్థికి ఓటేయాలని చెపుతూ ఓటర్లను భయపెడుతున్నారన్నారు. అదే విధంగా అధికార పార్టీ నాయకులు ఓటర్లకు మొబైల్ఫోన్లు , నగదు ఇచ్చి ప్రలోభాలకు గురి చేయాలని చూస్తున్నారని విమర్శించారు. ఈ విషయాలపై అధికారులు దృష్టి సారించి దొంగ ఓట్లకు కళ్లెం వేయాలన్నారు. అడ్డదారులను అడ్డుకుంటాం – సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్ నెల్లూరు రూరల్ : తూర్పురాయలసీమ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ గెలుపు కోసం జిల్లా మంత్రి నారాయణ, అ పార్టీ అభ్యర్థి పట్టాభిరామిరెడ్డి ఓటర్లను ప్రలోభపెట్టేందుకు ప్రయత్నిస్తున్నారని ఆరోపించారు. చింతారెడ్డిపాళెంలోని నారాయణ హాస్పిటల్ ఎదుట టీడీపీ అక్రమాలకు నిరసనగా మంగళవారం సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ నారాయణ మెడికల్ కళాశాలలో ఓటర్లకు సెల్ఫోన్లు, ట్యాబ్‌లను పంపిణీ చేస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల నిబంధనలను ఉల్లంఘించి అడ్డదారుల్లో గెలవాలని ప్రయత్నిస్తే అడ్డుకుంటామని హెచ్చరించారు. సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు మోహన్‌రావు, రూరల్ కార్యదర్శి మాదాల వెంకటేశ్వర్లు, మూలంరమేష్, గోగుల శ్రీనివాసులు, నరహరి, సతీష్, శ్రీనివాసులు పాల్గొన్నారు. -
'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్'
-
'దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయ్'
విజయవాడ: ప్రత్యేక హోదా ఉద్యమాన్ని రాష్ట్ర ప్రభుత్వం సహించలేకపోతున్నదని సీపీఎం ఏపీ రాష్ట్ర కార్యదర్శి పీ మధు విమర్శించారు. విద్యార్థులు, ఉద్యమకారులపై ప్రభుత్వం తప్పుడు కేసులు పెడుతున్నదని ఆయన మండిపడ్డారు. శనివారమిక్కడ ఆయన విలేకరులతో మాట్లాడారు. విశాఖపట్నంలో జరుగుతున్న సీఐఐ భాగస్వామ్య సదస్సు బోగస్ అని ఆయన మండిపడ్డారు. దమ్ముంటే పెట్టుబడులపై శ్వేతపత్రం విడుదల చేయాలని ప్రభుత్వాన్ని సవాల్ చేశారు. ప్రత్యేక హోదా ఉద్యమాన్ని సుజనా చౌదరి పందులతో పోల్చడం అనాగరికమని మండిపడ్డారు. హోదా వచ్చేవరకు అందరం కలిసి పోరాడుదామని ఆయన పేర్కొన్నారు. -
హోదా ఊసుండదు..ప్యాకేజీ ఉండదు
-
‘బాబు ప్రజల పక్షమా.. బీజేపీ పక్షమా’
నెల్లూరు: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజల పక్షమా.. లేక ప్రజా వ్యతిరేక నిర్ణయాలు తీసుకుంటున్న బీజేపీ పక్షమా స్పష్టం చేయాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. గురువారం నెల్లూరు సీపీఎం కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్రమోదీకి దమ్ముంటే నోట్టు రద్దు చేసి సామాన్యులను రోడ్డుపాలు చేయడం కాకుండా.. నల్లకుబేరుల పేర్లు బయటపెట్టాలని డిమాండ్ చేశారు. -
పాత నోట్లను ఇంకొన్నాళ్లు కొనసాగించాలి
-
‘బాబు అరాచక పాలన సాగిస్తున్నారు’
కాకినాడ: ఏపీలో చంద్రబాబు అరాచక పాలనను సాగిస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. కాకినాడలో ఆయన శుక్రవారం మీడియాతో మాట్లాడుతూ.. నిన్న తమని అరెస్ట్ చేసిన సందర్భంగా పిడిగుద్దులు గుద్దిన పోలీసులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. దివీస్‌కు వ్యతిరేకంగా మళ్లీ ఆ ప్రాంతంలో సభ నిర్వహిస్తామన్నారు. ఈ నెల 15న సీపీఎం జాతీయ నేత రాఘవులు, 27న సీపీఎం ఎంపీల బృందం దివీస్ ప్రభావిత ప్రాంతాలలో పర్యటిస్తుందని తెలిపారు. ఒక పక్క రాష్ట్రంలో వ్యవసాయ ఆధారిత పరిశ్రమలు మూతపడుతుంటే.. చంద్రబాబు సర్కారు మాత్రం కాలుష్య కారక పరిశ్రమలను తెచ్చి పెడుతుందని అన్నారు. టీడీపీ పాలనపై విసుగు చెందిన ప్రజలు.. గత ఆరు నెలలుగా రోడ్డెక్కి ఆందోళన చేస్తున్నారన్నారు. ఎన్నికలకు ముందు నిరుద్యోగ యువతకు ఉద్యోగాలు ఇప్పిస్తామన్న చంద్రబాబు దాన్ని పక్కదారి పట్టించడం కోసమే విశాఖలో ప్రేమికుల రోజు జరిగే బీచ్ ఫెస్టివల్‌కు సహకరిస్తున్నారని ఆరోపించారు. -
చంద్రబాబు టెరరిస్టులనడం దారుణం
-
కడప ఉక్కు కోసం ఉద్యమిద్దాం
కడప సెవెన్‌రోడ్స్: ప్రభుత్వాల మెడలు వంచి కడపలో ఉక్కు పరిశ్రమను సాధించుకోవడానికి ప్రజలు పోరాటాలకు సిద్ధం కావాలని సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు గఫూర్ పిలుపునిచ్చారు. గురువారం కలెక్టరేట్ ఎదుట ఆ పార్టీ నిర్వహించిన ధర్నాలో ఆయన ప్రసంగించారు. కడపలో స్టీల్ ప్లాంటు నిర్మించాలని విభజనచట్టంలో పేర్కొన్నా కేంద్ర ప్రభుత్వం కాలయాపన చేస్తోందని విమర్శించారు. అంతర్జాతీయంగా ఉక్కు ధరలు తగ్గడాన్ని సాకుగా చూపెడుతూ ఆ పరిశ్రమలు ఏర్పాటు లాభదాయకం కాదని కేంద్రం మాట్లాడటం తగదన్నారు. సెయిల్ ఆధ్వర్యంలో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేసి కరువు ప్రాంతంలో ఉద్యోగ, ఉపాధి అవకాశాలను కల్పించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో వెనుకబడిన రాయలసీమ, ఉత్తర కోస్తా జిల్లాలకు బుందేల్‌ఖండ్ తరహా ప్యాకేజీ ఇవ్వాలని కోరారు. రాయలసీమకు రూ. 50 వేల కోట్ల ప్రత్యేక ప్యాకేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. గాలేరు–నగరి, హంద్రీ–నీవా ప్రాజెక్టులకు నిధులు కేటాయించి మూడేళ్లలో పూర్తి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి ఆంజనేయులు కోరారు. శ్రీశైలం రిజర్వాయర్‌లో కనీస నీటిమట్టం 854 అడుగులు నిల్వ చేయాలన్నారు. జిల్లాపై ముఖ్యమంత్రి చంద్రబాబు అనుసరిస్తున్న వివక్షపై తీవ్రంగా ధ్వజమెత్తారు. కేసీ ఆయకట్టు స్థిరీకరణకు రాజోలి, జొలదరాశి రిజర్వాయర్లను నిర్మించాలన్నారు. ఖరీఫ్‌లో వేరుశనగను నష్టపోయిన రైతులందరికీ పరిహారం ఇవ్వాలని, రబీలో ఉచితంగా ఎరువులు, విత్తనాలు ఇవ్వాలని, రుణాలు రీషెడ్యూల్డ్ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఆ పార్టీ నాయకులు చంద్రశేఖర్, ఎ.రామ్మోహన్‌రెడ్డి, చంద్రశేఖర్, ఓ.శివశంకర్, సావంత్ సుధాకర్, పాపిరెడ్డి, దస్తగిరిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్
-
సీపీఎం నేత మధుకు వైఎస్ జగన్ ఫోన్
హైదరాబాద్ : ఆంధ్రప్రదేశ్ సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధుతో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదివారం ఫోన్లో మాట్లాడారు. శనివారం భీమవరంలో జరిగిన పరిణామాలపై వైఎస్ జగన్ ఆరా తీశారు. మధుతో పాటు సీపీఎం కార్యకర్తలపై పోలీసులు ప్రవర్తించిన తీరుపై ఆయన ఆక్షేపించారు. మెగా ఆక్వాఫుడ్ పార్క్ సందర్శించేందుకు శనివారం భీమవరం వెళ్లిన మధుతో పాటు సీపీఎం కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. దీంతో ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అనంతరం వారిని అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించిన విషయం తెలిసిందే. (చదవండి : ఆక్వాపార్క్ రగడ ) -
భీమవరంలో ఉద్రిక్తత...మధు అరెస్ట్
-
భీమవరంలో ఉద్రిక్తత...మధు అరెస్ట్
పశ్చిమ గోదావరి : భీమవరంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఏపీ ప్రభుత్వం ఏర్పాటుచేయనున్న మెగా ఆక్వాఫుడ్ పార్క్‌ను సందర్శించేందుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు శనివారం ఇక్కడకు చేరుకున్నారు. వన్‌టౌన్ పోలీసులు ఫుడ్‌పార్క్ వద్దకు చేరుకుని మధును అడ్డుకున్నారు. అనంతరం ఆయన్ను అరెస్ట్ చేసి స్టేషన్‌కు తరలించారు. దీంతో స్థానికంగా టెన్షన్ వాతావరణం చోటుచేసుకుంది. సమాచారం తెలుసుకున్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత గ్రంధి శ్రీనివాస్, కార్యకర్తలతో కలిసి స్టేషన్‌కు చేరుకున్నారు. సీపీఎం మధును విడుదల చేయకపోతే స్టేషన్ వద్ద ధర్నా చేస్తామని గ్రంధి శ్రీనివాస్ హెచ్చరించారు. -
సెజ్ బాధితులకు అండగా పోరాడతాం
సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు కోట: కర్లపూడి సెజ్ బాధితులకు అండగా నిలబడి పోరాడుతామని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తెలిపారు. ఆదివారం కర్లపూడి గ్రామస్తులతో ఆయన మాట్లాడారు. కోస్టల్ కారిడార్ పేరుతో రైతుల నుంచి బలవంతంగా భూములు లాక్కోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. ఇక్కడ ఉన్న భూములు వాటి స్థితిగతుల ఆధారంగా ఎకరాకు రూ.కోటి నష్ట పరిహారంగా చెల్లించాలన్నారు. కోట, చిల్లకూరు మండలాల్లో 11 వేల ఎకరాలు పరిశ్రమలకు ఇచ్చేందుకు అధికారులు సిద్ధం చేసిన విషయాన్ని గ్రామస్తులు ఆయన దృష్టికి తెచ్చారు. పరిశ్రమల కోసం గ్రామాలు ఖాళీ చేయాల్సిన అవసరం లేదని ఆయన పేర్కొన్నారు. భూ బాధితులకు అండగా ఉంటామన్నారు. ఆయన వెంట సీపీఎం జిల్లా కార్యదర్శి చండ్ర రాజగోపాల్, డివిజన్ కార్యదర్శి యాదగిరి, కోట మండల కార్యదర్శి పీవీ కృష్ణయ్య, కర్లపూడి సర్పంచ్ సన్నారెడ్డి చెంచురాఘవరెడ్డి ఉన్నారు. సెజ్‌లు, సీపీఎం మధు, కోట -
పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు
సాక్షి, విశాఖపట్నం: ప్యాకేజీ సోమ్మును పంచుకునేందుకే టీడీపీ, బీజేపీలు హోదా డిమాండ్ ను తుంగలోతొక్కాయని సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ఇప్పుడు ప్యాకేజీ సరిపోతుందంటున్న నేతలు.. విభజన సమయంలో ఐదేళ్లుకాదూ పదేళ్లు ప్రత్యేక హోదా కావాలని ఎందుకు అడిగినట్లో? అని ప్రశ్నించారు. కేంద్ర మంత్రివర్గంలో కొనసాగుతూ టీడీపీ హోదా సాధించలేదని వ్యాఖ్యానించారు. విశాఖపట్నంలో ఆదివారం విలేకరులతో మాట్లాడిన ఆయన జనసేన చీఫ్ పవన్ కల్యాణ్ పైనా ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా విషయంలో పవన్ కల్యాణ్ కేవలం మాటలతో సరిపెట్టకుండా ఏదోఒకటి చేతల్లో చేసి చూపించాలని రాఘవులు సూచించారు. ‘చేగువేరా గురించి ఆయన తరచూ ప్రస్తావిస్తాడు. ప్రశంసిస్తాడు. పవన్.. చేగువేరా మాటలు చెప్పలేదు. తుపాకీతో సాయుధ పోరాటం చేశాడు. నువ్వు(పవన్) కూడా తుపాకి పట్టుకోమని మేం చెప్పం. అయితే రాజ్యాంగ పరిధిలో ప్రజల పక్షాన ఆందోళనలు చేయాలి’ అని రాఘవులు అన్నారు. హోదా రాకపోతే ఏపీలో టీడీపీ, బీజేపీలకు నూకలుండవని జోస్యం చెప్పారు. అమరావతి చుట్టూనే అభివృద్ధి రాష్ట్ర విభజన జరిగాక సీఎం చంద్రబాబు రాష్ట్రాన్ని పట్టించుకోకుండా అమరావతి చుట్టూనే అభివృద్ధిని కేంద్రీకరిస్తున్నారని రాఘవులు విమర్శించారు. గతంలో రాష్ట్ర విభజనకు అదే దారితీసిన విషయాన్ని విస్మరిస్తూ మళ్లీ అదే తప్పునే చేస్తున్నారన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమను నిర్లక్ష్యం చేస్తే మళ్లీ అలాంటి ఉద్యమమే పునరావృతమవుతుందని హెచ్చరించారు. ఏయూ ప్లాటినం జూబ్లీ హాలులో ఉత్తరాంధ్ర అభివృద్ధి వేదిక నిర్వహించిన సదస్సులో ఆయన ప్రసంగించారు. రాయలసీమ వెనకబాటుకు భౌతిక కారణం ఉందని, కానీ ప్రకృతి వనరులున్నా ఉత్తరాంధ్ర వెన కబడి ఉండటానికి పాలకుల నిర్లక్ష్యమే కారణమని ఆరోపించారు. -
బాబు ఇప్పటికైనా పోరుకు కదలాలి: మధు
సాక్షి,హైదరాబాద్: కేంద్రంపై ఆందోళనకు నిరంతర ఒత్తిడికి చంద్రబాబు సన్నద్ధం కావాలనీ, కేంద్రం ప్రత్యేక హోదా పేరిట దారుణంగా మోసం చేసిందనీ సీపీఎం రాష్ట్రకార్యదర్శి మధు బుధవారం రాత్రి అన్నారు.ఎలాంటి అదనపు కేటాయింపులు లేకుండానే ఉన్న వాటికి సర్దుబాటు చేసేలా ప్యాకేజీ ప్రకటించి చేతులు దులిపేసుకుందన్నారు. ప్రత్యేక హోదా తిరస్కరించడానికి రాజ్యాంగ కారణాలు ఏమిలేవన్నారు. 14వ ఆర్థిక సంఘం, నీతి ఆయోగ్‌లు కూడా కారణం కాదనీ ఇది కేవలం బీజేపీ ఏకపక్ష తిరస్కరణ అని అన్నారు. కేంద్ర ప్రభుత్వ వైఖరిని నిరసిస్తున్నామనీ రాష్ట్రవ్యాప్త ఆందోళన చేపడతామని వెల్లడించారు. -
పాలనపై చంద్రబాబు దృష్టి పెట్టాలి
-
ఏపీకి ప్రత్యేక హోదా అత్యవసరం
* వెంటనే ఏపీకి హోదా ఇవ్వాలని వామపక్షాల డిమాండ్ * హోదా కోసం పోరాటం కొనసాగిస్తాం: ఏచూరి * ఫిరాయింపుదారులపై అనర్హత విధించే అధికారం స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండాలి * వామపక్షాల నేతలతో వైఎస్ జగన్ భేటీ * హోదా సహా పలు అంశాలపై చర్చ.. మద్దతు కోసం వినతి * జీఎస్టీ బిల్లు తర్వాత హోదా మరింత అవసరం: వైఎస్ జగన్ * అది మన హక్కు.. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు * సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తే లేదని వెల్లడి సాక్షి, న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేకహోదా తక్షణావసరమని, కుంటిసాకులు చెప్పకుండా వెంటనే హోదాను ప్రకటించాలని సీపీఐ రాజ్యసభ పక్ష నేత డి.రాజా, సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తామని.. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తామని తెలిపారు. ఏపీకి హోదాతో పాటు ఇతర అంశాలపై చేసే పోరాటానికి మద్దతు ఇవ్వాలని వైఎస్సార్ కాంగ్రెస్ అధ్యక్షుడు వై.ఎస్.జగన్మోహన్ రెడ్డి మంగళవారం వారిరువురిని విడివిడిగా కలిశారు. ఉదయం 10 గంటలకు డి.రాజాను ఆయన నివాసంలో పార్టీ ఎంపీలు మేకపాటి రాజమోహన్‌రెడ్డి, వైవీ సుబ్బారెడ్డి, వెలగపల్లి వరప్రసాదరావు, విజయసాయి రెడ్డి, బుట్టా రేణుక, వై.ఎస్.అవినాష్‌రెడ్డి, పి.వి.మిథున్‌రెడ్డి, పార్టీ సీనియర్ నేత భూమన కరుణాకర్‌రెడ్డితో కలిసి భేటీ అయ్యారు. అనంతరం మధ్యాహ్నం 12.30 గంటలకు సీపీఎం కార్యాలయంలో సీతారాం ఏచూరిని కలిశారు. ఈ సమావేశంలో సీపీఎం పొలిట్‌బ్యూరో సభ్యుడు ఎం.ఎ.బేబీ కూడా పాల్గొన్నారు. రాష్ట్రం ఎదుర్కొంటున్న పలు సమస్యలపై మూడు పేజీల వినతిపత్రాన్ని వారిరువురికీ అందజేశారు. ప్రత్యేక హోదా సాధనలో కేంద్రంపై ఒత్తిడి తేవాలని, క్షేత్రస్థాయిలో తమ పోరాటానికి మద్దతు ఇవ్వాలని కోరారు. ప్రత్యేక హోదా అంశంతోపాటు రాష్ట్రం ఎదుర్కొంటున్న అనేక సమస్యలను వై.ఎస్.జగన్ ఈ సమావేశంలో వారి దృష్టికి తీసుకొచ్చారు. వైఎస్సార్సీపీ పోరాటాలకు వామపక్షాల మద్దతు ఉంటుందని వారు హామీ ఇచ్చారు. సమావేశాల అనంతరం రాజా, సీతారాం ఏచూరి, జగన్ విలేకరులతో మాట్లాడారు. హోదా కోసం కార్యాచరణ: డి.రాజా పార్లమెంటరీ ప్రజాస్వామ్యంలో ప్రధాని, ప్రభుత్వం హామీలు ఇస్తే.. తదుపరి ప్రభుత్వాలు తప్పనిసరిగా అమలుచేయాలి. రాజ్యసభలో విభజన బిల్లు వచ్చినప్పుడు వాళ్లు కూడా పట్టుపట్టారు. నేను కూడా అక్కడే ఉన్నాను. వెంకయ్య నాయుడు ఐదేళ్లు కాదు.. పదేళ్లు కావాలన్నారు. ఇప్పుడు ఆయన ప్రభుత్వంలో ఉన్నారు. అరుణ్ జైట్లీ ఆనాడు రాజ్యసభలో ప్రతిపక్ష నేతగా ఉన్నారు. నేడు రాజ్యసభ సభా నాయకుడిగా, ఆర్థిక మంత్రిగా ఉన్నారు. బీజేపీ ఈ అంశాన్ని ఎన్నికల్లో కూడా ప్రచారం చేసింది. మోదీ తిరుపతిలో ఈమేరకు హామీ ఇచ్చారు. కానీ ఇప్పుడు ప్రత్యేక హోదాను తిరస్కరిస్తూ నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఈ విషయంలో వారు చెబుతున్న కారణాలు ప్రజలు అంగీకరించేలా లేవు. దీనిపై ఇతర వామపక్షాలతో సంప్రదింపులు జరుపుతాం. హోదా సాధనకోసం భవిష్యత్తు కార్యాచరణ రూపొందిస్తాం. ఆంధ్రప్రదేశ్ ప్రజల ప్రయోజనాలను కాపాడుతాం. నేను జగన్మోహన్రెడ్డికి ఇదే హామీ ఇచ్చాను. పార్టీ ఫిరాయింపుల వ్యతిరేక చట్టాన్ని సమీక్షించాల్సిన అవసరం ఉంది. అలాగే అంతర్రాష్ట్ర నదీ జలాల పంపిణీ విషయంలో సామరస్యపూర్వక పరిష్కారం కనుక్కోవాలి. దిగువ రాష్ట్రాలకు అన్యాయం జరగకుండా చూడాలి. ఉద్యమాలతో ఒత్తిడి తెస్తాం: ఏచూరి ప్రత్యేక హోదా ఏపీకి తక్షణావసరం. ఇతర రాష్ట్రాలకు ఇవ్వాలా లేదా? దాని వల్ల ఏపీకి ఇవ్వలేమన్నది అర్థం లేని వాదన. ప్రత్యేక హోదాపై ప్రభుత్వ వైఖరి స్పష్టంగా అర్థమవుతోంది. చేసిన వాగ్దానాలను అమలుచేయరని స్పష్టమవుతోంది. తిరిగి ఈ అంశాన్ని పార్లమెంటు ముందుకు, ప్రజల ముందుకు తీసుకొస్తాం. ప్రజా ఉద్యమాల ద్వారా, పార్లమెంటులో ఆందోళన ద్వారా కేంద్రంపై ఒత్తిడి తెస్తాం. పోరాటాన్ని భవిష్యత్తులో ఏవిధంగా ముందుకు తీసుకెళ్లాలనేదానిపై ఈ సమావేశంలో చర్చించాం. నీటి పంపకం రాష్ట్రాల మధ్య ఎలా ఉండాలన్న అంశంపై చర్చించాం. ఇది మహారాష్ట్ర, కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల మధ్య ఉన్న సమస్యమాత్రమే కాదు. అన్ని రాష్ట్రాల మధ్య సమస్య ఏర్పడుతోంది. జాతీయస్థాయిలో ఎలా చేయాలో చర్చించాలి. పార్టీ ఫిరాయింపుల చట్టం ప్రకారం అనర్హత వేటు వేసే అధికారం స్పీకర్ నుంచి ఎన్నికల సంఘంలోకి రావాలన్న ప్రతిపాదన చేశారు. దీనిని ఇతర పార్టీలతో చర్చిస్తాం. ఆ అధికారం ఒక స్వతంత్ర సంస్థ చేతుల్లో ఉండడం అవసరం. రాజీ పడితే చరిత్ర హీనులుగా మిగులుతారు: జగన్ జీఎస్టీ బిల్లు ఆమోదం పొందాక స్పెషల్ కేటగిరీ స్టేటస్ ఇవ్వడం అన్నది అతి ముఖ్యమైన అంశంగా మారింది. ఇప్పటివరకు రాష్ట్ర ప్రభుత్వాల చేతుల్లో సేల్స్‌టాక్స్ అంశం ఉండేది. కొత్త పరిశ్రమలను ఆకర్షించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలకు సేల్స్ టా క్స్ రాయితీలు ఇచ్చే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ సేల్స్ టాక్స్ అన్న అంశం కూడా జీఎస్టీ రావడం వల్ల కేంద్రం పరిధిలోకి వెళ్లిపోయింది. సేల్స్ టాక్స్‌పై ఇక రాష్ట్ర ప్రభుత్వాలు మినహాయింపు ఇచ్చే పరిస్థితి లేకుండా పోయింది. అలాంటి మినహాయింపులు లేనప్పుడు ఎవరైనా కూడా కొత్త రాష్ట్రం, ఏ మౌలిక వసతులు లేని ఏపీకి రావడానికి ఏ పారిశ్రామికవేత్తయినా ఎందుకు ఉత్సాహం చూపుతారు? ఇప్పటికే మౌలిక వసతులు ఉన్న చెన్నైకో, బెంగళూరుకో, హైదరాబాద్‌కో పోవడానికి ఉత్సాహం చూపుతారు. ఒకవైపు హైదరాబాద్ పోయింది.. ఇతర రాష్ట్రాలతో సమాన బలం లేకుండా పోయిం ది.. సేల్స్‌టాక్స్ మినహాయింపులు ఇచ్చే అవకాశం పోయింది. కాబట్టి ఇప్పుడు జీఎస్టీ వచ్చిన నేపథ్యంలో ఏపీకి ప్రత్యేక హోదా రావడం తప్పనిసరి అయింది. హోదా కలిగిన రాష్ట్రాలకే జీఎస్టీ మినహాయింపు ఉంటుంది. మిగిలిన రాష్ట్రాలకు ఉండదు. రూ. లక్షా 65 వేల కోట్ల ప్యాకేజీ ఇచ్చామని బీజేపీ ప్రభుత్వం చెప్పింది. రాష్ట్రానికి రావాల్సినవన్నింటినీ మూటకట్టి ప్యాకేజీగా చూపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. వందేళ్లు పోరాటం చేస్తేనే స్వాతంత్య్రం వచ్చింది. ఏదైనా పోరాడితేనే సాధిస్తాం. రాజీపడకుండా గట్టిగా పోరాటం చేస్తేనే హోదాను మరిచిపోలేరు. హోదా మన హక్కు. హోదా వస్తేనే పరిశ్రమలు, ఉద్యోగాలు వస్తాయి. లక్షల కోట్లు పెట్టుబడి పెట్టి రాష్ట్రం తన కాళ్ల మీద తాను నిలబడాలంటే హోదా తప్పనిసరి. ఎవరైనా కూడా రాజీ పడకూడదు. పడితే చరిత్ర హీనులుగా మిగిలిపోతారు. ప్రత్యేక హోదా అన్న అంశంపై అందరం కలిసికట్టుగా పోరాటం చేయాల్సిన అంశం. ఈ అంశం జాతీయస్థాయిలో కూడా చర్చించదగ్గ అంశం. పార్లమెంటు ఇచ్చిన మాటను నిలబెట్టుకోవాలంటే... ప్రజల్లో ప్రజాస్వామ్య విశ్వసనీయతను కాపాడాలంటే... ప్రతిఒక్కరు అడగాల్సిన అంశం. ఈ విషయంలో ఏచూరి ఇంతవరకు మద్దతు ఇస్తూ వచ్చారు. రాబోయే రోజుల్లో ఈ అంశంపై రాష్ట్రంలోనూ, పార్లమెంటులో కలిసికట్టుగా ఒక్కటై పోరాటం చేయాలి. ఇతర పార్టీలను కూడా కలుపుకుని హోదా సాధించే దిశగా అడుగులు వేస్తాం. సాధించేవరకు వదిలిపెట్టే ప్రసక్తి ఉండదని ఘంటాపథంగా చెబుతున్నాం. నేడు రిషికేష్‌కు వైఎస్ జగన్ సాక్షి, హైదరాబాద్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రిషికేష్‌కు వెళుతున్నారు. అక్కడ విశాఖ శారదాపీఠం స్వామీజీ శ్రీ స్వరూపానందేంద్ర స్వామీజీ ఆశీస్సులను ఆయన తీసుకుంటారు. ఏపీకి హోదా ఇచ్చేలా కేం ద్రం మనసు మారాలని, రాష్ట్రం సుభిక్షం గా ఉండాలనే ఆకాంక్షతో జగన్ అక్కడికి వెళుతున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. -
‘సాక్షి ప్రసారాల నిలిపివేత అనైతికం’
నెల్లూరు: రాష్ట్రంలో సాక్షి టీవీ ప్రసారాల నిలిపివేత అనైతిక చర్యని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. నెల్లూరు సీపీఎం పార్టీ కార్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ...ప్రసారాల నిలిపివేతను అన్ని వర్గాల వారు తీవ్రంగా ఖండించాలన్నారు. ‘సాక్షి’ గొంతు నొక్కేందుకు చంద్రబాబు ప్రభుత్వం ప్రయత్నిస్తోందని ఆయన ఆరోపించారు. తక్షణమే ఆ చానల్ ప్రసారాలను పునరుద్ధరించాలని మధు డిమాండ్ చేశారు. -
'ప్రజలను మభ్యపెట్టేందుకే నవనిర్మాణ దీక్షలు'
నెల్లూరు సెంట్రల్ : చంద్రబాబు ఎన్నికలకు ముందు ఇచ్చిన ఏ ఒక్క హామీ కూడా అమలు చేయకుండా, ప్రజలు పడుతున్న సమస్యలను పక్కదారి పట్టించి మభ్యపెట్టేందుకే నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నగరంలోని సీపీఎం కార్యాలయంలో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. కరువు తాండవం చేస్తుంటే చంద్రబాబుకు నవనిర్మాణ దీక్షలు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. తక్షణమే కరువు చర్యలు, ఉద్యోగాల భర్తీ, నిరుద్యోగ భృతి ఇవ్వకపోతే జూన్ చివరి వారంలో రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఉద్యమాలు చేస్తామని హెచ్చరించారు. ప్రజల సమస్యలను ప్రశ్నిస్తున్న ప్రతిపక్షం అనేది లేకుండా చేసేందుకు చంద్రబాబు కట్రపన్నుతున్నారని ఆరోపించారు. 2050 వరకు టీడీపీయే అధికారంలో ఉండాలనడం చంద్రబాబు అత్యాశకు పరాకాష్ట అన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఆయన చేస్తున్న పనులు, మరో పార్టీ ఎమ్మెల్యే కొనుగోలు తీరుపై రాష్ట్ర ప్రజలే కాకుండా దేశ, విదేశాల్లో ఉన్న తెలుగు వారంతా ఛీదరించుకుంటున్నారన్నారు. -
సీపీఎం నేత మధు మేనల్లుడు దారుణ హత్య
హైదరాబాద్ : సీపీఎం ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి మధు మేనల్లుడు హష్మి దారుణహత్యకు గురయ్యాడు. లింగంపల్లిలోని రైల్వే ట్రాక్ దగ్గర అతడి మృతదేహాన్ని బుధవారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. కాగా సెల్‌ఫోన్, నగదు, బంగారు గొలుసు కోసమే హష్మిని స్నేహితుడు నరేష్ కుమార్ రెడ్డి హతమార్చినట్లు తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా గద్వాలకు చెందిన హష్మి గత వారమే టీసీఎస్ సంస్థలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా చేరాడు. గచ్చి బౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం... బల్కంపేట ఎల్లమ్మ గుడి సమీపం లో నివాసం ఉండే వల్లిపల్లి హష్మి 26) సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 8.15కి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మంగళవారం ఉదయానికి కూడా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీలో ఆరా తీయగా ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు. కాల్ చేస్తే సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. హష్మి కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో సోదరుడు ఉమామహేశ్వర్రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హష్మి కాల్ డేటా ఆధారంగా నరేష్ కుమార్‌ను పోలీసులు అదుపులోకి విచారిస్తే అసలు విషయం బయటపడింది. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ రూమ్ పక్కన ఉండే నరేష్ కుమార్ రెడ్డి రమ్మనడంతో హష్మి వెళ్లాడని, స్నేహితుడే కావడంతో హష్మి అతడి వెంట లింగంపల్లి వరకూ వెళ్లాడని తెలిపారు. తనకు ఓ పదివేలు డబ్బు అవసరమని నరేష్ కుమార్ అడిగాడని, అయితే హష్మి తన దగ్గర లేదని చెప్పడంతో, అతడి దగ్గరున్న డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశాడని, వారిద్దరి మధ్య వాగ్వాదం జరిగిందని, దీంతో బండరాయితో కొట్టి చంపినట్లు సీఐ పేర్కొన్నారు. తర్వాత హష్మి దగ్గరున్న పర్సు, సెల్‌ఫోన్ తీసుకుని నరేంద్ర కుమార్ రెడ్డి వెళ్లిపోయాడని, మర్నాడు ఏమీ తెలియనట్లు హష్మి బైక్ తిరిగి ఇచ్చేయడానికి వచ్చాడని, బైక్ స్నేహితుడికి ఇచ్చాడంటూ కట్టుకథ చెప్పినట్లు తెలిపారు. కాల్ డేటా ఆధారంగా నిన్న మధ్యాహ్నమే నరేష్ కుమార్ రెడ్డిన అదుపులోకి తీసుకుని విచారణ జరిపినట్లు సీఐ వెల్లడించారు. మరోవైపు సీపీఎం కార్యదర్శి మధుతో పాటు కుటుంబసభ్యులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. హష్మి మృతదేహాన్ని పోస్ట్ మార్టంకు తరలించారు. -
సాఫ్ట్వేర్ ఇంజినీర్ అదృశ్యం
హైదరాబాద్: విధులు ముగించుకొని ఇంటికి బయలుదేరిన స్టాఫ్ట్వేర్ అదృశ్యమయ్యాడు. గచ్చి బౌలి సీఐ జె.రమేశ్ కుమార్ కథనం ప్రకారం... బల్కంపేట ఎల్లమ్మ గుడి సమీపం లో నివాసం ఉండే వల్లిపల్లి హష్మి(26) నానక్‌రాంగూడ ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్‌లోని వేవ్‌రాక్‌లోని ఓ కంపెనీలో సాఫ్ట్వేర్ ఇంజినీర్‌గా పని చేస్తున్నాడు. సోమవారం రాత్రి 8.15కి డ్యూటీ ముగించుకొని ఇంటికి బయలుదేరాడు. మంగళవారం ఉదయానికి కూడా అతను ఇంటికి చేరకపోవడంతో కుటుంబ సభ్యులు కంపెనీలో ఆరా తీయగా ఇంటికి వెళ్లిపోయాడని చెప్పారు. కాల్ చేస్తే సెల్‌ఫోన్ స్విచ్చాఫ్ వచ్చింది. హష్మి కోసం గాలించినా ఆచూకీ దొరక్కపోవడంతో సోదరుడు ఉమామహేశ్వర్రావు గచ్చిబౌలి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు దర్యాప్తులో ఉంది. -
'ప్రత్యేక హోదా కోసం బాబు చేసిందేమీలేదు'
కడప: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ప్రత్యేక హోదా కోసం చేసిందేమీ లేదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. బుధవారమిక్కడ ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు ఢిల్లీ పర్యటనలతో ఏమీ లాభం లేదన్నారు. ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో ప్రధాని మోదీతో ఏం మాట్లాడారో చెప్పాలని మధు అడిగారు. -
సంతలో పశువుల్లా కొంటున్నారు
రాష్ట్రాభివృద్ధిపై ఆ శ్రద్ధ చూపించండి చంద్రబాబుకు సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు సూచన అనంతపురం: సంతలో పశువులను కొంటున్నట్లు ప్రతిపక్ష ఎమ్మెల్యేలను కొనుగోలు చేస్తున్న చంద్రబాబు, ఆ శ్రద్ధను రాష్ట్రాభివృద్ధిపై చూపించాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు అన్నారు. అనంతపురం జిల్లా ఉరవకొండలో సోమవారం ప్రారంభమైన సీపీఎం జిల్లా ప్లీనరీ సమావేశాల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ కేవలం రాజధాని నిర్మాణంపైనే దృష్టి సారించిన చంద్రబాబు, ప్రజా సమస్యలను ఏ మాత్రం పట్టించుకోవడం లేదన్నారు. జిల్లాలో సోలార్, విండ్ పవర్ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్న ప్రైవేట్ కంపెనీలు కారుచౌకగా భూములు కొనుగోలు చేస్తూ రైతులకు తీవ్ర అన్యాయం చేస్తున్నాయని ఆరోపించారు. వెనుకబడిన రాయలసీమ అభివృద్ధిపై ముఖ్యమంత్రికి చిత్తశుద్ధి ఉంటే ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని డిమాండ్ చేశారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యురాలు పుణ్యవతి, రాయులసీవు కార్యదర్శి ఓబులు, జిల్లా కార్యదర్శి రాంభూపాల్ తదితరులు పాల్గొన్నారు. -
ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి
-
'ఆ ఇద్దరు మంత్రులను మోదీ బర్తరఫ్ చేయాలి'
హైదరాబాద్ : కేంద్రమంత్రులు స్మృతీ ఇరానీ, బండారు దత్తాత్రేయ ఒత్తిళ్ల వల్లే... హెచ్‌సీయూ నుంచి విద్యార్థులను సస్పెండ్ చేశారని సీపీఎం జాతీయ కార్యదర్శి సీతారాం ఏచూరి ఆరోపించారు. ఆ ఇద్దరు మంత్రులను ప్రధాని మోదీ బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేశారు. రోహిత్ ఆత్మహత్య నేపథ్యంలో బుధవారం హెచ్‌సీయూకి సీతారాం ఏచూరి విచ్చేశారు. స్థానిక విద్యార్థులతో మాట్లాడిన అనంతరం సీతారాం ఏచూరి విలేకర్లతో మాట్లాడుతూ... హెచ్‌సీయూ వీసీని తొలగించాలని ప్రభుత్వానికి సూచించారు. అసలు వీసీ నియామకమే రాజకీయంగా జరిగిందని విమర్శించారు. విద్యార్థుల మధ్య గొడవ సమసిపోయాక సదరు విద్యార్థులను సస్పెన్షన్ ఎలా చేశారని ఈ సందర్భంగా సందేహం వ్యక్తం చేశారు. ఈ పరిణామాలన్నీ కుట్రపూరితంగా జరిగాయని అన్నారు. బాధ్యులపై క్రిమినల్ కేసులు పెట్టాలని ప్రభుత్వాన్ని సీతారాం ఏచూరి డిమాండ్ చేశారు. -
'హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతాం'
న్యూఢిల్లీ: రాష్ట్ర విభజన వల్ల తలెత్తిన సమస్యలు పరిష్కరించాలంటూ వామపక్ష నేతలు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా అంశాన్ని పార్లమెంట్లో లేవనెత్తుతామని సీపీఐ నేత రాజా పేర్కొన్నారు. న్యూఢిల్లీలో ఆదివారం మీడియాతో ఆయన మాట్లాడారు. రాష్ట్ర విభజన సమయంలో ఇచ్చిన హామీలను కేంద్రం నిలబెట్టుకోవాలని ఈ సందర్భంగా సీపీఐ నేత రాజా డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ పునర్విభజన సమయంలో ఇచ్చిన వాగ్దానాలు ఏమయ్యాయని, వాటిని ఎప్పుడు నెరవేరుస్తారని కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వాన్ని ఏపీ ప్రజలు నిలదీయాలని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. విభజన సమయంలో తీసుకున్న తొందరపాటు నిర్ణయాల వల్లే ఈ గందరగోళం తలెత్తిందని ఏచూరి అభిప్రాయపడ్డారు. -
చంద్రబాబు గురించి మాట్లాడకపోతే పొరపాటే..
గుంటూరు : ప్రత్యేక హోదా కావాలంటూ ఏపీ ప్రతిపక్ష నేత, వైఎస్ఆర్ సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన నిరవధిక నిరహార దీక్షకు సీపీఎం సంఘీభావం ప్రకటించింది. ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి పి.మధు శనివారం వైఎస్ జగన్ దీక్షా స్థలిని సందర్శించి మద్దతు తెలిపారు. ప్రత్యేక హోదా కోసం దీక్ష చేపట్టిన వైఎస్ జగన్‌ను ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుపై సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. ఎన్నికల ముందు అలవికాని వాగ్దానాలు ఇచ్చి...అధికారంలోకి వచ్చాక వాటన్నింటినీ తుంగలోకి తొక్కిన చరిత్ర చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబు గురించి మాట్లాడుకోకపోవటం చాలా పొరపాటు అవుతుందని, ముఖ్యమంత్రిగా ఆయనకు కనీసం నిజాయితీ కూడా లేదని విమర్శించారు. అప్పట్లో ప్రత్యేక హోదా తెస్తానన్న బాబు...ఇప్పుడు ప్యాకేజీతో సరిపెడతానంటున్నాడని మధు ధ్వజమెత్తారు. చంద్రబాబు ఏ రోజు అయితే ముఖ్యమంత్రి పీఠం ఎక్కాడో ఆ రోజే రాష్ట్రంలోని రైతులకు కష్టాలు మొదలైయ్యాయని మధు మండిపడ్డారు. ఏపీ రాజధాని శంకుస్థాపన అదిరిపోవాలంటున్న చంద్రబాబు.... రాజమండ్రిలో గోదావరి పుష్కరాల సమయంలో ఎలా అదిరగొట్టాడో అందరం చూశామని ఆయన ఎద్దేవా చేశారు. రైతుల రుణమాఫీ చేయటానికి డబ్బులు లేవంటున్న చంద్రబాబు ...రాజధాని శంకుస్థాపనకు మాత్రం రూ. 400 కోట్లు ఖర్చు పెడుతున్నారని మధు నిప్పులు చెరిగారు. ఇదంతా ఎవడబ్బ సొమ్మని సభా ముఖంగా చంద్రబాబును నిలదీశారు. -
‘గుజరాత్ మోడల్’ డొల్లతనం బట్టబయలు
- పటేళ్ల ఆందోళనపై బీజేపీ సమాధానం చెప్పాలి - టీఆర్ఎస్ ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై ఆందోళనకు సిద్ధం - ఏపీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించింది - ప్రత్యేక హోదా విషయంలో కేంద్రానిది మోసపూరిత వైఖరి - వైఎస్సార్సీపీ బంద్‌కు సీపీఎం మద్దతు: సీతారాం ఏచూరి సాక్షి, హైదరాబాద్: గుజరాత్లో పటేళ్ల ఆందోళనల తో ప్రధాని మోదీ పేర్కొంటున్న ‘గుజరాత్ మోడల్’ డొల్లతనం బట్టబయలైందని, ఈ నమూనా పూర్తిగా విఫలమైందని స్పష్టమవుతోందని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. ఆ రాష్ర్టంలో తలెత్తిన పరిస్థితులకు బీజేపీ కేంద్ర నాయకత్వం, గుజరాత్ ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఆర్థికంగా మంచిస్థితిలో ఉన్న పటేళ్ల సామాజికవర్గం కూడా రోడ్డుపైకి వచ్చి ఆందోళనలు చేస్తున్నారంటే విద్యా, ఉద్యోగ రంగాల్లో అవకాశాలు అందరికీ అందడం లేదని అర్థమవుతోందని చెప్పారు. నిరసన ర్యాలీపై పోలీసులను విచక్షణారహితంగా ప్రయోగించడం వల్లనే అది అదుపు తప్పిందన్నారు. గురువారం ఎంబీభవన్‌లో పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, బి.వెంకట్‌లతో కలసి ఆయన విలేకరులతో మాట్లాడారు. 2002 గుజరాత్ అల్లర్ల అదుపునకు సైన్యాన్ని పిలవడంలో తాత్సారం చేశారని, ఇప్పుడు మాత్రం వెంటనే పిలవాల్సి వచ్చిందని వ్యంగ్యాస్త్రాలు సంధించారు. ఆర్థికంగా వెనుకబడిన తరగతుల రిజర్వేషన్లకు సంబంధించి మండల్ కమిషన్ చేసిన సిఫార్సులను తమ పార్టీ బలపరిచిందని తెలిపారు. ఈ విధానం అమలు జరిగి ఉంటే గుజరాత్లో ప్రస్తుత పరిస్థితి తలెత్తేది కాదని అన్నారు. మోదీ ఏడాదిలోనే విఫలం.. యూపీఏ ప్రభుత్వం ప్రజల ప్రయోజనాలను పరిరక్షించడంలో పదేళ్లలో విఫలమైతే.. ఏడాది కాలంలోనే మోదీ తన అప్రయోజకత్వాన్ని నిరూపించుకున్నారని ఎద్దేవా చేశారు. గతంలో ఏ ప్రధానీ వెళ్లని విధంగా మోదీ 24 దేశాలు వెళ్లారని, విదేశాల నుంచి పెట్టుబడులు వస్తాయని నమ్మించి చివరకు శూన్యహస్తం చూపారన్నారు. బీహార్ ఎన్నికల్లో రాజకీయ లబ్ధికోసం మతపరమైన విభజన (పోలరైజేషన్) తెచ్చేవిధంగా ముస్లింల జనాభా లెక్కలను కేంద్రం వెల్లడించిందని విమర్శించారు. భూసేకరణ చట్టాన్ని ఉల్లంఘించిన ఏపీ రాజధాని నిర్మాణం కోసం ప్రస్తుతమున్న 2013 కేంద్ర భూసేకరణచట్టాన్ని ఏపీ ప్రభుత్వం ఉల్లంఘించిందని ఏచూరి విమర్శించారు. ‘ల్యాండ్ పూలింగ్’కు వ్యతిరేకంగా తమ పార్టీ ఉద్యమిస్తోందన్నారు. పార్లమెంట్లో చట్ట సవరణ చేయకుండా ఆ దిశలో చర్యలు తీసుకోవడం చట్టాన్ని ఉల్లంఘించడమేనన్నారు.ఈ నెల 29న వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రాష్ట్ర బంద్‌కు సీపీఎం మద్దతు ప్రకటించిందన్నారు. ఏపీకి ప్రత్యేకహోదా విషయంలో కేంద్రం వైఖరి మోసపూరితంగా ఉందని, ప్రతిపక్షంలో ఉండగా బీజేపీ నాయకులే హామీనిచ్చారని గుర్తుచేశారు. మతోన్మాదం రాజ్యాంగానికి ప్రమాదం దేశంలో మతోన్మాదం తీవ్రంగా పెరుగుతోం దని, ఇది భారత రాజ్యాంగానికి ప్రమాదకరమని సీతారాం ఏచూరి అన్నారు. గురువారం సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో సీపీఎం ఆధ్వర్యంలో నిర్వహించిన గెట్ టూ గెదర్ కార్యక్రమంలో ఆయ న ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశంలో ఆర్థిక దోపిడీ విధానాలను మోదీ ప్రభుత్వం కొనసాగిస్తుందని విమర్శించారు. సామాజిక దౌర్జన్యం తీవ్రంగా పెరుగుతోందని, వీటిని అడ్డుకోకపోతే రాబోయే రోజుల్లో చాలా ప్రమాదకరంగా పరిణమిస్తోందని చెప్పారు. కేసీఆర్ మిత్రుడే కానీ సీఎం కేసీఆర్ తమకు మిత్రుడే కానీ, ఆయ న అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా ఎల్లప్పుడూ ఆందోళనలకు సిద్ధంగా ఉం టామని ఏచూరి పేర్కొన్నారు. ప్రజల భా వాలకు అనుగుణంగా రాష్ర్టం ఏర్పడిం దని, వారి బతుకుదెరువు మెరుగుపర్చేలా, వెనుకబాటు తనాన్ని దూరం చేసే చర్యలు తీసుకోవాలని కేసీఆర్‌కు సూచించారు. ప్రజా సమస్యలపై సామాజిక, వామపక్ష శక్తులతో కలసి సీపీఎం ఉమ్మడిగా పోరాటాలు చేపడుతుందని చెప్పారు. -
కుంభకోణాల్లో మునిగి తేలుతున్నారు..
సాక్షి ప్రతినిధి, నిజామాబాద్: మాజీ ప్రధాని మన్మోహన్ సింగ్ ఐదేళ్ల పాలనలో కుంభకోణాలు చేస్తే.. నరేంద్రమోదీ ప్రభుత్వం ఏడాదిన్నర లోపే అందులో మునిగి తేలుతోందని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి విమర్శించారు. పార్టీ రాష్ట్రస్థాయి సమావేశాల సందర్భంగా నిజామాబాద్‌లోని కలెక్టరేట్ మైదానంలో బుధవారం బహిరంగ సభ నిర్వహించారు. సభకు ముఖ్యఅతిథిగా హాజరైన ఏచూరి మాట్లాడుతూ.. కుంభకోణాలకు పాల్పడిన మంత్రులను నిలువరించాలని మోదీని కోరితే కనీస స్పందన కూడా లేదని, పార్లమెంట్ సమయమంతా వృథా అరుునా ఏమీ పట్టనట్టుగా వ్యవహరించారన్నారు. రాజస్థాన్, మధ్యప్రదేశ్ సీఎంలపై వచ్చిన ఆరోపణలనూ పట్టించుకోలేదన్నారు. దేశంలో మతోన్మాద రాజకీయాలు పెరుగుతున్నాయని, హిందూ, ముస్లింల మధ్య విభేదాలు సృష్టిస్తూ రాజకీయ లబ్ధి పొందేందుకు కొన్ని పార్టీలు కుట్ర పన్నుతున్నాయని ఆరోపించారు. కాశ్మీర్ కోసం పాకిస్తాన్‌తో జరిగిన చర్చల నేపథ్యంలో తప్పుకోవడం కేంద్ర ప్రభుత్వ వైఫల్యమేనన్నారు. కాశ్మీర్లో భాగమేనని పాకిస్తాన్ ముందుగానే చెప్పినప్పుడు అసలు చర్చల ప్రస్తావన ఎందుకు తీసుకొచ్చారని ప్రశ్నించారు. దేశంలో మార్కెట్ రంగానికి అనుగుణంగానే విద్యాకోర్సులు వస్తున్నాయి తప్ప విద్యార్థులకు అనుగుణంగా ఉండడం లేదన్నారు. నరేంద్రమోదీ ప్రధానిగా 24 దేశాలు పర్యటించినా దేశాభివృద్ధిపై మాత్రం చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. ఉల్లిధరల నియంత్రణలో విఫలమయ్యారని, సబ్సిడీలు తగ్గించి ధరలు పెంచారని మండిపడ్డారు. కేంద్రంతో పాటు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలు కూడా పారిశ్రామిక వేత్తలకు అనుకూలమైన విధానాలనే అవలంబిస్తున్నాయని విమర్శించారు. బడా పారిశ్రామిక వేత్తలకు ఎర్రతివాచీ పరుస్తున్నారని, వ్యవసాయ కూలీలు, రైతులు, కార్మికులపై మాత్రం వివక్ష చూపుతున్నారని అన్నారు. పేదరికంలో భారతదేశం ప్రపంచలోనే అగ్రస్థానంలో ఉందన్నారు. రాష్ర్టంలో టీఆర్ఎస్ అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నరలోపు విద్యుత్ ఉద్యోగులు, 108 ఉద్యోగులు, పారిశుధ్య కార్మికులు సమ్మె చేశారని, వారి సమస్యలు పట్టించుకోకపోవడం వల్లే నిరసనకు దిగారు తప్ప ప్రతిపక్షాల ప్రోత్సాహంతో కాదని స్పష్టం చేశారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం మాట్లాడుతూ తెలంగాణకు పట్టిన దెయ్యం కేసీఆర్ అని అన్నారు. ఆయనకు చిత్తశుద్ధి ఉంటే గోదావరిపై ప్రాజెక్టుల డిజైన్ల మార్పు అంశాన్ని చర్చించేందుకు అఖిలపక్ష సమావేశం నిర్వహించాలని, ఇంజనీర్లు, అఖిలపక్ష నాయకుల వాదనలను పరిగణనలోకి తీసుకోవాలని డిమాండ్ చేశారు. తుమ్మిడిహెట్టి వద్దనే ప్రాణాహిత-చేవెళ్ల ప్రాజెక్టు నిర్మిస్తే ప్రయోజనం ఉంటుందన్నారు. ఆరోగ్యం కోసం చీప్ లిక్కర్ అంటు ఓ మంత్రి వ్యాఖ్యలు చేయడం సిగ్గుచేటన్నారు. దళితులకు 10 లక్షల ఎకరాలు పంపిణీ చేస్తామన్న కేసీఆర్.. ఇప్పటికి 1,400 ఎకరాల భూమి మాత్రమే పంచారని ఎద్దేవా చేశారు. కేసీఆర్ ఏ మంత్రినీ, ఎమ్మెల్యేనూ పట్టించుకోవడం లేదని, కేవలం హరీశ్‌రావు, కేటీఆర్, ఎంపీ కవిత కోసమే పాటుపడుతున్నారని విమర్శించారు. తెలంగాణ పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం మాట్లాడుతూ.. అధికారంలోకి రాగానే లక్ష నాగళ్లతో రామోజీ ఫిల్మ్‌సిటీని దున్నిస్తామని ప్రకటించిన కేసీఆర్..ఆ పని ఎందుకు చేయడం లేదని ప్రశ్నిం చారు. ‘నీకు చేతకాకుంటే నిజామాబాద్ జిల్లా నుంచి లక్ష నాగుళ్లు, ఇక్కడి రైతుల ట్రాక్టర్లను తీసుకొని వస్తా.. భూములను దున్నుతావా’ అని సవాల్ విసిరారు. ఒక చేతిలో గ్రామజ్యో తి, మరో చేతిలో చీప్‌లిక్కర్‌తో చావు జ్యోతి వెలిగించేందుకు కేసీఆర్ సిద్ధమయ్యారన్నారు. -
వైఎస్ జగన్ దీక్షకు సీతారాం ఏచూరీ మద్ధతు!
-
ఆరడుగుల బుల్లెట్ ఎక్కడ దాక్కున్నాడు?
కాకినాడ : ఉద్యోగులపై దాడులు జరుగుతుంటే ఆరడుగుల బుల్లెట్ ఏపీ ఎన్జీవో అధ్యక్షుడు అశోక్ బాబు ఎక్కడ దాక్కున్నాడని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు ప్రశ్నించారు. ఏ ఒక్క పార్టీకి, ప్రభుత్వానికి అశోక్ బాబు వత్తాసు పలకడం సరైంది కాదని ఆయన శనివారమిక్కడ అన్నారు. తహసీల్దార్ వనజాక్షి ఇచ్చిన ఫిర్యాదుపై ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్‌ను తక్షణమే అరెస్ట్ చేయాలని మధు డిమాండ్ చేశారు. లేదంటే కృష్ణాజిల్లా ముసునూరులో ఉద్యమాన్ని ప్రారంభిస్తామని ఆయన హెచ్చరించారు. చింతమనేనికి ముఖ్యమంత్రి చంద్రబాబు వత్తాసు పలుకుతున్నారని మధు ఆరోపించారు. -
సీపీఎం ‘జన్ ఆందోళన్’
మోదీ సర్కారుకు వ్యతిరేకంగా ఆగస్టు నుంచి మార్చి వరకు చండీగఢ్: ప్రధాని నరేంద్ర మోదీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం అనుసరిస్తున్న విధానాలకు వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా పెద్ద ఎత్తున ‘జన్ ఆందోళన్’ పేరిట నిరసనలు చేపట్టనున్నట్లు సీపీఎం ప్రకటించింది. జన్ ఆందోళన్‌లో భాగంగా ఈ ఏడాది ఆగస్టు నుంచి వచ్చే ఏడాది మార్చి 23 వరకూ పార్టీ శ్రేణులుపలు కార్యక్రమాలను నిర్వహించనున్నట్లు శుక్రవారం చండీగఢ్‌లో సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి వెల్లడించారు. దివంగత వామపక్ష నేత హరికిషన్ సింగ్ సుర్జిత్ శత జయంతిని పురస్కరించుకుని జన్ ఆందోళన్‌ను తలపెట్టినట్లు ఆయన తెలిపారు. అమెరికా విధానాలను మోదీ సర్కారు గుడ్డిగా అనుసరిస్తోందని ఆరోపించారు. గత పార్లమెంట్ మావేశాల్లో 50 చట్టాలను స్థాయీ సంఘానికి సమర్పించకుండానే తెచ్చారని, ఇది దేశానికి ప్రమాదకరమన్నారు. 2013లో కాంగ్రెస్‌తో కలిసి భూసేకరణ చట్టాన్ని ఆమోదించిన బీజేపీ ఇప్పుడు సవరణలు ఎందుకు తేవాలనుకుంటోందో అర్థం కావడం లేదన్నారు. పారిశ్రామికవేత్తల కోసమే భూసేకరణ చట్టాన్ని కేంద్రం సవరిస్తోందన్నారు. సవరణ చట్టం ఆమోదం పొందితే.. జాతీయ, రాష్ట్ర రహదారులకు ఇరువైపులా కి.మీ. వరకూ భూమిని కేంద్రం సేకరిస్తుందని, ఇది దేశంలోని సాగుభూమిలో 39 శాతానికి పైగా ఉంటుందన్నారు. -
సీపీఎం సారథిగా ఏచూరి
లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం విశాఖలో ముగిసిన సీపీఎం జాతీయ మహాసభలు విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి: సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. దీంతో కొంతకాలంగా సీపీఎంలో సాగుతున్న ఉత్కంఠకు తెరపడింది. తొలుత ప్రధాన కార్యదర్శి పదవికి పోటీలో నిలిచిన కేరళ నేత రామచంద్రన్ పిళ్లై.. అనూహ్యంగా పోటీ నుంచి తప్పుకుంటున్నట్టు ప్రకటించడంతో ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. గత 6 రోజులుగా విశాఖలో జరుగుతున్న పార్టీ 21వ జాతీయ మహాసభల ముగింపు రోజైన ఆదివారం పార్టీ నూతన కార్యవర్గాన్ని.. ప్రధాన కార్యదర్శి పదవి నుంచి తప్పుకున్న ప్రకాశ్ కారత్ ప్రకటించారు. 91 మందితో నూతన కేంద్ర కమిటీ(సీసీ)ని, 16 మందితో పొలిట్‌బ్యూరో(పీబీ)ను మహాసభ ఎన్నుకున్నట్టు తెలిపారు. సీసీలో 17 మంది, పీబీలో నలుగురు కొత్తవారికి చోటు కల్పించారు. పొలిట్‌బ్యూరోలో ఏపీ, తెలంగాణల ప్రతినిధిగా బీవీ రాఘవులు కొనసాగుతారు. మరో ఐదుగురు శాశ్వత ఆహ్వానితులుగా ఉంటారు. సీనియర్ నేత సుకుమల్సేన్ పార్టీ కంట్రోల్ కమిషన్ చైర్మన్‌గా ఉంటారు. మైనారిటీలు, మహిళలకు కూడా.. పార్టీ నాయకత్వ స్థానాల్లోకి మహిళలను, మైనా రిటీలను, ఎస్సీ, ఎస్టీలను ప్రోత్సహించాలని తీర్మానించినప్పటికీ దళితవర్గాలకు పొలిట్‌బ్యూరోలో చోటు లభించలేదు. మైనారిటీలకు, ఓ మహిళకు మాత్రం స్థానం దక్కింది. కేంద్ర కమిటీలో కొంతమంది బీసీలకు చోటు కల్పించారు. వీరిలో తెలంగాణ నుంచి ఎన్నికయిన చెరుపల్లి సీతారాములు ఒకరు. ముగిసిన మహాసభలు ఆరు రోజులు, 12 సెషన్లు, 40 గంటల చర్చోపచర్చలు, 812 మంది ప్రతినిధులు, 26 తీర్మానాలు, కొత్త కార్యవర్గం ఎంపిక అనంతరం పార్టీ 21వ జాతీయ మహాసభలు ఆదివారమిక్కడ ముగిశాయి. పార్టీకి రాబోయే కాలంలో దిశానిర్దేశం కల్పించే రాజకీయ, ఎత్తుగడల పంథాను, వచ్చే మూడేళ్ల కాలానికి రాజకీయ విధానాన్నీ, పార్టీ సంస్థాగత వ్యవహారాల దిద్దుబాటుకు త్వరలో ప్రత్యేక ప్లీనంను నిర్వహించాలన్న కీలక నిర్ణయాలతో మహాసభలు ముగిసినట్టు రామచంద్రన్ పిళ్లై ప్రకటించారు. పొలిట్‌బ్యూరో సభ్యులు వీరే సీతారాం ఏచూరి(ప్రధాన కార్యదర్శి), ప్రకాశ్ కారత్, ఎస్.రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్(త్రిపుర సీఎం), పినరాయి విజయన్, బీవీ రాఘవులు, బృందా కారత్, కొడియేరి బాలకృష్ణన్, ఏంఏ బేబీ, సూర్యకాంత్ మిశ్రా, ఏకే పద్మనాభన్, హన్నన్ మొల్లా, మహమ్మద్ సలీం, సుభాషిణీ అలీ, జి.రామకృష్ణన్. కేంద్ర కమిటీ నుంచి తప్పించిన కురువృద్ధులు (వీరు ఆహ్వానితులుగా ఉంటారు) అచ్యుతానందన్ (కేరళ మాజీ సీఎం) బుద్ధదేవ్ భట్టాచార్య (బెంగాల్ మాజీ సీఎం) మల్లు స్వరాజ్యం (తెలంగాణ సాయుధ పోరాట యోధురాలు) మహమ్మద్ అమీన్ కేంద్ర కమిటీలో తెలుగువారు వీరే.. ఏపీ నుంచి: పెనుమల్లి మధు, పాటూరి రామయ్య, ఎంఎ గఫూర్, సుంకర పుణ్యవతి. తెలంగాణ నుంచి: తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య, చెరుపల్లి సీతారాములు. కేంద్ర కమిటీలో ఏపీ, తెలంగాణ రాష్ట్రాల ఉమ్మడి ప్రతినిధి: బీవీ రాఘవులు సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం: ‘ప్రజల జీవితాన్ని చిన్నాభిన్నం చేస్తున్న సరళీకరణ ఆర్థిక విధానాలు, దేశ సమగ్రతకు భంగకరంగా మారిన మతోన్మాద శక్తులకు వ్యతిరేకంగా పోరాడదాం. దీనికిగాను లౌకిక, ప్రజాస్వామ్య శక్తులను కూడగడదాం. నూతన భారతాన్ని నిర్మిద్దాం. అందుకోసం సీపీఎంను బలపరచండి’ అని సీపీఎం నూతన ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి పిలుపునిచ్చారు. ప్రధాని నరేంద్ర మోదీ మతోన్మాద, విధ్వంసకర రాజకీయాలను సీపీఎం ఎర్రజెండా అడ్డుకుని తీరుతుం దని ఉద్ఘాటించారు. ఈ మేరకు సీపీఎం 21వ జాతీయ మహాసభల ముగింపు సందర్భంగా విశాఖ ఆర్కేబీచ్ వద్ద నిర్వహించిన బహిరంగ సభలో ఏచూరి ప్రసంగించారు. చరిత్రాత్మక సీపీఎం మహాసభలతో విశాఖ తీరాన కొత్త ఉద్యమ స్ఫూర్తి ఉదయించిందని ఏచూరి చెప్పారు. ‘ఘర్‌వాపసీ’, ‘లవ్‌జీహాద్’, చర్చిలపై దాడులు తదితర ఆర్ఎస్ఎస్ ప్రేరేపిత రాజకీయాలతో దేశ సమగ్రతకు బీజేపీ ప్రభుత్వం విచ్ఛిన్నం కలిగిస్తోందని నిప్పులు చెరిగారు. రైతుల నుంచి భూములు బలవంతంగా గుంజుకుని.. కార్పొరేట్ పెద్దలకు కట్టబెట్టేందుకు మోదీ ప్రభుత్వం భూసేకరణ చట్టాన్ని నిర్వీర్యం చేయాలని కుట్ర పన్నిందన్నారు. ఫాన్స్ నుంచి రూ.8 వేల కోట్లతో యుద్ధ విమానాలు కొనుగోలు చేయాలన్న మోదీ నిర్ణయం విదేశీ కంపెనీలకే ప్రయోజనకరమని విమర్శించారు. ‘మేక్ ఇన్ ఇండియా’ స్థానంలో ‘మేక్ ఫర్ ఇండియా’ విధానం కావాలని ఏచూరి డిమాండ్ చేశారు. బడా కార్పొరేట్ సంస్థలకు పన్ను రాయితీలు ఇస్తున్న ప్రభుత్వం సామాన్యులపై పన్ను భారాలు మోపుతోందని ఆరోపించారు. మోదీ ప్రజావ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా సీపీఎం ఉద్యమపథం సాగుతుందని ఏచూరి స్పష్టం చేశారు. వచ్చే 6 మాసాల్లో ప్రత్యేక ప్రణాళిక ద్వారా ఎర్రజెండాకు పూర్వవైభవం తెస్తామన్నారు. ఉద్యమాలతో బుద్ధి చెబుదాం: కారత్, పొలిట్ బ్యూరో సభ్యుడు కేంద్రంలోని బీజేపీ, ఏపీలో టీడీపీ ప్రభుత్వాలు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై వామపక్ష, ప్రజాస్వామ్య శక్తులను కూడగట్టి ఉద్యమిద్దాం. తద్వారా ఆయా ప్రభుత్వాలకు బుద్ధి చెబుదాం. దీనికిగాను సీపీఎం తన బలాన్ని మరింత పటిష్టపరుచుకోనుంది. బహిరంగ సభలో త్రిపుర సీఎం మాణిక్ సర్కార్, పొలిట్‌బ్యూరో సభ్యులు బృందా కారత్, బీవీ రాఘవులు, సీిపీఎం ఏపీ కార్యదర్శి మధు ప్రసంగించారు. -
పార్టీ బలోపేతానికి మరింత కృషి చేస్తా: సీతారాం ఏచూరి
విశాఖపట్నం : కమ్యూనిస్టుల బలోపేతానికి మరింత కృషి చేస్తానని సీపీఎం ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి స్పష్టం చేశారు. పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఆయన ఏకగ్రీవంగా ఎన్నికైన తర్వాత ఆదివారం ఆయన విశాఖపట్నంలో మాట్లాడుతూ.. దేశవ్యాప్తంగా పార్టీలో నెలకొన్న సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తనపై ఉంచి బాధ్యతను సమర్థవంతంగా నిర్వహిస్తానన్నారు. అలాగే మోదీ ప్రభుత్వ హయాంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను సమర్థవంతంగా ఎత్తిచూపుతామని సీతారాం ఏచూరి తెలిపారు. -
సీపీఎం ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఎన్నిక
విశాఖపట్నం : సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శిగా సీతారాం ఏచూరి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఇప్పటి వరకు పోటీలో ఉన్న రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించుకుంటున్నట్లు ఆదివారం విశాఖపట్నంలో ప్రకటించారు. దీంతో సీతారాం ఏచూరి ఎన్నిక ఏకగ్రీవమైంది. విశాఖపట్నం వేదికగా సీపీఎం 21వ మహాసభలు ఈ నెల 14న ప్రారంభమైనాయి. ఆదివారం ఆ సమావేశాలు ముగియనున్నాయి. ఈ సందర్భంగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిని ఈ సమావేశాల్లోనే ఎన్నిక చేయవలసి ఉంది. ఈ పదవికి సీతారాం ఏచూరి, రామచంద్రన్ పిళ్లై పోటీలో నిలిచారు. అయితే పార్టీకి నూతన సారథిగా సీతారాం ఏచూరిని ఎంపిక చేయాలని పార్టీ నేతలంతా ఓ నిర్ణయానికి వచ్చారు. దీంతో రామచంద్రన్ పిళ్లై తన నామినేషన్ ఉపసంహరించుకోవాలని నిర్ణయించారు. దీంతో పార్టీ పగ్గాలు అందుకునేందుకు సీతారాం ఏచూరి ఎన్నిక లాంఛనప్రాయమైంది. సీతారాం ఏచూరి జాతీయ ప్రధాన కార్యదర్శిగా ఎన్నికైనట్లు ప్రకాశ్ కారత్ ప్రకటించారు. అలాగే 16 మందితో సీపీఎం పోలిట్ బ్యూరోను ఎంపిక చేశారు. పొలిట్ బ్యూరో సభ్యులుగా సీతారాం ఏచూరి, ప్రకాశ్ కారత్, రామచంద్రన్ పిళ్లై, బిమన్ బసు, మాణిక్ సర్కార్, విజయన్, బి వి రాఘవులు, బాలకృష్ణన్, ఎంఏ బేబి, సూర్యకాంత్ మిశ్రా, పద్మనాభన్, బృందాకారత్, మహ్మద్ సలీమ్, సుభాషిణి అలీ, హన్నర్ మొల్లా, జి.రామకృష్ణన్ ఎన్నికయ్యారు. అలాగే 91 మందితో కేంద్ర కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. వారిలో ఏపీ నుంచి బీ వి రాఘువులు, గఫూర్, పి. మధు, పుణ్యవతి, పాటూరి రామయ్య... తెలంగాణ నుంచి చెరుకుపల్లి సీతారాములు, వీరయ్య, తమ్మినేని వీరభద్రం ఎన్నికయ్యారు. అయితే ప్రత్యేక ఆహ్వానితులుగా మల్లు స్వరాజ్యంను ఎంపిక చేశారు. -
మూడోఫ్రంట్ ముగిసిన ముచ్చట
⇒ వామపక్ష సంఘటనే లక్ష్యం ⇒ సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ స్పష్టీకరణ (విశాఖపట్నం నుంచి సాక్షి ప్రత్యేక ప్రతినిధి): ఎన్నికలకోసం పార్టీలను ఏకం చేసే ప్రసక్తే లేదని సీపీఎం ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ స్పష్టం చేశారు. ఎన్నికల ఎత్తుగడలనేవి తాత్కాలికమేగానీ, వాటికోసమే ఏమైనా చేయాలనుకోవట్లేదని తేల్చిచెప్పారు. సమసమాజం, కమ్యూనిజమే అంతిమలక్ష్యంగా పనిచేస్తాం తప్ప స్వల్పకాలిక ప్రయోజనాలకోసం పాకులాడబోమన్నారు. పార్టీ 21వ జాతీయ మహాసభల సందర్భంగా బుధవారమిక్కడ ఏపీ రాష్ట్ర కార్యదర్శి పి.మధుతో కలసి ఆయన మీడియాతో మాట్లాడారు. మహాసభలో చేసిన రెండు తీర్మానాల్ని విడుదల చేశారు. భూసేకరణ చట్టసవరణ బిల్లును వ్యతిరేకిస్తూ దేశవ్యాప్తంగా పోరాటం చేయాలని మహాసభ పిలుపునిస్తూ తీర్మానం చేసింది. మరో తీర్మానంలో అంబేడ్కర్ 125వ జయంతి సందర్భంగా దేశంలోని షెడ్యూల్డ్ కులాల సమస్యలపై చర్చించేందుకు ప్రత్యేక పార్లమెంటు సమావేశాన్ని నిర్వహించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. మీడియా సమావేశంలో కారత్ చెప్పిన అంశాలివీ.. అది గతించిన గతం..: 1998 నుంచి 2008 వరకు మూడో ప్రత్యామ్నాయంకోసం ప్రయత్నించాం. అది సాధ్యం కాదని తేలిపోయింది. అది గతించిన గతం. ఇప్పుడు మాముందున్న తక్షణ కర్తవ్యం వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యత. పోరాటాలు, ఉద్యమాల ప్రాతిపదికన అది ఉంటుంది. గతంలోనూ వామపక్ష, ప్రజాతంత్ర శక్తుల ఐక్యసంఘటనకు పిలుపిచ్చాం. కొంతమేర కృషి జరిగింది. మధ్యలో అనేక అభిప్రాయాలొచ్చాయి. ఇప్పుడు సరిదిద్దుకుంటున్నాం. అందులో తప్పేముంది? వామపక్ష పార్టీల్లో మాది పెద్ద పార్టీ. అంతమాత్రాన మేము చెప్పిందే నడవాలనుకోవట్లేదు. అన్ని వామపక్షాలనూ సంప్రదించాకే భవిష్యత్ కార్యక్రమాన్ని రూపొందిస్తాం. ఇప్పుడున్న ఆరు పార్టీలనే కాదు మరికొన్ని పార్టీలనూ వామపక్ష ఫ్రంట్‌లోకి తేవాలనుకుంటున్నాం. అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం అంబేడ్కర్ ఇప్పుడెందుకు గుర్తుకొచ్చారనేది అప్రస్తుతం. ఏ పార్టీ ఒకే రీతిలో ఉండదు. మారుతూ ఉంటుంది. మేమూ అంతే. దళితులు, ఆదివాసీలు, బలహీన వర్గాల సమస్యలపై ప్రత్యేక దృష్టిపెట్టాం. దానిలో భాగంగా అంబేడ్కర్ 125వ జయంతి ఉత్సవాలను నిర్వహించాలనుకుంటున్నాం. మా పార్టీ కేంద్రకమిటీలో దళితులు లేరనడంలో నిజం లేదు. మా పొలిట్‌బ్యూరోలో దళితులు లేనిమాట నిజం. నేను కార్యదర్శిగా ఏమి చేశాననేది అప్రస్తుతం. వెనక్కు తిరిగి చూడాలనుకోవట్లేదు. -
ఈ పాపం కరెంటోళ్లదే..
♦ ఇళ్లపై నుంచి తీసిన తీగలు తెగిపడి ఇద్దరి మృత్యువాత ♦ కరీమాబాద్ ఎస్‌ఆర్‌ఆర్‌తోటలో ఘటన ♦ బోరున విలపించిన కుటుంబ సభ్యులు, బంధువులు ♦ కేసు నమోదు చేసిన పోలీసులు విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం దంపతులను బలిగొంది. ఇళ్ల మీది నుంచి వెళ్లిన 11కేవీ తీగలు వేలాడుతున్నాయని, వాటిని తీసేయమని చెప్పినా సిబ్బంది పట్టించుకోలేదు. ఈ క్రమంలో ఆదివారం గాలి దుమారానికి అవి తెగిపడడంతో దంపతులు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే తనువు చాలించారు. కరీమాబాద్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం ఇద్దరు దంపతులను బలిగొంది. ఇళ్ల మీది నుంచి వెళ్లిన 11కేవీ తీగలు తెగిపడడంతో విద్యుదాఘాతానికి గురై భార్యాభర్తలు మృత్యువాతపడిన సంఘటన నగరంలోని కరీమాబాద్ ఎస్ఆర్ఆర్ తోటలో ఆదివారం ఉదయం జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. కారు డ్రైవర్‌గా పనిచేస్తున్న అంకతి రమేష్(50), రాజమణి(45) దంపతులు కొన్నేళ్లుగా ఎస్ఆర్ఆర్ తోటలో నివాసముంటున్నారు. ఇదే కాలనీలో కరెంట్ సరఫరా కోసం ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు ఇళ్ల మీదుగానే వెళుతున్నారుు. అక్కడక్కడ ఆ తీగలు కిందికి వేలాడినట్లు ఉండడంతో కర్రల సాయంతో వాటిని పైకి లే పారు. అరుుతే ఆదివారం కురిసిన వర్షం, గాలి దుమారానికి రమేష్ ఇంటి మీద నుంచి వెళ్లిన విద్యుత్ తీగలు తెగి దుస్తులు ఆరేసే తీగకు ఆనుకున్నాయి. ఈ క్రమంలో ఉదయం 7 గంటల ప్రాంతంలో నిద్ర లేచిన రాజమణి దుస్తులు పిండి వాటిని తీగపై ఆరేస్తుండగా షాక్‌తగిలి విల విలలాడసాగింది. ఇది గమనించిన రమేష్ ఆమెను కాపాడేందుకు ప్రయత్నించగా అతడికి కూడా షాక్ తగిలి ఇద్దరూ అక్కడికక్కడే మృతిచెందారు. ఇది గమనించిన చుట్టుపక్కలవారు వెంటనే విద్యుత్ సిబ్బంది సమాచారమివ్వగా వారు వచ్చి విద్యుత్ సరఫరా నిలిపివేశారు. మిల్స్‌కాలనీ పోలీ సులు కేసు నమోదు చేసి, మృతదేహాలను ఎంజీఎం మార్చురీకి తరలించారు. ఇదిలా ఉండగా రమేష్, రాజమణి దంపతులకు పిల్లలు లేరని స్థానికులు చెప్పారు. ఒంటరిగా మిగిలిన మృతుడి తల్లి రమేష్ మృతితో అతడి తల్లి ఒంటరిగా మారింది. తనకు దిక్కెవరని బోరున విలపించింది. మృతుల దగ్గరి బంధువులు, స్థానికులు సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. తీగలు తొలగించాలని చెప్పాం : సజన్‌లాల్, స్థానికుడు ఇళ్ల మీద నుంచి వె ళుతూ ప్రమాదకరంగా మారిన విద్యుత్ తీగలు తొలగించాలని ఎన్నో ఏళ్లుగా సంబంధిత విద్యుత్ అధికారులకు చెప్పుకొస్తున్నాం. అరుు నా వారు నిర్లక్ష్యం చేశారు. ఇప్పుడు రెండు ప్రాణాలు పోయాయి. దీనికి విద్యుత్ అధికారులే బాధ్యులు. ఇప్పటికైనా పట్టించుకోవాలి : సువర్ణ, స్థానికురాలు మా కాలనీలో పది, పదిహేను ఇళ్ల మీద నుంచి కరెంట్ తీగలు పోయాయి. మాకు ప్రాణసంకటంగా ఉందని చెప్పినా ఎవరూ పట్టించుకోలేదు. ఇంకా కర్రలు పాతి ఇంటికి వైర్లు తగలకుండా చేసిన ఇళ్లున్నాయి. వాటికి కూడా ఏదైనా ప్రమాదం జరగొచ్చు. ఈ పాపం కరెంటోళ్లదే. ఇప్పటికైనా ఇళ్ల మీద ఉన్న తీగలు తీసేయాలి. సీపీఎం ఆధ్వర్యంలో ఆందోళన మృతుల కుటుంబానికి విద్యుత్ శాఖ నష్టపరిహారం చెల్లించాలని అండర్ రైల్వేగేటు సీపీఎం కార్యదర్శి మర్రి శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఈ మేరకు ఎస్‌ఆర్‌ఆర్‌తోట వాసులతో కలిసి కరీమాబాద్ విద్యుత్ సబ్‌స్టేషన్ ఎదుట ధర్నా నిర్వహించారు. కార్యక్రమంలో నాయకులు పల్లం రవి, ఆడెపు బిక్షపతి, రామస్వామి, బత్తిని సతీష్, భాస్కర్, లక్ష్మన్, జానకి, వనజ, సరస్వతి పాల్గొన్నారు. -
బాబు-మోదీల మధ్య లాలూచీ బయటపెట్టాలి
సీపీఎం కేంద్ర కమిటీ నేత శ్రీనివాసరావు డిమాండ్ ఒంగోలు టౌన్ : ‘రాష్ట్ర విభజన నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం ప్రత్యేక హోదా ప్రకటించలేదు. ఇటీవల ప్రకటించిన ఆర్థిక, రైల్వే బడ్జెట్లలో రాష్ట్రానికి తీవ్ర అన్యాయం జరిగింది. దీనిపై మంత్రులు, ప్రజాప్రతినిధులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. అయినప్పటికీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సంయమనం పాటిం చాలంటూ మభ్యపెడుతున్నారు. రాష్ట్రానికి అన్యాయం జరుగుతున్నా నోరు మెదపడం లేదు. చంద్రబాబునాయుడు-నరేంద్రమోదీల మధ్య ఏదో లాలూచీ ఉంది. అదేంటో వెంటనే బయటపెట్టాలి’ అని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి.శ్రీనివాసరావు డిమాండ్ చేశారు. విశాఖపట్నంలో ఏప్రిల్ 14 నుంచి 19వ తేదీ వరకు జరగనున్న సీపీఎం అఖిల భారత మహాసభలను పురస్కరించుకుని జిల్లా శాఖ ఆధ్వర్యంలో చేపట్టిన ఇంటింటికీ సీపీఎం కార్యక్రమంలో గురువారం ఆయన పాల్గొన్నారు. అనంతరం స్థానిక సుందరయ్య భవన్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ‘రాష్ట్రంపై కేంద్ర ప్రభుత్వం చిన్నచూపు చూస్తూ బాధ్యతారాహిత్యంగా వ్యవహరి స్తోంది. రాష్ట్రానికి రూ.15 వేల కోట్ల లోటు బడ్జెట్ ఉంటే కేవలం రూ.5 వేల కోట్లు మాత్రమే కేటాయించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు మాత్రం కేంద్రంలో చేరిన తరువాత నిధులన్నీ మనకే వస్తాయంటూ ప్రజలు, ప్రజాప్రతినిధులను మభ్యపెడుతున్నారు’ అని విమర్శించారు. విలేకరుల సమావేశంలో సీపీఎం రాష్ట్ర నాయకుడు అంజయ్య, జిల్లా కార్యదర్శి ఆంజనేయులు, నగర కార్యదర్శి జీవీ కొండారెడ్డి పాల్గొన్నారు. బీజేపీ హనీమూన్ పిరియడ్ ముగిసింది ‘కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వ హనీమూన్ పిరియడ్ ముగిసింది. ఇక ముళ్ల కిరీటం పెట్టుకుని ప్రజల్లోకి వెళ్లాల్సిన తరుణం ఆసన్నమైంది’ అని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గసభ్యుడు వి.శ్రీనివాసరావు వ్యాఖ్యానించారు. ఇటీవల జరిగిన ఢిల్లీ ఎన్నికల్లో నరేంద్రమోదీ రెండు చెంపలు వాచిపోయేలా ప్రజలు తీర్పునిచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. రానున్న రోజుల్లో అంత సానుకూల పరిస్థితులు ఉండవన్నారు. వెంకయ్యనాయుడు తెలివి తక్కువ దద్దమ్మ... కేంద్ర మంత్రి వెంకయ్యనాయుడు తెలివి తక్కువ దద్దమ్మ అని శ్రీనివాసరావు విమర్శించారు. రాష్ట్ర విభజన నేపథ్యంలో అప్పటి ప్రధానమంత్రి మన్మోహన్సింగ్ ఐదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామని ప్రకటిస్తే, వెంకయ్యనాయుడు పదేళ్లపాటు ప్రత్యేక హోదా ఇస్తామంటూ ఫుల్‌పేజీ ప్రకటనలు ఇచ్చారని, ఇప్పుడేమో ఐదేళ్ల ప్రత్యేక హోదా గురించి మాట్లాడకుండా దాటవేస్తూ అసలుకే మోసం వచ్చేలా చేస్తున్నారన్నారు. -
ఆ బిల్లును అందరూ వ్యతిరేకిస్తున్నారు
భూ సేకరణ చట్ట సవరణ బిల్లుపై సీపీఎం ప్రధాన కార్యదర్శి కారత్ - బిల్లుకు రాజ్యసభలో ఆమోదం కష్టమే - కేంద్రం ఇప్పటికే పునరాలోచనలో పడింది - ‘సాక్షి’ ప్రత్యేక ఇంటర్వ్యూలో కారత్ సాక్షి, హైదరాబాద్: రాజ్యసభలో భూ సేకరణ చట్ట సవరణ బిల్లు ఆమోదం పొందే ప్రసక్తే లేదని సీపీఎం జాతీయ ప్రధాన కార్యదర్శి ప్రకాశ్ కారత్ పేర్కొన్నారు. లోక్‌సభ, రాజ్యసభల్లో వామపక్షాల బలం తక్కువగానే ఉన్నా, యావత్ ప్రతిపక్షం ఈ బిల్లును వ్యతిరేకిస్తున్నందున అది ఆమోదం పొందే అవకాశం లేదని చెప్పారు. సీపీఎం తొలి తెలంగాణ రాష్ట్ర మహాసభ ల్లో పాల్గొనేందుకు ఇక్కడకు వచ్చిన ఆయన ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వ్యూ ఇచ్చారు. రాజ్యసభలో ఎన్డీఏ కు తగిన బలం లేకపోయినా, ఉభయసభల సమావేశాన్ని పెట్టి ఆ బిల్లును ఆమోదింప చేసుకుంటామని బీజేపీ చెబుతోంది కదా అన్న ప్రశ్నకు.. లోక్‌సభలో లేదా రాజ్యసభలో బిల్లు తిరస్కరణకు గురైనపుడే ఉమ్మడి సమావేశాన్ని పెట్టాల్సి ఉంటుందన్నారు. ఎలాగైనా సరే ఈ బిల్లును ఆమోదింపచేసుకుంటామని ప్రధాని మోదీ చెబుతున్నారు కదా అన్న ప్రశ్నకు, కేంద్రం ఇప్పటికే ఈ విషయంలో పునరాలోచనలో పడిందన్నారు. ఈ బిల్లు రాజ్యసభకు వస్తుందా లేదా అన్నది అనుమానంగానే ఉందన్నారు. ఆయా అంశాలపై ఆయన ఇచ్చిన ఇంటర్వ్యూలోని ముఖ్యాంశాలు.. సాక్షి: రైల్వే, సాధారణ బడ్జెట్లపై లెఫ్ట్ ఏవైనా ఆందోళనలు చేపడుతుందా? కారత్: కేంద్ర ప్రభుత్వ విధానాల్లో భాగంగా కార్పొరేట్ రంగానికి అనుకూలంగా బడ్జెట్లలో ఆయా ప్రతిపాదనలు చేశారు. ఇందుకు సంబంధించి ఆయా వర్గాల ప్రజల్లో వ్యక్తమయ్యే ఆందోళన, అసంతృప్తిని కూడా పరిగణలోకి తీసుకోవాల్సి ఉంటుంది. సీపీఎం, సీపీఐ జాతీయ మహాసభలు ముగిసిన తర్వాత కార్యాచరణను రూపొందించుకుంటాం. కాంగ్రెస్, ఇతర పార్టీలతో కలసి ఆందోళనలు చేసే అవకాశముందా? ఇకముందు కాంగ్రెస్, ఇతర బూర్జువాపార్టీలతో కలసి ఆందోళనలు, నిరసనల్లో పాల్గొనే అవకాశాలు లేవు. వామపక్షాల కార్యక్రమాలు ఎలా ఉండబోతున్నాయి? సీపీఐ, సీపీఎం జాతీయ మహాసభలు ముగిశాక, ఆయా అంశాలపై చర్చించుకుని, కార్యక్రమాలను రూపొందించుకుంటాం. ఇప్పటికే ఆరు వామపక్షాలు కలసి పనిచేస్తున్నాయి. ముందుగా వామపక్షాల మధ్య ఐక్యత సాధిం చేందుకు కృషి చేస్తూనే, ప్రజలు ఎదుర్కొం టున్న సమస్యలపై ప్రజాస్వామ్యశక్తులతో కలసి ఆందోళనలను తీవ్రతరం చేయాలనే ఆలోచనతో ఉన్నాము. దేశంలో వ్యవసాయ సంక్షోభం, కేంద్ర ప్రభుత్వ విధానాలపై ఏ విధమైన వైఖరిని తీసుకుంటారు? వ్యవసాయరంగానికి సంబంధించి దేశవ్యాప్తంగా ఒకేవిధమైన పరిస్థితులు, సమస్యలు లేవు. తెలంగాణలో ఒకవిధంగా, మరో రాష్ర్టంలో మరో విధంగా పంటలతీరు, వాతావరణ పరిస్థితులున్నాయి. అయితే భూసంస్కరణల అంశం అందరికీ సంబంధించిన విషయం కాబట్టి దానిపై కార్యాచరణను చేపడుతున్నాం. భూసంస్కరణ చట్టానికి సవరణలు, బీమారంగంలో ఎఫ్‌డీఐల కోసం జరుగుతున్న ప్రయత్నాలను అడ్డుకుంటాం. కేరళ మాజీ సీఎం అచ్యుతానందన్‌ను సస్పెండ్ చేస్తారా? ఆ అవసరమే లేదు. పార్టీలో అచ్యుతానందన్ ఒంటరి అయ్యారు. ఆయన ఒక వ్యక్తి మాత్రమే. కేరళలో మొదటిసారిగా 20 ఏళ్లలో పార్టీలో రాజకీయంగా, సంస్థాగతంగా ఐక్యత కనిపించింది. క్రమశిక్షణకు కట్టుబడితే మాజీ సీఎం అచ్యుతానందన్ మళ్లీ పార్టీలోకి రావొచ్చు. ప్రస్తుతం ఆయన స్థానాన్ని ఖాళీగానే ఉంచాం. -
అమరుల ఆశయాలు సాధిద్దాం
సీపీఎం తెలంగాణ తొలి మహాసభలు ప్రారంభం సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రైతాంగ సాయుధ పోరాట స్ఫూర్తిని జ్ఞప్తికి తెచ్చుకుంటూ, ప్రజా పోరాటాలకు వేదికగా నిలిచిన గడ్డమీద అమరవీరుల ఆశయాలను సాధిస్తాం, ఎర్రజెండా వర్ధిల్లాలి, మార్క్సిజం, లెనినిజం వర్ధిల్లాలి అనే నినాదాల మధ్య నాటి పోరాట యోధురాలు మల్లు స్వరాజ్యం పార్టీ జెండాను ఎగురవేసి సీపీఎం తెలంగాణ తొలిమహా సభలను ప్రారంభించారు. ఈ పోరాటంలో ఎంతో స్ఫూర్తిని రగిలించి, ఆదర్శంగా నిలిచిన వీరభైరాన్‌పల్లి గాథను గుర్తుకు తెచ్చేలా రూపొందించిన మహాసభల స్వాగతద్వారం పార్టీ కార్యకర్తలు, అభిమానులను ఎంతగానో ఆకట్టుకుంది. మహాసభల ప్రాంగణంలోని అమరవీరుల స్తూపం వద్ద సీపీఎం జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్, పార్టీనాయకులు బీవీ రాఘవులు, వి.శ్రీనివాసరావు, తమ్మినేని వీరభద్రం, ఎస్.వీరయ్య తదితర నాయకులు, కార్యకర్తలు ఉత్తేజభరితమైన వాతావరణంలో ఘనంగా నివాళులర్పించారు. ఆదివారం ఆర్టీసీ కల్యాణ మండపంలోని మహాసభల ప్రాంగణంలో తెలంగాణలో జరిగిన వివిధపోరాటాలు, రజాకార్లు, నిజాం పోలీసుల వ్యతిరేక పోరాటం, పేదలు, మహిళలు సాగించిన ఉద్యమాలను ఎత్తిచూపేలా చిత్రాలను ఏర్పాటు చేశారు. రాష్ర్ట మహాసభల వేదికపై ఒకవైపు పార్టీ చిహ్నం, ఇతరసందేశాలతో‘‘సంక్షేమం, సామాజికన్యాయం, సమగ్రాభివృద్ధి, వామపక్షాల ఐక్యత’’ అనే ఫ్లెక్సీ , మరోవైపు బంజారా మహిళలు, కొమ్ము, బూరా వాయిద్యాలు, నృత్యాలతో ఏర్పాటుచేసిన ఇంకొక ఫ్లెక్సీ అందరినీ ఆకట్టుకున్నాయి. బూర్జువా ప్రభుత్వమిది: కారత్ ధ్వజం పార్టీ జాతీయ ప్రధానకార్యదర్శి ప్రకాశ్ కారత్ ఈ మహాసభల ప్రారంభోపన్యాసం చేస్తూ దేశంలో బీజేపీ ప్రభుత్వం పేరుకే అధికారంలో ఉందని, అసలు నడుస్తున్నది బూర్జువా, కార్పొరేట్, ఆరెస్సెస్, హిందుత్వశక్తుల ప్రభుత్వమని ధ్వజమెత్తారు. కార్పొరేట్ అనుకూల, హిందుత్వభావజాల వ్యాప్తి, మతోన్మాద ఎజెండాను అమలుచేస్తూ ప్రధాని మోదీ పాలన సాగుతోందన్నారు. గత 9 నెలల పాలనలో ఇదే సుస్పష్టమైందన్నారు. బీజేపీ అధికారంలో ఉండడంతో హిందుత్వ అనుకూల విధానాలను ప్రజలపై రుద్దడానికి ఆరెస్సెస్ ప్రయత్నిస్తోందన్నారు. ప్రజల భావప్రకటనాస్వేచ్ఛపై, కళాకారులపై హిందూమతోన్మాద వాదులు దాడులకు పాల్పడుతున్నారన్నారు. సరళీకరణ విధానాలతోపాటుగా మతోన్మాదశక్తులకు వ్యతిరేకంగా నడుంబిగించాల్సిన అవసరం ఉందని ఆయన పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. పొరుగుదేశం చైనాను దూరంగా పెట్టి, అమెరికాతో మోదీ జతకట్టారని, ఆదేశంతో బంధాన్ని బలోపేతం చేసుకుంటూ సామ్రాజ్యవాదశక్తులకు దాసోహం అవుతున్నారని అన్నారు. పార్లమెంట్‌ను కూడా కాదని భూసంస్కరణలు, ప్రైవేట్ శక్తులను బొగ్గురంగంలోకి దింపేందుకు ఆర్డినెన్స్‌ల ద్వారా సవరణలు తెచ్చే ప్రయత్నం ఎన్డీఏ ప్రభుత్వ స్వభావాన్ని స్పష్టంచేస్తోందన్నారు. వామపక్ష, ప్రజాతంత్రశక్తులు ఐక్యసంఘటనగా ఏర్పడాలి... దేశ, రాష్ట్రస్థాయిల్లో వామపక్షాలు బలపడాలని, దాంతోపాటు ప్రజాతంత్రశక్తులు, అణగారిన వర్గాలు, ప్రజాసంఘాలు బలపడి, విశాలప్రాతిపదికగా ఐక్యసంఘటనగా ఏర్పడడం నేటి అవసరమని కారత్ పిలుపునిచ్చారు. ఈ శక్తులు సంప్రదాయ రాజకీయ, బూర్జువా పార్టీలకు ప్రత్యామ్నాయంగా ఏర్పడాల్సి ఉందన్నారు. ఈ దిశలో రాష్ట్రమహాసభలు, విశాఖలో జరగనున్న పార్టీ జాతీయమహాసభలు దోహదంచేస్తాయన్నారు. కేంద్ర, రాష్ర్ట ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాలపై తెలంగాణలో 10 వామపక్షాలు కలసి ఉద్యమించడం హర్షణీయమన్నారు. ప్రభుత్వ వ్యతిరేక ఉద్యమాల్లో కార్మికులు, రైతులు, మహిళలు, అణగారిన వర్గాలు, గ్రామీణపేదలను కలుపుకుని ముందుకు పోవాలన్నారు. తెలంగాణలో సాగిన కమ్యూనిస్టు ఉద్యమం ఎంతో ఉత్తేజవంతమైనదని, దాని నుంచి స్ఫూర్తిని పొంది వామపక్ష, ప్రజాతంత్రశక్తులతో ప్రత్యామ్నాయం కోసం కృషిచేయాలని ప్రకాశ్ కారత్ పిలుపునిచ్చారు. -
సంక్షేమాన్ని విస్మరించిన ప్రభుత్వాలు
సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాస రావు నూనెపల్లె: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ప్రజా సంక్షేమాన్ని విస్మరించాయని సీపీఎం కేంద్ర కార్యదర్శివర్గ సభ్యుడు శ్రీనివాసరావు ఆరోపించారు. సీపీఎం 20వ జిల్లా మహాసభల ముగింపు సందర్భంగా శుక్రవారం సాయంత్రం పట్టణంలోని మున్సిపల్ టౌన్హాల్లో భారీ బహిరంగ సభను నిర్వహించారు. సభలో శ్రీనివాసరావు మాట్లాడతూ.. ప్రధాని మోడీ విదేశీ పెట్టుబడులతో కార్పొరేట్ సంస్థలకు ఆహ్వానించాలని చూడడం సరికాదన్నారు. ఎఫ్‌డీఐలతో దేశంతో 40వేల మంది చిల్లర వ్యాపారులు రోడ్డున పడతారన్నారు. విదేశాల సొమ్ముకు సీఎం చంద్రబాబు నాయుడు కక్కుర్తి పడుతున్నారని, ఇందుకు దావోస్‌లో జరిగిన దేశాల ఆర్థిక సమావేశానికి వెళ్లడమే ఉదాహరణగా చెప్పారు. వాల్‌మార్ట్ సంస్థకు వ్యాపారాలు చేయాలని బాబు చెబుతున్నారని, దీంతో చిన్న సన్నకారు రైతులు పంటలు సాగు మానుకోవాల్సిందేనన్నారు. సీపీఎం కేంద్ర కమిటీ సభ్యుడు ఎం.ఎ.గఫూర్ మాట్లాడుతూ..రాష్ట్ర విభజనకు బీజేపీ, టీడీపీ మద్దతిచ్చాయన్నారు. విభజన రాష్ట్రాలకు అప్పట్లో ప్యాకేజీలు ఇస్తామని నాయకులు చెప్పిన మాటలు మరిచారన్నారు. రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించాలని కోరారు. అనంతపురం, కర్నూలు జిల్లాలను కరువు ప్రాంతాలుగా ప్రకటించాలని రాష్ట్ర కమిటీ సభ్యుడు షడ్రక్ డిమాండ్ చేశారు. సీమ సమగ్రాభివృద్ధికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిధులు ఇవ్వాలని కోరారు. కార్యక్రమంలో సీపీఎం రాష్ట్ర కమిటీ సభ్యులు రామాంజనేయులు, రామకృష్ణ, జిల్లా కార్యదర్శి ప్రభాకర్ రెడ్డి, నాయకులు శంకరయ్య, మస్తాన్‌వలి, మద్దులు తదితరులు పాల్గొన్నారు. -
వారే మనకు మిత్రులు
* జాతీయ స్థాయిలో బూర్జువా పార్టీలతో పొత్తులు ఉండవు * ముగిసిన సీపీఎం కేంద్ర కమిటీ సమావేశాలు * ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యతిరేకించే పార్టీలతోనే జట్టు కట్టాలని సీపీఎం నాయకత్వం నిర్ణయం సాక్షి, హైదరాబాద్: జాతీయ, రాష్ట్ర స్థాయిల్లో ఉదారవాద ఆర్థిక విధానాలను వ్యతిరేకించే రాజకీయపార్టీలనే మిత్రులుగా చూడాలని సీపీఎం నాయకత్వం నిర్ణయించింది. భవిష్యత్‌లో రాజకీయపొత్తులు, కూటమి వంటి వాటికి కూడా ఇదే భూమిక కావాలని తీర్మానించింది. వచ్చే మూడేళ్లలో అనుసరించాల్సిన రాజకీయ విధానాలకు సంబంధించిన తీర్మానాన్ని బుధవారం ఇక్కడ ముగిసిన సీపీఎం కేంద్రకమిటీ సమావేశం ఆమోదించింది. అంతకు ముందు ఈ తీర్మానంపై పార్టీ పొలిట్‌బ్యూరో సమావేశంలో చర్చించారు. దళిత, గిరిజన, మహిళా, మైనారిటీల సమస్యలపై పోరాడే ఇతర వామపక్షాలు, సంఘాలు ప్రగతిశీల శక్తులతో కలసి ముందుకు సాగాలని తీర్మానించింది. జాతీయస్థాయిలో ఇకపై కాంగ్రెస్, ఇతర బూర్జువాపార్టీలతో ఎలాంటి పొత్తులు కుదుర్చుకోరాదని, వామపక్ష. ప్రజాతంత్ర కూటమి కోసం కృషిచేయాలని నిర్ణయించింది. రాష్ర్టస్థాయిల్లో మాత్రం అక్కడి పరిస్థితులకు అనుగుణంగా రాజకీయపొత్తులు కుదుర్చుకునే అవకాశాన్ని తొలుత కల్పించినా ఇక్కడ కూడా ఉదారవాద ఆర్థికవిధానాలను వ్యతిరేకించే ప్రాంతీయ పార్టీలతోనే పొత్తు కుదుర్చుకోవాలని ఈ భేటీలో నిర్ణయించారు. దళితులు, గిరిజనులు, మహిళలు, మైనారిటీల సమస్యలపై వివిధరూపాల్లో కార్యక్రమాలను చేపట్టడం ద్వారా ఆ వర్గాలకు దగ్గర కావాలని నిర్ణయించింది. కాంగ్రెస్, టీడీపీ, టీఆర్ఎస్ వంటి బూర్జువాపార్టీల నుంచి బయటకు వచ్చి వ్యక్తులు సరళీకృత ఆర్థిక విధానాలను వ్యతిరేకించిన పక్ష ంలో వారితో కలిసి పనిచేసేందుకు అభ్యంతరం లేదని స్పష్టంచేసింది. మూడురోజుల పాటు జరిగిన కేంద్రకమిటీ సమావేశాల్లో పలు తీర్మానాలను ఆమోదించారు. నష్టమే ఎక్కువ జరిగింది! గత పాతికేళ్లలో అనుసరించిన రాజకీయ విధానాల వల్ల పార్టీకి నష్టమే అధికంగా జరిగిందని కేంద్ర కమిటీ అభిప్రాయపడింది. ఈ విధానాల వల్ల అక్కడక్కడ ప్రయోజనం కలిగి, ఏదోకొంతమేర ప్రజలకు ఉపశమనం లభించినా పార్టీకి రాజకీయంగా నష్టమే జరిగిందని కేంద్ర కమిటీ భావిస్తోంది. చర్చ సందర్భంగా తప్పొప్పులను సమీక్షించింది. ఉదారవాద ఆర్థిక విధానాలను సమర్థించే కాంగ్రెస్ వంటి బూర్జువాపార్టీతో పొత్తు, ఇటువంటి ఇతర పార్టీలతో కలసి ఐక్యకూటమిలో భాగస్వాములు కావడం వల్ల ప్రజల్లో కమ్యూనిస్టుపార్టీల పట్ల నమ్మకం సన్నగిల్లిందనే అభిప్రాయానికి పార్టీ వచ్చింది. ఈ నేపథ్యంలోనే వామపక్ష, ప్రజాతంత్ర శక్తులు, ప్రజల పక్షాన నిలబడి పనిచేస్తున్న వ్యక్తులు, సంస్థలతో కలసి పనిచేయాలనే కొత్తవిధానాన్ని ఈ భేటీ ఆమోదించింది. జాతీయస్థాయిలో 7 వామపక్షాలు కలసి పనిచేస్తున్నవిధంగానే, వివిధ రాష్ట్రాల్లో వామపక్ష ఐక్యతకోసం కృషి చేయాలని నిర్ధేశించింది. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో 11 వామపక్షపార్టీలు కలసి సమన్వయంతో ముందుకు సాగడాన్ని కేంద్రకమిటీ అభినందించింది. దీనిని మరింత విస్తృత పరచి ప్రజాసంఘాలు, సంస్థలు, మేధావులతో కలసి వామపక్ష,ప్రజాతంత్ర ఐక్యవేదిక ఏర్పాటు కోసం కృషి చేయాలని తీర్మానించింది. కేంద్రంలో మోదీ ప్రభుత్వం నియంతృత్వ ధోరణితో పనిచేస్తోందని మండిపడింది. సంఘ్‌పరివార్ శక్తుల ప్రభావం పెరగడంపై సీపీఎం ఆందోళన వ్యక్తంచేసింది. జాతీయస్థాయిలో దీనిపై కలిసొచ్చే పార్టీలు, సంఘాలతో కలసి పోరాడాలని నిర్ణయించింది. -
‘ఆ రచయితను మరణించనివ్వం’
సాక్షి, హైదరాబాద్: ‘రచయితగా మరణించాను’ అని ప్రకటించిన ప్రముఖ తమిళ రచయిత పెరుమాళ్ మురుగన్‌కు సీపీఎం కేంద్ర కమిటీ అండగా నిలిచింది. ఆయన్ని రచయితగా బతికించుకుంటామని ప్రకటించింది. పార్టీ కేంద్ర కమిటీ సమావేశంలో ఈ మేరకు ఓ తీర్మానాన్ని ఏకగ్రీవంగా ఆమోదించింది. ఈ సందర్భంగా తమిళనాడుకు చెందిన పార్టీ కేంద్ర కమిటీ సభ్యురాలు, రచయిత వాసుకీ ‘సాక్షి’ ప్రతినిధితో మాట్లాడారు. ఆ రచయితను మరణించనివ్వం అని చెప్పారు. మురుగన్ తన నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా చూస్తామని, ఆయన కలం నుంచి మరిన్ని చైతన్యవంతమైన రచనలు వెలువడేలా సీపీఎం పోరాడుతుందని వాసుకీ తెలిపారు. -
'చంద్రబాబు చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత'
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజధాని కమిటీలో రెవెన్యు మంత్రికి చోటు కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజధాని నిర్మాణంపై ఏకపక్ష నిర్ణయం తగదన్నారు. గుంటూరు జిల్లా నిడమర్రులో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రామకృష్ణతో పాటు సీపీఎం కార్యదర్శి మధు పాల్గొన్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మధు ఆరోపించారు. రైతులు, కౌలు రైతులు, కూలీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు. -
రాజధాని ప్రకటనపై అనుమానాలు
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు విజయవాడను తాత్కాలిక రాజధానిగా ఎందుకు ప్రకటించారని , ఆ ప్రకటనపై పలు అనుమానాలు రేకెత్తుతున్నాయని సీపీఎం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కార్యదర్శి పెనుమల్లి మధు అన్నారు. రాయలసీమకు, ఉత్తరాంధ్రకు ఏం ఇస్తారనే విషయాన్ని చెప్పకుండానే రాజధాని గురించి ప్రకటన చేయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయన్నారు. రుణమాఫీపై చంద్రబాబు ఎందుకు జారుకుంటున్నారని మధు ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ ఇప్పటికే రుణమాఫీకి సంబంధించిన ఉత్తర్వులపై సంతకాలు చేసేశారు. అయితే ఆంధ్రప్రదేశ్‌లో మాత్రం రుణమాఫీ చేయలేని ప్రభుత్వం.. ఇప్పుడు వ్యవసాయానికి ప్రత్యేక బడ్జెట్ అంటూ రైతులను మోసం చేస్తోందని మధు అన్నారు.