'దళితులకు రక్షణ కరువైంది' | CPM Madhu slams tdp government | Sakshi
Sakshi News home page

'దళితులకు రక్షణ కరువైంది'

Published Thu, Jul 13 2017 11:54 AM | Last Updated on Mon, Aug 13 2018 9:04 PM

CPM Madhu slams tdp government

విజయవాడ: టీడీపీ ప్రభుత్వం అక్రమ నిర్బంధానికి పాల్పడటం సిగ్గుచేటని గరికపర్రు గ్రామస్థులు ర్యాలీగా వస్తుంటే లాఠీచార్జి చేయడం దుర్మార్గమని సీపీఎం ఏపీ కార్యదర్శి పి. మధు అన్నారు. ఆయన ఈ రోజు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ.. రాష్ట్రంలో దళితులకు రక్షణ లేకుండా పోయింది.
 
చిత్తూరులో జరిగే ఉత్సవాల్లో దళితులను పాల్గొననీయకపోవడం ఆక్షేపణీయం. ముఖ్యమంత్రి జోక్యం చేసుకొని గరికపర్రులో దళితుల మీద అమలవుతున్న సోషల్‌ బాయ్‌కాట్‌ ఎత్తివేయాలి లేకుంటే అన్ని పార్టీలను కలుపుకొని ఈ నెల 28న చలో గరికపర్రు చేపడతామని అన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement