
సాక్షి, తిరుపతి: ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పచ్చి అవకాశవాదని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి మధు విమర్శించారు. ఆయనిక్కడ శుక్రవారం మాట్లాడుతూ.. విభజన చట్టంలోని హామీలను నెరవేర్చడంలో చంద్రబాబు విఫలయ్యారన్నారు.
ప్రజల దృష్టి మరల్చడానికే సుప్రీం కోర్టు వెళ్తానంటున్నారన్నారు. మరోవైపు జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్‌కు స్థిరత్వం లేదన్నారు. టీడీపీ, టీఆర్‌ఎస్‌ల పట్ల పవన్ వైఖరి ఏంటో వెల్లడించాలన్నారు.