మధు, రామకృష్ణ(ఫైల్)
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు తన చుట్టూ ఉన్న కోటరీకే ప్రాధాన్యత ఇస్తున్నారని సీపీఐ కార్యదర్శి రామకృష్ణ ఆరోపించారు. రాజధాని కమిటీలో రెవెన్యు మంత్రికి చోటు కల్పించకపోవడాన్ని ఆయన తప్పుబట్టారు. రాజధాని నిర్మాణంపై ఏకపక్ష నిర్ణయం తగదన్నారు.
గుంటూరు జిల్లా నిడమర్రులో వామపక్షాల ఆధ్వర్యంలో నిర్వహించిన సదస్సులో రామకృష్ణతో పాటు సీపీఎం కార్యదర్శి మధు పాల్గొన్నారు. రాజధాని పేరుతో టీడీపీ నేతలు రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తూ కోట్ల రూపాయలు దండుకుంటున్నారని మధు ఆరోపించారు. రైతులు, కౌలు రైతులు, కూలీలకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తామని చెప్పారు.