నారాయణ సహా వామపక్ష నేతల అరెస్ట్
అనంతపురం: కరువుతో సతమతమవుతున్న రైతులను ఆదుకోవాలంటూ అనంతపురం కలెక‍్టర్ కార్యాలయం వద‍్ద ధర్నా చేస్తున‍్న వామపక్షాల నేతలను బుధవారం మధ్యాహ‍్నం పోలీసులు అరెస్టు చేశారు. రాయలసీమ కరువు సమస‍్యల పరిష్కారానికి వామపక్షాలు 48 గంటల ఆందోళనకు పిలుపు ఇచ్చిన విషయం విదితమే. ఈ ఆందోళనలో భాగంగా బుధవారం సీపీఐ నేతలు నారాయణ, రామకృష‍్ణ, సీపీఎం ఏపీ కార‍్యదర్శి మధు తదితరులు పాల‍్గొన్నారు.
వామపక్ష నేతలు కలెక‍్టరేట్ ముట‍్టడికి ప్రయత్నించడంతో అక్కడ భారీ ఎత్తున పోలీసులు బలగాలను మోహరించారు. కలెక‍్టరేట్‌లోకి చొచ్చుకుపోతున‍్న వామపక్షాల నేతలు నారాయణ, రామకృష‍్ణ, మధు సహా వందలాది మంది కార్యాకర‍్తలను అదుపులో తీసుకున్నారు. కలెక్టరేట్ ముట్టడికి యత్నించిన నేతలను అరెస్ట్ చేసే క్రమంలో అక్కడ ఉద్రిక‍్త వాతావరణం నెలకొంది.