సాక్షి, విజయవాడ: ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేతపై సీపీఐ రాష్ట్ర కార్యదర్శి రామకృష్ణ ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన శనివారం మీడియాతో మాట్లాడుతూ.. ఎంబీబీఎస్ సీట్ల భర్తీకి పూర్తి రీకౌన్సిలింగ్ నిర్వహించాలన్నారు. మొదటి విడత కౌన్సిలింగ్‌లో బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు అన్యాయం జరిగిందని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం రెండో విడత కౌన్సిలింగ్ రద్దు చేయడం సరికాదని, మొత్తం ఎంబీబీఎస్ ప్రవేశాల కౌన్సిలింగ్ రద్దు చేసి రీకౌన్సిలింగ్ జరపాలని డిమాండ్ చేశారు. జీవో నెంబర్ 550 ప్రకారం, స్లయిడింగ్ విధానం అమలు చేసి బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ విద్యార్ధులకు న్యాయం చేయాల్నారు.
కాగా ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ కౌన్సిలింగ్ ప్రక్రియ నిలిపివేస్తున్నట్టు మంత్రి అచ్చెన్నాయుడు శనివారం ప్రకటించారు. బీసీ విద్యార్థులకు జరుగుతున్న అన్యాయంపై వర్సిటీ వీసీతో చర్చించామన్నారు. త్వరలో మళ్లీ కౌన్సిలింగ్ నిర్వహించాలని నిర‍్ణయం తీసుకున్నట్టు మంత్రి తెలిపారు.
Comments
Please login to add a commentAdd a comment