National Eligibility cum Entrance Test (NEET)
-
Parliament Special Session: పార్లమెంట్లో నీట్ రగడ
సాక్షి, న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ) వ్యవహా రం పార్లమెంట్ ఉభయ సభలను కుదిపేసింది. నీట్ పరీక్షలో అవినీతి అక్రమాలపై, పేపర్ లీకేజీపై వెంటనే చర్చ చేపట్టాలని శుక్రవారం ప్రతిపక్షాలు గట్టిగా పట్టుబట్టాయి. నినాదాలతో హోరెత్తించాయి. ఇతర వ్యవహారాలు పక్కనపెట్టి నీట్ అభ్యర్థుల భవితవ్యాన్ని కాపాడడంపై చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశాయి. తర్వాత చర్చిద్దామని సభాపతులు కోరినన్పటికీ ప్రతిపక్ష నేతలు శాంతించలేదు. దీంతో సభలను పలుమార్లు వాయిదా వేయాల్సి వచ్చింది. దిగువ సభలో విపక్షాల ఆందోళన లోక్‌సభ శుక్రవారం ఉదయం 11 గంటలకు ప్రారంభం కాగానే సుశీల్‌కుమార్ మోదీ సహా పలువురు మాజీ సభ్యుల మృతి పట్ల స్పీకర్ ఓం బిర్లా సంతాపం వ్యక్తం చేశారు. అనంతరం విపక్ష సభ్యులు నీట్ అంశాన్ని లేవనెత్తారు. తక్షణమే చర్చ ప్రారంభించాలని డిమాండ్ చేశారు. స్పీకర్ స్పందిస్తూ... రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాల తెలిపే తీర్మానంపై చర్చ వాయిదా వేయడం కుదరని, ఈ నేపథ్యంలో జీరో అవర్ చేపట్టలేమని అన్నారు. కాంగ్రెస్ పక్షనేత రాహుల్ గాంధీ మాట్లాడుతూ... అభ్యర్థుల ఆందోళనను దృష్టిలో పెట్టుకొని నీట్–యూజీపై చర్చించాలని అన్నారు. డీఎంకే, టీఎంసీ, కాంగ్రెస్ ఎంపీలు వారి సీట్ల వద్దే నిల్చొని నినాదాలు ప్రారంభించారు. రాహుల్ గాంధీ విజ్ఞప్తిని స్పీకర్ తిరస్కరించారు. ముందుగా నిర్ణయించిన కార్య క్రమాలు ప్రారంభించారు. కేంద్ర న్యాయ, పార్లమెంటరీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి అర్జున్‌రాం మేఘ్వాల్ మాట్లాడుతుండగా విపక్ష సభ్యులు నినాదాలు ప్రారంభించారు. సభాపతి ఎంతగా వారించినా వినకుండా నినాదాలు కొనసాగించారు. తొలుత రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చిద్దామని, ఆ తర్వాత నీట్‌పై చర్చకు సమయం కేటాయిస్తానని సభాపతి పేర్కొన్నప్పటికీ విపక్షాలు పట్టువీడలేదు. దీంతో సభను మధ్యాహ్నం 12 గంటల వరకు వాయిదా వేస్తున్నట్లు ఓం బిర్లా ప్రకటించారు. సభ పునఃప్రారంభమైన తర్వాత పశి్చమ బెంగాల్‌కు చెందిన నురుల్ హసన్‌తో ఎంపీగా స్పీకర్ ప్రమాణం స్వీకారం చేయించారు. అనంతరం లోక్‌సభలో కమిటీల ఏర్పాటుకు సంబంధించి పార్లమెంటరీ వ్యవహారాల మంత్రి కిరణ్ రిజిజు ప్రకటన చేశారు. మరోవైపు నీట్–యూజీపై విపక్షాలు తమ ఆందోళన కొనసాగించాయి. అభ్యర్థులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారని, వారికి ప్రభుత్వం న్యాయం చేయాలని కాంగ్రెస్ సభ్యుడు గౌరవ్ గొగోయ్ డిమాండ్ చేశారు. సభ సజావుగా సాగేందుకు విపక్ష సభ్యులు సహకరించాలని స్పీకర్ కోరారు. అయినప్పటికీ విపక్ష సభ్యులు శాంతించకపోవడంతో లోక్‌సభను స్పీకర్ సోమవారానికి వాయిదా వేశారు.రాజ్యసభలో వెల్‌లోకి దూసుకొచి్చన ఖర్గే నీట్ అంశంపై చర్చ చేపట్టకుండా ప్రభుత్వం ఎందుకు వెనుకంజ వేస్తోందని రాజ్యసభలో ప్రతిపక్షాలు నిలదీశాయి. విపక్షాల నిరసనలు, నినాదాల వల్ల శుక్రవారం ఎగువ సభను చైర్మన్ జగదీప్ ధన్‌ఖడ్ మూడుసార్లు వాయిదా వేశా రు. రాష్ట్రప తి ప్ర సంగానికి ధన్యావాదాలు తెలిపే తీర్మానంపై చర్చను చేపట్టగా విపక్షాలు అడ్డుకున్నాయి. నీట్‌పై చర్చించాలని పట్టుబట్టాయి. నీట్లో అక్రమాలపై దర్యాప్తు జరుగుతోందని జేడీ(ఎస్) సభ్యుడు హెచ్.డి.దేవెగౌడ గుర్తు చేశారు. సభ సక్రమంగా జరిగేలా విపక్ష సభ్యులంతా సహకరించాలని కోరారు. నీట్‌పై ప్రభుత్వం సరైన నిర్ణయం తీసుకుంటుందని, అప్పటిదాకా అందరూ ఓపిక పట్టాలని చెప్పారు. నీట్‌పై చర్చించాలని కోరుతూ ప్రతిపక్షాల నుంచి 22 నోటీసులు వచ్చాయని, వాటిని తిరస్కరిస్తున్నానని ధన్‌ఖడ్ చెప్పారు. దీనిపై విపక్ష ఎంపీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెల్‌లోకి దూసుకొచ్చి బిగ్గరగా నినాదాలు చేశారు. ప్రతిపక్ష నేత మల్లికార్జున ఖర్గే సైతం వెల్‌లోకి దూసుకురావడంపై రాజ్యసభ చైర్మన్ ధన్‌ఖడ్ ఆగ్రహం వ్యక్తంచేశారు. ప్రతిపక్ష నాయకు డు వెల్‌లోకి రావడం రాజ్యసభ చరిత్రలో ఇదే మొదటిసారి అని, పార్లమెంట్‌కు ఇదొక మచ్చ అని ఆక్షేపించారు. పార్లమెంటరీ సంప్రదాయం ఈ స్థాయికి దిగజారిపోవడం తనను ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఈ ఘటన దేశంలో ప్రతి ఒక్కరినీ మానసికంగా గాయపర్చిందని చెప్పారు. నీట్‌పై చర్చకు సభాపతి అనుమతి ఇవ్వకపోవడంతో ప్రతిపక్ష ఎంపీలు వాకౌట్ చేశారు. రాష్ట్రపతి ప్రసంగానికి ధన్యవాదాలు తెలిపే తీర్మానంపై చర్చ జరిగింది. ఇదిలా ఉండగా, సభలో మాట్లాడేందుకు చైర్మన్ ధనఖఢ్ అవకాశం ఇవ్వకపోవడం వల్లే తాను వెల్‌లోకి వెళ్లాల్సి వచ్చిందని కాంగ్రెస్ ఎంపీ మల్లికార్జున ఖర్గే వివరణ ఇచ్చారు. అయితే, ధన్‌ఖడ్ చెబుతున్నట్లుగా రాజ్యసభలో ప్రతిపక్ష నేత వెల్‌లోకి వెళ్లడం ఇదే మొదటిసారి కాదని కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి జైరామ్ రమేశ్ వెల్లడించారు. 2019 ఆగస్టు 5న రాజ్యసభలో అప్పటి విపక్ష నేత గులాం నబీ ఆజాద్ వెల్‌లోకి వెళ్లారని గుర్తుచేశారు. స్పృహతప్పి పడిపోయిన కాంగ్రెస్ ఎంపీ రాజ్యసభలో కాంగ్రెస్ ఎంపీ ఫూలోదేవి నేతమ్ శుక్రవారం స్పృహ తప్పి పడిపోయారు. అధిక రక్తపోటు కారణంగా ఆమె అనారోగ్యానికి గురయ్యారు. పార్లమెంట్ సిబ్బంది ఆమెను ఆసుపత్రిలో చేర్చారు. నేతమ్ ఆరోగ్య పరిస్థితి మెరుగైందని, కోలుకుంటున్నారని, ఈ మేరకు ఆసుపత్రి నుంచి తనకు సమాచారం అందిందని చైర్మన్ ధన్‌ఖఢ్ సభలో ప్రకటించారు. -
NEET UG Result 2024: నీట్లో ఆరుగురి ఫస్ట్ ర్యాంకు గల్లంతు!
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో కొందరు అభ్యర్థులకు కేటాయించిన గ్రేసు మార్కులను రద్దు చేస్తున్నట్లు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) సుప్రీంకోర్టుకు తెలియజేసిన నేపథ్యంలో టాప్ ర్యాంకర్లపై ప్రభావం పడబోతోంది. టాపర్లలో కొందరు 60 నుంచి 70 శాతం పాయింట్లు కోల్పోతారని అంచనా. గతంలో ఎన్నడూ లేనివిధంగా ఈసారి ఏకంగా 67 మంది ఫస్ట్ ర్యాంకు సాధించిన సంగతి తెలిసిందే. వీరిలో గ్రేసు మార్కులతో ఫస్ట్ ర్యాంకు పొందినవారు ఆరుగురు ఉన్నారు. గ్రేసు మార్కులను రద్దు చేస్తుండడంతో వీరు ఫస్టు ర్యాంకును కోల్పోనున్నట్లు సమాచారం. అంటే టాపర్ల సంఖ్య 61కి పరిమితం కానుందని అంచనా వేస్తున్నట్లు ఎన్టీఏ వర్గాలు వెల్లడించాయి. నీట్–యూజీలో అక్రమాలు జరిగాయని, 1,563 మందికి ఉద్దేశపూర్వకంగా గ్రేసు మార్కులు కేటాయించారని ఆరోపణలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో అభ్యర్థుల మార్కులను ఎన్టీఏ పునర్ మూల్యాంకనం చేస్తోంది. గ్రేసు మార్కులను రద్దు చేసి, మళ్లీ ర్యాంకులు కేటాయించబోతున్నారు. గ్రేసు మార్కులు రద్దయిన వారికి ఈ నెల 23న మళ్లీ పరీక్ష నిర్వహిస్తారు. ఇదిలా ఉండగా, నీట్ పరీక్షలో ఎలాంటి అవకతవకలు జరగలేదని ఎన్ఏటీ స్పష్టంచేసింది. యథాతథంగా కౌన్సెలింగ్! నీట్ కౌన్సెలింగ్‌ను నిలిపివేయాలని, అక్రమాలపై సీబీఐ దర్యాప్తు జరిపించాలని కోరుతూ దాఖలైన పిటిషన్లపై సుప్రీంకోర్టు బుధవారం విచారణ చేపట్టింది. షెడ్యూల్ ప్రకారం వచ్చేనెల 6వ తేదీ నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్ నిలిపివేసేందుకు నిరాకరించింది. -
30 లక్షలకు నీట్ ప్రశ్నాపత్రం!
పట్నా: దేశవ్యాప్తంగా వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష–అండర్ గ్రాడ్యుయేట్(నీట్–యూజీ)లో అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రశ్నపత్రం లీక్ అయ్యిందని, పరీక్షలో రిగ్గింగ్ జరిగిందని కొందరు అభ్యర్థులు ఆరోపిస్తున్నారు. తమకు న్యాయం చేయాలంటూ కోర్టులను సైతం ఆశ్రయించారు. నీట్–యూజీని రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలని చాలామంది డిమాండ్ చేస్తున్నారు. మరోవైపు గ్రేసు మార్కుల వ్యవహారం తీవ్ర దుమారం సృష్టించింది. బిహార్‌లో నీట్ అక్రమాలపై జరగుతున్న దర్యాప్తులో సంచలనాత్మక అంశాలు వెలుగులోకి వస్తున్నాయి. నీట్ అక్రమాలకు సంబంధించి బిహార్ పోలీసులు ఇప్పటివరకు 14 మందిని అరెస్టు చేశారు. వీరిలో ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ కూడా ఉండడం గమనార్హం. రూ.30 లక్షలు ఇచ్చి నీట్ ప్రశ్నపత్రం కొనుగోలు చేశామని ప్రాథమిక విచారణలో పలువురు అభ్యర్థులు అంగీకరించినట్లు పోలీసులు చెబుతున్నారు. పకడ్బందీగా స్కెచ్ బిహార్‌లో పేపర్ లీక్ చేసి, అభ్యర్థులకు విక్రయించి సొమ్ము చేసుకున్న వ్యక్తులు తెలివిగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. లీకేజీ వ్యవహారం బయటకు పొక్కకుండా పకడ్బందీగా వ్యవహరించారు. తమకు డబ్బులు ముట్టజెప్పిన అభ్యర్థులను తొలుత సురక్షిత స్థావరాలకు తరలించారు. వారికి అక్కడే ప్రశ్నపత్రం అప్పగించారు. జవాబులు సైతం చెప్పేశారు. తర్వాత నేరుగా పరీక్షా కేంద్రాలకు తీసుకెళ్లారు. మధ్యలో ఎవరినీ కలవనివ్వలేదు. ఇదంతా ప్రాథమిక దర్యాప్తులో బయటపడింది. నీట్ పేపర్ లీకేజీపై బిహార్ పోలీసు శాఖకు చెందిన ఆర్థిక నేరాల విభాగం(ఈఓయూ) దర్యాప్తు కొనసాగిస్తోంది. ఇప్పటికే పలువురు అభ్యర్థులను, అనుమానితులను ప్రశ్నించింది. శనివారం మరో 9 మంది అభ్యర్థులకు నోటీసులు జారీ చేసింది. సోమవారం తమ ఎదుట విచారణకు హాజరు కావాలని ఆదేశించింది. వీరంతా బిహార్‌లో వేర్వేరు జిల్లాలకు చెందినవారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ నుంచి అభ్యర్థుల వివరాలు తెలుసుకొని, నోటీసులు ఇచ్చామని ఈఓయూ డీఐజీ మనవ్జీత్ సింగ్ థిల్లాన్ చెప్పారు. కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో.. నీట్ పరీక్షలో అవకతవకలు జరిగాయంటూ ఫిర్యాదులు రాగానే బిహార్ పోలీసులు వేగంగా స్పందించారు. ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని(సిట్) ఏర్పాటు చేశారు. అనుమానిత అభ్యర్థులు, పేపర్ లీక్ చేసిన బ్రోకర్లను అదుపులోకి తీసుకున్నారు. దర్యాప్తులో అభ్యర్థులు నోరు విప్పారు. బ్రోకర్లకు రూ.30 లక్షలకుపైగా ఇచ్చి నీట్ ప్రశ్నాపత్రం కొనుగోలు చేశామని ఒప్పుకున్నారు. బిహార్ ప్రభుత్వ జూనియర్ ఇంజనీర్ సికిందర్ కుమార్ యాదవేందు(56)ను పోలీసులు అరెస్టు చేసి, ప్రశ్నించారు. పేపర్ లీక్ ముఠాతో తాను చేతులు కలిపినట్లు అంగీకరించాడు. కొందరు అభ్యర్థుల కుటుంబ సభ్యులతో ఎప్పటికప్పుడు సంప్రదింపులు జరిపానని చెప్పాడు. ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీ సంస్థను నడిపిస్తున్న నితీశ్, అమిత్ ఆనంద్ అనే వ్యక్తులను తన ఆఫీసులో∙కలిశానని, వారు మే 4వ తేదీన నీట్ ప్రశ్నాపత్రం తీసుకొచ్చారని వెల్లడించారు. పట్నాలోని రామకృష్ణానగర్‌లో అభ్యర్థులతో సమావేశం ఏర్పాటు చేశామని, బేరసారాలు అక్కడే జరిగాయని పేర్కొన్నాడు. నితీశ్, అమిత్ ఆనంద్ అరెస్టయ్యారు. అభ్యర్థుల నుంచి రూ.30 లక్షల నుంచి రూ.32 లక్షల దాకా వసూలు చేశామని పోలీసుల విచారణలో వెల్లడించారు. బిహార్ పబ్లిక్ సరీ్వస్ కమిషన్ టీచర్ రిక్రూట్మెంట్ పరీక్ష కుంభకోణంలో నితీశ్ కుమార్ ఇప్పటికే ఒకసారి జైలుకు వెళ్లొచ్చాడు. పేపర్ లీకేజీలో ఆరితేరాడు. లీకేజీ ముఠా సభ్యులు ఎడ్యుకేషన్ కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్ల ముసుగులో అభ్యర్థులను సంప్రదించి, ప్రశ్నాపత్రాలు విక్రయిస్తున్నట్లు పోలీసులు గుర్తించారు. నిజానికి ఇలాంటి కన్సల్టెన్సీలు, కోచింగ్ సెంటర్లకు ప్రభుత్వ నుంచి ఎలాంటి గుర్తింపు ఉండదు. ఇదిలా ఉండగా, బిహార్‌లో బయటపడిన నీట్ అక్రమాలపై కేంద్ర విద్యా శాఖ గానీ, నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ గానీ ఇంతవరకు స్పందించలేదు. -
‘నీట్’పై ఉన్నత కమిటీ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత, ప్రవేశ పరీక్ష(నీట్)–అండర్ గ్రాడ్యుయేట్ వైద్య ప్రవేశ పరీక్షలో ఈ ఏడాది పెద్ద ఎత్తున అవకతవకలు జరిగినట్లు ఆరోపణలు వస్తున్నాయి. ఏకంగా 67 మంది అభ్యర్థులకు మొదటి ర్యాంకు రావడంపై చాలామంది అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. వీరిలో ఒకే పరీక్ష కేంద్రానికి చెందిన ఆరుగురు అభ్యర్థులున్నారు. అందుకే నీట్–2024ను రద్దు చేసి, మళ్లీ నిర్వహించాలన్న డిమాండ్లు వెల్లువెత్తుతున్నాయి. ఈ నేపథ్యంలో 1,500 మందికిపైగా విద్యార్థులకు కేటాయించిన గ్రేసు మార్కులపై పునఃసమీక్ష చేయడానికి యూజీసీ మాజీ చైర్మన్ నేతృత్వంలో నలుగురు సభ్యులతో కేంద్ర విద్యా శాఖ ఒక ఉన్నత స్థాయి కమిటీని నియమించింది. ఈ విషయాన్ని నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) డైరెక్టర్ జనరల్ సుబో«ద్‌కుమార్ సింగ్ శనివారం వెల్లడించారు. కమిటీ వారంలోగా ప్రభుత్వానికి సిఫార్సులు చేస్తుందని అన్నారు. గ్రేసు మార్కులతో అర్హత ప్రమాణాలపై ప్రభావం ఉండదన్నారు. కొందరు అభ్యర్థుల ఫలితాలను పునఃసమీక్ష చేయడం వల్ల ప్రవేశాల ప్రక్రియకు ఎలాంటి విఘాతం కలగదని స్పష్టం చేశారు. నీట్ పరీక్షలో అవకతవకలు జరగలేదన్నారు. ఎన్సీఈఆర్టీ పాఠ్య పుస్తకాల్లో మార్పులు, కొన్ని సెంటర్లలో ఇచి్చన గ్రేసు మార్కుల కారణంగానే అభ్యర్థులకు ఈ ఏడాది ఎక్కువ మార్కులొచ్చాయని వివరించారు. ఎక్కువ మార్కులు పొందిన విద్యార్థులకు మళ్లీ పరీక్ష నిర్వహించాలా వద్దా అనేది కమిటీ తేలుస్తుందన్నారు. పేపరు లీక్ కాలేదన్నారు. నీట్ విషయంలో తాము రాజీ పడే ప్రసక్తే లేదన్నారు. గ్రేసు మార్కుల కేటాయింపులో అక్రమాలు జరిగాయని, అందుకే చాలామందికి ఫస్టు ర్యాంకు వచి్చందని తల్లిదండ్రులు ఆరోపిస్తుండటం తెలిసిందే. ఆరు సెంటర్లలో పరీక్ష నిర్వహణలో జాప్యం జరగడంతో అక్కడ రాసిన విద్యార్థులకు గ్రేసు మార్కులు ఇచ్చారు. మేఘాలయా, హరియాణాలోని బహదూర్గఢ్, ఛత్తీస్‌గఢ్‌లోని దంతేవాడ, బాలోద్, గుజరాత్‌లోని సూరత్‌తోపాటు చండీగఢ్‌లో ఈ పరిణామం చోటుచేసుకుంది. ఈసారి దేశవ్యాప్తంగా 24 లక్షల మంది నీట్ రాశారు. ఈ నెల 4న ఫలితాలు వెల్లడయ్యాయి. -
పేదరికంలో సరస్వతీ పుత్రుడు.. స్పందించిన కేటీఆర్.. ఆదుకుంటామని హామీ
సాక్షి, కరీంనగర్(జమ్మికుంట): సరస్వతీ పుత్రుడికి లక్ష్మీ కటాక్షం కరువైంది. పట్టుదలతో మెడిసిన్ సీటు సాధించిన ఆ యువకుడి డాక్టర్ విద్యకు పేదరికం అడ్డు పడుతుంది. కూలీ పని చేసుకుంటే కాని పూటగడవని ఆ తల్లిదండ్రులు దాతల సాయం కోసం వేడుకుంటున్నారు. వివరాలు.. జమ్మికుంట మున్సిపల్ పరిధి ధర్మారం గ్రామంలోని రెండో వార్డుకు చెందిన మోతే అశోక్– రాణి దంపతుల కుమారుడు మోతే జయంత్. అశోక్ నాలుగు రేకులు వేసుకొని, చుట్టూ పరదాలు కప్పుకొని, ఆటో అద్దెకు నడుపుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. జయంత్ సోషల్ రెసిడెన్షియల్ పాఠశాలలో చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడు. 1 నుంచి 6వ తరగతి వరకు ఇల్లందకుంట జిల్లా పరిషత్ పాఠశాల, పదో తరగతి వరకు మానకొండూరులోని సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలలో విద్యనభ్యసించి, హైదరాబాద్‌లోని గౌలిదొడ్డి సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలలో ఇంటర్ పూర్తి చేశాడు. మెడిసిన్ సీటు వచ్చిందని ఆ తల్లితండ్రులు ఎంతో సంబరపడ్డా.. కుమారుడి చదువు కోసం ఫీజు చెల్లించలేని స్థితిలో కూడా లేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేదరికం అతడిని వెంటాడుతున్నా పట్టుదలతో చదివి ఇటీవల నిర్వహించిన నీట్లో 463 మార్కులతో 2,700 ర్యాంక్ సాధించాడు. ఈనెల 8న నిజామాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఫీజు చెల్లించి ప్రవేశం పొందాలి. మెడిసిన్ చదువుకు ఏడాదికి రూ.1లక్షకు పైగా ఖర్చువుతుంది. పేద తల్లిదండ్రులు అంత మొత్తంలో ఫీజు చెల్లించే ఆర్థిక స్థోమత లేదంటున్నారు. దాతలు పెద్ద మనసుతో ఆర్థికసాయం చేసి ఆదుకోవాలని వేడుకుంటున్నారు. సాయం చేయండి సారు.. డాక్టర్ చదువుకొని, భవిష్యత్‌లో పేదలకు సేవ చేస్తానని అంటున్నాడు జయంత్. కేటీఆర్ హామీ అయితే నీట్లో మంచి ర్యాంకు సాధించి.. యువకుడి ఆర్థిక పరిస్థితి చూసి చలించిపోయిన పలువురు తమకు తోచిన సాయం చేస్తున్నారు. మరికొంతమంది యువకుడిని ఆదుకోవాలంటూ ‘సాక్షి కథనాన్ని’ ట్విటర్లో పోస్టు చేస్తూ మంత్రి కేటీఆర్‌ను ట్యాగ్ చేశారు. దీనిపై స్పందించిన కేటీఆర్.. దగ్గరుండి అతనికి సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. దీనిపై సమన్వయం చేసుకోవాల్సిందిగా మంత్రి కార్యాలయానికి సూచించారు. Will take care personally @KTRoffice please coordinate https://t.co/eYx0boCgYC — KTR (@KTRTRS) November 4, 2022 దాతలు సాయం చేయాల్సిన అడ్రస్ మోతే జయంత్ అకౌంట్ నం : 026312010000566 ఐఎఫ్ఎస్సీ కోడ్ UBI0802638, యూనియన్ బ్యాంకు, జమ్మికుంట బ్రాంచ్ -
NEET అభ్యర్థి లోదుస్తుల తొలగింపుపై రగడ
తిరువనంతపురం: నీట్ పరీక్షలో అభ్యర్థి లోదుస్తులు తొలగించిన తర్వాతే పరీక్షకు అనుమతించారనే వ్యవహారం ముదురుతోంది. ఈ ఘటనపై విద్యార్థిని తండ్రి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో వ్యవహారం వెలుగు చూసింది. స్పందించిన మానవ హక్కుల సంఘం.. పదిహేను రోజుల్లోగా దర్యాప్తు పూర్తి చేసి ఘటనకు సంబంధించిన నివేదిక తమకు సమర్పించాలని కొల్లాం రూరల్ ఎస్పీని ఆదేశించింది కూడా. అయితే.. నీట్ ఎగ్జామ్ కోసం వెళ్లిన అభ్యర్థిని లోదుస్తులు తొలగించారనే ఘటనపై ఎట్టకేలకు నీట్ నిర్వాహణ సంస్థ ‘నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ’ స్పందించింది. ఆ ఆరోపణల్లో ఎలాంటి వాస్తవం లేదని స్పష్టం చేసింది. జులై 17న నీట్ పరీక్ష సందర్భంగా.. కేరళ కొల్లాంలోని ఓ ఎగ్జామ్ సెంటర్లో అభ్యర్థినిని లోదుస్తులు తొలగించాల్సిందిగా సెంటర్ నిర్వాహకులు కోరారు. ఈ ఘటనపై బాధిత యువతి తండ్రి మాట్లాడుతూ.. 90 శాతం విద్యార్థులకు ఇలాంటి అనుభవమే ఎదురైందని, వాళ్లంతా మానసిక వేదన అనుభవించారని ఆరోపించారు. మీడియా కథనాల ఆధారంగా.. ఈ ఘటనపై కొల్లాం సెంటర్ సూపరిండెంట్, ఇండిపెండెంట్ అబ్జర్వర్, సిటీ కో ఆర్డినేటర్ల నుంచి పరీక్ష నిర్వాహణ సంస్థ నివేదిక తెప్పించుకుంది. అలాంటి ఘటనేం జరగలేదని, అభ్యర్థిని పరీక్షకు అనుమతించామని వాళ్లు నివేదికలో పేర్కొన్నారు. మరోవైపు ఎన్టీఏ సైతం ఇందుకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు అందలేదని స్పష్టం చేసింది. ఎన్టీఏ డ్రెస్ కోడ్ ప్రకారం.. నీట్ పరీక్షలో అలా అభ్యర్థుల మనోభావాలు దెబ్బతినేలా ఎలాంటి నిబంధనలు లేవు. కోడ్ చాలా స్పష్టంగా ఉంది అని ఎన్టీఏ తెలిపింది. విమర్శల నేపథ్యంతో.. కేరళ కొల్లాంకు చెందిన ఓ వ్యక్తి.. నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రెన్స్ టెస్ట్ పరీక్ష కేంద్రంలో తన కూతురికి ఎదురైన ఘోర అవమానంపై కొట్టారకారా పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎన్టీఏ రూల్స్‌లో లేకున్నా తన కూతురి లోదుస్తులు విప్పించి స్టోర్ రూమ్‌లో పడేయాలని, ఆపైనే పరీక్షకు అనుమతించారని.. తద్వారా ఆమెను మానసికంగా వేధించారని ఫిర్యాదు చేశాడు. అంతేకాదు.. మెజార్టీ విద్యార్థులకు ఇలాంటి సమస్యే ఎదురైందని ఆయన ఫిర్యాదులో పేర్కొన్నారు. కేరళ లోక్‌సభ ఎంపీ ఎన్కే ప్రేమచంద్రన్ ఈ ఘటనపై స్పందించారు. పరీక్ష మార్గదర్శకాలను సవరించాల్సిన అవసరం ఉందని అభిప్రాయపడ్డారు. సాంకేతికతో పరీక్షలో అవకతవకలు గుర్తించగలుగుతున్నాం. అలాంటి సాంకేతిక సాయాన్ని ఉపయోగించకుండా.. ఇలా కర్కశకంగా వ్యవహరించడం సరికాదంటూ విమర్శించారు. ఈ మేరకు ఘటనపై పార్లమెంట్లో చర్చకు పట్టుబడుతున్నారు. పోలీస్ కేసు నమోదు బలవంతగా విద్యార్థినుల బ్రాలు తొలగించిన సిబ్బందిపై కేసు నమోదు చేశారు పోలీసులు. మరోవైపు కేరళ విద్యా శాఖ మంత్రి డాక్టర్ ఆర్ బిందు ఈ ఘటనపై సీరియస్‌గా స్పందించారు. కేంద్రం ఈ వ్యవహారంలో ఎన్టీఏపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారామె. అలాగే.. నీట్ పరీక్ష రాసేందుకు వచ్చిన బాలికను బలవంతంగా ఇన్నర్‌వేర్‌ను తొలగించిన ఘటనపై కేరళ పోలీసులు భారతీయ శిక్షాస్మృతి (IPC)లోని సెక్షన్లు 354, 509ల కింద కేసు నమోదు చేశారు. అయితే పరీక్ష నిర్వాహణ కేంద్రం అయిన మార్ థోమా ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ అధికారులు.. తమ సిబ్బంది ఎవరూ తనిఖీల ప్రక్రియలో పాల్గొనలేదని చెప్పారు. అలాగే ఎడ్యుకేషన్ విద్యాశాఖ కూడా తమ పరిధిలో ఈ పరీక్ష జరగలేదని, రాష్ట్ర నిర్వాహణ అధికారులు ఎవరూ అందులో లేరని అంటోంది. డ్రెస్ కోడ్ ఏంటంటే.. అభ్యర్థులు సాధారణంగా.. వాతావరణానికి తగిన దుస్తులను ధరించాలని సూచిస్తుంది. అయితే, పూర్తి స్లీవ్లతో కూడిన లేత రంగు దుస్తులను మాత్రం ధరించడానికి వీల్లేదు. అలాగే శాండల్స్, ఓపెన్ స్లిప్పర్స్ వేస్కోవచ్చు. షూలు ధరించడానికి మాత్రం వీల్లేదు. పర్సులు, హ్యాండ్ బ్యాగులు, బెల్టులు, టోపీలు, నల్ల కళ్లద్దాలు, చేతి వాచీ, బ్రేస్లెట్, కెమెరా, నగలు, మెటాలిక్ వస్తువులు నిషిద్ధం. అయితే మెటాలిక్ హుక్స్ ఉన్న దుస్తులు నిషిద్దమా? కాదా? అనే విషయంపై మాత్రం స్పష్టత ఇవ్వలేదు. గతంలో కేరళలోనే.. గతంలోనూ ఇలాంటి ఘటనలు జరిగాయి. 2017లో కేరళ కన్నూర్‌లోనే ఓ అభ్యర్థితో బ్రా విప్పించారు సెంటర్ నిర్వాహకులు. ఆ ఘటన విమర్శలకు దారి తీసింది. తొలుత.. హాప్ స్లీవ్, బ్లాక్ ప్యాంట్‌తో సెంటర్‌కు చేరుకుంది ఓ అభ్యర్థి. అయితే డార్క్ కలర్ అనుమతించకపోవడంతో.. ఆమె ఆందోళనకు గురైంది. ఆదివారం కావడంతో దుకాణాలు సైతం తెరవలేదు. దీంతో రెండు కిలోమీటర్లు తల్లితో పాటు వెళ్లి కొత్త దుస్తులు కొనుగులు చేసుకుని మార్చుకుని వచ్చింది. అయితే ఇది ఇక్కడితోనే ఆగిపోలేదు. మెటల్ డిటెక్టర్ గుండా వెళ్తున్న టైంలో.. బ్రాకు ఉన్న హుక్స్ కారణంగా ఆమెను అడ్డుకున్నారు. ఆ తర్వాత ఇన్నర్‌వేర్ తొలగించి ఇబ్బందికర పరిస్థితుల్లోనే ఆమె పరీక్ష రాసింది. ఆ సమయంలో సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ వాళ్లునీట్ నిర్వహించారు. ఆ మరుసటి సంవత్సరం పాలక్కడలో ఇలాంటి ఘటనే మరొకటి జరిగింది. ఈ ఏడాది నీట్ పరీక్షల సమయంలో హిజాబ్ తొలగింపు ఫిర్యాదులు సైతం రావడం విశేషం. -
నీట్ యూజీ సెంటర్ల జాబితా విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్యలో ప్రవేశాలకు సంబంధించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (అండర్ గ్రాడ్యుయేట్) నీట్ యూజీ– 2022 కోసం అభ్యర్థులు ఏ పట్టణాల్లోని పరీక్ష కేంద్రాల్లో ఎగ్జామ్ రాస్తారనే జాబితాను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్టీఏ) విడుదల చేసింది. అయితే ఈసారి జాబితాను అభ్యర్థుల సౌకర్యార్థం చాలా ముందుగానే విడుదల చేయడం విశేషం. లిస్ట్‌ను ఆన్లైన్లో అందుబాటులోకి తెచ్చారు. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ అధికారిక వెబ్సైట్లో సెంటర్ వివరాలను డౌన్లోడ్ చేసుకోవచ్చు. అయితే ఇది అడ్మిట్ కార్డు కాదని, కేవలం అభ్యర్థులకు ముందస్తు సమాచారం అందించే వెసులుబాటు అని ఎన్టీఏ తమ నోటీస్‌లో పేర్కొంది. అభ్యర్థులు తమ అడ్మిట్ కార్డులను తర్వాత డౌన్లోడ్ చేసుకోవాల్సి ఉంటుంది. జూలై 17న జరిగే ఈ పరీక్షను మధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5.20 గంటల వరకు ఒకే దఫాలో నిర్వహిస్తారు. ఈ పరీక్షను ఇంగ్లీష్, హిందీ, తెలుగుతో పాటు 13 భాషల్లో నిర్వహించనున్నారు. దేశవ్యాప్తంగా 546 పట్టణాల్లో నిర్వహించనున్న నీట్ యూజీ–2022 కోసం ఆంధ్రప్రదేశ్‌లో 29, తెలంగాణలో 24 నగరాలను ఎంపిక చేశారు. యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్(యూఏఈ), సింగపూర్, కువైట్ సహా పలు దేశాల్లోని 14 నగరాల్లోనూ టెస్ట్ నిర్వహించనున్నారు. -
నీట్ పీజీ ఫలితాలు.. కోనసీమ విద్యార్థినికి జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్
అల్లవరం (కోనసీమ జిల్లా): పీజీ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశపరీక్షలో కోనసీమ జిల్లా ఉప్పలగుప్తం మండలం భీమనపల్లి బట్టుపాలెంకి చెందిన యాళ్ల హర్షిత జాతీయ స్థాయిలో 3వ ర్యాంక్ సాధించింది. తాజాగా విడుదల చేసిన పీజీ నీట్ ఫలితాల్లో హర్షితకు 99.17 శాతం మార్కులు వచ్చాయి. భీమనపల్లి ఉన్నత పాఠశాలలో పదో తరగతి వరకు చదివిన హర్షిత 9.3 గ్రేడ్ సాధించి విశాఖపట్నంలో ఇంటర్ బైపీసీ పూర్తి చేసింది. ఇంటర్‌లోనూ 9.3 గ్రేడ్ సాధించి ఎంసెట్‌లో 180వ ర్యాంక్ దక్కించుకుంది. కాకినాడ రంగరాయ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ అభ్యసించింది. ఎంబీబీఎస్‌లో ప్రథమ స్థానంలో నిలిచి ఆరు బంగారు పతకాలు సాధించింది. పోస్ట్రుగాడ్యుయేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్ (పీజీఐఎంఈఆర్)– చండీగఢ్ నిర్వహించిన ప్రవేశపరీక్షలోనూ జాతీయ స్థాయిలో 47వ ర్యాంకుతో సత్తా చాటింది. పీడియాట్రిక్స్‌లో పీజీ చేయడమే తన లక్ష్యమని హర్షిత తెలిపారు. తమ కుమార్తె నీట్ పీజీలో మంచి ర్యాంకు సాధించడం పట్ల తల్లిదండ్రులు యాళ్ల శ్రీనివాసరావు, కాంతామణి ఆనందం వ్యక్తం చేశారు. కాగా హర్షిత తమ్ముడు శివ సుబ్రహ్మణ్యం శ్రీకాకుళంలోని జెమ్స్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నాడు. జాతీయ స్థాయిలో ర్యాంక్ సాధించిన హర్షితకు పలువురు అభినందనలు తెలిపారు. -
NEET PG 2022 Result: నీట్ పీజీ ఫలితాలు విడుదల
సాక్షి, న్యూఢిల్లీ: మే నెలలో నిర్వహించిన నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాలు విడదలయ్యాయి. పరీక్ష నిర్వహించిన 10 రోజుల్లోనే ఫలితాలను విడుదల చేసినట్లు కేంద్ర ఆరోగ్యమంత్రి మన్సుఖ్ మాండవీయ వెల్లడించారు. ఉత్తీర్ణత సాధించిన అభ్యర్థులకు మాన్సుఖ్ మాండవీయ అభినందనలు తెలుపుతూ ట్వీట్ చేశారు. ఫలితాలు విడుదల చేయడంలో అధికారుల కృషిని కేంద్రమంత్రి ప్రశంసించారు. NEET-PG result is out! I congratulate all the students who have qualified for NEET-PG with flying colours. I appreciate @NBEMS_INDIA for their commendable job of declaring the results in record 10 days, much ahead of the schedule. Check your result at https://t.co/Fbmm0s9vCP — Dr Mansukh Mandaviya (@mansukhmandviya) June 1, 2022 నీట్ పీజీ ప్రవేశ పరీక్ష-2022 ఫలితాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి -
నీట్ పీజీ-2022 పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరణ
న్యూఢిల్లీ: జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ 2022 వాయిదాకు సుప్రీంకోర్టు నిరాకరించింది. నీట్ పీజీ- 2022 పరీక్షలను వాయిదా వేస్తే విద్యార్థులకు ఇబ్బంది అవుతుందని ధర్మాసనం పేర్కొంది. పరీక్షల వాయిదా గందరగోళం అనిశ్చితితోపాటు వైద్యుల కొరత కూడా ఏర్పడే అవకాశం ఉందని, కాబట్టి పరీక్ష వాయిదా వేయలేమని తెలిపింది. కాగా నీట్ పీజీ-2021 కౌన్సిలింగ్ ఉన్నందున చదువుకోవడానికి తగినంత సమయం లేకపోవడంతో పరీక్షలు వాయిదా వేయాలని కోరుతూ వైద్యుల బృందం పిటిషన్ దాఖలు చేశారు. అయితే పిటిషనర్ల వాదనను సుప్రీంకోర్టు తోసిపుచ్చింది. ఈ మేరకు జస్టిస్ డివై చంద్రచూడ్ నేతృత్వంలోని ధర్మాసనం పిటిషన్‌పై విచారణ జరిపి శుక్రవారం తీర్పును వెల్లడించింది. నీట్ పీజీ 2022 పరీక్షలు వాయిదా వేయడం సరైన ఆలోచన కాదని, దీని వల్ల ఈ పరీక్ష రాసే 2 లక్షల మంది విద్యార్థులకు నష్టం వాటిల్లే అవకాశం ఉందనిసనం తెలిపింది. నీట్ పీజీ 2022 పరీక్ష వాయిదా వేయడం వల్ల రోగి సంరక్షణ, వైద్యుల కెరీర్ పై ప్రభావం చూపుతుందని బెంచ్ పేర్కొంది. ఈ పరిస్థితుల్లో ఎలా.పరీక్షను వాయిదా వేస్తామని కోర్టు ప్రశ్నించింది. కాగాఈ ఏడాది మే 21న నీట్ పీజీ పరీక్షను నిర్వహించనున్నారు. అడ్మిట్ కార్డ్‌లు మే 16, 2022 నుంచి అధికారిక వెబ్సైట్ nbe.edu.in లో అందుబాటులో ఉండనున్నాయి. చదవండి:చత్తీస్‌గఢ్‌లో కుప్పకూలిన హెలికాప్టర్.. ఇద్దరు పైలట్ల మృతి -
నీట్, ఎంసెట్ విద్యార్థులకు సాక్షి మాక్‌టెస్టులు
సాక్షి, అమరావతి: తెలుగు రాష్ట్రాల్లో ఎక్కువ మంది విద్యార్థుల లక్ష్యం.. ఇంజనీరింగ్, లేదా మెడిసిన్. అధికశాతం మంది తల్లిదండ్రులు తమ పిల్లలకు ఉజ్వల భవిష్యత్‌ను అందించే ఇంజనీరింగ్/మెడికల్ కోర్సుల్లో చేర్పించాలని కోరుకుంటున్నారు. అందుకు ఖర్చులకు వెనుకాడకుండా పిల్లలను కోచింగ్‌లో చేర్పిస్తున్నారు. ఈ నేపథ్యంలో దేశవ్యాప్తంగా ఉన్న మెడికల్ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్.. అలాగే తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్/అగ్రికల్చర్ తదితర కోర్సుల్లో అడ్మిషన్ కల్పించే ఎంసెట్‌కు లక్షల మంది విద్యార్థులు సన్నద్ధమవుతున్నారు. చదవండి👉: Competitive Exams: ఏ పోటీ పరీక్షలకైనా.. రాజకీయ అవగాహన తప్పనిసరి.. ఈ వ్యూహాలను అనుసరిస్తే..! ఈ నేపథ్యంలో విద్యార్థులకు చేయూతనిచ్చేలా నిపుణుల ఆధ్వర్యంలో ఎంసెట్, నీట్ పరీక్షలకు సాక్షి మాక్‌టెస్టులు నిర్వహించనుంది. పరీక్షకు కొద్దిరోజుల ముందు వాస్తవ పరీక్షలాంటి వాతావరణంలో జరిగే సాక్షి మాక్ టెస్టులు రాయడం ద్వారా విద్యార్థులు తమ ప్రిపరేషన్ స్థాయిని అంచనా వేసుకుని, ప్రిపరేషన్‌ను మరింత మెరుగుపరచుకోవచ్చు. అంతేకాకుండా సాక్షి మాక్ టెస్టుల్లో ఉత్తమ ప్రతిభను చూపడం ద్వారా టాప్ టెన్ ర్యాంకర్లు ఆకర్షణీయ బహుమతులూ గెలుచుకోవచ్చు. సాక్షి మాక్ ఎంసెట్ (ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్) పరీక్ష 25 జూన్, 2022, 26 జూన్, 2022 (శనివారం, ఆదివారం) తేదీల్లో ఆన్లైన్లో జరగనుంది. సాక్షి మాక్ నీట్ పరీక్ష 3 జూలై, 2022 (ఆదివారం) ఆన్లైన్/ఆఫ్‌లైన్ విధానంలో జరుగుతుంది. ఒక్కో పరీక్షకు రిజిస్ట్రేషన్ ఫీజు రూ.250. అభ్యర్థులు https://www. arenaone.in ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తులు పూర్తిచేసిన అభ్యర్థుల ఈమెయిల్‌కు హాల్‌టికెట్ నంబర్ వస్తుంది. వివరాలకు సంప్రదించాల్సిన నెంబర్లు: 96666 97219, 99126 71555, 96662 83534 -
టీ అమ్మిన చేతులతో నాడిపట్టేలా..
సాక్షి, ఒంగోలు: రెక్కాడితే కానీ డొక్కాడని కుటుంబం..కన్నబిడ్డలను కష్టపడి చదివించుకుంటూ జీవనం సాగిస్తోంది. బిడ్డలకు కూడా కష్టం అంటే ఏమిటో తెలియజేస్తోంది. ఆ బిడ్డలు తల్లిదండ్రుల కష్టాన్ని చూసి చదువులో రాణించటం మొదలు పెట్టారు. ఆ కష్టం కాస్తా ఫలించింది. కుమారుడు మెడిసిన్‌కు సంబంధించి నీట్ ఎంట్రన్స్ పరీక్షలో ఉచితంగా ఎంబీబీఎస్ సీటు సాధించి ఆ తల్లిదండ్రుల ముఖాల్లో ఆనందాన్ని నింపాడు. దీంతో ఆ కుటుంబం సంతోషానికి అవధులు లేకుండాపోయాయి. స్థానిక ధారావారితోటలో నివాసం ఉంటూ..ప్రకాశం భవన్ ముందు టీకొట్టు నడుపుకుంటూ జీవనం సాగిస్తున్న దాసరి పిచ్చయ్య, మాధవిల కుమారుడు దాసరి వంశీకృష్ణ ఈ అరుదైన ఘనత సాధించాడు. తల్లిదండ్రులు పడుతున్న కష్టాన్ని కళ్లారా చూసిన వంశీకృష్ణ చదువుకుంటూనే టీ కొట్టులో కూడా పనిచేస్తూ కుటుంబానికి చేదోడు వాదోడుగా ఉన్నాడు. చివరకు మొన్నటి మెడిసిన్ నీట్ పరీక్షలో మంచి ర్యాంకు సాధించాడు. కౌన్సిలింగ్లో విశాఖపట్నంలోని గాయత్రీ విద్యాపీఠం మెడికల్ కాలేజీలో ఫ్రీ సీటు వచ్చింది. పిచ్చయ్య ఎస్సీ కార్పొరేషన్లో రూ.లక్ష రుణం తీసుకొని జీవనం సాగిస్తూ తన కుమారుడు, కుమార్తెలను ఉన్నత చదువులు చదివిస్తున్నాడు. కుమార్తె వైష్ణవి కూడా బీటెక్ మొదటి సంవత్సరం చదువుతోంది. వైష్ణవి చదువుకు రాష్ట్ర ప్రభుత్వం అందిస్తున్న జగనన్న విద్యా దీవెన ద్వారా ఆర్థిక సహకారం అందుతోంది. ప్రత్యేకంగా అభినందించిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్‌లో సీటు సాధించిన దాసరి వంశీకృష్ణను రాష్ట్ర విద్యుత్, అటవీ, పర్యావరణ, శాస్త్ర సాంకేతిక శాఖ మంత్రి బాలినేని శ్రీనివాసరెడ్డి ప్రత్యేకంగా అభినందించారు. ఒంగోలు చంద్రయ్య నగర్లో ఒక కార్యక్రమంలో పాల్గొనేందుకు బుధవారం సాయంత్రం వచ్చిన మంత్రి బాలినేని ఎంబీబీఎస్ సీటు సాధించిన వంశీకృష్ణను వెన్ను తట్టి ప్రోత్సహించారు. సాధారణ టీకొట్టు నడుపుకుంటున్న వ్యక్తి కుమారుడు ఎంబీబీఎస్ సీటు సాధించి నేటి యువతకు ఆదర్శంగా నిలిచాడని అభినందించారు. యువత కష్టపడి చదువుకోవాలని బాలినేని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా దాసరి వంశీకృష్ణ పడిన కష్టం గురించి మంత్రికి జిల్లా ఎస్సీ కార్పొరేషన్ ఈడీ తూతిక విశ్వనాథ్ శ్రీనివాస్ వివరించారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద టీ అమ్ముకుంటూ కష్టపడి చదువుకొని ఎంబీబీఎస్ సీటు సాధించాడని చెప్పారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అందిస్తున్న అమ్మ ఒడి పథకం ద్వారా వంశీకృష్ణ చెల్లెలు వైష్ణవి చదువుకుందని, అదేవిధంగా బీటెక్‌లో చేరాక జగనన్న విద్యా దీవెన పథకం కూడా వచ్చిందని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. విశాఖపట్నంలో ఎంబీబీఎస్ సీటు వచ్చిన ఆర్డర్‌ను మంత్రి బాలినేని చేతుల మీదుగా వంశీకృష్ణకు అందజేశారు. -
నీట్ ఎగ్జామ్: బీజేపీ ఆఫీస్‌పై బాంబు దాడి.. .రౌడీ షీటర్ అరెస్ట్!!
చెన్నై(తమిళనాడు): టీ నగర్‌లోని బీజేపీ ప్రధాన కార్యాలయంపై పెట్రో బాంబు దాడితో ఒక్కసారిగా కలకలం రేగింది. కొందరు దుండగులు పెట్రోల్ బాటిళ్లతో ఆఫీస్‌పై దాడికి తెగపడ్డారు. ఇదిలా ఉండగా.. ఈ ఘటనపై బీజేపీ పలు అనుమానాలు వ్యక్తం చేస్తోంది. గురువారం ఉదయం ఈ ఘటనకు సంబంధించి వినోద్ అనే వ్యక్తిని అరెస్ట్ చేశారు. నీట్ పరిణామాలతోనే తాను బీజేపీ ఆఫీస్‌పై పెట్రోల్ బాంబుతో దాడి చేశానని ఆ యువకుడు అంగీకరించినట్లు పోలీసులు వెల్లడించారు. అయితే.. ఈ వ్యవహారంలో అనుమానాలు ఉన్నాయని అంటున్నారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కె. అన్నామలై. వినోద్ ఒక రౌడీ షీటర్ అని.. చదువుకు అతనికి పొంతన లేదని, అలాంటప్పుడు నీట్ వ్యతిరేకంగా దాడి ఎందుకు చేస్తాడని అనుమానాలు వ్యక్తం చేస్తున్నాడు. ఈ ఘటనలో కుట్ర కోణం దాగి ఉండొచ్చని.. ఎన్ఐఏతో దర్యాప్తు చేయించాలని కోరుతున్నాడు. ఇక దాడి అనంతరం ఆఫీస్‌ను పరిశీలించిన అన్నామలై.. బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని డీఎంకే ప్రభుత్వాన్ని డిమాండ్ చేశాడు. ఇదిలా ఉండగా.. నీట్‌పై తమిళనాడు ముందు నుంచి వ్యతిరేకత వ్యక్తం చేస్తోంది. అసెంబ్లీలో వ్యతిరేక బిల్లు సైతం రూపొందించి ఆమోదించగా.. బీజేపీ అడ్డుచెప్తూ సభ నుంచి వాకౌట్ చేసింది. కొన్ని నెలల తర్వాత పరిశీలించిన గవర్నర్.. బిల్లును ఆమోదించకుండానే అసెంబ్లీకి వెనక్కి తిప్పి పంపారు. దీంతో రాజకీయ దుమారం చెలరేగింది. ఈ పరిణామాలు తట్టుకోలేకనే తాను దాడికి పాల్పడినట్లు వినోద్ చెప్తున్నాడు. బుధవారం అర్ధరాత్రి తర్వాత కొందరితో కలిసి పెట్రల్ సీసాలను బీజేపీ ఆఫీసుల్లోకి విసిరాడు వినోద్. ఇదిలా ఉంటే.. మాదకద్రవ్యాలకు బానిసైన వినోద్‌పై రౌడీ షీట్ కూడా ఉందని, సీసీ ఫుటేజీ ద్వారా మిగతా నిందితులను పట్టుకుంటామని టీనగర్ డీసీపీ హరి చెబుతున్నారు. -
నీట్ పీజీ పరీక్ష వాయిదా
న్యూఢిల్లీ: నీట్ పీజీ 2022 పరీక్షను 6– 8 వారాలు వాయిదా వేయాలని కేంద్ర ఆరోగ్య శాఖ నిర్ణయించింది. ఈమేరకు పరీక్ష వాయిదా వేయాలని జాతీయ పరీక్షల బోర్డు (ఎన్బీఈ)ని కోరింది. ప్రభుత్వ ఆదేశం మేరకు పరీక్షను మార్చి 12 నుంచి మే 21కి వాయిదా వేస్తున్నట్లు ఎన్బీఈ ఎంఎస్(మెడికల్ సైన్సెస్) శుక్రవారం ప్రకటించింది. మే 21 ఉదయం 9 నుంచి 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని తెలిపింది. పరీక్ష దరఖాస్తుకు ఆన్లైన్ విండో గడువు ఈనెల 4న ముగుస్తుండగా, ఈ గడువును మార్చి 25 రాత్రి 11.55 గంటల వరకు పొడిగించింది. నీట్ పీజీ 2021 కౌన్సెలింగ్ తేదీలతో నీట్ పీజీ 22 పరీక్ష తేదీలు ముడిపడుతున్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు ఆరోగ్య శాఖ తెలిపింది. ఫిబ్రవరి 8న విచారణ నీట్ పరీక్ష వాయిదా వేయాలంటూ గత నెల్లో కొందరు విద్యార్ధులు సుప్రీంకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్‌పై ఫిబ్రవరి 8న విచారణ చేపడతామని సుప్రీంకోర్టు శుక్రవారం తెలిపింది. పరీక్షను ప్రభుత్వం వాయిదా వేసినట్లు తమ దృష్టికి వచ్చిందని జస్టిస్ చంద్రచూడ్ నేతృత్వంలోని బెంచ్ తెలిపింది. మరోవైపు నీట్ పరీక్షపై చర్చకు డీఎంకే సభ్యులు రాజ్యసభలో పట్టుబట్టారు. దీనికి సభాధ్యక్షుడు వెంకయ్యనాయుడు అంగీకరించలేదు. దీంతో నిరసనగా కాంగ్రెస్, డీఎంకే సభ్యులు సభనుంచి వాకౌట్ చేశారు. -
‘నీట్’ తీర్మానం వెనక్కి పంపిన గవర్నర్.. దుమారం
After NEET Bill Sent Back GetOutRavi Trending In Twitter: నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీ తీర్మానాన్ని గవర్నర్ ఆర్ఎన్ రవి తిరస్కరించారు. ఫిబ్రవరి 1వ తేదీన రాష్ట్ర ప్రభుత్వానికి ఆ తీర్మానాన్ని వెనక్కి పంపించినట్టు రాజ్ భవన్ గురువారం ప్రకటించింది. దీంతో గవర్నర్ నిర్ణయంపై డీఎంకేతో పాటుగా నీట్‌ను వ్యతిరేకిస్తున్న వారంతా విమర్శలు గుప్పిస్తున్నారు. సాక్షి, చెన్నై : గురువారం రాజ్ భవన్ విడుదల చేసిన ప్రకటనలో నీట్‌పై అసెంబ్లీలో చేసిన తీర్మా నం సుప్రీంకోర్టు తీర్పుకు వ్యతిరేకంగా ఉన్నట్టు వివరించారు. నీట్ రాకతో విద్యార్థులందరికీ సామాజిక న్యాయం దక్కుతోందని పేర్కొన్నారు. సమగ్ర పరిశీలన, సమీక్ష మేరకు పేద విద్యార్థులకు నీట్ ఎంతో దోహదకరంగా ఉందన్నారు. Christian Medical College, Vellore Association Vs. Union of India (2020) కేసులో సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పును సైతం ప్రస్తావించారు. రాష్ట్ర ప్రభుత్వ తీర్మానాన్ని వెనక్కి పంపించడమే కాకుండా, అసెంబ్లీ ఆమోదం పొందిన నేపథ్యంలో, పునః పరిశీలన జరిపాలని, తగిన వివరణ ఇవ్వాలని స్పీకర్ అప్పవును గవర్నర్ ఆదేశించడం గమనార్హం. గెట్‌అవుట్‌రవి ట్రెండింగ్‌లో.. ఇక గవర్నర్ నిర్ణయంపై పార్టీలకతీతంగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తమిళ ప్రజలంతా గవర్నర్ రవి నిర్ణయాన్ని ఖండిస్తూ.. ట్విటర్లో గెట్ అవుట్ రవి యాష్ ట్యాగ్‌తో నిరసన వ్యక్తం చేస్తున్నారు. తమిళనాడు రాష్ట్ర ప్రయోజనాలకు అనుకూల నిర్ణయాలు తీసుకోలేనప్పుడు, మనోభావాల్ని గౌరవించలేనప్పుడు తప్పుకోవాలంటూ, వెళ్లిపోవాలంటూ డిమాండ్ చేస్తున్నారు. #GetOutRavi😡😡 That’s the tweet — Dr Sharmila (@DrSharmila15) February 3, 2022 Hon TR Balu MP at parliament of India Today said that" To call back TN Governor Ravi "#GetOutRavi pic.twitter.com/QQn7fiABR7 — ELAIYA (@elaiyakumar_r) February 3, 2022 ఇదిలా ఉంటే అన్నాడీఎంకే సహా అన్ని పార్టీలు ఈ బిల్‌కు మద్ధతు తెలపగా.. బీజేపీ మాత్రం సభ నుంచి వాకౌట్ చేసిన సంగతి తెలిసిందే. NEET అసమానతలను పెంపొందించడంతో పాటు సమాజంలోని ధనవంతులు, అధిక ప్రాధాన్యత కలిగిన తరగతికి అనుకూలంగా ఉందని, XII తరగతిని కొనసాగించడమే కాకుండా ప్రత్యేక కోచింగ్‌ను పొందగలుగుతారు. ఇది వాస్తవంగా వైద్య మరియు దంత విద్య నుండి గ్రామీణ ప్రాంతాల్లోని వెనుకబడిన సామాజిక వర్గాలను అడ్డుకుంటుంది. Who are you to decide the NEET is against rural students....#GetOutRavi Or you will be forced to get out of TN pic.twitter.com/ygM9oGN8Lj — selvam (@Selvam_nallavan) February 3, 2022 #GetOutRavi When you can’t work for TN, quit https://t.co/hhbOUJNry1 — Upright (@GATHOBIAS) February 3, 2022 వైద్య UG ప్రోగ్రామ్‌ల తర్వాత సంపన్న తరగతికి చెందిన విద్యార్థులు గ్రామీణ ప్రాంతాల్లో సేవ చేయడం లేదని. తరచూ విదేశాలలో పోస్ట్‌గ్రాడ్యుయేట్ కోర్సులను అభ్యసిస్తున్నారని, ఇది రాష్ట్రంలో సేవలందిస్తున్న వైద్యుల సంఖ్య క్షీణతకు దారితీస్తుందని ఆందోళన వ్యక్తం చేసింది తమిళనాడు ప్రభుత్వం. All party has to take unanimous decision to send back the governer.#GetOutRavi #GetOutGovernorRavi https://t.co/1HoemlZLMx — Aravindan L (@i_am_aravindan) February 3, 2022 రీకాల్ చేయండి ఇదిలా ఉంటే నీట్ బిల్లును వెనక్కి పంపిన నిర్ణయంపై తమిళనాడు ప్రభుత్వం గుర్రుగా ఉంది. వెంటనే గవర్నర్ రవిని రీకాల్ చేయాలని కేంద్రాన్ని డిమాండ్ చేసింది. ఈ మేరకు గురువారం లోక్‌సభలో డీఎంకే ఎంపీ టీఆర్ బాలు సైతం గళం వినిపించారు. ఐదు నెలల కాలయాపన తర్వాత ఆ బిల్లును పంపించడం ఏంటో అర్థం కావట్లేదని ఆయన వ్యాఖ్యానించారు. ఈ క్రమంలో కాంగ్రెస్, డీఎంకే, సీపీఐ(ఎం) ఎంపీలు లోక్‌సభ నుంచి వాకౌట్ చేశారు. మరోవైపు ఫిబ్రవరి 5న గవర్నర్ నిర్ణయంపై చర్చించేందుకు.. భవిష్యత్ చర్యల కోసం శనివారం(ఫిబ్రవరి 5న) సీఎం స్టాలిన్ ఆధ్వర్యంలో ఆల్ పార్టీ మీటింగ్ జరగనుంది. రాజ్యాంగం ప్రకారం.. సాధారణంగా అసెంబ్లీ పంపిన బిల్లును గవర్నర్ ఆమోదించి.. రాష్ట్రపతికి పంపిస్తారు. ఒకవేళ వెనక్కి పంపిన బిల్లు మళ్లీ గవర్నర్ దగ్గరికి గనుక వస్తే మాత్రం.. దానిపై ఆయన ఆమోద ముద్ర వేసి రాష్ట్రపతికి పంపిస్తారు. ఆపై తుది నిర్ణయం రాష్ట్రపతికే ఉంటుందని రాజ్యాంగ నిపుణులు సుభాష్ కశ్యప్ చెప్తున్నారు. -
'సీఎం సార్ హెల్ప్ మీ'.. వెంటనే కారు ఆపి..
CM Stalin Stops to Meet Student: తమిళనాడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి సీఎం ఎంకే స్టాలిన్ తనదైన పాలనతో ప్రజలకు చేరువవుతున్నారు. ఈ క్రమంలోనే గురువారం అసెంబ్లీకి వెళ్తున్న సమయంలో చెన్నైలోని టీటీకే రోడ్లో ఓ యువకుడు 'సీఎం సార్ హెల్ప్ మీ' అంటూ ప్లకార్డును పట్టుకుని నిల్చొని ఉండగా, దీనిని గమనించిన సీఎం స్టాలిన్ తన కారును ఆపి ఆ యువకుడితో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం తూర్పుగోదావరి జిల్లాకు చెందిన ఎన్ సతీష్ దేశమంతటా నీట్ మినహాయింపులు తీసుకు వచ్చేలా చూడాలని సీఎం స్టాలిన్‌ను విజ్ఞప్తి చేశారు. ఇప్పటికే తమిళనాడులో నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) పరీక్షలను వ్యతిరేకిస్తున్నందుకు ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌కు కృతజ్ఞతలు తెలిపారు. ఇదిలా ఉండగా.. తమిళనాడులోని డీఎంకే ప్రభత్వుం నీట్ రద్దు కోసం చర్యలను వేగవంతం చేసింది. ఈ వ్యవహారంలో అన్ని రాష్ట్రాల ఏకాభిప్రాయం కోసం ప్రయత్నిస్తామని, విద్యార్థుల భవిష్యత్ కోసం ఎంతవరకైనా వెళ్తామని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే. చదవండి: (Viral Video: పట్టపగలే భారీ దొంగతనం.. తుపాకీతో బెదిరించి కోటి రూపాయలతో పరార్) மாண்புமிகு முதலமைச்சர் @mkstalin அவர்கள், தலைமைச் செயலகம் வரும் வழியில் டி.டி.கே சாலையில், ஆந்திர மாநிலம் கிழக்கு கோதாவரி மாவட்டத்தைச் சேர்ந்த மாணவர் திரு. என்.சதிஷ், “CM SIR HELP ME” என்ற பதாகையுடன் நின்றிருந்ததை பார்த்து, அவரை சந்தித்துப் பேசினார். 1/2 pic.twitter.com/279k8ilq8g — CMOTamilNadu (@CMOTamilnadu) February 3, 2022 -
నీట్ ఫలితాలు విడుదల
సాక్షి, అమరావతి/రాజమహేంద్రవరం రూరల్/చిలకలపూడి/సాక్షి, న్యూఢిల్లీ/సాక్షి, హైదరాబాద్: దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించిన జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నీట్) యూజీ–2021 ఫలితాలను నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీఏ) సోమవారం విడుదల చేసింది. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరితోపాటు ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ జాతీయ స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించారు. విజయవాడకు చెందిన జి.రుషిల్, రాజమహేంద్రవరంకు చెందిన చందం విష్ణువివేక్, తెలంగాణకు చెందిన ఖండవల్లి శశాంక్ (715 మార్కులు) జాతీయ స్థాయిలో ఐదో ర్యాంక్ సాధించి సత్తా చాటారు. అదేవిధంగా కృష్ణా జిల్లా జాయింట్ కలెక్టర్ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డి 23వ ర్యాంక్‌తో మెరిశాడు. ఇక బాలికల టాప్ 20లో తెలంగాణకు చెందిన కాస లహరి, ఈమణి శ్రీనిజ, దాసిక శ్రీనిహారిక, పసుపునూరి శరణ్య ర్యాంక్‌లు సాధించారు. ఈడబ్ల్యూఎస్ కేటగిరీలో టాప్ 10లో తెలంగాణకు చెందిన సీహెచ్ వైష్ణవి ఉంది. ఆమె 143వ ర్యాంకు సా«ధించింది. దేశవ్యాప్తంగా సెప్టెంబర్ 12న నీట్ నిర్వహించిన సంగతి తెలిసిందే. ఏపీ నుంచి 59,951 మంది విద్యార్థులు పరీక్ష రాశారు. ఎన్టీఏ విద్యార్థుల ఈమెయిల్, ఫోన్ నంబర్లకు ర్యాంక్ కార్డులను పంపింది. 720కి 720 మార్కులు సాధించింది వీరే.. తెలంగాణకు చెందిన మృణాల్ కుట్టేరి సహా మొత్తం ముగ్గురు విద్యార్థులు వంద శాతం మార్కులతో టాప్ ర్యాంక్ సాధించినట్లు ఎన్టీఏ ప్రకటించింది. 720 మార్కులకుగాను 720 సాధించి అగ్రస్థానంలో నిలిచినవారిలో మృణాల్ కుట్టేరి, ఢిల్లీకి చెందిన తన్మయ్ గుప్తా, మహారాష్ట్రకు చెందిన కార్తీక జి.నాయర్ ఉన్నారు. అదేవిధంగా 5వ ర్యాంకును 12 మంది, 19వ ర్యాంకును 21 మంది సాధించారు. 8 మంది ట్రాన్స్జెండర్లు కూడా నీట్లో అర్హత సాధించారు. ఈ ఏడాది నీట్‌కు దేశవ్యాప్తంగా 16.14 లక్షల మంది నమోదు చేసుకోగా సుమారు 95% మంది.. అంటే 15.44 లక్షల మంది పరీక్ష రాశారు. వీరిలో 8.70 లక్షల మంది అర్హత సాధించారు. బాలికలు 4,94,806 మంది, బాలురు 3,75,260 మంది అర్హత సాధించినట్లు ఎన్టీఏ తెలిపింది. విద్యార్థులు తమ ఫలితాలను neet.nta.nic.in,http://taresults.nic.in/NTARESULTS&CMS/ వెబ్సైట్లలో చూసుకోవచ్చు. పరీక్ష పత్రం ఫైనల్ ‘కీ’ని కూడా ఎన్టీఏ విడుదల చేసింది. కటాఫ్ మార్కులు కంటే ఎక్కువ సాధించినవారే ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌కు అర్హులు. ప్రతిష్టాత్మక విద్యా సంస్థలు.. ఎయిమ్స్, జిప్మర్ తదితర సంస్థల్లో నీట్ ర్యాంకుల ఆధారంగానే ప్రవేశాలు కల్పిస్తారు. ఈసారి తగ్గిన కటాఫ్ మార్కులు.. గతేడాది జనరల్ కేటగిరీలో నీట్ కటాఫ్ 147 ఉండగా ఈసారి 138కి తగ్గింది. గతేడాది కంటే కఠినంగా పేపర్ ఉండటం వల్లే కటాఫ్ తగ్గింది. 720కి 700 మార్కులు వచ్చినవాళ్లు గతేడాది 100 మంది ఉంటే.. ఈసారి 200 మంది వరకు ఉన్నారు. 640 మార్కులు, ఆపై వచ్చినవారు సుమారు 5 వేల మంది ఉన్నారు. గతేడాది మొత్తం 180 ప్రశ్నలకు 180 రాయాల్సి ఉండగా, ఈసారి 200 ప్రశ్నలుంటే 180 మాత్రమే రాసే అవకాశం కల్పించారు. రాష్ట్రంలో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఆంధ్రప్రదేశ్‌లో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా, ఇలా అన్ని విభాగాల్లో 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే.. ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. రాష్ట్రంలో ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140 సీట్లు, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. 15 శాతం సీట్లకు అఖిల భారత కౌన్సెలింగ్ ► నీట్లో జనరల్ కేటగిరీ అభ్యర్థులకు కనీస అర్హత మార్కులను 50 పర్సంటైల్‌గా, ఎస్టీ, ఎస్సీ, బీసీ అభ్యర్థులకు 40 పర్సంటైల్‌గా నిర్ణయించారు. సీట్ల కేటాయింపులో ఎస్సీ అభ్యర్థులకు 15 శాతం, ఎస్టీ అభ్యర్థులకు 7.5 శాతం, ఓబీసీ అభ్యర్థులకు 27 శాతం రిజర్వేషన్లు వర్తిస్తాయి. ► అఖిల భారత కోటా సీట్లు, రాష్ట్ర ప్రభుత్వ, ప్రైవేటు మెడికల్ కాలేజీల్లో సీట్లు, డీమ్డ్ యూనివర్సిటీలు, కేంద్ర సంస్థలు అన్నీ నీట్ ర్యాంకుల ఆధారంగానే కేటాయిస్తారు. ► దేశవ్యాప్తంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లోని 15 శాతం సీట్లను నేషనల్ పూల్‌లోకి తీసుకున్నారు. వాటినన్నింటినీ అఖిల భారత కౌన్సెలింగ్‌లో భర్తీ చేస్తారు. నీట్ ర్యాంకుల ఆధారంగానే రాష్ట్రాల వారీగా మెరిట్ జాబితా రూపొందించి ప్రవేశాలు కల్పిస్తారు. ► నీట్లో అర్హత సాధించిన విద్యార్థుల మెరిట్ జాబితాను ’కేంద్ర ఆరోగ్య కుటుంబ మంత్రిత్వ శాఖ’ ఆధ్వర్యంలోని డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్‌తో పాటు మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా, డెంటల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రూపొందిస్తాయి. విద్యార్థులు 15 శాతం అఖిల భారత సీట్లకు ప్రత్యేకంగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. వివరాలకు www.mcc.nic.in వెబ్‌సైట్‌ను సందర్శించాలని ఎన్టీఏ విజ్ఞప్తి చేసింది. ► ఇక రాష్ట్రస్థాయిలో ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీల్లో ఎంబీబీఎస్‌లో ప్రవేశాలకు ఆయా రాష్ట్రాలు ప్రత్యేకంగా నోటిఫికేషన్లు జారీ చేస్తాయి. ఇందుకోసం రాష్ట్రస్థాయి నీట్ ర్యాంకులను ప్రకటిస్తారు. వాటి ఆధారంగా కన్వీనర్, మేనేజ్మెంట్, ఎన్ఆర్ఐ, మైనారిటీ సీట్లను భర్తీ చేస్తారు. కౌషిక్‌రెడ్డికి పలువురి అభినందన నీట్లో జాతీయ స్థాయిలో 23వ ర్యాంకు సాధించిన కృష్ణా జిల్లా జేసీ మాధవీలత కుమారుడు కౌషిక్‌రెడ్డికి పలువురు అభినందనలు తెలిపారు. కౌషిక్‌రెడ్డి తిరుపతి భారతీయ విద్యాభవన్‌లో పదో తరగతి చదివి 500కు గానూ 488 మార్కులు సాధించాడు. అనంతరం ఇంటర్మీడియెట్ విజయవాడలోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదివి 985 మార్కులు పొందాడు. సమాజ సేవ చేస్తా.. నేను కెమికల్ ఇంజనీరింగ్ చేయాలనుకున్నప్పటికీ.. సమాజానికి ఎక్కువ సేవ చేసేందుకు వైద్య రంగమైతే బాగుంటుందని ఎంబీబీఎస్‌ను ఎంచుకున్నా. వైద్య రంగం ఎంతో ఆసక్తికరమైందే కాకుండా సవాళ్లతోనూ కూడుకున్నది. ఎన్సీఈఆర్టీ పుస్తకాలు బాగా అధ్యయనం చేశా. ఏకధాటిగా చదవడం కంటే ప్రతి 45 నిమిషాలకు 10– 15 నిమిషాల విరామమిచ్చేవాడిని. టీవీ చూడటం, వీడియోగేమ్స్ వంటి వాటితో ఒత్తిడిని జయించాను. అమ్మ.. సాఫ్ట్వేర్ ఇంజనీర్‌గా, నాన్న హెచ్ఆర్ కన్సల్టెంట్‌గా పనిచేస్తున్నారు. వారిద్దరూ నన్ను అన్ని విధాల ప్రోత్సహించారు. – మృణాల్ కుట్టేరి, నీట్, ఆలిండియా ఫస్ట్ ర్యాంకర్ న్యూరాలిజిస్ట్గా వైద్యసేవలందించాలన్నదే లక్ష్యం ఎయిమ్స్ న్యూఢిల్లీలో ఎంబీబీఎస్ చేస్తా. ఆ తర్వాత న్యూరాలజీలో స్పెషలైజేషన్ చేసి పేదలకు సేవలందించాలన్నదే నా లక్ష్యం. అమ్మానాన్న లక్ష్మి,Ðð వెంకటేశ్వరరావు, ఇతర కుటుంబ సభ్యులు, అధ్యాపకుల ప్రోత్సాహంతోనే ర్యాంకు సాధించగలిగాను. తెలంగాణ ఎంసెట్‌లో ఐదో ర్యాంకు, ఏపీ ఈపీసెట్లో ప్రథమ ర్యాంకు సాధించాను. – చందం విష్ణువివేక్, నీట్ ఆలిండియా ఓపెన్ కేటగిరీలో ఐదో ర్యాంకు, ఓబీసీ కేటగిరీలో ఫస్ట్ ర్యాంకు న్యూరో ఫిజీషియన్ అవుతా మాది తెలంగాణలోని ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలో వట్టెం గ్రామం. నీట్లో ఐదో ర్యాంక్ రావడం చాలా ఆనందంగా ఉంది. పదో తరగతి వరకు కర్నూలులో చదివాను. హైదరాబాద్‌లో ఇంటర్మీడియెట్ చదివాను. రోజూ 10 గంటలు అధ్యయనం చేశాను. ఢిల్లీ ఎయిమ్స్‌లో చేరతాను. న్యూరో ఫిజీషియన్ అవుతా. అమ్మ.. సీనియర్ లెక్చరర్‌గా, నాన్న.. బిజినెస్ మెడిక్యూర్ సేల్స్ మేనేజర్‌గా పనిచేస్తున్నారు. – ఖండవల్లి శశాంక్, ఆలిండియా ఐదో ర్యాంకర్ చదవండి: మన పరీక్షలు ఎంత ‘నీట్’? -
NEET 2021: నీట్ రాసారా.. ఇది మీ కోసమే!
నీట్–యూజీ–2021. ఎంబీబీఎస్, బీడీఎస్, ఆయుష్ కోర్సుల్లో ప్రవేశానికి ఈ నెల(సెప్టెంబర్) 12న జాతీయ స్థాయిలో నిర్వహించిన పరీక్ష! ఇందులో ర్యాంకు ఆధారంగా.. మెరిట్ లిస్ట్, ఫైనల్ కటాఫ్‌లను నిర్ణయించి.. ఆల్ ఇండియా కోటా.. అదేవిధంగా రాష్ట్రాల స్థాయిలో కన్వీనర్ కోటా విధానంలో సీట్లు భర్తీ చేస్తారు!! నీట్ యూజీ ఈసారి క్లిష్టంగా ఉందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఒకవైపు..పరీక్షలో మంచి మార్కులు వస్తాయని, సీటు లభించే అవకాశం ఉందని భావించే విద్యార్థులు! మరోవైపు.. పరీక్ష సరిగా రాయలేక పోయామని.. ఆశించిన ర్యాంకు రాకపోవచ్చని ఆవేదన చెందే విద్యార్థులు! ఫలితాలు వెలువడటానికి మరో నెల రోజుల సమయం పట్టే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో.. నీట్ పరీక్షకు హాజరైన అభ్యర్థులకు నిపుణుల సలహాలు.. జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్ 2021కు దాదాపు 16 లక్షల మంది అభ్యర్థులు హాజరైనట్లు అధికారిక వర్గాలు వెల్లడించాయి. నీట్‌కు ఆంధ్రప్రదేశ్ నుంచి 59,951 మంది, తెలంగాణ నుంచి 59,069 మంది దరఖాస్తు చేసుకున్నారు. ‘గత ఏడాదితో పోల్చితే నీట్ ఈసారి క్లిష్టంగా ఉంది. 450 మార్కులకు పైగా వచ్చిన వారికి సీటు లభించే అవకాశం ఉంది’ అని నిపుణులు సూచిస్తున్నారు. (చదవండి: హైదరాబాద్‌లో ఐటీ బూమ్.. నూతన పాలసీతో జోష్) 450 కంటే ఎక్కువ నీట్‌ను మొత్తం 720 మార్కులకు నిర్వహించారు. ఈ పరీక్షకు హాజరై.. 450 కంటే ఎక్కువ మార్కులు వస్తాయని భావిస్తున్న విద్యార్థులు.. జాతీయ, రాష్ట్ర స్థాయిలోని మెడికల్, డెంటల్ కళాశాలల వివరాలు తెలుసుకోవడంపై దృష్టిపెట్టాలని నిపుణులు పేర్కొంటున్నారు. ఆయా కళాశాలల్లో విద్యా ప్రమాణాలు, ఇతర మౌలిక సదుపాయాల గురించి తెలుసుకోవాలి. ఫలితంగా కౌన్సెలింగ్ సమయంలో ప్రాథమ్యాలుగా పేర్కొనాల్సిన కాలేజీలపై స్పష్టత వస్తుంది. కౌన్సెలింగ్‌కు సన్నద్ధం నీట్లో మెరుగైన ప్రతిభ చూపామని, సీటు ఖాయమని భావించే విద్యార్థులు.. కౌన్సెలింగ్‌కు సన్నద్ధమవ్వాలి. కౌన్సెలింగ్ సమయంలో అవసరమయ్యే అన్ని రకాల ధ్రువ పత్రాలను ఇప్పటి నుంచే సిద్ధం చేసుకోవాలి. ముఖ్యంగా ఆదాయ, కుల ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ తదితర ధ్రువ పత్రాలను వీలైనంత ముందుగా ఫలితాలు వెలువడేలోపు పొందేందుకు కసరత్తు చేయాలి. (ఫ్రెషర్స్‌కు గుడ్‌న్యూస్, లక్షకు పైగా ఉద్యోగాలకు...) ముందుగా ఆల్ ఇండియా కోటా ప్రస్తుతం నీట్–యూజీ ప్రవేశాలను ఆల్ ఇండియా కోటా, స్టేట్ కోటా అనే రెండు విధానాల్లో నిర్వహిస్తున్నారు. ముందుగా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ జరుగుతుంది. ఆల్ ఇండియా కోటాలో.. అన్ని రాష్ట్రాల్లోని మెడికల్ కళాశాలల్లో ఉన్న మొత్తం సీట్లలో 15 శాతం సీట్లను భర్తీ చేస్తారు. వీటికి స్థానికత, పుట్టిన రాష్ట్రం తదితర అంశాలతో సంబంధం లేకుండా.. ఏ రాష్ట్ర విద్యార్థులైనా దరఖాస్తు చేసుకొని..ఆన్లైన్ కౌన్సెలింగ్‌కు హాజరు కావచ్చు. గతేడాది కౌన్సెలింగ్ గణాంకాల ప్రకారం–ఆల్ ఇండియా కోటాలో దాదాపు 6,700 ఎంబీబీఎస్ సీట్లు; నాలుగు వేల బీడీఎస్ సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సారి కౌన్సెలింగ్ సమయానికి ఈ సంఖ్యలో మార్పులు,చేర్పులు జరిగే అవకాశముంది. (చదవండి: భారీగా ఉద్యోగాలు, ఈ రేంజ్లో శాలరీలు ఎప్పుడు ఇవ్వలేదేమో!) రాష్ట్రాల స్థాయిలో కౌన్సెలింగ్ ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్ ముగిశాక.. రాష్ట్రాల స్థాయిలో ప్రవేశాలు నిర్వహిస్తారు. ఇందుకోసం ఆయా రాష్ట్రాల హెల్త్ యూనివర్సిటీలు వేర్వేరుగా కౌన్సెలింగ్ నోటిఫికేషన్లు విడుదల చేస్తాయి. వీటికి అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలి. అభ్యర్థుల మార్కుల ఆధారంగా మెరిట్ లిస్ట్ రూపొందించి కౌన్సెలింగ్ నిర్వహిస్తారు. కౌన్సెలింగ్‌లో అభ్యర్థులు పేర్కొన్న కాలేజ్, సీటు ప్రాథమ్యాలు; వారు పొందిన మార్కులను పరిగణనలోకి తీసుకొని ప్రవేశం ఖరారు చేస్తారు. కాలేజ్ ఎంపిక ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల విషయంలో ఏ కాలేజ్‌లో సీటు వచ్చినా ఓకే అనుకునే విద్యార్థుల సంఖ్య ఎక్కువగా ఉంటుంది. కారణం..సీట్ల పరిమితే! కానీ నీట్లో మెరుగైన మార్కులు సాధించిన విద్యార్థులు నాణ్యమైన విద్యను అందించే కళాశాలలో చేరేందుకు ప్రయత్నించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఎయిమ్స్, జిప్మర్ వంటి ప్రతిష్టాత్మక ఇన్స్టిట్యూట్లు కూడా ఆల్ ఇండియా కోటా కౌన్సెలింగ్‌లో పాల్గొంటున్నాయి. కాబట్టి విద్యార్థులు నాణ్యమైన ఇన్స్టిట్యూట్లో చేరేలా ప్రాథమ్యాలను ఇవ్వాలి. ప్రత్యామ్నాయ మార్గాలు నీట్ పరీక్షను ఆశించిన విధంగా రాయలేదని భావిస్తున్న విద్యార్థులు.. ప్రత్యామ్నాయ కోర్సులవైపు దృష్టిసారించాలని నిపుణులు సూచిస్తున్నారు. బైపీసీ విద్యార్థులకు ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు పలు కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీరు వైద్య అనుబంధ కోర్సులుగా పేర్కొనే ఆయుష్‌తోపాటు మరెన్నో కోర్సులను ఎంచుకోవచ్చు. ఆయుష్ కోర్సులూ నీట్‌తోనే ► ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో సీటు దక్కని విద్యార్థులకు చక్కటి ప్రత్యామ్నాయం.. ఆయుష్ కోర్సులు. బీహెచ్ఎంఎస్, బీఏఎంఎస్, యునానీ(బీయూఎంఎస్), బీఎన్‌వైఎస్ వంటి కోర్సులను పూర్తి చేసుకుంటే.. డాక్టర్ కల సాకారం అవుతుంది. ► ఆయుష్ కోర్సుల సీట్లను కూడా నీట్ స్కోర్ ఆధారంగానే భర్తీ చేస్తున్నారు. ఇందుకోసం ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల కౌన్సెలింగ్ పూర్తయిన తర్వాత.. ప్రత్యేక నోటిఫికేషన్‌ను విడుదల చేస్తారు. తెలంగాణలో కేఎన్ఆర్యూహెచ్ఎస్, ఏపీలో ఎన్‌టీఆర్‌యూహెచ్‌ఎస్‌లు ఈ ప్రక్రియను చేపడతాయి. బీహెచ్ఎంఎస్ బ్యాచిలర్ ఆఫ్ హోమియోపతిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీహెచ్ఎంఎస్).గత కొన్నేళ్లుగా కార్పొరేట్ రూపు సంతరించుకుంటున్న కోర్సు ఇది. బీహెచ్ఎంఎస్ పూర్తి చేసిన వారికి ప్రస్తుతం అవకాశాలకు కొదవ లేదు. రోగుల్లో ఈ వైద్య విధానంపై ఆసక్తి పెరగడం, పలు కార్పొరేట్ ఆసుపత్రులు ప్రత్యేకంగా హోమియోపతి వైద్యాన్ని అందించే ఏర్పాట్లు చేస్తుండటమే ఇందుకు కారణంగా చెప్పొచ్చు. ఏపీలో నాలుగు కళాశాలల్లో,తెలంగాణలో అయిదు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఏఎంఎస్ మెడికల్ రంగంలో స్థిరపడాలనుకునే బైపీసీ విద్యార్థులకు మరో ప్రత్యామ్నాయం.. బ్యాచిలర్ ఆఫ్ ఆయుర్వేదిక్ మెడిసిన్ అండ్ సర్జరీ(బీఏఎంఎస్). ఈ కోర్సులోనూ ఎంబీబీఎస్‌లో మాదిరిగానే అనాటమీ, ఫిజియాలజీ, పిడియాట్రిక్స్, జనరల్ మెడిసిన్ తదితర సబ్జెక్టులు బోధిస్తారు. ఆంధ్రప్రదేశ్‌లో ఏడు కళాశాలల్లో, తెలంగాణలో రెండు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఉన్నత విద్యపరంగా ఎండీ స్థాయిలో ఆయుర్వేద, ఎంఎస్–ఆయుర్వేద కోర్సులు చదవొచ్చు. యునానీ (బీయూఎంఎస్) ఇటీవల కాలంలో ఆదరణ పెరుగుతున్న మరో కోర్సు.. బీయూఎంఎస్(బ్యాచిలర్ ఆఫ్ యునానీ మెడికల్ సైన్స్). దీన్ని పూర్తిగా ప్రకృతి వైద్యంగా పేర్కొనొచ్చు. ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్‌లో ఒకటి, తెలంగాణలో ఒకటి చొప్పున రెండు కళాశాలల్లో మాత్రమే ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎన్‌వైఎస్ బ్యాచిలర్ ఆఫ్ నేచురోపతిక్ మెడికల్ సైన్సెస్.. బీఎన్‌వైఎస్. బైపీసీ విద్యార్థులకు వైద్య రంగంలో మరో ప్రత్యామ్నాయ కోర్సు ఇది. దీన్ని పూర్తి చేసిన వారికి యోగా, సిద్ధ యోగా వంటి విధానాల ద్వారా రోగులకు చికిత్స చేయగలిగే నైపుణ్యాలు లభిస్తాయి. ఈ కోర్సు తెలంగాణలో ఒక కళాశాలలో, ఏపీలో ఒక కళాశాలలో అందుబాటులో ఉంది. బీవీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న చక్కటి కోర్సు.. బ్యాచిలర్ ఆఫ్ వెటర్నరీ సైన్స్ అండ్ యానిమల్ హజ్బెండరీ(బీవీఎస్సీ). ఈ కోర్సు ద్వారా.. జంతువులకు వచ్చే వ్యాధులు, నివారణ చర్యల తదితర అంశాలపై నైపుణ్యం లభిస్తుంది. పౌల్ట్రీ ఫారాలు, పశు వైద్య ఆసుపత్రులు, పశుసంవర్థక శాలలు,వన్యమృగ సంరక్షణ కేంద్రాలు, జంతు ప్రదర్శనశాలలు, డెయిరీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ఏపీలో శ్రీ వేంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ, తెలంగాణలో పి.వి.నరసింహరావు తెలంగాణ వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. అగ్రికల్చర్ బీఎస్సీ బైపీసీ విద్యార్థులకు అవకాశాలు అందించే మరో కోర్సు.. అగ్రికల్చర్ బీఎస్సీ. వ్యవసాయ సాగు విధానాల్లో ఆధునిక పద్ధతులు, నూతన పరికరాల వినియోగం వంటి నైపుణ్యాలను అందించే కోర్సు ఇది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ప్రైవేటు రంగంలో విత్తన ఉత్పాదక సంస్థలు, పౌల్ట్రీ ఫామ్స్‌లో అవకాశాలు లభిస్తాయి. ప్రభుత్వ వ్యవసాయ శాఖలో అగ్రికల్చర్ ఎక్స్టెన్షన్ ఆఫీసర్ వంటి ఉద్యోగాలు లభిస్తాయి. రూరల్ బ్యాంకింగ్ ఆఫీసర్లుగా కొలువులు దక్కించుకోవచ్చు. తెలుగు రాష్ట్రాల్లో.. ఆచార్య ఎన్జీరంగా అగ్రికల్చర్ యూనివర్సిటీ(ఏపీ), ఆచార్య జయశంకర్ అగ్రికల్చర్ యూనివర్సిటీ(తెలంగాణ) పరిధిలో పలు కళాశాలల్లో ఈ కోర్సు అందుబాటులో ఉంది. హార్టికల్చర్ సైన్స్ బైపీసీ విద్యార్థులు బీఎస్సీ హార్టికల్చర్ సైన్స్‌ను ఎంచుకోవచ్చు. వీరికి స్టేట్ హార్టికల్చర్ మిషన్, నాబార్డ్ వంటి వాటిల్లో ఉద్యోగాలు లభిస్తాయి. డ్రిప్ ఇరిగేషన్ కంపెనీలు, మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్ట్‌ల్లోనూ అవకాశాలు అందిపుచ్చుకోవచ్చు. తెలంగాణలో శ్రీ కొండా లక్ష్మణ్ బాపూజీ తెలంగాణ స్టేట్ హార్టికల్చర్ యూనివర్సిటీ, ఏపీలో డాక్టర్ వైఎస్ఆర్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. బీఎఫ్ఎస్సీ బ్యాచిలర్ ఆఫ్ ఫిషరీస్ సైన్స్.. సంక్షిప్తంగా బీఎఫ్ఎస్సీ. బైపీసీ విద్యార్థులు ఈ కోర్సు ద్వారా చేపల పెంపకంపై ప్రత్యేక నైపుణ్యాలు పొందొచ్చు. వీరికి ఆక్వాకల్చర్ సంస్థలు, ఆక్వా రీసెర్చ్ సంస్థలు ప్రధాన ఉపాధి వేదికలు. తెలంగాణలో పి.వి. నరసింహారావు వెటర్నరీ యూనివర్సిటీ, ఏపీలో శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ పరిధిలో ఈ కోర్సు అందుబాటులో ఉంది. ఇతర కోర్సులు కూడా బైపీసీ విద్యార్థులు ఆసక్తి ఉంటే.. బ్యాచిలర్ ఆఫ్ ఫిజియోథెరపీ, బ్యాచిలర్ ఆఫ్ నర్సింగ్, బ్యాచిలర్ ఆఫ్ అనస్థీషియా టెక్నాలజీ వంటి కోర్సుల్లో కూడా చేరే అవకాశం ఉంది. కౌన్సెలింగ్‌కు ముందే స్పష్టత నీట్ కౌన్సెలింగ్‌కు సన్నద్ధమయ్యే విద్యార్థులు ఆన్లైన్ కౌన్సెలింగ్, ఛాయిస్ ఫిల్లింగ్ విషయంలో స్పష్టతతో వ్యవహరించాలి. ఇందుకోసం ఇప్పటి నుంచే ముందస్తు కసరత్తు ప్రారంభించాలి. నిర్దిష్టంగా కాలేజీ, కోర్సు విషయంలో స్పష్టత వచ్చాక.. దానికి అనుగుణంగా తమ ప్రాథమ్యాలు పేర్కొనాలి. కుల, ఆదాయ ధ్రువీకరణ పత్రాలు, ఈడబ్ల్యూఎస్ పత్రాలు దగ్గర ఉండేలా చూసుకోవాలి. – డాక్టర్ బి.కరుణాకర్ రెడ్డి, వైస్ ఛాన్స్లర్, కేఎన్ఆర్యూహెచ్ఎస్ నీట్–2021– ముఖ్యాంశాలు ► జాతీయ స్థాయిలో నిర్వహించిన నీట్‌కు దాదాపు 16 లక్షల మంది హాజరు. ► దేశవ్యాప్తంగా ఎంబీబీఎస్‌లో 83 వేలు, బీడీఎస్‌లో 27 వేల సీట్లు. ► నేషనల్ మెడికల్ కమిషన్ ప్రకారం–ఏపీలో 5,210 ఎంబీబీఎస్ సీట్లు, తెలంగాణలో 5,240 ఎంబీబీఎస్ సీట్లు. ► గత ఏడాది హెల్త్ యూనివర్సిటీల నోటిఫికేషన్ గణాంకాల ప్రకారం– ఏపీలో 1440 బీడీఎస్ సీట్లు , తెలంగాణలో 1140 బీడీఎస్ సీట్లు. ► 450పైగా స్కోర్ వస్తుందనుకునే విద్యార్థులు కౌన్సెలింగ్‌కు సన్నద్ధంగా ఉండాలి. ► కౌన్సెలింగ్‌కు అవసరమైన అన్ని ధ్రువ పత్రాలను ముందుగానే సిద్ధం చేసుకోవాలి. ► ఎంబీబీఎస్, బీడీఎస్‌కు ప్రత్యామ్నాయాలుగా నిలుస్తున్న ఆయుష్, ఏజీ బీఎస్సీ, బీవీఎస్సీ, ఫిషరీస్ తదితరాలు. -
ఏ ర్యాంకుకు ఎక్కడ ఎంబీబీఎస్ సీటు? విద్యార్థుల్లో పరేషాన్
సాక్షి, అమరావతి: ఎంబీబీఎస్, బీడీఎస్ సీట్ల భర్తీకి జాతీయ స్థాయిలో నిర్వహించిన నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రెన్స్ టెస్ట్ (నీట్) ఇటీవలే ముగిసింది. మన రాష్ట్రం నుంచి మొత్తం 59 వేల మందికిపైగా నీట్ రాశారు. ఈ నేపథ్యంలో ఇప్పుడు అభ్యర్థుల ఆందోళన అంతా తమకొచ్చే ర్యాంకుకు సీటు వస్తుందో, రాదోననే. మన రాష్ట్రంలో 11 ప్రభుత్వ, 15 ప్రైవేటు, 2 మైనార్టీ కాలేజీల్లో కన్వీనర్, యాజమాన్య, ప్రవాస భారతీయ కోటా.. ఇలా అన్నీ కలిపి 5,010 ఎంబీబీఎస్ సీట్లు ఉన్నాయి. ప్రభుత్వ కళాశాలల వరకు మాత్రమే చూస్తే ఎంబీబీఎస్ సీట్ల సంఖ్య 2,180. అభ్యర్థుల్లో అందరి దృష్టి ప్రభుత్వ కళాశాలలపైనే ఉంది. దీనికోసం ఎన్ని మార్కులు వస్తే.. ఎంత ర్యాంకు వస్తుంది, ఎంత ర్యాంకు సాధిస్తే ప్రభుత్వ కాలేజీల్లో సీటు వస్తుందో తెలుసుకునే పనిలో ప్రస్తుతం అభ్యర్థులంతా తలమునకలై ఉన్నారు. ఈ ఏడాది నీట్లో భౌతిక శాస్త్రం (ఫిజిక్స్) కొంచెం కష్టంగా వచ్చింది. దీంతో ఫిజిక్స్‌లో బాగా పట్టున్న వారు, ఆ సబ్జెక్టు బాగా రాసిన వారు సీటు వస్తుందన్న ఆశతో ఉన్నారు. రాష్ట్రంలో ఉన్న ప్రభుత్వ ఎంబీబీఎస్ సీట్లలో 15 శాతం జాతీయ కోటా కింద నేషనల్ పూల్‌లో భర్తీ చేస్తారు. మిగతా 85 శాతం సీట్లను రాష్ట్రమే భర్తీ చేస్తుంది. కాగా, 2 ప్రభుత్వ డెంటల్ కాలేజీల్లో 140, 14 ప్రైవేటు డెంటల్ కాలేజీల్లో 1,300 బీడీఎస్ సీట్లు ఉన్నాయి. ఎన్ని మార్కులొస్తే సీటు వస్తుంది? ఏయూ పరిధిలో ఓపెన్ కేటగిరీలో 343 మార్కులకు డెంటల్ సీటు గతేడాది ఆంధ్రా విశ్వవిద్యాలయం పరిధిలో ఎస్టీ కేటగిరీలో 162 మార్కులు సాధించిన వ్యక్తికి ప్రభుత్వ కళాశాలలో దంత వైద్య సీటు లభించింది. జాతీయ స్థాయిలో 6,31,277 ర్యాంకు సాధించిన అభ్యర్థికి 162 మార్కులు వచ్చాయి. అదే ఓపెన్ కేటగిరీలో చివరి సీటు 343 మార్కులు (ర్యాంకు 2,57,671) వచ్చినవారికి దక్కింది. ఎస్సీ కేటగిరీలో 310 మార్కులు వచ్చిన వారికి చివరి సీటు లభించింది. అదే శ్రీ వేంకటేశ్వర యూనివర్సిటీ పరిధిలో చూస్తే ఎస్టీ కేటగిరీలో 359 మార్కులు (2,35,606 ర్యాంకు) వచ్చిన వారికి కూడా సీటు దక్కింది. దీన్ని బట్టి చూస్తే ఒకే రాష్ట్రంలో రెండు యూనివర్సిటీల పరిధిలో ఎంత వ్యత్యాసం ఉందో అంచనా వేయొచ్చు. -
యువతి అదృశ్యం కలకలం: హీరో సూర్య ఆందోళన
చెన్నె: నీట్ భయం ఇంకా తమిళనాడు విద్యార్థులను వెంటాడుతోంది. ఇప్పటికే ముగ్గురు విద్యార్థులు నీట్ ఒత్తిడితో బలవన్మరణాలకు పాల్పడ్డారు. నీట్‌ను మినహాయింపు ఇస్తూ ప్రభుత్వం బిల్లు తీసుకొచ్చినా కూడా విద్యార్థులు ఊరట చెందడం లేదు. తాజాగా ఓ విద్యార్థిని అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. నీట్ పరీక్ష రాసి వచ్చిన అనంతరం కీ పేపర్ చూసుకున్న విద్యార్థిని కనిపించకుండాపోయింది. దీంతో కుటుంబసభ్యులు భయాందోళన చెందుతున్నారు. వారి ఫిర్యాదు మేరకు విద్యార్థిని కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు. తమిళనాడులోని నమక్కర్ జిల్లాకు రాసిపురం పోలీస్‌స్టేషన్ పరిధికి చెందిన శ్వేత (19) జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష (నేషనల్ ఎలిజిబిలిటీ ఎంట్రన్స్ టెస్ట్-నీట్)ను ఈనెల 12వ తేదీన రాసింది. ఈనెల 17వ తేదీన రాసిన పరీక్షకు సంబంధించిన కీ పేపర్ చూసుకుంది. ఉత్తీర్ణత సాధించలేనని గ్రహించి ఇంట్లో నుంచి వెళ్లిపోయింది. కుటుంబసభ్యులు అదృశ్యం కేసు ఫిర్యాదు చేయడంతో రాసిపురం పోలీసులు గాలిస్తున్నారు. అయితే విద్యార్థుల ఆందోళన నేపథ్యంలో ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ స్వయంగా రంగంలోకి దిగారు. ఇప్పటికే నీట్ మినహాయింపు ఇస్తూ అసెంబ్లీలో బిల్లు ప్రవేశపెట్టారు. అయినా కూడా విద్యార్థుల బలవన్మరణాలు ఆగకపోవడంతో ముఖ్యమంత్రి స్టాలిన్ వీడియో సందేశం విడుదల చేశారు. ‘పరీక్షపై ఆందోళనతో తీవ్ర నిర్ణయాలు తీసుకోవద్దు. బంగారు భవిష్యత్ ఎంతో ఉంది’ అని విజ్ఞప్తి చేశారు. ఈ క్రమంలోనే సినీ నటుడు సూర్య కూడా విద్యార్థులకు ఓ పిలుపునిచ్చారు. -
‘నీట్’కు బలైన ముగ్గురు..సీఎం స్టాలిన్ సంచలన ప్రకటన
చెన్నె: మూడు రోజుల్లో ముగ్గురు ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై భయంతో ఆందోళన చెందుతూ బలవన్మరణానికి పాల్పడ్డారు. వారి మరణం తమిళనాడు రాష్ట్రాన్ని కదిలించింది. పలువురు ప్రముఖులు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇక ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ అయితే చలించిపోయారు. తమ విద్యార్థులకు బలిపీఠంగా మారిందని పేర్కొన్న స్టాలిన్ నివారణ చర్యలు చేపట్టారు. మెడికల్ ప్రవేశ పరీక్ష నీట్ నుంచి ఉపశమనం కలిగిస్తూ అసెంబ్లీలో ఓ బిల్లును ప్రవేశపెట్టారు. ఆ బిల్లు పెట్టినా కూడా విద్యార్థుల మరణాలు ఆగడం లేదు. తాజాగా ఓ యువతి కూడా ఆత్మహత్య చేసుకోవడంతో సీఎం స్టాలిన్ ఆవేదన చెందారు. ఈ సందర్భంగా విద్యార్థులకు మనోధైర్యం కల్పిస్తూ ఓ సందేశం విడుదల చేశారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం.. సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి ‘నీట్‌తో ఆందోళన చెందుతున్న విద్యార్థుల కోసం 24/7 పని చేసే హెల్ప్‌లైన్‌ను మొదలుపెట్టాం’ అని సీఎం స్టాలిన్ తెలిపారు. విద్యార్థులకు నిరంతరం కౌన్సిలింగ్ ఇస్తామని ప్రకటించారు. మనస్తాపం.. ఒత్తిడితో బాధపడుతుంటే 104కు సంప్రదించాలని.. వ్యక్తిత్వ వికాస నిపుణుడితో మాట్లాడించేందుకు ఏర్పాట్లు చేసినట్లు వివరించారు. వీటికోసం ఏకంగా 330 మంది నిపుణులను నియమించినట్లు ఆ రాష్ట్ర వైద్యారోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. చదవండి: కులాలు వేరు.. అయినా ఘనంగా పెళ్లి చేస్తారని నమ్మివెళ్తే.. ‘ప్రియమైన విద్యార్థులు ఎవరూ ఆందోళన చెందొద్దు. తీవ్రమైన నిర్ణయాలు తీసుకోవద్దని విజ్ఞప్తి చేశారు. మేం మొత్తం మారుస్తాం. నీట్ రద్దు చేసేంత వరకు మేం విశ్రమించం’ అని సీఎం స్టాలిన్ స్పష్టం చేశారు. రాతి హృదయాలను కరిగిద్దాం అని పిలుపునిచ్చారు. దయచేసి ఆత్మహత్యలకు పాల్పడ్డవద్దని రెండు చేతులు జోడించి విజ్ఞప్తి చేశారు. నీట్‌పై తమిళనాడులోని అన్ని పార్టీలు మద్దతు ప్రకటిస్తున్న విషయం తెలిసిందే. மாணவச் செல்வங்களே! மனம்தளராதீர்கள்! கெஞ்சிக் கேட்டுக்கொள்கிறேன்; ஈடில்லா உயிர்களை மாய்த்துக் கொள்ளாதீர்கள்! கல் நெஞ்சங்கொண்டோரைக் கரைப்போம்!#NEET எனும் அநீதியை ஒழிக்கும்வரை நாம் ஓயமாட்டோம்! https://t.co/sE6530aZR7 — M.K.Stalin (@mkstalin) September 15, 2021 -
నీట్‌కు వ్యతిరేకంగా తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం
సాక్షి, చెన్నై: మెడికల్ ప్రవేశపరీక్ష నీట్ నుంచి పూర్తిగా మినహాయింపు కోరుతూ సీఎం ఎంకే స్టాలిన్ తమిళనాడు అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. తమిళ విద్యార్థులకు నీట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని స్టాలిన్ కేంద్రాన్ని డిమాండ్ చేశారు. తీర్మానానికి సంపూర్ణ మద్దతునివ్వాలని విపక్షాలను కోరారు. ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో సోమవారం అసెంబ్లీలో నీట్‌కు వ్యతిరేకంగా తీర్మానం ప్రవేశపెట్టారు. అయితే ప్రతిపక్ష అన్నా డీఎంకే మాత్రం అసెంబ్లీ నుంచి వాకౌట్ చేసింది. తమిళనాడులో నీట్ జరుగుతుందా లేదా తెలియక విద్యార్థులు, తల్లిదండ్రులు అయోమయానికి గురయ్యారని, చివరికి విద్యార్థి ఆత్మహత్య గురించి కూడా అసెంబ్లీలో చర్చించనివ్వలేదని ప్రతిపక్ష నేత పళనిస్వామి ఆరోపించారు. నీట్‌పై డీఎంకే ప్రభుత్వం స్పష్టమైన వైఖరి అవలంబించలేదని మండిపడ్డారు. నీట్‌నును రద్దు చేస్తారనుకొని విద్యార్థులు ఆ పరీక్షకు సిద్ధం కాలేదు. ఆ విద్యార్థి ఆత్మహత్యకు ప్రభుత్వానిదే బాధ్యత. దీనికి నిరసనగా వాకౌట్ చేస్తున్నామని, అయితే నీట్ తీర్మానానికి మద్దతిస్తున్నామని పళనిస్వామి అన్నారు. చదవండి: నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి -
నీట్ బలిపీఠంపై మరో మరణం: సీఎం స్టాలిన్ దిగ్భ్రాంతి
చెన్నె: వైద్య విద్య కోర్సు (యూజీ)ల్లో ఎంబీబీఎస్, దంత వైద్య సీట్ల భర్తీ కోసం నిర్వహించే ‘నీట్’ (జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష)పై విద్యార్థుల్లో భయాందోళన నెలకొని ఉంది. ఆ పరీక్షపై ఒత్తిడి పెంచుకుని తాజాగా ఓ విద్యార్థి భయాందోళనతో బలవన్మరణానికి పాల్పడ్డాడు. ఇప్పటికే రెండుసార్లు నీట్ రాయగా అర్హత సాధించలేకపోయాడు. ఏడాదిగా మూడోసారి నీట్‌కు శిక్షణ పొందాడు. చివరకు ఆదివారం పరీక్ష ఉండగా ఫెయిలవుతాననే భయాందోళనతో ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన తమిళనాడులోని సేలంలో జరిగింది. ఈ ఘటనపై తమిళనాడులో సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. చదవండి: సీఎం జగన్ ప్రత్యేక చొరవ.. 48 గంటల్లో భూవివాదం పరిష్కారం సేలం జిల్లా కుజయ్యూర్‌కు చెందిన ధనుశ్ (19) నీట్‌కు ప్రిపేరవుతున్నాడు. గతంలో రెండుసార్లు పరీక్ష రాయగా ఉత్తీర్ణత సాధించకపోయాడు. ఈసారి ఎలాగైనా సాధించాలనే పట్టుదలతో శిక్షణ తీసుకున్నాడు. తీరా ఆదివారం పరీక్ష ఉండగా భయాందోళన పెంచుకున్నాడు. ఈసారి కూడా ఉత్తీర్ణత సాధించలేమోననే భయంతో పరీక్షకు కొన్ని గంటలు ఉందనగా ఆ యువకుడు ఫ్యాన్‌కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. నీట్‌పై ఒత్తిడి పెంచుకున్నట్లు తల్లిదండ్రులు, మృతుడి సోదరుడు నిశాంత్ తెలిపాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. ఈ సందర్భంగా ధనుశ్ తల్లిదండ్రులు ‘నీట్ పరీక్ష రద్దు చేయాలి’ అని రాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. చదవండి: ప్రతిభకు గుర్తింపు.. విద్యార్థులను ఆకాశాన తిప్పిన టీచర్ విద్యార్థి ఆత్మహత్యపై ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్ దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ‘నీట్ బలిపీఠం మీద మరొక మరణం. ఈ ఘటన నన్ను షాక్‌కు గురి చేసింది. నీట్‌కు శాశ్వత మినహాయింపు బిల్లును తీసుకువస్తాం’ అని ప్రకటించారు. ప్రస్తుతం జరుగుతున్న అసెంబ్లీ సమావేశాల్లో భాగంగా సోమవారం దానికి సంబంధించిన బిల్లును ప్రవేశపెడతామని ఆరోగ్య శాఖ మంత్రి సుబ్రమణియన్ తెలిపారు. நீட் எனும் பலிபீடத்தில் மற்றுமொரு மரணம்! கல்வியால் தகுதி வரட்டும்; தகுதி பெற்றால் மட்டுமே கல்வி எனும் அநீதி நீட் ஒழியட்டும்! நாளை நீட் நிரந்தர விலக்கு சட்ட மசோதா கொண்டு வருவோம்; #NEET-ஐ இந்தியத் துணைக்கண்டத்தின் பிரச்சினையாகக் கொண்டு செல்வோம். pic.twitter.com/iAI4zm9knA — M.K.Stalin (@mkstalin) September 12, 2021 -
NEET Exam: ఈనెల 12న షెడ్యూల్ ప్రకారం యథాతథం: సుప్రీంకోర్టు
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంర్ 12న ఆదివారమే ఈ పరీక్షను నిర్వహించాలని కోర్టు అధికారులను ఆదేశించింది. నీట్ పరీక్ష నిర్వహిస్తున్న రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని.. అలాగే సీబీఎస్ఈ కంపార్ట్మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల నీట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. -
నీట్(యూజీ) 2021: ఇలా ప్రిపేరయితే విజయం ఖాయం
నేషనల్ ఎలిజిబిలిటీ కమ్ ఎంట్రన్స్ టెస్ట్ (నీట్) –యూజీ–2021.. ఎంబీబీఎస్, బీడీఎస్‌తోపాటు ఇతర వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు దేశవ్యాప్తంగా నిర్వహించే పరీక్ష! గత కొన్ని నెలలుగా.. నీట్ ఎప్పుడు జరుగుతుందా? అని ఎదురు చూస్తున్న విద్యార్థులకు.. ఎట్టకేలకు ఎన్టీఏ స్పష్టత ఇచ్చింది. సెప్టెంబర్ 12న పరీక్ష నిర్వహించనున్నట్లు ప్రకటించింది. అంతేకాకుండా పరీక్ష విధానంలో కొన్ని కీలక మార్పులు ప్రవేశపెట్టింది. ఈ నేపథ్యంలో.. నీట్–యూజీ–2021లో మార్పులు.. పరీక్ష విధానం, ప్రిపరేషన్ గైడెన్స్.. నీట్–యూజీ–2021 నిర్వహణ తేదీపై సందేహాలకు ఫుల్స్టాప్ పెడుతూ.. ఎన్టీఏ(నేషనల్ టెస్టింగ్ ఏజెన్స్) తాజాగా పరీక్ష తేదీని అధికారికంగా ప్రకటించింది.దీంతో గత కొన్ని నెలలుగా నెలకొన్న సందిగ్ధత తొలగిపోయింది. సెప్టెంబర్ 12వ తేదీన నీట్ పరీక్షను పెన్–పేపర్ విధానంలో నిర్వహించనున్నారు. మరోవైపు నీట్లో కొత్తగా ప్రవేశపెట్టిన మార్పులను గుర్తించి.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలని నిపుణులు సూచిస్తున్నారు. ఛాయిస్ విధానం నీట్ పరీక్షలో ఈ ఏడాది ఛాయిస్ విధానాన్ని ప్రవేశపెట్టారు. ప్రతి సబ్జెక్టులో సెక్షన్బీలోని 15 ప్రశ్నల్లో పదింటికి సమాధానం ఇస్తే సరిపోతుంది. నీట్లో గతేడాది వరకు బోటనీ, జువాలజీ రెండు సబ్జెక్ట్‌లను కలిపి బయాలజీ విభాగం పేరుతో 90 ప్రశ్నలు అడిగేవారు. కాని ఈ ఏడాది బోటనీ, జువాలజీలను రెండు వేర్వేరు సబ్జెక్టులుగా పేర్కొన్నారు. ఒక్కోదాన్ని నుంచి 45 ప్రశ్నలు అడగనున్నారు. రెండు సెక్షన్లు ► మొత్తం నాలుగు సబ్జెక్ట్‌ల్లో(ఫిజిక్స్, కెమిస్ట్రీ, బోటనీ, జువాలజీ) పరీక్ష జరుగుతుంది. ► ప్రతి సబ్జెక్టులో సెక్షన్–ఏ, సెక్షన్–బీ పేరుతో రెండు విభాగాలు ఉంటాయి. ► ప్రతి సబ్జెక్టులోనూ సెక్షన్–ఏ నుంచి 35 ప్రశ్నలు, సెక్షన్–బీ నుంచి 15 ప్రశ్నలు అడుగుతారు. ► సెక్షన్–బీలోని 15 ప్రశ్నల్లో అయిదు ప్రశ్నలు ఛాయిస్‌గా వదిలేసి.. 10 ప్రశ్నలకు సమాధానాలు ఇవ్వాలి. ► ప్రతి సబ్జెక్ట్ నుంచి మొత్తం 50 ప్రశ్నలు అడిగినా.. సెక్షన్–బీలో కల్పించిన ఛాయిస్ విధానం వల్ల 45 ప్రశ్నలకు సమాధానాలు ఇస్తే సరిపోతుంది. ► అంటే.. ప్రతి సబ్జెక్ట్ నుంచి 45 ప్రశ్నలు చొప్పున.. నాలుగు సబ్జెక్టుల నుంచి మొత్తం 180 ప్రశ్నలకు సమాధానాలు గుర్తించాలి. ఒక్కో ప్రశ్నకు నాలుగు మార్కుల చొప్పున మొత్తం 720 మార్కులకు పరీక్ష జరుగుతుంది. ► నెగెటివ్ మార్కింగ్ నిబంధన ప్రకారం– ప్రతి తప్పు సమాధానానికి ఒక మార్కు తగ్గిస్తారు. పదమూడు భాషలు నీట్‌ను ఇంగ్లిష్, హిందీ సహా మొత్తం 13 భాషల్లో నిర్వహించనున్నారు. అభ్యర్థులు దరఖాస్తు సమయంలోనే తాము ఏ మాధ్యమంలో పరీక్ష రాయాలనుకుంటున్నారో తెలియజేయాల్సి ఉంటుంది. ఇంగ్లిష్ కోరుకుంటే.. కేవలం ఇంగ్లిష్ ప్రశ్న పత్రం అందిస్తారు. హిందీ కోరుకుంటే.. ఇంగ్లిష్/హిందీ ఇలా రెండు భాషల్లో.. అంటే బైలింగ్వల్ టెస్ట్ బుక్‌లెట్‌ను ఇస్తారు. అలాగే ఏదైనా ప్రాంతీయ భాషను ఎంచుకుంటే.. సదరు ప్రాంతీయ భాష/ఇంగ్లిష్ బుక్లెట్ అందిస్తారు. ఉదాహరణకు తెలుగును కోరుకున్న విద్యార్థులకు తెలుగు/ఇంగ్లిష్.. ఇలా రెండు భాషల్లో ప్రశ్న పత్రం ఉంటుంది. ఛాయిస్ కల్పించినా.. పెరగని సమయం ఈ ఏడాది నీట్లో ప్రశ్నల సంఖ్య పెంచి ఛాయిస్ విధానాన్ని కల్పించినా.. పరీక్ష సమయాన్ని పెంచలేదు. గత సంవత్సరంతో పోల్చితే ఈ ఏడాది విద్యార్థులు అదనంగా 20 ప్రశ్నలు చదివి, వాటిని అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. ఇది పరీక్షలో సమయాభావానికి దారితీసే ఆస్కారముందంటున్నారు నిపుణులు. ఎందుకంటే.. సెక్షన్ బీలో 10 ప్రశ్నలు అటెంప్ట్ చేయాల్సి ఉన్నా.. మొత్తం 15 ప్రశ్నలు చదివి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అంతేకాకుండా ఛాయిస్‌గా వదిలేయాల్సిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకునేందుకు సమయం పడుతుంది. బోటనీ, జువాలజీ వేర్వేరుగా ► బయాలజీ విషయానికొస్తే.. ఈ ఏడాది కొత్తగా బోటనీ, జువాలజీ పేరుతో రెండు ప్రత్యేక సబ్జెక్టులుగా పరీక్ష నిర్వహించనున్నారు. ► బోటనీలో ఫిజియాలజీ ఆఫ్ ప్లాంట్స్ అండ్ యానిమల్స్, మార్ఫాలజీ, జెనిటిక్స్ అండ్ ఎవల్యూషన్, సెల్ బయాలజీ, బయోటెక్నాలజీ, హ్యూమన్ ఫిజియాలజీ, డైవర్సిటీ ఆఫ్ లివింగ్ ఆర్గానిజమ్‌లను ముఖ్య చాప్టర్లుగా భావించి చదవాలి. అన్ని అంశాలకు సంబంధించి కాన్సెప్ట్ట్‌లపై పట్టు సాధించాలి. ఎకాలజీలో ఆర్గనైజేషన్స్ అండ్ పాపులేషన్, ఎకోసిస్టమ్‌పై ప్రశ్నలు వస్తున్నాయి. వీటితోపాటు బయోడైవర్సిటీ, ఎన్విరాన్మెంటల్ ఇష్యూస్ పాఠ్యాంశాలపై దృష్టిపెట్టడం లాభిస్తుంది. ప్లాంట్ ఫిజియాలజీలో ప్లాంట్ గ్రోత్ అండ్ డెవలప్మెంట్, మొక్కల హార్మోనులు, ట్రాన్స్పోర్ట్ ఇన్ ప్లాంట్స్, మినరల్ న్యూట్రిషన్ చాప్టర్లను ప్రిపేరవ్వాలి. సెల్ స్ట్రక్చర్ అండ్ ఫంక్షన్స్‌లో కణ విభజన(సమ విభజన, క్షయకరణ విభజన)లోని వివిధ దశల్లో జరిగే మార్పులు,కణచక్రం తదితరాలను అధ్యయనం చేయాలి. బయోమాలిక్యూల్స్ నుంచి కంటెంట్ సంబంధిత ప్రశ్నలు వస్తాయి. రీప్రొడక్షన్ నుంచి దాదాపు 10 ప్రశ్నల వరకు అడుగుతున్నారు. మానవ ప్రత్యుత్పత్తి వ్యవస్థను బాగా అధ్యయనం చేయాలి. మాలిక్యులర్ బేసిస్ ఆఫ్ ఇన్‌హెరిటన్స్‌లో రెప్లికేషన్, ట్రాన్స్‌స్క్రిప్షన్, ట్రాన్స్లేషన్, రెగ్యులేషన్లపై దృష్టిపెట్టాలి. నీట్లో ఇంటర్ సిలబస్‌లో లేని అంశాలను గుర్తించి.. వాటికోసం ప్రత్యేక సమయం కేటాయించాలి. ► జువాలజీకి సంబంధించి హ్యూమన్ ఫిజియాలజీ, ఎకాలజీ, జెనిటిక్స్, ఎవల్యూషన్ టాపిక్స్‌పై విద్యార్థులు ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్‌సీఈఆర్‌టీతోపాటు ఇంటర్ పుస్తకాల నుంచీ ప్రశ్నలు అడుగుతున్నారు. కాబట్టి గత ప్రశ్న పత్రాలను, ఇంటర్లో ఆయా చాప్టర్స్ చివరలో అడిగే ప్రశ్నలను సాధన చేయాలి. ఎన్సీఈఆర్టీ, ఇంటర్ పుస్తకాలను క్షుణ్నంగా చదవాలి. ► ఫిజిక్స్‌లో.. ఆప్టిక్స్, మెకానిక్స్, హీట్ అండ్ థర్మోడైనమిక్స్, ఎలక్ట్రానిక్ డివైజెస్, కరెంట్ ఎలక్ట్రిసిటీ, మోడరన్ ఫిజిక్స్ చాప్టర్లపై ప్రత్యేక దృష్టిపెట్టాలి. ఎన్సీఈఆర్టీ పుస్తకాల్లో అధ్యాయానికి చివర ఇచ్చిన ప్రశ్నలను సాధించాలి. అవకలనం, సమాకలనం అనువర్తనాలపై పట్టు సాధించాలి. ఇంటర్ రెండేళ్ల పాఠ్యాంశాలకు సమాన ప్రాధాన్యం ఇవ్వాలి. రొటేషనల్ డైనమిక్స్, సిగ్మా పార్టికల్స్‌పై ఎక్కువగా దృష్టిపెట్టాలి. అదేవిధంగా ఎలక్ట్రోమ్యాగ్నటిజం, ఇండక్షన్, కరెంట్ ఎలక్ట్రిసిటీ వంటి చాప్టర్లను చదవడంతోపాటు ప్రాక్టీస్‌కు ప్రాధాన్యం ఇవ్వాలి. ► కెమిస్ట్రీలో.. జనరల్ ఆర్గానిక్ కెమిస్ట్రీ, మోల్ కాన్సెప్ట్, కెమికల్ బాండింగ్, ఎలక్ట్రోకెమిస్ట్రీ, కోఆర్డినేషన్ కాంపౌండ్, ఈక్విలిబ్రియమ్, పాలిమర్లు, బయో మాలిక్యూల్స్, పరమాణు నిర్మాణం, సాలిడ్ స్టేట్, ద్రావణాలు, సర్ఫేస్ కెమిస్ట్రీ; ఆర్గానిక్ కెమిస్ట్రీలో ఐసోమెరిసమ్, సమ్మేళనాల తయారీ, ధర్మాలపై ఎక్కువగా ప్రశ్నలు వస్తున్నాయి. కెమిస్ట్రీలో విద్యార్థులు చర్యలు, సమీకరణాలను మర్చిపోతుంటారు. కాబట్టి వాటిని ఎప్పటికప్పుడు పునఃశ్చరణ చేయాలి. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో వివిధ మూలకాలు, వాటి సమ్మేళనాల ధర్మాలను అధ్యయనం చేయాలి. కెమిస్ట్రీలో ఫిజికల్, ఆర్గానిక్, ఇనార్గానిక్ కెమిస్ట్రీలను వాటి వాటి స్వభావాల ఆధారంగా ప్రిపేరవ్వాలి. ఫిజికల్ కెమిస్ట్రీలో ఫార్ములాలతో సొంత నోట్స్ రూపొందించుకోవాలి. పీరియాడిక్ టేబుల్‌పై పట్టు సాధిస్తే.. ఇనార్గానిక్ కెమిస్ట్రీలో మంచి మార్కులు సొంతం చేసుకోవచ్చు. రివిజన్‌కు ప్రాధాన్యం ► నీట్లో మంచి స్కోర్ సాధించేందుకు విద్యార్థులు సిలబస్‌పై గట్టి పట్టు బిగించాలి. ► ప్రతి రోజు ప్రతి సబ్జెక్ట్‌కు నిర్దిష్ట సమయాన్ని కేటాయించుకొని.. ఆయా సబ్జెక్ట్‌ల అభ్యసనం చేయాలి. ► ప్రస్తుత సమయంలో స్వీయ సామర్థ్యాలపై స్పష్టతతో వ్యవహరించాలి. ► నిర్దిష్ట సమయంలో అవగాహన పొందేలా ముందుకు కదలాలి. ► ప్రతి సబ్జెక్టుకూ సమానంగా సమయం కేటాయించుకోవాలి. ► ప్రతి రోజు చదవాల్సిన టాపిక్స్‌ను ముందుగానే విభజించుకుని దానికి అనుగుణంగా అధ్యయనం చేయాలి. ► ప్రతి రోజు మాక్ టెస్టులకు హాజరవ్వాలి. ► ప్రస్తుతం అందుబాటులో ఉన్న సమయంలో రివిజన్‌కు అధిక ప్రాధాన్యం ఇవ్వాలి. ► మోడల్ కొశ్చన్స్‌ను బాగా ప్రాక్టీస్ చేయాలి. ► డైరెక్ట్ కొశ్చన్స్ కంటే ఇన్‌డైరెక్ట్ కొశ్చన్స్‌నే ఎక్కువ అడుగుతున్న విషయాన్ని గుర్తించాలి. దీనికి అనుగుణంగా మోడల్ టెస్ట్‌లను వీలైనంత ఎక్కువగా ప్రాక్టీస్ చేయాలి. ► ప్రిపరేషన్ సమయంలోనే షార్ట్ నోట్స్ రూపొందించుకోవాలి. ఇది పరీక్షకు ముందు ర్యాపిడ్ రివిజన్‌కు ఉపయోగపడుతుంది. నీట్–యూజీ(2021) సమాచారం ► పరీక్ష తేదీ: సెప్టెంబర్ 12, 2021 (మధ్యాహ్నం 2 నుంచి 5 వరకు) ► పరీక్ష వ్యవధి: మూడు గంటలు(పెన్, పేపర్ విధానంలో) ► అర్హత: బైపీసీ గ్రూప్‌తో ఇంటర్మీడియెట్ తత్సమాన కోర్సుల ఉత్తీర్ణత. ద్వితీయ సంవత్సరం విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ► వయో పరిమితి: డిసెంబర్ 31 నాటికి కనిష్ట వయోపరిమితి 17ఏళ్లు, గరిష్ట వయో పరిమితి 25ఏళ్లు ఉండాలి. ► ఆన్లైన్ దరఖాస్తు తేదీలు: జూలై 13 నుంచి ఆగస్ట్ 6 వరకు. ► ఆన్లైన్లో దరఖాస్తులో సవరణ అవకాశం: ఆగస్ట్ 8 నుంచి ఆగస్ట్ 12 వరకు. ► పరీక్ష కేంద్రం కేటాయింపు ప్రకటన: ఆగస్ట్ 20, 2021. ► అడ్మిట్ కార్డ్ డౌన్లోడ్ సదుపాయం: పరీక్ష తేదీకి మూడు రోజుల ముందు. ► పూర్తి వివరాలు, ఆన్లైన్ దరఖాస్తుకు వెబ్‌సైట్స్: https://ntaneet.nic.in ఈజీ టు డిఫికల్ట్ పరీక్ష రోజున అభ్యర్థులు తొలుత ప్రశ్న పత్రం చదివేందుకు పది, పదిహేను నిమిషాలు కేటాయించాలి. ఛాయిస్ సెక్షన్ విషయంలో వీలైనంత వేగంగా ప్రశ్నలను అర్థం చేసుకొని.. తమకు కచ్చితంగా సమాధానాలు తెలిసిన ప్రశ్నలపై స్పష్టత తెచ్చుకోవాలి. ముందుగా సులభమైన ప్రశ్నలతో సమాధానాలు గుర్తించడం ప్రారంభించాలి. ప్రిపరేషన్ పరంగా.. ఎక్కువ సమయం రివిజన్‌కు కేటాయించాలి. అదే విధంగా మాక్ టెస్ట్‌లు, గ్రాండ్ టెస్ట్‌లకు హాజరై తమ సామర్థ్యం స్థాయి తెలుసుకొని.. దానికి అనుగుణంగా ప్రిపరేషన్ సాగించాలి. – బి.రాజేంద్ర, బోటనీ సబ్జెక్ట్ నిపుణులు