హాస్టల్ విద్యార్థులపై కళాశాల డైరెక్టర్ దాడి చేసిన ఘటన పెనమలూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని కానూరులో చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. కానూరులోని విశ్వ అకాడమీ హాస్టల్ విద్యార్థులు తాము ఉంటున్న హాస్టల్‌లో చోరీ జరగడంతో డైరెక్టర్‌ను నిలదీశారు. దీంతో కోపోద్రిక్తుడైన డైరెక్టర్ ఫణి కుమార్ ఐదుగురు విద్యార్థులపై పీవీసీ పైపులతో విచక్షణా రహితంగా దాడికి పాల్పడ్డాడు