
న్యూఢిల్లీ: ఎంబీబీఎస్, బీడీఎస్ కోర్సుల్లో ప్రవేశానికి మే 6న నిర్వహించబోయే నీట్ పరీక్షకు ఆన్‌లైన్‌లో దరఖాస్తుల ప్రక్రియ గురువారం ప్రారంభమైంది. మార్చి 9 రాత్రి 11.50 గంటల వరకు అభ్యర్థులు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చని సీబీఎస్‌ఈ ప్రకటించింది. మార్చి 10 రాత్రి 11.50 గంటల లోపు ఫీజు చెల్లించవచ్చు. అసోం, మేఘాలయ, కశ్మీర్ రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు తప్ప మిగిలిన వారంతా దరఖాస్తు సమయంలో తప్పనిసరిగా ఆధార్ సంఖ్య వెల్లడించాలి. www. cbseneet.nic.in వెబ్‌సైట్‌లో విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలి.