
సాక్షి, న్యూఢిల్లీ: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ పరీక్ష వాయిదాకు సుప్రీంకోర్టు నో చెప్పింది. ముందుగా వెల్లడించిన షెడ్యూల్ ప్రకారం సెప్టెంర్ 12న ఆదివారమే ఈ పరీక్షను నిర్వహించాలని కోర్టు అధికారులను ఆదేశించింది.
నీట్ పరీక్ష నిర్వహిస్తున్న రోజునే ఇతర పోటీ పరీక్షలు కూడా ఉన్నాయని.. అలాగే సీబీఎస్‌ఈ కంపార్ట్‌మెంట్ పరీక్షలు కూడా జరుగుతున్నాయని.. అందువల్ల నీట్ పరీక్షను మరో తేదీకి వాయిదా వేయాలని కొందరు సుప్రీంకోర్టులో పిటిషన్లు దాఖలు చేశారు. ఈ పిటిషన్లను సుప్రీం తోసిపుచ్చింది. షెడ్యూల్ ప్రకారం సెప్టెంబర్ 12, ఆదివారమే జరుగుతుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
Comments
Please login to add a commentAdd a comment