సాక్షి, న్యూఢిల్లీ: నీట్- 2018 పరీక్షకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పని సరి చేస్తూ సీబీఎస్ఈ ఆదేశాలు జారీ చేసింది. నీట్- 2018 పరీక్షలకు ఆధార్ నంబర్ అనుసంధానం తప్పనిసరి చేస్తూ ఆదేశాలు జారీ చేసింది. అధికారిక వెబ్‌సైట్‌లో సీబీఎస్ ఈ విషయాన్ని స్పష్టం చేసింది.
నేషనల్ ఎలిజిబిలిటీ-కమ్-ఎంటన్స్ టెస్ట్ (నీట్) దరఖాస్తుకు ఆధార్ నంబర్ తప్పనిసరి సెంట్రల్ బోర్డ్ అఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) ఆదేశించింది. ఈ మేరకు పరీక్ష తేదీ తదితర వివరాలను cbseneet.nic.in లో గురువారం వెల్లడించింది. అసోం,జమ్ము కశ్మీర్, మేఘాలయ మినహాయించి మిగతా రాష్ట్రాల అభ్యర్థులు ఆధార్ నెంబర్‌ను తప్పనిసరిగా ఇవ్వాలని పేర్కొంది. అండర్‌గ్రాడ్యుయేట్ మెడికల్ అండ్ డెంటల్ కోర్సులు ప్రవేశానికి మే 6 వ తేదీన నిర్వహించనున్న ఈ పరీక్షకు ఆన్‌లైన్‌లో మాత్రమే దరఖాస్తు చేసుకోవాలి. ఈ దరఖాస్తు ప్రక్రియ ఈ రోజునుంచి(ఫిబ్రవరి 9) ప్రారంభమై మార్చి 9 వతేదీ 11.50 వరకు గడువు వుంటుందని సీబీఎస్‌ఈ తెలిపింది. మరిన్ని వివరాలు బోర్డు తేదీ అధికారిక వెబ్ సైట్ cbseneet.nic.inలో లభ్యం.
Comments
Please login to add a commentAdd a comment